వామ్మో...ఈమె బెల్లీ శశిరేఖ...మాయాబజార్ పాటని ఇలా ఖూనీ చేసారేమిటి ?

  కాలం మారుతోంది.. బ్లాక్ అండ్ వైట్ సినిమాలను కలర్ లోకి మార్చి మళ్ళీ రిరిలీజ్ లు చేస్తున్నారు. ఇక క్లాసిక్స్ విషయానికి వస్తే నిజంగా వాటిని కలర్ లో చూడడం కొంత అదృష్టం అనే చెప్పాలి. కానీ ఏకంగా అందులో డాన్స్ లు పాటలను మార్చేస్తే మాత్రమే ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో మాయాబజార్ మూవీలో మహానటి సావిత్రి శశిరేఖ గెటప్ లో చేసిన నృత్యం మొత్తాన్ని మార్చేసింది అన్షికా..మాయాబజార్ మూవీ ఒకెత్తు ఐతే అందులో సావిత్రి చేసిన "అహ నా పెళ్ళంటా" అనే సాంగ్ కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి పాటకు డాన్స్ ని రీమిక్స్ చేసేసింది. ఆ మూవీలో మహానటి సావిత్రి నిండైన వస్త్రాలతో ఎంతో అందంగా డాన్స్ చేసింది. కళ్ళు మూసుకున్నా కూడా ఆమె డాన్స్ మైండ్ లో అలా రోల్ అవుతూనే ఉంటుంది. ఐతే ఇప్పుడు డాన్స్ ఐకాన్ షోలో ముమైత్ ఖాన్ కంటెస్టెంట్ ఈ డాన్స్ ని ఆమెకు నచ్చినట్టు చేసేసింది. ఇక  ఈ షోకి సారంగపాణి జాతకం మూవీ టీమ్ వచ్చింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈమె డాన్స్ చూసి "చాలా కొత్తగా అనిపించింది నాకు..ఇలా కూడా ఊహించొచ్చా ఈ పాటను.. ఈమె బెల్లీ శశిరేఖ" అంటూ కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు. నిజం చెప్పాలంటే క్లాసిక్స్ ని ఇలా రిమిక్స్ చేయడం కంటే ఒరిజినల్ పెర్ఫార్మెన్స్ చేసి ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేయాలి... కానీ ఇలా అరకొర దుస్తులతో ఇలాంటి పాటను అసలు అవమానించకూడదు  అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. "ఆ పాట ఏంటి ఆ డ్యాన్స్ ఏంటి అక్కడ మ్యూజిక్ ఏంటి వాళ్ళు వేసే స్టెప్స్ ఏంటి సంబంధం వుండక్కర్లా..ఆ పాట స్థాయి ఏంటి ఇక్కడ ప్రెజంట్ చేస్తున్న విధానం ఏంటి..శశిరేఖ లాంటి పాత్ర మన ఇండస్ట్రీకి సిగ్నేచర్ రోల్. ఆ పాటను పట్టుకుని ఖూనీ చెయ్యడం ఏంటో..దానికి పొగడ్తలేంటో..   " అని కూడా తిడుతున్నారు అభిమానులు.  

Illu illalu pillalu : చందుని కిడ్నాప్ చేసిన విశ్వ.. గదిలో వాళ్ళిద్దరు!

