అప్పుడే తాగి పడిపోయావా...సెన్స్ లెస్ గా మాట్లాడితే వినను..హమీద మీద ఫుల్ ఫైర్

  కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఇమ్మానుయేల్ టిల్లు గెటప్ లో వచ్చాడు. ఇక హమీద ఐతే మిత్రవింద గెటప్ లో వచ్చింది. టిల్లు అనుకుంటూ వచ్చి కింద పడిపోయేసరికి ఇమ్ము ఒక ఘాటైన డైలాగ్ వేసేశాడు. "వేసిందే  రెండు రౌండ్లు అప్పుడే తాగి పడిపోయావా" అనేసరికి హమీద నవ్వుకుంది. ఇక మానస్ ఐతే పవన్ కళ్యాణ్ గెటప్ లో వచ్చి "మనం డైలాగ్స్ చెప్పం పాట పాడతాం" అంటూ పాట పాడి వినిపించాడు. ఈ షోలో జడ్జెస్ శేఖర్ మాష్టర్ - అనసూయ హీరోహీరోయిన్స్ గా వచ్చారు. ఈ నెక్స్ట్ వీక్ సినిమా సినిమా అనే కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. శ్రీముఖి టాకీస్ కి హీరో శేఖర్ మాష్టర్ హీరోయిన్ అనసూయ వచ్చారు అంటూ చెప్పింది శ్రీముఖి. "ఎలా ఉన్నారు హీరో గారు" అని శ్రీముఖి అడిగేసరికి "నువ్వు హీరోగారు అనేసరికి నాకేం అర్ధం కావడం లేదు" అన్నాడు శేఖర్ మాష్టర్. హీరోయిన్ ఎవరు అనేసరికి ఇంకెవరు ఇదిగో అంటూ అనసూయని చూపించింది శ్రీముఖి. ఆమె కూడా సీరియస్ గా చూసేసరికి "ఇదంతా సినిమాలో యాక్ట్ చెయ్యి ఇక్కడ కాదు" అని సెటైర్ వేసాడు శేఖర్ మాష్టర్. ఇక ఈ ప్రోమోలో మానస్ వెర్సెస్ హమీద అన్నట్టుగా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఒక టాస్క్ లో బాయ్స్ తరపున శివ్ కుమార్, అమ్మాయిల తరపున ఐశ్వర్య పోటీ పడ్డారు. పుష్ప మూవీలోని ఒక ఫోటో చూపించి దానికి సంబందించిన ఒక ప్రశ్న అడిగింది శ్రీముఖి. ఐతే శ్రీముఖి ప్రశ్న అడిగేటప్పుడే ఐశ్వర్య ముందుకు వచ్చేయడంతో ఆ బొమ్మ తనకు వచ్చింది. దీని మీద మానస్ ఫుల్ ఫైర్ అయ్యాడు.   దీంతో ఐశ్వర్య కూడా వాదించింది. ఆమెకు తోడుగా హమీద కూడా గట్టిగా తిట్టింది. తాము గెలిచినప్పుడే పాయింట్స్ రైజ్ చేస్తారు అంటూ సీరియస్ అయ్యింది. తొండిగా ఆడడం కాదు డైరెక్ట్ గా గెలువు అంటూ మానస్ కూడా అరిచాడు..ఓడిపోయాక సైలెంట్ గా కూర్చోము అంటూ వార్నింగ్ ఇచ్చింది హమీద కూడా. ఇక మానస్ కి కూడా చిర్రెత్తుకొచ్చి సెన్స్ తో మాట్లాడితే వింటా కానీ సెన్స్ లెస్ గా మాట్లాడితే వినను అని చెప్పుకొచ్చాడు. ఇలా వీళ్ళ మధ్య షోలో పెద్ద న్యూసెన్స్ అయ్యింది.  

