'జబర్దస్త్‌'లో మెరిసిన‌ 'వకీల్ సాబ్' సూప‌ర్ వుమ‌న్‌!

  'సూపర్ ఉమన్... సూపర్ సూపర్ సూపర్ ఉమన్' - 'వకీల్ సాబ్' సినిమాలో కోర్టు రూమ్‌లో పవన్ కల్యాణ్ చెప్పిన ఈ డైలాగ్ బాగా పేలింది. అంతే కాదు, ఆ సీన్‌లో నటించిన లిరీషాకు ప్రేక్షకుల్లో విపరీతమైన గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడామెను 'జబర్దస్త్' స్టేజి మీదకు తీసుకొచ్చాడు రాకెట్ రాఘవ. జూలై 22న టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌లో సూపర్ ఉమన్ సందడి చేయనున్నారు.  'నేను సూపర్ ఉమన్ రా. ఎక్కడికైనా సరే పదిహేను నిమిషాల్లో వెళ్లిపోతా తెలుసా' అని సూపర్ ఉమన్ అలియాస్ లిరీషా చెప్పిన డైలాగ్ తో లేటెస్ట్ 'జబర్దస్త్' ప్రోమో కట్ చేశారు. 'ఆల్వాల్ లో ఉన్న ఫంక్షన్ హాల్ నుంచి మొయినాబాద్ లో ఉన్న పోలీస్ స్టేషన్‌కి సిర్ఫ్ పంద్రామినిట్ లో వచ్చిండ్రమ్మా మీరు' అని పవన్ అడగటం, 'సార్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే అది అయిందని జెట్ స్పీడ్‌లో వచ్చేసినా' అని లిరీషా చెప్పడం ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. దానిని మరోసారి గుర్తు చేశారు.  రాకెట్ రాఘవ ఎపిసోడ్‌లో కూడా లిరీషా పోలీస్ గా కనిపించనున్నారు. ప్రోమో చూస్తుంటే టీమ్ కంటెస్టెంట్ నాగిని చితక్కొట్టే సీన్లు బాగా తీసినట్టు ఉన్నారు. నిజం చెప్పాలంటే... 'వకీల్ సాబ్' కంటే ముందు టీవీ ప్రేక్షకులకు లిరీషా తెలుసు. 'అమ్మనా కోడలా', 'అక్కాచెల్లెళ్లు' సీరియళ్ళలో నటించారు. 

డాక్టర్ బాబుకు మెగాస్టార్ వాళ్ల‌మ్మ మామిడిపళ్ళు పంపిస్తుంటారు!

  'కార్తీక దీపం' సీరియల్, అందులో హీరోగా నటిస్తున్న నిరుపమ్ పరిటాల గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అసలు పేరు కంటే... సీరియల్‌లో క్యారెక్టర్ పేరు కార్తీక్ కంటే... డాక్టర్ బాబుగా ఎంతో గుర్తింపు సొంతం చేసుకున్నాడు. బుల్లితెరపై హీరోగా దూసుకువెళ్తున్న ఇతడు, వెండితెరపై విలన్‌గా చేశాడనే సంగతి మీకు తెలుసా? ఇంకా నిరుపమ్ పరిటాల నిజజీవితంలో మీకు తెలియని విషయాలు...  * నిరుపమ్ పరిటాల తండ్రి ఓంకార్ రచయిత, నటుడు. ఆయన 30 సినిమాలు, 50 సీరియళ్లకు రచయితగా పని చేశారు.  కొడుకు మంచి ఉద్యోగంలో స్థిరపడాలని ఓంకార్ కోరుకున్నారు. నటనపై ఆసక్తితో నిరుపమ్ ఇటు వచ్చారు.   * తండ్రి నుండి వచ్చిన వారసత్వం ఏమో! నిరుపమ్ కి కూడా డైలాగ్స్ రాయడం అంటే ఆసక్తి. టీవీస్టార్ ప్రభాకర్ దర్శకత్వం వహించిన 'నెక్స్ట్ నువ్వే' సినిమాకి మాటలు రాశాడు. అతడు నటించే సీరియళ్లకు కొన్ని సందర్భాల్లో మాటలు రాస్తుంటాడు.    * నిరుపమ్ నిర్మాత కూడా. స్నేహితుడు కృష్ణకాంత్‌తో కలిసి జీ తెలుగులో ప్రసారమయ్యే 'హిట్లర్ గారి పెళ్ళాం'ను నిర్మిస్తున్నాడు. అందులో అతడే హీరో.  * 'అల్లరి' నరేష్ హీరోగా నటించిన 'ఫిట్టింగ్ మాస్టర్'లో నిరుపమ్ నెగెటివ్ రోల్ చేశాడు. ఆ సినిమా ప్లాప్ కావడంతో అతడికి అంతగా గుర్తింపు రాలేదు. సినిమాల్లో నటించాలని ఉన్నప్పటికీ... మొహమాటం వల్ల ఎవరినీ అవకాశాలు అడగలేకపోతున్నాడు. మంచి అవకాశాలు వస్తే నటించాలని అనుకుంటున్నాడు.  * సుమారు డజను సీరియళ్ళలో నిరుపమ్ నటిస్తే... దాదాపుగా అన్నిటిలో పాజిటివ్ పాత్రలే. ఒక్క 'అత్తారింటికి దారేది'లో తప్ప. అందులో నెగెటివ్ రోల్ చేశాడు. మిమ్మల్ని నెగెటివ్ రోల్ లో చూడలేమని అభిమానులు చెప్పడంతో, ఆ తర్వాత నెగెటివ్ రోల్స్ మానేశాడు.  * నిరుపమ్ నటనను పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు మెచ్చుకున్నారు. ఒకసారి బ్రహ్మానందం ఫోన్ చేసి అభినందించారు. మెగాస్టార్ చిరంజీవి మదర్ అంజనాదేవి ప్రతి వేసవికి అతడికి మామిడిపళ్ళు పంపిస్తారు. తనను అంజనాదేవిగారు సొంత కొడుకులా ఆదరిస్తారని నిరుపమ్ సంతోషం వ్యక్తం చేశాడు. 