  స్టార్ మా టీవీలో ప్రసారామవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -132 లో..విశ్వ పంపిన అమ్మాయి శ్రీవల్లికి మేకప్ వెయ్యడానికి వస్తుంది. మరొకవైపు విశ్వ పెళ్లి కి వస్తాడు. అతన్ని చుసిన ధీరజ్ రాకుండా ఆపుతాడు. అప్పుడే వేదవతి చూసి ఎందుకు ఆపుతున్నావ్ రా అని అడుగుతుంది. వాడేదో ప్లాన్ తోనే ఇక్కడికి వచ్చాడు అమ్మ అని ధీరజ్ అంటాడు. వాడు నా మేనల్లుడు అని వేదవతి ధీరజ్ ని కంట్రోల్ చేస్తుంది. విశ్వ వెళ్లి కూర్చుంటాడు. ప్రేమ విశ్వ వంక ప్రేమగా చూస్తుంది. అప్పుడే విశ్వ మేకప్ ఆర్టిస్ట్ కి ఫోన్ చేస్తాడు. తను బయటకు వచ్చి విశ్వని చూస్తుంది. విశ్వ ఏదో ప్లాన్ చెప్తాడు. ఆ తర్వాత పెళ్లి మండపం లోకి అమ్మాయిని తీసుకొని రండీ అనగానే భాగ్యం ఇంకా తన చెల్లి శ్రీవల్లి దగ్గరికి వెళ్తారు కానీ శ్రీవల్లి గదిలో ఉండదు. అప్పుడే నర్మద, ప్రేమ ఇద్దరు శ్రీవల్లి అక్కని తీసుకొని రమ్మంటున్నారని చెప్తారు. భాగ్యం టెన్షన్ పడుతుంది. అప్పుడే శ్రీవల్లి వస్తుంది. ఏసీ పని చెయ్యడం లేదని పక్క గదిలోకి వెళ్ళానని శ్రీవల్లి చెప్తుంది. ఆ తర్వాత అబ్బాయిని తీసుకొని రండీ అని అనగానే సాగర్, ధీరజ్, తిరుపతి చందు దగ్గర కి వెళ్తారు కానీ చందు గదిలో ఉండడు ఏదో లెటర్ ఉంటుంది. అది చదివి వాళ్ళు షాక్ అవుతారు. వెంటనే ఆ విషయం రామరాజుకి వెళ్లికి చెప్తాడు. నర్మద ఆ లెటర్ చదువుతుంది. నాన్న నాకూ ఆ పెళ్లి ఇష్టం లేదని అందులో ఉన్నది చదువుతుంది. దాంతో రామరాజు షాక్ అవుతాడు. నేనంటే ఆయనకు ఇష్టం లేదా అంటూ శ్రీవల్లి ఏడుస్తుంది. తరువాయి భాగంలో చందుని విశ్వ కిడ్నాప్ చేస్తాడు. అతన్ని పట్టుకోవడానికి మేకప్ ఆర్టిస్ట్ ని తీసుకొని ప్రేమ ధీరజ్ వెళ్తారు కానీ ప్రేమ, ధీరజ్ లని గది లోపల ఉండగానే బయట నుండి డోర్ వేస్తుంది మేకప్ ఆర్టిస్ట్ . ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : దశరథ్ కి ఏమైనా అయితే దీప ప్రాణం పోతుంది.. ముసలాయన శపథం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -331 లో..... దీప చేతిలో ఉన్న గన్ మిస్ ఫైర్ అవ్వడంతో బుల్లెట్ సరాసరి దశరథ్ గుండెల్లో గుచ్చుకుంటుంది. వెంటనే శివన్నారాయణ వాళ్ళు ఆతన్ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. దీప ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత కార్తీక్ హాస్పిటల్ కి వెళ్తాడు. కార్తీక్ ని చూడగానే అందరు మండిపడతారు. మావయ్యకి ఇప్పుడు ఎలా ఉందని కార్తీక్ అడుగగానే.. ఎందుకు వచ్చావ్ రా అంటూ శివన్నారాయణ కోప్పడుతాడు. ఎందుకు వచ్చావ్ రా తప్పు చేసింది దీప కాదు.. నువ్వే అసలు అన్నింటికి కారణం నువ్వే అని సుమిత్ర అంటుంది. దీప షూట్ చేస్తే బావని అంటావ్ ఏంటని జ్యోత్స్న అంటుంది. తప్పంతా నీదేరా నువ్వు నా కూతురు మెడలో తాళి కట్టి ఉంటే పరిస్థితిలు వేరేలా ఉండేవి అని సుమిత్ర అంటుంది. దీప ఎలాంటిదో నాకంటే బాగా నీకే తెలుసు అత్తయ్య అని కార్తీక్ అంటాడు. అయిన కార్తీక్ మాట వినిపించుకోకుండా అందరు కార్తీక్ ని తిడుతారు. నాకు కొడుకుకి ఏమైనా అయితే ప్రాణానికి ప్రాణం సరాసరి అని శివన్నారాయణ అంటాడు. పుట్టెడు దుఃఖంతో కార్తీక్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కార్తీక్ ఇంటికి వెళ్లేసరికి శౌర్య, కాంచన, అనసూయ మాట్లాడుకుంటారు. అమ్మా ఎక్కడ అని శౌర్య అడుగుతుంది. తనకి ఏదో ఒకటి చెప్పి లోపలికి పంపిస్తాడు. ఆ తర్వాత జరిగిందంతా కాంచన, అనసూయలకి కార్తీక్ చెప్పగానే వాళ్ళు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : పసివాడి కోసం రామలక్ష్మి మారుతుందా.. సవతి తల్లి ప్లాన్ నెరవేరేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -378 లో.... రామలక్ష్మికి రామ్ ఫోన్ చేసి అత్త అంటాడు. అలా అంటావేంటి రామ్ అని రామలక్ష్మి అంటుంది. పిలుపు కూడా వద్దని అంటుంది. అలాంటిది మనతో ఎలా బంధం కావాలనుకుంటుందని సీతాకాంత్ అనుకుంటాడు. మిమ్మల్ని చూడాలని ఉంది మిస్ అనగానే నాకు వర్క్ ఉందని రామలక్ష్మి అబద్ధం చెప్తుంది. రామ్ కోసం వస్తానని అంటుంది. ఆ తర్వాత నువ్వు పసివాడి కోసం అయిన వెళ్లి తీరాలి అమ్మా కానీ జాగ్రత్తగా మసులుకోవాలి కానీ శాశ్వతంగా అక్కడే ఉండిపోకు అని ఫణీంద్ర అంటాడు. ఆ తర్వాత శ్రీలత దగ్గరికి శ్రీవల్లి వచ్చి తుపాన్ వస్తుంది. ఆ మైథిలి ఇక్కడికి వస్తుందని అనగానే రామ్ చేతే దాన్ని వద్దని అనిపించేలా చేస్తానని శ్రీలత అంటుంది. రామ్ దగ్గరికి శ్రీలత జ్యూస్ తీసుకొని వెళ్తుంది. రామ్ ఇది తీసుకోమని అనగానే నాకు మా మిస్ ఇస్తేనే తాగుతానని రామ్ అంటాడు.. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. మా మిస్ వచ్చింది అని రామ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మేడమ్ నాకు పాయసం తినాలని ఉంది చేస్తారా అని రామ్ అంటాడు. సరే అని రామలక్ష్మి కిచెన్ లోకి వెళ్ళి పాయసం రెడీ చేస్తుంది. సీతాకాంత్ తన దగ్గరికి వెళ్లి మా రామ్ వల్ల మీరు ఇబ్బంది పడొద్దు మీరు లండన్ వెళ్లిపోండి అని సీతాకాంత్ చెప్పి వెళ్ళిపోతాడు. రామలక్ష్మి పాయసం చేసి రామ్ కి తినిపిస్తుంది. సీతాకి కూడా తినిపించు అని రామ్ అనగానే రామలక్ష్మి తినిపిస్తుంది. నువ్వు మిస్ కి తినిపించు సీతా అని రామ్ అనగానే.. రామలక్ష్మికి సీతాకాంత్ తినిపిస్తాడు. అదంతా శ్రీలత, శ్రీవల్లి, సందీప్ చూసి కోప్పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : అత్తకి నిజం చెప్పేసిన కోడలు.. తన పుట్టినరోజు గిఫ్ట్ అదే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -695 లో.....కావ్య ఆఫీస్ లో ఉండగా తన క్లయింట్స్ వచ్చి డబ్బు పే చెయ్యలేదని అడుగుతారు. దాంతో అదేంటీ ఇంకా పేచెయ్యలేదా అని కావ్య మేనేజర్ ని పిలిచి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. ఆ తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్ మళ్ళీ రిపీట్ కాకూడదని మేనేజర్ కి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత కావ్య ఇంటికి వెళ్తుంది. కావ్య కోసం అప్పు బయట వెయిట్ చేస్తుంది. అక్క నీ కోసమే వెయిట్ చేస్తున్నా బావ ఉన్నాడని మనకి తెలుసు కానీ ఆ విషయం తెలియక అత్తయ్య రోజు రోజుకి ఆరోగ్యం పాడుచేసుకుంటుందని అప్పు అనగానే.. ఆ సంగతి నేను చూసుకుంటాను నువ్వు టెన్షన్ పడకని అప్పుతో కావ్య అంటుంది. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి కావ్య వెళ్తుంది. ఎందుకు అత్తయ్య మీ కొడుకు బ్రతికే ఉన్నాడంటే నమ్మట్లేదని కావ్య అంటుంది. ఎలా నమ్మమంటావ్ రాజ్ ఒక నీకే కన్పిస్తున్నాడు.. మాకెందుకు కన్పించడం లేదని అపర్ణ అడుగుతుంది. ఎందుకంటే ఆయన గతం మర్చిపోయాడని కావ్య అనగానే అపర్ణ షాక్ అవుతుంది. జరిగిందంతా అపర్ణకి కావ్య చెప్తుంది. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదని అపర్ణ అడుగుతుంది. చెప్తే మీరు తనకి గతం గుర్తుచేసే ప్రయత్నం చేస్తారు. అలా చేస్తే తన ప్రాణానికే ప్రమాదమని కావ్య అంటుంది. నాకు ఒక్కసారి రాజ్ ని చూపించు లేదంటే ఇదంతా అబద్ధమని అనుకుంటానని అపర్ణ అంటుంది. సరే చూపిస్తా కానీ మీరు తనకి గతం గుర్తు చేసే ప్రయత్నం చెయ్యొద్దని కావ్య అంటుంది. మీ పుట్టినరోజున అయన చేతుల మీదుగానే గుళ్లో అన్నదానం జరుగుతుందని కావ్య అనగానే అపర్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత రాజ్ ని ఎలా ఒప్పించాలని కావ్య ఆలోచిస్తుంది. అప్పుడే రాజ్ ఫోన్ చేస్తాడు. నేను ఇప్పుడు కూరగాయలు తీసుకొని రావడానికి వెళ్ళాలని కావ్య అనగానే నేను వస్తానని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో ఏంటి వదిన గుళ్లో ఏదో నీ కొడుకే అన్నదానం చేస్తున్నట్లు హ్యాపీగా వెళ్తున్నావని రుద్రాణి అనగానే.. మరి నా కొడుకే చేసేదని అపర్ణ అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ప్రకృతికి గట్టిగా కౌంటర్ ఇచ్చిన మానస్