Karthika Deepam2:  కోర్టులో దీపని నిలదీసిన లాయర్.. ఇంట్రస్టింగ్ గా మారిన కేస్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-339లో.. దీపని పోలీసులు కోర్ట్ లోపలకి తీసుకొని వెళ్తారు. జ్యోత్స్నని తిట్టేస్తాడు కార్తీక్. అందరు లోపలికి వెళ్తారు. ఇక కోర్టులో వాదన మొదలవుతుంది. ఇటు దీప తరపున కళ్యాణ్ ప్రసాద్, అటు జ్యోత్స్న వాళ్ల తరపున భగవాన్ aదాసు ఇద్దరు పోటాపోటీగా వాదిస్తుంటారు. సుమిత్రను విచారించడానికి దీప తరుపు లాయర్ కళ్యాణ్ ప్రసాద్ అనుమతి కోరతాడు. ఆమె వస్తుంది. మీపేరు అని కళ్యాణ్ అనగానే.. సుమిత్ర అంటుంది. దీపను చూపిస్తూ.. తను ఎవరో తెలుసా అంటాడు. తెలుసు.. మా ఇంట్లో ఉండేది. మేమే ఉండమన్నామని సుమిత్ర అంటుంది. ఆమె మీ బంధువా అని కళ్యాణ్ అంటాడు. కాదని సుమిత్ర అనగానే.. మరి ఏ బంధుత్వం లేకుండా ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారని లాయర్ అంటాడు. నా ప్రాణాలు కాపాడిందన్న కృత‌జ్ఞ‌తతో అని సుమిత్ర అనగానే.. నోట్ దిస్ పాయింట్ యువరానర్ అని లాయర్ కళ్యాణ్ ప్రసాద్ అంటాడు. ఎక్కడో ముత్యాలమ్మ గూడెంలో ఉన్న దీప.. తన భర్త కోసం సిటీకి వచ్చి.. అనుకోకుండా సుమిత్రగారి ప్రాణాలు కాపాడందన్న కృత‌జ్ఞ‌తతో తన ఇంట్లోనే ఉండమని చెప్పానని ఆవిడే చెబుతున్నారు.. భార్యకు ప్రాణాలు పోసి భర్త ప్రాణాలు ఎలా తీస్తుంది యువరానర్ అంటూ లాజిక్‌గా కళ్యాణ్ ప్రసాద్ చెప్తుంటాడు. వెంటనే భగవాన్ దాసు పైకి లేచి.. అబ్జెక్షన్ యువరానర్.. ఓ తల్లి తన ప్రియుడి కోసం ముగ్గురు పిల్లల్ని చంపిన విషయం మనందరికీ తెలిసిందే. ఏం.. ఆ తల్లి బిడ్డల్ని కనేటప్పుడు ప్రేమ లేకుండానే కనిందా? చంపేటప్పుడు ఆ ప్రేమ ఏమైంది? అంటే మనుషులు మారతారు.. ప్రేమ మారుతుంది.. ప్రాణాలు పోసిన ఈవిడ ప్రాణాలు ఎందుకు తీయకూడదని కొత్త పాయింట్ లాగుతాడు. ఇక భగవాన్ దాసు.. యువరానర్.. దీప చంపాలి అనుకున్నది దశరథ్ గారిని కాదు.. జ్యోత్స్నను.. ఆ నిజం తనతోనే చెప్పిస్తాను.. అనుమతి ఇవ్వండి అనగానే సరే అంటుంది జడ్జ్. ఇక దీప దగ్గరకు వెళ్లిన భగవాన్ దాసు.. నీ పేరు.. నీ భర్త పేరు అంటూ ప్రశ్నలు స్టార్ట్ చేస్తాడు. దీప, కార్తీక్ అంటూ దీప సమాధానాలు ఇవ్వగానే.. మరి నరసింహా ఎవరని భగవాన్ దాసు అంటాడు. వెంటనే కళ్యాణ్.. అబ్జెక్షన్ చెప్తూ పైకి లేచి.. దీప కార్తీక్‌ని రెండో పెళ్లి చేసుకుంది.. ప్రస్తుతం విడాకులు ఇచ్చి జైల్లో ఉన్న నరసింహా గురించి అప్రస్తుతం అని అంటాడు. అసలు గొడవ మొదలైందే నరసింహా గురించి అని భగవాన్ దాసు అంటాడు. ఎవరి గురించి అని కళ్యాణ్ ప్రసాద్ అనగానే.. కార్తీక్ గురించి దీప ఎన్నోసార్లు జ్యోత్స్నతో గొడవ పడిందని భగవాన్ దాసు అంటాడు. లేదు.. కార్తీక్ బాబు గురించి నేనెప్పుడు జ్యోత్స్నతో గొడవపడలేదని దీప అంటుంది. అబద్దం.. బావ గురించి నాతో చాలాసార్లు గొడవపడిందని జ్యోత్స్న పైకిలేస్తుంది. వెంటనే కార్తీక్ పైకి లేచి.. మొదలుపెట్టింది ఎవరు? ఎవరు ఎవరి దగ్గరకు వెళ్లి గొడవపడ్డారని కార్తీక్ అంటాడు. వెంటనే జడ్జ్ ఇద్దరి మీద సీరియస్ కావడంతో ఇద్దరూ సారీ చెప్పి కూర్చుంటారు. దీప ఎలాంటిదో ఇప్పుడే నిరూపిస్తానంటూ సుమిత్రను పిలిపించి.. సాక్ష్యానికి జ్యోత్స్నని పిలిపిస్తాడు. జ్యోత్స్న రాగానే.. దీపా నీ సమక్షంలో మొదలైన కార్తీక్, జ్యోత్స్నల నిశ్చితార్థం ఎవరి కారణంగా ఆగిపోయింది. నువ్వు కారణం కదా అని భగవాన్ దాసు అంటాడు. తప్పక అవునని దీప అంటుంది. నువ్వు కార్తీక్, జ్యోత్స్నల పెళ్లి చేస్తానని మాట ఇచ్చావా లేదా అని భగవాన్ దాసు అనగా.. ఇచ్చానని దీప అంటుంది. నువ్వు కార్తీక్‌ని దొంగచాటుగా పెళ్లి చేసుకున్నావని భగవాన్ దాసు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu: కొడుకుని చూసి గర్వంగా ఫీల్ అయిన రామరాజు.. ధీరజ్ ఎమోషనల్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-140 లో.. శ్రీవల్లిని ప్రేమ అవమానించిన తన భర్త ధీరజ్ సపోర్ట్ చేయకపోవడంతో తను ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది.‌ ఇక ఇల్లు దాటి గీత దాటుతుండగా ప్రేమ ఆగిపోతుంది. ఇక అప్పుడే తన పక్కకి ధీరజ్ వస్తాడు. నీ అడుగు ఈ గీతను దాటదు ప్రేమా అని అంటాడు. అడుగుదాటకపోవడం కాదు.. నువ్వే అడుగుముందుకు వేయలేవు. ఎందుకంటే.. ఏదో తెలియని బంధం నీ మనసుని కాళ్లని కట్టిపడేస్తుంది. మనకి తెలియకుండానే ఇష్టంలేని బంధంలో ఇరుక్కునిపోయాం. మన జీవితాల గురించి మనం నిర్ణయం తీసుకునే పరిస్థితిలో మనం లేము ప్రేమా.. ఎందుకంటే మనది ఇష్టం లేని ప్రయాణం. కానీ కలిసి నడవాల్సిన పరిస్థితి. అలాగని నిన్న ఆగమని చెప్పే హక్కు నాకు లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం.. నచ్చినా నచ్చకపోయినా.. ఏం జరిగినా ఎవరేమన్నా.. మనం భరించాల్సిందే.. కలిసి అడుగులు వేయాల్సిందేనని ధీరజ్ అంటాడు. ఆ మాటతో ప్రేమ అవుతుంది. నీ బాధకి కారణం మా వదిన ఏదో మాట్లాడిందనే కదా.. ఒక్కసారి మా వదిన స్థానంలో నువ్వు ఉండి ఆలోచించు. ఇంకో గంటలో తన మెడలో తాళి పడబోతుందనగా.. తన భర్తని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లారు. ఆ క్షణంలో ఓ ఆడపిల్ల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు ప్రేమా అని ధీరజ్ అంటాడు. పెళ్లికి వచ్చిన వాళ్లు నానా మాటలు అంటే.. ఆ పిల్ల పరిస్థితి ఏంటి? ఆమెను కన్నవాళ్ల పరిస్థితేంటి? కొడుకు పెళ్లిపీటలపై ఆగిపోతే మా అమ్మనాన్నల పరిస్థితేంటి? వాళ్లకి ఎంత నరకమో ఒక్కసారి ఆలోచించు. మా వదిన మాట్లాడిన విధానం తప్పు అయ్యి ఉండొచ్చు కానీ.. తన బాధలో అర్థం ఉంది. ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది ప్రేమా.. తరువాత నీ ఇష్టమని ధీరజ్ సర్దిచెప్తాడు. దాంతో ప్రేమ గీత దాటకుండ వెనక్కి వచ్చేస్తుంది. ఇక రామరాజు అయితే కొడుకు పెళ్లైపోయిందనే ఆనందంలో చాలా రోజుల తర్వాత తిరుపతితో కలిసి మందేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. నిన్ను చాలా రోజుల తర్వాత ఇంత సంతోషంగా చూస్తున్నాను బావా అని తిరుపతి అంటాడు. ఈ సంతోషానికి కారణం నా చిన్న కొడుకురా అని రామరాజు అంటాడు. ఆ మాట విన్న ధీరజ్ ఎమోషనల్ అయిపోతాడు. అవునురా తిరుపతీ.. ఈ మాట మనస్పూర్తిగా చెప్తున్నా పెళ్లి మండపంలో పెద్దోడు లెటర్ రాసి వెళ్లిపోయాడని చాలా బాధపడ్డానురా.. వాడు అలా చేశాడంటే నమ్మేశానురా కానీ నా చిన్నకొడుకు మాత్రం.. అన్నయ్య తప్పు చేయడు.. మా నాన్నని బాధపెట్టడని బలంగా నమ్మాడురా.. ముహూర్తం టైమ్ కి అన్నయ్యని తీసుకొస్తా.. మీ కళ్లల్లో సంతోషం నింపుతా అన్నాడు.. నింపాడు. చిన్నోడు వాళ్ల అన్నయ్య జీవితాన్ని నిలబెట్టడమే కాదు.. నా ప్రాణాలను నిలబెట్టాడు. దానికి వాడు పెద్ద యుద్దమే చేశాడురా నా చిన్న కొడుకు. ఒకవేళ పెద్దోడి పెళ్లి ఆగిపోయి ఉంటే ఆ బాధలో ఈ గుండె ఆగిపోయేదిరా. నిలబడ్డాడ్రా.. నా చిన్న కొడుకు నా కోసం ఈ ఇంటికోసం నిలబడ్డాడ్రా. వాడు బాధ్యత తెలియని ఆకతాయి అనుకున్నా. కానీ వాడు నాలాగేరా.. కుటుంబానికి ఆపద వస్తే ప్రాణం పెట్టేస్తాడ్రా.. నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా.. నా కొడుకులు జెమ్స్ అని. నా చిన్నకొడుకు మాత్రం నెంబర్ వన్ జెమ్‌.. వాడి విషయంలో నాకు గర్వంగా ఉందని రామరాజు ఎమోషనల్ అవుతాడు. ఆ మాటలు విని ధీరజ్ సంతోషపడతాడు. మరి ఈ మాట.. చిన్నోడితో చెప్పొచ్చు కదా బావా? ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు బయటపడటం లేదు.. చిన్నోడ్ని దగ్గరకు తీసుకుంటూ వాడూ సంతోషపడతాడు కదా బావా అని తిరుపతి అనగానే.. నా కొడుకుని దగ్గరకు తీసుకోకుండా నేను ఎందుకు ఉంటానురా.. కానీ ఒక్క విషయంలో వాడు నన్ను నమ్మించి మోసం చేశాడు. నాన్నా ఈరోజు నుంచి మీతో శభాష్ అనిపించుకుంటానని చెప్పి.. నా దగ్గర డబ్బులు తీసుకుని ఆ ఎదురింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడ్రా వాడూ.. అసలు అక్కడేం జరిగింది.. వీడెందుకు ఇలా చేశాడూ.. ఆ విషయం ఇప్పటికీ చెప్పలేదు. ఎప్పటికైనా ఆ నిజాన్ని వాడు చెప్తాడని చూస్తున్నా.. అప్పుడు నా చిన్న కొడుకుని గర్వంగా గుండెలకు హత్తుకుని.. ఈ సంతోషాన్ని వాడితో పంచుకుంటానని రామరాజు అంటాడు. చిన్నోడు ఇప్పటికే బాధ్యతల్ని తెలుసుకున్నాడు బావా.. వాడ్ని త్వరలోనే దగ్గరకు తీసుకుంటావ్ చూడు అని తిరుపతి అంటాడు. ఆ రోజు కోసమే ఎదురుచూస్తున్నానురా.. ఏదేమైనా ఈ ఇంటికి తగిలిన దిష్టి ఈరోజుతో పోయిందిరా.. మహాలక్ష్మి లాంటి కోడలు రావడంతో ఈ ఇంటికి కళ వచ్చేసిందిరా.. ఎంత వెతికిన కూడా అంతమంచి అమ్మాయిని పెద్దోడి భార్యగా తీసుకుని రాలేపోయేవాడ్ని.. నా పెద్ద కోడలు నా కుటుంబాన్ని నిలబెడుతుందిరా అని రామరాజు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాజ్ సంతకమా? డెత్ సర్టిఫికేటా.. కావ్యని ఇరికించిన రుద్రాణి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి (Brahmamudi)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-703లో.. రుద్రాణి ఒకతనికి కాల్ చేస్తుంది. నవ్య జ్యూయెలరీ మేనేజర్ శ్రీధర్ గారేనా మాట్లాడేదని అంటుంది. నేనే మేడమ్.. బాగున్నారా.. మీ నంబర్ నా దగ్గర ఉందని శ్రీధర్ అంటాడు. మీకు ఓ ముఖ్యమైన విషయం చెప్పడానికి కాల్ చేశాను.. మీరు నాలుగు కోట్ల వరకు మా కంపెనీకి చెల్లించాలని విన్నాను నిజమేనా అని రుద్రాణి అనగానే.. నిజమే మేడమ్.. మాకు రావాల్సిన పేమెంట్స్ రాక మేము 2 డేస్ టైమ్ అడుగుతున్నాం కానీ ఆ మేడమ్ అందుకు ఒప్పుకోవడం లేదు.. మాకు 2 డేస్ టైమ్ ఇప్పించగలరా అని అంటాడు. నేను చెప్పినట్లు చేస్తే రెండు రోజులు కాదు రెండు వారాలు టైమ్ దొరుకుతుంది.. మీతో డీల్ మొదలుపెట్టింది రాజ్ కాబట్టి తను లేనప్పుడు పవర్ ఆఫ్ పటార్నీ ఉన్న వాళ్లే డీల్ క్లోజ్ చేయాలి కదా.. రాజ్ లేడన్న డెత్ సర్టిఫికెట్‌ని కావాలని లేదంటే రాజే సంతకం చేసి డీల్ క్లోజ్ చేయాలని కండీషన్ పెట్టండి సరిపోతుందని రుద్రాణి అంటుంది. అదేంటి మేడమ్.. రాజ్ సర్ చనిపోయారు కదా పాపం.. మరి పవర్ ఆఫ్ పటార్నీ కావ్య మేడమ్ గారికి లేదా అని శ్రీధర్ అంటాడు. కావ్యకు పవర్ ఆఫ్ పటార్నీ లేదు.. అందుకే చెబుతున్నా.. ఈ కండీషన్ పెడితే మీకు టైమ్ దొరుకుతుంది. వస్తే రాజ్ వచ్చి సంతకం చెయ్యాలి. అది జరగదు కాబట్టి డెత్ సర్టిఫికెట్ తెప్పించాలి.. దానికి ఎలాగో టైమ్ పడుతుందని రుద్రాణి చెప్తుంది. సరే, థాంక్యూ మేడమ్.. మంచి సలహా ఇచ్చారని శ్రూధర్ అంటాడు అవతల వ్యక్తి. మామ్ కంపెనీకి డబ్బులు రాకుండా ఆపావు ఓకే.. కానీ ఇప్పుడు మన కంపెనీ నుంచి డబ్బు ఇవ్వాల్సిన వారికి సమాచారం ఇవ్వాలి కదా అని రుద్రాణితో రాహుల్ అంటాడు. ఇప్పుడు అదే చేయబోతున్నా అని రుద్రాణి అంటూ.. స్వరాజ్ కంపెనీకి రా మెటీరియల్ సప్లై చేసే వారికి కాల్ చేస్తుంది. మీకు 24 గంటల్లో 2 కోట్లు ఇస్తానని మా కావ్య చెప్పిందట కదా.. కానీ అది జరిగేలా లేదు.. రాజ్ చనిపోయాడు కాబట్టి డెత్ సర్టిఫికెట్ ఇవ్వనిదే పేమెంట్స్ వసూలు కావడం లేదట అని రుద్రాణి అంటుంది. మరి కావ్య మేడమ్ మాకు ఎందుకు అలా చెప్పారు.. 24 గంటల్లోనే ఇస్తామని అతను అంటాడు. నన్ను అడిగితే నేనేం చెప్పాలి. అదే విషయం ఇంటికి వచ్చి కావ్యను నిలదీయండి అని రుద్రాణి అనగానే.. వస్తాం మేడమ్.. ఇంటికి వచ్చే నిలదీస్తాం.. మీ ఫ్యామిలీకి ఉన్న పేరు వల్ల అలా ఆగాం కానీ మమ్మల్ని మోసం చేస్తే ఊరుకుంటామా అని అతను అంటాడు. దాంతో ఫోన్ పెట్టేస్తుంది రుద్రాణీ. వెంటనే కొడుకు రాహుల్‌తో .. ఇప్పుడు చూస్తాను కావ్య ఏం చేస్తుందో.. ఏది ఏమైనా రాజ్‌ని తీసుకుని రావాలి. ఒకవేళ తీసుకుని రాలేకపోతే.. వాడు చచ్చాడని డెత్ సర్టిఫికెట్ అయిన తీసుకునిరావాలని రుద్రాణి అంటుంది. ఇక మరునాడు కావ్యకు నవ్య జ్యూయెలరీ మేనేజర్ కాల్ చేసి.. మాతో డీల్ చేసుకున్న రాజ్ గారి డెత్ సర్టిఫికెట్ తెస్తేనే మేము డబ్బు ఇవ్వగలమని చెప్తాడు. మరోవైపు కావ్య ఆఫీస్‌కి బయలుదేరే సమయానికి.. రా మెటీరియల్ అమ్మే వాళ్లు.. మరో వ్యక్తిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చేస్తాడు. మా డబ్బు మాకు ఇప్పుడే కట్టండి అని వాళ్లు అంటారు.. కావాలనే.. వాళ్ల తరపున తను మాట్లాడటం మొదలుపెడుతుంది. వాళ్లు కోరినట్లు డబ్బు మనం ఇవ్వాలంటే రాజ్ రావాలి.. లేదా రాజ్ డెత్ సర్టిఫికెట్ తీసుకొచ్చి చూపించాలి. అప్పుడే మనకు రావాల్సిన బిల్స్ వసూలు అవుతాయి. అప్పుడే మనం తీర్చాల్సిన అప్పులు తీర్చగలం.. అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడి కావ్యను ఇబ్బంది పెడుతుంది. ఆఖరి అవకాశంగా ఈ ఒక్కరోజు ఇస్తున్నామని కావ్యకు చెప్పి వాళ్లు వెళ్లిపోతారు. డెత్ సర్టిఫికెట్ పేపర్ కావ్య ముందు పెట్టి.. ఇందులో ఒక్క సంతకం చెయ్ కావ్యా.. రాజ్ లేడని క్లారిటీ వస్తే సమస్యలన్నీ తీరిపోతాయంటూ ఇరికిస్తూ మాట్లాడుతుంది. దాంతో రుద్రాణి మీద అపర్ణ కూడా ఫైర్ అవుతుంది. ఇక తరువాయి భాగంలో రాజ్‌ని కావ్య పిలిచి అతడి సాయం కోరడం కీలకంగా మారింది. మా బాస్ ఇచ్చిన లెటర్ హెడ్‌ని నేను పోగొట్టి తప్పు చేశానండి అని రాజ్ తో కావ్య అంటుంది. మరి ఇప్పుడు మీ బాస్ సంతకం చేసిన లెటర్ హెడ్ లేకపోతే డీల్ పూర్తి చేయలేరుగా అని రాజ్ అంటాడు. నేను డీల్ పూర్తి చేయాలంటే మీరు మా బాస్ లాగా ఒక సంతకం మాత్రమే ఇందులో చేస్తే.. నేను సేఫ్ అవుతానని రాజ్ తో కావ్య అంటుంది. వెంటనే రాజ్ ఆ లెటర్ వదిలేసి.. అమ్మో.. ఏంటండీ మీరు అనేది.. నన్ను ఫోర్జరీ చేయమంటున్నారా అని అంటాడు. సరే మీ వల్ల కాదు కదా.. మీరు వెళ్లిపోండి.. నేను చూసుకుంటానని కావ్య అలిగినట్టుగా మాట్లాడుతుంది. దాంతో రాజ్ లేచి వెళ్లిపోయినట్లు.. ఆ పేపర్ మీద కావ్యే సంతకం చేయాలని ప్రయత్నించినట్లు చూపించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అంత మంది చనిపోయారు అన్న చిన్న ఫీల్ కూడా లేదు ? నువ్వు సేఫ్ గానే ఉంటావులే  

