హాట్ ఫొటో షూట్‌: విష్ణుప్రియ.. తగ్గేదే లే!

  అందాల ప్రదర్శనలో అనసూయ, రష్మీ గౌతమ్‌లను విష్ణుప్రియ మించిపోతోంది. హాట్‌ హాట్‌ ఫొటోషూట్‌లతో ఇంటర్నెట్‌లో కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతోంది. నాభి అందాలతో పాటు ఎద సంపదను చూపించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. గతంలో ఓసారి వైట్‌ కలర్‌ డ్రస్‌తో విష్ణుప్రియ హాట్‌ ఫొటోషూట్‌ చేసింది. తర్వాత బ్లాక్‌ బికినీలో మరో ఫొటోషూట్‌ చేసింది. అయితే, అప్పుడు అంతగా ఎక్స్‌పోజింగ్‌ చెయ్యలేదు. ఇప్పుడు మరోసారి బ్లాక్‌ బికినీలో స్కిన్‌ షో చేస్తూ కొత్త ఫొటోషూట్‌ చేసింది. టీవీ యాంకర్స్‌లో హాట్‌ ఫొటోషూట్స్‌, యాక్టింగ్‌ అంటే రష్మీ గౌతమ్‌ గుర్తొస్తుంది. అయితే, ఆవిడ టీవీ ప్రోగ్రామ్స్‌లో హాట్‌ అప్పియరెన్స్‌ ఇవ్వలేదు. ‘గుంటూరు టాకీస్‌’ వంటి సినిమాల్లో స్కిన్‌ షో చేసింది. అనసూయ కూడా టీవీ ప్రోగ్రామ్స్‌లో హాట్‌ షోను డ్రస్సుల వరకూ పరిమితం చేసింది.  విష్ణుప్రియ అలా కాదు. టీవీ ప్రోగ్రామ్స్‌లో పాటలకు డ్యాన్స్‌ చేసేటప్పుడూ నాభి అందాలు నాజూకుగా చూపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్‌ రీల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది. టీవీలతో పాటు సినిమాలపై కూడా విష్ణుప్రియ కాన్సంట్రేట్‌ చేసిందట. అందుకనే, ఈ హాట్‌ షో అని టాక్‌.

నాగ్‌ కంటే తార‌క్‌కు బెట‌ర్ రేటింగ్‌!

  జూనియ‌ర్ ఎన్టీఆర్‌ రెండోసారి బుల్లితెర‌పై హోస్ట్‌గా క‌నిపిస్తున్నారు. 'బిగ్ బాస్' సీజ‌న్ 1కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం ద్వారా తార‌క్ టెలివిజ‌న్ తెర‌పై అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. ఆయ‌న హోస్ట్‌గా చేయ‌డంతో 'బిగ్ బాస్' ప్రారంభ సీజ‌న్ సూప‌ర్ హిట్ట‌యింది. ఇప్పుడు రెండోసారి 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' గేమ్ షో ద్వారా ఆయ‌న టీవీ తెర‌పై ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నారు. జెమిని టీవీలో ప్ర‌సార‌మ‌వుతున్న ఈ షో క‌ర్టెన్ రైజ‌ర్ ఎపిసోడ్‌కు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ గెస్ట్ కంటెస్టెంట్‌గా వ‌చ్చారు. 'ఆర్ఆర్ఆర్' కో-స్టార్స్ ఇలా హోస్ట్ అండ్ కంటెస్టెంట్‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో ఇద్ద‌రి ఫ్యాన్స్‌తో పాటు వ్యూయ‌ర్స్‌కు కూడా క‌న్నుల పండ‌గ‌గా మారింది. లేటెస్ట్‌గా ఈ షో రేటింగ్స్ వ‌చ్చాయి. క‌ర్టెన్ రైజ‌ర్ వీక్ష‌కుల‌కు అమితంగా ఆక‌ట్టుకుంద‌ని దానికి ల‌భించిన 11.4 టీఆర్పీ తెలియ‌జేసింది. గ‌తంలో 2014లో 'మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు'కు నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన‌ప్పుడు ఫ‌స్ట్ ఎపిసోడ్‌కు 9.7 టీఆర్పీ వ‌చ్చింది. అంటే ఇప్పుడు 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు'కు తార‌క్ ఇచ్చిన ఓపెనింగ్ అదిరింద‌న్న మాటే. జూనియ‌ర్ ఎన్టీఆర్ మ్యాజిక్ బాగా ప‌నిచేయ‌డంతో జెమిని టీవీ ఓవ‌రాల్ రేటింగ్ కూడా ఒక్క‌సారిగా 290 జీబీఆర్ నుంచి 400 జీబీఆర్‌కు పెరిగింది. దీంతో నిర్వాహ‌కులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. రానున్న రోజుల్లో 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు'కు వీక్ష‌కాద‌ర‌ణ మ‌రింత‌గా పెరుగుతుంద‌ని వారు ఆశిస్తున్నారు. 

పెళ్లికి ముందు పిల్లలు పుట్టరని డాక్ట‌ర్లు చెప్పారు.. రోజా భావోద్వేగం!

  తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విజయవంతమైన హీరోయిన్లలో రోజా ఒకరు. కథానాయికగా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన రోజా, ప్రస్తుతం 'జబర్దస్త్'తో సహా ఇతర కార్యక్రమాల ద్వారా బుల్లితెర ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. రోజా దగ్గర బోలెడు డబ్బులు ఉన్నాయని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు రోజా దగ్గర డబ్బులు ఉండి ఉండవచ్చు. అయితే కథానాయికగా కెరీర్ ప్రారంభించినప్పటి నుండి పదేళ్ల పాటు కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ అప్పులు కట్టడానికి సరిపోయాయని తాజాగా బయటపెట్టారు.  "నేను 1991లో ఇండస్ట్రీకి వచ్చాను. 2002 వరకూ కష్టపడినది మొత్తం అప్పులు కట్టాను" అని వినాయక చవితి సందర్భంగా త్వరలో ఈటీవీలో ప్రసారం కానున్న 'ఊరిలో వినాయకుడు'  స్పెషల్ ఈవెంట్ లో చెప్పారు. ఈ సంగతి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె చెబుతుంటే ఇంద్రజ, పూర్ణ ఎమోషనల్ అయ్యారు. ఇద్ద‌రూ రోజా దగ్గరకు వెళ్లి ఓదార్చారు.  పెళ్లి చేసుకునే ముందు తనకు పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పారని... అయితే, ఏడాదిలో ప్రెగ్నెన్సీ వచ్చి అన్షు పుట్టిందని రోజా తెలిపారు. అందుకే, తనకు కుమార్తె అన్షు అంటే చాలా చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. 'ఊరిలో వినాయకుడు' కార్యక్రమానికి రోజా కుమార్తె, కుమారుడు వచ్చారు. అలాగే, హీరో శ్రీకాంత్ కూడా సందడి చేశారు.

