ఆఫ్టర్ సిక్స్ మేమిద్దరం చిల్ అవుతాం!

  బిగ్ బాస్ సీజన్ 8 లో యష్మి చేసిన హడావిడి కానీ ఇచ్చిన కంటెంట్ కానీ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఆమె చుట్టూ ఎన్నో రూమర్స్ తిరిగాయి. ఐతే రీసెంట్ గా యష్మి ఒక ఇంటర్వ్యూలో తన తాగుడు గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.    "ఆఫ్టర్ సిక్స్ అనే నా డైలాగ్ ఒక షో ద్వారా బాగా హైలైట్ అయ్యింది. ఆఫ్టర్ సిక్స్ చిల్ అవుతాం నేను, సత్య. అలా అని రోజూ నేను తాగుతానని కాదు. నేను తాగడం నేర్చుకుంది రెండు మూడేళ్ళ నుంచి . డిప్రెషన్ లో ఉన్నప్పుడు తాగుతాను తప్ప.. డైలీ బేసిస్ లో ఐతే తాగను. ఆఫ్టర్ సిక్స్ తర్వాత యష్మి ఏ బార్ లోనో టేబుల్ మీద ఒక గ్లాస్ పెట్టుకుని కూర్చుంటుంది అని మాత్రం అనుకోకండి. తాగుతాను కానీ లిమిట్ లో తాగుతాను. ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినప్పుడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక నా సర్కిల్ మొత్తం మారిపోయింది. కానీ నేను డిప్రెషన్ లో ఉన్నానని మాత్రం అనుకోకండి.. నేను హ్యాపీగా ఉన్నాను. బిగ్ బాస్ అంటేనే బోర్ కొట్టేసింది. బిగ్ బాస్ హౌస్ మళ్ళీ నెలా రెండు నెలలు ఉండాలి అంటే నా వల్ల కాదు. అస్సలు వెళ్లాలని నాకైతే లేదు. ఒకవేళ వెళ్ళాలి అంటే యష్మిని చూడరు..మాస్క్ వేసుకున్న యష్మిని మాత్రమే చూస్తారు. మూవీస్ ఆఫర్స్ వస్తున్నాయి..చూస్తున్నా..కన్నడలో ఒక సీరియల్ చేయించారు. కానీ తర్వాత వాళ్ళే ఆ సీరియల్ నుంచి నన్ను క్విట్ చేయించారు. తర్వాత వేరే సీరియల్ లో ఛాన్స్ ఇస్తాం అన్నారు. ఐతే ఆ ఫస్ట్ రోజు షూట్ లో మాత్రం కొత్త ఫేస్ కావాలి అన్నారు. అలాంటి టైములో నాకు తెలుగులో ఆఫర్ వచ్చింది. అలా తెలుగులోనే బిజీ ఐపోయాను" అని చెప్పింది యష్మి.  

Karthika Deepam 2 : జ్యోత్స్నపై పారిజాతానికి డౌట్.. శ్రీధర్ డ్యుయల్ రోల్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -336 లో... దశరథ్ స్పృహలోకి వస్తాడు. సుమిత్ర, శివన్నారాయణ హ్యాపీగా ఫీల్ అవుతారు. వెళ్లి దశరథ్ ని మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మీరేం మాట్లాడకండి తల ఊపండి అంతే అని దశరథ్ తో డాక్టర్ చెప్తాడు. ఇక కాసేపటికి దశరథ్ కి ఇక ఏ ప్రాబ్లమ్ లేనట్లే అని డాక్టర్ చెప్పగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు.   మరొకవైపు స్వప్న, కాశీ ఇద్దరు దీప దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. ఆ మాట దాస్ విని మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతాడు. మీకు దీప తెలుసు కదా దశరథ్ గారిని షూట్ చేసిందని అంటున్నారని స్వప్న చెప్పగానే.. తను అలా చేయదు అదే చేసి ఉంటుందని దాస్ ఆవేశపడుతుంటే దాస్ ని కాశీ గదిలో వేసి డోర్ పెడతాడు. వెంటనే డాక్టర్ కి ఫోన్ చేస్తాడు. మరొకవైపు కావేరి దగ్గరికి శ్రీధర్ వచ్చి దశరథ్ బావ స్పృహలోకి వచ్చాడని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ఆ దీపకి శిక్ష పడుతుందని శ్రీధర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక అందరివి తనే డ్యుయల్ రోల్స్ ప్లే చేసి ఆనందపడతాడు. ఆ తర్వాత దీప ఉండదు కాబట్టి కార్తీక్ కి జ్యోత్స్నకి పెళ్లి చేస్తానని కావేరితో శ్రీధర్ అంటాడు.   ఆ తర్వాత పారిజాతానికి జ్యోత్స్న పై డౌట్ వస్తుంది. నువ్వే కావాలని దీపని ఇరికించలేదు కదా అని జ్యోత్స్నని పారిజాతం అడుగుతుంది. లేదు దాని ఆవేశంతో ఒక ఛాన్స్ ఇచ్చింది. మనకి బావ ఎలా దగ్గర అవ్వాలో ఆలోచించు అంతే గానీ ఇలా అడగకు అని జ్యోత్స్న కోప్పడుతుంది. దాస్ దగ్గరికి డాక్టర్ వచ్చి టెస్ట్ చేస్తాడు. మావయ్యని కొన్ని రోజులు దూరంగా తీసుకొని వెళ్ళాలని కాశీతో స్వప్న అంటుంది. సరే అని కాశీ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoindi Manasu : మైథిలీనే రామలక్ష్మి అని తెలుసుకున్న సీతాకాంత్.. హ్యాపీ మూమెంట్స్ తో శుభం కార్డ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -383 లో... ఫణీంద్రకి రామలక్ష్మి ఫోన్ చేసి మాట్లాడుతుంది. నువ్వు నీ భర్త తో హ్యాపీగా ఉన్నావని సంతోషపడాలో లేక మా మనవరాలు మైథిలీ మాకు దూరం అయిందని బాధపడాలో అర్ధం అవ్వడం లేదని సుశీల బాధపడుతుంటే.. ఇన్నిరోజుల తర్వాత తన భర్తతో ఉంటుంది. మన కోసం తన సంతోషం దూరం చేసుకోమనడం కరెక్ట్ కాదని ఫణీంద్ర అంటాడు. మీరేం టెన్షన్ పడకండి నేను ఎప్పటికి నీ మనవరాలినే అని రామలక్ష్మి అనగానే.. ఫణీంద్ర, సుశీల హ్యాపీగా ఫీల్ అవుతారు.    మరుసటిరోజు రామలక్ష్మి రెడీ అయి బయటకి వెళ్తుంది. అక్కడ కొంతమంది రౌడీలు తన చుట్టు చేరి ఎటాక్ చేస్తారు. రామలక్ష్మిని ఒక రౌడీ కత్తితో పొడవడానికి చూస్తుంటే.. అప్పుడే శ్రీలత వచ్చి రౌడీని కొడుతుంది. నిన్ను సీతని సందీప్ చంపాలనుకుంటున్నాడు.. వద్దన్నందుకు నన్ను బంధించాడని రామలక్ష్మికి శ్రీలత చెప్తుంది. అది విని రామలక్ష్మి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఆ రౌడీల దగ్గరికి సందీప్ వచ్చి.. ఎవరు అడ్డువచ్చినా లేపేయండి అని చెప్తాడు. ఇక శ్రీలత.. సీతా అని గట్టిగా అరవడంతో సీతాకాంత్ బయటకు వస్తాడు.   రామలక్ష్మిని సందీప్ కత్తితో పొడవబోతుంటే సీతాకాంత్ వచ్చి ఆపుతాడు. కన్నతల్లిని చంపాలనుకుంటావా అని సందీప్ పై సీతాకాంత్ కోప్పడతాడు. ఇక సీతాకాంత్ రౌడీలని కొట్టగా వాళ్లు పారిపోతారు. ఇక సందీప్ ని సీతాకాంత్ కత్తితో పొడవబోతుంటే.. వద్దని శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తుంది. ఇక అక్కడే ఉన్న రామలక్ష్మి.. వద్దండి ఇక నా వల్ల కాదు.. మీకు దూరంగా ఉండడం మీకేం ప్రాబ్లమ్ రాకూడదని ఇన్నిరోజులు మైథిలీగా నటించాను.. నేను మీ రామలక్ష్మినే అని తను చెప్పగానే సీతాకాంత్ షాక్ అవుతాడు. ఇక రామలక్ష్మిని సీతాకాంత్ హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత సందీప్ క్షమాపణ అడుగుతాడు. అదే విధంగా సవతి తల్లి శ్రీలత కూడా క్షమించమని అడుగుతుంది.    ఆ తర్వాత అందరు కలిసి లోపలికి వెళ్తారు. రామ్ దగ్గర కి వెళ్లి ఆ ఫోటోలో ఉన్న రామలక్ష్మి ఈవిడే అని సీతాకాంత్ అనగానే రామ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక  ఓవైపు రామలక్ష్మి, మరోవైపు సీతాకాంత్ ఉండగా మధ్యలో రామ్ ఉంటాడు. ఇక ఇద్దరు ఒకేసారి రామ్ కి ముద్దు ఇవ్వబోతుంటే రామ్ వెనక్కి వెళ్తాడు. దాంతో రామలక్ష్మి, సీతాకాంత్ రొమాంటిక్ మూడ్ లోకి వెళ్తారు. వాళ్ళని చూసిన శ్రీలత.. ఏంటి ఇద్దరికి.. 'ఎటో వెళ్లిపోయిందా మనసు' అని  శ్రీలత అంటుంది. ఇక అందరు ఒకే ఫ్రేమ్ లో నిలబడి స్మైల్ ఇస్తారు. దాంతో ఈ సీరియల్ కి శుభం కార్డ్ పడుతుంది.  

