పంచ్ డైలాగ్స్‌తో అన్న‌పూర్ణ అద‌ర‌గొట్టేశారంతే!!

  సీనియర్ నటి అన్నపూర్ణ కామెడీ టైమింగ్ సూపరంతే! ఆమె వేసిన పంచ్ డైలాగ్స్ ముందు కంటెస్టెంట్స్ చేసిన కామెడీ చిన్నబోయేలా ఉందంటే అతిశయోక్తి కాదు. రెగ్యులర్‌గా షోలో కామెడీ చేసే టీమ్ లీడర్లు, శేఖర్ మాస్టర్ మధ్య మధ్యలో వేసే సెటైర్స్ కంటే అన్నపూర్ణ చమక్కులు 'కామెడీ స్టార్స్'లో బాగా పేలాయి. ప్రోమోలో ఇంత సందడి చేశారంటే... షోలో ఇంకెంత చేసి ఉంటారో? అప్‌కమింగ్ సండే 'కామెడీ స్టార్స్' చూడాల్సిందే అన్నట్టు చేశారు.  'స్టార్ మా'లో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే 'కామెడీ స్టార్స్' షో కోసం గిరిబాబు, హాస్యనటి శ్రీలక్ష్మితో పాటు అన్నపూర్ణ అతిథులుగా వచ్చారు. స్టేజి మీదకు వచ్చీ రావడంతో 'ఈ పిల్లకు పెళ్లి అవ్వదా?' అని శ్రీముఖి మీద పంచ్ వేశారు. 'మాకూ అదే డౌట్' అని శేఖర్ అంటే... 'నేను తప్పటడుగులు వేస్తున్నప్పటి నుండి చూస్తున్నా. నీకు పెళ్లి అవ్వదా?' అని మళ్ళీ శ్రీముఖిని అడిగింది. అందరికీ అవినాష్ నమస్కారాలు పెడుతుంటే... 'దీంతోనే సరిపెడతావా? ప్రోగ్రామ్ ఏమైనా చేస్తావా?' అని మరో పంచ్ వేశారు.  మినీ స్కర్ట్ వేసుకున్న అషురెడ్డి నా డ్ర‌స్ చూడండి. ఎంత బాగుందో అని తెగ ఇదైపోతుంటే, డ్ర‌స్ వేసుకున్నాన‌ని ఫీలీంగా నీకు? అని చ‌మ‌త్క‌రించారు అన్న‌పూర్ణ‌. శేఖర్ మాస్టర్ డాన్స్ చేశాక త‌న సీట్లో కూర్చొని ఆయాసం వస్తోంద‌ని అంటే 'ఇద్దమ్మాయిల మధ్యలో మాస్టర్ ను ఆడమన్నారు. ఆయాసం రాదూ?' అని సైలెంట్ గా ఓ చమక్కు విసిరారు. అన్నపూర్ణను తీసుకొచ్చి 'కామెడీ స్టార్స్' టీమ్  మంచి పని చేసినట్టు ఉంది. 

దీప‌ను చంప‌డానికి గ‌న్ తీసిన మోనిత‌!

  దీపను మోనిత ఏమైనా చేస్తుందేమో అని కంగారులో కార్తీక్ ఉంటే... అతడిని కోర్టుకు హాజరు పరచడమే తన ప్రథమ కర్తవ్యంగా ఏసీపీ రోషిణి విధి నిర్వహణలో ఉంటుంది. మరోవైపు మోనిత వెనుక కారులో దీప బయలుదేరినా... పట్టుకోలేకపోతుంది. మొత్తం మీద ఈ రోజు (సెప్టెంబర్ 9) 'కార్తీక దీపం' సీరియల్‌లో కథ పెద్దగా ముందుకు కదల్లేదు. కానీ, కథనం ఆకట్టుకునేలా ఉంది. ఉత్కంఠను కొనసాగించిందని చెప్పాలి. అసలు, ఏమైందనే వివరాల్లోకి వెళితే... రీనా వేషంలో ఆస్పత్రికి వచ్చిన మోనిత తన దగ్గరకు రాకపోవడం... దీప కనిపించకపోవడంతో కార్తీక్ కంగారు పడతాడు, మోనితను పట్టుకోవడానికి దీప వెళ్లిందా? అని. దీపను వెద‌క‌డానికి వెళతా అంటే పోలీసులు ఒప్పుకోరు. దాంతో మోనితకు రత్నసీత ఫోన్ చేస్తుంది. దీప కోసం కార్తీక్ కంగారు పడుతున్నట్టు చెబితే... 'కాసేపటిలో నా చేతిలో దీప చావబోతుంది' అని మోనిత ఫోన్ పెట్టేస్తుంది. కట్ చేస్తే... కోర్టులో కార్తీక్ ను హాజరు పరచాలని ఏసీపీ రోషిణి వస్తుంది. దీప కనిపించడం లేదని, తన భార్యను మోనిత ఏమైనా చేసి ఉంటుందని కార్తీక్ చెబుతాడు. మోనితను మీరే చంపేశారని రోషిణి అంటుంది. అప్పుడు ఆమెకు కార్తీక్ నిజం చెబుతాడు. బసవయ్య కూతురు మూగమ్మాయిగా టీ తెచ్చినదీ, రీనా వేషంలో వచ్చినదీ మోనిత అనీ... పెళ్లి చేసుకోకపోతే తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించిందనీ కార్తీక్ వివరిస్తాడు. అయితే, రోషిణి వినదు. 'స్టాపిట్... మీ దగ్గర ఒక్క సాక్ష్యమైనా ఉందా?' అని ఎదురు ప్రశ్నిస్తుంది. 'నేనే సాక్ష్యం. నా భార్య ప్రత్యక్ష సాక్షి' అని కార్తీక్ చెబుతాడు. రోషిణి పట్టించుకోకపోవడంతో దీపను వెతికించమని ప్రాధేయపడతాడు. కోర్టుకు వెళ్లొచ్చిన తర్వాత వెతికిస్తానని రోషిణి చెబుతుంది. కార్తీక్ రిక్వెస్ట్ చేస్తుంటే... 'అతడు మనకు డాక్టర్ కాదు... ఖైదీ. పట్టుకొచ్చేయండి' అని పోలీసులను ఏసీపీ ఆదేశిస్తుంది. దాంతో అతడిని కోర్టుకు తీసుకువెళతారు.  మరోవైపు... మోనిత వెనుక బయలుదేరిన దీప కారులో పెట్రోల్ అయిపోవడానికి దగ్గరగా ఉండటంతో ఓ బంక్ దగ్గర ఆగుతారు. మోనిత కూడా క్యాబ్ దిగుతుంది. అదే రూటులో కార్తీక్ ను పోలీసులు కోర్టుకు తీసుకువెళుతుంటే దొంగచాటుగా మోనిత చూస్తుంది. 'కార్తీక్... జైలుపాలు అవుతున్నావా?' అంటూ ఫీల్ అవుతుంది. అక్కడ నుండి కొంచెం కదిలేసరికి దీప కనిపించడంతో చెట్టు చాటు నుండి చంపాలని గన్ తీస్తుంది. కోర్టుకు కార్తీక్ వెళ్లేసరికి తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు ఉంటారు. తల్లి సౌందర్యతో మోనితను పట్టుకోవడానికి దీప వెళ్లిందని కార్తీక్ చెబుతాడు. సౌందర్య భయపడుతుంది.  అక్కడితో ఎపిసోడ్ కి ఎండింగ్ కార్డు పడింది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.  

తల్లి మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న అషు!

