ప‌ద్దెనిమిదేళ్ల‌ తర్వాత టీవీ షో కోసం ఇంద్రజ ఏం చేశారంటే?

  'యమలీల' సినిమాలో 'నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో...' పాటలో ఇంద్రజ మాస్ డాన్స్ చేస్తే, టాలీవుడ్ ఆడియన్స్ కూడా స్టెప్పులు వేశారు. 'అమ్మ దొంగా'లో ఆమె వేసిన స్టెప్పులు కూడా హిట్టే. అప్పట్లో డాన్స్ బాగా చేసే హీరోయిన్లలో ఇంద్రజ పేరు వినిపించేది. పెళ్లి, పిల్లలు తర్వాత ఇంద్రజ సినిమాలకు దూరం అయ్యారు. రీఎంట్రీలో తల్లి పాత్రలు, పెద్దమనిషి తర్వాత పాత్రల్లో నటించే అవకాశాలు వస్తుండటంతో పాటల్లో డాన్స్ చేసే అవకాశం ఇంద్రజకు దక్కలేదు. కానీ, ఓ టీవీ షోలో డాన్స్ చేసే ఛాన్స్ వచ్చింది.  'ఈటీవీ'లో ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే కామెడీ షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'. కామెడీ మాత్రమే కాదు... అందులో డాన్స్ పెర్ఫార్మన్స్ లు కూడా వుంటాయి. నెక్స్ట్ సండే, జూలై 18న టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్‌లో ఇంద్రజ డాన్స్ పెర్ఫార్మన్స్ స్పెషల్ అట్రాక్షన్ కానుంది. 'గురు' సినిమాలో 'మెరిసింది మేఘం మేఘం' పాటకు ఇంద్రజ డాన్స్ చేశారు. ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే... పద్దినిమిదేళ్ళ తర్వాత  ఓ పాటకు ఆమె డాన్స్ చేయడం. సుధీర్ ఈ విషయం చెప్పాడు.  'మేడమ్ సాంగ్ పెర్ఫార్మ్ చేసి పద్దెనిమిదేళ్ళు అయ్యిందట. కాని ఇక్కడ పద్దెనిమిదేళ్ళ పిల్లలా చేశారు' అని ఇంద్రజకు సుధీర్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఈ ఎపిసోడ్‌లో మరో అట్రాక్షన్... మరో సీనియర్ హీరోయిన్ లైలా. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' 25వ ఎపిసోడ్‌ సందర్భంగా ఆమెను గెస్ట్ గా తీసుకొచ్చారు. ఆమె కూడా ఇంద్రజతో కలిసి చిన్నగా కాలు కదపడం విశేషం. 

సభాముఖంగా అవినాష్ పంచె ఊడింది!

  అవినాష్ పంచె ఊడింది. అదీ సభాముఖంగా! పంచె ఊడిన తర్వాత స్టేజి మీద నుంచి అవినాష్ వెళ్తున్న సమయంలో యాంకర్ శ్రీముఖి వీడియో తీసింది. దానిని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. అందులో అవినాష్ వెనుక పంచె తీసుకుని నడుస్తున్న అసిస్టెంట్ మరొకరు కూడా ఉన్నారు. శ్రీముఖిని వీడియో తీయవద్దని అంటున్నట్టు అవినాష్ సైగ చేయడమూ కనిపించింది. 'సభాముఖంగా మా రాయుడు పంచె ఊడింది' అని శ్రీముఖి కాప్షన్ ఇచ్చింది.  'జబర్దస్త్' షోతో పాపులర్ అయిన అవినాష్, ఇప్పుడు ఆ షో చెయ్యడం లేదు. స్టార్ మా ఛానల్ లో షోస్ చేస్తున్నాడు. 'బిగ్ బాస్' తరవాత నుంచి స్టార్ మాతో కంటిన్యూ అవుతున్నాడు. లేటెస్ట్ గా 'స్టార్ మా పరివార్ చాంపియన్షిప్' అని ఒక షో షూటింగ్ చేశారు. అందులో 'పెదరాయుడు' గెటప్ వేశాడు అవినాష్. స్కిట్ పూర్తయిన తరవాత పంచె ఊడిందా? స్కిట్ లో పంచె ఊడటం భాగమా? అన్నది షో టెలికాస్ట్ అయితే గాని తెలియదు.  ఈ షోకి శ్రీముఖి యాంకరింగ్ చేసింది. షూటింగ్ మధ్యలో తీసుకున్న కొన్ని వీడియోస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

'వైదేహీ పరిణయం' హీరోయిన్ బ్యాగ్రౌండ్ ఇదే!

  అందం, అమాయకత్వం కలగలిపిన అమ్మాయి వైదేహిగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యుక్తా మల్నాడ్ ఉంది చూశారా? అదేనండీ... 'జీ తెలుగు'లో ప్రసారం అవుతున్న 'వైదేహీ పరిణయం' సీరియల్‌లో వైదేహిగా నటిస్తున్న అమ్మాయి. నటనపై ఆసక్తితో విమానంలో ఉద్యోగాన్ని వదిలేసి మరీ వచ్చింది. ఇంతకీ, యుక్తా మల్నాడ్ ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...  బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటున్న యుక్తా మల్నాడ్ తెలుగమ్మాయి కాదు. పేరులోని చివరి అక్షరాలు 'మల్నాడ్' ఆమె ఇంటి పేరు కూడా కాదు. యుక్తాది కర్ణాటకలోని చిక్ మంగళూరు. బీకామ్ చదివింది. డిగ్రీ చదివేటప్పుడు అందాల పోటీల్లో పాల్గొనేది. 2015లో 'మిస్ మల్నాడ్' టైటిల్ గెలుచుకుంది. అందుకు గుర్తుగా పేరు చివర 'మల్నాడ్' అని పెట్టుకుంది.  కాలేజీలో ఉండగా కన్నడ సినిమా 'అనిసుతిదే'లో అవకాశం వస్తే నటించింది. కానీ, అది విడుదల కాలేదు. డిగ్రీ తర్వాత ఎయిర్ హోస్టెస్ గా చేసే అవకాశం వస్తే 'స్పైస్ జెట్'లో చేరింది. నటనపై ఆసక్తితో రెండు మూడు నెలలు తిరక్కుండా మానేసింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కొన్నాళ్ళు పని చేసింది. కన్నడ సీరియల్‌లో నటించాలని ఆడిషన్స్ ఇస్తే... తొలుత తమిళ సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది. అదెలా? అంటే... కన్నడ సీరియల్‌కి పని చేసే వ్యక్తి ఒకరు తమిళంలో చేస్తావా? అని అడగటంతో చేసేసింది. తర్వాత తెలుగులో 'వైదేహీ పరిణయం'లో అవకాశం వచ్చింది.  నిజానికి, తెలుగులో సినిమా కథానాయికగా అడుగుపెట్టాలని యుక్తా మల్నాడ్ భావించింది. తలుపు తట్టిన మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని సీరియల్ చేశానని ఆమె చెప్పింది. అదీ సంగతి. 

'ఢీ' మ‌ధ్య‌లో ప‌ర్ఫార్మెన్స్ ఆపేసిన డాన్స‌ర్స్‌! ఏమైంది?

  'మాస్టర్... సాంగ్ సెలక్షన్ బావుంది. నాకు కొరియోగ్రఫీ నచ్చింది. తనుశ్రీ... స్ట్రాంగ్ కంటెస్టెంట్‌' - ఇవి.. డాన్స్ మాస్టర్ సుదర్శన్, కంటెస్టెంట్ తనుశ్రీకి 'ఢీ' లాస్ట్ ఎపిసోడ్‌లో పూర్ణ  ఇచ్చిన కాంప్లిమెంట్స్. తనుశ్రీ ఫెంటాస్టిక్ డాన్సర్ అని... తనలో స్వాగ్, యాటిట్యూడ్, స్టయిల్ వున్నాయని ప్రియమణి పొగిడారు. సుదర్శన్ చించేశాడని చెప్పుకొచ్చారు. 'కీప్ వర్కింగ్ హార్డ్' అని తనుశ్రీకి సలహా ఇచ్చారు. కాంప్లిమెంట్స్ ఇచ్చి వారం కూడా కాకముందే తనుశ్రీ, సుదర్శన్ అనూహ్య రీతిలో డిజప్పాయింట్ చేశారు. రాబోయే ఎపిసోడ్‌లో తనుశ్రీ పెర్ఫార్మన్స్ ఉంది. లాస్ట్ టైమ్ గ్రూప్ డాన్సర్లతో మాస్ సాంగ్ ట్రై చేసిన సుదర్శన్... వేరియేషన్ చూపించాలని అనుకున్నాడో, మరొకటో మాంచి మెలోడీ సాంగ్ 'ప్రేమికుల రోజు'లోని 'రోజా రోజా' తీసుకున్నాడు. లిరిక్ కి తగ్గట్టు డాన్స్ వుండాలనే ఉద్దేశంతో రోజా అని వచ్చినప్పుడల్లా రోజా పువ్వు తీసే విధంగా కొరియోగ్రఫీ డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే అది బెడిసికొట్టింది. పూల‌ను అందించే క్ర‌మంలో కో-ఆర్డినేష‌న్ లోపించింది. ప్రాక్టీస్ ఫుల్ గా చేయలేదో, తనుశ్రీకి జోడీగా వచ్చిన అబ్బాయికి, ఆమెకి కోఆర్డినేషన్ కుదరలేదో... సాంగ్‌లో సరిగా పెర్ఫార్మన్స్ ఇవ్వలేకపోయారు. మధ్యలో సాంగ్ ఆపేశారు. లేటెస్టుగా విడుదలైన ప్రోమోలో దాన్ని చూపించారు. దానిపై టీమ్స్ మ‌ధ్య చాలా డిస్క‌ష‌న్స్ జ‌రిగిన‌ట్లు చూపించారు. ఇంత‌కు ముందు మంచి కాంప్లిమెంట్స్ అందుకున్న సుదర్శన్, తనుశ్రీ టీమ్ ఈసారి ఇలా ఎందుకు చేశారు? ఏమైంది? అనేది బుధవారం టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. 

'దేత్తడి' హారిక నాభి అందాలు చూడతరమా!

  ఉత్తరాది నుండి తెలుగు సినిమాలకు వస్తున్న కొంతమంది హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం 'దేత్తడి' హారికది. హాట్ షోకు కూడా ఏమాత్రం వెనుకాడదు. 'బిగ్ బాస్'లో థైస్ కనిపించేలా చేసిన డాన్స్ అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. అడపాదడపా సోషల్ మీడియాలో హారిక హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తుంటుంది. అయితే రీసెంట్‌గా పోస్ట్ చేసిన ఫొటోలు మాత్రం ఒక రేంజ్ అని చెప్పాలి. రీసెంట్‌గా దేత్తడి హారిక ఒక ఫొటోషూట్ చేశారు. అందులో ట్రెడిషనల్ వేర్‌లో వున్నారు. కానీ అందాలు చూపించిన విధానం మాత్రం మోడరన్ అని చెప్పాలి. నడుము ఒంపులు, నాభి అందాలు చూడతరమా... అని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. హారిక వేసుకున్న టాప్ బికినీ అని చెప్పలేం. కానీ బికినీకి ఏమాత్రం తీసిపోదు.  గతంలో జీన్స్, టీ-షర్టులో నాభి అందాలు చూపిస్తూ హారిక ఒక పోస్ట్ చేసింది. దానిని మించి ఈ ఫొటోలు వున్నాయి. యూట్యూబ్ స్టార్స్ కొందరు సినిమాల్లో ట్రై చేస్తున్నారు. హారిక కూడా చిన్న చిన్న రోల్స్ చేసింది. ఈసారి హీరోయిన్ ట్రయల్స్ లో వున్నట్టు భోగట్టా.   

సుధీర్-రష్మీ మ‌ళ్లీ పెళ్లి!

  'సుడిగాలి' సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందని కామెంట్లు వినిపిస్తుంటాయి. ఏదో ఎఫైర్ వుందని అంటారంతా. కాని తమ మధ్య ఏమీ లేదని ఇద్దరూ ఎప్పుడూ ఖండించలేదు. మీమధ్య ప్రేమ వుందంట కదా అని అడిగితే ముసిముసి నవ్వులు నవ్వుతూ 'మంచి స్నేహితులం మాత్రమే' అంటూ ఆన్సర్ ఇస్తారు ఇద్దరూ.  ఆడియన్స్‌లో సుధీర్, రష్మీ జోడీకి వున్న క్రేజ్ క్యాష్ చేసుకోవడం కోసం ఈటీవీ కోసం మల్లెమాల వాళ్ళు 'అహ‌ నా పెళ్ళంట' అని ఒక పండక్కి ప్రోగ్రామ్ చేశారు. వాళ్ల పెళ్లి చేశారు. రియల్ లైఫ్‌లో సుధీర్, రష్మీ గౌతమ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారోనని వెయిట్ చేస్తున్న జనాలు వున్నారు. రీసెంట్‌గా 'రెచ్చిపోదాం బ్రదర్' షోలో సుధీర్‌ను, 'ఎక్సట్రా జబర్దస్త్'లో రష్మీను 'బుల్లెట్' భాస్కర్ ఫాదర్ 'మీ పెళ్లి ఎప్పుడు?' అని అడిగాడు. ఇద్దరూ సమాధానం దాటవేశారు. రియల్ లైఫ్‌లో ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో, అసలు చేసుకోరో తెలియదు గానీ... రీల్ లైఫ్‌లో ఇంకోసారి సుధీర్, రష్మీ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు సుధీర్, రష్మీ పెళ్లికి 'హైపర్' ఆది పెద్ద. ఎందుకంటే... ఈసారి వాళ్ళిద్దరి పెళ్లి చేసింది అతడే. ప్రతి వారం తన స్కిట్‌లో సమ్‌థింగ్ వుండేలా చూసుకోవడం ఆది స్పెషాలిటీ. ఎవరో ఒకరిని అతిథులుగా తీసుకొస్తాడు. జూలై 15న టెలికాస్ట్ కానున్న జ‌బ‌ర్ద‌స్త్‌ ఎపిసోడ్ కోసం సుధీర్, రష్మీ, దీపికా పిల్లిని తీసుకొచ్చాడు. స్కిట్‌ను కూడా మ్యారేజ్ థీమ్‌లో డిజైన్ చేశాడు. అందులో సుధీర్ - రష్మీ, ఆది - దీపికా పెళ్లి చేసుకోబోతున్న జంటలుగా కనిపించారు. 'ఆ సూర్య రశ్మిలు వున్నంత కాలం ఈ సుధీర్, రష్మీలు అలాగే వుంటారు' అని సుధీర్ డైలాగ్ చెప్పడం గమనార్హం. దానికి 'రాత్రి ఎక్కడ వుంటాడు?' అని ఆది కౌంటర్ వేయడం, ఎప్పటిలా ప్లేబాయ్ ఇమేజ్ కంటిన్యూ చేస్తూ... 'పదిన్నర అయ్యింది. ఏంటిమరి?' అని రష్మీని సుధీర్ అడగటం ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. 

హరి గుండెలపై 'అషు'! చాచి కొట్టింది బాసూ!

  డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయిన అషురెడ్డి.. బిగ్ బాస్ షోతో మరింత పాపులారిటీ దక్కిచుకుంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ టాటూని తన ఎదపై వేయించుకొని సోషల్ మీడియాలో హల్చల్ చేసింది . ఈ మధ్యకాలంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఎఫైర్ పెట్టుకుందంటూ ఆమెపై ఓ రూమర్ చక్కర్లు కొడుతుంది. వాటిని ప్రమోషన్స్ కోసం వాడేసింది అషురెడ్డి. సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు, వీడియోలతో రచ్చ చేసే ఈ బ్యూటీ స్టార్ మాలో 'కామెడీ స్టార్స్' అనే షోలో పాల్గొంటుంది.  ఈ షోలో కమెడియన్ హరితో కలిసి సందడి చేస్తుంటుంది అషురెడ్డి. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో హరి.. అషురెడ్డికి పెద్ద షాకే ఇచ్చాడు. ఈ మధ్య వీరిద్దరూ కలిసి స్కిట్ లు చేస్తుండడంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటికి మ‌రింత‌ బలాన్ని చేకూరుస్తూ హరి తన గుండెలపై అషురెడ్డి పేరుని టాటూగా వేయించుకున్నాడు.  ముందుగా అషురెడ్డి వెంటపడే వ్యక్తిగా స్కిట్ చేసిన హరి.. ''నువ్ ఛీ కొట్టినా, చెంపమీద కొట్టినా.. నీ వెనకాలే తిరిగి నువ్వే కావాలనుకుంటున్నాను చూశావా? అందులోనే నిజమైన ప్రేమ ఉంది.. అమ్మాయి ప్రేమ కళ్లల్లో కనిపిస్తుంది.. కానీ అబ్బాయి ప్రేమ కన్నీళ్లలో మాత్రమే కనిపిస్తుంది'' అంటూ భారీ డైలాగ్‌లు పలికిస్తూ.. ''నిన్ను ఎంతలా గుర్తుపెట్టుకున్నానో తెలుసా.. నువ్ ఎప్పటికీ నా గుండెలపై ఉండిపోయేంతలా.." అంటూ తన గుండెలపై ఉన్న అషురెడ్డి పచ్చబొట్టును చూపించాడు. అది చూసి బిత్త‌ర‌పోయింది అషు. స్కిట్ కోసం కాదని.. నిజంగానే టాటూ వేయించుకున్నానని హరి ఎమోషనల్ అవుతూ చెప్పడంతో అషురెడ్డి అతడి చెంపపై కొట్టింది.  హ‌రి టాటూ వేయించుకోవ‌డం చూసి అక్క‌డున్న జ‌డ్జిలు స‌హా అంద‌రూ షాకైపోయారు. హ‌రి దీన్ని స్కిట్ లో భాగంగా చేశాడా..? లేక నిజంగానే అషుపై ప్రేమ‌తో అలా ప‌చ్చ‌బొట్టు పొడిపించుకున్నాడా..? అనే ఈ విష‌యం ఈరోజు మ‌ధ్యాహ్నం మ‌న‌కు తెలుస్తుంది.

షణ్ముఖ్‌తో దీప్తి బ్రేకప్..?

  డబ్ స్మాష్ వీడియోలతో ఫేమస్ అయిన దీప్తి సునైనా.. బిగ్ బాస్ షోలో పాల్గొని తన ఫాలోయింగ్ పెంచుకుంది. ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు, స్పెషల్ ఆల్బమ్స్ అంటూ బిజీగా గడుపుతోంది. అయితే చాలాకాలంగా దీప్తి సునైనా.. యుట్యూబ‌ర్ షణ్ముఖ్ తో ప్రేమలో ఉందంటూ వార్తలొస్తున్నాయి. ఈ వార్తలను వీరిద్దరూ ఎప్పుడూ ఖండించలేదు. అలా అని ప్రేమలో ఉన్నట్లు కూడా ఎప్పుడూ బ‌హిర్గ‌తం చేయ‌లేదు. కానీ వీరిద్దరి పోస్ట్ లు, సన్నిహితంగా మెలిగే తీరు చూస్తుంటే ప్రేమలో ఉన్నారనే సందేహాలు కలగక మానవు. అయితే ఇప్పుడు దీప్తి సునైనా చేసిన ఓ పోస్ట్ మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మామూలుగానే దీప్తి సునైనా ఫుడ్ లవర్. ఆమెకి తినడమంటే చాలా ఇష్టం. ఎక్కువగా వర్కవుట్లు చేసేది కూడా తినడానికే అని చెబుతుంటుంది.  తాజాగా ఈమె ఓ మీమ్ షేర్ చేస్తూ కామెంట్ పెట్టింది. అందరూ ప్రేమలో పడుతున్నారు కానీ తను మాత్రం ఈ తినడం గోలలోనే ఉండిపోయాననే అర్థం వచ్చేలా ఓ మీమ్‌ను షేర్ చేసింది. ఈ పోస్ట్ ద్వారా తను ప్రేమలో లేననే విషయాన్ని చెప్పకనే చెబుతోంది దీప్తి సునైనా. దీంతో దీప్తికి షణ్ముఖ్‌తో బ్రేకప్ జరిగిందా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. రీసెంట్‌గా అభిమానులతో ముచ్చటించిన దీప్తి.. ఐదేళ్ల తరువాత పెళ్లి చేసుకుంటానని చెప్పారు. 

విష్ణుప్రియకి కాబోయే భర్త ఎలా ఉండాలంటే..?

  షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ ఆ తరువాత బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో కొన్ని షోలు చేసినప్పటికీ ఆమెకి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ సుడిగాలి సుధీర్ తో కలిసి చేసిన 'పోవే పోరా' అనే షో ఆమెకి పాపులారిటీ తీసుకొచ్చింది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తుంటుంది. మరోపక్క యూట్యూబ్ ఛానెల్ ద్వారా మరికొంతమందికి దగ్గరైంది.  ఈ లాక్ డౌన్ సమయంలో తన స్నేహితురాలు శ్రీముఖితో కలిసి ఆమె చేసిన డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఈ మధ్యకాలంలో స్కిన్ షో చేస్తూ రచ్చ చేస్తోంది విష్ణుప్రియ. ప్రస్తుతం డైటింగ్ చేస్తున్న‌ విష్ణుప్రియ తన అందాలు ప్రదర్శిస్తూ పలు వీడియోలు షేర్ చేస్తోంది. వీటికి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.  ఇదిలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో తన ఫాలోవర్లతో ముచ్చటించింది. ఈ క్రమంలో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెబుతూ కొన్ని కామెంట్స్ చేసింది. తనకు 'ఆషికి 2' సినిమాలో హీరో ఆదిత్యరాయ్ కపూర్ లాంటి వ్యక్తి భర్తగా కావాలని.. "ఈ జన్మలో కాకపోయినా.. వచ్చే జన్మలో అయినా ఇలాంటి వ్యక్తిని భర్తగా ప్రసాదించు దేవుడా" అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం విష్ణుప్రియ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

దేత్త‌డి హారిక గురించి మీకు తెలీని విష‌యాలు.. ఆమె పెళ్లెప్పుడంటే...

  'దేత్త‌డి' హారిక ఇప్పుడొక‌ సెల‌బ్రిటీ. యాంక‌ర్‌గా ఉన్న‌ప్పుడు కంటే బిగ్ బాస్ షోకి వెళ్లాకే ఆమెకు ఆ సెల‌బ్రిటీ హోదా వ‌చ్చింది. హారిక ఎలా ఎదుగుతూ వ‌చ్చింద‌నేది ఆస‌క్తిక‌రం. చిన్న‌ప్పుడు మంచిగా పాట‌లు పాడుతోంద‌ని హారిక రెండున్న‌రేళ్ల వ‌య‌సులోనే ఉండ‌గా సంగీతం నేర్పించాల‌ని చూశారు ఇంట్లోవాళ్లు. సెకండ్ క్లాస్‌లోకి వ‌చ్చేదాకా నేర్చుకుంది కానీ హై పిచ్‌లో పాడుతుంటే హారిక‌కు త‌ల‌నొప్పి వ‌చ్చేసేది. దాంతో ఏడ్చేసేది హారిక‌. ఇది చూసి సంగీతం టీచ‌ర్ తిట్టేది. అందువ‌ల్ల‌నేమో ఆమెకు సంగీతం మీద ఆస‌క్తిపోయింది. సంగీతం క్లాసుల‌కు వెళ్తుంటే త‌ల‌నొప్పి రావ‌డం చూసి, త‌ల‌కు ఏమైనా అవుతుందేమోన‌ని భ‌య‌ప‌డి, సంగీతం మాన్పించేశారు వాళ్ల‌మ్మ జ్యోతి. ఆమె భ‌ర్త నుంచి విడిపోయారు. పిల్ల‌లిద్ద‌ర్నీ త‌నే పెంచి పెద్ద‌చేశారు. హారిక త‌ల్లి క‌రీంన‌గ‌ర్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చి స్థిర‌ప‌డ్డారు. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు.. వంశీ కార్తీక్‌, అలేఖ్య హారిక‌. వంశీ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌. హారిక బిగ్ బాస్ షోలో ఉన్న‌ప్పుడు ఆమె త‌ర‌పున సోష‌ల్ మీడియాలో మంచి ప్రాప‌గాండా చేశాడు. హారిక హైద‌రాబాద్‌లోనే పెరిగింది. డాన్స్‌ మీద అస‌క్తి చిన్న‌ప్ప‌ట్నుంచే ఉంది. త‌ను హిమాయ‌త్‌న‌గ‌ర్‌లోని హార్వ‌ర్డ్ ప‌బ్లిక్ స్కూల్‌లో చ‌దువుకుంది. డాన్స్ కాంపిటిష‌న్స్‌లో పార్టిసిపేట్ చేసేది. డాన్స్ కోసం క్లాసులకు కూడా బంకు కొట్టేసేది. హారిక చ‌దువుకున్న స్కూల్లోనే ఆమె త‌ల్లి టీచ‌ర్‌గా చేయ‌డం గ‌మ‌నార్హం. ఆమె ఎం.ఏ. పొలిటిక‌ల్ సైన్స్ చ‌దువుకున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉద్యోగం రావ‌డంతో ఆమె టీచ‌ర్ ప‌ని వ‌దిలేశారు. హారిక సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఇంజ‌నీరింగ్‌లో చ‌దువుకున్నాక‌, కొంత కాలం అమెజాన్‌లో ఉద్యోగం చేసింది. హారిక‌కు ఊరికే ఇంట్లో కూర్చోవాలంటే ఆమె చేత‌కాదు. ఎప్పుడూ ఏదో ఒక ప‌నిచేస్తుండాల‌నే మ‌న‌స్త‌త్వం ఆమెది. ఇప్పుడ‌ప్పుడే పెళ్లి చేసుకొనే ఉద్దేశం ఆమెకు లేదు. ప్ర‌స్తుతం ఆమె దృష్టంతా ప‌నిమీదే. ఇటీవ‌లే ఒక వెబ్ సిరీస్ చేసింది. కెరీర్‌లో సంతృప్తి చెందాక ఆమెకు పెళ్లి చేస్తామ‌ని వాళ్ల‌మ్మ చెప్పారు. ఒకసారి తాను ఒక‌రితో ప్రేమ‌లో ఉన్నాన‌నీ, నాలుగేళ్ల త‌ర్వాత అత‌నితో బ్రేక‌ప్ అయ్యింద‌నీ బిగ్ బాస్ హౌస్‌లో ఉండ‌గా బ‌య‌ట‌పెట్టి సంచ‌ల‌నం సృష్టించింది హారిక‌. ఆ విష‌యం తొలిసారి వాళ్ల‌కు ఆమె చెప్పింది ఆ ప్లాట్‌ఫామ్ నుంచే. ఆమె త‌ల్లి ఒక ఐదేళ్ల పాటు హిమ‌య‌త్ న‌గ‌ర్‌లో ఒక బౌటిక్‌ న‌డిపి, ఫ్యామిలీని మ‌ణికొండ‌కు షిఫ్ట్ చేయ‌డంతో ఇటీవ‌లే దాన్ని తీసేశారు. ఇప్పుడామె హారిక యూట్యూబ్ చాన‌ల్ కోసం వీడియోలు చేసే ప‌నిలో ఉన్నారు.

ఇదిగో.. హ‌రితేజ చిన్నారి కూతురు భూమి!

  ఇటు బుల్లితెర‌, అటు వెండితెర‌.. రెండింటిపైనా రాణిస్తోన్న హ‌రితేజ‌కు ఇటీవ‌ల ఓ పండింటి పాప‌కు జ‌న్మ‌నిచ్చింది. ఆమెకు భూమి అనే పేరు కూడా పెట్టింది. అయితే ఇంత‌దాకా పాప ముఖాన్ని ప్ర‌పంచానికి చూపించ‌లేదు హ‌రితేజ‌. ఈరోజు శుక్ర‌వారం (జూన్ 9) పాప‌ను అంద‌రికీ ప‌రిచ‌యం చేసింది. త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా పాప ఫొటోల‌ను కొన్నింటిని ఆమె షేర్ చేసింది. ఆ ఫొటోల‌కు "Meet Ms Bhoomi Deepak Rao" అనే క్యాప్ష‌న్ జోడించింది. హ‌రితేజ షేర్ చేసిన ఫొటోల‌లో బ్యూటిఫుల్‌ భూమి భిన్న ర‌కాల హావ‌భావాల‌తో ద‌ర్శ‌మివ్వ‌డం విశేషం. ఒక ఫొటోలో ఆశ్చ‌ర్యంగా క‌ళ్లు పెద్ద‌వి చేసుకొని చూస్తూ, ఇంకో ఫొటోలూ న‌వ్వుతూ, మ‌రో ఫొటోలో ఆస‌క్తిగా దేన్నో చూస్తూ.. ఎంత ముచ్చ‌ట‌గా ముద్దొస్తూ ఉందో!  తెర‌మీద హాస్యాన్ని పండిస్తూ వస్తున్న హ‌రితేజ సోష‌ల్ మీడియాలోనూ న‌వ్వులు పూయిస్తుంటుంది. అయితే అందుకు భిన్నంగా డెలివెరీ సమయంలో తాను పడిన కష్టాల గురించి హరితేజ చెప్పిన విషయాలు అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశాయి. కొద్ది రోజుల క్రితం పాప మొహాన్ని చూపించకుండా హరితేజ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. 'భూమి దీపక్ రావ్' అంటూ పెట్టిన పేరుకి వివరణ కూడా ఇచ్చింది. ''భూమి అంటే సహనంతో ఉంటుందని అనుకుంటున్నారు.. కానీ వాళ్లకేం తెలుసు సహనాన్ని పరీక్షిస్తే భూకంపాలే'' అని తన బిడ్డ చెబుతున్నట్టుగా హరితేజ చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది.

'బిగ్ బాస్ 5'లో సీరియల్ హీరోయిన్!

  ఇప్పటివరకు నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు ఐదో సీజన్ కోసం రెడీ అవుతోంది. ఈసారి పేరున్న సెలబ్రిటీలను తీసుకొచ్చి హైప్ పెంచాలని చూస్తోంది బిగ్ బాస్ టీమ్. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీల పేర్లను పరిశీలించారు. కామెడీని పండించడానికి ఒకరు, గ్లామర్ షో చేయడానికి మరొకరు, ఫైర్ బ్రాండ్ లాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్లని ఇలా అన్ని ఎమోషన్స్ ను పండించేవారిని ఒక్కొక్కరిగా ఎంపిక చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ ఐదో సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా బుల్లితెర నటి, యాంకర్ సిరి హన్మంత్ కూడా బిగ్ బాస్‌లో ఎంట్రీ ఇవ్వబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. మొదట్లో యాంకర్‌గా మెరిసిన సిరి ఆ తరువాత సీరియల్స్ వైపు అడుగులేసింది.  పలు షోలకు హాజరవుతూ ఇప్పుడిప్పుడే పాపులారిటీ పెంచుకుంటున్న ఆమెకి బిగ్ బాస్ షో నుండి కాల్ వచ్చిందట. అయితే ఈ విషయంలో ఆమె ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరి ఈ ఆఫర్‌ను ఆమె ఒప్పుకుంటుందో లేదో చూడాలి. మరోపక్క హీరోయిన్ ఇషా చావ్లా, యాంకర్ లోబోను కూడా ఈ షోలో తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. 

లైఫ్‌లో శ్రీ‌ముఖి చేసిన పెద్ద తప్పు ఇదే!

  బుల్లితెరపై రాములమ్మగా సూపర్ పాపులారిటీ దక్కించుకున్న శ్రీముఖి.. వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న తరువాత ఆమె ఇమేజ్ కాస్త మారిపోయింది. గతంలో వరుస టీవీ షోలతో ఎంతో బిజీగా ఉన్న ఈమె ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. అప్పుడప్పుడు షోలలో గెస్ట్ గా కనిపిస్తోందే తప్ప హోస్ట్‌గా మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.  అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈమె చాలా యాక్టివ్ గా ఉంటోంది. తన హాట్ హాట్ ఫోటోలు, డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. ఇక శ్రీముఖి ప్రేమ సంగతుల గురించి తెలిసిందే. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితో ఒక‌ప్పుడు రిలేషన్ లో ఉన్నట్లు.. కానీ తరువాత బ్రేకప్ అయిందని బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు చెప్పుకొచ్చింది.  తాజాగా ఈ బ్యూటీ తన ఫాలోవర్లతో ముచ్చటించింది. ఇందులో భాగంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది. ముందుగా ఓ నెటిజన్.. ''జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఏంటి..?'' అని అడిగాడు. దానికి ఆమె.. ''జనాలను త్వరగా నమ్మడం, ప్రేమించడం'' అంటూ చెప్పుకొచ్చింది. మరో నెటిజన్ 'మీ జీవితంలో ప్రేమ కథలు ఉన్నాయా..?' అని అడగ్గా.. అమేజింగ్ స్టోరీస్ ఉన్నట్లు చెప్పుకొచ్చింది. 

ప‌వన్ కళ్యాణ్‌తో సినిమా మిస్స‌యిన‌ 'కార్తీకదీపం' డైరెక్టర్!

  టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని  దర్శకులందరూ కోరుకుంటారు. ఆయనకున్న క్రేజ్ అలాంటిది. అయితే అలాంటి క్రేజీ ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందని చెబుతున్నారు 'కార్తీకదీపం' దర్శకుడు కాపుగంటి రాజేంద్ర. బుల్లితెరపై తన సీరియల్ తో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ దర్శకుడు గతంలో 'అందం', 'బంగారు బొమ్మ' అనే సీరియల్స్ ను తెరకెక్కించారు. అలానే ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్నాళ్లు పని చేశారు. అనంతరం మెగాఫోన్ పట్టుకొని మోహన్ బాబుతో 'శివ శంకర్', అల్లరి నరేశ్‌తో 'రాంబాబు గాడి పెళ్లాం' అనే సినిమా చేశారు. దర్శకుడిగా అనుభవం సంపాదించిన తరువాత ఈయనకు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందట. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ నిర్మాతగా సినిమా ప్లాన్ చేశారు కూడా. కానీ ఆ సినిమా ఛాన్స్ వచ్చినట్లే వచ్చి రెండుసార్లు ఆగిపోయిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.  ఇక 'కార్తీకదీపం' సీరియ‌ల్‌ విషయంలో తనపై వస్తోన్న కంప్లైంట్స్, ట్రోల్స్ పై స్పందిస్తూ.. ఆ సీరియ‌ల్‌లో ప్ర‌తి పాత్ర‌ను ప్రేక్షకులు ఓన్ చేసుకోవడం వలనే ఇలాంటి స్పందనలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. 

ప్రదీప్‌కి శ్రీముఖి లవ్ ప్రపోజల్! కెమిస్ట్రీ వ‌ర్క‌వుట్‌!!

  బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో యాంకర్ ప్రదీప్ ఒకరని చెప్పాలి. ప్రదీప్ పెళ్లిపై ఏకంగా ఓ టీవీ షో కూడా చేసేశారు. ఎప్పటికప్పుడు ప్రదీప్ పెళ్లి విషయం హాట్ టాపిక్ అవుతుంటుంది. ఇదిలా ఉండగా.. చాలా రోజులుగా శ్రీముఖి-ప్రదీప్ మధ్య కెమిస్ట్రీ పండించే విధంగా కొన్ని షోలను ప్లాన్ చేస్తున్నారు. కానీ అవేవీ వర్కవుట్ అవ్వడం లేదు. ఈసారి ఏకంగా ఓ షోలో శ్రీముఖితో ప్రదీప్‌కి లవ్ ప్రపోజల్ చేయించారు.  తాజాగా విడుదలైన 'డ్రామా జూనియర్స్ - ద నెక్స్ట్ సూపర్ స్టార్' అనే షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తోన్న ఈ షోలో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. ముందుగా అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ముసుగు వేసుకొని వచ్చింది.  'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమాలో 'అందాలలో అహో మహోదయం' అనే పాటకు ప్రదీప్ చుట్టూ తిరుగుతూ డాన్స్ చేసింది. అనంతరం నీకొక విషయం చెప్పాలంటూ "ఐ లవ్యూ" చెప్పేసింది. అది విన్న ప్రదీప్ తెగ సిగ్గుపడిపోయాడు. ఈ సీన్ చూసిన సింగర్ సునీత, అలీ, ఎస్వీ కృష్ణారెడ్డి ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇమ్మానుయేల్ ముందే వర్షను ముద్దాడిన బుల్లెట్ భాస్క‌ర్‌!

  బుల్లితెరపై లవ్ ట్రాక్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'జబర్దస్త్' షోలో లవ్ ట్రాక్ లతో సెపరేట్ షోలు కూడా చేసేస్తున్నారు. గతంలో రష్మీ-సుధీర్ లకు పెళ్లి చేసిన 'జబర్దస్త్' టీమ్ రీసెంట్ గా ఇమ్మాన్యుయేల్-వర్షలకు పెళ్లి చేసేసారు. ప్రదీప్-శ్రీముఖి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ చేద్దామని చూస్తున్నా కుదరడం లేదు. ప్రస్తుతానికైతే ఇమ్మానుయేల్-వర్ష జంటతో స్కిట్లు చేసేస్తున్నారు.  మొన్నామధ్య కెవ్వు కార్తిక్ ఈ జంటను తన స్కిట్ లో వాడేశాడు. ఇందులో కార్తీక్.. వర్షతో రొమాన్స్ చేస్తూ ఉంటే.. ఫ్రస్ట్రేటెడ్ లవర్ బాయ్ గా ఇమ్మాన్యుయేల్ కనిపించాడు. తాజాగా బుల్లెట్ భాస్కర్ కూడా ఇదే ఫార్ములా వాడేశాడు. వచ్చే వారం ప్రసారం కానున్న 'ఎక్స్ట్రా జబర్దస్త్' ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో బుల్లెట్ భాస్కర్ తన తండ్రిని కూడా తీసుకొచ్చారు.  మొదటిసారి ఇలా తన తండ్రితో కలిసి స్కిట్ వేస్తున్నాడు. అయితే ఇందులో ఇమ్మాన్యుయేల్ కు జోడీగా మరొకరిని సెట్ చేసిన భాస్కర్ తనకు జోడీగా వర్షను సెలెక్ట్ చేసుకున్నాడు. భార్యాభర్తలుగా వర్ష-బుల్లెట్ భాస్కర్ లను చూసి తట్టుకోలేకపోయాడు ఇమ్మాన్యుయేల్. అతడిని ఉడికించడానికి బుల్లెట్ భాస్కర్ ఏకంగా వర్ష చేతికి ముద్దు కూడా పెట్టాడు.  "కాఫీ తాగుతారా?  టీ తాగుతారా?" అని వ‌ర్ష అడిగితే, "డార్లింగ్.. నీ చేత్తో విష‌మిచ్చినా కూడా స్వీట్‌గా ఉంటుంది." అంటూ ఆమె చేయి అందుకుని, చ‌ప్పుడు వ‌చ్చేలా ముద్దు పెట్టుకున్నాడు భాస్క‌ర్‌. ప‌క్క‌నే కూర్చొని ఉన్న ఇమ్ము ఉడుక్కుంటూ "భాస్క‌ర్‌.. ఇందుకేనా టీమ్‌ను మార్చింది?" అంటూ కామెంట్ చేశాడు ఇమ్మాన్యుయేల్.  

ఓంకార్ షోలో కూతురితో కలిసి ప్ర‌త్య‌క్ష‌మైన బండ్ల గ‌ణేశ్‌!

  ఓంకార్ ప్ర‌యోక్త‌గా స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతోన్న సిక్స్త్ సెన్స్ సీజన్ 4 కి టీవీ సెలెబ్రిటీలను గెస్ట్ లుగా తీసుకొస్తున్నారు. తాజాగా ఈ షోకి నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ వచ్చారు. ఎప్పటిలానే షోలోకి ఎంట్రీ ఇవ్వగానే.. ''వెంకటేశ్వర స్వామికి ఏం ఉత్సవాలు చేస్తారో.. డాలర్ శేషాద్రికి తెలియదా.. అలాగే పవర్ స్టార్ గురించి బండ్ల గణేష్‌కి తెలియదా.. ఆయన నా దేవర‌.. నా ఆస్తి.. నా సర్వస్వం.. ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.." అంటూ పవన్ క‌ల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.  అయితే ఈ షోకి బండ్ల గణేష్ తనతో పాటు తన కూతురు జననిని కూడా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తన కూతురు జనని కోరిన రెండు  కోరికలను బయటపెట్టారు. తన కూతురు వయసు 18 ఏళ్లు అని.. ఈ 18 ఏళ్లలో తనను రెండే ప్రశ్నలు అడిగిందని చెప్పారు. "అందులో ఒకటి.. పవన్ కళ్యాణ్ తో మళ్లీ బ్లాక్‌బస్టర్ సినిమా ఎప్పుడు తీస్తావ్..? రెండోది.. ఓంకార్ అన్నయ్య షోకి వెళ్తే నన్ను కూడా తీసుకెళ్లు అని.. అందుకే నా కూతుర్ని షోకి తీసుకొచ్చా.. అదీ నీకున్న క్రెడిబిలిటీ.ష‌ అంటూ ఓంకార్ పై ప్రశంసలు కురిపించాడు బండ్ల గణేశ్‌.  ఈ మధ్యకాలంలో బండ్ల గణేశ్‌ తన స్పీచ్ లతో అదరగొడుతున్నాడు. ఆయన ఎక్కడ ఏం మాట్లాడినా సంచలనం అవుతోంది. ఇప్పుడు సిక్స్త్ సెన్స్ షోలో కూడా తన మార్క్ చూపించి అదరగొట్టాడు. తన కూతురుని మొదటిసారి ఆన్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చి పరిచయం చేశారు. ఈ షోలో బండ్ల గ‌ణేశ్ ఇంకేం మాట్లాడారో చూడాలంటే వ‌చ్చే శ‌ని, ఆదివారాల్లో రాత్రి 9 గంట‌ల‌కు స్టార్ మాలో ప్ర‌సారం కానున్న ఎపిసోడ్ చూడాల్సిందే. 

నాకూ క్యాస్టింగ్ కౌచ్ సంద‌ర్భం ఎదుర‌య్యింది: 'కార్తీకదీపం' ప్రియ‌మ‌ణి !

  సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో మహిళలను లైంగికంగా వంచిస్తున్నారని ఇప్పటికే చాలా మంది నటీమణులు బహిరంగంగా కామెంట్స్ చేశారు. 'మీటూ' పేరుతో ఓ ఉద్యమం కూడా చేశారు. తాజాగా ఇదే అంశంపై 'కార్తీకదీపం' సీరియల్ లో పనిమనిషి ప్రియమణి పాత్ర‌ను చేస్తున్న శ్రీ‌దివ్య‌ కొన్ని కామెంట్స్ చేసింది. రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తన కెరీర్ సంగతులతో పాటు క్యాస్టింగ్ కౌచ్ విషయాలపై స్పందించింది.  'కమిట్మెంట్' అనేది ఇండస్ట్రీలో ఉంటుందని.. తాను కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నట్లు ఆమె చెప్పింది. ఇండస్ట్రీకి వచ్చే ప్రతి అమ్మాయికి ఇలాంటి సందర్భం ఏదొక చోట ఎదురవుతూనే ఉంటుందని.. అయితే అందుకు అంగీకారం తెలపడమా..? లేదా అనేది వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని రంగాల్లో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉందని.. ఒక అమ్మాయి బయట పని చేస్తుందంటే కచ్చితంగా ఏదొక సమస్య ఉంటుందని చెప్పింది ప్రియమణి.  అయితే లైంగిక దోపిడీ విషయంలో వార్నింగ్ లాంటివి ఇస్తే ఇక కెరీర్ అక్కడితో ముగిసిపోతుందని ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తన విషయంలో క్యాస్టింగ్ కౌచ్ సందర్భాలు ఎదురైనప్పుడు సింపుల్ గా నవ్వుతూ బయటకొచ్చానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె 'పుష్ప' సినిమాలో నటిస్తున్నట్లు చెప్పింది. అందులో కూడా పనిమ‌నిషి క్యారెక్టరే అని.. రియల్ లైఫ్ లో పనిమనిషి ఎలా ఉంటుందో అచ్చం అలాగే కనిపిస్తానని చెప్పుకొచ్చింది. 

తల్లి కాబోతున్న బుల్లితెర పాపుల‌ర్ నటి!

  బుల్లితెర నటి చైత్ర రాయ్ తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. పలు సీరియల్స్‌లో హీరోయిన్ గా నటించి తెలుగువారికి దగ్గరైంది చైత్ర. 'అష్టా చమ్మా' సీరియల్‌తో మంచి పాపులారిటీ సంపాదించిన ఈ బ్యూటీ కన్నడ ఇండస్ట్రీలో సైతం ఆఫర్లు దక్కించుకుంది. అయితే సడెన్‌గా ఆమె తెలుగు సీరియల్స్‌లో నటించడం మానేసి, ఇండ‌స్ట్రీలోని అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఒకప్పుడు 'ఒకరికి ఒకరు', 'మనసున మనసై', 'దటీజ్ మహాలక్ష్మీ' ఇలా వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉండేది చైత్ర.  'అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు' సీరియల్‌లో నటిస్తోన్న సమయంలో ఆమె వ్యక్తిగత కారణాల వలన బయటకి వచ్చేసింది. కొంత గ్యాప్ తీసుకుంటున్నానని ప్రకటించింది. అలా చాలా కాలంగా సీరియళ్ల‌కు దూరంగా ఉంటోన్న చైత్ర ఇప్పుడొక గుడ్ న్యూస్ చెప్పింది. తన జీవితంలో కొత్త దశ ప్రారంభం కానుందని చెబుతూ ఎమోషనల్ అయింది.  తాను తల్లి కాబోతున్న విషయాన్ని చెబుతూ.. కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ''త్వరలోనే బేబీ చైత్ర ప్రసన్న రాబోతుంది.. నా భర్త ప్రసన్నతో కలిసి ఈ విషయాన్ని షేర్ చేసుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను.. మీ ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి. మా జీవితాల్లో కొత్త చాప్ట‌ర్‌కు ప్రిపేర్ అవుతున్నాం. నా లైఫ్‌లో అత్యంత అంద‌మైన ద‌శ‌ను అనుభ‌విస్తున్నా'' అంటూ రాసుకొచ్చింది. చైత్ర రాయ్ షేర్ చేసిన బేబీ బంప్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.