Illu illalu pillalu: రామరాజు ఇంట్లోకి కొత్త కోడలు.. ఏడ్చేసిన ప్రేమ, నర్మద!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్- 137 లో.. ప్రేమ, నర్మద ఇద్దరు కలిసి కొత్త కోడలిగా ఇంట్లోకి అడుగుపెట్టబోతున్న శ్రీవల్లి గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి కొత్త కోడలి కోసం హారతి పట్టుకొని ఎదురుచూస్తుంటారు. ఇక ఇద్దరు వారి గతాన్ని చూసుకొని.. ఇలాంటివి మనకేం దక్కలేదని అనుకుంటు ఎమోషనల్ అవుతారు. మొదట నర్మద తన చేతిలోని హారతి ప్రేమకి పడుతుంది. అలాగే నర్మదకి ప్రేమ హారతి పడుతుంది. అంటే వాళ్ళు ఇంట్లో పొందలేని ఇలాంటి ఓ అనుభవాన్ని రిక్రీయేట్ చేసుకొని ప్రేమ, నర్మద ఆనందపడతారు. ఇక అదంతా దూరం నుండి ధీరజ్ చూసి.. ఆడపిల్లలు పుట్టింటి నుంచి అందాల్సింది అందకపోతే వాళ్లు ఇంతలా బాధపడతారా అని ఎమోషనల్ అవుతాడు.   మరోవైపు శ్రీవల్లి, చందు కారులో వస్తుంటారు. శ్రీవల్లి ఏడుస్తుంటే ఇంటికి నవ్వుతూ రావాలని ఏడ్వకూడదని చందు చెప్పడంతో నవ్వేస్తుంది శ్రీవల్లి. ఇక వాళ్లు ఇంటికి రాగానే హారతితో ప్రేమ, నర్మద రెడీ అవుతారు. ఇంతలో వేదవతి, రామరాజుల కూతురు కామాక్షీ వచ్చి.. ఆగండి, హారతి నేను ఇస్తానని అంటుంది. లేదు.. నా కోడళ్లు ఇద్దరు ఇవ్వాలని వేదవతి అంటుంది. లేదు ఇంటి ఆడపడుచుగా నేనే ఇవ్వాలని కామాక్షి పట్టుబడుతుంది. ఎందుకని వేదవతి అడగ్గా.. హారతి ఇచ్చాక ప్లేట్ లో కట్నం పెడతారుగా వాటి కోసం అని కామాక్షి అనగానే రామరాజుతో సహా అందరు నవ్వేస్తారు. ఆ డబ్బులు నీకే కానీ ప్రేమ, నర్మదలని హారతి ఇవ్వమను అని కామాక్షికి వేదవతి చెప్పడంతో సరేనంటుంది.    కాసేపటికి ఆ ఇద్దరు కలిసి హారతి ఇవ్వడం ముగిసిన తర్వాత డబ్బులు ఇవ్వమని కామాక్షి అడుగుతుంది. పెద్దోడు ఇచ్చిన డబ్బులు సరిపోవడం లేదని మారాం చేయడంతో రామరాజు ఆమెకి కావాల్సిన డబ్బులు ఇస్తాడు. ఆ తర్వాత కొత్త పెళ్లికొడుకు పెళ్లికూతురు ఒకరి పేర్లు ఒకరు చెప్పుకోవడానికి తెగసిగ్గుపడతారు. శ్రీవల్లి సిగ్గుపడే సీన్ అయితే హైలైట్ అంతే. ఆ తంతు ముగిసిన తరువాత.. అత్తారింట్లో శ్రీవల్లి కుడికాలు పెట్టేస్తుంది. ఇక ఈ పెళ్లి తంతు అంతా చూసిన తర్వాత ప్రేమ, నర్మదలు మళ్లీ ఎమోషనల్ అవుతారు. ఇంతగొప్ప సంతోషాన్ని మేం కోల్పోయామని మళ్లీ బాధపడతారు. తమ పెళ్లిళ్ల విషయంలో జరిగిన గొడవల్ని తల్చుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రాజ్ చేసిన పనికి యామిని పేరెంట్స్ షాక్.. అపర్ణ హ్యాపీ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-700 లో... అపర్ణ దగ్గరికి రాజ్ వచ్చి మీతో కేక్ కట్ చేయించాలనుకుంటున్నాం మీకు ఇష్టమైతే రండి అని అంటాడు. దాంతో అపర్ణ మురిసిపోతుంది. కేక్ కట్ చెయ్యడానికి వెళ్తుంది.    కేక్ కట్ చేస్తుండగా యామిని వచ్చి అక్కడ జరుగుతుందంతా చూసి షాక్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందని యామిని అంటుంది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావ్ అని రాజ్ అడుగుతాడు. యామిని టెన్షన్ పడుతుంటే.. ఇందాక మీరు బయటికి వెళ్ళినప్పుడు తను ఫోన్ చేస్తే నేనే ఇక్కడికి రమ్మన్నానని కావ్య కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఈవిడ ఎవరు అని యామిని అడుగుతుంది. అమ్మ అని రాజ్ అనగానే.. యామిని షాక్ అవుతుంది. తనది కూడా ఈ రోజు బర్త్ డే అంట.. అందుకే కేక్ కట్ చేస్తున్నామని రాజ్ అంటాడు. రాజ్, అపర్ణ హ్యాండ్ వాష్ కి వెళ్తారు. ఇండైరెక్ట్ గా కావ్య యామినికి కౌంటర్ వేస్తుంది. నువ్వు బయటపడే వరకు నేను బయట పడనని కావ్య అంటుంది. ఇదంతా కావాలనే చేస్తున్నావని యామిని అనుకుంటుంది. రాజ్ వెళ్తు నన్ను ఆశీర్వదించండి అమ్మ అని అపర్ణ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. మా ఇద్దరిని ఆశీర్వాదించండి మాకు పెళ్లి కాబోతుంది అని యామిని అనగానే అపర్ణ షాక్ అవుతుంది. ఇక అపర్ణకి ఇష్టం లేకుండా దీవిస్తుంది.   ఆ తర్వాత కావ్యతో అపర్ణ మాట్లాడుతుంది. రాజ్ ని చూసానని హ్యాపీగా ఉంది. ఆ యామిని ఏంటి అలా మాట్లాడుతుందని అపర్ణ అనగానే.. అదేం లేదు ఆ పెళ్లి జరగదని కావ్య అంటుంది. మరొకవైపు యామిని, రాజ్ ఇంటికి వెళ్తారు. బావ గుళ్లో అన్నదానం చేసాడని యామిని చెప్తుంది. రాజ్ వెళ్ళాక రాజ్ తన అమ్మ బర్త్ డే జరిపించాడని చెప్పగానే యామిని పేరెంట్స్ షాక్ అవుతారు. తరువాయి భాగంలో ఎప్పటిలాగే రాజ్ లేడని రుద్రాణి అంటుంటే రాజ్ ఉన్నాడు.. త్వరలోనే వస్తాడని అపర్ణ చెప్తుంది. వీళ్ళకి ఏదో నిజం తెలిసిందని రుద్రాణి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