అషురెడ్డి చెంపదెబ్బ.. ఆర్జీవీ రియాక్షన్ సూప‌రంట‌!

  ‘దూకుడు’ సినిమాలో మహేశ్‌బాబు, బ్రహ్మానందం మధ్య సన్నివేశాలు గుర్తున్నాయా?  "చెంప‌దెబ్బ‌ల‌కు మీరిచ్చిన రియాక్షన్స్‌ బావున్నాయి" అని మహేశ్‌బాబు చెప్పడంతో ప్రైజ్‌ మనీ కోసం మళ్లీ మళ్లీ కొట్టించుకోవాలని బ్రహ్మానందం ప్రయత్నిస్తారు. అషురెడ్డి చెంపదెబ్బకు రామ్‌ గోపాల్‌ వర్మ ఇచ్చిన రియాక్షన్‌ బ్రహ్మీని మించిపోయిందని నెటిజన్స్‌ అంటున్నారు. బ్యూటిఫుల్‌ గాళ్‌, ‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ అషురెడ్డితో కాంట్రవర్షియల్‌ కింగ్‌ ఆర్జీవీ బోల్డ్‌ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్‌గా ప్రోమో రిలీజ్‌ చేశారు. అందులో ఆర్జీవీ ఎవరో తనకు తెలియనట్టు అషురెడ్డి బిహేవ్‌ చేశారు. అదంతా యాక్టింగ్‌ అని తెలుస్తోంది. అంతకు మించిన విషయం ఏంటంటే... ఆర్జీవీని అషురెడ్డి చాచిపెట్టి చెంప‌పై కొట్టడం! ఇంటర్వ్యూ మీద జనాల్లో ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేయడానికి ఇటువంటి జిమ్మిక్కులు చేయడంలో వర్మ దిట్ట. అయితే, ఇంటర్వ్యూలో అషురెడ్డి కాళ్ల మీద వర్మ ఎక్కువ ఫోకస్‌ చేశారు. దానికంటే ఆమె చెంపదెబ్బకు ఆర్జీవి ఇచ్చిన రియాక్షన్‌ హైలైట్‌ అయ్యింది. "ఆర్జీవిగారి చెంపదెబ్బ రియాక్షన్‌ బ్రహ్మానందంగారిని మించిపోయింది" అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. "ఆర్జీవీని కొట్టిన మొదటి పిల్ల... పైనా కిందా ఊపు. ఆర్జీవీ సార్‌ తోపు" అని ఇంకో కామెంట్‌. "ఆర్జీవీ అంటే కొట్టడం మాత్రమే అనుకున్నా. కొట్టించుకోవడం కూడానా... ఓన్లీ సింగిల్‌ మీనింగ్‌" అని ఒకరు కామెంట్‌ చేశారు. "ఇండియాలో స్వతంత్య్రం వచ్చింది అంటే అది ఆర్జీవీ సార్‌కి మాత్రమే" అని ఎవరో కామెంట్‌ పెట్టారు. మొత్తం మీద ఇంటర్వ్యూ ప్రోమో యూట్యూబ్‌లో వైరల్‌ అవుతోంది.

రాజశేఖర్ 'బిగ్ బాస్' హోస్ట్ అయితే?!

  'స్టార్ మా'లో ఈ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు 'బిగ్ బాస్' ఐదో సీజన్ షురూ కానుంది. అయితే, అంతకంటే కొన్ని గంటల ముందు, మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు 'కామెడీ స్టార్స్' కార్యక్రమంలో కూడా 'బిగ్ బాస్' సందడి చేయనున్నాడు. 'బిగ్ బాస్' థీమ్ మీద 'కామెడీ స్టార్స్'లో సద్దాం టీమ్ ఒక స్కిట్ చేసింది. అందులో 'బిగ్ బాస్' హోస్ట్‌గా సద్దాం సందడి చేయనున్నాడు. అయితే, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ వాయిస్, మేజరిజమ్‌తో సద్దాం స్కిట్ చెయ్యడం విశేషం. ఇప్పటివరకు రాజశేఖర్‌ను ఇమిటేట్ చేస్తూ చాలామంది కామెడీ చేశారు. లేటెస్టుగా ఇది అన్నమాట.  'టిక్ టాక్' దుర్గారావు, అతడి వైఫ్ కూడా స్కిట్ లో చేశారు. అంటే... వాళ్ళు 'బిగ్ బాస్ 5'లో లేరన్నమాట. స్కిట్ లో ఛాన్స్ దొరికిందని అషురెడ్డిని కౌగిలోకి తీసుకున్నాడు హరి. గెస్ట్‌గా అలీ అల‌రించ‌నున్నారు. ప్రోమో చూస్తుంటే... నవ్వించేటట్టు ఉన్నారు. 

