హైపర్‌ ఆదిపై పోలీసులకు ఫిర్యాదు

కమెడియన్‌ హైపర్‌ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ టీవీ కార్యక్రమంలో ఆది.. తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మతో పాటు తెలంగాణ భాషను కించపరిచే విధంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆదితో పాటు స్క్రిప్ట్ రైటర్, నిర్మాణ సంస్థ మల్లెమాల ప్రొడక్షన్‌ పై చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు.  బుల్లితెరపై తన కామెడి టైమింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హైపర్ ఆది.. డబుల్‌ మీనింగ్‌ డైలాగులు, హద్దుమీరిన కామెడీతో అప్పుడప్పుడు విమర్శల పాలవుతున్నాడు. గతంలో కూడా ఆదిపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు అందాయి. తమ మనోభావాలను దెబ్బతీసేలా టీవీ షోలో ఆది ఓ స్కిట్ చేశారని ఆరోపిస్తూ.. పలువురు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు.  ఇప్పుడు తాజాగా ఆది తెలంగాణ భాషను, దేవతలను కించపరిచారు అంటూ ఫిర్యాదు నమోదైంది. మరి దీనిపై ఆది ఏం వివరణ ఇస్తారో చూడాలి.

"ఎంత ప‌నిచేశావ్ డాక్ట‌ర్ బాబు?".. వెన్నెల కిశోర్ కూడా 'కార్తీక‌దీపం' ఫ్యాన్‌!

  'కార్తీకదీపం' సీరియల్ గురించి తెలియని తెలుగు వారుండరు. బుల్లితెరపై ఈ సీరియల్ ఓ సంచలనం. ఇప్పటివరకు ఏ సీరియల్ కూడా దీన్ని బీట్ చేయలేకపోతోంది. టీఆర్పీలో ఈ సీరియల్ ఎప్పుడు టాప్ ప్లేస్ లోనే ఉంటోంది. సోషల్ మీడియాలో కూడా ఈ సీరియల్ హాట్ టాపిక్ అవుతుంటుంది. సెలబ్రిటీలు సైతం అప్పుడప్పుడు ఈ సీరియల్ గురించి మాట్లాడుతుంటారు. మొన్నామధ్య లక్ష్మీ మంచు 'కార్తీకదీపం' సీరియల్ ను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేసింది.  అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కమెడియన్ వెన్నెల కిశోర్ అప్పుడప్పుడు ఈ సీరియల్ మీద సెటైర్లు వేస్తుంటారు. రీసెంట్ గా డాక్టర్ బాబు, వంటలక్క మీద వెన్నెల కిశోర్ వేసిన పోస్ట్ తెగ వైరల్ అయింది. "అంత మంచి డాక్టర్ బాబుకి అంత మంచి వంటలక్క అంటే ఎందుకంత కోపం?" అని ట్వీట్ చేశారు. అది కాస్తా నెట్టింట్లో వెైరల్ అయింది. ఇప్పుడు 'కార్తీకదీపం' సీరియల్ మలుపు తీసుకున్న సంగతి తెలిసిందే. మోనితా కడుపుతో ఉన్నానని.. దానికి కారణం కార్తీక్ అని చెప్పడంతో అందరూ డాక్టర్ బాబునే టార్గెట్ చేస్తున్నారు. దీనిపై రకరకాల మీమ్స్ ను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వాటిలో ఒక మీమ్ ను వెన్నెల కిశోర్ పోస్ట్ చేశారు.  "ఎంత పని చేశావ్ డాక్టర్ బాబు?" అంటూ బ్రహ్మానందం స్టైల్లో ఉన్న మీమ్‌ను వెన్నెల కిశోర్ షేర్ చేయగా దాన్ని నిరుపమ్ తన ఇన్ స్టాలో స్టోరీలో పెట్టుకున్నాడు. 

'జాన‌కి క‌ల‌గ‌న‌లేదు' హీరో బ్రేక‌ప్ స్టోరీ!

  'జానకి కలగనలేదు' సీరియల్ లో హీరోగా నటిస్తోన్న అమర్ దీప్ చౌదరి తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు 60 ఎపిసోడ్ లను పూర్తి చేసుకున్న ఈ సీరియల్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు అమర్ దీప్. ఈ క్రమంలో తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి చెప్పి యూత్ కి ఓ మెసేజ్ ఇచ్చాడు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పిన అమర్ తన లైఫ్ లో కూడా ఓ బ్రేకప్ స్టోరీ ఉందని చెప్పాడు.  లవ్ ఫెయిల్యూర్ అంటే ఇద్దరిలోనూ మిస్టేక్ ఉంటుందని... లవ్ ఫెయిల్ అయ్యిందని.. హ్యాండ్ ఇచ్చిందని పగలు కోపాలు పెంచుకోవడం లాంటివి కరెక్ట్ కాదని అన్నాడు. కానీ.. లవ్‌లో ఫేక్ ప్రామిస్‌లు ఉండకూడదని.. వాళ్లలో లేనిపోని ఆశల్ని కలిగించకూడదని చెప్పాడు. అప్పటి వరకు కలిసి ఉండి ఆ తర్వాత హ్యాండ్ ఇస్తే అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా తట్టుకోలేరని.. వీక్ హార్ట్ అయితే చచ్చిపోతాడు.. లేదంటే చంపేస్తాడని చెప్పుకొచ్చాడు.  ఏడిస్తే అమ్మాయి తిరిగి వస్తుందనుకుంటే.. ఎన్నాళ్లైనా ఏడవవ‌చ్చని, కానీ రాదు అని తెలిసినప్పుడు వదిలేయాల‌నీ అన్నాడు. "అమ్మాయిల్లో ఓ విషయాన్ని గమనించాను.. వాళ్లు వద్దు అనుకుంటే కనీసం వెనక్కి తిరిగి కూడా చూడరు. ఒక్కసారి మనసు విరిగిపోయిందంటే ఏం చేసినా అతుక్కోదు.. మళ్లీ మనవైపు చూడరు.. అలాంటప్పుడు నిన్ను నువ్వు బాధపెట్టుకోవడం.. ఇంట్లో వాళ్లని బాధపెట్టడం.. ప్రేమించిన అమ్మాయిని బాధపెట్టడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు." అని చెప్పుకొచ్చాడు. తన జీవితంలో ఇలాంటి అనుభవం ఎదురైంది కాబట్టి చెబుతున్నానని.. త‌న‌ బ్రేకప్ స్టోరీ వెల్ల‌డించాడు.

"దూరం నుంచి చూశాడు కాబట్టి చేయి కోసుకున్నాడు.. దగ్గర నుంచి చూస్తే ఉప్పెనే!"

  'జబర్దస్త్'లో హైపర్ ఆది స్కిట్ లకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రత్యేకించి ఆయన కోసమే షోని చూసేవాళ్లు చాలా మంది ఉన్నారు. డబుల్ మీనింగ్ డైలాగులు, బూతు పంచ్ లతో రెచ్చిపోతుంటాడు ఆది. అయినప్పటికీ అతడి స్కిట్ లకు మిలియన్లలో వ్యూస్ వస్తుంటాయి. తాజాగా వచ్చే వారానికి సంబంధించిన 'జబర్దస్త్' ప్రోమోను విడుదల చేయగా.. ఇందులో హైపర్ ఆది, రామ్ ప్రసాద్ తో క‌లిసి నవ్వించే ప్రయత్నం చేశాడు.  ఒక పేపర్ పట్టుకొని వచ్చి "నువ్వు చ‌దువు" అంటే "నువ్వు చదువు" అనుకుంటూ "ఇద్దరికీ రాదులే" అంటూ చిన్న పంచ్ తో స్కిట్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత తనను తాను వెధవ అని ఒప్పుకుంటూ.. ''నేను నెంబర్ 1 వెధవ..".. రామ్ ప్రసాద్ ను చూపిస్తూ "వీడు నెంబర్ 2 వెధవ" అని కామెంట్ చేశాడు. వెంటనే రామ్ ప్రసాద్ "నన్ను పిలిచి ఇన్సల్ట్ చేస్తావా.. నెంబర్ వన్ నాకే ఇవ్వు" అన్నాడు. ఆది "స‌రే" అన‌గానే అంతా గొల్లున న‌వ్వేశారు. ఇక లేడీ గెటప్ లో ఎంట్రీ ఇచ్చిన శాంతి స్వరూప్.. "మొన్న ఒకడు నన్ను చూసి చేయి కోసుకున్నాడు" అని అన్నాడు. దానికి హైపర్ ఆది.. "దూరం నుంచి చూశాడు కాబట్టి చేయి కోసుకున్నాడు.. దగ్గర నుంచి చూస్తే ఉప్పెనే" అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వేశాడు. 'ఉప్పెన' సినిమాలో క్లైమాక్స్ సీన్ ను ఉద్దేశిస్తూ ఈ పంచ్ వేశాడు. ఈ పంచ్ లకు మ‌నో, రోజా, అనసూయ పడిపడి మరీ నవ్వుకున్నారు. 

ఇంట్లో ఉంటూనే సంపాదించేస్తోన్న సుమ! ఎలా అంటే...

  బుల్లితెరపై స్టార్ యాంకర్ గా దూసుకుపోతోంది సుమ. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆమెకి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. బుల్లితెరపై టీవీ షోలు, సినిమా ఈవెంట్లు అంటూ సుమ చాలా బిజీగా ఉంటోంది. గ్యాప్ లేకుండా వరుస షోలతో భారీ సంపాదన ఆర్జిస్తోంది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో చాలా మంది వర్క్ లేక ఇబ్బంది పడుతున్నారు. సుమ కూడా మొన్నామధ్య ఈ లాక్ డౌన్ కారణంగా సినిమా వాళ్లకు ఉపాధి లేకుండా పోయిందంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది.  ఇదిలా ఉంటే.. సుమ ఇంట్లో ఉంటూనే సంపాదించడం మొదలుపెట్టింది. పలు ప్రొడక్ట్ లను ప్రమోట్ చేస్తూ వాటికి అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. తాజాగా ఈమె ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. "ఇడ్లీ దినోత్సవం" అంటూ ఈమె షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. మదర్స్ డే, ఫాదర్స్ డే ఇలా ఏదో ఒక డే ఉన్నప్పుడు ఇడ్లీకి ఓ డే ఉండకూడదా? అంటూ వేడి వేడి ఇడ్లీలను తయారు చేసింది.  దాని కోసం ఒక కంపెనీ వారు చేసిన స్పెషల్ పొడులను ప్రమోట్ చేసింది.  పుట్నాల పొడి, కారంపొడి, తనకెంతో ఇష్టమైన చల్ల మిరపకాయల పొడి ఉన్నాయని వారి ఉత్పత్తులను వివరిస్తూ ప్రమోట్ చేసింది. ఈ పొడులు కావాల్సిన వారు వాట్సప్ చేయొచ్చు లేదా వెబ్ సైట్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు అంటూ సుమ తన స్టైల్లో ప్రమోషన్ చేసింది. మొత్తానికి ఇంట్లో ఉంటూ ప్రమోషన్స్ తోనే డబ్బులు సంపాదించేస్తోంది.

వాళ్లు వ‌స్తే రానీ.. వాళ్లతో నాకు పోటీ లేదు!

  బుల్లితెరపై దాదాపు ఇరవై సీరియల్స్ లో నటించిన లహరి ప్రస్తుతం 'గృహాలక్ష్మీ' సీరియల్ లో నటిస్తోంది. ఈ సీరియల్ లో అమాయకంగా కనిపించే లహరి రియల్ లైఫ్ లో మాత్రం తాను ముక్కుసూటిగా ఉండే అమ్మాయినంటూ కొన్ని విషయాలను పంచుకుంది. ఇప్పటివరకు తను చేసిన అన్ని పాత్రలు నచ్చే చేశానని.. ప్రస్తుతం నటిస్తోన్న 'గృహాలక్షీ' సీరియల్ ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, కాబట్టి తన పాత్రకు  ఢోకా ఉండదని చెప్పింది. పాత్ర విషయానికొస్తే.. అది డైరెక్టర్ చేతిలో ఉంటుందని.. రేటింగ్ బట్టి మారిపోతుంటుందని.. జనాలకు నచ్చి రేటింగ్ వస్తే ఉంచుతారు లేదంటే లేదని చెప్పింది.  రేటింగ్ బట్టి కథ మారిపోతుందని.. సీరియల్ లో ఏదైనా జరగొచ్చని చెప్పింది. ఇప్పటివరకు తను చేసిన పాత్రలతో మంచి పేరొచ్చిందని.. జనాలు గుర్తుపట్టి పలకరిస్తుంటార‌ని.. తనను అభిమానిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇక సీరియల్స్ లో కానీ.. రియల్ లైఫ్ లో కానీ చేదు అనుభవాలు లేవని క్లారిటీ ఇచ్చింది. గొడవలకు దూరంగా ఉంటానని.. దేన్నీ సీరియస్ గా తీసుకోనని చెప్పింది. ఎవరైనా గొడవ పెట్టుకోవడానికి వస్తే పక్కకి తప్పుకుంటానని.. అలాంటి వారికి దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది.  ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు తెలుగు సీరియల్స్ లో హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం గురించి మాట్లాడుతూ.. తనకు ఆ విషయంలో ఎలాంటి బాధ, బెంగ లేవని చెప్పింది. పక్క రాష్ట్రం వాళ్లు వచ్చి చేసేస్తున్నారు.. నాకు రోల్స్ రావనే భయం తనకు లేదని.. ఎవరు వచ్చినా, వెళ్లినా పట్టించుకోనని.. వాళ్లతో తనకు పోటీ లేదని.. తన రోల్స్ తనకు ఉన్నాయని స్పష్టం చేసింది. తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయని.. కానీ సీరియల్స్ లోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నట్లు చెప్పింది. 

న‌లుగురికి సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్న‌ సొహేల్‌!

  బిగ్ బాస్ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు సొహేల్ ర్యాన్‌. హౌస్ లో ఉన్నంత కాలం 'కథ వేరే ఉంటది' అంటూ రచ్చ చేశాడు. అరియనాతో గొడవలు, అఖిల్ తో స్నేహం, టాస్క్ ల కోసం కష్టపడడం లాంటి విషయాలు సొహేల్‌ ని వార్తల్లో నిలిచేలా చేశాయి. హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత అత‌డి ఇమేజ్ బాగా పెరిగింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభిజిత్ కి పాతిక లక్షలు వస్తే.. సొహేల్‌ కి మాత్రం నలభై లక్షల వరకు వచ్చింది.  నాగార్జున, చిరంజీవి ఇచ్చిన చెక్కులతో సొహేల్‌ క్రేజ్ బాగా పెరిగింది. అయితే తనకు వచ్చిన ఈ మొత్తంలో ఎక్కువ శాతాన్ని సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నాడు సొహేల్‌. తాజాగా తన స్వచ్చంద సంస్థ గురించి చెబుతూ సోషల్ మీడియాలో కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. సొహేల్‌ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఇప్పటివరకు చాలా సేవా కార్యక్రమాలు చేసినట్లు చెప్పాడు. భవిష్యత్తులో కూడా ఇలానే చేస్తామని అన్నాడు.  కొన్ని రోజుల్లో వందమంది జూనియర్ ఆర్టిస్ట్ లకు రేషన్, సరుకులు అందించబోతున్నట్లు తెలిపాడు. తమ చారిటీ సంస్థ ద్వారా నాలుగు ఆపరేషన్స్ ను విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చాడు. అందులో ఒకటి న్యూరో సర్జరీ కాగా.. మరో మూడు హార్ట్ ఆపరేషన్స్ అని.. ఇప్పటివరకు రూ. 24 లక్షలకు పైగా ఖర్చు పెట్టి ఛారిటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించామని వివరించాడు. ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఉందని.. కష్టాల్లో ఉన్నవారికి తమ వంతుగా సాయం అందిస్తామని చెప్పాడు. 

సుధీర్‌కు కన్నుకొడుతూ.. పెదాలు కొరుక్కుంటూ రెచ్చిపోయిన రష్మీ!

  బుల్లితెర జోడీ సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీలకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. 'జబర్దస్త్', 'ఢీ' వంటి షోలలో ఈ జంట చేసే రచ్చ మాములుగా ఉండదు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడంతో ఈవెంట్ మేనేజర్స్ కూడా ఈ పెయిర్ తో మ్యాజిక్ రిపీట్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన 'ఢీ 10' ప్రోమోలో వీరిద్దరి రొమాంటిక్ ట్రాక్ హైలైట్ అయింది. అందరూ చూస్తుండగానే సుధీర్‌కు కన్నుకొడుతూ రష్మీ రెచ్చిపోవడం హాట్ టాపిక్ గా మారింది.  ముందుగా యాంకర్ ప్రదీప్ డల్ గా ఉన్న సుధీర్‌ను స్టేజ్ పైకి పిలిచాడు. అతడితో పాటు హైపర్ ఆది కూడా వచ్చాడు. వీరిద్దరూ ఒకేరకమైన బట్టలు వేసుకొని కనిపించారు. సుధీర్ పర్పుల్ కలర్ వేసుకోవడంతో.. ప్రదీప్ పరుపుల అంటూ సెటైర్ వేశాడు. వెంటనే  జడ్జి ప్రియమణి పరుపుల సుధీర్ అంటూ పరువు తీసేసింది. అనంతరం ప్రోమో చివర్లో రష్మీ-సుధీర్ ల రొమాన్స్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.  అందరూ చూస్తుండగానే డైరెక్ట్ గా సుధీర్‌కి కన్నుకొడుతూ పక్కకు పిలిచింది రష్మీ. అంతేకాదు.. అతని వంక చూస్తూ మునిపంటితో పెదాలు కొరుక్కుంది. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. ప్రియమణి అయితే నోరెళ్లబెట్టింది. ఇక రష్మీ అలా పిలవడంతో సుధీర్ ప‌ర‌వ‌శంతో మైమ‌ర‌చిపోయాడు. మాటల్లో చెప్పలేనంత ఆనందంతో మురిసిపోయాడు. 

నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు ఎమోష‌న‌ల్ అయిన డాక్టర్ బాబు భార్య! ఆ ప్ర‌శ్నేమిటంటే...

  బుల్లితెర ప్రేక్షకులకు 'కార్తీక దీపం' ఫేమ్ నిరుపమ్ పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన భార్య మంజుల కూడా సీరియల్స్ లో నటిస్తున్నారు. 'చంద్రముఖి' సీరియల్ తో వీరిద్దరి ప్రయాణం మొదలైంది. షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఓ కొడుకు కూడా ఉన్నాడు. నిరుపమ్ భార్యగా మంజులకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. వీరిద్దరూ కలిసి ఓ సీరియల్ చేస్తే చూడాలని అభిమానులు ముచ్చట పడుతున్నారు.  'హిట్లర్ గారి పెళ్ళాం' సీరియల్ తో త్వరలోనే మంజుల ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో మంజుల కన్ఫర్మ్ చేసింది. నిరుపమ్ తో కలిసి ఎప్పుడు నటిస్తారని నెటిజన్ ప్రశ్నించగా.. దానికి మంజుల 'హిట్లర్ గారి పెళ్ళాం' సీరియల్ తో త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతోన్నట్టు తెలిపింది. తాజాగా మరోసారి ఆమె తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టారు.  ఈ క్రమంలో 'అదా..? ఇదా..?' రెండింటిలో ఏదొకటి సెలెక్ట్ చేసుకోవాలనే ఆట ఆడారు. దీంతో నెటిజన్లు రకరకాల ప్రశాలు అడిగారు. "డాక్టర్ బాబు అంటే ఇష్టమా..? హిట్లర్ అంటే ఇష్టమా..?", "బెంగళూరా..? హైదరాబాదా..?" అంటూ రకరకాల ప్రశ్నలు సంధించారు. తనకు హిట్లర్ అంటే ఇష్టమని, బెంగళూరు అంటేనే ఇష్టమని చెప్పుకొచ్చింది. మరో నెటిజన్ "భర్తా..? కొడుకా..?" అని అడిగాడు. దానికి ఆమె ఇద్దరినీ వేరు చేయలేనని.. అలా చేసిన రోజు నా ఊపిరి ఆగిపోతుందని ఎమోషనల్ అయింది. 

జ‌బర్ద‌స్త్‌.. నైటీతో వ‌చ్చేసిందంటూ రోజా డ్రెస్సుపై ట్రోల్స్‌!

  అనారోగ్యం కారణంగా 'జబర్దస్త్' షోకి కొంతకాలం పాటు దూరమైనా రోజా.. రీసెంట్ గా మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె షోకి వేసుకొచ్చిన డ్రెస్సుపై సోషల్ మీడియాలో నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నిజానికి చాలా మంది ఆడవాళ్లు రోజా ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుందా అని ఈ షోని చూస్తుంటారు. ఆమె వేసుకునే డ్రెస్సులు, చీరల గురించి చర్చించుకుంటారు.  అలాంటిది తాజాగా ఆమె వేసుకొని వ‌చ్చిన‌ డ్రెస్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు. అచ్చం నైటీలా ఉన్న లాంగ్ డ్రెస్ ను వేసుకొచ్చింది రోజా. ఆ డ్రెస్ వేసుకొని డాన్స్ స్టెప్స్ వేసింది. దీంతో నెటిజన్లు ఆమెని ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. ఆలస్యంగా లేవడంతో షోకి లేట్ అయిపోతుందని నైటీతో వచ్చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆమెపై మీమ్స్ కూడా క్రియేట్ చేశారు.  "ఏదైతే అది అయిందని జెట్  స్పీడ్ లో వచ్చేసినా" అంటూ 'వకీల్ సాబ్' సినిమాలో సూపర్ విమేన్ డైలాగ్ ను రోజాకి ఆపాదిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ట్రోలింగ్ ని రోజా పెద్దగా పట్టించుకోదు. అందుకే దీనిపై కూడా స్పందించలేదు. ఇటీవలే సోషల్ మీడియాలో రోజా రీఎంట్రీ కారణంగా ఇంద్రజను వెనక్కి పంపడంతో 'రోజా మాకొద్దు' అంటూ ఇంద్రజ అభిమానులు చేసిన ట్వీట్స్ వైరల్ అయ్యాయి. 

ఆ హీరోయిన్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరో!

  చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు బాలాదిత్య. 'లిటిల్ సోల్జర్స్', 'హిట్లర్', 'అబ్బాయిగారు', 'హలో బ్రదర్'.. ఇలా చాలా సినిమాల్లో బాలనటుడిగా కనిపించాడు. ఒకప్పటి స్టార్ హీరోలందరి చిన్నప్పటి పాత్రలను కూడా బాలాదిత్యనే పోషించేవాడు. ఆ తరువాత 'చంటిగాడు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. కానీ అతడికి అవకాశాలను తీసుకురాలేకపోయింది.  ఇటీవలే బాలాదిత్య నటించిన 'అన్నపూర్ణమ్మ గారి మనవడు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం బాలాదిత్య పలు సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. గతంలో 'చంటిగాడు', 'సుంద‌రానికి తొంద‌రెక్కువ' సినిమాల్లో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న సుహాసినిని బాలాదిత్య పెళ్లి చేసుకున్నట్లు గ‌తంలో వార్తలొచ్చాయి. ఆమె కూడా కొన్ని సినిమాల్లో న‌టించి, త‌ర్వాత టీవీ సీరియ‌ల్ తార‌గా స్థిర‌ప‌డిన విష‌యం తెలిసిందే. త‌మ‌ పెళ్లి ప్ర‌చారంపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు బాలాదిత్య.  ఆ వార్తల్లో నిజం లేదని అన్నాడు. ఎప్పుడైనా ఫంక్షన్స్‌కు వెళ్లినప్పుడు సుహాసినితో కలిసి ఒకే కారులో వెళ్లేవాడినని.. అది చూసి కొందరు తప్పుగా అనుకున్నారని చెప్పుకొచ్చాడు. తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు. ఇద్దరం కలిసి రెండు సినిమాల్లో నటించేసరికి పెళ్లి చేసుకున్నామంటూ వార్తలు రాసేశారని.. నిజానికి త‌మ‌ ఇద్దరికీ అలాంటి అభిప్రాయమే లేదని స్పష్టం చేశాడు. 

నిజ జీవితంలో 'వంట‌ల‌క్క' భ‌ర్త ఏం చేస్తుంటారో తెలుసా?

  రెండు తెలుగు రాష్ట్రాల్లో 'కార్తీకదీపం' సీరియల్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది వంటలక్క (ప్రేమి విశ్వనాథ్). మలయాళంలో వచ్చిన 'కరుతముత్తు' అనే సీరియల్ కు రీమేక్ గా దీన్ని రూపొందించారు. ఈ ఒక్క సీరియల్ తో మలయాళీ నటి ప్రేమి విశ్వనాథ్ మంచి పాపులారిటీ దక్కించుకుంది. అయితే సీరియల్స్ లో నటించకముందు ఆమె ఏం పని చేసేదో తెలుసా?..  1991 డిసెంబర్ 2న కేరళలో జన్మించిన ప్రేమి విశ్వనాథ్ లా కోర్సు పూర్తి చేసింది. ఆ తరువాత ఓ ప్రైవేట్ సంస్థకు లీగల్ అడ్వైజర్ గా పని చేసింది. ఇక సీరియల్స్ లో నటించడం కంటే ముందు మోడల్ గానూ రాణించింది. అంతేకాకుండా.. 'సాల్మ‌న్‌ 3 డీ' సినిమాలో కూడా నటించింది. ప్రేమి అన్నయ్య శివప్రసాద్ కేరళలో ఫేమస్ ఫోటోగ్రాఫర్. ఆయనకు ఎర్నాకుళంలో రెండు స్టూడియోలు కూడా ఉన్నాయి. తన సోదరుడిలానే ఫోటోగ్రఫీ మీద మక్కువతో కొన్ని పెళ్లిళ్లు, శుభకార్యాలకు పని చేసిందట ప్రేమి విశ్వనాథ్.  ఇక ప్రేమి విశ్వనాథ్ భర్త వినీత్ భట్ ఆస్ట్రాలజీలో పలు అంతర్జాతీయ అవార్డులను సైతం గెలుచుకున్నారు. ఆయన వద్దకు పలువురు రాజకీయ, సినిమా రంగాలకు చెందిన వాళ్లు వస్తుంటారట. ప్రేమి-వినీత్ లకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఇక ప్రేమి విశ్వనాథ్ కు తెలుగులో పలు సినీ అవకాశాలు కూడా వస్తున్నాయట. కానీ ప్రస్తుతం ఆమె సీరియల్ మీదే ఫోకస్ పెట్టారు. 

సీరియల్ నుండి తీసేయడంతో భోరుమ‌న్న‌ నటి!

  'నా పేరు మీనాక్షి' సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి.. మధు రెడ్డి. 2015 నుండి 2021 వరకు ఆమె ఈ సీరియల్ లో కంటిన్యూ అవుతూ వచ్చింది. మధ్యలో డెలివెరీ కోసం బ్రేక్ తీసుకున్నప్పటికీ.. తిరిగి అదే సీరియల్ లో రీఎంట్రీ ఇచ్చింది. అయితే కొన్నాళ్లుగా ఆమె సీరియల్ లో కనిపించడం లేదు. దీంతో ఆమె అభిమానులు చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఆమెని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆమె వివరణ ఇస్తూ బోరున ఏడ్చేసింది.  చాలా సీరియల్స్ లో నటించినప్పటికీ 'నా పేరు మీనాక్షి' సీరియల్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. అయితే కొన్నాళ్లుగా ఈ సీరియల్ డేట్స్ కోసం ఒకటి రెండు రోజులు మాత్రమే తనను అడుగుతున్నారని తెలిపింది. దానికోసం పదిహేను నుండి ముప్పై రోజులు బ్లాక్ చేస్తుండడంతో వేరే సీరియల్స్ చేయలేకపోతున్నానని దర్శకనిర్మాతలకు చెప్పిన విషయాన్ని బయటపెట్టింది. నెలలో రెండు రోజుల కోసం నెలంతా గడపాలంటే కష్టమని చెప్పింది.  అయినప్పటికీ 'నా పేరు మీనాక్షి'తో మంచి పేరు రావడంతో సీరియల్ ను వదల్లేకపోయానని తెలిపింది. అయితే తను దర్శకనిర్మాతలను అడగడంలో తప్పు ఉందో ఏమో తెలియదు కానీ తనను మొత్తానికి సీరియల్ నుండి తప్పించినట్లు వివరించింది మధు రెడ్డి. పిలుస్తారులే అని చాలా రోజులు చూశానని.. కానీ అలా జరగలేదని ఎమోషనల్ అవుతూ ఏడ్చేసింది. 

హైపర్ ఆదిని అర్ధనగ్నంగా కూర్చోపెట్టిన ఓంకార్!

  బుల్లితెరపై రోజుకో ఎంటర్టైన్మెంట్ షో పుట్టుకొస్తూనే ఉంది. అయితే ఓంకార్ హోస్ట్ చేసే షోలు కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి. ఇస్మార్ట్ జోడి, డ్యాన్స్ ప్లస్, సిక్స్త్ సెన్స్ వంటి షోలతో ఓంకార్ మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ మధ్యనే డాన్స్ ప్లస్ షోను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. ఇక ఇప్పుడు సిక్స్త్ సెన్స్ కొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఓంకార్‌. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన మూడు సీజన్లను టెలికాస్ట్ చేశారు. ఇప్పుడు నాల్గో సీజన్ రాబోతుంది.  ఈ షోకి బుల్లితెర తారలు, టాలీవుడ్ సెలబ్రిటీలను తీసుకొచ్చి గేమ్స్ ఆడిస్తుంటారు ఓంకార్. తాజాగా ఈ కొత్త సీజన్‌కు హైపర్ ఆది, అనసూయలను గెస్ట్ లుగా తీసుకొచ్చారు ఓంకార్. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇప్పుడు అది యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. ఇందులో హైపర్ ఆది షర్ట్ తీయించి అర్ధనగ్నంగా కూర్చోబెట్టారు ఓంకార్.  ఛాలెంజ్ లో ఓడిపోవ‌డంతో హైపర్ ఆది తన షర్ట్ ను తీయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో అతడు.. ''ఆది కేశవరెడ్డిలా వస్తే అర్జున్ రెడ్డిలా చేశారంటూ'' కౌంటర్ వేశాడు. గేమ్‌లో ఆదిని బాగా టెన్షన్ పెట్టేశారు ఓంకార్. దీంతో అతడు టెన్షన్ తట్టుకోలేక.. "ఆ లక్ష మీకే ఇచ్చేస్తాను నన్ను వదిలేయండి." అంటూ బతిమాలుకున్నాడు. "ఇలా కూడా బ్రతకనివ్వరా!" అంటూ ఓంకార్ మీద అసహనం వ్యక్తం చేశాడు. ఆదితో పాటు అనసూయను కూడా బాగానే టెన్షన్ పెట్టినట్లు ఉన్నారు ఓంకార్. 

"ఆఫర్ ఇస్తే మాకేంటి అంటున్నారు".. సీరియల్ నటి ఆవేదన!

  కొన్నిరోజులుగా స్టార్ మాలో ప్రసారమవుతోన్న 'జానకి కలగనలేదు' సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ లో పనిమనిషి క్యారెక్టర్ లో నటిస్తోన్న చికిత (రమ్య) తన నటనతో మెప్పిస్తోంది. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నటనపై మక్కువతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కుటుంబానికి తానే ఆధారం కావడంతో ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది రమ్య. అయితే తనకు అవకాశాలు వస్తున్నాయి కానీ నాకేంటి అంటూ వేధించేవాళ్లు ఎక్కువగా ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.  తొలిసారి 'జానకి కలగనలేదు' సీరియల్ లో ఆఫర్ వచ్చిందని.. రాశి, అమర్, ప్రియాంక లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్ట్ లతో పని చేయడం సంతోషంగా ఉందని చెప్పింది. కెమెరా ముందు ఎలా చేయాలో తనకు తెలియకపోతే వాళ్లే హెల్ప్ చేశారని చెప్పుకొచ్చింది. అనంతరం ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. అందరూ అమ్మాయిలను అదే ఉద్దేశంతో చూస్తున్నారని.. ఒక్కోసారి ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా అని అనిపిస్తోంద‌ని.. ఎందుకు బతికున్నానా..? అనే ఫీలింగ్ వచ్చిందని చెప్పుకొచ్చింది.  తన ఇంట్లో ఆర్థిక‌ ఇబ్బందుల కారణంగా ఇండస్ట్రీకి రావాల్సి వచ్చిందని.. వచ్చిన తరువాత క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు వచ్చాయని చెప్పింది. అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు నో చెప్పేదాన్ని అనీ, అందుకే సరైన అవకాశాలు రాలేదనీ తెలిపింది. కానీ 'జానకి కలగనలేదు' టీమ్ వాళ్లు సాయం చేయడంతో తనకు అవకాశం వచ్చిందని అంటూ.. టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు చెప్పింది.

ఆర్జీవీతో ఇంటర్వ్యూ.. టెన్షన్‌లో అరియానా!

  అప్పటివరకు అరియానా గ్లోరీ అంటే ఎవరికీ తెలియదు. కానీ ఆర్జీవీను ఇంటర్వ్యూ చేసి సూపర్ పాపులారిటీ దక్కించుకుంది ఈ బ్యూటీ. ఈ ఇంటర్వ్యూ కారణంగానే ఆమెకి బిగ్ బాస్ షోలో ఛాన్స్ వచ్చింది. ఈ షో అరియానాకు మరింత క్రేజ్ ను తీసుకొచ్చింది. దీంతో హౌస్ నుండి బయటకొచ్చిన తరువాత ఆమెకి పలు టీవీ షోలు, సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. రీసెంట్ అరియనా ట్విట్టర్ లో ఓ ఫోటో షేర్ చేసింది.  అందులో ఆర్జీవీ, అరియనా జిమ్ డ్రెస్ లో కనిపించారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ వర్మను మరోసారి ఇంటర్వ్యూ చేసినట్లు తెలిపింది అరియానా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. ఆర్జీవీ ప్రత్యేకించి తనతో ఓ ఇంటర్వ్యూ చేయమని అరియానాను కోరాడట. పైగా ఆ ఇంటర్వ్యూ కూడా డిఫరెంట్ గా యాంకర్-గెస్ట్ ఇద్దరూ జిమ్ లో కసరత్తులు చేస్తూ ఉండేలా ఒక థీమ్ తో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.  ఇంటర్వ్యూ పూర్తయిందని.. ఆర్జీవీనే ఎడిటింగ్ బాధ్యతలు, ప్రోమో కటింగ్ పనులు పూర్తి చేశారని.. ఆ తరువాత అరియానాను పిలిచి ప్రోమోను చూపించినట్లు తెలుస్తోంది. ఇది చూసిన అరియనా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని సన్నిహితుల వద్ద టెన్షన్ పడినట్లు సమాచారం. అరియానా అంతలా టెన్షన్ పడుతుందంటే.. ఈ ఇంటర్వ్యూ మొత్తం వర్మ స్టైల్ లో పొగడ్తలు, హాట్ కామెంట్స్ తో నిండిపోయి ఉందనిపిస్తుంది. 

లైవ్‌లో టీవీ యాక్ట‌ర్‌ ఆత్మహత్యాయత్నం..!

  కరోనా వైరస్ కారణంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ వైరస్ అన్ని దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇండియాలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. దీన్ని కట్టడి చేయాలని ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా ఎందరో ప్రజాలు జీవనోపాధిని కోల్పోయారు. చాలా మంది పేద ప్రజలు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. తినడానికి తిండి లేక ఆకలి చావులకు గురవుతున్నారు. ఈ వైరస్ ప్రభావం సినీ పరిశ్రమపై కూడా పడింది.  షూటింగ్స్ లేకపోవడంతో సినీ కార్మికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో బెంగాలీ నటుడు సువో చక్రవర్తి అవకాశాలు లేక ఆర్థిక‌ సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడంతో ఫేస్ బుక్ లైవ్ లో సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. బెంగాలీలో 'మంగళ చాందీ', 'మానస' వంటి సీరియల్స్ తో అక్కడ ప్రేక్షకులకు దగ్గరైన చక్రవర్తి రీసెంట్ గా అభిమానులతో ఫేస్ బుక్ లైవ్ లో పాల్గొన్నాడు.  లైవ్‌లో మాట్లాడుతూ సడెన్ గా ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు మింగేశాడు. ఇది చూసిన ఆయన స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సువో చక్రవర్తిని హాస్పిటల్‌లో చేర్పించి అతడి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఆర్థిక‌ ఇబ్బందుల కారణంగానే ఆయన ఆత్మహత్యాయ‌త్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 

ఆ నిర్మాత న‌న్ను మోసం చేశాడు!

  కమెడియన్ గా వెండితెరపై పలు సినిమాల్లో నటించిన అభి.. 'జబర్దస్త్' షోతో మరింత హాస్యాన్ని పండిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా 'జబర్దస్త్' షోలో కనిపిస్తోన్న అభి తన టీమ్ ద్వారా చాలా మంది కమెడియన్స్ ను పరిచయం చేశాడు. అలా వచ్చిన వారిలో హైపర్ ఆది టాప్ రేసులో దూసుకుపోతున్నాడు. అభి తన స్కిట్ లలో డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు లేకుండా క్లీన్ కామెడీ ఉండేలా చూసుకుంటాడు.  మధ్యలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేశాడు. ఆ తరువాత హీరోగా మారాలని ప్రయత్నించాడు. కొన్నాళ్లక్రితం అతడు హీరోగా నటించిన సినిమా ఓటీటీలో విడుదలైంది. కానీ అభికి అంత క్రేజ్ ను తీసుకురాలేకపోయింది. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా 'అలీతో సరదాగా' షోకి గెస్ట్ గా వచ్చాడు అభి. అతడితో పాటు రామ్ ప్రసాద్ కూడా వచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో అభి తనకు జరిగిన మోసాన్ని బయటపెట్టారు.  అభి దర్శకుడిగా ఓ నిర్మాత ఐదు కోట్లు పెట్టి సినిమా చేయాలనుకున్నాడట. తన మీద అంత బడ్జెట్ పెట్టి సినిమా తీస్తున్నాడు కదా.. అలాంటిది తను కొంచెమైనా హెల్ప్ చేయాలని ఐదు లక్షల చెక్కు రాసిచ్చానని అభి చెప్పుకొచ్చాడు. ఆ తరువాత డబ్బులు వెనక్కి రాలేదని, దానికోసం పోలీసుల దగ్గరకు కూడా వెళ్లానని తెలిపాడు. అయితే ఆ నిర్మాత ఎవరనేది వెల్ల‌డించ‌లేదు. అలానే తనకు కొన్ని అవమానాలు కూడా ఎదురయ్యాయని అన్నాడు. పూర్తి ఎపిసోడ్ ప్రసారమైన తరువాత మరిన్ని వివరాలు తెలుస్తాయి. 

"కొడుకు పుడితే నీలా పెంచుతా".. రవికృష్ణపై సావిత్రి ప్రేమ!

  బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ లుగా పాల్గొన్న తీన్మార్ సావిత్రి, సీరియల్ నటుడు రవికృష్ణల మధ్య ఎమోషనల్ బాండింగ్ క్రియేట్ అయింది. రవిని తన సొంతింట్లో మనిషిలా ట్రీట్ చేస్తుంటుంది సావిత్రి. అతడికి కోవిడ్ వచ్చినప్పుడు ఫ్యామిలీ మొత్తం దూరంగా ఉండడంతో సావిత్రి తన ఇంటికి తీసుకెళ్లి సేవలు చేసిందని గతంలో ఓ షోలో చెప్పి ఎమోషనల్ అయ్యాడు రవికృష్ణ. సావిత్రి సొంత అక్క కంటే చాలా ఎక్కువ అని.. అమ్మలా చూసుకుంటుందని రవికృష్ణ సందర్భం వచ్చిన ప్రతీసారి చెబుతూ ఉంటాడు.  ఇక ఈరోజు (జూన్ 9) పుట్టినరోజు జరుపుకుంటున్న రవికృష్ణకు సావిత్రి ఎమోషనల్ గా బర్త్ డే విషెస్ చెప్పింది. ''కొడుకు పుడితే నీలా పెంచాలి.. అంత ప్రేమ.. ఒక వేళ పుట్టకపోయినా ఏం కాదు నా కొడుకువి నువ్వు ఉన్నావ్ అన్న నమ్మకం'' అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన రవి.. ''లవ్యూ అమ్మా'' అంటూ రిప్లై ఇచ్చాడు. మరోపక్క రవికృష్ణ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది నటి నవ్య స్వామి. చాలా కాలంగా వీరిద్దరి మధ్య ఎఫైర్ సాగుతుందని వార్తలొస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ జంటకు మంచి డిమాండ్ కూడా ఉంది. అయితే వీరి రిలేషన్ పై ఈ జంట పెద్దగా స్పందించింది లేదు. ఇదిలా ఉంటే రవికృష్ణ బర్త్ డే సందర్భంగా అర్ధరాత్రి అతడితో కేక్ కట్ చేయించింది నవ్య. 'నువ్ కోరుకున్న ప్రతీదీ నీకు దక్కాలని.. ఈ ఏడాది మొత్తం నీకు బాగుండాలని కోరుకుంటున్నట్లు' పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది.