Eto Vellipoindhi manasu: సీతాకాంత్ ప్రయత్నాలు కనిపెట్టేసిన రామలక్ష్మి.. డేంజర్ లో వాళ్ళిద్దరు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు(Eto Vellipoindhi Manasu)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-372 లో సీతాకాంత్, తమ పోలీస్ ఫ్రెండ్ ని తీసుకొని రామలక్ష్మి ఇంటికి వెళ్తారు. రామలక్ష్మి చూసి.. ఏంటి ఈ రోజు చాలా యాక్టివ్ గా ఉన్నారని అడుగగా.. ఎస్ ఈ రోజునా రోజు.. అలాగే ఉండాలని అంటాడు. ఇక రామలక్ష్మి చూసి మళ్ళీ ఏదో ప్లానింగ్ తో వచ్చాడని అనుకుంటుంది. మీరు లండన్ వెళ్ళాక ఆ రియల్ ఎస్టేట్ రంగా గానీ అతని అనుచరులు గానీ మిమ్మల్ని ఇబ్బంది పెడితే నాకు కాల్ చేయండి అని ఎస్సై చెప్తాడు. అది విన్న రామలక్ష్మి.. మీ నెంబర్ నా దగ్గర లేదని చెప్తాడు. మీలాంటి వాళ్ళ కోసం నా వాడి దగ్గర విజిటింగ్ కార్డులు ఉంటాయని సీతాకాంత్ అనగానే.. తన విజిటింగ్ కార్డ్ తీసి రామలక్ష్మికి ఇస్తాడు ఎస్సై. ఇక కాసేపటికి ఆ విజిటింగ్ కార్డ్ మీద నా పర్సనల్ నెంబర్ లేదు .. ల్యాండ్ లైన్ నెంబర్ ఉందని వేరే కార్డు ఇస్తూ రామలక్ష్మికి ఇచ్చిన కార్డుని ఎస్సై ఇవ్వమంటాడు. ఇక సీతాకాంత్ సంతోషం చూసిన రామలక్ష్మికి డౌట్ వస్తుంది. తనకిచ్చిన కార్డ్ మీద పౌడర్ చల్లి ఉండటం గమనించి దానిని గాల్లోకి ఊదేస్తుంది. దాంతో సీతాకాంత్, ఎస్సై కంగారుపడతారు. మీరు నన్ను దొంగలా చూస్తున్నారా అంటూ ఎస్సైని రామలక్ష్మి నిలదీస్తుంది. దాంతో వీరి గురించి పై అధికారులకి చెప్తానని ఫణీంద్ర, సుశీల అంటారు. దాంతో వాళ్ళ పిల్లలు ఆడుకుంటూ పౌడర్ చల్లారేమో.. మాకు తెలియదు ..మేము ప్యూర్ గా మీకు సహాయం చేయాలనుకున్నామంటూ  సీతాకాంత్ కవర్ చేస్తాడు. కాసేపటికి ఎస్సై, సీతాకాంత్ బయటకు వచ్చేస్తారు. ఇకనుండి సీతాకాంత్ తో జాగ్రత్తగా ఉండమని ఫణీంద్ర చెప్తాడు. మరోవైపు సీతాకాంత్ తన పోలీస్ ఫ్రెండ్ తో మాట్లాడతాడు. నీ వల్ల నా పరువు పోయదని, తను రామలక్ష్మి కాదని మైథిలీ అని సాక్ష్యం ఉందని ఎస్సై దగ్గరున్న రామలక్ష్మి సర్టిఫికేట్లు ఇస్తాడు. అవి చూసిన సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరుసటి రోజు బొకే పట్టుకొని రామలక్ష్మి ఇంటికెళ్తాడు సీతాకాంత్. ఈ రోజు నీ బర్త్ డే కదా పార్టీ లేదా అని సీతాకాంత్ అనగానే ఉంది ఎందుకు లేదని రామలక్ష్మి కవర్ చేస్తుంది. మరి నాకు ట్రీట్ లేదా అని సీతాకాంత్ అంటాడు. ఏం కావాలని రామలక్ష్మి అడుగగా ఈవినింగ్ కలుద్దామని అంటాడు. ఇక రామలక్ష్మి, సీతాకాంత్ కార్ లో సిటీ అవుట్ స్కట్స్ కు వెళ్తారు. ఇక తరువాయి భాగంలో వాళ్లు వెళ్తున్న కార్  మధ్యలో ఆగిపోతుంది. కార్ లో మరే స్టెప్నీ కూడా ఉండదు దాంతో రామలక్ష్మి, సీతాకాంత్ కంగారుపడతారు. ఇక ఒకతడిని కలిసి అడుగగా మెకానిక్ ఊళ్ళో ఉంటాడని చెప్తాడు. అప్పటిదాకా తన ముసలమ్మ ఇంట్లో ఉండమని అతను చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.     

