అవినాశ్‌తో 'నేను మిస్టేక్ చేశా.. సారీ' అని చెప్పిన అరియానా!

  'బిగ్ బాస్' హౌస్‌లో, హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత అవినాష్, అరియనా మధ్య రిలేషన్షిప్ వార్తల్లో నిలిచింది. ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే మాటలూ వినిపించాయి. ఒకే ఫ్లాట్‌లో ఉంటున్నారని అప్పట్లో కొందరు చెవులు కొరుకున్నారు. అయితే, ఇద్ద‌రూ వాటిని ఖండించారు. తాము మంచి స్నేహితులమని చెప్పుకొచ్చారు. కానీ, అవినాష్ - అరియనా కొన్నాళ్లుగా చెట్టపట్టాలు వేసుకుని కనిపించలేదు. అందుకు కారణం ఇద్దరి మధ్య గొడవలే. అసలు, వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు? అనేది 'కామెడీ స్టార్స్'లో చెప్పుకొచ్చారు.  సండే టెలికాస్ట్ అయ్యే 'కామెడీ స్టార్స్'లో తన స్కిట్ లోకి అరియనాను తీసుకొచ్చాడు అవినాష్. ఆర్జీవీ-అరియనా బోల్డ్ ఇంటర్వ్యూ మీద అవినాష్ సెటైర్స్, పంచ్ డైలాగులు వేశాడు. స్కిట్ అయిపోయాక జడ్జ్‌మెంట్ టైమ్‌లో శ్రీముఖి ఇద్దరినీ నేరుగా అడిగింది. "కొన్ని గొడవల వల్ల మీ ఇద్దరి మధ్య దూరం వచ్చింది. ఎందుకు విడిపోయారు?" అని శ్రీముఖి అడిగింది.  "గొడవ అయిపోయాక ఇద్దరినీ కూర్చుని మాట్లాడితే మాకు గొడవ గురించి ఏమీ తెలియదు. గొడవ తర్వాత ప్రభావం ఏదైతే ఉంటుందో... 'మాట్లాడకూడదు, మాట్లాడొద్దు' అని. అది ఎక్కువ ప్రభావం చూపించింది" అని అరియనా చెప్పింది. "ఫ్రెండ్ తప్పుదోవలో వెళ్తుంది. ఇది రాంగ్ వే. ఆమెకు ఒక ఎక్స్‌పీరియన్స్. అలా వెళ్లొద్దు, వద్దని రెండు మూడుసార్లు చెప్పాను. రెండు మూడుసార్లు మాట్లాడడటం మానేశాను. అప్పుడు తనే వచ్చి 'నేను మిస్టేక్ చేశా. సారీ' అని చెప్పింది" అని అవినాష్ అన్నాడు. వెంటనే "ఆ పొగరుబోతు బిహేవియర్ తగ్గించుకోమని చెప్పండి" అని అరియనా అక్కడున్నవాళ్లకు చెప్పింది. "మనిషి అన్నాక కోపాలు, తాపాలు అన్నీ మైంటైన్ చెయ్యాలి. లేకపోతే మనిషే కాదు" అని అవినాష్ అన్నాడు.  మొత్తం మీద అవినాష్, అరియనా మధ్య రెండు మూడుసార్లు గొడవలు అయ్యాయని... ఆ తర్వాత మళ్ళీ కలిశారని అర్థమవుతోంది.    

అతడి ఇమిటేషన్ చూసి శ్రీముఖికి చచ్చిపోవాలనిపించింది!

  ఒకరు కాదు... ఇద్దరు కాదు... ఏకంగా ముగ్గురు యంగ్ హీరోలతో సండే సందడి చేయబోతోంది 'జీ తెలుగు' ఛానల్. కృష్ణాష్టమి సందర్భంగా జీ తెలుగులో 'అల... బృందావనంలో' అని సీరియల్ ఆరిస్టులు, టీవీ కమెడియన్లతో ఓ ప్రోగ్రామ్ చేసింది. యంగ్ హీరోలు సుశాంత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబులను దానికి గెస్టులుగా తీసుకొచ్చింది.  శ్రీముఖిని బుల్లెట్ ఎక్కించుకుని స్టేజి మీద సుశాంత్ ఒక రౌండ్ వేశాడు. అంటే... 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'లో ప్రమోషన్ అన్నమాట. 'రాజ రాజ చోర'లో దొంగగా నటించిన శ్రీవిష్ణు చిన్నతనంలో చేసిన దొంగతనాలను గుర్తు చేసుకున్నాడు. సుధీర్ బాబు ఏం చేశాడన్నది ఆసక్తికరం. ఆదివారం ఐదు గంటలకు ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ కానుంది. ఇక, ఇందులో శ్రీముఖిని గల్లీబోయ్ రియాజ్ ఇమిటేట్ చెయ్యడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. స్కిట్ లో భాగంగా బాలయ్య వేషధారి 'గాడిద' అని తిడితే... 'నేను చూసేదానికి గాడిదలా ఉంటాను కానీ' అని శ్రీముఖి గెటప్ వేసిన రియాజ్ డైలాగ్ చెప్పాడు. దాంతో ఒక్కసారి అందరూ నవ్వేశారు. శ్రీముఖి అయితే 'నన్ను ఎంతోమంది ఇమిటేట్ చేశార్రా! కానీ, ఫర్ ద ఫస్ట్ టైమ్ చచ్చిపోవాలని అనిపిస్తోంది' అని చెప్పింది. 'శ్రీముఖి... శ్రీముఖి... నువ్ అరుస్తావు దేనికి? ఓడలా ఒళ్లు పెంచావ్.. తగ్గించవు దేనికి?' అంటూ  శ్రీముఖి వెయిట్ మీద కూడా డైలాగులు వేశారు. ప్రోమోలో ఇన్ని ఉంటే... షోలో ఇంకెన్ని పంచ్ డైలాగులు, సెటైర్స్ ఉన్నాయో చూడాలి.   

స్కిట్‌లో కాదు.. ప్రేమతో హరికి అషు ముద్దు!

  టీవీ కామెడీ షోల్లో ఈమధ్య కిస్సులు కామన్ అయ్యాయి. 'జబర్దస్త్'లో మొన్నటివరకు లేడీ గెటప్స్ తో స్కిట్లు చేసేవారు. ఎప్పుడైతే లేడీ గెటప్స్ వేసుకునే అబ్బాయిల ప్లేసులో అమ్మాయిలను తీసుకోవడం మొదలైందో... అప్పటి నుండి స్కిట్ ప్రాక్టీస్‌లో లేకపోయినా అమ్మాయిలను ఎత్తుకోవడం, తాకడం, కౌగిలించుకోవ‌డం, ముద్దులు పెట్టడం చేస్తున్నారు మేల్ కంటెస్టెంట్లు. అమ్మాయిలు కావాలని అబ్బాయిలకు ముద్దులు పెట్టడం కల అన్నట్టు ఉండేది. కానీ,అషురెడ్డి మాత్రం హరికి ప్రేమతో ముద్దు పెట్టింది.  'స్టార్ మా'లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు వచ్చే 'కామెడీ స్టార్స్'లో హరి టీమ్ లో అషురెడ్డి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వాళ్ళు చేసే స్కిట్స్ కు హైలైట్ అవుతూ ఉంటుంది. ఈ సండే 'లవ్' థీమ్ మీద ఎపిసోడ్ చేశారు. '30 వెడ్స్ 21' జంట చైతన్య, అనన్యతో పాటు మై విలేజ్ షో అనిల్ తో పాటు అవినాష్, అరియనా సందడి చేశారు.  ప్రోగ్రామ్ మధ్యలో హరిని అషురెడ్డి ప్రేమతో ముద్దు పెట్టుకుంది. దానికి హరి కూడా షాక్ అయ్యాడు. షో చివర్లో అషురెడ్డి మీద ప్రేమ ఉన్నంత కాలం తన గుండెలపై అషు పేరు టాటూగా ఉంటుందని హరి చెప్పుకొచ్చాడు. సండే షోకి సత్యదేవ్ గెస్ట్ గా వచ్చాడు. 

టీవీ తార రాగిణి ఎవ‌రో మీకు తెలుసా?

  'అమృతం' సీరియ‌ల్‌లో అంజి (గుండు హ‌నుమంత‌రావు) భార్య శాంత పాత్ర‌లో ఆడియెన్స్‌ను అమితంగా అల‌రించిన రాగిణి ఎవ‌రో నేటి త‌రంలోని చాలామందికి తెలీదు. ఆమె మొద‌ట 'వేమ‌న' టీవీ సీరియ‌ల్ ద్వారా దూర‌ద‌ర్శ‌న్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. అప్ప‌ట్నుంచి ఇప్ప‌టిదాకా లేడీ డిటెక్టివ్‌, అమృతం, నాన్న‌, రాధ మ‌ధు, ఇద్ద‌రు అమ్మాయిలు, అగ్నిసాక్షి, రెండు రెళ్లు ఆరు లాంటి సీరియ‌ల్స్ ద్వారా వీక్ష‌కుల‌కు బాగా స‌న్నిహిత‌మ‌య్యారు. ఆమె కామెడీ టైమింగ్‌, ఆమె హావ‌భావాలు అంద‌రినీ అల‌రిస్తుంటాయి.  రాగిణి స్వ‌త‌హాగా తెలుగు వ‌నిత అయినా బాల్య‌మంతా క‌ర్ణాట‌కలోని రాయ‌చూర్‌లో గ‌డిచింది. ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి కృష్ణ‌వేణికి రాగిణి స్వ‌యానా చెల్లెలు. న‌టిగా సినీ రంగంలో ప్ర‌వేశించాల‌నే ఉద్దేశంతో, అక్క కృష్ణ‌వేణి ప్రోత్సాహంతో, మ‌ద్రాసులో వెంప‌టి చిన‌స‌త్యం మాస్ట‌ర్ ద‌గ్గ‌ర మూడేళ్ల‌పాటు ఆమె డాన్స్ అభ్య‌సించారు. ఆ త‌ర్వాత మ‌ద్రాస్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చి స్థిర‌ప‌డిన త‌ర్వాత మొట్ట‌మొద‌ట‌గా 'వేమ‌న' టీవీ సీరియ‌ల్‌లో త‌న అక్క కృష్ణ‌వేణికి కూతురి పాత్ర‌లో న‌టించారు రాగిణి. ఆ త‌ర్వాత ఆమె వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా ఒక దాని త‌ర్వాత ఒక‌టిగా ప‌లు దూర‌ద‌ర్శ‌న్ సీరియ‌ల్స్‌లో న‌టించే అవ‌కాశం ల‌భించింది. ముఖ్యంగా 'ఎండ‌మావులు' సీరియ‌ల్‌లో భ‌ర్త‌ప‌ట్టే బాధ‌లు భ‌రించ‌లేక ఎదురుతిరిగి పోరాడిన యువ‌తిగా ఆమె పోషించిన సీత పాత్ర విశేష‌మైన పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ఇప్ప‌టి ఆమె ఇమేజ్‌కు ఆ సీత క్యారెక్ట‌ర్ పూర్తి భిన్న‌మైన‌ది కావ‌డం గ‌మ‌నార్హం.  టీవీ సీరియ‌ల్స్ ద్వారా వ‌చ్చిన పాపులారిటీ వ‌ల్ల రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో 'గాయం' సినిమాలో గుమ్మ‌డి కూతురిగా న‌టించే అవ‌కాశం వ‌చ్చింది రాగిణికి. అప్ప‌ట్నుంచీ కేవ‌లం టీవీకే ప‌రిమితం కాకుండా అవ‌కాశం ల‌భించిన‌ప్పుడ‌ల్లా సినిమాల్లోనూ న‌టిస్తూ వ‌స్తున్నారు. అలా ఆమె న‌టించిన సినిమాల్లో అన్న‌, అంద‌రూ అంద‌రే, కిష్కింధ‌కాండ‌, సూప‌ర్ మొగుడు, ప‌విత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, గ‌ణేష్‌, అష్టా చ‌మ్మా, బాణం, ఈ రోజుల్లో, జులాయి, భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు లాంటి సినిమాలు ప్ర‌ముఖ‌మైన‌వి. మొద‌ట్లో సాత్విక పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకున్న రాగిణి ఇప్పుడు కామెడీ ట‌చ్ ఉన్న క్యారెక్ట‌ర్లు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె 'అమృతం ద్వితీయం', 'చెల్లెలి కాపురం' సీరియ‌ల్స్‌లో న‌టిస్తున్నారు.

'బిగ్ బాస్ 5' ప్రారంభానికి ముహూర్తం పెట్టేశారు!

  'చెప్పండి బోర్‌డమ్‌కి గుడ్ బై... వచ్చేస్తుంది బిగ్‌బాస్ సీజన్ ఫైవ్' అంటూ కింగ్ అక్కినేని నాగార్జున బుల్లితెర మీద మరోసారి సందడి చెయ్యడానికి సిద్ధమయ్యారు. మూడోసారి 'బిగ్ బాస్' షోకి హోస్ట్ చెయ్యడానికి ఆయన రెడీగా ఉన్నారు. సెప్టెంబర్ తొలి వారం నుండి 'స్టార్ మా' ఛానల్‌లో షో స్టార్ట్ కానుందనేది తెలిసిన విషయమే. ఇప్పుడు ఏ తేదీ నుండి స్టార్ట్ చేస్తారనేది కూడా వెల్లడించారు.  సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు ఐదో సీజన్‌ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు, శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు షో ప్రసారం కానుంది. ఆల్రెడీ కంటెస్టెంట్లను క్వారంటైన్ చేశారు. హౌస్‌లోకి ఎవరెవరు వెళతారనేది ముందుగా చెప్పే అలవాటు స్టార్ మాకు లేదు. కానీ, కొందరి పేర్లు అయితే కన్ఫర్మ్ అంటున్నారు. అందులో యాంకర్లు రవి, వ‌ర్షిణి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ పేర్లు ఉన్నాయి.  రవి, షణ్ముఖ్ కాకుండా... 'టిక్ టాక్' దుర్గారావు పిలిస్తే వెళతానని అంటున్నారు. ఇంకా ఆర్‌జె కాజల్‌, శ్వేతా వర్మ, సిరి హనుమంతు, లోబో, ట్రాన్స్‏జెండర్ ప్రియాంక, యానీ మాస్టర్, కార్తీక దీపం భాగ్య అలియాస్ ఉమ, నటి లహరి  పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరెవరు షోకి వెళతారో త్వరలో తెలుస్తుంది.

గాజుముక్క గుచ్చుకొని "అబ్బా" అని అరిచిన 'మూగ‌మ్మాయి' మోనిత‌!

  'కార్తీక దీపం' కథనం రసవత్తరంగా మారింది. ఎటువంటి నేరం చెయ్యని కార్తీక్ కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అతడు కటకటాల వెనక్కి వెళ్లడానికి కారణమైన మోనిత, అతడిని చూడటానికి మారు వేషంలో ఏకంగా జైలుకు వచ్చింది. అదే సమయంలో జైలుకు దీప రావడం, వాళ్ళిద్దరికీ మోనిత టీ ఇవ్వడం గత ఎపిసోడ్‌లో జరిగిన సన్నివేశాలు! మోనితను కార్తీక్, దీప దంపతులు గుర్తించారా? లేదా? అన్నది నేటి ఎపిసోడ్‌లో ఆసక్తికరంగా మారింది. అసలు, ఈరోజు (ఆగస్టు 26, 1128) ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే... మోనిత పోలీస్ స్టేషన్‌కి రావడం, అక్కడున్న వాళ్ళకు టీ ఇవ్వడం తెలిసిందే. గుమ్మం దగ్గర ఉన్న మోనితను పక్కకు తప్పుకోమని దీప అడిగే సన్నివేశాన్ని ఈరోజు చూపించారు. భర్తకు భోజనం తీసుకుని వెళ్తున్న దీపను చూసి 'దీని పతి భక్తి తగలెయ్య' అని మోనిత తిట్టుకుంటుంది. కార్తీక్ దగ్గరకు వెళ్లిన దీప, మోనిత బతికున్న విషయాన్ని చెబుతుంది. తనను చంపడానికి వచ్చిన మోనితను వదలనని దీప అంటుంది. ఆమెను కార్తీక్ వారిస్తాడు. ఆ రోజు వీడియో తీసిన సమయంలో మోనిత నిన్ను చూస్తే పరిస్థితి ఏంటని మందలిస్తాడు. భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకునేది మోనిత వింటూ ఉంటుంది.  కార్తీక్ చేతికి మోనిత టీ ఇవ్వబోతే ముందు దీపకు ఇవ్వమని కార్తీక్ అంటాడు. దీప చేతికి ఇవ్వకుండా టేబుల్ మీద పెట్టబోయి కింద పడేస్తుంది. సౌండ్ విని 'ఏయ్ ఎవరు నువ్వు' అని ఓ కానిస్టేబుల్ అంటాడు. అక్కడ మోనితను కార్తీక్ సేవ్ చేశాడని చెప్పాలి. లేదంటే దొరికిపోయేది. 'తను మూగమ్మాయి. టీ కొట్టు అతని కూతురు. ఈ రోజు నుండి ఈమె టీ తెస్తుందని రత్నసీత చెప్పింది' అని కార్తీక్ చెప్పడంతో మోనిత సేవ్ అయ్యింది. అయితే, కిందపడిన టీ గ్లాసు గట్రా క్లీన్ చేసేటప్పుడు మోనిత 'అబ్బా' అని అరవడంతో కార్తీక్ మనసులో డౌట్ వస్తుంది. మూగమ్మాయి అరవడం ఏమిటి? అని ఆలోచిస్తాడు. అంతకు ముందు టీ అందించిన సమయంలో స్పర్శను గుర్తు చేసుకుని, అది మోనిత స్పర్శ అని పసిగడతాడు.  'రత్నసీత మూగమ్మాయి టీ తెస్తుందని చెప్పింది. కానీ, ఆమె గాజు ముక్క గుచ్చుకున్నప్పుడు అబ్బా అని అరిచింది. నువ్వు విన్నావా?' అని దీపను కార్తీక్ అడుగుతాడు. మీరేదో భ్రమలో ఉన్నారని దీప లైట్ తీసుకుంటుంది. దీపకు నిజం చెబితే మోనిత వెంటపడుతుంది. అప్పుడు దీపను మోనిత చంపేస్తుందని చెప్పడు. ఏసీపీ రోషిణి వచ్చాక చెప్పాలని అనుకుంటాడు. మరోవైపు మోనిత ఆస్పత్రికి ఏసీపీ రోషిణి  వెళ్తుంది. అక్కడ డాక్టర్ భారతి, పనిచేసే వాళ్లు, అందరూ కార్తీక్ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతారు.  మోనిత బతికే ఉందని దీప చెబితే కార్తీక్ నమ్మలేదు. ఇప్పుడు కార్తీక్ కి కూడా మోనిత బతికి ఉందని, జైలుకు వచ్చిందనే విషయం తెలిసింది. దాంతో తర్వాత ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. 

మోనితను చూసిన దీప... పోలీసులకు ఎలా పట్టిస్తుంది?

  మోనిత మరణించలేదన్న నిజం దీపకు తెలిసింది. తెలియడం మాత్రమే కాదు... దీపను చంపడానికి మోనిత వేసిన ప్లాన్ బెడిసికొట్టడంతో పాటు దీపకు మోనిత రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతుంది. అయితే, అక్కడ నుండి ఎలాగోలా తప్పించుకుంటుంది. మోనిత బతికిఉందన్న నిజాన్ని మామగారు ఆనందరావు అండ్ ఫ్యామిలీకి, జైలులో ఉన్న భర్త కార్తీక్ కు చెబుతుంది. అయితే, నిజం తెలియడం వేరు. దాన్ని నిరూపించడం వేరు.  మోనిత మరణించలేదని, కార్తీక్ ను జైలుకు పంపడం కోసం నాటకం ఆడిందని పోలీసుల ముందు దీప ఎలా నిరూపిస్తుంది? మోనితను పట్టించడానికి అందివచ్చిన అవకాశాన్ని కార్తీక్-దీప దంపతులు గుర్తిస్తారా? అన్నది రేపటి ఎపిసోడ్‌లో తెలుస్తుంది. మరి, ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే... ఒంటరిగా గుడికి వచ్చిన దీపను గన్‌తో షూట్ చేసే సమయంలో తుమ్ము రావడం, సరిగ్గా అదే సమయంలో అక్కడికి దుర్గ రావడంతో సోదమ్మ వేషంలో ఉన్న మోనిత తప్పించుకున్న సంగతి తెలిసిందే. అయితే, మోనితను దీప చూస్తుంది. జరిగినదాన్ని తలుచుకుంటూ మోనిత బాధపడుతుంది. తన చేతికి మట్టి అంటుకోకుండా దీప అడ్డు తొలగించి కార్తీక్ ను తనవాడిని చేసుకోవడం ఎలా? అని ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే... మరోవైపు తండ్రి ఎందుకు జైలుకు వెళ్ళాడో తెలుసుకోవాలని పిల్లలు దీపను ప్రశ్నిస్తారు. దాంతో వాళ్లపై దీప కోప్పడుతుంది.  కట్ చేస్తే... దీపను చంపాక‌ ఎక్కడో చేసిన పొరబాటు సాక్ష్యంగా మారితే కార్తీక్ జైలు నుండి బయటకు వచ్చినా, తాను జైలులోకి వెళ్లాల్సి వస్తుందన్న నిజాన్ని మోనిత గ్రహిస్తుంది. దాంతో ప్లాన్ బి అమలు చేయాలని అనుకుంటుంది. రత్నసీతకు ఫోన్ చేసి చెబుతుంది. 'రిస్క్ ఏమో మేడమ్' అని రత్నసీత ప్రశ్నిస్తే 'కార్తీక్ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాన'ని అంటుంది.  జైలులో మోనిత ప్లాన్ ను రత్నసీత అమలు చేయడం మొదలు పెడుతుంది. 'డాక్టర్ సార్.. మీకు బయట టీ చెప్పి వెళ్తాను. మూగమ్మాయి వచ్చి మీ టీ ఇస్తుంది' అని వెళుతుంది. మూగమ్మాయి వేషంలో జైలులోకి మోనిత వస్తుంది. ఆ సమయంలో కార్తీక్, దీప మాట్లాడుకుంటూ ఉంటారు. మోనితను చూశానని దీప చెబుతుంది. కార్తీక్ మాత్రం తనను విడిపించాలనే ధ్యాసలో అలా అంటున్నావని అంటాడు. 'లేదు డాక్టర్ బాబు. మోనిత రివాల్వర్ తో వచ్చింది. దాన్ని పట్టుకుని మిమ్మల్ని బయటకు తీసుకొస్తా' అంటుంది దీప.  అదే సమయంలో కార్తీక్ చేతిని తాకుతూ టీ అందించి మోనిత వెళుతుంది. ఈ సన్నివేశం చాలా ఉత్కంఠగా ఉంది. అక్కడ మోనిత స్పర్శను కార్తీక్ గమనిస్తాడు. దీపతో మాట్లాడుతూ ఉండటం వల్ల పెద్దగా పట్టించుకోడు. 'ఆ స్పర్శ మోనితదే' అనుకుంటాడు. అయితే, మోనిత బయటకు వెళ్లే సమయంలో కాలికి ఏదో తగలడంతో 'హా' అంటుంది. మూగమ్మాయి ఎలా అరిచింది? అనేది కార్తీక్, దీప గమనిస్తే ఆమెను పట్టించవచ్చు. కళ్ళముందుకు వచ్చిన మోనితను పెట్టుకుంటారా? లేదా? అన్నది రేపటి ఎపిసోడ్‌లో చూడాలి. 

మళ్ళీ 'మాయాద్వీపం' తీసుకొస్తున్న ఓంకార్

  ఓంకార్ అంటే బుల్లితెర మీద ఒక బ్రాండ్. అందుకు కారణాలు ఏమిటని వెతికితే 'ఆట' డాన్స్ ప్రోగ్రామ్ సహా 'మాయాద్వీపం' రియాలిటీ షో కూడా ఉంటుంది. కెరీర్ స్టార్టింగులో ఓంకార్ చేసిన ఈ షో అతడికి మంచి సక్సెస్ ఇచ్చింది. వరుసగా మూడేళ్లు... 2007, 2008, 2009లో 'మాయాద్వీపం' చేశాడు. ఆ తర్వాత దానిని పక్కన పెట్టేశాడు. నాలుగేళ్ల తర్వాత 2013, 2014లో చేశాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 2021లో 'మాయాద్వీపం' తీసుకురావడానికి ఓంకార్ ప్లాన్ చేశాడు. 'పిల్లలూ... మీరు 'మాయాద్వీపం'లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే?' అంటూ ఆల్రెడీ ఒక ప్రోమో రిలీజ్ చేశాడు. ఆరు నుండి పన్నెండు ఏళ్లలోపు వయసున్న పిల్లలు తమ టాలెంట్ చూపించే విధంగా ఒక నిమిషం వీడియో రికార్డ్ చేసి... దాంతో పాటు పేరు, వివరాలను పంపించమని అడిగాడు. త్వరలో జీతెలుగు ఛానల్ లో ఈ షో స్టార్ట్ కానుంది.  ఈసారి షోలో కొత్తగా ఏం ప్లాన్ చేశారో చూడాలి. మునుప‌టిలా పిల్ల‌ల‌ను ఈ స‌రికొత్త 'మాయాద్వీపం' అల‌రిస్తుందా?  లెట‌జ్ వెయిట్ అండ్ సీ.

మహిళల మనసు గెలుచుకున్న జూనియ‌ర్ ఎన్టీఆర్!

  నందమూరి కుటుంబ సంస్కారం, మహిళలకు ఎంత గౌరవం ఇస్తారనేది 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమంతో మరోసారి ప్రజలకు తెలిసింది. ఒక్క అక్షరం, బుల్లితెర కార్యక్రమం పేరులో ఒక్క అక్షరం మార్పు చెయ్యడంతో యంగ్ టైగర్ జూనియ‌ర్‌ ఎన్టీఆర్ మహిళల మనసు గెలుచుకున్నారు. ఆయన నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జెమినీ టీవీలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమం ఆగస్టు 22న మొదలైంది. మొదటి ఎపిసోడ్‌కి రామ్ చరణ్ గెస్ట్ కింద వచ్చారు. అదే రోజు చిరంజీవి పుట్టినరోజు కూడా కావడంతో తండ్రితో పాటు 'ఆచార్య' సినిమాకు సంబంధించిన విశేషాలు రామ్ చరణ్ వెల్లడించారు. అయితే, గతంలో 'స్టార్ మా'లో ఈ కార్యక్రమం ప్రసారమైనప్పుడు 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అని ఉండేది. కార్యక్రమానికి వచ్చే అతిథులను ఏకవచనంతో సంబోధించడం తనకు నచ్చలేదని, అందుకని 'కోటీశ్వరుడు'ను 'కోటీశ్వరులు' కింద మార్చమని చెప్పానని తార‌క్‌ అన్నారు. టైటిల్ మార్పు గురించి జూనియ‌ర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ "షోకు వచ్చేవాళ్లను 'డు' అంటూ ఏకవచనంతో సంభోదించడం నాకు ఇష్టం లేదు. మహిళలు కూడా  షోకు వస్తారు కాబట్టి 'ఎవరు మీలో కోటీశ్వరులు' అని మార్చాము" అని చెప్పారు. ఈ మాట మహిళల మనసులను తాకింది. తార‌క్‌ మీద వారంతా ప్రశంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. 

అమ్మ నాన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఎప్పుడూ మ‌న హృద‌యంలోనే ఉంటారు!

  వ‌చ్చే 29వ తేదీ 'శ్రీ‌దేవి డ్రామా కంపెనీ' ఎపిసోడ్ స్పెష‌ల్‌గా ఉండ‌నుంది. టీవీలోని లేడీ స్టార్స్ అంద‌రూ ఈ ఎపిసోడ్‌లో ఆడియెన్స్‌ను అల‌రించ‌నున్నారు. అంతేకాదు, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు, లేడీ అమితాబ్ విజ‌య‌శాంతికి నీరాజ‌నాలు అర్పిస్తూ ప్ర‌త్యేక స్కిట్‌ల‌తో ఆర్టిస్టులు మ‌న ముందుకు రానున్నారు. సెప్టెంబ‌ర్ 2 ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు అడ్వాన్స్ బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తూ ప‌వ‌న్ క‌ల్యాణ్ లేడీ ఫ్యాన్స్ ఆయ‌న‌కు ఈ ఎపిసోడ్‌లో నీరాజ‌నాలు ప‌లికారు. ఆ ఫ్యాన్స్‌తో ఇంద్ర‌జ‌, హేమ‌, సున‌య‌న లాంటి తార‌లు కూడా జ‌త క‌లిశారు. ఇంకేముంది.. ఆడియెన్స్‌కు కావాల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ ల‌భించిన‌ట్లే. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ప్రోమోలో లేడీ స్టార్స్ డాన్స్ ప‌ర్ఫార్మెన్సెస్ అదిరిపోయాయి. ఇంద్ర‌జ అయితే "అమ్మ నాన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎప్పుడూ మ‌న హృదయంలోనే ఉంటారు" అని చెప్పిన డైలాగ్‌కు విజిల్స్ మోగిపోయాయి. ఆ డైలాగ్ చెప్పి, స్టైల్‌గా ఆమె క‌ళ్ల‌కు బ్లాక్ గాగుల్స్ పెట్ట‌డం అల‌రించింది. 'గ‌బ్బ‌ర్‌సింగ్‌'లో మెడ‌పై చేయిపెట్టి పైకీ కింద‌కు రాసే ప‌వ‌న్ మేన‌రిజ‌మ్‌ను లేడీ స్టార్స్ అంతా ఒకేసారి ప్ర‌ద‌ర్శించ‌డం కూడా హైలైట్. ఆ త‌ర్వాత విజ‌య‌శాంతికి నీరాజ‌నాలు తెలుపుతూ రోహిణి, ఆటో రామ్‌ప్ర‌సాద్ బృందం ప్ర‌ద‌ర్శించిన 'ఒసేయ్ రాముల‌మ్మా' ప్ర‌ద‌ర్శ‌న అంద‌రికీ క‌న్నీళ్లు తెప్పించింది. విజ‌య‌శాంతి రోల్‌లో రోహిణి, రామిరెడ్డి రోల్‌లో రామ్‌ప్ర‌సాద్ అద‌ర‌గొట్టారు. ఆ ప్ర‌ద‌ర్శ‌న అయ్యాక‌ "తెర‌పై విజ‌య‌శాంతి లేడీ సూప‌ర్‌స్టార్ అయితే, టీవీపై రోహిణి సూప‌ర్‌స్టార్" అని హైప‌ర్ ఆది కితాబు ఇచ్చేశాడు. నిజంగానే త‌న న‌ట‌న‌తో అంద‌రి హృద‌యాల‌నూ ద్ర‌వింప‌జేసింది రోహిణి. ప్రోమోనే ఇంత‌గా ఆక‌ట్టుకుందంటే, వ‌చ్చే ఆదివారం ప్ర‌సార‌మ‌య్యే ఫుల్ ఎపిసోడ్ ఏ రేంజిలో ఆడియెన్స్‌ను ఖుష్ చేస్తుందో చూడాలి.

తెలుగు బుల్లితెర‌పై క‌న్న‌డ రౌడీ బేబీ!

  ఇప్ప‌టికే తెలుగు బుల్లితెర‌ను ప‌లువురు క‌న్న‌డ భామ‌లు ఏలుతుండ‌గా, లేటెస్ట్‌గా మ‌రో క‌న్న‌డ న‌టి ప‌రిచ‌యం కాబోతోంది. ముత్య‌మంత ముద్దు సీరియ‌ల్‌లో హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఆ తార‌.. నిషా ర‌వికృష్ణ‌న్. వ‌చ్చే సోమ‌వారం రాత్రి 7.30 గంట‌ల‌కు ఆ సీరియ‌ల్ తొలి ఎపిసోడ్ ప్ర‌సారం కానున్న‌ది. నెల్లూరు బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే ఆ సీరియ‌ల్‌లో హీరోయిన్ గీత క్యారెక్ట‌ర్‌ను పోషిస్తోంది నిష‌. క‌థ ప్ర‌కారం ఆమె త‌మిళియ‌న్‌గా క‌నిపించ‌నున్న‌ది.  ఇంట్లో చిన్న కూతురైన ఆమె పెళ్ల‌య్యాక త‌న అత్తామామ‌ల‌తో పాటు అమ్మానాన్న‌లు కూడా ఒకే ఇంట్లో ఆనందంగా గ‌డ‌పాల‌ని ఆశిస్తుంటుంది. అలాంటి ఆమె గోవింద్ అనే యువ‌కుడితో ప్రేమ‌లో ప‌డుతుంది. ఆ పాత్ర‌ను సిద్ధార్థ్ వ‌ర్మ చేస్తున్నాడు. అత‌నిది పాత త‌ర‌హా ప‌ద్ధ‌తి. కోడ‌లు ఇంట్లో ఉండి ప‌నిపాట‌లు చూసుకోవాల‌ని, పెళ్లిలో క‌ట్నం తీసుకోవాల‌నే టైప్‌. రెండు భిన్న ధ్రువాలైన ఆ ఇద్ద‌రికీ ఎలా సెట్ట‌వుతుందనేది ఆస‌క్తిక‌రం.  క‌న్న‌డంలో నిష‌కు "రౌడీ బేబీ" అని పిలుస్తుంటారు. అంటే 'గ‌ట్టిమేళ' సీరియ‌ల్‌లోని పాత్ర ద్వారా ఆమెకు ఆ పేరు వ‌చ్చింది. ఆ సీరియ‌ల్ టీఆర్పీలో టాప్‌గా నిలిచింది. అక్క‌డ ఎలా అయితే త‌ను స‌క్సెస్ అయ్యిందో తెలుగులోనూ అలాంటి స‌క్సెస్‌ను అందుకుంటాన‌ని న‌మ్ముతోంది నిష‌. ఆమెకు క‌న్న‌డ సినిమాల ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయి. త్వ‌ర‌లో ఆమె 'అండోడిత్తు కాల' సినిమాలో హీరోయిన్‌ పాత్ర‌లో ద‌ర్శ‌నం ఇవ్వ‌నుంది. హీరోగా విన‌య్ రాజ్‌కుమార్ న‌టిస్తోన్న ఆ మూవీలో అదితి ప్ర‌భుదేవా మ‌రో హీరోయిన్‌. చైత్ర రాయ్‌, మంజుల‌, మేఘ‌నా లోకేశ్‌, న‌వ్య స్వామి, నిత్యా రామ్‌, చంద‌న‌, కావ్య‌శ్రీ లాంటి క‌న్న‌డ తార‌లు తెలుగు సీరియ‌ల్స్ ద్వారా పాపుల‌ర్ అయ్యారు. నిష కూడా వారి త‌ర‌హాలో ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటుందేమో చూడాలి.

'బిగ్ బాస్‌ ఓటీటీ'లో జ‌రుగుతున్న‌ది ఇదీ.. స్విమ్మింగ్ పూల్‌లో చిల్‌!

  ఓటీటీ ప్లాట్‌ఫామ్ కంటెంట్‌పై సెన్సార్‌షిప్ లేక‌పోవ‌డంతో అక్క‌డ రిలీజ‌వుతున్న సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల‌లో శృంగారం, హింస‌, బూతు మితిమీరుతున్నాయ‌నే విమ‌ర్శ‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. లేటెస్ట్‌గా 'బిగ్ బాస్ ఓటీటీ' షో కూడా బోల్డ్ డోస్ పెంచుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. క‌ర‌ణ్ జోహార్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న 'బీబీ ఓటీటీ' వీక్ష‌కుల్ని రంజింప చేస్తోంద‌న‌డంలో సందేహం లేదు. కొంత‌మంది కంటెస్టెంట్లు బోల్డ్‌గా క‌నిపించ‌డానికి వెనుకాడ్డం లేదు. తాజాగా కంటెస్టెంట్లు స్విమ్మింగ్ పూల్‌లో ఈత‌లు కొడుతూ, ఒక‌రిపై ఒక‌రు నీళ్లు చిమ్ముకుంటూ క‌నిపించారు. ఇంట్లో ప‌నుల విష‌యంలో ఒక‌రితో ఒక‌రు ఫైటింగ్ చేసుకుంటూ వ‌స్తున్న వాళ్లు ఇలా చిల్ అవుతూ క‌నిపించ‌డం వీక్ష‌కుల్ని అట్రాక్ట్ చేసింది. నేహా భాసిన్‌, మిళింద్ గాబా, నిశాంత్ భ‌ట్‌, జీష‌న్ ఖాన్ పూల్‌లో బాగా ఎంజాయ్ చేశారు. మొద‌ట డ్ర‌స్‌తోటే నీళ్ల‌లోకి దూకిన నేహ‌, త‌ర్వాత స్విమ్మింగ్ కాస్ట్యూమ్‌లోకి మారింది. మిళింద్‌, నిశాంత్ ఒక‌రిపై ఒక‌రు నీళ్లు చ‌ల్లుకున్నారు. చిన్న‌పిల్ల‌ల మాదిరిగా ఉత్సాహంతో కేరింత‌లు కొట్టారు. రిధిమా పంటిట్‌ను కూడా త‌మ‌తో జాయిన్ అవ్వాల్సిందిగా నేహ పిలిచినా, అప్ప‌టికే ఆమె డ్ర‌స్ వేసుకొని ఉండ‌టంతో ఆమె పూల్‌లోకి దిగ‌లేదు. అయితే పూల్ బ‌య‌ట నిల్చొనే వారిని ఎంక‌రేజ్ చేసింది. కొంత‌సేప‌టికి క‌ర‌ణ్ నాథ్ కూడా పూల్‌లో ఉన్న‌వాళ్ల‌తో క‌లిశాడు. ఐదుగురూ కొంత‌సేపు పూల్‌లో ఎంజాయ్ చేసి, త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చి ఫ్రెష్ అయ్యారు. ఇలాంటి సీన్ల‌తో వ్యూయ‌ర్స్ దృష్టిని 'బీబీ ఓటీటీ' అల‌రిస్తోంది.

శ్యామ‌ల భ‌ర్త న‌ర‌సింహ‌తో ఫొటో షేర్ చేసిన ప్రేమి! 'కార్తీక‌దీపం'లో దుర్గ రి-ఎంట్రీ!!

  అభిమానుల‌ను ఎలా ఆనందింప‌జేయాలో, వారి సంఖ్య‌ను ఎలా పెంచుకోవాలో 'కార్తీక‌దీపం' ఫేమ్ ప్రేమి విశ్వ‌నాథ్‌కు బాగా తెలిసిపోయిన‌ట్లుంది. అందుకే ఆ సీరియ‌ల్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌తో వారిని ఆక‌ట్టుకుంటూ వ‌స్తోంది వంట‌ల‌క్క‌. అంతేకాదు, త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా అప్పుడ‌ప్పుడు ఆమె షేర్ చేస్తోంది. రీసెంట్‌గా ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా త‌న స‌హ‌న‌టులు న‌ర‌సింహ‌, భ‌ర‌ద్వాజ్‌తో క‌లిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. ఆ ఇద్ద‌రూ 'కార్తీక‌దీపం'లో దుర్గ, అంజి పాత్ర‌ల్ని చేస్తున్నారు. ఆ సీరియ‌ల్ లొకేష‌న్‌కు న‌ర‌సింహ (యాంక‌ర్ శ్యామ‌ల భ‌ర్త‌) రావ‌డం, అత‌నితో ప్రేమి ఫొటో దిగ‌డంతో దుర్గ క్యారెక్ట‌ర్ రి-ఎంట్రీ ఇస్తుంద‌ని అర్థ‌మైపోయింది. ఈ ఫొటోల్లో ప్రేమి న‌వ్వులు చిందిస్తోంది. న‌ర‌సింహ‌తో చేతులు క‌లుపుతున్న ఫొటో ఒక‌టి అయితే, ఆ ఇద్ద‌రి మ‌ధ్య‌లో నిల్చొని వాళ్ల చేతుల్ని త‌న చేతుల్లోని తీసుకున్న ఫొటో ఇంకొకొటి. ప్ర‌స్తుతం సీరియ‌ల్‌లో మోనిత మిస్సింగ్ కేస్ న‌డుస్తోంది. ఆమెను కార్తీక్ హ‌త్య చేశాడని అనుమానిస్తూ డీసీపీ రోషిణి అత‌డిని పోలీస్ స్టేష‌న్‌లో పెట్ట‌గా, దీప‌ను హ‌త్య చేయ‌డానికి మోనిక ప‌థ‌కం వేయ‌డం చూస్తున్నాం. మోనిత‌ను ఎవ‌రో మ‌ర్డ‌ర్ చేసి ఉండార‌నీ, ఆ నేరం కార్తీక్ మీద‌కు వ‌చ్చింద‌నీ దీప‌తో అంజి చెప్ప‌డంతో, ఆ ప‌నిచేసింది దుర్గ అని అనుకుంటుంది దీప‌. దీంతో రానున్న ఎపిసోడ్స్‌లో దుర్గ క్యారెక్ట‌ర్ కీల‌కం కానున్న‌ద‌ని ఊహించ‌వ‌చ్చు. మోనిత‌కు ప్ర‌బ‌ల శ‌త్రువైన దుర్గ‌.. దీప‌కు న్యాయం జ‌ర‌గాల‌ని అనుకుంటుంటాడు. కాబ‌ట్టి.. దీప‌కు హెల్ప్ చేయ‌డానికి అత‌ను త‌ప్ప‌కుండా వ‌స్తాడ‌న్న మాటే.

గుడికి రాని దీప హ‌త్య‌కు ప్లాన్ మార్చిన‌ మోనిత!

  భాగ్యం, ఆమె భర్త మురళీకృష్ణ గుడికి వెళుతూ దీపను రమ్మని చెబితే... దీప గుడికి వెళ్తే ఆమెను అక్కడే చంపాలని గన్ తీసుకుని మోనిత బయలుదేరిన సంగతి తెలిసిందే. దీప గుడికి రాకపోవడంతో మోనితకు నిరాశ తప్పలేదు. అయితే, దీపను చంపడానికి మోనిత కొత్త ప్లాన్ వేసింది. మోనిత వలలో దీప చిక్కుతుందా? లేదా? అనేది తదుపరి ఎపిసోడ్స్‌లో తెలుస్తుంది. ఈ రోజు (ఆగస్టు 20, 1123) ఎపిసోడ్‌లో ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే... భాగ్యం, మురళీకృష్ణ గుడికి వెళతారు. వాళ్లిద్దరూ పూజారితో మాట్లాడుతుండగా, అక్కడికి మోనిత చేరుకుంటుంది. దీప కనిపించడకపోవడంతో ఎక్కడ ఉందోనని అటూ ఇటూ చూస్తుంది. వాళ్ళ మాటలు వింటే ఏదైనా సమాచారం దొరుకుతుందేమోనని పూజారి, భాగ్యం, మురళీకృష్ణ దగ్గరకు వెళుతుంది. సరిగా అప్పుడే 'పూజారిగారు, దీపకు ఏదో పని ఉండి ఈరోజు రాలేదు' అని భాగ్యం చెప్పిన మాటలు మోనిత చెవిన పడతాయి. ఆయన మర్నాడు సాయంత్రం వస్తే... అఖండ జ్యోతి వెలిగించి పంపిస్తానని చెబుతారు. దీప చావు ముహూర్తం రేపటి వాయిదా పడిందని మోనిత మనసులో అనుకుంటుంది.  గుడి నుండి బయటకు వస్తున్న భాగ్యం, మురళీకృష్ణ ముందు 'సోది చెబుతానమ్మా సోది చెబుతా' అంటూ మోనిత తిరుగుతుంది. సోది చెప్పించుకోవడానికి మోనిత దగ్గరకు భాగ్యం వెళుతుంది. 'కడుపునా పుట్టకపోయిన పెద్దకూతురు కష్టం కోసం గుడికి వచ్చావే తల్లి. ఆ పెట్ట కష్టాల్లో ఉంది. పెట్టకు చెందిన పుంజు కొలువులో ఉన్నాడు' అని చెబుతుంది. పరిష్కారం చెబుతానంటూ 'రేపు ఆరున్నరకు బస్తీలో గుడికి పెట్టను ఒంటరిగా రమ్మను. ఓ మంత్రం చెబుతా. దాంతో పుంజు బయటకు వస్తుంది. నా మాట కాదని పెట్టతో పాటు ఎవరొచ్చినా మంత్రం పని చెయ్యదు' అని చెబుతుంది. తప్పకుండా పంపిస్తానని చెప్పిన భాగ్యం అక్కడ నుండి బయలుదేరుతుంది. వెళ్లేముందు మోనిత  చేతిలో భాగ్యం, మురళీకృష్ణ దంపతులు ఓ వంద రూపాయలు పెడతారు. దీప బ‌స్తీలో గుడికి ఒంట‌రిగా వస్తే చంపేయాలని మోనిత ప్లాన్. భాగ్యం, మురళీకృష్ణ వెళ్లిన తర్వాత అప్పటివరకూ ముఖానికి అడ్డుగా పెట్టుకున్న చీర కొంగును తొలగించి... 'రా దీప. రా! రేపు నిన్ను చంపి, ఈ వందతో పూలదండ కొని నీ మెడలో వేస్తా' అని ఆవేశంతో మోనిత రగిలిపోతుంది. రేపు ఏం జరుగుతుందో చూడాలి. 

హోమ్ ఐసొలేష‌న్‌లో బిగ్ బాస్ 5 కంటెస్టెంట్లు.. ఫైన‌ల్ లిస్ట్ ఇదేనా?

  రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 సెప్టెంబ‌ర్ 5న ప్రారంభం కావ‌డానికి రంగం సిద్ధ‌మ‌వుతోంది. వ‌రుస‌గా మూడోసారి హోస్ట్ బాధ్య‌త‌ల‌ను అక్కినేని నాగార్జున నిర్వ‌ర్తించ‌నున్నారు. కొవిడ్ ప‌రిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని కంటెస్టెంట్ల‌కు ఇప్ప‌టికే టెస్టులు నిర్వ‌హించారు. వారంతా ప్ర‌స్తుతం హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్నార‌ని స‌మాచారం. గ‌త ఏడాది బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేముందు కంటెస్టెంట్ల‌ను హైద‌రాబాద్‌లోని ఓ స్టార్ హోట‌ల్‌లో క్వారంటైన్‌లో ఉంచిన నిర్వాహ‌కులు ఈసారి ఎవ‌రి ఇళ్ల‌ల్లో వారిని ఐసోలేష‌న్‌లో ఉండాల్సిందిగా కోరారు. గ‌త కొన్ని వారాలుగా బిగ్ బాస్ 5 హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవ‌ర‌నే దానిపై అనేక ఊహాగానాలు వెలువ‌డుతూ వ‌స్తున్నాయి. చాలామందికి తెలిసిన ముగ్గురు సెల‌బ్రిటీలు యాంక‌ర్లు ర‌వి, వ‌ర్షిణి సౌంద‌రాజ‌న్, యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌ మాత్రం హౌస్‌లోకి ఖాయంగా వెళ్ల‌నున్నారు. వీరు కాకుండా కొరియోగ్రాఫ‌ర్లు ర‌ఘు, ఆనీ, న‌ట‌రాజ్‌, ఆర్జే కాజ‌ల్‌, వీజే లోబో, సిరి హ‌న్మంత్‌, ఆట సందీప్‌, న‌టి శ్వేతావ‌ర్మ పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి. హీరోయిన్ ఇషా చావ్లా, టీవీ న‌టి న‌వ్య స్వామి పేర్లు కూడా రంగంలో ఉన్న‌ప్ప‌టికీ అది కేవ‌లం స్పెక్యులేష‌నే అంటున్నారు.

దీపను చంపడానికి మారువేషంలో బయలుదేరిన మోనిత!

  కార్తీక్‌ కోసం మోనిత ఎంతదూరమైనా వెళ్తుందని చెప్పడానికి, కార్తీక్‌ను సొంతం చేసుకోవడానికి ఎవరిని అడ్డు తొలగించడానికి అయినా వెనుకాడదని చెప్పడానికి ఈ రోజు (ఆగస్టు 19, 1122) ఎపిసోడ్‌ను ఉదాహరణగా చెప్పుకోవాలి. ఈరోజు ఏకంగా దీపను చంపడానికి మోనిత బయలుదేరింది. దీపను ఒంటరి చెయ్యడం కోసమే కార్తీక్ ను కేసులులో ఇరికిస్తుంది. అసలు, నేటి ఎపిసోడ్‌లో హైలైట్స్ ఏంటంటే... కార్తీక్ ఫొటో చూస్తూ... పిల్లల్ని తప్ప దీపతో సహా మిగతా అందర్నీ చంపేస్తానని మోనిత చెబుతూ ఉండటంతో ఎపిసోడ్ మొదలైంది. తనను చంపకుండా కార్తీక్ వదిలేసినా... గన్ గురిపెట్టినప్పుడు 'నిన్ను చంపి జైలుకు వెళితే నా భార్య ఒంటరి అయిపోతుంది' అంటాడు. ఆ మాటలు మోనిత మనసుకు గుచ్చుకుంటాయి. దీపను ఒంటరి చెయ్యడం కోసం తాను చచ్చినట్టు నాటకం ఆడి, కార్తీక్ మీద కేసు పడేలా చేసి జైలుకు పంపిస్తుంది. ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుని... కార్తీక్ ఫొటో చూస్తూ, 'సారీ బాస్. నీ భార్యను చంపేస్తా. ఇకనుండి తనను అడ్డు తొలగించే పనిలో ఉంటాను. సారీ... నిన్ను కష్టపెట్టక తప్పడం లేదు' అంటుంది.  మరోవైపు కార్తీక్ దగ్గరకు టిఫిన్ తీసుకుని దీప, పిల్లలు శౌర్య, హిమ వెళతారు. వాళ్ళు టిఫిన్ తినిపిస్తామని బతిమాలడంతో రత్నసీత సెల్ డోర్ ఓపెన్ చేస్తుంది. అదే సమయంలో ఏసీపీ రోషిణి వస్తుంది. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచమని రత్నసీతతో కోపంగా అంటుంది. ఆమెను పిల్లలు గుర్రుగా చూస్తారు. అదొక ఎమోషనల్ సీన్.  సరిగ్గా స్టేషన్ లో ఉన్నప్పుడు భాగ్యం నుండి దీపకు ఫోన్ వస్తుంది. కార్తీక్ పేరు మీద పూజ చేయించడానికి గుడికి వెళ్తున్నట్టు చెబుతుంది. తాను కూడా వస్తానని దీప అంటుంది. ఆ మాటలు విన్న రత్నసీత, మోనితకు మేటర్ చేరవేస్తుంది.  ముఖం అంతా పసుపు రాసుకుని, ఎర్రచీర కట్టుకుని సోది చెప్పే మహిళలా ముస్తాబై గన్ తీసుకుని బయలుదేరుతుంది. గుడికి క్యాబ్ బుక్ చేసుకుంటుంది. తన దగ్గర క్యాష్ లేదని, అకౌంట్ కి ట్రాన్స్‌ఫ‌ర్‌ చేస్తానని క్యాబ్ డ్రైవర్ తో అంటుంది. మోనిత మాట్లాడిన ఇంగ్లీష్ చూసి ఆమెను ఆర్టిస్ట్ అనుకుంటాడత‌ను. 'మేడమ్ మీరు ఆర్టిస్టా?' అని అడుగుతాడు. అవునని ఆన్సర్ ఇస్తుంది. 'మేడమ్ ఇప్పుడు మీరు ఏ స్టోరీకి ఈ గెటప్ వేసుకున్నారు?' అని అడిగితే... 'ఓ దీపం ఆరిపోయింది' అని చెబుతుంది. దీప ప్రాణం తియ్యడానికి అని ఆడియన్స్ కి ఇన్ డైరెక్టుగా చెప్పింది. ఆ గుడి దగ్గర ఏం జరిగిందో తదుపరి ఎపిసోడ్ కోసం ఉగ్గ‌బ‌ట్టేలా చేసింది ఈ ఎపిసోడ్‌.

'దాదాగిరి అన్‌లిమిటెడ్' తొమ్మిదో సీజ‌న్‌కు సిద్ధ‌మ‌వుతున్న సౌర‌వ్ గంగూలీ!

  'దాదా'గా అభిమానులు పిలుచుకొనే ఇండియ‌న్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్‌, బీసీసీఐ ప్రస్తుత అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న పాపుల‌ర్ క్విజ్ షో 'దాదాగిరి అన్‌లిమిటెడ్‌'. ఇప్ప‌టికి ఎనిమిది సీజ‌న్లు పూర్తి చేసుకున్న ఈ షో తొమ్మిదో సీజ‌న్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న‌ది. మునుప‌టి సీజ‌న్ల‌న్నీ బ‌హుళ జ‌నాద‌ర‌ణ పొంద‌డంతో, కొత్త సీజ‌న్ కోసం వ్యూయ‌ర్స్ కుతూహ‌లంగా ఎదురుచూస్తున్నారు. 'దాదాగిరి అన్‌లిమిటెడ్' తొమ్మిదో సీజ‌న్‌కు సంబంధించి అతి త్వ‌ర‌లో ఆడిష‌న్స్‌ను స్టార్ట్ చేసేందుకు నిర్వాహ‌కులు స‌న్నాహాలు చేస్తున్నారు. ప్రెజెంట్ కొవిడ్ ప‌రిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఆడిష‌న్స్‌ను ఆన్‌లైన్‌లోనే నిర్వ‌హించ‌బోతున్నారు. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో ముగిసిన‌ సీజ‌న్ 8లో విజేత‌గా డార్జిలింగ్ జిల్లా నిలిచింది. బెంగాలీ టెలివిజ‌న్‌లోని మోస్ట్ పాపుల‌ర్ నాన్‌-ఫిక్ష‌న్ షోస్‌లో నిస్సందేహంగా 'దాదాగిరి అన్‌లిమిటెడ్' ఒక‌టి. దానికి భారీ స్థాయిలో వ్యూయ‌ర్‌షిప్ ల‌భించింది. వీకెండ్స్‌లో ప్ర‌సారమైన ఈ షో వారం మొత్తం ప్రసార‌మ‌య్యే ఇత‌ర అన్ని పాపుల‌ర్ డైలీ సీరియ‌ల్స్‌కు గ‌ట్టి పోటీ ఇస్తూ వ‌చ్చింది. సౌర‌వ్ చ‌తురోక్తులు, ఆయ‌న షోను నిర్వ‌హించే విధానం, ప్ర‌శ్న‌ల‌ను అడిగే శైలి వీక్ష‌కుల్ని అల‌రిస్తూ వ‌చ్చాయి. ఇంట‌లిజెంట్‌గా, హ్యూమ‌ర‌స్‌గా ఆయ‌న ఇచ్చే రిప్లైలు క్విజ్ షోకు ఆక‌ర్ష‌ణ‌ను తెచ్చాయి.

అషురెడ్డిని ఆర్జీవీ ఎన్ని యాంగిల్స్‌లో చూపిస్తారో!

  బిగ్‌ బాస్‌ బ్యూటీస్‌, ముఖ్యంగా హాట్‌ ఇమేజ్‌ ఉన్న యాంకర్స్‌ మీద రామ్‌గోపాల్‌ వర్మ మనసు పారేసుకున్నట్టు ఉన్నారు. మొన్నామధ్య బిగ్‌ బాస్‌కు వెళ్లొచ్చిన అరియానాను వర్మ ఇంటర్వ్యూ చేశారు. అది మరీ బోల్డ్‌గా ఉందని కామెంట్లు వినిపించాయి. అందులో వర్మ హాట్‌ టాపిక్స్‌ డిస్కస్‌ చేశారు. అరియానా అందాలను ఎవరూ చూపించని యాంగిల్స్‌లో చూపించారు. ఇప్పుడు మరో బిగ్‌ బాస్‌ బ్యూటీ అషురెడ్డిపై వర్మ కాన్సంట్రేట్‌ చేశారు. ఆమెను ఎన్ని యాంగిల్స్‌లో చూపిస్తారో, ఆమెతో ఏం టాపిక్స్‌ డిస్కస్‌ చేస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. వర్మ తనను ఫొటోలు తీస్తున్న సమయంలో తీసిన వీడియో క్లిప్‌ను అషురెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ‘నో మీన్స్‌ నో... త్వరలో వస్తుంది. ఇట్స్‌ గోయింగ్‌ టు బి ఎపిక్‌’ అని అషురెడ్డి పేర్కొంది. దీన్నిబట్టి అమ్మాయిలు వద్దంటే వద్దు అనే టాపిక్‌ మీద డిస్కస్‌ చేసినట్టు తెలుస్తోంది. అషురెడ్డిని తనదైన శైలిలో, లో యాంగిల్స్‌లో వర్మ ఫొటోలు తీశారు. దానిపై, వర్మతో అషురెడ్డి తీసుకున్న సెల్ఫీపై ఆల్రెడీ మీమ్స్‌ స్టార్ట్‌ అయ్యాయి. వర్మ టేస్ట్‌ సూపరని కొందరు అంటుంటే... వర్మ అలా ఫొటోలు తీయడం చూసి జాలి పడుతున్నానని ఇంకొందరు అన్నారు. ‘సిగ్గు లేదా నీకు ఛీఛీ’ అని ఒకరు అషురెడ్డి వీడియో కింద కామెంట్‌ చేశారు. ‘మరీ పాపులారిటీ కోసం ఇంత దిగజారాలా?’ అని ఇంకొకరు కామెంట్‌ చేశారు.

హాస్పిటల్ బెడ్ నుంచి 'బెస్టాఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్' ఆడిషన్స్‌కు వెళ్లి సెల‌క్ట‌య్యింది!

  'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్'తో పాటు ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ వచ్చింది. 'బెస్టాఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్' అంటూ ఇంతకు ముందు చేసిన స్కిట్స్ లో బెస్ట్ స్కిట్స్ టెలికాస్ట్ చేస్తున్నారు. ప్రతి శుక్రవారం ఓ అరగంట ప్రోగ్రామ్ చేస్తున్నారు. దీనికి కొన్నిరోజులు ఇన్‌స్టాగ్రామ్ ఫేమ్ భాను యాంకరింగ్ చేసింది. లాస్ట్ వీక్ ఎపిసోడ్ కి సిరి హనుమంతు యాంకరింగ్ చేసింది. త్వరలో స్రవంతి చొక్కారపు కనిపించనుంది.  స్రవంతి చొక్కారపు గతంలో మల్లెమాల షోలు 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో రెండు మూడు కార్యక్రమాలు చేసింది. ఇమ్మాన్యుయేల్ నచ్చాడని చేసిన స్కిట్ ఒకటి హిట్ అయ్యింది. అయితే, 'బెస్టాఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్' చేసే అవకాశం అంత సులభంగా రాలేదని ఆమె ఓ పోస్ట్ పోస్ట్ చేసింది. ఆ కార్యక్రమానికి ఆడిషన్స్ ఇవ్వడానికి పిలిచినప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాలేదట. ఆ రోజు ఏం జరిగిందో వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్రవంతి రాసుకొచ్చింది.  "కొన్ని రోజుల క్రితం అనుకోకుండా నా ఆరోగ్యం బాలేదు. కనీసం బెడ్ మీద నుండి లేవలేని పరిస్థితి. నడవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఆ సమయంలో మల్లెమాల ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. 'బెస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్' కోసం ఆడిషన్ కి రావాలని. వాళ్లకి యాంకర్ ని తీసుకోవడం చాలా అర్జెంటు. నా ముందు ఆ రోజు ఉన్న ఆప్షన్లు రెండే... రిస్క్ తీసుకోవడం, లేదంటే అవకాశాన్ని వదిలేయడం. మా ఇంట్లో వాళ్లంతా  'ఈ పరిస్థితిలో ఎందుకులే, వద్దు' అన్నారు. అప్పటికే ఆ నెలలో వచ్చిన అన్ని అవకాశాలు వదిలేసుకున్నా. ఏదైతే అది అయ్యిందని, దేవుడి మీద భారం వేసి నా కష్టాన్ని నమ్మి ఆడిషన్ కి వెళ్లాను.  తీరా అక్కడికి వెళ్ళాక... నాతో పాటూ  ఆరుగురు అమ్మాయిలు వచ్చారు. అందరూ చాలా బాగా రెడీ అయ్యారు. ఫుల్ ఎనర్జిటిక్ గా డాన్స్ చేశారు. 'నేను అనవసరంగా వచ్చాను. కనీసం స్ట్రాంగ్ గా  నిలబడలేని పరిస్థితి' అని మనసులో అనుకొని వెళ్లి నిలబడ్డా. ఓ సాంగ్ ప్లే చేశారు. ఏదో రెండు స్టెప్స్ వేశా. మెల్లగా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ సక్సెస్ ఫుల్ గా చెప్పేశా. అసలు, ఆ రెండు గంటలు ఎలా గడిచాయో కూడా తెలీదు. నాతో వచ్చిన లేడీ అసిస్టెంట్ ఫుల్లు ఏడవడం మొదలుపెట్టింది. 'మీకు ఏమైనా జరగరానిది జరిగితే ఎలా అమ్మ?' అని. 'ఏం కాదులే. అంతా మంచే జరుగుతుంది' అన్నాను.  తర్వాత ఇంటికి వెళ్లపోయా. నాకు రాదని రెండు రోజులు బాధపడ్డా. సడన్ గా మళ్లీ మల్లెమాల నుండి మేనేజర్ కాల్ చేశారు. 'ఒకసారి ఆఫీసుకు రండి. సార్ మీతో మాట్లాడతారట' అని. వెళ్లాను. మాట్లాడాను. వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. 'మీకు ఈ షో చేయటం ఇష్టమేనా? అని అడిగారు. 'ప్రోగ్రాం మీ దృష్టిలో చిన్నది అవ్వచ్చు. కానీ, నాకు ఈ పరిస్థితిలో అదో పెద్ద అచీవ్మెంట్'. మొత్తానికి రిస్క్ తీసుకోవడాన్ని నేను నమ్మాను" అని స్రవంతి చొక్కారపు తెలిపింది.