తెలియక బెట్టింగ్ యాప్స్ ప్రోమోట్ చేశా

  జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ఎన్నో ఈవెంట్స్, షోస్ , సీరియల్స్ లో నటించింది రీతూ. ఇక ఈమె చుట్టూ గత ఏడాది నుంచి 700 కోట్ల స్కాం అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రొమోషన్స్ వంటి వివాదాలలో ఆమె ఇరుక్కుపోయిన విషయం అందరికీ తెలుసు. ఇక ఆమె తన సీక్రెట్ పెళ్లి గురించి చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. "మేము ఒక ప్రోపర్ రిలేషన్ షిప్ లో ఒక ఏడాది పాటు ఉన్నాము. ప్రస్తుతం ఉన్న జనరేషన్ వల్లనో నా మెంటాలిటీ వల్లనో, అతని మెంటాలిటీ వల్లనో ఇద్దరికీ సెట్ కాలేదు. మహా అంటే కలిసి ఆరు నెలలు ఉండుంటాం..నేను దాన్ని పెళ్లి అని ఐతే అనను. ఎందుకంటే అది పెళ్లి కాదు కాబట్టి. సోషల్ మీడియాలో ఫొటోస్ ఎవరు రిలీజ్ చేశారో తెలీదు. ఆ ఫొటోస్ నా దగ్గర కూడా లేవు. ఆ ఫొటోస్ కి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. బ్రేకప్ ఎందుకు జరిగింది అన్న విషయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మందికి బ్రేకప్ జరుగుతోంది. నాగ చైతన్యకు సమంతకు ఎందుకు బ్రేకప్ అయ్యిందో తెలుసా...విడిపోవడానికి ఎవరి దగ్గర పర్టికులర్ రీజన్ అంటూ ఏమీ ఉండదు. అదంతా పర్సనల్. ఇప్పుడు ఇది చెప్పడం వలన అతని పర్సనల్ లైఫ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి నేను చెప్పను. ఇద్దరం కలిసే బ్రేకప్ అయ్యాము. రిలేషన్ షిప్ కి ఒక దణ్ణం, మగజాతికి ఒక దణ్ణం. పెళ్లి ఒక ట్రామా. పెళ్లి అంటేనే పారిపోవాలని అనిపిస్తోంది. పెళ్లి చేసుకొని ఇలాగే చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు నచ్చినవాడు దొరకలేదు. మా అమ్మకు మా నాన్న లాంటి వాడు దొరికాడు. ఆయన లాంటి వాళ్ళు దొరికితే నేను హ్యాపీ. పెళ్లి అంటే మెంటల్ టార్చర్, చిరాకు, అదొక టాక్సిక్ , అదొక డిప్రెషన్ అన్నీ. ఇక బెట్టింగ్ యాప్స్ మీద కూడా నా పేరు బాగా బయటకు వచ్చింది. తెలీనప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసాను. కానీ అది తప్పు అని తెలిసాక చేయలేదు.." అని చెప్పిన రీతూ చౌదరి.    

నా అకౌంట్ బ్లాక్ అయ్యింది...నా స్లీవ్‌లెస్ డ్రెస్ ఫొటోస్ పెట్టి కొత్త స్టోరీలు అల్లొద్దు

  ప్రవస్తి ఆరాధ్య  తాను పాడుతా తీయగా షోలో ఎదుర్కున్న ఎన్నో ఇష్యుస్ ని బయట పెట్టింది. ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రోజూ ఏదో ఒక కొత్త విషయం బయటకు వస్తూనే ఉంది. అలాగే సునీత, కీరవాణి, చంద్రబోస్ వంటి లెజెండరీ సింగర్స్ మీద కూడా అలిగేషన్స్ చేసిన ప్రవస్తికి వాళ్ళు కూడా ఇన్డైరెక్ట్ గా కౌంటర్లు  ఇస్తున్నారు. అలాగే జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. దానికి ప్రవస్తి కూడా ఊరుకోకుండా రికౌంటర్లు ఇస్తోంది. ఇప్పుడు ఇంకో పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "చాలా మంది నా స్లీవ్‌లెస్ డ్రెస్ ఫొటోస్ ని పోస్ట్ చేస్తూ,  అప్పుడు రాని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటూ  ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో నేను ఆ దుస్తులు వేసుకోమంటూ నన్ను ఎవరూ బలవంతం చేయలేదు, అది నా ఇష్టం మేరకు వేసుకున్నాను. మన ఇష్టానుసారం వేసుకోవడానికి అలాగే ఎవరైనా మనల్ని ఫోర్స్ చేసి వేసుకునేలా చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఐనా స్లీవ్‌లెస్ డ్రెస్సులు వేసుకోవడం వలన కలిగే సమస్యల గురించి నేను ఎక్కడా ప్రస్తావించలేదు. నేను చెప్పిన విషయాన్నీ  మార్చేసి సొంత కథలు క్రియేట్ చేయొద్దు" అంటూ ఒక కౌంటర్ పోస్ట్ చేసింది. అలాగే ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో కూడా ఒక పోస్ట్ పెట్టింది.. " హాయ్ ..నా అకౌంట్ బ్లాక్ అయ్యి మూడు రోజులు అయ్యింది. "చాకిరీ" అని కామెంట్ చేసిన వీడియోకి కాపీ రైట్ ఇష్యూ వచ్చింది. నేను పోస్టులకు రిప్లై ఇవ్వలేను. నేను బాగున్నాను సేఫ్ గా ఉన్నాను. మీ ఆదరణకు నా కృతఙ్ఞతలు" అని చెప్పింది. అలాగే ప్రవస్తి తనకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారూ వాళ్ళ కామెంట్స్ ని కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది.

ముమైత్ ఖాన్ బ్రెయిన్ లో కొన్ని వైర్స్ ఉన్నాయి.. ఐనా స్టంట్ చేయడానికి వచ్చింది  

  కాకమ్మ కథలు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి శేఖర్ మాష్టర్, ముమైత్ ఖాన్ వచ్చారు. ఇక ముమైత్ ఖాన్ గురించి ఇచ్చిన ఇంట్రడక్షన్ బాగుంది. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ఇంతకంటే గొప్పగా కావాలని వాళ్ళ అమ్మ మొక్కి పెట్టుకున్న పేరు ముమైత్ ఖాన్ అని చెప్పింది. "ముమైత్ ఖాన్ బ్రెయిన్ లో ఏడో, ఎనిమిదో వైర్స్ ఉన్నాయి. ఆమె ఎంత సఫర్ అయ్యిందో నేను చూసాను" అని హోస్ట్ తేజస్విని చెప్పింది. ఇక ముమైత్ చెప్తూ "అనరిజం కోయిలింగ్ అనే సమస్యతో బాధపడుతున్నాను. ఈ సమస్య వలన షూ లేస్ కట్టుకోవడం కూడా డేంజర్"అని చెప్పింది. మళ్ళీ తేజు మాట్లాడుతూ "షూ లేస్ కట్టుకోవద్దని డాక్టర్ చెప్తే బాంగ్ కాక్ కి స్టంట్ షో చేయడానికి వచ్చింది. ఒక రోజు స్టంట్ షో చేసేసింది నెక్స్ట్ డే ముమైత్ లేవడం లేదు" అని చెప్పింది. మళ్ళీ ముమైత్ మాట్లాడుతూ "నేను స్వప్నా దత్ కి చెప్పాను నేను ఒక వేళా లేవలేకపోతే నేను చనిపోయినట్టు అని అర్ధం చేసుకో..నాకు ఆ సిట్యుయేషన్ ని యాక్సెప్ట్ చేయడానికి రెండేళ్లు పట్టింది " అన్నానని చెప్పింది. గాడ్ ఫాథర్ అన్న పొజిషన్ కానీ పేరు కానీ ఇవ్వాలంటే ఎవరికీ ఇస్తారు అని అడిగింది తేజు.."పూరి జగన్నాధ్, రాజమౌళి" అని చెప్పింది ముమైత్. ముమైత్ తన సివియర్ హెల్త్ కండిషన్ తో చాల ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇక ఇప్పుడు షోస్ లో కనిపిస్తోంది. అలాగే ఆహా వాళ్ళ డాన్స్ ఐకాన్ లో మెరిసింది. పోకిరి మూవీలో  "ఇప్పటికింకా నా వయసు" అన్న ఐటెం సాంగ్ తో ముమైత్ ఫుల్ పాపులర్ అయ్యింది.  

