తమన్నాకు ఇష్టమైన తెలుగు వంటకాలు!

  తమన్నా తనను తాను తెలుగమ్మాయిగా ప్రకటించుకుంది. సౌతిండియన్ లాంగ్వేజెస్ అన్నిటిలో సినిమాలు చేసినా ప్రపంచమంతా తనను తెలుగమ్మాయిగా గుర్తిస్తారని చెప్పుకొచ్చింది. ఇప్పుడు తెలుగులో 'మాస్టర్ చెఫ్'కి హోస్ట్‌గా చేస్తోంది. అంతే కాదు... తనకు, తన కుటుంబానికి తెలుగు వంటల్లో ఏవి ఇష్టమో వెల్లడించింది.  "పూత రేకులు, ఆవకాయ... మా ఇంట్లో అందరికీ ఇష్టమైన తెలుగు రుచులు" అని తమన్నా చెప్పింది. తెలుగమ్మాయిగా ప్రకటించుకున్నప్పటికీ... తమన్నా ఇంకా ముంబయిలోనే ఉంటోంది. షూటింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ నుండి ముంబయి వెళుతుంది. వెళుతూ వెళుతూ అక్కడ ఉన్న స్నేహితుల కోసం అప్పుడప్పుడూ హైదరాబాద్ బిర్యానీ తీసుకువెళతానని, వాళ్లకు అది నచ్చుతుందని చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ వంటల గురించి ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకున్నానని తెలిపింది. త్వరలో జెమినీ టీవీలో 'మాస్టర్ చెఫ్' టెలికాస్ట్ కానుంది.  సినిమాల విష‌యానికి వ‌స్తే ఎప్పుడూ లేనంత బిజీగా మారింది త‌మ‌న్నా. తెలుగులో 'మేస్ట్రో', 'సీటీమార్' సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా 'ఎఫ్‌3', 'గుర్తుందిగా శీతాకాలం' ఫిలిమ్స్‌ సెట్స్ మీద ఉన్నాయి. హిందీలో 'బోలే చుడియా', 'చోర్ నిక‌ల్ కే భాగా' చేస్తోంది. 

మోనాల్‌ను ప‌క్కా షూట్ చేస్తానన్న ముమైత్‌ఖాన్!

  బుల్లితెర మీదకు ముమైత్ ఖాన్ మళ్లీ వచ్చింది. 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే...' అంటూ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలు ఊగించిన ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ ముమైత్. ఒకప్పుడు కమర్షియల్ సినిమా అంటే ఆమె ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. ఇప్పుడు సినిమాల్లో కంటే టీవీల్లో ఎక్కువ కనిపిస్తోంది. బిగ్ బాస్, డాన్స్ ప్లస్ షోస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీకెండ్ 'సిక్స్త్ సెన్స్' షోలో గెస్ట్ కింద సందడి చేయనుంది. లాస్ట్ బిగ్ బాస్ సెన్సేషన్ మోనాల్ గజ్జర్, ముమైత్ ఖాన్ ఒక ఎపిసోడ్‌లో కనిపించనున్నారు. 'సిక్స్త్ సెన్స్' షోకు వచ్చినవాళ్ల చేతిలో గన్స్ పెట్టడం ఓంకార్ అలవాటు. ఆ తర్వాత షూట్ చేయమని అడుగుతాడు. అలాగే, ముమైత్ ను అడిగాడు. ఓంకార్ గుండెలకు ముమైత్ గురి పెట్టింది. 'అక్కడ నువ్వు ఉన్నావ్' అని అతడు అనేసరికి గుండెల పక్కకి గురి పెట్టింది. 'అక్కడ మోనాల్ ఉంది' అన్నాడు. వెంటనే పక్కా కాలుస్తా అన్నట్టు చెప్పింది. 'మోనాల్ ను కాలుస్తావా?' అన్నాడు. దాంతో ఒక్కటే నవ్వులు.  ఈ వీకెండ్ 'సిక్స్త్ సెన్స్' మరో ఎపిసోడ్‌లో కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ ఫ్యామిలీతో వచ్చాడు. టీవీ స్టార్ ప్రభాకర్ ఫ్యామిలీ కూడా అదే ఎపిసోడ్‌లో సందడి చేయనున్నారు. రెండు ఫ్యామిలీలు కలిసి ఫన్ ఇవ్వడం పక్కా అనుకుంట. విచిత్రం ఏమిటంటే... అమ్మ రాజశేఖర్ కు ఓ కుమారుడు, కుమార్తె. ప్రభాకర్ కు కూడా అంతే... ఓ అమ్మాయి, అబ్బాయి. అదే విషయం ఓంకార్ చెప్పాడు. వెంటనే ప్రభాకర్ వైఫ్ "అక్కడ భార్యాభర్తలు, ఇక్కడ భార్యాభర్తలు" అని జోక్ వేసి నవ్వించే ప్రయత్నం చేశారు. అదేమంత పేలలేదు. కానీ, అమ్మ రాజ‌శేఖర్ కుమార్తెతో కలిసి ప్రభాకర్ కుమార్తె 'మైండ్ బ్లాక్... మైండ్ బ్లాక్... బాబు నీ మాస్ లుక్కు మైండ్ బ్లాక్' పాటకు స్టెప్పులు వేశారు. అలాగే, ఫ్యామిలీ డాన్స్ పెర్ఫార్మన్స్ ఆడియన్స్ ను అట్ట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. 

మోనిత‌ మర్డర్‌కు, కార్తీక్ అరెస్టుకు అత్తగారే సాక్షి!