  రామ్‌ గోపాల్‌ వర్మ, అషురెడ్డి ఇంటర్వ్యూ మీద ఎవరి అభిప్రాయం వాళ్లది. కొంతమంది అషురెడ్డి కాళ్ళను మాత్రమే చూస్తున్నారు. కొంతమంది ఆమె చెప్పిన మాటలు వింటున్నారు. ఇంకొంతమంది వర్మ ప్రశ్నలను ఇష్టపడుతున్నారు. పలువురి అభిప్రాయాలను అషురెడ్డి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. అందులో ఆమెను పొగిడినవి ఎక్కువ ఉన్నాయి. తన థైస్‌ బావున్నాయని పెట్టిన కామెంట్‌ను కూడా అషురెడ్డి షేర్‌ చెయ్యడం విశేషం. అయితే, అన్నిటిలోకెల్లా ఆమె తల్లి అభిప్రాయం, అది విని అషురెడ్డి కన్నీళ్లు పెట్టుకోవడం ముఖ్యమైన విషయం. ‘‘ఇంటర్వ్యూ చూశాను. బావుంది. బోల్డ్‌గా, స్ట్రాంగ్‌గా మెసేజ్‌ చెప్పావ్‌. మాట్లాడావ్‌. సొసైటీకి మంచి మెసేజ్‌ ఇచ్చావ్‌. బానే ఉంది’’ అని అషురెడ్డి తల్లి చెప్పింది. దీనిని వీడియో తీసి, ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో అషురెడ్డి పోస్ట్‌ చేసింది. కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించింది. ‘‘నిజంగా నేను ఏడుస్తున్నా. థాంక్యూ మామ్‌. మీ టైమ్‌ కేటాయించి అప్రిషియేట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్యూ’’ అని అషురెడ్డి చెప్పింది.  

షణ్ముఖ్‌ జస్వంత్‌కి పనోడిగా లోబో!

  ఎవరి చేతిలో పవర్‌ రూమ్‌ యాక్సెస్‌ ఉంటే వాళ్లు చెప్పింది మిగతావాళ్లు చేయాల్సిందే! అందుకని, హౌస్‌లో కంటెస్టెంట్లు అందరూ పవర్‌ రూమ్‌ యాక్సెస్‌ కోసం పోటీపడ్డారు. ఒకసారి బజర్‌ మోగినప్పుడు డాన్స్‌ మాస్టర్‌ నటరాజ్‌తో పాటు హీరోయిన్‌ శ్వేతా వర్మ... ఇద్దరూ ఓకేసారి చెయ్యి పెట్టారు. దాంతో ఎవరికీ యాక్సెస్‌ రాలేదు. తర్వాత బజర్‌ మోగినప్పుడు యూట్యూబర్‌ సిరి హన్మంత్‌ యాక్సెస్‌ దక్కించుకుంది. షణ్ముఖ్‌ జస్వంత్‌, లోబో ఇద్దరిలో ఒకరు ఇంకొకరికి వ్యక్తిగత సేవకుడిగా ఉండాలని సిరి హ‌న్మంతుతో ‘బిగ్‌ బాస్‌’ చెబుతాడు. అప్పుడు షణ్ముఖ్‌ జస్వంత్‌కి పనోడిగా ఉండమని లోబోకి చెప్పంది సిరి. షణ్ముఖ్‌కి లోబో బాడీ మసాజ్‌ చేశాడు. అతడు సేవలు చేస్తున్నప్పుడు మిగతావాళ్లు నవ్వితే.. ‘ఏయ్‌! నవ్వకు నువ్వు’ అని లోబో అన్నాడు. ‘పనోడివి పనోడిలా ఉండు’ అని రవి కామెడీ చేసే ప్రయత్నం చేశాడు. ఇంకేం జరిగాయో ఈ రోజు ఎపిసోడ్‌ చూస్తే తెలుస్తుంది. ఏమైందో ఏమో... సిరికి బిగ్‌ బాస్‌ మొదటి హెచ్చరిక జారీ చేశాడు. ‘బిగ్‌ బాస్‌’ అంటే గొడవలు కామన్‌. ఈ రోజు హమీదా, లహరి మధ్య గొడవ జరిగింది. తప్పు ఎవరిదీ అనేది ఇప్పుడే చెప్పలేం. అయితే... ‘మాట్లాడేటప్పుడు సరిగా మాట్లాడు’ అని లహరి అన్నది. అందుకు బదులుగా ‘నేను ఎలా మాట్లాడాలో నా ఇష్టం. మీరు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు’ అని హమీదా చెప్పింది. తర్వాత కన్నీళ్లు పెట్టుకుంది. లహరి కోపంగా ‘నా ఇష్టం వచ్చినట్టు నేను ఆన్సర్‌ ఇస్తానంటే నేనెందుకు పడతా. నేనేమైనా వాళ్లింట్లో పని చేస్తున్నానా?’ అని విశ్వతో తన వెర్షన్‌ చెప్పుకొంది. 

తప్పించుకున్న మోనిత.. కారులో వెంటాడుతున్న దీప!!

  'కార్తీక దీపం' సీరియల్‌లో కథ మరో కీలక ఘట్టానికి చేరుకుంది. ఇవాళ్టి (సెప్టెంబర్ 8) ఎపిసోడ్ వీక్షకుల్లో ఉత్కంఠ పెంచింది. తర్వాత ఏం జరుగుతుందోనని టెన్షన్ పెట్టి ఎపిసోడ్ ముగించారు. ఆల్రెడీ ప్రోమోలో దీపకు మోనిత దొరికినట్టు చూపించారు. అది ఈ రోజు ఎపిసోడ్ లో ఉంది. ఆ తర్వాత దీప నుండి మోనిత తప్పించుకోవడం, మోనితను వెంటాడుతూ కారులో దీప బయలుదేరడం ఇవాళ్టి ఎపిసోడ్ హైలైట్స్. అసలు, ఈ రోజు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే... డాక్టర్ రీనా వేషంలో మోనిత ఆస్పత్రికి వచ్చేసరికి కార్తీక్, దీప మాట్లాడుకుంటూ ఉంటారు. భర్త శిక్ష తప్పించుకోవడానికి వేరే దారి లేదా? అని దీప ఏడుస్తుంది. 'మోనిత బతికి ఉందని నిరూపిస్తే... మోనిత దొరికితే శిక్ష నుంచి తప్పించుకోగలను. కాని, ఆ దారి మూసుకుపోయింది' అని కార్తీక్  అంటాడు. అప్పుడు సోదమ్మ వేషంలో మోనిత గుడికి వచ్చిందని, దుర్గను చూసి పారిపోయిందని దీప చెబుతుంది. మూగమ్మాయిగా టీ తీసుకొచ్చినది కూడా మోనిత అని కార్తీక్ అంటాడు. దాంతో తన గురించి ఎక్కడ చెబుతాడోనని మోనిత భయపడుతుంది.  అక్కడ నుండి దూరంగా బయటకు వెళుతుంది. 'నేను పెళ్లి చేసుకోవాలని వస్తే... నన్ను అజ్ఞాతంలోకి పంపాలని చూస్తున్నాడా?' అని మనసులో అనుకుని ఫోన్ చేస్తుంది. డాక్టర్ రీనా కాల్ చేశారని కార్తీక్ దగ్గరకు ఓ పోలీస్ ఫోన్ తీసుకొస్తాడు. 'ఏంటి? గొంతు పూడుకుపోయింది?? మీ ఆవిడతో నా గురించి చెప్పేటప్పుడు బాగానే ఉంది కదా?' అని మోనిత వాయిస్ వినిపించడంతో ఎక్కడ ఉందోనని కార్తీక్ బయటకు వచ్చి చూస్తాడు. కనిపించదు. పోలీసులు ఏమైందన్నట్టు సైగ చేయడంతో మళ్ళీ లోపలకి వెళతాడు. 'మన పెళ్లికి అరగంట మాత్రమే ఉంది. అంతా చెప్పేస్తే... నీ భార్య ఊరుకుంటుందా? ఏదో ఒకటి చేసి మన పెళ్లి ఆపేస్తుంది కదా?' అంటుంది మోనిత.  'మన పెళ్లి జరగకపోతే నేను అజ్ఞాతం నుంచి బయటికి రాను కదా! నువ్వు జైలు పాలు అయిపోతావ్ కదా? నీ వాళ్లందరినీ నేను బతకనివ్వను కదా. నువ్వు మరీ ఇంత అమాయకంగా తయ్యారయ్యావేంటి కార్తీక్' అని చెబుతూ పోతుంది మోనిత. 'నిన్ను ఆడదానిగా కాదు... మనిషిగా చూడటం లేదు. నీతో కాపురం ఎలా చేస్తానని అనుకుంటున్నావు?' అని కార్తీక్ కోప్పడతాడు. సరిగ్గా అప్పుడే మోనితను దీప చూస్తుంది. కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన సన్నివేశాలు గుర్తు చేసుకుని కార్తీక్ కంగారుకు కారణం ఇదన్నమాట అనుకుని మోనిత దగ్గరకు వస్తుంది.  మోనితకు దగ్గరగా వచ్చిన దీప, ఆమె వెనకాల నిలబడుతుంది. 'నా గురించి నా కన్నా ఎక్కువగా నీకే తెలుసు కార్తీక్! త్వరగా నీ పెళ్లాన్ని ఇక్కడి నుంచి పంపించేయ్. నా మెడలో తాళి కట్టేసెయ్! హిమను చంపిన నాకు... దీపను, నీ కుటుంబాన్ని చంపడం పెద్ద కష్టం కాదు' అని  వార్నింగ్ ఇస్తుంది. వెనుక ఉన్న దీప కోపం కట్టలు తెంచుకుంటుంది. ప్లేట్స్ నేలకేసి గట్టిగా కొడుతుంది. మోనిత వెనక్కి తిరిగి చూస్తే.... దీప. అమ్మవారిలా కళ్ళు పెద్దవి చేసుకుని ఉగ్రరూపం దాలుస్తుంది.  "ఇంకా ఎన్ని రోజులు తప్పించుకుంటావే? డాక్టర్ బాబును కాపాడటం కోసమే ఆ దేవుడు నిన్ను నాకు చూపించాడు. రావే" అంటూ మోనిత జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్ళడానికి దీప ప్రయత్నిస్తుంది. దీపను పక్కకు తోసేసి... అక్కడ నుండి తప్పించుకుని క్యాబ్ ఎక్కి మోనిత పారిపోతుంది. వారణాసిని కార్ తీయమని క్యాబ్ ను ఫాలో అవుతుంది దీప. మోనిత ఓటీపీ చెప్పకపోవడంతో క్యాబ్ బుక్ చేసుకున్నది ఆమె కాదని డ్రైవర్ గమనిస్తాడు. దింపేయబోతే... మోనిత రెండువేల రూపాయల నోట్ల కట్ట విసరడంతో ముందుకు పోనిస్తాడు.  ముందు క్యాబ్ లో మోనిత... దాన్ని ఫాలో అవుతూ వెనుక కారులో దీప... ఛేజింగ్ సీన్ బాగా తీశారు. ప్లేట్స్ కడగటానికి వెళ్లిన దీప ఎంతసేపటికీ రాకపోవడంతో కార్తీక్ ఆలోచించడం మొదలు పెడతాడు. మోనితను పట్టుకోవడానికి వెళ్ళిందేమోనని సందేహిస్తాడు. 'డాక్టర్ రీనా వచ్చారా?' అని అడిగితే... 'ప్రస్తుతం రూమ్ లో లేరు' అని  ఓ నర్స్ చెబుతుంది. దాంతో కార్తీక్ సందేహం బలపడింది. బయటకు వెళ్ళబోతే పోలీసులు ఆపుతారు. ఈలోపు రత్నసీత వస్తే ఆమెతో 'మా దీప కనిపించడం లేదు. నువ్వు డాక్టర్ రీనాను చూశావా? అని కార్తీక్ అడుగుతాడు. దాంతో రత్నసీత షాక్ అవుతుంది. తర్వాత ఏమైందనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి. 

రోహిణితో గొడవ... 'క్యాష్' నుండి వర్ష వాకౌట్!

  'జబర్దస్త్'తో రోహిణి, వర్షకు పాపులారిటీ పెరిగింది. రాకింగ్ రాకేష్ స్కిట్స్, హైపర్ ఆది స్కిట్స్ లో రోహిణి చేస్తోంది. మొన్నటివరకు కెవ్వు కార్తీక్ స్కిట్స్ లో చేసిన వర్ష, ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ స్కిట్స్ లో చేస్తోంది. 'ఊరిలో వినాయకుడు' ఈవెంట్ కోసం వర్ష ఇంట్లో చేసిన పూజకు రోహిణి వెళ్ళింది. ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బలపడిందని భావిస్తున్న సమయంలో, గొడవలు బయటపడ్డాయి.  సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'క్యాష్' షోకి రోహిణి, వర్ష వచ్చారు. తనను 'బండ... బండ' అని వర్ష పిలవడంతో రోహిణి ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఇంకోసారి బండ అన్నావంటే ఎత్తి అలా వేసేస్తాను' అని రోహిణి సీరియస్ అయ్యింది.  ''అసలు ఈ అమ్మాయి ఉంటే నేను షోకి రాకూడదని అనుకున్నాను. మాట్లాడితే నా పర్సనాలిటీ మీద... నువ్వు సన్నగా ఉంటావు. అది నీ బాడీ తత్వం. నన్ను అనకు'' అని వర్ష ముఖం మీద రోహిణి ఫైర్ అయ్యింది. దాంతో షో నుండి వర్ష వాకౌట్ చేసింది. 'రోహిణి ఉంటే నేను షోకు రానండి' అని వర్ష వెళ్ళిపోయింది. 'నీ ముందు నిలబడాలంటే నాకు చిరాకు' అని రోహిణి అన్నది. వీళ్లిద్దరి ప్రవర్తన చూసి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే సుమ సైతం అసహనం వ్యక్తం చేసింది.  వర్ష, రోహిణి గొడవ ప్రాంక్ లో భాగమా? లేదంటే నిజమా? అనేది షో టెలికాస్ట్ అయితే గానీ తెలియదు. టీఆర్పీ కోసం ఈమధ్య ఇటువంటివి చేస్తున్నారు. 'జబర్దస్త్'లో వెంకీ మంకీస్ టీమ్ లీడర్ వెంకీ అందరితో తాను స్కిట్స్ చేయిస్తుంటే తనకు పేరు రావడం లేదని వాపోయాడు. దాన్ని ప్రోమోలో హైలైట్ చేశారు. షో చూస్తే... ప్రాంక్ అన్నారు. వర్ష, రోహిణి గొడవ నిజమా? కాదా? అన్నది త్వరలో తెలుస్తుంది. 

మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక!

  అవకాశం దొరికితే చాలు... రష్మీ గౌతమ్ మీద తనకున్న ప్రేమను చాటుకోవడానికి 'సుడిగాలి సుధీర్ ఏమాత్రం వెనుకాడడు. ప్రతిసారీ రష్మీకి అతడే ప్రపోజ్ చేస్తుంటాడు. బట్, ఫర్ ఏ చేంజ్... ఈసారి సుధీర్‌కి రష్మీ గౌతమ్ ప్రపోజ్ చేసింది. అయితే, అదీ ఈవెంట్‌లో చేసిన ఓ పర్ఫార్మెన్స్‌లో భాగంగా ప్రపోజ్ చేసింది. అయితే... రోజా మాత్రం అడిగేశారు. 'మీ ఇద్దరి పెళ్ళెప్పుడు?' అని! ఎప్పటిలా రష్మీ ముసిముసి నవ్వులు నవ్వి సరిపెడుతుందో? లేదంటే ఏమైనా సమాధానం చెప్పిందో? గణేష్ చతుర్థి స్పెషల్ ఈవెంట్ 'ఊరిలో వినాయకుడు'లో చూడాలి.  వినాయక చవితి సందర్భంగా మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ ఈటీవీ కోసం 'ఊరిలో వినాయకుడు' పేరుతో ఓ ఈవెంట్ చేసింది. శుక్రవారం అది టెలికాస్ట్ కానుంది. అందులో 'తొమ్మిది సంవత్సరాల తీపి గుర్తులను తొమ్మిది గిఫ్టులుగా నీకు గుర్తుండిపోయేలా ఇస్తున్నా' అంటూ సుధీర్ ను సోఫాలో కూర్చోబెట్టి రష్మీ గౌతమ్ ఒక డాన్స్ పెర్ఫార్మన్స్ చేసింది. దాన్ని బాగా డిజైన్ చేసినట్టు ఉన్నారు.  పెర్ఫార్మన్స్ చివర్లో సుధీర్ వైపు లవ్ సింబల్ చూపించింది రష్మీ. ముద్దులు కూడా ఇచ్చింది. ఆ తర్వాత 'తొమ్మిదేళ్లు వెయిట్ చేసినందుకు ఎంత అందంగా ప్రపోజ్ చేసిందంటే... మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక' అని రోజా చెప్పారు. 'ఫైనల్ గా మీరేం చెబుతారు?' అని ఇంద్రజ కూడా అడిగారు. సుధీర్, రష్మీ ఏం చెప్పారో మరి? రష్మీ ఎమోషనల్ అయినట్టు చూపించారు. ఎందుకో ఈవెంట్ చూస్తే తెలుస్తుంది. 

మాన‌స్ మీద మ‌న‌సుప‌డ్డ ప్రియాంక‌?!

  'బిగ్ బాస్ 5'లో ప్రేమకథలు షురూ చెయ్యడానికి ఎక్కువ సమయం తీసుకోవడానికి నిర్వాహకులు ఇష్టపడటం లేదనుకుంట! ఆల్రెడీ ఓ కథను మొదలుపెట్టారు. మానస్ నాగులపల్లి మీద ట్రాన్స్‌జెండర్ ప్రియాంక మనసు పారేసుకున్న‌ట్టు ఉన్నారు.  'నువ్వు నన్ను ఏమని పిలుస్తావ్?' అని ప్రియాంకను యాంకర్ రవి అడిగితే... 'అన్నయ్య' అని ఆన్సర్ ఇచ్చింది. 'విశ్వను ఏమని పిలుస్తావ్' అని అడిగితే... ప్రియాంక నోటి నుండి 'అన్నయ్య' వచ్చింది. 'మానస్ ను' అని అడిగితే... 'అట్లా ఏమీ పిలవను' అని తప్పించుకుంది. దీనిబట్టి మానస్, ప్రియాంక మధ్య 'బిగ్ బాస్ 5'లో ప్రేమకథకు పునాది పడిందా? వేస్తున్నారా? అని అనిపిస్తోంది.  'బిగ్ బాస్' బుధవారం ఎపిసోడ్ లో  విశ్వకు పవన్ రూమ్ యాక్సెస్ లభించింది. అతడు ఎంపిక చేసిన ఇద్దరు సభ్యులు ఒంటి మీద దుస్తులతో సహా వాళ్ళ వస్తువులన్నీ స్టోర్ రూమ్ లో పెట్టాలని 'బిగ్ బాస్' ఆదేశించాడు. యాంకర్ రవి, ప్రియ పేర్లు చెప్పాడు విశ్వ. దాంతో రవి ఓ అమ్మాయి డ్రస్ వేసుకున్నాడు. ఈ ప్రోమో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇక, ఇదే ప్రోమో కింద షో టైమింగ్ మార్చమని ఒకరు రిక్వెస్ట్ చెయ్యడం గమనార్హం.  "మా (స్టార్ మా) యాజమాన్యానికి చిన్న విన్నపం ఏమనగా... 'బిగ్ బాస్ - 5' రోజువారీ దృశ్య ప్రదర్శన కాలము(టెలికాస్ట్ టైమింగ్)ను రాత్రి  9:30కి  కొనసాగించాలని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కోరుచున్నారు. గమనించగలరు" అని ఒకరు కామెంట్ చేశారు. దీనికి వెయ్యికి పైగా లైక్స్ వచ్చాయి. రోజూ రాత్రి పది గంటలకు 'బిగ్ బాస్' ప్రసారం కానుంది. వీకెండ్స్... శని, ఆదివారాలు తొమ్మిది గంటలకు ప్రసారం చేస్తున్నారు. ఫ్యాన్స్ రిక్వెస్ట్ పట్టించుకుని టైమింగ్ మారుస్తారో? లేదో? చూడాలి.   

దీపకు దొరికిన మోనిత! నెక్స్ట్ ఏంటి?

  మారువేషాలతో కార్తీక్, దీప కుటుంబాన్ని కన్నీళ్లు పెట్టిస్తున్న మాయలేడి మోనిత ఆటలకు ఇక చెక్ పడినట్టే. అయితే, 'కార్తీక దీపం' సీరియల్ లో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఇంట్రెస్టింగ్ టాపిక్. మోనిత మరణించలేదు అన్నది నిజం. కార్తీక్ చేత తన మెడలో తాళి కట్టించుకోవాలని నాటకాలు ఆడుతున్న మాట నిజం. మూగమ్మాయిగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కార్తీక్ కి టీ ఇవ్వడం, సోదమ్మగా దీపను చంపడానికి ప్రయత్నించడం, డాక్టర్ రీనాగా మారు వేషంలో పోలీసుల కళ్లుగప్పి ఆస్పత్రిలో తిరుగుతుండటం నిజం. అయితే, ఇన్నాళ్లూ మోనితను ఎవరూ పట్టుకోలేకపోవడంతో దొరలా దర్జాగా తిరుగుతోంది. అయితే, ఇప్పుడు మోనితను దీప పట్టుకుంది. సారీ... మోనిత చేసిన మిస్టేక్స్ వల్ల దీపకు దొరికేసింది. దాంతో నెక్స్ట్ ఏం అవుతుందోననే ఆసక్తి సీరియల్ అభిమానుల్లో మొదలైంది.  కార్తిక్ అలియాస్ డాక్టర్ బాబుకు కడుపు నొప్పి వచ్చేలా చేసి... అతడిని ఆస్పత్రికి మోనిత రప్పించిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ తమ్ముడు ఆదిత్యకు యాక్సిడెంట్ చేయించడం, వార్నింగ్ ఇవ్వడంతో మోనిత గురించి కార్తీక్ ఎవరికీ చెప్పలేకపోతున్నాడు. అయితే, రోజూ ఆస్పత్రికి దీప వస్తున్న సంగతి కూడా తెలిసిందే. భర్త తినేసిన తర్వాత క్యారేజ్ పట్టుకుని బయటకు వస్తుంది దీప. వాష్ బేసిన్ ముందు నిలబడి మోనిత ఫోన్ మాట్లాడుతుంది. వాష్ బేసిన్ ముందున్న అద్దంలో మోనిత ముఖం దీపకు కనిపిస్తుంది.  'మోనిత! డాక్టర్ రీనా వేషంలో వచ్చింది మోనిత!!' అని దీప మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత కోపంతో మోనిత దగ్గరకు నెమ్మదిగా నడుస్తూ వెళుతుంది. అప్పుడు 'త్వరగా నీ పెళ్ళాన్ని ఇక్కడి నుండి పంపించేయ్. డైరెక్టుగా నా మెడలో తాళి కట్టేసేయ్' అని ఫోనులో కార్తీక్‌కి మోనిత వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చేతిలో ప్లేట్స్ కిందకు గట్టిగా కొడుతుంది దీప.  వెనక్కి తిరగడంతో దీపకు మోనిత దొరికేసింది. దీంతో ఏం జ‌రుగుతుంద‌నే ఆస‌క్తి ఎక్కువైంది.

'బిగ్ బాస్' షోపై లోబో సెటైర్స్‌! ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్స్!

  "అరే.... 'బిగ్ బాస్'కి ఒక దండంరా అయ్యా నిజంగా! నిజంగా దేవుడు ఉన్నాడు తెలుసా. బిగ్ బాస్... నాట్ ఎట్ ఆల్ మై కప్ ఆఫ్ టీ. అది నా టేస్ట్ కాదు. నాకు నచ్చదు ఆ షో" - ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? 'బిగ్ బాస్' సీజన్ 5లో ఆరో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన లోబో.  గతంలో ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ షో మీద లోబో సెటైర్స్ వేశాడు. కట్ చేస్తే... అదే షో సీజన్ 5లో అడుగుపెట్టాడు. 'బిగ్ బాస్' హౌస్ లోపలికి వెళ్లిన తర్వాత హౌస్ సూపర్‌గా ఉందంటూ విపరీతమైన కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. దాంతో అతడిని నెటిజన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. షో నుండి బయటకు వచ్చిన తర్వాత లోబో ఏం చెబుతాడో చూడాలి. అప్పుడు ఎందుకు నచ్చలేదన్నాడో... తర్వాత షోలోకి ఎందుకు వెళ్ళాడో... ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ ఉండటం గ్యారెంటీ.  ఇక, షోలో లోబో బిహేవియర్ ఆకట్టుకోవడం లేదంటున్నారు మెజారిటీ ఆడియన్స్. అయితే, అతడి గెటప్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి కొన్ని రోజులు షోలో ఉంచే అవకాశాలు ఉన్నాయి. 

మ‌నో మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయ్యుంటే కీర‌వాణికి అవ‌కాశాలు ఉండేవి కావా?

  మ్యూజిక్ డైరెక్టర్ కావాల్సిన మనో సింగర్ మాత్రమే అయ్యాడా? ఒకవేళ మనో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఉంటే కీరవాణికి ఇన్ని అవకాశాలు వచ్చి ఉండేవి కావా? ఏమో... ఏం జరిగి ఉండేదో? మనోలో మ్యూజిక్ డైరెక్టర్ కి ముందరికాళ్ల బంధం వేశారో సీనియర్ సంగీత దర్శకులు. అయన వార్నింగ్ వల్ల మనో స్వరాలు రాయడం మీద దృష్టి పెట్టలేదని 'ఆలీతో సరదాగా' లేటెస్ట్ ప్రోమో చూస్తే అర్థమవుతుంది.  మనో, జమీలా దంపతులు 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి అతిథులుగా వచ్చారు. కెరీర్ ప్రారంభంలో జరిగిన సంగతులను మనో గుర్తు చేసుకున్నారు. "నేను ఓ స్వరం రాశా. 'కృష్ణమూర్తి! వీడు చాలా బాగా రాస్తున్నాడే' అని విశ్వనాథంగారు అన్నారు. ఫోన్ వస్తే మాట్లాడానికి వెళ్లారు. అప్పుడు విజయా కృష్ణమూర్తిగారు పిలిచారు. 'ఇంకోసారి స్వరం రాశావనుకో... మద్రాస్‌లో ఉండవ్!' అన్నారు" అని మనో చెప్పారు. ఏడాదిన్నర పాటు తనకు రావాల్సిన కన్వీనియన్స్ వేరొకరు తీసుకున్నారని వెల్లడించారు. తబలా ప్రసాద్ గారు చెప్పేవరకూ ఆ విషయం తనకు తెలియలేదన్నారు.  చక్రవర్తిగారి దగ్గర ఎం.ఎం. కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్ తనకు జూనియర్లు అని మనో చెప్పారు. ఆలీ హీరోగా నటించిన 'సోంబేరి' సంగీత దర్శకుడిగా తన తొలి చిత్రమని ఆయన వెల్లడించారు. ఆ సినిమా ఆడియో వేడుకలో 'ఒకవేళ నాగూర్ బాబుగారు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఉంటే ఇంతమంది నిర్మాతలు నాకు సినిమాలు ఇచ్చేవారు కాదేమో' అని కీరవాణి అన్నారని మనో గుర్తు చేసుకున్నారు. 'అరేయ్! నిన్ను సింగర్ చేస్తే నాకు దూరం అవుతావేమోనని చాలా కాలం నీకు పాటలు ఇవ్వలేదురా. నన్ను క్షమించరా' అని ఒకరోజు చక్రవర్తిగారు తనతో చెప్పినట్టు మనో వెల్లడించారు.  మనో, జమీలా పెళ్లి చూపుల రోజు ఏం జరిగిందనేది 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ప్రస్తావనకు వచ్చింది. "మాది తెనాలి. మనోగారు తెనాలి వచ్చారు. చూడటంతోనే 'నేను నీకు నచ్చానా?' అని నన్ను అడిగారు. నేను నచ్చానో లేదో ఫస్ట్ మీరు చెప్పండి. తర్వాత మీ సంగతి చెబుతాన్నాను. కరెక్ట్ అనుకున్నారు" అని జమీలా చెప్పారు. భర్త పాడిన పాటల్లో 'ప్రియా ప్రియతమా రాగాలు' పాట తనకు బాగా ఇష్టమన్నారు. అన్ని పాటలు ఇష్టమేనన్నారు.

మోనిత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! ర‌త్న‌సీత‌లో పెరుగుతున్న భ‌యం!!

  కార్తీక్ మీద మోజుతో మోనిత చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేసే సమయం ఆసన్నమైందా? ఆమెను పోలీసులు పెట్టుకుంటారా? లేదంటే పోలీసుల ముందుకు వెళ్లి లొంగిపోవాల్సిన పరిస్థితి మోనితకు వస్తుందా? ఇవాళ్టి 'కార్తీక దీపం' (సెప్టెంబర్ 7) ఎపిసోడ్ చూస్తే ఇటువంటి సందేహం కలుగక మానదు. మోనితకు మద్దతుగా నిలుస్తున్న  రత్నసీత సైతం 'మేడమ్! లొంగిపోండి' అని అంటుందంటే... మోనిత పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  తన మెడలో తాళి కట్టకపోతే కుటుంబ సభ్యులకు ప్రాణహాని తలపెడతానని కార్తీక్‌కి మోనిత వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్నట్టుగా కార్తీక్ తమ్ముడు ఆదిత్యకు యాక్సిడెంట్ చేయిస్తుంది. మరోవైపు కార్తీక్‌కి కడుపునొప్పి వచ్చేలా చేసి ఆస్పత్రికి రప్పించుకుని డాక్టర్ టీనా పేరుతో మారువేషంలో అతడిని చూసి వెళుతోంది. మాట్లాడుతోంది. కట్టుకున్న భార్యకు తన పరిస్థితి చెప్పుకోలేక కార్తీక్ తనలో తాను ఆందోళ‌న ప‌డుతున్నాడు. మరోవైపు ఏసీపీ రోహిణితో 'మూగమ్మాయిగా టీ తీసుకొచ్చినది మోనిత' అని దీప చెప్పడంతో ఆ కోణంలో ఏసీపీ దర్యాప్తు మొదలుపెడుతుంది. ఇదీ జరిగిన కథ. మరి, ఈ రోజు ఏం జరిగింది? అనే విషయంలోకి వెళితే... కార్తీక్‌కి మోనిత టీ ఇచ్చిన రోజు సీసీ టీవీ ఫుటేజ్ కోసం ఏసీపీ రోహిణి వెతుకుతుంది. రత్నసీతతో "సీసీ టీవీ ఫుటేజ్ కనిపించడం లేదంటే దీప చెప్పినది నిజమేనా? మన స్టేషన్ లో ఎవరైనా మోనితకు హెల్ప్ చేస్తున్నారా?" అని అంటుంది. దాంతో రత్నసీతకు భయం మొదలైంది. మోనిత దగ్గరకు వెళ్లి రోహిణి మేడమ్‌కి డౌట్ వచ్చిందని, లొంగిపోమని చెబుతుంది. కానీ, మోనిత మాట వినదు. పైగా, 'కార్తీక్ తాళి కట్టిన తర్వాత లొంగిపోతా. నీకు నీ భర్త ఎంత ముఖ్యమో... నాకు కాబోయే భర్త అంతే ముఖ్యం' అని అంటుంది. మరోవైపు మోనితను పట్టుకోవాలని ఎటువంటి సాహసాలు చేయవద్దని దీపతో కార్తీక్ చెబుతాడు. రోహిణి బయటకు వెళుతూ... స్టేషన్ కి ఎవరు వచ్చి వెళుతున్నారో చూడమని పోలీసుకు చెబుతుంది.  'కార్తీక దీపం'లో తాజా పరిణామాలు చూస్తుంటే మోనిత చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టు ఉంది. అయితే, 'మోనిత మరణించలేదు. బతికి ఉంది' అనే నిజం పోలీసులకు ఆధారాలతో దొరకాలి. సీసీ టీవీ ఫుటేజ్ కోణం నుండి దర్యాప్తు చేసినా... ఆస్పత్రి దగ్గర నిఘా పెంచినా... మోనిత దొరకడం ఖాయం. మోనిత దీపకు దొరికినట్టు ప్రోమో విడుదల చేసి సీరియల్ మీద మరింత ఆసక్తి పెంచారు.    

అషురెడ్డితో ఇంట‌ర్వ్యూ.. పవన్‌ను లాగిన‌ వర్మ!

  రామ్ గోపాల్ వర్మకు పబ్లిసిటీ ఎలా చేసుకోవాలో బాగా తెలుసు. తాను తీసిన సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టులు, యూట్యూబ్ ఇంటర్వ్యూలను మార్కెట్ చేయడంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రిక్కులు, జిమ్మిక్కులు ప్లే చేస్తారు. ఇప్పుడు అషురెడ్డి ఇంటర్వ్యూ ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ ను ఫుల్లుగా వాడేసుకుంటున్నారు. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అంటే అషురెడ్డికి పిచ్చి. ఆయ‌న‌కు వీరాభిమాని. పవన్ పేరును ఒంటిపై టాటూ వేయించుకుంది. ఈ టాపిక్ పట్టుకున్నారు వర్మ. పవన్ కల్యాణ్ పుట్టినరోజున అషురెడ్డి ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ రోజు సాయంత్రం ఇంటర్వ్యూ రిలీజ్ చేయనున్న సందర్భంగా మరోసారి పవన్‌ను మధ్యలోకి లాగారు.  "సత్యహరిచంద్రుడు, లార్డ్ బాలాజీ మీద ఒట్టు... అషురెడ్డి ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ టాపిక్ లేదు" అని వర్మ ట్వీట్ చేశారు. ఓట్లు వేసిన తర్వాత తీసి గట్టు మీద పెట్టానని చెప్పడం... మాట మీద నిలబడకపోవడం వర్మకు అలవాటే. పవన్ టాపిక్ తో పాటు అషురెడ్డి థైస్ షో ఇంటర్వ్యూలో హైలైట్ కానుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోలో అషురెడ్డి థైస్ మీద వర్మ ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. 

ఫ‌స్ట్ వీక్ ఎలిమినేష‌న్‌లోకి వ‌చ్చిన‌ యాంక‌ర్ ర‌వి!

  'బిగ్‌ బాస్ 5' మొదలైంది. కర్టైన్ రైజర్ ఎపిసోడ్ తర్వాత తొలి రోజే హౌస్ హీట్ ఎక్కింది. ఎవరికి వారు యమునా తీరే అన్నట్టు... ఒకరితో ఒకరు సరిగా కలవడం లేదనే నెపంతో కొందరు మిగతా సభ్యులను ఎలిమినేట్ చేయాల్సిందిగా నామినేట్ చెయ్యడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసే అంశమే. ఈ సీజన్ ఎలా ఉండబోతుందనేది చెప్పడానికి ఫస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియ ఓ ఉదాహరణ అని చెప్పవచ్చు.  'బిగ్ బాస్' సీజన్ 5లో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్ కి సంబంధించి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. దీన్ని వెరైటీగా, కాస్త చెత్తగా డిజైన్ చేశారు. చెత్త కవర్స్ మీద సభ్యుల ఫొటోలను అతికించారు. ఎవరైనా సరే ఫలానా సభ్యుడిని నామినేట్ చేయాలంటే... అతడి ఫొటో ఉన్న చెత్త కవర్ తీసుకుని చెత్త కుండీలో వేయాలి. ఎందుకు అతడిని నామినేట్ చేస్తున్నారనేది కూడా చెప్పాలి. మిగతా సభ్యులతో సరిగా కలవడం లేదనే కారణంతో ఎక్కువమంది మిగతా సభ్యులను నామినేట్ చేశారు.  వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్ రౌండ్ లో సభ్యులందరూ మిగతా సభ్యుల చేత నామినేట్ చేయబడ్డారు. అయితే, ఎవరిని అయితే ముగ్గురు నామినేట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఎలిమినేషన్స్ లో ఉంటారని బిగ్ బాస్ కండిషన్ పెట్టడంతో చాలామంది సేవ్ అయ్యారు. ఆరుగురు మాత్రం బుక్ అయ్యారు. అందులో పాపులర్ ఫేస్ యాంకర్ రవి ఉండటం విశేషం.  యాంకర్ రవి, ఆర్జే కాజల్, యూట్యూబర్ సరయు, హీరోయిన్ హమీదా, యాక్టర్ మానస్ నాగులపల్లి, మోడల్ జెస్సీ ఫస్ట్ వీక్ నామినేట్ అయినా సభ్యుల్లో ఉన్నారు. ఈ ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.    

రష్మీ కాళ్ళు మొక్కిన సుధీర్!

  టీవీ ఆడియన్స్‌కు సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ అంటే లవ్ బర్డ్స్. అయితే, అప్పుడప్పుడూ రష్మీ వయసు మీద సుధీర్ పంచ్ డైలాగ్స్ వేస్తుంటాడు. సీనియర్ సిటిజన్ అని, రష్మీ వయసు మూడు పదహార్లు అని కామెడీ చేస్తుంటాడు. వయసులో పెద్దదని కాళ్ళు మొక్కాడో, లేదో సరదాగా ఆమె ఆశీర్వాదం తీసుకున్నాడో... వినాయక చవితి రోజున టెలికాస్ట్ కానున్న 'ఎక్స్ట్రా జబర్దస్త్' ఎపిసోడ్ లో రష్మీ కాళ్ళకు సుధీర్ మొక్కాడు.  ప్రతి శుక్రవారం 'ఎక్స్ట్రా జబర్దస్త్' షో టెలికాస్ట్ అవుతుంది. ఈ శుక్రవారం వినాయక చవితి రావడంతో జబర్దస్త్ స్టేజి మీద గణేషుడి విగ్రహాన్ని పెట్టారు. అందరూ పూజ చేశారు. అక్కడ రష్మీ కాళ్ళు సుధీర్ మొక్కడం ప్రోమోలో చూపించారు. వినోదం పంచడంతో పాటు అందరూ ధూమ్ ధామ్ గా స్టేజి మీద చిందులు వేసినట్టు ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. మరోసారి రికార్డింగ్ డ్యాన్స్ థీమ్ తో సుధీర్ టీమ్ ఫుల్ కామెడీ చేయడానికి సిద్ధమైంది.  రాకింగ్ రాకేష్ అయితే ఇప్పట్లో కిస్ కాన్సెప్ట్ స్కిట్లు వదిలేలా కనిపించడం లేదు. ఒకసారి రోహిణికి ముద్దు పెట్టడం డిస్కషన్ పాయింట్ అయితే... తర్వాత దాని మీద వీడియో చేశాడు. ఈసారి టీమ్ లో జంటల చేత ముద్దులు పెట్టించాడు. ముద్దుల చుట్టూ ఇంకెన్ని స్కిట్లు అల్లుతాడో? 