Brahmamudi: రాజ్ ని చూసేసిన దుగ్గిరాల కుటుంబం.. అతను కాదని కావ్య చెప్పనుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి(Brahmamudi)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-689 లో.. ఇంట్లో కావ్య పూజ చేసి అందరికి హారతి అందిస్తూ.. అత్తయ్యా మీరంతా ఇంకా రెడీ కాలేదా అని అంటుంది. ఎందుకమ్మా అని ఇందిరా దేవి అనగానే.. అదేంటి అమ్మమ్మా ఈ రోజు శ్రీరామనవమి కదా.. మనం అంతా గుడికి వెళ్లి పూజలు చేయించే వాళ్లంగా అని కావ్య అంటుంది. ప్రతి సంవత్సరం అంటే రాజ్ చేతుల మీదుగానే చేయించేవాళ్లం. లాస్ట్ ఇయర్ మా వదిన గొప్పలకు పోయి నా కొడుకు కోడలు అంటూ మీ ఇద్దరి చేత ఆ పూజలు చాలా గ్రాండ్‌గా జరిపించింది.. ఇప్పుడు రాజ్ లేకుండా ఆ గుడికి వెళ్తే నీ కొడుకు ఎక్కడా అని అక్కడి వాళ్లు అడిగితే వదిన ఏమని సమాధానం చెబుతారని రుద్రాణి అంటుంది. ఆ సమాధానాలు ఏవో నేను చెప్పుకుంటాను.. గుడిలో పూజారి గారికి మనం వస్తున్నట్లు చెప్పేశాను. మనం కూడా అక్కడికి వెళ్దామని కావ్య అంటుంది. వెంటనే రుద్రాణీ.. ఎందుకు రాజ్ బతికే ఉన్నాడని మమ్మల్ని పిచ్చివాళ్లను చేసినట్లు అక్కడి వాళ్లని కూడా పిచ్చివాళ్లను చేయడానికా.. మేమంటే ఇంట్లో వాళ్లం.. బయటి వాళ్లకు ఆ కథలు చెబితే నమ్మరు.. పిచ్చదానివి అనుకుంటారని రుద్రాణి అంటుంది. హాల్లో.. అప్పూ, కవి, రుద్రాణీ, రాహుల్, ప్రకాశం, ధాన్యం, ఇందిరాదేవి, సీతారామయ్య, స్వప్న, అపర్ణా దేవి, సుభాష్.. అంతా ఉంటారు. కావ్య మాటలను కొందరు వింటారు కావ్య తరపునే మాట్లాడతారు. కొందరు వాదిస్తారు. అక్కా.. నువ్వు రాహుల్‌ని తీసుకునిరా .. అంతా భార్యభర్తలు అక్కడ కళ్యాణం చేయిస్తే మంచిది కదా.. అక్కడ అందరికి నేను సమాధానం చెబుతాను.. ఈ కళ్యాణం జరిపిస్తున్నదే ఆయన ఇంటికి రావాలని  అని స్వప్నతో కావ్య అంటే.. రాహుల్ కూడా అందుకుంటాడు. నీలా మేము పిచ్చివాళ్లం కాలేం.. నేను రానని అనేసి రాహుల్ ఆగిపోతాడు. మిగిలిన వాళ్లంతా కావ్య మాట నమ్మి కావ్యతో పాటు వస్తారు. ఇక మరోవైపు యామినీ, వైదేహీ, రఘునందన్ ముగ్గురు కూడా శ్రీరామనవమికి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతారు. ఇక రాజ్ కూడా రెడీ అయ్యి కిందకు రాగానే.. గుడికి వెళ్దాం రా బావా.. ఈ రోజు మనం శ్రీరామనవమిలో రాముల వారి పెళ్లిని జంటగా చూస్తే మన పెళ్లి త్వరగా అవుతుందని మమ్మీ మొక్కుకుందట అంటూ రాజ్‌ని ఒప్పించి.. దుగ్గిరాల వారు వెళ్లిన గుడికే తీసుకుని వెళ్తారు. అయితే రాజ్ మనసులో కావ్య గురించే ఆలోచిస్తాడు. ఈరోజు తనని కలవాలి అనుకున్నాను కానీ ఇలా ఇరుక్కున్నానని రాజ్ బాధపతాడు. అప్పుడే యామినీ, రాజ్ వాళ్లు ఆ గుడి ముందు కారు దిగుతారు. కావ్య గురించే రాజ్ తపిస్తూ ఉంటాడు. ఇక గుడిలోపల పంతులు పీటలు ఏర్పాటు చేయించి... దంపతులు కూర్చోండి, కళ్యాణం చేయిద్దాం అన్నప్పుడు.. నేను ఆయనతో కలిపి కూర్చుంటానని కావ్య అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ కావ్య అంటూ రుద్రాణి తిడుతుంది.. అప్పుడు కూడా కావ్య మాటకే సపోర్టుగా ఇందిరాదేవి నిలబడుతుంది. ఇప్పుడే వస్తానని కావ్య పక్కకు వెళ్లి రాజ్ ఫొటో పట్టుకుని ఎంట్రీ ఇస్తుంది. అప్పటికే అపర్ణా, సుభాష్‌తో పాటు కవి, అప్పూ కూడా పీటల మీద కూర్చుంటారు. తరువాయి భాగంలో రాజ్ ఫోటోతో కావ్య ముందు వరుసలో కూర్చుంటే రాజ్ ఏమో చివరి వరుసలో యామినితో ఉంటాడు. అప్పుడే బయట నుండి వచ్చిన రుద్రాణి.. చివరి వరుసలో యామిని పక్కన రాజ్ ని, ముందు వరుసలో కావ్య పక్కన ఫోటోలో రాజ్ ని చూసి ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu: కూతురు కోసం నగలు తెచ్చిన రేవతి‌.‌. గీత దాటిందిగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-126 లో.. చందు ఎంత మందికి ఫోన్‌లు చేసి డబ్బులు అడిగినా కూడా ఎవ్వరూ ఇవ్వరు. దాంతో శ్రీవల్లికి చందు కాల్ చేసి.. సారీ అండీ.. ఈ మాట మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.. ఎంత ప్రయత్నించినా కూడా డబ్బులు అడ్జెస్ట్ కావడం లేదని అంటాడు. ఆ మాట విని శ్రీవల్లి.. అయ్య బాబోయ్ అదేంటి బావా.. ఒకేసారి అంత పెద్ద బాంబ్ పేల్చారు.. ఒకవైపు పెళ్లికి టైమ్ దగ్గర పడుతుంది. ఇప్పుడు డబ్బులు లేవంటే ఎలా బావా? అని అడుగుతుంది. నేనూ అదే టెన్షన్ పడుతున్నాను.. నా వరకూ చాలా ప్రయత్నించాను కానీ నా వల్ల కావడం లేదు. అంత డబ్బు ఎవరు ఇవ్వడం లేదు. అందుకే ఈ విషయం మీ వాళ్లకి చెప్పి ఏదో విధంగా ట్రై చేయమను. మీ నాన్న ఎలాగూ ఫైనాన్స్ బిజినెస్‌లోనే ఉన్నారు కదా.. ట్రై చేయమను అని చెప్పేసి చందు ఫోన్ పెట్టేస్తాడు. దాంతో తన తల్లి భాగ్యాన్ని పిలిచి విషయం చెప్తుంది శ్రీవల్లి. మన ఆశలపై నీళ్లు చల్లేశారు.. నీ ప్లాన్‌పై పిడుగుపడింది.. బావ ఫోన్ చేశాడు.. డబ్బులు దొరకడం లేదట.. మనల్నే చూసుకోమన్నాడని అంటుంది. ఆ మాట వినగానే భాగ్యం గుండెల్లో రాయి పడిపోతుంది. చేప కోసం గాలం వేస్తే.. గాలం కూడా చేప మింగినట్టు.. ఒకేసారి మన ప్లాన్‌లు ఇలా ఫెయిల్ అవుతున్నాయ్ ఏంటని భాగ్యం అంటుంది. మరి అందుకే చెప్పింది.. పెనం ఎంత ఉంటే దోసె అంతే వేసుకోవాలని అని పెనం కంటే పెద్ద దోసె వేస్తే ఇలాగే అవుతుంది. మన స్థాయికి తగ్గ సంబంధం చూస్తే సరిపోయేది కదా.. ఇప్పుడు చూడు మొదటికే మోసం వచ్చిందని భాగ్యం భర్త అంటాడు. దాంతో భాగ్యం.. ఎహే ఇలాంటి దిక్కుమాలిన సలహాలు ఇచ్చావంటే.. అట్లకాడ ఇరిగిపోద్దని వార్నింగ్ ఇస్తుంది. అది కాదు ఆవిడ గారండీ.. కూసంత కోపం తెచ్చుకోకుండా ఆలోచించండీ.. డబ్బులు లేకుండా పెళ్లి ఎలా చేస్తామని అంటాడు. నాకూ అదే అర్థం కావడం లేదు.. టెన్షన్‌తో బుర్రబద్దలైపోతుందని భాగ్యం అంటుంది. ఇక పెళ్లై ఇన్నాళ్లు అయినా శోభనం కానీ సాగర్, నర్మద ఎప్పటిలాగే కళ్లతోనే కాపురం చేస్తుంటారు. భార్య అందానికి ముగ్దుడైన సాగర్ పేపర్‌పై ఐ లవ్యూ అని రాసి.. దాన్ని రాకెట్‌లో చేసి నర్మద కోసం విసురుతాడు. అది చూసిన నర్మద.. నేను స్వీట్స్ పనిలో ఉన్నాను.. రావడం కుదరదని సైగ చేస్తుంది. ఆ లవ్ లెటర్ రాకెట్‌ని అక్కడే వదిలేసి వెళ్లిపోతుంది. సరిగ్గా అప్పుడే ప్రేమ వచ్చి.. అదే ప్లేస్‌లో కూర్చుంటుంది. ఇక ధీరజ్ కూడా అప్పుడే వచ్చి ఆమె వెనుకనే కూర్చుంటాడు. అతని చేతిలో పుస్తకం చూసి.. ఐ లవ్యూ అని రాసి.. తన కోసమే ఆ రాకెట్ వేశాడని ప్రేమ అనుకుంటుంది. వెంటనే ధీరజ్ దగ్గరకు వెళ్లి.. రేయ్ ఏంట్రా ఇదీ అని ఆ లెటర్‌లో రాసింది చూపిస్తుంది. కళ్లు దొబ్బాయా? చూసి చదువుకోమని ధీరజ్ అంటాడు.  ఏంట్రా చూసేదీ.. నీ మనసులో ఇలాంటి ఉద్దేశం ఎప్పటి నుంచే ఉందన్నమాట. పైకి మాత్రం చిరాకుగా ఉన్నట్టు నటిస్తున్నావ్.. ఐ లవ్యూ అని నాకెందుకు రాశావ్ రా అని ప్రేమ నిలదీస్తుంది. దాంతో ధీరజ్ పెద్దగా నవ్వి.. ఛీ ఛీ నేను నీకు ఐ లవ్యూ అని రాయడం ఏంటి.. జోక్ బాగుందని అంటాడు. నువ్వే రాశావని ప్రేమ, రాయలేదని ధీరజ్ ఇద్దరు కాసేపు గొడవ పడతారు. ఇక నర్మద.. తన కోసం తన తల్లి ఇచ్చిన నగల్ని చూసి మురిసిపోతుంది. వీటిని చూసినప్పుడల్లా.. మీరు నా దగ్గరే ఉన్నట్టు ఉంటుందంటూ ఆ నగల్ని అలంకరించుకుంటుంది. ఇంతలో ప్రేమ రావడంతో.. ఈ నగలు ఎలా ఉన్నాయ్ ప్రేమా అని అడుగుతుంది. నీకు చాలా బాగున్నాయ్ అందంగా ఉన్నాయని అంటుంది. కానీ తనకి కూడా అలాంటి అదృష్టం ఉంటే బాగుండని మనసులో అనుకుంటుంది. ఏమైంది ప్రేమ అని నర్మద అడగడంతో.. ఏం లేదని అంటుంది. నాకు తెలుసు ప్రేమ.. మీకు మీ వాళ్లు గుర్తొచ్చారు కదా.. నన్ను అర్థం చేసుకున్నట్టే నిన్ను మీ వాళ్లు కూడా అర్థం చేసుకుంటారు. ఏదోరోజు నీ కోసం మీ వాళ్లు వస్తారు బాధపడకు ప్రేమ అని నర్మద అంటుంది. నీ మాటలు వింటుంటే నవ్వు వస్తుంది అక్కా.. మీ వాళ్లకి నీపై వాళ్లకి నచ్చని వాళ్లని చేసుకున్నావనే కోపం మాత్రమే ఉంది. కానీ మా వాళ్లకి ఈ ఇంటిపై పాతికేళ్ల పగ ఉంది. మా చిన్న అత్త పాతికేళ్లుగా ఇంటి ముందున్నా సరే.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాంటిది.. మా వాళ్లు నా కోసం వస్తారా.. నేను కనపడితే మా వాళ్లు కనీసం నా వైపు కూడా చూడటం లేదు. కనీసం మా అమ్మ కూడా నాతో మాట్లాడటం లేదు. నేను ఎన్నిసార్లు పలకరించినా నా మొహం కూడా చూడటం లేదని ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయితే ఆమె తల్లి రేవతి మాత్రం.. కూతుర్ని కలుసుకోవడానికి అన్నీ రెడీ చేస్తుంది. చీర, నగలు, పసుపుకుంకుమలు కూతురు కోసం సిద్ధం చేస్తుంది. శారదాంబ చూసి.. ఇవి ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావని అడుగుతుంది. నా కూతురు కోసమని రేవతి అనేసరికి శారదాంబ ఆనందంతో ఉప్పొంగిపోతుంది. కనీసం నీ కూతుర్ని నువ్వైనా అర్థం చేసుకున్నావ్.. చాలా సంతోషంగా ఉందే.. మా అమ్మైనా అర్థం చేసుకుందని నీ కూతురు ఇంకా సంతోషపడుతుందేమోనని శారదాంబ ఎమోషనల్ అవుతుంది. నా కూతురిపై కోపం పోయిందో లేదో నాకు తెలియదు కానీ ఈ కన్నతల్లి ప్రేమ మాత్రం ఎప్పటికీ బతికే ఉంటుంది. నా కూతురుకి ఏలోటూ రాకూడదు. ఇవి నా కూతురి నగలు.. ఇవి దానికే చెందాలి.. దాని దగ్గర ఉండాలని రేవతి అంటుంది. సరే.. మీ ఆయన, వదినచూడకుండా జాగ్రత్తగా వెళ్లమని జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది శారదాంబ. ఇంటి ముందు ఉన్న గీతని దాటి రామరాజు ఇంటి గేట్లను తెరుచుకుని కూతురు కోసం రేవతి నగలు, చీరని తీసుకుని వెళ్తుంది. ప్రేమా.. ప్రేమా అని పిలిచేసరికి.. ప్రేమకి ప్రాణం లేచివచ్చినట్టు అవుతుంది. తల్లిని చూసి ఎమోషనల్ అయిపోతుంది. తరువాయి భాగంలో చందుని శ్రీవల్లి కలిసి.. డబ్బులు లేకపోతే పెళ్లి ఆగిపోతుందని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ కన్నీళ్లకి కరిగిపోయిన చందు.. అప్పు కోసం ఓ వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్తాడు. సరిగ్గా అప్పుడే రామరాజు కూడా అక్కడికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2: ఏకమైన కార్తిక్, దీప.. గౌతమ్ వార్నింగ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-325 లో... ముందే ఈ శుభవార్తను జ్యోత్స్నకు చెప్పి దాని మనసు చెడగొట్టడం దేనికీ.. గౌతమ్ పేరెంట్స్‌తో కూడా మాట్లాడి, వాళ్లు ఓకే అన్నాక ముహూర్తాలు పెట్టాక దానికి చెబుదామని సుమిత్ర అంటుంది. ఈ పెళ్లి అనుకుంటే ఆ దీప చెడగొడుతుందేమో.. పెళ్లికి కూడా వచ్చి గొడవ చేస్తుందేమోనని పారిజాతం అంటుంది. అలా చేస్తే పోలీసులకు పట్టిస్తానంటాడు శివనారాయణ. సరే అయితే ఇక మనం పెళ్లి ఏర్పాట్లకు గౌతమ్ పేరెంట్స్‌తో మాట్లాడదామని ఆ నలుగురు నిర్ణయించుకుంటారు. అయితే అంతా పైనుంచి చాటుగా విన్న జ్యోత్స్న.. అసలు ఆ గౌతమ్ గాడు ముందు దీప సంగతి చూడకుండా ఇలా తగులుకున్నాడేంటీ.. ముందు వీడికి పెళ్లి కావాల్సి వచ్చిందా.. వాడు ఎలాంటి వాడో తెలిశాక వాడ్ని నేనెందుకు పెళ్లి చేసుకుంటా.. బావతోనే నా పెళ్లి జరగాలి.. దీప అడ్డు తొలగాలి.. ఆ దీప పోవాలంటే ఆ ఇంట్లో ఏదొక గొడవ జరగాలి ఎలా అని రగిలిపోతుంది. మరోవైపు దీప, కార్తీక్ ఇద్దరి మధ్య దూరం చెరిగి దగ్గరవుతారు. ఈ రోజు శౌర్య స్కూల్ బస్ రాదట బాబు.. మీరే తీసుకెళ్లండి అని శౌర్యను వెళ్లమంటుంది దీప. కార్తీక్ బాబు బండి కొనుక్కోవచ్చుగా అని దీప అనగానే ఏ బండి చూసినా లక్ష పైనే ఉంది దీపా.. దానికి డబ్బులు పక్కకు తీసి పెట్టాను.. తర్వాత వారం తీసుకుందామని కార్తీక్ అంటాడు. కారు కొనుక్కుందామని శౌర్య అనగానే.. ఏం దీపా కారు అంట, కొనాలా అని కార్తీక్ అంటాడు. కొనండి బాబు వచ్చేటప్పుడు ఆడుకునే కారు అని దీప నవ్వుతూ అంటుంది. ఇక కార్తీక్ కూడా నవ్వుతాడు. అమ్మా నువ్వు వెళ్లవా రెస్టారెంట్‌కి అని శౌర్య అనగానే.. అమ్మకు కాస్త పనుంది.. అది చూసుకుని వస్తుందిలే మనం వెళ్దామని కార్తీక్ అంటాడు. మరోవైపు జ్యోత్స్న ఒంటరిగా కూర్చుంటే.. గౌతమ్ కాల్ చేస్తుంటాడు. తనేమో కట్ చేస్తుంటు.ది. దీప విషయం ఏం చేవావని మెసేజ్ చేస్తుంది. ఛ ఈ గౌతమ్ గాడు ముందు దీప సంగతి చూడకపోతే నా ప్లాన్ అంతా వేస్ట్ అవుతుందనుకుంటూ ఉంటుంది. ఇంతలో పారిజాతం వచ్చి.. ఏం ప్లానే అంటుంది. ఇంతలో గౌతమ్ మళ్లీ కాల్ చేయడంతో.. అది చూసిన పారు.. నీ గౌతమ్ కాల్ చేస్తున్నాడే.. లిఫ్ట్ చెయ్.. పెళ్లికి ఓకే అని మీ తాతకు కాల్ చేసి చెప్పాడు.. నీకు చెప్పాడా లేదా అంటూ పక్కనే కూర్చుని సంబరంగా మాట్లాడుతుంది. తప్పక పారిజాతం ముందు గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేసిన జ్యోత్స్న. నేను పెట్టిన మెసేజ్‌ గురించి ఆలోచించు.. తర్వాత మాట్లాడతానని పెట్టేస్తుంది. ఏంటే అబ్బాయితో అంత కోపంగా మాట్లాడతావని జ్యోత్స్నని కూల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. నేను ఏం చేయబోతున్నానో త్వరలో తెలుస్తుందిలే గ్రానీ అని తన మనసులో అనుకుని, ఆ దీప నా పెళ్లి జరగనివ్వదులే గ్రానీ అంటూ మాటను దాటేసి జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జ్యోత్స్న ఫోన్‌ లో దీప గురించి చెప్పడంతో గౌతమ్ తెగ రగిలిపోతాడు. ఈ దీప నాకు తగులుకుందేంటి? ఏం చెయ్యాలి తనని అని రగిలిపోతాడు. మరోవైపు కాంచనకి దీప కాఫీ ఇస్తూ ఉంటుంది. అప్పుడే దీపను కాంచన ఓ మాట అడుగుతుంది. వాడు నిన్న నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాడో తెలియదు కానీ.. నిన్నటి నుంచి నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావ్.. ఇక నువ్వు సంతోషంగా ఇలానే ఉంటానని నాకు మాటివ్వమని చేయి చాపుతుంది కాంచన. అప్పుడే బయట నుంచి తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తుంది. దీప మాట ఇవ్వబోతూ ఆగి.. తనే వెళ్లి తలుపు తీస్తుంది. ఎదురుగా గౌతమ్ ఉంటాడు. దీప, కాంచన బిత్తరపోతారు. ఎవరు ఆ అబ్బాయి అని అనసూయ అంటుంది. జ్యోత్స్నను చేసుకోబోయిన అబ్బాయి ఇతడే అని కాంచన అంటుంది. ఇక గౌతమ్ నవ్వుతూ లోపలికి వచ్చి.. ఏంటి దీపా బాగున్నావా? మీరు బాగున్నారా అంటూ కాంచనను పలకరిస్తూ వచ్చి కూర్చుని.. కాలు మీద కాలేసుకుని బిల్డప్‌గా ఉంటాడు. ఇక దీప, గౌతమ్ ల మధ్య వాదన మొదలవుతుంది. నువ్వు ఇక నుంచి ఏం చేసినా నాకు తెలుస్తుంది దీపా.. తేడా వస్తే.. నా విషయాల్లో కలుగజేసుకుంటే నిన్ను వదిలిపెట్టను.. జాగ్రత్త.. ఏదో నీ సొంత చెల్లెలికి అన్యాయం జరిగినట్లు ఫీల్ అవుతావేంటీ? నువ్వు ఏదీ నిరూపించలేవని తాను చెప్పాలనుకున్నది చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి గౌతమ్ వెళ్లిపోతాడు. ఇక ఆ సమయంలో దీప కూడా గౌతమ్ కాలర్ పట్టుకొని రెచ్చిపోతుంది.. అనసూయ ఆగమనడంతో దీప ఆగుతుంది. అయితే గౌతమ్ వెళ్లగానే కాంచన నమ్మకంగా.. ఇప్పుడు అర్థమైందా.. నువ్వు చెప్పింది అంతా నిజమే.. ఈ గౌతమ్ మంచివాడు కాదు.. ఆ రోజు నీ మాటలు నమ్మాను కానీ.. ఈ రోజు క్లారిటీ వచ్చిందని కాంచన అంటుంది. భయంతో కాదు బలుపుతో వచ్చాడని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