పహల్గాంలో పరిస్థితి అద్వానంగా ఉంటే ఆర్జే కాజల్ మాత్రం అక్కడంతా ప్రశాంతంగా ఉందని, రోడ్స్ అంతా క్లియర్ గా ఉన్నాయని..వాళ్లంతా సేఫ్ గా ఉన్నామంటూ ఒక వీడియోని రిలీజ్ చేసింది. కాశ్మీర్ ట్రిప్ లో ఉన్నామని లేటెస్ట్ అప్ డేట్ ఇస్తున్నాను అంటూ  పెహెల్గాం నుంచి శ్రీనగర్ కి వెళ్తున్నామని చెప్పింది. అంతా ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఉంది అని చెప్పింది. తన గురించి ఆలోచన వెల్ విషర్స్ , ఫ్రెండ్స్ అంతా కాల్ చేస్తున్నారు, మెసేజెస్ పెడుతున్నారు. ఐతే అక్కడ తాను సేఫ్ గా ఉన్నాను అని చెప్పింది. అలాగే లోకల్ పోలీసులు కూడా అంతా జాగ్రత్తగా చూసుకుంటున్నారని చెప్పింది. కాశ్మీర్ ఎప్పటిలానే సేఫ్ గా ఉంది. కాబట్టి ఎవరూ టెన్షన్ పడొద్దు అని చెప్పింది. ఇక కిర్రాక్ సీత, గాయత్రి భార్గవి, ప్రియాంక సింగ్, జ్యోతక్క అంతా టేక్ కేర్ అంటూ మెసేజెస్ పెట్టారు. ఇక నెటిజన్స్ ఐతే కాజల్ మీద ఫుల్ ఫైర్ అవుతున్నారు .."ఏంటి కాశ్మీర్ సేఫ్ గా అందంగా ఉందా..25 మందిని చంపాక ..నీ స్క్రిప్ట్ పని చూసుకో ...కాశ్మీర్ ముస్లిమ్స్ కి సేఫ్...నిద్ర లేమ్మా కాశ్మీర్ ముస్లిమ్స్ కి సేఫ్ కానీ హిందుస్ కి కాదు. మీకు పర్వాలేదు లెండి. వాళ్ళు ముందుగానే ఐడి కార్డ్స్ చెక్ చేసుకుని చంపారు..బ్యూటిఫుల్ ఏంటి..అక్కడ అంత మంది చనిపోయారు అన్న చిన్న ఫీల్ కూడా లేదు ?  ఇక ఈ ఉగ్ర దాడి మీద సినీ నటులంతా కూడా స్పందిస్తున్నారు. రేణు దేశాయ్, చిరంజీవి, ఎన్టీఆర్ వంటి వాళ్లంతా ఈ దాడిని ఖండించారు. ఆర్జే కాజల్  బిగ్ బాస్ సీజన్ 5 కి వెళ్లొచ్చి బాగా ఫేమస్ అయ్యింది. కొన్ని వెబ్ సిరీస్ లో నటించింది.    