‘సారంగపాణి జాతకం’మూవీ హీరోయిన్  రూపా కొడువాయుర్.. పట్టిందల్లా బంగారం

  సారంగపాణి మూవీ టీమ్ లో హీరోయిన్ రూపకి మంచి కితాబిచ్చాడు ప్రియదర్శి. డాన్స్ ఐకాన్ సీజన్ 2 ఈ వారం ఎపిసోడ్ ఈ మూవీ నుంచి డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ, ప్రియదర్శి, రూప వచ్చారు. వీళ్ళు రాగానే స్టేజి మీద ముమైత్ ఖాన్ కంటెస్టెంట్ అన్షికా వచ్చి "అహ నా పెళ్ళంటా" అంటూ మాయాబజార్ మూవీలోని ఓల్డ్ క్లాసికల్ సాంగ్ కి డాన్స్ చేసింది. ఆ డాన్స్ చూసాక అసలు ఇలాంటి డాన్స్ ని తన లైఫ్ లో చూడలేదు అంటూ ఓంకార్, ప్రియదర్శి, ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పుకొచ్చారు. తర్వాత సారంగపాణి మూవీ హీరోయిన్ రూపతో ఈ సాంగ్ కి డాన్స్ వేయాలని ఓంకార్ అడిగేసరికి దర్శి ఐతే ఆమెకు ధైర్యం చెప్పి వెళ్లి డాన్స్ చేసేసి రా అని చెప్పాడు. దాంతో ఆమె వెళ్లి డాన్స్ ఇరగదీసింది. దాంతో ఇంద్రగంటి మోహనకృష్ణ చూసి చాలా ఫీలయ్యాడు. "ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నా. సారంగపాణి మూవీ ముందు ఈ షోకి వచ్చి ఉంటె...ఇలాంటి ఒక డాన్స్ చేయగలదు రూప అని తెలిసి ఉంటె ఇలాంటి ఒక సాంగ్ ని పెట్టేసేవాడినేమో..నాలుగు పాటలున్న ఆల్బం ఐదు పాటలున్న ఆల్బం అయ్యేది. ఈ సినిమాలో రూప మాకు చేసిన అన్యాయం ఇదొక్కటే.. జోక్స్ పక్కన పెడితే రూప చాలా బాగా డాన్స్ చేసావ్ " అని మెచ్చుకున్నారు. దాంతో రూప "నెక్స్ట్ ఫిలింలో చేస్తా సర్" అంది. వెంటనే ప్రియదర్శి "చెప్పా కదా తెలుగు సాయి పల్లవిలాగా బాగా చేసినవ్..బాగా డాన్స్ వేసినవ్" అన్నాడు.  సారంగపాణి మూవీ హీరోయిన్ రూప కొడువాయుర్ ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య మూవీలో ఆ తర్వాత మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీలో నటించింది. ఈమె క్లాసికల్ డాన్సర్ కూడా కావడంతో ఏ డాన్స్ ని ఐనా అవలీలగా వేసేస్తుంది. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలే లేరు అన్న మాటను పక్కన పెడితే రూప లాంటి తెలుగమ్మాయిలు డైరెక్టర్స్ కి బెస్ట్ ఆప్షన్ గా ఉన్నారిప్పుడు . వీళ్ళను చూసి ఇంకొంతమంది తెలుగమ్మాయిలు కూడా ఇండస్ట్రీలోకి నెమ్మది నెమ్మదిగా వస్తున్నారు.

రాజు గారి గది 4 లో చిన్న దెయ్యంగా నటించే ఛాన్స్ కొట్టేసిన బినిత

  డాన్స్ ఐకాన్ సీజన్ 2 ఈ వారం షో ఫుల్ గా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. మంచి డాన్స్ లతో అలరించింది. ఫైనల్ గా ప్రాకృతి - మానస్ కి మధ్య ఎప్పటిలాగే గొడవ జరిగిపోయింది. ఐతే ప్రాకృతి తన మాటలకు సారీ చెప్పింది. ఐతే ఇంత షోలో యష్ మాష్టర్ కంటెస్టెంట్ కి ఓంకార్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆమె ఎవరో బినిత ఛెత్రి. అసలు బినీత డాన్స్ మాములుగా ఉండదు. ఈమె ఇండియాస్ గాట్ టాలెంట్ లో చేసిన పెర్ఫార్మెన్స్ కి జడ్జెస్ అంతా షాకయ్యారు.... ఆమె డాన్స్ కి ఫిదా ఇపోయారు. ఇప్పుడు ఆమె తెలుగు డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో యష్ మాష్టర్ కంటెస్టెంట్ గా ఉంది. ఈ వారం బినిత డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసాక యాంకర్ ఓంకార్ ఒక మాట అన్నాడు. నెక్స్ట్ "రాజు గారి గది 4 " చేస్తే గనక బినితని డెఫినిట్ గా తీసుకుంటాను అని చెప్పాడు. "మరి ఏంటి బినిత యాక్ట్ చేస్తావా" అని అడిగేసరికి చేస్తాను అని చెప్పింది. "చిన్న దెయ్యంగా నటిస్తుంది" అన్నాడు యష్. దానికి ఓంకార్ కూడా చిన్న దెయ్యంగా నటించాలి అన్నాడు. ఇక ఈమె డాన్స్ పెర్ఫార్మెన్స్ కి శేఖర్ మాష్టర్ ఐతే ఫిదా ఐపోయాడు. "ఎం డాన్స్ అమ్మా నీది..నువ్వు ఇండియానే కదా నీ డాన్స్ తో వరల్డ్ ని కూడా షేక్ చేసే రోజు కూడా రావొచ్చు. బినిత చాలా రేర్ పీస్. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. బెస్ట్ పెర్ఫామర్...బెస్ట్ డాన్సర్ వి " అని చెప్పాడు. ఫైనల్ లో ఎలిమినేషన్స్ రౌండ్ లో యష్ మాష్టర్ తన కంటెస్టెంట్ బినితకి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్న ప్రకృతిని - బర్కత్ జోడిని ఎలిమినేట్ చేసాడు. యష్ ఫస్ట్ నుంచి కూడా చాలా జాగ్రత్తగా తన చోటా కంటెస్టెంట్ ని కాపాడుకుంటూ ఆమెకు ఎవరూ కాంపిటీషన్ లేకుండా స్ట్రాటజీగా గేమ్ ప్లే చేస్తూ వస్తున్నాడు. ఈ వారం కూడా యష్ - బినిత సేఫ్ జోన్ లో ఉన్నారు.  