లాస్య-మంజునాథ్ ని అయోధ్యకు పంపిన ఆదివారం విత్ స్టార్ మా పరివారం

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో ఎప్పుడూ చేయని ఒక ప్రయోగం చేశారు. అదేంటంటే శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకుని ఇష్మార్ట్ జోడీస్ ని ఈ షోకి తీసుకొచ్చారు. తీసుకురావడమే కాకుండా వీళ్లకు కొన్ని టాస్కులు కూడా ఇచ్చారు. ఆ తసుకుల్లో గెలిచిన జంటతో శ్రీరామనవమి పూజా కార్యక్రమం చేయించారు. అలాగే ఇంకో స్పెషల్ సర్ప్రైజ్ గా గెలిచిన జంటను అయోధ్యకి కూడా పంపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇచ్చినట్టే ఒక జంటను కూడా పంపించారు. ఆ పోటీలు ఏంటంటే నేల మీద ఒక పట్టా వేసి భార్య భర్తను నిలబెట్టి డాన్స్ చేయించడం, తర్వాత భోజనం... ఎవరు అన్నీ ఖాళీ చేస్తారో అని కాన్సెప్ట్, తర్వాత గురి చూసి బాణం వేసే టాస్క్ ఇలా రక రకాల టాస్కులు ఇచ్చింది. ఐతే ఫైనల్ గా ఇదంతా కాదు అని ఆ జోడీలు పేర్లు కాగితాల మీద రాసి మడతేసి టేబుల్ మీద పొసే సీనియర్ నటుడు ప్రదీప్ - సరస్వతి చేత తీయించింది. ఎవరి పేర్లు వస్తాయో వాళ్ళు అవుట్ అంటూ కొత్త పేర్లు చెప్పింది. ఇక ఫైనల్ గా రాకేష్ - సుజాత, లాస్య - మంజునాథ్ మాత్రమే ఉన్నారు. ఇందులో ఫైనల్ లాస్య - మంజునాథ్ పేర్లు రాలేదు. దాంతో వాళ్ళు గెలిచినట్టు అనౌన్స్ చేసింది శ్రీముఖి.  వాళ్ళు అయోధ్య వెళ్తారంటూ చెప్పేసరికి లాస్య కన్నీళ్లు పెట్టేసుకుంది. తర్వాత శ్రీముఖి ఇలా చెప్పింది "అసలు ఇష్మార్ట్ జోడికి నేను ఎందుకు వచ్చా మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీగా ఎందుకు వచ్చా..నేను ఎప్పుడొచ్చినా లక్ ఎందుకు రాదు..లక్ నా దగ్గర ఎందుకు లేదు. లక్ అదీ ఇది అవసరం లేదు... శ్రీరాముడి అనుగ్రహం మీ మీద ఉంది" అని చెప్పింది శ్రీముఖి. "ఇష్మార్ట్ జోడిలో అన్ని పోటీల్లో ఓడిపోయాను. బయట ఎవరేం మాట్లాడుకుంటారో తెలీదు కానీ మా జున్ను మాత్రం ఇంత చిన్న పోటీ కూడా గెలవలేకపోయావా" అని అడిగాడు అంటూ లాస్య ఏడ్చేసింది.

నాలుగు నెలలు బిగ్ బాస్ హౌస్ లో ఉంటే ఎక్కడ వస్తుంది ఔట్ పుట్ : శ్రీపద్ ఆవేదన

బిగ్ బాస్ ప్రేరణ గురించి తెలియని వారు లేదు. ఇష్మార్ట్ జోడి సీజన్ 3 లో ప్రేరణ ఆమె భర్త శ్రీపద్ సీజన్ విన్నర్స్ గా నిలిచారు. ఈ సీజన్ లోని జోడీస్ ని ఇప్పుడు శ్రీముఖి ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి తీసుకొచ్చింది. ఇందులో వీళ్ళతో ఎన్నో గేమ్స్ కూడా ఆడించింది. ఐతే ప్రేరణను శ్రీపద్ చేతుల్లో ఎత్తుకుని షో స్టేజి మీదకు వచ్చాడు. ఎలా అంటే పుష్ప మూవీలో శ్రీవల్లిని ఎత్తుకుని వచ్చినట్టు. తరువాత "సూసీకి" సాంగ్ కి డాన్స్ చేశారు. "మీ అందరికీ అర్ధం కావట్లేదు. పుష్ప మూవీ చూసిన వాళ్ళకే అర్ధమవుద్ది..శ్రీపద్ జాగ్రత్తగా అలా ప్రేరణని అలా ఎత్తుకుని తీసుకొచ్చాడు అంటే ఈ పాటలో రష్మిక మందన్న ఏంటో మీ అందరికీ తెలుసు కదా" అని అనేసరికి శ్రీపద్ షాకయ్యాడు. హరి, అవినాష్, శ్రీముఖి కలిసి కంగ్రాట్యులేషన్స్ అని చెప్పేసరికి "ఎవరికీ..ఎవరికీ" అంటూ ప్రేరణ గట్టిగ అడిగింది. "ఎక్కడా వన్ ఇయర్ లో నాలుగు నెలలు బిగ్ బాస్ హౌస్ లో ఉంటే ఎక్కడ వస్తుంది అవుట్ పుట్" అని డైరెక్ట్ గా అడిగేశాడు శ్రీపద్. ఇక ఈ విషయాన్నీ కవర్ చేస్తూ శ్రీముఖి "సో టాప్ 5 లో ఆగిపోయిందని అనుకున్నారేమో మా లేడీ ఫైటర్. కానీ కప్పు గెలుచుకుని వెళ్ళింది..ఇంతకు ఆ కప్పును ఇంటికి తీసిన డిసిఎం వాన్ కి ఎంత ఖర్చు అయ్యింది" అని అడిగేసరికి హరి మధ్యలో వచ్చి "ఆ కప్పును చూసి ఇంటికి కొత్త ఫ్రిజ్ వచ్చినదని పక్కింటి వాళ్ళు" అన్నారట అని కామెడీ చేసాడు. మరి శ్రీపద్ చెప్పింది కరెక్ట్ కదా. పెళ్లైన వెంటనే హనీమూన్ కి వెళ్లకుండా బిగ్ బాస్ హౌస్ కి వచ్చేసింది ఆ తర్వాత ఇష్మార్ట్ జోడికి వచ్చేసింది ప్రేరణ. ఇలా కంటిన్యుయస్ గా షోస్, ఈవెంట్స్ చేస్తూ ఉంటే అవుట్ పుట్ కోసం ఇంకా టైం అనేది ఎక్కడ ఉంటుంది అని చాలా క్లియర్ గా చెప్పాడు.

బిగ్ బాస్ సీజన్ 9 కి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌..!

  అలేఖ్య చిట్టి పికిల్స్ వరల్డ్ వైడ్ ఇష్యూలా మారిపోయింది. అనగనగ ఒక ముగ్గురు అక్కాచెల్లెళ్లు కాస్ట్లీ రేట్స్ తో పచ్చళ్ళు అమ్ముతున్నారు...ఇంత కాస్ట్లీనా అన్న లేడీస్ ని, జెంట్స్ ని కెరీర్ మీద ఫోకస్ చేయండి ముందు, నాలుగు ఇళ్లల్లో పాచి పనులు చేసి బతుక్కోండి..అప్పుడే మీ లాంటోళ్ళు పచ్చళ్ళు కొనుక్కోగలరు అనే రేంజ్ ఆ త్రి సిస్టర్స్ లో ఒక అమ్మాయి వదిలిన బూతు ఆడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. వీటి మీద కథనాలు బాబోయ్ యూట్యూబ్ లో మూడొంతులు ఈ పచ్చళ్ళ మీదనే..అలాగే దీని ఫుల్ మీమ్స్ కూడా వచ్చాయి..మూవీ ప్రొమోషన్స్ లో కూడా ఈ సిస్టర్ బూతులనే బాగా వాడేస్తున్నారు. అంటే బంగారం కంటే ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ కాస్ట్లీ అనేది వాళ్ళు చెప్పుకున్నారు అదే విషయం బాగా ట్రెండింగ్ లో ఉందిప్పుడు.    ఇక ఇప్పుడు వీళ్లల్లో ఒకరు బిగ్ బోస్ కి వెళ్లే ఛాన్స్ ఉందంటూ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి చెప్తున్నాడు. ఐనా బిగ్ బాస్ కి ఎం కావాలి కాంట్రవర్సీ కావాలి..వీళ్లకు ఆర్గానిక్ గా ఆ కాంట్రోవర్సి రేటింగ్ వచ్చేసింది. కాబట్టి వీళ్ళ ముగ్గురిలో అలేఖ్య గారే రావొచ్చు...బిగ్ బాస్ లో ఫేస్ చేయనంత నెగటివిటీని వీళ్లకు వచ్చేసింది. బిగ్ బాస్ హైప్ కోసం ఇలాంటి వాళ్ళు రావాల్సిందే..వీళ్ళు వచ్చే ఛాన్స్ లు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఉప్పల్ బాలు కూడా బిగ్ బాస్ 9 కి వచ్చే ఛాన్స్ ఉంది. వీళ్ళు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా అనేది కామెంట్ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి. ఇక ఆదిరెడ్డి చెప్పిన మాటలకు  నెటిజన్స్ కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు. "బిగ్ బాస్ కి వెళ్తే అక్కడ ఎంత మందిని తిడుతుందో. రొయ్యల పచ్చడి తిని ప్రెగ్నెంట్ అవ్వడానికా. వీళ్ళు బిగ్ బాస్ కి వెళ్తే టీవీని మ్యూట్ లో పెట్టుకుని చూడాలి. " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

Karthika Deepam 2 : గౌతమ్ ని రెచ్చగొట్టిన జ్యోత్స్న.. ఏకమైన కార్తీక్, దీప!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2' (Karthika Deepam 2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -324 లో... కార్తీక్, దీప ఇద్దరు మాట్లాడుకుంటారు. నేను మీ ప్రాణాలు కాపాడితే మీరు నా జీవితాన్ని కాపాడారు.. ఈ గడ్డి మొక్కను తులసి మొక్కను చేశారు. చిన్నప్పుడు మా నాన్న ఎప్పుడూ అనేవారు.. మనిషి ఎప్పుడూ ఒంటరి వాడు కాదు.. పంచభూతాలు మనతో ఉండి మనల్ని నడిపిస్తాయని.. నేను మిమ్మల్ని ఎన్ని మాటలన్నా భూదేవిలా ఓర్చుకున్నారు.. సమస్యల్లో చిక్కున్నప్పుడు ఆకాశంలా నిలబడ్డారు. ఈ తాళిని నా మెడలో కట్టి మైలపడిన గుడిని గంగాజలంతో కడిగేసినట్లు నా బతుకుని శుద్ధి చేశారు. నా గుడిలో మీరు చేరి, మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నారు.. దీపగానే మిగిలిపోయిన నా జీవితాన్ని దీపంగా వెలిగించి.. మీ పేరు పక్కన చోటు ఇచ్చి నన్ను ‘కార్తీకదీపం’ చేశారు అని దీప అంటుంది. ఇంకో జన్మ ఉందో లేదో నాకు తెలియదు. మనం మాత్రం భార్యభర్తలుగా ఉన్నంత వరకు కలిసే ఉంటాం దీపా.. నా నుంచి వెళ్లిపోతా అని ఎప్పుడూ అనొద్దంటాడు కార్తీక్.    దీప చేతుల్ని పట్టుకుని.. ప్రాణాలు కాపాడిన నీ చేతుల్ని ప్రాణం ఉండగా దూరం చేసుకోలేనని కార్తీక్ అనగానే.. దీప మురిసిపోతుంది. నువ్వు నేను అన్న ఆలోచన ఎప్పుడూ రానివ్వద్దు దీపా.. మనిద్దరం ఒక్కటే.. మనది ఆ దేవుడు ముడి వేసిన బంధం.. అందుకే ఈ కోనేటిలో మునిగిపోకుండా నిన్ను పంపాడని కార్తీక్ అంటాడు. ఇక ఏది ఎదురయినా కలిసి పోరాడుదాం.. గెలుద్దామని దీపతో కార్తీక్ అంటాడు.    ఇదిగో దీపా నీ లాకెట్ మళ్లీ నీ దగ్గరకే వచ్చేసింది. దీన్ని నీ దగ్గరే ఉండనీ అంటాడు కార్తీక్. వెంటనే దీప చేయి చాపుతుంది ఇవ్వమని. వెంటనే కార్తీక్.. ఇన్నేళ్లు కష్టపడి దాచింది చేతికి ఇవ్వడానికి కాదు.. మెడలో వేయడానికి.. ప్రాణదాత నా భార్యవు కాకపోయి ఉంటే చేతికే ఇచ్చేవాడ్ని.. ఇక సర్వం నువ్వే.. సర్వస్వం నువ్వే.. మూడు ముళ్లు ఎలాగో నీకు ఎదురుపడి వేయలేదు కదా? కనీసం ఈ లాకెట్ అయిన నీకు ఎదురుగా నిలబడి వేస్తానంటూ మెడలో తాళి కట్టినట్లే లాకెట్ వేస్తాడు కార్తీక్. దీప మురిసిపోతూ కార్తీక్ కళ్ళల్లోకి చూస్తుంది. ఇది నీ మెడలోనే ఉండనీ దీపా అని కార్తీక్ అంటాడు. అయితే దీప కూల్‌గా.. లేదు బాబు ఇది అంటే శౌర్యకు చాలా ఇష్టం.. దానికే ఇస్తాను.. గుర్తుగా ఉంటుంది. ఈ లాకెట్ మా అమ్మది.. మా నాన్న మా అమ్మ గుర్తుగా ఉండాలని దీన్ని నా మెడలో వేశారని దీప అంటుంది.    మరొక వైపు జ్యోత్స్న గౌతమ్ లు కలుస్తారు. జ్యోత్స్న తనని అడ్డు పెట్టుకొని దీప మీద గెలవాలని చూస్తుంది. నీపై అంత నింద వేసింది.. అది నేను నమ్మనంటూ దీపపై కోపం వచ్చేలా గౌతమ్ తో జ్యోత్స్న మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoindi Manasu : సీతాకాంత్ మాస్టర్ ప్లాన్.. విజిటింగ్ కార్డ్ పై ఆమె ఫింగర్ ప్రింట్స్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -371 లో... రామ్ ని తీసుకొని రామలక్ష్మి దగ్గరికి వస్తాడు సీతాకాంత్. వద్దన్నా పదే పదే ఎందుకు వస్తున్నారని రామలక్ష్మి అడుగుతుంది. ఇక మీరు లండన్ వెళ్ళిపోతారు కదా.. ఉన్నన్ని రోజులు మీతో టైమ్ స్పెండ్ చెయ్యడానికి వచ్చామని సీతాకాంత్ అంటాడు.    మిస్ ఒక అట ఆడుకుందామా అని రామ్ అనగానే రామలక్ష్మి సరే అంటుంది. కళ్లకి గంతలు కట్టుకొని మేమ్ ఎక్కడ ఉన్నామో కనుక్కోవాలని రామ్ అంటాడు. ముందుగా రామ్ కి గంతలు కడుతారు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ కి కడుతారు. ఆ గేమ్ ఆడుతున్నంత సేపు రామలక్ష్మి సీతాకాంత్ ఒకరినొకరు టచ్ చేసుకుంటు ఉంటారు. సీతకాంత్ పై రామలక్ష్మి పడిపోతుంది. దాంతో రామలక్ష్మి సిగ్గుపడి వెళ్ళిపోతుంది సీతాకాంత్ కూడా సిగ్గు పడతాడు. నువ్వే కదా మీ మిస్ నాపై పడేలా చేసావని రామ్ ని సీతాకాంత్ అడుగుతాడు. అదేం లేదని రామ్ అంటాడు.    రామలక్ష్మి దగ్గరిక సీతాకాంత్ వెళ్లి కాసేపు  క్యారెక్టర్ మార్చుకుందామా అని సీతాకాంత్ అంటాడు. నేను మైథిలి మీరు సీతాకాంత్ అని సీతాకాంత్ అంటాడు. ఇద్దరు కాసేపు అలా మాట్లాడుకుంటారు. దాంతో సీతాకాంత్ క్యారెక్టర్ లో ఉన్న రామలక్ష్మి ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత రామ్ ఇక్కడే ఉంటాడు మీరు వెళ్ళండి అని రామలక్ష్మి అనగానే సీతాకాంత్ వెళ్ళిపోతాడు.   ఆ తర్వాత సీతాకాంత్ తన ఫ్రెండ్ సీఐ తో మాట్లాడతాడు. ఎవరిని అడిగినా కూడా తను మైథిలి అంటున్నారని సీఐ చెప్తాడు. ఇద్దరు కలిసి రామలక్ష్మినా మైథిలినా అని కనుకోవడానికి ఒక ప్లాన్ చేస్తారు. మరుసటి రోజు సీతాకాంత్, సీఐ ఇద్దరు రామలక్ష్మి ఇంటికి వెళ్తారు. రామలక్ష్మి ఫింగర్ ప్రింట్స్ ద్వారా కనిపెట్టొచ్చని ఇద్దరు అనుకుంటారు. మీకు ఏమైనా అవసరమైతే నాకు కాల్ చెయ్యండి అని సీఐ తన విజిటింగ్ కార్డు ఇస్తాడు. దానిపై రామలక్ష్మి ఫింగర్ ప్రింట్స్ పడతాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : వేదవతి పిలుపుతో వచ్చిన నర్మద తల్లి.. పదిలక్షల కోసం చందు టెన్షన్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -125 లో... చందు పది లక్షలు ఎలా తీసుకొని రావాలని టెన్షన్ పడుతుంటే వెనకాల నుండి రామరాజు వచ్చి తన భుజంపై చెయ్యి వేస్తాడు. దాంతో చందు టెన్షన్ పడతాడు. ఏమైందని రామరాజు అడుగగా.. ఏం లేదని చందు అబద్ధం చెప్తాడు. నువ్వు నా కొడుకువే కాదురా నా నమ్మకానికి ప్రతిరూపమని రామరాజు అని తన పెద్ద కొడుకుపై ప్రేమని చెప్తుంటాడు. మా నాన్న పరువు పోకూడదు.. ఈ పెళ్లి జరగాలి ఎలాగైనా పది లక్షలు తీసుకొని రావాలని చందు అనుకుంటాడు. మరొకవైపు అల్లుడు గారు ఎలాగైనా పది లక్షలు తీసుకుని వస్తాడు.. నాకు నమ్మకం ఉంది.. తండ్రి మాట కంటే ఇప్పుడు భార్య మాటనే వింటాడని భాగ్యం తన వాళ్ళతో చెప్తుంది.    ఆ తర్వాత వేదవతి కుటుంబంలో పెళ్లి ఏర్పాట్లు జరుగుతాయి. పిండి వంటలు చేస్తుంటారు. మా అమ్మ పిండి వంటలు బాగా చేస్తుందని నర్మద బాధపడుతుంది. మీ వాళ్ళు పెళ్లికి పిలిస్తే వస్తారా అని వేదవతి అంటుంది. లేచిపోయి పెళ్లి చేసుకున్నారు కదా ఎలా వస్తారని వేదవతి అంటుంటే ఆ లేచిపోయి వచ్చింది కూడా మీ కొడుకు కోసమే కదా అని నర్మద అంటుంది.    తన వాళ్ళని గుర్తుచేసుకొని నర్మద ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడు నీ వాళ్ళు వస్తే హ్యాపీనా ఒకసారి అటు చూడు అని వేదవతి అనగానే అప్పుడే నర్మద వాళ్ళ అమ్మ వస్తుంది. తనని చూసి నర్మద ఎమోషనల్ అవుతుంది. నా కోసం వచ్చావా అమ్మ అని నర్మద హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీ అత్తయ్య వల్లే ఇక్కడికి వచ్చానని చెప్తుంది. నర్మద పేరెంట్స్ తో వేదవతితో మాట్లాడిన విషయం నర్మద వాళ్ళ అమ్మ చెప్తుంది. నర్మద వాళ్ళ అమ్మ తనకి చీర నగలు తీసుకొని వస్తుంది. దాంతో నర్మద హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కావ్య కోసం ఆఫీస్ కి వెళ్ళిన రాజ్.. టెన్షన్ లో యామిని!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -688 లో.....స్వప్న, అప్పు ఇద్దరు రుద్రాణిని ప్రాంక్ చేస్తారు. రుద్రాణి భోజనానికి వచ్చేసరికి టేబుల్ పై లైవ్ ఫిష్ ఉంటుంది. అది చూసి రుద్రాణి భయపడుతుంది. ఇదేంటీ లైవ్ ఫిష్ ఉంది వండలేదా అని రుద్రాణి అనగానే మీకు ఎక్కడ కన్పిస్తుంది అక్కడ కర్రీ ఉంది కదా అని స్వప్న, అప్పు అంటారు. చికెన్ కూడా పచ్చిగానే ఉంది బంగాళాదుంప కూడా వండలేదు అలాగే పెట్టారని రుద్రాణి అంటుంది. అక్కడ అన్ని కర్రీస్ ఉన్నాయ్ మీకెందుకు అలా అనిపిస్తుందని అప్పు, స్వప్న యాక్టింగ్ చేస్తారు.   మీరు నన్ను పిచ్చి దాన్ని చేస్తున్నారా.. ఎందుకు అలా అంటున్నారు.. ఇక్కడే ఉండండి, అంటూ రుద్రాణి వెళ్ళి ధాన్యలక్ష్మి ప్రకాష్ ఇద్దరిని తీసుకొని వచ్చి అక్కడ చూడండి వండకుండా పచ్చివి పెట్టారు కానీ వాళ్ళు కర్రీస్ అంటున్నారని చెప్పగానే ప్రకాష్ ఓపెన్ చేసేసరికి కర్రీస్ ఉంటాయి. నీకు ఏమైనా మైండ్ పని చెయ్యడం లేదా ఎందుకు ఇలా చేస్తున్నావ్ అవి కర్రీస్ అని ధాన్యలక్ష్మి కోప్పడుతుంది. కానీ వాళ్ళు వచ్చేలోపే స్వప్న, అప్పు మారుస్తారు. మరొకవైపు కావ్యకి రాజ్ ఫోన్ చేస్తాడు. అపర్ణ ఫోన్ లిఫ్ట్ చేయబోతుంటే కావ్య వెళ్లి లిఫ్ట్ చేసి పక్కకి వచ్చి మాట్లాడుతుంది చాలా సేపు ఫోన్ మాట్లాడుకుంటారు.   మరొకవైపు రాహుల్ టీనా కోసం వెతికి వెతికి ఫోన్ చేస్తాడు. స్వప్న లిఫ్ట్ చేసి నేను అడ్రెస్ చెప్తుంటాను నువ్వు రా అని అంటుంది. తీరా చుస్తే రాహుల్ తన ఇంటికి వస్తాడు. ఎదరుగా స్వప్న చీపురుకట్టతో రెడీగా ఉంటుంది. నీకు పెళ్ళాం పిల్లలున్నా కూడా టీనా అంటూ తిరుగుతున్నావంటూ కొడుతుంది. అప్పుడే రుద్రాణి వస్తుంది అందరు ఇంట్లో నన్ను పిచ్చి దానిలాగా చూస్తున్నారని రుద్రాణి అంటుంది.    తరువాయి భాగం లో రాజ్ బయటకు వెళ్తాడు. రాజ్ వెళ్తున్న కార్ లో జీపీఎస్ పెట్టాను తను ఎక్కడికి వెళ్లిన తెలుస్తుందని తన పేరెంట్స్ తో యామిని చెప్తుంది. కావ్య కోసం ఆఫీస్ కి వెళ్తాడు రాజ్. ఏంటి వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళాడు.. తనని గుర్తు పడుతారు కదా అని యామిని టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

