'ఇంట్లో నాది కుక్క బ‌తుకు' అంటున్న ప్ర‌కాష్‌రాజ్‌!

  "ఇంట్లో కుక్క బతుకు. అమ్మకు 82 ఏళ్లు. ఆవిడను చూసుకునే నర్సు, పనిమనిషి, నా కూతుళ్లు. ఆడాళ్ల మధ్యలో ఉంటున్నాను. వాళ్లదే రాజ్యం" అని ప్రకాష్ రాజ్ అన్నారు. ఢిల్లీకి రాజైనా ఓ తల్లి కుమారుడే అని సామెత ఉంది. అలాగే, ఎంత పెద్దవారైనా ఇంట్లో మహిళలు చెబితే వినాల్సిందేనని 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. భార్య పోనీ వర్మ, కుమార్తెలు ఇద్దర్నీ చూపిస్తూ... "వీళ్లంతా రిక్వెస్ట్ చేయరు. ఆర్డర్ వేస్తారు. బయట నేను విలన్. నన్ను జోక‌ర్‌లా చూస్తారు వీళ్ళందరూ" అని ప్రకాష్ రాజ్ చెప్పారు. తన విడాకులపైనా ఆయన స్పందించారు. "ప్రపంచానికి అబద్ధం చెబుతూ  బతకడం కన్నా... పిల్లలకు అబద్ధం చెబుతూ చంపుకోవడం కన్నా... విడిగా బతుకుతూ హ్యాపీగా ఉందామని అనుకున్నాం" అని తొలి భార్య లలితకుమారితో ఎందుకు విడిపోయిందీ ప్రకాష్ రాజ్ తెలిపారు. ప్రకాష్ రాయ్‌ నుండి తన పేరును ప్రకాష్ రాజ్‌గా మార్చింది కె. బాలచందర్ అని చెప్పారు. కృష్ణవంశీ స్వార్థపరుడు అయినప్పటికీ... పూరి జగన్నాథ్ కంటే ఎక్కువ ప్రేమిస్తానని ప్రకాష్ రాజ్ తెలిపారు.  'ఏ అసోసియేషన్ అయితే నన్ను బ్యాన్ చేసిందో... దానికి నేను ప్రెసిడెంట్ అవ్వాలని పోటీ చేస్తున్నారా? అది అచీవ్ మెంటా? రివెంజా?' అని అలీ అడిగితే... "ఛీఛీ... అలా లేదు. అది మర్చిపోయా. మీరు గుర్తు చేశారంతే. ఇది అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షనా?" అని ప్రకాష్ రాజ్ ఆన్సర్ ఇచ్చారు.  

'ఉప్పెన'లో సేతుపతి... బుల్లితెరలో నిరుపతి!

  సూపర్ డూపర్ హిట్ సీరియల్ 'కార్తీకదీపం', 'హిట్లర్ గారి పెళ్ళాం'తో బుల్లితెరలో నిరుపమ్ పరిటాలకు స్టార్ ఇమేజ్ వచ్చింది. అతడిని అభిమానించే జనాలు చాలా మంది ఉన్నారు. అదే సమయంలో అతడిపై సరదాగా సెటైర్లు వేసే సెలబ్రిటీలు ఉన్నారు. జీ తెలుగు ఛానల్ వాళ్లు పండగలకు ప్రత్యేకంగా ఈవెంట్లు చేసిన ప్రతిసారి నిరుపమ్ మీద శ్రీముఖి సెటైర్లు కంపల్సరీగా ఉంటాయి. విజయదశమి పండక్కి 'దసరా దోస్తీ' పేరుతో జీ తెలుగు ఛానల్ ఒక ఈవెంట్ చేసింది. దానికి మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ అతిథిగా వచ్చాడు. తొలి సినిమా 'ఉప్పెన'తో అతడు బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. అతడితో కలిసి స్టేజ్ మీద శ్రీముఖి సరదాగా కాసేపు వినోదం పండించింది. వైష్ణవ్ తేజ్ ఏదో అడగ్గా... 'భయమేస్తుంది' అన్నీ శ్రీముఖి సమాధానమిచ్చింది. 'నీళ్లు అంటే భయమా? నాన్న అంటే భయమా?' అని వైష్ణవ్ అడిగాడు. 'నిరుపమ్ అంటే భయం' అని శ్రీముఖి అనడంతో నిరుపమ్ పరిటాల షాక్ అయ్యాడు. అంతటితో అయిపోలేదు. 'మీ సినిమాలో సేతుపతి కదా ఇక్కడ నిరుపతి' అని శ్రీముఖి చెప్పబోగా... 'ఇప్పుడు క్లైమాక్స్ వరకు ఎందుకు లెండి' అని వైష్ణవ్ అనడంతో అందరూ నవ్వేశారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 10న ప్రసారం కానుంది.

ష‌న్నును బ‌య‌ట‌కు పంపాల‌నుకుంటున్న ఎనిమిది మంది!

  అప్పుడే ఐదో వారంలోకి 'బిగ్ బాస్' ఐదో సీజన్ అడుగుపెట్టింది. చూస్తుండగానే నాలుగు వారాలు గడిచిపోయాయి. నలుగురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. ఒక్క లహరి తప్పితే మిగతా వాళ్ళందరూ కోపధారి మనుషులుగా ముద్రపడిన వాళ్లే. ఇప్పుడు ఐదో వారంలో ఎవరు బయటకు వెళ్తారు అనే ఆసక్తి మొదలైంది. సోమవారం ఐదో వారం నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. రికార్డు స్థాయిలో తొమ్మిది మంది నామినేట్ కావడం గమనార్హం. ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ ముగిసిన తర్వాత.... లోబో, జెస్సీ, షణ్ముఖ్, ప్రియ, సన్నీ, రవి, మానస్, విశ్వ, హమీద నామినేట్ అయినట్టు బిగ్ బాస్ ప్రకటించారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ఇంటిలోని 15 మంది సభ్యుల్లో ఎనిమిది మంది షణ్ముఖ్ జస్వంత్‌ను నామినేట్ చేయడం గమనార్హం. రవి, జెస్సీలను నలుగురు నలుగురు నామినేట్ చేశారు. పైకి నెమ్మ‌ద‌స్తుడిగా క‌నిపిస్తున్న ష‌ణ్ముఖ్ ప‌ట్ల ఇంత మంది విముఖ‌త చూపిస్తుండ‌టం వెనుక కార‌ణ‌మేంటి? అనే చ‌ర్చ మొద‌లైంది. ఆడియెన్స్‌లో మాత్రం అత‌ని మీద ఇంత విముఖ‌త లేద‌నే చెప్పాలి.

తమిళ బిగ్‌బాస్‌ లో తెలుగమ్మాయి!

కోలీవుడ్ స్టార్ హీరో కమల్‌‌ హాసన్ హోస్ట్ చేస్తున్న తమిళ బిగ్‌‌ బాస్ సీజన్-5 అక్టోబర్ 3న గ్రాండ్‌‌ గా మొదలైంది. తమిళ బిగ్‌బాస్‌ షో ఐదో సీజన్‌ 18 కంటెస్టెంట్లతో ప్రారంభమైంది. అయితే వారిలో మన తెలుగమ్మాయి పావని రెడ్డి కూడా ఉంది. దీంతో ఆమె గురించి తెలుసుకోవడానికి తెలుగు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.   మొదట్లో మోడలింగ్‌ చేసిన పావని రెడ్డి తర్వాత బుల్లితెరపై అడుగు పెట్టింది. తెలుగులో అగ్నిపూలు, నా పేరు మీనాక్షి వంటి హిట్‌ సీరియల్స్‌ లో నటించింది. అలాగే ది ఎండ్, డబుల్ ట్రబుల్, లజ్జ, డ్రీమ్ వంటి సినిమాల్లోనూ తళుక్కున మెరిసింది. అయితే తెలుగులో ఆశించినంత గుర్తింపు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. అక్కడ పలు సీరియల్స్‌, సినిమాలలో నటిస్తూ తమిళ ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది. పావని రెడ్డి తెలుగు ఇండస్ట్రీకి దూరమవ్వడానికి మరో కారణం కూడా ఉంది. ఆమె 2013లో నటుడు ప్రదీప్‌ కుమార్‌ ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. అయితే అతను 2017లో ఆత్మహత్య చేసుకున్నాడు. పావని రెడ్డి మరొకరితో చనువుగా ఉన్న ఫోటోను చూసి మనస్తాపంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. అప్పట్లో ఈ వ్యవహారం తెలుగునాట హాట్‌ టాపిక్‌ గా మారింది. ఆ ఘటన తర్వాత ఆమె తెలుగు ఇండస్ట్రీకి గుడ్‌ బై చెప్పి చెన్నైలోనే సెటిల్‌ అయిపోయింది. 2020లో ఆనంద్‌ జాయ్‌ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పుడు తమిళ బిగ్‌బాస్‌ హౌస్‌ లోకి ఎంటర్ అయింది. మరి పావని రెడ్డి ఈ షో తో తమిళ ప్రేక్షకులను ఏ మేర మెప్పిస్తుందో చూడాలి.

మోనితకు శ్రీమంతం చేసిరా! వంటలక్క మీద కార్తీక్ ఫైర్‌!!

  మోనిత పేపర్‌కు ఎక్కడంతో వంటలక్కలో కంగారు మొదలైంది. పేపర్ పిల్లల కంట పడడం, వాళ్లేమో తండ్రిని దోషిలా చూస్తుండడంతో మోనితకు వార్నింగ్ ఇవ్వడానికి వంటలక్క జైలుకు వెళ్ళింది. వెళుతూ వెళుతూ యాపిల్స్ పట్టుకుని వెళ్ళింది. పేపర్‌లో పిచ్చి రాతలు మానెయ్యమని మోనితతో సీరియస్‌ నోట్‌లో చెప్పింది. అయితే, ఎప్పటిలా కార్తీక్ చేత నా మెడలో తాళి కట్టిస్తే ఇవన్నీ మానేస్తానని మోనిత అన్నది. లేదంటే పిల్లలకు నిజం చెప్పేయమని అంటుంది.  ఇంటికి వచ్చిన దీపను 'ఎక్కడికి వెళ్ళావ్?' అని సౌందర్య అడుగుతుంది. 'మోనిత దగ్గరకు' అని చెబుతుంది. దాంతో కార్తీక్ కోప్పడతాడు. 'ఆ మోనిత ఓ క్రూరమృగం. మాటలతో చెబితే మారిపోతుందా? పైగా, యాపిల్స్ తీసుకువెళ్లావా? ఈసారి జ్యూస్ తీసుకువెళ్ళు. శ్రీమంతం చేసిరా' అని ఫైర్ అవుతాడు కార్తీక్. అప్పుడే మోనిత న్యూస్ పడిన పేపర్ కనిపించడం లేదని భర్తతో వంటలక్క చెబుతుంది. దాంతో కార్తీక్ కూలబడతాడు. దీపను తిట్టడంతో పాటు పిల్లలకు తెలిస్తే అని కుమిలిపోతాడు.  ఆల్రెడీ పేపర్ చదివిన హిమ దగ్గరకు దీప వెళుతుంది. ఏమైందని అంటే... 'డాడీ మంచివాడేనా? ఎందుకు కష్టాలు వస్తున్నాయి' అని తల్లిని హిమ ప్రశ్నిస్తుంది. 'మంచివాళ్లకు ఎక్కువ కష్టాలు వస్తాయి' అని అమ్మాయికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది దీప. వెంటనే, 'మరి మోనిత ఆంటీ మంచిదేనా? అందుకే తనకీ కష్టాలు వస్తున్నాయా? జైల్లో ఉన్నవాళ్లు చెడ్డవాళ్ళా? బయట ఉన్నవాళ్లు మంచివాళ్లా?' అని ప్రశ్నల వర్షం కురిపించడంతో కొంపతీసి పేపర్ పిల్లల కంట పడిందేమోనని దీప కంగారు పడుతుంది. మరోవైపు సుకన్య సాయంతో ఏదో ప్లాన్ వేయడానికి ప్రయత్నిస్తుంది జైల్లో ఉన్న మోనిత. అదేమిటన్నది రాబోయే ఎపిసోడ్స్‌లో చూడాలి. 

బ్రెయిన్ వాడు లోబో... క్లాస్ పీకిన నాగార్జున!

బిగ్‌బాస్ శ‌నివారం ఇంట్లో స‌భ్యులు అంద‌రికీ 'బిగ్ బాస్ యాప్ స్టార్' టాస్క్ ఇచ్చారు. ఇందులో ఏం చేయాలంటే... ఇంట్లో ఎవరు 'అటెన్షన్ సీకర్'? ఎవరు నోరు అదుపులో పెట్టుకోవాలి ('వాచ్ యువర్ టంగ్')? ఎవరు బ్రెయిన్ వాడాలి ('యూజ్ యువర్ బ్రెయిన్')? ఎవరు సింపతీ గైనర్? అనేది చెప్పాలి. శ్రీరామచంద్ర, సిరి హనుమంతు, షణ్ముఖ్ జస్వంత్, విశ్వ... హౌస్‌లో నలుగురు లోబోకి బ్రెయిన్ వాడమని చెప్పారు. లోబో సింపతీ గైనర్ అనిఆర్జే కాజల్ చెప్పింది. ప్రియాతో పాటు ప్రియాంక కూడా లోబో నోరు అదుపులో పెట్టుకోవాలని అభిప్రాయపడ్డారు. శ్వేతా వర్మ అయితే తన దృష్టిలో లోబో వరస్ట్ పెరఫార్మర్ అని డిసైడ్ చేసింది. చాలాసార్లు  రూల్స్ బ్రేక్ చేశాడని చెప్పింది.  లాస్ట్ వీక్ హౌస్‌లో లోబో ఓవర్ యాక్షన్ చేశాడు. తన ప్రేమకథను సినిమా కథలా ఉందని చెప్పినందుకు ప్రియా మీద అరిచాడు. నిజం చెప్పాలంటే... అంత అరవాల్సిన అవసరం లేదని అనిపించింది. తర్వాత ప్రియాకు లోబో సారీ చెప్పినా సరే. అతడు చేసినది తప్పే. అందుకని నాగార్జున శనివారం లోబోకి క్లాస్ పీకారు. 'మాట్లాడితే బస్తీ నుండి వచ్చాను (అంటావ్). ఇది  బిగ్ బాస్. బస్తీ కాదు, విల్లా కాదు. ఇక్కడ అందరూ ఒక్కటే' అని లోబోకి నాగార్జున క్లాస్ పీకారు. అంతకు ముందు 'నీ ఒక్కడికే ఉంది ప్రేమ. ఇంకెవరికీ లేదు' అని కూడా అన్నారు. దాంతో ప్రియా కాస్త హ్యాపీ ఫీల్ అయ్యిందని చెప్పాలి. అంతే కాదు... లోబో తనను ఉరిమి ఉరిమి చూస్తున్నాడని కంప్లైంట్ ఇచ్చింది. 

'బిగ్ బాస్ 5': నటరాజ్ మాస్టర్‌ను పంపేశారు!

'బిగ్ బాస్' హౌస్‌లో నటరాజ్ మాస్టర్ దూకుడుకు శుభం కార్డు పడిందా? తన కోపమే తన శత్రువు అన్న నానుడిని నిజం చేస్తూ... కోపధారి మనిషిగా ముద్ర పడిన నటరాజ్ మాస్టర్‌ను బయటకు పంపేశారా? అంటే 'అవును' అనే సమాధానం వినబడుతోంది. 'బిగ్ బాస్' ఐదో సీజన్‌లో నాలుగో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో నటరాజ్ మాస్టర్ ఇంటి నుండి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. 'బిగ్ బాస్ 5' నాలుగో వారంలో మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. అందులో నలుగురు... యాంకర్ రవి, ఆర్టిస్ట్ ప్రియా, యూట్యూబర్ సిరి హనుమంతు, ఇంకా సన్నీ సేఫ్ జోన్‌లో ఉన్నట్టు అక్కినేని నాగార్జున శనివారం వెల్లడించారు. మిగతా నలుగురిని అలా డేంజర్ జోన్‌లో ఉంచారు. అందులో నటరాజ్ మాస్టర్ మీద వేటు పడింది.  నటరాజ్ మాస్టర్ కాకుండా యానీ మాస్టర్, లోబో కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారు. మహిళా కోటాలో యానీ, ఎంటర్టైన్మెంట్ ఇస్తూ డ్రామా పండిస్తున్నందుకు లోబోను సేఫ్ చేసినట్టు అర్థమవుతోంది. నటరాజ్ మాస్టర్ గేమ్ పక్కన పెడితే... కొన్నిసార్లు ఆయన ఆగ్రహం డిస్కషన్ పాయింట్ అవుతోంది. అందుకే ఆయన్ను పంపించారేమో!

ఆ బూతు రోజాకు బాగా అర్థమైంది!

బుల్లితెరపై బూతుల ప్రవాహానికి 'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో ఎప్పుడో పునాది వేశాయి. ప్రత్యామ్నాయ పదాలు సృష్టించి మరీ బూతులను యథేచ్ఛగా వాడేస్తున్నారు. 'నువ్ మింగేయ్', 'మింగుతా' పదాలు కొంతమంది టీమ్ లీడర్లు స్కిట్లలో ఉపయోగించిన దాఖలాలు ఉన్నాయి. ప్రజల ఆదరణ ఉండటంతో కొందరు విమర్శలు చేస్తున్నప్పటికీ నడుస్తోంది. ఆ బూతులు మాట్లాడితే చాలామంది అర్థమవుతాయి. అయితే, డైలాగ్ ఫినిష్ చెయ్యకముందే బూతు ఏంటో అర్థం చేసుకుని మరీ రోజా నవ్వడం విశేషం.  'నువ్ తోప్ ఎహే పూరి' అని పూరి పిండిని అజర్ పొగుడుతూ ఉంటాడు. 'ఏంట్రా అలా చేస్తే ఏమొస్తుంది?' అని ఆది అడగటంతో 'ఇలా పొగిడితే పొంగుతారంట కదా' అని ఆన్సర్ ఇస్తాడు. 'ఇలా పొంగుతారు' అనే డైలాగులు వేస్తే ఆడియన్స్...' అని ఆది డైలాగ్ ఫినిష్ చెయ్యకుండా వదిలేశాడు. పొంగు పదానికి ప్రాస చూసుకుంటే 'మింగు' వస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా! యూట్యూబ్‌లో కామెంట్స్ చూస్తే ఆది స్కిట్ సూపర్ అన్నవాళ్లు ఎక్కువమంది ఉన్నారు. సో... జనాలు యాక్సెప్టెన్స్ ఉందని అనుకోవాలి.  మరో స్కిట్‌లో ఇమ్మాన్యుయేల్ బ్యాక్ సీట్ మీద సెటైర్ వేస్తూ 'మీరు కింద పడతారని ముందే తెలుసా? ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ చేసుకుని మరీ పడిపోతేనూ' అని లేడీ గెటప్ వేసిన సాయి డైలాగ్ చెప్పాడు. దానికీ రోజా పడి పడి నవ్వారు. అయితే, రోజా మీద ఒకరు యూట్యూబ్‌లో కామెంట్ చేశారు. "ఇమ్ము... ఫీల్ అవ్వకు. రోజా ఇరగబడి నవ్వుతుంది. రోజా ఎయిర్‌బ్యాగ్స్‌తో పోలిస్తే ఇమ్ము 100% బెటర్' అని కామెంట్ చేశారు ఒక నెటిజన్. ఒకొకరు జబర్దస్త్ క్వీన్ రోజా అని ఆమెను పొగిడారు. సెలబ్రిటీలకు ఇవన్నీ కామన్. తిట్టేవాళ్ళు, పొగిడేవాళ్ళు ఉంటారు.

రష్మీని ఏడిపించిన జబర్దస్త్ టీం లీడర్

'ఎక్స్ట్రా జబర్దస్త్' యాంకర్ రష్మీ గౌతమ్ వెరీ సెన్సిటివ్. 'ఢీ' షో లో ఎవరైనా మహిళలు, వృద్ధులు, మూగ జీవాలు ఎదుర్కొంటున్న సమస్యలపై డాన్స్ పెర్ఫార్మన్స్ చేస్తే ఎమోషనల్ అవుతుంది. వెంటనే కనీళ్ళు పెట్టుకుంటుంది. 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో మాత్రం నవ్వుతూ ఉంటుంది. అటువంటి రష్మీని టీమ్ లీడర్ 'రాకింగ్' రాకేష్ ఏడ్పించాడు. వినాయక చవితి సందర్భంగా చేసిన ఒక ఈవెంట్‌లో 'సుడిగాలి' సుధీర్‌కు రష్మీ గౌతమ్ ప్రపోజ్ చేసింది. తొమ్మిదేళ్ల ప్రేమకు తీపి గుర్తులుగా తొమ్మిది బహుమతులు ఇస్తూ ఒక పెర్ఫార్మన్స్ చేసింది. దాన్ని రాకేష్ పేరడీ చేస్తూ స్కిట్ చేశాడు. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్‌లో టెలికాస్ట్ కానుంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన ప్రోమోలో రాకేష్ పేరడీ స్కిట్ గ్లింప్స్‌ చూపించారు. ఆ స్కిట్ చూసి రష్మీ గౌతమ్ కన్నీళ్లు పెట్టుకుంది.  తన పెర్ఫార్మన్స్ స్పూఫ్ చేసినందుకు రష్మీ గౌతమ్ భావోద్వేగానికి గురైందా? మరొకటా? అన్నది ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే తెలుస్తుంది. రష్మీ ఎమోషనల్ కావడంతో స్కిట్ మధ్యలో ఆపేసి రాకేష్ స్టేజి దిగాడు. మొత్తం మీద కొంత డిస్ట్ర‌బెన్స్‌ జరిగిందనేది స్పష్టమవుతోంది. 

ఆలీ ఇంట్లో అందాలభామలకు భోజనాలు

ఇండస్ట్రీలో హాస్యనటుడు ఆలీ అందరివాడు. ఆయనకు వెండితెరతో పాటు బుల్లితెరలో నటించే తారలతో సత్సంబంధాలు ఉన్నాయి. పైగా, ఆలీ కూడా ‘ఆలీతో సరదాగా’ టాక్‌ షో చేస్తున్నారు. అప్పుడప్పుడూ కొన్ని షోలకు వెళతారు. తాజాగా బుల్లితెర యాంకర్లు, నటీనటులు కొంతమందిని ఇంటికి పిలిచి భోజనాలు పెట్టారు. ఆలీ ఇంట్లో వండే బిర్యానీలకు చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. లేటెస్ట్‌ టీవీ సెన్సేషన్‌ అషురెడ్డి అదే విషయాన్ని చెప్పింది. ‘థ్యాంక్యూ సో మచ్‌ ఫర్‌ వండర్‌ఫుల్‌ డిన్నర్‌ ఆలీగారు. బిర్యానీ మేకింగ్‌ కింగ్‌’ అని అషురెడ్డి పేర్కొంది. ఆలీ ఇంట్లో భోజనాలు సంగతి కూడా ఆమె బయటపెట్టారు. యాంకర్లు ఉదయభాను, శ్యామల, మృదుల, సావిత్రి, ఫీమేల్‌ ఆర్టిస్టులు హిమజ, శ్రీవాణి, సోనియా సింగ్‌ తదితరులు భోజనాలు చేసిన బ్యాచ్‌లో ఉన్నారు. వీళ్లందరూ య్యూట్యూబ్‌ కోసం ప్రత్యేకంగా వీడియోలు చేస్తున్నవాళ్లే. త్వరలో ఆలీ ఇంట్లో భోజనాల ప్రోగ్రామ్‌ ఒకటి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

బుల్లితెరపై పడిపోతున్న ఎన్టీఆర్‌ షో రేటింగ్స్‌!

బుల్లితెరపై యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ దూసుకువెళడానికి ఆశిస్తే... వ్యవహారం అందుకు రివర్స్‌లో ఉంది. టీఆర్పీల లెక్క ప్రకారం ‘బిగ్‌ బాస్‌’ హోస్ట్‌గా అదరగొట్టిన ఆయన... ‘ఎవరు మీలో కోటీశ్వరులు’తో సేమ్‌ మ్యాజిక్‌ రిపీట్‌ చెయ్యలేకపోతున్నారు. బుల్లితెరపై ఆయన షో టీఆర్పీ రేటింగ్‌, గ్రాఫ్‌ కిందకు పడుతూ ఉండటం జెమిని యాజమాన్యాన్ని కొంత కలవరపెట్టే అంశమే. రేటింగ్‌ పటడానికి ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగే టైమింగ్స్‌ కూడా కొంత కారణమని చెప్పక తప్పదు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమంతో ఎన్టీఆర్‌ ‘జెమిని టీవీ’కి మాంచి బూస్ట్‌ ఇచ్చారు. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ గెస్ట్‌గా వచ్చిన కర్టెన్‌ రైజర్‌ ఎపిసోడ్‌కు 11.42 టీఆర్పీ వచ్చింది. నాగార్జున హోస్ట్‌ చేస్తున్న ‘బిగ్‌ బాస్‌ 5’కు వచ్చిన టీఆర్పీ 18తో పోలిస్తే... ఎన్టీఆర్‌ షో రేటింగ్‌ తక్కువ అయిన్నప్పటికీ తీసిపారేయలేం. తొలి వారం మంచి టీఆర్పీ నమోదు చేసింది. యావరేజ్‌గా 5 పాయింట్స్‌ వచ్చాయి. రెండో వారం యావరేజ్‌ టీఆర్పీ రేటింగ్‌ తీసుకుంటే 6 ఉంది. సో... వారం వారానికి పెరుగుతుందని ఆశిస్తే, ఇప్పుడు తగ్గింది. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో రేటింగ్‌ మూడో వారం పెరగలేదు. అలాగని, మరీ తగ్గలేదు. కానీ, తర్వాత వారంలో మేజర్‌ డ్రాప్‌ కనిపించింది. యావరేజ్‌ టీఆర్పీ రేటింగ్‌ తీసుకుంటే... జస్ట్‌ 4 ఉందంతే! దీనికి కారణాలు ఏమిటని విశ్లేషిస్తే... ఐపీఎల్‌ మ్యాచ్‌ల ప్రభావం కొంత ఉందని తెలుస్తోంది. అయితే... ఈటీవీ హిట్‌ కామెడీ షో ‘జబర్దస్త్‌’కు యావరేజ్‌ వీక్‌ టీఆర్పీ 7 ఉండటం గమనార్హం. ‘జబర్దస్త్‌’, ‘ఎక్ట్జా జబర్దస్త్‌’ గానీ, ‘ఢీ’ గానీ రాత్రి తొమ్మిదిన్నరకు ప్రసారమవుతాయి. వాటితో పోటీ లేకుండా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ను ఎనిమిదిన్నరకు ప్రసారం చేస్తున్నారు. అయినా జనాలు షో చూడట్లేదు. మగమహారాజులంతా ఐపీఎల్‌ మీద పడ్డారు. మహిళల ఆదరణతో మాటీవీ, జీటీవీ, ఈటీవీ సీరియళ్లు, షోలకు టీఆర్పీలు బావున్నాయి.

చిక్కులో చిక్కుకునేదెవ‌రు?

కొత్త టాస్క్‌ల‌తో హౌస్‌మేట్స్ లోని పోటీత‌త్వాన్ని ప‌రీక్షిస్తున్న బిగ్‌బాస్ ఈరోజు "చిక్కులో చిక్కుకోకు" అనే టాస్క్ ఇవ్వ‌నున్న‌ట్లు కొత్త ప్రోమోలో వెల్ల‌డించారు. ఈ ప్రోమోలో "సారంగ‌ద‌రియా" పాట‌కు హౌస్‌మేట్స్ అంద‌రూ డ్యాన్స్ చేస్తూ స‌ర‌దాగా క‌నిపిస్తున్నారు.  బ‌రువును త‌గ్గించుకోవ‌డానికి ఇచ్చిన చిక్కులో చిక్కుకోకు టాస్క్‌లో హౌస్‌మేట్స్ అంద‌రూ ఉత్సాహంగా పాల్గొన్నారు. "ఏ జంట అయితే ఎక్కువ బ‌రువు కోల్పోతారో వారిలో నుండే కెప్టెన్ పోటీదారులు ఎంచుకోబ‌డ‌తారు" అంటూ ర‌వి ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తున్న‌ది.  "తొలి వారం వాడికి అవ‌కాశం వ‌చ్చింది ఇప్పుడు నేను అడుగుతా వ్యాలీడ్ రీజ‌న్" అంటూ స‌న్నీ పేర్కొన‌డం..."ఫిజిక‌ల్ టాస్క్ కాకుండా వేరే టాస్క్ వ‌స్తే అప్పుడు ప‌రిస్థితి ఏంటి?" అంటూ అత‌డితో మాన‌స్ చెప్ప‌డం ఉత్కంఠ‌ను పంచుతున్న‌ది. శ్రీ‌రామ్ వ‌స్తాడ‌ని స‌న్నీ అన‌గా... "శ్రీ‌రామ్ వ‌స్తే నేను ఉంటా" అని గ‌ట్టిగా మాన‌స్‌ స‌మాధానం ఇవ్వ‌డం వెనుక ఏదో గూడుపుఠాని ఉన్న‌ట్లుగానే క‌నిపిస్తున్న‌ది. శ్రీ‌రామ్‌, మాన‌స్‌ మ‌ధ్య ఏం జ‌రుగుతుందో ఈ రోజు ఎపిసోడ్‌లో తేల‌నుంది.

హ‌రి పేరు టాటూగా వేసుకున్న ప‌దిమంది అమ్మాయిలు! అషు సంగ‌తేంటి?

  అషు పేరును చెస్ట్ మీద టాటూగా వేయించుకుని టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు హ‌రి. అది చెరిపేస్తే చెరిగిపోయేది కాద‌నీ, నిజ‌మైన టాటూయేన‌నీ హ‌రి నిరూపించాడు. 'కామెడీ స్టార్స్' షోలో అషు-హ‌రి జోడీ బాగా పాపుల‌ర్ అయింది. వ‌చ్చే ఆదివారం ఎపిసోడ్‌లో టాటూ మీద మ‌రో స్కిట్ చేశాడు హ‌రి. అయితే ఈసారి అషు లేకుండా ఈ స్కిట్‌ను చేయ‌డం ఆస‌క్తిక‌రం. ఒక కాలేజీ అమ్మాయితో, "నేను మిమ్మ‌ల్ని గుండెల్లో పెట్టుకొని ప్రేమించాను తెలుసా?" అని చెప్పాడు హ‌రి. "అదేంటీ.. బ‌య‌టంతా వేరేవాళ్ల పేరేసుకున్నార‌ని చెప్పారు?" అని అడిగిందామె. "అవి జ‌స్ట్ పేర్లు.. తుడిపేస్తే ఇలా చెరిగిపోతాయ్" అని యాక్ష‌న్ చేస్తూ చెప్పాడు హ‌రి. దాంతో జ‌డ్జి శ్రీ‌దేవి క‌ల‌గ‌జేసుకొని "ఏయ్‌.. అషుతో ఐపోయారే హ‌రి మీరు" అంది. దాంతో ఖంగుతిన్న‌ట్లు ఎగిరి గంతేసి, న‌వ్వేశాడు హ‌రి. ఆ త‌ర్వాత వీల్ చైర్‌లో కూర్చొని క‌నిపించాడు హ‌రి. అత‌ని వెనుక ప‌దిమంది అమ్మాయిలు నిల్చున్నారు. "నేను ఒక్క టాటూ వేసుకున్నందుకే మీరు నాలో అంత ప్రేమ‌ను చూశారు. ఈరోజు ప‌ది మంది అమ్మాయిలు ప‌ది చేతుల మీద నా పేరు టాటూగా వేసుకున్నారు" అని ఎమోష‌న‌ల్ అవుతూ చెప్పాడు హ‌రి. అమ్మాయిలంద‌రూ HARI అని టాటూ వేయించుకున్న చేతుల‌ను చూపారు. అదిచూసి శ్రీ‌ముఖి, "ఆ క‌టౌట్‌కి అంత‌మందంటే.. అయ్యో రామా!" అని పెద్ద‌గా న‌వ్వేసింది. వ‌చ్చే ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్ర‌సార‌మ‌య్యే ఎపిసోడ్‌లో హ‌రి టాటూ స్కిట్ బాగా న‌వ్వించ‌నున్న‌ట్లు లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ప్రోమోను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. దీనిపై అషు ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.

నాగార్జున గుంట‌న‌క్క అంటుంటే అంద‌రూ నావైపే చూస్తున్నారు!

  రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. టీవీ షోల్లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్లకు కూడా సేమ్ ఫార్ములా అప్లై అవుతుందని అనుకోవాలేమో! 'బిగ్ బాస్'లో ఈరోజు కలిసిమెలిసి ఉన్నోళ్ళు... రేపు మాటల కత్తులు దూసుకుంటున్నారు.‌ మరునాడు మళ్లీ కలుస్తున్నారు.‌ షోలో అటువంటి దృశ్యం ఒకటి చోటు చేసుకుంది. ప్రియను నామినేట్ చేస్తూ లోబో గట్టిగా అరిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. యాంకర్ రవి 'తప్పు మన వైపు ఉన్నప్పుడు మనమే వెళ్లి సారీ చెప్తే పెరుగుతాం' అని సలహా ఇవ్వడంతో... ప్రియ దగ్గరకు వెళ్ళిన లోబో ఆమెకు హగ్ ఇచ్చాడు. ఆమె నార్మల్ అయినట్టే అనిపించింది. మరోవైపు గతవారం తనను ఏడిపించిన రవి దగ్గరకు ప్రియా వెళ్ళింది. 'ఇక నార్మల్ అయిపో. అయిపోయింది ఏదో అయిపోయింది' అని ఓదార్చే ప్రయత్నం చేసింది. 'బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నా. నాతో నాకే ఫైట్' అని రవి చెప్పాడు. మొత్తం మీద తన రెండు నాల్కల ధోరణి బయటపడడంతో బాగా ఫీల్ అయినట్టు వున్నాడు. నటరాజ్ మాస్టర్ దగ్గర 'నాగార్జునగారు గుంటనక్క అంటుంటే అందరూ నావైపే చూస్తున్నార'ని బాధపడ్డాడు.

రాకేష్‌తో రిలేష‌న్‌షిప్‌పై రోహిణి ఏం చెప్పిందంటే..!

  'జబర్దస్త్' వీక్షకులకు ఫిమేల్ ఆర్టిస్ట్ రోహిణి సుపరిచితురాలు. బుల్లితెరపై దూసుకువెళ్తున్న తార‌ల్లో ఆమె ఒకరు. లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చాట్ చేశారు. రాకేష్‌తో రిలేషన్షిప్, 'బిగ్ బాస్'లో తన సపోర్ట్ తదితర అంశాల గురించి ఓపెన్ అయ్యారు. ఫాలోవ‌ర్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన స్టైల్‌లో ఆమె ఆన్స‌ర్లు ఇచ్చారు. * అక్కా... మీరు శ్రీదేవి డ్రామా కంపెనీలో రావడం లేదు. ఎందుకు? ఆ రెండు ఎపిసోడ్స్ లో లేను. నెక్స్ట్ నుండి వస్తా.   * 'బిగ్ బాస్ 5'లో మీ సపోర్ట్ ఎవరికి? సన్నీ భాయ్.  * ఎందుకు సన్నీని సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారు? అతను నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్యామిలీ లెక్క. మంచి అయినా, చెడు అయినా అతనికి అండగా నిలబడతా.   * 'బిగ్ బాస్'లో ఫస్ట్ సన్నీ అయితే సెకండ్ ఎవరికీ సపోర్ట్ చేస్తారు? విశ్వ, యాంకర్ రవి, సిరి హనుమంతు.  * సీరియల్ చేస్తానని అన్నారుగా. స్టార్ట్ అయ్యిందా? డేట్స్ ప్రాబ్లమ్ వల్ల క్యాన్సిల్ అయ్యింది. మళ్ళీ మంచి సీరియల్ తో రావాలని ఆశిస్తున్నా.  * హాలీవుడ్ లో ఎందుకు ట్రై చెయ్యట్లేదు? మన ఇంట్లో ఫ్రైలు చేసుకోవాలి కానీ అలాంటివి ట్రై చేయకూడదు.  * మీరు, రాకేష్ రిలేషన్ లో ఉన్నారా? నో వే. అంటే... అటువంటి అవకాశమే లేదు అన్నట్టు.   * మీది, సుధీర్ ది ఫొటో. ఇప్పటివరకూ ఎవరూ చూడనిది.  అంత అన్‌సీన్ పిక్స్ ఏమీ దిగలేదు.  

రెండు కొత్త క్యారెక్ట‌ర్లు.. శౌర్య‌, హిమ‌ల‌కు బావ‌లు వ‌చ్చారు!

  రోజుకు ఒక మలుపుతో 'కార్తీక దీపం' సీరియల్ కొత్త దారుల్లో పయనిస్తోంది. మోనిత జైలుకు వెళ్లిందన్న మాటే గానీ కార్తీక్ కుటుంబంలో ఎవరికీ సుఖం లేకుండా చేస్తోంది. మోనిత చేస్తున్న పనులకు కార్తీక్, దీప దంపతులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మరోవైపు తండ్రిని దోషిలా చూడటమే కాదు, మోనితను నిజంగా తమ తండ్రి మోసం చేశాడని కార్తీక్ పిల్లలు బాధపడుతున్నారు. ఇప్పుడు కథంతా తండ్రి, పిల్లల చుట్టూ తిరుగుతోంది. మరింత ఆసక్తికరంగా మారుతోంది. స్కూల్ ఫ్రెండ్ షైనీ చెప్పింది నిజమా? కదా? అని తండ్రిని పిల్లలు హిమ, శౌర్య నిలదీయడంతో 'ఆయన (కార్తీక్) ఏ తప్పూ చేయలేదు. అంత ప్రేమ చూపించే తండ్రి మీద మీకు కోపం ఏంటి? పంతం ఏమిటి?' అని దీప చెప్పడంతో పిల్లలు మామూలు అవుతారు. అయితే, మరుసటి ఉదయం పేపర్ చూసి కార్తీక్ మళ్లీ తలపట్టుకుంటాడు, షాక్ అవుతాడు.  'నా బిడ్డకు తండ్రి అతనే... ఓ డాక్టర్ వింత ప్రేమకథ' హెడ్డింగ్ తో ఓ పత్రికలో మోనిత రాసిన వెర్షన్ కథగా ప్రచురితమై ఉంటుంది. అందులో తన పేరు చివరన కార్తీక్ చేరాక ఆనందం వచ్చిందని, తన జీవితంలో ఉత్తేజం వచ్చిందని మోనిత రాసుకొస్తుంది. కార్తీక్ బిడ్డకు తల్లి కాబోతున్నందుకు గర్వంగా ఉందని అంటుంది. 'ప్రేమకు హద్దులు చెరిపేశా. కొత్త నిర్వచనం ఇచ్చా. నా ప్రేమను గెలిపించుకోవడానికి ఏ పరీక్షకైనా సిద్ధమే. దీపక్క మొగుడు కార్తీకే నాకు పుట్టబోయే బిడ్డకు తండ్రి' అని పత్రికలో రాసిన కథలో మోనిత చెబుతుంది. తరువాత సంచికలో మోనిత ఎవరు? కార్తీక్ ఎవరు? అనేది చదవమని, చదివించమని పాఠకులను కోరుతుంది.  ఆ పేపర్ చదివి కార్తీక్ షాక్ అవుతాడు. దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. పిల్లలకు కనిపించకుండా పరుపు కింద పేపర్ పెడుతుంది మోనిత. డబ్బుల కోసం పిల్లలు పరుపు కింద చూడటంతో ఆ పేపర్ వాళ్ల కంట కనబడుతుంది. దాంతో నిజంగా తండ్రి మోసం చేశాడని మరోసారి బాధపడతారు.  మోనిత మేటర్ పక్కన పెడితే... కార్తీక్ కుటుంబంలో మరో రెండు కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇచ్చాయి. సౌందర్య కుమార్తె పిల్లలుగా ఇద్దరు అబ్బాయిలు ప్రేమ్, నిరుపమ్ తెరపైకి వచ్చారు. కార్తీక్ పిల్లలు హిమ, శౌర్యకు వాళ్ళు బావ వరుస అన్నమాట. వీళ్ళ మధ్య ప్రేమకథలు నడుపుతారేమో చూడాలి.   

ఆ ప‌దం వాడ‌తావా? నాతో మాట్లాడ‌కు!

  బుల్లితెరపై తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ మహిళా వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రవి, 'బిగ్ బాస్' ఇంటి లోకి వెళ్ళిన తర్వాత మహిళలకు శత్రువు అవుతున్నాడు. ఇంటిలో మహిళా సభ్యులు ఒక్కొక్కరుగా రవి ప్రవర్తనతో ఆగ్రహం చెందుతున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. గత వారం రవి కారణంగా ప్రియా వెక్కివెక్కి ఏడ్చారు. ఈ వారం రవి మాటకు కాజల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అసలు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే... నాలుగో వారంలో ఆర్జే కాజల్ ను రవి నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు అతను ఉప‌యోగించిన‌ పదంపై కాజల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మంగళవారం కాజల్, మానస్ గార్డెన్ ఏరియాలో మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో... వాళ్ళిద్దరి దగ్గరకి రవి వచ్చాడు. వెంటనే కోపంతో అక్కడినుండి కాజల్ లేచి వెళ్ళిపోయింది.‌ రవితో పాటు మానస్ కూడా ఆమెను కూర్చోమని అడిగారు.‌ అప్పుడు రవిని కాజల్ ప్రశ్నించింది. 'ఫిజికల్ ఏంటి?' అని! 'కొట్టడం ఫిజికల్ కాదా?' అని రవి అడిగాడు. 'ఆ పదం వాడతావా? నాతో మాట్లాడకు' అని వెళ్ళిపోయింది.‌ సిరి హనుమంతును పట్టుకుని ఏడ్చింది.

'క్యాష్' నుండి వాకౌట్ చేసిన రాఘవేంద్రరావు!

  దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుకు మౌనముని అని పేరు. గతంలో ఆయన అసలు సినిమా వేడుకలోనూ, మీడియా ముందు అసలు మాట్లాడే వారే కాదు.‌ 'సౌందర్య లహరి' కార్యక్రమంతో మౌనాన్ని వీడి, మనసులో భావాలను పంచుకోవడం మొదలుపెట్టారు. అయినా... రాఘవేంద్ర‌ రావు పబ్లిక్ గా ఎవరి మీదా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు లేవు.‌ అటువంటి రాఘవేంద్రుడు ఒక టీవీ షో నుండి వాకౌట్ చేశారు. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'క్యాష్'కు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన 'పెళ్లి సందడి' హీరో రోషన్, హీరోయిన్ శ్రీలీల, దర్శకురాలు గౌరీ రోణంకి, రచయిత శ్రీధర్ సీపాన విచ్చేసారు. వారితో పాటు రాఘవేంద్రరావు కూడా ఉన్నారు.‌ షో చాలా సరదాగా మొదలైంది. చెట్టు నుండి ఆపిల్ కింద పడడంతో న్యూటన్ గ్రావిటీ థియరీ కనిపెడితే... యాపిల్ ఎక్కడ పడాలో (హీరోయిన్ల బొడ్డు మీద) తాను కనిపెట్టానని రాఘవేంద్రరావు అనడంతో షోలో అందరూ నవ్వేశారు‌.  సరదాగా సాగుతున్న షోలో రాఘవేంద్రరావుకు కోపం తెప్పించిన అంశం... క్యాష్! అవును. తమ చిత్ర బృందం సభ్యులు ఎవరికీ డబ్బులు రాకపోవడంతో చీటింగ్ జరుగుతోందని అందరితో కలిసి వాకౌట్ చేశారు. ఇదంతా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయడం కోసం చేశారో... నిజంగానే వెళ్లిపోయారో... నెక్స్ట్ వీక్ తెలుస్తుంది.

ప్రియను ఏడ్పించిన లోబో!

  'బిగ్ బాస్-5' ప్రోగ్రామ్ ప్రారంభమై మూడు వారాలు గడిచింది. నాలుగో వారంలోకి ఎంటరైంది. ఆల్మోస్ట్ షోలో ఫైర్ బ్రాండ్స్ ఎక్కువమంది కనిపిస్తున్నారు. కానీ, అందరిలో ప్రియ మాత్రం డిఫరెంట్. ఆమె సెన్సిటివ్ కింద కనిపిస్తున్నారు. ఎమోషనల్ అవుతున్నారు. వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. లాస్ట్ వీక్ లహరి విషయంలో రవి మాట మార్చినప్పుడు 'నువ్ అన్నావ్ బ్రో' అని ప్రియ వెక్కి వెక్కి ఏడ్చింది. మరోసారి మళ్ళీ అటువంటి సీన్ రిపీట్ అయ్యింది. ఈసారి ప్రియను ఏడ్పించినది లోబో.  నామినేషన్స్ సమయంలో తన ప్రేమకథ చెబుతున్నప్పుడు ఏదో సినిమాలా ఉందని ప్రియ అన్నదని, అది తనను చాలా బాధించిందని లోబో చెప్పాడు. ప్రియ వివరణ ఇవ్వబోతే గట్టిగా అరిచాడు. తర్వాత ఏడ్చాడు. అప్పుడు 'మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకొకటి మాట్లాడొద్దు లోబో' అని ప్రియ చెప్పింది. తనపై లోబో అలా అరవడంతో వెక్కి వెక్కి ఏడ్చింది. తనను నామినేట్ చేసిన లోబోను ప్రియ నామినేట్ చేసింది.