ప్రాకృతికి ఇచ్చిపడేసిన అమర్ దీప్...

  డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో మానస్ కి ప్రాకృతికి మధ్యలో కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఐతే మానస్ మొదట్లో సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు తర్వాత వైల్డ్ కార్డు ద్వారా తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. ఐతే కొత్త కంటెస్టెంట్ సాగరికతో వచ్చాడు. మానస్ ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే తిరిగి రాబట్టుకున్నాడు. డాన్స్ తో దుమ్ము దులిపి ఆరేసాడు. వైల్డ్ కార్డులో ఎవరొచ్చినా నామినేట్ చేసేస్తారా..?వైల్డ్ కార్డులో రావడం పాపమా ? నామినేట్ చేయడమంటే డాన్స్ బాలేదనో, స్టెప్స్ సరిగా లేవనో చెప్పి నామినేట్ చేయాలి. ఐనా ఎవరో పంపిస్తే వెళ్ళిపోయి ఎవరో పంపిస్తే షోలోకి రావడం కాదు. కంటెస్టెంట్ కి బాగోకపోవడం వలన సెల్ఫ్ నామినేట్ చేసుకుని బయటకు వచ్చాడు తప్ప అక్కడ ఎవరు ఎవరినీ పంపించేంత సీన్ లేదక్కడ అన్నాడు అమర్. ఐనా కంటెస్టెంట్స్ వలన మెంటార్స్ కి పేరు కానీ మెంటార్స్ వలన కంటెస్టెంట్స్ కి పేరు లేదు. మెంటార్స్ వాళ్ళను రిప్రెజెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్లకు పేరు. కాబట్టి వాళ్ళను ఎవరూ తోసేయలేరు. కాబట్టి వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్న మానస్ - సాగరికాకి ఓటు వేయండి అంటూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక  వీడియో చేసి పోస్ట్ చేసాడు. అది డాన్స్ కాంపిటీషన్..అక్కడ డాన్స్ ని మాత్రమే చూడాలి..కాబట్టి వాళ్ళను ఎవరూ బయటకు తోసేయలేరు అని చెప్పాడు. ఐతే ఈ డాన్స్ ఐకాన్ లో ప్రకృతి మాట్లాడిన మాటల మీద నెటిజన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఇది టెంపరరీ షో కానీ ఆమె మాత్రం చాలా పర్సనల్ గా మాట్లాడుతోంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక సాగరికా రావడం రావడమే ఓంకార్ ఇచ్చిన థీమ్ కి సరితూగే డాన్స్ చేసి అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది. అది డాన్స్ కాంపిటీషన్ అమ్మ.. ప్రాకృతికి ఇచ్చిపడేశాడు అమర్ దీప్.  

