ఎపిసోడ్ 1111.. భాగ్యాన్ని కిడ్నాప్‌ చేసిన మోనిత... టెన్షన్‌లో వంటలక్క!

  ‘కార్తీక దీపం’ సీరియల్‌లో నేటి (ఆగస్టు 06, 2021) ఎపిసోడ్‌కి ఓ ప్రత్యేకత ఉంది. ఈ రోజు ఏం జరిగింది? తర్వాత ఏం జరగబోతోంది? అనేది పక్కన పెడితే... నేటి ఎపిసోడ్‌ సంఖ్య 1111. నంబర్‌లో మొత్తం నాలుగు ఒకట్లు ఉన్నాయి. సక్సెస్‌ఫుల్‌గా వెయ్యి ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ డైలీ సీరియల్‌ నేడు వెయ్యినూట్ల పదకొండవ ఎపిసోడ్‌లో ఎంటరైంది. మరో మైలురాయి చేరుకుంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగింది? అనే విషయంలోకి వెళితే... మోనితను కిడ్నాప్‌ చేయడానికి ఆమె ఇంటికి భాగ్యం వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, కార్తీక్‌ దగ్గర అంజి ఉన్నాడని అబద్ధం ఆడటంతో మోనిత పసిగట్టేస్తుంది. నిన్న జరిగిందిది. నేడు భాగ్యాన్ని మోనిత కిడ్నాప్‌ చేయడం సీరియల్‌లో కీలక మలుపు. పిన్ని దగ్గరకు వెళ్తున్నానని డాక్టర్ బాబు అలియాస్‌ కార్తీక్‌కు చెప్పిన వంటలక్క.. అంజి దగ్గరకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, ఫోన్‌ ఇంట్లో మర్చిపోవడం, వంటలక్క ఫోన్‌కు ఆమె పిన్ని భాగ్యం కాల్‌ చేయడంతో తనతో భార్య అబద్ధం చెప్పిందని డాక్టర్ బాబు పసిగడతాడు. ఇంటికి వచ్చిన దీపను నిలదీయడంతో ఆమె అసలు విషయం చెబుతుంది. అంజిని మోనిత కిడ్నాప్‌ చేసిన వీడియో చూపించి, అడ్రస్‌ చెప్పి మరీ భర్తను అక్కడికి పంపిస్తుంది. అంజి దగ్గరకు డాక్టర్‌బాబు వెళతాడు. మోనిత మనిషి ద్రాక్షారామం నుండి తప్పించుకునే క్రమంలో డోర్‌ తీయగా... అంజి ముందు డాక్టర్ బాబు ప్రత్యక్షం అవుతాడు. మోనిత తనను కిడ్నాప్‌ చేసిందని డాక్టర్ బాబుతో అంజి చెబుతాడు. ఇంకా మోనిత చేసిన నేరాలను బయటపెడతాడు. ‘నీ మాటలను నేను నమ్మను’ అని డాక్టర్‌బాబు అనేసరికి... ‘నన్ను నమ్మకపోయినా పర్వాలేదు. కానీ, మోనితను మాత్రం నమ్మవద్దు’ అంటాడు. అయితే డాక్టర్‌బాబు అతడి మాటల్ని కొట్టి పారేస్తాడు. మరోవైపు భాగ్యం కిడ్నాప్‌ అవుతుంది కదా! ఆమె ఫోన్‌కు మురళీకృష్ణ కాల్‌ చేస్తాడు. రిసీవ్‌ చేసుకోకపోవడంతో వంటలక్క దగ్గరకు వస్తాడు. మురళీకృష్ణతో పాటు వంటలక్క కూడా భాగ్యానికి ఏమై ఉంటుందోనని కంగారుపడతారు. ఇవీ ఆగస్టు 06 ఎపిసోడ్‌ హైలైట్స్‌. మరోవైపు కుమారుడు కార్తీక్‌, మోనిత పెళ్లి గురించి ఆనందరావు టెన్షన్‌ పడటం, ఆదిత్య-శ్రావ్య కూల్‌ చేయడం జరిగాయి.

'వ‌కీల్ సాబ్' సాంగ్ ప‌ర్ఫార్మెన్స్‌కు కన్నీళ్లు పెట్టుకున్న గణేష్ మాస్టర్!

  'ఢీ' అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో ఆడియన్స్‌కు అల్టిమేట్ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కాగా దొరుకుతుందని లేటెస్ట్ ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఆగస్టు 11న ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో ఆరు సినిమాలు ఆడియన్స్‌కు చూపించాలని ప్లాన్ చేశారు. స్టార్ హీరోల హిట్ సినిమాలను డాన్స్ షో రూపంలో ప్రజెంట్ చేస్తారన్నమాట. దీనికి తోడు టీమ్ లీడర్లు, జడ్జిలు సహా యాంకర్ కూడా సూపర్ స్టార్స్ మేనరిజమ్స్ తో సందడి చేయనున్నారు.  బ్లాక్‌బస్టర్ మూవీస్ స్పెషల్ థీమ్‌తో 'ఢీ' ఆగస్టు11 ఎపిసోడ్ ప్లాన్ చేశారు. 'నా దారి రహదారి...' అంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ గెటప్‌లో మంజుల వేదిక మీదకు వచ్చింది. ఆమె 'నరసింహ' సినిమాను పెరఫార్మ్ చేసినట్టు తెలుస్తుంది. మరో కంటెస్టెంట్ సాయి 'వకీల్ సాబ్'కు పెర్ఫార్మన్స్ చేశాడు. అతడి యాక్ట్ పూర్తయిన తర్వాత గణేష్ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు. అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో 'ఒరేయ్! .... కొడుకుల్లారా? చిన్నపిల్లల దగ్గర ఏం కనిపిస్తుందిరా మీకు??' అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటువంటి పెర్ఫార్మన్స్ లు ఎప్పుడు ఎవరు చేసినా ఎమోషనల్ అయ్యే రష్మీ గౌతమ్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.  రజనీకాంత్ 'నరసింహ', పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలతో పాటు మహేష్ బాబు 'బిజినెస్ మేన్', నితిన్ 'జయం', 'సై', విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమాలకు కంటెస్టెంట్లు పెర్ఫార్మన్స్ చేశారు. మొత్తం మీద నెక్స్ట్ ఎపిసోడ్ సందడి సందడిగా జరగనుంది.  

రష్మీకి ల‌వ్ లైఫ్ కావాలి!

  హాట్ అండ్ హ్యాపెనింగ్ యాంకర్ రష్మీ గౌతమ్‌కి ఏం కావాలో తెలుసా? 'ఎ లవ్ లైఫ్'. అదేనండీ... ఓ ప్రేమ జీవితం కావాలట. ఇది చెప్పింది ఎవరో కాదు... ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్. ఇన్‌స్టాగ్రామ్‌లో రకరకాల ఫిల్టర్లు ఉంటాయి. సెలబ్రిటీలు సరదాగా ఒక్కోసారి ఫిల్టర్లు వాడుతున్నారు. అలాగే, రష్మీ గౌతమ్ మీద 'ఢీ'లో కో-యాంకర్ దీపిక ఓ ఫిల్టర్ ట్రై చేశారు.  'మీకు ఏం కావాలో ఈ ఫిల్టర్ చెబుతుంది' అని ఒక వాయిస్ వచ్చింది. ఆ తర్వాత రష్మీకి 'లవ్ లైఫ్' కావాలని చెప్పింది. ఒకసారి కాదు... రెండుసార్లు ప్రయత్నించినా అదే సమాధానం వచ్చింది. దాన్ని చూసి ఆశ్చర్యపోవడం రష్మీ వంతైంది. ఈ వీడియోను దీపిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దానికి 'నీ కోసం ఒకర్ని వెతుకుదాం' అని పేర్కొంది. అంతే కాదు... వీడియోలో ఇన్‌స్టా ఫిల్టర్ చెప్పింది నిజమే అన్నట్టు "కరెక్టే కదా రష్ (రష్మీ ముద్దుపేరు) అక్కా' అని ఎండింగ్ ఇచ్చింది.  రష్మీ వయసు నాలుగు పదులకు చేరుకుంది. ఇంకా పెళ్లి చేసుకోలేదు కూడా! సుధీర్ వెంటపడుతున్నట్టు స్కిట్లు, షోస్‌లో ఆడియన్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. రియల్ లైఫ్‌లో ఒక్కటి అవుతారో, లేదో.. ఎవరికి వారు వేర్వేరు పార్ట్‌నర్స్‌ను చూసుకుంటారో కాలమే సమాధానం చెప్పాలి.