Illu illalu pillalu : శ్రీవల్లి పెట్టిన ఫిట్టింగ్.. స్టోర్ రూమ్ లో ప్రేమ, ధీరజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -145 లో.....ప్రేమ, ధీరజ్ బయటకు వచ్చి కూర్చుంటారు. మరొకవైపు చందు, శ్రీవల్లి గదిలో ఉంటారు. సాగర్ నర్మద వాళ్ళు ప్రేమలో మునిగిపోతారు. మూడు జంటలు సరదాగా గడుపుతారు. మరుసటి రోజు ఉదయం రామరాజు ఒక దగ్గర టీ తాగుతుంటే ఊళ్ళో పెద్ద మనుషులు రామరాజు గురించి గొప్పగా మాట్లాడుతారు. పెద్ద కోడలికి ఒక్క రూపాయి కట్నం తీసుకోకుండా మీ కొడుకుకి చేసుకున్నారు. కోడళ్ళని కూతుళ్ళలాగా చూసుకుంటారని అందరు గొప్పగా మాట్లాడతారు‌. ఇక అక్కడే ఉన్న సేనాపతి అది వినలేక ఏంటి బాగా చూసుకునేది అని కోప్పడతాడు. పెద్ద కోడలు వచ్చాక చిన్న కోడలిని బయట పడుకోమ్మన్నారని రామరాజు గురించి నెగెటివ్ గా మాట్లాడతాడు. దాంతో రామరాజు కోపంగా ఇంటికి వచ్చి వేదవతిని పిలిచి మన రూమ్ లో ఉన్న సామాను బయట పెట్టించి అందులో ప్రేమ, ధీరజ్ ని ఉండమని చెప్పు.. ఊళ్ళో వాళ్లంతా చిన్న కోడలు, కొడుకుని బయటకు పంపించారని అనుకుంటున్నారు. మేమ్ హాల్లో ఉంటామని రామరాజు అంటాడు. ఎందుకు మావయ్య వాళ్ళు అందరు చూసేలా అలా బయట పడుకున్నారు కాబట్టి ఈ రోజు అందరిలో మీ పరువుపోయిందని శ్రీవల్లి కావాలనే మాట్లాడుతుంది. వాళ్ళు కావాలని ఏం వెళ్ళలేదని నర్మద మాట్లాడుతుంది.  మీరు హాల్లో ఎందుకు మావయ్య మేమ్ స్టోర్ రూమ్ లో ఉంటామని శ్రీవల్లి అంటుంది. దానికి చందు సరే అంటాడు. మీరెందుకు మేమ్ ఉంటాం స్టోర్ రూమ్ లో అని ధీరజ్ అంటాడు. దానికి రామరాజు సరే అంటాడు. హమ్మయ్య ఒకరికి స్టోర్ రూమ్ కి పంపాను.. ఇంకొక కోడలు సంగతి చూడాలని శ్రీవల్లి అనుకుంటుంది. ధీరజ్, ప్రేమ స్టోర్ రూమ్ కి వెళ్తారు. తరువాయి భాగం లో ప్రేమ, ధీరజ్ ఇద్దరు స్టోర్ రూమ్ క్లీన్ చేస్తారు. అలా క్లీన్ చేస్తున్నప్పుడు ప్రేమ కింద పడిపోబోతుంది. అప్పుడే దీరజ్ పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : ఫోరెన్సిక్ రిపోర్ట్ చూసి అంతా షాక్.. ఆ గన్ పేల్చింది ఎవరు?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -344 లో... దీపని కలవడానికి అనసూయ జైలుకి వస్తుంది. ఇక శౌర్యకి తల్లి అయిన తండ్రి అయిన కార్తీక్ బాబే నేను బయటకు వస్తానన్న నమ్మకం నాకు లేదని దీప అంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. తల్లి అయినా తండ్రి అయినా నేనే అనేవరకు ఒకే కానీ అలా శౌర్య కూడా అనుకోవాలి కదా అని కార్తీక్ అంటాడు. అయితే ఇప్పుడు నేను శౌర్యకి వేరొక అమ్మని తీసుకొని రావాలా అని కార్తీక్ అనగానే కార్తీక్ బాబు అని అనసూయ అంటుంది. ఇప్పుడు దీప మాట్లాడుతున్న మాటలకి సారాంశం అదే అనసూయ గారు అని కార్తీక్ అంటాడు. పోనీ నువ్వే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చెయ్ అని కార్తీక్ వెటకారం గా మాట్లాడతాడు అసలు నువ్వు బయటకు రావు అని చెప్పింది ఎవడు.. నా భార్యని బయటకు తీసుకొని వస్తాను. నా కూతురికి మాటిచ్చాను. మీ అమ్మని బయటకు తీసుకొని వస్తానని అని కార్తీక్ అంటాడు. అనసూయ గారు మీరు వెళ్ళండి దీపతో నేను కోర్ట్ కి వెళ్తాను. నిర్ధోషి గా బయటకు తీసుకొని వస్తానని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే బోన్ లో దీప ఉంటుంది. శివన్నారాయణని కళ్యాణ్ ప్రసాద్ బోన్ లోకి పిలిచి మాట్లాడతాడు. దీపకి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నట్లు తనకి జీవితకాలం జైలు శిక్ష విధించినట్లు జ్యోత్స్న ఉహించుకుంటుంది. ఏంటి కల కంటున్నావా ఇంకా తీర్పు ఇవ్వలేదని పారిజాతం అంటుంది. ఇన్‌స్పెక్టర్ వచ్చి జడ్జ్ కి ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇస్తాడు. గన్ పై వేలిముద్రలు దీపవే కానీ దీప పట్టుకున్న గన్ లో బుల్లెట్ దశరత్ ని కాల్చింది కాదు. అది వేరే బుల్లెట్ అని జడ్జ్ రిపోర్ట్ ని చూసి చెప్పగానే అంత షాక్ అవుతారు. దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది జ్యోత్స్న డిస్సపాయింట్ అవుతుంది. ముందు నుండి చెప్తుంది అదే దీప చేతిలోని గన్ పేలలేదు వేరొక గన్ పేలింది. అది పేల్చింది ఎవరు అని కళ్యాణ్ ప్రసాద్ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : సుభాష్ కి నిజం చెప్పేసిన కావ్య.. ఆ ఇద్దరి మధ్య ఛాలెంజ్!