రష్మీలో ఓంకార్‌కి నచ్చేది ఇదేనంట‌!

  'సిక్త్స్ సెన్స్' షోకు వచ్చిన ఫిమేల్ సెలబ్రిటీల అందాన్ని వర్ణిస్తూ... ఓంకార్ కవిత్వాలు ఒలికిస్తున్నాడు. మొన్నటికి మొన్న దివి వస్తే చక్కటి కవిత వినిపించాడు. అలాగే, ఈ వీకెండ్ ఎపిసోడ్ లో సందడి చేయనున్న రష్మీపై కూడా ఓ కవిత రాశాడు. ఆల్రెడీ రిలీజైన ప్రోమోలో కవిత్వం ఒలికించిన విజువల్స్ చూపించాడు. కవిత్వం మాత్రమే కాదు, అందాల భామలతో ఓంకార్ పులిహోర బాగా క‌లుపుతున్నాడ‌ని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు షోను ఇంట్రెస్టింగ్ గా మార్చడం కోసం ఓంకార్ తనలో చిలిపి కోణాన్ని బయటకు తీస్తున్నాడని అంటున్నారు. ఏది ఏమైనా... లేటెస్టుగా విడుదలైన 'సిక్త్స్ సెన్స్' ప్రోమోలో రష్మీలో తనకు నచ్చేది ఏంటో ఓంకార్ చెప్పుకొచ్చాడు.  వన్ సెకండ్... 'సిక్త్స్ సెన్స్'లో పాపులర్ డైలాగ్ ఇది. సెలబ్రిటీలు గేమ్ ఆడేటప్పుడు ఓంకార్ ఈ డైలాగ్ చెప్పాడంటే వాళ్ళకు టెన్షన్ మరింత పెరుగుతుంది. రష్మీ గౌతమ్ గన్ పట్టుకుని షూట్ చేయడానికి సిద్ధమైనప్పుడు  ఓంకార్ 'వన్ సెకండ్' అన్నాడు.  'మీలో నాకు నచ్చలేనిది అదే నాకు... వన్ సెకండ్' అని రష్మీ గౌతమ్ చెప్పింది. 'మీలో నచ్చింది నాకు ఇదే' అని వెంటనే తనలో చిలిపి కోణం బయటకు తీశాడు ఓంకార్.  'ఏంటి?' అని రష్మీ అడిగితే... 'ఈ క్యూట్‌నెస్' అని సమాధానం ఇచ్చాడు. ముసిముసి నవ్వుల్లో మునిగింది రష్మీ. ఆమె కూడా ఓంకార్ హెయిర్ స్టయిల్, గడ్డం స్టయిల్ బావున్నాయని పొగిడింది. ఆల్రెడీ రిలీజైన ప్రోమోలో మాస్ డాన్స్ తో వర్షిణి ఆకట్టుకుంది. రష్మీ కూడా స్టెప్పులు వేసింది. లేటెస్ట్ ప్రోమోలోనూ వాళ్లిద్దరూ 'నా తప్పు ఏమున్నదబ్బా' పాటకు స్టెప్స్ వేసిన విజువల్స్ చూపించారు. మొత్తం మీద ఈ వీకెండ్ 'సిక్స్ సెన్స్'లో రష్మీ, వర్షిణి డాన్స్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం పక్కా అన్నమాట.  

'కార్తీకదీపం' ట్విస్ట్‌: ప్రియమణి కాదు... పైడమ్మ!

  ప్రియమణి... పేరు అందంగా ఉంది కదూ! 'కార్తీక దీపం'లో ప్రియమణి పాత్రలో నటిస్తున్న శ్రీదివ్య కూడా అందంగానే ఉంటుంది. కనిపించేది పనిమనిషి పాత్రలో అయినప్పటికీ... ఆమెకు అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఆ పేరుకు. అయితే, ప్రియమణి అసలు పేరు పైడమ్మ అని రివీల్ చేయడం 'కార్తీక దీపం' సీరియల్ ప్రేక్షకులకు లేటెస్టుగా తగిలిన షాక్.  రోజుకొక ఆసక్తికర మలుపుతో 'కార్తీక దీపం' ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సాగుతుంది. ఈమధ్య కార్తీక్ మీద మోనిత కేసు పెట్టిన సంగతి తెలిసిందే. కేసును టేకప్ చేసిన ఏసీపీ రోషిణి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. అందులో భాగంగా మోనిత ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న ప్రియమణిని విచారణకు పిలుస్తుంది. అప్పుడు 'నీ  అసలు పేరు చెప్పు?' అని గట్టిగా అడిగేసరికి 'పైడమ్మ' అని చెప్పడంతో ఆడియన్స్ షాక్ అవుతారు. ఇంటికి వెళ్లి విచారణ సంగతి మోనితకు చెబుతుంది పైడమ్మ. కార్తీక్, దీపకు రోహిణి సపోర్ట్ చేస్తే... తనకు ఎప్పటికీ కార్తీక్ దక్కకుండా పోతాడని మోనిత భయపడుతుంది. సీన్ రివర్స్ కాకుండా తనను కార్తీక్ పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలోనని మథనపడటం మొదలుపెడుతుంది. ఆ త‌ర్వాత ఆమె ఏం చేసిందో చూడాల్సిందే.

చేసింది ఒకే సీన్‌.. దాన్నీ లేపేశారు.. పాపం శ్రీ‌ప్రియ‌!