'వరూనిధి పరిణయం' ఫేమ్ చందన సేగు బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

  వరూనిధిగా తెలుగు ప్రజలకు దగ్గరైన కన్నడ కస్తూరి చందన సేగు. 2013 నుండి 2016 వరకూ సుమారు 850కి పైగా ఎపిసోడ్స్ నడిచిన 'వరూనిధి పరిణయం'తో ఆమెకు మంచి పేరు, గుర్తింపు వచ్చింది. అసలు చందన నటి కావాలని అనుకోలేదు. చిన్నతనంలో గాయని కావాలని అనుకుంది. మరి, నటనలోకి ఎలా వచ్చింది? యాంకరింగ్ ఎందుకు చేసింది? డబ్బింగ్ చెప్పడానికి కారణం ఏమిటి? చందన సేగు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా? ఆమె రియల్ లైఫ్ సంగతులు తెలుసుకుందాం...  - చందన సేగు తల్లి సరస్వతీ గుప్తా డబ్బింగ్ ఆర్టిస్ట్. చిన్నతనంలో తల్లితో కలిసి డబ్బింగ్ స్టూడియోలకు వెళ్లడం ఆమెకు అలవాటు అయ్యింది. అక్కడ ఒకరికి ఆమె గొంతు నచ్చింది. దాంతో ఆమెతో డబ్బింగ్ చెప్పించారు. అలా డబ్బింగ్ కెరీర్ మొదలైంది. ఒక యాక్సిడెంట్ కావడంతో సరస్వతీ గుప్తా డబ్బింగ్ చెప్పడం మానేసినా చందన సేగు కంటిన్యూ చేసింది. సుమారు 45 సినిమాలకు డబ్బింగ్ చెప్పింది.  - డబ్బింగ్ ఆర్టిస్ట్ కావాలని చందన ఎప్పుడూ అనుకోలేదు. చిన్నతనంలో గాయని కావాలని అనుకుంది. తల్లి దగ్గర కర్ణాటక సంగీతంలో శిక్షణ కూడా తీసుకుంది. కొన్ని పాటలు కూడా పాడింది. గొంతు బావుందని, పాటలు బాగా పాడుతుందని ఆమెతో డబ్బింగ్ చెప్పించారు. తర్వాత స్నేహితులు 'చూపులకు బాగుంటావ్. యాక్ట్ చేయవచ్చు కదా' అనడంతో నటి కావాలనే కోరిక ఆమెలో మొదలైంది. తండ్రి స్టేజి ఆర్టిస్ట్ కావడంతో ఆయనకూ నటన అంటే ఆసక్తి. కుమార్తెను ఎంకరేజ్ చేశారు. ఒక టీవీ ఛానల్ వాళ్లు అవకాశం ఇవ్వడంతో యాంకరింగ్ చేసింది.  - యాకరింగ్ చేస్తున్నప్పుడే కన్నడ సీరియల్‌లో చిన్న పాత్ర చేసే అవకాశం రావడంతో అందులో నటించింది. మరో సీరియల్ కూడా చేసింది. అలా స్కూల్ డేస్ లో సీరియల్ ప్రయాణం ప్రారంభమైంది. వరుసగా చిన్న చిన్న రోల్స్ రావడంతో ఇంటర్ చదివేటప్పుడు బ్రేక్ తీసుకుంది. తర్వాత 'నేను బేవర్సీ గొత్తా' షార్ట్ ఫిల్మ్ చేసింది. దాని తర్వాతే 'వరూనిధి పరిణయం' సీరియల్ టీమ్ నుండి ఆమెకు పిలుపు వచ్చింది.  - 'వరూనిధి పరిణయం' తర్వాత వోకల్ కార్డ్ దెబ్బతినడంతో డబ్బింగ్ చెప్పడం, పాటలు పాడటం మానేసింది.   - ప్రస్తుతం 'స్వర్ణ ప్యాలెస్' సీరియల్‌లో చందన నటిస్తోంది. కన్నడలో 'రమేష్ - సురేష్' అనే సినిమా చేస్తోంది. మరో సినిమా కూడా ఆమె చేతిలో ఉంది. తెలుగులో సినిమా అవకాశాలు వచ్చాయట. అయితే, కథతో పాటు పాత్రలు నచ్చక వదులుకుందట. ఆమెకు ఇష్టమైన హీరోయిన్ ప్రియాంకా చోప్రా.  - చందన సేగు ఫ్యాషన్ డిజైనర్ కూడా! ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. ఆమె డ్రస్సులు అన్నీ ఆమే డిజైన్ చేసుకుంటుంది. ఫ్యాషన్ డిజైనర్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనేది ఆమె కోరిక. అలాగే, ఆమె యానిమల్ లవర్. ఐదేళ్లుగా యానిమల్ రెస్క్యూ టీమ్ లో పని చేస్తోంది.  

"గ‌ల‌గ‌ల పారుతున్న గోదారిలా" పాడిన వ‌ర్ష‌.. మ‌హేశ్‌కు ప్ర‌దీప్ వివ‌ర‌ణ‌!

  అందంగా కనిపించే అమ్మాయిలు అందరికీ అందమైన గొంతు ఉండాలని రూలేం లేదు. అలాగే, అందంగా పాడే అమ్మాయిలు అంతా చూపులు పరంగా అందంగా ఉంటారని చెప్పలేం. ఎవరి టాలెంట్ వాళ్లది. లేటెస్ట్ టీవీ సెన్సేషన్ వర్ష అందంగా ఉంటుంది. కానీ, గొంతు మాత్రం అదోలా ఉంటుంది. అంటే... కొంచెం రఫ్‌గా అన్నమాట. ఆ గొంతుతో 'గలగల పారుతున్న గోదారిలా' పాట పాడింది. ఇంకేముంది? పక్కనున్న ప్రదీప్ వెంటనే పంచ్ వేశాడు.  ఈటీవీ 'జబర్దస్త్' కామెడీ షోతో పాపులర్ అయిన వర్ష సీరియళ్ళలో కూడా నటిస్తోంది. జీ తెలుగు ఛానల్‌లో వచ్చే 'ప్రేమ ఎంత మధురం'లో ఆమె కీ రోల్ చేస్తోంది. ప్రజెంట్ జీ తెలుగులో 'సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్' ఈవెంట్ చేస్తోంది. అందులో రెండు సీరియల్ టీమ్స్ మధ్య పోటీలు పెడుతున్నారు. ఈ ఆదివారం 'రామ సక్కని సీత', 'ప్రేమ ఎంత మధురం' సీరియల్ టీమ్స్ మధ్య పోటీ. రెండు సీరియళ్లలో నటిస్తున్న యాక్టర్లు స్టేజి మీదకు వచ్చారు.  'గల గల పారుతున్న గోదారిలా' అని వర్ష పాట పాడింది. 'మహేష్ బాబు గారూ... నేను మామూలుగా బాగా పాడతారనుకుని అడిగాను సార్' అన్నాడు ప్రదీప్. బాగా పాడలేదని సెటైర్ వేశాడు. పాపం వర్ష... తనలో బాధను అలా దాచుకుంది. 'పోకిరి'లో 'గలగల పారుతున్న గోదారిలా' పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. 

హమ్మయ్య... అంజి చావలేదు! దీప ఏం చేసిందంటే...