శ్రీముఖి ప్లీజ్ డాన్స్ చేయొద్దు..మా ఆయన నీ డాన్స్ చూసి మెస్మోరైజ్ ఐపోతున్నాడు

  శ్రీరామనవమి పండగ స్పెషల్ కాన్సెప్ట్ ఆదివారం విత్ స్టార్ మా పరివారం రాబోతోంది. ఈ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఇష్మార్ట్ జోడీస్ ఎంట్రీ ఇచ్చారు. రాకేష్ - సుజాత, యష్ - సోనియా, ప్రేరణ - శ్రీపద్, ప్రదీప్ - సరస్వతి, లాస్య - మంజునాథ్ వీళ్లంతా వచ్చారు. వీళ్ళతో టాస్కులు ఆడించింది శ్రీముఖి. ఐతే ఇందులో ఒక టాస్క్ లో నేల మీద ఒక క్లాత్ వేసి దాని మీదనే వైఫ్ అండ్ హజ్బెండ్ ని నిలబెట్టి డాన్స్ చేయించింది. ఇకపోతే  సోనియా శ్రీముఖిని పాపం  ఒక రిక్వెస్ట్ చేసింది. "శ్రీముఖి గారు నా నుంచి ఒక రిక్వెస్ట్ మీరు అంత మంచిగా డాన్స్ చేయొద్దు...యష్ మీ డాన్స్ ని చూసి మెస్మోరైజ్ ఐపోయాడు..సో" అని చెప్పుకొచ్చింది. దాంతో శ్రీముఖి షాకైపోయింది. వెంటనే రాకేష్ అందుకున్నాడు.."పాపం యష్ రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నాడు. వాళ్ల ఆవిడను తప్ప అందరినీ చూస్తున్నాడు అదేంటో మరి" అన్నాడు. దానికి సోనియా, యష్ నవ్వేశారు. ఇక ఈ జోడీల్లో భర్తలను ఒక అట్ట పెట్టెల్లో పెట్టేసి భార్యలకు తమ తమ భర్తలను కనుక్కోవాలి అంటూ ఒక టాస్క్ ఇచ్చింది. అందులో లాస్య మంజునాథ్ ఓడిపోయారు. ఇక పాపం వాళ్ళు ఈసారి ఫీలైనట్టే అనిపించినా ఇది అలవాటే మాకు అంటూ నవ్వుకున్నారు. ఎందుకంటే ఇష్మార్ట్ జోడిలో పాపం వాళ్ళే మొదటిసారి ఎలిమినేట్ ఐపోయి వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చి మళ్ళీ ఎలిమినేట్ ఇపోయారు. ఇక ఆదివారం విత్ స్టార్ మా పరివారం కూడా అలాగే ఇప్పుడు జరిగేసరికి ఎలిమినేషన్ కి పాపం వాళ్ళు అలవాటు పడిపోయి పోన్లే అనేసుకున్నారు. అలాగే భయాలకు భర్తలు తినిపించే టాస్క్ కూడా ఇచ్చింది శ్రీముఖి. ఇలా శ్రీరామా నవమి రోజున ఎన్నో టాస్కులతో ఇష్మార్ట్ జోడి జంటలు వచ్చి ఆడియన్స్ ని అలరించబోతున్నాయి.  

ఛ..నన్నెవరూ కమిట్మెంట్ అడగలేదు.. ఒకవేళ అడిగితే ఎలా ఉంటుందో ?

  బుల్లితెర మీద జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది అష్షురెడ్డి. ఐతే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కమిట్మెంట్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. "కమిట్మెంట్ ఎలా వర్క్ అవుతుందో నాకు ఇంత వరకు తెలీదు. కానీ అడిగితే ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనే దురద కూడా నాకు ఉండేది. ఐతే ఇప్పటి వరకు నాకు అలాంటి సందర్భం ఎదురు కాలేదు..బహుశా నేను అంతలా ఎదగలేదేమో అడగడానికి. ఇప్పుడు చాలామంది వచ్చామా, పని చేసుకున్నామా , వెళ్ళిపోయి పడుకున్నామా అనేవాళ్లే ఉన్నారు. నా మీద ఎలాంటి నెగటివ్ కామెంట్స్ వచ్చినా నేను పట్టించుకోను. అరుణాచల  శివుడి దగ్గరకు వెళ్లాం నేను నా ఫ్రెండ్ కలిసి...అక్కడి నుంచి వచ్చాక  నేను చాలా మారాను. శివుడు ఉన్నాడు చూసుకుంటాడు అనిపిస్తుంది. అరుణాచలం ఒక పవర్ ఫుల్ ప్లేస్. అరుణాచలం వెళ్లక ముందు ఒక రకమైన ఆలోచన ఉండేది. అరుణాచలం వెళ్లి వచ్చాక చాల శాంతంగా ఉంది. ఐనా ఎందుకు నేను అంతలా రియాక్ట్ కావాలి ఏ విషయానికైనా అనుకుంటున్నాను. నాలోనే చాలా మార్పు వచ్చింది. ఇక లివింగ్ రిలేషిప్ అనేది జీవితంలో ఒక చెడ్డ విషయం.. పెళ్లి మాత్రమే స్పెషల్ లైఫ్ లో. కోపాలు, తాపాలు, చిన్న చిన్న రొమాన్స్ లు ఇవన్నీ ముందే చేసేస్తే పెళ్లి తర్వాత టీవీ చూడడం తప్ప ఇంకేం చేస్తారు. పెళ్లి తర్వాత ఇలాంటి మాజికల్ థింగ్స్ జరిగితేనే అందంగా ఉంటుంది. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చేవాళ్లకు కొంచెం లేట్ ఐనా కానీ సక్సెస్ మాత్రం వస్తుంది. ఐతే ఏమీ లేనప్పుడు ఎలా ఐతే నీ మైండ్ సెట్ ఉంటుందో...అన్ని ఉన్నప్పుడు కూడా మైండ్ సెట్ అలాగే ఉండాలి" అంటూ చెప్పుకొచ్చింది అష్షు రెడ్డి. ఇక ఇదే కమిట్మెంట్ మీద వర్ష కూడా మాట్లాడింది. " ఛ అసలు ఎవరూ నన్ను కమిట్మెంట్ అడగలేదు. బేసిక్ గ వర్క్ ఐపోయిన తర్వాత మాకు ఒక్కళ్ళు కూడా ఫోన్ లు చేయరు.." అంటూ తెగ ఫీలైపోయింది.    

రంభకు ప్రపోజ్ చేసిన రోబో...

  సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో భలే క్యూట్ గా ఉంది. ఈ షోకి రంభ, జెడి.చక్రవర్తి జంటగా వచ్చారు. రంభ రావడమే ఎప్పుడెప్పుడు ప్రొపోజ్ చేద్దామా అన్నట్టుగా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అందులో ఒక రోబో కూడా రెడీ ఐపోయి మరీ వచ్చింది. "ప్రపంచంలో నచ్చినవి రెండే రెండు. ఒక నేను ఒకటి మీరు" అంటూ చిట్టి ది రోబో వచ్చి రంభకి మెరిసే కళ్ళతో ప్రొపోజ్ చేసేసరికి రంభ కూడా ముద్దులిచ్చేసింది. తర్వాత చామంతి సీరియల్ టీం నుంచి ఆశిష్ వచ్చి రోబో కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నాను అంటూ రంభకి గులాబీలు ఇచ్చి మరీ ప్రొపోజ్ చేసాడు. అందమైన పూలన్నీ కలిసి ఒక దగ్గర ఉంటే ఇంకెంత అందంగా ఉంటుందో మీరే చూస్తారు అంటూ బ్యాక్ గ్రౌండ్ లో ఒక వాయిస్ రావడం జెడి చక్రవర్తి ఒక కర్టైన్ ని తీసేయడం ఆ వెంటనే అందమైన గులాబీలు పేర్చిన రంభ చిత్రం రావడం చూస్తే ఎవ్వరైనా సరే మెస్మోరైజ్ కాకుండా ఉండరు.. రమ్య కూడా గులాబీలలో తన అందాన్ని చూసుకుంది. ఇంతలో అష్షు వచ్చి జెడి గారు మీ సర్ప్రైజ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అని అడిగింది. వెంటనే ఆయన ఒక సారి నీ పేరు చెప్పు అన్నాడు చక్రవర్తి. రవి వెంటనే రంభ అనేసరికి ఆయన గుండెల్లోంచి రంగురంగుల హార్ట్ ఎమోజిస్ బయటకు వస్తున్నట్టు ఒక గ్రాఫిక్ పెట్టారు. అంతే రంభ వెంటనే "ఇది ఎప్పుడో చూపించారు" అని జెడి పరువు తీసేసింది.  ఇక రంభ, జెడి చక్రవర్తి కలిసి బొంబాయి ప్రియుడు మూవీలో నటించారు. ఇందులో వీళ్ళ నటన ఎంతో సహజంగా ఉంటుంది. అలాగే ఈ జోడి "కోందండ రాముడు" అనే మూవీలో కూడా కలిసి నటించారు. వీళ్ళ మధ్య మంచి బాండింగ్ అప్పటినుంచి ఉంది. ఇప్పుడు రంభ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.  