  బుల్లితెర సీరియళ్ల ద్వారా తనకంటూ తెలుగు ప్రజల్లో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న మన తెలుగు అమ్మాయిలలో శ్రీప్రియ ఒకరు. ఆమె ఫస్ట్ టార్గెట్ సీరియళ్లు కాదు, సినిమాలు. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించింది. సినిమాల్లోకి వస్తానని దర్శకుడు బోయపాటి శ్రీనును కలిసి చెప్పింది. ఆయన వద్దని సలహా ఇచ్చారట. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించేసరికి 'సరే... ప్రత్నించు' అని చెప్పారట.  ప్రస్తుతం 'జీ తెలుగు'లో ప్రసారమయ్యే 'నిన్నే పెళ్లాడతా' సీరియల్‌లో మానసి పాత్రలో శ్రీప్రియ నటిస్తోంది. అంతకు ముందు 'అగ్నిసాక్షి' సీరియల్ కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే, శ్రీప్రియ ఫస్ట్ టైమ్ కెమెరా ఫేస్ చేసింది దేనికోసమో తెలుసా? 'సుకుమారుడు' సినిమా సెట్స్ లో. ఆది సాయికుమార్ హీరోగా నటించిన 'సుకుమారుడు' సినిమాలో శ్రీప్రియ నటించింది. నటించింది అనడం కంటే తళుక్కున మెరిసింది అనడం బావుంటుంది ఏమో. ఎందుకంటే... అందులో ఒకే ఒక్క సన్నివేశంలో శ్రీప్రియ నటించింది. ఆ ఒక్క సీన్‌నూ ఎడిటింగ్ లో లేపేశారు. ఒక్క చోట తళుక్కున కనిపించింది.  సాయికుమార్ హోస్ట్ చేస్తున్న 'వావ్' షోకి వచ్చిన శ్రీప్రియ ఈ సంగతి చెప్పింది. 'సుకుమారుడు'లో హీరో ఆది, సాయికుమార్ తనయుడు కదా! అందుకని, ఆయనతో ఈ విషయం షేర్ చేసుకుంది.  

'దిల్' రాజు కుమార్తె యోగా భంగిమలు చూశారా?

  టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన 'దిల్' రాజు, ఫిట్‌నెస్‌కు ఇంపార్టెన్స్ ఇస్తారు. వయసు కనపడనివ్వరు. ఫిట్‌గా ఉంటారు. ఇప్పుడు 'దిల్' రాజు కుమార్తె హన్షితారెడ్డి కూడా ఫిట్‌నెస్ మీద దృష్టి పెట్టారు. రెగ్యులర్‌గా జిమ్‌కు వెళుతున్నారు. రీసెంట్‌గా యోగా కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం హన్షితారెడ్డి బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నారట.  ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత మహిళలు బరువు పెరగడం సర్వ సాధారణం. హన్షితారెడ్డి ఇద్దరు పిల్లలకు జన్మినిచ్చారు. బాబు పేరు ఆరాన్ష్. పాప పేరు ఇషిక. అమ్మాయి పుట్టి ఏడాదిన్నర దాటింది. అందుకని, ఇప్పుడు హన్షితారెడ్డి ఫిట్‌నెస్ మీద దృష్టి పెట్టారు. ఏరియల్ యోగా చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'కింద పడతామనే భయం మనల్ని ఎగరనివ్వదు. ఆ భయాన్ని మీలోంచి తీసేయండి. ఉంచొద్దు' అని అర్థం వచ్చేలా హన్షితా పేర్కొన్నారు.  

ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తానంటున్న‌ డాక్టర్ బాబు!

  మహిళా ప్రేక్షకుల్లో సినీ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఫాలోయింగ్ డాక్టర్ బాబుది. అదేనండీ... 'కార్తీక దీపం'లో డాక్టర్ కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబుగా ప్రేక్షకులకు సుపరిచితుడైన నిరుపమ్ పరిటాలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టీవీ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న నిరుపమ్, త్వరలో ఓటీటీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడాలని చూస్తున్నాడు. కరోనా తరువాత ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడటానికి ప్రేక్షకులు అలవాటుపడ్డారు. ఇంటి దగ్గర ఉన్నవాళ్లు ఖాళీ సమయంలో డిజిటల్ షోలు చూడటం మొదలుపెట్టారు. అందుకని, ఓటీటీలోకి డాక్టర్ బాబు రావాలని అనుకుంటున్నాడు.  "ప్రస్తుతానికి టీవీ ఇండస్ట్రీ బావున్నా... భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడంతా వెబ్ హవా నడుస్తోంది. సీరియళ్లు అంటే మహిళలకు మాత్రమే అనే ముద్ర పడింది. పైగా, యువతరం వెబ్ సిరీస్ ల మీద ఆసక్తి చూపిస్తున్నారు. అందుకని, వెబ్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నా. పరిస్థితులకు అనుకుణంగా చక్కటి ప్రణాళికలతో ముందుకు సాగాలనేది నా అభిమతం" అని లేటెస్టుగా ఒక డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిరుపమ్ చెప్పాడు.  సో... భవిష్యత్తులో డాక్టర్ బాబును ఓటీటీలో చూసే అవకాశం ఉందన్నమాట. అలాగే, మంచి అవకాశాలు వస్తే సినిమాల్లోనూ నటించాలని నిరుపమ్ పరిటాల చెబుతున్నాడు.

అమ్మ‌కు బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా బంగారు గాజులు ఇచ్చి, ఎమోష‌న‌ల్ అయిన‌ మోనాల్‌!