  అంజిని మోనిత చంపిందా? లేదా? అనే సందేహాల నడుమ 'కార్తీక దీపం' సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ ముగింది. చాలామంది అంజి చావకుండా ఉండాలని, మోనిత ఆటలు సాగకూడదని కోరుకున్నారు. వాళ్ళ కోరికలు గురువారం నాటి ఎపిసోడ్ లో నిజం కాబోతున్నాయి. అంజిని మోనిత చంపలేదు. మరి, ఏం చేసింది? భార్య ఎక్కడికి వెళ్లిందోనని టెన్షన్ పడుతున్న డాక్టర్ బాబు, ఇంటికి భార్య వచ్చిన తర్వాత ఏం చేశాడు? వంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ రోజు (ఆగస్టు 5, 2021) 1110 ఎపిసోడ్‌ను చూడాల్సిందే.  మోనిత చేతికి అంజి చిక్కిన సంగతి తెలిసిందే. అయితే, అతడిని మోనిత చంపలేదు. అతడిని చంపితే పెళ్లి ఆగిపోతుందేమోనని భయపడుతుంది. తుపాకీతో బెదిరించి తన మనిషి ద్రాక్షారామం సాయంతో కిడ్నాప్ చేస్తుంది. అదంతా వంటలక్క రికార్డ్ చేస్తుంది. ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియక డాక్టర్ బాబు కంగారు పడతాడు.  సీన్ కట్ చేస్తే... మోనిత తన ఇంటికి వెళ్లిపోతుంది. ఆమెతో 'అమ్మా  మీ కోసం నిన్న రాత్రి కార్తీక్ (డాక్టర్ బాబు) వచ్చారు' అని ప్రియమణి చెబుతుంది. ఎందుకొచ్చాడోనని టెన్షన్ పడుతుంది మోనిత‌. వంటలక్క పిన్ని భాగ్యం కూడా మోనిత దగ్గరకు వెళ్లి 'నిన్ను చంపడానికి కార్తీక్ కత్తి పట్టుకుని తిరుగుతున్నాడు' అని  అబద్ధం చెబుతుంది. పెళ్లిని ఆపడానికి మోనితను కిడ్నాప్ చేయాలనేది ఆమె ప్లాన్. అయితే, కార్తీక్ దగ్గర అంజి ఉన్నాడని చెబుతుంది. తన మనుషుల కస్టడీలో ఉన్న అంజిని కార్తీక్ దగ్గర ఉన్నాడని చెప్పడంతో భాగ్యం ఏదో నాటకం ఆడుతున్నదని మోనిత పసిగడుతుంది. డ్రామా మొదలుపెడుతుంది.  మరోవైపు ఇంటికి వెళ్లిన వంటలక్కను 'ఎక్కడికి వెళ్ళావ్' అని డాక్టర్ బాబు పదే పదే అడుగుతాడు. చివరకు, గట్టిగా నిలదీస్తాడు. అప్పుడు అంజిని మోనిత కిడ్నాప్ చేసినప్పుడు తీసిన వీడియోను డాక్టర్ బాబుకు వంటలక్క చూపిస్తుంది. ప్రజెంట్ అంజి ఎక్కడ ఉన్నాడో చెబుతుంది. అక్కడికి డాక్టర్ బాబు వెళ్తాడు. అంజిని చూసి షాక్ అవుతాడు. తర్వాత ఏం జరిగిందనేది శుక్రవారం ఎపిసోడ్ లో చూడాలి. 

పూర్ణ బుగ్గ కొరుకుడుకు సెన్సార్ కట్ ప‌డిందిగా!

  పూర్ణ పెట్టే ముద్దుల కోసం 'ఢీ' షోలో కంటెస్టెంట్ల కంటే మేల్ టీమ్ లీడర్లు, డ్యాన్స్ మాస్టర్లు పరితపిస్తున్నట్టు ఉన్నారు. పూర్ణ ఎవరికైనా ముద్దు ఇవ్వడం ఆలస్యం వెంటనే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది రెడీ అవుతారు. కామెడీలో అదొక భాగం అని సరిపెట్టుకున్నా... 'ఢీ' షోలో ఈ ధోరణి రోజు రోజుకు శృతి మించుతున్నట్టు ఉంది.  ఆగస్టు 4న టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో కృష్ణ మాస్టర్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కాన్సెప్ట్ ఏంటంటే... పూర్ణ బట్టలు ఉతకమని అతడి దగ్గరకు ఒకడు వస్తాడు. 'పూర్ణ అంటే ఢీలో డ్యాన్స్ బాగా చేసిన వాళ్లకు ముద్దులు పెడతారు. ఆ పూర్ణ మేడమా? బట్టలు బాగా ఉతికితే నాకు కూడా ముద్దులు ఇస్తారా?' అంటాడు. చెంప మీద ఒకటి ఇస్తాన్నట్టు నవ్వుతూ పూర్ణ ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. చివరకు బాగా చేశాడని కృష్ణకు ముద్దు పెట్టింది.  ఇదే ఎపిసోడ్‌లో చైతన్య మాస్టర్‌కు కూడా ముద్దు పెట్టింది. దాన్ని ముద్దు అనడం కంటే బుగ్గ కొరుకుడు అంటే బెటర్. లాస్ట్ వీక్ ఎపిసోడ్ తర్వాత రిలీజ్ చేసిన ప్రోమోలో ఆ బుగ్గ కొరుకుడును శాంపిల్ గా చూపించారు. కానీ ఎపిసోడ్ లో మాత్రం చూపించలేదు. చైతన్య మాస్టర్ బుగ్గను పూర్ణ చేతితో తుడవడం వరకు చూపించారు. తర్వాత బుగ్గ కొరుకుడు లేదు. ప్రియమణి ఎక్స్‌ప్రెషన్ చూపించారు. పాత సినిమాల్లో ముద్దు సీన్లకు అడ్డంగా పువ్వును చూపించినట్టు. బహుశా... ఈటీవీ యాజమాన్యం లేదంటే మల్లెమాల ఎంటర్టైన్మెంట్ వాళ్లు బుగ్గ కొరుకుడుకు సెల్ఫ్ సెన్సార్ కట్ వేసినట్టు ఉన్నారు.  

కోడి రామకృష్ణతో గొడ‌వ‌.. దాస‌రితో చెంప‌దెబ్బ‌.. బ‌య‌ట‌పెట్టిన రేలంగి!

  దర్శకరత్న దాసరి నారాయణరావు స్వగ్రామం పాలకొల్లు. ఆయన శిష్యులుగా పరిశ్రమలోకి వచ్చి, పలు విజయవంతమైన చిత్రాలు తీసిన కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావులది కూడా పాలకొల్లే. అంతే కాదు... వాళ్ళిద్దరూ స్కూల్‌మేట్స్‌, క్లాస్‌మేట్స్‌ కూడా! ఆరో తరగతి చదివే సమయంలో కోడి రామకృష్ణతో రేలంగి నరసింహారావు గొడవ పడ్డారు. తర్వాత మళ్ళీ దర్శకుడైన తర్వాత కలిశారు. వచ్చే వారం ప్రసారం కానున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన రేలంగి నరసింహారావు ఈ విశేషాలు పంచుకున్నారు. ‘‘కోడి రామకృష్ణ నాకు చిన్ననాటి స్నేహితుడు. అందుకని, నేనే తన ఇంటికి వెళ్ళాను. ‘ఒరేయ్‌ అబ్బాయ్‌! జిన్నా వచ్చాడు... జిన్నా వచ్చాడు’ అని ఎంతో సంబరపడ్డాడు. పాలకొల్లులో నన్నంతా రేలంగి జిన్నా అంటారు. నా ముద్దుపేరు అది’’ అని చెప్పుకొచ్చారు రేలంగి నరసింహారావు. అలాగే, రాజేంద్రప్రసాద్‌ హీరోగా 32 చిత్రాలకు దర్శకత్వం వహించానని, తామిద్దరం భార్యభర్తలం లాంటోళ్ళమని, రాజేంద్రప్రసాద్‌తో ఎటువంటి గొడవలు లేవన్నారు. హీరో సుమన్‌ను ‘ఇద్దరు కిలాడీలు’ చిత్రంతో వెండితెరకు తానే పరిచయం చేశానని రేలంగి తెలిపారు. సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నప్పుడు, తెలియక ఎంతో పవిత్రంగా భావించే క్లాప్‌ బోర్‌ను  కిందపెట్టి ఏదో రాసుకుంటుంటే త‌మ‌ గురువు దాసరి నారాయణరావు వచ్చి ఛెళ్ళున కొట్టిన ఘటనను గుర్తు చేసుకున్నారు రేలంగి. ‘ఎప్పుడూ నా కళ్ల ముందు ఇటువంటి పని చేయకు’ అని దాసరి చెప్పారన్నారు. ఒకానొక సమయంలో కాకాపట్టేవాళ్ళను ముందు పెడుతున్నారని గురువుగారి కాళ్ళకు నమస్కరించి తాను వెళ్ళిపోయానని రేలంగి చెప్పారు. అప్పుడు రెండు కన్నీటి చుక్కలు ఆయన కాళ్ళ మీద పడ్డాయట. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అయ్యాక చూడాలి.

సుమ‌క్క అని పిలిచిన గంగ‌వ్వ‌.. షాకైన సుమ‌!

  యాంకర్‌ సుమ అంటే టీవీ సెలబ్రిటీలు అందరూ రెస్పెక్ట్‌ ఇస్తారు. ప్రజెంట్‌ టీవీలో టాప్‌ పొజిషన్‌లో ఉన్న యాంకర్లు అనసూయ, రష్మీ గౌతమ్‌, ప్రదీప్‌, రవి, వర్షిణీ సౌందర్‌రాజన్‌ తదితరుల కంటే సుమ సీనియర్‌. సీనియరే కాదు, వాళ్ళ కంటే ఆమెది టాప్‌ పొజిషన్‌. ఒక రకంగా ఎవరూ రీప్లేస్‌ చేయలేని పొజిషన్‌. అందుకని, అందరూ సుమను ‘సుమక్క’ అని పిలుస్తుంటారు.  వయసులో చిన్నవాళ్ళు అక్క అనడంలో అంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ, సుమ కంటే ఎన్నో ఏళ్ళు పెద్దదైన అవ్వ అక్క అంటే ఆశ్చర్యం కంటే షాక్‌ ఎక్కువ కలుగుతుంది. అటువంటి షాక్‌ రీసెంట్‌గా సుమకు తగిలింది. గతంలో కొంతమందికి తెలిసిన గంగవ్వ, ‘బిగ్‌ బాస్‌’ పుణ్యమా అంటూ టీవీ చూసే జనాల్లో మ్యాగ్జిమమ్‌ ఆడియన్స్‌కు తెలిసింది. సుమ యాంకరింగ్‌ చేస్తున్న ‘స్టార్ట్‌ మ్యూజిక్‌’ ప్రోగ్రామ్‌కు గంగవ్వ గెస్ట్‌గా వచ్చింది. గేమ్స్‌ ఆడింది. మాటల మధ్యలో ‘సుమక్క’ అనేసింది గంగవ్వ. ఇంకేముంది? స్పాంటేనియస్‌గా రియాక్ట్‌ అయ్యే సుమ కూడా ఒక్క క్షణం షాక్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. మరి, ప్రోగ్రామ్‌లో ఇంకెన్ని వింతలు చోటు చేసుకున్నాయో తెలియాలంటే ఆదివారం వరకూ వెయిట్‌ చేయాల్సిందే.

అప్పీకి ఫారిన్‌ పోరి పప్పీ!

  ‘జబర్దస్త్‌’లో టీమ్‌ లీడర్‌ ఆసమ్‌ అప్పీది టిపికల్‌ బాడీ లాంగ్వేజ్‌, కామెడీ స్టయిల్‌. కమెడియన్‌కు రంగు అక్కర్లేదని ప్రూవ్‌ చేసినవాళ్ళు గతంలో ఉన్నారు. లేటెస్ట్‌ ఎగ్జాంపుల్‌ ఆసమ్‌ అప్పీ అలియాస్‌ అప్పారావు. ఓంకార్‌ షో ‘సిక్త్స్‌ సెన్స్‌’కు భార్యతో కలిసి అతడు వచ్చాడు. ఇంతకు ముందు ఈటీవీ ఈవెంట్స్‌కు అప్పారావు భార్య వచ్చారు. ఆవిడ తనదైన శైలిలో కామెడీ చేశారు. ఇందులోనూ చేసినట్టు ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. ‘వయసు పెరుగుతున్న కొద్దీ మీలో ఊపు పెరుగుతుందే’ అని ఓంకార్‌ అంటే... ‘మనిషికి మాత్రమే వయసు, మనసుకు నో వయసు’ అని అప్పీ  చెప్పుకొచ్చారు. భార్యతో కలిసి డ్యాన్స్‌ చేశారు. తర్వాత ‘నువ్వు శ్రుతీ హాసన్‌వి కాదు, మతీ హాసన్‌వి’ అని అప్పారావ్‌ వైఫ్‌ మీద పంచ్‌ వేశాడు. ‘నేను శ్రుతీ హాసన్‌ అయితే నీ పక్కన ఉంటానేంటి? రవితేజ పక్కనే ఉందను’ ఆవిడ కౌంటర్‌ ఇచ్చారు. అయితే, అప్పారావు అండ్‌ వైఫ్‌ చేసిన కామెడీ కంటే ప్రోమో ఎండింగ్‌లో అప్పీకి ఫారిన్‌ పాప ఇచ్చిన పప్పీ... అదేనండీ ముద్దు హైలైట్‌ అని చెప్పాలి. కమెడియన్‌ కమ్‌ హీరో ‘సుడిగాలి’ సుధీర్‌ కూడా ‘సిక్త్స్‌ సెన్స్‌ 4’కు వచ్చారు. అతడితో పాటు ఇంద్రజ సందడి చేశారు. ఆవిడలో ఇంత కామెడీ టైమింగ్‌ ఉందని ‘సిక్త్స్‌ సెన్స్‌ 4’ ప్రోమో చూసేవరకూ తెలియలేదు. రోజా అనారోగ్య కారణాలతో ‘జబర్దస్త్‌’కు కొన్ని రోజులు రాని టైమ్‌లో ఇంద్రజ జడ్జ్‌గా చేశారు. అప్పుడు ఎక్కువగా నవ్వడం తప్ప ఏమీ చేయలేదు. ఇప్పుడు అలా కాదు.  ‘నీ పెద్ద కొడుకు సెంటర్‌కి కొట్టమన్నాడు’ అని సుధీర్‌ అన్నాడు. ‘ఆయన (ఓంకార్‌) కొడుకు అని నేను నీకు చెప్పానా?’ అని ఇంద్రజ ఇమ్మీడియేట్‌గా కౌంటర్‌ ఇచ్చారు. ‘అంటే... నేను అన్నయ్య అంటున్నాను’ అని సుధీర్‌ చెప్పబోగా... ‘మీరు ఎంతోమందిని అన్నయ్యా అంటారు. వాళ్ళందరూ కొడుకులు అయిపోతారా?’ అని నవ్వేశారు ఇంద్రజ. దెబ్బకు ‘అమ్మా’ అని సుధీర్‌ దణ్ణం పెట్టేశాడు. ఈ టైమింగ్‌ ఉంటే నెక్ట్స్‌ ఈటీవీ కామెడీ షోస్‌లో బిజీ అవ్వడం ఖాయం.

"హిమను చంపింది నేనే" అని చెప్పిన‌ మోనిత... అంజిని కూడా చంపిందా?

  కార్తీక్‌ కోసం మోనిత ఎంత దూరమైనా వెళ్తుందని చెప్పడానికి ఈ రోజు ఎపిసోడ్‌ ఉదాహరణగా నిలుస్తుంది. అలాగే, కార్తీక్‌ మీద మోజులో మోనిక ఎంత తప్పు చేయడానికైనా వెనుకాడదని, హత్యలు చేయడానికి ఓ క్షణం కూడా ఆలోచించదని ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఇంతకీ, బుధవారం (ఆగస్టు 4, 2021) 1109 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే... ఎయిట్‌ హోటల్‌లో ఉన్న అంజి కోసం వంటలక్క అలియాస్‌ దీప, మోనిత బయలుదేరిన సంగతి తెలిసిందే. మోనిత కారు ట్రబుల్‌ ఇవ్వడంతో లిఫ్ట్‌ అడిగి వంటలక్క కారు ఎక్కిన‌ విషయమూ విదితమే. ఫోనులో మోనిత మాట్లాడుతున్న మాటలను వెనుక కూర్చున్న వంటలక్క వింటూ ఉంటుంది. అయితే, వాటర్‌ బాటిల్‌ కనిపించడం లేదని వెంకటేశ్‌ను లైట్‌ వేయమని మోనిత అడుగుతుంది. లైట్‌ వేశాక... వెనుక సీట్‌లో ఉన్న వంటలక్కను చూస్తుంది. షాక్‌ అవుతుంది. అంజి కోసం వెళ్తున్నట్టు ఇద్దరూ ఒకరికొకరు చెప్పుకోరు. మోనితకు వంటలక్క ‘విజయవాడ దుర్గ గుడికి’ అని చెబితే... వంటలక్కకు మోనిత ‘ఎయిట్‌ హోటల్‌లో వంటవాళ్లు బాగా చేస్తారని విన్నా. రేపు జరగబోయే నా పెళ్లికి తీసుకువెళదామని’ అని అబద్దాలు ఆడతారు. మోనితను హోటల్‌ దగ్గర దింపిన వంటలక్క విజయవాడ వెళ్తున్నట్టు నటిస్తుంది. మళ్లీ వెనక్కి తిరిగి వస్తుంది. హోటల్‌లో ఉన్న అంజిని మోనిత పట్టుకుంటుంది. గన్‌ గురిపెడుతుంది. ‘మారిపోయానమ్మా’ అని అంజి కాళ్ల మీద పడి బతిమాలతాడు. అయినా అతడిని మోనిత వదలదు. ‘నేను కార్తీక్‌ను ఎలా వదిలేస్తాననుకున్నావ్‌? దీపమ్మా దీపమ్మా అంటుంటావ్‌ కదా! ఆ దీపమ్మ కోసం చచ్చిపో. ఆ హిమను చంపిందీ నేనే’ అని మోనిత ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా దొంగచాటుగా వంటలక్క వీడియో తీస్తుంది. ఇంతలో గన్‌ సౌండ్‌! అంజిని మోనిత షూట్‌ చేసినట్టు అనిపిస్తుంది. మరి, నిజంగా అంజిని మోనిత చంపిందా? లేదా? ఆగస్టు 5న టెలికాస్ట్‌ అయ్యే ‘కార్తీక దీపం’ 1110 ఎపిసోడ్‌లో చూడాలి. 

తెలుగు బుల్లితెర‌ను ఏలుతున్న ప‌ర‌భాషా తార‌లు!

  తెలుగు టీవీ ఇండ‌స్ట్రీ ప్రాంతంతో, భాష‌తో సంబంధం లేకుండా టాలెంట్‌ను ప్రోత్స‌హించ‌డంలో ముందుంటోంది. తెలుగువాళ్ల కంటే బ‌య‌టివాళ్ల‌కే ఎక్కువ అవ‌కాశాలు ఇస్తున్నారంటూ స్థానిక క‌ళాకారులు విమ‌ర్శ‌లు చేస్తున్నా, అప్పుడ‌ప్పుడు ఆందోళ‌న‌లు చేస్తున్నా, ప్రేక్ష‌కులు మాత్రం తెలుగువారు, ప‌రాయివారు అనే తేడా లేకుండా ప్ర‌తిభావంతులైన తార‌ల‌ను ఆద‌రిస్తున్నారు. అలా తెలుగు వీక్ష‌కుల హృద‌యాల్లో మంచి స్థానం సంపాదించుకున్న తెలుగేత‌ర తార‌లెవ‌రో చూద్దాం.. ప్రేమి విశ్వ‌నాథ్‌ ప‌ర‌భాషా తార‌ల్లో తెలుగువారి హృద‌యాల్లో అంద‌రికంటే అధికంగా స్థానం సంపాదించుకుంది ప్రేమి విశ్వ‌నాథ్‌. డీగ్లామ‌ర్డ్ ఫేస్‌తోటే ఆమె వారి అభిమానాన్ని పొందిందంటే.. అందుకు కార‌ణం ఆమె న‌ట‌నా ప్ర‌తిభే. కార్తీక‌దీపం సీరియ‌ల్‌లో దీప అలియాస్ వంట‌ల‌క్క పాత్ర‌లో బ్ర‌హ్మాండంగా రాణిస్తోన్న ప్రేమి మ‌ల‌యాళం అమ్మాయి. కార్తీక‌దీపం ఒరిజిన‌ల్ మ‌ల‌యాళం సీరియ‌లే. అందులో క‌రుత్త‌ముత్తుగా ఆక‌ట్టుకున్న ఆమె అదే పాత్ర‌ను తెలుగులో పోషిస్తోంది. ఇవాళ తెలుగ‌మ్మాయి మాదిరిగానే చ‌క్క‌ని తెలుగు మాట్లాడుతోంది ప్రేమి. ప్రియాంక జైన్‌ మౌన‌రాగం సీరియ‌ల్‌లో మూగ‌మ్మాయి అమ్ములు పాత్ర‌తో ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను సంపాదించుకుంది ప్రియాంక జైన్‌. బెంగ‌ళూరుకు చెందిన ఆమె, ఈ సీరియ‌ల్ త‌మిళ రీమేక్‌లోనూ న‌టిస్తోంది. ప్ర‌స్తుతం జాన‌కి క‌ల‌గ‌న‌లేదు సీరియ‌ల్‌లో జాన‌కి రోల్‌లో అల‌రిస్తోన్న ప్రియాంక‌కు సోష‌ల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో అంద‌మైన త‌న ఫొటోల‌తో పాటు ఫ‌న్ వీడియోస్‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఆనందం క‌లిగిస్తోంది. త‌నూజా గౌడ‌ ముద్ద మందారం సీరియ‌ల్‌లో పార్వ‌తి పాత్ర‌తో తెలుగువారిని ఆక‌ట్టుకున్న బెంగ‌ళూరు అమ్మాయి త‌నూజా గౌడ‌. ముద్ద మందారం, అందాల రాక్ష‌సి సీరియ‌ల్స్‌లో ప్ర‌ద‌ర్శించిన అభిన‌యంతో స్వ‌ల్ప కాలంలోనే వీక్ష‌కుల అభిమాన తార‌గా మారిందామె. ఆరేళ్ల పాటు త‌మను అల‌రించిన ముద్ద మందారం సీరియ‌ల్ ముగిశాక ఆమె ఏ సీరియ‌ల్‌తో మ‌ళ్లీ త‌మ ముందుకు వ‌స్తుందా అని వీక్ష‌కులు ఎదురుచూస్తున్నారు. మేఘ‌నా లోకేశ్‌ క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో ముద్దుగుమ్మ మేఘ‌నా లోకేశ్‌. తెలుగు బుల్లితెర‌పై శశిరేఖా ప‌రిణ‌యం సీరియ‌ల్‌లో టీనేజ్‌లోనే అడుగుపెట్టిన ఈ బ్యూటీ త‌న అంద‌చందాలు, అభిన‌య సామ‌ర్థ్యంతో తెలుగువారి హృద‌యాల‌ను దోచుకుంది. క‌ల్యాణ వైభోగం, ర‌క్త సంబంధం సీరియ‌ల్స్ ఆమె అభిమానుల సంఖ్య‌ను పెంచాయి. కావ్య‌శ్రీ గోరింటాకు సీరియ‌ల్‌లో శ్రీ‌వ‌ల్లి పాత్ర‌లో ప్ర‌ద‌ర్శించిన అభిన‌యంతో అంద‌రి దృష్టినీ త‌న‌వైపు తిప్పుకుంది కావ్య‌శ్రీ‌. సూప‌ర్‌హిట్ తెలుగు సీరియ‌ల్స్‌లో గోరింటాకు ఒక‌టి కావ‌డంతో ఆమెకు పాపులారిటీ ల‌భించింది. క‌ర్ణాట‌క‌కు చెందిన ఆమె ఇవాళ పాపుల‌ర్ టీవీ తార‌ల్లో ఒక‌రు. శోభాశెట్టి కార్తీక‌దీపం సీరియ‌ల్‌లో పోషిస్తోన్న వ్యాంప్ టైప్ క్యారెక్ట‌ర్ మోనిత‌ను చూసి తిట్టుకోని వారుండ‌రు. ఆ నెగ‌టివ్ రోల్‌తోటే పాపుల‌ర్ అయిన తార శోభాశెట్టి. ఆ క్యారెక్ట‌ర్‌ను ఆమె పోషిస్తున్న తీరు, ఆమె విగ‌రస్ లుక్స్ శోభ‌కు పాపులారిటీ తీసుకొచ్చాయి. లాహిరి లాహిరి లాహిరిలో సీరియ‌ల్‌లోనూ కీల‌క‌పాత్ర చేసిన శోభ బెంగ‌ళూరు అమ్మాయి. అర్చ‌నా అనంత్‌ కార్తీక‌దీపం సీరియ‌ల్‌లో పాపుల‌ర్ అయిన మ‌రో ప‌ర‌భాషా న‌టి అర్చ‌నా అనంత్‌. డాక్ట‌ర్ బాబుకు త‌ల్లి పాత్ర‌లో అంద‌మైన అమ్మ సౌంద‌ర్య పాత్ర‌లో సూప‌ర్బ్‌గా రాణిస్తోన్న ఆమె కూడా బెంగ‌ళూరు నుంచే వ‌చ్చింది. ఈ సీరియ‌ల్ క‌న్న‌డ రీమేక్‌లోనూ ఆమె ఇదే పాత్ర చేయ‌డం గ‌మ‌నార్హం. త‌న వ‌య‌సుకు మించిన పాత్ర‌ను చేస్తూ తెలుగువారి హృద‌యాల‌ను ఆక‌ట్టుకున్న ఆమె కొద్దిరోజులుగా కార్తీక‌దీపంలో కనిపించ‌క‌పోవ‌డంతో అభిమానులు ఏమైందోన‌ని ఆరా తీస్తున్నారు. వెన్నుకు సంబంధించిన స‌మ‌స్య‌తో బాధ‌ప‌డిన ఆమె త్వ‌ర‌లో షూటింగ్‌ను కొన‌సాగించ‌నున్న‌ది.

రెస్టారెంట్‌లో.. వాళ్ళిద్దరి ముద్దుల్లో తడిసిన రష్మీ!

  ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవని సామెత. అలాగే, ఓ చూరు కింద రెండు కొప్పులకు పడదని మన పెద్దలు అంటుంటారు. కాని 'ఎక్స్ట్రా జబర్దస్త్' యాంకర్ రష్మీ గౌతమ్ మాత్రం తోటి యాంకర్లతో కలుపుగోలుగా ఉంటూ ముందుకు వెళ్తోంది. 'జబర్దస్త్' యాంకర్ అనసూయతో ఆమెకు పడదని గుసగుసలు వినిపిస్తుంటాయి. కాని వాళ్ళిద్దరూ అటువంటిది ఏమీ లేదంటూ పలుమార్లు చెప్పారు. అలాగే, డాన్స్ రియాలిటీ షో 'ఢీ 12'లో తోటి యాంకర్ వర్షిణి, 'ఢీ 13'కి కొత్తగా వచ్చిన యాంకర్ దీపికా పిల్లితో రష్మీ గౌతమ్ గుడ్ రిలేషన్ మైంటైన్ చేస్తోంది. రష్మీ గౌతమ్, వర్షిణీ సౌందర్‌రాజన్, దీపికా పిల్లి... లేటెస్టుగా ముగ్గురూ కలిశారు. ఒక రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ రష్మీని వర్షిణి, దీపిక ముద్దుల్లో ముంచెత్తారు. 'రష్.. నువ్వు నా క్రష్' అంటూ వర్షిణి రైమింగ్ తో పోస్ట్ చేశారు. రష్మీ, వర్షిణి తనకు గర్ల్ ఫ్రెండ్స్ అని దీపిక పోస్ట్ చేశారు. మొత్తం మీద ఈ ముగ్గురి కలయిక బుల్లితెర ప్రేక్షకులకు కనువిందుగా నిలిచింది.  ప్రస్తుతం ఈటీవీలో వర్షిణి షోస్ చేయడం లేదు. స్టార్ మా ప్రోగ్రామ్స్ తో సెటిల్ అయింది. ర‌ష్మి ఈటీవీ షోస్ 'ఎక్స్ట్రా జబర్దస్త్', 'ఢీ'తో పాటు మధ్య మధ్యలో జీ తెలుగులో ఈవెంట్స్ కూడా చేస్తుంది.

'బిగ్ బాస్ 5'కు భార్యతో ర‌మ్మ‌న్నా ఓకే.. ఒక్కడినే ర‌మ్మ‌న్నా ఓకే!

  చైనా కంపెనీకి చెందిన 'టిక్ టాక్' యాప్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే, ఆ‌ యాప్ కొంత మందికి మేలు జరిగింది. అందులో దుర్గారావు దంపతులు ఖచ్చితంగా ఉంటారు.‌ తొలుత 'టిక్ టాక్'‌ ద్వారా వారిద్దరూ ప్రజలకు వినోదం అందించేవారు. తర్వాత వాళ్లను చాలామంది టీవీ షోలను ఆహ్వానించడం మొదలుపెట్టారు. బుల్లితెరపై కూడా దుర్గారావు దంపతులకు ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది.  అందువల్ల, వారిద్దరిని 'బిగ్ బాస్' రియాల్టీ షోలోకి తీసుకోవడానికి స్టార్ మా ఛానల్, షో నిర్వాహకులు ఆలోచిస్తున్నాట.‌ దీనిపై దుర్గారావు స్పందించాడు. బిగ్ బాస్‌ గురించి తనకు ఒకరు ఫోన్ చేశారని చెప్పాడు. 'బిగ్ బాస్'లో పాల్గొనే అవకాశం వస్తే మీరు పెళతారా? అని దుర్గారావును ప్రశ్నించగా... "తప్పకుండా వెళతాను" అని అతడు సమాధానమిచ్చాడు.  అయితే ఇదివ‌ర‌కు భార్య‌తో క‌లిసి ర‌మ్మంటేనే వెళ‌తాన‌ని చెప్పిన అత‌ను, ఇప్పుడు మ‌న‌సు మార్చుకున్నాడు. "గతంలో ఒక టీవీ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాతో సహా నా భార్యను కూడా తీసుకువెళ్లే అవకాశం ఉంటేనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళతానని చెప్పాను. ఇద్దరినీ రమ్మని పిలిస్తే ఇద్దరం వెళ్దాం. లేదంటే నన్ను ఒక్కడినే రమ్మన్నా వెళతాను. నా భార్యను తీసుకువెళ్లే అవకాశం లేకపోయినా పర్వాలేదు" అని దుర్గారావు చెప్పాడు. 'బిగ్ బాస్' ఇంటిలోకి వెళ్లే కంటెస్టెంట్ మల తుది జాబితాలో అతనికి చోటు దక్కుతుందో? లేదో? చూడాలి మరి.

ఒకే కారులో వంటలక్క, మోనిత... అంజి ఎవరికి దొరికాడు?

  అంజి పాత్రను అడ్డం పెట్టుకుని 'కార్తీక దీపం' దర్శకుడు కాపుగంటి రాజేంద్ర సీరియల్‌ను నడిపిస్తున్న తీరు రోజు రోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. థ్రిల్లర్ సినిమా తరహాలో కథను ముందుకు తీసుకువెళ్తున్నారు. భర్తకు అబద్ధం చెప్పిన వంటలక్క, ఎక్కడికి వెళుతున్నానో ప్రియమణికి చెప్పకుండా బయలుదేరిన మోనిత... చివరకు ఒకే కారులో చేరారు. మరి, కారులో వంటలక్క ఉన్న సంగతి మోనితకు తెలుస్తుందా? డాక్టర్ బాబు టెన్షన్ పడుతున్నట్టు వంటలక్కను మోనిత ఏమైనా చేస్తుందా? అనేది రేపటి (బుధవారం) ఎపిసోడ్ లో చూడాలి. నేటి (మంగళవారం, ఆగస్టు 3) ఎపిసోడ్‌లో అయితే... మోనితకు దీప గురించి తెలియలేదు. అసలు, ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటనేది ఒకసారి చూస్తే... సూర్యాపేటలోని ఎయిట్ హోటల్‌లో అంజి ఉన్నాడని వంటలక్క అలియాస్ దీపకు ఏసీపీ రోషిణి ఫోన్ చేసి చెబుతుంది. వెంటనే అక్కడికి వెళ్లమని, డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్‌కు విషయం చెప్పవద్దని చెబుతుంది. అయితే, అంజి అక్కడ ఉన్నట్టు మోనితకు తన మనుషుల ద్వారా సమాచారం అందుతుంది.  తన పిన్నికి బాలేదని భర్త డాక్టర్ బాబుకు అబద్ధం చెప్పిన వంటలక్క ఇంటి నుండి బయలుదేరుతుంది. మర్నాడు ఉదయం ఇంటికి వస్తానని చెబుతుంది. మరోవైపు మోనిత కూడా ఎక్కడికి అనేది ప్రియమణికి చెప్పకుండా ఇంటి నుండి బయటకొస్తుంది. కారులో వెళ్తూ వెళ్తూ గన్ చెక్ చేసుకుంటుంది. అంజి మాట వినకపోతే తుపాకీతో బెదిరించాలని ప్లాన్ వేస్తుంది.  వంటలక్క ఫోన్ ఇంటిలో మర్చిపోవడంతో తనకు అబద్ధం చెప్పిందని డాక్టర్ బాబుకు అర్థం అవుతుంది. పిన్ని దగ్గరకు వెళ్తున్నానని వంటలక్క చెబుతుంది కదా! అదే పిన్ని భాగ్యం నుండి ఫోన్ రావడంతో డాక్టర్ బాబు లిఫ్ట్ చేస్తాడు. దాంతో పిన్ని దగ్గరకు భార్య వెళ్లలేదని తెలుసుకుంటాడు. వెంటనే మోనిత ఇంటికి వెళ్తాడు. అక్కడ మోనిత కూడా లేదని తెలుసుకున్నాక అతడిలో టెన్షన్ మొదలవుతుంది.  సీన్ కట్ చేస్తే... మోనిత కారు ట్రబుల్ ఇస్తుంది. దారి మధ్యలో ఆగడంతో లిఫ్ట్ కోసం అందర్నీ అడుగుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే వంటలక్క కారు వస్తుంది. మోనితను డ్రైవింగ్ చేస్తున్న వెంకటేష్ గుర్తు పడతాడు. లిఫ్ట్ ఇవ్వాలా? వద్దా? అని వంటలక్కను అడుగుతాడు. తాను కారులో ఉన్నట్టు చెప్పకుండా లిఫ్ట్ ఇవ్వమని వంటలక్క చెబుతుంది. కానీ, మనసులో ఆందోళన మొదలవుతుంది. అంజి గురించి మోనితకు తెలిసిందా? అని! చివరకు, ఆమె అనుమానం నిజమవుతుంది. మోనితకు ఫోన్ రావడం, అవతలి వ్యక్తితో ఎయిట్ హోటల్‌కు వస్తున్నట్టు ఆమె చెప్పడంతో వంటలక్క షాక్ అవుతుంది.  మరోవైపు భార్య గురించి డాక్టర్ బాబు టెన్షన్ పడతాడు. తమ్ముడు ఆదిత్యతో విషయం చెబుతాడు. మోనిత చేతిలో గన్ ఉందని, తన మనుషులు ఉన్నచోటుకు వెళుతుందని, అదేమైనా వంటలక్కను ఏమైనా చేస్తుందేమోనని అంటాడు.  మరి, అంజి ఎవరికి దొరికాడు... మోనితకా? వంటలక్కకా? తరవాత ఎపిసోడ్ లో చూడాలి.  

బుల్లితెరపై స్టార్ హీరోల సంగ్రామానికి వేళాయెరా!

  కింగ్ నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య చ‌క్క‌ని అనుబంధం ఉంది. అక్కినేని అందగాడిని 'బాబాయ్...' అంటూ నందమూరి కుర్రాడు ఎంతో ప్రేమగా పిలుస్తుంటారు. నిజ జీవితంలో ఇద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉన్నప్పటికీ... తెర జీవితానికి వచ్చేసరికి పోటీ తప్పడం లేదు. ఒకవేళ పోటీ వద్దని స్టార్ హీరోలు ఇద్దరూ అనుకున్నా... పోలికలు తీసుకురాకుండా ప్రేక్షకులు ఉండరు. తమ హీరో బాగా చేశాడంటే, తమ హీరో బాగా చేశాడని అభిమానులు చెప్పుకోకుండా ఉండరు. అసలు, పోటీకి కారణం ఏంటనే వివరాల్లోకి వెళితే... యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరుడు' షోకి హోస్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఆగస్టు... అంటే ఈ నెలలో జెమినీ టీవీ షో స్టార్ట్ చేస్తోంది. ఇంతకు ముందు మాటీవీ/స్టార్ మా టీవీలో టెలికాస్ట్ అయిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో కాన్సెప్ట్, ఈ 'ఎవరు మీలో కోటీశ్వరులు' కాన్సెప్ట్ ఒక్కటే. టీవీ మారింది కాబట్టి టైటిల్ ను కొద్దిగా మార్చారు. బహుశా... ఈ నెలాఖరు నుండి జెమినీలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రారంభం కావచ్చు.  'మీలో ఎవరు కోటీశ్వరుడు' తొలి మూడు సీజన్లకు అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేశారు. తర్వాత సీజన్ చిరంజీవి చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఎలా చేస్తాడో చూడాలి. అయితే, 'బిగ్ బాస్' రియాలిటీ షో తొలి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రెండో సీజన్ నాని చేశాడు. తర్వాత నుంచి నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. 'బిగ్ బాస్' ఐదో సీజన్ కూ నాగార్జున హోస్ట్ చేయనున్నారు. సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ కావచ్చని టాక్.  ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలైన 'బిగ్ బాస్' నాగార్జున చెంతకు వస్తే... నాగార్జున హోస్ట్ గా మొదలైన 'ఎవరు మీలో కోటీశ్వరులు' ఎన్టీఆర్ చెంతకు వచ్చింది. ఎవరు ఎలా చేస్తారనే ఆసక్తి అందరిలో మొదలు కావడం ఖాయం. 'బిగ్ బాస్' హోస్ట్ చేసినవాళ్లలో ఎన్టీఆర్ బెస్ట్ అని ఇప్పటికీ చాలామంది అంటుంటారు. నాగార్జున బాగా చేయలేదని కాదు. ఎన్టీఆర్ స్టయిల్ కి చాలామంది కనెక్ట్ అయ్యారు. నాగార్జున కంటే ఎన్టీఆర్ హోస్ట్ చేయడం కూడా అందుకు ఓ కారణం కావచ్చు.  అలాగే, చిరంజీవి కంటే నాగార్జునకు 'మీలో ఎవరు కోటీశ్వరుడు' హోస్ట్ గా ఎక్కువ మార్కులు పడ్డాయి. దాంతో ఎన్టీఆర్, నాగార్జున మధ్య కంపేరిజన్స్ వస్తాయి. పైగా, రెండు షోలు రెండు మూడు వారాలు అటు ఇటుగా మొదలు కానున్నాయి. టీఆర్పీ రేటింగ్స్ పరంగా వచ్చే కంపేరిజన్స్ ను తీసి పారేయలేం. సో, బుల్లితెరపై వెండితెర స్టార్ హీరోల సంగ్రామానికి సమయం వచ్చింది. గెట్ రెడీ ఆడియన్స్. 

అతడి బుగ్గను పూర్ణ అలా కొరికేసింది!

  పూర్ణ అలియాస్ షామ్నా ఖాసింకు ఓ అలవాటు ఉంది. ‘ఢీ’లో ఎవరైనా బాగా డ్యాన్స్‌ చేస్తే... ఆమెకు నచ్చేలా చేస్తే... వాళ్లను పిలిచి మాంచి ముద్దు ఒకటి పెడుతుంది. దాన్ని ముద్దు అని కూడా అనలేం. ఎందుకంటే... ఆమె బుగ్గను అదో మాదిరిగా కొరికేస్తుంది కాబట్టి! ఇన్నాళ్లూ ‘ఢీ’లో కంటెస్టెంట్లకు మాత్రమే పూర్ణ ముద్దులు ఇచ్చింది. బుగ్గలు కొరికింది. కానీ, ఇప్పుడు డ్యాన్స్‌ మాస్టర్‌ బుగ్గను కొరికింది. ‘ఢీ’లో కంటెస్టెంట్‌, డ్యాన్స్‌ మాస్టర్‌ కలిసి పర్ఫార్మ్‌ చేసే రౌండ్‌ జరుగుతోంది. మొన్న బుధవారం కొంతమంది డ్యాన్స్‌ మాస్టర్లు, కంటెస్టెంట్లు కలిసి చేశారు. వచ్చే వారం ఇంకొన్ని పర్ఫార్మెన్స్‌లు ఉన్నాయి. అందులో చైతన్య మాస్టర్‌ది ఒకటి. అతను చిన్నపిల్లాడిగా గెటప్‌ వేసి ‘చిన్ని తండ్రీ... నిను చూడగా’ పాటకు పర్ఫార్మ్‌ చేశాడు. పర్ఫార్మెన్స్‌ పూర్తయిన అతడి బుగ్గను పూర్ణ కొరికినట్టు ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. అసలు పర్ఫార్మెన్స్‌ చేసేటప్పుడు అయితే లవ్‌ సింబల్స్‌ చూపించింది. ఫ్లయింగ్‌ కిస్సులు పెట్టింది. చైతన్య మాస్టర్‌ పర్ఫార్మెన్స్‌ పూర్తయిన తర్వాత రష్మీ గౌతమ్‌ చెప్పిన డైలాగ్‌ మరో హైలైట్‌ అని చెప్పక తప్పదు. ‘హీరో ఎంత హ్యాండ్సమ్‌ ఉన్నా వాళ్ల పోస్టర్‌ వాల్‌ మీద ఉంటుంది. కానీ, టెడ్డీబేర్‌ ఎప్పుడూ బెడ్‌ మీద ఉంటుంది’ అని రష్మీ ముసిముసిగా నవ్వుతూ చెప్పింది. దానికి చైతన్య చాలా సిగ్గుపడ్డాడు. ఎప్పటిలా నెక్ట్స్‌ ఎపిసోడ్‌లోనూ సుధీర్‌ మీద ఆది, ప్రదీప్‌ వేసిన పంచ్‌ డైలాగ్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.

మ‌న‌కు తెలీని శ్రీ‌ముఖి మ‌రో కోణం.. ఫ్రెండ్‌షిప్ కోసం ఇంత చేసిందా!

  ‘నేను అప్పట్లో శ్రీముఖిని చూసి బాగా పొగరు అనుకున్నాను. కానీ, ఇప్పుడు శ్రీముఖిగారికి పెద్ద ఫ్యాన్‌ అయ్యా. సూపర్‌ శ్రీముఖిగారు. మీ మీద రెస్పెక్ట్‌ పెరిగింది’ అని యూట్యూబ్‌లో ‘కామెడీ స్టార్స్‌’ ప్రోమో కింద మహేష్‌ అనే నెటిజన్‌ చేసిన కామెంట్‌. దానికి దగ్గర దగ్గర వెయ్యి లైకులు. అతనొక్కడే కాదు, చాలామంది ‘శ్రీముఖి మనసు బంగారం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న యాంకర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శ్రీముఖి మీద గౌరవం పెరిగిందని చెబుతున్నారు. ఇంతకీ, శ్రీముఖి ఏం చేసింది? అంటే... ‘జబర్దస్త్‌’ షోతో అవినాష్‌కు గుర్తింపు దక్కింది. దాంతో అతడికి ‘బిగ్‌ బాస్‌’ రియాలిటీ  షోలో పాల్గొనే అవకాశం దక్కింది. అయితే, ‘బిగ్‌ బాస్‌’ హౌస్‌కు వెళ్లడానికి ‘జబర్దస్త్‌’ షో ప్రొడ్యూస్‌ చేస్తున్న మల్లెమాలతో ఉన్న అగ్రిమెంట్‌ అడ్డం వచ్చింది. పది లక్షలు కడితేనే తప్ప ‘జబర్దస్త్‌’ను వీడి ‘బిగ్‌ బాస్‌’కు వెళ్లలేని పరిస్థితి. అవినాష్‌ దగ్గర అంత డబ్బు లేదు. అప్పుడు అతడి కష్టం తెలుసుకుని శ్రీముఖి డబ్బులు ఇచ్చింది. ఫ్రెండ్షిప్‌ డే స్సెషల్‌గా చేసిన కామెడీ స్టార్స్‌ ఎపిసోడ్‌లో అవినాష్‌ ఈ విషయం చెప్పాడు. ‘‘యాక్చువల్లీ... నాకు ఎవర్నీ డబ్బులు అడగటం ఇష్టం ఉండదు. షూటింగ్స్‌ లేక, అమ్మానాన్నలకు ఆపరేషన్స్‌ చేయించి... అప్పుడు నాకు సూసైడ్‌ థాట్స్‌ వచ్చాయి. ఆ టైమ్‌లో నాకు బిగ్‌ బాస్‌ ఆఫర్‌ రావడం, పది లక్షలు కడితేనే వెళ్లాలంటే... అప్పుడు డబ్బులు లేక ఎవర్ని అడగాలో తెలియలేదు. ఎవరి అడిగితే ఏం అనుకుంటారో అనే భయం. శ్రీముఖినీ అడగలేదు. తను తెలుసుకుంది. ‘డబ్బులివ్వాలి అమ్మా’ అంటే... వెంటనే ఇంట్లోంచి క్యాష్‌ తీసుకుని వచ్చి ఇచ్చింది. ఎటువంటి ప్రూఫ్స్‌ లేకుండా ఇచ్చింది. కేవలం నమ్మకంతో’’ అని అవినాష్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చాలా ఎమోషన్‌ అయ్యాడు. అతడిని శ్రీముఖి ఆత్మీయంగా దగ్గరకు తీసుకుంది. ‘కామెడీ స్టార్స్‌’ ఫ్రెండ్షిప్‌డే ఎపిసోడ్‌లో అవినాష్‌ ఓ స్కిట్‌ చేశాడు. శ్రీముఖి ఇంట్లో ఎలా ఉంటుంది? ఆమె బర్త్‌డే పార్టీ జరిగినప్పుడు ఏం జరిగింది అనేది ఫన్నీగా చూపించాడు. శ్రీముఖి గెటప్‌ వేశాడు. ‘నా పేరు శ్రీముఖి... నేను ఎవరితోనైనా ధైర్యంగా మాట్లాడతాను ముఖాముఖి... నాకు కోపం వస్తే అవుతాను చంద్రముఖి’ అని అవినాశ్‌ కవిత కూడా చెప్పాడు.

‘బిగ్‌బాస్‌3’... ఇన్‌స్టాలో ఎవరి ఫాలోయింగ్‌ ఎంత?

  ‘బిగ్‌బాస్‌ 3’తో టీవీ ఆడియన్స్‌లో పాపులర్‌ అయిన గ్లామర్‌ డాల్‌ అషురెడ్డి ఖాతాలో ఓ రికార్డ్‌ చేరింది. ఇన్‌స్టాలో ఆమెను ఫాలో అవుతున్న జనాల సంఖ్య వన్‌ మిలియన్‌కు చేరింది. ‘బిగ్‌ బాస్‌’కు వెళ్లకముందు నుండి సోషల్‌ మీడియాలో ఆమె యాక్టివే. రియాలిటీ షోలో ఛాన్స్‌ రావడం వెనుక సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ పనికొచ్చింది. బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి తిరిగొచ్చిన తర్వాత టీవీ షోల్లో పార్టిసిపేట్‌ చెయ్యడం, కొన్నిటికి యాంకరింగ్‌ చెయ్యడంతో ఆమె ఫాలోయింగ్‌ పెరుగుతోంది. ఇప్పుడు ఇన్‌స్టాలో ఆమె వెనుక పదిలక్షల మంది ఉన్నారు.  సెప్టెంబర్‌ సెకండ్‌ వీక్‌ నుండి తెలుగులో ‘బిగ్‌ బాస్‌ 5’ రియాలిటీ షో స్టార్ట్‌ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. షోకు వెళితే ఫాలోయింగ్‌ పెరుగుతుందని చాలామంది ట్రయల్స్‌ స్టార్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ‘బిగ్‌ బాస్‌ 3’కి వెళ్లొచ్చిన సెలబ్రిటీలకు ఇన్‌స్టాలో ఎంత ఫాలోయింగ్‌ ఉందో చూడండి. అషురెడ్డి కంటే ముందు స్టార్‌ యాంకర్‌ శ్రీముఖి, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ ఉన్నారంతే. శ్రీముఖికి 3.7 మిలియన్స్‌ (37 లక్షలమంది) ఫాలోయర్లు ఉన్నారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ను ఫాలో అవుతున్న వాళ్ల సంఖ్య 1.3 మిలియన్‌ మాత్రమే. పదమూడు లక్షలు అన్నమాట. అషురెడ్డితో పాటు హిమజకు పదిలక్షల (వన్‌ మిలియన్‌) మంది ఫాలోయర్లు ఉన్నారు. కంటెస్టెంట్‌ పేరు: ఫాలోయర్ల సంఖ్య శ్రీ‌ముఖి : 37,00,000 రాహుల్ సిప్లిగంజ్ : 13,00,000 అషురెడ్డి: 10,00,000 వరుణ్‌ సందేశ్‌ : 3,37,000 అలీ రేజా : 5,87,000 శివజ్యోతి/సావిత్రి : 7,92,000 వితికా శేరు : 8,34,000 మహేశ్‌ విట్టా : 68,000 పునర్నవి భూపాలం : 5,37,000 రవికృష్ణ : 2,86,000 హిమజ : 10,00,000 శిల్పా చక్రవర్తి : 54,000 రోహిణి : 4,64,000 తమన్నా సింహాద్రి : 19,000 హేమ : 29,000