ఈ లుక్‌ను బాలీవుడ్ హీరోయిన్లు కాపీ కొడుతున్నారంట‌!

  స్టార్ యాంకర్ అనసూయ త్వరలో బాలీవుడ్ స్క్రీన్ మీద సందడి చేయనుందా? ప్రస్తుతం ఆమె ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ చేచేస్తుందా? అనసూయ సోషల్ మీడియా పోస్ట్ చూస్తే ఇటువంటి సందేహాలు కలుగక మానదు.  ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్ట్ నుండి తన లుక్‌ను అనసూయ రివీల్ చేసింది. అయితే, అది సినిమానా? సీరియలా? వెబ్ సిరీసా? అనేది చెప్పలేదు. ప్రాజెక్ట్ టైటిల్, ఇతరత్రా వివరాలు సస్పెన్స్‌లో ఉంచింది. ఒక్కటి మాత్రం క్లారిటీగా చెప్పింది... తన లుక్‌ను బాలీవుడ్ జనాలు కాపీ కొడుతున్నారని! "గౌరీ నాయుడు (అనసూయ స్టయిలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్) మరో స్నేహితురాల్ని చూడండి. మిస్ సి! మేమిద్దరం కలిసి చేస్తున్న ప్రాజెక్టుల్లో ఒక పాత్ర ఆమె. అంతకు మించి ఏమీ చెప్పలేను. ఈ లుక్‌ను కాపీ చేయడానికి చాలామంది తారలు ప్రయత్నిస్తున్నారు. మా సెట్స్ నుండి బాలీవుడ్ కు తీసుకు వెళ్తున్నారు. అవును... నిజమే! గౌరీ, నేను ఎంతో మనసుపెట్టి ఈ లుక్ క్రియేట్ చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నాం. మిస్ సి.. త్వరలో" అని అనసూయ పేర్కొంది. 

నా జీవితం చేజారింది, పారేసుకున్నా!.. కార్తీక్ ఆవేదన!!

  మోనిత జైలుకు వెళ్లినా... వెళ్లేముందు 'రీ-ఎంట్రీ ఇస్తా! బిడ్డతో వస్తా' అన్న మాటలే కార్తీక్‌కు గుర్తుకు వస్తాయి. అవి తలుచుకుని, మోనిత ఏం చేస్తుందోనని ఆలోచిస్తుంటాడు. దీనికి తోడు పిల్లలు ఎక్కడికైనా వెళదామని అడగంతో అవునని అంటాడు. మోనితకు భయపడి పిల్లలను తీసుకుని ఎక్కడికి వెళతాడు? అమెరికానా? విశాఖపట్టణమా? కార్తీక్ అండ్ ఫ్యామిలీ ఎక్కడికి వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది. 'కార్తీక దీపం' సీరియల్ ఇవాళ (సెప్టెంబర్ 21, 2021) 1550 ఎపిసోడ్‌లోకి ప్రవేశించింది. ఈ రోజు ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే... మోనిత మాటలను తలచుకుంటూ కార్తీక్ బాధ పడుతుంటే... అతడి దగ్గరకు భార్య దీప, తల్లితండ్రులు ఆనందరావు, సౌందర్య వెళతారు. 'నా జీవితం నా చేతుల్లోంచి చేజారిపోయింది. పారేసుకున్నాను' అని కార్తీక్ తన ఆవేదన, బాధను పంచుకుంటాడు. 'ఇప్పటికైనా దాని (మోనితను ఉద్దేశిస్తూ) పీడ విరగడైంది. దాన్ని మనసులోంచి తీసేయండి' అని భర్తకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది దీప. అయినా కార్తీక్ కుదుటపడడు. మనసులోంచి తీసేయడానికి... మర్చిపోయేంత చిన్న విషయం కాదని కార్తీక్ అంటాడు.  'అది జైలుకు ఒంటరి వెళ్లి ఉంటే... నువ్వు చెప్పినట్టు అన్నీ మర్చిపోయి హుషారుగా అందరితో కబుర్లు చెబుతూ ఆనందంగా గడిపేవాడిని. కడుపులో బిడ్డతో వెళ్ళింది. ఒక అణుబాంబును మోసుకువెళ్ళింది. ఆ బాంబు ఎప్పుడు పేలుతుందో? అదెంత బలమైందో? దానికి మనలో ఎంత మంది బలైపోతారో? ఊహించుకోవడానికి భయంగా ఉంది' అని కార్తీక్ అంటాడు. దాంతో దీపలో ఒక అంతర్మథనం మొదలవుతుంది. కార్తీక్ నుండి పక్కకు జరుగుతుంది. ఇటువంటి ఆలోచనలు ఆపమని, ప్రశాంతంగా ఉండమని కొడుక్కి సౌందర్య చెబుతుంది. మేడ మీద నుండి కిందకు వెళుతూ వెళుతూ కోడలితో 'ఏడుస్తూ కూర్చోక కిందకి  వాడిని తీసుకునిరా' అంటుంది. మరోవైపు మోనితకు తక్కువ శిక్ష పడిందని కార్తీక్ తమ్ముడు ఆదిత్య, మరదలు శ్రావ్య చర్చించుకుంటారు.  కార్తీక్‌తో పిల్లలు 'కొన్ని రోజులు ఎక్కడికైనా వెళదాం నాన్నా' అంటారు. అందుకు దీప ఒప్పుకోదు. 'నో' అంటుంది. కార్తీక్ మాత్రం సరేనంటాడు. 'ఎక్కడికి వెళదాం?' అని అడుగుతాడు. 'వైజాక్' అంటుంది సౌర్య. అక్కడికి వచ్చిన సౌందర్య ఎక్కడికి వెళ్లవద్దని, తన కళ్ళముందు ఉండమని అంటుంది. 'ఇప్పుడు ఇలా అంటున్నావ్ కానీ, అమెరికాకు వెళ్ళిపోతే ఏం చేస్తావ్?' అని సౌర్య ప్రశ్నిస్తుంది. 'అమెరికాకు వాళ్ళిద్దర్నీ పంపిస్తా కానీ మిమ్మల్ని పంపించను' అని సౌందర్య అనడంతో సౌర్య ఎమోషనల్ అవుతుంది. కొంత డిస్కషన్ జరిగాక 'సరదాగా అన్నాను' అని సౌందర్య సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది. 'సరదాగా అన్నా... అదే జరిగితే బావుంటుంది. ఆలోచించండి' అని ఆదిత్య అంటాడు. తమ్ముడి మాటలతో అదే సరైనదేమోనని కార్తీక్ ఆలోచనలో పడతాడు. మరి, ఫ్యామిలీ అంతటినీ ఎక్కడికైనా తీసుకువెళతాడా? లేదా? అన్నది రాబోయే రోజుల్లో చూడాలి. 

వంటలక్క కంటే నాగ్‌, తారక్‌కు తక్కువే!

  సూపర్‌హిట్ సీరియల్ టీఆర్పీని బీట్ చేసే క్రమంలో... స్టార్ అట్రాక్షన్ లక్ష్యానికి కొంతదూరంలో నిలిచింది. వంటలక్కపై బుల్లితెర వీక్షకులకు ఉన్న అభిమానం ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న గేమ్ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు', కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో 'బిగ్ బాస్ 5'కు తక్కువ టీఆర్పీలు రావడం గమనార్హం. జెమినీ టీవీలో వస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌కు 11.4 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. దాని త‌ర్వాత‌ ఈ షో హైయ్యస్ట్ రేటింగ్ 11.37. అయితే, టీవీలో ఎన్టీఆర్ బెస్ట్ ఇదేనా? అంటే కాదు అని చెప్పాలి. ఎందుకంటే... ఆయన హోస్ట్ చేసిన 'బిగ్ బాస్ 3'కి 17.9 రేటింగ్ వచ్చింది. దాన్ని 'బిగ్ బాస్ 5'తో నాగార్జున బ్రేక్ చేశారు. 18 టీఆర్పీ రేటింగ్ సాధించారు. అయితే... ఎస్‌డి, హెచ్‌డి మినహాయిస్తే 15.66 మాత్రమే. టీఆర్పీ విషయంలో ఈ రెండు షోస్ కంటే 'కార్తీక దీపం' సీరియల్ ముందంజలో ఉంది.  జూన్ తొలి వారంలో 'కార్తీక దీపం'కు 19.10 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. దాన్ని ఎన్టీఆర్, నాగార్జున ఇద్దరూ బీట్ చెయ్యలేకపోయారు. దీన్నిబట్టి వంటలక్కకు ఎంతమంది అభిమానులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

సుధీర్‌కు పెళ్లి సంబంధాలు చూస్తున్న ఫ్యామిలీ.. మ‌రి ర‌ష్మి ప‌రిస్థితి?

  'సుడిగాలి' సుధీర్, రష్మీ గౌతమ్ జంట ఈటీవీకి టీఆర్పీ పంట పండిస్తోంది. వాళ్ళిద్దరి లవ్ స్టోరీ మీద ఎన్ని స్కిట్స్, డాన్స్ పెర్ఫార్మన్స్, ఈవెంట్స్ చేసినా వ్యూవర్షిప్ దక్కుతోంది. దాంతో 'మా చెల్లికి పెళ్లి చేయాలి మళ్ళీ మళ్ళీ' అన్నట్టు... 'సుధీర్-రష్మీ పెళ్లి లేదంటే లవ్ స్టోరీ మీద చేయాలి మళ్ళీ మళ్ళీ ఈవెంట్' అన్నట్టు వ్యవహారం తయారవుతోంది. గతంలో సుధీర్-రష్మీకి పెళ్లి చేస్తూ ఒక ఈవెంట్ చేశారు. రీసెంట్‌గా వినాయక చవితికి తొమ్మిదేళ్ల ప్రేమకు గుర్తుగా అంటూ రష్మీ చేత ఒక పెర్ఫార్మన్స్ చేయించారు. సుధీర్‌కి ఆమె చేత ప్రపోజ్ చేయించారు. 'మీ ఇద్దరి పెళ్లి ఎప్పుడు?' అని రోజా, ఇంద్రజ అడిగారు. అయితే, అదంతా టీవీ ప్రోగ్రామ్ కోసం చేసిందని 'గెటప్' శీను స్టేట్మెంట్ బట్టి అర్థమవుతోంది. సుధీర్, రష్మీ పెళ్లి చేసుకోరని అతడు కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు.  "సుధీర్, రష్మీ మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ తప్పితే... ఆఫ్-స్క్రీన్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఏమీ లేవు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోరు. ఇది నిజం. షూటింగ్ అయిపోయిన వెంటనే రష్మీది వేరే లోకం. ఆ లోకంలో ఉంటుంది. సుధీర్ కూడా అంతే! రియల్ లైఫ్‌లో వాళ్ళ మధ్య ఏమీ లేదు. వీలు కాదు కూడా! ఎందుకంటే... సుధీర్ కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు" అని 'గెటప్' శీను చెప్పాడు. దాంతో రష్మీ కాకుండా సుధీర్ ఎవరోనని టీవీ ఆడియన్స్ లో ఆసక్తి మొదలైంది. 

ఇది నా జీవితానికి క్లైమాక్స్ కాదు, ఇంటర్వెల్ మాత్రమే.. మోనిత కాన్ఫిడెన్స్‌!

  పరిణామాలు అన్నీ తన ఊహలకు వ్యతిరేకంగా జరుగుతున్నప్పటికీ... కార్తీక్ మీద మోనితకు ఉన్న మోజు చావలేదు. కార్తీక్ కుటుంబంలో తనకు స్థానం దక్కుతుందనే ఆశ పోలేదు. తన కడుపులో బిడ్డకు కార్తీక్ తండ్రి అని ఇప్పటికీ బలంగా వాదిస్తోంది. తనకు శిక్ష పడినప్పటికీ.. తనపై ఆత్మ విశ్వాసంతో, చిరునవ్వుతో కటకటాల్లోకి వెళ్లింది. 'కార్తీక దీపం' సీరియల్ ఈ రోజు (సెప్టెంబర్ 20, 2021) 1149 ఎపిసోడ్‌లోకి ఎంటరైంది. నేడు ఏం జరిగిందంటే... మోనితను కోర్టుకు లాకొచ్చి తన భర్త నిర్దోషి అని దీప (వంటలక్క) నిరూపించిన, జైలు నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత అందరూ ఊహించినట్టుగా టాపిక్ మోనిత కడుపులో బిడ్డ మీదకు వెళ్లింది. కోర్టులో 'మీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు?' అని లాయర్ ప్రశ్నించగా 'కార్తీక్' అని మోనిత చెబుతుంది. 'మీకు పెళ్లి కాకుండా ఆ బిడ్డ ఎలా వచ్చాడు?' అని లాయర్ అడగటంతో 'కృతిమ గర్భం దాల్చాను' అని చెబుతుంది. ఆ విషయం కార్తీక్‌కి తెలియదని, పెళ్లైన తర్వాత ఫస్ట్ నైట్ రోజున చెప్పాలని ఆగానని అంటుంది. కార్తీక్‌కి దీపతో పెళ్లి కాకముందే అతడిని తాను ప్రేమించానని, ఆమెతో పెళ్లైన తర్వాత కూడా తన ఇంటికి వచ్చి ప్రతిదీ తనతో చెప్పుకోవడం వల్ల ఈ సమాజం తనపై నిందలు వేసిందని, దాంతో తాను ఇల్లు మారాల్సి వచ్చిందని మోనిత చెబుతుంది. కార్తీక్ తనవాడు అనిపించుకోవడం కోసం మోనిత చేసిన కుట్ర తప్ప, అందులో ప్రేమ ఎక్కడుందని దీప అంటుంది. మోనిత తనకు స్నేహితురాలు అని, భార్యతో విడిపోయిన సందర్భంగా మమ్మల్ని కలపడానికి అమ్మ ప్రయత్నాలు చేస్తుంటే... వాటిని ఆపడానికి మోనితను పెళ్లి చేసుకుంటానని అన్నాను తప్ప... మోనితను ఏనాడూ వేరే ఉద్దేశంతో, ఆలోచనతో చూడలేదని కార్తీక్ చెబుతాడు. పెళ్ళికి అంగీకరించకపోతే తన తమ్ముడికి యాక్సిడెంట్ చేయించిందని, కృత్రిమ గర్భం దాల్చిందని మోనిత నేరాలు బయటపెడతాడు. ఆ సమయంలో 'మోనిత కడుపులో బిడ్డకు నేను తండ్రిని కాదు' అని కార్తీక్ అరుస్తుంటే... దీపకు గతం గుర్తుకు వస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో సీన్ వస్తుంది. మరోవైపు మోనిత "పదకొండేళ్ల క్రితం కట్టుకున్న భార్య కడుపులో బిడ్డకు తాను తండ్రి కాదని కార్తీక్ అన్నాడు. ఇప్పుడు నా కడుపులో బిడ్డకు తండ్రి కాదంటున్నాడు. అప్పుడు కాదనుకున్న భార్య ఇప్పుడు అతడి పక్కన ఉంది. ఏమో రేపు నన్ను కూడా ఆదరిస్తాడేమో. ఇంకా నాలో ఆశ చావలేదు. నా కడుపులో బిడ్డకు తండ్రి కార్తీక్" అని అంటుంది. ఇదంతా పక్కన పెడితే... కార్తీక్ వాదన కోర్టు నమ్ముతుంది. మోనితకు ఐదు లక్షల జరిమానాతో పాటు ఏడాదిన్నర కఠిన కారాగార శిక్ష విదిస్తుంది కోర్టు. హిమ హత్య విషయంలో విచారణ చేయమని ఆదేశిస్తుంది. మోనితను జైలుకు తీసుకువెళుతున్న సమయంలో మీడియా చుట్టుముడుతుంది. 'జైల్లో బిడ్డను కంటారా?' అని ప్రశ్నిస్తుంది. వికట హాసంతో 'సినిమాకు ఉన్నట్టే జీవితానికి మూడు భాగాలు ఉంటాయి. ఓపెనింగ్, ఇంటర్వెల్, క్లైమాక్స్. ఇది నా జీవితానికి క్లైమాక్స్ కాదు. ఇంటర్వెల్ మాత్రమే' అని మోనిత అంటుంది. 'క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది?' అని విలేకరి అడిగితే... 'ఎవరూ ఊహించి ఉండరు. చూస్తుండండి. అందరికీ తెలుస్తుంది' అని ఆన్సర్ ఇస్తుంది. ఆ తర్వాత దీపతో మాట్లాడాడతానని ఏసీపీ రోషిణిని అడిగితే ఆమె ఒప్పుకోదు.  "దీపక్కా! దీపక్కా... శ్రావ్య నీకు తోడబుట్టిన చెల్లెలు అయితే, కార్తీక్ మూలంగా నేనూ చెల్లెల్నే అవుతా! గుర్తుపెట్టుకో!!" అని మోనిత గట్టిగా అరుస్తుంది. కోపంగా దీప ముందుకు కదిలితే... సౌందర్య ఆపుతుంది. "దాన్ని నువ్వు కొడితే ఫొటోలు వైరలవుతాయి. అవసరమా? బురదలో రాయి వేయడం!" అని అంటుంది. అత్త మాటలకు దీప శాంతిస్తుంది. కానీ, మోనిత మాత్రం ఆగలేదు.  "ఆంటీ... సౌందర్య ఆంటీ! నా బిడ్డకు నామకరణం, బారసాల, అక్షరాభ్యాసం... అన్నీ మీ చేతుల మీదే జరగాలి. లేకపోతే నేను ఊరుకోను" అని మోనిత మళ్ళీ అరుస్తుంది. ఈసారి సౌందర్య కోపంగా కదిలితే దీప ఆపుతుంది. "నన్ను ఆపి మీరు ఉరుకుతారేంటి?" అని అడుగుతుంది. "దాని నమ్మకం చూశావా?" అంటుంది సౌందర్య.  అక్కడితోనూ మోనిత ఆగలేదు. ఈసారి కార్తీక్ తండ్రి ఆనందరావును పిలుస్తుంది. "ఆనందరావు అంకుల్! మీకు మనవడే పుడతాడు. మీకు అసలైన వారసుడొస్తాడు. వాడికి మీ పేరే పెడతా. 'ఆనందం' అని! మోనిత శకం ముగిసిపోలేదు. రీ-ఎంట్రీ ఇస్తా. గుర్తు పెట్టుకోండి... బిడ్డతో వస్తా! రీ-ఎంట్రీ పక్కా! ఐ లవ్యూ మై డియర్ ఫ్యామిలీ" అని మోనిత అరుస్తుంది. ఇదంతా కోపంగా కార్తీక్ చూస్తూ ఉంటాడు. తర్వాత ఏమైందనేది మిగతా ఎపిసోడ్స్ లో చూడాలి. 

దసరాకు బిగ్ సర్ప్రైజ్.. ఒకే ఫ్రేమ్ లో తారక్, మహేష్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో జెమిని టీవీలో ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. గతంలో 'బిగ్ బాస్'తో ఆకట్టుకున్న తారక్.. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతోనూ తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. అయితే ఈ షోపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జెమిని.. తారక్ హోస్ట్ చేస్తున్న ఈ షోకి రికార్డ్ స్థాయిలో రేటింగ్ తెప్పించాలన్న ఉద్దేశంతో తారక్ సన్నిహితులైన టాలీవుడ్ బడా సెలబ్రిటీలను రంగంలోకి దింపుతుంది. తారక్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకి ఫస్ట్ గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చారు. తారక్, చరణ్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాతో వీరి ఫ్రెండ్ షిప్ మరింత బలపడింది. దీంతో తారక్ షో కోసం చరణ్ ని రంగంలోకి దింపారు నిర్వాహకులు. ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక రీసెంట్ గా టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివలను రంగంలోకి దింపింది జెమిని. ఈ ఎపిసోడ్ సోమవారం టెలికాస్ట్ కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటుంది. ఇక దసరా స్పెషల్ ఎపిసోడ్ కోసం 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో నిర్వాహకులు సూపర్ స్టార్ మహేష్ బాబును తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం నాడు ఈ ఎపిసోడ్ షూట్ కూడా చేశారని సమాచారం. తారక్-మహేష్ కలిస్తే ఎపిసోడ్ రేటింగ్ ఏ స్థాయిలో దూసుకుపోతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఐపీఎల్, బిగ్ బాస్ షో, సీరియల్స్ ని తట్టుకొని మంచి రేటింగ్ సాధించాలంటే ఈ మాత్రం సెలబ్రిటీస్ ని రంగంలోకి దింపాలన్న ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది.

బిగ్‌ బాస్ 5: ఉమాదేవి అవుట్!

  'బిగ్‌ బాస్-5' నుండి మరో మహిళ ఎలిమినేట్ అయ్యింది. తొలి వారం హౌస్ నుండి సరయును బయటకు పంపిన బిగ్ బాస్... రెండో వారం ఉమాదేవిని పంపించారు. దాంతో బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు మహిళలు షో నుండి బయటకు వచ్చినట్టు అయ్యింది. దాంతో నామినేట్ అయిన మిగతావాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఉమాదేవితో పాటు రెండో వారంలో ఎలిమినేషన్స్ ప్రక్రియలో నటరాజ్, కాజల్, లోబో, ప్రియాంక, ప్రియ, యాని మాస్టర్ నామినేట్ అయ్యారు. చివరకి నటరాజ్, ఉమాదేవి మధ్య గట్టిపోటీ నెలకొంది. ఇద్దరిలో ఉమాదేవికి తక్కువ ఓట్లు వచ్చాయి. దాంతో ఆమె ఎలిమినేట్ అయ్యారు.  నిజం చెప్పాలంటే... ఉమాదేవి ఎలిమినేషన్ అందరూ ఊహించిందే. తన కోపమే తనకు శత్రువు అన్నట్టు ఉమాదేవి కోపం షో చూసేవాళ్లల్లో ఆమెపై వ్యతిరేక భావం ఏర్పడేలా చేసింది. తోటి సభ్యులను నోటికి వచ్చినట్టు బూతులు తిట్టడం, ఇతరులతో ప్రవర్తించేటప్పుడు విపరీత ధోరణి తమకు నచ్చడం లేదని చాలామంది గతంలో సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఇప్పుడు ఉమాదేవి తన కోపం, ప్రవర్తన కారణంగా ఎలిమినేట్ అయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

డాన్స‌ర్ కేవల్ మృతి... విషాదంలో 'ఢీ' ఫ్యామిలీ

  యువ డాన్సర్ కేవల్ తమంగ్ మృతి చెందాడు. తెలుగు డాన్స్ రియాలిటీ షో 'ఢీ'తో పాటు హిందీ డాన్స్ రియాలిటీ షో 'డాన్స్ ప్లస్'లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన కేవల్  కొన్ని రోజులుగా బ్లడ్ కాన్సర్ తో పోరాడుతున్నాడు. అతడిని కాపాడటం కోసం కొరియోగ్రాఫర్ యశ్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఆర్థిక సహాయం చేయమని ప్రముఖులను, ప్రేక్షకులను కోరాడు. ప్రియమణి, రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్, మేఘన తదితరులు ముందుకొచ్చారు. విధిరాత ముందు వీరి ప్రయత్నం తల వంచక తప్పలేదు.  కేవల్ తమంగ్ ఆదివారం తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. అతడి మరణవార్తను ధృవీకరిస్తూ యశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "నువ్వు లేవనే విషయాన్ని మనసుకు తీసుకోలేకపోతున్నాను. నేను ఇది భరించలేకపోతున్నాను. స్వర్గంలో విశ్రాంతి తీసుకో బ్రదర్. నన్నెప్పటికీ, జీవితాంతం ఈ వేదన వెంటాడుతుంది. నేనింకా నువ్వున్నట్టు ఫీలవుతున్నా. చాలా త్వరగా మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్లిపోయావ్" అని యశ్ పోస్ట్ చేశాడు. కేవల్ మృతిపై పలువురు టీవీ ప్రముఖులు, డాన్సర్లు సంతాపం వ్యక్తం చేశారు. 

నాగార్జునకు బిగ్ షాక్.. బిగ్‌బాస్‌ 5 ఫస్ట్ ఎపిసోడ్‌ కు దారుణ రేటింగ్!

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ సెప్టెంబర్‌ 5న ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున వరుసగా మూడోసారి ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఐదో సీజన్‌ తో ఐదు రెట్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తామంటూ నాగార్జున చెప్పారు. దీంతో ఐదో సీజన్‌ అదరగొడుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. బిగ్‌బాస్‌ 5 లాంచింగ్‌ ఎపిసోడ్‌ కు దారుణమైన రేటింగ్ వచ్చింది. బిగ్‌బాస్‌ తొలి సీజన్‌ కు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్ గా వ్యవహరించారు. బిగ్‌బాస్‌ షో తెలుగు ప్రేక్షకులకు చేరువ అవ్వడానికి ఆయనే ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఆయన హోస్ట్ చేసిన తొలి సీజన్‌ లాంచ్‌ ఎపిసోడ్‌కు 16.18 టీఆర్పీ వచ్చింది. ఆ తర్వాత నేచురల్‌ స్టార్‌ నాని హోస్ట్ చేసిన రెండో సీజన్‌ తొలి ఎపిసోడ్‌కు 15.05 టీఆర్పీ వచ్చింది. ఇక మూడో సీజన్ నుండి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మూడవ సీజన్‌ ఫస్ట్‌ ఎపిసోడ్‌కు అనూహ్యంగా 17.92 టీఆర్పీ వచ్చింది. నాలుగో సీజన్‌ లాంచింగ్‌ ఎపిసోడ్‌ కు అయితే ఏకంగా 18.5 టీఆర్పీ వచ్చింది. దీంతో ఐదో సీజన్‌తో నాగార్జున ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడోనని అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా గత రెండు సీజన్ల కంటే ఈ సీజన్ కు తక్కువ రేటింగ్‌ నమోదైంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 5 లాంచ్‌ ఎపిసోడ్‌ కు 15.7 టీఆర్పీ వచ్చింది. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. అయితే కంటెస్టెంట్ల వివరాలు ముందే లీక్ కావడమే తొలి ఎపిసోడ్‌ కు తక్కువ రేటింగ్‌ రావడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. మరోవైపు, ఈ సీజన్ లో చాలావరకు కొత్త ముఖాలే ఉండటంతో ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపట్లేదని టాక్ వినిపిస్తోంది. మరి ముందు ముందు నాగార్జున ఏమైనా మ్యాజిక్ చేస్తారేమో చూడాలి.

"ఐ ల‌వ్ యూ మై ఫ‌రెవ‌ర్‌".. షణ్ముఖ్‌తో బంధంపై ఓపెన్ అయిన దీప్తి!

  బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ దీప్తి సునైనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మందికి ఇష్ట‌మైన సెల‌బ్రిటీల్లో ఆమె ఒక‌రు. త‌న రోజువారీ కార్య‌క‌లాపాల‌కు సంబంధించిన ఫోటోలను దీప్తి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఆమెకు బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ అంటే విప‌రీత‌మైన ప్రేమ అని ఆమె అనుచరులలో చాలామందికి ఇప్పటికే తెలుసు.  మూడేళ్ల క్రితం దీప్తికి షణ్ముఖ్ ప్ర‌పోజ్ చేశాడ‌నే ప్ర‌చారం ఉంది. అయితే ఇంత‌దాకా త‌మ మ‌ధ్య అనుబంధం ఉన్న‌ద‌నే విష‌యాన్ని దీప్తి బాహాటంగా ఒప్పుకోలేదు, అలాగ‌ని తిర‌స్క‌రించ‌నూ లేదు. ఏదేమైన‌ప్ప‌టికీ, సోష‌ల్ మీడియాలో వారిద్ద‌రూ క‌లిసున్న ఫొటోలు వారి బంధం గురించిన సంకేతాల‌ను అందిస్తుంటాయి. సెప్టెంబర్ 16 ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా అత‌డి బ‌ర్త్‌డేని సెల‌బ్రేట్ చేయ‌డానికి బుధ‌వారం రాత్రి అన్న‌పూర్ణ స్టూడియోస్‌కు వెళ్లింది దీప్తి. అక్క‌డే బిగ్ బాస్ హౌస్ సెట్ ఉంది. మామూలుగా అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి అతిథుల్ని కానీ, కంటెస్టెంట్ల కుటుంబ‌స‌భ్యుల‌ను కానీ అనుమ‌తించ‌రు. అందుక‌ని దీప్తి హౌస్ గేట్ ద‌గ్గ‌ర‌కు ఒక కేక్ తీసుకొని వెళ్లింద‌నీ, దూరం నుంచే అత‌డ్ని పిలిచి బ‌ర్త్‌డే విషెస్ చెప్పింద‌నీ లేటెస్ట్‌గా లీకైన వీడియోలో క‌నిపించింది. దీప్తిని చూసి అమితాశ్చ‌ర్యానికి గురైన ష‌ణ్ముఖ్ ఆమెకు థాంక్స్ చెప్పాడు. ఇక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా ష‌ణ్ముఖ్‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేసింది దీప్తి. అత‌డికి స‌న్నిహితంగా ఉన్న రెండు ఫొటోల‌ను షేర్ చేసిన ఆమె, "హ్యాపీ బ‌ర్త్‌డే ష‌ణ్ణు. ఎప్ప‌టికీ ఐ ల‌వ్ యూ" అని రాసుకొచ్చింది. దాంతో పాటు హార్ట్ ఎమోటికాల‌ను జోడించింది. ఆ పోస్ట్ ద్వారా ఆమె ష‌ణ్ముఖ్‌ను ఎంత‌గా ప్రేమిస్తుందో అర్థ‌మైపోతోంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

మోనిత జైలుకు వెళ్లినా... కార్తీక్ ఫ్యామిలీకి టెన్షన్ ఎందుకంటే?

మోనిత అరెస్టుతో కార్తీక్, దీప కుటుంబానికి ఇక ఎటువంటి అడ్డు లేదని... కథ సుఖాంతం అవుతుందని భావించిన వీక్షకులకు 'కార్తీక దీపం' సీరియల్ దర్శకుడు ట్విస్ట్ ఇస్తున్నాడు. కథను మరింత కొనసాగించే ఆలోచనలో ఉన్నట్టు తాజా ఎపిసోడ్స్ ద్వారా స్పష్టం చేస్తున్నాడు. కార్తీక్ ఫ్యామిలీకి మోనిత అడ్డు ఇంకా తగ్గలేదని టెన్షన్ తప్పదని ఆల్రెడీ హింట్స్ ఇచ్చేశాడు. మోనితను కార్తీక్ హత్య చేశాడని అభియోగం మీద పోలీసులు అతడిని అరెస్టు చేయడం, సరిగ్గా తీర్పు వెలువరించే సమయంలో ఎవరినైతే తన భర్త హత్య చేశాడని అంటున్నారో ఆమెను కోర్టులోకి దీప తీసుకురావడంతో కథ మొత్తం మారిపోయింది.‌ కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబును నిర్దోషిగా విడుదల చేయడంతో పాటు కోర్టు సమయాన్ని వృథా చేయడంతోపాటు హత్యకు గురైన నాటకాన్ని ఆడిన మోనితకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. కార్తీక్ ఇంటికి... మోనిత జైలుకు వెళ్లడంతో వంటలక్క అలియాస్ దీప జీవితంలో ఎటువంటి టెన్షన్ లేదని అభిమానులు హ్యాపీ ఫీలయ్యారు.‌ అయితే, కార్తీక్ వీర్యం ద్వారా మోనిత కృత్రిమ ఈ పద్ధతుల ద్వారా గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. ఆ బిడ్డను అడ్డుపెట్టుకుని ఎలాగైనా కార్తిక్ చేత తాళి కట్టించుకుని ప్రయత్నం చేస్తుందని కార్తీక్ తల్లి సౌందర్య అనుమానపడుతుంది. అదేవిధంగా మోనిత కూడా జైలు నుంచి కార్తీక్ ఇంటికి రత్నసీత చేత ఒక బ్యాక్ పంపిస్తుంది. అందులో చిన్న పిల్లల ఫోటోలు ఉంటాయి. మనకు పుట్టబోయే బిడ్డ ఇలాగే ఉంటాడని, ఈ ఫోటోలో మీ పడక గదిలో అంటిస్తే సంతోషిస్తానని, ప్రతి అడుగులోనూ గుర్తొస్తున్నావని, మన బాబు కి మీ నాన్నగారి పేరు ఆనంద్ పెట్టానని మోనిత ఓ లేఖ రాస్తుంది. చివర్లో ఇట్లు నీ సహధర్మచారిణి 2 అని పేర్కొంటుంది. అలాగే దీప ఫోనులో తాను బెదిరింపులకు పాల్పడిన వీడియోలను రత్న సీత చేత డిలీట్ చేయిస్తుంది. తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకుండా ఉండాలని జాగ్రత్త పడుతోంది. తదుపరి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

నన్నెవరూ ముద్దుపేర్లతో పిలవలేదు!

  విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావుకు తగ్గ మనవడు అనిపించుకున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. నటనలోనూ, ప్రవర్తనలోనూ తనదైన ముద్ర వేస్తూ ముందుకు వెళుతున్నారు. ఆయనది కూడా మహానటుడి పేరే. యంగ్ టైగర్‌ను తారక్ అని కొందరు, రామారావు అని ఇంకొందరు జూనియర్ ఎన్టీఆర్ అని మరికొందరు పిలుస్తుంటారు.  అసలు జూనియర్ ఎన్టీఆర్‌కు ముద్దుపేర్లు లేవా? అంటే... 'లేవు' అని చెప్పాలి. తారక్ కూడా 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమంలో ఇదే విషయం చెప్పారు. గేమ్ ఆడటానికి వచ్చిన ఒక కంటెస్టెంట్ టెన్షన్ పడుతుంటే అతడి ముద్దుపేరు గురించి తారక్ డిస్కస్ చేశారు. తర్వాత "మంచి పేరు ఉన్నప్పుడు ఆ పేరు పెట్టి పిలవడం చాలా మంచిది. సో, అందుకనే నన్ను కూడా చిన్నప్పుడు ముద్దుపేర్లు పెట్టి పిలవలేదు" అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు.  అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా క్రోర్‌పతి' ఆధారంగా 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేం షోను రూపకల్పన చేశారు. జెమిని టీవీలో ఈ షో ప్రసారమవుతోంది.

వాళ్ళిద్దరితో మాల్దీవ్స్ వెళ్లిన సుమ

  కొవిడ్ టైమ్‌లో మాల్దీవ్స్ ఫుల్ ఫేమస్ అయ్యింది. లాక్‌డౌన్ రిస్ట్రిక్షన్స్ నుండి రిలీఫ్ రావడమే ఆలస్యం సెలబ్రిటీలు అందరూ మాల్దీవ్స్ క్యూ కట్టారు. అప్పుడు వాళ్లపై విమర్శలు కూడా వచ్చాయి. ఓ పక్క ప్రజలు ప్రాణాల కోసం పరుగులు తీస్తుంటే విహారయాత్రలు ఏంటని మాల్దీవ్స్ వెళ్లిన సెలబ్రిటీలపై సహచర నటీనటులు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి. సాధారణ ప్రజలు కూడా విహారయాత్రలకు వెళుతున్నారు. యాంకర్ సుమ కూడా వెళ్లారు.  ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ సుమ మాల్దీవ్స్ వెళ్లారు. కుమారుడు రోషన్ కనకాల, కుమార్తె స్నేహ మనస్వి కానుకలతో కలిసి ప్రముఖ పర్యాటక సముద్రతీర ప్రాంతానికి వెళ్లారు. ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు. సుమ చాలా బిజీ యాంకర్. పలు షోస్ చేస్తున్నారు. అయితే.. కరోనా తర్వాత ఎక్కడికి వెళ్లలేదని, కాస్త రిలీఫ్ కోసం షార్ట్ బ్రేక్ తీసుకున్నారని టీవీ ఇండస్ట్రీ టాక్. సుమ, పిల్లలతో పాటు రాజీవ్ కనకాల వెళ్లారో లేదో మరి! పిల్లలతో కలిసున్న ఫొటోలను మాత్రమే సుమ షేర్ చేశారు. 

శ్రీముఖి ఇంట విషాదం

  ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి ఇంట విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఆమె అమ్మమ్మ మరణించారు. దాంతో శ్రీముఖి భావోద్వేగానికి లోనయ్యింది. అమ్మమ్మతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. "అమ్మమ్మ అంటే ప్రేమ. జీవితంలో చాలా విషయాలను తను నాకు చెప్పింది. అమ్మమ్మ ఎప్పుడూ హుషారుగా ఉండేది. ఎల్లప్పుడూ సంతోషాన్ని పంచేది. అమ్మమ్మ ధైర్యవంతురాలు. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. తనతో పాటలు పాడటం, డాన్స్ చేయడం మిస్ అవుతాను. అమ్మమ్మ... ఐ లవ్యూ. జీవితంలో నువ్వు ఇచ్చిన ప్రతి దానికి థాంక్స్. నా జీవితంలో నేను విన్న అత్యుత్తమ ప్రేమ కథల్లో అమ్మమ్మ, తాతయ్య ప్రేమకథ ఒకటి. పైలోకంలో తాతయ్యను అమ్మమ్మ కలుస్తుందని, వాళ్ళ ప్రేమకథ అక్కడ కొనసాగుతుందని ఆశిస్తున్నా" అని శ్రీముఖి రాసుకొచ్చింది. శ్రీముఖి అమ్మమ్మ మరణానికి సంతాపం తెలుపుతూ పలువురు ప్రముఖులు సందేశాలు పెట్టారు. ఉత్తేజ్ సతీమణి పద్మావతి మరణం మరువక ముందే పరిశ్రమకు చెందిన మ‌రో కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

షణ్ముఖ్‌పై స‌ర‌యు కామెంట్స్ కాక‌రేపుతున్నాయ్‌!

  బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5లో ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్‌గా నిలిచింది న‌టి-యూట్యూబ‌ర్ స‌ర‌యు రాయ్‌. హౌస్‌లోకి వెళ్లేముందు ఆమె అగ్రెసివ్‌నెస్ చూసిన‌వాళ్లు ఎవ‌రూ ఆమె అంత త్వ‌ర‌గా ఎలిమినేట్ అవుతుంద‌ని ఊహించ‌లేరు. ఏదేమైనా ఎలిమినేష‌న్‌కు గురైన తొలి కంటెస్టెంట్‌గా నిలిచి అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌వారితో షో నిర్వాహ‌కులు ఒక యాంక‌ర్‌తో ఇంట‌ర్వ్యూ జ‌రిపించి, హౌస్‌లో జ‌ర్నీ గురించి మాట్లాడించ‌డం, వాటి వివ‌రాల‌ను హౌస్‌మేట్స్‌కు షేర్ చేయ‌డం ఆన‌వాయితీ. ప్ర‌స్తుతం ఇంట‌ర్వ్యూ బాధ్య‌త‌ల‌ను మునుప‌టి బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియానా గ్లోరీ నిర్వ‌ర్తిస్తోంది. ఎలిమినేట్ అయిన స‌ర‌యుతో ఇంట‌ర్వ్యూ జ‌రిపింది.  బిగ్ బాస్ హౌస్‌లోని మ‌గాళ్లంద‌రూ.. ఒక్క విశ్వ మిన‌హాయించి.. ప‌నికిరాని వాళ్లుగా తేల్చేసింది స‌ర‌యు. ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ గురించి చెప్పాల్సి వ‌చ్చిన‌ప్పుడు షాకింగ్ కామెంట్స్ చేసింది. "నువ్వు నిజంగా మ‌గాడివైతే, ద‌మ్ముంటే, స‌రిగా ఆట ఆడి చూపించాలి. లేదంటే, వెళ్లి ఇంట్లో కూర్చోవాలి" అని చెప్పింది. అలాగే వీజే స‌న్నీకి క్యారెక్ట‌ర్ లేద‌ని కూడా కామెంట్ చేసింది స‌ర‌యు. హౌస్‌లో విశ్వ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఆమె అభిప్రాయ‌ప‌డింది.  కాగా, ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌పై స‌ర‌యు చేసిన షాకింగ్ కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ష‌ణ్ముఖ్ ఫ్యాన్స్ ఆ కామెంట్స్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ, స‌ర‌యును ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. కొంత‌మంది మాత్రం ష‌ణ్ముఖ్ ఇంత‌దాకా స‌రైన ఆట మొద‌లుపెట్ట‌లేద‌ని హోస్ట్ నాగార్జున కూడా పాయింట్ ఔట్ చేయ‌డాన్ని ప్ర‌స్తావిస్తూ, అత‌నిపై స‌ర‌యు స‌రిగానే చెప్పింద‌ని ఆమె వెన‌కేసుకొస్తున్నారు.

బ్లాక్‌బ‌స్ట‌ర్ సిరీస్‌ 'నార్కోస్: మెక్సికో' సీజ‌న్ 3 రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!

  వ‌ర‌ల్డ్ వైడ్‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన 'నార్కోస్' వెబ్ సిరీస్ కొత్త సిరీస్ అతి త్వ‌ర‌లో మ‌న‌ముందుకు రాబోతోంది. నవంబ‌ర్ 5న 'నార్కోస్‌: మెక్సికో' సీజ‌న్ 3 ప్రీమియ‌ర్ కానున్న‌ది. 'నార్కోస్‌: మెక్సికో' సీజ‌న్ 3 ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌ను షేర్ చేసిన నెట్‌ఫ్లిక్స్, దాని రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేసింది. ఈ నెట్‌ఫ్లిక్స్ ఒరిజిన‌ల్ సిరీస్ కూడా మునుప‌టి సీజ‌న్‌ల త‌ర‌హాలోనే పెద్ద హిట్ అవుతుంద‌ని చెప్ప‌డానికి సందేహించాల్సిన ప‌నిలేదు. 'నార్కోస్: మెక్సికో' న్యూ సీజ‌న్ కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా అత్యంత ఆత్రుత‌తో ఎదురు చూస్తున్నాను.  ఈ సిరీస్ రెండో సీజ‌న్ నెట్‌ఫ్లిక్స్‌లో 2020 అక్టోబ‌ర్‌లో రిలీజ‌య్యింది. అది బ్లాక్‌బ‌స్ట‌ర్ అవ‌డంతో, అప్ప‌ట్నుంచీ కూడా మూడో సీజ‌న్ ఎప్పుడొస్తుందా అని వీక్ష‌కులు వెయిట్ చేస్తూ వ‌స్తున్నారు. ఎట్ట‌కేల‌కు 2021 న‌వంబ‌ర్ 5న మూడో సీజ‌న్‌ను ప్రీమియ‌ర్ చేస్తున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించ‌డంతో వారు త‌మ ఆనందాన్ని సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఈ కొత్త సీజ‌న్ 10 ఎపిసోడ్లు ఉండ‌నుంది. 1990ల నాటి బ్యాక్‌డ్రాప్‌లో డ్ర‌గ్ బిజినెస్ వార్ మెయిన్ పాయింట్‌గా రూపొందిన‌ 'నార్కోస్: మెక్సికో' సీజ‌న్ 3లో స్కూట్ మెక్‌నైరీ, జోస్ మ‌రియా యాజ్‌పిక్‌, లూయిస్ గెరార్డో మెండెజ్‌, ఆల్బ‌ర్టో గుయెర్రా, లూసా రుబినో, అల్ఫాన్సో డోస‌ల్‌, మేరా హెర్మోసిల్లో, మాట్ లెషెర్‌, మాన్యుయెల్ మ‌సాల్వా, అలెజాండ్రో ఎడ్డా, గోర్కా ల‌సోసా న‌టించారు. 

ఎలిమినేట్ అయిన ఫ‌స్ట్ కంటెస్టెంట్ స‌ర‌యు దృష్టిలో వ‌ర‌స్ట్ కంటెస్టెంట్స్ వీరే!

  బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5లో ఎలిమినేష‌న్‌కు గురైన ఫ‌స్ట్ కంటెస్టెంట్‌గా నిలిచింది.. స‌ర‌యు రాయ్ అలియాస్ 7ఆర్ట్స్ స‌ర‌యు. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ఆమె షోకు, హౌస్‌మేట్స్‌కు వీడ్కోలు తెలిపింది. షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ముందుగా, హౌస్‌లో త‌న దృష్టిలో బెస్ట్ అండ్ వ‌ర‌స్ట్ కంటెస్టెంట్స్ ఎవ‌రో చెప్పిందామె. స‌ర‌యు దృష్టిలో.. సిరి హ‌న్మంత్, వీజే స‌న్నీ, ల‌హ‌రి, ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌, కాజ‌ల్ వ‌ర‌స్ట్ కంటెండ‌ర్స్‌. అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతుందంటూ సిరి గురించి చెప్పింది. ష‌ణ్ముఖ్‌, సిరి ఒక ట్యాగ్ టీమ్ అని అభివ‌ర్ణించింది. ప్ర‌తి విష‌యాన్నీ స్కీమ్‌లాగా చూడ‌వ‌ద్ద‌ని ష‌ణ్ముఖ్‌కు చెప్పిన ఆమె, ఎలిమినేష‌న్ ఇంట‌రాక్ష‌న్ సీక్వెన్స్‌లో అత‌ని వెర్ష‌న్ త‌న‌ను ఎంట‌ర్‌టైన్ చెయ్య‌లేద‌ని తెలిపింది. హౌస్‌లో జాగ్ర‌త్త‌గా ఉండ‌మంటూ కాజ‌ల్‌ను హెచ్చ‌రించింది. వీజే స‌న్నీ, ల‌హ‌రిపై కూడా విరుచుకుప‌డింది స‌ర‌యు. బిగ్ బాస్ 5లో అడుగుపెట్ట‌డానికి ముందు తాము చేసిన ఓ సినిమాలో ఒక డైలాగ్‌ను మార్చ‌డంతో త‌న‌పై స‌న్నీ క‌క్ష క‌ట్టాడ‌నీ, అందుకే త‌న‌ను అత‌ను నామినేట్ చేశాడ‌నీ ఆరోపించింది. స‌న్నీ వివ‌ర‌ణ ఇవ్వ‌డానికి ట్రై చేసినా, స‌ర‌యు త‌న ఆరోప‌ణ‌ల‌పైనే గ‌ట్టిగా నిల‌బ‌డింది. ల‌హ‌రితో కూడా వాద‌న‌కు దిగిన స‌ర‌యు, ఎదుటివాళ్ల‌ను చిన్న‌చూపు చూడ‌వ‌ద్ద‌ని స‌ల‌హా ఇచ్చింది. ఇక స‌ర‌యు దృష్టిలో శ్వేతావ‌ర్మ‌, మాన‌స్‌, ప్రియాంక‌, విశ్వ బెస్ట్ కంటెస్టెంట్‌లుగా నిలిచారు. ఆమె ఎలిమినేట్ అయ్యాక విశ్వ క‌న్నీరు పెట్టుకోవ‌డం ఆమెను భావోద్వేగానికి గురిచేసింది. విశ్వ ప్ర‌తి డిపార్ట్‌మెంట్‌లోనూ ప‌నిచేస్తే, ప్ర‌తి విష‌యంలోనూ అంద‌రికీ సాయం చేస్తాడ‌ని మెచ్చుకుంది. హౌస్‌లో గ‌డిపిన కొద్ది కాలానికి సంబంధించిన కొన్ని గొడ‌వ‌ల‌ను ఎంచుకుంది స‌ర‌యు. నామినేష‌న్ టాస్కుల స‌మ‌యంలో యాంక‌ర్ ర‌వితో వాద‌న పెట్టుకోవ‌డం, కెప్టెన్సీ టాస్క్ టైమ్‌లో సిరితో గొడ‌వ పెట్టుకోవ‌డం.. వాటిలో ఉన్నాయి. హౌస్‌లోని త‌న ఫ్రెండ్స్ సాయంతోటే సిరి కెప్టెన్సీ టాస్క్‌ను గెలిచింద‌ని ఆమె ఆరోపించింది. త‌న సొంత ప్ర‌తిభ‌తో టాస్క్‌ను గెల‌వాల‌ని సిరికి సూచించింది. ప్రియాంక‌తో గొడ‌వ విష‌యంలో ఉమాదేవికి ఆమె స‌పోర్ట్ ప‌లికింది.  సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసే అడ‌ల్డ్ కామెడీ కంటెంట్‌తో పాపుల‌ర్ అయిన న‌టి-యూట్యూబ‌ర్ స‌ర‌యు రాయ్‌, బిగ్ బాస్ హౌస్‌లో త‌న బోల్డ్‌, ముక్కుసూటిత‌నంతో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. తొలివారంలో నామినేష‌న్ పొందిన ఆరుగురు కంటెస్టెంట్ల‌లో ఒక‌రైన ఆమె, అంద‌రి కంటే ముందుగా ఎలిమినేట్ అయ్యింది.

మోనితను కోర్టుకు లాక్కొచ్చిన వంటలక్క!?

  మోనిత నాటకానికి ఫుల్ స్టాప్ పడే రోజు వచ్చినట్టుంది. 'కార్తీకదీపం' సీరియల్‌లో శనివారం ఇచ్చిన ముగింపు చూస్తే... మోనితను దీప కోర్టుకు లాక్కొచ్చినట్టు అర్థమవుతోంది. మొత్తం మీద భర్త కార్తీక్‌కు శిక్ష పడకుండా, పతి ప్రాణాలను వంటలక్క కాపాడినట్టు తెలుస్తోంది. అసలు ఏమైంది? అనేది వివరాల్లోకి వెళితే... దీపను మోనిత ఏం చేస్తుందోనని కార్తీక్ కంగారు పడుతుంటే, అదేమీ పట్టించుకోకుండా విధి నిర్వహణలో భాగంగా అతడికి ఏసీపీ రోషిణి కోర్టుకు తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. మరోవైపు మోనితను ఫాలో అవుతూ వెళ్లిన దీప, చివరికి మోనిత చేతికి చిక్కుతుంది. గన్ తీసుకుని దీపకు మోనిత గురి పెడుతుంది. కట్ చేస్తే... కోర్టులో కార్తీక్ మీద మోపిన అభియోగాలపై విచారణ జరుగుతుంది. మోనితను కార్తీక్ గర్భవతి చేశాడని, ఆమె తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసేసరికి చంపేశాడని, అతడికి శిక్ష విధించాలని న్యాయవాది వాదిస్తాడు. సాక్ష్యాలు అన్నీ కార్తీక్ కి వ్యతిరేకంగా ఉంటాయి. అతడి తల్లి మాత్రం 'నా మనస్సాక్షి ప్రకారం నా కుమారుడు నిర్దోషిగా బయటకొస్తాడు' అని నమ్మకంగా ఉంటుంది.  దీపకు గన్ గురి పెట్టిన మోనిత... చంపేస్తానని బెదిరిస్తోంది. దీప ఏమాత్రం కంగారు పడకుండా ఒకటి, రెండు అని అంకెలు లెక్కపెడుతూ మోనిత చేతిలో గన్ లాక్కుంటుంది. దాంతో దీప కాళ్ళ మీద పడిన మోనిత... తనను వదిలేయమని, ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటుంది. 'నువ్వు బతికుంటే నా భర్త ప్రాణాలకు ప్రమాదం. నిన్ను చంపేస్తా' అని దీప భయపెడుతుంది. దాంతో ఎపిసోడ్ దాదాపుగా ముగిసింది. అయితే, నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం రాబోతోందనేది చూపించిన ప్రోమోలో అసలు మేటర్ ఉంది.  'వాదోపవాదనలు ముగిశాయి' అని న్యాయమూర్తి తీర్పు ప్రకటించే సమయంలో దీప కోర్టులోకి ఎంటర్ అవుతుంది. తనను తాను కార్తీక్ భార్యగా న్యాయమూర్తికి పరిచయం చేసుకుంటుంది. 'మీరు తీర్పు ఇచ్చే ముందు మరో ముఖ్యమైన సాక్షిని అనుమతించండి' అని కోరుతుంది. అందుకు, జడ్జ్ సరేనని అంటారు. కోర్టులోకి వస్తున్నది ఎవరనేది చూపించలేదు. కానీ, అందరూ షాక్ అవ్వడం, అంతకు ముందు దీప గన్ తీసుకుని మోనితకు గురి పెట్టడం గుర్తు చేసుకుంటే... మోనితను దీప కోర్టుకు లాక్కొచ్చినట్టు అర్థమవుతోంది. 

అనసూయ 45 వేలకు ఈవెంట్ చేస్తుందా?

  'జబర్దస్త్'లో కొన్ని వారాలుగా ఫాహిమా (ఫైమా)కు స్పేస్ దొరుకుతోంది. టిపికల్ కామెడీ టైమింగ్‌తో ఫన్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలో ఫాహిమా హద్దు మీరుతున్నట్టు కనబడుతోంది. 'జబర్దస్త్'లో బాడీ షేమింగ్ ఎప్పటి నుండో ఉంది. ఇన్నాళ్లూ ఇతరుల అందాన్ని హేళన చేస్తూ ఎవరో ఒకరు పంచ్‌లు వేసేవారు. అయితే, తన అందంపై ఫాహిమా పంచ్‌లు వేసుకుంటోంది.  నెక్స్ట్ వీక్ వెంకీ మంకీస్ స్కిట్‌లో ఫాహిమా చేసింది. ప్రోమో చూస్తుంటే... 'శక్తి' సినిమా స్పూఫ్ చేసినట్టు ఉన్నారు. అందులో ఫాహిమా, బాబుకు మధ్య ఓ సీన్ ఉంది. 'నువ్వు నాకు కావాలి' అని బాబు అంటే... 'ఇదే మాట స్కిట్ అయిపోయాక చెప్పు. వస్తా' అని ఫాహిమా అంటుంది. అదిరే అభి స్కిట్‌లో రామును పట్టుకుని టోంబ్రి అన్నది. స్కిట్ తర్వాత కూడా రెచ్చిపోయింది. ఫాహిమా పంచ్‌లు పేలుతున్నాయి కాబట్టి కంటిన్యూ చేస్తారో? లేదంటే టీమ్ లీడర్లు కట్ చేస్తారో? చూడాలి.  ఇక, నెక్స్ట్ వీక్ 'హైపర్' ఆది స్కిట్ విషయానికి వస్తే... జబర్దస్త్ టీమ్ లీడర్లు, జడ్జ్‌లకు వయసు అయిపోతే, ముసలోళ్లు అయితే ఎలా ఉంటారనే థీమ్ తీసుకుని స్కిట్ చేశాడు. అందులో రామ్ ప్రసాద్ 'నా వేళ్ళు చూశావా? ఎలా అయిపోయాయో?' అంటే... 'అందరికీ గోకి గోకి గోళ్లు పోతే నీకు వేళ్ళు తిరిగిపోయాయి ఏంటి?' అని ఆది పంచ్ వేశాడు. 'ఆ లెక్కన చూస్తే నీకు వేళ్లే ఉండకూడదు' అని రామ్ ప్రసాద్ కౌంటర్ పంచ్ వేశాడు. 'నీకు గోళ్లు, నాకు వేళ్ళు అంటే ఆ సుధీర్ గాడికి ఏం అరిగిపోయి ఉంటాయో?' అని ఆది అనడంతో అందరూ నవ్వేశారు.  అనసూయ పాత్రను రైజింగ్ రాజు చేశాడు. వయసు అయిపోయిన తర్వాత అనసూయకు సరిగా వినపడదని, ఓ ఈవెంట్ కోసం 90 వేలు ఇస్తామంటే... 65 వేలు అడుగుతున్నట్టు చూపించారు. అలా కాదు... 65 ఇస్తామంటున్నారని ఆది చెప్పబోతే... 45వేలకు ఒప్పుకొన్నట్టు కన్‌క్లూజన్ ఇచ్చారు. రోజా పళ్ళ సెట్ తీసుకురమ్మని అనడం, ఆది డాన్స్ అంటే సెలైన్ పెట్టమని అడగటం నవ్వించాయి.