  డాన్స్ ఐకాన్ సీజన్ 2 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక మరో సారి వైల్డ్ కార్డు ఎంట్రీగా మానస్ కొత్త కంటెస్టెంట్ తో వచ్చాడు. లాస్ట్ వీక్ ప్రియాంక జైన్ వెళ్లిపోయిన ప్లేస్ లోకి  మళ్ళీ తీసుకొచ్చాడు ఓంకార్. ఇక అందరి పెర్ఫార్మెన్సెస్ చూసాక ఇదే ఫైనల్ ఎలిమినేషన్స్ అంటూ చెప్పాడు. ఇక మళ్ళీ ప్రక్రుతి మొదటికే వచ్చింది. మానస్ ని చూడగానే తాచులా బుస్సున పైకి లేచింది. ఈరోజు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్లనే నామినేట్ చేస్తున్నా అంది. వెంటనే సీరియస్ గా చూసాడు మానస్. "నాకు తెలిసి నేను ఇంకోసారి ఈ షో నుంచి బయటకు గెంటేయొచ్చు" అంటూ కొంచెం ఓవర్ కంటెంట్ ఇచ్చేసింది. దాంతో మానస్ కి కోపం తారాస్థాయికి పెరిగిపోయింది. "నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నన్ను ఎవరూ బయటకు తోసేయలేదు. నువ్వు వాడుతున్న పదాలు చాలా తప్పు " అన్నాడు. "అంటే దీనికంటే గౌరవం లేని యూజ్ చేస్తే అది తప్పు లేదు కానీ ఇది తప్పొచ్చిందా..పుష్ చేయొచ్చు అని నేను అనేసరికి అమ్మో చాలా తప్పైపోయింది " అంటూ ప్రకృతి కౌంటర్ ఎటాక్ ఇచ్చింది. "ఐతే నువ్వు ఇంతకుముందువన్నీ కూడా మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావన్న మాట ..అంటే అసలు నేను ఎందుకు వచ్చానో చెప్పండి. మళ్ళీ బయటకు పంపించడానికి పిలిచారా. అసలు ఆమె వాడిన పదం అసలు కరెక్టేనా...అసలు ఎం మాట్లాడుతుంది...ఎవరినైనా ఎలా గెంటేస్తుంది అసలు." అంటూ ఫైర్ అయ్యాడు. ఓంకార్ కూడా ఏమీ మాట్లాడకుండా వాళ్లనే చూస్తూ  ఉన్నాడు. ఇక నెటిజన్స్ ఐతే ప్రకృతిని తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రేరణా కంటే దారుణంగా ఉందేంటి ప్రకృతి అని అంటున్నారు. మెంటార్స్ ఎన్ని తిట్టుకున్నా కూడా కంటెస్టెంట్స్ మాత్రం చాలా బాగా డాన్స్ చేసి ఆడియన్స్ ని మెప్పించారు.  

డాన్స్ ఐకాన్ నుంచి ప్రియాంక జైన్ ఎలిమినేట్.. దీపికా డాన్స్ మాములుగా లేదు

  డాన్స్ ఐకాన్ సీజన్ 2 ఈ వారం షో చాలా అద్భుతమైన డాన్స్ లతో అలరించింది. మెంటార్స్ విత్ కంటెస్టెంట్స్ కాబట్టి ఇద్దరి పెర్ఫార్మెన్సులు ఆడియన్స్ చూసే అవకాశం వచ్చింది. ఇందులో అందరూ మెంటార్ దీపికా పెర్ఫార్మెన్స్ చూద్దామనుకున్నారు. చూసేసారు.. ఐతే అందులో డాన్స్ లేదు కానీ ఆమె చేసే రెగ్యులర్ స్టెప్పులతోనే డాన్స్ కంపోజ్ చేసి స్టేజి మీద ఎక్కించారు. ఐతే ఆ డాన్స్ ఆమె ఎక్స్ప్రెషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఇక శేఖర్ మాష్టర్ ఐతే ఫిదా ఐపోయాడు. చాలా తెలివిగా కొరియోగ్రాఫ్ చేసారు అంటూ కితాబిచ్చాడు.    ఇక ఫైనల్ గా ఎలిమినేషన్స్ రౌండ్ వచ్చేసరికి అందులో ప్రేరణ, ముమైత్ ఖాన్, ప్రియాంక జైన్ ఎలిమినేషన్స్ లో ఉన్నారు. ఈ ముగ్గురిలో ప్రియాంక జైన్ - కంచి టీమ్ ఎలిమినేట్ ఐపోయింది. ప్రియాంక కంటెస్టెంట్ కి ఓట్లు కూడా ఎక్కువగా రాకపోవడంతో వాళ్ళు షో నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ స్టేజి తమకు దొరకడమే పెద్ద అవకాశం. నా ఫామిలీ కూడా ఇంతమంది డాన్సర్స్ తో ఇంకా ఎక్స్టెండ్ అయ్యింది. ఎంతో హ్యాపీనెస్ ని వెంట తీసుకెళ్తున్న అని చెప్పింది ప్రియాంక. ఈ స్టేజి మీద నుంచి ఎన్నో మెమొరీస్ ని తీసుకెళ్తున్నా అని చెప్పింది. అలాగే కంచి మంచి డాన్సర్ కానీ తాను ఎలిమినేట్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేయలేదంటూ మెంటార్ యష్ అన్నాడు. అలాగే మిస్ యు కాంచి అంటూ దీపికా కొంచెం ఎక్సయిట్ అయ్యింది. అలా వీళ్ళు ఈ వారం షో నుంచి ఎలిమినేట్ అయ్యారు.    ఐతే ఈ ఎపిసోడ్ లో ముమైత్ ఖాన్ అండ్ ప్రియాంక జైన్ రిటర్న్ గిఫ్ట్ లు ఇచ్చుకున్నారు. ప్రియాంక జైన్ - కంచి ఎల్లో శారీస్ లో "అబ్బని తియ్యని దెబ్బ" అనే సాంగ్ చేశారు. అలాగే ముమైత్ ఖాన్ - అన్షికా వచ్చి "ఇప్పటికింకా నా వయసు" సాంగ్ చేశారు. ఐతే ప్రియాంక సాంగ్ సెలక్షన్ సరిగా చేసుకోలేదని ముమైత్, ముమైత్ డాన్స్ అంత బాలేదని ప్రియాంక వోట్ వేసుకోలేదు. అలా ఈ వారం ఎలిమినేషన్ లో ప్రియాంక అవుట్ అయ్యింది. ముమైత్ ఐతే ఫారియాతో, యష్ తో, శేఖర్ మాష్టర్ తో డాన్స్ చేసి ఎంటర్టైన్ చేసింది.  