    స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -708 లో..... కావ్య ఇంట్లో వాళ్ళు ఎవరు చూడొద్దని డోర్ వేస్తుంది కానీ రాజ్ వెళ్తుంటే రాజ్ కి సుభాష్ ఎదురుపడతాడు. రాజ్ ని చూసి సుభాష్ షాక్ అవుతాడు. అపర్ణ, అప్పు బయటకు వస్తారు. మరొకవైపు బావ ఇంకా రాలేదు అని యామిని జీపీఎస్ ఆన్ చేసి చూస్తుంది. లొకేషన్ రాజ్ ఇల్లు చూపించడంతో యామిని షాక్ అవుతుంది. రాజ్ వాళ్ళింటికి వెళ్ళిపోయాడని తన పేరెంట్స్ కి చెప్తుంది. ఆ తర్వాత రాజ్ ని సుభాష్ చూస్తూ ఉంటాడు. మావయ్య తను రామ్.. నా ఫ్రెండ్ అని కావ్య కవర్ చేస్తుంది కానీ సుభాష్ మాత్రం బిత్తరపోయి చూస్తుంటాడు. హాయ్ అంకుల్ అని రాజ్ అనగానే.. సుభాష్ ఆశ్చర్యంగా చూస్తాడు. మీరు వెళ్ళండి రామ్ గారు అని రాజ్ ని పంపిస్తుంది కావ్య. అదంతా సుభాష్ కి ఏం అర్ధం కాదు. రాజ్ వెళ్లిపోతు వెనక్కి తిరిగి చూస్తూ వెళ్తాడు. ఆ తర్వాత కావ్య అపర్ణ, అప్పు, సుభాష్ గదిలో మాట్లాడుకుంటారు. నాకు ఏం అర్థం అవ్వడం లేడని సుభాష్ అంటాడు. దాంతో కావ్య జరిగింది మొత్తం చెప్తుంది. తను మీ అబ్బాయి రాజ్ కానీ తనకి గతం గుర్తు లేదు అలా గతం గుర్తుచేసే ప్రయత్నం చేస్తే తనకి ప్రమాదం అంట అని కావ్య చెప్తుంది. ఇంత బాధపడుతుంటే నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదని సుభాష్ అడుగుతాడు. కొన్ని రోజులు ఆగితే అంత సెట్ అవుతుందని అపర్ణ, కావ్య అంటారు. సరేనని సుభాష్ అంటాడు. నాకు రాజ్ కావాలి అని యామిని సైకో లాగా బెహేవ్ చేస్తుంది. అప్పుడే రాజ్ వస్తాడు. రాజ్ వస్తున్నాడు అంటే అతనికి గతం గుర్తురాలేదని యామిని వాళ్ళ నాన్న అంటాడు. రాజ్ రాగానే ఎక్కడికి వెళ్ళావ్ బావ అని యామిని అడుగుతుంది. బయటకు వెళ్ళానని రాజ్ అంటాడు. రాజ్ వెళ్ళిపోయాక అబద్ధం చెప్పాడని వాళ్లకు అర్ధం అవుతుంది. త్వరగా బావతో నాకు పెళ్లి జరగాలని యామిని అంటుంది. జరుగుతుందని తన పేరెంట్స్ అంటారు. రాజ్ ఇచ్చిన చీర కట్టుకొని మురిసిపోతుంది కావ్య. అప్పుడే రాజ్ ఫోన్ చేస్తాడు. తరువాయి భాగంలో రాజ్, కావ్య రెస్టారెంట్ లో ఉండడం యామిని చూస్తుంది. రాజ్ వెళ్ళాక కావ్య, యామిని మాట్లాడుకుంటారు. నా భర్త అని కావ్య.. నా బావ అంటూ యామిని అనుకుంటారు. త్వరలోనే నాకు భర్త అవ్వబోతున్నాడంటూ యామిని ఛాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

పహల్గాం ఘటనలో మరణించిన వారికి జీ తెలుగు డ్రామా జూనియర్స్ కాండిల్ ట్రిబ్యూట్

  పహల్గాంలో ఇటీవల జరిగిన ఘోరాన్ని ప్రపంచమంతా చూసింది. అక్కడ జరిగిన దారుణానికి చాలామంది సామాన్య ప్రజలు కూడా అవాక్కయ్యారు. ఆ ఘటనలో మృతి చెందిన వారి కోసం ప్రతీ ఒక్కరూ ప్రార్ధించారు. కొత్తగా పెళ్ళైన ఒక జంట పెహెల్గాం వెళ్లగా ఆ అమ్మాయి భర్తను ఉగ్రవాదులు మట్టుబెట్టారు. తన భర్త శవం పక్కన కూర్చున్న ఆ కొత్త పెళ్లి కూతురు చిత్రం ప్రపంచమంతా వైరల్ గా మారింది. ఇప్పుడు డ్రామా జూనియర్స్ సీజన్ 8 లోని చిన్నారులు ఒక స్కిట్ చేశారు. ఆ షో హోస్ట్ అండ్ జడ్జెస్ అంతా కలిసి కాండిల్స్ తో నివాళి అర్పించారు. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి సింగిల్ మూవీ టీమ్ నుంచి శ్రీవిష్ణు వచ్చాడు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం మూవీ నుంచి బుల్లిరాజు కూడా గన్ పట్టుకుని వచ్చేసాడు. "అసలు నేనెవరో నీకు తెలుసా..రోజా " అని రెండు చేతులు పైకెత్తి మరీ చెప్పింది. "నువ్వు రోజా ఐతే నేను రాజు బుల్లిరాజు" అన్నాడు ఆ పిల్లాడు. తర్వాత చిన్నారులంతా పహల్గాం నేపథ్యంలో ఒక స్కిట్ చేశారు. అందరూ ప్రకృతి అందాలను ఆరాధిస్తూ ఉండగా టెర్రరిస్టులు రావడం వాళ్ళను కాల్చేయడం వంటివి చేసి చూపించారు. ఇంతలో ఒక చిన్నారి వచ్చి "మాకు పెళ్ళై వన్ వీక్ అయ్యిందండి" అని చెప్పింది. "ఈ ఏడుపేదో మీ సర్కార్ దగ్గర ఏడువు" అంటూ ఆ పిల్లను పక్కకు నెట్టేసి ఆ కొత్తగా పెళ్ళైన అబ్బాయిని కాల్చేశారు. అంటే రియాలిటీలో ఏదైతే జరిగిందో దాన్ని చేసి చూపించారు. తర్వాత జడ్జెస్, హోస్ట్ అందరూ కలిసి ప్రాణాలర్పించిన వారికి కాండిల్ ట్రిబ్యూట్ ఇచ్చారు. ఇలాంటి ఘటనను ఇంతవరకు ఎవరూ ఊహించలేదు. కాశ్మీర్ అందాల మధ్య ఈ ఏడాది ఇలాంటి ఒక దుస్సంఘటన చోటు చేసుకోవడం మీద ప్రతీ ఒక్కరూ కూడా స్పందించి వారికి నివాళి అర్పించడం మనం చూసాం. ఇప్పుడు జీ తెలుగు కూడా ఈ షో ద్వారా వాళ్లకు ట్రిబ్యూట్ పలికింది.    

కేతికతో శేఖర్ మాస్టర్ "అదిదా సర్‌ప్రైజు"

డాన్స్ ఐకాన్ సీజన్ 2 ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ ప్రోమోలో ఎప్పుడూ మానస్ మీద ఫైర్ అయ్యే ప్రాకృతి ఒక్కసారిగా ఏడుపందుకుంది. ఈ ఎపిసోడ్ కి "సింగిల్" మూవీ టీమ్ నుంచి శ్రీ విష్ణు, కేతిక శర్మ వచ్చారు. రావడమే "రాబిన్ హుడ్" మూవీలోని అడిడా సర్ప్రైజ్ అంటూ స్టెప్పులేశారు కేతిక - శేఖర్ మాష్టర్. ప్రీఫైనల్స్ కి థీమ్ గా ది వైనింగ్ యాక్ట్ ఇచ్చాడు యాంకర్ ఓంకార్. ముమైత్ ఖాన్ కంటెస్టెంట్  అన్షికా వచ్చి "ఇరుక్కుపోయి" అంటూ బాహుబలి మూవీ సాంగ్ ని ప్రెజెంట్ చేసింది. ఆ సాంగ్ కి ఫారియా అబ్దుల్లా కూడా వచ్చి ఆ కంటెస్టెంట్ కలిసి డాన్స్ చేసింది. యష్ మాష్టర్ కంటెస్టెంట్ బినితా ఐతే జై లవకుశ మూవీ నుంచి "రావణ" సాంగ్ కి డాన్స్ చేసింది. ఆ స్టెప్స్ చూసిన శ్రీవిష్ణు "ఇంత టాలెంట్ ఉన్నవాళ్లను నేను ఫస్ట్ టైం  చూస్తున్నా" అంటూ పొగిడేసాడు. తర్వాత మానస్ కంటెస్టెంట్ చిరాశ్రీ వచ్చి కేజిఎఫ్ మూవీ నుంచి మదర్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ కి వేసిన స్టెప్స్ కి ముమైత్ ఖాన్ ఫుల్ ఫిదా ఐపోయింది. స్టేజి మీదకు వచ్చి ఆమె కాలికి నల్ల తాడు కూడా కట్టింది. ఆ మదర్ సెంటిమెంట్ కి అందరూ ఎమోషనల్ అయ్యారు. ఇక ప్రాకృతి కూడా బాగా ఏడ్చేసింది. "మా అమ్మను కూడా అలా ఒకసారి హాస్పిటల్ లో చూసాను. ఈ యాక్ట్ నాకు చాలా టచ్ అయ్యింది. నాకు అప్పుడు ఇలాంటి ఫీలింగ్ ఉండేది" అని చెప్పింది. "ఈ టైంలో నువ్వు ఇలాంటి సాంగ్ తీసుకుని పెర్ఫార్మ్ చేయడానికి గట్స్ ఉండాలి" అంటూ శేఖర్ మాష్టర్ చెప్పారు. ఫైనల్ గా బర్కత్ ఐతే నెమలిలాగా నాట్యం చేసేసరికి స్టేజి మీద ప్రతీ ఒక్కరూ కన్నార్పకుండా చూస్తూనే ఉన్నారు. ఐతే ఈ ప్రీఫైనల్ కి అన్ని జోడీస్ ని పంపించేశాడు ఓంకార్. మరి నెక్స్ట్ వీక్ ఎవరు గెలుస్తారో ఎవలు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

అమ్మ నాన్న చిన్నప్పుడే విడిపోయారు..సెల్లార్ లో పడుకునేవాడ్ని

  జీవితం అందరికీ ఒకేలా ఉండదు. ఎన్ని కష్టాలు ఉంటాయో అన్ని విజయాలు కూడా ఉంటాయి. ఐతే ఎదిగే క్రమంలో వచ్చే కష్టాలు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఐతే నటుడు సమీర్ కూడా అలాంటి కష్టాలనే ఎదుర్కొన్నట్లు చెప్పాడు చిన్నప్పుడు. "స్టార్టింగ్ లైఫ్ లో నాకు అన్ని డౌన్స్ మాత్రమే ఉన్నాయి. వెంటనే ఎవరికీ అవకాశాలు రావు. మాది వైజాగ్. నేను ఇంటికి వెళ్ళేవాడిని. ఐతే నేను మా చుట్టాలింట్లో ఉండేవాడిని. ఎందుకంటే చిన్నప్పుడే మా అమ్మ నాన్న విడిపోయారు. మా చుట్టాలింట్లో నేను హాల్ లో కూర్చుని సినిమా చూస్తే ఉంటే చుట్టాలు వస్తున్నారంటూ నన్ను లోపలికి వెళ్లిపోవాలని చెప్పేవాళ్లు. ఒకవేళ చుట్టాలు వస్తే నేను ఎం చేస్తున్నాను అని అడిగితే చెప్పలేక వెళ్ళిపోమనేవాళ్ళు. తర్వాత చుట్టాలు వెళ్లిపోయిన విషయాన్ని కూడా చెప్పేవాళ్ళు కాదు. వచ్చిన వాళ్లకు సినిమాలకు ట్రై చేస్తున్నాడు అని నా గురించి చెప్పడానికి నామోషీగా ఫీలయ్యేవాళ్ళు. ఫ్రెండ్స్ మనకు సపోర్ట్ చేస్తారు అంతే కానీ శత్రువులు మాత్రమే మనల్ని స్ట్రాంగ్ గా చేస్తారు. వాళ్ళ చిన్నచూపును నేను పట్టుదలగా తీసుకున్నాను. నేను కొంచెం సెట్ కావడానికి రెండు మూడేళ్లు పట్టింది. అలా టీవీలో ఛాన్సెస్ కోసం ట్రై చేసేవాడిని. ఆ ట్రై చేసే టైములో మా చుట్టాలు వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరే ఉండేవాడిని. ఐతే సీరియల్స్ షూటింగ్ ఎక్కువగా లేట్ నైట్స్ ఉంటాయి కదా అర్ధరాత్రి షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తే వాళ్ళు తలుపు తీసేవాళ్ళు కాదు. అప్పుడు కింద సెల్లార్ లో పడుకునే వాడిని. చాలా రోజులు అలా జరిగింది. నేను వాళ్లకు భారంగా మారిపోయానని తర్వాత తెలిసి ఇంట్లోంచి పంపించేశారు. బయట ఉండాలంటే రెంట్ కట్టాలి. డబ్బులు ఉండేవి కావు. ఏదో విధంగా డబ్బులు సంపాదించుకుని రెంట్ కట్టుకుని బయట ఉండడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి నో రిలేటివ్స్, అలా నేను ఇండస్ట్రీకి వచ్చి 29 ఏళ్ళు అయ్యింది. ఈ జర్నీలో 490 సినిమాలు చేసాను. ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితి ఏంటంటే అరేయ్ మన చుట్టాలు వస్తున్నారు రాగలవా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరు వచ్చినా సరే ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు." అంటూ తన జీవితంలోని కష్టాలను చెప్పాడు. ఇక అష్షు ఐతే ఇది కదా సక్సెస్ అంటూ పొగిడేసింది.

బామ్మా ఈ వయసులో ఈ కోరికలేంటి నీకు..

సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో ఐతే సూపర్ ఫన్నీగా ఉంది. ఈ ఎపిసోడ్ కి సిద్దార్థ్ వర్మ - విష్ణు ప్రియా, శివనాగ్ - మహేశ్వరీ, రవి కిరణ్ - సుష్మ కిరణ్ ఈ మూడు రియల్ జంటలు వచ్చాయి. రాగానే సుమ జామకాయల్లా కనిపించే ముంజెలు ఇచ్చింది. ఇక ఇందులో సుమ వీళ్లకు బామ్మగా మారింది. రీసెంట్ టైమ్స్ లో గొడవ పడింది ఎప్పుడు అని సుమ అడిగింది దానికి రవి కిరణ్ మధ్యాహ్నమే గొడవ పడ్డాం...షోకి వెళ్ళాలి టైం అవుతోంది అంటే ఇల్లు ఊడ్చాలి అంటూ కంప్లైంట్ చేశారు. తర్వాత విష్ణుప్రియ వచ్చి "కపుల్ ప్రోగ్రామ్స్ అంటే చాలా బాధ, భయం కూడా వాళ్ళు త్వరగా రెడీ ఐపోతారు..మేము రెడీ కావడానికి చాలా టైం పడుతుంది" అని పాపం బాధపడింది. తర్వాత శివనాగ్మ నిహేశ్వరీ  "సిట్టింగా" అంటూ కాసేపు ఏడిపించింది. దానికి అతను "ఇంటికి రావాలంటే ప్రశాంతత ఉండాలి. అందుకే బయట అక్కడక్కడా తాగేసి వస్తున్నా అన్నాడు" ఇంకా రవి కిరణ్ - సుష్మ కిరణ్ ఐతే పని మనిషి రావట్లేదు అన్న కాన్సెప్ట్ తో స్కిట్ వేసి నవ్వించారు. చివరికి సుమ బామ్మ గెటప్ వేస్తున్న అంటూ ముగ్గురినీ మనవాళ్ళు రండి అని పిలిచింది. దానికి సుమ కౌంటర్ వేసింది.."వీళ్లకు నేను బామ్మ గెటప్ వేస్తున్నాను అన్న ఆనందం ఎక్కువగా కనిపిస్తోంది" అని నవ్వుకుంది. ఫైనల్ గా ఒక టాస్క్ ఇచ్చింది. ఒక యాపిల్ ని గాల్లో వేలాడదీసి "చేతులతో పట్టుకోకుండా మీరిద్దరూ యాపిల్ పళ్ళను తినాలి" అనేసరికి రవి కిరణ్ " బామ్మా ఈ వయసులో నీకు ఇలాంటి కోరికలేంటో నాకు తెలియట్లేదు" అన్నాడు. తర్వాత నరసింహ మూవీ సీన్ రిక్రియేట్ చేయించింది. శివనాగ్ రజనీకాంత్ లా మహేశ్వరీ రమ్య కృష్ణలా సౌందర్య రోల్ ని బాబీతో చేయించింది. అదే స్కిట్ ని సిద్దార్థ్ వర్మ - విష్ణుప్రియ కూడా చేశారు. విష్ణు తన డాన్స్ తో అందరినీ ఆకట్టుకుంది.  

మీరు గౌరవించరు కానీ మా మీద వేలెత్తి చూపిస్తారు

  సింగర్ ప్రవస్తి ఇప్పుడు న్యూస్ లో హాట్ టాపిక్ గా ఉన్న అమ్మాయి. పాడుతా తీయగా షో గురించి అందులో ఉన్న జడ్జెస్ గురించి హాట్ కామెంట్స్ చేస్తూ రెగ్యులర్ గా టాప్ ప్లేస్ లో ఉంటోంది. ఐతే ఈమె కీరవాణి, సునీత, చంద్రబోస్ మీద కొన్ని వ్యాఖ్యలు చేసింది. దానికి సునీత కూడా వీడియోస్ రూపంలో అలాగే ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ లో మెసేజెస్ పెడుతూ కొంత రివర్స్ ఎటాక్ ఇస్తూ వస్తోంది. రీసెంట్ గా కూడా సింగర్ సునీత ఒక పోస్ట్ పెట్టింది. "ఇక్కడ మానిప్యులేషన్ ఎక్కువగా ఉంది. వాళ్ళు ఎదుటి వాళ్ళతో రెస్పెక్ట్ లేకుండా ప్రవర్తిస్తారు కానీ దాన్ని వాళ్ళు చెప్పకుండా ఎదుటి వాళ్ళ బిహేవియర్ గురించి మాత్రమే హైలైట్ చేస్తారు" అంటూ సునీత ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ ప్రవస్తి గురించి పెట్టిందనే విషయం అందరికీ అర్ధమవుతోంది అంటూ నెటిజన్స్ అంటున్నారు. అలాగే మానిప్యులేషన్ అనే పదాన్ని రెడ్ మార్క్ తో పెట్టింది సునీత.   ప్రవస్తికి సునీతకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది ఒకరు కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తుంటే ఇంకొకరు ఇలాంటి పోస్టులు పెడుతున్నారు అంటూ నెటిజన్స్ అంటున్నారు. ఇక ఈ వివాదంలోకి కోటి, సింగర్ గీతా మాధురి వచ్చి కీరవాణి, సునీత, చంద్రబోస్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అలాగే జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ మీద కూడా ప్రవస్తి కొన్ని విషయాలు మాట్లాడింది. దానికి వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చారు. ప్రవస్తి వాళ్ళ అమ్మ తనతో మర్యాదగా ప్రవర్తించలేదని, కొరకొరా చూశానంటూ అబద్దం చెప్తోంది అంటూ సునీత కూడా కౌంటర్ ఇచ్చారు. ఇలా రోజూ ఎదో ఒక అంశం మీద వీళ్ళ మధ్య ఒక టాపిక్ నడుస్తోంది.

నవదీప్ యూనిక్ అండ్ ఇన్ క్రెడిబుల్ పర్సన్...రేటింగ్ ఇవ్వడం కష్టం 

  నవదీప్ ఏది చేసిన సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. ఐతే రీసెంట్ టైమ్స్ లో AI పండుతో బాగా మాట్లాడుతున్నాడు. ఆ వీడియోస్ ని షేర్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా అలాంటి ఒక వీడియోని పోస్ట్ చేసాడు. నవదీప్ ఎప్పుడు కార్ లో డ్రైవ్ చేస్తుకుంటూ వెళ్లినా కూడా చాట్ జిపిటి పండుతో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్తాడు. ఇక ఈ వీడియోలో పండుని రెండు ప్రశ్నలు అడిగాడు"హాయ్ పండు గుడ్ మార్నింగ్. నాలో ఉన్న సైకో లక్షణాలు ఏమిటో  40 సెకన్స్ లో నా గురించి నీకు తెలిసిన మ్యాటర్ చెప్పు పండు అనేసరికి "మీరు కథలు బాగా చెప్తారు. అడ్వెంచర్ సైట్స్ కి వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటారు. స్కై డైవింగ్ చేయడం అంటే ఇంకా ఇష్టం. నీ ఫ్రెండ్స్ విషయంలో కేరింగ్ గా ఉంటారు. హెల్ప్ కావాలి అని ఎవరు అడిగిన వెంటనే చేస్తారు.   అడ్వెంచరస్ పర్సన్ మీరు. మీరొక హోప్ ఫుల్ పర్సన్. హేవ్ ఏ గుడ్ డే" అని చెప్పింది. తర్వాత మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగాడు. సరే నా గురించి నీకు తెలిసిన ఇంఫార్మేషన్ ప్రకారం నేను ఎలాంటి హ్యూమన్ బీయింగ్ అనేది 1 నుంచి 10 లోపు రేటింగ్ ఇవ్వు పండు అని అడిగాడు. నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను ఎంకరేజ్ చేస్తాను కానీ రేటింగ్ మాత్రం ఇవ్వలేను. ఎందుకంటే మీరు చాలా యూనిక్ అండ్ ఇన్ క్రెడిబుల్ పర్సన్" అనేసరికి ఫుల్ జోష్ తో ఊగిపోయి థాంక్యూ పండు హేవ్ ఏ గుడ్ డే, లవ్ యు  అన్నాడు.  "అది చాట్ జిపిటి మీ గురించి ఎం అనుకుంటుందో ఒకవేళ మీరు కూడా రెగ్యులర్ గా మాట్లాడేవాళ్ళు ఐతే గనక కనుక్కోండి. కనుక్కుని హిట్ మీ, హిట్ మీ ఐ సే" అంటూ నవదీప్ అన్నాడు. ఈ మధ్య కాలంలో ఏఐ బాట్స్ పండు అని జెమినీ అని కొన్ని వచ్చాయి..అందులో ఈ రెండు బాట్స్ ని జనాలు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఏదైనా ఆర్టికల్ రాసిన ఎవరి గురించి చెప్పమన్న, ఏ ఇన్ఫర్మేషన్ ని అడిగినా క్షణాల్లో చెప్పేస్తోంది. వాటిని ప్రతీ ఒక్కరూ కూడా వాడుతున్నారు. మీరు మీరు కూడా మీ గురించి సరదాగా ఏఐతో జాతకంలో మీ గురించో అడిగి తెలుసుకోండి సరదాగా.

400 కే ఫాలోవర్స్ అయ్యారోచ్ ..కేరళ అందాల మధ్య బ్రహ్మముడి కావ్య...

