తల్లి కాబోతున్న బుల్లితెర పాపుల‌ర్ నటి!

  బుల్లితెర నటి చైత్ర రాయ్ తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. పలు సీరియల్స్‌లో హీరోయిన్ గా నటించి తెలుగువారికి దగ్గరైంది చైత్ర. 'అష్టా చమ్మా' సీరియల్‌తో మంచి పాపులారిటీ సంపాదించిన ఈ బ్యూటీ కన్నడ ఇండస్ట్రీలో సైతం ఆఫర్లు దక్కించుకుంది. అయితే సడెన్‌గా ఆమె తెలుగు సీరియల్స్‌లో నటించడం మానేసి, ఇండ‌స్ట్రీలోని అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఒకప్పుడు 'ఒకరికి ఒకరు', 'మనసున మనసై', 'దటీజ్ మహాలక్ష్మీ' ఇలా వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉండేది చైత్ర.  'అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు' సీరియల్‌లో నటిస్తోన్న సమయంలో ఆమె వ్యక్తిగత కారణాల వలన బయటకి వచ్చేసింది. కొంత గ్యాప్ తీసుకుంటున్నానని ప్రకటించింది. అలా చాలా కాలంగా సీరియళ్ల‌కు దూరంగా ఉంటోన్న చైత్ర ఇప్పుడొక గుడ్ న్యూస్ చెప్పింది. తన జీవితంలో కొత్త దశ ప్రారంభం కానుందని చెబుతూ ఎమోషనల్ అయింది.  తాను తల్లి కాబోతున్న విషయాన్ని చెబుతూ.. కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ''త్వరలోనే బేబీ చైత్ర ప్రసన్న రాబోతుంది.. నా భర్త ప్రసన్నతో కలిసి ఈ విషయాన్ని షేర్ చేసుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను.. మీ ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి. మా జీవితాల్లో కొత్త చాప్ట‌ర్‌కు ప్రిపేర్ అవుతున్నాం. నా లైఫ్‌లో అత్యంత అంద‌మైన ద‌శ‌ను అనుభ‌విస్తున్నా'' అంటూ రాసుకొచ్చింది. చైత్ర రాయ్ షేర్ చేసిన బేబీ బంప్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

''టీమ్ లీడర్ స్థాయికి సుధీర్ అర్హుడేనా..?''

  'జబర్దస్త్' షోతో సుడిగాలి సుధీర్ టీమ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ టీమ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా ఏకంగా త్రీ మంకీస్ అనే సినిమా కూడా వచ్చింది. బుల్లితెరపై ఈ ముగ్గురు (సుడిగాలి సుధీర్, గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్) కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంది. 'జబర్దస్త్' షోలో ఈ టీమ్ కి తిరుగులేదు. అయితే అప్పడప్పుడు ఈ టీమ్ విషయంలో కొన్ని నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తుంటాయి.  గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్‌ల కారణంగానే టీమ్ నడుస్తుందని.. ఇందులో సుధీర్ టాలెంట్‌ పెద్దగా ఉండడం లేదని అంటున్నారు. డిఫరెంట్ గెటప్స్ తో, మేన‌రిజ‌మ్స్‌తో శ్రీను, పంచ్‌లతో రామ్ ప్రసాద్ ఆకట్టుకుంటుంటే.. సుధీర్ క్రెడిట్ కొట్టేస్తున్నాడనే ఫీలింగ్ కొందరిలో ఉంది. కానీ బుల్లితెరపై సుధీర్‌కు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో చాల‌మందికి తెలిసిందే. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా టీమ్ లీడర్ ప‌ద‌వికి సుధీర్ అర్హుడేనా అంటూ ఓ నెటిజన్ గెటప్ శీనుకి అడిగాడు.  దీనికి అతడు చెప్పిన సమాధానం ఆకట్టుకుంటుంది. ''మీ దృష్టిలో సుడిగాలి సుధీర్ టీమ్ లీడర్ స్థాయికి అర్హుడేనా..?' అని ఓ నెటిజన్ గెటప్ శీనుని అడగ‌గా.. దానికి అతడు.. వంద శాతం అంటూ సుధీర్‌కు ఆ సమర్ధ‌త‌ ఉందనే అర్ధం వచ్చేట్లుగా ఎమోజీలను షేర్ చేశాడు. ఇక సుధీర్ గురించి ఒక్క మాటలో చెప్పమని మరో నెటిజన్ అడగగా.. 'జాన్ జిగిరీ' అంటూ బదులిచ్చాడు శ్రీ‌ను. నిజ‌మే.. ఈ ముగ్గురూ జాన్ జిగిరీలే!!

'జబర్దస్త్' వినోద్ (వినోదిని) పెళ్లి చేసుకున్నాడు!

  'జబర్దస్త్' షో బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతుంది. ఈ షోని ఇష్టపడే వాళ్లతో పాటు హేట్ చేసేవాళ్లు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఈ షో చాలా మందికి లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఇందులో లేడీ గెటప్పులు వేసే ఆర్టిస్ట్ ల పట్ల సమాజంలో చులకనభావం ఉంటుంది. వారిపై రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. పెళ్లికి సంబందించిన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు. సమాజంలో ఎన్నో వేధింపులు ఎదుర్కొంటున్నామంటూ 'జబర్దస్త్' లేడీ గెటప్ ఆర్టిస్ట్ లు చాలా సార్లు బహిరంగంగా కామెంట్స్ చేశారు.  లేడీ గెటప్ వేసే 'జబర్దస్త్' వినోదిని (వినోద్) ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాడు. ఆ మధ్య ఇంటి యజమాని గొడవతో వార్తల్లో నిలిచాడు. ఇక ఇప్పుడు 'జబర్దస్త్' షోలో కూడా కనిపించడం లేదు. తాజాగా యూట్యూబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇందులో మొదటి వీడియోతోనే షాకిచ్చాడు. తనకు పెళ్లి జరిగిందంటూ చెబుతూ తన భార్యను పరిచయం చేశాడు.  తన అత్త కూతురు విజయలక్ష్మిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. చిన్నప్పటినుండి కలిసే పెరిగామని.. లాక్ డౌన్ లో తన పెళ్లి జరగడం గమ్మత్తుగా అనిపించిందని తెలిపాడు. చాలా మంది ఎన్నో ఇంటర్వ్యూలలో తనను పెళ్లి గురించి అడిగారని.. వారందరికీ సమాధానం ఇవ్వడానికి తన భార్యతో వీడియో చేస్తున్నట్లు చెప్పాడు వినోద్‌. 