"నాకు హగ్ ఇవ్వకపోయినా నా తమ్ముడికి ఇచ్చారు.. అది చాలు''

  డాన్స్ రియాలిటీ షో 'ఢీ'లో జడ్జ్‌గా చేస్తున్న హీరోయిన్ ప్రియమణి హగ్ కోసం హైపర్ ఆది విపరీతంగా పరితపిస్తాడు. మామూలుగా షోలో ప్రియమణిని ప్రియా... ప్రియా... అని ప్రేమగా పిలుస్తూ ఉంటాడు. అప్పుడప్పుడూ అతడిని ప్రియమణి 'బావా' అని పిలుస్తుంది. ఇవ్వక ఇవ్వక ఒకరోజు ఆదికి ప్రియమణి హగ్ ఇచ్చింది. ఆ రోజు కో టీమ్ లీడర్ సుధీర్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. 'నాకు హగ్ ఇవ్వకపోయినా... నా తమ్ముడికి ఇచ్చారు. అది చాలు' అని సుధీర్ వీర డైలాగ్ చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ సేమ్ సీన్ 'ఢీ'లో రిపీట్ కానుంది. అయితే... సుధీర్ పాత్రను రష్మీ, ఆది పాత్రను దీపిక పోషించారు.  'ఢీ' అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో 'లెట్స్ వెల్కమ్ కింగ్స్ టీమ్ లీడర్స్' అని యాంకర్ ప్రదీప్ ఇన్వైట్ చేయగానే... రష్మీ, దీపిక వచ్చారు. ప్రోమోలో కనిపించింది కాసేపైనా సరే... సుధీర్‌ను రష్మీ దింపేసింది. అలాగే, ఆదిని దీపిక! ప్రియమణి దగ్గరకు వెళ్లి దీపిక హగ్ తీసుకుంది. స్టేజి మీద రష్మీ 'ఇది చాలు' అంటూ సందడి చేసింది. వీళ్లిద్దరి యాక్టింగ్ చూసి సుధీర్, ఆది సహా అందరూ నవ్వుకున్నారు.  సుధీర్ స్టేజి మీద ఉన్నప్పుడు కిందనున్న సెట్ బాయ్స్, డాన్సర్లు 'అన్నా ఏయ్' అంటూ ఉంటారు. సుధీర్ రోల్ రష్మీ చేస్తున్న సమయంలో 'అన్నా ఏయ్' అంటూ గట్టిగా అరిచారు. వాళ్లకు ప్రదీప్ తోడు కలిశాడు. 'ఆగరా... వేస్తా! వేస్తా!' అని రష్మీ రిప్లై ఇచ్చింది. పూర్ణ దగ్గరకు వెళ్లినప్పుడు గులాబీ పువ్వును తినేసింది. 'సూపర్... అది కడగలేదు' అని ప్రదీప్ అనగానే వెంటనే నోట్లో రేకలు ఊసేసింది. ఇంకెంత సందడి చేశారో తెలియాలంటే వచ్చే బుధవారం ఎపిసోడ్ చూడాలి. 

బిగ్ షాక్‌.. 'బిగ్‌బాస్-13' విన్నర్, 'చిన్నారి పెళ్లికూతురు' హీరో మృతి!

  ప్రముఖ బాలీవుడ్-టీవీ యాక్టర్, హిందీ 'బిగ్ బాస్' పదమూడో సీజన్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా మృతి చెందారు. ఆయన వయసు 40 సంవత్సరాలు. గురువారం ఉదయం తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికి మృతి చెందినట్టు కూపర్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సిద్ధార్థ్ శుక్లాకు తల్లి, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. 'బాలికా వధు' సీరియల్ సిద్ధార్థ్ శుక్లాకు ప్రేక్షకుల్లో విపరీతమైన గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత అతను 'బిగ్ బాస్ - 13' విన్నర్ గా నిలిచారు. ఇటీవల 'బిగ్ బాస్' ఓటీటీలోనూ కనిపించాడు. 'హంప్టీ శర్మ కె దుల్హనియా'లో సపోర్టింగ్ రోల్ ద్వారా సిల్వర్ స్క్రీన్ కు సిద్ధార్థ్ పరిచయమయ్యాడు. ఏక్తా కపూర్ నిర్మించిన 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్'లో అగస్త్య పాత్రలో నటించాడు. రియాలిటీ షోల్లో కూడా కనిపించాడు. సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌కు విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. సిద్ధార్థ్ ఆక‌స్మిక మృతికి దేశంలోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీ అంతా ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌యింది. ప‌లువురు సెల‌బ్రిటీలు ఈ వార్త నిజం కాక‌పోతే బాగుండునంటూ సోష‌ల్ మీడియా అకౌంట్ల ద్వారా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ వార్త‌ను త‌ట్టుకోలేక‌పోతున్నామ‌ని సంతాపం వ్యక్తం చేశారు. 

తార‌క్‌ అసహ్యంగా ఉన్నాడన్న రాజమౌళి!

  బరువు తగ్గాలని ప్రయత్నించే వాళ్లకు యంగ్ టైగర్ జూనియ‌ర్‌ ఎన్టీఆర్ ఒక ఇన్స్పిరేషన్. 'రాఖీ' సినిమా వరకూ తార‌క్‌ లావుగా ఉండేవారు. తర్వాత 'యమదొంగ' కోసం సన్నబడ్డారు. 'కంత్రి'లో మరీ సన్నగా కనిపించారు. లావుగా ఉన్నప్పటికీ డ్యాన్సులు ఇరగదీసేవారు. యాక్టింగ్ అదరగొట్టేవారు. ప్రేక్షకులను మెప్పించారు. అయితే, ఉన్నట్టుండి తార‌క్ బరువు తగ్గడానికి కారణం ఎవరో తెలుసా? దర్శక ధీరుడు, తార‌క్‌ ముద్దుగా "జక్కన్న" అని పేరు పెట్టిన రాజమౌళి. "నేను చాలా లావుగా ఉండేవాడిని. అయినా ఏ రోజూ నేను లావుగా ఉన్నానని అనిపించలేదు. ఒక రోజు జక్కన్న, 'అసహ్యంగా ఉన్నారు' అని అన్నారు. ఆ రోజు కొంచెం వెలిగింది. ఎందుకంటే... మన చుట్టూ ఉండే మన ఫ్రెండ్స్... వాళ్లే పర్ఫెక్ట్ గా గైడ్ చేస్తారు. ఆ రోజు నుండి వెయిట్ తగ్గే ప్రయత్నం చేశా. తగ్గా" అని 'ఎవరు మీలో కోటీశ్వరుడు' కార్యక్రమంలో జూనియ‌ర్‌ ఎన్టీఆర్ చెప్పారు. సినిమాల్లోకి రావాలని అనుకుంటున్న కంటెస్టెంట్‌తో నిజాయతీగా ఉండమని తార‌క్‌ సలహా ఇచ్చారు. మనకు చాలా తెలుసు అని అనుకుంటామని, కానీ ఏమీ తెలియదని ఆయన చెప్పుకొచ్చారు. 