Illu illalu pillalu: భార్యకి ధీరజ్ భరోసా లేనట్టేనా.. ప్రేమ ఆ గీత దాటనుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-139 లో..  తోడికోడలు ప్రేమపై నోరు పారేసుకుంటుంది శ్రీవల్లి. ఆమె కుటుంబం గురించి చాలా నీఛంగా మాట్లాడింది. బుద్ది లేకుండా ధీరజ్‌ని ఎలా పెళ్లి చేసుకుంటావంటూ ప్రేమని తక్కువ చేసి మాట్లాడింది శ్రీవల్లి.  అయితే శ్రీవల్లి అన్న మాటలకు ఏడ్చుకుంటూ.. భర్త ధీరజ్ దగ్గరకు వెళ్తుంది ప్రేమ. ప్రపంచం మొత్తం నిందించినా కూడా.. నీకు నేనున్నననే భర్త భరోసా, ఓదార్పు కోసం ఎదురుచూస్తుంది భార్య. అలాంటి ఓదార్పు ధీరజ్ నుంచి లభిస్తుందని ఆశపడింది ప్రేమ. కానీ భరోసా ఇవ్వాల్సిన భర్తే.. వంత పాడాడు. కనీసం సొంత అక్క కాకపోయినా కూడా.. ఎందుకు ప్రేమను అంతంత మాటలు అంటున్నావ్ అని నర్మద తిరగబడింది కానీ.. కట్టుకున్న వాడు మాత్రం భుజం తట్టలేకపోయాడు. అన్నలతో సంతోషంగా ఉన్న ధీరజ్ దగ్గరకు వచ్చిన ప్రేమ.. నీతో మాట్లాడాలి.. ఒక్కసారి ఇలా రా అని పిలుస్తుంది. ఇప్పుడు కాదు.. తరువాత మాట్లాడుకుందాం అని అంటాడు ధీరజ్. తరువాత కాదు.. ఇప్పుడే మాట్లాడాలి రా అని అంటుంది ప్రేమ. నేను రాను.. తరువాత చూద్దాం వెళ్లు అని అంటాడు ధీరజ్. ఇంతలో తిరుపతి.. అమ్మాయి అంతలా పిలుస్తుంటే వెళ్లనంటావ్ ఏంట్రా వెళ్లు అని అంటాడు. ఇక సాగర్, చందులు కూడా.. వెళ్లమని చెప్తారు. దాంతో అయిష్టంగానే అక్కడ నుంచి కదులుతాడు ధీరజ్. ఏంటీ నీ నస.. ఎందుకు పిలిచావని ధీరజ్ అడుగుతాడు. దాంతో ప్రేమ..మీ పెద్ద వదిన నా ఫ్యామిలీ గురించి దారుణంగా మాట్లాడింది. మా వాళ్లంతా పరమదుర్మార్గులట.. కిడ్నాప్‌లు చేసే కిరాతకులట. ధీరజ్‌ని పెళ్లి చేసుకోవడానికి నీకు బుద్దిలేదని.. నన్ను అవమానిస్తూ మాట్లాడిందని తన బాధను ప్రేమ వెల్లబోసుకుంటుంది. దాంతో ధీరజ్.. మా వదిన మాట్లాడిన దాంట్లో తప్పేం ఉంది? అన్నీ కరెక్టే కదా.. పచ్చి నిజాలే కదా అని అంటాడు. ఆ మాటతో ప్రేమ షాక్ అయిపోతుంది. ఏంటీ ఏమన్నాని ప్రేమ అంటుంది.  ఇంకేం చెప్పకు ధీరజ్.. నా బాధ నీకు నవ్వులాట అయ్యింది.. మీ వదినకే కాదు.. నీకు కూడా లోకువ అయ్యాను. భవిష్యత్‌లో కూడా మీ వదిన ఇలాగే మాట్లాడితే నువ్వు సమర్ధిస్తూ మాట్లాడతావ్ తప్ప.. నా వైపు నిలబడవు.. నాకు అర్థం అయ్యింది. నేను ఇంట్లో ఎప్పుడూ ఒంటరినే అని నాకు అర్థం అయ్యింది. నాకు ఈ ఇంట్లో విలువ లేనప్పుడు నేను ఇక్కడ ఉండలేను. అందుకే వెళ్లిపోతున్నాను.. నేను మా ఇంటికి ఇప్పుడే ఈ క్షణమే వెళ్లిపోతున్నానంటూ తన ఇంటికి వెళ్లిపోబోతుంది ప్రేమ. అయితే సరిగ్గా ఇంటి ముందు ఉన్న గీత దాటేసరికి.. అడుగు అటు పెట్టకుండా అక్కడే ఆగిపోతుంది ప్రేమ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : రాజ్ బ్రతికే ఉన్నాడని చెప్పిన అపర్ణ.. రాజ్ కొత్త గెటప్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -702 లో.....రుద్రాణి కావాలనే కొంతమందిని ఆఫీస్ నుండి రప్పిస్తుంది. వీళ్ళందరు రాజ్ కి సంతాపం సభ ఏర్పాటు చెయ్యాలి అనుకుంటున్నారని అనగానే అపర్ణ ఏదో అనాలని వెళ్తుంటే.. కావ్య ఆపుతుంది. కావ్య ఆపడం రుద్రాణి చూస్తుంది. అలా పిలిపించడంతో ఇంట్లో అందరు రుద్రాణిపై కోప్పడతారు. వాళ్ళను కావ్య పంపిస్తుంది. నా కొడుకు బ్రతికే ఉన్నాడు త్వరలోనే వస్తాడని అపర్ణ చెప్పగానే రుద్రాణి, రాహుల్ షాక్ అవుతారు. ఆ తర్వాత ఇలా తిట్లుపడితే గాని మనకి బుద్ధి రాదని రుద్రాణితో రాహుల్ అంటాడు. తిడితే తిట్టింది గాని ఏదో జరుగుతుందని అర్ధం అవుతుందని రాహుల్ తో రుద్రాణి అంటుంది. మరొకవైపు రాజ్ ని కావ్య కలుస్తుంది. రాజ్ గెటప్ మార్చి వస్తుంటే.. ఏంటి ఇలా తయారు అయ్యారని అంటుంది. మనం సీక్రెట్ ఏజెంట్ లో వర్క్ చేస్తున్నాం అండర్ కవర్ ఆపరేషన్ లో ఉన్నామంటూ రాజ్ అర్ధం లేకుండా మాట్లాడతాడు. మరొకవైపు రాహుల్ ఆఫీస్ కి ఫోన్ చేసి ఆఫీస్ లో జరిగే విషయాలు తెలుసుకుంటాడు. మరొకవైపు ఒక దగ్గర దొంగతనం జరుగుతుంటే రాజ్ వెళ్లి ఆపుతాడు. మేం ఆఫీసర్ అంటూ మాట్లాడతాడు అప్పుడే పోలీసులు వస్తారు. వాళ్లతో కూడా రాజ్ అలాగే మాట్లాడతాడు. దాంతో కావ్య రాజ్ ని పక్కకి తీసుకొని వెళ్తుంది. మీరు కొరియర్ స్టేషన్ నుండి పంపారు కదా.. అందుకే నేను ఇలా ఉహించుకున్న అని రాజ్ అంటాడు. అదంతా ఏం లేదు.. మా చెల్లి పోలీస్ డిపార్ట్ మెంట్.. తను పంపింది కొరియర్ అని కావ్య చెప్తుంది. ఆ తర్వాత రాహుల్ ఆఫీస్ లో జరుగుతున్న విషయాలు రుద్రాణికి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: శౌర్యని ఆయుధంగా మార్చుకున్న జ్యోత్స్న.. కార్తీక్ కి డౌట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్- 338లో..  దశరథ్‌కి తెలియకుండా కోర్టు వ్యవహారాలు సాగాలని శివన్నారాయణ నిర్ణయం తీసుకుంటాడు. బావా.. తప్పు జరిగింది.. అది నిజం.. దయచేసి దీపను కాపాడే ప్రయత్నం చేసి.. నువ్వు ఇంకా విలన్ కాకు అని కార్తీక్ తో జ్యోత్స్న అంటుంది. ఆ మాటలు చాటుగా విన్న శౌర్యకు అనుమానం వస్తుంది. అమ్మను నాన్న కాపాడటం ఏంటీ? ఈ విషయం వెంటనే కాశీ మావయ్యను అడగాలని శౌర్య ఫిక్స్ అయ్యి ఇంట్లోంచి దొంగచాటుగా పరుగుతీస్తుంది. ఇక జ్యోత్స్నని కార్తీక్ కోప్పడి పంపేసి సైకిల్ మీద కోర్టుకి బయల్దేర్తాడు. మరోవైపు దశరథ్ నిద్రపోతుంటే సుమిత్ర అక్కడే ఉండి అతడ్ని చూస్తుంటుంది. పక్కనే ఉన్న పారిజాతం.. సుమిత్రా నువ్వు కూడా కాసేపు రెస్ట్ తీసుకోమని అంటుంది. ఇంతలో శివన్నారాయణ వచ్చి.. అమ్మా సుమిత్రా మనం కోర్టుకి వెళ్లాలి.. ఇప్పుడే బయల్దేరాలి. అక్కడకి దీపను తీసుకొస్తున్నారట.. మనం సాక్ష్యం చెప్పాలి. అలాగే ఈ కోర్టు వ్యవహారాలన్నీ దశరథ్‌కి తెలియకూడదు ఇక.. పారిజాతం నువ్వు ఏం చెప్పకు అనేసి ఇద్దరినీ తీసుకుని కోర్టుకి బయలుదేర్తాడు. ఇక శౌర్య రోడ్ల మీద తిరుగుతుంటే జ్యోత్స్న చూస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావని జ్యోత్స్న అడుగగా.. నేను మా కాశీ మావయ్య ఇంటికి వెళ్తున్నా జ్యో.. మా అమ్మ కోసం వెళ్తున్నా.. కానీ మా అమ్మ ఎక్కడుందో నీకు తెలుసు.. మా నాన్నకు చెబుతుంటే నేను విన్నాను.. మా అమ్మ ప్రమాదంలో ఉందని అర్థమైంది. మళ్లీ బూచోడు వచ్చాడా? చెప్పు జ్యో.. నన్ను తీసుకెళ్లవా మా అమ్మ దగ్గరకి అంటూ శౌర్య రిక్వెస్ట్ చేస్తుంది. వ్వు ఇంట్లోంచి బయటికి వచ్చేటప్పుడు ఎవరైనా చూశారా అని జ్యోత్స్న అడుగుతుంది. ఎవరికీ చెప్పకుండా వచ్చానని శౌర్య అంటుంది.  కాసేపటికి దీపని పోలీస్ వ్యాన్ లో ఎక్కిస్తుంటారు. అప్పుడే అక్కడికి శౌర్య వస్తుంది. అమ్మా అంటూ పరుగున వెళ్ళి దీపని పట్టేసుకుంటుంది శౌర్య. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని దీప అడుగగా.. అమ్మా నీకోసమే వచ్చాను.. నువ్వు ఇక్కడున్నావేంటీ.. పోలీసులు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారని శౌర్య అడుగుతుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. రౌడీ ఇక్కడున్నావేంటని అడుగుతుంది. నువ్వు నాతో మాట్లాడకు.. నాకు నువ్వు అబద్ధం చెప్పావ్.. అమ్మ ఇక్కడుందని జ్యో నాకు చెప్పిందంటూ శౌర్య షాకిస్తుంది. దీప ఏడుస్తూ ఉంటే.. శౌర్య ఏడుస్తూనే.. అమ్మా తప్పు చేస్తేనే కదా పోలీసులు తీసుకెళ్తారు. నువ్వేం తప్పు చేశావ్.. ఏం జరిగిందని ఆరా తీస్తుంది. ఇక కార్తీక్ సర్దిచెప్తున్నంత సేపు.. నాన్నా నీ మాట ఇక నమ్మనంటూ దీప చేయిపట్టుకుని.. అమ్మరా వెళ్లిపోదామని అంటుంది. లావణ్యా ఏంటి ఇది అని ఎస్ఐ అరుస్తాడు. సర్ మీరు కారు ఎక్కండి.. రెండు నిమిషాలు సర్.. చిన్నపిల్ల కదా లావణ్య అంటుంది. ఇక దీప, శౌర్యల మధ్య సెంటిమెంట్ సీన్ సాగుతుంది. కాసేపటికి దీప వెళ్ళిపోతుంది. అమ్మని తీసుకొస్తానంటూ శౌర్యకి కార్తీక్ మాటిస్తాడు.  మరోవైపు పారిజాతం, సుమిత్ర, శివన్నారాయణ కారు మీద వెళ్తూ వెళ్తూ.. దీపను వదిలిపెట్టకూడదని ఫిక్స్ అవుతారు. అది బయటికి వస్తే జ్యోత్స్నను బతకనివ్వదు. దాన్ని వదిలిపెట్టకూడదు.. ఉరితాడు వేలాడాల్సిందే అని పారిజాతం చెప్తుంది. ఇక కాసేపటికి కోర్టు దగ్గర కావేరీ, కార్తీక్ ఇద్దరు వచ్చి దీప కోసం ఎదురుచూస్తుంటారు. ఆ రోజు నువ్వు ఈ నిజం నాకు చెప్పి ఉంటే సరిపోయేది చిన్నమ్మా అని కార్తీక్ అంటాడు. దీప గన్ పట్టుకోవడం ఏంటీ.. బుల్లెట్ దశరథ్ గారికి తగలడమేంటి? అయినా ఆ జ్యోత్స్న ముందే అంది.. నీ జీవితంలో దీపను ఉండనివ్వనని కాంచన అంటుంది. అంటే నేను చూసిన దానికి.. మావయ్యకు బుల్లెట్ తగలడం మధ్య ఇంకేమైనా జరిగిందా అని కార్తీక్ ఆలోచనలో పడతాడు. ఇంతలో దీపను పోలీసులు తీసుకొస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 రెండు ఇడ్లి 1200 .. పచ్చళ్ళ కంటే కాస్ట్ గా ఉన్నాయి..

  సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి అంబటి అర్జున్ తో పాటు ప్రియాంక జైన్, శోభా శెట్టి, సుహాసిని వచ్చారు. ఐతే నిన్న మొన్నటి వరకు రచ్చ చేసిన అలేఖ్య చిట్టి పికిల్స్ కాన్సెప్ట్ ని ఈ షోలో కూడా వాడేశారు. ఐతే సుమ అడ్డా షోలో "సుమ టిఫిన్స్ అండ్ కర్రీ పాయింట్" పేరుతో ఒక స్కిట్ వేశారు. ఇందులో సుమ కూడా మాములుగా జోక్స్ వేయలేదు. "ఈ ఇడ్లీ గనక మీరు తిన్నారు అనుకో మీ ముఖం కూడా ఇడ్లీలా నిగనిగలాడిపోతుంది అంతే. రెండు ఇడ్లి 1200 అమ్మా" అంటూ సుమ మంచి జోష్ తో డైలాగ్ వేసింది. దానికి అంబటి అర్జున్ వచ్చిన "ఏంటో వీళ్ళ ఇడ్లి పచ్చడి కన్నా కాస్ట్ గా ఉంది..ఆ పచ్చడి కొనలేకే మీ టిఫిన్ తిందామని వచ్చాను..టిఫిన్ కూడా ఇంత కాస్ట్లీ గా చెప్తుంటే నేను ఎక్కడికి వెళ్ళాలి" అంటూ చిట్టి పికిల్స్ మీద సెటైర్స్ వేసాడు. ఆ తర్వాత సుహాసిని వచ్చి "ఏంటి ఈ దోశ ఇంత గట్టిగా ఉంది" అని అడిగింది. దానికి సుమ " మేము దోశలు వేసేసిన తర్వాత వాటిని డైరెక్ట్ గా తీసుకువెళ్లి గేట్ మీద ఆరేస్తాం" అనేసరికి అందరూ నవ్వేశారు. ఇంతలో స్కిట్ లో ఉన్న ఇంకో కమెడియన్ "అంటే ఎవరో చెప్పారు మన హోటల్ లో దోస తింటే బాగా డాన్స్ వస్తుందట" అన్నాడు. దానికి సుమా "అవును రా అంటూ దోశ, చట్నీ పెట్టింది సుమా. అది తిన్న వెంటనే అతను మైకేల్ జాక్సన్ స్టెప్పులేసి కింద పడిపోయాడు. దాంతో అందరూ నవ్వేశారు. ఐతే ఈ వారం ప్రతీ స్కిట్ లో కూడా పచ్చళ్ళు కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయ్యింది. ఇక ఈ షోకి రాగానే శోభా శెట్టి, ప్రియాంక జైన్ కలిసి కొబ్బరి మామిడిని ఇలా తినాలి అంటూ ఇద్దరూ ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. దానికి సుమ ఐతే ఈ మధ్య ఏ పనీ తిన్నగా చేయట్లేదా అని సెటైర్ వేసింది. ఇలా ఈ షో మొత్తం సెటైర్స్ కనిపిస్తూనే ఉన్నాయి.

సుధీర్ కు  ప్రపోజ్ చేసిన గీతూ...ఆ టైములో సూసైడ్ చేసుకోబోయా అన్న జ్యోతి

  రష్మీ సుధీర్ విడివిడిగా షోస్ చేస్తుండడంతో ఇక్కడ సుధీర్ ని పటాయించడానికి చాలామంది అమ్మాయిలు క్యూలు కడుతున్నారు. నెక్స్ట్ వీక్ ప్రసారం కాబోయే  ఫామిలీ స్టార్స్ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఇందులో సుధీర్ ని ఇద్దరు అమ్మాయిలు గులాబీలతో వెంటపడ్డారు. వాళ్ళే నటి జ్యోతి, గీతూ రాయల్. ఇద్దరూ కూడా ఎర్ర గులాబీలు తీసుకొచ్చి పోటీ పడి మరీ ఇవ్వడానికి ట్రై చేశారు. "చిన్నప్పటి నుంచి నీ మీద ఒక టైపాఫ్ క్రష్ ఉంది నీ మీద. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం." అంటూ తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేసాడు జ్యోతి.  "నీ కోసం నా ప్రాణాలు ఇచ్చేటంత ప్రేమ ఉంది నాకు. మనకు పెళ్ళైతే నువ్వు లేచే ముందే నీ కళ్ళ ముందర కాఫీ పెట్టి నీకు ఎం కావాలో అది వండి ఎత్తుకుని వచ్చి ఆఫీస్ లో ఇచ్చి రాత్రి పడుకునే ముందు నీ కాళ్ళు నొక్కుతా బావా" అని గీతూ అనేసరికి "తర్వాత తర్వాత" అన్నాడు సుధీర్...ఆ మాటకు గీతూ తెగ సిగ్గు పడిపోతూ గులాబీ పువ్వు ఇవ్వడానికి కూడా చేతులు వణుకుతున్నాయి" అంది. ఇక ఈ ఇద్దరితో సుధీర్ కోదాం డ్యూయెట్ డాన్స్ లు వేసి అలరించాడు. వీళ్లకు తగ్గట్టు అతిలోక సుందరి గెటప్ లో వచ్చిన పాగల్ పవిత్ర వచ్చి "మానవా ఏది నీ వామ హస్తము ఇమ్ము" అని అడిగింది కానీ తన చేతులను జేబుల్లో దాచేసుకుని ఇవ్వను అన్నాడు. ఇక నటి జ్యోతి గురించి సుధీర్ అడిగేసరికి తన లైఫ్ లో జరిగిన విషయం చెప్పింది. "ఒకానొక టైములో నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. నేను సూసైడ్ చేసుకోబోయా..." అన్న మాట చెప్పేసరికి అష్షు రెడ్డితో పాటు అందరూ షాకయ్యారు. ఇక అక్కడి వాళ్లంతా కూడా తమ బాధల్ని చెప్పుకొచ్చారు.  