పదహారేళ్లు వ‌చ్చేదాకా నాకు ఫోన్ ఇవ్వ‌రు!

  యాంకర్ రవి కూతురు వియాకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. రవి చేసే వీడియోలతో పాటు తన సొంత సోషల్ మీడియా అకౌంట్స్, యూట్యూబ్ ఛానెల్ లో వియా అల్లరి చేస్తుంటుంది. తన తండ్రి ప్రోత్సాహంతోనే యూట్యూబ్ ఛానెల్ పెట్టానని వియా చెప్పుకొచ్చింది. రీసెంట్ గా తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టింది వియా. ఈ క్రమంలో నెటిజన్లు అడిగే పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.  సుధీర్ మామ, అనసూయ పిన్ని, లాస్య ఆంటీ అంటూ అందరి గురించి వియా మాట్లాడింది. తన వ్యక్తిగత విషయాలపై కూడా వియా కామెంట్స్ చేసింది. "ఈ సమాధానాలన్నీ నువ్వే చెబుతున్నావా..? లేక ఎవరైనా సాయం చేస్తున్నారా..?" అని ఓ నెటిజన్ అడగగా.. దానికి వియా బదులిస్తూ.. "మా అమ్మ ప్రశ్నలను చదివి వినిపిస్తుంటే నేను సమాధానాలు చెబుతున్నా." అని తెలిపింది.  మరో నెటిజన్ "నీకు సొంతంగా ఫోన్ ఉందా..?" అని ప్రశ్నించాడు. దానికి వియా.. తన దగ్గర ఫోన్ లేదని.. తనకు 16 ఏళ్లు వచ్చే వరకు ఫోన్ కొనివ్వరని పేరెంట్స్ చెప్పినట్లు వియా తెలిపింది. యాంకర్ రవి తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఫోన్ లేకపోయినా.. వియా మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. 

ర‌మ్య‌కృష్ణ వ‌ల్లే ఆ షో నుంచి వ‌నితా విజ‌య్‌కుమార్ బ‌య‌ట‌కు వ‌చ్చేసిందా?

  విజ‌య్ టెలివిజ‌న్‌లో ప్ర‌సార‌మ‌వుతోన్న డాన్స్ రియాలిటీ షో 'బీబీ (బిగ్ బాస్‌) జోడిగ‌ళ్' నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది వ‌నితా విజ‌య్‌కుమార్‌. ఆమె అలా ఆ షో నుంచి వ‌చ్చేయ‌డానికి కార‌ణం ర‌మ్య‌కృష్ణ అంటూ సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఈ షోలో తాను ఓ సీనియ‌ర్ మ‌హిళ వ‌ల్ల వేధింపుల‌కు, బెదిరింపుల‌కు, అవ‌మానాల‌కు గుర‌య్యాన‌ని ఓ స్టేట్‌మెంట్‌లో వ‌నిత చెప్పింది. ఈ వివాదంపై ర‌మ్య‌కృష్ణ స్పందించారు. 'బీబీ జోడిగ‌ళ్' షోలో అవ‌మానాల‌కు గుర‌య్యాన‌ని త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ పోస్టులో తెలిపింది వ‌నిత‌. తాను వేధింపుల‌ను భ‌రించే మ‌నిషిని కాద‌నీ, అందుకే ఆ షో నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌నీ ఆమె చెప్పింది. ఒక స్త్రీ మ‌రో స్త్రీని స‌పోర్ట్ చేయాలే కానీ, వాళ్ల జీవితాన్ని దుర్భ‌రం చేయ‌కూడద‌ని ఆమె రాసుకొచ్చింది. ఈ షోకు జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారిలో ర‌మ్య‌కృష్ణ ఒక‌రు. వ‌నిత ప‌ర్ఫార్మెన్స్‌కు 10 మార్కుల‌కు గాను ర‌మ్య‌కృష్ణ ఇచ్చిన మార్కులు కూడా వ‌నిత‌ ఈ షో నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి ఒక కార‌ణం అంటున్నారు. దీనిపై 'సినిమా విక‌ట‌న్' అనే త‌మిళ ప‌త్రిక ప్ర‌శ్నించ‌గా, "నో కామెంట్స్" అని జ‌వాబిచ్చారు ర‌మ్య‌కృష్ణ‌. "మీరు 'బిగ్ బాస్ జోడిగ‌ళ్' షూటింగ్‌లో ఏం జ‌రిగిందో వ‌నిత‌ను అడిగితే బాగుంటుంది. నావ‌ర‌కు ఇద‌స‌లు ఒక స‌మ‌స్యే కాదు. ఆ కాంట్ర‌వ‌ర్సీపై నేను కామెంట్ చేయాల‌ని ఇప్ప‌టికీ మీర‌నుకుంటూ ఉంటే, నో కామెంట్స్ అనే చెప్తాను." అని ఆమె స్ప‌ష్టం చేశారు. 'బీబీ జోడిగ‌ళ్‌'కు ర‌మ్య‌కృష్ణతో పాటు న‌టుడు న‌కుల్ జైదేవ్ మ‌రో జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. మునుప‌టి త‌మిళ‌ 'బిగ్ బాస్' షోల‌లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న వారితో ఈ డాన్స్ రియాలిటీ షోను రూపొందిస్తున్నారు.

వంటలక్క కాదు ఫొటోల‌క్క‌.. నిరుపమ్ సెటైర్లు!

  బుల్లితెరపై 'కార్తీకదీపం' సీరియల్ జనాలను ఎంతగా ఆకట్టుకుంటుందో తెలిసిందే. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సీరియల్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సీరియల్‌లో నటించే తారలంతా ప్రేక్షకులు దగ్గరయ్యారు. సోష‌ల్ మీడియాలో 'కార్తీకదీపం' సీరియల్ హల్చల్ చేస్తుంటుంది. డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్ తన నటనతో మెప్పిస్తుంటే.. వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్ ఓ రేంజ్‌లో పెర్ఫార్మ్ చేస్తోంది.  ఈ జంట ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా నిరుపమ్ ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులకు టచ్‌లో ఉంటారు. తనదైన స్టైల్‌లో సెటైర్లు, పంచ్‌లు వేస్తూ అలరిస్తుంటారు. తన మీద, 'కార్తీకదీపం' సీరియల్ మీద వచ్చే మీమ్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇదిలా ఉండగా తాజాగా నిరుపమ్ తన ఇన్స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు.  ఆదివారం అయితే మాములుగా అందరూ ఇంటిపట్టునే ఉంటారు. షూటింగ్‌లు ఏవీ పెద్దగా ఉండవు. కానీ 'కార్తీకదీపం' యూనిట్ మాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తుందట. ఆదివారం కూడా షూటింగ్ పెట్టడంతో కోపంగా ఉన్నానని చెప్పిన నిరుపమ్.. వంటలక్క మాత్రం ఫోటోలు తీస్తూ.. ఫొటోలక్కగా మారుతుందేమో అని కౌంటర్ వేశారు. వంటలక్క తీసిన ఫోటోలో నిరుపమ్ బుంగమూతి పెట్టుకొని కనిపించారు. 

బ్రూనోను కిరాత‌కంగా చంప‌డంపై యాంకర్ రష్మి ఎమోషనల్ పోస్ట్!

  యాంకర్ రష్మీ గౌత‌మ్‌ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు పలు విషయాలపై ఆమె స్పందిస్తుంటుంది. ముఖ్యంగా మూగజీవాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటుంది. మూగజీవాల పరిరక్షణ కోసం ఆమె ఎన్నో మంచి పనులు చేసింది కూడా. ఈ క్రమంలో త‌ను ట్రోలింగ్‌కు గుర‌వుతున్నా ఏమాత్రం ప‌ట్టించుకోదు. పండగల్లో జంతు బలి ఇవ్వడాన్ని తప్పుబడుతూ రష్మీ చాలా సార్లు నెగెటివ్ కామెంట్స్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెని టార్గెట్ చేశారు.  అయితే రష్మీ మాత్రం అసలు రాజీ పడదు. హిందూ సంప్రదాయాన్నే కాదు.. మూగజీవాలకు హాని కలిగించే ప్రతి అంశాన్నీ ఆమె వేలెత్తి చూపుతుంటుంది. వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు అనే తేడా లేకుండా అన్నింటి గురించి ఆలోచిస్తుంటుంది. వీధి కుక్కలపై జరిగే దాడిని ఎప్పటికప్పుడు ఖండిస్తుంటుంది.ఇటీవ‌ల‌ ఓ బీచ్‌లో బ్రూనో అనే కుక్కను ముగ్గురు కలిసి కిరాతకంగా చంపేశారు. కర్రలతో బాది ఆ తరువాత చేపల గాలానికి వేలాడదీసి చంపేశారు.  ఈ భయంకరమైన ఘటన అందరినీ కుదిపేసింది. ఈ ఘటనకు కారణమైన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన రష్మీ.. మనుషులు, మానవత్వం అనే దానిపై సిగ్గేస్తోంద‌ని.. కరోనా లాంటివి రావడం సమంజసమే అనిపిస్తోందని కామెంట్స్ చేసింది. బ్రూనో హంతకుల‌ను ఉద్దేశిస్తూ.. "అది మీకేం అన్యాయం చేసింది.. అదేం పాపం చేసిందని దాన్ని అలా చంపారు? అని ఆవేద‌న వ్య‌క్తం చేసింది ర‌ష్మి.  

'కార్తీకదీపం' రేటింగ్స్ తగ్గుతున్నాయ్! ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతున్నాయ్‌!!

  బుల్లితెరపై 'కార్తీకదీపం' సీరియల్ అత్యధిక టీఆర్పీతో మిగ‌తా సీరియ‌ల్స్‌కు అంద‌నంత ఎత్తులో దూసుకుపోతూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. గత మూడున్నరేళ్లుగా టాప్ రేటింగ్ తో మొదటి స్థానంలో ఉన్న ఈ సీరియల్ కు అస‌లు ఏదుర‌నేది లేకుండా పోయింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ సీరియ‌ల్ రేటింగ్స్ తగ్గుతుండ‌టం గ‌మ‌నార్హం. మోనిత ప్రెగ్నెంట్‌ అనే ట్విస్ట్ తో 21.01 టీఆర్పీ సాధించి రికార్డు క్రియేట్ చేసింది 'కార్తీక‌దీపం'. అయితే ఈ ట్విస్ట్ తరువాత సీరియల్లో పస తగ్గిందనే అభిప్రాయం వీక్ష‌కుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో రేటింగ్స్ తగ్గుతూ వస్తున్నాయి.  జూన్ నెల 5 నుండి 11 వరకు చూసుకుంటే ఈ సీరియల్ 19.10 రేటింగ్ సంపాదించింది. జూన్ 12-18 మధ్య 18.86 రేటింగ్, ఆ తర్వాత జూన్ 19-25 మధ్య 18.25 రేటింగ్ సాధించింది. ఇది చూస్తే గనుక వారం, వారానికి రేటింగ్ తగ్గుతూ వస్తోంది. టీఆర్పీ తగ్గుతున్నప్పటికీ.. ఫస్ట్ ప్లేస్ మాత్రం 'కార్తీకదీపం' సీరియల్‌దే.  ప్రస్తుతం 'కార్తీకదీపం' సీరియల్ 18.24 రేటింగ్‌తో తొలిస్థానంలో ఉండగా.. 'గృహలక్ష్మి' 12. 92 రేటింగ్‌తో రెండో స్థానంలో ఉంది. కొత్త సీరియల్ 'గుప్పెడంత మనసు' 11.89 రేటింగ్‌తో అనూహ్యంగా మూడో స్థానంలో నిలవగా.. 'జానకి కలగనలేదు' 9.35 రేటింగ్‌తో నాలుగో స్థానంలో ఉంది. 'దేవత' సీరియల్ 8.79 రేటింగ్‌ తో ఐదో స్థానంలో నిలిచింది.  డాక్ట‌ర్ బాబు, దీప క‌లుసుకోబోతున్నార‌ని ప్రేక్ష‌కులు సంతోష ప‌డుతున్నంత‌లో మోనిత ప్రెగ్నెంట్ కావ‌డం, దానికి కార‌ణం డాక్ట‌ర్ బాబేన‌ని ఆమె చెప్ప‌డంతో మొద‌ట ప్రేక్ష‌కుల్లో ఉత్కంఠ రేకెత్తింది. కానీ క్ర‌మంగా సీరియ‌ల్‌ను సాగ‌దీయ‌డంలో భాగంగానే ఇలా చేస్తున్నార‌నే అభిప్రాయం వీక్ష‌కుల‌కు క‌లుగుతోంది. దాంతో ఈ సీరియ‌ల్‌ను రెగ్యుల‌ర్‌గా చూసే ప‌లువురు ప్రేక్ష‌కులు కూడా ఆ సీరియ‌ల్‌పై విముఖ‌త వ్య‌క్తం చేస్తున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం దీప పాత్ర చిత్ర‌ణ కూడా ఆక‌ట్టుకొనే రీతిలో ఉండ‌టం లేద‌ని వారంటున్నారు.

'జబర్దస్త్' ఆర్టిస్ట్ పేరుతో ఫేక్‌ అకౌంట్! హెచ్చ‌రించిన త‌న్మ‌యి!!

  ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. అందులో ఖాతాలు లేని వారెవరూ ఉండరు. సెలబ్రిటీల నుండి సాధారణ ప్రజల వరకు ప్రతీ ఒక్కరికీ సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉంటున్నాయి. అయితే కొందరు కేటుగాళ్లు మాత్రం నకిలీ ఖాతాలతో రెచ్చిపోతున్నారు. ఇది సెలబ్రిటీలకు అప్పుడప్పుడు తలనొప్పిగా మారుతుంటుంది. ఇప్పుడైతే వెరిఫైడ్ అకౌంట్ అనే ఆప్షన్ రావడంతో సెలబ్రిటీల అకౌంట్లను సులువుగా పోల్చే అవకాశం ఉంది.  అయితే కొందరు సెలబ్రిటీలకు బ్లూ టిక్స్ ఉండవు. సాధారణ వ్యక్తుల మాదిరి వారి ఖాతాలు ఉంటాయి. అలాంటి వారిని ఆకతాయిలు టార్గెట్ చేస్తున్నారు. కొందరు హ్యాకింగ్‌లకు పాల్పడుతుంటే.. ఇంకొందరు నకిలీ ఖాతాలతో జనాలను బురిడీ కొట్టిస్తుంటారు. తాజాగా 'జబర్దస్త్' షోలో లేడీ గెటప్పులతో ఫేమస్ అయిన తన్మయికి ఆకతాయిలు షాకిచ్చారు.  ఆమె పేరుతో ఓ నకిలీ ఖాతాను ఓపెన్ చేశారు. దీంతో ఆ ఖాతా త‌న్మయిదే అనుకొని చాలా మంది ఫాలో అవుతున్నారు. ఈ విషయం తన్మయికి తెలియడంతో తన అభిమానులను హెచ్చరించింది. ఆ ఫేక్ అకౌంట్ డీటైల్స్ షేర్ చేస్తూ.. ఇది నకిలీ ఖాతా అని ఎవరూ నమ్మొద్దని చెప్పింది. చాట్ చేయొద్దని తన ఫాలోవర్లకు సూచించింది. 

ప్రియ‌మ‌ణికి హైపర్ ఆది లవ్ లెటర్.. చదివి వినిపించిన ప్రదీప్!

  ఈ మధ్యకాలంలో బుల్లితెరపై షోలు బాగా పెరిగిపోయాయి. వెండితెర స్టార్స్ సైతం టీవీ షోల్లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఢీ 13 ప్రోమో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాబోయే బుధవారం టెలికాస్ట్ కాబోతున్న ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమనిపిస్తోంది. యాంకర్లు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ప్రదీప్ లతో పాటు జడ్జిలు ప్రియమణి, పూర్ణ చేసిన హడావిడి మాములుగా లేదు.  ఓ కంటెస్టెంట్ డాన్స్ పెర్ఫార్మన్స్ కు ముగ్ధురాలైన‌ పూర్ణ నేరుగా స్టేజ్ పైకి వెళ్లి అతడి బుగ్గపై ముద్దు పెట్టుకుంది. ఇక హైపర్ ఆది రాసిన లవ్ లెటర్ ఈ ప్రోమోకు హైలైట్‌గా నిలిచింది. ఈ లెటర్‌ను ప్రదీప్ చదివి వినిపించాడు. స‌హ‌ యాంకర్ దీపికను ఉద్దేశిస్తూ ఆది లెటర్ రాశాడు. ''దీపికా దీపికా నీ గురించి రాయడానికి నాకు లేదు ఓపిక..'' అంటూ కౌంటర్లు వేశాడు. అలానే ప్రియమణిని ఉద్దేశిస్తూ.. "ప్రియా నిన్ను చూడగానే పడిపోయా.." అంటూ రాసిన కవితను ప్రదీప్ తన స్టైల్ లో చదివి నవ్వించాడు.  ఆదితో పాటు సుడిగాలి సుధీర్ కూడా లవ్ లెటర్ రాశాడు. ఆ లెటర్ ను చూడాలని ఉందా..? అంటూ ప్రదీప్ ఆసక్తికి క్రియేట్ చేశాడు. ప్రోమోలో అయితే లెట‌ర్‌ను వినిపించలేదు. సుధీర్ ఏం రాశాడో తెలియాలంటే.. పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురుచూడాల్సిందే! మొత్తానికి ఇలాంటి ఆస‌క్తిక‌ర స్కిట్స్‌తో ఢీ 13 దూసుకుపోతోంది.

శ్రీ‌నివాస‌రెడ్డితో గొడవ.. గిల్టీ ఫీల‌వుతున్న రాకెట్ రాఘవ!

  'జబర్దస్త్' కామెడీ షోలో చాలా ఏళ్లుగా కొనసాగుతూ వస్తోన్న రాకెట్ రాఘవ క్లీన్ కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఆయనతో పాటు 'జబర్దస్త్' షోకి వచ్చిన చాలా మంది కమెడియన్స్ ఇప్పుడు ఆ షోలో లేరు. కానీ రాఘవ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా.. సినీ నటుడు శ్రీనివాసరెడ్డికి 'జబర్దస్త్' కమెడియన్ రాఘవకు మధ్య విభేదాలు ఉన్నాయంట. ఆ విషయాన్ని రాఘవ స్వయంగా వెల్లడించారు.  తనకు తెలియకుండానే శ్రీనివాసరెడ్డిని నొప్పించానని.. ఇప్పటికీ ఆ విషయంలో చాలా గిల్టీగా ఉంటుందని అన్నారు. శ్రీనివాసరెడ్డి 'నవ్వుల సవాల్' అనే కామెడీ షోను హోస్ట్ చేస్తుండేవారు. ఆ షో డైరెక్టర్ రాఘవ పక్కింట్లో ఉండేవారట. ఒకరోజు ఆయన రాఘవని పిలిచి షో చేస్తావా అని అడిగితే వెంటనే ఓకే చెప్పేశారట. షూటింగ్ చేస్తూ ఉండగా.. శ్రీనివాసరెడ్డి వచ్చారట.  తన స్థానంలో రాఘవను చూసిన శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడకుండా అక్కడనుండి వెళ్లిపోయారట. ఆ తరువాత  ఒకరోజు బయట కలిసిన శ్రీనివాసరెడ్డి.. తను చేస్తోన్న షో ఎలా ఇచ్చారంటూ రాఘవను ప్రశ్నించారట. యాంకర్ ను మారుస్తున్న విషయం తనతో చెప్పలేదని.. కనీసం నువ్ అయినా చెప్పాలి కదా అంటూ అడిగేసరికి రాఘవ బాగా గిల్టీ ఫీల్ అయ్యారట. తమ ఇద్దరి మధ్య ఇలాంటి సంఘటన జరిగినా.. శ్రీనివాసరెడ్డి తన మనసులో ఏం పెట్టుకోలేదని.. ఎక్కడైనా షూటింగ్ లో కనిపిస్తే ఫ్రీగా మాట్లాడతారని చెప్పుకొచ్చారు. 

విజ‌య్ ఇంట్లో సుమ కొత్త చాన‌ల్ లాంచ్‌!

  బుల్లితెర సెలబ్రిటీలందరూ కూడా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ చాలా బిజీగా ఉంటున్నారు. సొంతంగా ఛాన‌ల్స్ ఓపెన్ చేసి రకరకాల వీడియోలతో తెగ హడావిడి చేస్తున్నారు. దాంతో ఫేమ్ కి ఫేమ్, డబ్బుకి డబ్బు వస్తోంది. అందుకే తారలంతా కూడా యూట్యూబ్ మీద పడ్డారు. తాజాగా సుమ కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. నిజానికి ఇప్పటికే సుమక్క పేరుతో ఆమెకి యూట్యూబ్ ఛానల్ ఉంది. కానీ మళ్లీ కొత్త ఛానల్ మొదలుపెట్టింది.  సుమక్క యూట్యూబ్ ఛానల్ ని ఇప్పటివరకు ఏడు లక్షల మంది సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. ఇందులో సుమ దాదాపు డెబ్భై వీడియోలను పోస్ట్ చేసింది. అలాంటిది ఇప్పుడు ఆ ఛాన‌ల్‌ను ఎందుకో పక్కన పెట్టేసింది. తన పేరు మీదే తాజాగా కొత్త యూట్యూబ్ చానల్‌ మొదలుపెట్టింది. దీనికోసం గత కొన్ని రోజులుగా ప్రమోషన్స్ చేస్తూనే ఉంది. సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ అంటే అందరూ తన కొడుకు సినిమా గురించి అనుకున్నారు.  కానీ తన కొత్త ఛానల్ ను విజయ్ దేవరకొండతో లాంచ్ చేయించింది సుమ. దీనికోసం విజయ్ ఇంటికి వెళ్లింది సుమ. అక్కడే ఆయనతో కాసేపు ముచ్చట్లు పెట్టింది. విజయ్ తన ఛానల్ లాంచ్ చేయడంతో సుమ చాలా సంతోషపడిపోయింది. అన్ని ప్రశ్నలకు సమాధానాలు తన యూట్యూబ్ ఛానల్ లో దొరుకుతాయని ఆమె చెప్పుకొచ్చింది. 

ఇండ‌స్ట్రీలో తెలుగువాళ్లంటే చిన్నచూపు.. ప్రశాంతి ఆవేద‌న‌!

  స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతోన్న 'గృహలక్ష్మి' సీరియల్‌కు మంచి టీఆర్పీ వ‌స్తోంది. ఇందులో లాస్య అనే నెగెటివ్ రోల్‌లో యాంకర్ ప్రశాంతి నటిస్తున్నారు. లాస్య క్యారెక్టర్‌కు ఆమె ఆమె పెర్ఫెక్ట్ గా సూటయ్యిందనే పేరొచ్చింది. ఒకప్పుడు టీవీ ఛానెల్స్‌లో యాంకర్ గా ఆమె సత్తా చూపించారు. తెలుగింటి అమ్మాయి అయిన ప్రశాంతి.. ఇండస్ట్రీలో అవకాశాల కోసం గట్టిగానే కష్టపడ్డారు.  ఫైనల్‌గా 'గృహలక్ష్మి' సీరియల్ తో నటిగా తనను తాను నిరూపించుకున్న ప్రశాంతి తాజాగా ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తెలుగు వాళ్లలో చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ ఉన్నారని.. వాళ్లందరినీ ఎంకరేజ్ చేస్తే వాళ్లు ఒక్కొక్కరూ ఒక్కో ఆణిముత్యాలే అవుతారని అన్నారు. కానీ అవకాశం లేక చాలా మంది తమ టాలెంట్‌ని చంపుకుంటున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  కొంతమంది అవకాశాలు లేక డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటారని.. ఇవన్నీ ఒక్కోసారి చూస్తుంటే బాధగా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. బయట రాష్ట్రాల నుండి తెలుగు ఇండస్ట్రీకి రావాలనుకే వాళ్లను ఎంకరేజ్ చేస్తుంటారని, కానీ తెలుగు వాళ్లకు అవకాశాలు ఇవ్వరని వాపోయారు. ముందు తెలుగు వాళ్లను ప్రోత్సహించాలని.. చాలా మంది టాలెంటెడ్ వాళ్లు ఉన్నారని ప్ర‌శాంతి అన్నారు. 

డాక్ట‌ర్ బాబు భార్య మంజుల గురించి మీకు తెలీని నిజాలు!

  క‌న్న‌డ‌మ్మాయి మంజుల తెలుగింటి కోడ‌లు. 'చంద్ర‌ముఖి' సీరియ‌ల్‌తో తెలుగు టీవీ వీక్ష‌కుల‌కు ఆమె ప‌రిచ‌య‌మ‌య్యారు. 'కార్తీక‌దీపం' సీరియ‌ల్‌లో హీరో డాక్ట‌ర్ బాబుగా న‌టిస్తోన్న ప‌రిటాల నిరుప‌మ్ భార్య‌గా ఆమె మ‌రింత చేరువ అయ్యారు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంజుల రెగ్యుల‌ర్‌గా త‌న ఫొటోల‌ను అప్‌డేట్ చేస్తూ ఫాలోయ‌ర్స్‌కు ఆనందం క‌లిగిస్తుంటారు. అంతేకాదు, అప్పుడ‌ప్పుడు త‌మ ఇంట్లో జ‌రిగే వేడుక‌లు, ఫ్యామిలీతో దిగిన ఫొటోల‌ను షేర్ చేస్తుంటారు. ఆమె గురించి చాలా మందికి తెలీని విష‌యాల‌ను పంచుకుందాం... మంజుల బెంగ‌ళూరులో ఓ క‌లిగిన కుటుంబంలో 1990 మే 9న పుట్టారు. వాళ్ల నాన్న శివ‌శంక‌ర్ హెడ్ కానిస్టేబుల్‌. ఆమె త‌ల్లి గృహిణి. మంజుల‌కు చంద్ర‌క‌ళ అనే అక్క‌, కీర్తి అనే చెల్లెలు ఉన్నారు. మంజుల కంటే ముందే ఆమె చెల్లెలు కీర్తి బుల్లితెర‌పై బాల‌న‌టిగా న‌టించింది. ఆ త‌ర్వాత కీర్తి కూడా తెలుగు సీరియ‌ల్స్‌తో పాపుల‌ర్ అవ‌డ‌మే కాకుండా, అక్క మంజుల త‌ర‌హాలో టీవీ న‌టుడు ధ‌నుష్‌ను పెళ్లాడి, త‌ను కూడా తెలుగింటి కోడ‌లు అయిపోయింది.  కీర్తి బాల‌న‌టిగా బిజీగా ఉంటే, మంజుల చ‌దువుతో బిజీగా ఉండేవారు. చెల్లితో క‌లిసి ఆమె ఏనాడూ షూటింగ్ లొకేష‌న్‌కు వెళ్లింది లేదు. ఆమె ఇంట‌ర్మీడియేట్ ఫ‌స్ట్ ఇయ‌ర్ చ‌దువుతున్న‌ప్పుడు వాళ్ల నాన్న స్నేహితుడు ఒకాయ‌న ఓ సీరియ‌ల్‌లో కొత్త‌వాళ్ల కోసం వెతుకుతున్నార‌ని చెప్తే, ఆడిష‌న్‌కు వెళ్లారు. అందంగా ఉన్న ఆమెను చూసి ఓకే చేశారు. ఆ సీరియ‌ల్ నిర్మాత‌లే ఆమెకు డైలాగ్స్ ఎలా చెప్పాలి, ఎక్స్‌ప్రెష‌న్స్ ఎలా ఇవ్వాలి లాంటి విష‌యాల‌పై ట్రైనింగ్ ఇప్పించారు. అలా క‌న్న‌డ సీరియ‌ల్ 'ప్రేమ పిశాచిగ‌ళు'తో ఆమె చిన్నితెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. అలా కాలేజీలో చ‌దువుతూనే ఐదు క‌న్న‌డ సీరియ‌ల్స్‌లో ఆమె న‌టించారంటే ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క మాన‌దు. బీకామ్ పూర్త‌య్యాక ఆమెకు తెలుగు సీరియ‌ల్ 'చంద్ర‌ముఖి' ఛాన్స్ వ‌చ్చింది. కొత్త ఇండ‌స్ట్రీ ఎలా ఉంటుందో అని భ‌య‌ప‌డుతూనే అందులో న‌టించారు. అమాయ‌క‌త్వం, స‌హ‌నం మేళ‌వించిన ఆ సీరియ‌ల్ పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చింది. అలా తొలి తెలుగు సీరియ‌ల్‌తోటే ప్రేక్ష‌కుల అభిమాన‌ తార‌గా మారారు మంజుల‌. ఆ సీరియ‌ల్‌లో న‌టించేట‌ప్పుడే అందులో హీరోగా న‌టించిన నిరుప‌మ్‌తో ప్రేమ‌లో ప‌డ‌టం, అది పెళ్లికి దారి తీయ‌డం జ‌రిగిపోయాయి. 2010లో వారు దంప‌తులుగా మారారు. వారికి అక్ష్‌రాజ్‌ అనే కొడుకు పుట్టాడు. 'చంద్ర‌ముఖి'తో పాటు 'అమ్మాయి కాపురం', 'నీలాంబ‌రి', 'కాంచ‌న‌గంగ' సీరియ‌ల్స్ మంజుల‌కు మంచి పాపులారిటీ తెచ్చాయి. 'కాంచ‌న‌గంగ‌'లో చేసిన నెగ‌టివ్ రోల్ ఆమె న‌ట‌న‌లోని మ‌రో పార్శ్వాన్ని వీక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసింది. 2013లో స‌న్ టీవీ సీరియ‌ల్ 'పొన్నుంజాల్‌'లో ప్రియా వ‌రుణ్ అనే నెగ‌టివ్ రోల్ పోషించ‌డం ద్వారా త‌మిళ టీవీ ఇండ‌స్ట్రీలోకి కూడా ఆమె అడుగుపెట్టారు. ఆమె న‌ట‌న త‌మిళ వీక్ష‌కుల‌ను అల‌రించింది. ప్ర‌స్తుతం ఆమె ఓవైపు న‌టిస్తూ, మ‌రోవైపు త‌న ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

'కార్తీక‌దీపం' హిమ ఇంటికి ఈట‌ల ఎందుకు వ‌చ్చారు?!

  సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ టాపిక్ వైరల్ అవుతుందో చెప్పలేం. తాజాగా సోషల్ మీడియాలో 'కార్తీకదీపం' హిమ తెగ హల్చల్ చేస్తోంది. మాములుగా 'కార్తీకదీపం' సీరియల్ ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. రీసెంట్ గా 'ఆర్ఆర్ఆర్' పోస్టర్‌ను సైతం 'కార్తీకదీపం' స్టైల్ లోకి మార్చి మీమ్స్ క్రియేట్ చేశారు. ఈ సీరియల్ మాత్రమే కాదు.. అందులో నటీనటులు కూడా ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటారు.  ముఖ్యంగా చిన్నపిల్లల పాత్రలు పోషిస్తున్న హిమ (సహృద), శౌర్య (కృతిక) సోషల్ మీడియాలో చేసే అల్లరి మాములుగా ఉండదు. సహృద ఈ మధ్యకాలంలో తన డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. మాస్ స్టెప్పులతో తన ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా సహృద.. తెలంగాణా మాజీ మినిస్ట‌ర్‌, ఇటీవ‌లే బీజేపీలో చేరిన‌ ఈటల రాజేందర్‌తో కలిసి తీసుకున్న ఫోటోని షేర్ చేసింది. అసలు ఇప్పుడు తెలంగాణలో ఈటల రాజేందర్ టాక్ ఆఫ్ ద టౌన్‌గా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సహృద ఆయ‌న‌తో దిగిన‌ ఫోటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. ఈటల రాజేందర్ తన ఇంటికి వచ్చినట్లు చెప్పింది సహృద. కానీ ఎందుకు వచ్చారనే విషయాన్ని మాత్రం బయటకు చెప్పలేదు. ఇదే అంశంపై నెటిజన్లు ఆమెని ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అషురెడ్డిని అడవిపందితో పోల్చిన ర‌వి.. వీడియో వైర‌ల్‌!

  యాంకర్ రవి, అషురెడ్డిలు బుల్లితెరపై 'హ్యాపీడేస్' అనే షోతో పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా 'హ్యాపీడేస్' టీమ్ తెగ రచ్చ చేస్తోంది. ఈ షో ప్రమోషన్స్ కోసం రవి, అషురెడ్డి బాగానే కష్టపడుతున్నారు. వీరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వడంతో షో గాడిలో పడింది. తెరపైనే కాకుండా తెర వెనుక కూడా ఈ జోడీ నవ్వులు పూయిస్తోంది.  తాజాగా ఇన్స్టాగ్రామ్‌లో వీరిద్దరి సంభాషణ అందరినీ నవ్విస్తోంది. అషురెడ్డిని యాంకర్ రవి మోసం చేసి తీసిన వీడియో వైరల్ అవుతోంది. తాజాగా షూటింగ్ మధ్యలో కాస్త గ్యాప్ దొరికిన అషురెడ్డి, రవిలు రీల్ వీడియోలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా థైస్ క‌నిపించేట్లు చిన్న రెడ్ ఫ్రాక్ వేసుకున్న అషురెడ్డితో ఓ రొమాంటిక్ వీడియో చేస్తానని రవి చెప్పాడంట‌. అషురెడ్డి ఏదో తింటూ అలా నడిచి వస్తున్న వీడియోకి రొమాంటిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాడ్‌ చేస్తానని రవి నమ్మించి మోసం చేశాడట.  ఫైనల్‌గా ఆ వీడియోను ఆమెకి తెలియకుండానే ఫన్నీగా ఎడిట్ చేశాడు. బ్యాగ్రౌండ్‌లో "హైద‌రాబాద్ వనస్థలిపురం పార్క్ లోకి వ‌చ్చిన ఓ అడవి పంది కాసేపు అంద‌ర్నీ భ‌య‌పెట్టింది. పార్కులో అడ‌విపంది క‌నీసం నాలుగు గంట‌ల పాటు దొరక్కుండా తిరిగింది." అనే ఓ లేడీ వాయిస్ యాడ్ చేశాడు. "ఐయామ్ సో సారీ అషు.. ఈ వీడియో చూశాక పోస్ట్ చేయకుండా ఉండలేకపోతున్నా. న‌వ్వి న‌వ్వి నా లంగ్స్ బ‌య‌ట‌కొచ్చేట్లున్నాయి." అంటూ క్యాప్షన్ ఇచ్చాడు రవి. ఇది చూసిన అషు "ఓ మై గాడ్‌..  నువ్ కూడా నాకు తొంద‌ర్లో దొరుకుతావ్ ర‌వీ.. కానీ న‌వ్వ‌కుండా ఉండ‌లేక‌పోయాను" అంటూ రిప్లై ఇచ్చింది. ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది.

దివి కళ్లల్లోకి చూస్తూ క‌విత్వం ఒలికించిన ఓంకార్!

  ఈ మధ్యకాలంలో బుల్లితెరపై వస్తోన్న ఎంటర్టైన్మెంట్ షోల సంఖ్య ఎక్కువవుతోంది. రోజుకో కొత్త రకం షో పుట్టుకొస్తోంది. అయితే వీటిల్లో ఓంకార్ హోస్ట్ చేసే షోలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. 'ఇస్మార్ట్ జోడీ', 'డాన్స్ ప్లస్', 'సిక్స్త్ సెన్స్' వంటి షోలతో ఓంకార్ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. రీసెంట్‌గా డాన్స్ ప్లస్ షో పూర్తి చేసిన ఓంకార్ ఇప్పుడు సిక్స్త్ సెన్స్ నాల్గో సీజన్ ను మొదలుపెట్టాడు.   ఇప్పటివరకు జరిగిన మూడు సీజన్లలో టాలీవుడ్ సెలబ్రిటీలు, బుల్లితెర తారలు పాల్గొన్నారు. ఇప్పుడు నాల్గో సీజన్‌లో ఎక్కువగా టీవీ తారలను గెస్ట్ లుగా తీసుకొస్తున్నాడు. ఇప్పటికే హైపర్ ఆది, అనసూయ, అషురెడ్డి.. ఇలా చాలా మంది టీవీ తారలు ఈ షోలో సందడి చేశారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ లను ఈ షోకి అతిథులుగా తీసుకొచ్చారు.  అఖిల్ సార్థ‌క్‌, దివి వ‌డ్త్య‌ ఈ షోకి వచ్చారు. తన 'వన్ సెకండ్' కాన్సెప్ట్ తో అఖిల్ ని బాగా టెన్షన్ పెట్టేశాడు ఓంకార్. బిగ్ బాస్ ఫైనల్స్ సమయంలో కూడా ఇంత టెన్షన్ పడలేదని అఖిల్ అన్నాడు. 'నీలో ఇన్ని షేడ్స్ ఏంటన్నా.. అపరిచితుడు నువ్' అంటూ ఓంకార్ పై కామెంట్ చేశాడు. ఆ తరువాత 'నాగిన్' పాటకు తనదైన స్టైల్ లో డాన్స్ వేసి ఆకట్టుకుంది పొట్టి డ్ర‌స్‌లో వ‌చ్చిన‌ దివి. ఆ తరువాత దివి కళ్లల్లోకి చూస్తూ "మెస్మరైజింగ్ లాంటి కళ్లు నీవి. అందుకే నీకు పెట్టారు పేరు దివి" అంటూ ఓంకార్ కవిత్వం ఒలికించాడు. యాంక‌రింగే కాదు, ఓంకార్‌లో ఈ క‌ళ కూడా ఉందన్న మాట.. అంటున్నారు నెటిజ‌న్లు.

కొడుకుతో రోజా డాన్స్.. వీడియో వైరల్!

  సీనియర్ నటి రోజా ఓ పక్క రాజకీయాలు, మరోపక్క షూటింగ్స్ తో చాలా బిజీగా ఉంటున్నారు. ఎంత బిజీగా ఉన్నా.. ఆమె తన కుటుంబంతో గడపాల్సిన సమయాన్ని వాళ్ల కోసం ఇచ్చేస్తారు. కుటుంబంలో జరిగే ప్రతి వేడుకకు రోజా హాజరవుతుంటారు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కుటుంబంతో కలిసి  షికార్లకు వెళ్తుంటారు. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు.  ఇక జూన్ 27న రోజా తన కొడుకు కౌశిక్ పుట్టినరోజుని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. హార్స్‌లీ హిల్స్ లో ఈ వేడుక జరిగింది. భర్త సెల్వమణి, కూతురుతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఈ పార్టీలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  అలానే కొడుకుతో కలిసి రోజా డాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. అందులో 'ప్రేమికుడు' సినిమాలోని 'ఊర్వశి' పాటకు కొడుకుతో కాలు కదిపారు రోజా. పాటకు తగ్గట్లుగా సింపుల్ స్టెప్పులతో డాన్స్ బాగా చేశారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చెలామణి అయిన రోజా ఆ మాత్రం డాన్స్ చేయాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

అవినాష్ పెళ్లి ఫిక్స్‌!.. ఫోటో వైరల్!!

  ఈ మధ్యకాలంలో బుల్లితెర తారలు తమ ఈవెంట్స్ ను, స్కిట్స్ ను సరికొత్తగా ప్రామిస్ చేసుకుంటున్నారు. పెళ్లి అయినట్లు, ఎంగేజ్మెంట్ జరిగినట్లు ప్రాంక్ పోస్ట్ లు పెడుతున్నారు. రీసెంట్ గా జబర్దస్త్ వర్ష‌ ఇలానే పెళ్లి చేసుకోబోతున్నట్లు పోస్ట్ లు పెట్టి హల్చల్ చేయగా.. అదంతా స్కిట్ కోసమని తెలుసుకున్న నెటిజన్లు ఆమెని ట్రోల్ చేశారు.  ఇప్పుడు తాజాగా 'జబర్దస్త్' అవినాష్ కూడా ఇదే రూట్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ షో అనంతరం అవినాష్ స్టార్ మాలోనే పలు ఈవెంట్స్ చేస్తూ.. తన కామెడీ స్కిట్ లతో అలరిస్తున్నాడు. కామెడీ స్టార్స్ షోలో అవినాష్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా అవినాష్ షేర్ చేసిన ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది.  పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్న అవినాష్ ని చూసిన వారంతా షాకయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు అవినాష్ పెళ్లి విషయంపై ఎంత రచ్చ చేశారో తెలిసిందే. అవినాష్ కూడా పెళ్లి ఎప్పుడు అవుతుందా అన్నట్లు మాట్లాడేవాడు. ఇప్పుడు ఆయన్ను పెళ్లి గెటప్ లో చూసిన నెటిజన్లు 'పెళ్లి ఫిక్స్ అయిందా..?' అంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరు మాత్రం స్కిట్ కోసం ఇలా రెడీ అయి ఉంటాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. "ఈటీవీ వాళ్లు నీకు కూడా పెళ్లిచేస్తున్నారా బ్ర‌ద‌ర్ సెట్లో?" అని ఒక‌త‌ను అడిగాడు. మరి దీనిపై అవినాష్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి!