పెళ్లయ్యాక రొమాన్స్ చచ్చిపోయింది...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే మాత్రం ప్రతీ వారం ఆడియన్స్ ని నవ్విస్తూనే ఉంది. ఈ వారం ఎపిసోడ్ లో యాదమ్మ రాజు తన సహా కంటెస్టెంట్ సుప్రీతతో కలిసి వచ్చాడు. వీళ్లకు  బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా "మోత మోగిపోద్ది" అనేది వచ్చింది. యాదమ్మ రాజు, సుప్రీతా డాన్స్ చేస్తూ ఉండగా మధ్యలో అమర్ దీప్ వచ్చి సుప్రీతతో డాన్స్ చేయడంతో రాజు నోరెళ్లబెట్టాడు. దాంతో సుమ అమర్ ఒక్కసారన్నా రాజుతో ఒక్క ఎపిసోడ్ అన్నా డాన్స్ చేయనివ్వవా అని అడిగింది. దాంతో అమర్ "మంచి సాంగ్ పెడుతుంటే రాజు వాడుకోవట్లేదు" అన్నాడు. "నేను డాన్స్ చేస్తుంటే అలా నన్ను వదిలేసి నడిచి వెళ్ళిపోతోంది" అంటూ పాపం రాజు తెగ ఫీలయ్యాడు. ఆ  వెంటనే సుప్రీతా వచ్చి "రాజు కోసం మాత్రమే వేరే సాంగ్ పెట్టండి" అంది. ఐతే ఆ సాంగ్ కి డ్యూయెట్ స్టెప్ ని సుప్రీతాతో కలిసి వేయలేకపోయారు. ఇంకేముంది రాజుని వదిలేసి తన వర్క్ స్టేషన్ కి వెళ్ళిపోయింది సుప్రీతా. "నాకు ఇంటరెస్ట్ పోయింది" అంది సుప్రీతా. "మాకు మాత్రం ఉందా ఏంటి" అంది సుమ. "పెళ్లయ్యాక నాలో రొమాంటిక్ యాంగిల్ పోయింది మేడం లోపల" అన్నాడు రాజు. దానికి సుమ నవ్వేసి " మీ లైఫ్ లో ఉన్న స్వీటెస్ట్ మెమరీ ఏమిటి" అని అడిగింది సుమ. "స్వీటెస్ట్ మెమొరీ అంటే మెమరీ కార్డు మేడం అని జోక్ వేస్తూనేరీసెంట్ గా మాకు ఒక పాప పుట్టింది అదే స్వీట్ మెమరీ" అన్నాడు. "అంటే ఇంత అన్ రొమాంటిక్ గా ఉన్నావ్ స్టెల్లాతో నువ్వు ఎలా ఉంటావా" అని సందేహం అంటూ రాజుని అడిగింది సుమ. "నేనేం ఉండను మేడం ఆమెనే ఉంటుంది నాతో అలా" అని కామెడీ చేసాడు రాజు. ఇలా రాజు, సుప్రీతా, సుమ కలిసి కామెడీ చేశారు.  

మాతా రాణి కృపతో కార్ కొన్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్...

  శ్రష్టి వర్మ ఇప్పుడు టాలీవుడ్ లో నిలదొక్కుకుంటున్న లేడీ కొరియోగ్రాఫర్. పుష్ప 2  మూవీలో జాతర సీన్ లో వచ్చే సాంగ్ అంటే అందరికీ ఇష్టమే. అదే "సూసెకి అగ్గిరవ్వ మాదిరి" అనే సాంగ్.. ఇది ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. ఈ సాంగ్ కి అల్లు అర్జున్, రష్మిక అద్భుతంగా డాన్స్ చేశారు. సోషల్ మీడియాలో ఈ సాంగ్ మీద రీల్స్ చేయని వాళ్లంటూ ఎవరూ లేరు. ఈ సాంగ్ ని గణేష్ మాష్టర్ కంపోజ్ చేస్తే శ్రష్టి వర్మ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించింది. అలాగే తన ఇన్స్టాగ్రామ్ లో ఈ సాంగ్ కి చేసిన స్టెప్స్ వీడియోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి. ఈమె ఢీ షో నుంచి బయటకు వచ్చాక జానీ మాష్టర్ తో కలిసి కొన్ని మూవీస్ కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కూడా పని చేసింది.   ఆ తర్వాత జానీ మాష్టర్ మీద లైంగిక వేధింపుల కేసు పెట్టింది శ్రష్టి వర్మ. ఏదేమైనా ఇప్పుడు జానీ మాష్టర్ కొన్ని రోజులు జైల్లో ఉండి వచ్చి ఇప్పుడు తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. అలాగే శ్రష్టి వర్మ కూడా ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంది. ఇక ఇప్పుడు శ్రష్టి వర్మ హ్యుందాయ్ ఫార్ట్యూనర్ కార్ ని కొనుగోలు చేసింది. అది టాప్ ఓపెన్ చేసి బయటకు చూస్తూ పిక్స్ తీసుకుని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకుంది. అలాగే మాతా రాణి కృప వలన కార్ కొనుక్కున్నంటూ పోస్ట్ పెట్టుకుంది. నెటిజన్స్ ఆమెకు విషెస్ చెప్తున్నారు. ఆమె తన డెబ్యూ  మూవీ శర్వానంద్ నటించిన మనమే అనే చిత్రంలో "నా మాట " అనే సాంగ్ కి కోరియోగ్రఫీ చేసింది. ఇక శ్రష్టి వర్మ జానీ మాస్టర్ మీద పోక్సో కేసు నమోదు చేయడంతో ఆయన తన నేషనల్ అవార్డుని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఏదేమైనా శ్రష్టి ఇప్పుడు మూవీస్ కి కొరియోగ్రాఫ్ చేస్తూ ఎదుగుతోంది.

కోడిని చంపి కుక్కకు పెడతావా...మళ్ళీ పక్షులను కాపాడాలా...ఇదేం లెక్క

  ఈ వారం ఢీ షోలో అశ్విని పరువు తీసేసాడు ఆది. మెంటార్ ప్రభు మాష్టర్ ఆధ్వర్యంలో సాగర్ - శృతి వచ్చి డాన్స్ చేశారు ఐతే సేవ్ బర్డ్స్ అనే కాన్సెప్ట్ తో వీళ్ళు డాన్స్ చేశారు. డాన్స్ తర్వాత అశ్విని నాలుగు మాటలు మాట్లాడింది. పక్షుల్ని కాపాడాలి. అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్లంతా మెష్ లు వేసేసుకుంటారు. పక్షులకు కొంచెం వాటర్ కొంచెం ఫుడ్ పెట్టండి. లేదంటే చచ్చిపోతాయి ఎండాకాలం కదా అని చెప్పింది. దానికి ఆది కౌంటర్ వేసాడు. "డిన్నర్ లో కోడి తిన్నది" మళ్ళీ వాటి గురించి మాట్లాడుతోంది అన్నాడు ఆది. " వాటికి ఫుడ్ పెట్టండి, నీళ్లు పెట్టండి అంటారు చాలామంది. మళ్ళీ పక్కకు వెళ్లి అందరూ లెగ్ పీస్ తినేస్తారు." అన్నాడు ఆది. "నేను తింటానేమో కానీ నేను రోజు 30 డాగ్స్ కి ఫీడ్ చేస్తాను. మా అమ్మ రోజూ ఉదయాన్నే చికెన్ రైస్ వండి స్ట్రీట్ డాగ్స్ కి పెడుతుంది" అంది అశ్విని. "కోడిని చంపి కుక్కకు పెడతారంట. దాన్ని చాల మంచి విషయంగా చెప్తోంది. అంటే పావురాలను, కుక్కలను తినం కాబట్టి వాటి మీద జాలి పడాలి..ఇదేం లెక్క" అన్నాడు ఆది. "మీరొక్కళ్ళు చాలండి నేను ఎన్ని మంచి మాటలు చెప్పినా ఒక్క మాటతో పరువు తీసేస్తారు" అంటూ అశ్విని ఫీలయ్యింది. ఐతే ఎవరు తిన్నా తినకపోయినా..మూగజీవాలకు మాత్రం గుప్పెడు గింజలు. కొంచెం వాటర్ పెడితే వాటికి నిజంగా ఎంతో పుణ్యం అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఆ భూతదయ అనేది ప్రతీ ఒక్కరికీ ఉండాలి. అసలే ఎండాకాలం. ఠారెత్తిస్తున్నాయి ఎండలు. ఇలాంటి టైంలో ఎవరైనా కూడా వాటికి చేతనైన సాయం చేయడం ఒక మంచి విషయం అంటూ అశ్విని చెప్పడంతో హోస్ట్ నందు కూడా ఆ విషయాన్ని మెచ్చుకున్నాడు.

Illu illalu pillalu : భాగ్యం ప్లాన్ ని తిప్పికొట్టిన వేదవతి కోడళ్ళు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -129 లో.....వేదవతి చేత ఎక్కువ రేట్ కి పెట్టి చీరలు కొనిపించాలి. నేను వాళ్లకి తక్కువ రేటున్న చీరలు కొనాలని భాగ్యం ప్లాన్ వేస్తుంది. అందులో భాగంగా కామాక్షి, అమూల్యలకి తక్కువ రేట్ చీరలు కొంటుంది‌. ఇక వేదవతి ని మాటలతో మభ్యపెట్టి తనకి తక్కువ రేట్ చీరలు కొంటుంది. దాంతో వేదవతి ఏమనలేకపోతుంది. మరొకవైపు నర్మదని ప్రేమ పక్కకి తీసుకొని వస్తుంది. చూసావా ఆ భాగ్యం అత్తయ్య.‌. వాళ్ళకి చీప్ రేట్ లో సారీస్ తీసుకొని వీళ్లకేమో లక్షలో తీసుకుంటుందని ఇద్దరు కలిసి ఒక ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత భాగ్యం వేల రేటున్న చీరలు సెలక్ట్ చేసుకుంటుంది. ప్రేమ, నర్మద కలిసి తక్కువ రేట్ చీరకు లక్షల చీర అన్నట్లు స్ట్రిక్కెర్ అంటిస్తారు. భాగ్యం వాళ్ళ దగ్గరికి వచ్చి పిన్ని గారు అక్కడ చీరలు బాగున్నాయంటూ వాళ్ళు స్టిక్కర్ అంటించిన దగ్గరికి తీసుకొని వెళ్లి చూపిస్తారు. చీరలు ఏంటి చీప్ గా ఉన్నాయని భాగ్యం అంటుంది. రేట్ చుడండి అనగానే భాగ్యం రేట్ చూసి చాలా కాస్లీ అని అనుకుంటుంది. ఇవే తీసుకుంటానని భాగ్యం అంటుంది. ఏం చేస్తున్నారు మీరు అంటూ వేదవతి తన కోడళ్ళని అడుగుతుంది. ఏం చెయ్యడం లేదు తర్వాత అర్ధమవుతుందని వాళ్ళు అంటారు. ఆ తర్వాత ప్రేమని ధీరజ్ పక్కకు తీసుకొని వెళ్లి.. నువ్వు కూడ చీర తీసుకో అంటాడు. నాకు మీ నాన్న అన్న మాటలు గుర్తున్నాయ్.. నేను కొనుక్కోను.. నువ్వు కోనివ్వమని ప్రేమ అంటుంది. నా దగ్గర వెయ్యి పదిహేను వందలున్నాయని ధీరజ్ అనగానే వాటితోనే కోనివ్వమని ప్రేమ అంటుంది. తరువాయి భాగం లో ప్రేమకి ధీరజ్ చీర సెలక్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : ఊరు వెళ్తున్న రామలక్ష్మి.. ఆపోద్దన్న సీతాకాంత్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -375 లో.....సీతాకాంత్ డల్ గా ఇంటికి వస్తాడు. సీతాకాంత్ దగ్గరికి శ్రీలత వెళ్లి నేను నీకు ఇచ్చిన గడువు దగ్గర పడుతుంది. ముహూర్తం పెట్టమంటావా అని అడుగుతుంది. నన్ను అర్ధం చేసుకోవాల్సిన నువ్వే ఇలా బాధపెడుతావ్ అనుకోలేదు అమ్మ అని సీతాకాంత్ అంటాడు. నువ్వే నన్ను అర్ధం చేసుకోవడం లేదురా.. నీ సంతోషం కోసమే ఇదంతా చేస్తున్నానని శ్రీలత నటిస్తుంటుంది. మరొకవైపు ఫణీంద్ర, సుశీల ఇద్దరు రామలక్ష్మి కోసం వెయిట్ చేస్తుంటారు. అప్పుడే రామలక్ష్మి బాధపడుతూ వస్తుంది. నేను ఇక్కడ మైథిలీగా ఉండలేక అటు సీతా సర్ కి భార్యగా ఉండలేక నేను నరకం అనుభవిస్తున్నానని రామలక్ష్మి ఎమోషనల్ అవుతుంటుంది. మా వాళ్లే ఇదంతా అని ఫణీంద్ర అంటాడు. మీ వాళ్ళ కాదని రామలక్ష్మి అంటుంది. ఇక మీదట ఆయన నా కోసం రాడని రామలక్ష్మి అంటుంది. ఏం జరిగి ఉంటుందని ఫణీంద్ర, సుశీల అనుకుంటారు. మరొకవైపు సీతాకాంత్ దగ్గరికి రామ్ వచ్చి ఫోన్ తీసుకొని రామలక్ష్మికి ఫోన్ చేస్తాడు. మిస్ మీతో ఆడుకోవాలని ఉంది రండీ అని రామ్ అనగానే.. నేను ఊరు వెళ్తున్నానని రామలక్ష్మి చెప్తుంది. సీతా మిస్ ఊరు వెళ్తుందంట అని రామ్ అంటాడు. వెళ్లే వాళ్ళని ఆపొద్దని సీతాకాంత్ అంటాడు. ఆ మాటలు రామలక్ష్మి ఫోన్ లో వింటుంది. నేను మిస్ ని కలవాలి అని రామ్ అనగానే డ్రైవర్ కి చెప్పి రామ్ ని తన వెంట పంపిస్తాడు. అదంతా చూస్తున్న శ్రీలత ఇదే కదా మనకి కావల్సింది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2:  ఆవేశంగా తాత దగ్గరికి వెళ్ళిన దీప.. జ్యోత్స్న  కన్నింగ్ ప్లాన్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-328 లో.. కాంచన, అనసూయలు.. శివనారాయణకు చాలా నచ్చజెప్పడానికి ట్రై చేస్తారు. ఆ గౌతమ్ మంచివాడు కాదు.. అతడితో జ్యోత్స్న పెళ్లి చేయొద్దని వాళ్ళు చెప్తుంటే.. శివనారాయణ మాత్రం వినడు. ఏది ఏమైనా ఈ పెళ్లి జరిగి తీరుతుందని శివనారాయణ చెప్పేసి లోపలికి వెళ్లిపోతాడు. తర్వాత సుమిత్ర, పారిజాతం ఇద్దరిని కూడా కాంచన బతిమిలాడుతుంది. సుమిత్ర వినకపోగా.. పారిజాతం మాత్రం.. తనకు నిజం తెలిసినా తెలియనట్లు నటిస్తూ మాటలు అనేస్తుంది. ఇక నిస్సహాయంగా ఏడ్చుకుంటూ అనసూయ, కాంచన తిరిగి బయలుదేర్తారు. ఇక కాంచన వాళ్లు వెళ్ళగానే జ్యోత్స్న దగ్గరికి పరుగుతీస్తుంది పారిజాతం. మరోవైపు అనసూయ, కాంచన ఇంటికి వస్తారు. అక్కడ జరిగిందంతా దీపకి చెప్తారు. ఈ పెళ్లి జరగకూడదు.. నీకు నష్టం జరగకూడదు.. ఏదొకటి చెయ్ దీపా అనేసి కాంచన వెళ్లిపోతుంది. భర్త కోసం పోరాడిన సతీ సావిత్ర కథ గుర్తుందిగా.. అలానే నువ్వు పోరాడు అని దీపకి అనసూయ ధైర్యం ఇస్తుంది. పెళ్లి ఆగాలంటే జ్యోత్స్న నోటితోనే నిజం చెప్పించాలి.. నా మీద పడిన నింద పోతుందని దీప కోపంగా ఇంటి నుండి బయల్దేరుతుంది.  మరోవైపు జ్యోత్స్న దగ్గరికి వెళ్ళిన పారిజాతం.. కాంచన, అనసూయ లు వచ్చిన సంగతి చెప్తుంది. జాగ్రత్తగా ఉండు, ఆ దీప దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయోనని జ్యోత్స్నకి పారిజాతం చెప్తుంది. ‌ఇక జ్యోత్స్న వెంటనే దీపకి కాల్ చేస్తుంది. ఇక దీప ఫోన్ లిఫ్ట్ చేసి.. పది నిమిషాలు ఆగు ఫోన్లో కాదు డైరెక్ట్‌గా మాట్లాడుకుందామని అంటుంది. ఇంటికి వస్తున్నావా అని జ్యోత్స్న అడుగగా.. ఏం ఆపుతావా? అని దీప అంటుంది. నా పెళ్లి ఆపడానికి మా అత్తను పంపించడానికి సిగ్గులేదా అని జ్యోత్స్న అనగానే.. అన్నింటికీ సమాధానం చెప్పడానికే వస్తున్నానని దీప అంటుంది. మళ్లీ ఛీ అనిపించుకుంటావని జ్యోత్స్న అంటుంది. నువ్వు సత్తిపండు గాడ్ని తీసుకొచ్చి గౌతమ్ గాడ్ని కాపాడటానికి నేనేం రమ్యను తీసుకుని రావడంలేదు జ్యోత్స్నా అని దీప అనగానే.. ఏం మాట్లాడుతున్నావని జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇక దీప వార్నింగ్ ఇచ్చి వస్తున్నా అంటూ కాల్ కట్ చేస్తుంది. మరోవైపు ఇంటికి వచ్చిన కార్తీక్.. దీప కోసం చూస్తాడు. తను లేకపోయేసరికి ఏం జరిగిందో చెప్పమని అనసూయ, కాంచనలని నిలదీస్తాడు. ఇక వాళ్ళిద్దరు జరిగిందంతా చెప్తారు. కావేరీ చాటుగా జ్యో, పారుల మాటలు విన్న దగ్గర నుంచి దీపను కాంచన కోరిన కోరిక వరకు అంతా చెప్తారు. అంతా విన్న కార్తీక్ బిత్తరపోతాడు. ముందు నిజం తెలియగానే నాకు చెప్పకుండా మీకు చెప్పడం దీప తప్పు కాదా.. కావేరీ చిన్నమ్మ నాతో షేర్ చేసుకోకపోవడం తప్పు కదా.. మీరే దీపను బలి పశువుని చేస్తున్నారు.. నాకు ముందు నుంచి జ్యోత్స్న మీద నమ్మకం లేదు.. తను మారిందని దీప చెప్పినా నేను నమ్మలేదంటూ కార్తీక్ కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ఆఫీస్ కి వెళ్ళిన రాజ్.. వాళ్ళు చూస్తారేమోనని కావ్య టెన్షన్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -692 లో..... యామిని రాజ్ ని ఎక్కడ తన ఫ్యామిలీ చూస్తుందోనని టెన్షన్ పడుతుంది. అందుకే రాజ్ ని అక్కడ నుండి తీసుకొని వెళ్ళాలనుకుటుంది. బావ వేరొక దగ్గర కళ్యాణం జరుగుతుంది కదా అక్కడికి వెళదామని రాజ్ తో యామిని అంటుంది. ఎక్కడ అయితే ఏంటి అని రాజ్ అంటాడు. యామిని పేరెంట్స్ కూడా వేరొక దగ్గరికి వెళదామని రాజ్ ని ఒప్పిస్తారు. రాజ్, యామిని వాళ్ళు వెళ్తుంటారు. నేను కార్ తీసుకొని వస్తానంటూ రాజ్ వెళ్తాడు. ఒకసారి కళావతిని కలవాలని తన కోసం చూస్తాడు. రుద్రాణి బయట తిరుగుతుంటే ఎక్కడ రాజ్ ను చూస్తుందోనని కావ్య బయటకు వచ్చి రాజ్ కోసం చూస్తుంది. కావ్యని యామిని చూస్తుందేమోనని ఒక గదిలోకి తీసుకొని వెళ్తాడు రాజ్. ఏంటి ఇలా లాక్కొచారు అక్కడ అని కావ్య అంటుంది. ఆ తర్వాత బయటకు వెళదామంటే పూజారి తాళం వేస్తాడు. డోర్ రాకపోవడంతో అయ్యో కళ్యాణం చూడలేకపోతున్నానని కావ్య ఫీల్ అవుతుంటే.. ఆ గదిలో ఉన్న ఫొటోస్ ఇంక పూజ సామానుతో రాజ్ పూజకి అన్ని సిద్ధం చేస్తాడు. ఇద్దరు పీటలపై కూర్చొని పూజ చేస్తారు. దాంతో కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత పూజారి డోర్ తియ్యగానే ఇద్దరు బయటకు వస్తారు. యామిని చూస్తుందేమోనని కావ్యకి బై చెప్పి వెళ్ళిపోతాడు రాజ్‌. ఎక్కడికి వెళ్ళావ్ బావ అని యామిని అడుగుతుంది. కార్ కీస్ కూర్చున్న దగ్గర మర్చిపోయానని వెళ్ళాను.. కళ్యాణం జరిగేటప్పుడు వెళ్లొద్దు అంటే అక్కడే ఉన్నానని రాజ్ చెప్తాడు. నేను అక్కడికి వచ్చాను. నువ్వు అక్కడ లేవని యామిని అంటుంటే.. ఉన్నాను అంటూ రాజ్ కవర్ చేస్తాడు. మరొకవైపు ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావని కావ్యని అపర్ణ అడుగుతుంది. కావ్య ఏదో కవర్ చేస్తుంది. తరువాయి భాగంలో కావ్యని కలవటానికి ఆఫీస్ కి వెళ్తాడు రాజ్. జీపీ ఎస్ ద్వారా యామిని చూస్తుంది. రాజ్ ఏంటి అక్కడికి వెళ్ళాడని టెన్షన్ పడుతుంది. సీసీటీవీ లో రాజ్ ఆఫీస్ కి రావడం కావ్య చూస్తుంది. ఎక్కడ ఎంప్లాయిస్ చూస్తారోనని కావ్య టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

 హుక్ స్టెప్స్‌ వివాదం.. కన్నీళ్లు పెట్టుకున్న శేఖర్ మాస్టర్!

టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ మాష్టర్ ఒక షోలో కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చేశారు. కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో అందులో హుషారుగా సాగుతోంది. జాతర అనే స్పెషల్ కాన్సెప్ట్ తో ఈ షో రాబోతోంది. ఐతే ఇందులో శేఖర్ మాష్టర్ ఏడ్చారు. శ్రీముఖి "మీరు చేసిన కోరియోగ్రఫీలో అద్భుతమైన పేరు వచ్చినప్పటికీ ట్రోలింగ్ కూడా బాగా జరిగింది" అని అడిగేసరికి శేఖర్ మాష్టర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాంతో శ్రీముఖి కూడా చాల బాధపడింది. "ఏ సాంగ్ ని ఎలా చేయాలో అలాగే చేస్తాం. అన్ని సాంగ్స్ ని ఒకేలా చేయము. ఈ సాంగ్ ఇలా చేయాలి. మాస్ సాంగ్ ఉంటె మాస్ సాంగ్, డ్యూయెట్ సాంగ్ ఉంటె ఇంకో లాగ, వేరే సాంగ్ కి వేరే లాగ..మీరు రాసేయటానికి, చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ నాకు నా వెనకాల నా వాళ్లకు" అంటూ పాపం వెక్కి వెక్కి ఏడ్చాడు. దాంతో అక్కడ సెట్ లో ఉన్న వాళ్లంతా కూడా ఆ మాటలకు చాలా ఫీల్ అయ్యారు. ఐతే శేఖర్ మాష్టర్ కోరియోగ్రఫీ కొంచెం శృతి తప్పింది అంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. రవితేజ మూవీ మిస్టర్ బచ్చన్ లో హీరోయిన్ బ్యాక్ పాకెట్ లో హీరో చెయ్యి పెట్టి వేసే స్టెప్స్ మీద ఆ తర్వాత పుష్ప 2 లోని పీలింగ్స్ సాంగ్ కి , డాకు మహారాజ్ మూవీలోని దబిడి దిబిడి సాంగ్ మీద, అలాగే రాబిన్ హుడ్ మూవీలో  అదిదా సర్ప్రైజు  అనే సాంగ్ స్టెప్స్ మీద బాగా నెగటివిటీ వచ్చింది. ఈ మూవీలో కేతిక శర్మ హుక్ స్టెప్ మీద బాగా ట్రోలింగ్ జరిగింది. ఇలాంటి స్టెప్స్ ని ఎలా కంపోజ్ చేస్తారు అంటూ కూడా నెటిజన్స్  అడిగారు. ఇక ఇప్పుడు మళ్ళీ ఈ ట్రోలింగ్ మీద కిర్రాక్ బాయ్స్ షోలో శ్రీముఖి అడిగింది.

Brahmamudi : ఆ గదిలో వాళ్ళిద్దరే.. బయట వాళ్ళ ఫ్యామిలీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -691 లో... గుడిలో రాజ్ ని చూస్తుంది కావ్య. ఎక్కడ తన అత్త మామ రాజ్ ని చూస్తారోమని కంగారుపడుతుంది. అప్పుడే రుద్రాణి వచ్చి రాజ్ ని చూసి పూజ జరుగుతున్న దగ్గరికి వెళ్లి మైక్ తీసుకొని తన వాళ్ళకి రాజ్ ఉన్నాడని చూపిస్తుంది. దాంతో అందరు రాజ్ దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అవుతారు. అదంతా చూసి యామిని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. తను మా ఆయన రాజ్.. తనకి గతం గుర్తు లేదని యామిని చెప్తుంది. అంత యామిని చేస్తున్నా కుట్ర అని కావ్య చెప్తుంది. అందరు రాజ్ చుట్టూ చేరి ఏదో ఒకటి మాట్లాడుతున్నట్లు రాజ్ కళ్ళు తిరిగి కిందపడిపోయినట్లు కావ్య ఉహించుకుంటుంది. అలా జరగకూడదు అత్తయ్య వాళ్ళ ఎవరు కూడా ఆయన్ని చూడొద్దని యామినికి కావ్య ఎదరుపడితే తనే ఇక్కడ నుండీ తీసుకొని వెళ్తుందని అక్షింతలు అందరికి ఇస్తూ యామిని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. కావ్యని చూసి యామిని షాక్ అవుతుంది. ఇదేంటీ ఇక్కడ ఉంది అనుకుటుంది. కావ్యతో రాజ్ మాట్లాడతాడు. మా వాళ్లు అంత వచ్చారని రాజ్ కి కావ్య చెప్తుంది. రాజ్ అటుగా చూస్తుంటే అందరు అటు వైపు తిరిగి ఉంటారు. తరువాయి భాగం లో కావ్య వెళ్తుంటే ఎక్కడ యామిని చూస్తుందోనని రాజ్ తనని పక్కన గదిలోకి తీసుకొని వెళ్తాడు. అప్పుడే పూజరి వచ్చి గది తాళం వేస్తాడు. అయ్యో అక్కడ పూజ జరుగుతుందని కావ్య టెన్షన్ పడుతుంటే.. మీకు పూజ జరగాలి కదా అంటూ ఆ గదిలో ఉన్న దేవుడు ఫొటోస్ సెట్ చేసి పూజకి రాజ్ అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఇద్దరు కలిసి పూజ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : శివన్నారాయణకి నిజం చెప్పేసిన కాంచన.. జ్యోత్స్న పెళ్ళి ఫిక్స్ చేస్తాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -327 లో.... గౌతమ్ తనకి వార్నింగ్ ఇచ్చిన విషయం దీప గుర్తుచేసుకొని కోపంగా ఉంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఏంటి కోపంగా ఉన్నావంటూ ప్రేమగా మాట్లాడి ఒక రోజ్ ఫ్లవర్ ఇస్తాడు. అప్పుడే కావేరి రావడం చుసిన దీప మీ పిన్ని వస్తుందని చెప్తుంది. కావేరి వచ్చి దీప తో మాట్లాడాలనగానే కార్తీక్ అక్కడ నుండి వెళ్లిపోతాడు. జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ నువ్వు ఆపలేదు.. నీ చేత తనే ఆపించిందని కావేరి చెప్పగానే దీప షాక్ అవుతుంది. పారిజాతం, జ్యోత్స్న మాట్లాడుకున్న ప్రతీమాట కావేరి చెప్పగానే దీపకి కోపం వస్తుంది. ఇదంతా కార్తీక్ ని నీ నుండి దూరం చేసి నీ ప్లేస్ లో జ్యోత్స్న ఉండాలనుకుంటుంది. నువ్వు ఏదో ఒకటి చెయ్ దీప అని కావేరి చెప్తుంది. సరే మీరు ఈ విషయం ఎవరికి చెప్పకండి అని దీప అంటుంది. ఆ తర్వాత శివన్నారాయణ జ్యోత్స్న పెళ్లిని ఫారెన్ లో చెయ్యాలనుకుంటాడు. అప్పుడే ఇంట్లోకి వస్తున్న పారిజాతం,జ్యోత్స్నలకి ఆ విషయం చెప్తాడు శివన్నారాయణ. వద్దు నా పెళ్లి ఇక్కడే జరగాలి అయిన నాకు కొంత టైమ్ కావాలని జ్యోత్స్న చెప్తుంది. మరొకవైపు దీప ఇంటికి వచ్చి కావేరి చెప్పింది మొత్తం కాంచనకి చెప్తుంది. జ్యోత్స్న ఏంటి ఇలా తయారైందని కోప్పడుతుంది. ఇప్పుడు ముహూర్తం పెట్టుకోకుండా ఆపాలని కాంచన అంటుంది. నేనే వెళ్లి జ్యోత్స్నకి బుద్ది చెప్తానని దీప వెళ్తుంటే.. కాంచన అనసూయ ఇద్దరు ఆపుతారు. నేనే వెళ్లి మాట్లాడుతా అని కాంచన అంటుంది. ఆ తర్వాత నేను పెళ్లి ముహూర్తం పెట్టడానికి వెళ్తున్నా.. ఈ విషయం జ్యోత్స్నకి ఇప్పుడే చెప్పకండి అని పారిజాతంతో శివన్నారాయణ అంటాడు. నాకు ఎదరు రామ్మా అని సుమిత్రతో శివన్నారాయణ అంటాడు. సుమిత్ర ఎదరు వస్తుంది. శివన్నారాయణ బయటకు వెళ్తుంటాడు. అప్పుడే కాంచన వస్తుంది. నాన్న గౌతమ్ మంచివాడు కాదని చెప్తుంది. కాంచన చెప్పేది నిజమని అనసూయ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : మైథిలీ కాదని నిరూపించడం కోసం సీతాకాంత్ ప్లాన్.. నిజం తెలుసుకున్న రామలక్ష్మి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -374 లో.... రామలక్ష్మి సీతకాంత్ ఇద్దరు ఒకే ప్లేట్ లో భోజనం చేస్తుంటారు. వాళ్ళని చూసి ఆ పెద్దావిడ, తన భర్త మురిసిపోతారు. ఇద్దరు భోజనం చేస్తారు తర్వాత సీతాకాంత్ పక్కకి వచ్చి తను మైథిలి అయితే నాతో కలిసి అలా ఒకే ప్లేట్ లో భోజనం ఎలా చేస్తుంది. ఖచ్చితంగా తను నా రామలక్ష్మినే ఎలాగైనా తాను బయటపడేలా చెయ్యాలనుకుంటాడు. తన ఫ్రెండ్ కి కాల్ చేసి కొంతమంది రౌడీలని పంపించు నన్ను కొట్టమని చెప్పమని చెప్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు వెళ్తుంటే ఆ పెద్దవాళ్ళు వాళ్ళని ఆశీర్వదించి పంపిస్తారు. ఇద్దరు వెళ్తుంటే కొంతమంది రౌడీలు వస్తారు. సీతాకాంత్ తో గొడవ పడుతుంటాడు. వీళ్ళు నా మనుషులే కదా అని సీతాకాంత్ ఓవర్ యాక్టింగ్ చేస్తుంటాడు కానీ వాళ్ళు తన ఫ్రెండ్ పంపించిన రౌడీ లు కాదు.. అప్పుడే తన ఫ్రెండ్ కాల్ చేసి మా వాళ్ళు ఫుల్ గా తాగి పడుకున్నారు.. రావట్లేదని చెప్తాడు. దాంతో సీతాకాంత్ ఈ రౌడీలని కొడతాడు. రామలక్ష్మి దగ్గరికి వెళ్లి తప్పుగా మాట్లాడుతుంటే వాళ్ళని కొడతాడు. రౌడీ లు సీతాకాంత్ ని కత్తితో పొడిచినట్లు సీతాకాంత్ ని ఆ సిచువేషన్ లో చూసి రామలక్ష్మి నేనే మీ రామాలక్ష్మి అని నిజం చెప్పినట్లు సీతాకాంత్ కల కంటాడు. హలో సీతా గారు అని రామలక్ష్మి అంటుంటే.. అప్పుడు ఉహలో నుండి తేరుకొని ఇదంతా కలనా అని డిస్సపాయింట్ అవుతాడు. రౌడీ లు వచ్చినప్పుడు రామలక్ష్మి ఆ పెద్దావిడ వాళ్ళని పిలిచానని రామలక్ష్మి చెప్తుంది. అప్పుడే తన ఫ్రెండ్ కాల్ చేసి రౌడీ లని పంపమంటావా అని అడుగుతాడు. నా ప్లాన్ ఫెయిల్ చేసావని ఫోన్ లో సీతాకాంత్ తన ప్లాన్ గురించి చెప్తుంటే రామలక్ష్మి వింటుంది. ఇక మీరు మారరా.. నేను మైథిలి అని చెప్తున్నా వినిపించుకోవడం లేదని కోపంగా వెళ్ళిపోతుంది. మరొకవైపు అసలు ఈ మైథిలి సీతా బావ ఎక్కడ వెళ్లినట్లు అని శ్రీలత తో శ్రీవల్లి అంటుంది. అప్పుడే సీతాకాంత్ డల్ గా వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : పెళ్ళి షాపింగ్ కి వెళ్ళిన భాగ్యం.. తన డబ్బుతోనే కొనివ్వమన్న ప్రేమ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -128 లో... సేట్ దగ్గరికి చందు వెళ్లి పది లక్షలు కావాలని అడుగుతాడు. మీ నాన్న తో ఒక మాట చెప్పించు ఇస్తానని సేట్ అంటాడు. డబ్బు గురించి మా నాన్నకి తెలియొద్దని చందు అంటాడు. అప్పుడే రామరాజు సేట్ కి పత్రిక ఇవ్వడానికి వస్తాడు. రామరాజుకి ఎదరుగా సేట్ బయటకు వెళ్తాడు. నా కొడుకు పెళ్లి తప్పకుండా రావాలని రామరాజు చెప్తాడు. వస్తాం ఏమైనా డబ్బు కావాలా అని రామరాజుని సేట్ అడుగుతాడు. వద్దు పెళ్లి కోసం డబ్బు దాచానని రామరాజు అంటాడు. ఎందుకు అలా అడుగుతున్నారని రామరాజు అడుగుతాడు. ఏదైనా హెల్ప్ చేద్దామని అని సేట్ అంటాడు. ఆ తర్వాత రామరాజు వెళ్ళిపోయాక సేట్ లోపలున్న చందు దగ్గరికి వస్తాడు. డబ్బు ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాడు. ఇస్తాను నువ్వు డబ్బు కట్టకపోతే మాత్రం మీ ఇంటికి వస్తానని చెప్పి పది లక్షలు అప్పు ఇస్తాడు. ఆ డబ్బు తీసుకొని వెళ్లి శ్రీవల్లి చేతిలో పెడతాడు చందు. శ్రీవల్లి థాంక్స్ బా అంటూ హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ డబ్బు భాగ్యం చేతిలో పెడుతుంది శ్రీవల్లి. అల్లుడు గారు నా కూతురికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారని భాగ్యం మురిసి పోతుంది. మరొకవైపు అందరు షాపింగ్ కి వస్తారు. భాగ్యం తన కుటుంబాన్ని తీసుకొని వస్తుంది. వాళ్ళు రావడం ఫస్ట్ టైమ్ కాబట్టి అన్నీ వింతగా చూస్తుంటారు. మీరు అమ్మాయికి కొనండి.. మేం అబ్బాయికి కొంటామని అని వేదవతితో భాగ్యం అంటుంది. సరే మా అబ్బాయికి నా ఇద్దరు కూతుళ్ళకి తీసుకోండి అని వేదవతి అంటుంది. వాళ్ళ చేత ఎక్కువ రేట్ బట్టలు కొనిపించుకుని వాళ్ళకి తక్కువ రేటు బట్టలు కొనియ్యాలని భాగ్యం అనుకుంటుంది. వాళ్ళు ఏది చూసిన బాలేదని పక్కకి పారేస్తుంది. తరువాయి భాగంలో అందరు కొనుక్కుంటున్నారు. నువ్వు కొనుక్కో అని ప్రేమతో ధీరజ్ అంటాడు. మీ నాన్న అన్న మాటలు ఇంకా గుర్తున్నాయ్.. నీ డబ్బులతో కొనిస్తే కొనుక్కుంటా అని ప్రేమ అనగానే.. నా దగ్గర వెయ్యి పదిహేను వందలు తప్ప ఏం లేవని ధీరజ్ అనగానే వాటితోనే కోనివ్వమని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మెమరీ పవర్ తగ్గిపోయింది..ఇక రిటైర్ అవ్వండి

రష్మీ రిటైర్ కావాల్సిన టైం వచ్చిందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లూఎన్సర్. శ్రీదేవి డ్రామా కంపెనీ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో భలే సందడి చేసింది. ఐతే ఈ ఎపిసోడ్ కి సోషల్ మీడియా ఇన్ఫ్లూఎన్సర్ పూలచొక్కా అనే అతను వచ్చాడు. రాగానే అతని మ్యానరిజమ్ తో చేతులు తిప్పుతూ మాట్లాడాడు. టొమాటోస్ బుట్టను పట్టుకొచ్చాడు. రాగానే హాయ్ గైస్ నేను సినిమాలకు టొమాటోస్ ఇస్తూ ఉంటాను. కానీ ఫర్ ఏ చేంజ్ నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి టొమాటోస్ ఇస్తాను...అంటే ఈ షోలో ఉన్న ఆర్టిస్టులకు టొమాటోస్ ఇవ్వబోతున్నాను అన్నాడు. అతని చేతులు తిప్పే మ్యానరిజాన్ని ఇమిటేట్ చేశారు ఆది, పంచ్ ప్రసాద్. బులెట్ భాస్కర్ కి టొమాటోస్ ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పేసరికి ఆయనకు టొమాటోస్ కాదు గుడ్లు కూడా విసిరేయాలి అన్నాడు ఆది. ఇంతలో ప్రసాద్ అతని దగ్గరకు వెళ్ళాడు. "నాకు మీ స్కిట్స్ అంటే చాలా ఇష్టం " అన్నాడు పూలచొక్కా . తర్వాత పూలచొక్కా అని పేరు పెట్టుకుని గళ్ళ చొక్కా వేసుకొచ్చావేంటి అని అడిగాడు. ఆ తర్వాత రష్మీని పిలిచి "నేను మీ యాంకరింగ్ చూస్తున్నాను...క్లోజ్లీ అబ్జర్వింగ్ అంటూనే కాకపోతే కొంచెం మెమరీ పవర్ తగ్గింది మీకు. రిటైర్ కావడానికి మీకు ఇదే మంచి సమయం" అంటూ పుసుక్కున రష్మీ పరువు తీసేసాడు. అసలు అంత సడెన్ గా రిటైర్ అన్న పదం అతని నోటి నుంచి విన్న రష్మీ పాపం ఎం చెప్పాలో తెలీక చాలా ఫీలయ్యింది. పూలచొక్కా వేసిన ఈ డైలాగ్ కి నెటిజన్స్ ఐతే ఆమెకు రిటైర్మెంట్ అవసరం లేదు కానీ తెలుగు నేర్చుకుంటే చాలు అంటూ కామెంట్ చేస్తున్నారు.  

Illu illalu pillalu : డబ్బుల కోసం కొడుకు.. శుభలేఖ ఇవ్వడానికి తండ్రి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -127 లో...... ప్రేమ దగ్గరికి రేవతి వస్తుంది. ప్రేమ తన తల్లిని చూడగానే ఎమోషనల్ అవుతుంది. నువ్వు ఈ ఇంట్లో ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ ఎప్పుడు నువు లక్ష్మీదేవిలా నగలతో కళకళలాడుతు ఉండాలని ప్రేమకి నగలు ఇస్తుంది రేవతి. దాంతో ప్రేమ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక నేను వెళ్ళొస్తా అంటూ రేవతి వెళ్తుంది. గుమ్మం బయటే పెద్దావిడ వింటుంది. రేవతి రాగానే ఎక్కడ మీ ఆయన చూస్తాడోనని టెన్షన్ అయిందని లోపలికి వస్తుండగా సేనాపతి, భద్రవతి ఎదరుపడుతారు. ఎక్కడికి వెళ్ళావని రేవతిని సేనాపతి అడుగుతాడు. ఆ ఇంట్లో ఉన్న నా కూతురికి నగలు ఇవ్వడానికి వెళ్ళాననగానే రేవతిని కొడతాడు సేనాపతి. దాంతో పెద్దావిడ ఆపుతుంది నీకేమైనా బుద్ది ఉందా  ప్రేమను ఎలా రప్పించుకోవాలో నేను ఆలోచిస్తుంటే.. నువ్వు అక్కడికి వెళ్లి నగలు ఇచ్చావా అంటూ రేవతిపై కోప్పడుతుంది‌ భద్రవతి. మరొకవైపు చందు ఎన్ని ప్రయత్నాలు చేసిన డబ్బు దొరకదు. శ్రీవల్లి ని కలవడానికి చందు రెస్టారెంట్ కి వస్తాడు. తను ఎలాగైనా పది లక్షలు తీసుకొని వస్తాను అనేలా చందుతో భాగ్యం చెప్పినట్లుగా మాట్లాడుతుంది శ్రీవల్లి.ఆ తర్వాత తన తల్లి తెచ్చిన నగలన్ని పెట్టుకుంటుంది ప్రేమ. ధీరజ్ ని పిలచి ఎలా ఉన్నాయని అడుగుతుంది. మొదట వెటకారం గా మాట్లాడిన ఆ తర్వాత బాపు బొమ్మలా ఉన్నావంటూ పొగుడుతాడు. తరువాయి భాగం లో చందు ఒక సేట్ దగ్గరికి వెళ్లి వడ్డీ కి డబ్బు కావాలని అంటాడు. మీ నాన్న ని తీసుకొని రా అని అతను అంటాడు. అప్పుడే రామరాజు శుభలేక ఇవ్వడానికి సేట్ దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: కూపీలాగిన పారిజాతం.. కావేరి తనకి నిజం చెప్పగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -326 లో.... దీప దగ్గరికి గౌతమ్ వచ్చి వార్నింగ్ ఇస్తాడు. దీప కూడా తగ్గకుండా మాట్లాడుతుంది. గౌతమ్ వెళ్ళిపోయాక గౌతమ్ ఇలాంటి వాడా అని కాంచన, అనసూయ మాట్లాడుకుంటారు. నువ్వు గౌతమ్ విషయంలో ఏం చేసిన కూడా నాకు చెప్పాలని దీప దగ్గర కాంచన మాట తీసుకుంటుంది. ఇలాంటి వాడిని మళ్ళీ ఆ  ఇంటికి అల్లుడు చేసుకోరు కదా అని అనసూయ అంటుంది. లేదు గౌతమ్ తనంతట తనే వద్దనుకున్నాడు కదా మళ్ళీ మా నాన్న ఈ పెళ్లి కి ఒప్పుకోడని కాంచన అంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వస్తుంది. అప్పుడే జ్యోత్స్నకి గౌతమ్ మెసేజ్ చేస్తాడు. దాంతో జ్యోత్స్న వెళ్ళిపోతుంది. ఇది నా దగ్గర ఏదో దాస్తుంది.. ముందు అది కనుక్కోవాలని అనుకుటుంది. ఆ తర్వాత పారిజాతం సత్తి పండుని కలుస్తుంది. నువ్వు రమ్య భర్త కాదని తెలుసు.. ఇప్పుడు నిజం చెప్పు అంటూ కొంతడబ్బు ఇస్తుంది. నేను రమ్య భర్త కాదు ఒకరు చెప్పమంటే చెప్పానని సత్తి పండు అంటాడు. ఎవరు వాళ్ళని పారిజాతం అడుగుతుంది. జ్యోత్స్న మేడమ్ అని అతను చెప్పగానే.. పారిజాతం షాక్ అవుతుంది. మరొక వైపు శ్రీధర్, కావేరి ఒక రెస్టారెంట్ కి వస్తారు అదే రెస్టారెంట్ కి జ్యోత్స్న, గౌతమ్ వస్తారు. వాళ్ళని చుసిన కావేరి అదేంటీ పెళ్లి కాన్సిల్ అయింది మళ్ళీ కలిసి వస్తున్నారని అనుకుటుంది. శ్రీధర్ పక్కకి వెళ్లి ఫోన్ మాట్లాడుతాడు. కావేరి కాబిన్ పక్కనే వాళ్ళు కూర్చుంటారు. దీప గురించి మాట్లాడుకుంటారు అప్పుడే పారిజాతం రావడం చుసిన జ్యోత్స్న.. గౌతమ్ ని అక్కడ నుండి పంపిస్తుంది. గౌతమ్ కాల్ చేస్తే చిరాకు పడ్డావ్.. ఇప్పుడు ఏకంగా కలిసావని పారిజాతం అంటుంది. ఇప్పుడే సత్తి పండుని కలిసాను జరిగిందంతా చెప్పాడు అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇది రెస్టారెంట్ అంటూ పారిజాతాన్ని  పక్కకి తీసుకొని వెళ్తుంది జ్యోత్స్న. వాళ్ళ వెనకాలే కావేరి వెళ్తుంది. గౌతమ్ తప్పు చేసాడు. ఈ పెళ్లి దీప ద్వారా ఆగిపోతే అందరు దీపని తిడతారు. అందుకే గౌతమ్ తప్పు చేసాడని తెలిసిన సైలెంట్ గా ఉన్నానంటూ జరిగింది మొత్తం చెప్తుంది. ఇదంతా ఎందుకని పారిజాతం అడుగుతుంది.  బావ జీవితం లో నుండి దీప వెళ్లిపోతుంది.. బావ నాకు మాత్రమే సొంతమని జ్యోత్స్న అంటుంది. ఈలోపు ఇంట్లో వాళ్లకి తెలిస్తే అని పారిజాతం అంటుంది. తెలిసేలోపు అంత అయిపోతుందని జ్యోత్స్న అంటుంది. అదంతా విన్న కావేరి వెంటనే ఈ విషయం దీపకి చెప్పాలనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : భార్యాభర్తల అన్యోన్యత చూసి రామలక్ష్మి ఫిధా.. సీతాకాంత్ కి తను దగ్గరవుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -373 లో....సీతాకాంత్ రామలక్ష్మి బయటకు వస్తారు. అదే సమయంలో కార్ పంచర్ అవ్వడం తో ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు. మీరు నడవలేరు నేను ఎత్తుకుంటా అని సీతాకాంత్ అంటాడు. అవసరం లేదని రామలక్ష్మి నడుస్తుంటుంది. దాంతో రామలక్ష్మి కిందపడబోతుంటే సీతాకాంత్ పట్టుకుంటాడు. నేను చెప్పాను కదా అని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ తన కాలు పట్టుకొని నిమురుతుంటే రామలక్ష్మి కావాలనే నొప్పి అంటుంది. దాంతో రామలక్ష్మి కావాలనే చేస్తుందని అర్ధమవుతుంది. ఈ కర్ర తో కొడితే నొప్పి తగ్గిపోతుందని సీతాకాంత్ అనగానే నొప్పి లేదు ఏం లేదని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒక పెద్దాయన ఇంటికి వెళ్తారు. అక్కడ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం చూసి ముచ్చట పడతారు. మీరు భార్యాభర్తలు కదా అంటూ సీతాకాంత్, రామలక్ష్మి ఇద్దరిని మాట్లాడనివ్వకుండా వాళ్లే మాట్లాడతారు. మీరు ఏంటి ఇంత దూరంగా ఇలా బ్రతుకుతున్నారు అని రామలక్ష్మి వాళ్ళని అడుగుతుంది. మేమ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. ఇంట్లో వాళ్ళని ఎదురించి చేసుకున్నాం చేసుకున్నాక కూడా మేమ్ చాలా సమస్యలు ఎదుర్కున్నామని వాళ్ళు చెప్తారు. కానీ మేం కలిసి ఉంటే ఇద్దరిలో ఒకరు బ్రతకరని చెప్పారు కానీ మేమ్ ఒక్క దగ్గర ఒకే రోజున్నా చాలు అని ఇలా జీవనం సాగిస్తున్నామని వాళ్ళు చెప్తారు. అది వినగానే రామలక్ష్మి పక్కకి వచ్చి నేనే అనవసరంగా సీతా సర్ ని దూరం పెడుతున్నానని బాధపడుతుంది. ఆ తర్వాత భోజనం చెయ్యండి అని వాళ్ళు అంటారు. వద్దని సీతాకాంత్.. చేస్తామని రామలక్ష్మి అంటుంది. భోజనం ఒకే ప్లేట్ తీసుకొని వస్తారు. అందులో ఇద్దరు తినండి అని చెప్తారు. ఇద్దరు ఒకే ప్లేట్ లో భోజనం తింటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : అతడిని చూసి దుగ్గిరాల కుటుంబం షాక్.. గతం గుర్తుచేస్తారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -690 లో....నువ్వు ఎలా పీటలపై ఒక్కదానివే కూర్చుంటావని కావ్యతో రుద్రాణి అనగానే మా ఆయన వస్తారు నా పక్కన కూర్చుంటారని కావ్య వెళ్లి రాజ్ ఫోటో తీసుకొని వస్తుంది. ఆ ఫోటో తన పక్కన పెట్టుకొని పీఠలపై కూర్చుంటుంది. ఇదెక్కడైనా ఉందా అని రుద్రాణి దీర్ఘాలు తీస్తుంటే కల్మషం లేని మనసు ఉంటే చాలు అదంతా ఎందుకని పూజారి అంటాడు. మరొకవైపు అదే గుడికి రాజ్, యామిని ఇంకా తన కుటుంబం వస్తుంది. ముందు వస్తే సీతారాముల కళ్యాణం దగ్గరుండి చూసేవాళ్ళమని యామిని అంటుంటే.. ఎప్పుడు అలా ఎందుకు ఆలోచిస్తావ్.. ఇక్కడ కూర్చొని చూద్దామని రాజ్ అంటాడు. యామిని పక్కన ఉంటే కళావతితో మాట్లాడలేను‌. అందుకే ఇప్పుడే మాట్లాడాలని ఫోన్ మాట్లాడి వస్తానంటూ పక్కకి వెళ్తాడు. అలా రాజ్ నడుచుకుంటూ వెళ్తుంటే రాజ్ ని ప్రకాశ్ చూస్తాడు. నిజం గానే రాజ్ బ్రతికివున్నాడు అంటే కావ్య చెప్పింది నిజమే.. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పాలని ప్రకాశ్ వస్తుంటే ఒకతనికి డాష్ ఇస్తాడు. అతను గొడవ పడతాడు అప్పడే ధాన్యలక్ష్మి వస్తుంది. ఒక అర్జెంట్ విషయం చెప్పాలని వస్తున్నా మర్చిపోయానని ప్రకాశ్ అంటాడు. ఆ తర్వాత కావ్యకి రాజ్ ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఇక్కడ ఫోన్ లో ఒకటే సౌండ్ వస్తుందని రాజ్ అంటాడు. నేను పూజలో ఉన్నానని కావ్య ఫోన్ కట్ చేస్తుంది. రాజ్ లోపలికి వస్తాడు. రాజ్ ని కావ్య చూస్తుంది. ఈయన ఇక్కడికి వచ్చాడేంటనుకుంటుంది. రుద్రాణి రాజ్ ని చూస్తుంది. చూసి షాక్ అవుతుంది. నిజంగానే రాజ్ బ్రతికి ఉన్నాడు అందుకే కావ్య అంత స్ట్రాంగ్ గా చెప్పిందని రుద్రాణి అనుకుటుంది. పూజ దగ్గరికి వెళ్లి మైక్ తీసుకొని ఇంట్లో వాళ్ళకి గుడ్ న్యూస్ రాజ్ బ్రతికే ఉన్నాడు.. అదిగో అక్కడే ఉన్నాడని రుద్రాణి చెప్పాగానే.. అందరు రాజ్ దగ్గరికి వెళ్తారు. అపర్ణ వెళ్లి..  రాజ్ నువ్వు బ్రతికే ఉన్నావా అని ఎమోషనల్ అవుతుంటే.. ఎవరు మీరంతా అని రాజ్ అడిగేసరికి అందరు షాక్ అవుతారు. అందరు కలిసి రాజ్ ని తీసుకొనిపోయేలా ఉన్నారు.. ఎలాగైనా మ్యానేజ్ చెయ్యాలని యామిని అనుకుటుంది. తను నా బావ అని యామిని అంటుంది. తరువాయి భాగంలో రాజ్ గతం మర్చిపోయిన విషయం కావ్య చెప్తుంది. ఇప్పుడు రాజ్ కి గతం గుర్తు రావాలంటూ అందరు రాజ్ చుట్టూ చేరి మాట్లాడుతుంటే.. రాజ్ కి కళ్ళు తిరుగుతాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ - అనసూయ ఎవరో తెలుసా...ఎనిమీస్

  కిర్రాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ ఈ వారం షో చాలా ఎంటర్టైన్ చేసింది. ఇందులో ఒక్కో టాస్క్ లో ఒక్కోసారి ఒక్కొక్కరు గెలుస్తూ వచ్చారు. ఐతే ఇందులో హోస్ట్ శ్రీముఖి ఒక లైబ్రరీ కాన్సెప్ట్ ఇచ్చింది. అందులో లేడీస్ విన్ అయ్యారు. ఆ తర్వాత ఆ లైబ్రరీ సెటప్ ని తీసేసే ముందు అందరం కలిసి సరదాగా ఫ్లేమ్స్ ఆడదామా అనేసరికి ఓకే అన్నారు అంతా. ఐతే ఈ గేమ్ ని చిన్నప్పుడు ప్రతీ ఒక్కరం స్కూల్ లో, కాలేజ్ లో ఆడిన వాళ్ళమే. ఇక ఈ షోలో కొంతమందివి పేర్లు రాసి ఫ్లేమ్స్ ఆడింది శ్రీముఖి. ముందుగా డెబ్జాన్ - దిలీప్ ఇద్దరి పేర్లు రాసి ఫ్లేమ్స్ ఆడారు. దాంతో వాళ్లకు మ్యారేజ్ అన్నది వచ్చింది. తర్వాత పృద్వి శెట్టి - ఐశ్వర్య పేర్లు రాసి చూస్తే అట్రాక్షన్ అని వచ్చింది. దాంతో ఐశ్వర్య ఒక సెకను పాటు పృద్వి కన్నార్పకుండా చూసి తర్వాత కళ్ళు మూసేసుకుంది. ఆ తర్వాత  బబ్లు - శ్రీ సత్య పేర్లు రాసి ఫ్లేమ్స్ ఆడితే ఇంకేముంది మ్యారేజ్ అని వచ్చింది. దాంతో శ్రీసత్య బబ్లుకి ఆల్ ది బెస్ట్ చెప్పింది కామెడీగా. అనసూయ-యాదమ్మ రాజు పేర్లు రాసి చూస్తే ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ ఉందని ఫ్లేమ్స్ లో వచ్చింది. దాంతో రాజు కోరిక మేరకు శ్రీముఖి అనసూయ - శేఖర్ మాష్టర్ పేర్లు రాసి చూస్తే ఇంకేముంది ఇద్దరూ ఎనిమీస్ అని వచ్చింది. ఆ మాటకు శేఖర్ మాష్టర్ రియాక్ట్ అయ్యారు. "నాకు సంబంధం లేదు. కాంపిటీషన్ వరకు వచ్చిందేమో అది" అంటూ చెప్పారు. ఇలా ఈ షోలో జరిగిన లైబ్రరీ అంటే ఈటింగ్ కాంపిటీషన్ లో ఖిలాడీ గర్ల్స్ విన్ అయ్యారు. కానీ పోటా పోటీగా ఇందులో టాస్కులు నిర్వహిస్తోంది శ్రీముఖి.  

"సుప్రీమ్ హోస్ట్" సుధీర్...డ్రామా జూనియర్స్ బ్లాక్ బస్టర్ అంటున్న నెటిజన్స్

  సుడిగాలి సుధీర్ దశ తిరిగిపోయినట్టు కనిపిస్తోంది. మొదట ఢీ డాన్స్ షోకి హోస్ట్ గా, జబర్దస్త్ లో కమెడియన్ గా, టీం లీడర్ గా, శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి యాంకర్ గా చేసాడు. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ మూవీస్ కూడా చేసాడు. ఆ తర్వాత మళ్ళీ బుల్లితెర మీదకు వచ్చి ఫామిలీ స్టార్స్ షోకి హోస్టింగ్ చేస్తున్నాడు. అలాంటి సుధీర్ ఇప్పుడు లేటెస్ట్ షోకి యాంకర్ గా రాబోతున్నాడు. అదే డ్రామా జూనియర్ సీజన్ 8 కి హోస్ట్ గా చేయబోతున్నాడు. ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద సుప్రీమ్ హీరో అంటూ చిరంజీవిని అనేవారు...ఇప్పుడు బుల్లితెర మీద సుప్రీమ్ హోస్ట్ అంటూ సుధీర్ పేరు వేస్తున్నారు. ఈ షో మెగా లంచ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి రోజా, అనిల్ రావిపూడి, ఆమని, జగపతి ఒక్కొక్కరిగా ఎంట్రీ ఇచ్చారు. అనిల్ రావిపూడి రావడంతోనే "హిస్టరీలో డ్రామా జూనియర్స్ వచ్చిన ప్రతీసారీ విక్టరీనే" అంటూ డైలాగ్ వేశారు. తర్వాత రోజా వచ్చి "నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం" అని చెప్పింది. సుధీర్ వచ్చి "అందుకే నేనంటే మీకు చాలా ఇష్టం" అంటూ తనను తాను చిన్నపిల్లాడిలా చెప్పుకున్నాడు. వీళ్ళ తర్వాత జగపతి బాబు వచ్చి "మా అమ్మ ఎప్పుడూ చెప్తా ఉండేది మీరంతా కూడా చేస్తున్నారు 15 - 20 టేకులు వాళ్ళు చేస్తున్నారు సింగల్ టేకులో" అంటూ పిల్లల గురించి చెప్పుకొచ్చారు. ఫైనల్ గా సుధీర్ వచ్చి "ఇక ముందుండేది వైల్డ్ ఫైర్" అంటూ షో గురించి గట్టిగానే హైప్ క్రియేట్ చేసాడు. ఈ షో ఏప్రిల్ 12 నుంచి ప్రతీ శనివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం కాబోతోంది. నెటిజన్స్ ఐతే "సుధీర్ షో అంటే బ్లాక్ బస్టర్ ..." అంటూ కామెంట్ చేస్తున్నారు. సుధీర్ ఉంటే చాలు ఆ షోకి రేటింగ్ మాములుగా ఉండదు అంటూ మేకర్స్ కూడా అనుకుంటున్నారు. మరి ఈ షో ఎలా ఉండబోతోందో చూడాలి.