కంప్యూటర్లు దొంగతనం చేసి అమ్ముతూ ఉంటాడు..ఇంటికో గర్ల్ ఫ్రెండ్ ఉంది అతనికి

  డ్రామా జూనియర్స్ సీజన్ 8 ఎంత ఫన్నీగా ఉందంటే మాములుగా లేదు. ఇందులో ఇద్దరు పిల్లలు హైపర్ ఆంటీస్ పేరుతో వేసిన స్కిట్ తో స్టేజిని దుమ్ము దులిపేసారు. అందులోనూ సుధీర్ ని ఒక రేంజ్ లో ఆడేసుకున్నారు. ఆ ఆడపిల్లలిద్దరికీ పెళ్లి చేసిన పెళ్లిళ్ల పేరయ్య వచ్చి "సుధీర్ అనే అబ్బాయి ఉన్నాడట కదా పెళ్లి సంబంధాలు చూడడానికి వచ్చా" అనేసరికి అందులో ఒక అమ్మాయి నిష్ఠూరంగా "స్వీట్ పడదు..మొన్ననే సుధీర్ కి టెస్ట్ చేయిస్తే షుగర్ అని తేలింది.."అని ఒక ఆంటీ అంటే పెళ్లిళ్ల పేరయ్యా "కంప్యూటర్ జాబ్ అంట కదా" అన్నాడు. దానికి ఆంటీ మళ్ళీ " కంప్యూటర్ లు దొంగతనం చేసి అమ్ముతా ఉంటాడు" అని చెప్పింది సుధీర్ పరువు తీసేసింది. తరువాత ఈ షోలో "బతుకు జట్కా బండి వెర్సెస్ సంక్రాంతికి వస్తున్నాం" అనే స్కిట్ వేశారు. అందులో ఇద్దరు చిన్నారులు భార్యాభర్తలుగా నటించారు. ఐతే పెళ్ళాం మీద భర్త చెయ్యి ఎత్తేసరికి రోజా వచ్చి "ఏయ్ ఏంటి నా ముందే పెళ్ళాం మీద చెయ్యెత్తుతున్నావ్" అని రోజా అనేసరికి వెంటనే ఆ భర్త బుంగమూతితో బుల్లిరాజు అని పిలుస్తాడు. వెంటనే తుపాకీని చేత్తో పట్టుకుని సంక్రాంతికి వస్తున్నాం మూవీలోని కుర్రాడు వచ్చేసాడు. రోజాని కోపంగా చూస్తూ ఆమె మీద అరిచాడు. ఆ తర్వాత రెండు జంటల మధ్య బతుకు జట్కా బండి రోజా కూర్చుని ఆ సమస్య మీద మాట్లాడింది. తర్వాత రోజాని చూసి కొరికెత్త కొరికెత్త అంటూ కాసేపు అరిచాడు ..ఇక అక్కడి నుంచి సుధీర్ వైపు వెళ్లి "మా నాన్న మీ మేడెక్కి డాన్స్ చేశాడా " అని అడిగాడు. "అవును బుల్లిరాజు గారు" అని సుధీర్ ఆన్సర్ చెప్పేసరికి "మా అమ్మతోనే కదరా డాన్స్ చేసింది. ఏదో నీ పెళ్లాంతో డాన్స్ చేసినట్టు" అని బూతులు తిట్టాడు. ఆ తర్వాత రోజా దగ్గరకు వచ్చి "మా నాన్నకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ ఉందని గొడవ చేస్తున్నావ్..కానీ ఆ సుధీర్ గాడికి ఇంటింటికి గర్ల్ ఫ్రెండ్ ఉంది" అనేసరికి అందరూ నవ్వేశారు.  

Illu illalu pillalu : వీడియో కాల్ చేయమన్న నర్మద.. భాగ్యం బండారం బయటపడనుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -148 లో....శ్రీవల్లి చందు, వేదవతి, ప్రేమ , ధీరజ్ భాగ్యం ఇంటికి వస్తారు. ఇక వాళ్ళంతా రాగానే శ్రీవల్లిని హగ్ చేసుకుంటుంది భాగ్యం. నేను చెప్పినట్లు నగలు తీసుకొని వచ్చావా అని అడుగుతుంది. తీసుకొని వచ్చానని శ్రీవల్లి చెప్తుంది. ఆ తర్వాత భాగ్యం హారతి ఇచ్చి శ్రీవల్లి, చందులని ఆహ్వానిస్తుంది. అందరు లోపలికి వెళ్ళాక నర్మద, సాగర్ ఎందుకు రాలేదని భాగ్యం అడుగుతుంది. వదినకి లీవ్ ఇవ్వలేదని అమూల్య చెప్తుంది. ఆ తర్వాత శ్రీవల్లిని తీసుకొని భాగ్యం పక్కకి వెళ్తుంది. నగలన్నీ తీసుకొని వచ్చినట్లే కదా అని శ్రీవల్లిని భాగ్యం అడుగుతుంది. తీసుకొని వచ్చాను ఆ కామాక్షి ఆడపడుచు కట్నం అంటే ఒక నగ తీసి ఇచ్చానని శ్రీవల్లి అనగానే.. అది గిల్ట్ నగ ఎందుకు ఇచ్చావ్.. ఎక్కడైనా చెక్ చేయిస్తే బండారం బయటపడుతుంది. నువ్వు వెళ్ళాక తనని మాయ చేసి తీసుకోమని భాగ్యం చెప్తుంది. నేను ఎలాగోలా మీ పెళ్లి చేశాను. నీ కాపురం జాగ్రత్త అంటూ శ్రీవల్లితో భాగ్యం చెప్తుంటే ప్రేమ వస్తుంది. వాళ్ళు మాట్లాడుకుంది అంత విన్నదేమోనని ఇద్దరు టెన్షన్ పడుతారు కానీ ప్రేమ వినదు. వాటర్ కోసం వచ్చానని ప్రేమ చెప్పగానే భాగ్యం వాటర్ ఇస్తుంది. మరొకవైపు నర్మద సాగర్ ని తీసుకొని శ్రీవల్లి వాళ్ళు నాన్న ఇంట్లో ఉన్నాడో లేదో చూడడానికి వస్తుంది. శ్రీవల్లి వాళ్ళు నాన్న నర్మద, సాగర్ వెళ్ళకముందే ఇంటికి వెళ్లాలని పరుగెడతాడు. ఆ తర్వాత భాగ్యం కావాలనే ప్రేమ చేత టీ కప్పులు తీయిస్తుంది. భాగ్యం టీ కింద పడబోసి ఏమనుకోకు అమ్మ కాస్త ఇది క్లీన్ చేస్తావా అని భాగ్యం అనగానే ప్రేమ క్లీన్ చేస్తుంది. అది ధీరజ్ చూసి వచ్చి ప్రేమని ఆపుతాడు. తరువాయి భాగంలో నర్మద, సాగర్ భాగ్యం ఇంటికి వచ్చి బాబాయ్ గారిని పిలవండి అంటారు. ఆయన లేడని భాగ్యం అనగానే వీడియో కాల్ చెయ్యమని నర్మద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 :దీప కోసం తండ్రిని కొట్టబోయిన కార్తీక్.. జ్యోత్స్న టెన్షన్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -347 లో.... దీప ఇంటికి వచ్చిందని తెలిసి శ్రీధర్ ని గది లోపల ఉంచి బయట డోర్ వేసి దీప దగ్గరికి వస్తుంది. దీపతో కావేరి మాట్లాడుతుంటే శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. ఎప్పటిలాగే దీప ని నిందిస్తుంటాడు. ఎందుకు వచ్చారు దీప దగ్గరికి వెళ్లి కార్తీక్ కి విడాకులు ఇవ్వమని చెప్పి బాధపెట్టారు.. మళ్ళీ ఎందుకు వచ్చారని అనసూయ అంటుంది. అంటే దీప నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమనడానికి కారణం నువ్వా అని శ్రీధర్ తో కార్తీక్ అంటాడు. మీకు కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా అని కార్తీక్ తిడతాడు. ఇప్పుడు నా కోడలికి సారీ చెప్పాలని కాంచన అనగానే నేను చెప్పనని శ్రీధర్ అంటాడు.. అనసూయ గారు మీరు వెళ్లి చీపురుకట్ట తీసుకొని రండీ అని కార్తీక్ అనగానే అనసూయ తీసుకొని వస్తుంది. ఇప్పుడు మీరు సారీ చెప్పకపోతే దానికి పని చెప్పాల్సి ఉంటుందని కార్తీక్ అనగానే శ్రీధర్ బయపడి సారీ చెప్తాడు. మరొకవైపు దీప ఏ తప్పు చెయ్యలేదని కార్తీక్ తన భార్యకి సపోర్ట్ చేసి బెయిల్ పై బయటకు తీసుకొని వచ్చాడని జ్యోత్స్న పారిజాతం ఇద్దరు దశరథ్ తో చెప్తారు. దీప చెయ్యలేదేమో బుల్లెట్ తన గన్ లోనిది కాదని తేలింది కదా అని దశరథ్ అంటాడు. మరి ఆ అవసరం ఎవరికీ ఉంటుందని శివన్నారాయణ అంటాడు. ఏమో చెప్పలేం మొదట సుమిత్రపై ఎటాక్.. ఆ తర్వాత దాస్, దీప శౌర్యలపై ఎటాక్ జరిగింది కదా నాపై ఎటాక్ , సుమిత్ర పై ఎటాక్ చేసింది ఒక్కరేమోనని దశరథ్ అంటాడు. సుమిత్రపై ఎటాక్ చేసింది నేనే కానీ దశరత్ పై ఎటాక్ చేసింది మాత్రం నాకు తెలియదని పారిజాతం అనుకుంటుంది. ఏదైనా సరే ఎవరు షూట్ చేసారో తెలుస్తుందని దశరథ్ అంటుంటే జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. మరొకవైపు దీప, కార్తీక్, శౌర్య, అనసూయ, కాంచన అందరు భోజనం చేస్తుంటారు. కార్తీక్, దీపలకి శౌర్య తినిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : యామిని ఛాలెంజ్..రిసార్టు కి వెళ్ళిన రాజ్, కావ్య!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -711 లో.....రాజ్ దగ్గరికి యామిని వచ్చి వెడ్డింగ్ కార్డు చూపించగానే అతను షాక్ అవుతాడు. ఏంటి బావ అలా అయ్యావని యామిని అడుగుతుంది. ఏం లేదని రాజ్ అంటాడు. మరొకవైపు రాజ్ ని మాములు మనిషిని చెయ్యాలి అందుకు రాజ్ కి గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తు చెయ్యాలని అపర్ణ అంటుంది. అదే ఏం చేయాలో అర్థం కావడం లేదని కావ్య అంటుంది. రాజ్ కి మీ మధ్య జరిగిన సంఘటన గుర్తు చెయ్యాలని అపర్ణ అంటుంది. ఆ తర్వాత రాజ్ ఫ్రెండ్ సందీప్ వెడ్డింగ్ అనివర్సరి పార్టీ ఉందట పిలిచాడు.. ఆ పార్టీకీ ఆయన్ని రప్పించి, నా ప్రయత్నం నేను చేస్తానని కావ్య అంటుంది. ఆ తర్వాత యామినితో పెళ్లి అంటే నా మనసు ఎందుకో అంగీకరించడం లేదు.. కళావతిని కలిసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఎందుకో యామిని పై కలగడం లేదు.. కళావతికి నాపై ఉన్న అభిప్రాయం కనుక్కోవాలని రాజ్ అనుకుంటాడు. వెంటనే కావ్యకి ఫోన్ చేస్తాడు. రాజ్ ని ఎలా పార్టీ కి పిలవాలని కావ్య ఆలోచిస్తుండగా రాజ్ ఫోన్ చెయ్యడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా ఫ్రెండ్ ఆనివర్సరీ పార్టీ ఉందని కావ్య చెప్పగానే నన్ను పిల్వండి నేను వస్తానని రాజ్ అంటాడు. సరే అని కావ్య పిలుస్తుంది. హమ్మయ్య ఇక కళావతి గారికి నాపై ఉన్న అభిప్రాయం తెలుసుకునే ఛాన్స్ దొరికిందని రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత రాజ్ బ్యాగ్ తో వస్తుంటే ఎక్కడికి అని యామిని అడుగుతుంది. ఫ్రెండ్ ఆనివర్సరీ పార్టీ ఉందని రాజ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా కావ్య ప్లాన్ అని యామినికి అర్థమవుతుంది. తను కావ్యకి ఫోన్ చేసి గొడవపడుతుంది. నీ ప్లాన్ ఫెయిల్ చేస్తాను.. రాజ్ ని ఆపుతానని ఛాలెంజ్ చేస్తుంది. తరువాయి భాగంలో పార్టీకి వెళ్తున్నానని రుద్రాణి రాహుల్ కి కావ్య చెప్పి వెళ్తుంది. రాజ్ , కావ్య ఇద్దరు రెసాట్ కి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించిన జానీ మాస్టర్

పహాల్గమ్ బాధితులైన మధుసూదన్ కుటుంబ సభ్యులను ఈరోజు ఫేమస్ కొరియోగ్రాఫర్ జానీ మాష్టర్ కుటుంబసభ్యులు వెళ్లి కలిశారు. మధుసూదన్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ కుటుంబానికి తమ నాయకుడు పవన్ కళ్యాణ్ తో పాటు తాను కూడా ఒక సోదరుడిలా అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు. ఈ దేశ ఔన్నత్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని టెర్రరిస్టు మూకలు ఎప్పటికీ ఏమీ చేయలేవు అంటూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియోని పోస్ట్ చేశారు. మన దేశంపై, మన ప్రజలపై జరిగే దాడులని కుల,మత,జాతి తేడాలు లేకుండా, అవసరమైతే ప్రతీ పౌరుడు ఒక సైనికుడిగా మారి ఎదుర్కోవాలి అంటూ పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన తరపున ఆ కుటుంబానికి 50 లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ కుటుంబానికి ఎంతో అండగా ఉన్నందుకు తమ  తరపున ధన్యవాదాలు చెప్పమన్నారంటూ  చెప్పారు జానీ మాష్టర్. చేసింది సాయం కాదు బాధ్యతను గుర్తించి వాళ్లకు అండగా నిలబడడం వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఏప్రిల్ 22 న పహాల్గమ్ లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది మరణించిన విషయం తెలిసిందే. ఐతే అదే ప్రాంతానికి బెంగుళూరు నివాసి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మధుసూదన్ తన భార్య కామాక్షితో పాటు ఇద్దరు పిల్లలను తీసుకుని కాశ్మీర్ వెళ్ళాడు. మధుసూదన్ కావాలి ప్రాంతానికి చెందిన వ్యక్తి ఐనా బెంగళూరులో స్థిరపడ్డాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ కావాలి వెళ్లి అక్కడ మధుసూదన్ భౌతిక కాయం వద్ద నివాళులర్పించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పహాల్గమ్ బాధిత కుటుంబాలను ఆదుకున్న పవన్ కళ్యాణ్ కి జానీ మాష్టర్ కృతఙ్ఞతలు చెప్పారు.  

వాళ్ళు బాగుంటే చాలు  నేను చచ్చిపోయినా పర్లేదు..

  బుల్లితెర మీద ట్రాన్స్ జెండర్ కమెడియన్ తన్మయి గురించి అందరికీ తెలుసు. క్యూట్ గా మంచి కామెడీ టైమింగ్ తో ఫుల్ జోష్ అండ్ ఎనర్జీతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఐతే ఆమె జీవితంలోని కష్టాలు వింటే ఎవ్వరైనా అవాక్కవ్వాల్సిందే.. ఒక ఇంటర్వ్యూలో ఆమె చాలా ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పింది  "మూవీ ఆఫర్స్ వస్తున్నాయి కానీ డేట్స్ చెప్తాము అంటున్నారు  కానీ తర్వాత పట్టించుకోవడం లేదు. నేను ఒక ఛాన్స్ వచ్చింది అని పరిగెత్తను, రాలేదు అని డల్ ఇపోను. నా లైఫ్ లో నాకు కొత్త ఆశలు అంటూ ఏమీ లేవు..నా ఫామిలీని చూసుకోవాలి అంతే..వాళ్ళు బాగున్నారా అది చాలు నాకు..వాళ్ళు బాగుంటే చాలు నేను చచ్చిపోయినా పర్లేదు.వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్లే.. ఈవెంట్స్ చేస్తున్నాను , జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నాను. చాలు నాకు. సినిమాలో అవకాశాలు రావడం అంత ఈజీ కాదు. నా లైఫ్ లో చాలా మలుపులు ఉన్నాయి. నేను మంచి స్టూడెంట్ ని. బైపీసీ చదివి డాక్టర్ అవ్వాలనుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి కూడా అమ్మాయిలనే ఉండడం ఇష్టం. మా ఇంట్లో కూడా అందరికీ తెలుసు. ఇంటర్, డిగ్రీ చదివాను..మా ఇంటి వెనకే మా కాలేజ్. ఐతే అందులో బైపీసీ లేదు. చదివించే స్తొమత మా వాళ్లకు లేదు. అందుకే ఆర్కెస్ట్రాస్ లో డాన్సర్ గా వెళ్లేదాన్ని. 500 , 1000 , 1500 అలా ఇచ్చేవాళ్ళు. ముందు మాది పూరిల్లు, తర్వాత పెంకుటిల్లు, సంపాదించడం మొదలయ్యాక రేకుల ఇల్లు కట్టుకున్నాను. షోస్ లో వచ్చే డబ్బులతో చిట్టీలు వేసుకుని గుంటూరు లో ఒక మూడు ఫ్లోర్స్ తో ఉన్న ఒక మంచి ఇల్లును గుంటూరులో కట్టుకున్నాను. మా నాన్న డ్రింక్ చేసేవాడు, అమ్మ పొలం పనులకు వెళ్ళేది, నేను చినిగిపోయిన బట్టలతోనే స్కూల్ కి వెళ్లేదాన్ని. ఐతే ఇప్పుడు అందరినీ సెట్ చేసాను. నాకు పూర్తి అమ్మాయిగా ఉండడం అంటే ఇష్టం అందుకే మూడు సర్జరీలు చేయించుకుని చచ్చి బతికాను. బయట ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు ఎవరెవరో ఎలా బిహేవ్ చేస్తారో తెలీదు. జాకెట్ పట్టుకుని లాగేసిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఒక వ్యక్తిని నమ్మి మోసపోయాను. అతను నా డబ్బు కావాలనుకున్నాడు కానీ నన్ను కాదు. " అంటూ తన్మయ్ తన జీవితంలోని ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది.  

ప్రభుదేవా ఫోన్ చేసి మెచ్చుకున్నారు...క్రెడిట్స్ కింద కొరియోగ్రాఫర్ పేరు ఉండదు

  బుల్లితెర మీద డాన్స్ షోస్ కి ఎక్కువగా శేఖర్  మాస్టర్ జడ్జ్ గా వస్తూ ఉంటారు. ఆయన టాలీవుడ్ లో ఎన్నో సాంగ్స్ కి కొరియోగ్రాఫ్ చేశారు. ఐతే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. "కొరియోగ్రఫీ విషయంలో నాకు ఒకటి బాధ కలిగిస్తుంది. ఇంత కష్టపడి చేస్తే కొరియోగ్రాఫ్ చేస్తే ఒక డాన్స్ కి యూట్యూబ్ లో కానీ ఇంకెక్కడైనా కూడా క్రెడిట్స్ కింద కొరియోగ్రాఫర్ పేరు ఉండదు. అక్కడ చాలా బాధేస్తుంది. సాంగ్ రిలీజ్ చేసాక మ్యూజిక్ డైరెక్టర్ ది, పాడిన వాళ్ళ పేర్లు, రచయిత పేరు కూడా వేస్తారు కానీ కొరియోగ్రాఫర్ పేరు మాత్రం వేయరు. ఐతే కొందరు మర్చిపోతారేమో.. అదొక్క విషయంలోనే బాధగా ఉంటుంది. మనం ఒక పని చేసాక క్రెడిట్స్ తీసుకోవాలి. కొరియోగ్రాఫ్ చేసినందుకు డబ్బు మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కానీ టెక్నీషియన్స్ కి ఆ క్రెడిట్స్ అలాగే బాగా చేస్తే ఒక ఫోన్ చేసి బాగా చేశారు అని చెప్పే మాట ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అలా చెప్తే ఇంకా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఆ క్రెడిట్స్. ప్రభుదేవా గారి నుంచి నాకు మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఆయన ఉన్నారు కాబట్టే నేను ఈరోజు ఈ పొజిషన్ లో ఉన్నాను. నాకు ఆయన డాన్స్ అంటే ఇష్టం. నేను ఆయన దగ్గర వర్క్ కూడా చేయలేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ లో ఎం చేయాలో తెలీక అలా రోడ్డు మీద వెళ్తుంటే ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ కనిపించింది. ఈ హాలిడేస్ లో ఎం చేస్తాం డాన్స్ నేర్చుకుందాం అనుకున్నా..అలా అక్కడ జాయిన్ అయ్యాను. అప్పుడు మస్తాన్ మాష్టర్ ఉన్నారు. ఏ డాన్స్ స్టైల్ కావాలి అన్నారు. ప్రభుదేవా మాష్టర్ చేసే డాన్స్ స్టైల్ అన్నాను. ఆయన సాంగ్స్ ఆయన మూవ్మెంట్స్ చూసి ఇంటికి వెళ్లి ప్రాక్టీస్ చేసేవాడిని. "టాపు లేచిపోద్ది" సాంగ్ చూసి ప్రభు మాష్టర్ వేరే వాళ్ళ దగ్గర నా నంబర్ తీసుకుని ఫోన్ చేసి చాలా చాలా బాగుంది అన్నారు. నేను ఆయన మాట్లాడేసరికి ఇదంతా నిజమా అని నేను నమ్మలేకపోయా. తర్వాత "యాక్షన్ జాక్ సన్" మూవీకి కొరియోగ్రాఫ్ చేయాలి అంటే ఆస్ట్రేలియా వెళ్లి రెండు సాంగ్స్ చేశా." అని చెప్పాడు శేఖర్ మాస్టర్.

Illu illalu pillalu : శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇడ్లీ అమ్మడం చూసిన నర్మద.. భాగ్యం ఇంటికెళ్ళిన ప్రేమ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -147 లో.. చీర కట్టుకోవాలా డ్రెస్ వేసుకోవాలా అనే కన్ఫ్యూషన్ లో ప్రేమ ఉంటుంది. అప్పుడే ధీరజ్ వస్తాడు. దీనికి ఇంత ఆలోచించడం ఎందుకు సారీ అని సెలక్ట్ చేస్తాడు. ఆ తర్వాత ధీరజ్ రెడీ అయి వస్తాడు. ప్రేమ జాకెట్ హుక్స్ పెట్టడానికి నర్మదని పిలుస్తుంది. అయిన వాళ్ళు ఎందుకు వస్తారు ఏంటోనని ధీరజ్ అడుగుతాడు. ప్రేమ ఇబ్బంది పడుతూ జాకెట్ హుక్స్ అని చెప్తుంది. సరే నేను పెడతాను అటు తిరుగమని ధీరజ్ అంటాడు. ప్రేమ తిరుగుతుంది. ఒకవైపు ధీరజ్ మరొకవైపు ప్రేమ ఇద్దరు సిగ్గుపడుతుంటారు. ధీరజ్ హుక్స్ పెడతాడు.మరొకవైపు శ్రీవల్లి అన్ని గిల్టీ నగలు బ్యాగ్ లో పెడుతుంది. అప్పుడే భాగ్యం ఫోన్ చేసి అన్ని సర్ధావా అని అడుగుతుంది. అన్ని సర్ధానని చెప్తుంది. అప్పుడే చందు వస్తాడు ఫోన్ లో మాట్లాడింది విన్నాడేమోనని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది కానీ చందు వినడు. బావ ఈ నగలన్ని మా అమ్మ లాకర్ లో పెట్టమంది అందుకే తీసుకొని వెళ్తున్నానని శ్రీవల్లి అనగానే సరే అని చందు అంటాడు. బావ ఈ మల్లె పులు నా తలలో పెట్టమని శ్రీవల్లి అనగానే చందు పెడుతాడు. అప్పుడే కామాక్షి వస్తుంది. దాంతో చందు సిగ్గుపడి వెళ్ళిపోతాడు. అమ్మ అందరిని బుట్టలో వేసుకోమంది కదా ఈవిడతో మొదలు పెడుదామని అనుకుంటుంది. ఇదిగోండి ఆడపడుచు కట్నం అంటూ ఒక గిల్టీ నగ  కామాక్షికి ఇస్తుంది. అది చూసి కామాక్షి హ్యాపీగా ఫీల్ అవుతూ అందరికి చూపిస్తానంటూ వెళ్తుంది. అయ్యో ఇప్పుడు దొరికిపోతానేమో అని శ్రీవల్లి బయపడుతుంది. మరొకవైపు శ్రీవల్లి నాన్న ఇడ్లీ అమ్ముతు ఉంటాడు‌. సాగర్, నర్మద వెళ్తుంటే ఇడ్లీ అమ్ముతున్న శ్రీవల్లి నాన్నని చూస్తుంది.  శ్రీవల్లి వాళ్ళ నాన్న అని సాగర్ కి చెప్తుంది నర్మద. అయన ఇడ్లీ అమ్మడం ఏంటని సాగర్ అంటాడు. నర్మద, సాగర్ అతని దగ్గరికి వెళ్తుంటే అతను వాళ్ళని చూసి దాక్కుంటాడు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే తెలుస్తుంది కదా అని సాగర్ తో నర్మద అంటుంది. ఆ మాట విని శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇంటికి వెళ్తాడు. తరువాయి భాగంలో శ్రీవల్లి వాళ్ళు భాగ్యం ఇంటికి వెళ్తారు. శ్రీవల్లితో భాగ్యం మాట్లాడుతుంటే ప్రేమ వస్తుంది. ఎక్కడ వాళ్ళ మాటలు విందేమోనని వాళ్ళు భయపడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2: జైలు నుండి ఇంటికొచ్చిన దీప.. శ్రీధర్ తిట్లు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -346 లో... దీపని ఇంటికి తీసుకొని వస్తాడు కార్తీక్. దీప ఇంటికి వస్తుందని తను వచ్చే దారిలో పూలతో డెకరేషన్ చేస్తుంది శౌర్య. ఇక దీప వచ్చి శౌర్యని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. నువ్వు వస్తున్నావని శౌర్య ఇదంతా చేసిందని కాంచన చెప్తుంది. దీప కి అనసూయ హారతి ఇచ్చి ఆహ్వానిస్తుంది. దీప లోపలికి వస్తుంది. కుబేర్ ఫోటో దగ్గరికి వచ్చి మొక్కుకుంటుంది. నాకు ఈ కుటుంబం కావాలి. ఎప్పుడు వీళ్ళతోనే ఉండాలని మొక్కుకుంటుంది. మరొక వైపు దీపని అరెస్ట్ చేసిన ఇన్‌స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి జ్యోత్స్న కలుస్తుంది. రిపోర్ట్ చేంజ్ చెయ్యమంటే ఎందుకు చెయ్యలేదు.. డబ్బు తీసుకున్నావ్ కదా అని అడుగుతుంది. మాటలు మర్యాదగా రానివ్వండి. డబ్బు పంపాను చూడండి అని అతను అంటాడు. మా బావ ఎంత ఇచ్చాడు.. మా బావకి అమ్ముడు పోయావా అని జ్యోత్స్న అంటుంది. దాంతో ఇన్‌స్పెక్టర్ కూతురిని కార్తీక్ కాపాడి బ్లడ్ ఇచ్చిన విషయం గుర్తుచేసుకుంటాడు. వాళ్ళు మంచి వాళ్ళు వాళ్లకు అన్యాయం జరగొద్దని నేను రిపోర్ట్ మార్చలేదని ఇన్‌స్పెక్టర్ చెప్పేసి వెళ్ళిపోతాడు.  ఆ తర్వాత కావేరి డాన్స్ చేస్తుంటుంది. అప్పుడే శ్రీధర్ వచ్చి చూస్తాడు. ఏంటి ఇంత హుషారుగా ఉన్నావని అడుగుతాడు. అదేం లేదు మీరు రండీ అంటూ శ్రీధర్ ని కావేరి రూమ్ లోకి తీసుకొని వెళ్లి బయటనుండి లాక్ వేస్తుంది. కిటికీ దగ్గరికి వెళ్లి దీప బెయిల్ పై బయటకు వచ్చిందని చెప్పగానే శ్రీధర్ షాక్ అవుతాడు. నా కోడలిని కలవడానికి నేను వెళ్తున్నా మీరు వెనకాలే వస్తారని ఇలా చేసానని చెప్పేసి కావేరి వెళ్ళిపోతుంది. కాసేపటికి దీప దగ్గరికి కావేరి వెళ్తుంది. ఆయన వస్తే ఏదో ఒక గోడవ చేస్తారని లాక్ వేసి వచ్చానని కావేరి చెప్తుంది. అయిన వచ్చాను కదా అని శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. ఇక ఎప్పటిలాగే దీప తప్పు చేసిందని తిడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రాజ్ బ్రతికే ఉన్నాడని తెలుసుకున్న దుగ్గిరాల కుటుంబం.. వారిద్దరికి తప్ప!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -710 లో....కావ్య, యామిని ఇద్దరు గొడవపడతారు రాజ్ ని ఎలాగైనా నా సొంతం చేసుకుంటానని యామిని అంటుంది. అది నీ వల్ల కాదని ఇద్దరు ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకుంటారు. ఆ తర్వాత కళ్యాణ్ వెళ్తుంటే రాజ్ కార్ కి సైడ్ ఇవ్వబోయి కిందపడతాడు. చూసుకో బ్రదర్ అంటూ రాజ్ చెప్పి వెళ్తాడు. రాజ్ ని చూసిన కళ్యాణ్ అన్నయ్య అంటూ వెళ్ళబోతుంటే ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వచ్చి ఆపుతాడు. లైసెన్స్ ఉందా అంటూ విసిగిస్తాడు అన్ని చూపెట్టేలోపు రాజ్ వెళ్ళిపోతాడు. అన్నయ్య అయితే బ్రతికే ఉన్నాడు హ్యాపీ కానీ నన్ను ఎందుకు గుర్తుపట్టలేదు.. అన్నీ కనుక్కోవాలని కళ్యాణ్ అనుకుంటాడు. కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఇంట్లో అందరిని పిలిచి అన్నయ్య బ్రతికే ఉన్నాడు. నాకు కన్పించాడని చెప్తాడు. ధాన్యలక్ష్మి, ఇందిరాదేవి, సీతారామయ్య మొదట నమ్మరు. ఆ తర్వాత అపర్ణ చెప్పాక అందరు నమ్ముతారు. రాజ్ గతం మర్చిపోయిన విషయం అంతా అపర్ణ చెప్తుంది. వెళ్లి రాజ్ ని తీసుకొని వద్దామని సీతారామయ్య అంటాడు. వద్దు నేనే ఆయన్ని మాములు మనిషిని చేసి తీసుకొని వస్తానని కావ్య చెప్తుంది. ఈ విషయం రాహుల్, రుద్రాణిలకి చెప్పొద్దని ఇందిరాదేవి అంటుంది. వాళ్లకు మాత్రం తెలియొద్దని ప్రకాష్ అంటుంటే మాకెందుకు తెలియొద్దు ఏంటది అంటు రాహుల్, రుద్రాణి ఎంట్రీ ఇస్తారు. ఏం లేదు అంటూ ధాన్యలక్ష్మితో సహా అందరు కవర్ చేస్తారు. అసలు ఏమో జరుగుతుందని రాహుల్, రుద్రాణి అనుకుంటారు. మరొకవైపు రాజ్ దగ్గరికి యామిని వచ్చి.. తమ ఫొటోస్ తో ఉన్న వెడ్డింగ్ కార్డు ఇస్తుంది. అది చూసి రాజ్ షాక్ అవుతాడు. తరువాయి భాగంలో మా ఫ్రెండ్ వెడ్డింగ్ ఆనివర్సరీ ఫంక్షన్ ఉంది అంటూ యామినికి చెప్పి రాజ్ లగేజ్ తో బయల్దేరతాడు. దాంతో కావ్యకి యామిని ఫోన్ చేసి నీతో వారం రోజులు రిసార్ట్ కి తీసుకొని వెళ్లి రాజ్ ని నీ వైపుకి తిప్పుకోవాలనుకుంటున్నావా అని అంటుంది. నీ ప్లాన్ ని అడ్డుకొని రాజ్ ని నాతో తెచ్చుకుంటానని యామిని అంటుంది. మరొకవైపు నా ఫ్రెండ్ తో పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నానంటు రుద్రాణి, రాహుల్ కి కావ్య చెప్పి వెళ్తుంది. కావ్య ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోమని రాహుల్ తో రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఇక్కడ 5 వేలు...అక్కడ 2 లక్షలు...టెక్నాలజీ అంటే ఇష్టం...

  టాలీవుడ్ లో ఒకప్పుడు చక్రి ఆధ్వర్యంలో ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన కౌసల్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. "నీ కోసం" అనే మూవీతో ప్లే బ్యాక్ సింగర్ గా ఆమె కెరీర్ స్టార్ట్ చేసింది. క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా ఆమె అన్ని రకాల సాంగ్స్ పాడి అలరించారు. ఆ తర్వాత ఆమె ఇక పాడడం ఆపేసారు. రీసెంట్ గా ఇంటర్వ్యూలో సింగర్స్ రెమ్యూనరేషన్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు."ఫిలిం ఇండస్ట్రీ అనేది బిజినెస్. అందులో మన సౌత్ సైడ్ ఫిలిం ఇండస్ట్రీలో పేమెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ముంబైలో ఒక సింగర్ కి మినిమం 2 నుంచి 3 లక్షలు పే చేస్తారు. కానీ ఇక్కడ ఒక సింగర్ కి 5 వేలు మాత్రమే ఇస్తారు. అది కూడా టాప్ పేమెంట్ అన్న లెక్కలో ఉంటుంది. నా కెరీర్ లో నేను తీసుకున్న హయ్యెస్ట్ పేమెంట్ 30 వేలు. కానీ ముంబై, చెన్నై నుంచి సింగర్స్ ని ఇక్కడికి రప్పించి పాటలు పాడించుకుంటే మాత్రం వాళ్లకు మాకంటే డబుల్ త్రిబుల్ పేమెంట్ ఇస్తారు. చెన్నైలో అంత పేమెంట్స్ ఎందుకు ఇస్తారు అంటే చెన్నై హెడ్ క్వార్టర్ కదా తెలుగు, తమిళ్ ఫిలిం ఇండస్ట్రీకి. ఇక హైదరాబాద్ అప్పుడప్పుడే చిన్న చిన్నగా ఎదుగుతోంది. ఐతే హైదరాబాద్ లో రికార్డింగ్స్ చేయడం అనేది ముందుగా ఎస్వి.కృష్ణ రెడ్డి గారు తీసుకొచ్చారు ముందుగా. మేము అప్పట్లో కోరస్ పాడేవాళ్ళం ఆ తర్వాత రమణ గోగుల గారు పాడారు. అలా స్టార్ట్ అయ్యింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ప్రస్తుతానికి నేను రిటైర్ ఐపోయాను. సింగర్స్ కి మేల్ సోలోస్ కి ఎక్కువ అవకాశం ఉంటుంది కానీ ఫిమేల్ సోలోస్ కి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా డ్యూయెట్స్ కి తీసుకుంటూ ఉంటారు. నేను శంకర్ మహదేవన్, హరిహరన్ వాయిస్ ని మిక్స్ చేసేదాన్ని. వాళ్ళ దాంట్లో కొన్ని లెటర్స్ తప్పులు వచ్చేవి. నాకు టెక్నాలజీ అంటే చాలా ఇష్టం అందుకే నేను టెక్నికల్ గా ఆ లెటర్స్ ని కరెక్ట్ చేసేదాన్ని పిచ్ కరెక్షన్స్ చేసేదాన్ని అది కూడా ఆ రోజుల్లో. నేను టెక్నాలజీలో అప్డేట్ గా ఉంటాను. కంపోజింగ్ అంటే ఇష్టం. నేనొక వ్లాగర్ ని. నా పాటను నేనే ఎడిట్ చేసుకున్నా..ఐఫోన్  తో షూట్ చేసుకుని, ఎడిట్ చేసుకుని ఒక మ్యూజిక్ వీడియోని రిలీజ్ చేసాను. "స్నేహమా" అని  హిందీలో "మాహియా" అని ఈ టు సాంగ్స్ నేనే చేసాను." అంటూ తనలోని ఇంకో కోణాన్ని కూడా బయట పెట్టింది సింగర్ కౌసల్య.

నేను ఉగ్రవాదిని కాను...నేను ఇండియన్ ని...

  సోహైల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మంచి ఫేమ్ తెచ్చుకున్న కంటెస్టెంట్. అలాగే కొన్ని మూవీస్ లో నటించాడు. కళింగపట్నం అనే రెస్టారెంట్ ని స్టార్ట్ చేసాడు. రీసెంట్ గా ప్రపంచ యాత్రికుడు ఐన యూట్యూబర్ నా అన్వేషణ సోషల్ మీడియాలో సోహైల్, మెహబూబ్ తో పాటు కొంతమందిని ఉగ్రవాదులతో పోల్చుతూ ఒక వీడియో రిలీజ్ చేసాడు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్లందరినీ ఉగ్రవాదులు అంటూ కామెంట్ చేసాడు. దాని మీద సోహైల్ ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు.  "పహాల్గమ్ దాడికి బెట్టింగ్ యాప్స్ కి లింక్ పెట్టి నన్ను ఉగ్రవాది అని ముద్ర వేయడం ఏమిటి ? నన్ను ఉగ్రవాది అనేసరికి నేను చాలా హార్ట్ అయ్యాను. ఎవరో నన్ను ఉగ్రవాది అన్నంత మాత్రాన నేను అది కాదు కదా. నేను ఇండియన్ ముస్లిం అని చెప్పుకోవడానికి చాలా గర్వపడతాను. నేను శివుడికి పాలాభిషేకం చేసాను. సంక్రాంతికి అప్పాలు చేసుకునేవాళ్లం. రంజాన్ వస్తే నా హిందూ ఫ్రెండ్స్ వచ్చి మసీదుకు వచ్చి నాతో పాటు నమాజ్ చేసేవాళ్ళు. గ్లాడ్ విన్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. అతనితో కలిసి మేమంతా చర్చి కి వెళ్ళేవాళ్ళం. మా ఇంటి దగ్గర వాళ్ళతో కొండగట్టుకు వెళ్ళేవాళ్ళం.  మాకు చికెన్ పాక్స్ వచ్చినప్పుడు పోచమ్మ తల్లి వచ్చిదంటూ మాకు దిగదుడిసే వాళ్ళు...అలాంటి వాతావరణంలో పెరిగిన ఎంతో మంది ముస్లిమ్స్ ఉన్నారు. అందులో నేను ఒకడిని. ఎక్కడో ఎవరో దాడులు చేస్తే వాళ్ళను అనకుండా ఇక్కడ మనకు మనం కొట్టుకునేలా చేసుకుంటున్నాం. మనం మనం గొడవలు పడుతూ ఉంటే మనం ఫెయిల్ అయ్యాము..వాళ్ళు సక్సెస్ అయ్యారు. మతం పేరుతో మనం మనం కొట్టుకుంటే ఎం వస్తుంది. నాకు హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు. నీకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. టెర్రరిస్టులకు ఏ మతం ఉండదు. ఇస్లాంలో ఒకటి ఉంటుంది నేను పుట్టించిన మనిషిని చంపే హక్కు నీకు లేదు అని ఉంటుంది. ఇప్పుడు ఇంత చేసిన వాళ్ళు ముస్లిమ్స్ కాదు అసలు రియల్ ముస్లిమ్స్ కాదు. మా అమ్మ లాస్ట్ ఇయర్ చనిపోయింది. ఆమెను ఎన్నో మాటలు అన్నావ్. నీకు అమ్మ ఉంది. కానీ నేను నీలా అనను. నువ్వు తిట్టినట్టు నేను కూడా తిట్టొచ్చు కానీ నేను అలా చేయను. తల్లులు ఎం చేసారు. కని పెంచి ఇంతవరకు తీసుకొచ్చారు. బతికే నాలుగు రోజుల కోసం ఇదంతా అవసరమా. హ్యాపీగా  ఉంటే చాలుగా. ఇస్లాంలో ఇదే చెప్తారు. మీ మతాన్ని ప్రేమించండి..పక్క మతాన్ని గౌరవించండి అని..అందరం కలిసి ఉంటే మంచిది" అని చెప్పాడు సోహైల్.

మా ఇంట్లో వాళ్లకు అసలు గొడవలు పడదు..నిఖిల్ ప్లే చేసే గేమ్స్ వేరు

  కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఈ రాబోయే వారానికి "ఫామిలీ థీమ్" ఇచ్చింది శ్రీముఖి. దాంతో కంటెస్టెంట్స్ అంతా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ ని తీసుకొచ్చారు. రోహిణి వాళ్ళ నాన్నను తీసుకొచ్చింది. ఐతే శ్రీముఖి వచ్చి ఆయనకు షాక్ హ్యాండ్ ఇస్తుండగా రోహిణి నాన్నో అంటూ గట్టిగా పిచ్చిగా అరుస్తూ ఉంది. వెంటనే శ్రీముఖి షాకింగ్ ఫేస్ పెట్టి ఇందాకే కదవే కింద కలిశావ్ అప్పుడే డాడీ అని అరుస్తున్నావేంటి.. అవసరమా  అని అడిగింది. తర్వాత పృథ్వి శెట్టిని చూస్తూ "షూటింగ్ పేరుతో సగం టైం నువ్వు హైదరాబాద్ లోనే ఉంటావ్ ఇక ఫామిలీతో గడిపే టైం ఎక్కడ ఉంటుంది చెప్పు" అంది. "ఫ్యామిలీ నా గుండెల్లో ఉంటారు" అని చెప్పాడు పృద్వి. దాంతో శ్రీముఖి నవ్వేసింది. తర్వాత నిఖిల్ విజయేంద్ర సింహ వాళ్ళ అమ్మ స్టేజి మీదకు వచ్చేసరికి "మీకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, నిఖిల్..సౌర్య ..ఇద్దరిలో ఎవరు ఆటల్లో స్మార్ట్ " అని అడిగింది. "నిఖిల్ ప్లే చేసే గేమ్స్ వేరు..సౌర్య ప్లే చేసే గేమ్స్ వేరు అని చెప్పింది" నిఖిల్ వాళ్ళ అమ్మ. ఇక ఫైనల్ గా డెబ్జానీ దగ్గరకు వచ్చి "నీకు ఎలాంటి ఫ్యామిలీ కావాలి" అని అడిగింది శ్రీముఖి. "ఎలాంటి ఫ్యామిలీ ఐనా పర్లేదు కానీ గొడవలు లేకుండా ఉంటే చాలు" అంది. అంతే వెంటనే జైల్లో ఉన్న ఇమ్మానుయేల్ డెబ్జానీని చూస్తూ "మా ఇంట్లో వాళ్లకు అసలు గొడవలు అంటే పడదు" అని చెప్పాడు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ ఐతే " డెబ్జానీని తెగ పొగిడేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీని చూపించండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు".డెబ్జానీ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి వేదా రోల్ ద్వారా బాగా దగ్గయ్యింది. తర్వాత సత్యభామ సీరియల్ లో నటించింది.  

ఆది ఉంటే జబర్దస్త్ చేస్తా

  బుల్లితెర మీద రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటు షోస్ లో అప్పుడప్పుడు సీరియల్స్ లో జబర్దస్త్ లో కనిపిస్తూ అలరిస్తూ ఉండే అమ్మాయి. అలాంటి రీతూ లైఫ్ తన గోల్ ఏంటో సూటిగా చెప్పింది. "ముందు నేను ఈఎంఐలు క్లియర్ చేసుకుని హ్యాపీగా ఉండాలి. ఎక్కడైనా ఊరవతల ఒక చిన్న ఇల్లు కట్టుకుని రెండు బర్రెలు పెట్టుకుని వాటిని కాసుకుంటాను. ఎందుకంటే నాకు పెరుగంటే ఇష్టం. కర్డ్ రైస్ ఎక్కువగా తింటాను. బయట కొనుక్కుంటే వచ్చే పెరుగు నేచురల్ గా వచ్చే పెరుగు కావాలి..ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటాను. కొన్ని కూరగాయ మొక్కలు వేసుకుని వాటిని పెంచుకుంటాను. చిన్న చిన్న స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటాను. ఏ బాధలు లేవు అన్నప్పుడు రోజూ వ్లాగ్స్ చేసుకుంటూ ఇంట్లో కూర్చుంటా. జబర్దస్త్ లో ఇప్పుడు ఆది లేడు కాబట్టి చేయను..ఆది ఉంటే చేస్తా. ఐతే నేను ఆది టీమ్ లోకి ఎలా ఎంటరయ్యానంటే అప్పట్లో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి రామ్ ప్రసాద్ వీళ్లంతా ఫ్రెండ్స్. వీళ్ళు రామ్ మూవీలో నటిస్తున్నారు. ఆ పార్టీకి మా ఫ్రెండ్ నన్ను కూడా తీసుకెళ్లింది. రామ్ ప్రసాద్ కి పరిచయం చేసింది. అప్పుడు నేను చెప్పా ఇలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని  అనుకుంటున్నట్లు చెప్పాను. ఆ తరువాత రామ్ ప్రసాద్ ఫోన్ చేసి ఆది టీమ్ లోకి పర్సన్ కావాలి అని ఫోన్ నంబర్ ఇచ్చి చేయమని చెప్పాడు. అలా ఆది టీమ్ లోకి వెళ్లాను.జబర్దస్త్ లో అజర్ తో నాకు ఒక ట్రాక్ రన్ చేశారు. ఐతే అజర్ అంత ఫ్రెండ్లీ ఇష్టం అంతే. " అని చెప్పింది రీతూ చౌదరి.

Illu illalu pillalu : ఆమె జాకెట్ హుక్ పెట్టిన ధీరజ్.. ‌శ్రీవల్లి కపటనాటకం!

  స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -146 లో.....ప్రేమ ధీరజ్ స్టోర్ రూమ్ కి వెళ్తారు. రూమ్ నీట్ గా సర్దుతారు. ఒకవైపు వర్క్ చేస్తునే టామ్ అండ్ జెర్రీ లాగా ఫైట్ చేసుకుంటారు ప్రేమ కింద పడిపోతుంటే ధీరజ్ పట్టుకుంటాడు. ఒకరినొకరు ప్రేమ గా చూసుకుంటారు. ఆ తర్వాత ధీరజ్ కి కాఫీ తీసుకొని వస్తుంది ప్రేమ. ఇద్దరు ఒకరివంక ఒకరు చూస్తూ ప్రేమగా చూసుకుంటారు. మరొకవైపు భాగ్యం దేవుడికి మొక్కుకుంటుంది. ఎందుకు ఇలా దేవుడిని భయపెడుతున్నావని భాగ్యంతో తన భర్త అంటాడు. మన శ్రీవల్లికి ఎంత మంచి సంబంధం దొరికింది ఎట్టకేలకు వాళ్ళ ఇంటికి పంపించామని భాగ్యం అంటుంది. ఒకసారి ఫోన్ తీసుకొని రా శ్రీవల్లికి ఫోన్ చెయ్యాలి అంటుంది. భాగ్యంకి తన భర్త ఫోన్ తీసుకొని వచ్చి ఇస్తాడు. అప్పుడే శ్రీవల్లి ఫోన్ చేస్తుంది. నువ్వు రాత్రి చెప్పినట్టు చేసాను.. వాళ్ళ శోభనం ఆపేసానని శ్రీవల్లి చెప్తుంటే నర్మద వస్తుంది కానీ తన మాటలు వినదు. నర్మద రాగానే శ్రీవల్లి మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంది. బయటకు వచ్చి మాట్లాడుతుంటే నర్మద వస్తుంది ఏంటి అక్క అలా టెన్షన్ పడుతున్నావని నర్మద అడుగుతుంది. మా అమ్మతో మాట్లాడుతున్నాను.. రోజు మా అమ్మ మాట్లాడుతుంది.. అయ్యో నీకు ఇలా అమ్మతో మాట్లాడే అదృష్టం లేదు కదా అని నర్మద బాధపడేలా శ్రీవల్లి మాట్లాడుతుంది. ఆ తర్వాత రామరాజుకి భాగ్యం ఫోన్ చేసి పదహారు రోజుల పండుగకి అందరు రండి అని చెప్తుంది. నాకు వీలు అవ్వదు వాళ్ళు వస్తారని రామరాజు చెప్తాడు. వల్లి మీ వాళ్ళతో మాట్లాడమని వేదవతి అనగానే.. నాకూ అమ్మనాన్నలాగా మీరు ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడాలనిపించడం లేదని అనగానే నర్మద షాక్ అవుతుంది. నాకు ఆఫీస్ ఉంది నేను రానని నర్మద ఆఫీస్ కి వెళ్తుంది. తరువాయి భాగంలో ప్రేమ రెడీ అవుతూ నర్మదని పిలుస్తుంది కానీ ధీరజ్ వచ్చి ఏంటని అడుగుతాడు నా జాకెట్ హుక్ పెట్టాలని అనగానే ధీరజ్ పెడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీపకు బెయిల్.. నెగెటివ్ గా చెప్పిన జ్యోత్స్న!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -345 లో.... దీప చేతిలో ఉన్న గన్ పేలలేదు దశరథ్ ని షూట్ చేసింది ఆ గన్ లో ఉన్న బుల్లెట్ తో కాదని ఫోరెన్సిక్ రిపోర్ట్ ద్వారా జడ్జ్ చెప్తుంది. అదే టైమ్ కి ఎవరో గన్ తో షూట్ చేశారని దీప తరుపు లాయర్ వాదిస్తాడు. అలా కేసుని తప్పు దోవ పట్టించొద్దని భగవాన్ దాస్ అంటాడు. అసలు దీప ట్రిగర్ పై వేలు పెట్టలేదు అనడానికి సాక్ష్యాలు అంటూ శివన్నారాయణ ఇంట్లో సీసీటీవీ లో ఫుటేజ్ ఫొటోస్ కళ్యాణ్ ప్రసాద్ జడ్జ్ కి ఇస్తాడు. అది చుసి అవునని జడ్జ్ చెప్తుంది. ఆ ఫొటోస్ మార్చి ఉండొచ్చు కదా అని భగవాన్ దాస్ అంటాడు. అదేం లేదు అది సర్టిఫిడ్ ఫోటోస్ అని కళ్యాణ్ ప్రసాద్ చెప్తాడు. అన్ని వాదనలు విన్న జడ్జ్ దీప ప్రమేయం లేదు కానీ ఎవరో కావాలనే షూట్ చేశారు.. వాళ్లెవరో కనుక్కోండి.. అప్పటివరకు దీపకి బెయిల్ మంజుర్ చేస్తున్నానని జడ్జ్ చెప్తుంది. అలాగే జ్యోత్స్నని ఇంటరాగేషన్ చెయ్యాలని చెప్తుంది. దీప బెయిల్ పై బయటకు వస్తున్నందుకు కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత అనవసరంగా మనమే దీపని తప్పుగా అర్థం చేసుకున్నామా అని శివన్నారాయణతో సుమిత్ర అంటుంది. అదేంటీ వీళ్ళు దీపకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. అలా జరగకూడదని జ్యోత్స్న సుమిత్ర వాళ్ళ దగ్గరికి వచ్చి.. దీపని కాపాడడానికి బావ లంచం ఇచ్చి ఇదంతా చేసాడంటూ నెగెటివ్ గా చెప్తుంది. ఆ తర్వాత సుమిత్ర, శివన్నారాయణ కలిసి కార్తీక్, దీపల దగ్గరికి వెళ్లి ఇంత దిగజారుతావనుకోలేదు.. నీ భార్యని కాపాడడానికి ఇలా చేస్తావా అంటూ కార్తీక్ పై కోప్పడతారు. దీప ఏ తప్పు చేయలేదని కార్తీక్ అంటాడు. అయిన వాళ్ళు వినకుండా అలాగే మాట్లాడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : యామిని కావ్య మధ్య గొడవ.. వారిద్దరికి బ్రహ్మముడి పడనుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -709 లో...... కావ్య రాజ్ ఇచ్చిన చీర కట్టుకొని మురుసిపోతుంది. అప్పుడే రాజ్ ఫోన్ చేస్తాడు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను పైగా మీ మావయ్య చూసాడు అన్నారు కదా ఏం అనలేదు కదా అని రాజ్ అడుగుతాడు. లేదండి మిమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని కావ్య చెప్తుంది. నన్ను చూసి హ్యాపీగా ఫీల్ అవడమేంటని రాజ్ అడుగుతాడు. అంటే మీరు నా ఫ్రెండ్ అని చెప్పాను కదా మీరు మావయ్యకి చాలా బాగా నచ్చారట అని కావ్య చెప్తుంది. నేను ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉందని రాజ్ అడుగగా.. చాలా బాగుందని కావ్య చెప్తుంది. మరుసటిరోజు ఉదయం కావ్య కిచెన్ లో వర్క్ చేస్తుంటే.. ఈ పనులు చేసుకుంటూనే ఉంటావా వెళ్లి రాజ్ తో మాట్లాడమని అపర్ణ చెప్తుంది. దానికి కావ్య సరే అంటుంది. ఆ తర్వాత మనం బయటకు వెళదాం బావ అని యామిని అంటుంది. సరే అని యామినితో రాజ్ వెళ్తుంటే.. కావ్య ఫోన్ చేసి కలవాలంటుంది. సరేనని రాజ్ అంటాడు. ఫ్రెండ్ ని కలవాలంటూ రాజ్ యామినికి చెప్పి కావ్యని మీట్ అవుతాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే యామిని చూస్తుంది. రాజ్ వెళ్ళిపోయాక కావ్యతో గొడవ పడుతుంది యామిని. రాజ్ నా వాడు.. నీ కంటే ముందు రాజ్ నాకు తెలుసని యామిని అంటుంది. ఆయన చూసావ్ కదా నన్ను వదిలి ఉండడం లేదని కావ్య ఇద్దరు వాదించుకుంటారు. తరువాయి భాగంలో అన్నయ్య బ్రతికే ఉన్నాడని ఇంట్లో అందరికి కళ్యాణ్ చెప్తాడు. వెళ్లి తీసుకోద్దామని సీతారామయ్య అంటాడు. వద్దు కొన్ని రోజులు ఆగండి.. నేను ఆయన్ని మాములు మనిషిని చేసి తీసుకొని వస్తానని కావ్య చెప్తుంది. మరొకవైపు కావ్య రాజ్ ఫోటోతో ఉన్న వెడ్డింగ్ కార్డు యామిని రాజ్ కి ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మా అమ్మే నాన్నలా నన్ను చూసుకుంది : గుప్పెడంత మనసు రిషి సర్