రవితేజను ‘మీ పేరేంటి?’ అని అడిగాడు!

  మాస్‌ మహారాజ్‌ రవితేజ అంటే తెలియనివాళ్లు ఉండరు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో టెక్నిషియన్స్‌ నుండి యాక్టర్స్‌ వరకూ అందరికీ రవితేజ తెలుసు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి హీరోగా టర్న్‌ అయ్యాడు కదా! ఇండస్ట్రీ కష్టాలు తెలిసినోడు. అందుకని, ఎవరైనా కొత్త హీరోలు బాగా చేస్తే అప్రిషియేట్‌ చెయ్యడం రవితేజ అలవాటు. అలాగే, ఓ హీరోకి ఫోన్‌ చేసి అప్రిషియేట్‌ చేస్తే... ఫోన్‌ పెట్టేసే ముందు ఆ కొత్త హీరో ‘సార్‌... మీ పేరేంటి?’ అని అడిగాడు. ‘నన్ను రవితేజ అంటారండీ’ అని సవినయంగా మాస్‌ మహారాజ్‌ సమాధానం ఇచ్చాడు. అప్పటి ఆ కొత్త హీరో, ఇప్పటి దర్శక–రచయిత, హీరో, నటుడు అవసరాల శ్రీనివాస్‌. ‘అష్టా చమ్మా’ విడుదలైన తర్వాత ఈ సంఘటన జరిగింది. ‘అష్టా చమ్మా’ విడుదలైన తర్వాత అవసరాలకు రవితేజ ఫోన్‌ చేశారు, ప్రశంసించారు. అప్పటికి ఆయన స్టార్ హీరో అయితే... రవితేజ వాయిస్‌ గుర్తుపట్టని అవసరాల అమాయకంగా మాస్‌ మహారాజ్‌ పేరు అడిగారు. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో ఆలీ అడిగితే... అవసరాల శ్రీనివాస్‌ ఈ విషయం చెప్పారు. ‘అష్టా చమ్మా’ సినిమా ట్రయిలర్‌ విడుదలయ్యేవరకూ ఇంట్లో సినిమా చేస్తున్న సంగతి చెప్పలేదని అవసరాల శ్రీనివాస్‌ తెలిపారు. ట్రయిలర్‌ చూసి ‘చేస్తే చేశావ్‌ కానీ ఇంకెప్పుడు చెయ్యకు’ అని అవసరాల తండ్రి చెప్పారట. ‘ఊహలు గుసగుసలాడే’ చూసిన తర్వాత ప్రశంసించారట. అవసరాల శ్రీనివాస్‌ చెప్పిన మరిన్ని సరదా సంగతులు చూడాలంటే సెప్టెంబర్‌ 6న ప్రసారం అయ్యే ఫుల్‌ ఎపిసోడ్‌ చూడాలి.

"శ్రీదేవి నాకు రెండో అమ్మ".. మహేశ్వరి భావోద్వేగం!

  ‘గులాబీ’ హీరోయిన్‌ మహేశ్వరి గుర్తుందా? అదేనండీ శ్రీదేవి చెల్లెలు! అంటే.. సొంత చెల్లెలు కాదనుకోండి. పిన్ని కూతురు! చాలా రోజుల తర్వాత మహేశ్వరి టీవీ షోలో కనిపించారు. ‘క్యాష్‌’ ప్రోగ్రామ్‌కు ఆమెను తీసుకొచ్చారు. అందులో శ్రీదేవితో తనకున్న అనుబంధాన్ని మహేశ్వరి గుర్తు చేసుకున్నారు. తనకు శ్రీదేవి రెండో అమ్మలాంటిదని చెప్పారు. ఎమోషనల్‌ అయ్యారు. ‘‘కొంతమంది వదిలేసి వెళ్లిపోయినప్పుడు వాళ్ల ఫ్యామిలీ బాధపడతారు. కొంతమంది వెళ్లిపోయినప్పుడు ఇలా ప్రపంచమంతా బాధపడుతుంది. దటీజ్‌ శ్రీదేవిగారు’’ అని సుమ చెప్పారు. మహేశ్వరితో పాటు హీరోయిన్లు రాశి, సదా, శ్రద్ధా దాస్‌ అతిథులుగా వచ్చిన క్యాష్‌ షో శనివారం, సెప్టెంబర్‌ 4న టెలికాస్ట్‌ కానుంది. ప్రజెంట్‌ సెలబ్రిటీలు అందరూ యూట్యూబ్‌ ఛానళ్ళు ప్రారంభించి... హోమ్‌ టూర్‌, కిచెన్‌ టూర్‌ అంటూ వీడియోస్‌ చేస్తున్నారు. దీనిని ‘క్యాష్‌’లో చూపించే ప్రయత్నం చేశారు. సదా హోమ్‌ టూర్‌ పేరుతో కాసేపు సందడి చేశారు. అందులో ఎంటరైన సుమ... ‘నేను అమ్మగారింట్లో పని చేస్తున్నా. పదేళ్ల నుంచి! నాకు జీతం పెంచలే ఇప్పటివరకూ’ అని కామెడీ చేశారు. ‘ఆర్య 2’ సెట్‌లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే ఏడ్చేదాన్ని అని తనకు ‘వాటర్‌ ట్యాప్‌’ అని పేరు పెట్టారని శ్రద్ధా దాస్‌ తెలిపారు. మొత్తంమీద ప్రోమో సందడిగా సాగింది.

"దేనికి భ‌య‌ప‌డుతున్నారు?".. కార్తీక్‌ను నిల‌దీసిన దీప‌!