  "మా అమ్మే నా ప్రపంచం" అని బిగ్‌బాస్ ఫేమ్, హీరోయిన్ మోనాల్ గజ్జర్ అంటోంది. నేడు ఆమె తల్లి పుట్టినరోజు. అందుకని, బుధవారం అర్ధరాత్రి బర్ట్‌డేను సెలబ్రేట్ చేసింది. అమ్మను తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని మోనాల్ గజ్జర్ చెప్పుకొచ్చింది. అంతే కాదు... ఆమెను ముద్దులతో, బహుమతులతో ముంచెత్తింది. తల్లికి మోనాల్ గజ్జర్ బంగారు గాజులను బహుమతిగా ఇచ్చింది. "అమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం. తనను సర్‌ప్రైజ్ చేయాలనుకున్నాను. ప్రతి మహిళ ఇష్టపడే వాటిని ఇచ్చాను. అమ్మ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. నా ఫ్యామిలీకి నేను ఇలా చేయగలుగుతున్నందుకు భగవంతుడికి థాంక్స్ చెబుతున్నా" అని మోనాల్ పోస్ట్ చేసింది. మోనాల్ మదర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోస్ మీరూ చూడండి. కూతురు ఇచ్చిన బ‌ర్త్‌డే గిఫ్ట్ చూసి మొద‌ట ఆశ్చ‌ర్య‌ప‌డి, ఆ త‌ర్వాత మురిసిపోతూ వాటిని చేతుల‌కు వేసుకున్నారు మోనాల్ వాళ్ల‌మ్మ‌. ఆ టైమ్‌లో మోనాల్ భావోద్వేగానికి గుర‌వ‌డం మ‌నం చూడొచ్చు. 'బిగ్ బాస్'కి ముందు తెలుగులో మోనాల్ కెరీర్ కోజ్ అయ్యిందని చెప్పాలి. రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత మళ్ళీ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్'లో ఐటమ్ సాంగ్ చేసింది. ప్రజెంట్ బిగ్ బాస్ హౌస్ లో కో కంటెస్టెంట్ అఖిల్  సార్థక్ తో 'తెలుగు అబ్బాయి గుజ‌రాత్ అమ్మాయి' అనే సినిమా చేస్తోంది. అలాగే గుజరాతీ సినిమా ఒకటి చేస్తోంది.

ఒక్క‌సారి పవన్‌కల్యాణ్‌తో.. ప్రియమణి కోరిక!

  హీరోయిన్‌గా ప్రియమణి కెరీర్ స్టార్ట్ చేసి ప‌ద్దెనిమిదేళ్లు. ఈ ప‌ద్దెనిమిదేళ్లలో తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో నటించింది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, జగపతిబాబు మొదలుకుని ఎన్టీఆర్, నితిన్, రవితేజ, గోపీచంద్ పక్కన సినిమాలు చేసింది. కానీ, ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయలేదు. పవన్‌తో ఒక్క సినిమా చేయాలని ఉందని తన మనసులో కోరికను ప్రియమణి బయటపెట్టింది. ప్రజెంట్ 'ఢీ'లో ప్రియమణి జడ్జ్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం పవన్ కల్యాణ్ పాటలు, డైలాగులను మెడ్లీగా తీసుకుని కంటెస్టెంట్ కార్తీక్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అది పవన్‌కు ఫెంటాస్టిక్ ట్రిబ్యూట్ అని ప్రియమణి చెప్పారు. తర్వాత పవన్ గురించి మాట్లాడారు.  "నేను ఒకే ఒక్కసారి పవన్ కల్యాణ్ సార్‌ను కలిశా. అప్పటి నుండి ఇప్పటికి నాకు ఓ కోరిక ఉంది. ఎప్పుడైనా ఆయనతో కలిసి ఒక్క సినిమాలో వర్క్ చేయాలని ఉంది. ఆయనతో పనిచేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను" అని ప్రియమణి చెప్పుకొచ్చారు. పవన్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఆమెకు అవకాశం వస్తుందని ఆశిద్దాం. పవన్ చెవిన ప్రియమణి మాటలను కొరియోగ్రాఫర్ గణేష్ వేస్తాడని ఆశిద్దాం. వెంక‌టేశ్ జోడీగా ఆమె న‌టించిన 'నార‌ప్ప' మూవీ జూలై 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా రిలీజ్ అవుతోంది.

ఇంట్లో ఎవరూ లేరు ర‌మ్మ‌న‌మ‌ని సుధీర్‌కు రష్మీ ఫోన్ చేస్తే...

  సుధీర్‌కి రష్మీ ఫోన్ చేసింది. ప్రేమగా 'అరే... ఎం చేస్తున్నావ్?' అని అడిగింది. 'ఏం చేయడం లేదు. ఖాళీగా ఉన్నాను' అని చెప్పాడు. అప్పుడు 'అరే... ఇంట్లో ఎవరూ లేరు' అని చెప్పింది. ఇంటికి రమ్మని హింట్ ఇచ్చింది. అయితే సుధీర్ ఏమీ తెలియనట్టు అమాయకుడిగా నాకెందుకు ఫోన్ చేశావ్ అన్నట్టు అడిగాడు. 'ఎదవ సోది ఆపి ఇంటికి రా' అని రష్మీ ఆర్డర్ వేసింది. వాయిస్‌లో బేస్ పెంచింది. మామూలుగా అయితే ఎప్పుడూ రష్మీకి లైన్ వేసే సుధీర్, తన ఇమేజ్‌కు భిన్నంగా ప్రవర్తించాడు.  'ఇంటికా? రష్మీ.. ప్లీజ్ రష్మీ. నన్ను వదిలేయ్.  మాటొస్తే ఇంటికి రా.. ఇంటికి రా అని ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడతావ్.' అని సుధీర్ అన్నాడు. దాంతో ఒక్కసారిగా అందరూ పగలబడి నవ్వారు. ఊహించని సమాధానంతో రష్మీ నోరెళ్లబెట్టింది. అసలు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ బుధవారం టెలికాస్ట్ కాబోయే 'ఢీ' ఎపిసోడ్‌లో చూడాలి.  సుధీర్‌కి రష్మీ ఫోన్ చేయడం మాత్రమే కాదు... ఆదికి దీపిక కూడా ఫోన్ చేసింది. ఇంట్లో ఎవరూ లేరని చెప్పక ముందే 'మనకు అన్ని సంవత్సరాల కెమిస్ట్రీ లేదు గానీ... తొందరగా కానిచ్చేద్దాం' అని ఆది రిప్లై ఇచ్చాడు. 'నాన్నగారు ఇంట్లో లేరు, ఇంటికి వస్తావా?' అని అడిగితే 'వెంటనే ఇంటికి వస్తా' అన్నాడు. మొత్తం మీద ప్రోమో కామెడీతో, కలర్‌ఫుల్ డాన్స్‌లతో సాగింది. ఒక కంటెస్టెంట్‌తో రష్మీ డాన్స్ చేయడం విశేషం. 

నవ్యస్వామి జిమ్ బడ్డీస్ వీళ్లే! గుర్తుప‌ట్టారా?

  హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ఫిగర్ మెయింటైన్ చేసే టీవీ స్టార్లలో నవ్య స్వామి ఒకరు. తెలుగు ప్రజలకు 'ఆమె కథ' సీరియల్‌తో చేరువైన ఈ మైసూర్ ముద్దుగుమ్మ వయసు మూడు పదులు. అయితే, ఎప్పుడూ సన్నజాజిలా ఉంటుంది. ఫిట్‌నెస్ విషయంలో అసలు నిర్లక్ష్యం వహించదు. నవ్య స్వామి క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తుంది. ఇంతకీ, జిమ్‌లో నవ్య స్వామి స్నేహితులు ఎవరో తెలుసా? ఫొటోలో వాళ్లను గుర్తు పట్టారా? ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు, హీరోయిన్ నందిని రాయ్, ఇంకొకరు ఫిట్నెస్ ట్రైన‌ర్ బెన్నీ.  'మాయ', 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' సినిమాల్లో నటించిన నందిని రాయ్... 'షూట్ అవుట్ ఎట్ ఆలేరు', 'మెట్రో కథలు', 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' వంటి వెబ్ సిరీస్ లలో నటించింది. ప్రజెంట్ 'కోతి కొమ్మచ్చి'లో ఐటమ్ సాంగ్ చేసింది.  'పిట్ట కథలు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంజయ్ రావు, రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నారు. నవ్య స్వామి, నందిని రాయ్, సంజయ్ రావు జిమ్ బడ్డీస్ అంట. సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోస్ కబుర్లు చెప్పుకొంటూ జిమ్ చేస్తారన్నమాట.

'కళ్యాణ వైభోగం' కహానీ: దివ్య మరణం తథ్యమా?

  దివ్య మరణం తథ్యమా? శాపం ఆమె ప్రాణాలను బలి తీసుకుంటుందా? చెల్లి ప్రాణం కాపాడటం కోసం అభి ఏం చేస్తాడు? ఏం చేయబోతున్నాడు? 'కళ్యాణ వైభోగం' సీరియల్ లో మంగళవారంనాటి ఎపిసోడ్ ముగింపు ప్రేక్షకులను మునివేళ్లపై ఉంచిందని చెప్పాలి. ఆసక్తికరమైన మలుపులతో సాగుతున్న సీరియళ్లలో జీ తెలుగు ఛానల్‌లో ప్రసారమయ్యే 'కళ్యాణ వైభోగం' ఒకటి. అన్నాచెలెళ్లు అభి, దివ్య సహా వాళ్ళ కుటుంబ పతనమే పరమావధిగా, తన ప్రాణరక్షణే ధ్యేయంగా నిత్యా శ్రీనివాస్ వేసిన పథకం ఫలించింది. దివ్య కుటుంబానికి ఉన్న శాపం ప్రకారం... ఆ ఇంటికి వచ్చే కోడలు మరణిస్తుంది. కానీ, ఈసారి శాపం దివ్యకు కూడా ఉందని పురోహితులు చెబుతారు. అది తెలిసిన చారి పక్షవాతం బారినపడి మంచానికి పరిమితం అవుతాడు. మరోవైపు శాపం గురించి నిత్యా శ్రీనివాస్ చెవిన పడిన సంగతి తెలిసిందే. అదేంటంటే... దివ్య ప్రాణాలతో ఉండాలంటే ఆమెకు పెళ్లి కాకూడదు. పెళ్ళైతే మరణిస్తుంది. ఒకవేళ దివ్యకు పెళ్లి కాకపోతే నిత్యా శ్రీనివాస్ మరణిస్తుంది. ఇది తెలుసుకున్న నిత్యా, అక్క కూతురు మెడలో మూడు ముడులు పడేలా పావులు కదుపుతుంది. చాణక్యకు కోపం వచ్చేలా చేసి, అతడిని దివ్య ఇంటికి పంపిస్తుంది. ఆవేశంతో దివ్య, అభిల ఇంటికి వెళ్లిన చాణక్య... దివ్య మెడలో తాళి కడతాడు. శాపం గురించి దివ్య, ఇతర కుటుంబ సభ్యులకు తెలియనప్పటికీ... అభికి తెలుసు. తన ముందే చెల్లెలు మెడలో మూడు ముడులు పడటంతో షాక్ తింటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది. మరి, తర్వాత ఏం జరుగుతుంది? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. సీరియల్ లో మేజర్ ట్విస్ట్ ఇది. ఇప్పుడు దివ్య మరణం తథ్యమా? చెల్లి ప్రాణాలు అభి కాపాడలేడా? అని అందరూ చర్చల్లోకి దిగారు. రాబోయే రోజుల్లో సీరియల్ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. 

'కార్తీకదీపం' కబుర్లు: మోనిత తన గొయ్యి తానే తవ్వుకుందా?