  మదర్స్ డే స్పెషల్ గా "లవ్ యు అమ్మ" అనే షో త్వరలో స్టార్ మా ఆడియన్స్ కోసం రాబోతోంది. ఈ షోకి హోస్ట్స్ గా యాంకర్ రవి, విష్ణు ప్రియా వచ్చారు. "మన మొదటి ప్రేమ తన కౌగిలింత, మన మొదటి ముద్ద తన చేతి వంట..ఈరోజు ఈ స్టేజి అంతా అమ్మ ప్రేమతో నిండిపోతుంది" అంటూ ఇంట్రడక్షన్ ఇచ్చాడు రవి. ఈ షోకి గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముకేశ్ గౌడ, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్, బిగ్ బాస్ నుంచి ప్రేరణ, గౌతమ్ కృష్ణ, విజె సన్నీ, బ్రహ్మముడి కావ్య అలియాస్ దీపికా ఇలా చాలామంది వచ్చారు. ఇక ఇమ్మానుయేల్ వాళ్ళ అమ్మ ఐతే విష్ణు ప్రియాకి కౌంటర్ ఇచ్చింది. "విష్ణు ప్రియా మేము మా పిల్లలతో వచ్చాము. నువ్వు మీ పిల్లలతో రాలేదే" అని అడిగేసరికి ఆమె నోరెళ్లబెట్టింది. ఆ తర్వాత రవి "అమ్మ పాడిన జోల పాత ఎంతమందికి గుర్తుంది" అని అడిగాడు. అప్పుడు విజె సన్నీ భుజం మీద తల పెట్టి పడుకున్న వాళ్ళ అమ్మకు జోల పాడాడు "నంది కొండా వాగుల్లోనా" అంటూ దాంతో వాళ్ళ అమ్మ షాకయ్యింది. "మా అమ్మ గనక నాకు జోల పాట పాడితే నేను నిద్రపోను మా అమ్మే నిద్రపోతుంది" అని చెప్పింది దీపికా. ఇక అందరికీ ఇష్టమైన నటుడు ముకేశ్ గౌడ అలియాస్ రిషి సర్ వచ్చి మాట్లాడాడు " మా నాన్న రెండేళ్లు బెడ్ మీదనే ఉన్నారు. ఆ తర్వాత పారలైజ్ అయ్యాక ఇంట్లోనే తిరుగుతూ ఉండేవాళ్ళు. ఐతే ఒక ఏజ్ కి వచ్చాక ఫాదర్ సపోర్ట్ అనేది అవసరం అవుతుంది. మా అమ్మే నన్ను మా నాన్నలా చూసుకుంది. నెటిజన్స్ ఇక ముకేశ్ గౌడాని చూసి ఫుల్ ఫిదా ఐపోతున్నారు. రిషి సర్ ని పిలిచినందుకు ధన్యవాదాలు అంటూ కామెంట్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలోకి వెళ్లడం అంటే బట్టలిప్పి రోడ్డు మీదకు రావడం లాంటిది

  బుల్లితెర మీద బులెట్ భాస్కర్ అంటే తెలియని వారు లేరు. ఆయన జబర్దస్త్ లో వేసే పంచులు మాములుగా ఉండవు. అలాగే టాలెంట్ ఉన్న వాళ్ళను కూడా జబర్దస్త్ లోకి తీసుకొచ్చాడు. అలాంటి బులెట్ భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో చాల విషయాలు చెప్పాడు. "సోషల్ మీడియాకి ఎందుకు దూరంగా ఉంటున్నావు..యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ అసలు ఎందుకు కనిపించవు " అన్న ప్రశ్నకు "సోషల్ మీడియాలోకి వెళ్లడం అంటే బట్టలిప్పి రోడ్డు మీదకు రావడం లాంటిది. నిజం చెప్పాలంటే బట్టలు ఎక్కడ మార్చుకోవాలి బెడ్ రూమ్ లో అదే బయట మార్చుకుంటే ప్రతీ ఒక్కరూ అడుగుతారు. అలా బయటకు రావడం ఎందుకు వేరే వాళ్లతో అనిపించుకోవడం ఎందుకు. ఉదాహరణకు ఎవరో ఒక అతను యూట్యూబ్ లో వీడియో చేస్తూ ఈ రోజు మా ఆవిడ ఎం చేసిందో తెలుసా అంటాడు ఇంతలో కింద ఒకడు కామెంట్ పెడతాడు ఏమని అంటే... మీ ఆవిడ నడుం మీద పుట్టు మచ్చ బాగుంది అని కామెంట్ చేస్తాడు. అలాంటి కామెంట్స్ అవసరమా..అందరూ పోజిటివ్ గానే పెట్టరు కదా కామెంట్స్. ఏ విషయాన్ని ఐనా కూడా నేను భరించగలను కానీ ఒకళ్ళతో అనిపించుకోవడం ఒకరితో చెప్పించుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకు వాళ్ళతో మాటలు అనిపించుకోవడం.. తినడానికి, ఉండడానికి ఉంటే చాలు. అందరూ అంటారు యు ట్యూబ్ ఛానెల్ పెట్టుకోండి అని కానీ వద్దు బాబోయ్ అంటూ ఉంటాను నేను. జబర్దస్త్ లో మా నాన్నకు నాకంటే ఎక్కువ ఫాలోయింగ్ వచ్చింది. కార్యక్రమాల కోసం విదేశాలు వెళ్లినా కూడా మా నాన్ననే అడుగుతారు. మా నాన్న బయట ఎలా మాట్లాడతాడో స్టేజి మీద కూడా అలాగే మాట్లాడతాడు. దేవుడి దయ వలన నేను కష్టపడి పని చేసి వాళ్ళను చూసుకుంటున్నాను. నేను బయటకు వచ్చి ఫ్రెండ్స్ తో వెళ్లి ఎంజాయ్ చేయడం వంటివి ఏమీ చేయను. ఇంట్లో సరుకులు ఇపోయాయ వెళ్లి తేవడం పిల్లలకు ఎం కావాలో చేయడం ఇంటిని చక్కబెట్టుకోవడం ఇదే లైఫ్. ఐతే ఈవెంట్స్ చేసుకుంటా లేదంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తా. " అని చెప్పాడు బులెట్ భాస్కర్ .