చిన్న డ్రాయర్ తో, బనీన్ తో ఉంటాడు...కుదిరితే నా ఆయుష్షు కూడా పోసుకుని...

  "మన రూపం చూడకముందే, మన గొంతు వినకముందే, మనల్ని మనలా ప్రేమించే ఒకే ఒక వ్యక్తి అమ్మ" అలాంటి మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఇక ఫామిలీ స్టార్స్ షో ఈ వారం మదర్స్ డే స్పెషల్ ఈవెంట్ తో రాబోతోంది. ఈ షోకి మానస్, రాకేష్, విశ్వా ఇంకా మిగతా బుల్లితెర నటులు అంతా వాళ్ళ వాళ్ళ మదర్స్ తో వచ్చారు. హోస్ట్ సుధీర్ మానస్ వాళ్ళ అమ్మను ఒక ప్రశ్న అడిగాడు "మానస్ ఇంట్లో ఎలా ఉంటాడండి" అని అడిగేసరికి "చిన్న డ్రాయర్ తో చిన్న బనీన్ తో అలా కనిపిస్తూ ఉంటాడు" అని చెప్పేసరికి మానస్ ఊరుకోమ్మా ఇంట్లో విషయాలన్నీ స్టేజి మీద పరువు పోయేలా చెప్తావేంటి అన్నట్టు పెట్టాడు ఫేస్. తర్వాత రాకేష్ దగ్గరకు వచ్చి చిన్నప్పటినుంచి ఇలాగే ఉండేవాడా అని వాళ్ళ అమ్మను అడిగితే "చిన్నప్పుడు అంటే ఒకటి గుర్తొచ్చింది..చిన్నప్పుడు ఉంగా ఉంగా అనేవాడు" అని చెప్పేసరికి సుధీర్ షాకయ్యాడు. ఇంకా ఏమందంటే "మా అపార్ట్మెంట్ లో ఒక అమ్మాయి ఉంది అనేసరికి" సుధీర్ "ఛీఛీ నాకొద్దు" అన్నాడు. "ఆమె కూడా అదే అంది" అంటూ రాకేష్ వాళ్ళ అమ్మ కామెడీ చేసింది. ఇక విశ్వా వాళ్ళ అమ్మ విశ్వతో కలిసి పోటాపోటీగా డాన్స్ చేసింది. తర్వాత సుధీర్ వాళ్ళతో కొన్ని గేమ్స్ ఆడించాడు. తర్వాత విశ్వా వాళ్ళ అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది.."అరవడం అనేది ఒక అగ్రేషన్..దాని వలన హెల్త్ ఇస్స్యూస్ వస్తాయని మా అమ్మ భయం ఎందుకంటే ఒక్కోసారి ఆ అరవడం వలన,  ఆ కోపం వల్ల చాలా దూరం వెళ్ళిపోతాం..మా అన్నయ్యను అలాగే మేము పోగొట్టుకున్నాం" అని విశ్వా చెప్పాడు. దాంతో సుధీర్ కూడా ఎమోషనల్ అయ్యాడు.  ఇక ఫైనల్ గా సుధీర్ వాళ్ళ పేరెంట్స్ పిక్ ని చూపించి "నాకు మా అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలి. కుదిరితే నా ఆయుష్షు కూడా పోసుకుని నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను" అని చెప్పాడు. ---------------

Illu illalu pillalu : ధీరజ్ కి దగ్గరవుతున్న ప్రేమ.. వాళ్ళిద్దరిపై కోపంగా ఉన్న రామరాజు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -151 లో.....ప్రేమ , ధీరజ్ ఆటోలో ఇంటికి వస్తుంటే.. అదేంటి బైక్ పై వస్తున్నారని చెప్పారు.. ఆటోలో వచ్చారేంటని ధీరజ్ ని రామరాజు అడుగుతాడు. బైక్ ట్రబుల్ ఇచ్చింది. అందుకే పక్కన పెట్టి ఆటోలో వచ్చామాని ధీరజ్ చెప్తుంటే.. నీకు బాధ్యత తెలియదు.. ఏం తెలియదంటూ ధీరజ్ ని తిడతాడు రామరాజు. అలా తిడుతుంటే శ్రీవల్లి నవ్వుతుంది. అలా నవ్వడం ప్రేమ చూసి బాధపడి లోపలికి వెళ్ళిపోతుంది. ప్రేమకి బాగోలేదు.. అందుకే ఇలా ఆటోలో వచ్చామని దీరజ్ చెప్తాడు. అయ్యో అవునా సరే వెళ్లి ప్రేమని చూసుకోమని రామరాజు అంటాడు. ఆ తర్వాత ఇలా అందరిముందు వాడిని తిట్టారు. వాడి భార్య ఫీల్ అవుతుందని రామరాజుతో అంటుంది వేదవతి. నా కొడుకుకి బాధ్యతలు చెప్పడం నా బాధ్యత అని రామరాజు అనేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సాగర్ కి ఫోన్ చేస్తుంది నర్మద. ఈవినింగ్ రెస్టారెంట్ కి వెళదామని నర్మదకి సాగర్ చెప్తాడు. రామరాజు దగ్గరికి సాగర్ వచ్చి.. నాన్న నాకు రెండు గంటలు పర్మిషన్ కావాలి.. నర్మద తో రెస్టారెంట్ కి వెళ్తానని అడుగుతాడు. ఇప్పుడు వద్దు మిల్ లో వర్క్ ఉందని అంటాడు. దాంతో సాగర్ డిస్సపాయింట్ అవుతాడు. ఆ తర్వాత ప్రేమ బాధపడుతుంటే వేదవతి వచ్చి మాట్లాడుతుంది. ధీరజ్ ప్రేమ కోసం కొబ్బరి బొండాలు ఇంకా టాబ్లెట్ తీసుకొని వచ్చి ఇస్తాడు. ఎందుకు నువ్వు కష్టపడుతూ ఇవ్వన్నీ ఎందుకు తెచ్చావని ప్రేమ అడుగుతుంది. నువ్వు నా బాధ్యత అని ధీరజ్ అంటుంటే.. అతడి వంక ప్రేమగా చూస్తుంది ప్రేమ. మరోవైపు సాగర్ కోసం నర్మద వెయిట్ చేస్తుంది. తరువాయి భాగంలో సాగర్, నర్మద ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి వెళ్తారు. అనుకోకుండా రామరాజు కూడ వెళ్తాడు. అక్కడ వాళ్ళని చూసి సాగర్ కి కాల్ చేస్తాడు. కానీ అతను లిఫ్ట్ చెయ్యడు. నేను వద్దన్నా వచ్చారని రామరాజు కోపంగా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : దీపని కత్తితో పొడిచేసిన రౌడీ.. కార్తీక్ చూసి షాక్!

  స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -350 లో....జ్యోత్స్న గౌతమ్ ని కలుస్తుంది. మన పెళ్లి జరగదు. ఆ దీప మనల్ని వదిలి పెట్టదు. అందుకే ఇప్పుడే ఆపేద్దాం అంటున్నానని జ్యోత్స్న కావాలనే గౌతమ్ ని రెచ్చగొడుతుంది. అంటే ఇప్పుడు ఆ దీప లేకుంటే నీకు ఒకే కదా.. ఆ దీప పని చెప్తాను శాశ్వంతంగా లేకుండా చేస్తానని గౌతమ్ అంటుంటే అలా చంపడాలు అంటే నాకు భయం ఒకసారి ఆలోచించమని జ్యోత్స్న నటిస్తుంది. నువ్వు త్వరలోనే గుడ్ న్యూస్ వింటావ్.. ఆ తర్వాత మన పెళ్లి అని గౌతమ్ అంటాడు. మరొకవైపు నువ్వు జైలు నుండి బయటకు వస్తే గుడికి వస్తానని మొక్కుకున్నాం. అందరు రెడీ అవ్వండి అని కార్తీక్, దీపలతో అనసూయ అంటుంది. నాకు వర్క్ ఉందని కార్తీక్ అంటాడు. లేదు అందరం వెళ్ళాలని కాంచన అంటుంది. సరే మీరు ముందు వెళ్లి ఏర్పాట్లు చెయ్యండి.. దీప, నేను తర్వాత వస్తామని కార్తీక్ అంటాడు. సరే అని వాళ్ళు వెళ్తారు. మరొకవైపు శివన్నారాయణకి రెస్టారెంట్ నుండి ఫోన్ వస్తుంది. సీఈఓ అక్కడే ఉంది కదా అంటాడు. లేదని వాళ్ళు చెప్తారు. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. ఎక్కడికి వెళ్లావని శివన్నారాయణ అడుగుతాడు. గౌతమ్ దగ్గరికి కి అని పారిజాతం ఇరికిస్తుంది. గౌతమ్ అంటే ఇష్టం లేనిదే తనని వెళ్లి కలుస్తుందా పెళ్లికి ముహూర్తం పెట్టించండి అని పారిజాతం కావాలనే అంటుంది. నువ్వేమంటావని జ్యోత్స్నని శివన్నారాయణ అడుగుతాడు. ఇక ఏం చెయ్యలేక జ్యోత్స్న సరే అంటుంది. ఆ తర్వాత దీప రెడీ అవుతుంటే కార్తీక్ జడలో మల్లెపూలు పెడుతాడు. ఇద్దరు గుడికి వెళ్ళడానికి రెడీ అవుతారు. కార్తీక్ వెళ్లి సైకిల్ దగ్గరికి వెయిట్ చేస్తుంటాడు. దీప డోర్ వేస్తుంటే రౌడీ వచ్చి కత్తితో దీపని పొడిచి వెళ్ళిపోతాడు. ఇంకా దీప రావడం లేదని కార్తీక్ వెళ్తాడు. దీపని చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రాజ్ ని చూసేసిన రాహుల్, రుద్రాణి.. కావ్య మనసు తెలిసేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -714 లో.... కావ్య తన గదిలోకి వస్తుంటే రాజ్ టవల్ పై ఉంటాడు. మీరు ఇక్కడ ఉన్నారేంటని కావ్య అడుగుతుంది. మా రూమ్ లో వాటర్ రావడం లేదని రాజ్ అంటాడు. నాకొక హెల్ప్ చేస్తారా మా రూమ్ లో నా డ్రెస్ ఉంది తీసుకొని రండీ అని కావ్యకి రాజ్ చెప్తాడు. కావ్య సరే అని వాళ్ళ రూమ్ కి వెళ్లేసరికి అక్కడ యామిని ఉంటుంది. దొంగ దొంగ అంటూ కావ్య కావాలనే అంటుంది. ఏంటి యామిని నువ్వు వస్తావని తెలుసని కావ్య అంటుంది. నువ్వు ఇంతవరకు రాజ్ తో ఉన్నావా అని యామిని అడుగుతుంది. తన పక్కనే ఉన్నాను.. తన బట్టల కోసం వచ్చానని యామినిని రెచ్చగొట్టేలా కావ్య మాట్లాడుతుంది. ఇక రాజ్ ఉన్నా గదిలోకి కావ్య వెళ్తుంది. బయట నుండి యామిని వింటుందని తెలిసి.. ఏవండీ ఏంటి అండి.. ఈ చిలిపి పనులు మీకు ముద్దు కావాలా అంటూ మాట్లాడుతుంది. అది వింటున్న యామినికి తెగ కోపం వస్తుంది. అప్పుడే రాజ్ స్నానం చేసి కావ్య దగ్గరికి వస్తాడు. యామిని కిటికీ దగ్గర నుండి చూస్తుందని కావ్య కావాలనే చీర సెట్ చేసుకుంటుంది. ఏం చేసావే అంటూ యామిని అనుకుంటుంది. ఆ తర్వాత రాజ్ కి కావ్య డిజైన్స్ చూపిస్తుంది. ఏదో గుర్తువచ్చినట్లు రాజ్ బెహేవ్ చేస్తుంటే.. అప్పుడే యామిని ఎంట్రీ ఇస్తుంది. నువ్వు ఎలా వచ్చావని యామినిని రాజ్ అడుగుతాడు. నువ్వే కదా బావ నాకు మెసేజ్ చేసావని యామిని చూపిస్తుంది. అదేసమయంలో రాజ్ లేనప్పుడు వెయిటర్ చేత రాజ్ ఫోన్ నుండి యామిని మెసేజ్ చెయ్యమని చెప్పింది గుర్తు చేసుకుంటుంది యామిని. ఆ తర్వాత రాహుల్, రుద్రాణి వెయిటర్ గెటప్ లో రెసాట్ లోకి ఎంట్రీ ఇస్తారు. యామిని, కావ్య మాట్లాడుకోవడం వాళ్లు వింటారు. అలాగే రాజ్ ని కూడా చూస్తారు. ఈ యామిని ఎవరు ఈ ట్రయాంగింల్ అర్ధం అవడం లేదు.. రాజ్ ని రామ్ అంటున్నారని రాహుల్, రుద్రాణి అనుకుంటారు. తరువాయి భాగంలో రాజ్ వేరొకరితో క్లోజ్ గా ఉంటే కావ్య జెలస్ గా ఫీల్ అవుతుంది. మిమ్మల్ని ఆవిడ లవ్ చేస్తుంది.‌ నేను మీతో క్లోజ్ గా ఉన్నానని ప్లేట్ విసిరేసి వెళ్ళిందని రాజ్ పక్కన కూర్చొని ఒక అమ్మాయి రాజ్ కి చెప్తుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఇమ్మ్యూనిటి లెవెల్స్ తగ్గిపోయాయి.. ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయింది...

  నటి మాధవి లతా కొంతకాలం క్రితం వరకు మూవీస్ లో చేస్తూ ఉండేది. కానీ మూవీస్ కి బైబై చెప్పేసి పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చింది. అలాగే సోషaల్ ఇష్యూస్ మీద తన ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు, వీడియోలు పెడుతూ ఉంటుంది. ప్రతీ ఇష్యూ మీద ఆమె స్పందిస్తూ ఉంటుంది. అలాంటి మాధవి లతాకి ఆరోగ్యం బాగాలేక వీడియోస్ చేయడం లేదు. ఐతే రీసెంట్ గా తన హెల్త్ అప్డేట్ మీద ఒక వీడియోని చేసి పోస్ట్ చేసింది. "రెండేళ్ల నుంచి హెల్త్ అసలు సహకరించడం లేదు. బాగా మైగ్రేన్ ఉంది. దాంతో సరిగా నిద్ర పట్టడం లేదు. ఆ కారణంగా ఇమ్మ్యూనిటి పవర్ తగ్గుతోంది..అలాగే బాడీలో ఇన్ఫ్లమేషన్ బాగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను. వాకింగ్ చేద్దాం అనుకుంటున్నా కానీ పది నిమిషాలు కూడా నడవలేకపోతున్న.. అసలు అడుగు తీసి అడుగు వేయాలంటే భయం వేస్తోంది. మెంటల్లీ నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటా కానీ ఫిజికల్లీ చిన్న జ్వరం వచ్చినా తట్టుకోలేను. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల హెల్త్ చాలా డెలికేట్ గా ఉంటుంది. అందుకే అమ్మాయిలు ఫిజికల్లీ వీక్ గ ఉన్నప్పుడు మెంటల్లీ కూడా వీక్ ఐపోతారు. అసలు మాట్లాడానికి కూడా నాకు ఓపిక ఉండడం లేదు. గట్టిగా కూడా మాట్లాడలేకపోతున్న. నాకు మొదటి సరి ఏడవ తరగతి చదివేటప్పుడు మైగ్రేన్ ఎటాక్ అయ్యింది. కింద నుంచి పైన ఉన్న నా గదికి వెళ్ళడానికి అంటే 15 మెట్లు ఎక్కడానికి కూడా నాకు వీక్ నెస్ వస్తోంది. కాసేపు ఫోన్ పట్టుకున్నా కూడా చేతులు నరాలు నొప్పులు వస్తున్నాయి. ఇమ్మ్యూనిటి లెవెల్స్ బాగా తగ్గిపోయాయి. అందుకే ఎలాంటి వీడియోస్ ని సరిగా చెయ్యట్లేదు. స్ట్రెస్, హార్మోనల్ ఇంబ్యాలన్సు ఇవన్నీ కలిపి నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకుంటున్నా"...అంటూ బాగా ఎమోషనల్ అయ్యింది. ఏడుస్తూనే ఆ వీడియోలో తన బాధల్ని చెప్పుకుంది.

కాన్సర్ తో అమ్మ చనిపోయింది..కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ

తేజస్విని మడివాడ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన తేజస్వి తర్వాత ఎన్నో మంచి మూవీస్ తో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళింది. కానీ హౌస్ నుంచి వచ్చాక ఆమె మీద ఫుల్ నెగటివిటీ రావడంతో మూవీస్ లో కనిపించడం మానేసింది. ఐతే ఇప్పుడు యాంకరింగ్ చేస్తూ బుల్లితెర మీద కొన్ని షోస్ లో కనిపిస్తోంది. అదే కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ లో యాక్టీవ్ పార్టిసిపెంట్ గా ఉంది. కానీ ఈ వారం ఫ్యామిలీ  థీమ్ లో ఆమె తన స్టోరీ చెప్పి అందరితో కన్నీళ్లు పెట్టించేసింది. జడ్జ్ అనసూయ కూడా కన్నీళ్లు పెట్టేసుకుంది. తనకు ఫుడ్ పెడుతున్న ఒక ఫ్యామిలీ  నుంచి రోహిత్ భరద్వాజ్ అనే పర్సన్ ని షోలో పరిచయం చేసింది. అప్పుడు తన ఫామిలీ గురించి చెప్పింది. షోస్ లో చిటపటమంటూ ఉంటుంది తేజు ఇంట్లో ఎలా ఉంటుంది అని రోహిత్ ని శ్రీముఖి అడగడంతో "నాకు ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. వాడి బిహేవియర్ తేజు బిహేవియర్ సేమ్ గా ఉంటుంది.. ఏడెనిమిదేళ్లు వయసులోనే ఎన్నో కష్టాలను చూసింది. వాళ్ళ అమ్మ కాన్సర్ తో చనిపోయింది. ఆ తర్వాత చదువు తన ఓన్ గా చదువుకుంది. తన కాళ్ళ మీద తానే బతికింది " అని చెప్పాడు. తర్వాత శ్రీముఖి అడిగేసరికి "ఎవరికైనా ఒక ప్లేస్ ఉంటుంది. అది ఫ్యామిలీ . కానీ నాకు అలా కాదు. నాకు ఎక్కడుంటే అదే నా ఫామిలీ. నేను జనాలను కలవడానికి ఎందుకు అంత ఎక్సయిట్ అవుతాను అంటే నేను ఇంటికి వెళ్తే ఒక్కదాన్నే ఉండాలి. నేను ఒంటరిగా ఉండాలి. అందుకే జనాలని కలిసినప్పుడు నాకు అదో పండగలా అనిపిస్తుంది. నాకు పిక్నిక్ కి వచ్చినట్టు ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళిపోగానే అంతా బాధగా అనిపిస్తుంది. పేరెంట్స్ లేరు, ఫ్యామిలీ  లేదు నాకు ఒక్కోసారి పని చేయకుండా ఉండాలని అనిపిస్తుంది. కానీ నాకు ఆ ఛాన్స్ లేదు. రోహిత్ వాళ్ళ ఫ్యామిలీ నువ్వు పని చేయకపోయినా పర్లేదు అని అంటూ ఉంటారు. లైఫ్ లాంగ్ ఫుడ్ పెడతాము అంటారు. అందుకే నాకు వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇష్టం." అని చెప్పింది. దాంతో అనసూయ ఏడుస్తూ "నాకు తేజు లాంటి కూతురు ఉండి ఉంటే బాగుండు అనిపించింది" అని చెప్పింది. దానికి తేజు "ఐతే నేను ఉన్నననుకోండి మీ కూతురిగా రేపటి నుంచి సామాన్లు సర్దుకుని వచ్చేస్తాను" అంటూ కామెడీ చేసింది.  

Illu illalu pillalu : భాగ్యం ప్లాన్ కి చెక్ పెట్టిన ప్రేమ.. కళ్ళుతిరిగిపడిపోయిన రామరాజు కోడలు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -150 లో.. వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు.. పాపం ఇలా పదహారు రోజుల పండుగ చేసుకోలేదని ప్రేమ, నర్మద బాధపడేలా చేస్తుంది భాగ్యం. ఆ తర్వాత శ్రీవల్లి మెడలో తాళి వేస్తాడు చందు. భాగ్యం పక్కకి తీసుకొని వచ్చి శ్రీవల్లి నగలన్ని తీసుకుంటుంది. చందు, శ్రీవల్లీలతో పాటు అందరు భాగ్యం ఇంటినుండి బయల్దేర్తుంటారు. అక్క నువ్వు వచ్చేటప్పుడు అన్ని నగలు వేసుకొని వచ్చావ్ మరి ఇప్పుడేంటి ఏం నగలు లేవని ప్రేమ అంటుంది. అవును నగలు ఏవి అని వేదవతి అంటుంది. అంటే అమ్మ లాకర్ లో పెడితే సేఫ్టీ ఉంటుందని తీసుకుందని శ్రీవల్లి అంటుంది. నువ్వు మొదటిసారి మా ఇంటికి కోడలుగా అడుగుపెడుతున్నావని వేసుకొని రా అని వేదవతి అంటుంది. ఇక ఏం చెయ్యలేక భాగ్యం, శ్రీవల్లి లోపలికి వెళ్తారు. భాగ్యం నగలన్నీ వేస్తుంది. నువ్వు ఏం టెన్షన్ పడకు ఈ నగలు టైమ్ చూసి ఇక్కడికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తానని భాగ్యం అంటుంది. ఆ తర్వాత అందరు భాగ్యం ఇంటినుండి వెళ్లిపోతారు. మేమ్ ఆ నగల గురించి టెన్షన్ పడేలా చేసావ్ కదా.. నిన్ను వదిలి పెట్టను ప్రేమ అని భాగ్యం అనుకుంటుంది. ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ ఇద్దరు వస్తుంటే.. బైక్ ఆగిపోతుంది. ప్రేమ ఎండలో ఉండడం వల్ల కళ్ళు తిరిగి పడిపోతుంటే.. ధీరజ్ పట్టుకొని వాటర్ ఇస్తాడు. కొబ్బరి బొండం ఇస్తాడు. బైక్ పక్కన పెట్టి ప్రేమని తీసుకొని ధీరజ్ ఆటోలో ఇంటికి బయలుదేర్తాడు. మరొకవైపు చందు శ్రీవల్లి అందరు ఇంటికి వస్తారు. చిన్నోడు ప్రేమ ఎక్కడ అని వేదవతిని రామరాజు అడుగుతాడు. అప్పుడే ప్రేమ, ధీరజ్ ఆటో దిగి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : జ్యోత్స్న వాడిని కలవడం చూసేసిన పారిజాతం.. ఆ ఇంటికి వెళ్ళొద్దు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -349 లో.....కార్తీక్, దీప ఇద్దరు అసలు ఆ షూట్ ఎలా జరిగిందో అన్నివైపులా ఆలోచిస్తారు. ఒకవేళ జ్యోత్స్ననే షూట్ చేసి నీ లైఫ్ లోకి రావాలని ఇదంతా చేసిందేమోనని కార్తీక్ అంటుంటే నిజంగానే అలా జరిగే ఛాన్స్ ఉందా అని దీప అంటుంది. అదంతా తర్వాత ఆలోచిద్దాం కానీ నువు ఫస్ట్ పడుకో.. ఎన్ని రోజులు అవుతుందని కార్తీక్ అంటాడు. మరుసటిరోజు జ్యోత్స్నని ఫాలో అవుతూ పారిజాతం వస్తుంది. జ్యోత్స్న ఎవరిని కలవడానికి వచ్చిందని పారిజాతం అనుకుంటుంది. తీరా చుస్తే జ్యోత్స్న దగ్గరికి సత్తిపండు వస్తాడు. బుల్లెట్ ఎందుకు మిస్ చేసావ్.. అక్కడ బుల్లెట్ తగిలిన వాళ్ళు బాగున్నారు.. ఆ దీప ఇంటికి వచ్చింది.. ఇప్పుడు నువ్వు దొరికితే నాకు సంబంధం లేదని జ్యోత్స్న అంటుంది. చేయించింది మీరే కదా అని సత్తి పండు అంటాడు. ఈ డబ్బు తీసుకొని ఎక్కడికైనా వెళ్ళమని జ్యోత్స్న అంటుంది. అసలు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారని పారిజాతం చూస్తుంది. వాడిని ఎందుకు కలిసింది.. దాస్, దశరథ్ లపై ఎటాక్ చేసింది అదే అని తెలిస్తే మాత్రం ఈ పారిజాతం అంటే ఏంటో చూపిస్తానని పారిజాతం అనుకుంటుంది. మరొకవైపు సుమిత్ర ఇంటికి దీప వెళ్తానని అంటుంటే.. దీపని తిడుతుంది అనసూయ. నీకు ఇదంతా అవసరమా గౌతమ్ మంచివాడు కాదని జ్యోత్స్నకి తెలుసు.. వాళ్ళు అపుకుంటారు. నువ్వు వెళ్లి అందరిచేత తిట్లు తిన్నావని అనసూయ తిడుతుంది. జ్యోత్స్న తన బావని దక్కించుకునే ప్రయత్నంలో భాగంగా గౌతమ్ తో చేతులు కలిపింది. గౌతమ్ మంచివాడు కాదు.. జ్యోత్స్న నన్ను అక్క అని పిలిచి తన ఇంట్లో చోటు ఇచ్చింది.. అందరు బాగుండాలి కార్తీక్ బాబు వాళ్ళు కలవాలని దీప అంటుంది. ఆ మాటలు అన్నీ కార్తీక్ వింటాడు. నువ్వు అనుకున్నది జరుగుతుంది కానీ ఇప్పుడు అయితే వాళ్ళ ఇంటికి వద్దని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

Brahmamudi : డిజైన్స్ చూపించిన కావ్య.. యామిని ఎంట్రీతో కథ మలుపు తిరగనుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -713 లో.....అప్పు, కళ్యాణ్ ఇద్దరు కలిసి రాజ్ కి గతం గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగా రాజ్ క్లోజ్ ఫ్రెండ్ శ్వేతని రెసాట్ కి రప్పిస్తారు. నువ్వు అన్నయ్యతో ఎలా క్లోజ్ గా ఉన్నావో.. నాతో అలా క్లోజ్ గా ఉండు, అప్పుడు అన్నయ్యకి ఏమైన గుర్తుకురావొచ్చని శ్వేతతో కళ్యాణ్ చెప్తాడు. ఆ తర్వాత రాజ్, కావ్య ఇద్దరు రెసాట్ కి చేరుకుంటారు. రాజ్ ని చూసి కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందరు రాజ్ కి తమని తాము పరిచయం చేసుకుంటారు. కళ్యాణ్ ఫ్లోలో అన్నయ్య అని రాజ్ ని పిలవగానే.. అదేంటీ అలా అన్నావని రాజ్ అడుగుతాడు. మా అన్నయ్య కూడ మీలాగే ఉంటాడు. తను మా దగ్గర నుండి వెళ్ళిపోయాడు. అందుకే మిమ్మల్ని అలా పిలవాలనిపిస్తుందని కళ్యాణ్ అనగానే.. సరే తమ్ముడు అని రాజ్ అంటడు. శ్వేత, కళ్యాణ్ ఇద్దరు క్లోజ్ గా ఉండడంతో మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏదో గతం గుర్తుకు వస్తుంది కానీ గుర్తుకు రావడం లేదని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్ , కళ్యాణ్ లకి ఒక రూమ్ అప్పు, కావ్యలకి రూమ్ తీసుకుంటారు. మరొకవైపు రెసాట్ కి యామిని వస్తుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి శృతి వచ్చి డిజైన్స్ ఇస్తుంది. ఆ డిజైన్స్ ద్వారా అయిన రాజ్ కి గతం గుర్తుకువస్తుందేమోనని కావ్య అనుకుంటుంది. కళ్యాణ్ ప్లాన్ లో భాగంగా రాజ్ దగ్గరికి వచ్చి.. అన్నయ్య ఈ రూమ్ లో వాటర్ రావడం లేదు. మీరు వదిన వల్ల రూమ్ లో స్నానం చెయ్యండి అని కళ్యాణ్ చెప్పగానే.. రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. రాజ్ కావ్య దగ్గరికి వెళ్లి తన మనసులో మాట చెప్పినట్లు ఉహించుకుంటాడు. ఆ తర్వాత నిజంగానే కావ్య కి తన మనసులో మాట చెప్పాలని ట్రై చేస్తాడు. తరువాయి భాగంలో రాజ్ కి కావ్య డిజైన్స్ చూపిస్తుంది. రాజ్ కి గతం గుర్తుకు వస్తుంటే అప్పుడే యామిని వచ్చి బావ అంటుంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

శృతి మరో సాయి పల్లవి కాబోతోంది...మీకు ఒక మంచి సినిమా రావాలి..

ఢీ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఒక్కో డాన్స్ ఒక్కో రేంజ్ లో ఉంది. ముఖ్యంగా సాగర్ - శృతి డాన్స్ ఐతే వేరే లెవెల్. వీళ్ళ డాన్స్ కి గణేష్ మాష్టర్ ఫిదా ఇపోయారు. ఐతే ఈ అన్ని జోడీస్ లో +5 స్కోర్ గెలుచుకునే జోడి ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఐతే ఇన్ని ఎపిసోడ్స్ నుంచి సాగర్ - శృతి డాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక నెక్స్ట్ వీక్ వీళ్ళు "ముక్కాలా మూకాబులా" అంటూ ప్రభుదేవా డాన్స్ కి క్లాసిక్ టచ్ ఇచ్చి మరీ డాన్స్ పెర్ఫార్మ్ చేశారు. క్లాసికల్ కాస్ట్యూమ్ తో చేసిన ఈ డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. మరీ ముఖ్యంగా గణేష్ మాస్టర్ గురించి చెప్పాలంటే "మన ఢీ షో నుంచి మరో సాయి పల్లవి రాబోతోంది." అంటూ చెప్పారు. ఇంకా "మీకు ఒక మంచి సినిమా అవకాశం రావాలండి" అని కూడా ఆమెతో అనేసరికి శృతి కూడా ఫుల్ ఖుషీ ఐపోయింది. ఈ కామెంట్స్ ఎవరైనా రైటర్స్, డైరెక్టర్స్ వింటే గనక కచ్చితంగా ఈమెతో సినిమా తీసే అవకాశం కూడా లేకపోలేదు. ఇక పులి యాట్టం డాన్స్ ఫార్మ్ లో "అదిగో అదిగో మేక" సాంగ్ కి జతిన్ చేసిన డాన్స్ కి వినయ్ బిన్నీ, గణేష్ మాస్టర్ ఇద్దరూ ఖుషీ ఐపోయి కాంప్లిమెంట్స్ ఇచ్చేసారు.  అలాగే మిగతా జోడీస్ ఐతే బాంగ్రా, ట్యాపింగ్, పులి యాట్టం, కాంటెంపరరీ, కథాకళి వంటి డాన్స్ ఫార్మ్స్ తో డాన్స్ చేసి అందరినీ అలరించారు. ఐతే గణేష్ మాష్టర్ సాయి పల్లవి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు అంటే ఢీ సీజన్ 4   లేడీస్ స్పెషల్  అప్పట్లో టెలికాస్ట్ అయ్యింది. అందులో సాయి పల్లవి కూడా డాన్స్ కంటెస్టెంట్ గా వచ్చింది. ఆ సీజన్ కి యాంకర్ గా ఉదయ భాను, జడ్జెస్ గా రంభ, బృంద మాష్టర్, సంగీత ఉన్నారు. ఈ ఢీ షో తర్వాత సాయి పల్లవి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రేమమ్, ఫిదా, లవ్ స్టోరీ, అమరన్ లాంటి హిట్ మూవీస్ చేసింది..

సింగల్ గా ఉంటే అన్ని అడ్వాంటేజెస్ కానీ రెండు మిస్సవుతాం

సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి హ్యాష్ టాగ్ సింగిల్ మూవీ టీమ్ నుంచి శ్రీవిష్ణు, కేతిక శర్మ, వెన్నెల కిషోర్, ఇవానా వచ్చారు. వీళ్ళతో హంగామా చేసింది సుమ. "సింగల్ గా ఉంటే అడ్వాంటేజ్ ఏంటి" అని సుమా అడిగేసరికి "అన్ని అడ్వాంటేజెస్ అండి...అప్పుడు రెండు మిస్సవుతాం" అని చెప్పాడు శ్రీవిష్ణు. ఇక ఇవానా కూడా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెపింది. "సింగల్ గా ఉండడం సర్టెన్ పాయింట్ వరకు ఓకే కానీ ఆ తర్వాత పార్టనర్ అవసరం" అని చెప్పింది. దాంతో వెన్నెల కిషోర్ కౌంటర్ వేసాడు "అంటే ఈ షోని ఎవరో చూస్తున్నారు" అనేసరికి ఇవానా నవ్వుకుంది. "వెన్నెల కిషోర్ గారు ఇంత హ్యాండ్సంగా ఉండడానికి గల కారణం ఏమిటి" అని అడిగింది సుమ. "డైట్ ఫుడ్, వర్కౌట్స్, ప్రతీసారి సంతోషంగా ఉండడం" అని చెప్పాడు శ్రీవిష్ణు. "నేనేమో మాటవరసకు అడిగాను ఇది నిజమైన క్వశ్చన్ కాదు" అని సుమా చెప్పడంతో "నేను మాటవరసకు ఆ ఆన్సర్ చెప్పను" అని రివర్స్ కౌంటర్ వేసాడు శ్రీవిష్ణు. తర్వాత సుమ కార్ డ్రైవింగ్ స్కూల్ లో కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిన వెన్నెల కిషోర్ కి కొన్ని రూల్స్ చెప్పింది "ముందు కీస్ పెట్టాలి" అని వెన్నెల కిషోర్ చెప్పాడు. "ఇప్పుడు కీస్ ఎవరు పెడుతున్నారు మొత్తం బటన్స్ అన్నీ నొక్కేస్తున్నారుగా" అని చెప్పింది సుమ. "మాది పాత కారు" అని చెప్పాడు వెన్నెల కిషోర్. తర్వాత కేతిక శర్మతో సుమా "వెన్నెల కిషోర్ గురించి తెలుగులో చెప్పు" అని అడిగింది. దాంతో కేతిక "వెన్నెల కిషోర్ చాలా మంచి మనిషి" అని డౌట్ తో చెప్పింది. వెంటనే సుమ "వెన్నెలా కిషోర్ మంచి మనిషా కాదా అన్న విషయం మీద కేతికాకి ఒక డౌట్ ఉంది" అంటూ నవ్వేసింది. ఇవానాతో చపాతీలు చేయించింది. వెన్నెలా కిషోర్ తో మాంగో పచ్చడి ప్రొసీజర్ చెప్పించింది సుమా.  

వెంకీ మామ పాటలు వింటూ తెలుగు నేర్చుకుంటున్నా...

గుప్పెడంత మనసు సీరియల్ జగతి మేడం అలియాస్ జ్యోతి పూర్వజ్ ప్రస్తుతం తెలుగు మాట్లాడ్డం నేర్చుకుంటోంది. దానికి సంబందించిన ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. జ్యోతి కిల్లర్ మూవీ చేస్తోంది. అది త్వరలో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఐతే ఇప్పుడు జ్యోతి తెలుగు నేర్చుకునే పనిలో పడింది. ఎందుకంటే తెలుగులో తన ఓన్ డబ్బింగ్ తానే చెప్పుకోవాలంటే తెలుగు అవసరం. మూవీ ప్రమోషన్స్ లో కూడా తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ కావాలి అంటే తెలుగులో మాట్లాడాలి. ఇప్పుడు జ్యోతి అదే పనిలో పడింది. అందులో భాగంగా వెంకటేష్ నటించిన "నువ్వు నాకు నచ్చావ్" మూవీలోని "ఓ నవ్వు చాలు అనే సాంగ్ ని వింటూ అదే లిరిక్స్ కి తగ్గట్టు తెలుగులో పాట కూడా పాడేస్తూ ఒక రీల్ ని పోస్ట్ చేసింది. అలాగే "నేను తెలుగు మాట్లాడగలను...కానీ తెలుగులో సరిగ్గా చదవలేను. కానీ నేను తెలుగు మాట్లాడడానికి, చదవడానికి ప్రతీ రోజూ ప్రయత్నిస్తున్నాను... చూద్దాం..అందుకే నేను తెలుగు పాటల లిరిక్స్ ని అలాగే ప్రాక్టీస్ చేస్తూ తెలుగును నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.  " అంటూ చెప్పింది. ఇక జ్యోతి తెలుగు నేర్చుకోవడం చూసిన నెటిజన్స్ మెసేజెస్ చేస్తున్నారు. "సూపర్బ్ మీరు వెంకటేష్ గారితో హీరోయిన్ గా చేయాలి ఆల్ ది బెస్ట్...బాగా పాడుతున్నారు..మంచి గొంతు.. మరో గ్రేట్ సింగర్ రాబోతోంది. మీ భాష కాకపోయినా బాగా పాడుతున్నారు. ఈ ప్రపంచంలోనే అందమైన అమ్మాయి. వెంకీ మామ మీరు ఒక స్క్రీన్ లో బాగుంటుంది. తెలుగు ఇండస్ట్రీలో నెక్స్ట్ బిగ్ హీరోయిన్." అంటూ ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. జ్యోతి పూర్వజ్ గుప్పెడంత మనసు సీరియల్ తో రిషికి తల్లిగా జగతిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఆమె హీరోయిన్ గా ఆడియన్స్ ముందుకు రాబోతోంది.

మేము ఎలాంటి తప్పు చేయలేదు.. పెళ్లి చేసుకోబోతున్నాం!

  ఢీ డాన్సర్ జాను మీద కొన్ని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. జాను తన మీద వస్తున్న రూమర్స్ కి అలాగే పెళ్లి చేసుకోబోతోందన్న విషయం మీద ఏడుస్తూ కూడా వీడియోస్ చేసింది. ఐతే ఇప్పుడు జాను పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్ దేవగన్ రీసెంట్ గా ఒక వీడియోని రిలీజ్ చేసాడు.    "నేను జానుతో ఉన్న ఫోటోని బాగా ట్రోల్ చేస్తున్నారు. ఐతే అది నిజమే. నేను జాను ఇష్టపడ్డాం. మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. అందరి అంగీకారం మేరకే పెళ్లి చేసుకోబోతున్నాం. మేము ఎలాంటి తప్పు చేయలేదు. మేము కలిసి బతకాలని అనుకుంటున్నాం. అలాంటి మా మీద రకరకాల కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు మీడియాలో. మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్లందరికీ థ్యాంక్యూ సో మచ్" అని చెప్పాడు.    ఆ తర్వాత జాను వచ్చి "నేను ఏదైతే వీడియో చేసానో దానికి చాల మంది బాధపడ్డారు. కానీ మాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్లందరికీ థ్యాంక్యూ సో మచ్. కొద్దీ రోజులుగా అన్ని గమనిస్తున్నాను. చివరికి తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా..మా ఫామిలీ ఎక్కడ బాధపడుతుందో అని భయమేసింది అంతేకాని ఎవరికో భయపడి కాదు. నేను అలా భయపడే దాన్నీ ఐతే ఈ స్టేజికి వచ్చేదాన్ని కాదు. నేను నా బాబు హ్యాపీగా ఉన్నాం. నా మీద ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి. ఎవరు ఎన్ని అనుకున్నా నేను నా లైఫ్ లో ఎప్పుడూ స్ట్రాంగ్ గానే ఉన్నాను, ఉంటాను" అని చెప్పింది.    ఇక జాను ఏడుస్తూ చేసిన వీడియోస్ చాలా వైరల్ ఐపోయాయి. ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య దాదాపు 1 .5 మిలియన్స్ కి చేరిపోయారు. ఇక నెటిజన్స్ ఐతే ఆ జంటకి విషెస్ చెప్తూ మెసేజెస్ చేస్తున్నారు.  

Illu illalu pillalu : పూజలో వారిని అవమానించిన భాగ్యం.. ధీరజ్ కి ప్రేమ దగ్గరవుతుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -149 లో... భాగ్యం కావాలనే ప్రేమని అవమానించాలని కాఫీ కింద పడబోసి ప్రేమ చేత క్లీన్ చేయిస్తుంది. అప్పుడే ధీరజ్ వచ్చి ప్రేమని ఆపుతాడు. ప్రేమ తన పుట్టింట్లో చాలా అపురూపంగా పెరిగింది. తనకి ఇలాంటి పనులు తెలియదని ధీరజ్ అంటాడు. అంటే అల్లుడు గారు టీ కింద పడిపోయింది అందుకే అని భాగ్యం అంటుంది. సరే నేనే చేసుకుంటానని ధీరజ్ క్లీన్ చేస్తుంటాడు. అలా ధీరజ్ క్లీన్ చేస్తుంటే తన వంక తన భార్య ప్రేమ ఆప్యాయంగా చూస్తుంది.   ఆ తర్వాత సాగర్, నర్మద కలిసి భాగ్యం ఇంటికి వస్తారు. మీరు రాలేదని అనుకున్నా వచ్చారా అని భాగ్యం అనగానే.. బాబాయ్ గారిని పిలవండి అని నర్మద అంటుంది. లోపల ఉన్నారు రెడీ అవుతున్నారని భాగ్యం చెప్తుంది. తర్వాత బయటకు వెళ్ళాడని చెప్తుంది. అయితే బాబాయ్ కి వీడియో కాల్ చెయ్ అని నర్మద అంటుంది. అప్పుడే భాగ్యం భర్త ఎంట్రీ ఇస్తాడు. ఆ పిల్ల నన్ను ఇడ్లీ అమ్ముతుంటే చూసిందని భాగ్యం భర్త ఆనందరావు  భాగ్యంతో చెప్తాడు. దాంతో భాగ్యం డైవర్ట్ చేసి పూజకి టైమ్ అవుతుందని అంటుంది.    ఆ తర్వాత పూజ మొదలవుతుంది. నర్మద, ప్రేమలని అవమానించాలని భాగ్యం అనుకొని.. తన ఇంటికి వచ్చిన వాళ్లతో అవమానిస్తుంది. వాళ్లకు నల్లపూసలు లేవేంటని వాళ్ళు అడుగగా వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకున్నారని భాగ్యం అంటుంది. దాంతో ప్రేమ, నర్మద ఇద్దరు బాధపడుతారు. ఆ విషయం వదిలేయండి అని వేదవతి అంటుంది.    తరువాయి భాగంలో అందరు తిరిగి ఇంటికి వస్తారు. ప్రేమ ధీరజ్ మాత్రం ఆటోలో వస్తారు. ఎందుకు ఆటోలో వచ్చారని రామరాజు అడుగుతాడు. బైక్ రిపేర్ అందుకే అని ధీరజ్ అంటాడు. నీకు బుద్ది ఉందా రిపేర్ చేయించుకొని రావాలి కానీ అలా బైక్ వదిలేసి వస్తారా అని ధీరజ్ పై రామరాజు కోప్పడుతుంటే.. శ్రీవల్లి చూసి నవ్వుతుంది. అలా శ్రీవల్లి నవ్వడం ప్రేమ చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2 : అసలైన వారసురాలు దాస్ కి తెలుసు.. సాక్ష్యాలని కాల్చేసిన జ్యోత్స్న!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -348 లో... దాస్ ని చూడడానికి పారిజాతం వస్తుంది. ఏంట్రా రమ్మని చెప్పావ్.. నువ్వు అలా రమ్మంటే దాస్ కి గతం గుర్తు వచ్చిందేమో అనుకున్నానని కాశీతో పారిజాతం అంటుంది. అప్పుడే అక్కడున్న దాస్.. నేనేం మర్చిపోలేదని అంటాడు. అయితే నిన్ను కొట్టింది ఎవరో చెప్పమని దాస్ ని పారిజాతం అడుగుతుంది. ఏమో అని దాస్ అంటాడు.    ఆ తర్వాత దాస్ లోపలికి వెళ్ళాక.. నాన్న గుర్తు వచ్చినప్పుడు ఏదో రాస్తున్నాడని కాశీ చెప్తాడు. ఆ పేపర్స్ తీసుకొని వచ్చి పారిజాతం కి చూపిస్తాడు. ఆ పేపర్ లో ఉంది చదివి పారిజాతం షాక్ అవుతుంది. అసలైన వారసురాలు అంటూ పేపర్ లో ఉంటుంది. అంటే అసలైన వారసురాలు గురించి దాస్ కి తెలిసిందా అని పారిజాతం అనుకుంటుంది. ఈ పేపర్స్ అన్ని తీసుకొని వెళ్తాను. అర్ధం చేసుకొని చెప్తానని పారిజాతం తీసుకొని వెళ్తుంది.    ఆ తర్వాత పారిజాతం ఇంటికి వెళ్లి పేపర్స్ లో ఉన్న వాటిని భూతదం పెట్టి చూస్తుంది. అప్పుడే జ్యోత్స్న వచ్చి అదేంటని అడుగుతుంది. దాస్ గుర్తు వచ్చినప్పుడల్లా ఏదో రాస్తున్నాడని పారిజాతం అంటుంది. దాంతో జ్యోత్స్న ఆ పేపర్స్ తీసుకొని చదువుతుంది. అది చూసి షాక్ అవుతుంది. అంటే దాస్ కి అసలైన వారసురాలు తెలిసింది.. అదే విషయం దశరథ్ కి చెప్పాలనుకుంటున్నాడు.. ఒకవేళ దాస్ నిజం చెప్తే నీకు నష్టం.. నాకు నష్టం.. నా కొడుకు కాబట్టి నేను వాడిని ఏం చెయ్యను.. ఇక నువ్వే కొట్టించుంటావని పారిజాతం అంటుంది. నేనెందుకు కొడుతానంటూ  పారిజాతాన్ని జ్యోత్స్న డైవర్ట్ చేసి పేపర్స్ తీసుకొని పంపిస్తుంది.   ఈ పేపర్స్ ఎవరన్నా చూస్తే ప్రాబ్లమ్ అని జ్యోత్స్న వాటిని కాల్చేస్తుంది. అలా జ్యోత్స్న కాల్చేయడం పారిజాతం చూసి షాక్ అవుతుంది. నువ్వేదో దాస్తున్నావ్.. అది కనిపెట్టాలి.. నా కొడుకుని గాని నువ్వు కొట్టి ఉంటే నిన్ను వదిలి పెట్టనని పారిజాతం అనుకుంటుంది. మరొకవైపు అసలు అలా ఎలా షూట్ చేసారని కార్తీక్, దీప ఆలోచిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రాజ్ కి గతం గుర్తుచేసే ప్రయత్నంలో కళ్యాణ్, అప్పు.. రుద్రాణి పసిగట్టేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -712 లో... కావ్యతో రాజ్ రిసార్ట్ కి వెళ్తున్నాడని యామిని అనుకుంటుంది. కావ్యకి ఫోన్ చేసి నీ వైపుకి తిప్పుకోవాలనుకుంటున్నావు.. నేను నీ ప్లాన్ చెడగొడతానంటూ కావ్యతో యామిని ఛాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ తో ఫోన్ లో మాట్లాడుతుంది కావ్య. రిసార్ట్ లో అన్ని ఏర్పాట్లు చేసావా అని కనుక్కుంటుంది. కావ్య రెడీ అయి హాల్లోకి వచ్చి అపర్ణ వాళ్ళకి చెప్తుంది. ఇదేం విడ్డురం రాజ్ లేడని బాధపడకుండా అలా తిరుగుతుందని రుద్రాణి అంటుంటే.. తన మాటలు పట్టించుకోకుండా కావ్య బయల్దేర్తుంది.   కావ్య వెనకాలే రాహుల్, రుద్రాణి వస్తారు. ఏంటి అలా డౌట్ గా చూస్తున్నారని కావ్య అడుగుతుంది. నీకు పార్టీ కల్చర్ నచ్చదు కదా మరి ఎందుకు వెళ్తున్నావని రాహుల్ అడుగుతాడు. నాకు అన్ని నచ్చుతాయని కావ్య సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది. దీన్ని అంత తేలికగా వదలకూడదు. ఎక్కడికి వెళ్తుందో కనుక్కోమని రాహుల్ కి రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత రాజ్, కావ్య ఒకే కార్ లో రిసార్ట్ కి బయల్దేర్తారు. మరొకవైపు కళ్యాణ్, అప్పు కలిసి రిసార్ట్ దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తారు. సందీప్ తన భార్యకి రాజ్ గురించి చెప్తారు. తన ఫ్రెండ్స్ కి రాజ్ గురించి చెప్తారు.    తరువాయి భాగంలో కావ్య రాజ్ రిసార్ట్ కి చేరుకుంటారు. అప్పుడే కళ్యాణ్, అప్పు ఇద్దరు రాజ్ ని కలిసి మాట్లాడుతారు. నిన్ను అన్నయ్య అనుకుంటున్నానని కళ్యాణ్ అనగానే.. సరే నిన్ను తమ్ముడు అనుకుంటానని రాజ్ అంటాడు. అప్పు, కళ్యాణ్, కావ్య కలిసి రాజ్ కి గతం గుర్తుచేసే ప్రయత్నం చేస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ముమైత్ ఖాన్ ప్రెసిడెంట్ ఐతే ఎలా ఉంటుందో తెలుసా

కాకమ్మ కథలు షో ఈ మధ్య కాలాల్లో ఆహా ప్లాట్ఫార్మ్ మీద మంచి రేటింగ్ ని సంపాదించుకుంటోంది. ప్రతీ వారం ఈ షోకి సెలబ్రిటీస్ రావడం వాళ్ళను తేజస్విని మడివాడ ఇంటర్వ్యూ చేయడం జరుగుతోంది. ఇక ఈ వారం ముమైత్ ఖాన్, శేఖర్ మాష్టర్ వచ్చారు. ఇందులో ముమైత్ ఖాన్ జాతకం చెప్పింది కాకమ్మ. ఒక పెద్ద సింహాసనం ఐతే చూపించింది తేజు. అందులో కూర్చోబోతోంది క్వీన్ ముమైత్ అని చెప్పింది. "ఐతే ఈ క్వీన్ మన తెలుగు ఇండస్ట్రీని చాల సంవత్సరాలు రూల్ చేసింది. ఈసారి రూల్ చెయ్యట్లేదు తానె కూర్చుని క్వీన్ కాబోతోంది." అని చెప్పింది తేజు. "సరే తేజు ఒకటి చెప్పు నేను ప్రెసిడెంట్ ఐతే ఎలా ఉంటుంది" అని అడిగింది ముమైత్. "అసలు ముమైత్ ఖాన్ ప్రెసిడెంట్ ఐతే జనాభా ఎలా ఉంటుందో చూపించినా అంటూ తేజు ఇప్పటికింకా నా వయసు అంటూ డాన్స్ లు వేస్తారు అంటూ డాన్స్ చేసి చూపించింది. స్కూల్స్ లో డాన్స్ క్లాసెస్ కంపల్సరి చేస్తుంది. ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ డ్యాన్సింగ్ యు విల్ బి" అని తేజు అనేసరికి "డాన్స్"  అంది ముమైత్. డాక్టర్ తనని  ని ఏడేళ్ల పాటు ఏ పని చేయకూడదు అని చెప్పారని ఎందుకంటే యాక్సిడెంట్ కారణంగా ఆమె తలలో వైర్ లు అమర్చడం వలన ఇబ్బంది పడతారని చెప్పడంతో ఇండస్ట్రీలో కనిపించకుండా రెస్ట్ తీసుకుంటున్నట్టు చెప్పింది. ప్రభాస్ ఫేవరేట్ హీరో అని పూరి జగన్నాధ్ ఫేవరేట్ డైరెక్టర్ అని చెప్పింది. తన గ్రేస్ ని రీప్లేస్ చేస్తున్న డాన్సర్స్ లో సాయి పల్లవి, శ్రీలీల ఉన్నారని చెప్పింది ముమైత్. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మోహన్ బాబు, నాగార్జునతో నటించాలని ఉందట. డాన్స్ రియాలిటీ షోస్ మీద ఎలాంటి ఒపీనియన్ లేదు అని చెప్పింది.

కొత్త కార్ తో బిగ్ బాస్ నైనికా

  బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ నైనికా కొత్త కార్ కి ఓనర్ అయ్యింది. ఢీ డాన్స్ షో ద్వారా ఆమె ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యింది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పిక్ పోస్ట్ చేసింది. ఆమె చాలా కాస్ట్లీ కార్ ని కొనుక్కుంది. "నేను ఒక విషయాన్ని చెప్పదలచుకున్నాను.. నా కుటుంబం ఇప్పుడు నన్ను చూసి గర్వపడుతోంది" అని పెట్టింది. ఢీ డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న నైనికా ఎక్కువ కాలం అందులో కొనసాగలేదు. ఆ తర్వాత ఆమె కొన్ని కవర్ సాంగ్స్ చేసింది, యుట్యూబర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఆ పేరుతో ఆమె బిగ్ బాస్ కి వెళ్ళింది. ఐతే బిగ్ బాస్ కి వెళ్లి వచ్చాక మాత్రం ఆమెకు పెద్దగా అవకాశాలు ఏమీ రావడం లేదు. ఐతే బుల్లితెర మీద వచ్చే షోస్ లో ఆమె కనిపిస్తోంది. ఇక ఈమె కార్ కొని షో రూమ్ లో ఆ కార్ మీద కూర్చుని అలాగే షో రూమ్ లో డాన్స్ చేసిన పిక్స్ ని వీడియోస్ ని పోస్ట్  చేసింది. ఇక బిగ్ బాస్ లో తన ఫ్రెండ్ కిర్రాక్ సీత ఆమె పోస్ట్ కి కామెంట్ చేసింది. "కంగ్రాట్యులేషన్స్ చుట్కి. నీ కార్ లో రైడ్ కి వెళ్ళాలి." అని చెప్పింది. అలాగే బెజవాడ బేబక్క, సంకేత్ అలాగే ఫ్రెండ్స్ మిగతా సెలబ్రిటీస్ అంతా ఆమెకు కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నారు. నైనికా టాటా వారి కర్వ్ కార్ ని కొనుక్కుంది. ఈ కార్ స్టార్టింగ్ పరిచే వచ్చి 9 లక్షల నుంచి 19 లక్షల మధ్యలో ఉంది. బిగ్ బాస్ 8 లో నైనికా టాస్కులు బాగా ఆడింది. లేడీ కెప్టెన్ కూడా అయ్యింది. ఆ తర్వాత అంతగా ఆడలేకపోయింది. హౌస్ లో ఆమెకు కిర్రాక్ సీత, విష్ణు ప్రియా మంచి ఫ్రెండ్స్ అయ్యారు.

Nuvvunte Naa Jathaga : వంద ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న  నువ్వుంటే నా జతగా!

  స్టార్ మా సీరియల్స్ లు అత్యధిక టీఆర్పీ రేటింగ్ తో సాగుతుంటాయి. అందుకేనేమో భిన్నమైన కాన్సెప్ట్ తో కొత్త సీరియల్స్ వస్తుంటాయి. అయితే వీటిల్లో గుండె నిండా గుడిగంటలు, ఇంటింటి రామాయణం, ఇల్లు ఇల్లాలు పిల్లలు, కార్తీక దీపం2, బ్రహ్మముడి, చిన్ని సీరియల్స్ ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకెళ్తున్నాయి. ఇక గత సీజన్ బిగ్ బాస్-8 తర్వాత మొదలైన నువ్వుంటే నా జతగా సీరియల్ తెలుగు ప్రేక్షకులన అభిమానాన్ని పొందుతుంది. ప్రస్తుతం ఈ సీరియల్ వంద ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ హీరోగా దేవ పాత్రలో కన్పిస్తుండగా.. మిథున పాత్రలో కొత్త అమ్మాయి నటిస్తోంది. శారద, సత్యమూర్తి ఇద్దరు దేవ వాళ్ళ అమ్మనాన్నలు. ఈ సీరియల్ ఎలా మొదలైందో ఓసారి చూద్దాం..  ఒక ఊరిలో దేవా అనే రౌడీ, మిథున గొప్పింటి అమ్మాయి ఉంటారు. ఓ రోజున మిథున తన ఫ్రెండ్ పెళ్లి గుడిలో చేపిస్తుంటుంది. ఇంతలో కొంతమంది రౌడీలని వెంబడిస్తూ దేవా ఆ గుడిలోకి వస్తాడు. ‌ఇక రౌడీలని ఛేజ్ చేసే క్రమంలో పెళ్ళికొడుకుకి దేవా తగిలి అతను పడిపోతాడు. ఇక మిథున చేస్తున్న పెళ్ళి ఆగిపోతుంది. దాంతో దేవాని మిథున లాగిపెట్టి కొడుతుంది. నీ వల్ల పెళ్లి ఆగిందంటూ దేవాని తిడుతుంది. తాళి కడితేనే పెళ్ళి జరిగినట్టా అని దేవా వాదిస్తుంటాడు. దాంతో మిథున అవునని అంటుంది. ఇక దేవా పక్కన ఉన్న తాళిని తీసుకొచ్చి మిథున మెడలో కట్టేసి.. ఇప్పుడు నీ మెడలో నేను తాళి కట్టాను.. అంతమాత్రానా మనం కలిసి ఉండాలా‌‌.. పోవే అంటు రూడ్ గా మాట్లాడి తనని వదిలేసి వెళ్ళిపోతాడు. పెళ్లికి, మన ఆచారాలకి విలువనిచ్చే మిథున మొదట షాకవుతుంది. ఆ తర్వాత ఆలోచనలో పడిపోతుంది. ఇక ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన అమ్మనాన్నలకి మిథున చెప్తుంది. ఆ తాళి తీసేసి ఇంట్లోకి రమ్మని వాళ్ళు గెంటేస్తారు. దాంతో మిథున ఇల్లు వదిలి దేవా దగ్గరికి వస్తుంది. ఇక దేవా వాళ్ళ నాన్న దేవాకి కనీస మర్యాద కూడా ఇవ్వడు. ఎందుకంటే ఎప్పుడు చూసిన గొడవలు పడుతుంటాడని అతడిని తిడుతూనే ఉంటాడు. ఇక దేవాతో పాటు ఉండటానికి వచ్చిన మిథునని ఎవరు అంగీకరించరు. అయితే కొన్ని ఎపిసోడ్ ల ముందు దేవా వాళ్ళ నాన్న మీద ఎటాక్ జరుగుతుంది. అందులో మిథున తన ప్రాణాలు అడ్డుపెట్టి మరీ దేవ వాళ్ళ నాన్న సత్యమూర్తిని కాపాడుతుంది. ఈ విషయం తెలుసుకున్న దేవా వాళ్ల అమ్మ శారద తనని కోడలిగా అంగీకరిస్తుంది. మరి ఇష్టం లేని పెళ్లితో అత్తారింట్లో అడుగుపెట్టిన మిథున జీవితం ఎలా సాగనుంది? నువ్వుంటే నా జతగా అని తన భర్త దేవా ఎప్పుడంటాడో తెలియాలంటే ఈ సీరియల్ చూడాల్సిందే. ఇప్పటికే ఈ సీరియల్ వంద ఎపిసోడ్ లు పూర్తి చేసుకోగా ఈ సీరియల్ టీమ్ సంబరాలు చేసుకుంటున్నారు.