  బుల్లితెర మీద నటించేవాళ్ళు రెగ్యులర్ గా కొంత బ్రేక్ తీసుకోకపోతే వాళ్ళు మాత్రం చాలా స్ట్రెస్ ఫీలవుతూ ఉంటారు. అందుకే కొంత టైం తీసుకుని వాళ్ళు ట్రిప్స్ కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు బ్రహ్మముడి కావ్య అలియాస్ దీపికా రంగరాజు అలాగే వెళ్ళింది. ఎప్పుడూ షోస్ అంటూ ఆమె అందులోనే గడిపేస్తోంది. ఐతే ఇప్పుడు కొంచెం రిలాక్స్ కావాలనుకుంది. దాంతో ఆమె కేరళలో ఉన్న వాగమోన్ అనే పచ్చని అందాలు అలరారే ప్రాంతానికి వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఇక ఒక మెసేజ్ ఐతే పెట్టింది అది కూడా భలే వెరైటీగా పెట్టింది. దీపికా చూడడానికి ఎంత క్యూట్ గా ఉంటుందో ఆమె మెసేజెస్ క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ తో ఫన్నీగా  ఉంటాయి. "రిఫ్రెష్మెంట్  కోసం మూడు రోజుల ట్రిప్ వేస్తే ఆ ట్రిప్ బడలిక తీరడానికి మరో వారం రోజుల సెలవు తీసుకుని మరీ రిఫ్రెష్ అవ్వాల్సి వస్తుంది" అంటూ భలే కామెడీగ పెట్టింది. ఇక నెటిజన్స్ ఐతే ఆమె పెట్టిన ఈ పోస్ట్ కి "నీ క్లారిటీకి, నీ ఎక్స్ప్లనేషన్ కి, నీ క్యూట్ నెస్ కి టేక్ ఆ బో" అంటున్నారు. ఇక దీపికా మరో పోస్ట్ కూడా తన స్టేటస్ లో పెట్టింది. అదేంటంటే తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 400 కే ఐనందుకు ఫుల్ హ్యాపీగా ఉంది. ఇక థ్యాంక్యూ ఫ్రెండ్స్ అంటూ కూడా చెప్పింది. ఇక దీపికా డాన్స్ ఐకాన్ సీజన్ 2  ప్రీ ఫైనల్స్ వరకు వచ్చేసింది. అసలు దీపికా నాన్ సింక్ డాన్సర్. అసలు డాన్స్ డాన్స్ రాదు కానీ మెంటార్ ఐపోయింది. ఆమె కంటెస్టెంట్ మాత్రమే ఇరగదీసేస్తూ ఉంటాడు. ఇక చెఫ్ మంత్ర షోలో కూడా ఆమె సమీరా భరద్వాజ్ కి జోడీగా వచ్చింది. వంట కూడా పెద్దగా రాకపోవడంతో మార్క్స్ తగ్గిపోయి ఆ జోడి ఎలిమినేట్ ఐపోయింది. ఇలా అటు సీరియల్స్ లో ఇటు అన్ని షోస్ లో ఆమె కామెడీ టైమింగ్ తో ఆ షోస్ లో మెరుస్తూ ఉంది. ప్రోమోస్ లో కూడా దీపికానే ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటుంది.