Karthika Deepam 2 : ప్రాణాపాయ స్థితిలో దశరథ్.. పోలీస్ స్టేషన్ లో దీప!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం' (karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -330 లో... దీప ఆవేశంగా జ్యోత్స్న దగ్గరికి రావడం తన పాలిట శాపంగా మారింది. జ్యోత్స్న వేసిన ప్లాన్ లో బలి పశువుగా మారింది దీప. జ్యోత్స్న గన్ పట్టుకొని చంపేస్తానని బెదిరించగా నేనే నిన్ను చంపేస్తానంటూ దీప గన్ తీసుకుంటుంది. అప్పుడే ఇంట్లో వాళ్ళు వస్తారు. నన్ను కాపాడండి అంటూ జ్యోత్స్న తన నటన మొదలుపెడుతుంది. గన్ దీప చేతిలో ఉంటుంది. అదుపు తప్పి దశరథ్ కి బుల్లెట్ గుండెల్లో గుచ్చుకుంటుంది. అందరు ఒక్కసారి షాక్ అవుతారు.    అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. అక్కడ జరుగుతున్న పరిస్థితి కార్తీక్ కి ఏం అర్ధం కాదు. దీపకి కూడా అక్కడున్నా పరిస్థితి ఏం అర్ధం కాదు. దశరథ్ ని ఆ సిచువేషన్ లో చూసి దీప దగ్గరికి వెళ్తుంది. సుమిత్ర దీప చెయ్ ని నెట్టేస్తుంది. దశరథ్ దగ్గరికి కార్తీక్ వెళ్ళబోతుంటే వద్దని శివన్నారాయణ చెప్తాడు. వీళ్ళ సంగతి తర్వాత చెప్దాము. ముందు దశరథ్ ని హాస్పిటల్ కి తీసుకొని వెళదామని శివన్నారాయణ అంటాడు. అప్పుడే పోలీసులు వచ్చి దీపని అరెస్ట్ చేస్తారు. దీప అరెస్ట్ ని కార్తీక్ ఆపాలని చూస్తాడు కానీ కుదరదు. మరొకవైపు కాంచన కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. శౌర్య, అనసూయ ఇద్దరు కాంచన కి ఏమైందని టెన్షన్ పడతారు. కళ్ళు తిరిగాయని కాంచన చెప్తుంది.    ఆ తర్వాత కార్తీక్ స్టేషన్ కి వెళ్తాడు. నువ్వేం చేసినా నాకు చెప్పాలి కదా.. ఇప్పుడు నిన్ను ఏం అనాలని దీపపై కార్తీక్ కోప్పడుతాడు. దీప మాత్రం సైలెంట్ గా ఉంటుంది. స్టేషన్ లో ఇన్‌స్పెక్టర్ దీప తప్పు చేసిందన్నట్టు మాట్లాడతాడు. అసలేం జరిగిందో తెలియకుండా మాట్లాడకండి అని పోలీస్ తో కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoindi Manasu : రామ్ కోసం సీతాకాంత్ తో రామలక్ష్మి పెళ్ళికి ఒప్పుకుంటుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -377 లో... ఫణీంద్ర, సుశీల ఇద్దరు రామలక్ష్మి గురించి టెన్షన్ పడుతుంటారు. అప్పుడే రామలక్ష్మి ఎంట్రీ ఇస్తుంది. జరిగిందంతా చెప్పి బాధపడుతుంది. అయ్యో ఇంత చిన్నప్పుడే బాబుకి ఎంత కష్టం పెట్టాడని సుశీల బాధపడుతుంది. రామలక్ష్మి మాత్రం తను కోరిన కోరికకి ఎటు తెల్చుకోలేకపోతుంది.    మరొకవైపు శ్రీలత, సందీప్ ఇద్దరు రామ్ మాట్లాడిన మాటల గురించి డిస్కషన్ చేసుకుంటారు. ఇంతవరకు రామ్ ఏది అడిగినా కూడ సీతాకాంత్ కాదనలేదు.. ఇప్పుడు ఆ మైథిలీని పెళ్లి చేసుకోవాలని కోరాడు కానీ సీతా ఆలోచనలో పడ్డాడని శ్రీలత అంటుంది. అడిగింది ఇవ్వడానికి వస్తువు కాదు కదా ఒక అమ్మాయి మనసు అని సందీప్ అంటాడు. అప్పుడే శ్రీవల్లి వస్తుంది. నేను ఒకటి అబ్జర్వ్  చేసానని శ్రీవల్లి అంటుంది. ఏంటని వాళ్ళు అడుగుతారు. ఇక సీతా బావ మైథిలీని పెళ్లి చేసుకుంటే మనకి మాములుగా ఉండదంటూ తన మాటలతో శ్రీలత, సందీప్ లకి చిరాకు తెప్పిస్తుంది.    ఆ తర్వాత రామ్ దగ్గరికి సీతాకాంత్ వస్తాడు. సీతా నేను చెప్పిన దానికి మిస్ ఒప్పుకుందా అని అడుగుతాడు. డాక్టర్ పక్కనే ఉండి బాబుని ఎక్కువ స్ట్రెయిన్ చెయ్యొద్దని అంటుంది. మేం చెప్పినట్టు వింటే నువ్వు చెప్పింది చేస్తామని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటాడు. అసలు తను రామలక్ష్మి కాదు ఒకవేళ అయితే రామ్ ఇలా బాధపడుతుంటే చూడలేదని అనుకుంటాడు. మరొకవైపు రామలక్ష్మి కూడా రామ్ గురించి బాధపడుతుంది.    మరుసటి రోజు రామ్ డ్రాయింగ్ చేస్తాడు. సీతాకాంత్ వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతాడు. ఇది మిస్.. నువ్వు .. మధ్యలో నేను అని రామ్ అనగానే.. సీతాకాంత్ షాక్ అవుతాడు. మా మిస్ కి ఫోన్ చేస్తానంటూ సీతాకాంత్ దగ్గర ఫోన్ తీసుకొని రామలక్ష్మికి రామ్ కాల్ చేస్తాడు. ఆ ఫోన్ కాల్ చూసి సీతా సర్ చేస్తున్నాడు.. ఒకవేళ నేను ఎమోషనల్ అయితే నేనే రామలక్ష్మి అని తెలుస్తుంది. ఇప్పుడు లిఫ్ట్ చెయ్యకపోతే రామ్ ఎలా ఉన్నాడో నాకు తెలియదని రామలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. రామ్ ఫోన్ చేసి అత్త అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : కొత్త చీరలో భార్యని చూసి ఫ్లాట్ అయిన భర్త.. పెద్దోడి పెళ్ళి జరిగేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -131 లో.... ఆ చందు గాడి పెళ్లి ఎలాగైనా ఆపాలని విశ్వ అనుకుంటాడు. ఒక అమ్మాయిని పిలిపించి నువ్వు ఒకరిని కిడ్నాప్ చెయ్యాలంటూ ప్లాన్ అంతా తనకి వివరిస్తాడు. దానికి ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది.    మరుసటి రోజు పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి రామరాజు చూస్తాడు. వచ్చిన బంధువులని ఆహ్వానిస్తాడు. సాగర్, తిరుపతి ఇద్దరితో రామరాజు పెళ్లి పనుల గురించి చెప్తూ ధీరజ్ తో కూడా మాట్లాడతాడు. మాటల్లో ధీరజ్ భుజం పై చెయ్ వేస్తాడు. దాంతో ధీరజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రామరాజు మళ్ళీ చెయ్ తీసి ధీరజ్ వంక చూస్తూ వెళ్ళిపోతాడు. కానీ ధీరజ్ మాత్రం తన తండ్రి మాట్లాడాడన్న హ్యాపీ నెస్ లోనే ఉంటాడు. ధీరజ్ బయటకు వెళ్తాడు. అక్కడ ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుకుంటారు. ఆ అమ్మాయి చూడు ఎంత అందంగా ఉందోనని అనుకుంటుంటే.. ఎవరని ధీరజ్ చూస్తాడు. తీరాచూస్తే ప్రేమ. ప్రేమ చీరకట్టులో అలా నడిచి వస్తుంది. ధీరజ్ ప్లాట్ అవుతాడు. వాళ్ళు ప్రేమ గురించి మాట్లాడుకుంటుంటే.. ఇక్కడ నుండి వెళ్ళండి అంటూ పంపిస్తాడు. ధీరజ్ దగ్గరికి ప్రేమ వచ్చి.. ఏంటి జెలస్ గా ఫీల్ అవుతున్నావా అని అడుగుతుంది. అదేం లేదని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ లోపలికి వస్తుంటే.. ధీరజ్ పడిపోబోతుంటే ప్రేమ పట్టుకుంటుంది.    ఆ తర్వాత శ్రీవల్లి రెడీ అవుతుంది. నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. మేకప్ వేయడానికి మనిషిని మాట్లాడలేదని భాగ్యంతో శ్రీవల్లి అంటుంది. నువ్వు అందంగా ఉంటావ్.. మళ్ళీ మేకప్ ఎందుకని భాగ్యం అంటుంది. అప్పుడే విశ్వ పంపిన మేకప్ ఆర్టిస్ట్ ఎంట్రీ ఇస్తుంది. నన్ను అబ్బాయి వాళ్ళు పంపారని తను చెప్పగానే నేనంటే మా బావకి ఎంత ఇష్టమోనని శ్రీవల్లి మురిసిపోతుంది. మేకప్ ఆర్టిస్ట్ భాగ్యం ఇంకా తన కూతురిని బయటకు వెళ్ళమంటుంది. వాళ్ళు బయటకు వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రాజ్ ని ఫాలో అవుతూ వెళ్ళిన యామిని.. అత్త బర్త్ డేకి కోడలు గిఫ్ట్ ఇస్తుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -694 లో.... కావ్యని కలవడానికి రాజ్ ఆఫీస్ కి వస్తాడు. ఎక్కడ ఆఫీస్ ఎంప్లాయిస్ రాజ్ ని చూస్తారోనని రాజ్ దగ్గరికి కావ్య వెళ్లి తనని పక్కకి తీసుకొని వెళ్తుంది. ఎందుకు ఇంత సడెన్ గా వచ్చారని కావ్య అనగానే.. చూడాలనిపించింది, మిమ్మల్ని చుస్తే నాకు ఇది వరకే పరిచయం ఉన్నట్లనిపిస్తుంది మీక్కూడా అలాగే అనిపిస్తుందా అని కావ్యని రాజ్ అడుగుతాడు. తను ఎక్కడ బయటపడుతుందోనని కావ్య అనుకొని నాకు వర్క్ ఉంది వెళ్తానంటు అక్కడ నుండి వెళ్ళబోతుంది. కావ్యని రాజ్ ఆపుతాడు. మీరు ఇప్పుడు చెప్పాలిసిందేనని రాజ్ అంటాడు. అయిన కావ్య మౌనంగా ఉంటుంది రాజ్ తీసుకొని వచ్చిన బోకే తనకు ఇస్తాడు.    మరొకవైపు యామిని జీపీఎస్ ద్వారా రాజ్ కార్ ఉన్న దగ్గరికి వస్తుంది. రాజ్ అక్కడ లేకపోయేసరికి ఆఫీస్ లోపలికి వెళ్తుంది. మరొక వైపు కావ్య వెళ్ళిపోగానే రాజ్ తిరిగి కార్ దగ్గరికి వస్తాడు. యామిని కార్ ఇక్కడ ఉందేంటని యామినికి ఫోన్ చేస్తాడు. నేను కార్ దగ్గరున్నా అనగానే వస్తున్నా బావ అని యామిని అంటుంది. నన్ను ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చావా అని రాజ్ అనగానే.. లేదు బావ ఫ్రెండ్ ని కలవడానికి వచ్చానని కవర్ చేస్తుంది.  రాజ్ ఇచ్చిన బొకే చూస్తూ కావ్య మురిసిపోతుంది.   రేపు వదిన బర్త్ డే కదా అని సుభాష్ తో ప్రకాష్ అంటాడు. రాజ్ ఉంటే గుడిలో అన్నదానం చేసేవాడని రుద్రాణి అంటుంది. నాకు వేటిపై ఇంట్రెస్ట్ లేదని అపర్ణ అంటుంది. ఒప్పుకోవచ్చు కదా వదిన అని ప్రకాష్ అంటాడు. ఇక ఎప్పటిలాగే రుద్రాణి ఏదో ఒకటి వాగుతుంటే ధాన్యలక్ష్మి చురకలేస్తుంది. అదంతా చూస్తున్న అప్పు.. పాపం బావ అక్కడ ఉంటే లేడనుకొని అత్తయ్య ఎంత బాధపడుతున్నారని ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

పవన్ కళ్యాణ్ గారి సినిమా టైటిల్ పెట్టడం హ్యాపీగా ఉంది...తమ్ముడు 9 సార్లు చూసా

  అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో ప్రదీప్ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ టైటిల్ తోనే పవర్ స్టార్ పరిచయం అయ్యారు. మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత ప్రదీప్ మాచిరాజు అదే టైటిల్ తో మంచి స్టోరీతో ఆడియన్స్ ని పలకరించాడు. ఈ నేపథ్యంలో కొన్ని చిట్ చాట్ ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చాడు. "పవన్ కళ్యాణ్ గారి డెబ్యూ ఫిలిం టైటిల్ తీసుకోవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాకు ఆ టైటిల్ సెట్ అవుతుంది అని మొదటి నుంచి అనుకున్నాం. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీకి కథకు సరిపడా టైటిల్ ఇది. స్టోరీ ఆనుకున్న దగ్గర నుంచి కూడా ఈ టైటిల్ పెట్టాలి అనుకున్నాం. ఇంత మంచి టైటిల్ ఉన్నప్పుడు సినిమా కూడా అంత బాగుండాలని కోరుకున్నాం..అలాగే చేసాం. ప్రొడ్యూసర్, యాంకర్, రేడియో జాకీ, హీరో ఇవి వేటికవే ఇష్టం నాకు.. వీటిల్లో యాంకర్ గా నేను బాగా ఎంజాయ్ చేసాను. ఇక అనసూయ, రష్మీ, సుమ యాంకరింగ్ కి పదికి పది వేసేశాడు. ఆడియన్స్ దూరం కావడం బాధాకరమే..బిగ్ స్క్రీన్ మీద నవ్వించడానికి సిద్ధం అయ్యాక డేట్స్ అవీ సెట్ కాలేదు. నేను చేసిన చాలా షోస్ నాకు ఇష్టం. కానీ ఢీ షోని బాగా ఎంజాయ్ చేసాను. నాలో కొత్త ఎనెర్జీని సృష్టించింది ఆ షో. మా టీమ్ మేట్స్ గురించి మీ అందరికీ తెలుసు. అందరితో కలిసినప్పుడు పండగ వాతావరణం ఉంటుంది. అప్పుడప్పుడు పండగను మిస్ అవుతూ ఉంటాను. నాకు ఢీ జడ్జెస్ లో శేఖర్ మాష్టర్, జానీ మాష్టర్ బాగా క్లోజ్. ఇక నా క్రైమ్ పార్ట్నర్స్ ఎవరు అంటే రష్మీ, గెటప్ శీను, సుధీర్ చాల మంది ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పక్కర్లేదు. తమ్ముడు సినిమా 9 సార్లు సంధ్య థియేటర్ లో చూసా. సినిమా చూడడం కోసం కాలేజ్ గోడలు దూకాను. టికెట్ తెంపేవాడి వాడి దగ్గర నుంచి ప్రొజెక్టర్ వేసే వాళ్ళ వరకు అందరూ నన్ను గుర్తుపట్టేవాళ్ళు. అంత రెగ్యులర్ గా సినిమా చూసేవాడిని. నాని నా డార్లింగ్ క్లాస్ మేట్. ఇక చిరంజీవి గారు నన్ను గుర్తుపట్టి నా షోస్ చూస్తున్నాను అని చెప్పేవారు. నా తెలుగు ఆయనకు బాగా ఇష్టం అనేవారు. కరోనా టైములో మా పేరెంట్స్ కి బాగోకపోతే రోజూ ఫోన్ చేసి ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు. డాక్టర్స్ కూడా మాట్లాడేవారు. ఆ టైములో నేను ఒక్కడినే ఉండిపోయాను. నాకు కొండంత అండగా ఆంజనేయ స్వామిలా నా వెనక నిల్చున్నారు ఆయన." అంటూ ప్రదీప్ చెప్పుకొచ్చాడు.  

 అత్తల ఇంటెలిజెన్స్ ముందు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఏమీ చేయలేదు

డ్రామా జూనియర్స్ సీజన్ 8 చూడబోతే ఈ సీజన్ మాములుగా ఉండేలా లేదు  అనిపిస్తోంది. ఈ సీజన్ లో స్వేచ్ఛ అనే చిన్నారితో కలిసి జడ్జ్ రోజా కూడా స్కిట్ లో పార్టిసిపేట్ చేసింది. రోజా అత్తగారిగా స్వేచ్ఛ కోడలిగా చేసింది. "ఈ అత్తలను కంట్రోల్ లో ఎలా పెట్టాలని ఏఐని అడిగాను..కానీ అత్తల ఇంటెలిజెన్స్ ముందు ఆర్టిఫీషియల్  ఇంటెలిజెన్స్ ఏమీ చేయలేదు అని ఆన్సర్ ఇచ్చింది." అని రోజాకు కౌంటర్ ఇచ్చింది స్వేచ్ఛ. వెంటనే సుధీర్ వచ్చి రింగులు బాగున్నాయండి అన్నాడు. "సెట్ లో రింగులు బాగున్నాయంటారు. బయటకు వెళ్ళాక మీ అసలు రంగులు చూపిస్తారు" అని కౌంటర్ వేసింది రోజా. ఇక స్వేచ్ఛ ఐతే "ఏంటత్తా రుసరుసలాడిపోతున్నావ్" అంటూ తెగ నడుము ఊపేస్తూ రోజాను అడిగింది. "నాతో పెట్టుకోకు. మొన్న ఒకడు ఇలాగే నాతో పెట్టుకుని ఎక్కడ మూడుతుందో అని మౌన వ్రతంతో దేవుడికి మొక్కుకుంటున్నాడు" అంది రోజు. "ఐనా వాడికి మూడకుండా ఉండాలి అంటే నువ్వు కదా మౌన వ్రతం చేయాలి" అంటూ రోజని తిరిగి ప్రశ్నించింది. "నేను ఎంత మంచి దాన్ని అండి. ఎవరైనా మీట్ ఐతే ఎంత బాగా చూసుకుంటాను" అని రోజా చెప్పింది. "నిన్ను మీట్ ఐతే బానే ఉంటుంది. కానీ ప్రెస్ మీట్ ఐతేనే ఎవరికో మూడిద్ది..ఈ షో స్టార్ట్ ఐన దగ్గర నుంచి అనిల్ గారు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎక్కడ మూడుద్దో ఏమో అని" అంటూ స్వేచ్ఛ క్యూట్ గ డైలాగ్స్ చెప్పేసరికి రోజా నోరెళ్లబెట్టింది. ఇక తర్వాత అత్తా కోడళ్ళుగా స్కిట్ వేసిన స్వేచ్ఛ- రోజా దగ్గరకు అనిల్ రావిపూడి వచ్చాడు. ఇద్దరూ వంటలు చేస్తూ ఉంటారు. "మీ పేరు అనిల్ ..మీరు రాకుంటే  సంక్రాంతి నిల్" అంటూ డైలాగ్ చెప్పింది రోజా. దానికి స్వేచ్ఛ "నువ్వు ఎంత భజన చేసినా నా వంటే బాగుందని చెప్తారు" అంటూ చెప్పింది. వెంటనే ఇద్దరూ పాయసం గిన్నెలు తెచ్చి ఇచ్చేసరికి అనిల్ పారిపోయాడు.  

రోజాను ఆంటీ అన్న సుధీర్

డ్రామా జూనియర్స్ ప్రతీ సీజన్ ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉంది. ఈ షోలో ఒక చిన్నారి సోదెమ్మ వేషం వేసుకొచ్చి హోస్ట్ సుడిగాలి సుధీర్ కి సోది చెప్పింది. "ఏ టీవీ చూసినా, ఏ పేపర్ చూసినా నేనే కనపడాలి..చుట్టూ ఎప్పుడూ పోలీసులు ఉండాలి" అని సుధీర్ అనేసరికి "బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్ చేయవయ్యా. నీ చుటూ పోలీసులే ఉంటారు. తర్వాత "నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను..ఆ అమ్మాయితో పెళ్లవుతుందా" అని సుధీర్ అడిగాడు. ఇక ఆ చిన్నారి సోదెమ్మ ఐతే "ఆ అమ్మాయికి తప్పకుండా పెళ్లవుతుందయ్యా" అంది వెంటనే జడ్జ్ రోజా వచ్చి "నీతో కాదు" అంది అంటే "అయ్యో ఐతే నాతో అవదా పెళ్లి" అన్నాడు. తర్వాత ఇంకో చిన్నారి వచ్చి స్కిట్ వేసింది. వెంటనే ఆ చిన్నారిని ఏ క్లాస్ అన్నాడు. 5th క్లాస్ అని చెప్పింది. అది విన్నాక నేను కూడా  5th క్లాస్ ఐతే అన్నాడు సుధీర్. దాంతో రోజా "నువ్వు 4th క్లాస్ అన్నట్టు గుర్తు సుధీర్" అంది. వెంటనే సుధీర్ "అది ఇందాక అన్నాను ఆంటీ" అని చెప్పాడు. వెంటనే పక్కనే ఉన్న ఇంకో జడ్జ్ అనిల్ రావిపూడి "మిమ్మల్ని ఫ్లోలో ఆంటీ" అన్నాడు అనేసరికి రోజా ఒక్క చూపు చూసింది అంతే సుధీర్ తలా దించుకున్నాడు. తర్వాత లోహిత్ సాయి - రుత్విక్ అనే ఇద్దరు చిన్నారులు చేసిన కామెడీ వేరే లెవెల్ లో ఉంది. క్లాస్మేట్ రోజీ లవ్ లెటర్ ఇచ్చింది అని రుత్విక్  చెప్పేసరికి ఇంకో చిన్నారి లోహిత్ సాయి " నీకన్నీ మీ చిన్న మావయ్య సుధీర్ పోలికలు వచ్చాయేంటి" అంటూ సుధీర్ మీద జోక్స్ వేసాడు. "క్లాస్ లీడర్ గా ఆ రమేష్ గాడు నిల్చున్నాడు అందుకే ప్రెస్ మీట్ పెట్టి గోడవెట్టుకున్నా" అని రుత్విక్ అనేసరికి ఏంటి నీకు మీ నాయనమ్మ రోజా గారి  పోలికలు వచ్చాయి అంటూ రోజాను చూపించేసరికి రోజా వేలు చూపించింది అంతే ఆ చిన్నారులిద్దరూ సైలెంట్ ఇపోయారు. ఇక ఇందులో స్కిట్స్ వేసిన పిల్లలు మాములుగా లేరు. కౌంటర్లు బాగా వేస్తున్నారు.  