  తనను పెళ్లి చేసుకుంటే కుటుంబమంతా కలిసి ఉందామని... లేదంటే మీ కుటుంబంలో ఎవ్వరినీ విడిచి పెట్టనని కార్తీక్‌కి మోనిత వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయం ఎవరికీ చెప్పలేక తనలో తాను కార్తీక్ బాధపడుతూ ఉండటంతో నేటి ఎపిసోడ్ ముగిసింది. దీప తన పక్కనే ఉన్నప్పటికీ ఆమెకు ఏమీ చెప్పుకోలేకపోతాడు. మరోవైపు కడుపులో బిడ్డతో 'నువ్వు బయటకు వచ్చేలోపు అన్నీ సెట్ చేసేస్తా' అంటుంది. దాని అర్థం కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబును పెళ్లి చేసుకుంటాననే! అసలు, ఈరోజు (సెప్టెంబర్ 1) ఎపిసోడ్‌లో ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే... మోనిత మాటలను గుర్తు చేసుకుంటూ... ఆలోచనల్లో పడతాడు కార్తీక్. ఉన్నట్టుండి ఒక్కసారిగా 'నో' అని అరుస్తాడు. ఏమైంది డాక్టర్ బాబు అని దీప దగ్గరకు వస్తుంది. కానీ, ఆమెతో ఏమీ చెప్పడు. మనసులో పాములాంటి దానితో స్నేహం చేశానని, అది నన్ను కాటేసిన పర్వాలేదు కానీ నా కుటుంబం మీద కాటు పడనివ్వనని అనుకుంటాడు. తర్వాత ఇంట్లో పిల్లల దగ్గర అందరూ ఉన్నారు కాబట్టి దీపను ఆస్పత్రిలో ఉండమని అడుగుతాడు. ఏమైందని, ఎందుకలా ఉన్నారని దీప అడిగినా సమాధానం చెప్పడు.  మరోవైపు కడుపులో బిడ్డతో 'ఏం నాన్నా! మీ అమ్మ కడుపులోంచి ఎప్పుడెప్పుడు బయటకు రావాలని ఆరాటపడుతున్నావా? కొన్ని నెలలే! మీ నాన్నను చూశావ్ కదా! అందగాడు, మంచివాడు. అందుకే, ఏరికోరి ఎంపిక చేసుకున్నా. కానీ, మనల్ని పట్టించుకోడం లేదు. దానికి మీ పెద్దమ్మ, ఆ వంటలక్క కారణం. పదేళ్లు దూరంగా ఉన్నా ఆవిడ కోసమే మీ నాన్న ఆరాటం. అయినా సరే నా పోరాటం ఆపను. నువ్వు బయటకు వచ్చేలోపు అన్నీ సెట్ చేస్తా' అంటుంది. మోనిత కాన్ఫిడెన్స్ చూస్తుంటే డాక్టర్ బాబును పెళ్లి చేసుంటుందని అనిపిస్తుంది. అంత గట్టిగా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది.  తెల్లవారిన తర్వాత పిల్లలు తండ్రికి ఎలా ఉందోనని కార్తీక్ గురించి ఆలోచిస్తారు. తల్లి గురించి వాళ్లకు కొంచెం కూడా బెంగ లేదని సౌందర్య కోప్పడుతుంది. ఆమె ఆలోచన అంతా కోడలు దీప గురించే. మరోవైపు ఆస్పత్రిలో కార్తీక్ బయట నేల మీద కింద కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. అతడికి దగ్గరకు వెళ్లిన దీప 'మీరు దేనికి భయపడుతున్నారు?' అని అడుగుతుంది. 'నేను బాగానే ఉన్నాను దీప. నేను బాధపడేది నా గురించి కాదు. నా వల్ల మీరంతా ఇబ్బంది పడుతున్నారని. ఆ నమ్మకద్రోహి మోనిత ముందు నా నిజాయతీ ఎందుకూ పనికిరాకుండా పోయింది' అని కార్తీక్ అంటాడు.  'మీరు చేయని నేరం మీ మీద పడింది. ఇన్నాళ్ళూ మా అందరికీ మీరున్నారు. ఇప్పుడు మీకు మేమున్నాము' అని భర్తకు దీప ధైర్యం చెబుతుంది. తండ్రిని, తమ్ముడిని ఆస్పత్రికి పంపమని, దీపను ఇంటికి పంపిస్తాడు కార్తీక్. తర్వాత ఏమైందనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.    

సూసైడ్ వరకూ వెళ్లిన 'జబర్దస్త్' కమెడియన్!

  ఒక టైమ్‌లో 'జబర్దస్త్'లో తనను టీమ్ లీడర్‌గా తీసేశారని, అప్పుడు సూసైడ్ వరకూ వెళ్లానని 'రాకింగ్' రాకేష్ చెప్పాడు. కారు వేసుకొని వెళ్లి కావాలని చెట్టుకు గుద్దేశాన‌ని వివరించాడు. అయితే, 'చలాకి' చంటి వల్ల తాను ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నానని చెప్పుకొచ్చాడు.  "నన్ను టీమ్ లీడర్‌గా తీసేసిన సమయంలో చంటి అన్న తన టీమ్‌లోకి నన్ను తీసుకున్నాడు. నాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను టీమ్ లీడర్‌గా ఉన్నానంటే... నాకు ఎప్పటికీ చంటి అన్న గుర్తు ఉంటారు" అని 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కార్యక్రమంలో 'రాకింగ్' రాకేష్ చెప్పాడు. అత‌ను ఈ విష‌యం చెబుతుంటే ఇంద్ర‌జ‌, సంగీత ద‌ర్శ‌కుడు కోటి, తోటి న‌టులంద‌రూ క‌దిలిపోయారు. టీచర్స్ డే సందర్భంగా సెప్టెంబర్ 5న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈటీవీలో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం టీచర్స్ డే కావడంతో 'ఆచార్యదేవోభవ' పేరుతో స్పెషల్ ఎపిసోడ్ చేశారు. దీనికి కోటి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఆల్రెడీ రిలీజైన ప్రోమో చూస్తుంటే... 'అదిరే' అభి, విష్ణుప్రియ వేసిన డాన్స్, మిగతావాళ్లు పంచ్ డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. రామ్ ప్రసాద్ తన గురువు అని బాబు అంటుంటే... రామ్ ప్రసాద్ వద్దని చెప్పడం హైలైట్.

తన తండ్రి హరికృష్ణ వల్లే క్రికెట్‌పై ఆసక్తి పోయిందన్న తారక్!

