కార్తీక్‌ను నిలదీసిన పిల్లలు... ఆగ్రహించిన దీప!

  ‘మీ డాడీ మోనితను చీట్‌ చేశారట’ అని స్కూల్‌లో ఫ్రెండ్‌ షైనీ చెప్పిన దగ్గర్నుంచి కార్తీక్‌తో అతని పిల్లలు ఇద్దరూ మాట్లాడటం మానేసిన సంగతి తెలిసిందే. నాయనమ్మ సౌందర్య పలకరించినా ముభావంగా ఉన్నారు. దాంతో దీప రంగంలోకి దిగింది. భర్త బాధను చూడలేక, ఆయన ముందే పిల్లలు ఇద్దర్నీ నిలబెట్టింది. అప్పుడు కార్తీక్‌ను మోనిత విషయ‌మై పిల్లలు నిలదీశారు. దాంతో దీప ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం మీద ఈ రోజు (సెప్టెంబర్‌ 27) ‘కార్తీక దీపం’ ఎపిసోడ్‌లో పిల్లలు కొంత శాంతించినట్టు కనిపించినా... భవిష్యత్తులో మోనిత గర్భం గురించి తెలిస్తే మరో బాంబు పేల్చే అవకాశం లేకపోలేదు. అసలు, ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే... మేడతో మీద ఉన్న దీపకు హిమ కంటపడుతుంది. అమ్మాయి కన్నీళ్లు తుడుతూ ‘ఏమైంది?’ అని అడిగుతుంది. హిమ మాత్రం ఏమీ చెప్పకుండా వెళుతుంది. మరోవైపు భర్త కార్తీక్‌ ‘ఈ ప్రపంచం ఏమైనా అనుకోని దీపా! కానీ, నా పిల్లలు నన్ను అపార్థం చేసుకుంటే తట్టుకోలేను’ అంటాడు. పిల్లల దగ్గర ఎవరో ఏదో చెత్త వాగి ఉంటారని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోడు. దాంతో నిజం చెప్పేద్దామని దీప అంటుంది. కానీ, ఒప్పుకోడు. అయితే, కొంచెం కూల్‌ అయ్యాక పిల్లలు ఇద్దర్నీ కార్తీక్‌ దగ్గరకు తీసుకొస్తుంది. ‘ఏంటీ మౌనం? ఏమైనా అడగాలంటే మీ డాడీని అడగండి. ఎదురుగా ఉన్నారుగా’ అని దీప కాస్త గట్టిగా చెబుతుంది. కాసేపు మౌనంగా ఉన్న పిల్లలు ఆ తర్వాత షైనీ చెప్పిన విషయాలు చెబుతారు. తండ్రిని నిలదీస్తారు. ‘మీ గురించి, మోనిత ఆంటీ గురించి తప్పుగా మాట్లాడారు’ అని హిమ ఏడుస్తుంది. ‘మీ ఇద్దరి మధ్య ఇంకేదో ఉందని అంటున్నారు’ అని శౌర్య చెబుతుంది. ఏదో దాస్తున్నారని ఇద్దరూ ప్రశ్నిస్తారు. దాంతో ముందు సీరియస్‌ అయినా చివరకు వాళ్లకు దీప ఓ కథ చెబుతుంది. ‘నీ ఫ్రెండ్‌ పారిపోతే ఎవర్ని అడుగుతారు?’ అని దీప ప్రశ్నిస్తుంది. ‘నన్నే’ అని శౌర్య సమాధానం ఇస్తుంది. ‘నాన్న విషయంలో అదే జరిగింది’ అని చెబుతుంది. ‘ఇటువంటి విషయాల గురించి ప్రశ్నిస్తారా? మాట్లాడకుండా ఉంటారా?’ అని నిలదీస్తుంది. ఆ తర్వాత అందరూ ఎమోషనల్‌ అవుతారు. తర్వాత ఏం జరిగింది? అనేది నెక్ట్స్‌ ఎపిసోడ్‌లో చూడాలి.

బిగ్ బాస్ 5: లహరి ఎలిమినేష‌న్ అనూహ్యం!

  'బిగ్ బాస్'లో మూడో వారం ఎలిమినేషన్ ఆసక్తికరంగా కొనసాగింది. వీక్షకులు, విశ్లేషకుల ఊహలకు భిన్నమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.‌ హౌస్ నుండి అందగత్తే లహరి బయటకు వచ్చింది. ఆమె ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించారు. లహరితో పాటు సింగర్ శ్రీరామ్, యాక్టర్ మానస్, ఫిమేల్ ఆర్టిస్ట్ ప్రియా, ప్రియాంక సింగ్ మూడో వారం నామినేషన్లలో ఉన్నారు. ప్రియాంక సింగ్ లేదా ప్రియా... ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ ఊహించారు. బిగ్ బాస్ ఇంటిలో సభ్యులు సైతం అదే అనుకున్నారు. అయితే అనూహ్యంగా లహరి ఎలిమినేట్ అయింది. శనివారమే శ్రీరామ్, ప్రియాంక సింగ్ సేఫ్ జోన్ లో ఉన్నట్టు నాగార్జున తెలిపారు.‌ మిగతా ముగ్గురిలో ప్రియా బయటకు రావచ్చునని అనుకుంటే... లహరి వచ్చింది. ఆమె అందానికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆట పరంగానూ లహరి ఆకట్టుకున్నారు. ఓటింగ్ లో మిగతా వాళ్ళ కంటే వెనుక పడడంతో ఎలిమినేట్ కాక తప్పలేదు. లహరి, ప్రియా, రవి మధ్య మూడవ వారం జరిగిన గేమ్ చూస్తే... కొన్ని రోజుల తర్వాత వైల్డ్ కార్డు ద్వారా లహరి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు.

ఆధ్యాత్మిక యాత్రలో అందగత్తె మోనాల్!

'బిగ్ బాస్ 4'కు వెళ్ళడానికి ముందు, వెళ్లొచ్చిన తర్వాత ప్రేక్షకుల ముందుకు అందాల ఆడబొమ్మగా మోనాల్ గజ్జర్ కనిపించింది. షోలో కూడా గ్లామర్ ఒలకబోసింది. షో తర్వాత 'అల్లుడు అదుర్స్'లో ఐటమ్ సాంగ్ చేసింది. సినిమాల్లో మోడ్రన్ డ్రస్సుల్లో ఎంత గ్లామర్‌గా కనిపించినప్పటికీ... మోనాల్ పక్కా ట్రెడిషనల్ అమ్మాయి. ఆమెకు దైవభక్తి ఎక్కువ. ప్రస్తుతం మోనాల్ గజ్జర్ ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నది. ఢిల్లీలో అక్షరధామ్ కు వెళ్లిన ఈ అందగత్తె అక్కడ అభిషేకం చేయించుకుంది. స్వయంగా పూజలో పాల్గొంది. శనివారం హరిద్వార్, రిషికేష్ బయలు దేరింది. మరో రెండు మూడు రోజులు అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకున్నదట. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటే ఫ్లైట్ జర్నీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫ్లైట్ లేదంటే కారులో వెళతారు. కానీ, మోనాల్ గజ్జర్ ఢిల్లీ నుండి హరిద్వార్ ట్రైన్ కి వెళ్లడం విశేషం. రైల్వే స్టేషన్ నుండి హోటల్ వరకు కారులో వెళ్లారు.

కన్నతండ్రి కార్తీక్‌ను దోషిలా చూస్తున్న పిల్లలు! 

మోనిత జైలుకు వెళ్లిందన్న మాటే కానీ కార్తీక్ కుటుంబ సభ్యులకు ప్రశాంతత అనేది కరువైంది. ఏదో ఒక కొత్త సమస్య వచ్చి పడుతుండటంతో మనఃశాంతి అనేది లేకుండా పోతోంది. ఇప్పుడు కొత్తగా వచ్చి పడిన సమస్య... పిల్లలకు మోనిత విషయం తెలియడం! దాంతో 'కార్తీక దీపం' సీరియల్ మరింత భావోద్వేగభరితంగా మారింది. పిల్లల ఏడుస్తూ ఉండటం టీవీల ముందు సీరియల్ చూస్తున్న వీక్షకుల గుండెలు ద్రవించిపోతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.  ఫీజు కట్టడానికి పిల్లల్ని స్కూల్ దగ్గర కార్తీక్ దింపేసి వెళ్లిన సంగతి తెలిసిందే. స్కూల్ లో హిమ, శౌర్య దగ్గర తండ్రి కార్తీక్ అరెస్ట్ గురించి స్కూల్ మేట్ షైనీ ప్రస్తావిస్తుంది. తప్పంతా కార్తీక్‌దేనని, కార్తీక్-మోనిత మధ్య ఏదో ఉందని, మోనితను కార్తీక్ చీట్ చేశాడని షైనీ అనడంతో పిల్లలు ఇద్దరికీ కోపం వస్తుంది. ఆ తర్వాత ఏడుపు వస్తుంది. వాళ్ళను పికప్ చేసుకోవడానికి వెళ్లిన కార్తీక్ తో ముభావంగా ఉంటారు.  ఇంటికి వచ్చిన తర్వాత కూడా షైనీ చెప్పిన మాటల గురించి కార్తీక్ పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు. 'స్కూల్ కి వెళ్ళినప్పుడు పిల్లలు బాగానే ఉన్నారు. వచ్చేటప్పుడు మాట్లాడలేదు' అని దీప వ్రతం కోసం పువ్వులు గుచ్చుతున్న తల్లి సౌందర్యతో కార్తీక్ తన బాధను పంచుకుంటాడు. పిల్లలు తనను దోషిలా చూస్తున్నారని చెబుతాడు. దీనిబదులు కోర్టులో తనకు శిక్ష పడితే బాగుండేదని ఆవేదన చెబుతాడు. సరిగ్గా అప్పుడే అటు వెళ్తున్న శౌర్యను సౌందర్య పిలిచినా పట్టించుకోకుండా వెళ్తుంది. దాంతో ఏదో అయ్యిందని సౌందర్యతో అర్థమైంది. అది తెలుసుకునే పనిలో పడింది.

క్యాన్సర్ పేషెంట్‌కు 'బిగ్ బాస్' రెమ్యునరేషన్ డొనేషన్!

నోరు మంచిదయితే ఊరు మంచిది అవుతుందని పెద్దలు అంటుంటారు. 'బిగ్ బాస్'లో రెండో వారం ఎలిమినేట్ అయిన ఉమాదేవి, హౌస్‌లో నోరు పారేసుకున్నారని వీక్షకులు విమర్శించారు. ఎవరైతే తనకు విమర్శించారో... వాళ్ళ చేత ప్రశంసలు అందుకుంటున్నారామె! ఉమాదేవి చేసిన పనికి నెటిజన్లు ఆమెను పొగుడుతున్నారు. చాలామంచి పని చేసిందని చెబుతున్నారు. ఇంతకీ, ఆమె ఏం చేసిందంటే...  'బిగ్ బాస్' హౌస్‌లో రెండు వారాలు ఉమాదేవి ఉన్నారు. అందుకు రెమ్యునరేషన్ అందుకున్నారు. అందులో కొంత మొత్తాన్ని బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి చికిత్సకు సాయంగా అందజేశారు. దాంతో ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ ఉమాదేవి మనసు మంచిదని పొగుడుతున్నారు. షోలో వైల్డ్ కార్డ్ ద్వారా ఆమె మళ్ళీ ఎంట్రీ ఇస్తే బావుంటుందని కొందరు అంటుండటం విశేషం.  'బిగ్ బాస్'కు వెళ్ళడానికి ముందు ఉమాదేవి కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. సూపర్ హిట్ సీరియల్స్ లో కూడా నటించారు. అయితే, వాటి కంటే ఈ షోలో పార్టిసిపేట్ చెయ్యడం ద్వారా, ఆ తర్వాత డొనేషన్ ఇవ్వడం ద్వారా ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. 

పూర్ణ ముద్దులు.... లిప్ స్టిక్ ముద్రలు

హీరోయిన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పూర్ణకు ఓ అలవాటు ఉంది. జడ్జ్‌గా వ్యవహరిస్తున్న డాన్స్ రియాలిటీ షో 'ఢీ'లో ఎవరి పెర్ఫార్మన్స్ అయినా నచ్చితే వాళ్లకు ముద్దులు ఇవ్వడం, బుగ్గ కొరకడం అలవాటుగా చేసుకున్నారు. గతంలో కొంతమంది కంటెస్టెంట్లకు ముద్దులు ఇచ్చారు. ఒకసారి చైతన్య మాస్టర్ కు ముద్దు ఇస్తే ఈటీవీ వాళ్ళు సెన్సార్ కట్ చేశారు.  గతంలో పెట్టిన ముద్దులను పక్కన పెడితే... లేటెస్టుగా మొన్న బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో నైనికా పెర్ఫార్మన్స్ నచ్చడంతో ఆమెకు పూర్ణ ముద్దులు పెట్టింది. అయితే, దానికి ముందు గతంలో తానూ ముద్దులు పెట్టినప్పుడు కొంతమంది చేసిన కామెంట్స్ చూసి హార్ట్ అయ్యానని పూర్ణ చెప్పారు. 'ఢీ' షోలో ఉన్నవాళ్ళందరూ తనకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చిన్న పిల్లలు లాంటోళ్లని... తన తోబుట్టువులకు ఈ వయసు గల పిల్లలు ఉన్నారని ఆమె వెల్లడించారు. ముద్దులు పెట్టడాన్ని ఎవరు ఎలా తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని పూర్ణ స్పష్టం చేశారు. తనకు ఎటువంటి సమస్య లేదన్నారు.  నైనికాకు ముద్దులు పెట్టిన తర్వాత ఆమె బుగ్గపై పూర్ణ లిప్ స్టిక్ ముద్రలు స్పష్టంగా కనిపించాయి. ఆ విషయం ప్రదీప్ గమనించాడు. తెల్ల పౌడర్ మీద లిప్ స్టిక్ ముద్రలు ఎంతబాగా కనిపిస్తున్నాయో అని అతడు అనడంతో అందరూ నవ్వేశారు.

యాంకర్ రవికి నాగార్జున క్లాస్ పీకుతారా?

వీకెండ్ వచ్చేసింది. నేడు 'బిగ్ బాస్'కి కింగ్ అక్కినేని నాగార్జున వస్తారు. కంటెస్టెంట్లలో ఈ వారం ఎవరు ఏం చేసిందీ ఆధారాలతో సహా చూపిస్తారు. గొడవలు జరిగితే తప్పు ఎవరిది అనే విషయంలో కళ్ళకు కట్టునట్టు చూపిస్తారు. గత వారం సిరి హనుమంతు తన షర్టులో సన్నీ చెయ్యి పెట్టాడని గోల గోల చేసింది. చెయ్యి పెట్టింది సన్నీ కాదని నాగార్జున క్లియర్ కట్ విజువల్స్ చూపించారు.  'బిగ్ బాస్'లో ఈ వారం గొడవ విషయానికి వస్తే... నామినేషన్స్ ప్రక్రియలో లహరి వేరే మగాళ్లతో బిజీగా ఉంటుందని ప్రియా అన్నది. మిడ్ నైట్ రవిని హగ్ చేసుకోవడం చూశానని చెప్పింది. అప్పుడు ఆమె మీద లహరితో పాటు రవి కూడా ఫైర్ అయ్యాడు. కట్ చేస్తే... 'బిగ్ బాస్' నుండి బయకు వెళ్లిన తర్వాత లహరి యాంకరింగ్ కోసం ప్రయత్నిస్తోందని, అందుకనే తన పనులు చేస్తున్నదని, ఇక్కడ ఇంతమంది సింగిల్ మెన్ ఉండగా తన చుట్టూ తిరుగుతుండటంతో తాను చెప్పలేకపోతున్నాని ప్రియాతో రవి అన్నాడు. అదే విషయం లహరి ప్రియా చెప్పింది. వెంటనే రవి దగ్గరకు వెళ్లిన లహరి, నేరుగా క్వశ్చన్ చేసింది.  ప్రియా అన్నట్టుగా తాను ఏమీ అనలేదని రవి బుకాయించాడు. 'నువ్వు అన్నావ్ బ్రో' అని ప్రియా వెక్కి వెక్కి ఏడ్చింది. రవి మాట్లాడిన విషయాన్ని ఇంట్లో మిగతా కంటెస్టెంట్లకు నాగార్జున నేడు చూపించే అవకాశం ఉంది. అలాగే, రవికి క్లాస్ పీకుతారని టాక్. ఏం అవుతుందో చూడాలి.  

లాస్యకు సాయికుమార్ క్రీమ్ బిస్కెట్!

బుల్లితెర వీక్షకులను ప్రస్తుతం ఎంటర్టైన్ చేస్తున్న రియాలిటీ షోల్లో 'బిగ్ బాస్' సీజన్ ఫైవ్ ఒకటి. యాంకర్ రవి, యూట్యూబర్లు షణ్ముఖ్ జస్వంత్, సిరి హనుమంతు, సింగర్ శ్రీరామచంద్ర, యాక్టర్లు లహరి, హమీదా తదితరులు ఉన్నారు. 'బిగ్ బాస్ 4'లోనూ యాంకర్, సింగర్, యాక్టర్, న్యూస్ రీడర్ ఇలా అన్ని వర్గాల వాళ్లు ఉన్నారు. అందులో నలుగుర్ని 'వావ్' షోకి తీసుకొచ్చారు. యాంకర్ లాస్య మంజునాథ్, యాక్టర్ కమ్ సింగర్ అండ్ ర్యాపర్ నోయల్ సేన్, యూట్యూబర్ మెహబాబ్, న్యూస్ రీడర్ జోర్దార్ సుజాత నెక్స్ట్ వీక్ 'వావ్' షోలో సందడి చేయనున్నారు. నలుగురిలో లాస్య గతంలో ఒకసారి 'వావ్'కి వెళ్లారు.  "లాస్య... ఆల్రెడీ 'వావ్'కి వచ్చినట్టు ఉన్నావ్ కదా?" అని సాయికుమార్ అడిగితే... "ఎప్పుడో మూడేళ్ళ క్రితం సార్" అని  లాస్య చెప్పింది. "అప్పుడు అలాగే ఉన్నావ్. ఇప్పుడు అలాగే ఉన్నావ్. ఎప్పుడూ అలాగే ఉంటావ్ ఏమో! రాయచోటి... కడప... పవర్" అని సాయికుమార్ అనడంతో లాస్య చాలా హ్యాపీ ఫీల్ అయింది. అయితే, మైక్ లో 'క్రీమ్ బిస్కెట్' అని వాయిస్ రావడంతో 'కాదు కాదు' అంటూ లాస్య నవ్వేసింది. షోలో 'బిగ్ బాస్ 4' బ్యాచ్ ఎంత సందడి చేశారో వచ్చే వారం తెలుస్తుంది.

పిల్లలతో కార్తీక్ ఆటలు... జైల్లో మోనిత కలవరపాటు!

కార్తీక్‌ను తనను మర్చిపోయేలా దీప మాయ చేస్తుందేమోనని జైలుకు వెళ్లిన మోనిత కలవరపాటుకు గురి అవుతుంటే... ఇంట్లో హాయిగా కార్తీక్ పిల్లలతో ఆటలు ఆడుకుంటూ ఉన్నాడు. అతడిని చూసి తల్లితండ్రులు సంతోషిస్తున్నారు. కార్తీక్ భార్య దీప మాత్రం మోనిత తమ జోలికి రాకుండా ఉంటే చాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. ఉత్కంఠభరిత సన్నివేశాలు లేనప్పటికీ తర్వాత ఏం జరుగుతుందో? అని ఆసక్తి రేకెత్తించేలా 'కార్తీక దీపం' సీరియల్ సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ (సెప్టెంబర్ 23, 1152)లో ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే...  జైల్లో తన గది గోడల మీద 'నా కార్తీక్... నా కార్తీక్' అని రాసుకుని మోనిత మురిసిపోతూ ఉంటుంది. మరోపక్క కార్తీక్‌ను కలవనివ్వకుండా దీప మాయ చేస్తుందేమోనని కలపడుతుంటుంది. "అసలే దీప! మామూలు ఆడది కాదు. నన్ను మర్చిపోయేలా చేస్తుందా? 18 నెలలు నాకు తక్కువే. కానీ, కార్తీక్ ఫ్యామిలీకి ఎక్కువ టైమ్ కదా! అప్పుడు ఎలా? వాళ్లకు టైమ్  ఇస్తే ఏదైనా చేస్తారు. నేను అంత టైమ్ ఇవ్వనుగా. ఇస్తే మోనితను ఎలా అవుతాను?" అని చిటికెలు వేస్తూ ఆవేశంతో ఊగుతుంది. అక్కడితో ఆగలేదు.  దీపను గుర్తు చేసుకుంటూ, తన కళ్ల ముందు దీప లేకపోయినా వార్నింగ్ ఇస్తుంది. "దీపక్కా! మోనిత జైలుకు వెళ్ళింది. డాక్టర్ బాబును బుట్టలో వేసుకుందామనుకుంటున్నావా? మీ ఇద్దర్నీ కలవనిచ్చేది లేదు. మోనిత ఇక్కడ. కొంగు నోట్లో పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటానని కలలు కంటున్నావా? అలాగని అనుకున్నావా? నేను ఏడిపించే టైప్ కానీ ఏడ్చే టైప్ కాదమ్మా!. ఇక్కడ (జైల్లో) కూర్చుని అక్కడ (ఇంట్లో) ఉన్న నీకు చుక్కలు చూపిస్తా. నీ మీద ఒట్టు దీపక్కా. ప్రామిస్" అని మోనిత తనలో అపరిచితురాల్ని చూపిస్తుంది. కాసేపు ఏడుస్తూ, కాసేపు సైకోలా నవ్వుతూ, కాసేపు కోపంగా చూస్తూ వింతగా ప్రవర్తించింది.  మరోవైపు ఇంట్లో పిల్లలతో కార్తీక్ ఆడుకుంటూ ఉంటాడు. అది చూసి ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత పిల్లల స్కూల్ ఫీజ్ కట్టడానికి పిల్లలతో పాటు దీపను తీసుకుని బయలు దేరతాడు. అమెరికా వెళదామని అన్న కార్తీక్ ఫీజ్ కట్టడానికి బయలుదేరడంతో దీపకు ఏమీ అర్థం కాదు. ఎలాగైనా అమెరికా ప్రయాణం క్యాన్సిల్ కావాలని కోరుకుంటుంది. మరోవైపు మోనిత తమ జోలికి రాకుండా ఉంటే చాలని, అంతకు మించి ఏమీ వద్దని భగవంతుడిని ప్రార్థిస్తుంది. కట్ చేస్తే... జైల్లో సుకన్య అనే ఖైదీకి కడుపులో నొప్పి వస్తుంది. డాక్టర్లు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో జైలుకు ఖైదీగా వచ్చిన డాక్టర్ మోనితను ఓ పోలీస్ పిలుస్తారు. తర్వాత ఏం జరిగింది?స్కూల్ దగ్గర పిల్లల్ని, షాపింగ్ దగ్గర దీపను వదిలేసి కార్తీక్ ఏ పని మీద బయటకు వెళ్ళాడు? అనేది  రాబోయే ఎపిసోడ్స్ లో చూడాలి.

వారసుడి చేతికి ఎస్పీబీ వాడిన మైక్

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో ఈటీవీకి విడదీయరాని అనుబంధం ఉంది. ఆయనతో రెండు కార్యక్రమాలు... 'పాడుతా తీయగా', 'స్వరాభిషేకం' చేసింది ఈటీవీ. ఆ కార్యక్రమాల కోసం ఎస్పీబీ వాడిన మైక్‌ను, ఎస్పీబీ తనయుడు ఎస్పీ చరణ్‌కు అందజేశారు. సెప్టెంబర్ 25కు ఎస్పీబీ ఈ లోకాన్ని విడిచి వెళ్లి ఏడాది అవుతుంది. ఈ సందర్భంగా 'బాలుకు ప్రేమతో' పేరుతో ఈటీవీ ఈ కార్యక్రమం నిర్వహించింది. సెప్టెంబర్ 26న ప్రసారం కానుంది. అందులో చరణ్‌కు ఎస్పీబీ మైక్ అందజేశారు రామౌజీరావు. ఇదొక ఎమోషనల్ మూమెంట్ అని చెప్పవచ్చు. ఆ మైక్ చేతబట్టి చరణ్ కార్యక్రమంలో పాటలు పాడారు. 'బాలుకు ప్రేమతో' కార్యక్రమానికి సంగీత దర్శకులు కోటి, ఎంఎం కీరవాణి, మణిశర్మ, ఆర్పీ పట్నాయక్ సహా చిత్ర, సునీతతో పాటు పలువురు గాయనీ గాయకులు, జొన్నవిత్తుల, అనంత శ్రీరామ్ వంటి గేయ రచయితలు హాజరయ్యారు. బాలుతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరు అయ్యారు. 

రెచ్చిపోయిన విష్ణుప్రియ... డాన్స్ మాస్ అంతే!

  విష్ణుప్రియ మరోసారి రెచ్చిపోయింది. అందాలు ఒలకబోయడం, గ్లామర్ షో విషయంలో హీరోయిన్లకు... స్టార్ యాంకర్లు అనసూయ, రష్మీకి ఏమాత్రం తీసిపోనని అన్నట్టు మాస్ పెర్ఫార్మన్స్‌తో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో హుషారుగా డాన్స్ చేసింది. ఐటమ్ సాంగ్స్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా స్టెప్పులు వేసింది.  విష్ణుప్రియ ఈమధ్య గ్లామర్ షోతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మొన్నామధ్య సోషల్ మీడియాలో బికినీ ఫోటోలు పోస్ట్ చేసింది. 'ద బేకర్ అండ్ ద బ్యూటీ' వెబ్ సిరీస్ ప్రెస్‌మీట్‌కి క్లీవేజ్ కనిపించేలా డ్రస్ వేసుకుని వచ్చింది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కార్యక్రమంలో ఇంతకు ముందు ఓసారి అభితో కలిసి చేసిన పెర్ఫార్మన్స్‌లో నాభి అందాలు కనిపించేలా డాన్స్ చేసింది. ఇప్పుడు అంతకు మించి అనుకునేలా 'కుర్రాడు బాబోయ్' పాటకు డాన్స్ వేసింది.  విష్ణుప్రియ డాన్స్ ప్రోమోలో కాసేపు చూస్తేనే 'మాస్ అంతే' అనేలా ఉంది. ఫుల్ ఎపిసోడ్ రిలీజ్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. డాన్స్‌కు ఇంద్రజ జడ్జ్‌మెంట్ ఇవ్వబోతుంటే విష్ణుప్రియ ఎగ్జైట్ అయ్యింది. 'ఇంద్రజగారు... నమస్కారం. ఐ లవ్యూ వెరీ మచ్. మీరు అద్భుతమైన నటి. గొప్ప ప్రతిభ కల మనిషి' అని చెబుతూ వెళుతుంటే... 'అమ్మా! ఆవిడ మీకు జడ్జ్‌మెంట్ చెప్పాలి. నువ్వు ఆమెకు చెబుతున్నావ్' అని ఆది సెటైర్ వేశాడు. సండే టెలికాస్ట్ కానున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో హిమజతో కలిసి ఆది స్కిట్ చేశాడు. 

"యు ఆర్ మైన్.. అయామ్ యువర్స్".. శ్వేత‌తో ష‌న్ను!

  'బిగ్ బాస్'లో ప్రేమకథలకు, రొమాంటిక్ ముచ్చట్లకు కొదవ ఉండటం లేదు. రవి, లహరి మిడ్ నైట్ హగ్  ఇష్యూ ఇంట్లో సభ్యులను ఓ కుదుపు కుదిపింది. అది మరువకముందే మరో గొడవ మొదలయ్యేలా ఉంది. హీరోయిన్ శ్వేతా వర్మను యూట్యూబర్ షన్ను అలియాస్ షణ్ముఖ్ జస్వంత్ ప్రేమలో దింపే ప్రయత్నాలు చేస్తున్నాడు. అది స్కిట్ లో భాగమే! శ్వేతా వర్మను పడేసే క్రమంలో షన్ను నోరు జారాడు. దాంతో శ్వేతా వర్మ బాధపడింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నేటి ఎపిసోడ్ చూడాలి. షన్ను, శ్వేతా వర్మ మధ్య ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే... 'మనకు వచ్చే డీల్ లో లోబోకు హ్యాండ్ ఇచ్చి... మనిద్దరం చెక్కులతో చెక్ అవుట్ అయిపోతే మనీ అంతా మనకే' అని శ్వేతా వర్మ ముందు షన్ను ఓ ప్రతిపాదన పెడతాడు. 'మీకు 50, నాకు 50... 50-50పర్సెంట్' అని ఆమె అంటుంది. 'పెళ్లి చేసుకుందాం శ్వేతా! యు ఆర్ మైన్. అయామ్ యువర్స్' అని షన్ను అన్నాడు. అందుకు ఆమె సరే అంది.  ఆ తర్వాత 'ఐ లవ్యూ శ్వేతా' అని లోబో  ప్రపోజ్ చేస్తుంటే మెలికలు తిరిగింది. ఇది చూసిన షన్ను ఫైర్ అవుతాడు. "శాస్త్రిగారూ" అంటూ షన్ను వెనుక శ్వేతా వెళ్ళింది. అప్పుడు 'ఏమైనా అందాం అంటే ముఖం మీద పెయింట్ వేసి కొడుతుంది' అని గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేసేలా షన్ను సెటైర్ వేశాడు. అందుకు శ్వేతా వర్మ బాధపడింది. 'దట్ వాజ్ నాట్ ఫన్నీ' అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. షన్ను సారీ చెప్పాడు. తర్వాత ఏమవుతుందో చూడాలి. 

"నన్ను పెళ్లి చేసుకుంటావా?".. హ‌రికి అషు మ్యారేజ్ ప్ర‌పోజ‌ల్‌!

  అషురెడ్డి అంటే హరికి ఎంతో ప్రేమ. అందుకు గుర్తుగా గుండెలపై ఆమె పేరు ఎప్పటికీ చెరిగిపోకుండా ఉండేలా పచ్చబొట్టు కింద వేయించుకున్నాడు. మరి, అషురెడ్డి మనసులో ఏం ఉంది? హరి గురించి ఏం అనుకుంటుంది? అంటే... ఆమెకూ అతడంటే ఇష్టమే. 'కామెడీ స్టార్స్' సాక్షిగా అతడికి ప్రపోజ్ చేసింది. లవ్ ప్రపోజల్ కాదు... మ్యారేజ్ ప్రపోజల్. మరి, హరి ఏం చేస్తాడో? ఏం చెబుతాడో? సండే టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్‌లో చూడాలి.  'హరి గురించి నువ్వు చెప్పాలని అనుకుంటే... క్లియర్‌గా, స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా ఏం చెప్పాలని అనుకుంటున్నావ్?' అని అషురెడ్డిని యాంకర్ శ్రీముఖి అడిగింది. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ల ముందు హీరోలు మోకాళ్ళ మీద కూర్చుని ప్రపోజ్ చేస్తారు కదా. శ్రీముఖి ప్రశ్న తర్వాత అటువంటి సీన్ చోటు చేసుకుంది. అయితే, రివర్స్‌లో! హరి ముందు మోకాళ్ల మీద కూర్చున్న అషురెడ్డి 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని అడిగింది. ఆమె ప్రపోజల్ తర్వాత న్యాయనిర్ణేత స్థానంలో ఉన్న శ్రీదేవి విజయ్ కుమార్ 'నాకు చాలా ఎమోషనల్ గా ఉంది. యాక్చువల్లీ కంట్లో నీళ్లు వచ్చాయి' అని అన్నారు. ఆ తర్వాత సర్‌ప్రైజ్ అంటూ హరికి ఖరీదైన హైఎండ్ బైక్ ఒకటి బహుమతిగా ఇచ్చింది అషురెడ్డి. తన తల్లితండ్రులు వెయ్యి రూపాయల దుస్తులు కొనిపెట్టారు తప్ప ఇంత ఖరీదైన బహుమతి ఇవ్వలేదని హరి ఎమోషనల్ అయ్యాడు. అషురెడ్డిని హగ్ చేసుకున్నాడు.  హరి, అషురెడ్డి లవ్ ట్రాక్ 'కామెడీ స్టార్స్'కు అట్రాక్షన్ గా నిలుస్తోంది. అయితే, ఇదంతా షో కోసం చేస్తున్నదని... ఈటీవీలో సుధీర్-రష్మీ లవ్ ట్రాక్ తరహాలో చేయడానికి ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు జనాలు. స్కిట్ కోసం తప్ప నిజ జీవితంలో హరి, అషురెడ్డి మధ్య ఏమీ ఉండదని అంటున్నారు.  

'ఆలీతో స‌ర‌దాగా 250'లో మోహన్‌బాబు ఏం పేలుస్తారో?!

  ముక్కుసూటిగా మాట్లాడటం మంచు మోహన్‌బాబు నైజం. మనసులో ఉన్నది ఉన్నట్టుగా, ఎటువంటి డొంక తిరుగుడు లేకుండా సూటిగా మాట్లాడతారు. క్యాజువల్‌గా సీరియస్ టాపిక్స్ గురించి ప్రశ్నలు వేయడం అలీకి అలవాటు. ఇప్పుడు మోహన్ బాబును అలీ ఏం అడుగుతారు? మోహన్ బాబు ఏం పేలుస్తారో? అని బుల్లితెర వీక్షకులతో పాటు పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. హాస్యనటుడిగా, కథానాయకుడిగా వెండితెరపై విజయవంతమైన అలీ... 'ఆలీతో సరదాగా' కార్యక్రమంతో బుల్లితెరపై తన ప్రత్యేకత చాటుకున్నారు. ఇప్పుడీ టాక్ షో 250వ ఎపిసోడ్‌ మైలురాయికి చేరుకుంది. 250వ‌ ఎపిసోడ్‌కి మంచు మోహన్ బాబును అతిథిగా ఆహ్వానించారు. ఆయనతో చిత్రీకరణ కూడా పూర్తి చేశారు.  ఇటీవల 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విష్ణు మంచు వచ్చారు. 'మనోజ్‌కు, నీకు గొడవలు అంట' అని, 'మా' ఎన్నికల గురించి అలీ ప్రశ్నించారు. విష్ణు చాలా అంశాల గురించి ఓపెన్ గా మాట్లాడారు. అలాగే, మంచు కుటుంబ విషయాలూ డిస్కస్ చేశారు. 'మా' ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఈ టాక్ షోలో మోహన్ బాబు ఆ విషయాలు ఏమైనా మాట్లాడతారా? పరిశ్రమలో సమస్యలను ప్రస్తావిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. 

అభయ్‌ది నా పోలిక... భార్గవ్‌ది ప్రణతి పోలిక!

  మెగాస్టార్ చిరంజీవిని ఆయన మనవరాలు కొట్టింది. అది కూడా కాస్త గట్టిగానే! దాంతో నొప్పి తగ్గడానికి మెగాస్టార్ ఐస్ బ్యాగ్ పెట్టుకున్నారు. 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివ ఈ సంగతి చెప్పుకొచ్చారు. మనవరాలు కొట్టిన విషయాన్ని చిరంజీవి తనతో చెప్పారన్నారు. అసలు, చిరంజీవి టాపిక్ ఎందుకు వచ్చిందంటే...  ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు'కు దర్శకులు రాజమౌళి, కొరటాల శివ అతిథులుగా వచ్చిన సంగతి తెలిసిందే. ముగ్గురి మధ్య కార్టూన్స్ డిస్కషన్ వచ్చింది. టామ్ అండ్ జెర్రీ కార్టూన్ అంటే తనకు ఇష్టమని కొరటాల అన్నారు. రాజమౌళి, ఎన్టీఆర్ కూడా టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ ఇష్టం అని చెప్పారు. అప్పుడు ఈతరం పిల్లల అభిరుచి మారిందని, వ‌యొలెంట్ కార్టూన్స్ చూస్తున్నారని ఎన్టీఆర్, కొరటాల చెప్పుకొచ్చారు.  "మొన్న చిరంజీవిగారు చెబుతున్నారు. ఆయన సోఫాలో పడుకుంటే మనవరాలు వచ్చి గుద్దేసి వెళ్లిపోయిందట. ఆ పాప చూసే కార్టూన్స్ లో ఏదో క్యారెక్టర్ బాక్సింగ్ పంచ్ టైపులో కొడుతుందట" అని కొరటాల శివ పేర్కొన్నారు. వెంటనే తార‌క్ తనకూ అటువంటి అనుభవం ఎదురైందని అన్నారు. "మంచి నిద్రలో ఉన్నప్పుడు సడన్ గా వచ్చి కొట్టేసి వెళ్లిపోతాడు. ఎందుకు మూడ్ మారుతుందో తెలియదు" అని తార‌క్‌ అంటే...  "అభయ్ అయి ఉండడు. భార్గవే" అని కొరటాల అన్నారు. భార్గవ్ కొట్టి ఉంటాడని పరోక్షంగా చెప్పారు. అందుకు జూనియ‌ర్‌ ఎన్టీఆర్ "అభయ్ ఎప్పుడూ నా పోలిక. సౌమ్యుడు, బావుంటాడు. భార్గవ్‌కి ప్రణతి పోలిక కదా! కొంచెం ఇదిగా ఉంటాడు. అంతే కదా! అంతే కదా!!" అని దర్శకులు ఇద్దర్నీ ఒప్పించే ప్రయత్నం చేశారు. 

మ‌హేశ్ త‌ర్వాత.. తార‌క్ కోసం ప్రభాస్ కూడా!

  'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి యంగ్ టైగర్ జూనియ‌ర్‌ ఎన్టీఆర్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. తన పరిచయాలు అన్నిటినీ ఉపయోగించి ప్రముఖ హీరోలు, దర్శకులను షోకి రప్పిస్తున్నారు. కోటి రూపాయల కోసం ఆడే ఆటను రసవత్తరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో జూనియ‌ర్‌ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. మరో స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అందులో నటిస్తున్న సంగతి తెలిసిందే. తొలి ఎపిసోడ్ కోసం ఆయ‌న‌ను తార‌క్ కార్యక్రమానికి తీసుకొచ్చారు. హీరోలు ఇద్దరూ కలిసి చేసిన హంగామా బుల్లితెర వీక్షకులను ఎంటర్‌టైన్ చేసింది. ఆ తర్వాత దర్శకులలో తనకు సన్నిహితులైన రాజమౌళి, కొరటాల శివను కూడా షో కి తీసుకోవచ్చారు తార‌క్‌. ఆ ఎపిసోడ్ సోమ‌వారం టెలికాస్ట్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం తార‌క్‌ కోసం షో కి వచ్చారు. ఇప్ప‌టికే దానికి సంబంధించిన షూటింగ్ పూర్త‌యింది. మహేష్ ఎపిసోడ్ దసరాకి టెలికాస్ట్ కానుంది. లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే... బాహుబలి ప్రభాస్ కూడా 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమంలో సందడి చేస్తారట.‌ ఆయన్ను తీసుకురావడం కోసం గేమ్ షో నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తార‌క్‌కు ప్రభాస్ కూడా స‌న్నిహితుడే. మ‌రి ఆయ‌న‌ ఏమంటాడో చూడాలి మరి! 

ర‌వి, ల‌హ‌రి మిడ్‌నైట్ హ‌గ్‌ను హైలైట్ చేసిన ప్రియ‌.. మొద‌లైంది ర‌చ్చ‌!

  ఓ అమ్మాయి, ఓ అబ్బాయి కౌగిలించుకుంటే తేడాగా మాట్లాడే మనుషులు మనకు సమాజంలో కనిపిస్తారు. ఏవేవో నిందలు వేస్తారు. 'బిగ్ బాస్' హౌస్‌లోనూ అదే జరిగింది. యాంకర్ రవి, నటి లహరి షెహరి మీద ఆర్టిస్ట్ ప్రియ నింద వేసింది. దాంతో హౌస్‌లో ఒక్కసారి మాటల మంటలు చెలరేగాయి. మూడో వారం నామినేషన్స్ ప్రక్రియలో నిందాస్తుతి మొదలైంది. ఆర్టిస్ట్ ప్రియను లహరి నామినేట్ చేసింది. మన మధ్య ఎందుకు డిస్టెన్స్ వచ్చిందో తెలియడం లేదని, అందుకే నామినేట్ చేస్తున్నానని చెప్పింది. అందుకు ప్రియ "నువ్వు సేఫ్ గేమ్ ఆడకు. నువ్వు వేరే మగాళ్లతో బిజీగా ఉంటున్నావ్" అని ఘాటుగా స్పందించింది. అక్కడ మొదలైన గొడవ, తర్వాత కూడా కంటిన్యూ అయ్యింది.  తనను నామినేట్ చేసిన లహరిని ప్రియ నామినేట్ చేసింది. అప్పుడు ఎందుకు నామినేట్ చేసిందో చెబుతూ... ఆ తర్వాత "నువ్వు వాష్ రూమ్ దగ్గర మిడ్ నైట్ రవిని హగ్ చేసుకోవడం (కౌగిలించుకోవడం) నేను చూశా. బహుశా... అది ఫ్రెండ్లీ హగ్ కూడా కావచ్చు" అని అన్నది. దాంతో రవి, లహరి, సన్నీ ముగ్గురూ ప్రియపై విరుచుకుపడ్డారు.  "ఇక్కడ హగ్ చేసుకోకూడదనే రూల్ ఏమైనా ఉందా?" అని రవి ప్రశ్నిస్తే... "కౌగిలింతను తప్పుగా ప్రాజెక్ట్ చేస్తున్నారు" అని సన్నీ అన్నాడు. నిజం చెప్పాలంటే... ప్రియ అలా అనడానికి ముందు రవి, ఆమె కలిసి లహరి గురించి మాట్లాడుకున్నారు. కానీ, మిడ్ నైట్ హగ్ అనేసరికి లేనిపోని రూమర్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉండటంతో రవి, లహరి ఫైర్ అయ్యారు. ఈ కౌగిలింత రచ్చ ఎంతదూరం వెళుతుందో చూడాలి. ప్రియ మాటలపై సోషల్ మీడియాలోనూ నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి.  

ఈ లుక్‌ను బాలీవుడ్ హీరోయిన్లు కాపీ కొడుతున్నారంట‌!

  స్టార్ యాంకర్ అనసూయ త్వరలో బాలీవుడ్ స్క్రీన్ మీద సందడి చేయనుందా? ప్రస్తుతం ఆమె ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ చేచేస్తుందా? అనసూయ సోషల్ మీడియా పోస్ట్ చూస్తే ఇటువంటి సందేహాలు కలుగక మానదు.  ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్ట్ నుండి తన లుక్‌ను అనసూయ రివీల్ చేసింది. అయితే, అది సినిమానా? సీరియలా? వెబ్ సిరీసా? అనేది చెప్పలేదు. ప్రాజెక్ట్ టైటిల్, ఇతరత్రా వివరాలు సస్పెన్స్‌లో ఉంచింది. ఒక్కటి మాత్రం క్లారిటీగా చెప్పింది... తన లుక్‌ను బాలీవుడ్ జనాలు కాపీ కొడుతున్నారని! "గౌరీ నాయుడు (అనసూయ స్టయిలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్) మరో స్నేహితురాల్ని చూడండి. మిస్ సి! మేమిద్దరం కలిసి చేస్తున్న ప్రాజెక్టుల్లో ఒక పాత్ర ఆమె. అంతకు మించి ఏమీ చెప్పలేను. ఈ లుక్‌ను కాపీ చేయడానికి చాలామంది తారలు ప్రయత్నిస్తున్నారు. మా సెట్స్ నుండి బాలీవుడ్ కు తీసుకు వెళ్తున్నారు. అవును... నిజమే! గౌరీ, నేను ఎంతో మనసుపెట్టి ఈ లుక్ క్రియేట్ చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నాం. మిస్ సి.. త్వరలో" అని అనసూయ పేర్కొంది. 

నా జీవితం చేజారింది, పారేసుకున్నా!.. కార్తీక్ ఆవేదన!!

  మోనిత జైలుకు వెళ్లినా... వెళ్లేముందు 'రీ-ఎంట్రీ ఇస్తా! బిడ్డతో వస్తా' అన్న మాటలే కార్తీక్‌కు గుర్తుకు వస్తాయి. అవి తలుచుకుని, మోనిత ఏం చేస్తుందోనని ఆలోచిస్తుంటాడు. దీనికి తోడు పిల్లలు ఎక్కడికైనా వెళదామని అడగంతో అవునని అంటాడు. మోనితకు భయపడి పిల్లలను తీసుకుని ఎక్కడికి వెళతాడు? అమెరికానా? విశాఖపట్టణమా? కార్తీక్ అండ్ ఫ్యామిలీ ఎక్కడికి వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది. 'కార్తీక దీపం' సీరియల్ ఇవాళ (సెప్టెంబర్ 21, 2021) 1550 ఎపిసోడ్‌లోకి ప్రవేశించింది. ఈ రోజు ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే... మోనిత మాటలను తలచుకుంటూ కార్తీక్ బాధ పడుతుంటే... అతడి దగ్గరకు భార్య దీప, తల్లితండ్రులు ఆనందరావు, సౌందర్య వెళతారు. 'నా జీవితం నా చేతుల్లోంచి చేజారిపోయింది. పారేసుకున్నాను' అని కార్తీక్ తన ఆవేదన, బాధను పంచుకుంటాడు. 'ఇప్పటికైనా దాని (మోనితను ఉద్దేశిస్తూ) పీడ విరగడైంది. దాన్ని మనసులోంచి తీసేయండి' అని భర్తకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది దీప. అయినా కార్తీక్ కుదుటపడడు. మనసులోంచి తీసేయడానికి... మర్చిపోయేంత చిన్న విషయం కాదని కార్తీక్ అంటాడు.  'అది జైలుకు ఒంటరి వెళ్లి ఉంటే... నువ్వు చెప్పినట్టు అన్నీ మర్చిపోయి హుషారుగా అందరితో కబుర్లు చెబుతూ ఆనందంగా గడిపేవాడిని. కడుపులో బిడ్డతో వెళ్ళింది. ఒక అణుబాంబును మోసుకువెళ్ళింది. ఆ బాంబు ఎప్పుడు పేలుతుందో? అదెంత బలమైందో? దానికి మనలో ఎంత మంది బలైపోతారో? ఊహించుకోవడానికి భయంగా ఉంది' అని కార్తీక్ అంటాడు. దాంతో దీపలో ఒక అంతర్మథనం మొదలవుతుంది. కార్తీక్ నుండి పక్కకు జరుగుతుంది. ఇటువంటి ఆలోచనలు ఆపమని, ప్రశాంతంగా ఉండమని కొడుక్కి సౌందర్య చెబుతుంది. మేడ మీద నుండి కిందకు వెళుతూ వెళుతూ కోడలితో 'ఏడుస్తూ కూర్చోక కిందకి  వాడిని తీసుకునిరా' అంటుంది. మరోవైపు మోనితకు తక్కువ శిక్ష పడిందని కార్తీక్ తమ్ముడు ఆదిత్య, మరదలు శ్రావ్య చర్చించుకుంటారు.  కార్తీక్‌తో పిల్లలు 'కొన్ని రోజులు ఎక్కడికైనా వెళదాం నాన్నా' అంటారు. అందుకు దీప ఒప్పుకోదు. 'నో' అంటుంది. కార్తీక్ మాత్రం సరేనంటాడు. 'ఎక్కడికి వెళదాం?' అని అడుగుతాడు. 'వైజాక్' అంటుంది సౌర్య. అక్కడికి వచ్చిన సౌందర్య ఎక్కడికి వెళ్లవద్దని, తన కళ్ళముందు ఉండమని అంటుంది. 'ఇప్పుడు ఇలా అంటున్నావ్ కానీ, అమెరికాకు వెళ్ళిపోతే ఏం చేస్తావ్?' అని సౌర్య ప్రశ్నిస్తుంది. 'అమెరికాకు వాళ్ళిద్దర్నీ పంపిస్తా కానీ మిమ్మల్ని పంపించను' అని సౌందర్య అనడంతో సౌర్య ఎమోషనల్ అవుతుంది. కొంత డిస్కషన్ జరిగాక 'సరదాగా అన్నాను' అని సౌందర్య సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది. 'సరదాగా అన్నా... అదే జరిగితే బావుంటుంది. ఆలోచించండి' అని ఆదిత్య అంటాడు. తమ్ముడి మాటలతో అదే సరైనదేమోనని కార్తీక్ ఆలోచనలో పడతాడు. మరి, ఫ్యామిలీ అంతటినీ ఎక్కడికైనా తీసుకువెళతాడా? లేదా? అన్నది రాబోయే రోజుల్లో చూడాలి.