ఈటీవీకి స్టార్ మాకి పోలిక పెట్టిన ఇమ్ము

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ ఆదివారం ప్రోమో చూస్తే మొత్తం పుష్ప 2 ఫీవర్ కనిపిస్తోంది. అలాగే ఇందులో డైలాగ్స్ కూడా వేరే లెవెల్ లో ఉన్నాయి. ఇక ఇమ్ము చెప్పిన డైలాగ్ వింటే వామ్మో అనకుండా ఉండరు. ఇక అవినాష్ ఐతే కొంచెం ఎక్కువ చేసినట్టే అనిపించింది. పుష్ప లా గెటప్ వేసుకుని "నిన్ను చూస్తుంటే పీలింగ్స్ వస్తుండాయి వచ్చి ఇచ్చేది ముద్దు" అంటూ శ్రీముఖిని అడిగేసరికి "వాడే బెస్ట్ రా" అంటూ హరిని పొగిడేసింది. ఉగాది, శ్రీరామనవమి పండగలు ఐపోయాయి ఇప్పుడు పుష్ప పండగ మొదలయ్యింది. ఇంతలో కొంతమంది టీవీ స్టార్స్ వచ్చారు. "చాల రోజుల తర్వాత చెప్పారు పుష్పలో కూలోడు గెటప్ అంటే వెతుక్కుని వెతుక్కుని మరీ వేసుకొచ్చాను." అన్నాడు అమర్ దీప్..నార్మల్ గా వచ్చినా కూలోడి గానే ఉంటావ్ గా అని కౌంటర్ వేసాడు హరి. ఆ తర్వాత ఇమ్ము గెటప్ చూసి నూకరాజు పెద్ద డైలాగ్ వేసాడు. రీసెంట్ గా ఈటీవీ నుంచి మా టీవీకి వచ్చిన విషయం తెలిసిందే. "అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక చాలా మారావ్ మచ్చా నువ్వు" అన్నాడు నూకరాజు. "సరుకు అక్కడ అమ్మితే ఒక రేటు..ఇక్కడ అమ్మితే ఒక రేటు" అంటూ చెప్పాడు ఇమ్ము. దానికి అందరూ అరుస్తూ మరీ నవ్వేశారు. ఇక హరి కూడా అమర్ మీద ఇలాంటి జోక్స్ వేస్తూండేసరికి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. "స్టార్ మా ఆర్టిస్టులకు ముందుగా రెస్పెక్ట్ ఇవ్వాలి...అమర్ వేరే ఛానల్ కి వెళ్తే బాగుంటుంది ప్లీజ్ స్టార్ మా అంత జోక్ చేయకూడదు అమర్ మీద.." అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చివరిలో కొంతమంది అమ్మాయిలని వేరే భాషల వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళను అచ్చ తెలుగు ఆడపడుచుల్లా మార్చి వాళ్లకు క్యూట్ బూతు మాటలు మాట్లాడించి ఫన్ క్రియేట్ చేశారు.  

Karthika Deepam2: దశరథ్ ని కాల్చేసిన దీప.. జ్యోత్స్న ప్లాన్ సక్సెస్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-329 లో.. జ్యోత్స్న ప్లాన్ తెలుసుకున్న దీప ఆవేశంగా వస్తుంది. ఇక తనకోసం జ్యోత్స్న ఇంటి బయటే ఎదురు చూస్తుంది. తను రాగానే బాగా రెచ్చగొట్టి మాట్లాడుతుంది జ్యోత్స్న. నేను రెండు కుటుంబాలను కలుపుతాను.. బావతో నా పెళ్లి జరిగి తీరుగుతుంది. ఇది జరగాలంటే అడ్డుగా ఉంది నువ్వు నీ కూతురు కాబట్టి నిన్ను బతకనివ్వును.. నీ కూతుర్ని నమ్మను.. మీ ఇద్దరినీ చంపి మా బావ చేత తాళి కట్టించుకుంటానంటూ జ్యోత్స్న అంటుంది. దాంతో దీప లాగిపెట్టి కొడుతుంది. చంపుతానన్న మాట వచ్చిందంటే నేనే నిన్ను చంపుతానంటుంది దీప. నీకు మనిషిని చంపేంత ధైర్యం లేదు.. బావ కోసం చచ్చేంత ప్రేమ లేదు.. బావ కోసం నిన్ను నీ కూతుర్ని చంపేంత ప్రేమ నాకుందంటూ మళ్లీ జ్యోత్స్న రెచ్చగొడుతుంది. ఇద్దరు గొడవ పడుతుండగా ఇలానే ఆవేశంగా జ్యోత్స్న లోపలికి వస్తుంది.  దీప ఆవేశంగా కర్ర తీసుకుని లోపలికి వెళ్లి.. హేయ్ జ్యోత్స్నా రావే.. జ్యోత్స్నా బయటికి రా.. చంపుతా అన్నావ్‌గా భయమేసిందా.. రావే బయటికి అని పెద్దపెద్దగా అరుస్తుంటుంది. ఇక దీప అరవగా అరవగా జ్యోత్స్న వెనక్కి చేతులు పెట్టుకుని దీప దగ్గరకు వస్తుంది. ఇది కూడా జ్యోత్స్న ప్లానే. వెనుక నుంచి గన్ తీసి దీపకు చూపిస్తూ.. ఆ రోజు నిన్ను చంపుదామనుకున్న రోజు నీ తల మీద గురి పెట్టింది ఇదే గన్.. ఇది మా తాతది అంటూ జ్యోత్స్న చెబుతూ ఉంటుంది. అంతలో అక్కడికి దశరథ్, కాంచన, సుమిత్ర, శివన్నారాయణ వస్తారు. ఇక వాళ్ళంతా రాగానే జ్యోత్స్న తన ఓవర్ యాక్టింగ్ మొదలెడుతుంది. మమ్మీ డాడీ కాపాడండి.. మీరే కాపాడాలి నన్ను దీప నన్ను చంపేస్తుందంటూ దీప అరుస్తుంది. పారిజాతం పోలీసులకు కాల్ చేయడానికి వెళ్తుంది. వద్దు వద్దు అంటూనే ఉంటారు అంతా దీపను. పారిజాతం పోలీసులకు కాల్ చేసి వచ్చి.. ఐదు నిమిషాల్లో పోలీసులు వస్తారని చెబుతూనే దీపకు దగ్గరకు వెళ్లబోతుంది. గ్రానీ వద్దు.. గన్ లోడ్ అయ్యి ఉంది.. దగ్గరకు వెళ్లకని పదే పదే అంటుంది జ్యోత్స్న. జెస్ట్ అలా గన్ పట్టుకుని బెదిరిస్తూ ఉంటుంది. గన్ పేలిపోతుంది. బుల్లెట్ వచ్చి దశరథ్ గుండెల్లో దిగిపోతుంది. అంతా షాక్ అయిపోతారు. దీప కూడా ఆశ్చర్యపోతుంది. అదే సమయానికి కార్తీక్ అక్కడికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : ట్రయల్ రూమ్ లో ప్రేమ జంటలు.. పెద్దోడి పెళ్ళి ఆపడానికి విశ్వ ప్రయత్నం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -130 లో.. అందరు తీసుకుటున్నారు.. నువ్వు కూడా చీర తీసుకోమని ప్రేమతో ధీరజ్ అంటాడు. నాకు మావయ్య అన్న మాటలు గుర్తున్నాయి.. నువ్వు కోనివ్వు అని ప్రేమ అంటుంది. నా దగ్గర వెయ్యి పదిహేను వందలకి మించి లేవని ధీరజ్ అనగానే వాటితోనే కోనివ్వమని ప్రేమ అడుగుతుంది. సరేనని ధీరజ్ అంటాడు. మరొకవైపు సాగర్ కి షర్ట్ సెలక్ట్ చేస్తుంది నర్మద. ట్రయల్ రూమ్ కి వెళ్లి ఈ బటన్ పట్టట్లేదని నర్మదని పిలుస్తాడు. నర్మదకి సాగర్ ట్రయల్ రూమ్ లో ముద్దు పెట్టబోతుంటే అప్పుడే డ్రెస్ లు ట్రయల్ చెయ్యడానికి కామాక్షి, అమూల్య వచ్చి ట్రయల్  రూమ్ ఓపెన్ చేస్తారు. వాళ్ళని అలా చూసి ఏం చేస్తున్నావ్ రా.. ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళతో ఇదే లొల్లి అంటూ అమూల్యని తీసుకొని కామాక్షి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు ప్రేమకి ధీరజ్ చీర సెలక్ట్ చేస్తాడు. ప్రేమ కట్టుకొని చూస్తుంది. ఒక్కసారిగా చీరతో ధీరజ్ లాగగానే ధీరజ్ దగ్గరికి వస్తుంది ప్రేమ. ఇద్దరు ఒకరికొకరు రొమాంటిక్ గా చూసుకుంటారు. మళ్ళీ వాళ్ళని కామాక్షి, అమూల్య చూసి అక్కడ వాళ్ళు.. ఇక్కడ వీళ్ళు అంటూ గుణుక్కంటు వెళ్తారు. ఆ తర్వాత రామారాజు తెల్లారితే పెద్దోడి పెళ్లి అని తన హ్యాపీ నెస్ ని వేదవతితో షేర్ చేసుకుంటాడు. మరొకవైపు ఎన్ని ప్రయత్నలు చేసిన ఆ రామరాజు తన పెద్ద కొడుకు పెళ్లి చేస్తున్నాడు. ఇక రేపటి నుండి వాడి పొగరు ఎవరు ఆపలేరని సేనాపతి అంటాడు. నేను రేపు పెళ్లి జరగకుండా ఆపుతానని విశ్వ అంటాడు. తరువాయి భాగంలో  ప్రేమ అందంగా రెడీ అయి వస్తుంటే ధీరజ్ ప్లాట్ అవుతాడు. మరొకవైపు శ్రీవల్లిని కిడ్నాప్ చెయ్యడానికి తనకి తెలిసిన మేకప్ ఆర్టిస్ట్ ని శ్రీవల్లి దగ్గరికి పంపిస్తాడు విశ్వ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : వాళ్ళిద్దరిని పెళ్ళి చేసుకోమన్న రామ్.. టెన్షన్ లో సవతి తల్లి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -376 లో..... రామాలక్ష్మిని రామ్ కలవడానికి వస్తాడు. మీరు నాతోనే ఉండండి మిస్.. ఎక్కడికి వెళ్లొద్దని రామ్ అంటాడు. లేదు వెళ్ళాలని రామలక్ష్మి అనగానే.. రామ్ కిందపడిపోతాడు. రామలక్ష్మి వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది. అప్పుడే సీతాకాంత్, శ్రీవల్లి, సందీప్ , శ్రీలత అందరు హాస్పిటల్ కి వస్తారు. లోపల రామ్ కి ట్రీట్ మెంట్ జరుగుతుంటే నీ వళ్లే ఇదంతా.. మా రామ్ ని ఏం చేసావ్.. మొన్న ఎంగేజ్ మెంట్ రోజు ఏదో చెప్పి రామ్ ని వెళ్లేలా చేసావ్‌‌‌.. ఇప్పుడు ఏం చెప్పావో ఇప్పుడు ఇలా అయిందంటు రామలక్ష్మిని శ్రీలత తిడుతుంది. నేను ఏం అన్లేదని రామలక్ష్మి చెప్తుంది. అయిన వినకుండా శ్రీవల్లి, శ్రీలత ఇద్దరు రామలక్ష్మిపై కోప్పడతారు. సైలెంట్ గా ఉండండి అని సీతాకాంత్ కోప్పడతాడు. డాక్టర్ బయటకు వచ్చి బాబు హార్ట్ లో చిన్న హోల్ ఉంది. మీరు ఆతన్ని ఎక్కువ స్ట్రెస్ చెయ్యకండి. తనని బాధపెట్టకండి అని డాక్టర్ చెప్తాడు. రామ్ స్పృహలోకి రాగానే అందరు వెళ్తారు. మిస్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్లొద్దని చెప్తాడు. మీరు ఇద్దరు పెళ్లి చేసుకోండి. ఎప్పుడు ఒక దగ్గర ఉండొచ్చని రామ్ అంటాడు. దాంతో రామలక్ష్మి సైలెంట్ గా ఉంటుంది. వీడెంటి ఇలా మాట్లాడుతున్నాడని శ్రీలత, సందీప్, శ్రీవల్లి టెన్షన్ పడతారు. అప్పుడే డాక్టర్ వచ్చి అతన్ని ఎక్కువ గా స్ట్రెస్ చెయ్యకండి తన మనసులో ఏముందో తెలుసుకొని తనకి నచ్చింది చెయ్యండి అని చెప్తాడు. మరొకవైపు ఫణీంద్ర, సుశీల ఇద్దరు రామలక్ష్మి ఇంకా రాలేదని టెన్షన్ పడుతుంటే.. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. జరిగిందంతా చెప్తుంది. అంత చిన్న బాబుకి అలాంటి పరిస్థితి వచ్చిందని వాళ్ళు బాధపడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : అపర్ణకి తన కొడుకుని చూపిస్తుందా.. ఆసక్తికరంగా మారిన బ్రహ్మముడి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -693 లో.....అప్పు, కళ్యాణ్ ఇద్దరు కలిసి రెడీ అయి హాల్లోకి వస్తారు. ఎక్కడికి వెళ్తున్నారు. నీతో పాటు కళ్యాణ్ ని కూడా స్టేషన్ కి తీసుకొని వెళ్తున్నావా అంటూ స్వప్న అడుగుతుంది. అదేం లేదు తను మ్యూజిక్ డైరెక్టర్ ని కలవడానికి వెళ్తున్నాడు. దార్లోనే కదా డ్రాప్ చేస్తానని తీసుకొని వెళ్తున్నానని అప్పు అంటుంది. మిమ్మల్ని చూస్తే జెలస్ గా ఉంది.. నా మొగుడు ఉన్నాడు ఎందుకని స్వప్న అంటుంది. ఆ తర్వాత కావ్య ఆఫీస్ కి వెళ్తూ సీతారామయ్య టాబ్లెట్ ఇంకా ఇందిరదేవికి టాబ్లెట్ ఇచ్చి వెళ్తుంది. ఏంటి మా చెల్లి వెనకాల వెళ్లి మళ్ళీ వీడియో తీస్తావా అని రుద్రాణితో స్వప్న వెటకారంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత కావ్యని కలవడానికి రాజ్ ఆఫీస్ కి వెళ్ళాలనుకుంటాడు. నాకు పని ఉందని యామినితో చెప్తాడు. సరేనని యామిని పంపిస్తుంది. అదేంటి బేబీ అలా పంపించావని వైదేహి అడుగుతుంది. తనని ప్రేమ తో మన దార్లోకి తెచ్చుకోవాలని నువ్వే కదా చెప్పావని వైదేహీతో యామిని అంటుంది. మరి తాను ఎక్కడికి వెళ్ళాడో ఎలా తెలుస్తుందని వైదేహి అడుగుతుంది. తన కార్ కి జీపీఎస్ పెట్టాను.. దాని ద్వారా ఎక్కడికి వెళ్ళేది తెలుస్తుందని యామిని అంటుంది. ఆ తర్వాత కావ్య ఆఫీస్ కి వెళ్తుంది. ఎంప్లాయిస్ తన వంక అందరు బాధగా చూస్తుంటారు. రాజ్ సర్ మాకు ఇన్స్పిరేషన్ అంటూ రాజ్ గురించి చెప్తారు. మీరు వెళ్లి పని చేసుకోండని వాళ్ళతో కావ్య చెప్తుంది. కావ్య తన క్యాబిన్ లో కూర్చొని బాధపడుతుంటే శృతి వచ్చి మాట్లాడుతుంది. ఆ తర్వాత రాజ్ కావ్యని కలవడానికి ఆఫీస్ కి వస్తాడు. ఆ విషయం జీపీఎస్ ద్వారా యామిని చూసి.. అదేంటీ రాజ్ ఆఫీస్ కి వెళ్ళాడని టెన్షన్ పడుతుంది. మరొక వైపు సీసీటీవీ ద్వారా రాజ్ రావడం చూసిన కావ్య రాజ్ లోపలికి రాకముందే తనే బయటకు వచ్చి రాజ్ ని పక్కకి తీసుకొని వెళ్తుంది. కావ్యకి రాజ్ బొకే ఇస్తాడు. తరువాయి భాగం లో రాజ్ లేడని అత్తయ్య చాలా బాధపడుతుందని కావ్యతో అప్పు అంటుంది. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి వెళ్లి రాజ్ గతం మర్చిపోయాడు.. మీకు రేపు రాజ్ ని చూపిస్తానని కావ్య చెప్తుంది. అపర్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.