  'కార్తీక దీపం' సీరియల్ ట్విస్టులు అభిమానులను నరాలు తెగే ఉత్కంఠలో పడేస్తున్నాయి. ఊహకు అందని మలుపులతో రోజు రోజుకూ సీరియల్ రసవత్తరంగా మారుతోంది. హిమ మరణానికి మోనిత కారణం అని తెలిసిన కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు, ఆమె ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. మోనితను చంపేస్తానని ఆగ్రహావేశాలకు లోనవుతాడు.  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ లో 'నువ్వు బతకడానికి వీల్లేదు' అంటూ మోనితకు గురి పెడతాడు కార్తీక్. "ఇన్ని దారుణాలు చేసిన నాకు నీ భార్య దీపను, మీ అమ్మను తప్పించడం ఓ లెక్కా?" అని మోనిత అనేసరికి కోపంతో కార్తీక్ గట్టిగా అరుస్తాడు. తర్వాత ఇంటికి వచ్చి దీపతో తన జీవితం ఇలా అయిపోవడానికి తనవాళ్ళే కారణమని ఆవేదన చెందుతాడు. కన్నీరు పెట్టుకుంటాడు. అసలు ట్విస్ట్ ఆ తర్వాత, బుధవారం ఎపిసోడ్ లో ఇచ్చాడు దర్శకుడు కాపుగంటి రాజేంద్ర. కార్తీక్ ఇంటికి వచ్చిన ఏసీపీ రోషిణి 'నీ భర్త నీకు తెలియకుండా మోనితను చంపి, ఆ శవాన్ని మాయం చేశాడు' అని దీపతో చెబుతుంది. కారు డిక్కీలో రక్తపు మరకలు ఉన్నాయని చెబుతుంది. సాక్ష్యంగా దీప పిన్ని భాగ్యాన్ని చూపిస్తుంది. తనను కిడ్నాప్ చేయడానికి వచ్చిన భాగ్యాన్ని బురిడీ కొట్టించిన మోనిత, ఆమెను బందీగా చేసి తన ఇంట్లో ఉంచిన సంగతి తెలిసిందే. కార్తీక్ షూట్ చేసినప్పుడు బుల్లెట్ సౌండ్ భాగ్యం వింటుంది. అదే రోషిణితో చెప్పడంతో కార్తీక్ ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకువెళుతుంది. అలాగే, తాను మోనిత ఇంటికి వెళ్లిన దగ్గరనుంచి జరిగిందంతా చెబుతుంది.  ఇవాళ్టి ఎపిసోడ్ లో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే... 'మోనిత కడుపులో బిడ్డకు నేను ఎలా తండ్రిని అయ్యానో, ఈ హత్యకు కూడా అలాగే కార‌ణం అయ్యాను' అని దీపతో కార్తీక్ చెబుతాడు. దాంతో అతడు ఈ హత్య చేయలేదని అర్థమవుతుంది. మరి, ఎందుకు అరెస్ట్ చేశారు? అంటే మోనిత కనిపించడం లేదు కనుక అనుకోవాలి.  మోనిత ఇంట్లో కార్తీక్ రెండు బుల్లెట్స్ కాల్చాడు. ఒకటి పోలీసులకు దొరికింది. మరొకటి  దొరకలేదు. అదే మోనిత మరణానికి కారణం అయ్యి ఉంటుందని, ఆమె శవాన్ని కార్తీక్ మాయం చేశాడని అనుమానిస్తున్నారు. కార్తీక్ అరెస్టుతో తండ్రి ఆనందరావు, భార్య దీప, పిల్లలు శౌర్య, హిమ, తమ్ముడు ఆదిత్య అందరూ దుఃఖంలో మునిగిపోతారు.  మోనితను కార్తీక్ షూట్ చెయ్యకపోతే, మోనిత ఏమైనట్టు? ఎందుకు ఈ నాటకం ఆడుతున్నట్టు? అనేది తదుపరి ఎపిసోడ్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే టాపిక్.  

దారినపోయే దానయ్యతో రష్మీ సెల్ఫీ... ఆడియన్స్‌కు మెసేజ్!

  స్టార్లు, సెలబ్రిటీలతో సెల్ఫీలు దిగడానికి సామాన్య ప్రజలు చూపించే ఆసక్తి అంతా ఇంతా కాదు. ఒకవేళ ఎప్పుడైనా రోడ్డు ఏదైనా వాహనంలో స్టార్ కనిపిస్తే, దానిని వెంబడిస్తారు. అభిమానులకు సెల్ఫీలు ఇవ్వడానికి స్టార్లు సదా సిద్ధంగా ఉంటారు. కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ ఏమీ అనరు.  ఓ స్టార్ తనకు తానుగా సామాన్యులతో సెల్ఫీలు దిగడం అరుదు. అటువంటి అరుదైన పని చేసింది రష్మీ గౌతమ్. ఎవరో దారిన పోయే దానయ్యతో సెల్ఫీ తీసుకుంది. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆడియన్స్‌కు మెసేజ్ ఇచ్చింది. అసలు మ్యాటర్ ఏంటనేది తెలుసుకోవడానికి వివరాల్లోకి వెళితే... రష్మీ గౌతమ్ పని మీద కారులో వెళ్తున్నారు. రోడ్డు మీద ఎవరో బండి వేసుకుని, హెల్మెట్ లేకుండా మగమహారాజులా దర్జాగా వెళ్తున్నాడు. కారులో కూర్చున్న రష్మీ గౌతమ్, అతడు కనిపించేలా సెల్ఫీ తీసుకున్నారు. "హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తితో సెల్ఫీ.  సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరి" అని పోస్ట్ చేశారు.  రష్మీకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అని చెప్పాలి. మూగజీవాలకు ఆహారం పెట్టడం నుండి ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఆర్థిక సహాయం చేయడం వరకు పలు మంచి పనులు చేస్తుంటుంది.    

మోనితను డాక్టర్‌బాబు కలవకుండానే కడుపు ఎలా వచ్చిందంటే..!

  మోనిత కడుపులో బిడ్డకు కార్తీక్‌ అలియాస్ డాక్టర్ బాబు. అందులో మరో సందేహానికి తావు లేదు. అయితే, మోనిత మీద కార్తీక్ ఎప్పుడూ మోజు పడింది లేదు. అసలు, ఆమెను కలిసింది లేదు. మోనితను డాక్టర్ బాబు కలవకుండా ఆమెకు గర్భం ఎలా వచ్చింది? అంటే... సోమవారం ప్రసారమైన 'కార్తీక దీపం' ఎపిసోడ్ చూడాలి.  డాక్టర్ బాబు మీద మోజుతో, డాక్టర్ బాబు తనకు దక్కాలని మోనిత చేయని పని లేదు. ఎంత దారుణానికి అయినా ఒడి గడుతుందని ప్రేక్షకులకు తెలిసిన విషయమే. అయితే, డాక్టర్ బాబు కోసం తాను ఏం చేసినదీ మోనిత చెబుతుంటే నోరెళ్లబెట్టక తప్పదు. అమ్మో... మోనిత చేసిన కుట్రలు, నేరాలు - ఘోరాలు అన్నీ ఇన్నీ కాదు.  హిమ మరణానికి కారణం మోనిత అని తెలిసిన డాక్టర్ బాబు, ఆవేశంగా ఆమె ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పుడు "స్నేహానికి నువ్వే నిదర్శనం అనుకుంటే పాపానికి పరాకాష్ట చూపించావ్. నమ్మక ద్రోహం చేశావ్. నా ప్రేమను దూరం చేశావ్' అని మోనిత మీద డాక్టర్ అరుస్తాడు. బదులుగా తానేం చేసిందీ మోనిత చెప్పడం మొదలుపెట్టింది.  "హిమ చావు గురించి తెలిసే ఇంతిలా షాకయ్యావే. నీ కోసం, నీ ప్రేమ కోసం, నిన్ను నా సొంతం చేసుకోవడం కోసం నీ భార్య దీపను చంపించడానికి దుర్గతో బేరం కుదుర్చుకున్నా. ఆ యాక్సిడెంట్ నువ్వే చేయించావ‌ని దీప అపార్థం చేసుకునేలా చేశా" అని మోనిత చెప్పింది. గతంలో తనను ఎందుకు చంపాలని దీపను త‌ను నిలదీసిన సంగతిని కార్తీక్ గుర్తు చేసుకుంటాడు.  "నిన్ను, నీ భార్యను విడదీయడానికి విహారిని అడ్డం పెట్టుకుని నీలో అనుమానం పెంచా. హిమకు, నీకు యాక్సిడెంట్ జరిగినప్పుడు నీకు పిల్లలు పుట్టరని డాక్టర్ తో చెప్పించా. కానీ, దీప గర్భవతి  కావడంతో నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని ఆమెను వదిలేశావ్. డెలివరీ సమయంలో దీపకు పాయిజన్ ఎక్కిస్తుంటే దుర్గగాడు వచ్చి లాక్కుని పోయాడు. లేదంటే దీప కూడా ఈపాటికి చచ్చేది" అని తాను చేసిన ఘోరాలను మోనిత బయటపెట్టింది.  కార్తీక్, దీప ఒక్కటై, కాలిపోయి కాపురం మొదలుపెడితే తన ప్రేమ, ఆశలు గంగలో కలిసిపోతాయని గర్భం తెచ్చుకుంది మోనిత. "నీకు పిల్లలు పుడతారా? లేదా? అని ఇచ్చిన సాంపిల్స్ ను నా గర్భంలో ప్రవేశపెట్టుకుని గర్భవతినయ్యా. ఎలాగైతేనేం కార్తీక్... నా కడుపులో బిడ్డకు తండ్రి నువ్వే" అని మోనిత అసలు విషయం బయటపెట్టింది. అన్నీ విన్న కార్తీక్, మోనితను చంపేస్తానని ఆవేశంతో ఊగిపోతాడు.  

