'కామెడీ స్టార్స్‌' షోపై సద్దాం సెటైర్లు!

  ప్రస్తుతం బుల్లితెరపై మీద ప్రసారమవుతోన్న 'కామెడీ స్టార్స్' షోకి మంచి పాపులారిటీ ఏర్పడింది. రవి, లాస్య, వర్షిణి, అవినాష్, శేఖర్ మాస్టర్ లాంటి వారితో షోని బాగానే నెట్టుకొస్తున్నారు. అయితే ఇదే షోలో 'అదిరింది' బ్యాచ్ కూడా దూసుకుపోతోంది. 'పటాస్' నుండి 'అదిరింది' షోకి షిఫ్ట్ అయిన 'గల్లీ బాయ్స్' మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే ఆ షో ఆగిపోవడంతో వారంతా 'కామెడీ స్టార్స్'లోకి వచ్చి చేరారు.  తాజాగా సద్దాం వేసిన స్కిట్.. దానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. యమలోకంలోకి వెళ్లిన సద్దాం.. భూలోకంలో తాను పడిన బాధల గురించి యముడికి చెబుతూ 'ఎంత పెద్ద శిక్ష వేశారు?' అంటూ ప్రశ్నిస్తుంటాడు. ఈ క్రమంలో తనదైన స్టైల్ లో పంచ్ లు వేశాడు. పనిలో పనిగా జడ్జ్ లు శేఖర్ మాస్టర్, శ్రీదేవిలను కూడా టార్గెట్ చేశాడు. ఎంకరేజ్ చేయడానికైనా పదికి పది మార్కులు ఇవ్వరని.. ఎంత బాగా చేసినా తొమ్మిది మార్కులే ఇస్తుంటారని అన్నాడు.  అలానే 'కామెడీ షో' నిర్వాహకులపై సెటైర్లు వేశాడు. మాములుగా అయితే స్కిట్ కోసం గంట ముందు మాత్రమే ప్రిపేర్ అవుతానని.. అలాంటిది రెండు రోజుల ముందు నుండే ప్రాపర్టీస్ చెప్పమని నిర్వాహకులు అడుగుతున్నారని అన్నాడు. వాళ్లిచ్చిన ప్రాపర్టీస్‌తో స్కిట్ డిజైన్ చేసుకోవాల్సి వస్తోందంటూ కౌంటర్ వేశాడు. 

మోనాల్‌కి అఖిల్ పెట్టుకున్న‌ ముద్దు పేరు ఇదే!

  బిగ్ బాస్ సీజన్ 34 లో కంటెస్టెంట్ లుగా పాల్గొన్న మోనాల్-అఖిల్ ఎంతో స్నేహంగా మెలిగారు. మొదట్లో అభిజిత్‌తో క్లోజ్‌గా ఉండే మోనాల్ ఆ తరువాత అఖిల్‌కి దగ్గరైంది. వీరిద్దరూ ఒకరిపై మరొకరు అలగడాలు, బుజ్జగించుకోవడాలు సీజన్‌కి హైలైట్‌గా నిలిచాయి. దీంతో ఎపిసోడ్‌లో ఎక్కువ భాగం వీరి గురించే ప్రసారం చేసివారు. హౌస్ నుండి బయటకు వచ్చేసిన తరువాత కూడా ఈ జంట తమ స్నేహాన్ని కొనసాగిస్తోంది.  తరచూ వీరిద్దరూ కలిసి పార్టీలకు వెళ్లడం, ఫోటోలకు ఫోజులివ్వడం చేసేవాళ్లు. దీంతో నిజంగానే వాళ్ల మధ్య ఏదో ఉందనే టాక్ నడుస్తోంది. ఈ జంట సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటారు. ఇదిలా ఉండగా.. తాజాగా వీరిద్దరూ వీడియో కాల్‌లో మాట్లాడుకున్నారు.  దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను అఖిల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ.. మోనాల్ ను 'గుజ్జు' అంటూ సంబోధించాడు. దీనికి మోనాల్ కూడా 'అఖిలూ' అంటూ ప్రేమగా పిలిచింది. ప్రస్తుతం ఈ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'తెలుగు అబ్బాయి గుజ‌రాత్ అమ్మాయి' అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. 

సంద‌డిగా జ‌రిగిన వ‌ర్ష‌-ఇమ్ము పెళ్లి.. ఇమ్ము కాళ్లుక‌డిగిన రామ్‌ప్ర‌సాద్‌!

  'జబర్దస్త్' జంటల్లో సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ ఎంత పాపులారిటీ సంపాదించారో తెలిసిందే. ఈ జంటకు ఆన్ స్క్రీన్ పెళ్లి కూడా చేసేసింది మల్లెమాల సంస్థ. ఇప్పుడు మరో జంట హాట్ టాపిక్ అవుతోంది. వారే ఇమ్మానుయేల్-వర్ష. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తో ఈ జంటకి క్రేజ్ పెరిగింది. పైగా కెమెరా ముందు ఈ జంట తమ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోంది.  దీంతో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షో వారు ఇమ్మాన్యుయేల్-వర్షలకు ఆన్ స్క్రీన్ పెళ్లి చేశారు. ఇందులో హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ కామెడీ పండించే ప్రయత్నం చేశారు. "తాజ్‌మ‌హ‌ల్ క‌డితేనే ఆ ప్రేమ‌కు అర్థం. నీ మెళ్లో తాళి క‌డితేనే నా ప్రేమ‌కు అర్థం" అని వ‌ర్ష‌తో డైలాగ్ కొట్టాడు ఇమ్మానుయేల్‌. అబ్బో అన్న‌ట్లు పొంగిపోయింది వ‌ర్ష‌. ఇద్ద‌రూ క‌లిసి పెళ్లి ప‌త్రిక‌ల‌ను ఆహ్వానితుల‌కు పంచారు. భోజ‌నాల త‌ర్వాత పెళ్లి జ‌ర‌ప‌డం ఈ పెళ్లిలోని విశేషం. అయితే సరిగ్గా వర్ష మెడలో ఇమ్మాన్యుయేల్ తాళి కట్టే సమయంలో గెట‌ప్ శ్రీ‌ను ఆధ్వ‌ర్యంలో పోలీసులు వచ్చి పెళ్లి ఆపారు. "ఏంటిక్క‌డ యాభై మందితో పెళ్లి చేస్తున్నారా?" అని గెట‌ప్ శ్రీ‌ను అడిగితే, "యాభై మందితో చెయ్య‌ట్లేదండీ, ఒక్క‌డితోనే చేశామండీ" అని పంచ్ వేశాడు హైప‌ర్ ఆది. 20 మందికే ప‌ర్మిష‌న్ ఉంటే, 40 మందితో పెళ్లి చేస్తున్నారంటూ, పెళ్లివారిని పోలీస్ స్టేష‌న్‌కు తీసుకుపోయారు. అంద‌రూ పాట‌లు పాడి, డాన్సులు చేసి ఇంప్రెస్ చేయ‌డంతో పోలీసులు వారిని వ‌దిలిపెట్టారు. వేదికపై హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, ఇమ్మాన్యుయేల్, వర్ష అందరూ కలిసి 'అనితా ఓ అనితా' అంటూ ఓ పాట పాడారు.  పెళ్లి పీట‌ల‌పై ఇమ్మాన్యుయేల్ కాళ్లు క‌డిగాడు రామ్‌ప్ర‌సాద్‌. చివ‌ర‌లో వ‌ర్ష మెడ‌లో ఇమ్ము తాళి క‌ట్టిన‌ట్లు చూపించారు. పెళ్లి వేడుక‌లో ఉండే అరుంధ‌తీ న‌క్ష‌త్రం చూపించ‌డం, ఉంగ‌రాల ఆట, పూల‌బంతాట‌, ఫ‌స్ట్ నైట్‌ వంటివి కూడా ఇందులో చోటు చేసుకున్నాయి. ఈ స్కిట్ ను ప్రమోట్ చేయడానికి వర్ష ఏకంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో తాళిబొట్టు ఫోటో షేర్ చేసింది. ఈ విషయంలో ఆమెని నెటిజన్లు బాగా ట్రోల్ చేశారు. ఏదేమైనా పెళ్లికూతురు గెట‌ప్‌లో వ‌ర్ష చాలా అందంగా ఉందంటూ కామెంట్లు వ‌చ్చాయి.

నాగ‌బాబు రూమ్‌కి పిలిచి క్లాస్‌లు పీకేవారు: రాకెట్‌ రాఘవ

  బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతోంది 'జబర్దస్త్'. ఈ షోతో చాలా కమెడియన్లు లైమ్ లైట్ లోకి వచ్చారు. ఎన్నో ఏళ్లుగా అత్యధిక రేటింగ్స్ తో దూసుకుపోతున్న ఈ షోలో మొదటి నుండి రాకెట్ రాఘవ టీమ్ లీడర్ గా కొనసాగుతున్నాడు. క్లీన్ కామెడీతో ఆకట్టుకోవడానికి అత‌ను ప్రయత్నిస్తుంటాడు.  రాకెట్ రాఘవతో పాటు 'జబర్దస్త్' షోకి వచ్చి చాలా మంది టీమ్ లీడర్స్ షో నుండి బయటకు వెళ్లిపోయారు కానీ రాకెట్ రాఘవ మాత్రం ఇంకా కొనసాగుతున్నాడు. ఈ మధ్యనే 'జబర్దస్త్' అనుభవాల గురించి రాఘవ చెప్పుకొచ్చాడు. 'జబర్దస్త్'లో సీనియర్ల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నట్లు.. ఇప్పుడు వస్తున్న కొత్తతరం వారి నుండి కూడా నేర్చుకుంటున్నట్లు తెలిపాడు.  ఎప్పుడైనా స్కిట్ సరిగ్గా లేకపోతే రూమ్ లోకి పిలిచి మరీ క్లాస్ తీసుకుంటారని చెప్పాడు. "అంతంత రెమ్యునరేషన్లు తీసుకుంటారు కదా.. స్కిట్ సరిగ్గా చూసుకోవద్దా" అంటూ నాగబాబు అప్పట్లో క్లాస్ పీకేవారని.. ఏమైనా తప్పులు ఉన్నా ముఖం మీదే చెప్పేవారని రాఘవ చెప్పుకొచ్చాడు. 

కావాల‌ని చార్జింగ్ త‌క్కువ పెట్టుకుని లైవ్‌లోకి వ‌స్తున్న‌ మోనాల్!

  బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ సోషల్ మీడియాలో చేసే సందడి గురించి తెలిసిందే. తరచూ తన ఫాలోవర్లతో చాట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. ఇక అఖిల్ తో కలిసి ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు. ఈ ఇద్దరికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతుంటాయి. ఈ మధ్యనే అఖిల్ ఓ వారం రోజుల పాటు సోషల్ మీడియాకి దూరమైతే దానికి కారణం మోనాల్ అంటూ కామెంట్స్ వినిపించాయి.  కానీ అఖిల్ తను సోషల్ మీడియా నుండి కావాలనే బ్రేక్ తీసుకున్నట్లు వివరించాడు. ఇక మోనాల్ రీసెంట్ గానే హైదరాబాద్ లో ఇల్లు కొని ఇక్కడకు షిఫ్ట్ అయిపోయింది. ప్రస్తుతం తన ఇంటికి సంబంధించిన పనులతో బిజీగా ఉంది. తాజాగా లైవ్ లోకి వచ్చిన ఈ బ్యూటీ తెగ సందడి చేసింది. అయితే లైవ్ లోకి వచ్చిన కాసేపటికే తాను వెళ్లిపోతున్నానని మోనాల్ చెప్పింది.  తన బ్యాటరీ పది శాతానికి వచ్చిందని.. అభిమానులకు గుడ్ బై చెప్పింది. తాను లైవ్ లోకి వచ్చిన ప్రతీసారి ఇదే జరుగుతుందని మోనాల్ అనగా.. ఓ నెటిజన్ 'మరి అలా బ్యాటరీ అయిపోయే ముందు ఎందుకు లైవ్ లోకి వస్తున్నావ్' అని అసహనం వ్యక్తం చేశాడు. దానికి మోనాల్ నవ్వుతూ.. 'అలా ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు లైవ్ లోకి వస్తే అదే రీజన్ చెప్పి త్వరగా లైవ్ లో నుండి వెళ్లిపోవచ్చు' అంటూ కౌంటర్ ఇచ్చింది. 

నువ్వు అద్భుత‌మైన అమ్మాయివి.. నేనెంతో అదృష్ట‌వంతుడిని!

  బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సినీ న‌టుడు సామ్రాట్ రెడ్డి ఫైనల్స్ వరకు చేరుకున్నారు. అయితే ట్రోఫీ మాత్రం అందుకోలేకపోయారు. హౌస్‌లో తన ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకున్నారు. మంచి ఇమేజ్‌తో హౌస్ నుండి బయటకొచ్చారు. మొదటి భార్యతో విడాకుల వ్యవహారం సామ్రాట్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసినప్పటికీ.. బిగ్ బాస్ షో అతడికి మంచి పేరు తీసుకొచ్చింది.  గతేడాది సామ్రాట్ రెండో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తాజాగా తన శ్రీమతి అంజ‌నా శ్రీ‌లిఖిత‌ పుట్టినరోజు సందర్భంగా ఆమెకి స్పెషల్ విషెస్ చెప్పారు సామ్రాట్. ఈ క్రమంలో ఆయన షేర్ చేసిన రొమాంటిక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. "నువ్వు ఎంతో స్వీట్.. నా హృదయానికి దగ్గరయ్యావ్.. నిన్ను ప్రతీరోజు ప్రేమిస్తూ ఇలా గడిపే క్షణాలు లభిస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. నువ్ అద్భుతమైన అమ్మాయివి.. నేను ఎంతో అదృష్టవంతుడిని. హ్యాపీ బర్త్ డే స్వీట్ హార్ట్" అంటూ రాసుకొచ్చారు.  అలానే మరో పోస్ట్ పెడుతూ.. తన భార్య మీద ఉన్న పేమని తెలియబరిచాడు. ''నీకు చెప్పడానికి ఇంకేం పదాలు లేవు. ఐ లవ్యూ.. హ్యాపీ బర్త్ డే" అంటూ విష్ చేశారు. ఈ పోస్ట్ లు చూసిన టీవీ సెలబ్రిటీలు, నెటిజన్లు అంజ‌నా శ్రీ‌లిఖిత‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. కొన్ని సినిమాల్లో న‌టించిన సామ్రాట్ 'పంచాక్ష‌రి' మూవీలో అనుష్క జోడీగా న‌టించి వార్త‌ల్లో నిలిచాడు.

అన‌సూయ ఉండ‌గా.. 'జ‌బ‌ర్ద‌స్త్‌'లోకి యాంక‌ర్‌గా ర‌ష్మి ఎలా వ‌చ్చింది?

  ఆల్రెడీ 'జ‌బ‌ర్ద‌స్త్‌'కు అన‌సూయ యాంక‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, ర‌ష్మీ గౌత‌మ్ మ‌రో యాంక‌ర్‌గా ఎలా వ‌చ్చింద‌నేది చాలా మందికి అర్థంకాని విష‌యం. త‌న చాతుర్యంతో ర‌ష్మి ఆ షోకు యాంక‌ర్‌గా వ‌చ్చింద‌నీ, దాంతో అన‌సూయ యాంక‌రింగ్ చేసే దానికి 'జ‌బ‌ర్ద‌స్త్' అని ఉంచి, ర‌ష్మీ యాంక‌రింగ్ చేసే షోకు 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్' అని పెట్టార‌నీ ఇండ‌స్ట్రీలో ఓ ప్ర‌చారం ఉంది. అయితే తాను అన‌సూయ నుంచి ఆ షోను లాక్కోలేద‌ని ర‌ష్మి స్ప‌ష్టం చేసింది.  'జ‌బ‌ర్ద‌స్త్‌'కు యాంక‌రింగ్ చాన్స్ ఆమెకు 2013లో వ‌చ్చింది. "ఆ టైమ్‌లో అన‌సూయ ప్రెగ్నెంట్‌. దానివ‌ల్లే ఆమె ఆ షో నుంచి కొంత‌కాలం బ‌య‌ట‌కు రావాల్సి వ‌చ్చింది. త‌ప్ప‌నిస‌రిగా ఆమె స్థానంలో యాంక‌ర్‌గా మ‌రొక‌రు కావాలి. అప్పుడు నాకు ఫోన్ వ‌చ్చింది. నిజానికి నేను మా అమ్మ‌కు ఆరోగ్య స‌మ‌స్య‌లు రావ‌డంతో అప్ప‌టికే ఇండ‌స్ట్రీ నుంచి ఓ ఏడాది గ్యాప్ తీసుకున్నాను. అంటే నాక‌స‌లు చేతిలో ప‌నిలేదు. ఇక ఇండ‌స్ట్రీతో నాకు ప‌ని అయిపోయింద‌నే, సినిమాల చాప్ట‌ర్ క్లోజ్ అనే అనుకున్నాను. ఆ ఏడాది గ్యాప్ తీసుకున్న‌ప్పుడు కూడా జ్ఞాపిక ప్రొడ‌క్ష‌న్స్‌ ప్ర‌వీణ గారివ‌ల్ల‌ అప్పుడ‌ప్పుడు టీవీ షోల‌కు గెస్ట్‌గా వ‌స్తుండేదాన్ని." అని ర‌ష్మి ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. ఓరోజు స‌డ‌న్‌గా ఆమెకు కాల్ వ‌చ్చింది. "జ‌బ‌ర్ద‌స్త్ షో ఉంది.. ఎల్లుండి నుంచే షూటింగ్. మీరు రాగ‌లుగుతారా?" అని అడిగారు. అప్ప‌టికి జ‌బ‌ర్ద‌స్త్ షో మొద‌లై 13 ఎపిసోడ్లు మాత్ర‌మే ప్ర‌సార‌మ‌య్యాయి. టీవీ అంటే సినిమాల్లో చేసేవారికి చిన్న‌చూపు ఉన్న‌రోజుల‌వి. "నువ్వు టీవీ షో చేస్తావా? మ‌ళ్లీ నీకు సినిమాలు రావు" అని కొంత‌మంది ర‌ష్మిని డిస్క‌రేజ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. "అప్పుడు నా బ్యాంక్ బాలెన్స్ జీరో. చేతిలో ఏ ప‌నీ లేదు. ఏదో ఒక‌టిలే అనుకుని ఆ ఆఫ‌ర్‌ను యాక్సెప్ట్ చేశాను." అని చెప్పింది ర‌ష్మి. అలా అందివ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డంతో అన‌సూయ తిరిగి వ‌చ్చినా, మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్ ర‌ష్మిని వెన‌క్కి పంప‌లేదు. ఆమెతో షోను కొన‌సాగించి, దానికి 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్' అనే పేరు పెట్టింది. అదీ జ‌బ‌ర్ద‌స్త్‌లోకి ర‌ష్మీ ఎంట్రీ ఇచ్చిన దానికి వెన‌కున్న క‌థ‌.

ఇమ్మాన్యుయేల్‌కు నిజంగా వేరేవాళ్ల‌తో పెళ్ల‌యితే వ‌ర్ష ప‌రిస్థితి ఏంటి?

  తెలుగు బుల్లితెరపై పాపులర్ టీవీ షోలలో 'జబర్దస్త్' ఒకటి. చాలా ఏళ్లుగా అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతోంది ఈ షో. తాజాగా ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో రోజా అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ వర్ష కన్నీరు పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. 'జబర్దస్త్' షోలో వర్ష-ఇమ్మానుయేల్ జోడీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. సందర్భం వచ్చిన ప్రతిసారి ఈ జంట కెమెరా ముందు రొమాన్స్ ను పండిస్తూ బుల్లితెర ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంది.  బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయినా ఈ జోడీకి మంచి డిమాండ్ పెరిగింది. వీళ్ల మధ్య కెమిస్ట్రీ చూసిన వారికి ప్రేమాయణం నడుస్తుందనే అభిప్రాయం క‌ల‌గ‌కుండా ఉండ‌దు. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో వర్ష కనీళ్లు పెట్టుకోవడానికి కారణం కూడా వీరి లవ్ మ్యాటరే అనే సందేహాలు కలుగుతున్నాయి.  స్కిట్ లో భాగంగా ప్రేమించుకున్న వర్ష-ఇమ్మాన్యుయేల్ పెళ్లి చేసుకోలేకపోతారు. వర్షకి బదులు ఇమ్మానుయేల్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. దీంతో వర్ష తెగ ఫీలైపోతుంది. ఈ స్కిట్ పూర్తయ్యాక రోజా రియాక్ట్ అవుతూ.. "స్కిట్ లోనే ఇంత బాధపడుతోంది. నిజంగా ఇమ్మాన్యుయేల్‌కు వేరే వాళ్లతో పెళ్లయితే వర్ష పరిస్థితి ఏంటి..?" అని అడగ్గానే ఆమె కన్నీరు పెట్టుకుంటూ తన ఫీలింగ్స్ బయటపెట్టింది.  "మ‌నం ఉండాల‌నుకున్న ఆ ప్లేస్‌లో వేరే అమ్మాయి ఉంటే త‌ట్టుకోవ‌డం చాలా క‌ష్టం.." అని విప‌రీత‌మైన భావోద్వేగానికి గురైంది. ఇది చూసిన ఇమ్మాన్యుయేల్ షాకవుతూ చూశాడు. "ఇమ్ము ఎక్స్‌ప్రెష‌న్‌కి ఏంటి అర్థం అనేది నాకింకా అర్థం కాలా" అని రోజా అన‌డంతో క‌ళ్ల‌ను చేత్తో వ‌త్తుకున్నాడు ఇమ్మానుయేల్‌. అత‌డి వంక ఎమోష‌నల్ ఫీలింగ్‌తో అలాగే చూసింది వ‌ర్ష‌.

చనిపోదామనుకున్నా.. గాయ‌ని చిత్ర వ‌ల్లే బ‌య‌ట‌ప‌డ్డాను!

  బాల నటిగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన సింగ‌ర్‌ కల్పన.. బాలకృష్ణ నటించిన 'సీతారామ కళ్యాణం' సినిమాలో ఓ పాటలో కనిపించారు. అలానే విఠాలాచార్య దర్శకత్వంలో 'కామాక్షి కటాక్షం' అనే సినిమాలో నటించారు. అలానే తమిళ, మలయాళ భాషల్లోనూ కొన్ని సినిమాలు చేశారు. అయితే ఎక్కువ లైట్లు, అవుట్ డోర్ షూటింగ్ లంటే ఇష్టం లేకపోవడంతో నటిగా ప్రయాణం సాగించలేకపోయారు. అయితే ఇప్పటికీ నటనపై ఆసక్తి ఉందని ఆమె చెబుతుంటారు.  త‌ర్వాత కాలంలో ఆమె సంగీత పాఠాలు నేర్చుకొని సింగర్‌గా మారారు. బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్ గా ఆమె పాల్గొన్న విష‌యం తెలిసిందే. హౌస్‌లో ఆమె ప్ర‌వ‌ర్తించిన తీరుపై ఆ సమయంలో కల్పనపై మీమ్స్ ఓ రేంజ్ లో వచ్చాయి. ఎక్కువ రోజులు ఆమె షోలో కంటిన్యూ చేయలేకపోయారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న కల్పన కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.  2010లో అన్నీ పోగొట్టుకున్నానని.. ఆ సమయంలో చనిపోదామనుకున్నట్లు చెప్పి దిగ్భ్రాంతికి గురిచేశారు. ఆ ఆలోచన నుండి గాయని చిత్ర తనను బయటకి తీసుకొచ్చారని.. చిన్నప్పటి నుండి ఆమెతో పరిచయం ఉందని చెప్పారు. మలయాళంలో ఓ షో జరుగుతోందని.. ఎలిమినేట్ అయినా పర్లేదు.. ప్రశాంతంగా ఉంటుంది వస్తావా అంటూ చిత్ర అడగడంతో.. ఎలాగైనా గెలవాలనే కసితో ఆ షోలో పాల్గొన్నట్లు చెప్పారు. అప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు.. తన వల్ల ఇండస్ట్రీ పరువు పోతోందని చాలా మంది అన్నారని తెలిపారు. ప్రొఫెషనల్ సింగర్ ఇలా కంటెస్టెంట్ గా రావడం ఏంటని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని.. ఫైనల్‌గా ఆ షోలో తనే విజేతగా నిలిచినట్లు ఆమె చెప్పుకొచ్చారు.

రజనీకాంత్‌కు రూల్స్ వ‌ర్తించ‌వా? సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్!

  నటి కస్తూరి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. 'గృహలక్ష్మి' సీరియల్‌తో కస్తూరి ఇప్పుడు తెలుగువారిని అలరిస్తున్నారు. అలా బుల్లితెరపై అందరినీ ఆకట్టుకుంటున్న ఆమె.. ఎప్పటికప్పుడు సామాజిక అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె సూపర్ స్టార్ రజనీకాంత్ అమెరికా ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.  ఈ ఏడాది మే నెల నుండి ఇండియన్స్ ఎవరూ కూడా అమెరికా వెళ్లడానికి వీలు లేకుండా అమెరికా ప్రభుత్వం బ్యాన్ విధించిందని.. మెడికల్ చెక‌ప్స్‌ కోసం కూడా ఛాన్స్ ఇవ్వలేదని.. ఇలాంటి సమయంలో రజనీకాంత్ అమెరికా ఎలా వెళ్లారని ప్రశ్నించారు కస్తూరి. అమెరికాలో పని చేసేవారు.. ఎన్నారైలు మాత్రమే ఇండియా నుండి వెళ్లే ఛాన్స్ ఉందని.. అలాంటి వారిని మాత్రమే అమెరికా రానిస్తోంద‌ని.. కానీ రజనీకాంత్ ఈ సమయంలో అమెరికా వెళ్లడం మిస్టరీగా మారిందని చెప్పుకొచ్చారు.  చాలా మంది ఆయన వైద్యం కోసం భారత ప్రభుత్వం నుండి అనుమతి తీసుకొని అమెరికా వెళ్లారని అంటున్నారు. అసలు ఆయన ఆరోగ్య సమస్య ఏంటని ప్రశ్నించారు కస్తూరి. ఇండియాలో ఆయన్ను ట్రీట్ చేసే హాస్పిటల్స్ లేవా? అంటూ మండిపడ్డారు. రజనీకాంత్ లాంటి పెద్దలు రూల్స్ పాటించకపోతే.. అంతకుమించి దారుణమైనది మరొకటి ఉండదని చెప్పింది. ఏ ఒక్కరూ రూల్స్ కంటే పెద్దవారు కాదని.. అందరినీ ప్రశ్నించవచ్చని.. అది రజనీకాంత్ అయినా సరే, ఇంకొకరు అయినా సరే అంటూ వరుస ట్వీట్లు పెట్టారు. 

"నువ్వు అంత వంగ‌కు ప్లీజ్‌".. అన‌సూయ పొట్టి డ్ర‌స్‌పై సుమ కామెంట్స్‌!

  ఈ మధ్యకాలంలో చాలా టీవీ షోలను కామెడీ థీమ్‌తో రూపొందిస్తున్నారు. యాంకర్ సుమ హోస్ట్ చేసే వీడియోల్లో కామెడీ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఆమె యాంకరింగ్ చేస్తోన్న 'క్యాష్' షోకి మంచి రేటింగ్స్ వస్తుంటాయి. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. జూలై 3న ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది.  ఈ షోకి యాంకర్ అనసూయ, సీనియర్ హీరోయిన్ ఇంద్రజ, నటులు ప్రియదర్శి, అభినవ్ గోమటం గెస్ట్ లుగా వచ్చారు. వీరంతా తమదైన స్టైల్‌లో పంచ్‌లు విసురుతూ రచ్చ చేశారు. "ఎవరైనా సరే లాక్ డౌన్ లో లావు అవుతారు లేదా సన్నగా అవుతారు.. నువ్వేంటి ఇంకా పొడుగయ్యావ్?" అంటూ అనసూయపై పంచ్ వేసింది సుమ. "నేనింకా పెరుగుతున్నానా!" అని ఆనంద‌ప‌డింది అన‌సూయ‌ ఆ తరువాత మాటల మధ్యలో "ఇంద్ర‌జ‌తో అయ్యో ఎంత మ‌ర్యాదండీ మీకు.. ఇక్కడ ఎవరికీ లేదు." అని సుమ అంటుండగా.. వెంటనే అనసూయ "అక్కా.. ఏం మాట్లాడుతున్నారు.. నాకు రెస్పెక్ట్ లేదా" అంటూ సుమ కాళ్లు పట్టుకోబోయింది... "నువ్వు అంత వంగకు ప్లీజ్‌" అంటూ అనసూయ పొట్టి డ్రెస్‌ను చూస్తూ కామెంట్ చేసింది సుమ.  దాంతో అవాక్క‌వుతూనే న‌వ్వేసింది అన‌సూయ‌. అనంతరం అనసూయ "అక్కా నేను ఫుల్ కొట్టినా" అని త‌న పోడియంను కొట్ట‌గా, "ఫుల్ కొట్టావా.. అయ్యా" అని ఆశ్చ‌ర్యం న‌టిస్తూ నోటి మీద చెయ్యేసుకుంది సుమ‌. ఆ తరువాత రైల్వే స్టేషన్ లో పెళ్లిచూపుల కార్యక్రమం చేపట్టి అందరినీ నవ్వించే ప్రయత్నం చేశారు. 

నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.. ఉద‌య్ కిర‌ణ్‌పై కౌశల్ ఎమోషనల్ పోస్ట్!

  'చిత్రం' సినిమాతో హీరోగా కెరీర్ మొదలుపెట్టి హిట్టు మీద హిట్టు అందుకుంటూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు ఉదయ్ కిరణ్. అతి తక్కువ సమయంలో లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. కెరీర్ లో స్టార్ స్టేటస్ అనుభవించిన ఉదయ్ కిరణ్ ప్రొఫెషనల్ గా ఇబ్బందులు ఎదుర్కోవడంతో 2014 జనవరి 5న ఉరేసుకొని చనిపోయాడు. ఆయన మరణాన్ని అభిమానులు తట్టుకోలేకపోయారు. ఇప్పటికీ ఉదయ్ కిరణ్ కు సంబంధించిన పోస్ట్ లు పెడుతూ ఆయన్ను గుర్తుచేసుకుంటూ ఉంటారు.  ఇదిలా ఉండగా.. ఈరోజు ఉదయ్ కిరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు ఆయన్ను తలచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. బిగ్ బాస్ విన్నర్ కౌశల్.. ఉదయ్ కిరణ్ ను తలచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ముందుగా ఉదయ్ కిరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన కౌశల్.. నిన్ను మిస్ అవ్వని క్షణం ఉండదని చెప్పారు.  నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని.. మనిద్దరం కలిసి ఉన్న రోజులను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటానని చెప్పుకొచ్చారు. తన కెరీర్ లో ఎనిమిది సినిమాలు ఉదయ్ కిరణ్‌తో కలిసి నటించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. 

భారీ-క్రేజీ సినిమాల‌న్నీ 'స్టార్ మా'కే!

  ఈరోజుల్లో నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా నిర్మాతలు భారీ లాభాలను పొందుతున్నారు. ఓటీటీ హక్కుల్లో ఎంత పోటీ ఉందో శాటిలైట్ హక్కుల్లో కూడా అంతే పోటీ నెలకొంది. ఇక అందులో స్టార్ మా ఛానెల్ శాటిలైట్ హక్కులను అందుకోవడంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో పాటు రాబోయే ఆసక్తికర సినిమా హక్కులను కూడా స్టార్ మా సొంతం చేసుకుంది.  ఒకప్పుడు సినిమా విడుదలైన చాలా కాలానికి టీవీల్లో వచ్చేది. కానీ ఈరోజుల్లో మాత్రం రెండు, మూడు వారాల తరువాత ఓటీటీల్లోకి వచ్చేస్తుంది. ఆ తరువాత టీవీలలో టెలికాస్ట్ అవుతున్నాయి. ఇప్పుడు స్టార్ మా సినిమాలపై పెట్టుబడులు గట్టిగానే పెడుతోంది. స్టార్ మా ముందుగా రెండు పాన్ ఇండియా సినిమాలను దక్కించుకోవడం విశేషం. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ తెరకెక్కుతోన్న 'ఆర్ఆర్ఆర్' శాటిలైట్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేశారు.  ఇక సూప‌ర్ క్రేజీ ప్రాజెక్టుల్లో అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మరో పాన్ ఇండియా సినిమా 'పుష్ప' హక్కులు, మ‌హేశ్‌బాబు - ప‌ర‌శురామ్ కాంబినేష‌న్ ఫిల్మ్ 'స‌ర్కారువారి పాట' హ‌క్కుల‌ను కూడా సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా 'అఖండ'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా హక్కులను కూడా దక్కించుకుంది 'స్టార్ మా'. వీటితో పాటు మీడియం బడ్జెట్ సినిమాలను కూడా స్టార్ మా వదలడం లేదు. 'ఖిలాడి', 'లవ్ స్టోరీ', 'టక్ జగదీశ్', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' హక్కులను కూడా దక్కించుకుంది. 

ఇల్లు కొని హైద‌రాబాదీ అయిన‌ మోనాల్!

  హీరోయిన్‌గా తెలుగులో రెండు సినిమాలు చేసినా రాని క్రేజ్‌ను బిగ్ బాస్ షోతో సంపాదించుకుంది గుజ‌రాతీ అమ్మాయి మోనాల్ గజ్జర్. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఆమె అఖిల్, అభిజిత్‌లతో క్లోజ్‌గా ఉంటూ వార్తల్లో నిలిచేది. కొన్నాళ్లకు అభిజిత్‌తో గొడవలు, అఖిల్‌తో స్నేహం వంటి అంశాలతో మోనాల్ హాట్ టాపిక్ అయ్యేది. మొత్తానికి ఈ షోతో మోనాల్‌కి గ్లామర్ పరంగా క్రేజ్ ఏర్పడింది.  హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది. సినిమాలు, టీవీ షోలు అంటూ బిజీగా గడుపుతోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూ వారికి టచ్‌లో ఉంటోంది. తరచూ తన హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.  వరుస ఆఫర్లు రావడంతో తన మకాంను హైదరాబాద్‌కు మార్చాలని భావించిందట మోనాల్. దీనికోసం హైదరాబాద్‌లో ఓ ఇంటిని కూడా కొనుగోలు చేసింది. తాజాగా తన తల్లిని తీసుకొని హైదరాబాద్‌లో ప్రత్యక్షమైంది మోనాల్. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేస్తూ.. హైదరాబాద్ లో తనకొక ఇల్లు దొరికిందని.. సో.. ఇప్పుడు తను కూడా అఫీషియల్ గా హైదరాబాదీ అయినట్లు చెప్పుకొచ్చింది. 

అన‌సూయ‌కు సారీ చెప్పిన శివ‌.. ఫూల్స్ అయిన ఫ్యాన్స్‌!!

  రీసెంట్ గా 'జబర్దస్త్'కు సంబంధించిన ప్రోమో ఒకటి యూట్యూబ్ లో బాగా వైరల్ అయింది. స్టేజ్ మీద యాంకర్ శివ అడిగిన ప్రశ్న‌కు ఆ షో వ్యాఖ్యాత, నటి అనసూయ కోప్పడి వెళ్లిపోయింది. హైపర్ అది స్కిట్ లో భాగంగా గెస్ట్ గా వచ్చిన యాంకర్ శివ.. మిమ్మల్ని ఎప్పటినుండో ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నా అని.. ఆమె డ్రెస్సింగ్ గురించి అడిగాడు.  దానికి అనసూయ 'అది నా పర్సనల్ విషయం' అని చెప్పింది. వెంటనే శివ.. 'పర్సనల్ అయితే ఇంట్లో చూసుకోవచ్చుగా.. ఇక్కడ ఎందుకు' అని అనగానే.. అనసూయ కోపంతో వెళ్లిపోయింది. ఇది చూసిన అభిమానులు నిజంగానే అనసూయ హర్ట్ అయి వెళ్లిపోయిందని అనుకున్నారు. కానీ అది నిజం కాదు. ఎప్పటిలానే ఈ ప్రోమోని కూడా పబ్లిసిటీ కోసం అలానే కట్ చేశారు.  స్టేజ్ మీద నుండి కోపంగా వెళ్లిపోయిన అనసూయను హైపర్ ఆది, యాంకర్ శివ కన్విన్స్ చేసి స్టేజ్ మీదకు తీసుకురావడానికి ప్రయత్నించారు. యాంకర్ శివ పదే పదే అనసూయకు సారీ చెప్పారు. ఈ బాగోతాన్ని జడ్జిలు రోజా, మను చూస్తూ ఉన్నారు. ఆ తరువాత స్టేజ్ మీదకు వచ్చిన అనసూయ 'రోజా గారు మీరు నమ్మేశారు కదా' అంటూ ఫూల్ చేసే ప్రయత్నం చేసింది. దానికి రోజా అస్సలు నమ్మలేదంటూ అనసూయ గాలి తీసేసింది. 

కూతురికి పేరు పెట్టిన హ‌రితేజ‌.. ఆ పేరే ఎందుకంటే..!!

  బుల్లితెరపై సీరియల్స్‌తో ఫేమస్ అయిన హరితేజ ఆ తరువాత సినిమా అవకాశాలు దక్కించుకుంది. బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అయిన తరువాత ఆమె క్రేజ్ బాగా పెరిగిపోయింది. బిగ్ బాస్ షో లంటే ముందుగా ఆమెకి ఎక్కువగా సీరియల్స్‌లో నెగెటివ్ రోల్స్ వచ్చేవి. కానీ బిగ్ బాస్ షో తరువాత ఆమె ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా 'అ ఆ' సినిమా హరితేజ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అయింది.  ఈ సినిమాతో కమెడియన్‌గా మారిపోయింది హరితేజ. తెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ హరితేజ నవ్వులు పూయిస్తుంటుంది. అలా హరితేజకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే హరితేజ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. డెలివెరీ సమయంలో తాను పడిన కష్టాల గురించి హరితేజ చెప్పిన విషయాలు అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశాయి.  ఇక తనకు పుట్టిన పాపను ఇప్పటివరకు క్లియర్‌గా బ‌య‌ట‌కు చూపించలేదు హరితేజ. మొహాన్ని చూపించకుండా హరితేజ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా హరితేజ తన కూతురికి అదిరిపోయే పేరు పెట్టింది. 'భూమి దీపక్ రావ్' అంటూ పెట్టిన పేరుకి వివరణ కూడా ఇచ్చారు. ''భూమి అంటే సహనంతో ఉంటుందని అనుకుంటున్నారు.. కానీ వాళ్లకేం తెలుసు సహనాన్ని పరీక్షిస్తే భూకంపాలే'' అని తన బిడ్డ చెబుతున్నట్టుగా హరితేజ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

సుధీర్‌కి రష్మీ పెట్టుకున్న ముద్దుపేరు ఏంటో తెలుసా?

  బుల్లితెరపై సుడిగాలి సుధీర్, రష్మీలకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. వీరిద్దరూ కలిసి చేసే సందడి మాములుగా ఉండదు. ఈ జంటకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు వీరిద్దరి మధ్య రొమాన్స్ ను తెరపై అందంగా చూపిస్తుంటారు. తాజాగా రష్మీ.. సుధీర్ కి ముద్దుపేరు పెట్టుకుంది. ఇకపై నుండి సుధీర్ ను "సుడ్డి" అని పిలుస్తా అంటూ తెగ సిగ్గుపడిపోయింది.  ప్రదీప్ హోస్ట్ చేస్తోన్న 'ఢీ 13' డాన్స్ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో "ఇక నుంచి నేను మాత్రం సుధీర్ ను సుడ్డి అని పిలుస్తా" అంటూ రష్మీ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆ తరువాత వీరిద్దరూ కలిసి 'ఆట' సినిమాలో "ఏం చాందిని రా ఏం చ‌మ‌కిదిరా" అనే పాటకు డాన్స్ చేశారు. ఈ పెర్ఫార్మన్స్ మొత్తం ఎపిసోడ్ కు హైలైట్ గా నిలిచింది.  మరోపక్క రష్మీ మాటలను ఇమిటేట్ చేస్తూ కామెడీ చేశాడు ప్రదీప్. రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ తో రష్మీని ఓ ఆట ఆడేసుకున్నాడు. ఇక జడ్జ్ ప్రియమణి కంటెస్టెంట్ తో కలిసి డాన్స్ చేయడం ఆకట్టుకుంటోంది. ఈ మొత్తం హుంగామా చూడాలంటే జూన్ 30వరకు ఎదురుచూడాల్సిందే!

గ‌డ్డు ప‌రిస్థితులు.. అందుకే సోషల్ మీడియాకు దూరం.. కారణం చెప్పిన అఖిల్!

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. తరచూ పోస్ట్ లు పెడుతూ.. అభిమానులతో టచ్ లో ఉండే సెలబ్రిటీలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోతే.. ఏమైందా..? అంటూ అభిమానులు టెన్షన్ పడుతుంటారు. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ ఫ్యాన్స్ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. రోజూ ఏదొక పోస్ట్ పెడుతూ ఫ్యాన్స్ తో టచ్‌లో ఉండే అఖిల్ వారం రోజులుగా ఒక్క పోస్ట్ కానీ, స్టేటస్ కానీ పెట్టలేదు.  దీంతో ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా అఖిల్‌ను ప్రశ్నిస్తున్నారు. అలానే కొందరు కాల్స్, మెసేజ్ లు చేశారట. అయితే అసలు కారణం చెబుతూ ఇన్స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు అఖిల్. కొన్నిసార్లు మనం మరింత బలంగా తయారవ్వాలంటే కొంత సమయం దూరంగా ఉండాల్సిందేనని చెప్పాడు అఖిల్. ఎన్నో జరిగాయని.. వాటి నుండి ఎంతో నేర్చుకున్నానని.. ప్రతిరోజూ గుణపాఠమే అని చెప్పుకొచ్చాడు.  గత వారం నుండి యాక్టివ్‌గా లేనందుకు క్షమించమని అభిమానులను కోరాడు. ఇప్పుడు మళ్లీ ఫుల్ ఎనర్జీతో మీ ముందుకు వచ్చానని.. ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నానని.. ఆ కారణంగానే సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. అభిమానులను ఉద్దేశిస్తూ.. "మీరు గనుక లేకపోతే ఇంకొన్ని రోజులు ఇలానే ఉండిపోయేవాడిని." అని ఫ్యాన్స్ మీద తనకున్న ప్రేమను వ్యక్తప‌రిచాడు. 

యాంకర్ రవి మొదటి రెమ్యునరేషన్.. ఎపిసోడ్‌కు 250 రూపాయ‌లే!

  లాక్ డౌన్ సమయంలో చాలా మంది తారలు యూట్యూబ్ ఛానెల్స్ తో బిజీ అయ్యారు. పలు రకాల వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో యాంకర్ రవి కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో తన భార్య, పాప వియాలతో కలిసి రవి తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేస్తోన్న వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా రవి మరో వీడియో పోస్ట్ చేశాడు.  ఇందులో తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాడు. 'నా గురించి నీకు.. నీ గురించి నాకు ఎంత తెలుసు..?' అనే కాన్సెప్ట్ తో భార్యతో కలిసి వీడియో చేశాడు. ఇందులో రవి-నిత్యల సంసార జీవితం గురించి ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. ఇంట్లో ఎవరికి కోపం ఎక్కువగా వస్తుంది..? అలా వచ్చిన సమయంలో వాళ్లిద్దరూ ఏం చేస్తారనే విషయాలు మాట్లాడుకున్నారు. నిత్యకు కోపం వస్తే రవి తన దగ్గరకు వచ్చి మాట్లాడాలని కోరుకుంటుందట.  ఇక రవి ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చాడు..? అతడి మొదటి రెమ్యునరేషన్ ఎంత అనే విషయాలను నిత్య చెప్పలేకపోయింది. 2010లో మొదటిసారిగా లైవ్ షో చేశానని రవి చెప్పాడు. అంతేకాకుండా ఆ సమయంలో ఒక ఎపిసోడ్ చేస్తే రూ. 250 ఇచ్చేవారని.. అలా నెలలో ఎన్ని ఎపిసోడ్ లు చేస్తే అన్ని రూ. 250లు ఇచ్చేవారని చెప్పుకొచ్చాడు. ప్రేక్షకుల అభిమానంతో ఇక్కడ వరకు వచ్చానని చెప్పుకొచ్చాడు.