బిగ్ బాస్ 5 కంటెస్టెంట్‌.. అంద‌మైన క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప్రియ ప్రొఫైల్ ఇదే!

  బిగ్ బాస్ 5 సీజ‌న్ ఆదివారం రాత్రి గ్రాండ్‌గా మొద‌లైంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ సీజ‌న్‌లో హౌస్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట‌ర‌వ‌డం విశేషం. వారిలో ఎక్కువ‌మంది సినీ, టీవీ తార‌లు ఉన్నారు. ఏడో కంటెస్టెంట్‌గా న‌టి ప్రియ ఎంట్రీ ఇచ్చారు. ఒక‌వైపు సినిమాల్లో, మ‌రోవైపు టీవీ సీరియ‌ళ్ల‌లో న‌టిస్తూ, అంద‌మైన తార‌గా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రియ‌. ఇటీవ‌ల 'ఉప్పెన' మూవీలో విజ‌య్ సేతుప‌తి భార్య‌గా, హీరోయిన్ కృతి శెట్టి త‌ల్లిగా ఆమె క‌నిపించారు. ప్రియ పూర్తిపేరు మామిళ్ల శైలజాప్రియ‌. గుంటూరు జిల్లా బాప‌ట్ల‌లో పుట్టి పెరిగిన ఆమె సినిమాల మీద మోజుతో 19 సంవ‌త్స‌రాల వ‌య‌సులో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేసిన 'మాస్ట‌ర్', 'అన్న‌య్య' సినిమాల్లో న‌టించ‌డం ద్వారా ద‌ర్శ‌క నిర్మాత‌ల దృష్టిలో పడ్డారు. ముఖ్యంగా అన్న‌య్య సినిమాలో హీరోయిన్ సౌంద‌ర్య ఫ్రెండ్‌గా ఆక‌ట్టుకున్నారు. ఆ త‌ర్వాత సౌంద‌ర్య‌తో క‌లిసి ప‌లు సినిమాల్లో న‌టించారు ప్రియ‌. చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేశ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి స్టార్స్‌తో పాటు హిందీలో అమితాబ్ బ‌చ్చ‌న్‌తోనూ ఆమె న‌టించారు.  టీవీ తెర‌పైనా రాణించారు ప్రియ‌. 'ప్రియ‌స‌ఖి' సీరియ‌ల్‌తో ఉత్త‌మ‌న‌టిగా నంది అవార్డును అందుకున్నారు. వాణి రాణి, నందిని వ‌ర్సెస్ నందిని, చిన్న కోడ‌లు, నంబ‌ర్‌వ‌న్ కోడ‌లు లాంటి సీరియ‌ల్స్‌లో ప్ర‌ధాన పాత్ర‌లు చేశారు. ఇటు వెండితెర‌, అటు బుల్లితెర‌పై అంద‌మైన క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న ప్రియ.. ఇప్పుడు త‌న‌ను తాను స‌రికొత్త‌గా ఆవిష్క‌రించుకోవ‌డానికి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట‌ర‌య్యింది. ఆమె అస‌లు వ్య‌క్తిత్వం ఏమిట‌నేది బిగ్ బాస్ షో ద్వారా మ‌నంద‌రికీ తెలియ‌నుంది.

బిగ్ బాస్ 5 స్టార్ట‌యింది.. ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు!

  బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న 5వ సీజ‌న్ ఈరోజు (సెప్టెంబ‌ర్ 5) మొద‌లైంది. ఈ టాప్ రియాలిటీ గేమ్ షో స్టార్ మా చాన‌ల్‌లో సాయంత్రం 6 గంట‌ల‌కు తండ్రి అక్కినేని నాగేశ్వ‌ర‌రావు సూప‌ర్ హిట్ సాంగ్ 'ఒక లైలా కోసం' సాంగ్‌ను హోస్ట్ కింగ్ నాగార్జున‌ ప‌ర్ఫామ్ చేయ‌డంతో సూప‌ర్‌గా స్టార్ట‌యింది. ఆ త‌ర్వాత ఆడియెన్స్‌కు బిగ్ బాస్ హౌస్ లోప‌ల ఎలా ఉందో ప‌రిచ‌యం చేశారు నాగ్‌. డైనింగ్ హాల్‌, వాష్‌రూమ్‌, లివింగ్ రూమ్‌, బెడ్‌రూమ్‌, కిచెన్‌, మోజ్ అనే ఫ‌న్ రూమ్ లాంటివి అందులో ఉన్నాయి. ఈసారి హౌస్‌లోకి అత్య‌ధికంగా 19 మంది కంటెస్టెంట్లు వ‌చ్చారు. ఫ‌స్ట్ కంటెస్టెంట్‌గా యాంక‌ర్‌, న‌టి సిరి హ‌న్మంత్ హౌస్‌లోకి అడుగుపెట్ట‌గా, ఆ త‌ర్వాత వ‌రుస‌గా టీవీ యాక్ట‌ర్ స‌న్నీ, ల‌హ‌రి ష‌హ్రీ, ఇండియ‌న్ ఐడ‌ల్ విన్న‌ర్ శ్రీ‌రామ‌చంద్ర‌, కొరియోగ్రాఫ‌ర్ ఆనీ మాస్ట‌ర్‌, యాక్ట‌ర్ లోబో, సినీ-టీవీ న‌టి ప్రియ‌, మోడ‌ల్ జెస్సీ, ట్రాన్స్‌జెండ‌ర్ ప్రియాంకా సింగ్‌, పాపుల‌ర్ యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌, హ‌మీదా, డాన్స్ మాస్ట‌ర్ న‌ట‌రాజ్‌, టీవీ తార స‌ర‌యు రాయ్‌, యాక్ట‌ర్ విశ్వ, న‌టి ఉమాదేవి, యాక్ట‌ర్ మాన‌స్‌, ఆర్జే కాజ‌ల్‌, న‌టి శ్వేతావ‌ర్మ‌, యాంక‌ర్ ర‌వి.. హౌస్‌లోకి వ‌చ్చారు. తాము బిగ్ బాస్ హౌస్‌లోకి ఎందుకు వ‌చ్చార‌న‌ది ప్ర‌తి కంటెస్టెంట్ వీడియో రూపంలో ప్ర‌జెంట్ చేశారు. న‌ట‌రాజ్ భార్య ఏడ‌వ నెల గ‌ర్భ‌వ‌తి ఉంద‌నే విష‌యం తెలిసిన‌ప్పుడు ఎమోష‌న‌ల్ ఎట్మాస్ఫియ‌ర్ ఏర్ప‌డింది. అలాంటి స్థితిలో బిగ్ బాస్ హౌస్‌లోకి రావ‌డానికి అత‌ను వెనుకాడినా భార్య మాత్రం అత‌డిని వెళ్ల‌మంటూ తానే ఎంక‌రేజ్ చేశాన‌ని తెలిపింది. అందంగా క‌నిపించే ప్రియ‌లో త‌నేమిటో నిరూపించుకోవాల‌నే ఫైర్ ఉంద‌నీ, త‌న‌లోని మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించ‌డానికి హౌస్‌లోకి వ‌చ్చింద‌నీ తెలిసింది. ఆనీ మాస్ట‌ర్ త‌న‌తో ఒక స్టెప్ వేయాల్సిందిగా నాగ్‌ను కోరితే, ఇప్పుడు కాదంటూ సున్నితంగా తిర‌స్క‌రించారు. ఉమాదేవి ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఎక్కువ‌గా క‌ష్టాల‌తో నిండివుంద‌ని విన్న‌ప్పుడు బాధ‌నిపించింది. కంటెస్టెంట్లు అంద‌రిలోకీ వ‌య‌సులో ఆమే పెద్ద‌ది. ఫ‌స్ట్ ఎపిసోడ్ అంతా కంటెస్టెంట్ల ప‌రిచ‌యంతోనే స‌రిపోయింది కాబట్టి, ఆడియెన్స్ ఎంజాయ్ చేయ‌డానికి పెద్ద‌గా ఏమీ లేక‌పోయింది. వాళ్ల‌కు సంబంధించిన ఏవీల‌లో చెప్పిన‌, చూపించిన విష‌యాలే కాస్త అల‌రించాయి, ఆక‌ట్టుకున్నాయి.

మ‌రోసారి న‌వీన‌కు రింగ్ తొడిగిన స‌త్య‌!

  టీవీ తార‌, నిర్మాత న‌వీన యాట‌, త‌న ఫ్యామిలీతో క‌లిసి ప్ర‌కృతి సౌంద‌ర్యానికి నిల‌య‌మైన సిక్కింలో క్వాలిటీ టైమ్‌ను ఎంజాయ్ చేస్తోంది. 'న‌వీన‌.. ది అల్టిమేట్ చాన‌ల్' పేరుతో స‌క్సెస్‌ఫుల్‌గా యూట్యూబ్ చాన‌ల్‌ను కూడా ఆమె ర‌న్ చేస్తోంది. ఇటీవ‌ల ఇండో-చైనా బోర్డ‌ర్ స‌మీపంలో ఉన్న సిక్కిం రాష్ట్రంలోని గ్యాంగ్‌ట‌క్‌, దాని ప‌రిస‌ర ప్రాంతాల్లో భ‌ర్త స‌త్య‌నారాయ‌ణ‌, ఇద్ద‌రు కుమారుల‌తో హాలిడే ట్రిప్‌కు వెళ్లింది న‌వీన‌.  ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా విరివిగా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. శీత‌ల ప్ర‌దేశ‌మైన గ్యాంగ్‌ట‌క్‌లోనూ అదే ప‌రిస్థితి. చ‌ల్ల‌టి ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో మ‌రోసారి త‌న భార్య‌కు మోకాళ్ల మీద కూర్చొని ప్ర‌పోజ్ చేశాడు స‌త్య‌. అంతేకాదు, ఆమె చేతివేలికి ఉంగ‌రం తొడిగి, ఆ చేతిని ప్రేమ‌గా ముద్దుపెట్టుకున్నాడు. ఆ త‌ర్వాత లేచి నిల్చున్న అత‌ని నుదుటి మీద త‌ను కూడా ప్రేమ‌తో ముద్దుపెట్టింది న‌వీన‌. అంతే! స‌త్య కూడా గ‌ట్టిగా ఆమె బుగ్గ‌ను చుంబించాడు. మెరూన్ క‌ల‌ర్ గౌన్‌లో న‌వీన గార్జియ‌స్‌గా మెరిసిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేసిందామె. 2003లో టీవీరంగంలోకి యాంక‌ర్‌గా అడుగుపెట్టిన న‌వీన‌, త‌ర్వాత న‌టిగా మారి ప‌లు సీరియ‌ల్స్‌లో న‌టించింది. ఆ త‌ర్వాత భ‌ర్త స‌త్య‌తో క‌లిసి యాట మూవీ ఫెస్టివ‌ల్ అనే ప్రొడ‌క్ష‌న్ హౌస్ స్టార్ట్ చేసి 'క‌ల‌వారి కోడ‌ళ్లు', 'పెళ్లినాటి ప్ర‌మాణాలు' లాంటి సీరియ‌ల్స్ నిర్మించింది. వాటిలో త‌నూ న‌టించింది. ఆర్కా మీడియా వ‌ర్క్స్ టీవీ వింగ్‌కు లైన్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేసిన ఆమె ప్ర‌స్తుతం త‌న యూట్యూబ్ చాన‌ల్‌లో ర‌క‌ర‌కాల కాన్సెప్టుల‌తో రూపొందించిన వీడియోల‌ను పోస్ట్ చేస్తూ వ్యూయ‌ర్స్‌ను ఆక‌ట్టుకుంటోంది.

మూడో కాన్పుకు అన‌సూయ రెడీ?!

  అనసూయ మరోసారి ప్రెగ్నెంట్‌ కానుందా? మూడో బిడ్డకు జన్మనివ్వనుందా? నెక్ట్స్‌ వీక్‌ టెలికాస్ట్‌ కాబోయే ‘జబర్దస్త్‌’ ప్రోమో చూస్తే... ఇటువంటి సందేహాలు కలగడం సహజమే! ‘అదిరే’ అభి మాటకు మాటగా... స్పాంటేనియస్‌గా, సరదాగా అనసూయ చెప్పిందేమో! అయితే, ఆమె మాటలే హైలైట్‌ అయ్యాయి. ‘టైమ్‌కు అన్నం తిను. పులుపు తినాలని అనిపిస్తే... నేను మామిడిపళ్లు అవీ పంపిస్తా’ – అనసూయతో అభి అన్న మాటలివీ. వెంటనే ఏమాత్రం తడుముకోకుండా ‘టైముంది దానికి’ అని అనసూయ చెప్పింది. ప్రెగ్నెంట్‌ లేడీస్‌కి పులుపు తినాలని అనిపిస్తుంది. ఆ ఉద్దేశంతో అభి అన్నట్టు అక్కడ సీన్‌ కనిపించింది. దానికి తోడు అభి స్కిట్‌లో ఫీమేల్‌ ఆర్టిస్ట్‌ ‘ఏంటి అన్ని జాగ్రత్తలు చెబుతున్నారు?’ అంటే... ‘తొమ్మిదో నెల కదే’ అన్నాడు.  ‘అనసూయకు మళ్లీ తొమ్మిదో నెలా?’ అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అప్పుడు అసలు విషయం బయటపెట్టారు. ‘నాకు కాదు... అందరికీ తొమ్మిదో నెలే ఇది’ అని అనసూయ అన్నది.  అయితే... ముందు ‘పులుపు తినడానికి టైముంది’ అని అనసూయ అనడంతో మళ్లీ గర్భం దాల్చడానికి, మరో బిడ్డకు జన్మనివ్వడానికి ఆమె సిద్ధంగా ఉందని పలువురు భావిస్తున్నారు. ఆల్రెడీ భరద్వాజ్, అనసూయ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే.  నెక్ట్స్‌ వీక్‌ ‘జబర్దస్త్‌’లో స్పెషాలిటీ ఏంటంటే... కొన్ని రోజులుగా షోకి దూరమైన ‘రైజింగ్‌’ రాజు, మళ్లీ ‘హైపర్‌’ ఆదితో కలిసి ఎంట్రీ ఇచ్చారు. వీళ్లతో పాటు ప్రోమోలో ‘జయం’ స్పూఫ్‌తో ‘చలాకీ’ చంటి టీమ్‌ సందడి చేసింది.