గతంలో 'బిగ్ బాస్' షోతో అలరించిన యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో మరోసారి బుల్లితెరపై సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రారంభమైన ఈ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. తారక్ హోస్ట్ గా మరోసారి తన మార్క్ ను చాటుకుంటున్నారు. కంటెస్టంట్స్ ను ఆయన ప్రశ్నలు అడిగే విధానం ఆకట్టుకుంటోంది. ఇక ఈ షోలో తారక్ తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటున్నారు. తనకు క్రికెట్‌ చూడాలనే ఆసక్తి పోయేలా తన తండ్రి హరికృష్ణ చేశారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో తాజా ఎపిసోడ్‌లో తారక్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆ ఎపిసోడ్‌లో పాల్గొన్న అభిరామ్ అనే కంటెస్టంట్‌ కు క్రికెట్‌ కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా తనకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టమని, కానీ క్రికెట్‌ ను టీవీలో చూడటమంటే తనకు అసలు ఇష్టం లేదని తారక్ చెప్పారు. దీనికి కారణం తన తండ్రి హరికృష్ణే అని తెలిపారు. చిన్నతనంలో తన తండ్రి ఉదయం టీవీలో వచ్చే క్రికెట్ మ్యాచ్‌ ను వీసీఆర్‌ లో రికార్డ్ చెప్పేవారట. దీంతో ఆ మ్యాచ్ ను తను పూర్తిగా చూడాల్సి వచ్చేదని, మళ్లీ సాయంత్రం కూడా తండ్రితో కలిసి అదే మ్యాచ్ చూసేవాడినని తారక్ తెలిపారు. ఇలా చూసీ చూసీ చివరకు క్రికెట్ అంటేనే బోర్ కొట్టేసిందని తారక్ పేర్కొన్నారు. అలాగే తన భార్య ప్రణతి గురించి కూడా తారక్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తనతో పరిచయమైన 8 నెలల తర్వాత కూడా ఆమె తాను ప్రపోజ్ చేస్తే 'ఎస్' చెప్పలేదని తారక్ ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. భార్యను అర్థం చేసుకున్న ఏ మగాడైనా జీవితంలో సక్సెస్ అవుతాడని ఈ సందర్భంగా తారక్ వ్యాఖ్యానించారు.

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ముక్కు అవినాష్.. అమ్మాయి ఎవరంటే?..

జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. అనూజ అనే అమ్మాయితో ఇటీవల అవినాష్ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న అవినాష్.. తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను షేర్ చేశాడు.  జబర్దస్త్ షోతో గుర్తింపు తెచ్చుకున్న అవినాష్.. బిగ్ బాస్ షోతో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో అరియానాతో అవినాష్ క్లోజ్ గా మూవ్ అవడంతో వీరి మధ్య ఎదో నడుస్తుందనే రూమర్స్ వచ్చాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, వీరు పెళ్లిపీటలు ఎక్కడం ఖాయమని ప్రచారం జరిగింది. అయితే, ఇద్ద‌రూ వాటిని ఖండించారు. తాము మంచి స్నేహితులమని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ రూమర్స్ ఆగలేదు. అయితే ఇప్పుడు తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలతో ఈ రూమర్స్ కి చెక్ పెట్టాడు అవినాష్. ఇటీవల నిశ్చితార్థం జరిగినట్లుగా అవినాష్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తనకు కాబోయే భార్యతో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. "మ‌న జీవితంలోకి రైట్ ప‌ర్స‌న్ వ‌చ్చిన‌ప్పుడు ఆలస్యం వద్దు. మా కుటుంబాలు క‌లిసాయి. తర్వాత మేము క‌లిసాం. వెంట‌నే ఎంగేజ్‌మెంట్ అయింది. మీరందరూ ఎప్ప‌టి నుండో పెళ్లి ఎప్పుడు? అని అడుగుతున్నారు. నా అనూజ‌ను త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నాను. ఎప్ప‌టిలానే మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను" అని అవినాష్ త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు.

'ఎక్స్ట్రా జబర్దస్త్' 350 స్పెషల్: కామెడీ వెనుక కన్నీళ్లు!

  'జబర్దస్త్' అంటే కామెడీ! చూస్తున్నంతసేపూ హాయిగా నవ్వుకునే బుల్లితెర వినోద కార్యక్రమం! అందులో నటీనటులకు కమెడియన్లుగా గుర్తింపు పొందారు. అయితే, వాళ్ళు కామెడీ చేయడం వరకూ రావడం వెనుక జీవిత ప్రయాణంలో ఎన్ని కన్నీళ్లు ఉన్నాయనేది రాబోయే 'ఎక్స్ట్రా జబర్దస్త్' ఎపిసోడ్‌లో కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నారు.  'ఎక్స్ట్రా జబర్దస్త్'కు ఈ శుక్రవారం (సెప్టెంబర్ 3) ఎపిసోడ్‌ చాలా స్పెషల్. ఎందుకంటే... ఈ ప్రోగ్రామ్ మొదలైన 350 వారాలు అవుతోంది. శుక్రవారం ఎపిసోడ్‌ 350వ ఎపిసోడ్. ఈ సందర్భంగా నాటీ నరేష్, సుడిగాలి సుధీర్, గెటప్ శీను జీవితాలను స్కిట్స్ రూపంలో చూపించారు.  'జబర్దస్త్ ఆర్టిస్ట్‌ల లైఫ్ జర్నీ స్కిట్' చూసి రష్మీ గౌతమ్ కన్నీళ్లు పెట్టుకుంది. హైట్ తక్కువ ఉన్నాడని, ఎదగలేదని నరేష్ ఎన్ని అవమానాలు పడిందీ... సుధీర్, శ్రీను తిండి లేక ఎన్ని కష్టాలు పడిందీ చూపించారు. అంతకు ముందు నవ్వించినట్టు ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా ఈసారి స్టేజి మీదకు తీసుకొచ్చారు. ఆ ప‌ర్ఫార్మెన్స్‌లు చూసి ర‌ష్మి, సుధీర్ ఏడుపు ఆపుకోలేక‌పోయారు.

ఐస్ క్రీమ్ తింటూ అషురెడ్డితో ఆర్జీవీ సె** డిస్కషన్!

  వెండితెర నుండి ఓటీటీ తెరకు, అక్కడ నుండి యూట్యూబ్ తెరకు రామ్ గోపాల్ వర్మ వచ్చారు. ఆయన గ్రాఫ్ పెరిగిందా? కిందకు పడిందా? అనేది పక్కన పెడితే... ఎప్పుడూ తాను వార్తల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఆలోచించే వర్మ, తర్వాత అందరికీ ఎడాపెడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇప్పుడు 'బిగ్ బాస్' బ్యూటీలను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆల్రెడీ అరియనాతో బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. లేటెస్టుగా అషురెడ్డితో ఒక ఇంటర్వ్యూ చేశారు.  ఐస్ క్రీమ్ తింటూ అషురెడ్డితో సెక్స్ డిస్కషన్ చేశామని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. అరియనా ఇంటర్వ్యూ బోల్డ్ అనుకుంటే... అంతకు మించి ఇవ్వబోతున్నట్టు హింట్ ఇచ్చారు. ఇప్పటికే అషురెడ్డిని వివిధ భంగిమల్లో వర్మ తీసిన ఫొటోలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇంటర్వ్యూకి అషురెడ్డి చిట్టి డ్రస్ వేసుకుని వచ్చింది. ఆమె కాళ్ళును హైలైట్ చేస్తూ వర్మ స్టిల్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ రిలీజ్ చేశాక... ఏ రేంజ్ హాట్ టాపిక్ అవుతుందో చూడాలి.  అన్నట్టు... ఇంటర్వ్యూ తర్వాత అషురెడ్డి ఫ్యాన్ అయ్యానని వర్మ ట్వీట్ చేశారు. తాను కలిసిన వ్యక్తుల్లో చాలా నిజాయతీ ఉన్న మనిషి అషురెడ్డి అని కాంప్లిమెంట్ ఇచ్చారు. వర్మ మాటలకు అర్థాలు వేరులే అనుకోవాలో... లేదంటే నిజం చెప్పారో కొన్నాళ్ల తర్వాత తెలుస్తుంది. గతంలో మాట్లాడిన మాటలకు పొంతన లేని విధంగా మాట్లాడడం వర్మకు అలవాటే.    

బ్లాక్‌మెయిల్ చేసిన మోనిత‌ను కార్తీక్ పెళ్లి చేసుకుంటాడా?

  'కార్తీకదీపం' సీరియల్ కథ కీలక ఘట్టానికి చేరుకుంది. కటకటాల నుండి కార్తీక్ బయటపడటానికి మోనిత ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. ఒక విధంగా అతడిని బ్లాక్ మెయిల్ చేసింది. భయపెట్టింది. మోనిత చర్యలకు కార్తీక్ తలొగ్గి ఆమెను పెళ్లి చేసుకుంటాడా? మోనిత షరతుకు అంగీకరించి జైలు నుండి బయటపడతాడా? అనేది రాబోయే ఎపిసోడ్స్‌లో తెలుస్తుంది. అసలు, ఇవాళ్టి ఎపిసోడ్ (ఆగస్ట్ 31, 1132)లో ఏం జరిగింది? కార్తీక్‌కు ఏం చెప్పి మోనిత బ్లాక్‌మెయిల్‌కి దిగింది, అతడిని భయపెట్టింది? అనే విషయాల్లోకి వెళితే... టీలో మోనిత ఏదో కలపడం వల్ల కార్తీక్‌కు కడుపునొప్పి వస్తుంది. దాంతో ఏసీపీ రోషిణి అనుమతి తీసుకుని అతడిని ఆస్పత్రికి తీసుకువెళతారు. అక్కడ డాక్టర్ డ్రస్సులో మోనిత ఉంటుంది. కార్తీక్ గదికి వెళ్లి, అతడికి మత్తుమందు ఇస్తుంది. స్పృహ కోల్పోయిన తర్వాత చేతులను మంచానికి కట్టేస్తుంది. నోటికి ప్లాస్టర్ వేస్తుంది. తర్వాత నిద్ర లేపుతుంది. ఇదీ సోమవారం ఎపిసోడ్ లో జరిగింది. ఇక, మంగళవారం ఏమైందంటే? కార్తీక్‌ను మంచానికి కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసిన మోనిత... 'నేను పోలీసులకు లొంగిపోతేనే నువ్వు బయటకు వస్తావ్. నేను లొంగిపోవాలంటే ఒక్క షరతు. అదేంటంటే... నీతో దీప ఉంటుంది. నేనూ ఉంటాను. మనమంతా కలిసే ఉందాం' అంటుంది. అంతకు మించి మరోదారి లేదని చెబుతుంది. పెళ్లి చేసుకోవడం వల్ల తనలాంటి అందగత్తె బోనస్ కింద దక్కుతుందని చెబుతుంది. తాను పోలీసులకు లొంగిపోతే రెండు మూడేళ్లు జైలుశిక్ష పడుతుందని, ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని అంటుంది. 'నా బిడ్డ నిన్ను నాన్నా అని పిలవాలి. దీపను అడ్డు తొలగించాలని కూడా అనుకోను' అని ఆఫర్ ఇస్తుంది.  ఒకవేళ తన ప్రతిపాదనకు అంగీకరించకుండా ఏసీపీ రోషిణికి చెప్పాలని చూస్తే... తనను తానూ షూట్ చేసుకుని చ‌స్తానని బెదిరిస్తోంది. 'మీ అమ్మ రివాల్వర్ నుండి మిస్ అయిన బుల్లెట్ తో షూట్ చేసుకోవడం వల్ల నిన్ను అరెస్ట్ చేస్తారు. అప్పుడు శాశ్వతంగా జైల్లో ఉంటావ్' అని తన ప్లాన్ వివరిస్తుంది. కట్లు విప్పేసిన తర్వాత తనను పట్టుకోవాలని చూసినా... తన గురించి పోలీసులకు చెప్పినా... తల్లితండ్రుల్ని, దీపను చంపిస్తానని, ఆల్రెడీ వాళ్లకు స్పాట్ పెట్టానని కార్తీక్‌కు వార్నింగ్ ఇస్తుంది మోనిత. పిల్లల్ని కూడా వదలనని అంటుంది. కుటుంబం కోసం కార్తీక్ మౌనంగా ఉంటాడు. కట్లు విప్పేసి రేపు వస్తానని, అప్పుడు నిర్ణయం చెప్పమని మోనిత వెళుతుంది.  అప్పటికి భర్తకు ఏమైందోనని ఆందోళనగా ఆస్పత్రికి వచ్చి, రూమ్ బయట ఏడుస్తున్న దీపతో కూడా మోనిత మాట్లాడుతుంది. అయితే తనను గుర్తుపట్టని విధంగా డాక్టర్ డ్రస్సులో మాస్క్ ధరించి ఉంటుంది. దీపను పోలీసులు కార్తీక్ గదిలోకి అనుమతించకపోతే... వాళ్ళతో మాట్లాడి దీపను పంపే విధంగా ఏర్పాట్లు చేస్తుంది.  దీపను చూడగానే కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. కంగారు పడతాడు. భయపడుతూ ఉంటాడు. దాంతో దీపకు అనుమానం వస్తుంది. డాక్టర్ వేషంలో వచ్చింది మోనిత ఏమో అని దీప అనుకుంటూ ఉండగా నేటి ఎపిసోడ్ కి శుభం కార్డు వేశారు. అది నిజమా? క‌ఆదా? అనేది బుధవారం చూడాలి. 