  'కార్తీక దీపం'లో కథ కొత్త మలుపు తీసుకుంది. డాక్టర్ బాబు కార్తీక్, వంటలక్క దీపను విడదీయాలని మోనిత వేసిన పథకం ఆమె మెడకు చుట్టుకోబోతుందా? న్యాయం వైపు నిలబడే అధికారి ఏసీపీ రోషిణి దగ్గరకు వెళ్లి మోనిత తప్పు చేసిందా?  తన గొయ్యి తానే తవ్వుకుందా? మంగళవారం ఎపిసోడ్ చూస్తే చాలామందికి అవునని అనిపిస్తోంది. అసలు, మంగళవారం ఏమైంది? అనే విషయంలోకి వెళితే...  కార్తీక్ తప్పు చేశాడని, తనను తల్లిని చేశాడని మోనిత చెప్పిన మాటలను వంటలక్క విశ్వసించదు. పైగా, గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపుతుంది. దాంతో ఆవేశంగా 'మీ అందరి అంతు చూస్తా' అంటూ అక్కడ నుంచి మోనిత నిష్క్రమిస్తుంది. ఏదో ఒకటి చేయాలని ఏసీపీ రోషిణి ఇంటికి వెళుతుంది. గతంలో దీప మిస్సింగ్ కేసును ఇన్వెస్టిగేట్ చేసింది ఆవిడే. కార్తీక్ స్నేహితురాలే మోనిత అని రోషిణి గుర్తు పడుతుంది. సమస్య ఏంటో చెప్పమని అడుగుతుంది. తనకు అన్యాయం జరిగిందని, పెళ్లి కాకుండా తల్లిని అయ్యానని, అందుకు కారణం కార్తీక్ అని మోనిత ఏకరువు పెడుతుంది. సమాజం ఇటువంటి పని చేస్తే హర్షిస్తుందని అనుకుంటున్నారా? అని రోషిణి ప్రశ్నిస్తుంది. మోనిత చెప్పింది విన్నాక... 'స్నేహితుడిని ఇంటికి పిలిచి, మద్యం తాగడానికి అనుమతి ఇచ్చి, అతడి గదిలోకి మీరు వెళ్లి, ఏంటిది? స్నేహమే ఉంటే ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఇప్పుడు మీ సమస్య ఏంటి?' అని రోషిణి అడుగుతుంది. ఇప్పుడు కార్తీక్ మొహం చాటేస్తున్నాడని, అతడి కుటుంబం తనను అవాయిడ్ చేస్తుందని, తన బిడ్డ అనాథలా పెరగడం తనకు ఇష్టం లేదని మోనిత కన్నీళ్లు పెట్టుకోవడంతో రోషిణి మనసు కరుగుతుంది. కార్తీక్, దీప ఇంటికి వెళుతుంది.  కార్తీక్ మీద మోనిత మీద కంప్లయింట్ ఇచ్చిందని రోషిణి చెప్పగా... దీపలో ఎటువంటి భయం కనిపించదు. ధైర్యంగా న్యాయం చేయమని కోరుతుంది. పదేళ్లలో జరగని తప్పు, తాను భర్తతో కలిసిన తర్వాతే ఎందుకు జరిగిందో తనకు అర్థం కావడం లేదని రోషిణికి అర్థమయ్యేలా దీప వివరిస్తుంది. దాంతో మోనిత తప్పు చేసిందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో చాలామందిలో కలిగింది. అక్కడితో ఎపిసోడ్ కి ఎండ్ కార్డు వేశారు. తర్వాత ఏం జరుగుతుందోననే ఆసక్తి కలిగించారు. అయితే, మోనిత ఇచ్చిన కంప్లయింట్ ఆమె మెడకు చుట్టుకునే అవకాశాలు ఉన్నాయని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. 

హరి గుండెలపై... అమ్మ చేతిపై.. అషూ ఏది రియల్?

  'కామెడీ స్టార్స్' షోలో కమెడియన్ హరి తన గుండెలపై అషు పేరు పచ్చబొట్టు వేయించుకున్న సంగతి తెలిసిందే. అది టెంపరరీ టాటూ కాదని, ఒరిజినల్ అని తెలియడంతో అషురెడ్డి అతడి చెంపపై చాచి ఒక్కటి ఇచ్చింది. అయితే, ఇదంతా స్కిట్ లో భాగమని... స్క్రిప్ట్ ప్రకారం జరిగిందని కొందరి అనుమానం.  అషురెడ్డి మదర్ కూడా టాటా వేయించుకున్నారు. కుమార్తె పేరును చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నారు. టాటూను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది అషురెడ్డి. వరల్డ్‌లో బెస్ట్ మదర్ మా అమ్మే అని చెప్పుకొచ్చింది. "నిజంగా నా పేరును టాటూగా వేయించుకున్న ఏకైక వ్యక్తి. నా నుంచి ఏమీ ఆశించకుండా ప్రేమించే ఏకైక వ్యక్తి... అమ్మ" అని అషురెడ్డి పోస్ట్ చేశారు. దాంతో హరి గుండెలపై టాటూ ఫేక్ అని అనుమానపడిన వాళ్లకు సమాధానం దొరికినట్టు అయింది.  హరి గుండెలపై... అమ్మ చేతిపై... రెండు టాటూలను పోస్ట్ చేసి 'ఏది రియల్?' అని అషురెడ్డిని ఒకరు ప్రశ్నించారు. 'రెండూ రియల్' అని ఆమె చెప్పింది. రెండూ రియల్ అయితే అమ్మ చేతిపై టాటూ పోస్ట్ చేసినప్పుడు తన పేరును టాటూ వేయించుకున్న ఏకైక వ్యక్తి అని చెప్పడం వెనుక అర్థం ఏమిటో? అషురెడ్డికి తెలియాలి. పైగా హ‌రి త‌న గుండెల‌పై వేయించిన టాట్టూను చూపించిన త‌ర్వాతే, అమ్మ చేతిపై త‌న టాట్టూను అషు షేర్ చేయ‌డం కూడా లెక్క‌లోకి తీసుకోవాలి. ఇంత‌కీ అషు పేరును ఆమె త‌ల్లి ఎప్పుడు ప‌చ్చ‌బొట్టుగా వేయించుకున్నారు?

వాళ్ళిద్దరికీ పెళ్లి చేసిన సుమ!

