స్టేజ్ మీదే 'జబర్దస్త్' కమెడియన్ పై దాడి!

  బుల్లితెర కామెడీ షోలలో 'జబర్దస్త్' టాప్ రేసులో దూసుకుపోతోంది. ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చిన కమెడియన్లలో వెంకీ ఒకరు. అమ్మాయిలను వేధిస్తున్నాడనే ఆరోపణలతో వెంకీను స్టేజ్ మీదే కొట్టడానికి కొందరు ప్రయత్నించడం హాట్ టాపిక్‌గా మారింది. మిమిక్రీ, వెంట్రిలాక్విజం ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన వెంకీ.. ఎన్నో ఈవెంట్‌లలో తన కామెడీతో ఆకట్టుకున్నాడు.  తన టాలెంట్ తో 'జబర్దస్త్' షోలో ఛాన్స్ కొట్టేశాడు. అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. టీమ్ లీడర్‌గా ఎదిగాడు. ఇదిలా ఉండగా.. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ఇటీవల 'రెచ్చిపోదాం బ్రదర్' అనే షోను మొదలుపెట్టారు. దీనికి నటుడు రాజీవ్ కనకాల జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో కమెడియన్స్ తో పాటు స్టూడెంట్స్ కూడా రచ్చ చేస్తున్నారు.  తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో ఓ అమ్మాయిని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ.. కొందరు వెంకీ కోసం ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. రాజీవ్ కనకాల ముందే వాళ్లంతా గొడవకు దిగారు. వాళ్లతో పాటు సదరు యువతి కూడా అక్కడకు వచ్చింది. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు వెంకీపై దాడికి దిగినట్లు కనిపిస్తోంది. దీంతో ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. ఇదంతా నిజమో..? లేక మల్లెమాల పబ్లిసిటీలో భాగమో తెలియాల్సి వుంది!

ఆర్జీవీ అమ్మాయిల‌ను వేధించే టైపు కాదు.. ఆయ‌న‌పై ఎవ‌రైనా ఫిర్యాదు చేశారా?

  గ‌తంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ ద్వారా పాపులారిటీ దక్కించుకుంది అరియానా. ఈ ఇంటర్వ్యూ కారణంగానే ఆమెకి బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఛాన్స్ వచ్చింది. ఈ షోలో ఆమె తన ప్రవర్తనతో, ఆటతీరుతో అందరినీ మెప్పించింది. రీసెంట్ గా మరోసారి వర్మని ఇంటర్వ్యూ చేసి హాట్ టాపిక్ గా మారింది. వర్మతో కలిసి జిమ్ లో వ్యాయామాలు చేస్తూ దిగిన ఫోటోలను వదులుతూ మొదటి నుండే పక్కా ప్లాన్ గా ఈ ఇంటర్వ్యూపై బజ్ వచ్చేలా చేశారు.  దీంతో ఈ ఇంటర్వ్యూ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని జనాలు ఎదురుచూశారు. రీసెంట్ గా పూర్తి ఇంటర్వ్యూ బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూపై చర్చలు జోరుగా నడుస్తున్నాయి. కొంత‌మంది స‌మాజాన్ని త‌ప్ప‌దోవ ప‌ట్టించే విధంగా ఆ ఇంట‌ర్వ్యూ ఉంద‌నీ, త‌న కూతురు కంటే చిన్న వ‌య‌సు అమ్మాయితో అత్యంత అభ్యంత‌ర‌క‌రంగా, అస‌హ్య‌క‌రంగా వ‌ర్మ మాట్లాడార‌నీ కొంత‌మంది విమ‌ర్శిస్తున్నారు. ఈ క్రమంలో అరియనా స్పందించింది. ఆర్జీవీతో అంతసేపు ఇంటర్వ్యూ చేయడమే ఓ పెద్ద టాస్ అని.. తనకు ఈ ఇంటర్వ్యూ ప్లస్ అవుతుందేమో కానీ ఆయనకు మాత్రం మామూలే అని చెప్పుకొచ్చింది .  అందరూ బోల్డ్ ఇంటర్వ్యూ అంటున్నారు కానీ అందులో బోల్డ్ ఏముందో తనకు అర్ధం కావడం లేదని చెప్పుకొచ్చింది. ఒకవేళ ఆర్జీవీ అమ్మాయిలను వేధించే టైప్ అయితే.. ‘మీటూ’లో ఆయన పేరు ఉండేదిగా.. ఎవరన్నా ఆయనపై ఫిర్యాదు చేశారా..? అంటూ తన గురువుని సపోర్ట్ చేస్తూ మాట్లాడుకొచ్చింది. ఈ ఫీల్డ్ లో సక్సెస్ అవ్వాలంటే కోపగించుకోకూడదని.. కోపం వల్ల సాధించేదేమీ లేదు కాబట్టి రాజీ పడాల్సిందే.. అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. 

మంగ్లీ మోడ్ర‌న్ లుక్.. దేని కోసం?

  ఒకప్పుడు యాంకర్ గా, తెలంగాణ జానపద గీతాలతో ప్రేక్షకులను అలరించేది మంగ్లీ. 'తీన్మార్' అనే టీవీ కార్యక్రమం ద్వారా పరిచయమైన ఈమె.. ఆపై పలు పాటలతో ఆకట్టుకుంది. పలు టీవీ షోలలో పాల్గొనే అవకాశం తెచ్చుకొని బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సినిమాల్లో కూడా సింగర్ గా ఆమెకి ఛాన్స్ లు వస్తున్నాయి. 'లవ్ స్టోరీ' సినిమాలో ఆమె పాడిన 'సారంగ దరియా' పాటకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.  ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు ఎంతో సంప్రదాయబద్ధంగా కనిపించిన మంగ్లీ తొలిసారి ట్రెండీ గెటప్ లో కనిపించి షాకిచ్చింది. డార్క్ బ్లూ క‌ల‌ర్ స్క‌ర్ట్ ధ‌రించిన ఆమె, ఆ ఫొటోల‌ను త‌న ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేసి, వాటికి "మోడ‌ర‌న్ మంగ్లీ" అంటూ క్యాప్ష‌న్ పెట్టింది. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. త్వరలోనే మొదలుకానున్న 'బిగ్ బాస్' షోలోకి మంగ్లీ వెళ్తోంద‌నీ.. అందులో భాగంగానే ఆమె ఇలా కొత్త లుక్కులో దర్శనమిస్తున్న‌ట్లుగా ఉంద‌నీ అంటున్నారు ఫ్యాన్స్.  నిజానికి బిగ్ బాస్ సీజన్ 4లో మంగ్లీ కంటెస్టెంట్ గా కనిపిస్తుందని అన్నారు. కానీ అలా జరగలేదు. ఇక సీజన్ 5లో ఆమెని తీసుకురావడానికి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కారణం ఏదైనప్పటికీ మంగ్లీ మాత్రం తన ట్రెండీ లుక్‌తో ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. మంగ్లీని ఇప్పటివరకు ఇలాంటి గెటప్ లో చూడని అభిమానులు ఆమెని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. 

"ద‌గ్గ‌ర్నుంచి చూస్తుంటే భ‌య‌మేస్తోంది".. అషురెడ్డి పరువు తీసేసిన స్టూడెంట్!

  ఈ మధ్యకాలంలో బుల్లితెరపై కామెడీ షోలలో బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువైపోయాయి. యాంకర్లు, కమెడియన్లు ఒకర్ని మించి మరొకరు డబుల్ మీనింగ్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. ఈ లిస్ట్ లో యాంకర్ రవి కూడా ఉంటాడు. ఈ మధ్య లాస్యతో కలిసి కామెడీ షోలు మొదలుపెట్టిన యాంకర్ రవి.. తాజాగా అషురెడ్డితో మరో కొత్త షో చేస్తున్నాడు.  బిగ్ బాస్ షోతో పాపులారిటీ తెచ్చుకున్న అషురెడ్డి ఈ మధ్యకాలంలో లవ్ ఎఫైర్లతో, తన డ్రెస్సింగ్ తో వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం రవితో కలిసి ఆమె హోస్ట్ చేస్తోన్న 'హ్యాపీ డేస్' షోకి ఓ మోస్తరు రేటింగ్‌లు వస్తున్నాయి. అప్పట్లో రవి-శ్రీముఖి కలిసి చేసిన 'పటాస్' షోకు జిరాక్స్ కాపీలా ఉంది 'హ్యాపీ డేస్' షో. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో అషురెడ్డి డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయింది.  ఈ షోకి కొంతమంది స్టూడెంట్స్ గెస్ట్ లుగా రాగా.. వారిలో ఒక అమ్మాయి "అషురెడ్డితో కలిసి యాంకరింగ్ చేస్తున్నావ్ కదా.. ఆమెతో సినిమా తీయాల్సి వస్తే ఏం సినిమా తీస్తావ్?" అని ఓ స్టూడెంట్ ప్రశ్నించగా.. దాని రవి తడుముకోకుండా "జఫ్ఫా" అని బదులిచ్చాడు. ఆ తరువాత మరో స్టూడెంట్ రవిని ఉద్దేశిస్తూ.. "మీరు చాలా మంది యాకర్స్ తో చేశారు కదా.. " అని అంటుంటే వెంటనే అషురెడ్డి "ఏం చేశాడు?" అంటూ కుళ్లు జోక్ వేసింది. ఇక అషురెడ్డిని జూనియర్ సమంత అని తెగ పొగిడిన ఓ స్టూడెంట్ స్టేజ్ మీదకొచ్చాక‌.. ర‌వితో, "అన్నా.. ఆమెను ద‌గ్గ‌ర్నుంచి చూస్తుంటే భ‌య‌మేస్తోంది." అంటూ అషు పరువు తీసేశాడు. దాంతో ర‌వి ప‌గ‌ల‌బ‌డి న‌వ్వ‌గా, అషు తెల్ల‌బోతూ స్టూడెంట్ వంక అలాగే చూస్తుండిపోయింది.

'అరుంధతి' స్పూఫ్‌తో అదరగొట్టిన లాస్య, రవి!

  బుల్లితెర మీద రవి, లాస్యల కాంబినేషన్ అప్పట్లో పెద్ద హిట్. ఉదయం పాటల ప్రోగ్రాంతో పలకరించే ఈ జంట మరికొన్ని టీవీ షోలలో కూడా సందడి చేసేది. ఆ తరువాత వాళ్ల క్రేజ్ తగ్గింది. పైగా ఇద్దరికీ గొడవలు వచ్చి విడిపోయారు. అలా దాదాపు ఐదేళ్లుగా వీరు విడిగానే ఉన్నారు. ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీ అయ్యారు. అయితే ఈ మధ్య మళ్లీ ఇద్దరూ కలిసిపోయారు.  అంతేకాదు, ప్రస్తుతం ఇద్దరూ కలిసి 'కామెడీ స్టార్స్' షోలో సందడి చేస్తున్నారు. రవితో కలిసి ఒకప్పటి మ్యాజిక్ ను రీక్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తోంది లాస్య. 'కామెడీ స్టార్స్' షోలో టాలీవుడ్ హిట్ సినిమాలను స్పూఫ్ లుగా చేస్తూ కామెడీ పండిస్తున్నారు. గతంలో 'ఉప్పెన', 'నరసింహ', 'నువ్వొస్తానంటే నేనొద్దాంటానా' వంటి సినిమాలను స్పూఫ్ చేసి కామెడీ పండించారు.  తాజాగా 'అరుంధతి' సినిమాను స్పూఫ్ చేశారు. అరుంధతిగా లాస్య‌.. పశుపతిగా ర‌వి వేషాలు వేశారు. రవి స్టేజ్ పైకి రాగానే 'లాస్య ఆంటీ అయిందే' అంటూ పంచ్ వేసేశాడు. ఆ తరువాత లాస్య నవ్వుని చూసుకుంటూ 'చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే' పాట వేసుకున్నాడు రవి. ఐదేళ్లుగా నీకో విషయం చెబుదామనుకుంటున్నా అంటూ రవిపై సమాధి వేసి మూసేస్తూ 'స్టే హోమ్ స్టే సేఫ్' అంటూ మెసేజ్ ఇచ్చింది లాస్య. ఆ త‌ర్వాత స‌మాధిలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి, "ఐదేళ్లు సమాధిలో కుళ్ల‌బెట్టిన నిన్ను ఈ రోజు వ‌ద‌ల బొమ్మాళీ".. అంటూ హ‌ల్‌చ‌ల్ చేశాడు ర‌వి.

కాళ్ల‌కు మొక్కిన ఆర్టిస్టులు.. భావోద్వేగానికి గురైన రాశి!

  ప్రముఖ యాంకర్ సుమ హోస్ట్ చేస్తోన్న షోలలో 'స్టార్ట్ మ్యూజిక్' షో ఒకటి. బిగ్ బాస్ కంటెస్టెంట్లను, టీవీ ఆర్టిస్ట్ లను ఈ షోకి అతిథులుగా తీసుకొచ్చి వారితో రకరకాల టాస్క్ లు చేయిస్తూ ఫన్ క్రియేట్ చేస్తుంటుంది సుమ. తాజాగా ఈ షోకి 'జానకి కలగనలేదు' టీమ్ వచ్చింది. ఈ సీరియల్ లో సీనియర్ హీరోయిన్ రాశి కీలకపాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు ఆమె భర్తగా, కొడుకుగా అలానే సీరియల్ లో ముఖ్య పాత్రలు పోషిస్తున్న వారు అతిథులుగా వచ్చారు.  'ఇస్మార్ట్ అమ్మ వర్సెస్ ఇన్నోసెంట్ అబ్బాయి' అంటూ ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. గెస్ట్ లను తన ఫన్నీ పంచ్ లతో ఓ ఆట ఆడేసుకున్న సుమ.. ఆ తరువాత రాశిని ఉద్దేశిస్తూ.. 'మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్లు అవుతుందండి' అని ప్రశ్నించింది. దానికి రాశి.. 'నా ఏజ్ ఎంతో అంత' అని చెప్పగా.. 'ఓ.. అయితే నా అంతే' అంటూ కౌంటర్ వేసింది సుమ.  అనంతరం రాశి ఇండస్ట్రీకి వచ్చి 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. ఇదే షోలో సెలబ్రేషన్స్ చేశారు. ఆమె లాంటి ఆర్టిస్ట్ తో కలిసి వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ కో ఆర్టిస్ట్ లంతా ఆమె ముందు మోకాళ్లపై నుంచొని నమస్కారం పెట్టగా.. భావోద్వేగానికి గుర‌వుతూ వారిని ఆప్యాయంగా హత్తుకుంది రాశి. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.

"అప్పుడే రిటైర్మెంట్ వ‌ద్దు".. సుమ వీడియోపై ఫన్నీ ట్రోల్స్!

  యాంకర్ సుమ సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తుంటారో తెలిసిందే. బుల్లితెరపైనే కాకుండా సోషల్ మీడియాలో కూడా సుమ సందడి చేస్తుంటారు. ప్రతీ రోజూ ఏదొక పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెడుతుంటారు. అలా సోషల్ మీడియాలో సుమ చేసే అల్లరికి అందరూ ఫిదా అవుతుంటారు. గతేడాది నుండి సుమ సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు.  కరోనా, లాక్ డౌన్ కారణంగా ఇంటి పట్టునే ఉంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేయడంతో తిరిగి వర్క్ లో బిజీ అయ్యారు. ఈ క్రమంలో ఆమె షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇంట్లో క్యాలెండర్ ను చూస్తూ జూలై 1వ తేదీని మార్క్ చేస్తూ.. ఆరోజు ఎగ్జ‌యిట్‌మెంట్‌ అనౌన్స్‌మెంట్‌ ఉండబోతుందంటూ చెప్పుకొచ్చారు.  ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ఫన్నీగా ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించొద్దని.. మిమ్మల్ని స్క్రీన్ పై చూడాలనుకుంటున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ష‌కొత్త ఛానెల్ ఏమైనా ఓపెన్ చేస్తున్నారా?ష‌ అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో తన కొడుకు సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ అయి ఉంటుందేమో అని ఎవరికి వాళ్లు ఊహాగానాలు అల్లేస్తున్నారు.  

పెళ్లిని కామెడీగా మార్చేసిన 'శ్రీ‌దేవి డ్రామా కంపెనీ'!

  రీసెంట్ గా యాంకర్ వర్ష చేతిలో తాళిబొట్టు పెట్టుకొని జూలై 4న బిగ్ అనౌన్స్‌మెంట్‌ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన నెటిజన్లు పబ్లిసిటీ కోసం ఇలా చేస్తుందని కొట్టిపారేశారు. మరికొందరు వర్ష పెళ్లి చేసుకోబోతుందంటూ పోస్ట్ లు పెట్టారు. అయితే చాలామంది అనుకున్నట్లుగా ఇదొక చీప్ పబ్లిసిటీ ట్రిక్ అని తేలిపోయింది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను విడుదల చేశారు.  ఇందులో యాంకర్ వర్ష.. కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ను పెళ్లాడుతూ కనిపించింది. వర్ష-ఇమ్మాన్యుయేల్ పెళ్లిపీటలపై ఒకరి పక్కన మరొకరు కూర్చొని తెగ సిగ్గుపడుతూ కనిపించారు. ఇంత‌కు ముందు సుధీర్-ర‌ష్మిలకు పెళ్లి చేసిన 'అహ నా పెళ్లంట‌', ఉగాది స్పెష‌ల్ ఈవెంట్‌ మంచి రేటింగ్స్ తెచ్చుకుంది.. అది మ‌ల్లెమాల వారిదే. అదే త‌ర‌హాలో ఇప్పుడు వర్ష-ఇమ్మాన్యుయేల్ లకు కూడా పెళ్లి చేసేసారు.  ఇలా అందరికీ పెళ్లిళ్లు చేస్తూ మ‌ల్లెమాల సంస్థ‌ పెళ్లిళ్ల కళ్యాణ మండపంలా మారిందంటూ కామెంట్స్ చేస్తూ నెటిజన్లు. ఇంత దిగజారుడు ప్రమోషన్స్ అవసరమా..? అంటూ నిర్వాహ‌కులను తిట్టిపోస్తున్నారు. పెళ్లి అనే ప‌విత్ర బంధాన్ని కామెడీతో హేళన చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా కొత్తగా ఆలోచించి ప్రోగ్రామ్స్ చేయమని సలహాలు ఇస్తున్నారు. 

మేకప్ లేకపోతే ఇలా ఉంటుంది అనసూయ ముఖం!!

  యాంకర్ అనసూయకి బుల్లితెరపై ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. పలు వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఎంతమంది తనను ట్రోలింగ్ చేసినా పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటుంది. తాజాగా అనసూయ తన మొహంపై వచ్చిన మొటిమల గురించి చెబుతూ కొన్ని కామెంట్స్ చేసింది.  అనసూయ అందానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడూ మేకప్‌తోనే కనిపిస్తుంటుంది. మేకప్ లేకుండా చాలా అరుదుగా కెమెరా ముందుకు వస్తుంటుంది. తాజాగా ఆమె మేకప్ లేకుండా నెటిజన్ల ముందుకు వచ్చింది. తనకు మొహం నిండా పింపుల్స్ వచ్చాయని దానికి కారణాలు చెప్పుకొచ్చింది.  పింపుల్స్ రావడం అనేది ఓ సమస్య అని అందరూ ఫీల్ అవుతారని.. మరీ ముఖ్యంగా అమ్మాయిలు.. అని చెప్పింది. ఈ మధ్యకాలంలో అబ్బాయిలు కూడా ఫీలైపోతున్నారని చెప్పింది. కానీ అది సాధారణమైన విషయమని.. మన శరీర ఉష్ణోగ్రత సరిగ్గా పని చేస్తుందనే దానికి గుర్తు అని చెప్పుకొచ్చింది. తనకు ఈ పింపుల్స్ ఎందుకు వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేశానని.. మామిడి పండ్లు తినడం వల్లే ఇలా జరిగిందని చెప్పింది. అలా అని తినకుండా ఉండలేమని.. ఈ ఒక్క సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి.. మ్యాంగో లవర్స్ ఈ విషయంలో మొహమాటపడకండి.. నేను మీతో ఉన్నానంటూ చెప్పుకొచ్చింది.

విజ‌య్ 'బీస్ట్‌'కు ప‌నిచేస్తున్న‌ జానీ మాస్టర్!

  టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లలో జానీ మాస్టర్ ఒకరు. అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంలోని అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంట‌పై చిత్రీక‌రించిన‌ "బుట్ట బొమ్మ" పాటతో జానీ మాస్టర్ మంచి పాపులారిటీ దక్కించుకున్నారు. ఇప్పుడు ఆయనకు కోలీవుడ్‌లోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి. తాజాగా జానీ మాస్టర్‌కు దళపతి విజయ్ సినిమాకి పని చేసే ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా 'బీస్ట్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.  విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కాసేపటికే సెకండ్ లుక్ అంటూ మరో పోస్టర్ వదిలి ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. ఈ పోస్టర్స్ ను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసి విజయ్‌కు స్పెషల్ విషెస్ చెప్పారు జానీ మాస్టర్.  "మీతో కలిసి పని చేస్తున్నందుకు నేను ఎంతో లక్కీ.. ఇంకా మీతో మరెన్నో సినిమాలు చేయాలని అనుకుంటున్నాను." అంటూ రాసుకొచ్చారు జానీ మాస్టర్. అంతేకాదు.. దర్శకుడితో కలిసి తీసుకున్న ఫోటోను కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దర్శకుడికి థాంక్స్ చెప్పారు. 

అషురెడ్డి హ్యాండ్ బ్యాగ్‌ను కోపంతో విసిరికొట్టిన‌ వాళ్ల‌మ్మ‌.. వీడియో వైరల్!

  బిగ్ బాస్ షోతో పాపులారిటీ తెచ్చుకున్న అషురెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రీసెంట్ గా బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతోంది. 'హ్యాపీ డేస్', 'కామెడీ స్టార్స్' లాంటి షోలలో ఆమె చేసే సందడికి అందరూ ఫిదా అవుతున్నాయి. తెరపై ఎంతో చలాకీగా కనిపించే అషురెడ్డి రియల్ లైఫ్‌లో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు రకరకాల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తుంటుంది.  ఈ మధ్యకాలంలో రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపిస్తుందంటూ ఆమెకి సంబంధించిన వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానిగా కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఓ హ్యాండ్ బ్యాగ్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.  ఇందులో అషురెడ్డి ఓ హ్యాండ్ బ్యాగ్‌ను తన తల్లికి చూపించి.. లక్షన్నర పెట్టి కొన్నట్లు చెప్పింది. "నిజం చెప్పు" అంటూ ఆ హ్యాండ్ బ్యాగ్‌ను చూసుకుంటూ అషురెడ్డి వాళ్ల‌మ్మ‌ ప్రశ్నించింది. "నిజమే మ‌మ్మీ" అని అషురెడ్డి చెప్పింది. వెంటనే వాళ్ల‌మ్మ‌ హ్యాండ్ బ్యాగ్‌ను నేలకేసి కొట్టింది. "ఇంట్లో ఉన్నవి సరిపోవా..? అయ్య‌న్నీ ఎందుకు?  పైనేసి తగలబెట్టుకుంటావేటి..?" అంటూ అషురెడ్డిపై ఫైర్ అయింది. దాంతో అషు న‌వ్వు ఆపుకోలేక‌పోయింది. ఈ వీడియో షేర్ చేసిన అషురెడ్డి ఈ బ్యాగ్ తనకు గిఫ్ట్‌గా వచ్చిందంటూ అసలు విషయం చెప్పింది. 

''బాటిల్ మొత్తం తాగాక ఒంటరిగా ఫీల్ అవుతానేమో"!

  క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తన తల్లితో కలిసి ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు. రీసెంట్ గా ఈ తల్లీకూతుళ్లు చీరలు కట్టుకొని చేసిన డాన్స్ పెర్ఫార్మన్స్ కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో సుప్రీత ఎంత యాక్టివ్ గా ఉంటుందో అంతే రేంజ్‌లో ట్రోలింగ్‌కి గురవుతుంటుంది.  ట్రోలర్స్‌పై ఆమె మండిపడే తీరు కూడా వివాదాలకు దారి తీస్తుంటుంది. రీసెంట్ గానే సుప్రీత లైవ్‌లో ఓ నెటిజన్‌కు వార్నింగ్ ఇచ్చింది. తాజాగా సుప్రీత మరోసారి తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టింది. తన గురించి ఎవరేం అనుకుంటున్నారో చెప్పమని సుప్రీత ఓ పోస్ట్ పెట్టింది. దానికి నెటిజన్లు రకరకాలుగా స్పందించారు .  కొందరు సుప్రీత వ్యక్తిత్వం మీద ప్రశ్నలు అడిగితే.. మరికొందరు మాత్రం పర్సనల్ విషయాల మీదే దృష్టి పెట్టారు. ఓ నెటిజన్ మాత్రం సుప్రీతను తాగుడు అలవాటు ఉందా..? అని నేరుగా అడిగాడు. "మీరు ఓ సిప్ తాగాక ఒంటరిగా ఫీల్ అవుతారా..?" అని సుప్రీతను అడగగా.. దానికి ఆమె. ''బహుశా మొత్తం బాటిల్ తాగాక అలా ఒంటరిగా ఫీల్ అవుతానేమో'' అని చెప్పుకొచ్చింది. వైన్ గ్లాస్‌ను కూడా ఆమె షేర్ చేసింది. మొత్తానికి తనకు వైన్ తాగే అలవాటు ఉందని.. సుప్రీత నేరుగా చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. 

అవకాశాల కోసం..!

  ఈ మధ్యకాలంలో సినిమాలతో పాటు టీవీ కంటెంట్ కు కూడా క్రేజ్ పెరుగుతోంది. అందుకే టీవీ యాంకర్స్ తో పాటు ప్రోగ్రాంలో పాల్గొనే వారికి కూడా మంచి క్రేజ్ వస్తోంది. ముఖ్యంగా లేడీ యాంకర్స్ పాపులారిటీ పెరిగిపోతుంది. పద్దతిగా ఉండేవారి కంటే హాట్ షో చేసేవారికి మంచి గుర్తింపు దక్కుతోంది. ఇప్పటికే అనసూయ, రష్మీ గౌతమ్, శ్రీముఖి, విష్ణుప్రియ, వర్షిణి ఈ రంగంలో సత్తా చూపిస్తున్నారు. ఇప్పుడు మరో తెలుగు యాంకర్ కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.  రీసెంట్ గా మొదలైన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకి మంచి రేటింగ్స్ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా టాలెంటెడ్ వ్యక్తులను గుర్తించి ఈ షోలో ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. ఆ ప్రదర్శనలతో పాటు సుడిగాలి సుధీర్ సహా 'జబర్దస్త్' టీమ్ సభ్యులు పాల్గొంటూ కామెడీ పంచుతున్నారు. వీరితో పాటు కొందరు అందమైన అమ్మాయిలను కూడా ఈ షోలోకి తీసుకొస్తున్నారు. అలా వచ్చిన వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు.  సోషల్ మీడియాలో ఈమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో ఈమె చాలా సార్లు కనిపించింది. ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానెల్స్ కి యాంకర్ గా పని చేసిన ఈమె మరిన్ని అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లేస్ తో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని మిర్రర్ ముందు నుంచొని ఆమె ఇచ్చిన ఫోజులకు యూత్ ఫిదా అయిపోయింది. సినిమా అవ‌కాశాల కోస‌మే ఆమె ఈ హాట్ పోజులిచ్చిందంటున్నారు నెటిజ‌న్లు.

నన్ను క్షమించండి.. ఏపీ రాజధాని వివాదంపై ప్రదీప్ స్పందన

యాంకర్‌ ప్రదీప్‌‌ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఓ టీవీ షోలో ఏపీ రాజధాని విశాఖ అంటూ ప్రదీప్‌ వ్యాఖ్యలు చేశాడు. దీంతో ప్రదీప్‌ పై ఏపీ పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో ఉన్న అంశాలపై యాంకర్ ప్రదీప్‌ ఎలా మాట్లాడతారని.. ప్రజల మనోభావాలు కించపరిచేలా వ్యవహరిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించింది. ప్రదీప్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని ఏపీ పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. దీంతో ఈ వివాదంపై యాంకర్ ప్రదీప్ స్పందించాడు. తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరాడు. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ నొప్పించలేదని, ఎవరినీ కించపర్చాలని ఈ విధంగా చేయలేదని చెప్పాడు. రీసెంట్‌గా జరిగిన ఓ షోలో రాష్ట్రం-రాజధాని అనే అంశంపై ప్రశ్నలు అడుగుతుండగా ఆ అంశం తప్పుదారి పట్టిందని పేర్కొన్నాడు.  తాను సిటీ పేరు చెప్పి, ఈ సిటీ క్యాపిటల్ ఏంటి అని అడగడం జరిగిందని.. అయితే అవతలి వ్యక్తి మీ ప్రశ్న తప్పు అని చెప్పకుండా వేరే ఆన్సర్ ఇవ్వడంతో ఈ పూర్తి సంభాషణ తప్పు దోవలో వెళ్లిందని అన్నాడు. దీని ద్వారా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నాడు. వాస్తవానికి ఇలాంటి అంశాలకు తాను దూరంగా ఉంటానని, ప్రేక్షకులకు వినోదం అందించడమే తన ప్రాధాన్యత అని.. అందుకు మీ ఆశీస్సులు కావాలని ప్రదీప్ అన్నాడు.

సినిమాల్లో ఎంట్రీపై క్లారిటీగా ఉన్న‌ డాక్ట‌ర్ బాబు!

  బుల్లితెరపై అత్యధిక రేటింగులతో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతోంది 'కార్తీకదీపం' సీరియల్. ఈ సీరియల్ లో హీరోగా నటిస్తోన్న డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాలకు బీభత్సమైన క్రేజ్ వచ్చింది. సినిమా హీరోలనైనా గుర్తు పడతారో లేదో కానీ డాక్టర్ బాబుకి మాత్రం చిన్న పిల్లల దగ్గర నుండి ముసలివాళ్ల వరకు అందరూ అభిమానులే. ఎందుకంటే ప్రతీ ఇంట్లో 'కార్తీకదీపం' సీరియల్ ను చూసేవాళ్లు ఉన్నారు.  బుల్లితెరపై స్టార్ అనిపించుకున్న డాక్టర్ బాబు.. త్వరలోనే వెండితెరపై అడుగుపెట్టబోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిరుపమ్ టాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. సినిమాల్లో చేయాలనే ఉందని.. 'కార్తీకదీపం' సీరియల్ వచ్చినట్లే.. సినిమాల్లో మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానని అన్నారు. కొన్ని క్యారెక్టర్లు వస్తున్నాయని.. కానీ తనకు సరిపోయే పాత్రను ఎంపిక చేసుకోవడానికి కాస్త టైం పడుతుందని అన్నారు.  ఎలాంటి పాత్రలను ఎన్నుకోవాలనే విషయంలో డైలమాలో ఉన్నానని చెప్పారు. ఇప్పటివరకు తనను సీరియల్స్ లో ఫ్యామిలీ ఓరియెంటెడ్ హీరోగానే చూశారని, ఇక సినిమాలంటే దానికి ఫిట్ అవుతానో లేదో ఆలోచించి అడుగులువేస్తున్నట్లు చెప్పారు. కమర్షియల్ సినిమాలు కాకుండా.. సబ్జెక్ట్ ఓరియెంటెడ్ కథల్లో చేయాలని ఉందని తెలిపారు. ఇక హీరోల్లో మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని.. అలానే వెంకటేష్ గారి సినిమాలు ఎక్కువగా చూస్తుంటానని అన్నారు. కానీ తన ఆల్ టైం ఫేవరెట్ మాత్రం చిరంజీవి గారే అని చెప్పుకొచ్చారు.  

ఏపీ రాజధానిపై వ్యాఖ్యలు.. వివాదంలో యాంకర్ ప్రదీప్

యాంకర్‌ ప్రదీప్‌‌ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ టీవీ షోలో ఏపీ రాజధాని విశాఖ అంటూ ప్రదీప్‌ వ్యాఖ్యలు చేశాడు. దీంతో ప్రదీప్‌ పై ఏపీ పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో ఉన్న అంశాలపై యాంకర్ ప్రదీప్‌ ఎలా మాట్లాడతారని.. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని ఏపీ పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ఈ వివాదంపై ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్‌ కొలికలపూడి శ్రీనివాసరావు స్పందిస్తూ ప్రదీప్‌ ను తీవ్రంగా హెచ్చరించారు. కోర్టులో ఉన్న అంశాలపై ప్రదీప్‌ ఎలా వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. రైతులు, ప్రజల మనోభావాలు కించపరిచేలా వ్యవహరిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రదీప్‌ తను చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోని.. క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. క్షమాపణ చెప్పకుంటే ప్రదీప్‌ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాగా, ఎందరో మనోభావాలతో ముడిపడి ఉన్న రాజధాని వంటి సున్నిత అంశంపై వ్యాఖ్యలు చేసిన ప్రదీప్.. ఏపీ పరిరక్షణ సమితి హెచ్చరికల నేపథ్యంలో క్షమాపణలు చెబుతారేమో చూడాలి.

మనకి అబ్బాయి పుడితే ముఖేష్, అమ్మాయి పుడితే ముఖ్యవతి అని పెడదాం!

  బుల్లితెరపై కామెడీ షోల పేరుతో బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువైపోయాయి. 'జబర్దస్త్', 'ఎక్స్ ట్రా జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ', 'ఢీ', 'కామెడీ స్టార్స్' ఇలా అన్ని షోలలో బూతులు దొర్లుతూనే ఉన్నాయి. దీంతో టీవీ కామెడీ షోల‌లో కామెడీ శ్రుతి మించుతోంద‌నే విమ‌ర్శ‌లు త‌ర‌చూ వినిపిస్తున్నాయి. శేఖర్ మాస్టర్, శ్రీదేవి విజయ్ కుమార్ న్యాయనిర్ణేతలుగా ఉన్న 'కామెడీ స్టార్స్' షోలో తాజాగా స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది యాంకర్ విష్ణుప్రియ.  ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ అందాల ప్రదర్శన చేస్తూ రకరకాల భంగిమల్లో షాకిస్తుంటుంది. తాజాగా కామెడీ స్టార్స్ షోకి చీరతో వచ్చి కాస్త పద్ధ‌తిగా కనిపించింది. కానీ తన మాటలతో బూతు కామెడీ చేసి రెచ్చిపోయింది. అవినాష్‌తో కలిసి ఓ స్కిట్ చేసింది విష్ణుప్రియ.  ''నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా.. నీ ముక్కు నాకు చాలా బాగా నచ్చింది. మన ముక్కులు కలిశాయి.. పెళ్లి చేసుకుంటే ఓంకార్ ఇచ్చిన చెక్కులు కూడా కలిసి వస్తాయి. మనకి అబ్బాయి పుడితే ముఖేష్ అని పెడదాం.. అమ్మాయి పుడితే ముఖ్యవతి అని పెడదాం అనుకున్నా. మన ముక్కులన్నీ కలిసి ముక్కాలా ముకాబులా అని డాన్స్ చేద్దాం'' అని అవినాష్ ని అడిగింది.  "కూపీ.. నీ కళ్లలో కరువు కనిపిస్తుంద"ని విష్ణు ప్రియ అంటే.. "అయితే కరవక ముందే వెళ్లిపో.. ఈ ఫైర్ ఎఫైర్‌గా మారకముందే వెళ్లిపోండి ప్లీజ్." అని అవినాష్ డబుల్ మీనింగ్ డైలాగ్‌ లతో రెచ్చిపోయాడు. 

'జబర్దస్త్' వర్ష పెళ్లికి రెడీ? ఇప్ప‌టికే ఎంగేజ్‌మెంట్ అయ్యిందా?

  'జబర్దస్త్' షోతో పాపులారిటీ దక్కించుకున్న వర్ష.. అప్పుడప్పుడు టీవీ సీరియల్స్ లో కూడా దర్శనమిస్తోంది. యాంకరింగ్ తో పాటు నటిగా కూడా రాణిస్తున్న ఈ బ్యూటీ తరచూ తన ఫోటోషూట్ లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఈమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పెట్టుకున్న ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. తన చేతికి రింగు ధరించిన ఫోటోని షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు షాకిచ్చింది వర్ష.  జూలై 4వ తేదీన ఓ ముఖ్యమైన విషయం చెప్పబోతున్నానని.. తెలిపింది. దీంతో ఆ ఉంగరం వెనుక ఏదో దాగి ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు.. చేతిలో మంగళసూత్రాన్ని పట్టుకున్న ఫోటోను కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది వర్ష. దీనికి పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఎమోజీలను జత చేసింది.  దీంతో వర్ష పెళ్లిపీటలెక్కబోతుందని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ వర్ష పెళ్లి న్యూస్ ని వైరల్ చేస్తున్నారు. చేతికి ఉంగరం ఉంది కాబట్టి ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందని ఖరారు చేస్తున్నారు. మరికొందరేమో వర్ష పెళ్లి చేసుకుంటే ఇమ్మానుయేల్ ఏమైపోతాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే ఆమె పెళ్లి చేసుకోబోతుందా..? లేక ఏదైనా ప్రోగ్రాం కోసం ఈ రకమైన ప్రమోషన్స్ చేస్తుందో తెలియాలంటే జూలై 4 వరకు ఎదురుచూడాల్సిందే!

అనసూయ డ్రెస్సింగ్‌పై కామెంట్స్.. అలిగి వెళ్లిపోయిన యాంకర్!

  యాంకర్ అనసూయ డ్రెస్సింగ్ పై తరచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పొట్టి పొట్టి బట్టలేసుకునే అనసూయను నెటిజన్లు టార్గెట్ చేస్తుంటారు. ఇలాంటి ట్రోల్స్ పై అనసూయ ఘాటుగా స్పందిస్తుంటుంది. ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది తన ఇష్టమని కౌంటర్ ఇస్తుంటుంది. తాజాగా ఆమె డ్రెస్సింగ్ పై యాంకర్ శివ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.  తాజాగా 'జబర్దస్త్' షోకి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. ప్రతీవారం ఎవరో ఒకరిని స్పెషల్ గెస్ట్ గా తీసుకొచ్చే హైపర్ ఆది.. ఈసారి యాంకర్ శివను తీసుకొచ్చాడు. టిక్ టాక్, యూట్యూబ్ స్టార్స్ ను ఇంటర్వ్యూలు చేసి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శివతో ఏదో స్కిట్ వేయించినట్లు ఉన్నాడు ఆది. అయితే స్కిట్ చివర్లో అనసూయను ఉద్దేశిస్తూ .. 'పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడంతో మీ పై కామెంట్స్ వస్తుంటాయి కదా.. దీని గురించి మిమ్మల్ని ఎప్పటినుండో అడగలనుకుంటున్నా' అని ప్రశ్నించాడు.  దాని అనసూయ ''వాళ్లెవరో అన్నారంటే.. ఇండస్ట్రీ గురించి తెలియదని అనుకోవచ్చు.. కానీ మీరు ఇక్కడి వారే కదా.. మీరు అడగడం ఏంటి..? అయినా ఇది నా వ్యక్తిగత విషయం'' అని బదులిచ్చింది. వెంటనే శివ 'పర్సనల్ అయితే మీ ఇంట్లో వేసుకోవచ్చుగా.. ఇక్కడ ఎందుకు' అని కౌంటర్ వేశాడు. దీంతో షాకైన అనసూయ స్టేజ్ మీద నుండి కిందకు వెళ్లిపోతూ ఆదిపై ఫైర్ అయింది. 'ఎవరెవరినో తీసుకొచ్చి.. మీకు తెలియకుండానే జరుగుతున్నాయా..?' అంటూ ఆదిపై కోప్పడింది. అయితే ఇదంతా నిజమా? లేక ప్రోమో కోసం ఇలా చేశారా..? అనేది తెలియాల్సివుంది.