లండన్ బ్రిడ్జ్ ముందు లవర్ ముద్దులిస్తేనా.. మానస్ అంటే ఇష్టం!

  దీపికా ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే నవ్వులు అని ఊరికే అనరు. బుల్లితెర మీద దీపికా తన మాటలతో, నవ్వుతో, జోష్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతోంది. డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో ప్రీ ఫైనల్ లోకి అడుగుపెట్టగా, చెఫ్ మంత్ర సీజన్ 2 లో మాత్రం ఓడిపోయింది. ఇక ఇప్పుడు కాకమ్మ కథలు సీజన్ 2 లో ఫస్ట్ ఎపిసోడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఎపిసోడ్ చెఫ్ సంజయ్ తుమ్మతో పాటు దీపికా కూడా వచ్చింది. ఐతే ఇందులో హోస్ట్ తేజస్విని మడివాడ ఒక ఇంటరెస్టింగ్ రౌండ్ లో అడిగిన వాటికి దీపికా చెప్పిన ఆన్సర్ మాములుగా లేదు.    ఈ షోలో "మినిమం డిగ్రీ ఉండాలి" అనే రౌండ్ ని పెట్టారు. అందులో ఒక ఐదు పదాలు ఇచ్చి వాటితో ఒక వాక్యం చేయాలి అని చెప్పింది. దీపికాకి ఇచ్చిన పదాలు ఏంటి అంటే "లవర్, లండన్, ముద్దు, ఫుడ్డు, బెడ్డు" అని చెప్పి వాటితో ఒక వాక్యం చెప్పమంది. అప్పుడు దీపికా "నా 6th లవర్ తో లండన్ బ్రిడ్జ్ ముందు అందరూ చూస్తుండగానే అసలు సిగ్గు లేకుండా అన్నీ మర్చిపోయి నాకు ముద్దులిస్తే నాకు ఫుడ్ కూడా అవసరం లేదు...ఐతే లండన్ బ్రిడ్జ్ ముందు నిలుచుని నిలుచుని అలిసిపోతాను కాబట్టి బెడ్డు అవసరం నిద్రపోవడానికి" అని చాల సింపుల్ గా చెప్పేసరికి తేజస్వి వ్వాహ్ అంటూ మెచ్చేసుకుంది.    ఇప్పుడు చేస్తున్న బ్రహ్మముడి సీరియల్ లో మానస్ రోల్ కి సెట్ అయ్యే ఇంకో పర్సన్ ఎవరు అనేసరికి అమర్ దీప్ అని చెప్పింది. తన ఇష్టమైన కో- ఆర్టిస్ట్ మానస్ అంది. ఒకవేళ ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే న్యూస్ రీడర్ ని అయ్యేదాన్ని అని చెప్పింది. అలాగే తనకు తినడం ఇష్టమట, ఇంకా సీరియల్స్ చూడడం ఇష్టమట.. ఇలా దీపికా చాలా విషయాలు చెప్పింది.  

Illu illalu pillalu : భాగ్యం ప్లాన్ ని శ్రీవల్లి అమలుచేసేనా.. వేదవతితో సహా అందరు షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-143 లో... చందు, శ్రీవల్లీలకి శోభనం జరిపించాలని రామరాజుకి వేదవతి చెప్తుంది. అలాగే ఏర్పాటు చేయించు, మన పెద్దోడికి మంచి భార్య దొరికిందని రామరాజు ఎమోషనల్ అవుతాడు. పనిలో పని నర్మద, సాగర్ లకి కూడ శోభనం ఏర్పాట్లు చేద్దామని వేదవతి అడుగగా.. సరేనని రామరాజు అంటాడు. వేదవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది.   ఆ తర్వాత తిరుపతి, ధీరజ్ ఇద్దరు శోభనం ఏర్పాట్లు చేస్తుంటారు. గదిని డెకరేషన్ చేస్తారు. ఒకవైపు చందు, సాగర్ రెడీ అవుతారు. ఇన్ని రోజులు మీరెందుకు దూరం గా ఉన్నారని సాగర్ ని చందు అడుగుతాడు. మేం నీకంటే ముందు పెళ్లి చేసుకొని తప్పు చేసాం.. ఇక పిల్లల్ని కంటే ఇంకా తప్పవుతుంది. అందుకే నీకు పెళ్లి అయ్యేవరకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామని సాగర్ అంటాడు. కామాక్షి, అమూల్య ఇద్దరు శ్రీవల్లి నర్మదలని రెడీ చేస్తారు. శ్రీవల్లి కంటే నర్మద బాగుందని కామాక్షి అంటుంది. దాంతో శ్రీవల్లి బాధపడుతూ వెళ్లి భాగ్యంకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. అయిన వాళ్ళకి ఇప్పుడు శోభనం ఏంటి ఆపేయ్ వాళ్ళ కంటే ముందు నువ్వు పిల్లలని కను అని ఏదో భాగ్యం ప్లాన్ చెప్తుంది. దానికి శ్రీవల్లి సరే అంటుంది.   ఆ తర్వాత రామరాజు, వేదవతి దగ్గరికి శ్రీవల్లి వచ్చి.. మా శోభనం కాన్సిల్ చెయ్యండి సాగర్, నర్మదలకి జరిపించండి అని శ్రీవల్లి అంటుంది. ఎందుకు అలా అంటున్నవ్ అని వేదవతి అడుగుతుంది. ఒకే ఇంట్లో రెండు జంటలకి శోభనం ఒకే రోజు జరగొద్దు అంట అని శ్రీవల్లి అంటుంది. దాంతో అందరు ఆశ్చర్యంగా చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2: దీప ఎప్పటికీ రాదు.. ఏడ్చేసిన శౌర్య!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -342 లో.. పూజ కోసం కాంచన ఏర్పాట్లు చేస్తుంటే.. కార్తీక్ వస్తాడు. కార్తీక్ షర్ట్ పై బ్లడ్ చూసి ఏంటి నాన్న అది అని శౌర్య అడుగుతుంది. దారిలో చిన్న ఆక్సిడెంట్ అని కార్తీక్ చెప్తాడు. మరి ఆ బ్యాండేజ్ ఏంటని శౌర్య అడుగుతుంది. బ్లడ్ ఇచ్చానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత కార్తీక్ ఫ్రెషప్ అయి వచ్చాక దీప జైల్లో నుండి బయటకు రావాలని అందరు నేలపైన భోజనం చేస్తారు.   మరొకపక్క దీపకి కానిస్టేబుల్ భోజనం తీసుకొని వస్తుంది. దీప భోజనం చేస్తూ తన కూతురితో గడిపిన క్షణాన్ని గుర్తు చేసుకొని బాధపడుతుంది. ఆ తర్వాత శ్రీధర్ ఎప్పటిలాగే కావేరితో గొడవ పడుతుంటాడు. కార్తీక్, కాంచన మాట్లాడుకుంటారు. లాయర్ తో మాట్లాడు మన దగ్గరున్న సాక్ష్యాలు దీపని బయటకు తీసుకొని రాలేవని కార్తీక్ తో కాంచన అంటుంది. నిజం చెప్పావ్ అత్త అని జ్యోత్స్న వస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావని జ్యోత్స్నని కార్తీక్ కోప్పడతాడు. మా డాడ్ బాగయి ఇంటికి వచ్చాడు. కానీ నీ కోడలు ఇంటికి రాదని జ్యోత్స్న చెప్తుంది. నువ్వు ఇక్కడ ఏం మాట్లాడుతున్నావ్ శౌర్య వింటుందని జ్యోత్స్నని బయటకు తీసుకొని వెళ్లి మాట్లాడతాడు కార్తీక్.    దీప ఎప్పటికి బయటకు రాదని మళ్ళీ జ్యోత్స్న అంటుంది. ఆ మాట బయట ఆడుకుంటున్న శౌర్య వింటుంది. కార్తీక్ లోపలికి వెళ్ళాక జ్యోత్స్న వెళ్తుంటే.. శౌర్య వచ్చి మా అమ్మ ఎక్కడుంది ఎందుకు రాదని అంటున్నావని అడుగుతుంది. మీ అమ్మ ఎప్పటికి రాదు అంటూ జ్యోత్స్న అంటుంటే శౌర్య ఏడుస్తుంది. కాసేపటికి జ్యోత్స్న అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : భార్యకి సర్ ప్రైజ్ ఇచ్చిన భర్త.. రాజ్ ని సుభాష్ చూస్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -706 లో..... రాజ్ తన తెలివితో కావ్య అడ్రెస్ కనుక్కున్నానని కావ్యకి ఫోన్ చేసి చెప్తాడు. కానీ రాజ్ కనుక్కుంది ఏదో అడ్రెస్.. అది విని కావ్య నవ్వుకుంటుంది. నేను మీ ఇంటికి వచ్చి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నానని రాజ్ అనగానే పాపం ఆయన వెళ్లే ఇంట్లో కుక్కలు అయితే ఉండకూడదని కావ్య అనుకుంటుంది.    ఆ తర్వాత యామిని పేరెంట్స్ యామినితో పెళ్లి గురించి డిస్కషన్ చేస్తారు. నాకు రాజ్ తో పెళ్లి అయితే చాలు.. ఎలా అనేది నాకు అవసరం లేదు కానీ మీ హ్యాపీ నెస్ కోసం మీరు నచ్చినట్టు చేయండి అని యామిని అంటుంది. రాజ్ మనసు లో ఏముందోనని యామిని వాళ్ళ నాన్న అంటాడు. ఇంకొకసారి రాజ్ అనకు రామ్ అను అని యామిని కోప్పడుతుంది. వాళ్ళ అమ్మని రాజ్ కలుస్తున్నాడు.. రాజ్ చుట్టూ కావ్య తిరుగుతుందని యామిని వాళ్ళ నాన్న అంటాడు.    మరోవైపు కావ్యకి సర్ ప్రైజ్ ఇవ్వాలని తను కనిపెట్టిన అడ్రెస్ కి రాజ్ బయలుదేర్తాడు. ఆ తర్వాత అపర్ణ ఇంట్లో అందరిని పిలిచి క్యారమ్స్ ఆడుతుంది. ఏంటి ఈవిడకి రోజురోజుకి పిచ్చి లేచినట్లు చేస్తుందని రాహుల్, రుద్రాణి అనుకుంటారు. రాహుల్ రుద్రాణి అక్కడినుండి వెళ్లిపోతుంటే.. రండి అని అపర్ణ పిలుస్తుంది. ఆ తర్వాత కావ్య క్యారమ్స్ ఆడేవాళ్లందరికి జ్యూస్ తీసుకొని వస్తుంది. రాజ్ అనుకోకుండా ఏదో గుర్తువచ్చినట్లు వాళ్ళ ఇంటిముందే ఆగి. నేను ఇక్కడ ఆగానేంటి ఇదేనా ఆ కళావతి ఇల్లు అని రాజ్ అనుకొని లోపలికి వస్తుంటే.. రాజ్ ని చూసి కావ్య షాక్ అవుతుంది. అపర్ణకి  కావ్య చెప్తుంది. దాంతో ధాన్యలక్ష్మి, ఇందిరాదేవిలని లోపలికి తీసుకొని వెళ్తుంది అపర్ణ. రాహుల్, రుద్రాణి ని అప్పు లోపలికి తీసుకొని వెళ్లి డైవర్ట్ చేస్తుంది. రాజ్ లోపలికి వచ్చి కావ్యతో మాట్లాడతాడు.    తరువాయి భాగంలో కావ్యకి రాజ్ సర్ ప్రైజ్ కి చీర తీసుకొని వస్తాడు. కాసేపటికి ఎవరు చూడకుముందు రాజ్ ని పంపిస్తుంది కావ్య. అప్పుడే రాజ్ కి సుభాష్ ఎదరుపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