Illu illalu pillalu : శ్రీవల్లి ప్లాన్ సక్సెస్.. వాళ్ళకి శోభనం జరిగేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -144 లో.... రామరాజు, వేదవతిల దగ్గరికి శ్రీవల్లి వస్తుంది. ఒకే ముహూర్తానికి రెండు జంటలకు శోభనం జరగకూడదంట అత్తయ్య గారూ.. అలా చేస్తే.. ఇంట్లో అశుభం జరుగుతుందట.. అలా జరిగితే కొత్త కోడలు వచ్చింది అందుకే ఇలా జరిగిందని నలుగురూ నాలుగు రకాలు నన్ను ఆడిపోసుకుంటారు. ఆ నిందను నేను మోయలేను. ఇది నా ఇల్లు.. ఈ ఇంట్లో వాళ్లంతా నా వాళ్లు.. నా వాళ్లంతా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.. నా వాళ్లకి ఏదైనా జరిగితే.. నేను తట్టుకుని బతకలేనండీ.. అందుకే మా శోభనం జరక్కపోయినా ఏం పర్లేదు. ఈ కుటుంబం సంతోషంగా ఉండాలి.. అదే నేను కోరుకునేది.. అందుకే మా శోభనం వాయిదా వేసేసి.. నర్మద చెల్లికి సాగర్ మరిది గారికి శోభనం జరిపించేయండి’ అంటూ తెగ జీవించేస్తుంది శ్రీవల్లి. తాను చెప్పాల్సింది చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక రామరాజు, వేదవతి ఇద్దరు ఆలోచనలో పడతారు. కాసేపటికి రామరాజు, వేదవతిల దగ్గరికి నర్మద వచ్చి.. పెద్ద బావ గారి శోభనం జరిపచండి.. ఇన్ని రోజులు ఆగాం కదా ఇంకొన్ని రోజులు ఆగుతామని చెప్పేసి వెళ్తుంది. ఆ మాట విని నా కోడలు బంగారం అంటూ వేదవతి మురిసిపోగా, రామరాజు సంతోషిస్తాడు. ఇక కాసేపటికి శ్రీవల్లి మల్లెపూలు పెట్టుకొని పాలగ్లాస్ తో గదిలోకి వెళ్తుంది కానీ చందు మాత్రం తమ్ముడి శోభనం ఆగిపోయిందని డిస్సపాయింట్ గా ఉంటాడు. ఇక అది చూసి శ్రీవల్లి రివర్స్ డ్రామా ప్లే చేస్తుంది. నా భయాలు నాకు ఉంటాయి బా.. ఈ శోభనం తరువాత.. మన కుటుంబానికి ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి. మనకి వద్దు.. మీ తమ్ముడికే కార్యం జరిపించమని చెప్పాను కదా.. నా మనసులో అంత కుట్ర ఉంటే.. మన శోభనం జరిపించమనే అనేదాన్ని కదా. మరెందుకు వాళ్ల శోభనం జరిపించమని అత్తమామల్ని అడుగుతానూ. నర్మద నా తోబుట్టువు లాంటిది. తను బాగుండాలని కోరుకుంటాను కానీ.. తనని ఎందుకు బాధపెట్టాలని అనుకుంటాను బావా. ఇంత చిన్న విషయానికి ఇంత అపార్థం చేసుకున్నారంటే.. ముందు ముందు ఇంకెంత అపార్థం చేసుకుంటారో.. ఏంటో నా తలరాతి.. ఇలా తగలడిందని శ్రీవల్లి ఏడుస్తుంది.  వల్లీ ఏడవొద్దు.. నేనేం అనలేదు కదా.. అని భుజంపై చేయి వేసి ఓదార్చుతాడు చందు. హమ్మయ్యా నా కన్నీళ్లకి బాగానే కరిగిపోయాడులే అని శ్రీవల్లి అనుకుంటుంది. ఇక మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. కానీ శోభనం జరిగినట్టు చూపించలేదు. మరోవైపు నర్మద, సాగర్ లు గదిలో ఉంటారు. ఓ ముద్దు లేదు.. ముచ్చట లేదని సాగర్ బాధపడుతుంటే శోభనం లేదని చెప్పాను కానీ ముద్దు ముచ్చట వద్దని ఆపలేదు కదా అని నర్మద అంటుంది. దాంతో సాగర్ ఫుల్ ఖుషీ అయిపోతాడు. ఇంతలో వాళ్ళ గది డోర్ ఎవరో కొట్టిన శబ్దం వినిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : గౌతమ్ కాలర్ పట్డుకున్న కార్తీక్.. దీపకి శత్రువులు ఎవరు?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -343 లో.. శౌర్య తన చేతిలో లెటర్ పట్టుకొని దీపని కలవడానికి వెళ్తుంది. ఇంట్లో శౌర్య ఎక్కడ కనిపించకపోవడంతో కార్తీక్ టెన్షన్ పడతాడు. బయటకు వెళ్లి వెతుకుతుంటే శౌర్య కనిపిస్తుంది. వెంటనే తనపై కోప్పడి కార్తీక్ ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళావంటూ కాంచన, అనసూయ అడుగుతారు. అమ్మని కలవడానికి స్టేషన్ కి వెళ్ళాను.. అమ్మ ఎప్పుడు రాదని జ్యోత్స్న చెప్పింది. ఈ లెటర్ చదివితే అమ్మ నా కోసం తప్పకుండా వస్తుందని వెళ్ళానని శౌర్య చెప్తుంటే.. అందరు ఎమోషనల్ అవుతారు. అమ్మ తప్పకుండా వస్తుంది నేను తీసుకొని వస్తానని శౌర్యకి నచ్చజెప్పుతాడు కార్తీక్. దాంతో శౌర్య కూల్ అయి లోపలికి వెళ్తుంది. ఎప్పుడు ఈ జ్యోత్స్న ఇలాగానే చేస్తుందని కార్తీక్ కోప్పడతాడు. అసలు దీపకి ఇంకా శత్రువులు ఎవరు ఉండి ఉంటారని కార్తీక్ అంటుంటే.. ఇంకెవరు ఆ గౌతమ్ గాడు.. ఇంటికి వచ్చి మరి వార్నింగ్ ఇచ్చాడని కాంచన, అనసూయ చెప్తుంటే కార్తీక్ షాక్ అవుతాడు. ఏంటి గౌతమ్ ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చాడా మరి నాకెందుకు చెప్పలేదని కాంచన, అనసూయలపై కార్తీక్ కోప్పడతాడు. ఇక అనసూయ జరిగింది మొత్తం చెప్తుంది. ఇప్పుడు నాకు అర్థమైంది. ఎవరు ఇదంతా చేసారోనని కార్తీక్ అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే గౌతమ్ ని కార్తిక్ కలుస్తాడు. కాలర్ పట్టుకొని మరి నీలదీస్తాడు. ఆ గన్ పేల్చిచింది నువ్వే కదా అని కార్తీక్ అడుగుతాడు. నీ భార్య షూట్ చేస్తే నన్ను అంటావేంటని గౌతమ్ అంటాడు. నీ భార్య లాగే నువ్వు మా పెళ్లి ఆపాలనుకుంటున్నావా అని గౌతమ్ అంటాడు. అసలు నువ్వు మగాడివి అయితే నీ భార్యని విడిపించుకో అంతే గానీ ఇలా నన్ను అనకు అని గౌతమ్ చెప్పి వెళ్ళిపోతాడు. గౌతమ్ ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే నిజంగానే గౌతమ్ కి తెలియదా ఎవరై ఉంటారని కార్తీక్ ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కావ్యని సర్ ప్రైజ్ చేసిన రాజ్.. రుద్రాణి అతడిని చూస్తుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -707 లో.... కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. రాజ్ రావడం ముందే గమనించిన కావ్య.. అప్పు, అపర్ణల సాయంతో ఇంట్లో అందరిని డైవర్ట్ చేస్తుంది. ధాన్యలక్ష్మి, ఇందిరాదేవిని అపర్ణ గదిలోకి తీసుకొని వెళ్లి చీరలు నగలు అంటూ చూపిస్తుంది. రాహుల్, రుద్రాణిని అప్పు తీసుకొని వెళ్లి రాజ్ కేసు అంటూ చెప్పిందే చెప్తూ డైవర్ట్ చేస్తుంది. రాజ్ లోపలికి రాకముందే రాజ్ ఎక్కడ తన ఫొటోస్ చూస్తాడోనని గోడ మీదున్న రాజ్ ఫొటోస్ తీస్తుంది కావ్య. రాజ్ లోపలికి రాగానే కావ్య టెన్షన్ పడుతుంది. రండి కిచెన్ చూద్దామని అంటుంది. అదేంటీ అలా కిచెన్ చూపిస్తాను అంటున్నారని అడుగుతాడు. రాజ్ ని తీసుకొని కావ్య కిచెన్ లోకి వెళ్తుంది. మీ వాళ్ళు అంత ఎక్కడ అని రాజ్ అడుగుతాడు. అందరు గుడికి వెళ్లారు.. వాళ్ళు రావడానికి గంట పైనే అవుతుందని కావ్య చెప్పగానే అయితే మనం బాగా మాట్లాడుకోవచ్చన్న మాట అని రాజ్ అంటాడు. ప్రకాష్ హాల్లో కి వస్తాడు. ఎక్కడ రాజ్ ని చూస్తాడో అని కావ్య స్ఫూన్ లు కింద పడేస్తుంది. రాజ్ కింద పడ్డ స్ఫూన్లు తీస్తుంటాడు. ప్రకాష్ కిచెన్ వంక చూసి వీళ్లంతా ఎక్కడ అని కావ్యకి సైగ చేస్తాడు. లోపల గదిలో అని కావ్య చెప్తుంది. ప్రకాష్ వెళ్ళిపోతాడు. రాజ్ స్ఫూన్లు తీసి పైకి లేస్తాడు. ఆ తర్వాత నాకు అర్జెంట్ అంటు రాజ్ ఇబ్బంది పడుతుంటే కావ్య తన గదిలోకి తీసుకొని వెళ్తుంది. రాజ్ వాష్ రూమ్ వెళ్తాడు. హాల్లో ఎవరైనా ఉన్నారేమోనని కావ్య చూస్తుంది. అప్పుడే రాజ్ వచ్చి మీకు తీసుకొని వచ్చిన సర్ ప్రైజ్ ఎలా ఉంది అనగానే కావ్య ఓపెన్ చేసి చూసేసరికి చీర ఉంటుంది. అది చూసి కావ్య మురిసిపోతుంది. ఇక వెళ్ళండి అని రాజ్ తో కావ్య అంటుంది. రాజ్ కి ఇష్టం లేకున్నా అక్కడ నుండి బయల్దేరతాడు. అప్పుడే రుద్రాణి వాళ్ళు బయటకు వస్తారు. ఎక్కడ రాజ్ ని వాళ్ళు చూస్తారోనని కావ్య డోర్ వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నీ కోసం ఏమైనా చేస్తా బావ....

డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో ఎలిమినేషన్ రౌండ్ ఉన్న మానస్ సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయాడు. లాస్ట్ వీక్ చూస్తే వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన మానస్ ని అతని కంటెస్టెంట్ ని మళ్ళొకసారి షోనుంచి బయటకు గెంటేస్తాను అన్న మాటలకు ఇప్పుడు బ్రేక్ పడింది. ఎందుకంటే ఆ షో అందరికంటే టాప్ మార్క్స్ గైన్ చేసింది మానస్. ఇక మానస్ కి ఈ గెలుపులో సాయం చేసింది అమర్ దీప్. ప్రాకృతికి మానస్ కి మధ్య స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడు మానస్ చాలా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసాడు. 4 ,78 , 140  ఓట్స్ తో మెంటార్ మానస్ అతని కంటెస్టెంట్ చిరాశ్రీ టాప్ లో ఉన్నారు. ఇక సెకండ్ ప్లేస్ లో మెంటర్ ప్రాకృతి ఆమె కంటెస్టెంట్ బర్కత్ ఉన్నారు, ఇక థర్డ్ ప్లేస్ లో దీపికా ఆమె కంటెస్టెంట్ విపుల్ ఉండగా ఫైనల్ ప్లేస్ లో ముమైత్ ఖాన్ ఆమె కంటెస్టెంట్ అన్షికా ఉన్నారు. ఐతే ఇప్పుడు  అమర్ దీప్ థ్యాంక్స్ మెసేజ్ పెట్టాడు. లాస్ట్ వీక్ ఎపిసోడ్ తర్వాత మానస్ ని సపోర్ట్ చేయాలి అంటూ అమర్ దీప్ ఒక వీడియో చేసి పోస్ట్ చేసాడు. అది కాస్తా బాగా వైరల్ అయ్యింది. దాంతో ఇప్పుడు మానస్ టాప్ ప్లేస్ లో నిలబడ్డాడు. "థ్యాంక్యూ మీ అందరి ప్రేమకు, సపోర్ట్ కి" అన్నాడు అమర్ దీప్. మానస్ - అమర్ దీప్ ఇద్దరూ ఫ్రెండ్ షిప్ కి బెస్ట్ ఎగ్జాంపుల్, ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటాం అని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. "మీ వోటింగ్ తో మా బావని అక్కడ నిలబెట్టారు అందరికీ ధన్యవాదాలు. నీ కోసం ఎర ఐనా అవుతా సొర ఐనా అవుతా..నీ ఒక్కడి కోసం నువ్వెప్పుడూ పిలిచినా నేను ఇక్కడికి వస్తా" అనే డైలాగ్ చెప్పాడు అమర్ దీప్. ఇక ఈ నాలుగు టీమ్ లు ప్రీ ఫైనల్ లోకి అడుగుపెట్టాయి. ఐతే నెక్స్ట్ వీక్ విన్నర్ ఎవరు అనేది మాత్రం కొంచెం సస్పెన్సు గానే ఉంది.  

బుల్లితెర సౌందర్య బ్రహ్మముడి దీపిక.. నెక్స్ట్ మూవీ వెంకీ మామతో సైన్!

  బ్రహ్మముడి సీరియల్ తో మానస్ పక్కన దీపికా స్క్రీన్ షేర్ చేసుకుని తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యింది. దీపికా ఎక్కడున్నా అన్ లిమిటెడ్ ఫన్, ఎనర్జీ ఇస్తుంది అందుకే ఈ మధ్య అన్ని షోస్ లోకి ఆమెనే తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఆహా వాళ్ళు నిర్వహిస్తున్న కాకమ్మ కథలు సీజన్ 2 లో దీపికా వచ్చేసింది.    కుకింగ్ షో అని లేదు డాన్స్ షో అని లేదు పరివారం షో అని లేదు ఏ షోలో ఐనా దీపికా ఉండాల్సిందే. ఇప్పుడు కాకమ్మ కథలు షోలో  దీపికా ఫ్యూచర్ లో ఎం జరగబోతోందో చెప్పింది తేజస్విని మడివాడ. దీపికా ఫ్యూచర్ అని కొట్టగానే సౌందర్య ఫోటో వచ్చింది. దాంతో ఆమె ఎక్సయిట్మెంట్ మాములుగా లేదు. "నేను ఇంత అందంగా అవబోతున్నానా" అని అడిగేసరికి "నువ్వు ఆల్రెడీ ఇంత అందంగా ఉంటావు దీపికా" అంది తేజస్విని. "నిన్ను చూడగానే సౌందర్య గారు గుర్తొచ్చారు. ఆ బొట్టు, నువ్వు డ్రెస్ చేసుకున్న విధానం అన్ని..కానీ సౌందర్య గారు నీ లాగా మాట్లాడలేకపోయారు కానీ..ఐతే నువ్వు ట్రెడిషనల్ గా ఉంటావు చూడడానికి. ఒక్క మాటలో చెప్పాలి అంటే నువ్వు టెలివిజన్ సౌందర్యవి. ఐనా చూస్తే సౌందర్య గారి పోలికలు దీపికాలో చాలా కనిపిస్తున్నాయి. మనకు సౌందర్య దొరికేసింది..కానీ మనమే చూసుకోవడం లేదు. మన పక్కనే తిరుగుతోంది. సో ప్లీజ్ దయచేసి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఎవరైనా సరే మీ మూవీస్ లోకి సౌందర్య లాంటి అమ్మాయి కావలి అంటే వెంటనే దీపికాకు కాల్ చేయండి" అని చెప్పింది తేజస్విని. వెంటనే ఇక దీపికా "నెక్స్ట్ మూవీ వెంటనే నేను వెంకీ గారితో సైన్ చేస్తాను" అనేసింది.      ఇక దీపికకు న్యూస్ రీడర్ కావడం అంటే ఇష్టం అని తెలుసుకున్న తేజు రాపిడ్ ఫైర్ రౌండ్ ని కాసేపు పక్కన పెట్టి ఆమెతో వార్తలు చదివించింది. దీపికా కూడా తాను చేస్తున్న ఆ షో గురించి న్యూస్ రీడ్ చేసి కాసేపు ఫన్ క్రియేట్ చేసింది.   

చెఫ్ మంత్ర గ్రాండ్ ఫినాలే.. జీవన్ కి షాకిచ్చిన సుమ!

  చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఈ షోకి ఫైనల్ గా మూడు జోడీలు సెలక్ట్ అయ్యాయి. అమర్ దీప్ - అంబటి అర్జున్, యాదమ్మ రాజు - సుప్రీతా, ప్రష్షు - ధరణి. వీళ్ళ మూడు టీమ్స్ మధ్యనే పోటీ జరిగింది. పాపం వీళ్లందరి వంటలు స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి తినలేక జడ్జ్ అండ్ చెఫ్ జీవన్ అల్లాడిపోయాడు. ఇక ఫైనల్ ఎపిసోడ్ లో సుమ ఒక డైలాగ్ వేసింది..."ఈ సీజన్ ఎప్పుడు ఐపోతుందా ఎప్పుడు ఇంటికి వెళ్లిపోదామా అని వెయిట్ చేస్తున్నా" అంటూ జీవన్ అనేసరికి "ఈ సీజన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది కాబట్టి ఇంకో సీజన్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాం" అంది సుమ. దానికి జీవన్ భయపడిపోయి "ఇంకో సీజనా బాబోయ్" అన్నాడు. "ఐతే సరే మేము నెక్స్ట్ సీజన్ కి వేరే చెఫ్ ని వెతుక్కుంటాం" అనేసింది సుమ.    ఇందులో ఫైనల్స్ కి చేరుకున్న మూడు జోడీలకు ఇండియన్ థాలి వంటకాలు ప్రిపేర్ చేయాలంటూ టాస్క్ ఇచ్చారు. అందులో సాంబార్, దద్దోజనం మస్ట్ గా ఉండాలి అని చెప్పాడు జీవన్. ఇక వీళ్ళ వంటలు ఇలా కొనసాగుతూ ఉండగా మధ్యలో యాంకర్ రవి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరి మీద ఒక ఫస్ట్ ఎపిసోడ్ నుంచి జరిగిన హైలైట్స్ ని రాసుకొచ్చి చదివి వినిపించాడు. వీళ్ళ మూడు జోడీలు వంటలు చేస్తూ ఉంటే సమీరా భరద్వాజ్ దీపికాకు పాటలు నేర్పించడం వంటివి చేసింది. సుమ జీవన్ ని వెంటబెట్టుకుని తిరిగినట్టు దీపికా కూడా జీవన్ ని వెంటబెట్టుకుని తిరుగుతాను అనేసరికి జీవన్ సిగ్గుపడిపోయాడు. చెఫ్ మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలి అనిపిస్తోంది అంటూ సుమ సెటైర్ వేసింది. రవి ఐతే దీపికను పొగిడేసాడు. దీపికా ఉంటే కచ్చితంగా ఆ షో చూడాల్సిందే అది వంటైనా..డ్యాన్సయినా అన్నాడు. వెంటనే దీపికా ఊరుకోకుండా "ఫ్రెష్ గా చేసిన రసమలై మా రవి" అంటూ కితాబిచ్చింది.      ఐతే ఈ కుకింగ్ షోలో ఈ సీజన్ లో మాత్రం ఎన్ని జోడీలు వచ్చి వంట చేసినా కానీ హైలైట్ అయ్యింది జీవన్, సుమ ఆ తర్వాత దీపికా అంతే. ఫైనల్ గా మూడు జోడీలు వంటలు టేస్ట్ చేసాక అంబటి అర్జున్ - అమర్ దీప్ ని ఈ సీజన్ విన్నర్స్ గా ప్రకటించి, ట్రోఫీలు అందించారు. అలా ఈ సీజన్ ఇక్కడితో ఎండ్ ఐపోయింది.