 బర్డ్ ఫ్లూ వచ్చిన కోడిలా ఉంది అంటూ పరువు తీసేసిన ఆది

  ఢీ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో సోనియా సింగ్ మీద ఆది వేసిన పంచులు మాములుగా లేవు. "లంచు కోస్తావా మంచు కోస్తావా" అనే పాటలు పెట్టే బదులు మంచి మెడ్లే సాంగ్స్ పెట్టొచ్చుగా" అంది సోనియా. దానికి ఆది " ఈ ఇడ్లి అమ్ముకునే దానికి మెడ్లే కావాలా" అనేసరికి షాకైంది సోనియా. "ఆది నేను డైటింగ్ చేసి సన్నగా అయ్యాను" అంది సోనియా. "బర్డ్ ఫ్లూ వచ్చిన కోడిలా ఉంది" అనేసరికి తలతిప్పేసింది. ఇక ఇప్పుడు హోస్ట్ నందు వంతు వచ్చింది. "చిలకలాగా భలే ఎనర్జిటిక్ గా ఉంటుంది సోనియా తెలుసా..నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేనా సోనియా "అని అడిగాడు. "లేదు జస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి" అనేసింది సోనియా. మళ్ళీ నందు "సడెన్ గా ఎలా మారిపోయావు" అన్నాడు డౌట్ తో..వెంటనే ఆది రియాక్ట్ అయ్యాడు. పంచ్ కోసం ఎప్పుడూ రెడీ ఉంటాడుగా "వీధి కుక్క కరిచింది. అందుకే మారిపోయింది" అంటూ డైలాగ్ కొట్టాడు. ఆ డైలాగ్ తో సోనియా షాక్ ఆది రాక్ అన్నట్టుగా ఉంది. అలాగే కంటెస్టెంట్స్ లో ఒక జోడి ఐతే "సేవ్ బర్డ్స్ సేవ్ నేచర్" అంటూ మొబైల్ రేడియేషన్ వల్ల పక్షులు ఎలా చనిపోతున్నాయో చెప్తూ చేసిన డాన్స్ కి జడ్జెస్ ఫిదా ఇపోయారు. అసలు ఈరోజున అడవులు, పక్షులు నాశనమైపోతున్నాయి అంటే దానికి ముఖ్య కారణం మొబైల్ రేడియేషన్. ఆ వేడికి తట్టుకోలేక ఎలా చనిపోతున్నాయో ఈ డాన్స్ లో చేసి చూపించారు. వీళ్ళ డాన్స్ చూసిన విజయ్ బిన్నీ మాష్టర్ ఐతే మీరిద్దరూ డాన్సర్స్ కాదు పెర్ఫార్మర్స్ అంటూ కితాబిచ్చారు. ఈ సాంగ్ చేస్తున్నంత సేపు కూడా ఆది పక్కన కూర్చున్న అశ్విని ఎమోషనల్ అవుతూనే కనిపించింది. హన్సిక కూడా బాధపడుతూ ఉంది. అలాగే ఈ సాంగ్ కి కోరియోగ్రఫీ క్లీన్ గా ఉంది అంటూ గణేష్ మాష్టర్ చెప్పుకొచ్చారు.