మామిడి కాయ అంటే గుర్తొచ్చేది మా నెల్లూరు చేపల పులుసు

  సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి అంబటి అర్జున్, సుహాసిని, శోభా శెట్టి, ప్రియాంక జైన్ వచ్చారు. ఇక ఈ ప్రోమో మొత్తం జోక్స్ తో నిండిపోయింది. రాగానే అందరికీ కొబ్బరి మామిడి ముక్కలు ఇచ్చింది సుమ. ఆ తర్వాత  ఇందులో సుహాసినిని హైలైట్ చేస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను షేర్ చేసుకోమని అడిగింది సుమా. "నాకు మామిడి కాయ అంటే గుర్తొచ్చేది మా నెల్లూరు చేపల పులుసు..ఇది తగిలించి పులుసు వేసుకుని తింటే ఉంటాది నా సామి" అంది. దాంతో సుమ అంది చేపలు తిన్న తర్వాత వాటర్ తాగొద్దు ఎప్పుడూ అని అంది. అదేంటో అర్ధం కాక ఆశ్చర్యంగా ఫేస్ పెట్టింది సుహాసిని. "చేపలు పొట్టలోపలికి వెళ్లి గలుగులు చేస్తాయి" అంది. దాంతో నవ్వేసింది సుహాసిని. ఆ తర్వాత ఇంకో ప్రశ్న అడిగింది "చంటిగాడు సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నా కూడా హీరోయిన్ గా కంటిన్యూ అవకపోవడానికి కారణం ఏంటి" అని అడిగింది. "సక్సెస్ వచ్చింది. అది హ్యాపీ థింగ్. మరీ కాకపొతే ఆ ఏజ్ లో కాకుండా కొంచెం 20 స్ లో వచ్చి ఉండి ఉంటే బాగుండేది అని ఫీలింగ్ ఉంది" అంది సుహాసిని. "అయ్యో మీరు ఇప్పుడే 20 స్ లో ఉన్నట్టుగా ఉన్నారు" అని సుమా రివర్స్ కౌంటర్ వేసేసరికి సుహాసిని అది నిజమే అనుకోండి అనబోతున్నంతలో  "సరదాగా జోక్ చేసాను లెండి" అంటూ సుహాసిని పరువు మొత్తం తీసేసింది". తర్వాత సుమ ప్రియాంక చేత కాఫీ, టీ ఎలా అమ్మాలో చేసి చూపించాలంటూ" టాస్క్ ఇచ్చింది. లాస్ట్ లో సుహాసినికి కూరగాయలు అమ్మే టాస్క్ ఇచ్చింది. ఐతే సుహాసిని ముందు స్టైల్ గా కూరగాయలు అమ్మింది కానీ ఆ తర్వాత మాస్ మసాలా రేంజ్ లో కూరలు అమ్మేసరికి ఇది అసలు రూపం అంటూ అంబటి అర్జున్ సుహాసిని గురించి కామెంట్ చేసాడు. సుహాసిని చంటిగాడు, సుందరానికి తొందరెక్కువ లాంటి మూవీస్ లో నటించింది. ఇంకొన్ని మూవీస్ లో సహాయక పాత్రల్లో నటించింది.

రామ్ ప్రసాద్ పచ్చళ్ళ ట్రైనింగ్ సెంటర్...రాఘవ నిల్వ ఆవకాయలాంటోడు

  సోషల్ మీడియాలో కొన్ని రోజుల క్రితం వరకు పచ్చళ్ళ హడావిడి బాగా నడిచింది. ఎటు చూసిన పచ్చళ్ళు, బూతులు ఇవి తప్ప వేరే న్యూస్ లేదు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని తీసుకుని జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో రామ్ ప్రసాద్ టీమ్ ఈ పచ్చళ్ళు  పట్టే కార్యక్రమంతో పాటు ఏఏ ఆర్టిస్ట్ ఏ టైపాఫ్ పచ్చడో చెప్పుకొచ్చాడు. ఈ పచ్చళ్ళు ఆవకాయలు అన్నీ ఒకటేరా అన్నాడు రామ్ ప్రసాద్. ఇంతలో సన్నీ వచ్చి ఎలా అని అడిగేసరికి "భాస్కర్ గోంగూర పచ్చడిలా ఉంటారు. పులుపు కాదు బలుపు" అన్నాడు. "మరి రాఘవ ఏంటో" అన్నాడు సన్నీ. "నిల్వ ఆవకాయ ...జాడీలో పదేళ్ల అలాగే ఉండిపోయాడు లోపల..అది పాడవదు.. తియ్యలేము, పారేయలేము"  అన్నాడు రామ్ ప్రసాద్. దానికి జడ్జ్ శివాజీ ఐతే "అది ఊరతా  ఉంటది" అన్నాడు. "మరి మన గురించి చెప్పలేదేమిటి" అన్నాడు సన్నీ. "మనది ఉగాది పచ్చడిరా అన్నాడు రామ్ ప్రసాద్. తీపి, చేదు, వగరు, ఘాటు, పులుపు అన్నీ ఉంటాయి" అన్నాడు. దానికి శివాజీ మళ్ళీ కామెడీనే ఉండదు..అంటూ కౌంటర్ వేసాడు. ఇంతలో రష్మీ వచ్చి "పచ్చళ్ళు కావాలి" అన్నది. ఇంతలో రామ్ ప్రసాద్ "సర్ మేము పచ్చళ్ళు అమ్మడమే కాదు..పచ్చళ్ళు ఎలా చేయాలో కూడా నేర్పిస్తాం అన్నాడు". దానికి శివాజీ "ఓహ్ ట్రైనింగ్ సెంటర్ కూడానా ఇది..ఓ మై మాంగో" అన్నాడు. ఆ మాటలకు అందరూ నవ్వేశారు. "పచ్చడిని తినడమే కాదు నాకచ్చు కూడా " అన్నాడు రామ్ ప్రసాద్. ఇంతలో శాంతి స్వరూప్ పళ్లెంలో మామిడి ముక్కలు పట్టుకుని వచ్చాడు. వెనక దొరబాబు శాంతిని కైపుగా చూస్తూ పళ్లెంలో మామిడి ముక్కలు తింటూ ఉన్నాడు. రామ్ ప్రసాద్ వచ్చి "ఎం చేస్తున్నావు రా" అన్నాడు. చూడు అక్కడ ఎం రాసుందో అని రామ్ ప్రసాద్ కే చూపించాడు. "సరసమైన ధరలకే" అని రాసి ఉంది అన్నాడు. "అందుకే ముందు సరసం ఆడుతున్నా" అన్నాడు దొరబాబు. ఆ మాటలకు షాకైపోయాడు రామ్ ప్రసాద్.

Illu illalu pillalu : కొత్త కోడలి ఆలోచనకి ఇంప్రెస్ అయిన మామయ్య.. విశ్వని కొట్టిన రామరాజు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -138 లో...... శ్రీవల్లి మొదటిసారిగా అతింట్లో అడుగుపెట్టడానికి గుమ్మం ముందు నిల్చొని ఉంటారు. ఇక ఆడపడుచులు పేరు చెప్పి లోపలికి రండి అని ఆటపట్టిస్తారు. నర్మద, ప్రేమ మాత్రం తాము ఇలా  కాకుండా గొడవల్లో అత్తారింట్లో అడుగుపెట్టిన సిచువేషన్ గుర్తుచేసుకొని బాధపడతారు. చందు, శ్రీవల్లి తమ పేర్లు చెప్పి లోపలికి వస్తారు.‌ శ్రీవల్లి లోపలికి వెళ్లి దీపం పెడుతుంది. ముగ్గురు కోడళ్ళలో ఈ కోడలే సంప్రదాయంగా ఇంట్లో అడుగుపెట్టింది. మిగతా ఇద్దరు ఏదో హాస్టల్ కి వచ్చినట్లు వచ్చారని కామాక్షి అంటుంది. దాంతో ప్రేమ, నర్మద బాధపడుతుంది. ప్రేమ, నర్మద బాధపడుతుంటే వేదవతి వాళ్ళ దగ్గరికి వెళ్లి తీసుకొని వస్తుంది. ఆ తర్వాత విశ్వ చేసిన పనికి రామరాజు కోపంతో విశ్వ దగ్గరికి వెళ్లి బయటకు లాక్కొని వచ్చి కొడుతాడు. నా కొడుకు జీవితం అన్యాయం చెయ్యాలని చూస్తావా అని విశ్వని రామరాజు కొడుతుంటే ప్రేమ వచ్చి.. మావయ్య నా మొహం చూసి ఆగండి అని ఆపుతుంది.  ఆ తర్వాత అందరు భోజనం చెయ్యడానికి వస్తారు. అమూల్య వెళ్లి శ్రీవల్లిని తీసుకొని వస్తుంది. దాంతో శ్రీవల్లి వస్తుంది. ఇలా పైన కూర్చొని కాకుండా కింద కూర్చొని తింటే బాగుంటుందని శ్రీవల్లి అనగానే మంచి ఆలోచన అని రామరాజు సరే అంటాడు. అందరు కింద కూర్చొని భోజనం చేస్తారు. చందుకి శ్రీవల్లి తినిపిస్తుంది. దాంతో చందు సిగ్గుపడతాడు. తరువాయి భాగంలో ప్రేమ వాళ్ళ కుటుంబాన్ని శ్రీవల్లి తిడుతుంది. దాంతో ప్రేమ ఏడుస్తూ బయటకు వస్తుంది. తన వాళ్ళు తప్పు చేస్తే ప్రేమని ఎందుకు తిడుతున్నావని శ్రీవల్లితో నర్మద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : షూట్ చేసింది దీపే అని చెప్పేసిన దశరథ్.. సంతోషంలో జ్యోత్స్న, పారిజాతం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -337 లో..... దీప దగ్గరికి కార్తీక్ భోజనం తీసుకొని వస్తాడు. మీరు అక్కడ పెట్టేసి వెళ్లిపోండి.. ఎస్ఐ గారు వస్తారని కానిస్టేబుల్ అంటుంది. నా భార్యకి నేను భోజనం తినిపిస్తానని కార్తీక్ అంటాడు. మీ ఆవిడకి ఆకలిగా లేదట అని కానిస్టేబుల్ అంటుంది. కన్నకూతురు కడుపునిండా తింది.. అక్కడ హాస్పిటల్ లో మావయ్య స్పృహలోకి వచ్చాడు.. ఇప్పుడు ఆకలి అవుతుందని కార్తీక్ అంటాడు. దీప నీ కోసం నేనే స్వయంగా వంట చేసి తీసుకొని వచ్చానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత దీపకి కార్తీక్ భోజనం తినిపిస్తాడు. కాసేపటికి ఎస్ఐ వస్తాడు. అతన్ని లోపలికి ఎందుకు రానిచ్చావని కానిస్టేబుల్ ని ఎస్ఐ అడుగుతాడు. దశరథ్ గారు స్పృహలోకి వచ్చారు ఇక బయటకు వస్తాను అనుకుంటున్నావేమో కానీ ఇప్పుడు దశరథ్ గారు దీప షూట్ చేసిందని చెప్తే నీకు శిక్ష తప్పదు.. ఇక మీ అయన నీకు భోజనం తీసుకొని రావల్సిన అవసరం లేదు.. జైల్లో పెడుతారని ఎస్ఐ దీప, కార్తీక్ లతో అంటాడు. ఆ తర్వాత ఎస్ఐ హాస్పిటల్ కి వచ్చి దశరథ్ ని కలిసి.. మిమ్మల్ని షూట్ చేసింది ఎవరని అడుగుతాడు దశరత్ కాసేపు సైలెంట్ గా ఉంటాడు. దీప షూట్ చేసిందని చెప్పు.. ఆ దీప బయటకు రాకూడదని శివన్నారాయణ అంటాడు. దాంతో షూట్ చేసింది దీప అని దశరథ్ చెప్పి సంతకం పెడతాడు. దాంతో పారిజాతం, జ్యోత్స్న మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు నేనొక దగ్గరికి వెళ్ళాలని జ్యోత్స్న బయల్దేర్తుంది. కార్తీక్ బయటకు వెళ్తుంటే బయట శౌర్య బొమ్మతో మాట్లాడుతుంది. కార్తీక్ తన దగ్గరికి వచ్చి.. శౌర్యతో దీప మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ వినిపిస్తాడు. అది విని శౌర్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే జ్యోత్స్న వస్తుంది.  శౌర్యని కార్తీక్ లోపలికి పంపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రాజ్ కోసం రుద్రాణి కొత్త డ్రామా.. చిక్కుల్లో పడ్డ కావ్య!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -701 లో....రాజ్ ఇంటికి వచ్చి అపర్ణ గారితో కేక్ కట్ చేయించామని హ్యాపీగా ఫీల్ అవుతాడు. రాజ్ వెళ్ళిపోయాక.. ఏంటి అల్లుడు గారు అపర్ణ అంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు.. అసలు అపర్ణ ఎవరు అని యామినిని తన తల్లి వైదేహి అడుగుతుంది. రాజ్ కన్నతల్లి అపర్ణ.. ఎదో ఒక రకంగా ఆ కావ్య రాజ్ ని కలుస్తుందని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఎంతైనా కన్నతల్లి కదా అని యామిని వాళ్ళ నాన్న అంటుంటే.. నువ్వు మళ్ళీ వాళ్ళకి ఫేవర్ గా మాట్లాడకని యామిని కోప్పడుతుంది. కావ్యలాగే ఇప్పుడు అపర్ణ వదిన కూడా తయారయ్యిందని రుద్రాణి అంటుంది. ఇప్పుడు ఏమైంది అపర్ణ వదిన బాగుంది కదా అని ప్రకాష్ అంటాడు. అప్పుడే అపర్ణ, కావ్య గుడి నుండీ ఇంటికి వస్తారు. అపర్ణ సంతోషంతో అందరికి ప్రసాదం ఇస్తుంది. తను హ్యాపీగా ఉండడం చూసి అందరు ఆశ్చర్యపోతారు. నా కొడుకు మళ్ళీ తిరిగి వస్తాడని ఇప్పుడు నాకు నమ్మకం కలిగిందని అపర్ణ చెప్తుంది. మీ అత్తయ్య చెప్పేది నిజమా రాజ్ ఉన్నాడా అని సుభాష్ అనగానే.. అన్నింటికి సమాధానం దొరుకుతుంది.. కొన్ని రోజులు వెయిట్ చెయ్యండి అని కావ్య చెప్పి వెళ్ళిపోతుంది. మరొకవైపు రాజ్, కావ్య అడ్రెస్ తెలుసుకోవడానికి తను పంపిన కొరియర్ పై చూస్తాడు. అందులో ఫ్రమ్ అడ్రెస్స్ ఉండదు. దాంతో కొరియర్ వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతాడు. అది ఒక పోలీస్ స్టేషన్ నుండి వచ్చిందని వాళ్ళు రాజ్ కి చెప్తారు. ఎలాగైనా కనుక్కోవాలని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి కావ్య వచ్చి భోజనం చెయ్యడానికి తీసుకొని వెళ్తుంది. అందరు భోజనం చెయ్యడానికి వెళ్తుంటే రుద్రాణి ఆపుతుంది. అప్పుడే కొంతమంది వస్తారు. రాజ్ లేడని మనం ఎంత బాధపడుతున్నామో వాళ్ళు కూడా బాధపడుతున్నారని రుద్రాణి అంటుంది. అపర్ణ ఏమైనా అంటుందేమోనని అపర్ణని కావ్య ఆపుతుంది. తరువాయి భాగంలో మా బిల్స్ క్లియర్ చెయ్యాలని ఇద్దరు కావ్య కోసం ఇంటికి వస్తారు. మీ బిల్స్ క్లియర్ చెయ్యాలంటే రాజ్ సంతకం కావాలి. లేకపోతే ఈ డెత్ సర్టిఫికెట్ పై కావ్య సంతకం చేయాలి లేదా రాజ్ రావాలని కావ్యని ఇరకాటంలోకి పడేస్తుంది రుద్రాణి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అషు రెడ్డికి బ్రెయిన్ సర్జరీ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో!

  బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. టీవీ షోలు, సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అలాంటి అషు రెడ్డి తాజాగా షేర్ చేసిన వీడియో కంటతడి పెట్టించేలా ఉంది. (Ashu Reddy)   కొద్ది నెలల క్రితం అషు రెడ్డికి బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని ఆ మధ్య ఒక షోలో స్వయంగా ఆమెనే చెప్పింది. ఆ సమయంలో తన కెరీర్ క్లోజ్ అయింది అనుకున్నానని చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది. అయితే ఈ సర్జరీ గురించి తర్వాత అషు పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన బ్రెయిన్ సర్జరీకి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో అషు రెడ్డి జుట్టు తొలగించి సర్జరీ చేయడం, ఆ సమయంలో ఆమె బాగా ఎమోషనల్ అవ్వడం, అలాంటి సిచువేషన్ నుంచి అషు కమ్ బ్యాక్ ఇవ్వడం చూడవచ్చు. ఈ వీడియో ఎంతో ఎమోషనల్ గా ఉంది.    

డిస్కవరీ ఛానల్ లో తప్ప అన్ని ఛానెల్స్ లో హోస్ట్ చేసింది సుమ... 

  చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే షో ఫైనల్ కి వచ్చేసింది. గ్రాండ్ ఫినాలేకి మూడు జోడీలు వెళ్లాయి. ఆ మూడు జోడీలు ఎవరంటే అమర్ దీప్ - అంబటి అర్జున్, యాదమ్మ రాజు - సుప్రీతా, ప్రష్షు - ధరణి. ఇక గ్రాండ్ ఫినాలేలో ఈ మూడు జోడీలకు టాస్కులు గట్టిగానే ఇచ్చారు. 7 ఐటమ్స్ చేయాలి అంటూ చెప్పింది. సమీరా భరద్వాజ్ - దీపికా అలాగే ప్రసాద్ - విరాజిత ఎలిమినేట్ అయ్యారు. ఇక దీపికా ఐతే "నాకు కప్పు ఇవ్వని వాళ్ళను చంపుతా" అంటూ సుమని బెదిరించింది. ఇక ఈ ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ గా యాంకర్ రవి రావడంతో  ఎంటర్టైన్మెంట్ ఇంకొంచెం పెరిగింది. ఈ షో గురించి చెప్పడానికి వచ్చాను అంటూ పాకెట్ లోంచి కళ్ళజోడు పెట్టుకున్నాడు. దాంతో సుమ "ఏంటి కళ్ళజోడు స్టేజికి వచ్చేసావా " అని రవి పరువు తీసేసింది సుమ. "ఎన్నో ఏళ్లుగా డిస్కవరీ ఛానల్ లో తప్పా ఏ ఛానెల్ పెట్టినా కనిపిస్తూ అలరిస్తున్నారు మన సుమ గారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆగకుండా మాట్లాడిన సుమకి మాటలు రాకుండా చేసిన ఘనత మన కంటెస్టెంట్స్ దే...అల్లాడిపోతున్నాడమ్మా అంటూ వచ్చి దీపికా ధాటికి తానే అల్లాడిపోయింది సమీరా..ఇక దీపికా గురించి చెప్పాలి అంటే ఒక వైపు స్టవ్ కి మరో వైపు మనుషులకు ఒకేసారి మండేలా చేస్తుంది ఈ దీపికా..బొగ్గులతో ఎంట్రీ ఇచ్చినప్పుడే అర్ధం చేసుకోవాల్సింది...అంతా బొగ్గే అని ..అమ్మాయి కలకండ..వీడు కలరా ఉండా..." అంటూ సమీరా - దీపికా, ప్రసాద్ - విరాజిత, యాదమ్మ రాజు - సుప్రీతా గురించి చెప్పాడు రవి. "ఇది వంట షో కదా వంట చేయొచ్చు అని ఒప్పుకున్నావా లేదంటే సుప్రీతా పక్కన కాసేపు నిల్చోవచ్చనా" అని అడిగాడు రవి. "నిజం చెప్పాలంటే సుప్రీతా ఉందనే ఒప్పుకున్నా..." అని యాదమ్మ రాజు తన ప్రేమను చెప్పేసరికి సుప్రీతా ఒక్క క్షణం అలా ఏమీ మాట్లాడకుండా  "స్టెల్లా చూస్తున్నావు కదా" అంది. వెంటనే సుమా లైన్ లోకి "ఏంటి సుప్రీతా నీకు యాదమ్మ రాజుకు మధ్య కెమిస్ట్రీ ఉందనే ఫీలవుతున్నావా" అని అడిగింది. వెంటనే సుప్రీతా "ఛి ఛి" అనేసింది. దాంతో రాజు మరీ అంత చెండాలంగా ఉన్నానా అన్నట్టుగా ఫేస్ పెట్టాడు. ఆ తర్వాత జడ్జెస్ సుమ - జీవన్ కలిసి వంటల రుచి చూసి విన్నర్ ని అనౌన్స్ చేశారు. మరి విన్నర్ ఎవరు అనేది నెక్స్ట్ వీక్ తెలుస్తుంది. ఇక ఈ ప్రోమో లాస్ట్ అన్నీ జోడీస్ కలిసి భోజనం చేసి ఎంజాయ్ చేశారు.

జడ్జిలు బాడీ షేమింగ్.. ఎక్స్ పోజింగ్ చేయాలని ఒత్తిడి.. వివాదంలో 'పాడుతా తీయగా' షో!

  ఈటీవీలో ప్రసారమయ్యే 'పాడుతా తీయగా' షోకి ఎంతటి పేరుందో తెలిసిందే. లెజెండరీ సింగర్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నడిచిన ఈ పాటల ప్రోగ్రామ్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువైంది. ఎందరో సింగర్స్ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. బాలసుబ్రహ్మణ్యం మరణం తర్వాత ఆయన కుమారుడు ఎస్.పి. చరణ్ ఈ షోహోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ సిరీస్ జరుగుతుండగా.. ఎం.ఎం. కీరవాణి, చంద్రబోస్, సునీత జడ్జిపైగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ జడ్జిలపై తాజాగా సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. (Padutha Theeyaga)   సూపర్ సింగర్ సహా పలు షోలలో విజేతగా నిలిచిన ప్రవస్తి.. 'పాడుతా తీయగా' సిల్వర్ జూబ్లీ సిరీస్ లో పార్టిసిపేట్ చేసింది. అయితే ఆమె అనూహ్యంగా చాలా త్వరగానే ఈ షో నుంచి ఎలిమినేట్ అయింది. దీంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎలిమినేషన్ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రవస్తి.. షోపైనా, జడ్జిలపైనా సంచలన ఆరోపణలు చేసింది.   "పాడుతా తీయగా కి వెళ్లాలనుకునే సింగర్స్‌కి నా సలహా ఒక్కటే. ఏమైనా రికమండేషన్స్ లేదా జడ్జిల నుంచి రిఫరెన్స్‌లు ఉంటే మాత్రమే వెళ్ళండి. అవి లేకుండా వెళ్తే మీకు అన్యాయం, మానసిక వేధింపులు మాత్రమే ఎదురవుతాయి." అని ప్రవస్తి ఆరోపించింది. "జడ్జిలు నన్ను చీడపురుగుల్లాగా చూసేవారు. నా బాడీ మీద జోకులు వేసేవారు. ఇవన్నీ నాకు వారి దగ్గర్లో కూర్చున్న ఆడియన్స్ ద్వారా తెలిశాయి. ఇంత పేరున్న జడ్జెస్ నుంచి నేను ఇలాంటివి అసలు ఊహించలేదు. షో మేనేజ్మెంట్ కూడా కంటెస్టెంట్స్ డ్రెస్సింగ్ ఎక్స్ పోజింగ్ చేసేలా ఉండాలి అన్నట్టుగా మాట్లాడేవారు. నాభి కనిపించేలా చీర కట్టాలి అనేలా వారి మాటలు అనేది. ఒక షోలో నాకు ఇలాంటి అనుభవాలు ఎదురుకావడం ఇదే మొదటిసారి" అని ప్రవస్తి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన ఆరోపణలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.  

ఫైబ్రాయిడ్స్ సమస్యని ఎదుర్కొన్నా యాంకర్ రష్మీ

  రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే తన  ఆరోగ్య పరిస్థితి చాలా దిగజారడంతో ఆమె ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఇక హాస్పిటల్ లో చేరాక అక్కడ వేసుకునే గౌన్ తోనే ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఆమె ఫాన్స్ అంతా కూడా చాలా బాధపడ్డారు. ఏమయ్యింది అంటూ మెసేజెస్ పెడుతుండేసరికి  తన ఆవేదన మొత్తాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసుకుంది. జనవరి నుంచి తన హెల్త్ ఏమీ బాగోడం లేదని  విపరీతమైన రక్త స్రావంతో బాధపడుతున్నానని చెప్పింది. ఒళ్ళు నొప్పులు పెరగడంతో పాటు ఆమె హిమోగ్లోబిన్ శాతం 9 కి పడిపోయిందని చెప్పింది. సమస్య ఏంటి అనేది తనకు అర్థంకాక ముందు ఏ డాక్టర్ కి  చూపించుకోవాలో తెలీలేదని అంది రష్మీ. మార్చ్ 29 వరకు ఎలాగోలా మేనేజ్ చేసిందట కానీ ఆ తర్వాత అస్సలు తన వాళ్ళ కాలేదని చెప్పింది. అప్పటికీ ఇచ్చిన కమిట్మెంట్స్ ని ఎలాగో పూర్తి చేసి ఏప్రిల్ 18 న హాస్పిటల్ లో చేరినట్లు చెప్పింది. ఐతే ఇప్పుడు ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది రష్మీ.. ఐతే ఇంకా రెండు మూడు వారాలు రెస్ట్ మూడ్ లో రెస్ట్ లో ఉండాలి అని చెప్పింది. ఐతే ఆపరేషన్ థియేటర్ కి వెళ్లే ముందు, వెళ్లి వచ్చాక కూడా పిక్స్ తీసి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఐతే ఫైబ్రాయిడ్స్ ఉండడం వలన ఈ సమస్య ఎదుర్కొన్నానని ఐతే ఇప్పుడు వాటిని సక్సెస్ ఫుల్ గా డాక్టర్స్ తొలగించారని తన మెసేజ్ లో రాసుకొచ్చింది. ఐతే చాలామంది కూడా ఆమెకు మెసేజెస్ చేస్తున్నారు. నటి లైలా, టేస్టీ తేజ, ఖుష్బూ, జబర్దస్త్ తన్మయి, నైనికా, అశ్విని వంటి వాళ్లంతా గెట్ వెల్ సూన్,  హ్యాపీ అండ్ స్పీడీ రికవరీ అంటున్నారు.