ఇద్దర్ని మెయింటైన్‌ చేసే డాక్టర్‌బాబు అది చెయ్యలేడా?

  బుల్లితెరపై విజయవంతంగా దూసుకువెళ్తున్న ధారావాహికల్లో ‘కార్తీక దీపం’ సీరియల్‌ ముందువరుసలో ఉంటుంది. అందులో డాక్టర్‌బాబు అలియాస్‌ కార్తీక్‌ పాత్రలో నటిస్తున్న నిరుపమ్‌ పరిటాల సైతం విజయవంతమైన బుల్లితెర నటుల్లో ఒకరు. ఆయనకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ తక్కువేం కాదు. బుల్లితెరపై ఆయనొక స్టార్‌. ఆయనతో పాటు తమ ఛానల్‌లో సీరియళ్లు చేస్తున్న స్టార్స్‌తో ‘స్టార్‌మా పరివార్‌ ఛాంపియన్‌షిప్‌’ పేరుతో ‘స్టార్‌మా’ ఛానల్‌ ఒక ఈవెంట్‌ చేస్తోంది. అందులోనూ నిరుపమ్‌ పరిటాల దూసుకువెళ్తున్నారు. ‘స్టార్‌మా పరివార్‌ ఛాంపియన్‌షిప్‌’ ఈవెంట్‌లో భాగంగా గేమ్స్‌ నిర్వహించారు. అందులో నిరుపమ్‌ విన్‌ అయ్యారు. ‘డాక్టర్‌బాబు... ఏంటి? మీ చేతిలో ఇంత మిరాకిల్‌?’ అని యాంకర్‌ శ్రీముఖి అడిగింది. ‘వంటలక్క’ అని పక్కనుంచి సమాధానం. ‘ఇద్దర్ని మెయింటైన్‌ చేస్తున్నాడు.  అది చెయ్యలేడా’.. ప్రభాకర్‌ సెటైర్‌. దాంతో అందరూ ఒక్కసారి ఘొల్లున నవ్వారు. ‘శ్రీముఖి... ఇప్పుడు కూడా రెండేసి బ్యాలెన్స్‌ చేశారు’ – ఇంకో ఆర్టిస్ట్‌ పాయింటవుట్‌ చేశారు. ‘నీ కాళ్లకు ఓ దండం తల్లి’ అన్నట్టు నిరుపమ్‌ దణ్ణం పెట్టారు. ‘కార్తీక దీపం’ సీరియల్‌లో కథను అడ్డం పెట్టుకుని ‘స్టార్‌మా పరివార్‌ ఛాంపియన్‌షిప్‌’ ఈవెంట్‌లో నిరుపమ్‌ పరిటాల మీద ప్రతి ఒక్కరూ పంచ్‌ డైలాగ్స్‌ మీద పంచ్‌ డైలాగ్స్‌ వేస్తున్నారు. పాపం... ఎవర్నీ ఏమీ అనలేక, మౌనంగా భరిస్తున్నాడు డాక్టర్‌బాబు.

రోజుకు భావ‌న సంపాద‌న ఎంతో తెలుసా?!

  దాదాపు ఒక‌టిన్న‌ర ద‌శాబ్ద కాలం నుంచీ టీవీ వీక్ష‌కుల‌కు భావ‌న తెలుసు. న‌టిగా, ప్ర‌యోక్త‌గా తెలుగువారికి బాగా ద‌గ్గ‌రైన తార‌ల్లో భావ‌న ఒక‌రు. మొద‌ట్లో హీరోయిన్‌గా సీరియ‌ల్స్‌లో క‌నిపించిన ఆమె, ఇప్పుడు నెగ‌టివ్ రోల్స్‌లో, ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపిస్తోంది. ఇంత కాలం టీవీ ఇండ‌స్ట్రీలో ఉంది కాబట్టి ఆమె బాగానే సంపాదించి ఉంటుంద‌నేది చాలామంది అభిప్రాయం. ఆమె రెమ్యూన‌రేష‌న్ ఎంత తీసుకుంటుంద‌నే టాపిక్ కూడా ఇండ‌స్ట్రీలో న‌డుస్తుంటుంది.  ఆమె పారితోషికం ఎంత‌నే విష‌యం ప‌క్క‌న‌పెడితే త‌న ఆదాయంలో కొంత చారిటీకి వెచ్చించే మంచి ల‌క్ష‌ణం భావ‌న సొంతం. మ‌నం సైతం కోసం త‌న‌కు తోచిన‌ప్పుడ‌ల్లా వెయ్యో, రెండో వేలో ఇస్తూ ఉంటుంది. ఇలా ఒక్క‌సారి కాదు, ఆ గ్రూప్‌కు చాలా సార్లు ఆమె డ‌బ్బులు ఇచ్చింది. వీటిని ఇండ‌స్ట్రీలో ఎవ‌రికైనా ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తే, వారి చికిత్స కోసం వెచ్చిస్తుంటారు. సాధారణంగా సినీ, టీవీ సెల‌బ్రిటీల ఇళ్ల‌ల్లో పిల్ల‌ల బ‌ర్త్‌డేస్ వ‌స్తే గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేస్తుంటారు. కానీ భావ‌న అలాంటి సెల‌బ్రేష‌న్స్ చెయ్య‌లేదు. వాళ్ల పుట్టిన‌రోజు నాడు కేన్స‌ర్ హాస్పిట‌ల్‌లో ఉండే రోగుల‌కు భోజ‌నం పెడుతుంటుంది. గ‌త ఏడాది ఆమె ఇంకో మంచి ప‌నిచేసింది. మ‌న‌కు ఇష్ట‌మొచ్చిన ఫుడ్ త‌యారుచేసి వాళ్ల‌కు పెట్ట‌డం కంటే, వాళ్ల‌కు ఇష్ట‌మైన ఆహారాన్నే వాళ్ల‌తో తినిపించాల‌నే ఆలోచ‌న ఆమెకు వ‌చ్చింది. స్టార్ ఫౌండేష‌న్ ద్వారా వాళ్ల‌ను మ‌ధ్యాహ్నం హోట‌ల్‌కు ర‌ప్పించి.. దాదాపు 35 మందికి బిర్యానీ స‌హా ఎవ‌రికి ఏమేం తినాల‌నిపిస్తుందో, ఆ భోజ‌నం పెట్టించిందామె. వారి బిల్లు మొత్తం త‌నే చెల్లించింది. ఇలాంటి మంచి హృద‌యం భావ‌న‌ది. స‌రే ఇంత‌కీ భావ‌న రెమ్యూన‌రేష‌న్ ఎంత‌?  "ఒక సీరియ‌ల్‌కు రోజుకు 5 వేలు, ఇంకో సీరియ‌ల్‌కు 6 వేలు, మ‌రో సీరియ‌ల్‌కు 7 వేలు ఇస్తున్నారు. వీటిలో అసిస్టెంట్స్ క‌న్వీయ‌న్స్‌, టీడీఎస్‌, పెట్రోల్ ఖ‌ర్చులు లాంటివ‌న్నీ ఉంటాయి. చివ‌ర‌కు మిగిలేది చాలా త‌క్కువ." అని ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది భావ‌న‌.

వర్షిణి... వైఫ్‌ ఆఫ్‌ సుమంత్‌! ఇది నిజమే!!

  వర్షిణి... వైఫ్‌ ఆఫ్‌ సుమంత్‌! మీరు చదివింది నిజమే! అందులో ఏమాత్రం తప్పు లేదు. తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని సుమంత్‌ క్లారిటీ ఇచ్చారు కదా! మళ్లీ అతడికి వైఫ్‌ ఏంటని డౌటు పడుతున్నారా? సుమంత్‌కు వర్షిణి భార్య అయినది రియల్‌ లైఫ్‌లో కాదు, రీల్‌ లైఫ్‌లో! రెండో పెళ్లి చేసుకోవడం లేదని చెప్పిన సుమంత్‌, ప్రజెంట్‌ తాను చేస్తున్న సినిమా విడాకులు, మళ్లీ పెళ్లి చేసుకోవడం పాయింట్‌తో రూపొందుతోందని చెప్పిన సంగతి తెలిసిందే. సుమంత్‌ హీరోగా యాక్ట్‌ చేస్తున్న లేటెస్ట్‌ సినిమా ‘మళ్లీ మొదలైంది’. పెళ్లి, విడాకుల తర్వాత జీవితం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఇందులో నైనా గంగూలీ హీరోయిన్‌. అయితే, ఆమెతో పాటు ఫేమస్‌ యాంకర్‌ వర్షిణి కూడా యాక్ట్‌ చేస్తోంది. సుమంత్‌ వైఫ్‌ క్యారెక్టర్‌లో వర్షిణి కనిపించనుంది. సినిమాలో ఆమెకు ఇంపార్టెంట్‌ రోల్‌ దక్కిందట. హీరోయిన్‌గా వర్షిణి కెరీర్‌ స్టార్ట్‌ చేసినా... టీవీ షోలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ క్రేజీ సినిమాల్లో ఇంపార్టెంట్‌ రోల్స్‌ వచ్చాయి. సమంత ‘శాకుంతలం’తో పాటు సుమంత్‌ ‘మళ్లీ మొదలైంది’లో నటిస్తోంది. రెండూ అక్కినేని ఫ్యామిలీ స్టార్స్‌ సినిమాలు కావడం విశేషమే.

తింటానికి తిండిలేక‌, దానిమ్మ పిందెల‌తో క‌డుపు నింపుకున్న గెట‌ప్ శ్రీ‌ను!

  గెట‌ప్ శ్రీ‌ను గురించి ఇవాళ ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. జ‌బ‌ర్ద‌స్త్ షోతో క‌మెడియ‌న్‌గా అత‌ను వేరే లెవ‌ల్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అత‌ని ఫ్యాన్ ఫాలోయింగ్ త‌క్కువేమీ కాదు. నాగ‌బాబు సైతం గెట‌ప్ శ్రీ‌ను న‌ట సామ‌ర్థ్యం గురించి గొప్ప‌గా మాట్లాడిన సంద‌ర్భాలు ఎన్నో. అలాంటి గెట‌ప్ శ్రీ‌ను జ‌బ‌ర్ద‌స్త్‌లోకి రాక‌ముందు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తింటానికి తిండి లేక‌పోవ‌డంతో క‌డుపు మాడ్చుకున్న పూట‌లెన్నో. ఇంట్లో వాళ్ల మీద ఆధార‌ప‌డ‌కూడ‌ద‌నుకొని ఉపాధి కోసం సొంతూరి నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన శ్రీ‌ను వాళ్ల పిన్ని వాళ్లింట్లో కొద్ది కాలం ఉన్నాడు. ప‌గ‌లంతా ప‌ని కోసం వెతుక్కోడం.. ఇంటికి వ‌చ్చి పిన్ని ఆప్యాయంగా పెట్టే భోజ‌నం చేసేవాడు. శ్రీ‌ను బ‌ట్ట‌లు కూడా ఆమే ఉతికేది. కొన్ని రోజుల త‌ర్వాత శ్రీ‌ను రియ‌లైజ్ అయ్యాడు. ఎంత పిన్ని, చిన్నాన్న‌లైనా వాళ్ల‌కు ఎంతైనా త‌ను భార‌మే క‌దా అనుకున్నాడు. దాంతో బ‌య‌ట‌కు వ‌చ్చేసి, మ్యాగీ అనే త‌న ఫ్రెండ్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయాడు. ఇండ‌స్ట్రీలో శ్రీ‌ను మొట్ట‌మొద‌టి శ్రేయోభిలాషి, స్నేహితుడు అత‌నే. మ్యాగీ అప్పుడు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా చేస్తున్నాడు. మ్యాగీకి నాగోల్‌లో చిన్న స్థ‌లం ఉంది. అందులో ఓ మూల రేకుల షెడ్డు ఉండేది. అందులోనే ఇంకో మూల బాత్‌రూమ్ ఉండేది. దానికి త‌లుపు కాకుండా క‌ర్టెన్ అడ్డంగా ఉండేది. అక్క‌డ ఉంటూ వ‌చ్చాడు శ్రీ‌ను. మ్యాగీ కూడా ఇంట్లో వాళ్ల‌మీద ఆధార‌ప‌డ‌కూడ‌ద‌నుకొని వ‌చ్చిన‌వాడే. ఆ ఇద్ద‌రూ క‌లిసి నాగోల్ నుంచి హైద‌రాబాద్‌కు ఇంకో దిక్కున ఉండే మియాపూర్‌లో ఉండే మా కేబుల్‌కు వెళ్లేవారు. శ్రీ‌ను అక్క‌డ‌కు వెళ్లిన మొద‌టి ఆరు నెల‌ల కాలంలో ఇద్ద‌రి ద‌గ్గ‌రా డ‌బ్బులు ఉండేవి కావు. షోల ద్వారా చాలా త‌క్కువ డ‌బ్బులే వ‌చ్చేవి. దాంతో క‌డుపు నింపుకోడానికి రాత్రిపూట కిరాణా కొట్టు నుంచి బ‌న్స్ తెచ్చుకొని, మంచినీళ్ల‌లో వాటిని ముంచుకొని తిని, అలాగే ప‌డుకొనేవాళ్లు. స్ట‌వ్‌మీద బియ్యంపెట్టి, అందులో చింత‌పండు వేసుకొని, ఆ అన్నం తినేవాళ్లు. ఒక‌సారి ప‌నిప‌డి మ్యాగీ వాళ్ల ఊరు నిర్మ‌ల్ వెళ్లాడు. ఆ టైమ్‌లో శ్రీ‌ను ద‌గ్గ‌ర ఒక్క రూపాయి కూడా లేదు. మ్యాగీని అడ‌గ‌డం మ‌ర్చిపోయాడు. మియాపూర్‌కు బ‌స్సులో వెళ్లాల‌న్నా రూపాయి లేదు. వాళ్ల ప‌క్కింట్లో ఒక దానిమ్మ చెట్టు కొమ్మ‌లు వీళ్ల స్థ‌లంలోకి వంగి ఉండేవి. ఆక‌లి న‌క‌న‌క‌లాడుతోంది. దానిమ్మ కాయ‌లైనా కోసుకు తిందామ‌ని చూశాడు. ఎక్క‌డా ఒక్క పెద్ద దానిమ్మ కాయ లేదు. అన్నీపిందెలే! వాటినే కోసుకొని తినేశాడు. ఇంకేముంది.. నోరంతా పొక్కిపోయి, పుండులా త‌యారైంది. అలాంటి ప‌రిస్థితుల నుంచి ఇవాళ జ‌బ‌ర్ద‌స్త్‌లో టాప్ కమెడియ‌న్ రేంజ్‌కు ఎదిగి, మంచి రెమ్యూన‌రేష‌న్ అందుకుంటున్నాడు. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా సినిమాలు కూడా చేస్తున్నాడు. ఈ విష‌యాల‌న్నీ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు శ్రీ‌ను.

అమ్మాయిలతో కలిసి రవి మందేస్తే... బూతులు, గట్రా!

  యాంకర్ రవి మందు తాగుతాడా? తాగుతాడని నటుడు, 'బిగ్ బాస్' ఫేమ్ అలీ రెజా అంటున్నాడు. అదీ అమ్మాయిలతో ఉన్నప్పుడు మందు తాగుతాడని చెబుతున్నాడు. జస్ట్ ఫర్ ఫన్ కోసం అన్నట్టు అలీ రెజా చెప్పినా, ప్రజెంట్ అతడు చెప్పిన విధానం ఆడియన్స్ ను అట్ట్రాక్ చేస్తోంది.  'హ్యాపీ డేస్' షోకి రవి, అషురెడ్డి యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులోకి అలీ రెజా సడన్ ఎంట్రీ ఇచ్చాడు. 'జనరల్ గా రవి అసలు ఎప్పుడూ తప్పు చెయ్యడు కదా' అని అషురెడ్డి అన్నది. అందుకు అలీ రెజా 'మనోడికి అసలు ఎటువంటి అలవాట్లు లేవు' అని చెప్పాడు. అతడి భుజం మీద వాలి సిగ్గుపడ్డాడు రవి. అక్కడితో అలీ రెజా ఆగలేదు.  'అమ్మతోడు చెప్తున్నా... వాడు అస్సలు బూతులు మాట్లాడడు' అని అలీ మళ్లీ మొదలుపెట్టాడు. 'అరే, ఏం మాట్లాడుతున్నావ్ రా' అన్నట్టు రవి ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. 'మందు తాగినప్పుడు (బూతులు) మాట్లాడతాడు. అమ్మాయిలతో ఉన్నప్పుడే మందు తాగుతాడు' అని అలీ రెజా చెప్పాడు. షోలో కమెడియన్లు, ఆడియన్స్ ఒక్కసారి ఘొల్లున నవ్వారు. అలీ సరదాగా అన్నట్టు కనిపించినా కొత్తవాళ్లు చూస్తే అమ్మాయిలతో కలిసి రవి మందేస్తే... బూతులు మాట్లాడుతూ ఏదో చేస్తాడని అనుకునే ప్రమాదం ఉంది. 

మోనితకు దిమ్మతిరిగే షాక్... కార్తీక్‌తో పెళ్లికి అంజి బ్రేక్!

  మోనిత ఆటలకు వంటలక్క చెక్ పెట్టింది. చెప్పినట్టు అంజిని లైనులోకి తీసుకొచ్చింది. ముందుగా డాక్టర్ బాబుతో మెడలో మూడు ముళ్లు వేయించుకోవాలని ఉబలాటపడుతున్న మోనిత ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసింది. మొత్తం మీద 'కార్తీక దీపం' సీరియల్ అభిమానుల్లో జూలై 29న ప్రసారమయ్యే 1104 ఎపిసోడ్ తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి మరింత కలిగించడంలో సక్సెస్ అయ్యింది. ఈరోజు ఎపిసోడ్ విశేషాలు ఏంటంటే...  ఇంటికి వచ్చిన తర్వాత మోనితకు ఏమైంది? అలా ప్రవర్తిస్తోందేంటి? అని వంటలక్క అలియాస్ దీపను భాగ్యం అడుగుతుంది. తన భర్త మీద మోజు పడిందని, దానిని ఎలా వదిలించుకోవాలో తనకు తెలుసు అని చెబుతుంది. ఆల్రెడీ వంటలక్క తన ప్లాన్ అమలుచేసిందని తర్వాత సన్నివేశంలో ప్రేక్షకులకు తెలుస్తుంది.  మోనితకు రిజిస్టర్ దుర్గాప్రసాద్ నుండి ఫోన్ వస్తుంది. డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ తో ఆమె పెళ్లికి అంజి అనే వ్యక్తి అభ్యంతరం చెప్పాడని, అతడిని 25వ తేదీలోపు ఒప్పిస్తేనే మీ పెళ్లి జరుగుతుందని చెబుతాడు. వంటలక్క దెబ్బకు మోనితకు దిమ్మ తిరుగుతుంది. దీపను తక్కువ అంచనా వేసి తప్పు చేశానని బాధ పడుతూ, ఏదొకటి చేసి 25న కార్తీక్ ను పెళ్లి చేసుకుని తీరుతానని మనసులో అనుకుంటుంది.  తర్వాత ఆనందరావును డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకురావడం, మోనిత-అంజి మధ్య శత్రుత్వానికి కారణం ఏమై ఉంటుందని కార్తీక్ ఆలోచిస్తూ ఉండటంతో ఎపిసోడ్ ముగుస్తుంది. ఫైనల్ పంచ్ ఏంటంటే... మోనితకు రోషిణి కాల్ చేసి 'ఒకసారి రండి. మాట్లాడాలి' అనడం, మోనిత ఇంట్లో దీప ఎంట్రీ ఇవ్వడం! జూలై 30న ప్రసారమయ్యే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.  

నిరుపమ్ పరిటాల ఖాతాలో పెద్ద బ్రాండ్

  బుల్లితెరపై నిరుపమ్ పరిటాలది మెగాస్టార్ రేంజ్. సూపర్ డూపర్ హిట్ 'కార్తీక దీపం' సీరియల్‌తో అతడికి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ అటువంటిది. ప్రజలలో అతడికి ఉన్న అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలని అడ్వర్టైజ్‌మెంట్ ఇండస్ట్రీ అడుగులు వేస్తోంది. సోషల్ మీడియాలో అతడి చేత తమ తమ బ్రాండ్స్ ప్రమోట్ చేయించుకోవాలని పెద్ద పెద్ద బ్రాండ్స్ ముందుకు వస్తున్నాయి.  స్టార్స్‌తో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్స్‌లో తమ ప్రోడక్ట్ గురించి చెప్పిస్తూ వీడియో, ఫొటోలు పోస్ట్ చేయించడం లేటెస్ట్ అడ్వర్టైజ్‌మెంట్ ట్రెండ్. ఇంతకు ముందు నిరుపమ్ గ్రీన్ టీకి చెందిన ఒక బ్రాండ్ ను ప్రమోట్ చేశాడు. అయితే, ఈసారి అతడి ఖాతాలో పెద్ద బ్రాండ్ పడింది.  పేటీయమ్ అంటే ఈ రోజుల్లో తెలియనివారు ఎవరూ ఉండరు. అటువంటి పేటీయమ్ కూడా నిరుపమ్ పరిటాలతో తమ బ్రాండ్ ను ప్రమోట్ చేయించుకుంటోంది. గ్రామీణ ప్రాంతాలకు, సీరియల్ వీక్షకులకు కూడా చేరువ కావడం కోసం నిరుపమ్ పరిటాలను ఎంపిక చేసుకుందని సమాచారం. 

ఇక్కడయితే సుత్తి తీసుకున్నావ్? ఇంట్లో ఏం తీసుకుంటావ్?

  భర్త మంజునాథ్ మాట వినేది లేదంటోంది యాంకర్ లాస్య. ఇంట్లో అయినా సరే... గేమ్ షోలో అయినా సరే... తనదే పైచేయి అంటోంది. ఓంకార్ షో 'సిక్స్త్ సెన్స్'కి మంజునాథ్, లాస్య దంపతులు వచ్చారు. కొరియోగ్రాఫర్ యష్ తన భార్యతో వచ్చాడు. వాళ్లిద్దరూ కలిసి డాన్స్ చేశారు.  యష్ కొరియోగ్రాఫర్ కాబట్టి డాన్స్ చేయడం పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ, భర్త మంజునాథ్ తో లాస్య డాన్స్ చేయించడం విశేషమే. ఈ వీకెండ్ లాస్య గెస్టుగా వచ్చిన ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. రీసెంట్ గా ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ఓంకార్ వేసిన ప్రశ్నలు, లాస్య చెప్పిన సమాధానాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 'మీ ఇంట్లో ఎక్కువగా ఎవరి మాట ఎవరు వింటుంటారు?' అని ఓంకార్ అడిగాడు. 'తెలియనిది ఏముంది అన్నా' అని లాస్య చెప్పింది. అంతటితో ఆగకుండా 'చెప్పండి చెప్పండి' అంటూ చేతిలో సుత్తిని పైకి ఎత్తింది. ఇంతలో పక్కనున్న మంజునాథ్, లాస్య మాట తాను వింటానన్నట్టు చేతులు ఆమెవైపు చూపించాడు. 'ఇక్కడయితే సుత్తి తీసుకున్నావ్? ఇంట్లో ఏం తీసుకుంటావ్?' అని ఓంకార్ మళ్ళీ ప్రశ్నించాడు. 'ఏది ఉంటే అది' అని ఠక్కున మంజునాథ్ నోటి నుండి ఆన్సర్ వచ్చింది.  'నా మాట వినకపోతే అలిగి వెళ్ళిపోతాను. అలకతో నాకు కావాల్సింది నేను సాధించుకుంటాను' అని లాస్య చెప్పుకొచ్చింది. అదీ సంగతి. ఇంట్లో లాస్య ఆయుధం అలక అన్నమాట. 

జ‌బ‌ర్ద‌స్త్‌లో ఫాహిమా టైమ్ మొద‌లైంది!

  జబర్దస్త్ అంటే ప్రేక్షకులకు గుర్తొచ్చేవి రెండే. ఒకటి... కామెడీ. రెండు... గ్లామర్. ఆర్టిస్టులు చేసిన కామెడీ కంటే ఒక్కోసారి యాంకర్లు అనసూయ, రష్మీ వేసిన డ్రస్సులు హాట్ టాపిక్ అవుతుంటాయి. గ్లామర్ షో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. 'జబర్దస్త్'లో అమ్మాయిలు అంటే అందమే హైలైట్ అవుతుంటుంది.  అందంతో కాకుండా కామెడీ టైమింగ్‌తో లేడీ కమెడియన్ ఫాహిమా కొట్టుకొస్తోంది. కలర్, లుక్స్ పరంగా చూస్తే అనసూయ, రష్మీ, వర్షలతో ఫాహిమాను కంపేర్ చేయలేము. కానీ, ఆమెకు రోజు రోజుకూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ ఉంది. రెండు మూడు ఎపిసోడ్ల నుండి ఫాహిమా రెచ్చిపోతోంది. 'బులెట్' భాస్కర్ టీమ్ లో ఫైమాకు మంచి రోల్స్ పడ్డాయి. లేటెస్ట్ గా రిలీజైన 'ఎక్స్ట్రా జబర్దస్త్' ప్రోమోలో సుడిగాలి సుధీర్ టీమ్ లో ఆమెకు రోల్ దక్కింది. వచ్చిన ఛాన్స్ దక్కించుకుని మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అందుకు యూట్యూబ్ లో కామెంట్లు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  సాధారణంగా 'జబర్దస్త్' ప్రోమో కింద హైపర్ ఆది గురించి, 'ఎక్స్ట్రా జబర్దస్త్' ప్రోమో కింద సుడిగాలి సుధీర్ గురించి ఎక్కువమంది కామెంట్లు చేస్తారు. కానీ, లేటెస్ట్ ప్రోమో కింద ఫాహిమా గురించి ఎక్కువమంది కామెంట్లు చేశారు. ఆడియన్స్ ఫాహిమాను మెచ్చుకుంటూ పోస్టులు చేశారు. ఇకనుండి జబర్దస్త్ షోలో ఫాహిమా టైమ్‌ మొదలైందని చెప్పవచ్చు. 

'కార్తీక దీపం'లో కీలక మలుపు... అంజిని తీసుకొస్తున్న వంటలక్క!

  ఎట్టి పరిస్థితుల్లోనూ కార్తీక్ తన మెడలో తాళిబొట్టు కట్టాల్సిందేనని, లేదంటే కార్తీక్ కుటుంబ పరువును బజారుకు ఈడుస్తానని మోనిత మంగమ్మ శపథం చేస్తుంది. జూలై 28 తేదీ, 1103 ఎపిసోడ్ లో మోనిత వీరంగం సృష్టించింది. కార్తీక్ అంటే తనకు పిచ్చి అని అతడితో, అతడి భార్య దీపతో చెబుతుంది. 'పెళ్లి అయినవాడిని ప్రేమించడమే తప్పు' అని కార్తీక్ చెప్పినా వినిపించుకోదు.  'నువ్వు ప్రేమించావని నేను ప్రేమిస్తే అది స్వార్థం. కానీ, ప్రేమించకపోయినా పర్వాలేదని ప్రేమిస్తే త్యాగం. నేను త్యాగమూర్తిని. నన్ను అర్థం చేసుకోకుండా దూరం పెట్టడం అన్యాయం. నువ్వు ద్వేషించవని నీ భార్య నీకు పదేళ్లు దూరంగా ఉంది. కానీ, నేను పదహారేళ్లుగా నిన్నే ప్రేమిస్తున్నా. మరో మగాడిని దగ్గరకు రానివ్వడం లేదు' అని మోనిత ఆగ్రహావేశాలకు లోనవుతూ ఏడుస్తుంది. 25న కార్తీక్ తన మెడలో తాళి కట్టకపోతే కుటుంబాన్ని బజారుకు ఈడుస్తానని బెదిరిస్తుంది. అక్కడితో ఈ రోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయని అర్థమవుతోంది.  కొత్త ప్రోమోలో హైలైట్స్ ఏంటంటే... మోనిత ఇంటికి దీప వెళుతుంది. సరిగ్గా అప్పుడే మోనితకు ఏసీపీ రోషిణి నుండి ఫోన్ వస్తుంది. అది లిఫ్ట్ చేయగానే అవతలి వైపు నుండి 'బయలుదేరేవా?' అని ప్రశ్న. 'వస్తున్నా మేడమ్' అని మోనిత సమాధానం. 'నీకోసం కూడా వెయిట్ చేయాలా?' అని రోషిణి అసహనం. లోపల ఆందోళన ఉన్నప్పటికీ, పైకి కనిపించనివ్వకుండా 'నేను రోషిణి మేడమ్ దగ్గరకు వెళ్తున్నాను. వచ్చాక నీ పని చెబుతా' అని వంటలక్క అలియాస్ దీపకు మోనిత వార్నింగ్ ఇచ్చినట్టు చెబుతుంది. 'వెళ్తున్నాను కాదు... వెళ్తున్నాం. మనిద్దరం వెళ్తున్నాం. అక్కడ అంజి ఉన్నాడో, దుర్గ ఉందో? నీ పాత నేరాల గురించి కొత్తగా ఏం కథనాలు చెబుతున్నారో' అంటుంది దీప.  కొన్ని రోజులుగా అంజి ప్రస్తావనను దీప తీసుకొస్తూ ఉంది. మరి, అతడు జూలై 29 ఎపిసోడ్ లో ఎంటర్ అవుతాడో, సస్పెన్స్ లో పెడుతూ మరోరోజు ఆలస్యం చేస్తారో చూడాలి. కాలేజీ రోజుల్లో కార్తీక్ ను దక్కించుకోవడం కోసం అతడు ప్రేమించిన అమ్మాయిని హత్య చేయడానికి అంజికి మోనిత సుపారీ ఇస్తుంది. మంచివాడిగా మారిన అంజి, ఆ విషయం కార్తీక్ కు చెబుతాడు. అదీ సంగతి. ఇప్పుడు ఆ నేరాలు బయటకు వస్తాయేమో చూడాలి. అంజి రాకతో సీరియల్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో?   

శేఖ‌ర్‌ను చూస్తే చాలు.. ముద్దు పెట్ట‌కుండా ఉండ‌లేక‌పోతున్న శ్రీ‌ముఖి!

  లాస్ట్ మంత్ 'సిక్స్త్ సెన్స్' షోకు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, యాంకర్ శ్రీముఖి వెళ్లారు. షోలో శేఖర్‌కు శ్రీముఖి ముద్దు పెట్టింది. తర్వాత ఏమనుకుందో ఏమో గానీ శేఖర్ దగ్గరకు వెళ్లి 'మీ భార్య పేరు ఏంటి?' అని అడిగి మరీ 'శిరీషా గారు ఇది కేవలం షోకి సంబంధించినది మాత్రమే. కల్పితాలు మాత్రమే' అని చెప్పింది. మరోవైపు శేఖర్ కూడా శ్రీముఖి తనకు ముద్దు పెట్టలేదని, అదంతా సీజీ అన్నారు. ఇదంతా ఓంకార్ అన్నయ్య ప్రోమోలో వేశారు. ఫుల్ వైరల్ అయింది.  కట్ చేస్తే... శేఖర్ మాస్టర్‌కు శ్రీముఖి మళ్లీ ముద్దు పెట్టింది. ప్రజెంట్ 'కామెడీ స్టార్స్' షోలో శేఖర్ జడ్జ్ గా చేస్తున్నారు కదా! రాబోయే ఆదివారం, ఆగస్టు 1న ఫ్రెండ్షిప్ సందర్భంగా ఎపిసోడ్ కి శ్రీముఖి వచ్చింది. ఇంట్రో సాంగ్ డాన్స్ చేసిన తర్వాత శేఖర్‌కు ముద్దు పెట్టినట్టు తెలుస్తోంది. పాత ముద్దుపై తన స్కిట్ లో అవినాష్ పంచ్ కూడా వేశాడు. 'ఆ ముద్దు మొత్తం వైరల్ అయ్యింది తెలుసా?' అని అవినాష్ అన్నాడు. వెంటనే 'ఆ తర్వాత మా ఇంట్లో నాకు వైరల్ ఫీవర్ వచ్చింది తెలుసా?' అని శేఖర్ అనడంతో శ్రీముఖి, విష్ణుప్రియ నవ్వుకున్నారు.  ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ కోసం 'కామెడీ స్టార్స్' టీమ్ కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ లను తీసుకొచ్చింది. ఇద్దరికీ సన్మానం చేసింది. 'మీరు తెలుసుకోవాల్సింది ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాదు... గోల్డ్ కెనాట్ బికమ్ ఓల్డ్' అని కోట అన్నారు. గోల్డ్ ఎప్పటికీ ఓల్డ్ కాదన్నది ఆయన అభిప్రాయం. 

సుమ సంపాదనే ఎక్కువ... ఓపెన్‌గా ఒప్పుకొన్న రాజీవ్ కనకాల!

  తెలుగులో బిజీయెస్ట్ యాంకర్లలో సుమ టాప్ ప్లేస్‌లో ఉంటారు. ఆల్రెడీ ఆమె చేతిలో 'క్యాష్', 'స్టార్ట్ మ్యూజిక్' లాంటి షోస్ ఉన్నాయి. ప్రీ-రిలీజ్ ఫంక్షన్స్ విషయానికి వస్తే హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల ఫస్ట్ ఛాయిస్ ఆమె. సుమ కాదన్న తర్వాత ఇతరుల దగ్గరకు వెళతాయి. ప్రజెంట్ సుమ రెండు చేతులా సంపాదిస్తున్నారు. మరోవైపు రాజీవ్ కనకాల కూడా సినిమాల్లో న‌టించ‌డం ద్వారా సంపాదిస్తున్నారు. ఇటీవ‌ల 'నార‌ప్ప' మూవీలో వెంక‌టేశ్ బావ‌మ‌రిది బ‌స‌వ‌య్య పాత్ర‌లో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నారు. అయితే, రాజీవ్ కంటే సుమ సంపాదన ఎక్కువ అని నలుగురూ మాట్లాడుకోవడం మొదలైంది. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయం మీద రాజీవ్ ఓపెన్ అయ్యారు.  'మీ భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరి సంపాదన ఎక్కువ?' అనే ప్రశ్నకు 'కచ్చితంగా సుమదే' అని రాజీవ్ కనకాల సమాధానం ఇచ్చారు. తర్వాత సంపాదన విషయంలో తమ మధ్య అభిప్రాయం బేధాలు ఎప్పుడూ రాలేదని రాజీవ్ కనకాల స్పష్టం చేశారు.  రెగ్యులర్ గా టీవీలో సుమ కనపడుతుంది కాబట్టి జనాలు ఏదేదో అనుకుంటారని రాజీవ్ కనకాల అన్నారు. తాను సంపాదించేది తాను సంపాదిస్తున్నాన‌ని వివరించారు. కొన్నేళ్ల క్రితం టీవీలో సుమ బిజీ కాకముందు తాను సినిమాల్లో బిజీగా ఉండి సంపాదించిన రోజులు ఉన్నాయని రాజీవ్ చెప్పారు. తమ మధ్య డబ్బు ప్రస్తావన ఎప్పుడూ చర్చకు రాదన్నారు. 

సుమతో విడిగా ఉండటంపై నోరువిప్పిన‌ రాజీవ్ కనకాల!

  రాజీవ్ కనకాల, సుమది అన్యోన్య దాంపత్యం. వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయని, ఇద్దరూ వేరు పడ్డారని, విడివిడిగా ఉంటున్నారని ఒకానొక సమయంలో పుకార్లు షికార్లు చేశాయి. రాజీవ్ కనకాల తన ఆస్తులను అమ్ముకున్నారనే ప్రచారం కూడా జరిగింది. వీటిపై రాజీవ్ కనకాల స్పందించారు. ఆ పుకార్లలో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. "నేను, సుమ, పిల్లలు ఎల్&టిలో ఉంటున్నాం. అమ్మగారు కాలం చేసిన తర్వాత మణికొండలో ఇల్లు ఖాళీగా ఉండింది. నాన్న(దేవదాస్ కనకాల)తో నేను అక్కడ ఉన్నాను. నాన్నను తీసుకుని అపార్టుమెంట్‌కు వద్దామంటే... ఆయన దగ్గర బోలెడు పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ పట్టేంత ప్లేస్ ఫ్లాట్‌లో ఉండదు. అక్కడ (మణికొండలో) ఇల్లు పెట్టుకుని, ఇక్కడ రెంట్ కట్టి... ఎక్ట్రా బర్డెన్ ఎందుకని నేను నాన్న ఇంటికి వెళ్లా. మధ్యలో మా ఇంటికి ష‌టిల్ అవుతూ ఉండేవాడిని. ఇదీ జరిగింది. అప్పుడు మేం వేరుపడ్డామని అనుకుని ఉంటారంతే" అని రాజీవ్ కనకాల వివరించారు.  దేవదాస్ కనకాల పలు చిత్రాల్లో నటించారు. ఫిల్మ్ స్కూల్ పెట్టి పలువురికి నటనలో శిక్షణ ఇచ్చారు. ఆగస్టు 2, 2019లో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దేవదాస్ కనకాల కుమారుడిగా పరిశ్రమలోకి ప్రవేశించిన రాజీవ్ కనకాల నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. లేటెస్ట్‌గా 'నార‌ప్ప' మూవీలో వెంక‌టేశ్ బావ‌మ‌రిది బ‌స‌వ‌య్య పాత్ర‌లో ఆయ‌న న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ల‌భించాయి. 

సమంత భారీ సినిమాలో వర్షిణికి ఛాన్స్

  బుల్లితెర ప్రేక్షకులకు వర్షిణి ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. గతంలో 'ఢీ' షో, ఇప్పుడు 'కామెడీ స్టార్స్'తో ఆమెకు పాపులారిటీ బాగా పెరిగింది. అయితే, వర్షిణి ప్రయాణం బుల్లితెర మీద కాదు... వెండితెరపై మొదలైంది. కానీ, ఎక్కువ గుర్తింపు తెచ్చింది మాత్రమే బుల్లితెరే. మధ్య మధ్యలో సినిమాలు చేస్తున్నా సరైన సినిమా పడలేదు. చాలా రోజుల తర్వాత వర్షిణికి భారీ సినిమాలో అవకాశం వచ్చింది.  సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చారిత్రక దృశ్యకావ్యం 'శాకుంతలం'. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో వర్షిణి నటిస్తున్నారు. ఆమెకు చెంతకు అవకాశం వచ్చిన వెంటనే ఓకే చెప్పేశారట. అయితే, సినిమాలో తన పాత్ర ఏమిటన్నది వర్షిణి చెప్పలేదు. షూటింగ్ స్టార్ట్ చేశానని మాత్రమే వెల్లడించారు. ఒకటి కంటే ఎక్కువ లుక్స్ లో కనిపించనున్నారట. సమంతతో షూటింగ్ చేయడం చాలా సంతోషంగా ఉందని వర్షిణి చెబుతోంది.  "సమంత చాలా స్వీట్" అని వర్షిణి ప్రశంసల వర్షం కురిపిస్తోంది. షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇతర ఆర్టిస్టుల గురించి సమంత ఎంత కేర్ తీసుకుంటారో చెప్పుకొచ్చింది. "ఒక సన్నివేశంలో నేను మోకాళ్ళ మీద కూర్చుని డైలాగ్ చెప్పాలి. ఎమోషనల్ సీన్ అది. ఫ్లోర్ మీద రాళ్లు ఉన్నాయి. అంత కంఫర్టబుల్ గా లేదు. నేను పాయింట్ అవుట్ చేయడానికి ముందే సమంతగారు గమనించారు. నా మోకాళ్ళ కింద ఏదైనా క్లాత్ వేస్తే ఇబ్బంది ఉండదని చెప్పారు. అంతపెద్ద స్టార్ అలా చెప్పడం గ్రేట్" అని వర్షిణి షూటింగ్ అనుభవాన్ని గుర్తు చేసుకుంది. 

రుణం పేరుతో దారుణాలు చేసే అత్తగా ఆమని!

  రుణం పేరుతో దారుణాలు చేసే అత్తగా ఆమని బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జీ తెలుగులో త్వరలో కొత్త సీరియల్ రాబోతోంది. దాని పేరు 'ముత్యమంత ముద్దు'. అందులో వడ్డీకి డబ్బులు ఇచ్చి, తర్వాత ముక్కుపిండి మరీ వసూలు చేసే మహిళగా ఆమని కనిపించనున్నారు. ఆమె కుమారుడేమో కన్నవాళ్ల రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. తర్వాత ఏమైందనేది సీరియల్ లో చూడాలి. త్వరలో ఈ సీరియ‌ల్ ప్రసారం కానుంది. దీనికి 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టితో ప్రచారం చేస్తున్నారు.  'ముత్యమంత ముద్దు' సీరియల్ కాన్సెప్ట్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఓ పెళ్లి జరుగుతూ ఉంటుంది. అక్కడికి కృతి శెట్టి వస్తుంది. పక్కనున్న నిషా రవిక్రిష్ణన్ (సీరియల్ హీరోయిన్)తో 'పెళ్లి తర్వాత అమ్మాయి జీవితమే మారిపోతుంది కదా. ఇంటిని వదులుకోవాలి. ఇంటి పేరు మార్చుకోవాలి. అమ్మానాన్నను దాదాపు మర్చిపోవాలి' అంటుంది. అప్పుడు కృతితో నిషా రవిక్రిష్ణన్ 'నువ్వు అమ్మాయి గురించి యోచన చేస్తూ ఉండావు. నాను అమ్మాయి అప్పా అమ్మ గురించి బాధ పడుతూ ఉన్నాను. వీళ్లకు కొడుకులు లేరు. మాలాగా ఇద్దరూ కూతుళ్లే. ఇన్నాళ్లూ కూతుళ్లే ప్రాణంగా బతికేశారు. ఇప్పుడు అత్తారింటికి పోయేది కూతురు కాదు. వాళ్ళ ప్రాణం. ఈ క్షణం నుండి ఆ అమ్మ అప్పా అనాథలే కదా. నాకు మాత్రం అలా కాదు. అబ్బాయి పెళ్లి చేసుకుని అమ్మ అప్పాను వదిలేస్తాడా? వాళ్లతో కలిసే కదా ఉంటాడు. అట్నే నన్ను చేసుకోబోయేవాడు కూడా మా అమ్మ, అప్పాను అత్తారింట్లో ఉండనిస్తేనే నేను పెళ్ళికి ఒప్పుకుంటా' అంటుంది.  నిషా రవిక్రిష్ణన్ కండిషన్లకు సిద్దు ఓకే అంటాడు. 'అబ్బాయి సరే. కానీ, నీకు కాబోయే అత్తగారు ఈ కండిషన్ కు ఒప్పుకుంటారా?' అని కృతి ప్రశ్నిస్తుంది. అప్పుడు ఆమని ఎంట్రీ. పెళ్లింట్లో సారెను తీసుకెళ్లే కర్కశమైన మహిళగా ఆమనిని చూపించారు. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సీరియల్ ఎలా ఉంటుందో టెలికాస్ట్ స్టార్ట్ అయిన తర్వాత చూడాలి. 

"న‌న్నింకా ద‌గ్గ‌ర‌కు తీసుకో దీపా".. బేల‌గా అడిగిన డాక్ట‌ర్ బాబు!

  డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ తండ్రి ఆనందరావుతో 'మీ కుమారుడి వల్ల నేను గర్భవతి అయ్యాను. నా కడుపులో బిడ్డకు మీరు తాతయ్య' అని మోనిత చెప్పడంతో, ఆనందరావుకు హార్ట్ ఎటాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన్ను హాస్పిటల్ లో జాయిన్ చేశాక... వంటలక్క అలియాస్ దీపతో బయటకు వెళుతున్న డాక్టర్ బాబును తనతో రమ్మని మోనిత అంటుంది. అప్పుడు వంటలక్క ఇచ్చిన వార్నింగ్ కు మోనితలో వణుకు మొదలవుతుంది. (శుక్రవారం, జూలై 23న 'కార్తీక దీపం' ఎపిసోడ్ లో జరిగింది ఇది).  'కార్తీక దీపం' సీరియల్ నేడు (జూలై 24న) 1098 ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటి? అనేది ఒక్కసారి చూస్తే... కార్తీక్, దీప మధ్య ఎమోషనల్ లవ్ సీన్ అని చెప్పాలి.  హాస్పిటల్‌లో జాయిన్ చేసిన ఆనందరావుకు అవసరం అయితే స్టంట్ వేయాలని డాక్టర్ బాబుతో గోవర్ధన్ చెబుతాడు. అతడిని ఆ పనులు చూడమని చెప్పిన డాక్టర్ బాబు... భార్యాబిడ్డలను ఏళ్లుగా దూరం పెట్టిన శాపం వలన ఈ విధంగా జరిగిందని బాధపడతాడు. మోనిత వల్ల తనను తల్లితండ్రులు నమ్మడం లేదని, రేపు సమాజం కూడా నమ్మే పరిస్థితి ఉండదని ఆవేదనకు లోనవుతాడు. అప్పుడు అతడికి వంటలక్క అండగా నిలుస్తుంది.  'ఎందుకు అంత నిరాశ డాక్టర్ బాబు? న్యాయంతో పాటు నేను కూడా మీవైపే ఉన్నాను' అని వంటలక్క ప్రేమ చూపిస్తుంది. అప్పుడు ఆమె భుజంపై డాక్టర్ బాబు వాలతాడు. 'నన్ను ఇంకా దగ్గరకు తీసుకో దీప. ప్రేమగా దగ్గరకు తీసుకో. అందులో జాలి కానీ, రాజీ కానీ లేకుండా ఇంకా దగ్గరకు తీసుకో' అంటూ డాక్టర్ బాబు కన్నీళ్లు పెట్టుకుంటాడు. వెంటనే ప్రేమగా అతడిని నిమురుతుంది దీప. నేపథ్యంలో 'తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం' పాట వస్తుంది. ఇద్దరి మధ్య ఈ ఎమోషనల్ లవ్ సీన్ ఎపిసోడ్ హైలైట్ అని చెప్పాలి.  మోనిత కారణంగా ఆనందరావు హాస్పటలైజ్ అయ్యారని శ్రావ్య ద్వారా భాగ్యం తెలుసుకుంటుంది. వెంటనే తిట్ల పురాణం అందుకుంటుంది. మళ్ళీ శ్రావ్య ఆపడంతో ఆగుతుంది. ఆ తర్వాత డాక్టర్ బాబు, వంటలక్క బయటకు వెళ్తున్న సమయంలో మోనిత వచ్చే సీన్ వస్తుంది. ముగ్గురి మధ్య సంభాషణల్లో  తన కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నావని మోనితపై కార్తీక్ కోప్పడతాడు.  తర్వాత '25న నా మెడలో కార్తీక్ మూడు ముళ్ళు వేస్తే... మనకు ఉమ్మడి మొగుడు, పెద్దాయ‌న‌ కామన్ మావయ్య' అని దీపతో మోనిత చెబుతుంది. తర్వాత మోనితకు వంటలక్క వణుకు పుట్టించే సీన్ వస్తుంది. ఎన్ని చేసినా పెళ్లి మాత్రం ఆగదని మోనిత చెబుతుంది. ఆటోవైపు దీప, హాస్పిటల్ లోకి కార్తీక్, మరోవైపు మోనిత వెళ్లిన తర్వాత సీన్ కట్ చేస్తే... చివరకు, హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరుగుతుంటే బయట అందరూ వెయిట్ చేస్తున్న సన్నివేశంతో ముగిసింది. 

"రాజీవ్‌ను నానా మాట‌లు అని సుమ‌తో క్లోజ్‌గా ఎలా ఉన్నారు?".. అన్న‌పూర్ణ‌మ్మ‌కు నెటిజ‌న్ ప్ర‌శ్న‌

  'రాజీవ్ కనకాల, అన్నపూర్ణమ్మ ల్యాండ్ ఇష్యూ ఎంతమందికి తెలుసు?' - 'స్టార్ట్ మ్యూజిక్' అప్‌కమింగ్ ఎపిసోడ్ రిలీజ్ చేస్తే దాని కింద కామెంట్లలో ఇదొకటి. దీనికి కారణం ఏంటంటే? ఈ ప్రోగ్రామ్‌కి సుమ కనకాల యాంకర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ ఫిమేల్ యాక్టర్లతో కలిసి అన్నపూర్ణమ్మ ప్రోగ్రామ్‌కి వచ్చారు. సుమ, అన్నపూర్ణమ్మ క్లోజ్‌గా ఉండటం చూసి చాలామంది సెటైర్లు వేశారు. ఎందుకంటే? రీసెంట్‌ ఇంటర్వ్యూలో ఒక స్థలం విషయంలో సుమ మామగారు దేవదాస్ కనకాల తనను మోసం చేశారని అన్నపూర్ణమ్మ కామెంట్లు చేశారు. రాజీవ్ కనకాలకు ఫోన్ చేసినా ఉపయోగం లేకుండా పోయిందని చెప్పారు. తనకు సంబంధం లేదన్నట్టు రాజీవ్ వ్యవహరించారని అన్నారు. దేవదాస్ కనకాల సంపాదించినది అంతా కొడుకుకు పెట్టాడని అన్నపూర్ణమ్మ చెప్పుకొచ్చారు. దాంతో షోలో సుమతో ఆమె క్లోజ్ గా ఉండటం చూసి కామెంట్లు చేశారు.  "అదేంటి? అన్నపూర్ణమ్మ గారు ఇంటర్వ్యూలో అలా చెప్పారు... 'రాజీవ్ గారు మోసం చేశారు, ఫోన్ లిఫ్ట్  చెయ్యలేదు' అని. కానీ, ఇప్పుడు ఎలా వచ్చారు? (షోకి). లాస్ట్ టైం 'క్యాష్'కి కూడా వెళ్లారు. ఎంతైనా మనల్ని మోసం చేసిన వాళ్ళతో అలా ఉండలేం కదా! డబ్బు కోసం అయినా ఒక్క షో వల్ల ఆవిడకేం కోట్లు వచ్చేయవు కదా! మహా అయితే ముప్పై వేలు ఇస్తారు. దాని కోసం చేసిన మోసాన్ని మర్చిపోతారా? 'క్యాష్'కి వెళ్ళినప్పుడు అడగొచ్చు కదా సుమగారిని. లేదంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్ కలిసి ఉంటారు కదా. అప్పుడు ఎందుకు అడగలేదు? అవాయిడ్ చేస్తున్నారు అన్నారు. అవాయిడ్ చేస్తే ఎలా ఎందుకు పిలుస్తారు?" అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.     

"నాకింకా పెళ్లి కాలేదు... డైరెక్ట్ అత్తన‌వుతా!".. షాకిచ్చిన ర‌ష్మి!!

  పెళ్లి గురించి రష్మీని ఎప్పుడు ప్రశ్నించినా మౌనమే సమాధానం అవుతుంది. అలాగే, వయసు గురించి కూడా! తన వయసు ఎంతనేది ఎప్పుడూ బయటపెట్టదు. అటువంటి రష్మీ నోటి నుండి వయసు, పెళ్లి గురించి వస్తే ఆశ్చర్యమే కదా! దాంతో 'ఆషాడంలో అత్తాకోడళ్లు' ఈవెంట్ లో ఆర్టిస్టులు అందరూ అవాక్కయ్యారు.  సండే సాయంత్రం ఐదు గంటలకు 'జీ తెలుగు'లో టెలికాస్ట్ కానున్న 'ఆషాడంలో అత్తాకోడళ్లు' ఈవెంట్ లో రష్మీ గౌతమ్ రచ్చ రచ్చ చేసిందని లేటెస్ట్ ప్రోమో చూస్తే తెలుస్తోంది. గతంలో రిలీజైన ప్రోమోలో 'మెరిసింది మేఘం' పాట పాడినట్టు రివీల్ చేశారు. ఇప్పుడు అంతకు మించి అన్నట్టు రష్మీ రెచ్చిపోయింది.  'ఆషాడంలో అత్తాకోడళ్లు'లో అత్తలు, కోడళ్లకు మధ్య కాంపిటీషన్లు పెట్టారు. కోడళ్లవైపు రష్మీ ఉన్నారు. మ్యూజికల్ చైర్స్ గేమ్ లో కోడలు ఒకరు ఓడిపోయారు. అంటే... కుర్చీలో కూర్చోలేక వెనక్కి వచ్చారు. అప్పుడు రష్మీ ఆమెను కొట్టింది. దాంతో 'హే... యు డోంట్ బికమ్ అత్త! నువ్వు కోడలు' అని శ్యామల ఆపింది. 'ఈ వయసులో నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేను డైరెక్ట్ అత్తకు అప్‌గ్రేడ్ అవుతా' అని రష్మీ ఆన్సర్ ఇచ్చింది. దానికి అంతా షాక్!  ఇక, ఈవెంట్ లో రవి మీద రష్మీ వేసిన డైలాగ్స్ అయితే ఓవర్ ద బోర్డు అని చెప్పాలి. 'రవీ... నిజంగా! ఈసారి మధ్యలో వచ్చావో ఉన్నది కూడా తీసేస్తా', 'నువ్వు పైకిరా!  నీకు ఉంటుంది. ఉన్నది కూడా ఇప్పేస్తాం'  అంటూ రష్మీ రచ్చ చేశారు. ఫుల్ ఈవెంట్ టెలికాస్ట్ అయితే ఇంకెంత రచ్చ చేశారో తెలుస్తుంది. 

"మేం మందు కొట్టని బ్యాచ్".. గర్వంగా చెప్పిన దీప్తి సునైన!

  ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే ప్రేక్షకుల్లో కొంతమందికి చాలా చిన్నచూపు ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిల గురించి ఏవేవో అనుకుంటూ ఉంటారు. మోడ్రన్ డ్రస్సులు వేసుకోవడం వలన వాళ్ళను జడ్జ్ చేస్తూ ఉంటారు. సిగరెట్ తాగుతారని, మందు కొడతారని అపోహతో ఉంటారు. అయితే, తనది మందు కొట్టని బ్యాచ్ అని 'బిగ్ బాస్' ఫేమ్, సోషల్ మీడియా స్టార్ దీప్తి సునైన చెప్పింది. త‌ర‌చూ త‌న ఫొటోలు, త‌న యాక్టివిటీస్‌కు సంబంధించిన ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో ట‌చ్‌లో ఉంటుంది దీప్తి. కాస్ట్యూమ్ డిజైనర్ నవ్య మరౌతు బర్త్ డే సెలబ్రేషన్స్ కు దీప్తి సునైన అటెండ్ అయ్యింది. 'బిగ్ బాస్' ఫేమ్స్  దేత్తడి హారిక, తీన్మార్ సావిత్రి, అఖిల్ సార్థక్, యాక్టర్ అండ్ సింగర్ నోయెల్, యూట్యూబ్ స్టార్లు తదితరులు అటెండ్ అయ్యారు. యూట్యూబ్ ఫిలిమ్స్ చేసే గోల్డీ, నవ్య మరౌతు, ఉదయ్ తేజ్ అనే వ్యక్తితో కలిసి 'ప్రౌడ్ నాన్ ఆల్కహాలిక్' అని దీప్తి సునైన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. కాఫీ తాగుతున్నట్టు ఇంకో స్టోరీ పోస్ట్ చేసింది.  దీప్తి సునైనను ఇంతకు ముందు ఎవరైనా కామెంట్ చేయడంతో ఇప్పుడు ఇలా చేసిందో, లేదంటే తాను నాన్ ఆల్కహాలిక్ అని చెప్పాలని అనుకుందో... మొత్తం మీద తాను మందు తాగనని ఆమె చెప్పింది.