Illu illalu pillalu: పెళ్ళి పనుల్లో రామరాజు ఫ్యామిలీ.. మరి విశ్వ ఎత్తుగడ ఏంటి?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-124లో..  అన్నదమ్ములు ముగ్గురూ రెస్టారెంట్‌కి వెళ్తారు. అయితే చందు శ్రీవల్లి అడిగిన పది లక్షల గురించే ఆలోచిస్తుండు. అది చూసిన ఇద్దరు తమ్ముళ్లు.. ఏంటి అన్నయ్యా వదినతో ఏదో సీక్రెట్‌గా మాట్లాడుతున్నావ్.. ఇంతకు ముందు ప్రతి చిన్న విషయం మాతో చెప్పేవాడివి.. పెళ్లి కుదరగానే ఎంత మారిపోయావ్ అన్నయ్య అని ధీరజ్, సాగర్ ఇద్దరు అంటారు. చందు మాత్రం అలా ఆలోచిస్తూనే ఉంటాడు. ఏమైందిరా.. దేనికో టెన్షన్ పడుతున్నావ్.. ఏమైందని మళ్లీ అడుగుతారు. ఏం లేదురా నాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయని చందు అంటాడు. అన్నయ్యా.. ఆ రోజు నీ ప్రేమ విషయాన్ని మా దగ్గర దాచేసి నరకం చూశావ్.. మాతో కూడా చెప్పలేదు. కానీ నీకు మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదు. నీ మనసులో ఏ ప్రాబ్లమ్ ఉన్నా మాతో చెప్పు.. నీలో నువ్వు బాధపడకు. నాన్న చేతులపై ఈ పెళ్లి జరుగుతున్నందుకు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. నువ్వొక్కడివే నాన్న మాటకి విలువ ఇచ్చావని చాలా సంతోషంగా ఉన్నారు. ఆ విలువను కాపాడుకోవాలిరా. ఇప్పటివరకు మన మధ్య ఎలాంటి దాపరికాలు లేవు. ఇకపై కూడా మనం అలాగే ఉందాం.. కాబట్టి చెప్పరా.. నువ్వు ఏ విషయంలో టెన్షన్ పడుతున్నావని చందుని ఇద్దరు అడుగుతారు. మరోవైపు రామరాజు ఇంటింటికి తిరిగి శుభలేఖలు పంచుతాడు. ఆ తర్వాత నా కొడుకు పెళ్లి నా చేతులపై జరుగుతుందని వేదవతి దగ్గర కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అవుతాడు. నా పిల్లల పెళ్లి నా చేతులపై జరిపించాలని అనుకున్నాను.. కానీ చిన్నోడు, నడిపోడు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు పెద్ద కొడుకు పెళ్లి నా చేతులపై జరిపిస్తున్నా. తండ్రి మాటని జవదాటని విషయంలో నా పెద్ద కొడుకు నిజంగానే శ్రీరామ చంద్రుడు. వాడు వాడి ప్రేమనే త్యాగం చేశాడు. వాడు పొరపాటున కూడా ఈ నాన్నని మోసం చేయడు. కలలో కూడా అలాంటి ఆలోచన చేయడని రామరాజు ఎమోషనల్ అవుతాడు. ఇటు రామరాజు మోసం చేయడని అంటాడు.. అటు చందు అదే పనిలో పడ్డట్టుగా చూపిస్తారు. ధీరజ్, సాగర్‌లు ఎంత అడిగినా కూడా.. ఆ పది లక్షల మ్యాటర్ గురించి నిజం చెప్పడు చందు. పెళ్లి పనుల గురించే మాట్లాడుకున్నాం.. మరేం లేదని చందు అంటాడు. మరోవైపు తొలి పెళ్లి శుభలేఖను తన తల్లి శారదాంబకి వేదవతి ఇస్తుంది. ఆ శుభలేఖలో తన భర్త పేరు.. తన పేరు ఉండటంతో నా అల్లుడుకి మేమంటే ఎంత ప్రేమ అని శారదంబ ఎమోషనల్ అవుతుంది. అయితే పెళ్లి శుభలేఖ గురించి కోడలితో మాట్లాడుతుండగా భద్రవతి వినేస్తుంది. శారదాంబ చేతిలో ఉన్న శుభలేఖని తీసుకుని.. ఆ పనోడికి ఎంత ధైర్యం.. నీకే శుభలేఖ ఇస్తాడా.. అంటూ ఆ కార్డ్‌ని దేవుడి దీపం దగ్గర కాల్చేయబోతుంది. ఇంతలో మేనల్లుడు విశ్వ వచ్చి ఆపేస్తాడు. పెళ్లికి పిలిచినప్పుడు వెళ్లాలి కానీ.. శుభలేఖ కాల్చేస్తావ్ ఏంటి అత్తా.. మనం కూడా పెళ్లికి వెళ్లాలి అని అంటాడు.  రేయ్.. ఏం మాట్లాడుతున్నావ్.. ఆ రామరాజుగాడి కొడుకు పెళ్లికి మనం వెళ్లడమేంటి.. ఏం మాట్లాడుతున్నావని అంటుంది భద్రవతి. నేనేం మాట్లాడుతున్నానో.. పెళ్లి రోజున నీకు తెలుస్తుందిలే అత్తా.. చెప్పారుగా పెళ్లికి రమ్మని.. వెళ్తా.. వెళ్లి పెళ్లి తంతు చూసే వస్తా అని విశ్వ అంటాడు. ఆ మాటలు విన్న భద్రవతి.. వీడేదో ప్లాన్ చేశాడని అనుకుంటుంది. మరోవైపు శ్రీవల్లి అడిగిన పది లక్షల కోసం చందు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2: కోనేరులో ప్రాణధాత ప్రతిబింబం.. పట్టరాని సంతోషంలో దీప!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -323 లో....కార్తీక్ రెస్టారెంట్ కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. దీపా పద రెస్టారెంట్ కి అంటాడు. నేను రాను బాబు ఇక రెస్టారెంట్ కి.. అక్కడికి ఎవరో ఒకరు వస్తున్నారు.. మాటలు అంటున్నారు.. నా వల్ల మీరు మాటలు పడాల్సి వస్తుందని దీప బాధపడుతుంది. నేను మీ జీవితంలోకి వచ్చాను కాబట్టి మీరు అందరికి దూరమయ్యారు. పెళ్లిలు పైనే జరుగుతాయని అంటారు కానీ మన పెళ్లి భూమ్మీద జరిగింది. నేనొక బాటసారిని మాత్రమే మా నాన్న వల్ల కలిసాం.. నా కూతురు వల్ల పెళ్లి చేసుకున్నామని దీప తన లోని బాధని చెప్తుంటే కార్తీక్ మౌనంగా వింటాడు. దీప మాట్లాడడం పూర్తయ్యాక కార్తీక్ దీప చెయ్ పట్టుకొని ఒక దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అది చిన్నప్పుడు కార్తీక్ ని దీప కాపాడిన గుడికి తీసుకొని వెళ్తాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చాడని దీప షాక్ అవుతుంది. ఈ ప్లేస్ గుర్తుందా నా ప్రాణధాత నన్ను కలిసిన చోటు.. ఇప్పుడు నా ప్రాణధాత ఇక్కడే ఉంది చూపిస్తానంటూ కార్తీక్ కోనేరు దగ్గరికి తీసుకొని వెళ్లి కోనేరులో దీప ప్రతిబింబం చూపిస్తాడు. అదిగో ఆవిడే అని కార్తీక్ అనగానే దీప షాక్ అవుతుంది. నువ్వే నా ప్రాణధాత అని నీక్కూడా తెలుసు.. నేను ఏదైనా సాధించాక చెప్పాలని అనుకున్నావ్.. నాకు నీ చిన్నప్పటి ఫోటో చూసాక తెలిసింది.. నువ్వే నా ప్రాణధాత అని కార్తీక్ అంటాడు. నువ్వన్నావ్ కదా మన పెళ్లి భూమ్మిద జరిగిందని.. పైన జరగలేదు.. ఆల్రెడీ అక్కడ ముడివేసాడు కాబట్టి ఇక్కడ ఒకటయ్యాం మనకి రాసి పెట్టి ఉంది కాబట్టే మీ నాన్న ద్వారా కలిసాం.. శౌర్య ద్వారా ఒక్కటయ్యాం.. నువ్వు బాటసారివి కాదు నా భార్యవి అని కార్తీక్ తన ప్రేమని చెప్తుంటే దీపకి పట్టరాని సంతోషం వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లికి టెన్షన్ పెట్టించే ఆ వీడియో.. కోడలా మజాకా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto  Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -370 లో..... సీతాకాంత్ రమ్యతో పెళ్లి కి ఒప్పుకోవడం లేదని శ్రీలత సీతకాంత్ ని తీసుకొని ఫణీంద్ర ఇంటికి వెళ్తుంది. నీ మనవరాలి వళ్ల నా కొడుకు ప్రశాంతంగా లేడు.. ఇప్పుడే ఆ అమ్మాయి రామలక్ష్మి నా మైథిలీనో తేలాలని శ్రీలత అంటుంది. నీ కొడుకే నా మనవరాలి వెంట రామలక్ష్మి రామలక్ష్మి అంటూ తిరుగుతున్నాడని శ్రీలతపై కోప్పడతాడు ఫణీంద్ర. మీకు ఎన్నిసార్లు చెప్పాలండి.. నేను మైథిలి అని.. అందుకు సాక్ష్యం పాస్ పోర్ట్ చూపించాను కదా మళ్ళీ ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారని సీతాకాంత్ పై రామలక్ష్మి కోప్పడుతుంది. ఇలా మా మనవరాలి వెంట పడి వేదిస్తున్నారని పోలీస్ కంప్లైంట్ ఇస్తానని ఫణీంద్ర అనగానే శ్రీలత వాళ్ళు షాక్ అవుతారు. మర్యాద గా ఇక్కడి నుండి వెళ్ళండి అని ఫణీంద్ర వార్నింగ్ ఇస్తాడు. శ్రీలత, రామలక్ష్మి, శ్రీవల్లి బయటకు వస్తారు. అమ్మ చేసిన పనికి వాళ్ళు బాగా హర్ట్ అయ్యారు. వాళ్ళని కూల్ చెయ్యాలని సీతాకాంత్ మళ్ళీ వస్తానంటు లోపలికి వెళ్తాడు. బావగారు మళ్ళీ లోపలికి వెళ్తున్నారని శ్రీవల్లి అనగానే ఇంత జరిగింది మళ్ళీ వాడిని క్షమిస్తారని ఎలా అనుకుంటావని శ్రీలత అంటుంది. సీతాకాంత్ లోపలికి వెళ్లి వాళ్లకు సారీ చెప్తాడు. ఆ తర్వాత శ్రీలత, శ్రీవల్లి పంతులిచే సీతాకాంత్ ని పెళ్లి చేసుకొమ్మని చెప్పిస్తారు కదా.. ఆ పంతులికి శ్రీలత డబ్బులు ఇస్తుంది.. అలా డబ్బు ఇచ్చేది రమ్య విషయంలో ఎంక్వయిరీ చేస్తున్న అతను వీడియో తీసి మైథిలీకి పంపిస్తాడు. ఆ వీడియో మైథిలీ చూసి ఎంత పని చేస్తున్నారు అత్తయ్య అని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ వీడియోని రామలక్ష్మి వేరే నెంబర్ నుండి శ్రీలతకి పంపిస్తుంది. శ్రీలత ఆ వీడియో చూసి టెన్షన్ పడుతూ శ్రీవల్లిని పిలుస్తుంది. మన చుట్టూ ఏదో జరుగుతుంది అత్తయ్య అని భయపడుతుంది. మీరు చేస్తున్నా ప్రయత్నం ఆపకపోతే ఈ వీడియో చేరాల్సిన వాళ్ళకి చేరుతుందని మెసేజ్ కూడ రావడంతో శ్రీలత ఇంకా టెన్షన్ పడుతుంది. మరొకవైపు రామలక్ష్మి దగ్గరికి సీతాకాంత్, రామ్ వెళ్తారు. సీతాకాంత్ బయట ఫోన్ మాట్లాడుతుంటే.. రామ్ లోపలికి వెళ్లి హాల్లో రామలక్ష్మి ఫోన్ ఉంటే అది తీసుకోబోతుంటాడు. అప్పుడే రామలక్ష్మి వచ్చి ఫోన్ తీసుకుంటుంది. సీతాకాంత్ లోపలికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కావ్య ఆ సాక్ష్యం తీసుకురాగలదా.. అత్తని ఆడుకున్న కోడలు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -687 లో..... స్వప్న ఒంటరిగా ఏదో ఆలోచిస్తుంటే అప్పుడే అప్పు వచ్చి ఏమైంది అక్క అంతలా ఆలోచిస్తున్నావంటుంది.. మా అత్త కావ్య పరిస్థితిని వాడుకొని తనని పిచ్చి దానిలాగా చూపించాలనుకుంటుంది. తనకి ఎలా బుద్ది చెప్పాలని ఆలోచిస్తున్నానని స్వప్న అంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నరు కదా వాళ్ళే చూసుకుంటారని అప్పు అంటుంది. ఈ రాహుల్ తోడు ఉండడం వళ్ల మా అత్త ఇంకా రెచ్చిపోతుందని స్వప్న అంటుంది. రాహుల్ ని బయటకు పంపించి మా అత్త సంగతి చెప్పాలని తన ఫోన్ నుండి రాహుల్ కి ఫోన్ చేసి ఎవరో అమ్మాయిలాగా మాట్లాడుతుంది. నిన్ను కలవాలని అనగానే కలుస్తాను.. నేను సింగిల్ నే అని రాహుల్ ఫోన్ లో ఫ్లర్ట్ చేస్తుంటాడు. ఆ తర్వాత రాహుల్ బయటకు వెళ్తుంటే ఎక్కడికి అని అంటుంది. ఏదో ఒకటి చెప్పి రాహుల్ వెళ్ళిపోతాడు. మాక్కావల్సింది కూడా అదే అని స్వప్న, అప్పు ఇద్దరు అనుకుంటారు.  ఆ కళావతి సడెన్ గా ఎందుకు వెళ్ళిందని రాజ్ ఆలోచిస్తాడు . కావ్యకి మెసేజ్ చేస్తాడు. ఇద్దరు కాసేపు చాట్ చేసుకుంటారు. ఆ తర్వాత కాల్ మాట్లాడుకుంటారు. ఫోన్ కట్ చేసి పక్కకి చూసేసరికి యామిని ఉంటుంది. ఏంటి ఇలా సడెన్ గా వచ్చావని రాజ్ అంటాడు. ఇక నీ ప్రైవసీకి అడ్డు రాను.. నీకు నచ్చినట్టు ఉండు.. ఇదిగో కార్ కీస్ అని రాజ్ కి యామిని కీస్ ఇస్తుంది. కావ్య తమ పెళ్లి ఫోటో చూస్తూ ఏడుస్తుంటుంది. అప్పుడే సుభాష్ వస్తాడు ఏంటి అమ్మ కావ్య ఎన్ని రోజులు ఇలాగే ఉంటావని అడుగుతాడు. అంటే మరి మీరు కూడ రుద్రాణి గారి మాటలు నమ్ముతున్నరా అని కావ్య అంటుంది. రాజ్ ఉంటే ఎక్కడ ఉన్నాడని సుభాష్ అడుగుతాడు. ఇప్పుడు చెప్పలేనని కావ్య అనుకుటుంది. రాజ్ లేడని అనడానికి సాక్ష్యం ఉంది.. ఉన్నాడు అనడానికి సాక్ష్యం ఉందా అని సుభాష్ అడుగుతాడు. ఆ తర్వాత కావ్య, అప్పు ఇద్దరు రుద్రాణి ని ప్రాంక్ చెయ్యడానికి రెడీ అవుతారు. టేబుల్ పై లైవ్ ఫిష్ పెడతారు. అది చూసి రుద్రాణి భయపడుతుంది. చాపల పులుసు బాగుంటుందని ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.