పట్నం వచ్చిన పతివ్రత గెటప్ ఏంటి..

  సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి జానకిరామయ్య గారి మనవరాలు వెర్సెస్ పడమటి సంధ్యారాగం సీరియల్స్ పోటీ పడుతున్నాయి. ఇక ఇందులో జ్యోతక్క కూడా వచ్చింది. అప్పుడు  ఒక సీరియల్ యాక్టర్ ని పిలిచిన హోస్ట్ అంబటి అర్జున్ "పక్కా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు చెప్పు" అనేసరికి అతను శివజ్యోతి గారు అన్నాడు. "పక్కా ఊరోళ్ళే అంటారు" అన్నాడు అర్జున్. "డౌటా" అని కసిరింది జ్యోతక్క. "మరి ఇదేంటండి" అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వెస్ట్రన్ స్టైల్ లో రెడీ అయ్యి ఫొటోస్ దిగిన జ్యోతక్క పిక్స్ వేసి చూపించాడు. దాంతో జ్యోతక్క షాకయ్యింది. "మరి పట్నం వచ్చిన పతివ్రత గెటప్ ఏటి" అని అడిగాడు. అష్షు రెడ్డి ఆ పిక్స్ చూసి అమ్మబాబోయ్ అనుకుంది. ఆ తర్వాత ఆ పిక్స్ చూసి ఆమె కూడా నవ్వుకుంది. ఆ తరువాత "మా టీమ్ తో పోటీ అంటే పోచమ్మ గుడి ముందు పొటెల్ని కట్టేసినట్టే" అంది శివజ్యోతి. తర్వాత ఈ రెండు సీరియల్స్ వాళ్లకు టాస్కులు ఇచ్చారు. ముంజల్ని ఇచ్చి కాయలు కొట్టుకుని వాళ్ళే అన్నీ ఫినిష్ చేసేటట్టు. తర్వాత బిందెలతో బాల్స్ తెచ్చి ఒక బాక్స్ లో వేయడం ఇలా. ఐతే రెండు గ్రూప్స్ రూల్స్ ని అతిక్రమించాయి  అంటూ అర్జున్ చెప్పాడు. దాన్ని కూడా చూపించాడు. ఇక సీరియల్ నటులైతే ఇవన్నీ తెలిసినప్పుడు ముందే ఆపేయాలి ఇప్పుడు చెప్పడం ఏమిటి అంటూ అడిగారు. బాల్స్ లైన్స్ టచ్ చేసారు అంటూ రెండు సీరియల్స్ వాళ్ళు అరుచుకుంటుండేసరికి అంబటి అర్జున్ కూడా ఇంకా గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు అందరూ షాకైపోయారు. ఆ తర్వాత ఈ గేమ్ డ్రా అయ్యిందని చెప్పేసరికి జానకిరామయ్య గారి మనవరాలు టీమ్  వాళ్ళు  షో నుంచి వాకౌట్ చేస్తాం అంటూ బెదిరిస్తూ మైక్ కూడా కింద పారేసి వెళ్లిపోయారు.

హుక్ స్టెప్ ఆయనతోనే స్టార్ట్ అయ్యింది...అల్లు అర్జున్ సర్ బ్రేక్ ఇచ్చారు...

  శేఖర్ మాష్టర్ అంటే టాలీవుడ్ లో తెలియని వాళ్ళు లేరు. ఈయన ఎన్నో సాంగ్స్ కి కొరియోగ్రాఫ్ చేశారు. అవి సూపర్ డూపర్ హిట్ కూడా అయ్యాయి. శేఖర్ మాష్టర్ సాంగ్ అంటే అందులో ఒక హుక్ స్టెప్ ఉంటుంది. ఆయనకు ఎన్ని మంచి కామెంట్స్ వచ్చాయో అన్నే నెగటివ్ ట్రోలింగ్స్ కూడా వచ్చాయి. అలాగే తన లైఫ్ లో బ్రేక్ ఇచ్చిన సాంగ్ ఎదో కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. "ఇండస్ట్రీలోకి ఎంటర్ ఐన కొత్తల్లో సుధీర్ బాబు నటించిన ఎస్.ఎం.ఎస్ మూవీకి కొరియోగ్రాఫ్ చేసాను. ఆ మూవీ ద్వారా నన్ను నేను ప్రూవ్ చేసుకున్నా. ఐతే అప్పటికే హైదరాబాద్ వచ్చి చాలా టైం స్పెండ్ చేశా. మా ముందు బాచ్ వాళ్లకు అవకాశాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద ఆఫర్స్ వస్తున్నాయి..నాకు మాత్రం బ్రేక్ దొరకడం లేదు. ఎంత కష్టపడుతున్నా ఉపయోగం ఉండడం లేదు వెళ్ళిపోదాం అనుకున్న టైములో బన్నీ గారు ఫోన్ చేశారు. నేను సాంగ్ ఇస్తాను నాకు మా డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి నచ్చితే ఓకే చేస్తాం అన్నారు. నాకు అదే మహాప్రసాదం అనుకుని వెళ్లాను ఆ సాంగ్ ఓకే అయ్యింది. అదే జులాయి మూవీలో సాంగ్ "లాయి లాయి ..మేహూ జులాయి" సాంగ్ కి కొరియోగ్రాఫ్ చేసాను. అదే టైములో తారక్ సర్ ది బాద్షా మూవీ ఆఫర్ కూడా వచ్చింది. అది "సైరో" సాంగ్. అలా జులాయి సాంగ్ తో బ్రేక్ వచ్చింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. నేను ఏ పాట చేసినా రెండు, మూడు ఒప్షన్స్ ని నా హీరోస్ కి డైరెక్టర్స్ కి చూపిస్తాను. వాళ్ళ బాడీ మ్యానరిజానికి తగ్గట్టు చేస్తాను. అందరూ ఓకే అంటేనే చేస్తాను. కొంతమంది మాత్రం నెగటివ్ గా కావాలనే ట్రోల్ చేస్తూ ఉంటారు. నేను ఏ సాంగ్ చేసినా హుక్ స్టెప్, సిగ్నేచర్ స్టెప్ ఉండాలని అనుకుంటా. ప్రతీ సాంగ్ లో క్యాచీగా ఉండే ఒక హుక్ స్టెప్ అందరూ ఈజీగా చేసేదిగా ఒకటి కంపోజ్ చేస్తాను. లక్కీగా అందరూ అది ఫాలో అవుతూ ఉంటారు. సాంగ్ కి ఎం కావాలి, హీరో హీరోయిన్ బాడీ ఏ సాంగ్ కి సెట్ అవుతుందో చూసుకుని అది కంపోజ్ చేస్తాను. ఒక్కో సారి అప్పటికప్పుడు కూడా సాంగ్స్ కంపోజ్ చేయాల్సి వస్తుంది. అలా చేసిన సాంగ్స్ కూడా హిట్ అయ్యాయి." అని చెప్పారు.  

నాగార్జున సర్ తో డేట్ కి వెళ్లాలని ఉంది..

  ఇండస్ట్రీలో అవకాశం వస్తే ఏ హీరోతో డేట్ కి వెళ్తారు అన్న ప్రశ్నకు ప్రియాంక జైన్ చెప్పిన ఆన్సర్ వింటే నిజంగా షాక్ అవుతారు. ప్రియాంక జైన్ తో జరిగిన చిట్ చాట్ లో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది. "శివ్ తో నా పరిచయం మౌనరాగం సీరియల్ తో స్టార్ట్ అయ్యింది. లైఫ్ లాంగ్ మా ప్రయాణం కంటిన్యూ అవుతుంది అని అవ్వాలని ప్రే చేస్తున్నాను. వెబ్ సిరీస్, షోస్, సీరియల్స్ వీటిల్లో ఒకటి చేయడం మానేయమంటే ఏదీ మానేయలేను. బతకడం మానేయండి అంటే ఎలా...నేను ఏదీ మానేయలేను. వర్క్ ఈజ్ మై వర్షిప్. సీరియల్స్ నన్ను టాప్ లో నిలబెట్టాయి. సినిమా హీరోయిన్ అవ్వాలనే వచ్చాను కానీ ఇప్పటికే అందరి గుండెల్లోనూ ఉన్నాను కాబట్టి ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటున్నా. ఫేవరేట్ వెకేషన్ అంటే పారిస్. మా అమ్మ బర్త్ డే నాకు స్పెషల్ డే. శివ్ ని చూస్తే ఆటోమేటిక్ గా నా ఫేస్ లో స్మైల్ వస్తుంది. నాకు నాగార్జున సర్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఈ విషయాన్నీ చెప్తూనే ఉంటాను. నాకే ఒకవేళ అవకాశం వస్తే నేను ఆయనతో కలిసి డిన్నర్ డేట్ కి వెళ్తాను. టాలీవుడ్, పప్పన్నం, ఇంట్లో ఉండడం అంటే ఇష్టం. ఇక ఎక్కువగా లవ్ స్టోరీస్ చూస్తాను. రెగ్యులర్ గా ట్రెడిషనల్ వేర్ ని ప్రిఫర్ చేస్తాను. అప్పుడప్పుడు వెస్ట్రన్ వేర్ వేస్తాను. లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అంటే బైక్స్ మీద వెళ్లడం ఇష్టం. కార్ లో సఫోకేషన్ గా ఉంటుంది. అలాగే ఏసీ కూడా పడదు. నా పార్టనర్ లో నాకు నచ్చేది డీసెన్సీ, ఇన్నోసెన్స్. నా పార్టనర్ కి తెలియకుండా డబ్బులు దాచి పెడుతూ ఉంటాను..ఇప్పటివరకు ఆయనకు ఈ విషయం తెలీదు. నిజం చెప్పాలి అంటే నన్ను శివ్ తప్ప ఎవరూ భరించలేరు." అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. ప్రియాంక రీసెంట్ గా డాన్స్ ఐకాన్ సీజన్ 2 కి మెంటార్ గా వెళ్ళింది ..అలాగే అన్ని షోస్ లో కూడా కనిపిస్తూనే ఉంది.

Illu illalu pillalu:  భాగ్యంపై భద్రవతికి డౌట్.. కొత్త కోడలు చక్రం తిప్పనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-142లో.. ధీరజ్, ప్రేమలు తమ గదిని ఖాళీ చేస్తుంటారు. నా నిర్ణయం తప్పు అంటావా.. నిన్ను అడగకుండానే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు మీ ఇంట్లో లగ్జరీగా పెరిగావ్.. కానీ ఇప్పుడు మనం ఈ గది ఇచ్చేస్తే నువ్వు నేలపైనే పడుకోవాలి.. నేలపై పడుకోవడం నీకు అలవాటు లేదని నాకు తెలుసు. నీ ఇబ్బంది గురించి ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకున్నా.. కానీ తప్పలేదు. నా నిర్ణయం తప్పైతే సారీ ప్రేమా అని ధీరజ్ అంటాడు. నీ ప్లేస్‌లో నేను ఉన్నా ఇలాగే చేసేదాన్ని. నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావ్.. గొప్పగా ఆలోచించావ్.. అలవాటు లేకపోయినా పర్లేదు. కష్టమైనా పర్లేదు.. నేలపైనే పడుకుంటా. నన్ను అడగకుండా నిర్ణయం తీసుకున్నందుకు నువ్వు నాకు సారీ చెప్పాల్సిన పని లేదని ప్రేమ అంటుంది. ఆ మాటతో ధీరజ్.. థాంక్యూ ప్రేమా.. నన్ను బాగా అర్థం చేసుకున్నావని చేయి అందిస్తాడు. అనంతరం ఇద్దరూ చేతులు కలిపేసుకుని ఒకర్నొకరు చూసుకుంటారు. ఇంతలో సాగర్, నర్మదలు వచ్చి లగేజ్ సర్దుకోవడం అయిపోయిందా అని అడుగుతారు. హా అయిపోయింది అయిపోయింది అంటూ లగేజ్ తీసుకుని ప్రేమ, ధీరజ్ బయటకు వచ్చేస్తారు. బయట చందు, శ్రీవల్లిలు ఉండటంతో.. వెల్ కమ్ అంటూ ఇద్దరు స్వాగతం పలుకుతారు. వాళ్లు బయటకు రావడం.. వీళ్లు లోపలికి వెళ్లడం మామూలుగా ఉండదు. పెద్దోడు చందు లోపలికి వెళ్తూ.. తమ్ముడు భుజంపై చేయి వేసే సీన్ చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ధీరజ్ అన్నయ్య చేతిని పట్టుకుని భావోద్వేగానికి గురౌతాడు. అన్నదమ్ముల ప్రేమానురాగాల గురించి చెప్పుకోవాలంటే.. అప్పట్లో రామాయణం.. ఇప్పుడు మిమ్మల్ని కళ్లారా చూస్తున్నానని భాగ్యం అంటుంది. ఇక శ్రీవల్లి గదిలోకి వస్తుంది. గది భలే ఉంది బా.. కానీ మన కోసం మీ తమ్ముడు మరదలు గది ఖాళీచేయడమే బాధగా ఉందని శ్రీవల్లి అనగానే.. వల్లీ.. మీ అమ్మ వచ్చారు కదా.. నువ్వు ఏమీ అనుకోకుండా.. ఓసారి డబ్బుల గురించి గుర్తు చేస్తావా అని చందు అడుగుతాడు. ఏ డబ్బులు బా.. అని శ్రీవల్లి అడిగేసరికి.. అదే పెళ్లి ఖర్చుల కోసం నేను పది లక్షలు ఇచ్చాను కదా.. అవి నేను వడ్డీకి తీసుకొచ్చాను. పదిరోజుల్లో తిరిగి ఇచ్చేస్తామని ఆరోజు నువ్వు చెప్పావ్ కదా.. ఒక్కసారి వెళ్లి మీ అమ్మని అడుగమని చందు అంటాడు. సరే బా.. వెళ్లి మా అమ్మని అడుగుతానని చెప్పి భాగ్యం దగ్గరకు వెళ్తుంది శ్రీవల్లి. అమ్మోయ్ కొంపలు మునుగుతున్నాయే.. మీ అల్లుడు గారు ఆ పది లక్షలు ఎప్పుడిస్తావో అడగమన్నారని భాగ్యంతో శ్రీవల్లి అంటుంది. ఆ మాటతో అదేంటే అమ్మడూ.. అప్పుడే అడగడం ఏంటని భాగ్యం అనగానే పది రోజుల టైమ్ అయిపోయింది కదా అమ్మా అని శ్రీవల్లి అంటుంది. వీళ్ళిద్దరిని సేనాపతి, భద్రవతి గమనిస్తుంటారు‌. ఇక శ్రీవల్లి అయితే.. అమ్మోయ్ బావకి నాపై చాలా నమ్మకం ఉందే.. మనం డబ్బుల కోసం మోసం చేశామని తెలిస్తే ఆయన నా ముఖం కూడా చూడడేమోనని భయంగా ఉందే. మన బండారం బయటపడితే.. కాపురం ఏమౌతుందోనని చచ్చేంత భయంగా ఉందని శ్రీవల్లి బాధపడుతుంటుంది. ఒసేయ్.. మెల్లగా పైనుంచి ఆ భద్రవతి వాళ్లు మనల్ని చూస్తున్నారు.. వాళ్లు వింటే కొంపలు అంటుకుంటాయ్. అసలే వాళ్లు ఈ ఇంటి పాలిట సీసీకెమెరాల్లా ఉన్నారు.. అల్లుడు గార్ని ఇంకో పది రోజులు గడువు అడుగమని భాగ్యం చెప్తుంది. పది రోజుల తరువాత అయిన పది లక్షలు ఇవ్వాలి కదమ్మా అని శ్రీవల్లి అనగానే.. ఏం చేయాలో నేను చూసుకుంటాను కదా.. నువ్వు వెళ్లి ముందు ఈ ముక్కని అల్లుడు గారికి చెప్పమని భాగ్యం అంటుంది. ఏం చెప్పడమో ఏంటో.. ఈ పది లక్షలు నా కాపురాన్ని కూల్చేట్టు ఉన్నాయని శ్రీవల్లి బాధపడుతుంది. అమ్మడూ నేను ఉన్నాను కదా.. చక్రం ఎట్టా తిప్పాలో నాకు తెలుసుకదా.. నువ్వు ఈ విషయాన్ని వదిలేసి.. ఇంటిని గుప్పెట్లో ఎలా పెట్టుకోవాలో ఆలోచించమని భాగ్యం చెప్తుంది. నాకెందుకో వీళ్లపై డౌట్‌గా ఉందిరా.. వాళ్లపై ఓ కన్నేసి ఉంచమని సేనాపతికి భద్రవతి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi:  ఫోన్ లోనే భార్యతో రొమాన్స్ కురిపిస్తున్న  భర్త‌‌.. షాక్ లో రుద్రాణి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి (Brahmamudi)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-705లో.. రాజ్ సంతకాన్ని కావ్య ఫోర్జరీ చేసిందని దుగ్గిరాల కుటుంబంలోని అందరికి రుద్రాణి డాక్యుమెంట్ పేపర్స్ చూపిస్తుంది. ఆ మాటలకు స్పందించిన కావ్య.. గతంలో రాజ్ ఏదైనా అత్యవసర పరిస్థితిల్లో తను లేకపోతే పవర్ అఫ్ పటార్నీ కావ్యకు ఉండాలని డాక్యుమెంట్లు రెడీ చేసినట్టు.. అవే ఇప్పుడు సమయానికి ఉపయోగపడ్డాయని కావ్య ఇంట్లో వాళ్ళందరికి చెప్తుంది. కానీ ఆ మాటలు రుద్రాణి నమ్మదు.. నువ్వు చెప్పింది నిజం కాదు కావ్య.. నువ్వే ఆ పేపర్లపై సంతకాలు చేసి ఇప్పుడు ఇలా కవర్ చేస్తున్నావని అంటుంది. మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు రుద్రాణి గారు అని కావ్య అనగానే కానీ నాకు ఉంది.. నువ్వు చేసిన పని బయట పెడతాను అగు అని చెప్పి ఒక ఫోన్ చేస్తుంది రుద్రాణి. అలా ఫోన్ చెయ్యగానే.. సంతకాలు ఫోర్జరీనా.. లేక రాజ్ పెట్టిన సంతకమా అని చెక్ చేయించడానికి స్పెషలిస్ట్ ను పిలిపిస్తుంది. అతను ఇంట్లోకి వచ్చి డాక్యుమెంట్లు చెక్ చేస్తాడు. అవి చూసిన అతను ఆ సంతకాలు నిజమని చెప్పగానే రుద్రాణి షాక్ అవుతుంది. అప్పుడే కావ్య కోసం రాజ్ కాఫీ షాప్ కు తిరిగి వచ్చి ఆ సంతకం చేసినట్టు, అయినవాళ్ల కోసం ఏమైనా చేస్తానని కావ్యకు ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చినట్టు రాజ్ చెప్తాడు. అదంతా కావ్య ఊహించుకొని సంతోషపడతుంది. మరోవైపు ఆ సంతకం పెట్టింది రాజేనని తెలుసుకున్న దుగ్గిరాల కుటుంబం.. రుద్రాణికి చుక్కలు చూపిస్తారు.. అసలు నీకు సిగ్గు అనేది లేదా.. ప్రతిసారి కావ్యపై ఇలా పడతావ్ ఏంటని ఆమెను అందరు తిడుతారు.. అయిన సరే రుద్రాణి అవేం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది.  మరోవైపు వజ్రాలకొండ అంటే ఏంటి అసలు.. అది ఎక్కడుందని రాజ్ తనలో తనే ప్రశ్నలు వేసుకుంటుంటాడు.. నెట్ లో కూడా సెర్చ్ చేస్తాడు.. అయిన సరే అతనికి అర్థం అవ్వక కావ్యకు ఫోన్ చేస్తాడు. ఇక అలా ఉదయం కాఫీ షాప్ లు, రాత్రి ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ కావ్య, రాజ్ లు మళ్లీ తమ ప్రేమ జీవితాన్ని కొత్తగా మొదలెడతారు. మరి రాజ్ కి గతం గుర్తుస్తొందా.. యామిని ఏం చేయనుంది? ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

Karthika Deepam2:  జైల్లో దీప.. కార్తీక్ కి రెండో పెళ్ళి చేయాలన్న తండ్రి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-341లో.. వాదోపవాదాలు విన్న జడ్జ్ దీపకి బెయిల్ కూడా ఇవ్వకుండా జైలుకి పంపిస్తాడు. ఇక కార్తీక్ వాళ్ళు ఇంటికి వెళ్లి బాధపడతారు. జైల్లో ఉన్న దీప.. తన పరిస్థితేంటని బాధపడుతుంది. మరోవైపు హాస్పిటల్ నుంచి ధశరథ్ ఇంటికి వస్తాడు. వచ్చి రాగానే చెల్లి గురించి అడిగితే శివన్నారాయణ తన మీద అరుస్తాడు. నీకు చెల్లిపై ప్రేమ ఉన్నట్టు ఆమెకు నీపై లేదని అంటే దశరథ్ సైలెంట్ గా ఉంటాడు. జ్యోత్స్న మాత్రం దీపకు శిక్ష పడేలా చెయ్యాలని అందరిని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. మరోవైపు లాయర్ తో కార్తీక్ మాట్లాడతాడు. అసలు దీప తుపాకీ పేల్చకపోతే బుల్లెట్ ఎలా తగిలింది.. అది మనం కనుక్కోవాలి.. దీపకు ఇంట్లో వాళ్ళు కాకుండా ఎవరైనా శత్రువులు ఉన్నారా.. మరీ ఇంట్లో వాళ్లే చేసి ఉండాలి.. జ్యోత్స్న చేసే అవకాశం ఉందా అని మరో ప్రశ్న వేస్తే కార్తీక్ ఆలోచిస్తాడు.. ఫస్ట్ మనం ప్రూవ్ లు సంపాదించాలి.. లేదంటే వాళ్ళ లాయర్ చాలా డేంజర్.. బయటపడటం కూడా కష్టమని దీప లాయర్ చెప్తాడు. మరోవైపు దీపను అరెస్ట్ చేసిన పోలీసును జ్యోత్స్న డబ్బుతో కోనేస్తుంది. ఫస్ట్ అతను చెయ్యనని చెప్పినా కావాల్సినంత డబ్బు, కూతురుకు స్కూల్ లో సీటు అన్ని ఇప్పిస్తానని జ్యోత్స్న ఆశ చూపించి సాక్ష్యాలను మార్చమని పోలీసుకు చెప్తుంది.  మరోవైపు దీపను కలవడానికి వచ్చిన కావేరి ఆమెకు దైర్యం చెప్తుంది కానీ శ్రీధర్ వచ్చి దీప బాధపడేలా మాట్లాడుతాడు. నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావ్ దీప.. నా కొడుకు నీవల్ల కోర్టులు కేసులు అంటూ తిరుగుతున్నాడు.. నిన్ను ఎలాగో ఆ కుటుంబం వదలదు.. నువ్వు జైల్లో బానే ఉంటావ్ కానీ బయట నా కొడుకు పరిస్థితేంటి.. నీ కూతురు పరిస్థితేంటి.. ఆలోచించు.. కార్తీక్ ను రెండో పెళ్లి చేసుకోమని చెప్పు.. నువ్వు చెప్తేనే ఒప్పుకుంటాడని దీపతో శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

సుధీర్ ని చిన్న పిల్లల చేత కూడా తిట్టిస్తున్నారు..హర్ట్ అవుతున్న ఫ్యాన్స్

    సుధీర్ హోస్ట్ గా ఏ షో ఐనా కూడా ఫుల్ రేటింగ్ ఉంటుంది అని మేకర్స్ కూడా సుధీర్ తో కొన్ని షోస్ చేయిస్తున్నారు. రీసెంట్ డ్రామా జూనియర్స్ సీజన్ 8 కి హోస్ట్ గా చేస్తున్నాడు సుధీర్. ఐటీ ఈ షో మొదలైన దగ్గర నుంచి సుధీర్ మీద చిన్న పిల్లలు కూడా కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ షో ప్రోమోలో కూడా అదే జరిగింది. శ్రీమనో అనే చిన్నారి వచ్చి సుధీర్ ని పిచ్చపిచ్చగా తిడుతూ జోక్స్ వేసింది. "నా కూతురుని ఎవరో ఒకరికి కట్టబెట్టాలి కదా" అని ఆ పిల్ల అనేసరికి " నేను ఉన్నాగా అత్తా " అన్నాడు సుధీర్. 'ఏడ్చావులే వెర్రి సచ్చినోడా. ఎం మాట్లాడుతున్నావురా బడుద్దాయి...ఓలమ్మో ఓలమ్మో ఈ ముదనష్టపోడు ఎన్ని మాటలు అంటున్నాడో" అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. ఇక జడ్జ్ అనిల్ రావిపూడి ఐతే తధాస్తు దేవతలు నీకు ఇలాంటి అత్తను ప్రసాదిస్తారేమో అనుకుంటున్నా అన్నాడు. ఇక పిల్లలు ఇలాంటి తిట్లు తిట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కామెంట్స్ కూడా చేస్తున్నారు. "మా సుధీర్ ని వెధవని చెయ్యడానికే ఈ షో పుట్టినట్టు ఉంది. యాంకర్స్ అందరినీ ఇలాగే చేస్తున్నారా...మర్యాద ఇవ్వండి...చిన్న పిల్లల చేత కూడా తిట్టిస్తున్నారే" అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ విషయం మీద కామెంట్స్ బాగా చేస్తున్నారు. సుధీర్ ని ప్రతీ షోలో తిట్టడమే పనిగా స్కిట్స్ నడుస్తున్నాయి...ఐతే దీని మీద నెటిజన్స్, సుధీర్ ఫాన్స్ మాత్రం హర్ట్ అవుతున్నారు.

రాంప్రసాద్ పచ్చళ్ళల్లో ఆ రకమైన పచ్చళ్ళు కూడా లభ్యం

  జబర్దస్త్ ఈ వారం షో ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఐతే పికిల్స్ ఎపిసోడ్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యిందో మనకు తెలుసు. ఇప్పుడు రాంప్రసాద్ కూడా అదే కాన్సెప్ట్ తీసుకున్నాడు. రాంప్రసాద్ పికిల్స్ పేరుతో ఒక స్కిట్ చేసాడు. ఇందులో పికిల్స్ అమ్మడమే కాదు పికిల్స్ పెట్టడంలో ట్రైనింగ్ కూడా ఇస్తాం అని చెప్పాడు. ఐతే ఇందులో ఆ టైపు పచ్చాలు కూడా ఉంటాయని చెప్పాడు. ఎందుకంటే సోషల్ మీడియాలో వైరల్ ఐన పికిల్స్ ట్రోలింగ్ చూస్తే ఒక వెరైటీ కామెంట్ ని కూడా చూసాం. ఒక సంస్థ వాళ్ళు పెట్టిన పచ్చడి తినడం వలన ప్రెగ్నెంట్ అయ్యారంటూ ఒక కస్టమర్ పెట్టిన ఒక మెసేజ్ కూడా  పాయింట్ బాగా వైరల్ అయ్యింది. ఇక్కడ రాంప్రసాద్ కూడా అలాంటి ఒక పాయింట్ ని యాడ్ చేసాడు. దొరబాబు పచ్చళ్ళు కొనుక్కోవడానికి వచ్చాడు. ఏ రకమైన పచ్చళ్లయినా మీ దగ్గర ఉన్నాయా అని అడిగాడు. "మగాడిని మగాడిగా నిరూపించే పచ్చళ్ళు కూడా మన దగ్గర ఉన్నాయి" అన్నాడు రాంప్రసాద్. "అవునా దానికి టాబ్లెట్స్ ఉన్నాయిగా" అన్నాడు దొరబాబు. "ఆ టాబ్లెట్స్ ఆ పచ్చళ్ళల్లో వేసేస్తాం" అన్నాడు రాంప్రసాద్. "నువ్వు ఈ పచ్చడి తింటే నీలో కోరికలు పరిగెడతాయి..నీలో దాహం తీరదు" అని పచ్చళ్ళు కొనుక్కునేలా రెచ్చగొట్టాడు. ఐతే మరి పచ్చడి చెడిపోకుండా ఉండాలంటే ఎం చేయాలి అన్నాడు దొరబాబు. "నువ్వు కొంచెం దూరంగా ఉండాలి" అన్నాడు రాంప్రసాద్. ఐతే ఇన్ని రోజులు నీ దగ్గర ఉందిగా  సగం  చెడిపోయి ఉంటుందిగా అంటూ రివర్స్ పంచ్ వేసాడు దొరబాబు. ఇక దొరబాబు వైఫ్ గా చేసిన శ్రీదేవి రాంప్రసాద్ ని కొట్టి "నువ్వు పచ్చళ్ళు అమ్ముతున్నావా కాపురాలు చెడగొడుతున్నావా" అంటూ పంచులేసింది.

దేవుడు ఉన్నాడో లేడో తెలీదు కానీ సుకుమార్ నా దేవుడు

  ఫ్యామిలీ స్టార్ ప్రతీ వారం లాగే ఈ వారం కూడా అలరించింది. ఈ షోకి "పెళ్లి కాని ప్రసాదు" మూవీ టీమ్ వచ్చింది. సప్తగిరి, కిట్టయ్య వంటి సీనియర్ నటులు వచ్చారు. అందులో కిట్టయ్య మూవీ ఇండస్ట్రీలో తన జర్నీ గురించి చెప్పుకొచ్చాడు. "నా లైఫ్ గురించి నేను అంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఒక ఆర్టిస్ట్ ని అవుతానని..ఆర్టిస్ట్ అయ్యే అర్హత నాకు లేదు. సుకుమార్ వలన ఇండస్ట్రీకి రాగలిగాను. అతను నా ఫ్రెండ్ అవడం వలన నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు. నాలోని ఆర్టిస్ట్ ని బయటకు తీసుకొచ్చాడు. కళామతల్లిని దగ్గర చేసాడు. ఆరోజు నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూసే పని లేకుండా పోయింది. ఆ తర్వాత రాజావారు రాణివారు అనే సినిమాలో రవి కిరణ్ నాకు మంచి రోల్ ఇచ్చి నా స్థాయిని ఇంకొంచెం పెంచారు. నన్ను అందరూ గుర్తుపట్టేలా చేశారు. ఇండస్ట్రీలో నాకంటూ ఒక మంచి స్థానాన్ని కల్పించారు. వాళ్ళిద్దరికీ నేను ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేను. సుకుమార్ నాకు ఫ్రెండ్ కావడం వలన నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. దేవుడు అనే వాడు ఉన్నాడో లేడో తెలీదు కానీ సుకుమార్ నా దేవుడు" అని చెప్పాడు కిట్టయ్య. ఆ మాటలు సుధీర్ రియాక్ట్ అయ్యాడు. "అంత మంచి ఫ్రెండ్స్ ఉండడం అదృష్టం..ఫ్రెండ్స్ అంటేనే కష్టకాలంలో ఆదుకునేవాళ్లు" అన్నాడు. కిట్టయ్య "రంగస్థలం" మూవీలో తన నటనతో అందరినీ అలరించాడు. అలాగే “ 2021 లో వచ్చిన  మహా సముద్రం” “2023 లో వచ్చిన బెదురులంక 2012” “2024 లో లంబసింగి” అలాగే "రాజా వారు రాణి వారు" వంటి ఎన్నో మూవీస్ లో నటించాడు.

త్వరలో మినిస్టర్ కాబోతున్న రోజా ? 

  డ్రామా జూనియర్స్ సీజన్ 8 ఆడియన్స్ ని బాగా అలరిస్తోంది. ఈ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో హార్విన్ అనే చిన్నారి చారీ గెటప్ లో వచ్చి రోజాకు జాతకం చెప్తాడు. ఇక ఆ కుర్రాడి మాటలు మాములుగా లేవు చాలా క్యూట్ గా ఉన్నాయి. "అందరూ జాబిలిని చూస్తారు కానీ నేను జాబిలికే జాతకం చూస్తున్నా" అని చెప్పాడు ఆ చిన్నారి. దాంతో రోజా ఐతే ఆ పిల్లాడి మాటలకు ఫిదా ఐపోయింది. ఆ చిన్నారినే చూస్తూ కూర్చుంది. దాంతో ఆ పిల్లాడు రోజా జాతకం చెప్పాడు. "త్వరలోనే మినిస్టర్ గా" అన్నాడు. దానికి రోజా వెంటనే "ప్రమాణ స్వీకారం చేస్తానా" అని అన్నది. కాదు త్వరలోనే మినిస్టర్ గా సినిమా చేయబోతున్నారు అని చెప్పాడు. ఇంతలో సుధీర్ వచ్చి "మరి నాకు కూడా జాతకాలు చెప్పాలి కదా" అన్నాడు. "నీ జాతకంలో ప్రాణగండం ఉంది నాయనా" అన్నాడు ఆ చిన్నారు. వెంటనే సుధీర్ "ప్రాణగండం పోవాలంటే ఎం చేయాలి" అని అడిగాడు. "అమ్మాయిలకు దూరంగా ఉండు నాయనా" అని పరిహారం చెప్పాడు. ఆ మాటకు అందరూ నవ్వేశారు. ఇక ఫైనల్ గా షోకి వచ్చిన జగపతి బాబు , రోజా, ఆమని వచ్చారు. జగపతి నటించిన సినిమాలకు సంబంధించిన పిక్స్ చూపించి గెస్ చేయమని సుధీర్ అడిగాడు. ఫైనల్ గా ఇచ్చేయండి ప్రైజ్ ఆమెకే ఇచ్చేయండి. "ఈ రాక్షసితో ఎక్కడ పెట్టుకుంటాం" అంటూ రోజాను ఉద్దేశించి జగపతి బాబు కామెంట్ చేసాడు. ఇక ఈ ముగ్గురూ కలిసి చాలా మూవీస్ లో నటించారు. జగపతి బాబు నటించిన సినిమాలను రోజా టకాటకా చెప్పేసింది చాలా మెమరీ అంటూ ఆమని కూడా పొగిడేసింది. అప్పుడు రోజా "ఏమీలేదు మళ్ళీ టాస్క్ లో ఆన్సర్స్ చెప్పి శుభలగ్నం సినిమాలోలా జగపతి బాబును మళ్ళీ గెలుచుకుందామని" అంటూ చెప్పింది రోజా.

Illu illalu pillalu: బెల్లం కాఫీతో అందరిని ఇంప్రెస్ చేసిన శ్రీవల్లి.. భాగ్యం ప్లాన్ అదుర్స్ !

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-141లో.. రామరాజు మార్నింగ్ వాక్‌కి వెళ్తుంటాడు. ఇంతలో శ్రీవల్లి.. అందరికీ కాఫీ ఇచ్చి.. మాయ గారు గుడ్ మార్నింగ్ అండి అని పలకరించి కాఫీ ఇవ్వబోతుంది. నేను వాకింగ్ చేసొచ్చాక తాగుతానమ్మా అని రామరాజు అంటాడు. అయ్ బాబోయ్.. ఖాళీ కడుపుతో వాకింగ్ చేస్తే నీరసం వచ్చేయదూ.. అట్టా ఎప్పుడూ చేయొద్దు.. మంచిది కాదు.. ఒక్క కాఫీ కడుపులో పడితే పడి ఉంటుంది కదా అని శ్రీవల్లి అంటుంది. దాంతో రామరాజు సరేనని కాఫీ తీసుకుంటాడు. ఏంటి బుజ్జమ్మా.. కొత్త కోడలికి అప్పుడే పనులు చెప్తున్నావా అని రామరాజు అంటాడు. శ్రీరామా.. శ్రీరామా.. నేను పనులు చెప్పడం ఏంటండీ.. మీ కొత్త కోడలే మాకు ఉదయాన్నే షాకిచ్చింది. నాలుగింటికే లేచి.. మేం ముగ్గురం చేసే పనులన్నీ తను ఒక్కతే చేసేసింది.. మేం లేచేసరికి వేదవతి అంటుంది.  దాంతో రామరాజు తెగ మురిసిపోతూ.. ఆడపిల్లకి గుణాన్ని మించిన ఆస్తి మరోటి లేదంటారు. ఆ మాట అక్షరాలా నిజమని నిరూపించావ్ అమ్మా.. మా పెద్దోడు ఎలాంటి రావాలని కోరుకున్నానో.. ఆ లక్షణాలన్నీ నీలో ఉన్నాయ్.. మా పెద్దోడు జీవితం గురించి నాకు ఎలాంటి దిగులు లేదంటూ రామరాజు అంటాడు. ఒకరి తరువాత ఒకరు కాఫీ రుచి చూసి.. ఆహా అద్భుతమని అంటారు. అబ్బబ్బా టేస్ట్ అదిరిపోయింది వదినా అని ధీరజ్ అనడంతో.. ఇదీ తాటి బెల్లం కాఫీ మరిదిగారూ.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని శ్రీవల్లి అంటుంది. కాఫీ టేస్ట్ చేసిన సాగర్.. ఇదిగో నర్మదా.. కాఫీ ఎలా పెట్టాలో మా వదినను చూసి నేర్చుకోమని అంటాడు. ఇక సాగర్ దగ్గరకు నర్మద వచ్చి.. ఏంటీ నేను కాఫీ పెట్టడం నేర్చుకోవాలా.మ రోజూ నేను పెట్టిన కాఫీ తాగి.. అంత మాట అంటావా.. ఇది బాగుందని అంటున్నావంటే.. నేను పెట్టిన కాఫీ బాలేదనే కదా అంటూ కాలర్ పట్టుకుని ఊపిపారేస్తుంది. దాంతో సాగర్ అక్కడ నుంచి పారిపోతాడు. ఇక కాసేపటికి రామరాజు ఇంటికి భాగ్యం బ్యాగులతో వస్తుంది. వచ్చీ రాగానే తన కూతురు శ్రీవల్లి గురించి అడిగి తెలుసుకుంటుంది. ఇక తనకి ఇంకా గది ఇవ్వలేదని శ్రీవల్లి తన తల్లి భాగ్యంకి చెప్తుంది. దాంతో భాగ్యం తన మాటలతో అందరిని ఇరకాటంలో పడేస్తుంది. రామరాజు తన గది ఇస్తానంటే ధీరజ్ అడ్డుపడి తమ గదిని ఇస్తానంటాడు. అలా శ్రీవల్లికి భాగ్యం గదిని ఇచ్చేలా చేస్తుంది. చూసావా ఎలా సాధించానో అని భాగ్యం శ్రీవల్లితో అనగానే ఇకమీదట నువ్వు ఎలాగంటే అలాగే ఉంటానమ్మా అంటు శ్రీవల్లి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2:  కోర్ట్ లో ఇరికించేసిన జ్యోత్స్న.. భగవాన్ దాసు వాదన చూసి నిస్సహాస్థితిలో దీప!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-340లో.. కళ్యాణ్ ప్రసాద్, భగవాన్ దాసు ఇద్దరు పోటాపోటీగా వాదిస్తుంటారు.  యువరానర్.. స్వయంగా దశరథ్ గారే వాంగ్మూలం ఇచ్చారు.. తనని కాల్చింది దీపే అని. పేషెంట్ బాడీలోంచి తీసిన బుల్లెట్.. అలాగే గన్‌ని ల్యాబ్‌కి పంపించిన రిపోర్ట్స్ కొన్ని అనివార్య కారణాల వల్ల రిపోర్ట్స్ లేటు అయ్యాయి.. లేదంటే వాటిని కోర్టుకు సమర్పించే వాళ్లమని భగవాన్ దాసు మాట్లాడుతుంటే.. మరి ఏ సాక్ష్యంతో దీపే కాల్చిందని చెబుతున్నారని కళ్యాణ్ ప్రసాద్ అంటాడు. దశరథ్ వాంగ్మూలం ఉంది.. అలాగే ప్రత్యక్ష సాక్షులు కూడా ఇక్కడే ఉన్నారు.. కార్తీక్ కూడా ప్రత్యేక్ష సాక్షే.. కావాలంటే విచారించుకోండి అని భగవాన్ దాసు అంటాడు. వెంటనే దీప ఏడుస్తూ.. జడ్జిగారు.. నేను గన్ పట్టుకున్నానంతే.. కాల్చలేదు.. జ్యోత్స్న నా కూతుర్ని చంపుతానన్న మాటలకు కోపంగా బెదిరించాను అంతే కానీ గన్ పేల్చలేదని అంటుంది. నువ్వు కాల్చకపోతే బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది.. నువ్వు పట్టుకున్న గన్‌లోంచే కదా బుల్లెట్ వచ్చిందని భగవాన్ దాసు అంటాడు. ఇక ఇద్దరు లాయర్లు పోటాపోటీగా కేసుని వాదిస్తుంటారు. జ్యోత్స్న గొంతు పట్టుకోవడానికి ఎస్ఐ, కానిస్టేబుల్స్ అంతా సాక్ష్యులే.. కావాలంటే ఎస్ఐ గారిని అడగండి.. లేదంటే దీప గారినే అడగండి అని భగవాన్ దాసు అంటాడు. కార్తీక్ విడిపించాడు కాబట్టి సరిపోయింది. లేదంటే జ్యోత్స్న పోలీస్ స్టేషన్‌లోనే చనిపోయేది తెలుసా అని భగవాన్ దాసు అనగానే.. అవును సర్.. దీపలో నన్ను చంపాలన్నంత కోపం ఉంది..ఇప్పుడు కాకపోతే తర్వాత అయిన చంపుతుందని జ్యోత్స్న అంటుంది. మంచి మాట చెప్పారు జ్యోత్స్నా గారు.. దీప మీ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అంతా ఉన్నారా.. దీప మిమ్మల్ని చంపబోతుందని మీ నాన్నగారితోనో మీ తాతగారితోనో చెప్పకుండా నువ్వు గన్ ఎందుకు తీశావంటూ కళ్యాణ్ ప్రసాద్ అంటాడు. ఆ టైమ్‌లో ఏం చెయ్యాలో తెలియలేదని జ్యోత్స్న భయంతో చేశానంటుంది. భయంతో చేయలేదు.. చాలా జాగ్రత్తగా దీపను ఇరికించాలని అలా చేశావని కళ్యాణ్ అంటాడు.  ఈ కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు. దీప షూట్ చేసింది. బుల్లెట్ దశరథ్ గారికి తగిలింది. అంతా క్లియర్‌గా ఉంది.. ఈ హంతకురాలు తప్పించుకునే అవకాశం ఇవ్వకండి అని  భగవాన్ దాసు అంటాడు. అబ్జెక్షన్ యువరానర్ అంటూ కళ్యాణ్ దాసు పైకి లేచి.. ఇంకా ఆధారాలు, రిపోర్ట్ రాలేదు. అందుకే ఈ కేసును వాయిదా వేయాల్సిందిగా కోర్టు వాళ్లను కోరుతున్నానని రిక్వెస్ట్ చేయడంతో జడ్జ్ కేసుని.. వచ్చే బుధవారానికి వాయిదా వేస్తున్నాం.. అంతవరకు దీప రిమాండ్‌లో ఉంటుంది. బైల్ ఇవ్వలేమని తేల్చేస్తుంది. ఇక అంతా వెళ్లిపోతారు. దీప ఏడుస్తూ కార్తీక్ ముందు నిస్సహాయంగా వెళ్తుంది. మరోవైపు కార్తీక్ ఇంటికి వచ్చి.. శౌర్య ఏడుస్తుంటే.. మీ అమ్మను వచ్చే బుధవారం తీసుకొస్తానని మాటిస్తాడు. అదెలా సాధ్యమని కాంచన, అనసూయ అంటారు. నా కూతురికి మాటిచ్చాను.. తీసుకొస్తానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: సంతకం ఫోర్జరీ చేసిందని ఆరోపించిన రుద్రాణి.. కావ్యకి షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి (Brahmamudi)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-704లో.. అపర్ణ, కావ్య మాట్లాడుకుంటారు. ఏం చేస్తున్నావే నువ్వు.. అంత నమ్మకంగా రుద్రాణీకి మాట ఇచ్చేసి వచ్చావని అపర్ణ అంటుంది. లేకపోతే ఆయన డెత్ సర్టిఫికెట్ కావాలని అడుగుతుందా? వయసులో పెద్దదని ఊరుకున్నా అత్తయ్యా.. లేదంటే చెంపలు పగలగొట్టేదాన్ని అని కావ్య అంటుంది. దాని సంగతి నేను చూసుకుంటానులే కానీ.. ముందు ఇప్పుడొచ్చిన సమస్య గురించి ఏం ఆలోచించావ్.. రాజ్ వచ్చి కాంట్రాక్ట్ పూర్తి చేయడానికి వాడికి గతమే గుర్తు లేదు కదా.. ఎలా ఇప్పుడని అపర్ణ అంటుంది. ఆయన రావాల్సిన పని లేదు.. నా పేరు మీద పవర్ ఆఫ్ పటార్నీ ఉంటే చాలు. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ నేను పూర్తి చేయగలనని కావ్య అంటుంది. నీ ఆలోచన బాగానే ఉంది.. నువ్వు అనుకున్నట్లు జరగాలంటే రాజ్ కనీసం సంతకం అయినా చెయ్యాలి కదా.. వాడికి వాడి పేరే గుర్తు లేదు. అలాంటప్పుడు ఎలా సంతకం చేస్తాడని అపర్ణ అంటుంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అత్తయ్యా.. ఆయన్ని కలవమని చెప్పాను.. కలిశాక ఏం చెయ్యాలో అర్థం కావడం లేదని కావ్య అంటుంది. నాకు కాళ్లు చేతులు ఆడటం లేదు కావ్యా.. ఏం చేస్తావో ఏంటో అని భయంగా ఉందని అపర్ణ అంటుంది. అత్తయ్యా మీరేం ఆలోచించకండి.. మనకు ఏ తోడు లేనప్పుడు పంచబూతాలే తోడుగా ఉంటాయి. తాతయ్య గారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు, ఆయన్ను అనామిక అరెస్ట్ చేయించినప్పుడు నా చుట్టు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.. ఇప్పుడూ అంతే.. మీరు కంగారు పడకండి అని ధైర్యం చెప్పి కావ్య కారులో బయల్దేరుతుంది. కారు ఎక్కగానే రాజ్‌కి కావ్య కాల్ చేసి.. రామ్ గారు.. మిమ్మల్ని కలవాలి.. వెంటనే రండి.. కాస్త ముఖ్యమైన విషయం మాట్లాడాలి.. ఎప్పుడూ కలిసే కాఫీ షాప్‌లో ఎదురుచూస్తుంటాననేసి ఫోన్ పెట్టేస్తుంది. మీరు నన్ను పిలవడమేంటీ.. ఆ ముఖ్యమైన విషయం ఏంటి అంటూ ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు కానీ వేటికీ కావ్య సమాధానం చెప్పదు. దాంతో రాజ్ బయల్దేరి వస్తాడు. ఇక రాజ్ కిందకి వస్తుంటే యామినీ, వైదేహి, రఘునందన్‌లతో పాటు పంతులు కూడా ఉంటాడు. ఇక పంతులతో వైదేహి.. మంచి ముహూర్తం పెట్టండి పంతులు గారు అంటుంది. బేబీ.. అల్లుడుగారిని కూడా పిలిస్తే బెటర్ కదా.. మళ్లీ ఆయనకు చెప్పలేదని ఫీల్ అవుతారేమోనని యామిని నాన్న అంటాడు.  లేదు డాడ్.. మనకు ఆసుపత్రిలోనే మాట ఇచ్చాడు కదా.. తప్పడు.. మన ఇష్టం అని చెప్పేశాడు కదా అంటుంది. ఇంతలో రాజ్ కిందకు దిగి.. వాళ్లను చూసి కూడా చూడనట్లుగా బయటికి వెళ్తుంటాడు. వెంటనే రఘునందన్.. బాబు.. పెళ్లి మూహూర్తం పెట్టిస్తున్నాం.. మీరు ఉంటే బాగుంటుందని రాజ్ అంటాడు. లేదు అంకుల్ నాకు చిన్న పని ఉంది.. మీరు పెద్దవాళ్లు ఎలా నిర్ణయిస్తే అలానే.. మీరు కానివ్వండి అనేసి రాజ్ బయటికి నడుస్తాడు. విన్నారా డాడ్.. రాజ్ మన నిర్ణయానికి నో చెప్పడని నేను చెప్పాగా.. ఇక కానివ్వండి అంటుంది యామినీ సంబరంగా. ఇక పంతులు ముహూర్తం చూసి..వచ్చే నెల 26న దివ్యమైన ముహూర్తం ఉందండి అని అంటాడు. పోనీలే పనులకు టైమ్ దొరుకుతుందని వైదేహి అంటుంది. అంత లేట్‌గా ఎందుకు మామ్.. దగ్గరల్లో ఏదైనా డేట్ చూడమనండి అని యామిని అంటుంది. జాతకాలు చూసి పెళ్లి చేస్తేనే మీరిద్దరు లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటారు.. ఏం కాదులేమ్మా. అంటూనే.. పంతులుగారు మీరు అదే ముహూర్తాన్ని ఖాయం చేయండి అని వైదేహి అంటుంది.  మరోవైపు రాజ్, కావ్య మాట్లాడుకుంటారు. మా బాస్ ఫారెన్ వెళ్తూ వెళ్తూ పవర్ ఆఫ్ అటార్నీ నా పేరున వచ్చేలా సంతకం చేసి లెటర్ హెడ్ నాకు ఇచ్చారు. నేను దాన్ని పోగొట్టేశాను.. తీరా ఇప్పుడు పనులన్నీ ఆగిపోయాయి. ఈ విషయం మా బాస్‌కి తెలిస్తే నా జాబ్ పోతుంది. అందుకే నాకు మీరు ఒక సాయం చెయ్యాలి. సేమ్ లెటర్ హెడ్ రెడీ చేయించి తీసుకొచ్చాను.. దాని మీద మీరు మా బాస్ సంతకం ఒకటి చేశారంటే చాలు.. నేను ఈ సమస్య నుంచి బయటపడిపోతానంటూ కావ్య చెప్తుంది. అమ్మో నా వల్ల కాదు.. ఫోర్జరీ అవుతుంది ఇది అనేసి రాజ్ నో చెప్తాడు. సరే మీరు వెళ్లండి.. నేను ఆ సంతకం ప్రాక్టీస్ చేసి పెట్టుకుంటానని కావ్య కోపంగా అనేస్తుంది. రాజ్ నిజంగానే లేచి వెళ్లిపోతుంటే.. అయ్యో నిజంగానే వెళ్లిపోతున్నారే అని చూస్తూ కావ్య బాధపడుతుంది. ఇక రాజ్ డోర్ దగ్గరకు వెళ్లి వెనక్కి తిరిగి చూస్తాడు. వెనక్కి వస్తాడేమోనని కావ్య ఆశపడుతుంది. కానీ ఆగడు వెళ్లిపోతాడు. దాంతో కావ్య.. అయ్యో.. సర్లే వెళ్తే వెళ్లనీ నేనే సంతకం ప్రాక్టీస్ చేసి నేనే పెట్టుకుంటాను అని కావ్య అనుకుని సంతకం ప్రాక్టీస్ చేసే పనిలో పడుతుంది. ఓ వ్యక్తి రుద్రాణీకి కాల్ చేసి.. మేడమ్ థాంక్యూ.. మీరు చెప్పినట్లు ఇంటికి వచ్చి అడగటం వల్లే ఇప్పుడు మా రెండు కోట్లు మాకు వచ్చేశాయి.. కావ్య మేడమ్ మా డీల్ సెటిల్ చేశారు.. థాంక్యూ మేడమ్.. రాజ్ సర్ సంతకం చేశారట.. ఆ డాక్యుమెంట్స్ మాకు పంపించారు. అంతా మీ వల్లే థాంక్యూ మేడమ్ అని అతను అంటాడు. థాంక్స్ ఏం అవసరం లేదు కానీ.. కావ్య పంపించిన డాక్యుమెంట్స్ పేపర్ నాకు మెయిల్ చెయ్ చాలు అని రుద్రాణి అంటుంది. సరే మేడమ్ పంపిస్తానని అతడు ఫోన్ పెట్టేసి.. ఆ డాక్యుమెంట్ పేపర్స్ పంపిస్తాడు. ఎంతకు తెగించావ్ కావ్యా.. రాజ్ చచ్చాడని ఒప్పుకుంటావ్ అనుకుంటే వాడి సంతకాన్ని ఫోర్జరీ చేసి కంపెనీ బాధ్యతలను నువ్వు తీసుకుంటావా.. నువ్వు చేసిన ఈ తప్పుని ఎలా బయటపెడతానో చూడమని రుద్రాణి రగిలిపోతుంది. ఆ వ్యక్తి పంపించిన డాక్యుమెంట్స్ ప్రింట్‌ని.. ఇంట్లో వాళ్ల ముందు పెట్టి రుద్రాణి రచ్చరచ్చ చేస్తుంది. ఆధారాలతోనే వచ్చాను.. ఇవిగో చదవండి.. రాజ్ లేకుండా కావ్యకు పవర్ ఆఫ్ పటార్నీ ఎలా వచ్చిందంటూ రుద్రాణి అనేసరికి అందరు ఆశ్చర్యపోతారు. ఇంతలో కావ్య రావడంతో తన చేతిలో ఆ డాక్యుమెంట్స్ పెట్టి షాకిస్తుంది రుద్రాణి. డాక్యుమెంట్స్‌లో రాజ్ సంతకం గురించి ఇంట్లో రచ్చ చేస్తుంటే కావ్య దోషిలా నిలబడి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నిఖిల్ పోస్ట్ ..కావ్య గురించేనా ?

  కొంతకాలం క్రితం వరకు నిఖిల్ - కావ్య బుల్లితెర మీద మంచి జోడిగా పేరు తెచ్చుకున్నారు. ఎవరి ద్రుష్టి పడిందో కానీ ఇద్దరూ ఇప్పుడు విడిపోయాడు. గోరింటాకు సీరియల్ తో వీళ్ళు తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. ఇక నిఖిల్ కి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందు వరకు ఇద్దరూ కూడా ఎంతో క్లోజ్ గా ఉండేవాళ్ళు. పెళ్లి జరిగినట్టుగా కూడా వీడియోస్ కూడా క్రియేట్ అయ్యాయి. ఎన్నో షోస్ లో కలిసి ప్రేమను ఎక్స్ప్రెస్ కూడా చేసుకున్నారు. కానీ బిగ్ బాస్ టైములో ఇద్దరూ విడిపోయారు. ఏమయ్యిందో కానీ ఇద్దరూ కారాలు మిరియాలు నూరుకున్నారు. ఇక ఇప్పుడు  ఇద్దరూ ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇద్దరూ కలిసున్నవి కనిపించకుండా డిలీట్ చేసేసుకున్నారు. ఒకవేళ షోస్ లో కలవాల్సిన పరిస్థితి వస్తే చూసుకోకుండా, మాట్లాడుకోకుండా దూరంగా ఉంటున్నారు. ఇక ఇప్పుడు నిఖిల్ దీనికి సంబంధించి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక మ్యాటర్ ని పోస్ట్ చేసాడు. "నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే దానికి కారణం మీరే. ఇంతకాలం నా మీద చూపించిన ప్రేమ, అభిమానాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను. ఐతే ఇక్కడ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. పరిస్థితులు అన్నవి ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఎవరికి వాళ్ళుగా మా జీవితాల్లో నిమగ్నమయ్యాము. దయచేసి నను ఎవరితోనూ కలపొద్దు, ట్యాగ్ చేయొద్దు. వర్క్ పరంగా తప్ప ఇతరత్రా ఇంటెన్షన్స్ తో నన్ను వేరే వారితో కలపొద్దు..ఎవరి పోస్టులకు కూడా నన్ను ట్యాగ్ చేయొద్దు. నన్ను అందరూ అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను. ఐ లవ్ యు ఆల్" అని రాసుకున్నాడు. అంటే ఏ షోస్ కి వెళ్లినా కూడా నిఖిల్ ని, కావ్యని కలిపి మాట్లాడ్డం, కామెంట్స్ చేయడం వంటివి చేస్తుండడంతో నిఖిల్ ఇలా రియాక్ట్ అయ్యాడంటూ నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.  

75 వేలతో మ్యూజిక్ వీడియో సాంగ్ థీమ్ తో డాన్స్ ఐకాన్

  డాన్స్ ఐకాన్ సీజన్ 2 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ ప్రోమో మాత్రం ఫుల్ కలర్ ఫుల్ గా ఉంది. ఐతే ఈ రాబోయే కాన్సెప్ట్ ఏంటంటే మ్యూజిక్ వీడియోస్ థీమ్ అన్నమాట. ఒక్కో కంటెస్టెంట్ కి 75 వేలు ఇచ్చామని ఆ డబ్బులతోనే ఫస్ట్ వీడియో సాంగ్ ని షూట్ చేయాలి అంటూ యాంకర్ ఓంకార్ టాస్క్ ఇచ్చాడు. దాంతో మానస్ కంటెస్టెంట్ చిరాశ్రీ సాగరిక ఐతే "ధీవర" అనే సాంగ్ కి డాన్స్ వీడియో చేసి చూపించింది. ఈ డాన్స్ కి ఫారియా కాంప్లిమెంట్ ఇచ్చింది. "మూవ్మెంట్స్ సాండ్ లాగా చాలా స్మూత్ గా ఉన్నాయి. చూడడానికి చాలా యూనిక్ గా ఉంది"అని చెప్పింది. ఇక బెనీత ఐతే "జేజమ్మ" సాంగ్ కి వీడియో సాంగ్ చేసింది. ఇక ఈ సాంగ్ షాట్స్ అన్నీ కూడా రెండు గంటల్లో చేసేశాం అని మెంటార్ యష్ మాష్టర్ చెప్పేసరికి శేఖర్ మాష్టర్ కూడా షాకయ్యాడు. ఇక విపుల్ రాకీ భాయ్ సాంగ్ కి డాన్స్ వీడియో చేసేసరికి దీపికా ఫుల్ ఫిదా ఐపోయింది. బర్కత్ అరోరా ఐతే "చిన్ని చిన్ని ఆశ" సాంగ్ కి డాన్స్ చేసింది. అది చూడడానికి కూడా ఎంతో క్యూట్ గా ఉంది. ఫైనల్ గా ముమైత్ ఖాన్ కంటెస్టెంట్ అన్షికా మంచి హాట్ పెర్ఫార్మెన్స్ కి డాన్స్ చేసింది. "పరేషానురా" పాటకు చేసిన హాట్ స్టెప్స్ కి యష్ మాష్టర్ ఫిదా ఐపోయాడు. "యష్ నువ్వు అన్షికా పెర్ఫార్మెన్స్ చూసి పరేషాన్ అయ్యావా లేదా" అని ఓంకార్ అడిగేసరికి "అయ్యాను" అన్నాడు . ఫారియా కూడా మూవీలో ఉండే యాక్షన్ సాంగ్ లా అనిపించింది అంటూ పొగిడేసింది. మరి ఈ ఫైనల్ ఎలిమినేషన్ లో ఎవరు ఉండబోతున్నారు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది కొంత సస్పెన్సు గా ఉంచాడు ఓంకార్.