Eto Vellipoyindhi Manasu : సందీప్ నిజస్వరూపాన్ని తెలుసుకున్న సవతితల్లి.. ఆ లెటర్ చూసి సీతాకాంత్ షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -382 లో... శ్రీలత మాట కాదని సందీప్ తనకి నచ్చినట్టు చెయ్యాలనుకుంటాడు. ఈ ఆస్తులన్నీ మనం దక్కించుకోవాలంటే మన చేతికి మట్టి అంటకుండా పని జరగాలి.. అలా చేసే వాడు ఒకడున్నాడని శ్రీవల్లితో సందీప్ అంటాడు. మరొకవైపు సీతాకాంత్ దగ్గరికి సెక్యూరిటీ వచ్చి.. ఒక లెటర్ ఇచ్చి ఎవరో వచ్చి మీకు ఇవ్వమన్నారని చెప్పి ఇస్తాడు. సీతాకాంత్ ఆ లెటర్ ఓపెన్ చూసేసరికి షాక్ అవుతాడు. నేను రామలక్ష్మిని నేను బ్రతికే ఉన్నాను.. మళ్ళీ మీ జీవితంలోకి రావాలనుకుంటున్నానని లెటర్ ఉంటుంది. అది చదివి నా రామలక్ష్మి బ్రతికే ఉంది.. నేను మైథిలీ మెడలో పసుపు తాడు కట్టకుండా ఉండాల్సిందని అనుకొని, ఈ విషయం మైథిలీకి చెప్పాలనుకుంటాడు. ఆ తర్వాత సందీప్ ఒకతన్ని కలిసి సీతాకాంత్, రామలక్ష్మి ఇద్దరిని చంపాలని చెప్తాడు. ఆ విషయం శ్రీలత విని.. వద్దు.. సీతా చాలా మంచోడని అంటుంది. నాకూ అడ్డు వస్తే నిన్ను అయిన చంపేస్తానని సందీప్ అంటాడు. ఆ తర్వాత శ్రీలతని ఒక గదిలో సందీప్ బంధిస్తాడు. మరోవైపు రామలక్ష్మి తనలో తాను మాట్లాడుకుంటుంది. నేను మైథిలీ అనుకుంటున్నారు కానీ నేను మీ రామలక్ష్మిని నాపై ప్రేమ ఇంకా ఎంతుందో తెలుసుకోవడానికి నేనే అలా లెటర్ పంపానని రామలక్ష్మి నవ్వుకుంటుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి మైథిలీ గారు ఈ లెటర్ చదవండి అని ఇస్తాడు. అది చదివినట్లు యాక్టింగ్ చేసి.. అంటే ఇప్పుడు నా మెడలో తాళి కట్టి, రామలక్ష్మి ఉందని అంటున్నారా.. అంటే ఈ విషయం మీకు ముందే తెలుసా అంటు సీతాకాంత్ ని అటపట్టిస్తుంది రామలక్ష్మి. మరోవైపు సందీప్ నిజస్వరూపం తెలుసుకుంటుంది శ్రీలత. సీతా చాలా మంచివాడు అని తనలో తాను మాట్లాడుకుంటుంది. అత్తయ్య గారు ఎక్కడికి వెళ్లారని శ్రీవల్లి వెయిట్ చేస్తుంది. మరొకవైపు ఫణీంద్ర, సుశీల కలసి రామలక్ష్మి గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే వాళ్లకు రామలక్ష్మి కాల్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : అమ్మ పుట్టినరోజున కేక్ కట్ చేయించిన రాజ్.. యామిని షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -699 లో.. రాజ్, కావ్య ఇద్దరు పూజరి దగ్గరికి వస్తారు. ఈ రోజు మా అమ్మ  పుట్టినరోజు.. తన పేరు భానుమతి.. తన పేరున అర్చన చెయ్యండి అని పూజారికి రాజ్ చెప్తాడు. గోత్రం చెప్పండి అని పూజరి అనగానే నా చిన్నప్పుడు అమ్మ, నాన్న చనిపోయారు.. నాకు గోత్రం తెలియదని రాజ్ అనగానే దూరం నుండి అదంతా చూస్తున్న అపర్ణ బాధపడుతుంది. మరొకవైపు బావ ఇంకా రావడం లేదేంటి.. ఒకవేళ ఎవరైనా కలిసారా.. లేక ఎవరినైనా కలవడానికి వెళ్లాడా అని వైదేహితో యామిని అంటుంది. ఆ తర్వాత రాజ్ , కావ్య కలిసి అన్నదానం చేస్తారు. నా కొడుకు నా కోసం అన్నదానం చేస్తుంటే.. నేను ఎందుకు దూరంగా ఉండాలని అపర్ణ వెళ్లి భోజనానికి కూర్చుంటుంది‌. అపర్ణని చూసిన రాజ్.. ప్లేట్ పెట్టి భోజనం వడ్డీస్తాడు. ఈ రోజు నా పుట్టినరోజు కూడా అని అపర్ణ చెప్పగానే.. అపర్ణని విష్ చేస్తాడు రాజ్. ఇక అలా రాజ్ తో మాట్లాడుతూ అపర్ణ మురిసిపోతుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి. ఆవిడ పుట్టినరోజు కూడా ఈ రోజే అంట పాపం.. తన కొడుకు దూరం గా ఉన్నాడటా.... ఒకపని చేద్దామా మా అమ్మ పుట్టినరోజు.. తన పుట్టినరోజు ఒకేరోజు కాబట్టి అవిడ చేత కేక్ కట్ చేయిద్దామని రాజ్ అనగానే కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత రాజ్ అపర్ణ దగ్గరికి  వచ్చి మీతో కేక్ కట్ చేయిద్దామనుకుంటున్నామని అనగానే అపర్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. తరువాయి భాగంలో అపర్ణ చేత రాజ్ కేక్ కట్ చేయిస్తాడు. అక్కడికి యామిని వచ్చి ఎవరు ఈమె అని అపర్ణని ఉద్దేశించి అడుగుతుంది. అమ్మ అని రాజ్ అనగానే యామిని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu:  భాగ్యం డైరెక్షన్ లో శ్రీవల్లి.. ఆ ఇంటిని గుప్పిట్లో పెట్టుకోగలదా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-136లో..  పెద్దోడి పెళ్ళి అవుతుంది. ప్రేమ ప్లాన్ వల్లే ఇదంతా సాధ్యమని ప్రేమకి థాంక్స్ చెప్తాడు ధీరజ్. ఇక తన మీద అరవలేదని తను కూడా థాంక్స్ చెప్తుంది. ఇక ఆ తర్వాత ధీరజ్, ప్రేమ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుంటే నర్మద అతని భర్త కూడా కలిసి చేస్తాడు. ఇక వీరిని చూసి పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు  ఇద్దరు పీటల మీద నుండే డ్యాన్స్ చేస్తుంటారు. అదంతా సరదగా సాగుతుంది. అందరు ఎంజాయ్ చేస్తుంటే రామరాజు మాత్రం ఏదో ఆలోచిస్తుంటాడు.  ఇంతలో రామరాజుకి విశ్వ గుర్తొస్తాడు. నా కొడుకుని కిడ్నాప్ చేస్తావారా అని రగిలిపోతాడు. మరోవైపు భాగ్యం తన మాటలతో చక్రం తిప్పాలనుకుంటుంది. పెళ్లి బట్టల్లో ఉన్న కూతుర్ని పక్కకి తీసుకుని వెళ్లి చెప్తుంటుంది. నిన్ను ఆ ఇంటికి కోడల్ని చేయడానికి నేను శకుని కంటే ఎక్కువ పాచికలు వేశా.. నా మాయమాటలతో రామరాజునే బురిడీ కొట్టించా.. నేను చక్రం తిప్పడం అయిపోయింది.. ఇక నుంచి నీ ఆట మొదలైంది.. నీకు అమాయకుడైన మొగుడు.. బంగారం లాంటి అత్తమామలు దొరికారు.. నీకు వచ్చిన చిక్కు ఏంటంటే.. నీ తోటి కోడళ్లే అని భాగ్యం అంటుంది. తోడుకోడళ్లతో చిక్కు అంటావ్ ఏంటమ్మా, వాళ్లు నన్ను బాగా చూసుకుంటున్నారు కదా అని శ్రీవల్లి అంటుంది. మంచోళ్లు కావచ్చు కానీ వాళ్లిద్దరూ నీకంటే బాగా చదుకున్నోళ్లు.. నీకంటే తెలివైన వాళ్లు.. డబ్బున్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లు.. వాళ్లకి తలపొగరు, అహంకారం ఉంటుంది.. అందుకే నీకు ప్రమాదం.. నీకు వాళ్ల నుంచి ప్రమాదం రాకుండా ఉండాలంటే నువ్వు నీ మొగుడ్ని, నీ అత్తమామల్ని గుప్పెట్లో పెట్టేసుకోవాలి.. అప్పుడు నీ తోడుకోడళ్లు చచ్చినట్టు నీ కాలికింద చెప్పులా పడి ఉంటారు. నేను చెప్పింది జాగ్రత్తగా అర్థం చేసుకోమని కూతురు శ్రీవల్లికి చెప్తుంది భాగ్యం. అదంతా విన్న శ్రీవల్లి.. అర్థం అయ్యింది అమ్మా.. వాళ్లు కాస్త గట్టిగా మాట్లాడినా గొడవ పెట్టేసుకోమంటున్నావ్ అంతేనా అని అంటుంది. నీ మొహమే.. అలా గొడవలు పెట్టుకుంటే.. అందరి దృష్టిలో గయ్యాళి అయిపోతావ్ తప్ప.. ఈ ఇంటిని నీ గుప్పెట్లో పెట్టుకోలేవ్. వాళ్ళిద్దరు నీకంటే ముందు ఈ ఇంటికి కోడళ్లుగా వచ్చినా కూడా ఈ ఇంటికి పెద్ద కోడలివి నువ్వే.. కాబట్టి.. ప్రతి విషయంలోనూ నీ మాటే చెల్లాలి.. నీ పెత్తనమే సాగాలి.. నీకు నేను ఎప్పటికప్పుడు ఫోన్‌లో డైరెక్షన్ ఇస్తాను.. నేను చెప్పినట్టు చేసి ఆ ఇంటిని గుప్పెట్లో పెట్టేసుకోమని భాగ్యం చెప్తుంది. సరేనమ్మా.. నువ్వు ఎట్టాగంటే అట్టా అని అప్పగింతల కార్యక్రమంలోకి వెళ్లిపోతుంది శ్రీవల్లి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2: జ్యోత్స్నకి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్.. స్పృహలోకి వచ్చిన దశరథ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-335లో.. పోలీస్ స్టేషన్ కి జ్యోత్స్న వస్తుంది. ఇక సెల్ లో ఉన్న దీపని రెచ్చగొడుతుంది జ్యోత్స్న. ఇక తను రెచ్చిపోయి జ్యోత్స్న పీక పట్టుకోవడంతో ఎస్ఐ వచ్చి వార్నింగ్ ఇస్తాడు. ఇక కార్తీక్ సారీ చెప్పడంతో ఎస్ఐ వదిలేస్తాడు. రిజిస్టర్ లో సంతకం చేసి జ్యోత్స్న వెళ్ళిపోతుంది. తను వెళ్ళగానే దీపకి ఆవేశం తగ్గించుకోమని చెప్పి కార్తీక్ వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్ కోసం బయట జ్యోత్స్న వెయిట్ చేస్తుంటే అతను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాడు. అది గమనించిన జ్యోత్స్న.. బావా నీతో మాట్లాడాలని అంటుంది. నీకు మాట్లాడటం కూడా వచ్చా.. అంటే నీకు గొడవ పడటం తప్ప మిగతా మనుషుల్లా మామూలుగా మాట్లాడవు కదా అని కార్తీక్ అంటాడు. మా డాడీ ఆసుపత్రిలో ఉన్నారని జ్యోత్స్న అనగానే.. నా భార్య పోలీస్ స్టేషన్‌లో ఉందని కార్తీక్ అంటాడు. దీప గన్ తో నన్ను చంపాలనుకుంది బావ అని జ్యోత్స్న అనగానే.. అది దీప చేతికి ఎలా వచ్చింది? మీ ఇంట్లోకి వెళ్లి బీరువాలో పెట్టుకున్న గన్ దీప తీసిందా? లేదా నీ చేతుల్లోంచి లాక్కుందా అని కార్తీక్ అంటాడు. నన్ను నేను ఎలా కాపాడుకోవాలని  జ్యోత్స్న అనగానే.. నిన్ను నువ్వే కాదు ఆ గౌతమ్ గాడ్ని కూడా కాపాడుతున్నావ్.. నీ ఉద్దేశాలేంటో నీ ఆలోచనలు ఏంటో అన్నీ అర్థమయ్యే దీప నీకు బుద్ధి చెప్పాలనుకుంది.. అందరి ముందు నువ్వు ఎలాంటిదానివో నిజం చెప్పాలనుకుందని కార్తీక్ అంటాడు. మరి మా తాతకు నిజం చెప్పకుండా మా డాడీని ఎందుకు కాల్చిందని జ్యోత్స్న అనగానే.. నువ్వు దీపని మాటలతో రెచ్చగొట్టావని కార్తీక్ అంటాడు. అన్నీ నీకోసమే చేశానని జ్యోత్స్న అనగానే కార్తీక్ ఆశ్చర్యపోతాడు. ప్రేమ కోసం ప్రాణాలను తీసేయరు.. అన్నింటికీ కారణం నువ్వే అని నాకు తెలుసు.. నువ్వు ఆడదానివై ఉండి పైకి ఏడుస్తున్నావ్.. నేను ఏడవలేకపోతున్నాను.. అందరి ఏడుపుకి నువ్వే కారణం అంటు కార్తీక్ అరుస్తాడు. సరేలే బావా.. నేను కారణం అన్నావ్ కదా.. పోతాలే అంటూనే చిటిక వేసి.. కానీ దీప మాత్రం ఈ కేసు నుంచి తప్పించుకోలేదు బావా.. చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే.. జైలు జీవితం గడపడానికి సిద్ధంగా ఉండమని చెప్పు. నీ ప్రియమైన భార్యకు అనేసి జ్యోత్స్న వెళ్లిపోతుంది.  మరోవైపు శౌర్య తినకపోతే అనసూయ బతిమలాడుతూ ఉంటుంది. అమ్మ నాన్న వస్తేనే తింటానని శౌర్య అంటుంది. ఇక అప్పుడే కార్తీక్ వస్తాడు. శౌర్యకు సద్దిచెప్తాడు. అమ్మకు చాలా పని ఉండి ఆగిపోయింది. వచ్చేస్తుందిలే అని సర్దిచెప్పి తనే తినిపిస్తాడు. నువ్వు వెళ్లి పడుకో.. నేను వచ్చేస్తానని శౌర్యను పంపిస్తాడు కార్తీక్. అయితే శౌర్య వెళ్తూ వెళ్తూ దీపకు తీసుకెళ్లబోయే క్యారేజ్ చూసి ఎవరికి అని అడుగుతుంది. వేరెవరో అడిగారు.. ఇచ్చేసి వస్తానని చెప్పి  శౌర్యను పంపేస్తాడు కార్తీక్. శౌర్యకు వినిపించకుండా కాంచన, అనసూయ కార్తీక్.. దీప పరిస్థితి గురించి బాధపడతాడు. మరోవైపు ఆసుపత్రిలో దశరథ్ చేతి వేళ్లు కదుపుతూ స్పృహలోకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

లోన్ యాప్ తో ఇబ్బందులు పడుతున్న ప్రియాంక నాయుడు...జాగ్రత్తగా ఉండండి

  "వదినమ్మ" సీరియల్ తో ఫేమ్ తెచ్చుకున్న ప్రియాంక నాయుడు అందరికీ తెలిసిన నటి. ఈ సీరియల్ తర్వాత ఆమె దీపారాధన అనే సీరియల్ తో ఆడియన్స్ కి మరింత దగ్గరయింది. అలాంటి ప్రియాంక ఇప్పుడు కొన్ని ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఐతే కొంతమంది స్కామర్లు కారణంగా ఆమె పడుతున్న బాధను ఒక వీడియోగా చేసి ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. రీసెంట్ గా ఆమె ఒక లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసిందట. బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్లు చెప్పింది. ఐతే తర్వాత అదొక ఫేక్ స్కాం యాప్ అని తెలిసింది. ఆ యాప్ కారణంగా తన ఫోన్ మొత్తం హ్యాక్ అయ్యిందని చెప్పింది. దాంతో ఆ స్కామర్లు తన ఫామిలీ మెంబర్స్ ని, ఫ్రెండ్స్ కి బెదిరింపు కాల్స్ చేస్తున్నారని తనకు ఎంతో భయమేస్తోంది ఆవేదన వ్యక్తం చేసింది. తన ఫేస్ ని మార్ఫింగ్ చేసి వాటిని అందరికీ పంపిస్తామని బెదిరిస్తున్నారని చెప్పింది. బాగా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అవి ఇవ్వకపోతే తన ఫొటోస్ మొత్తాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని భయపెడుతున్నారని చెప్పింది ప్రియాంక నాయుడు. తన నంబర్ నుంచి ఎలాంటి మెసేజ్ వచ్చినా కానీ వెంటనే రిపోర్ట్ కొట్టాలని సూచించింది.  కాబట్టి ఎవరైనా సరే లోన్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకునేటప్పుడు అలెర్ట్ గా ఉండాలని హెచ్చరించింది. ఇక నెటిజన్స్ ఐతే టేక్ కేర్ అక్కా , జాగ్రత్త అంటూ మెసేజెస్ చేస్తున్నారు.  నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో లోన్ యాప్స్ అనే కాదు రకరకాల యాప్స్ డౌన్ లోడ్ చేసుకుని చాలామంది ఇబ్బందుల్లో పడుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు తీసుకునేంతవరకు కూడా వెళ్తున్నాయి. సోషల్ మీడియాని యాప్స్ కి ఎంతదూరంగా ఉంటె అంత మంచిది అన్న విషయాన్నీ కూడా అందరూ తెలుసుకుంటే కొంత ప్రమాదం నుంచి బయటపడినట్టే.

చనిపోయేలోపు ఒక్కసారైనా నేను ఇలా...

   బ్రహ్మముడి సీరియల్ ద్వారా దీపికా రంగరాజు తెలుగు ఆడియన్స్ ని అలరిస్తోంది.ఆమె అల్లరి గురించి మాటల్లో చెప్పడం కంటే షోస్ లో చూస్తే చాలు. ఏ షో చేసిన ఆ షో ప్రోమోలో హైలైట్ అయ్యేది దీపికా మాత్రమే. అలా చేస్తుంది అల్లరి. బ్రహ్మముడి సీరియల్ తో పాటు డాన్స్ ఐకాన్ షోకి మెంటార్ అలాగే చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే షోలో సమీరా భరద్వాజ్ కి జోడి కంటెస్టెంట్ గా చేస్తోంది. అలాంటి దీపికా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైమింగ్ ఉన్న లేడీ ఆర్టిస్ట్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టింది. అది చాలా వెరైటీగా ఉంది. "నా జీవితంలో చనిపోయేలోపు  ఒక్కసారైనా నేను ఇలా రైడ్ కి వెళ్ళాలి అనుకుంటున్నా..దీన్ని మంగోలియా గ్రాస్ స్లైడ్" అంటారు అని పోస్ట్ చేసింది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియాలోని హులున్‌బుయిర్ ప్రైరీ దగ్గర  1,200 మీటర్ల పొడవైన గడ్డి స్లైడ్స్ కనిపిస్తాయి. ఏదైనా సరే పచ్చగడ్డిని చూసినప్పుడు వచ్చే ఆనందం కానీ ఆ ఎనెర్జీ కానీ ఎందులోనూ దొరకదు. మనం చెట్లను కొట్టేస్తుంటే మిగతా దేశాల్లోని వాళ్లంతా గడ్డిని, చెట్లను పెంచి ప్రకృతిని కాపాడుతూ ఉన్నారు. ఇప్పుడు దీపికా కూడా అలాంటి గడ్డిలో కాసేపు అలా స్లైడ్ చేస్తూ ఎంజాయ్ చేయాలని ఆశపడుతోంది. దీపికా ఎక్కువగా మానస్ తో కలిసి షోస్ కి వెళ్తూ ఉంటుంది. ఐతే ఈమె తెలుగు వలన షోస్ లో ఉన్నవాళ్లు ఆ మాటలను అర్ధం చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఆమె ఉంటె మాత్రం ఆ షో రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని ఆలోచనతో ఆమెను ఎక్కువగా షోస్ కి పిలుస్తున్నారు.