  యూట్యూబ్‌లో హిట్టయిన వెబ్ సిరీస్‌ '30 వెబ్స్ 21' చూశారా? అందులో తొలి ఎపిసోడ్‌లోనే హీరో హీరోయిన్లు చైతన్య, అనన్యకు పెళ్లైనట్టు చూపిస్తారు. ఫస్ట్ నైట్ సీన్ కూడా ఉంటుంది. కానీ, పెళ్లి సీన్ ఉండదు. హాస్పటల్‌లో అమ్మాయిని అబ్బాయి చూడటం... కట్ చేస్తే ఇద్దరికీ పెళ్లైనట్టు చెప్పి డైరెక్టుగా ఫస్ట్ నైట్ సీన్‌లోకి వెళతారు. ఆ పెళ్లి తంతు జరిగితే ఎలా ఉంటుందో... 'స్టార్ మా' ఛానల్  షో 'స్టార్ట్‌ మ్యూజిక్‌లో సుమ చూపించారు.  హాస్పటల్‌లో అబ్బాయి, అమ్మాయి చూపులకు భిన్నంగా 'స్టార్ట్ మ్యూజిక్' షోలో సుమ పెళ్లి చూపులు ఏర్పాటు చేయడమే కాదు... ఇద్దరికీ పెళ్లి చేసింది. 'మొత్తానికి మీ సిరీస్ లో జరగని పెళ్లి మా సిరీస్ లో జరిగింది' అని సుమ అంటే... 'సిరీస్ లో చాలా జరగలేదు' అని చైతన్య అన్నాడు. అందుకు అనన్య నవ్వింది. కమింగ్ సండే మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.  చైతన్య, అనన్యతో పాటు 'రామ్ లీల', 'మేడమ్ సార్ మేడమ్ అంతే' హీరో హీరోయిన్లు శ్రీహాన్, సిరి హనుమంతు... 'సూర్య' హీరో హీరోయిన్లు షణ్ముఖ్ జస్వంత్, మౌనిక ఎపిసోడ్ లో సందడి చేయనున్నారు. 

'ఢీ' కొరియోగ్రాఫర్‌తో పూర్ణ స్టెప్స్... ప్రేమలో పడిందట!

  స్టార్స్ అందరూ ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా డాన్స్ రియాలిటీ షో 'ఢీ'లో కంటెస్టెంట్లు, డాన్సర్లు, కొరియోగ్రాఫర్లు స్వతహాగా డాన్స్ నేపథ్యం వాళ్లు కావడంతో రీల్స్ విపరీతంగా చేస్తున్నారు. వాళ్లకు షోలో న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ప్రియమణి, పూర్ణ నుండి మంచి కోపరేషన్ లభిస్తోంది.  రీసెంట్‌గా 'ఢీ'లో కొరియోగ్రాఫర్ అభితో కలిసి పూర్ణ ఓ పాటకు స్టెప్స్ వేశారు. దీనిని పూర్ణ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అంతే కాదు... 'అభి, అయామ్ ఇన్ లవ్ విత్ దిస్' అని కామెంట్ చేశారు. అభి కొరియోగ్రఫీనీ మెచ్చుకున్నారు. బెస్ట్ కొరియోగ్రాఫర్, పెర్ఫార్మర్ అని కాంప్లిమెంట్స్  ఇచ్చారు. దానికి అభి ఆనందంతో పొంగిపోయాడు. 'థాంక్యూ సోమచ్ మేడమ్..ఈ సాంగ్ మీకు ఇంత బాగా నచ్చిందని నేను అనుకోలేదు. నేను చాలా లక్కీ. నా స్టెప్స్ మీతో వేస్తున్నందుకు' అని పోస్ట్ చేశాడు.  బేసిక‌ల్‌గా మ‌ల‌యాళీ అయిన పూర్ణకు ఇప్పుడు తెలుగు ఫిల్మ్‌, టీవీ ఇండ‌స్ట్రీ నుంచి మంచి స‌పోర్ట్ ల‌భిస్తోంది. ఓవైపు సినిమాలు, ఇంకోవైపు టీవీ షోల‌తో బిజీగా ఉంటోంది.

వర్ష బ్లౌజ్‌కు 70 ఎంఎం స్క్రీన్... ఇమ్మాన్యుయేల్ కామెంట్‌!

  'జబర్దస్త్'లో లవ్ బర్డ్స్ అంటే ఒకప్పుడు సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ గుర్తుకు వచ్చేవారు. వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదని, షో కోసం అలా చేస్తున్నారని చెప్పినవాళ్లు వున్నారు. ఏది ఏమైనా టీవీల్లో సుధీర్, రష్మీ హిట్ పెయిర్. ఇప్పుడు కొత్తగా ఇమ్మాన్యుయేల్, వర్ష పెయిర్ ఆడియన్స్ ను అట్ట్రాక్ట్ చేస్తోంది.  ఇమ్మాన్యుయేల్, వర్ష మధ్య ట్రాక్స్ హిట్ అవుతున్నాయి. మొన్నటివరకు వాళ్ళిద్దరూ కెవ్వు  కార్తీక్ టీమ్ లో చేశారు. ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ టీమ్ కు వచ్చారు. భాస్కర్ టీమ్‌కి వచ్చాక ఫస్ట్ స్కిట్‌లో లవర్స్‌గా కనిపించినా... చివరకు వర్షను భాస్కర్ పెళ్లి చేసుకున్నాడు. ఈ వీక్ టెలికాస్ట్ కానున్న స్కిట్‌లో వర్ష, ఇమ్మాన్యుయేల్ భార్యభర్తలుగా కనిపించనున్నారు. భార్య ఎవరి కోసమో ముగ్గు వేస్తుందని అనుమానించే భర్తగా ఇమ్మాన్యుయేల్ కనిపించనున్నాడు. భార్య మీద అనుమానం వ్యక్తం చేస్తే... 'పద్దతికి చీర కట్టిన దానిలా ఉంటాను. మీరు నన్నే అనుమానిస్తున్నావా?' అని వర్ష డైలాగ్ చెప్పింది.  'సూపర్ సూపర్.. మా ఆవిడ పద్ధతికి చీర కట్టినట్టు ఉంటుందంట! ఒక్కసారి ఇటు తిరుగమ్మా' అని వర్ష జాకెట్ బ్యాక్ సైడ్ కనిపించేలా ఆమెను తిప్పాడు. 'ఎవరైనా బ్లౌజులకు చిన్న చిన్న కిటికీలు పెట్టుకుంటారు. నువ్వు ఏంటి? 70 ఎంఎం తెర పెట్టావ్...' అని పంచ్ వేశాడు. ఏమీ చెప్పలేక వర్ష అలా నవ్వుతూ ఉండిపోయింది.   మొత్తానికి ఆడ‌వాళ్ల డ్ర‌స్సుల‌పై మ‌గాళ్ల కామెంట్లు టీవీ స్కిట్ల‌లోనూ కొన‌సాగుతూనే ఉన్నాయ్‌.

డాక్ట‌ర్లే బ‌త‌క‌డ‌ని చెప్పేశారు.. టీమ్ లీడ‌ర్లే న‌న్ను బ‌తికించారు!

  సూపర్‌హిట్ కామెడీ షో 'జబర్దస్త్'లో ఈమధ్య చాలా మార్పులు జరిగాయి. స్కిట్స్ చేసే టీమ్స్ సంఖ్య తగ్గింది. స్కిట్ నిడివి కూడా తగ్గించారు. అందులో భాగంగా కొంతమంది టీమ్ లీడర్లను తీసేశారు. దాంతో వాళ్ళు షోలో కనిపించడం లేదు. అలా 'జిగేల్' జీవన్ కూడా కొన్నాళ్ల నుంచి కనిపించడం లేదు. నెక్స్ట్ ఎపిసోడ్ నుండి మళ్ళీ అతడు షోలో కనిపించనున్నాడు. అతడి ఆబ్సెన్స్ కి కారణం హెల్త్ ఇష్యూ అని ప్రోమోలో చూపించారు. ఎప్పుడూ ప్రేక్షకులను నవ్వించే 'జబర్దస్త్' టీమ్ లీడర్లు స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా 'జిగేల్' జీవన్ కన్నీళ్లు అయితే ఆగలేదు. 'కొన్ని ఎపిసోడ్లు మీరు ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్స్ నుండి దూర‌మ‌య్యారు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది?' అని జీవన్ ను రష్మీ అడిగిన తర్వాత అతడు అసలు ఏమైందో వివరించాడు.  "నిజంగా నేను ఈ రోజు బతికి ఉన్నానంటే కారణం టీమ్ లీడర్లు. వీళ్ళందరూ లేకపోతే నిజంగా నేను బతికి ఉండేవాడిని కాదు. ఒక్కసారి కాదు... రెండుసార్లు సీరియస్ అయ్యింది. రెండోసారి అయితే డాక్టర్లు లేడ‌ని చెప్పేశారు. మా అమ్మ ఏడుపు. నా బాబు చిన్నోడు. ఇంజెక్షన్లకు కూడా బాడీ సహకరించలేదు. కష్టం అని  డాక్టర్లు చెబితే... వీళ్ళందరూ నన్ను కాపాడారు" అని 'జిగేల్' జీవన్ కన్నీటి పర్యంతం అయ్యాడు. అతడితో పాటు తోటి 'జబర్దస్త్' టీమ్ లీడర్లు భావోద్వేగానికి లోనయ్యారు. 'మన జబర్దస్త్ లో ఎవరికి ఏం జరిగినా మన జబర్దస్త్ ఫామిలీ అంతా ఇలాగే ఉండాలి' అని గెటప్ శీను అన్నాడు.   

అస‌లే చిట్టి స్కర్టు... ఇంకేం తగ్గించాలని వ‌ర్షిణి కౌంటర్!

  టీవీ ఇండస్ట్రీలో హాట్ యాంకర్ల లిస్టు తీస్తే... అందులో రష్మీ గౌతమ్, వర్షిణీ సౌందర్‌రాజన్ పేర్లు తప్పకుండా ఉంటాయి. ఒకప్పుడు వీళ్ళిద్దరూ 'ఢీ' షోలో కనిపించేవారు. 'ఢీ' లేటెస్ట్ సీజన్‌లో వర్షిణిని పక్కనపెట్టి దీపికను తీసుకోవడంతో హాట్ యాంకర్ జోడీ ఒకే స్టేజిపై కనిపించి చాలా రోజులైంది. మళ్ళీ వీళ్ళిద్దర్నీ ఒక్క స్టేజి మీదకు తీసుకొచ్చాడు ఓంకార్.  ఓంకార్ హోస్ట్ చేస్తున్న 'సిక్త్స్ సెన్స్' సీజన్4 అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో రష్మీ, వర్షిణి సందడి చేయనున్నారు. షోలో ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతునప్పుడు వర్షిణి మాట్లాడుతున్న సమయంలో 'ఇవే తగ్గించుకుంటే మంచిది' అని ప్రకాష్ రాజ్ డైలాగ్ వేశారు. వెంటనే 'ఏం తగ్గించుకోవాలి? ఆల్రెడీ ఇంత తగ్గించుకుని వచ్చా. ఇంకేం తగ్గించాలి?' అని తాను వేసుకున్న స్కర్టు సైజును చూపిస్తూ వర్షిణి సెల్ఫ్ సెటైర్ వేసుకుంది. పక్కన ఉన్న రష్మీ ఒక్కసారిగా నవ్వింది.  లేటెస్టుగా ఈ ప్రోమో విడుదలైంది. అందులో చివరగా మాస్ డాన్స్ తో రష్మీ, వర్షిణి ఒక ఊపు ఊపేశారు. ముఖ్యంగా చిట్టి స్కర్టులో వర్షిణి వేసిన డాన్స్ హైలైట్ గా నిలిచింది.  'మీరు చిలిపిగా నవ్వితే మల్లెపూల సునామీ...  చూపుల బాణం వదిలితే కుర్రకారు గుండెల్లో యమ్మీ యమ్మీ  అందుకే మీరంటే అందరికీ ఇష్టం రష్మీ' అంటూ ఓంకార్ వినిపించిన కవిత కూడా హైలైట్.