కేటీఆర్‌ను కలిసిన‌ యాంకర్ ప్రదీప్! రీజ‌న్‌ ఇదే!!

    తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు కలిశారు. మంత్రి పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించిన సేవా కార్యక్రమానికి తనవంతు సాయంగా కొంత ఆర్థిక మొత్తాన్ని అందజేశారు. అసలు వివరాల్లోకి వెళితే...  కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'గిఫ్ట్ ఏ స్మైల్' పేరుతో ఓ కార్యక్రమం ప్రారంభించారు. దివ్యాంగులకు వాహనాలు అందించడమే దాని సదుద్దేశం. 'గిఫ్ట్ ఏ స్మైల్'కి ప్రదీప్ మాచిరాజు ఆర్థిక సహాయం చేశారు. "థాంక్యూ సో మచ్ డియర్ కేటీఆర్ గారు. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా మీరు ఎంతోమందికి స్ఫూర్తి. 'గిఫ్ట్ ఏ స్మైల్' గొప్ప ఇనిషియేటివ్. అందులో మేం ఓ చిన్న భాగం కావడం సంతోషంగా ఉంది" అని ప్రదీప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేటీఆర్‌ను ప్రదీప్ కలిసిన సమయంలో ఆయన వెంట వినయ్ బాబు, మరొకరు ఉన్నారు. ప్రదీప్ హీరోగా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' చిత్రాన్ని నిర్మించిన ఎస్వీ ప్రొడక్షన్స్ కూడా ఈ ఆర్థిక సహాయంలో పాలు పంచుకున్నట్టు టాక్.  

బిగ్ బాస్ 5 హౌస్‌లోకి ర‌వి వెళ్తున్నాడ‌ని క‌న్ఫామ్ చేసిన లాస్య‌!

  బిగ్ బాస్ 5లో వీక్ష‌కుల‌కు తెలిసిన ముఖాల‌ను, సెల‌బ్రిటీల‌ను తీసుకురావ‌డానికి నిర్వాహ‌కులు అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి సురేఖా వాణి, యాంక‌ర్ వ‌ర్షిణి సౌంద‌రాజ‌న్‌, యాంక‌ర్ ర‌వి, టీవీ బ్యూటీ న‌వ్య స్వామి, సినీ తార‌లు ఇషా చావ్లా, పూన‌మ్ బ‌జ్వా, కొరియోగ్రాఫ‌ర్ ఆనీ లాంటి వారు వెళ్ల‌నున్న‌ట్లు ఓ లిస్టు ఆన్‌లైన్‌లో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అయితే తాను బిగ్ బాస్ 5 కంటెస్టెంట్‌గా వెళ్ల‌డం లేద‌ని ఇషా చావ్లా స్ప‌ష్టం చేసింది.   కాగా ఈసారి హౌస్‌లోకి యాంక‌ర్ ర‌వి వెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఎందుకంటే, అత‌డు కంటెస్టెంట్‌గా వెళ్తున్న విష‌యాన్ని అత‌డి జంట యాంక‌ర్ లాస్య క‌న్ఫామ్ చేసింది. రీసెంట్‌గా 'క‌న‌బ‌డుట‌లేదు' అనే సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ర‌వి, లాస్య యాంక‌ర్లుగా వ్య‌వ‌హ‌రించారు.  మాట‌ల మ‌ధ్య‌లో లాస్య మాట్లాడుతూ, "క‌న‌బ‌డుట‌లేదు టైటిల్ చాలా బాగుంది. కొద్ది రోజుల్లో ర‌వి క‌నిపించ‌కుండా పోతాడేమోన‌ని నా డౌట్" అంది లాస్య‌. "ఏయ్" అని హెచ్చ‌రించాడు ర‌వి. "ఏదో హౌస్‌లోకి వెళ్తున్నారు క‌దా.." అంది లాస్య‌. ఆమెవైపు అలాగే సీరియ‌స్‌గా చూశాడు ర‌వి.. దాంతో లాస్య క‌వ‌ర్ చేసుకుంటూ, "ఐ మీన్‌.. మీ హౌస్‌లోకి వెళ్తున్నావ్ క‌దా" అంది. "మా ఇంటికెళ్తున్నా" అన్నాడు ర‌వి. లాస్య పెద్ద‌గా న‌వ్వేసింది. అదీ విష‌యం! నిర్వాహ‌కులు వెల్ల‌డించేదాకా కంటెస్టెంట్లు ఎవ‌రూ తాము బిగ్ హౌస్‌లోకి వెళ్తున్న‌ట్లు బ‌హిర్గ‌తం చేయ‌కూడ‌దు. అందుకే తాను హౌస్‌లోకి వెళ్తున్న విష‌యాన్ని లాస్య క‌న్‌ఫామ్ చేయ‌డంతో క‌ళ్ల‌తోనే ఆమెను ర‌వి హెచ్చ‌రించాడ‌నీ, వెంట‌నే ఆమె దాన్ని క‌వ‌ర్‌చేస్తూ మాట్లాడింద‌నీ తెలుస్తోంది.  నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించే 'బిగ్ బాస్' తెలుగు 5వ‌ సీజ‌న్ సెప్టెంబ‌ర్ 5న మొద‌ల‌వుతుంద‌ని వినిపిస్తోంది.

'ముత్యమంత ముద్దు' పాటలో ఉప్పెనంత అందం!