రోజా నీతో పెట్టుకుంటే... నా బతుకు జట్కాబండి ఐపోతుంది

  డ్రామా జూనియర్ సీజన్ 8 లో జగపతిబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఆ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో జగపతి బాబు, ఆమని, రోజా అంటే శుభలగ్నం మూవీ టీమ్ వచ్చింది. ఇక ఆమని ఆ సినిమాలో లాగే జగపతి బాబు స్టేజి మీదకు రాగానే "పొరుగింటి మంగళ గౌరీ" సాంగ్ పాడింది. "పక్కింటి వరలక్ష్మి వాళ్ళ ఆయన వారానికి ఒక సారి సినిమాకు తీసుకెళ్తాడట" అని చెప్పింది. "అవును నేను వాళ్ళ ఆయన్ని అడిగాను కానీ ఆయన ఒప్పుకోలేదు" అన్నాడు జగపతి బాబు. ఇక ఇంకో అమ్మాయిని చూస్తూ "మేడలో బంగారు గొలుసు ఎంత బాగుందండి" అని ఆమని అనేసరికి "మెడ చూసా చాలా బాగుంది" అన్నాడు. " ఆ శుభలగ్నంలో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నానా అండి" అని అడిగింది. "అప్పుడు ఎలా ఉన్నవో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావ్ నువ్వు వేసుకున్న జుట్టు రంగు మీద ఒట్టు" అన్నాడు. తర్వాత రంగంలోకి రోజా ఎంట్రీ ఇచ్చింది. "అప్పుడు శుభ లగ్నంలో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నానా"అని అడిగింది. ఇప్పుడు నిన్ను ఏమన్నా అన్నాననుకో నా బతుకు జట్కా బండి ఐపోతుంది" అని జగపతి బాబు బయపడిపోయాడు. రోజా రాగానే బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ మీద "బతుకు జట్కాబండి" షో వేశారు. దాంతో జగపతి బాబు అలెర్ట్ అయ్యాడు. శుభలగ్నం రిక్రియేషన్ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా శుభలగ్నం మూవీ మాత్రం అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. ఇక ఆమని, రోజా ఐతే ఎంతో అమాయకమైన రోల్స్ లో నటించారు. ఈ మూవీతోనే వీళ్ళ ముగ్గురికి మంచి బ్రేక్ వచ్చింది. అప్పట్లో మిడిల్ క్లాస్ ఫామిలీ స్టోరీస్ కి ఆడియన్స్ అందులోనూ లేడీ ఆడియన్స్ ఐతే బ్రహ్మరధం పట్టేవాళ్ళు.  

Illu illalu pillalu : అన్నయ్యని తీసుకొచ్చిన తమ్ముడు.. ఎట్టకేలకు శ్రీవల్లి, చందుల పెళ్ళి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -135 లో.... చందు బావని కనిపెట్టాలంటే నాదగ్గర ఒక ప్లాన్ ఉందని ధీరజ్ తో ప్రేమ చెప్తుంది. ప్రేమ భద్రవతి కి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అత్త అని అంటుంది‌. దాంతో ప్రేమని కలుస్తుంది భద్రవతి. అదే సమయంలో విశ్వకి ధీరజ్ ఫోన్ చేసి.. మీ అత్తని కిడ్నాప్ చేసానని చెప్తాడు. దాంతో తన ప్లాన్ ఫెయిల్ అయిందని విశ్వ డిస్సపాయింట్ అవుతాడు. ఇప్పుడు మా అన్నయ్యని తీసుకొని రాకుంటే మీ అత్తయ్య ఉండదని విశ్వని బెదిరిస్తాడు ధీరజ్. ఆ తర్వాత అత్త మనం వేరొక దగ్గరికి వెళ్లి మాట్లాడుకుందామని భద్రవతిని ప్రేమ ఒక ప్లేస్ కి తీసుకొని వెళ్తుంది. ఏంటి ప్రేమ ఏదో మాట్లాడాలి అన్నావని ఆడుగుతుంది. వెనకాలే ధీరజ్ వస్తాడు. మరొకపక్క భద్రవతిని కిడ్నాప్ చేసారని  చందుని విశ్వ తీసుకొని ఆ ప్లేస్ కి వస్తాడు. సారీ అత్త నీతో మాట్లాడాలని ఇక్కడికి పిలవలేదు.. విశ్వ అన్నయ్య చందు బావని కిడ్నాప్ చేసాడు. అందుకే ఇలా నాటకం ఆడానని ప్రేమ అంటుంది.  చందుని ధీరజ్ తీసుకొని అక్కడ నుండి బయల్దేర్తాడు. సారీ అత్తయ్య అని భద్రవతికి చెప్పి ప్రేమ వెళ్ళిపోతుంది. మరొకవైపు ఊళ్ళో వాళ్లంతా పెళ్లికి వచ్చి వెళ్లిపోతుంటే అందరిని ధీరజ్ ఆపుతాడు. తన వెంట చందుని తీసుకొని వస్తాడు. జరిగిందంతా రామరాజుకి చెప్తాడు చందు. తమ్ముడు నన్ను కాపాడి మీ పరువు ని కాపాడాడని రామరాజుకి చందు చెప్తాడు. ఆ తర్వాత శ్రీవల్లి, చందుల పెళ్లి జరుగుతుంది. రామరాజు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2: దీప కోసం లాయర్ దగ్గరికి వెళ్ళిన కార్తీక్.. న్యాయం గెలుస్తుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -334 లో.. కార్తీక్ దగ్గరికి శ్రీధర్ వస్తాడు. మీరందరు వదిలేయాల్సింది నన్ను కాదు ఆ దీపని ఆ తర్వాత మనం ఒక మంచి ఇల్లు తీసుకొని సెటిల్ అవదామని శ్రీధర్ అంటుంటే.. ఇంకొక మాట మాట్లాడితే మర్యాద గా ఉండదని శ్రీధర్ కి వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. అక్కడ ఈ కేసు తీసుకుంది భగవాన్ దాస్.. సీనియర్ లాయర్.. తనకి ఎదురు ఎవరు వెళ్ళలేరు. ఇక దీపకి కఠిన కారాగార శిక్ష పడుతుందని శ్రీధర్ హెచ్చరించి వెళ్తాడు. ఆ తర్వాత కార్తీక్ ఒక లాయర్ దగ్గరికి వెళ్తాడు. తన పేరు కళ్యాణ్ ప్రసాద్.. న్యాయం కోసం ఎంతగా అయిన పోరాడుతాడు అతని దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్తాడు. ఏ పరిస్థితిలో దీపని పెళ్లి చేసుకున్నాడో ఆ తర్వాత జరిగిన సిచువేషన్ అంతా కార్తీక్ చెప్తాడు. సరే ఒకసారి మీ భార్య దీపని కలవాలని లాయర్ అంటాడు. నేను తన గురించి మొత్తం చెప్పాను కదా అని కార్తీక్ అంటాడు. అసలు ఏం జరిగిందని తను కూడా చెప్పాలి కదా అని లాయర్ అంటాడు. మరొకవైపు జ్యోత్స్న భగవాన్ దాస్ దగ్గరికి వెళ్లి తన కేసు గురించి చెప్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ ప్రసాద్ ని కార్తీక్ తీసుకొని దీప దగ్గరికి వెళ్తాడు. దీప జరిగింది మొత్తం చెప్తుంది. ఈ కేసుకి ఆధారాలు చాలా ఇంపార్టెంట్ అని దీపతో లాయర్ మాట్లాడతాడు‌. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. లాయర్ ఉండడం చూసి బయట ఉంటుంది. లాయర్ వెళ్లిపోతుంటే జ్యోత్స్న లాయర్ దగ్గరికి వెళ్లి పరిచయం చేసుకుంటుంది. మీరు ఈ కేసు ఎందుకు తీసుకున్నారు.. దీప తప్పు చేసిందని జ్యోత్స్న అంటుంది. నువ్వు నమ్మితే సరిపోదు కోర్ట్ కూడా నమ్మాలి న్యాయమే గెలుస్తుందని జ్యోత్స్నతో కళ్యాణ్ ప్రసాద్ అంటాడు‌. ఆ తర్వాత దీప, కార్తీక్ ల దగ్గరికి జ్యోత్స్న వెళ్లి వాళ్ళను రెచ్చగొట్టేల మాట్లాడుతుంది. దీప కోపంతో సెల్ నుండే జ్యోత్స్న గొంతు పట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : మైథిలి, రామలక్ష్మి ఒక్కరే అని తెలుసుకున్న సవతి తల్లి.. 

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్నా సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -381 లో.. రామ్ కోసం రామలక్ష్మి మెడలో తాళి కడతాడు సీతాకాంత్. వాళ్ళు పెళ్లి చేసుకొని రావడంతో శ్రీలత షాక్ అవుతుంది. ఏంట్రా ఇలా చేసావని శ్రీలత అంటుంది. రామ్ దగ్గరికి వెళ్తాడు సీతాకాంత్. అత్తయ్య, మావయ్య అంటూ సీతాకాంత్, రామలక్ష్మిలని రామ్ పిలుస్తాడు. నాకు ఇలా ఏం కాదు.. మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని రామ్ అంటాడు. ఇక బాబుకి ఆపరేషన్ చెయ్యండి అని సీతాకాంత్ చెప్తాడు. బాబుకి ఆపరేషన్ జరుగుతుంటే మరొకపక్క ఆ మైథిలీని ఎందుకు పెళ్లి చేసుకున్నావని శ్రీలత గొడవ పెడుతుంది. ఇందులో మైథిలీ తప్పేం లేదు తప్పంతా నాదే.. బలవంతంగా తన మెడలో తాళి కట్టానని సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత రామ్ ఆపరేషన్ సక్సెస్.. ఇక డిశ్చార్జ్ చేస్తాం తీసుకొని వెళ్ళండి అని డాక్టర్ చెప్తాడు. రామ్ ఇంటికి వచ్చాక రామలక్ష్మి సీతాకాంత్ లతో రామ్ మాట్లాడతాడు. అసలు సీతా అన్నయ్య ఎందుకు ఇలా చేసాడని శ్రీలతతో సందీప్ అంటాడు. ఒకవేళ రామ్ గురించి అలోచించి చేసిందంటే.. ఇంత తక్కువ పరిచయంలో తన జీవితాన్ని త్యాగం చేస్తుందా అని శ్రీలత అంటుంది. ఒకవేళ తను రామలక్ష్మి అయి ఉండొచ్చని శ్రీవల్లి అంటుంది. పిచ్చి పిచ్చిగా వాగకు అని సందీప్ అంటాడు.  మరుసటి రోజు స్వామిని కలవడానికి రామలక్ష్మి వెళ్తుంది. ఇకనైనా నా భర్తతో కలిసి ఉండాలి. ఈ ప్రాబ్లమ్ రాకూడదని రామలక్ష్మి మాట్లాడుతుంటే‌.. సందీప్ కిటికీలో నుండి చూస్తాడు. ఆ మాటలు విని మైథిలీ, రామలక్ష్మి ఒకరేనా అని సందీప్ షాక్ అవుతాడు. ఆ విషయం వెంటనే శ్రీలత దగ్గరికి వచ్చి చెప్తాడు సందీప్. ఇక నేను ఎవరి మాట వినను.. రామలక్ష్మి, సీతా అన్నయ్యని లేపేస్తానని సందీప్ అంటాడు. సీతాకాంత్ ని వద్దు.. వాడు ఎప్పుడు మనల్ని వదులుకోడు అని శ్రీలత అంటుంది. ఇప్పటివరకు నువ్వు చెప్పింది చేసాను. ఇక నేను చెప్పింది చెయ్ అని శ్రీలతతో సందీప్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కొడుకుని చూసి మురిసిపోయిన అపర్ణ.. వాళ్ళని చూసి యామిని షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -698 లో.....అపర్ణ వదినని, కావ్యని చూస్తుంటే నాకూ డౌట్ గా ఉందని రాహుల్ తో రుద్రాణి అంటుంది. మరొకవైపు కావ్య గిఫ్ట్ గా పంపిన షర్ట్ ని రాజ్  వేసుకొని మురిసిపోతుంటాడు. షర్ట్ బాగుందని వైదేహి అంటుంది. మా అమ్మాయి తీసుకొచ్చిందా అని రాజ్ ని వైదేహి అడుగుతుంది. లేదు బావే ఆర్డర్ పెట్టుకున్నాడని యామిని అంటుంది. అవునా చాలా బాగుందని యామిని పేరెంట్స్ అంటారు. మీకెలా నచ్చిందో నాకు అర్థం అవ్వడం లేదు నాకు అయితే నచ్చలేదు ఓల్డ్ గా ఉంది. రెండు మూడుసార్లు వాడి పడేసినట్లు ఉందని యామిని అనగానే నీకేం తెలుసు అన్ని అలా చూడకూడదు మనసుతో చూడాలని రాజ్ అంటాడు. బావ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావని యామిని అడుగుతుంది. శివాలయం దగ్గరికి అని రాజ్ చెప్పి వెళ్ళిపోతాడు. అలా ఎందుకు అడిగావని యామినిని వైదేహీ అడుగుతుంది. జీపీ ఎస్ ద్వారా మనకి తెలుస్తుంది కానీ బావ మనకి అబద్ధం చెప్తున్నాడో లేదో తెలుస్తుంది కదా అని యామిని అంటుంది. ఆ తర్వాత అపర్ణ, కావ్య ఇద్దరు రాజ్ కోసం వెయిట్ చేస్తారు. రాజ్ అప్పుడే వస్తాడు. తనని చూసి అపర్ణ షాక్ అవుతుంది. నా కొడుకు బ్రతికే ఉన్నాడని అపర్ణ మురిసిపోతుంది. అత్తయ్య మీరు ఆయన ముందు బయటపడొద్దని కావ్య పదేపదే చెప్తుంది. సరే ఒకసారి అటుగా వెళ్తానని రాజ్ పక్క నుండి అపర్ణ వెళ్తుంది. అపర్ణ పడిపోబోతుంటే రాజ్ అమ్మ అంటు పట్టుకుంటాడు. ఆ తర్వాత అమ్మ అని పిలవగానే అదంతా దూరం నుండి చూస్తున్న కావ్య ఆయనకు గతం గుర్తు వచ్చిందా అని అనుకుంటుంది. అమ్మ ఈ కర్చీఫ్ మీదేనా అని రాజ్ అడుగుతాడు. నాదే అని అపర్ణ తీసుకుంటుంది. ఆ తర్వాత అపర్ణని కావ్య పక్కకి తీసుకొని వస్తుంది. నా కొడుకుని అలా చూసి మాట్లాడకుండా ఉండలేకపోయానని అపర్ణ అంటుంది. రాజ్ దగ్గరికి కావ్య వెళ్తుంది. ఇద్దరిని చూసిన పంతులు గారు.. మీ జంట బాగుందని అంటాడు. ఆ మాట అపర్ణ విని మురిసిపోతుంది. తరువాయి భాగంలో రాజ్ , కావ్య ఇద్దరు కలిసి అపర్ణ చేత కేక్ కట్ చేయిస్తారు. అదంతా యామిని చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.