బిచ్చగత్తెలా మారి రోడ్డున పోయేవాళ్ల‌ను ఇబ్బందిపెట్టిన వ‌ర్ష‌!

  'జబర్దస్త్' షోలో, టీవీ ఈవెంట్లలో, సీరియళ్లలో వర్ష అందంగా కనిపిస్తుంది. ఆమెను అందాల బొమ్మగానే అందరూ చూపిస్తుంటారు. అటువంటి వర్ష బిచ్చగత్తెలా మారింది. రోడ్డున పోయేవాళ్లను చాలా ఇబ్బంది పెట్టింది. అబ్బాయిలకు అయితే ప్రపోజ్ చేసింది. అమ్మాయిలను అయితే "మీకు ఎవరైనా అన్నయ్యలు ఉన్నారా?" అని అడగటం మొదలుపెట్టింది. ఇదంతా ఒక ఈవెంట్ కోసమే! పండగలకు ఈటీవీ స్పెషల్ ఈవెంట్లు చేస్తుంది. టీవీ ఆర్టిస్టుల చేత ప్రాంక్స్ చేయించడం కామన్. ఈసారి  వినాయక చవితి సందర్భంగా ఈటీవీ కోసం మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ 'ఊరిలో వినాయకుడు' అని ఒక ఈవెంట్ చేసింది. అందులో వర్షకు ఎవరూ గుర్తుపట్టని విధంగా రోడ్డు మీదకు వెళ్లి అబ్బాయి యాక్సెప్ట్ చేసేలా ప్రపోజ్ చెయ్యాలని టాస్క్ ఇచ్చారు. అందుకోసం వర్ష బిచ్చగత్తెలా మారింది. వర్ష ప్రపోజల్ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారేమో అని చెడగొట్టడానికి ఇమ్మాన్యుయేల్ కూడా ఆమె వెంట వెళ్ళాడు.  'ఊరిలో వినాయకుడు' ఈవెంట్ కోసం ఆటో రామ్ ప్రసాద్, హైపర్ ఆది షాపింగ్ మాల్‌కి వెళ్లి అక్కడ ఎవరికి ఎక్కువ హగ్గులు వస్తాయో అని కాంపిటీషన్ పెట్టుకున్నారు. లడ్డువేలం పాటలో రోజా, ఇంద్రజ పోటీపడ్డారు. రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' టీమ్ కూడా 'ఊరిలో వినాయకుడు' ప్రోగ్రాంలో సందడి చేశారు.  

రాహుల్‌తో న‌టించ‌డానికి ఒక్క పైసా తీసుకోని అషు! రియ‌ల్ ఫ్రెండ్‌షిప్పు!!

  బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న రాహుల్ సిప్లిగంజ్‌, అషురెడ్డి మ‌ధ్య ఏదో వ్య‌వ‌హారం న‌డుస్తోంద‌నే ప్ర‌చారం ఉన్న‌ప్ప‌టికీ, ఆ ఇద్ద‌రూ మాత్రం తాము గుడ్ ఫ్రెండ్స్ అని మాత్ర‌మే చెప్పుకుంటూ వ‌స్తున్నారు. త‌మ ఫ్రెండ్‌షిప్‌ను మెచ్చుకున్న ఓ అభిమానికి థాంక్స్ చెబుతూ రీసెంట్‌గా త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ ఎమోష‌న‌ల్ నోట్ షేర్ చేశాడు రాహుల్‌. ఇటీవ‌ల రాహుల్‌, అషురెడ్డి "నువ్వెవ‌రే" అనే ఒక మ్యూజిక్ సింగిల్‌లో క‌లిసి న‌టించారు. దానికి సంబంధించిన ఒక స్క్రీన్‌షాట్‌ను ఆ అభిమాని షేర్ చేశాడు. దానికి  "#Friendshipbonding' అనే హ్యాష్‌ట్యాగ్‌, ఒక హార్ట్ ఎమోజీని జోడించాడు. అత‌డి పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన రాహుల్‌, "య‌స్ మిస్ట‌ర్ నాగ‌రాజ్‌. మొత్తానికి నువ్వైనా గుర్తుప‌ట్టినావ్ మాది ఫ్రెండ్‌షిప్ అని! నా ఫాలోయ‌ర్స్‌లో మీరే మొద‌టి వ్య‌క్తి. నేను, అషు కేవ‌లం మా ప‌ని చేస్తున్నాం. అషు మూడు రోజుల పాటు నా వీడియోలో యాక్ట్ చేసి, ఒక్క పైసా కూడా తీసుకోలేదు. దాన్నే ఒక ఫ్రెండ్‌కు స‌పోర్ట్ చేయ‌డానికి రియ‌ల్ ఫ్రెండ్ అంటారు" అని రాసుకొచ్చాడు. రాహుల్ ఇన్‌స్టా స్టోరీని షేర్ చేసిన‌ అషురెడ్డి "ల‌వ్ యు రాహుల్ సిప్లిగంజ్" అని రిప్లై ఇచ్చింది. అదీ విష‌యం!