  ఓ బుల్లితెర ధారావాహికను ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసం జీ తెలుగు ఛానల్ 'ఉప్పెన' హీరోయిన్ కృతి శెట్టి సాయం తీసుకుంటోంది. ప్రచార చిత్రంలోకి మాత్రమే కాదు, కొత్తగా విడుదల చేసిన పాటలో కూడా ఆమెను చూపించింది. ధారావాహికలో హీరో హీరోయిన్ల ప్రేమకథకు కృతి శెట్టి చేస్తే 'వావ్! వాట్ ఏ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఆల్ ద‌ బెస్ట్' అని కాంప్లిమెంట్ కూడా ఇప్పించింది. 'ముత్యమంత ముద్దు' టైటిల్ సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. అందులో లీడ్ పెయిర్ సిద్ధు, నిషా రవిక్రిష్ణన్ మధ్య ప్రేమకథను చూపించారు. 'ఇదేం మనసో... అదే పనిగా నిన్ను చూస్తోంది' అంటూ మొదలైన పాట నిషాను చూడగానే సిద్ధు ప్రేమలో పడ్డాడనే విషయాన్ని తెలియజేస్తోంది. సినిమా పాటలకు ఏమాత్రం తీసిపోని రీతిలో పాటను చిత్రీకరించారు. మధ్య మధ్యలో కృతి శెట్టిని చూపించారు.  'ముత్యమంత ముద్దు' సాంగ్‌లో ప్రేమకథను మాత్రమే చూపించారు. అయితే, అంతకు ముందు విడుదల చేసిన ప్రోమోలో కాన్సెప్ట్ ఏంటో చెప్పారు. రుణం పేరుతో దారుణాలు చేసే అత్త... కన్నవాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని ఆలోచించే కోడలు... ఇద్దరి మధ్య ఏం జరిగిందో త్వరలో ప్రారంభమయ్యే సీరియల్ లో చూడాలి. 

గోవాలో కూతురికి ట్రీట్ ఇచ్చిన సురేఖావాణి!

  కూతురు సుప్రీతతో నటి సురేఖావాణి ఓ కన్నతల్లిగా కంటే స్నేహితురాలిగా, పెద్దక్కలా సన్నిహితంగా ఉంటారు. అమ్మాయితో కలిసి డ్యాన్సులు చేస్తారు, జోకులు వేస్తారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వీళ్లిద్దరూ చేసే హల్‌చల్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు కూతుర్ని తీసుకుని సురేఖావాణి గోవా వెళ్లారు. ఎందుకో తెలుసా? ఆదివారం సుప్రీత పుట్టినరోజు. గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం కోసం అక్కడికి వెళ్లారన్నమాట.  "హ్యాపీ బర్త్ డే కన్నా (చిట్టితల్లి మా). మీ నాన్న నిన్ను అలానే పిలిచేవారు. ఆయన్ను నువ్వెంత (మనమెంత) మిస్ అవుతున్నావో నాకు తెలుసు. నీకు బెస్ట్ ఇవ్వడానికి నేనెప్పుడూ ప్రయత్నిస్తా. నా మనసులో ఏముందో, బయట ఏముందో? తెలిసిన వ్యక్తి నువ్వే. నిస్సందేహంగా నా జీవితంలో జరిగిన అద్భుతం నువ్వే. ప్రపంచంలో బెస్ట్ డాటర్‌ను ఇచ్చిన భగవంతుడికి థాంక్స్. నీకంటే ఎక్కువగా ఈ జీవితంలో ఎవర్నీ ప్రేమించలేను. నో... నో.. నో... వచ్చే జీవితంలోనూ ప్రేమించలేను. నీకు బంగారు భవిష్యత్ ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా" అని సురేఖావాణి పోస్ట్ చేశారు.  గోవాలో కుమార్తెతో కలిసి సురేఖావాణి చేసిన డ్యాన్సులు వైరల్ అవుతున్నాయి. గ్లామర్ డ్రస్సుల్లో ఇద్దరూ సందడి చేశారు. నెటిజన్స్ చేసిన కామెంట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. "నీ కాళ్ళను పట్టుకుని  వదలనన్నవి చూడే నాకళ్ళు" అని ఒకరు కామెంట్ చేశారు. "నిన్ను చూడాలో, నీ కూతుర్ని చూడాలో అర్థం కావడం లేదు" అని ఇంకో కామెంట్. "ఎవరు తల్లి? ఎవరు కూతురు? నేను కన్‌ఫ్యూజ్ అవుతున్నా. ఇద్దరూ సెక్సీగా ఉన్నారు" అని ఒకరు కామెంట్ చేశారు. ఇద్దరు కాళ్ళు సెక్సీగా ఉన్నాయని కొందరు కామెంట్లు చేశారు. 

అమ్మానాన్న‌లు ఇద్ద‌రినీ మా నాన్నలో చూసుకుంటాను!

  "నాకు మా నాన్నగారు అంటే చాలా చాలా చాలా ఇష్టం" అని నటి ఇంద్రజ అన్నారు. తండ్రితో తనకు ఉన్న అనుబంధాన్ని, తండ్రి గొప్పదనాన్ని 'సిక్త్స్ సెన్స్' షోలో వివరించారు. ఓంకార్ హోస్ట్ చేస్తున్న 'సిక్త్స్ సెన్స్' నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇంద్రజ, సుధీర్ సందడి చేయనున్న సంగతి తెలిసిందే. అందులో సుధీర్ మీద ఇంద్రజ పంచ్ డైలాగ్స్ వేసిన ఒక ప్రోమోను విడుదల చేశారు కూడా! లేటెస్ట్ ప్రోమోలో తండ్రీకూతుళ్ల‌ మధ్య బంధాన్ని హైలైట్ చేశారు. 'నాన్నంటే చాలా ఇష్టం కదా' అని ఓంకార్ అడిగిన వెంటనే 'చాలా చాలా చాలా చాలా అండీ' అని ఇంద్రజ చెప్పారు.  "నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా ఇంట్లో మా నాన్నగారే వంట చేశారు. మా అమ్మకి మెడిసిన్ అందివ్వడం గానీ, అమ్మవాళ్లను చూసుకోవడం గానీ... మమ్మల్ని (పిల్లల్ని), మా బాగోగులు చూసుకోవడం... తల్లి, తండ్రి ఇద్దర్నీ కలిపి నేను నాన్నగారిలో చూసుకుంటాను. ఐలవ్యూ. ఐలవ్యూ సో మచ్ నాన్నా" అని ఇంద్రజ  గొప్పగా చెప్పారు.  "తండ్రి ప్రేమను మనం పెద్దగా గుర్తించం. కానీ, వాళ్ళే లేకపోతే కుటుంబం అన్న ఒక బంధమే లేదు. ప్రతి ఒక్క తండ్రికి తలవంచి నేను నమస్కరిస్తున్నా" అని ఇంద్రజ సంస్కారాన్ని చాటుకున్నారు.

"నేనొక ఆడపిల్లను.. జాలి లేదా?".. భోరుమ‌న్న వ‌ర్ష‌! వెంట‌నే ప్రోమో డిలీట్‌!

  వర్ష 'జబర్దస్త్'కు గుడ్ బై చెప్పాలని అనుకుంటుందా? ఇకపై షోలో కనిపించదా? మానేస్తుందా? ఆగస్టు 13న టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్ ప్రోమో లేటెస్టుగా విడుదలైంది. అది చూస్తే నిజమే అని ఎవరికైనా అనిపించక మానదు. "వర్ష... ఏంటి? 'జబర్దస్త్' మానేయాలని అనుకుంటున్నట్టు తెలిసింది. ఏం జరిగింది?" అని రోజా అడిగారు. ఈ తర్వాత వర్ష ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. "మనవరకూ అవన్నీ చాలా ఈజీ మేడమ్. కానీ, మనం ఇక్కడ ఉండటం వేరు. మన ఇంట్లో వేరు" అని వర్ష కన్నీరు పెట్టుకుంది. బోరున విలపించింది.  "మా తమ్ముడు నా ఫేస్ మీద ఫోన్ పెట్టి... ఏంటక్కా? అని అడిగితే నేను ఫేస్ చేయలేకపోయా" అని వర్ష కన్నీళ్లు తుడుచుకుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో 'వకీల్ సాబ్'లోని 'మగువా మగువా' పాటను ప్లే చేశారు. 'నిందలు వేస్తారు. నిను వెలివేస్తారు' లైన్లు వినిపించాయి. దీన్నిబట్టి ఎవరో చేసిన విమర్శల గురించి ఇంట్లో ప్రశ్నించినట్టు ఉన్నారని అర్థమవుతోంది.  "నేను అందరినీ ఒకటే అడుగుతాను. మీ ఇంట్లో మీ సిస్టర్ ఉన్నప్పుడు ఎవరైనా చిన్న మాట అంటే 'ఏయ్ మా సిస్టర్ ను ఎందుకన్నావ్' అని మీకంత కోపం వస్తుంది కదా. మీరు ఏదైనా అన్నప్పుడు... నేనొక ఆడపిల్లను కదా. మీకు ఇంత కూడా జాలి అనిపించిందా?' అని వర్ష కన్నీరు పెట్టుకుంది. ఈ విమర్శలు తట్టుకోలేక సోషల్ మీడియాలో ఫోటోల కింద కామెంట్ ఆప్షన్ డిజేబుల్ చేసినట్టు ఉంది. కాగా ప్రోమో రిలీజ్ చేసిన కొద్దిసేప‌టికే దాన్ని యూట్యూబ్ నుంచి ఈటీవీ, మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్ రెండూ తొలగించ‌డం హాట్ టాపిక్‌గా మారింది. వ‌ర్ష ఎపిసోడ్ వ‌ల్లే దాన్ని తొల‌గించారా? ఆ ఎపిసోడ్‌ను రీ-ఎడిట్ చేస్తున్నారా?.. అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

‘జబర్దస్త్‌’లో అసంతృప్తి జ్వాలలు! బ‌య‌ట‌ప‌డిన‌ వెంకీ!!

  ‘జబర్దస్త్‌’లో వెంకీ కొన్నేళ్ళుగా టీమ్‌ లీడర్‌గా చేస్తున్నాడు. ‘జబర్దస్త్‌’లో ‘వెంకీ మంకీస్‌’ టీమ్‌ కంటిన్యూస్‌గా స్కిట్లు చేస్తోంది. అతడి టీమ్‌లో ఉండి పేరు తెచ్చుకున్న జీవన్‌ ప్రజెంట్‌ టీమ్‌ లీడర్‌గా చేస్తున్నాడు. ప్రసాద్‌ మధ్యలో కొన్నిరోజులు నరేష్‌తో కలిసి టీమ్‌ లీడర్‌గా చేశాడు. తర్వాత ‘పంచ్‌ ప్రసాద్‌ – నాటీ నరేష్‌’ టీమ్‌ను తీసేశారు. దాంతో ఇప్పుడు వెంకీతో పాటు ఇతర టీమ్‌ లీడర్ల స్కిట్లలో చేస్తున్నాడు. టీమ్స్‌ను తగ్గించిన తర్వాత తాగుబోతు రమేష్‌ను తీసుకొచ్చి వెంకీ మంకీస్‌ టీమ్‌తో కలిపారు. దాంతో పేరు మొత్తం తనకు రావడం లేదనే అసంతృప్తి వెంకీలో ఉన్నట్టుంది. లేటెస్ట్‌ ‘జబర్దస్త్‌’ ప్రోమో సాక్షిగా అది బయటపడింది. ‘ఏం వెంకీ! ఏమైంది?’ అని జడ్జ్‌ మనో అడిగారు. ‘చేసేది నేను... చేయించేది నేను’ అని వెంకీ చెప్పాడు. అప్పుడు అతడి ముఖంలో సంతోషం అనేది లేదు. ‘నువ్వు చేయించినా వాళ్లు బ్రహ్మాండంగా చేస్తున్నారు’ అని వెంకీ టీమ్‌లో ఇతర సభ్యుల్ని తక్కువ చేయకుండా చెప్పారు మ‌నో. వెంకీ వెనక్కి తిరిగి అసంతృప్తికి లోనయ్యాడు. అతడి దగ్గరకు తాగుబోతు రమేష్‌ వెళ్ళగా, వద్దన్నట్టు సైగ చేశాడు. ఇదంతా ప్రోమోలో చూపించడం వల్ల ‘జబర్దస్త్‌’ షో నిర్మాతలు ఏం చెప్పాలనుకున్నారో? ‘జబర్దస్త్‌’ ఎంతోమంది కమెడియన్లకు వేదిక కల్పించింది. కల్పిస్తోంది. సినిమాల్లో నటీనటుల కంటే కొందరికి ఎక్కువ పేరు వస్తోంది. అయితే, షోలో కొందరు కమెడియన్లు అసంతృప్తిలో ఉన్నమాట వాస్తవమే. అది తమకు వచ్చే పేరు విషయంలో కాదు, పేమెంట్స్‌ విషయంలో! క్యారెక్టర్‌ చిన్నదైనా కామెడీ బాగా చేస్తే ఆలోమేటిక్‌గా పేరు వస్తుంది. అందులో మరో సందేహం లేదు. కానీ, పేమెంట్స్‌ విషయంలో టీమ్‌ లీడర్లపై కొంతమంది ఫన్నీగా సెటైర్లు వేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు అసంతృప్తి జ్వాలలు టీమ్‌ లీడర్‌లో రావడం గమనార్హం.

"చిచ్చా.. అషుతో అలా చెయ్యొద్దు".. బ‌తిమ‌లాడిన‌ హరి!

  సుడిగాలి సుధీర్ - రష్మీ గౌతమ్, ఇమ్మాన్యుయేల్ - వర్ష తర్వాత బుల్లితెర వినోద కార్యక్రమాల్లో హరి - అషురెడ్డి జోడీకి పాపులారిటీ దక్కింది. ఇద్దరికీ ఫాన్స్ ఉన్నారు. ఫాలోయింగ్ ఉంది. అషురెడ్డితో 'కామెడీ స్టార్స్'లో హరి చేసే స్కిట్లు పేలుతున్నాయి. గుండెల మీద అషురెడ్డి పేరును హరి టాటూ వేయించుకోవడం, తర్వాత దాని మీద పేరడీగా ఒక స్కిట్ చేయడం వంటివి తెలిసిన విషయాలే.  కొత్త విషయం ఏంటంటే... రీసెంట్‌గా ఆఫ్రికన్ చిచ్చా చార్లెస్‌తో అషురెడ్డి ఒక రీల్ చేసింది. దానికి వ్యూస్ బాగా వచ్చాయి. అయితే, చిచ్చాతో అషుతో అలా రీల్స్ చెయ్యొద్దని హరి అంటున్నాడు.  ''అషుతో రీల్స్ చేయకు. డోంట్ డూ దట్ విత్ అషు" అని చిచ్చాతో హరి చెప్పాడు. 'ఎందుకు?' అని అతడు ప్రశ్నించాడు. "నాకు నచ్చడం లేదు. నెక్స్ట్ టైమ్ అషు నీకు కాల్ చేస్తే... నువ్ రిజక్ట్ చెయ్. 'నాకు అలా చెయ్యడం ఇష్టం లేదు. నేను అటువంటి వాడిని కాదు' అని చెప్పు. ఇంట్రెస్ట్ లేదని చెప్పేయ్. ఏదోకటి చెయ్. రీల్స్ మాత్రం చెయ్యకు" అని హరి చెప్పాడు. దయచేసి అర్థం చేసుకోమని అన్నాడు. అయితే, అషుతో తనకు రీల్స్ చేయాలని ఉందని చిచ్చా చార్లెస్ చెప్పడం విశేషం. దాంతో చుట్టుపక్కల ఉన్నవాళ్లు గట్టిగా నవ్వారు.

డాక్టర్‌ బాబు అరెస్ట్... జైలుకు తీసుకెళ్లిన పోలీసులు!

  'కార్తీక దీపం'లో కీలక మలుపు చోటు చేసుకుంది. కార్తీక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని జైలుకు తీసుకు వెళ్లారు. అసలు ఏం జరిగింది? అనేది పూర్తిగా తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే. అంతలా ప్రోమోలో ట్విస్ట్ షాక్ ఇచ్చింది. ఇవాళ్టి ఎపిసోడ్ ఎండింగ్‌లో మోనితను చంపేస్తానని కార్తీక్ అన్నాడు. కార్తీక్ కాకుండా ఎవరో మోనితను చంపి, ఆ హత్యానేరం కార్తీక్ మీద తోసినట్టు ప్రోమో చూస్తే తెలుస్తోంది. అసలు, అందులో ఏముంది? అనే అంశంలోకి వెళితే...  కార్తీక్, దీప ఇంట్లో ఉంటారు. వాళ్ళింటికి పోలీసులతో ఏసీపీ రోషిణి వస్తుంది. 'రండి మేడమ్. మేమే మీ దగ్గరకు వద్దామని అనుకుంటున్నాం' అని దీప అంటుంది. 'ఎందుకు? లొంగిపోవడానికా?' అని రోషిణి ప్రశ్నిస్తుంది. 'ఏమైంది?' అని దీప అంటుంది. ఆమెతో కాకుండా కార్తీక్‌తో రోషిణి మాట్లాడటం మొదలు పెడుతుంది. 'మోనిత శవాన్ని ఎక్కడ దాచావ్?' అని ప్రశ్నిస్తుంది. 'శవం ఏంటి?' అని దీప అడుగుతుంది. 'నీ భర్త మోనితను షూట్ చేసి చంపి, శవాన్ని మాయం చేశాడు' అని రోషిణి చెబుతుంది. దీప మాత్రమే కాదు, ఆమె మాటలకు కార్తీక్ కూడా షాక్ అవుతాడు.  మోనితను హత్య చేశాడనే అభియోగం మీద కార్తీక్ ను అరెస్ట్ చేసి జైలుకు తీసుకువెళతారు. దీపతో పాటు కుటుంబ సభ్యులు అందరూ కన్నీరు మున్నీరు అవుతారు. కొత్తగా విడుదల చేసిన ప్రోమోతో కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి. మోనిత శవం కనిపించడం లేదని ఏసీపీ రోషిణి చెప్పింది. దీనిబట్టి అసలు మోనిత నిజంగా మరణించిందా? లేదంటే నాటకం ఆడుతుందా? అనే సందేహం కలగక మానదు. మోనిత జైలుకు వెళుతుందని ప్రేక్షకులు అందరూ భావిస్తున్న తరుణంలో కార్తీక్ ను జైలుకు పంపి దర్శకుడు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. 

మనీతో పాటు మ‌న‌సులు కూడా గెలుచుకోవ‌చ్చు.. తారక్ సందడి మొదలైంది!

గతంలో బిగ్ బాస్ షోతో అలరించిన యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ద్వారా మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతున్నారు‌. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో ప్రోమోలు ఇప్పటికే విడుదలై ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ షోకి సంబంధించి మరో ప్రోమో వచ్చింది. ఈ షో ఈ నెలలోనే ప్రసారం కానుందని తెలుపుతూ శనివారం ఓ ప్రోమోను విడుదల చేశారు.  తాజాగా విడుదల చేసిన 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రోమో ఆకట్టుకుంటోంది. స్కూల్‌ లో పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నారు? అని టీచర్ అడిగిన ప్రశ్నకు.. కలెక్టర్‌, పైలెట్‌, సీఎం అంటూ విద్యార్ధులు రకరకాల సమాధానాలు చెప్పగా.. ఒక అమ్మాయి మాత్రం 'అమ్మను అవుదాం అనుకుంటున్నా' అని చెప్తుంది. పెద్దయ్యాక ఆ అమ్మాయ్యే షోలో తారక్ ముందు హాట్‌ సీట్‌లో కూర్చునే అవకాశం అందుకొని.. అమ్మ గొప్పతనాన్ని వివరిస్తుంది. ఆ తర్వాత 'ఇక్క‌డ మనీతో పాటు మ‌న‌సులు కూడా గెలుచుకోవ‌చ్చు. కథ మీది, కల మీది.. ఆట నాది, కోటి మీది.. రండి గెలుద్దాం' అంటూ మీసం మెలేసి తారక్‌ చెప్పిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.  ఇక షో ఆగష్టు నుంచే ప్రసారం కానుందని ప్రోమోలో తెలిపారు. మొదటి ఎపిసోడ్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా రానున్నారని సమాచారం.

"చచ్చి బతికా"... రోగాన్ని బయటపెట్టిన 'అల్లరి' సుభాషిణి

  చాలా రోజుల తరవాత సుభాషిణి కనిపించారు. సుభాషిణి కంటే 'అల్లరి' సుభాషిణిగా పరిశ్రమలో ఈవిడ పేరు తెచ్చుకున్నారు. రవిబాబు 'అల్లరి'తో పాటు ఆయన దర్శకత్వం వహించిన పలు చిత్రాల్లో ఆమె నటించారు. అలాగే ఇతర సినిమాలు, సీరియళ్లు కూడా చేశారు. కొంతకాలంగా తెరపై కనిపించడం లేదు. త్వరలో 'ఎక్స్ట్రా జబర్దస్త్' స్టేజి మీద కనిపించనున్నారు. రాకింగ్ రాకేష్ తన స్కిట్‌లోకి ఆమెను తీసుకొచ్చాడు. 'చాలా రోజుల తర్వాత మీరు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉందమ్మా' అని సుభాషిణితో రోజా చెప్పారు. తర్వాత ఇంతకాలం తాను కనిపించకపోవడానికి కారణం ఏమిటో స్టేజి మీద 'అల్లరి' సుభాషిణి బయట పెట్టారు. తనకు క్యాన్సర్ వ్యాధి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. 'నేను చచ్చి మ‌ళ్లీ బతికాను. నాకు క్యాన్సర్ వచ్చింది' అని కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతకు ముందు స్కిట్‌లో రాకేష్‌ను రోహిణి కొట్టగా... 'నేను ఇక్కడి నుండి కొడతా' అంటూ రష్మీ అన్నది. 'ఒక్కసారి కొట్టించుకోవా' అని రోహిణి అడుగుతుంది. 'రా కొడతాను' అని రొమాంటిక్‌గా రష్మీ అనడం, వేరే స్కిట్ తరవాత సుధీర్‌ను 'మావయ్య' అని పిలవడం, 'ఢీ'లో ఇటీవల బయటపడిన సాయి-నైనికా రొమాంటిక్ ట్రాక్‌ను కెవ్వు కార్తీక్ స్పూఫ్ చెయ్యడం లేటెస్ట్ ప్రోమోలో హైలైట్ గా నిలిచాయి. 

వ‌ర్ష మామూలు స్మార్ట్ కాదు.. హాట్ ఫొటోలకు ట్రోల్ చేసే చాన్స్ ఇవ్వ‌ట్లేదు!

  హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయడానికి ఏమాత్రం వెనుకాడని బుల్లితెర బ్యూటీల్లో వర్ష ఒకరు. ఇటు 'జబర్దస్త్' కామెడీ షో, అటు సీరియల్స్, మధ్య మధ్యలో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో హాట్ హాట్ డాన్స్ పెర్ఫార్మన్స్‌లతో ఆడియన్స్‌లో వర్ష క్రేజ్ తెచ్చుకుంది. అందుకు తగ్గట్టు సోషల్ మీడియాలో చాలా మంది ఆమెను ఫాలో అవుతున్నారు.  ఫాలోయర్లకు నయనానందం కలిగించడానికి అన్నట్టు హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో హాట్ హాట్ ఫొటోలు దిగుతూ అప్పుడప్పుడూ వర్ష పోస్ట్ చేస్తుంది. కానీ, కామెంట్ చేసే అవకాశం మాత్రం ఎవరికీ ఇవ్వడం లేదు. కామెంట్స్ అంటే విమర్శలు మాత్రమే కాదు, ప్రశంసలు కూడా ఉంటాయి. ప్రశంసించే అవకాశం కూడా వర్ష ఇవ్వడం లేదు.  అలాగని, అన్ని పోస్టులకు కామెంట్స్ ఆప్షన్ తీసేస్తుందా? అంటే అదీ లేదు. కొన్నిటికి కామెంట్ చేసే ఛాన్స్ ఇస్తుంది. తొడలు కనిపించేలా దిగిన హాట్ ఫోటోలకు మాత్రం కామెంట్స్ తీసేస్తుంది. పద్దతిగా చీర కట్టుకున్న కొన్ని ఫోటోలకు, ముఖ్యం మాత్రమే కనిపించేలా దిగిన క్లోజప్ ఫోటోలకు కామెంట్స్ ఆప్షన్ ఉంచింది. దీన్నిబట్టి కావాలనే వర్ష ఇలా చేస్తుందనే సంగతి అర్థమవుతోంది.

మోనితను చంప‌డానికి వెళ్లిన కార్తీక్.. ఏం జ‌రిగింది?

  'కార్తీక దీపం'లో కథ కొత్త పుంతలు తొక్కుతోంది. మరింత ఉత్కంఠగా మారుతోంది. మోనిత స్వయంగా తాను చేసిన నేరం గురించి అంజికి చెబుతున్న సమయంలో వంటలక్క వీడియో తీసిన సంగతి తెలిసిందే. దానిని డాక్టర్ బాబుకు చూపిస్తుంది. అప్పుడు ఆవేశంగా మోనిత ఇంటికి డాక్టర్ బాబు వెళతాడు. అక్కడ ఏం చేశాడు? అనేది ఇవాళ్టి (ఆగస్టు 07, 1112) ఎపిసోడ్‌లో మెయిన్ పాయింట్. అయితే, ఈ మధ్యలో ఏం జరిగింది? నేటి ఎపిసోడ్ విశేషాలు ఏంటి? అనేది చదవండి మరి! ఎట్టిపరిస్థితుల్లోనూ కార్తీక్ చేత 25వ తేదీన తన మెడలో మూడు ముడులు వేయించుకుంటానని మోనిత శపథం చేసిన సంగతి తెలిసిందే. అందరూ దాని గురించి చర్చించుకుంటూ ఉంటారు. అయితే, వంటలక్క మాత్రం బయటకువెళ్లిన భర్త ఎప్పుడొస్తాడా? అని ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ రానే వస్తాడు.  'హమ్మయ్య... వచ్చేశారా? మోనిత గురించి అంజి చెప్పిన నిజం తెలుసుకుని మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో అని కంగారుపడ్డాను' అని వంటలక్క అంటుంది. అందుకు కార్తీక్ 'అంజి ఏం చెప్తాడు. ఇంతకు ముందు చెప్పిందే చెప్పాడు. వాడు వస్తాడు... వస్తాడు అని ఎదురుచూస్తే వాడొచ్చి చెప్పింది ఇదా' అంటాడు. 'మీరు అంజిని నమ్మలేదా? నన్ను నమ్మలేదా?' అని వంటలక్క అడుగుతుంది. తాను మోనితను పెళ్లి చేసుకోకుండా ఉండటానికి, ఆ కడుపుతో తనకు సంబంధం లేదని చెప్పడానికి అంజి చెప్పిన సాక్ష్యం చాలదని కార్తీక్ నిరాశ వ్యక్తం చేస్తాడు. మోనిత నిజస్వరూపం బయటపడితే, ఏసీపీ రోషిణి మేడమ్ పెళ్లి ఆపేస్తుందని వంటలక్క అంటుంది. 'పెళ్లి తప్పించుకోవడానికి ఇదంతా చేస్తున్నానని రోషిణి మేడమ్ అనుకుంటే?' అని కార్తీక్ అనుమాన్యం వ్యక్తం చేస్తాడు. అప్పుడు మోనిత నేరం ఒప్పుకున్న వీడియోను అతడికి వంటలక్క చూపిస్తుంది.  'నాకు అర్థమైంది. మీరు సాక్ష్యం ఉంటే తప్ప దేనినీ సీరియస్ గా తీసుకోరు అని' అని వంటలక్క సీరియస్ అవుతుంది. 'నేను కాదు... రోషిణి మేడమ్ తీసుకోదు. అంత తేలిగ్గా దేనినీ నమ్మదు' అని కార్తీక్ బదులు ఇస్తాడు. అప్పుడు 'ఆవిడే కాదు, మీరు కూడా నమ్మే సాక్ష్యం నా దగ్గర ఉంది' అని వీడియో చూపిస్తుంది. హిమను చంపించానని మోనిత చెప్పిన మాటలు విని కార్తీక్ ఆగ్రహావేశాలతో ఊగిపోతాడు. ఈ వీడియో రోషిణి మేడమ్ కు చూపిస్తే అన్నీ ఆవిడ చూసుకుంటుందని వంటలక్క అంటుంది. ఇక మోనిత గురించి టెన్షన్ పడొద్దని చెప్పి, భర్తకు మంచినీళ్లు తీసుకురావడానికి లోపలకు వెళ్తుంది. వచ్చేసరికి కార్తీక్ అక్కడ ఉండదు. కాల్ చేస్తే 'భారతి ఫ్రెండ్ చనిపోయాడట. చూడ్డానికి వెళ్తున్నా' అని చెప్తాడు. కానీ, అతడు వెళ్ళింది మాత్రం మోనిత దగ్గరకు.  'నేను వెళుతున్నది చనిపోయిన వాళ్ళను చూడటానికి కాదు. చంపిన మోనితను చంపడానికి. నీకు అబద్ధం చెప్పా దీప' అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. దీప కూడా భర్త తనకు అబద్ధం చెప్పాడని అనుకుంటుంది.  మోనిత ఇంటికి కార్తీక్ వెళతాడు. అతడిని చూసి మోనిత సంతోషపడుతుంది. ఎందుకంటే అప్పటివరకు ఏసీపీ రోషిణి మేడమ్ దగ్గరకు వెళ్లి అంజి నిజం చెబితే తన పరిస్థితి ఏమవుతుందని టెన్షన్ పడుతూ ఉంటుంది. 'నువ్ వస్తావని నాకు తెలుసు కార్తీక్. నువ్వెంత మండివాడివి. నా ప్రేమ, తపన, ఆశ... అన్నీ అర్థం చేసుకుని నా కోసం వచ్చావా... రా కార్తీక్! నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిగా వచ్చావు కదూ? పెళ్లితో జవాబు చెప్పడానికి వచ్చావు కదూ?' అని సంతోషంతో ఉప్పొంగుతుంది. ఆమె మాటలకు కార్తీక్ అడ్డుకట్ట వేస్తాడు.  'నోరు ముయ్యవే' అని మోనితపై ఆవేశంగా అరుస్తాడు కార్తీక్. 'ఏంటబ్బా... అప్పుడే పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావ్?' అంటుంది. 'ఎవరే పెళ్ళాం? నా పెళ్ళాం పేరు దీప. చచ్చేదాకా తనే నా పెళ్ళాం. నీలాంటి మోసగత్తెలు వందమంది వచ్చినా నా కాలి గోటితో సమానం' అని కార్తీక్ అంటాడు. తన కబుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రినని ఒప్పుకోవాల్సిందేనని కార్తీక్ తో మోనిత అంటుంది. అదే పరిష్కారమని చెబుతుంది.  'పరిష్కారం పెళ్లి కాదు, నీ చావు' అని కార్తీక్ ఆవేశంతో ఊగిపోతాడు. 'ఏం అన్నావ్? చావా? నేను ఎలా చేస్తాను? ఎందుకు చస్తాను??' అని మోనిత అడుగుతుంది. 'ఇప్పుడే నా చేతుల్లో చస్తావ్. నన్ను ప్రేమించినందుకు చస్తావ్. హిమను దారుణంగా చంపించినందుకు నిన్ను చంపాలని వచ్చాను' అని కార్తీక్ చెప్పడంతో ఎపిసోడ్ ముగిసింది. మరి, మోనితను కార్తీక్ చెంపేశాడా? లేదా? అనేది తదుపరి ఎపిసోడ్ లో చూడాలి. అందులో ఆడియన్స్ దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఉంది.  

బిగ్ బాస్ 5.. ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌కు క్రేజీ ఆఫ‌ర్‌!

  యూట్యూబ‌ర్‌గా ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. సోష‌ల్ మీడియాలోనూ అత‌డి ఫాలోయ‌ర్స్ సంఖ్య త‌క్కువేమీ కాదు. త‌న వీడియోల‌తోనే కాకుండా, ఇత‌ర‌త్రా కూడా ష‌ణ్ముఖ్ వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తున్నాడు. యూట్యూబ్‌లో అత‌డు క్రియేట్ చేసే రికార్డుల‌ను, యూత్‌లో అత‌డికున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాల‌ని బిగ్ బాస్ తెలుగు నిర్వాహ‌కులు చాలా కాలంగా ట్రై చేస్తూనే ఉన్నారు. మునుప‌టి సీజ‌న్ల‌కు త‌న‌కు ఆఫ‌ర్ చేసిన రెమ్యూన‌రేష‌న్ అసంతృప్తి క‌లిగించ‌డంతో అత‌ను ఆ షోలో భాగం కావ‌డానికి అంగీక‌రించ‌లేదు.  దాంతో బిగ్ బాస్ 5 సీజ‌న్‌కు అత‌డిని ఎలాగైనా తీసుకురావాల‌ని షో నిర్వాహ‌కులు నిర్ణ‌యం తీసుకున్నారు. దీని కోసం భారీ మొత్తాన్నే అత‌డికి ఆఫ‌ర్ చేశార‌నీ, త‌ను ఊహించిన దానికి మించి ఆఫ‌ర్ రావ‌డంతో ష‌ణ్ముఖ్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లూ ప్ర‌చారం జ‌రుగుతోంది. బిగ్ బాస్ 5లో పాల్గొనే కంటెస్టెంట్లు అంద‌రికంటే అత‌డికే ఎక్కువ రెమ్యూన‌రేష‌న్ ముడుతున్న‌ట్లు, అది కోటి రూపాయ‌ల దాకా ఉంటుంద‌న్న‌ట్లు చెప్పుకుంటున్నారు. నాలుగో సీజ‌న్‌లో ఎక్కువ పాపుల‌ర్ ఫేస్‌లు లేవ‌నే విమ‌ర్శ‌లు రావ‌డంతో, ఈసారి వార్త‌ల్లో వ్య‌క్తుల మీద‌నే ఆర్గ‌నైజ‌ర్స్ ఫోక‌స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి సురేఖా వాణి, యాంక‌ర్ వ‌ర్షిణి సౌంద‌రాజ‌న్‌, యాంక‌ర్ ర‌వి, టీవీ బ్యూటీ న‌వ్య స్వామి, సినీ తార‌లు ఇషా చావ్లా, పూన‌మ్ బ‌జ్వా, కొరియోగ్రాఫ‌ర్ ఆనీ లాంటి వారు వెళ్ల‌నున్న‌ట్లు ఓ లిస్టు ఆన్‌లైన్‌లో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అదే నిజ‌మైతే బిగినింగ్ నుంచే 5వ సీజ‌న్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అంత‌మంది సెల‌బ్రిటీల్లో ష‌ణ్ముఖ్‌కే ఎక్కువ రెమ్యూన‌రేష‌న్ ద‌క్కుతుండ‌టం టాక్ ఆఫ్ ద టౌన్‌. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించే బిగ్ బాస్ 5 తెలుగు సెప్టెంబ‌ర్ 5న మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి.