బిగ్ షాక్‌! జెస్సీని హౌస్ బ‌య‌ట‌కు పంపేసిన బిగ్ బాస్‌!!

  ఆడియెన్స్‌తో పాటు హౌస్‌మేట్స్ అంద‌రికీ బిగ్ బాస్ ఊహించ‌ని షాక్ ఇచ్చాడు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న జెస్సీని హౌస్ బ‌య‌ట‌కు పంపాడు. "జ‌స్వంత్ మీ ఆరోగ్య ప‌రిస్థితి ఇంకా మెరుగుప‌డ‌లేద‌నే సంగ‌తి మీక్కూడా తెలుసు. అందుకోసం మీరు ఇంటినుంచి బ‌య‌ట‌కు రావాల్సి ఉంటుంది. మెయిన్‌గేట్ నుంచి బ‌య‌ట‌కు రండి." అని బిగ్ బాస్ సూచించాడు. క‌ళ్లు నులుముకుంటూ, ఏడుపు ఆపుకుంటూ రూమ్‌లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన జెస్సీ, హౌస్‌మేట్స్‌తో "గైస్‌! నేను హౌస్‌ని వ‌దిలి వెళ్తున్నా" అని అనౌన్స్ చేశాడు. అంద‌రూ షాకైపోయారు. సిరి ఏడుస్తూ జెస్సీని గ‌ట్టిగా కౌగిలించుకుంది. జెస్సీ కూడా ఏడుస్తూ "ఐ మిస్ యు రా" అన్నాడు.  ర‌వి.. "జెస్సీ నువ్వు ఫైట‌ర్‌వి. ధైర్యంగా ఉండు" అని భుజం త‌ట్టాడు. ఆ త‌ర్వాత ష‌ణ్ణును కావాలించుకున్నాడు జెస్సీ. సిరి తిరిగివ‌చ్చి ఆ ఇద్ద‌ర్నీ కౌగ‌లించుకుంది. ముగ్గురూ బాధ‌తో క‌న్నీళ్లు పెట్టుకున్నారు. సిరి అయితే బిగ్గ‌ర‌గా ఏడ్చేసింది. జెస్సీ మెయిన్ గేట్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ప్పుడు ప‌రిగెత్తుకొని వెళ్లి, అత‌డి నుదుటిపై ముద్దు పెట్టుకుంది. అత‌డు బ‌య‌ట‌కు వెళ్లాక కూడా ఏడుస్తూనే ఉంది. జెస్సీ అలా అర్ధంత‌రంగా వెళ్లిపోవ‌డంతో ష‌ణ్ణు, సిరి ఇద్ద‌రూ బాగా హ‌ర్ట‌యిన‌ట్లు క‌నిపించారు.  ఈవారం విశ్వ ఎలిమినేష‌న్‌కు గురై హౌస్ నుంచి వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అనారోగ్యంతో జెస్సీ బ‌య‌ట‌కు వెళ్లిపోయిన‌ట్లు చూపించారు. నిజంగానే జెస్సీ హౌస్‌ని వదిలి బయటకు వచ్చేశాడా?  లేక ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని పెంచ‌డానికి ప్రోమోను అలా క‌ట్ చేశారా? ఈ ప్ర‌శ్న‌ల‌కు ఈ రోజు ప్ర‌సార‌మ‌య్యే ఎపిసోడ్ చూస్తే జ‌వాబులు దొరుకుతాయి.

స్పెష‌ల్ ప‌వ‌ర్‌తో కాజ‌ల్‌ను నామినేట్ చేసిన యానీ మాస్ట‌ర్‌!

  ష‌ణ్ణు, సిరి, జెస్సీ గురించి మాన‌స్‌, స‌న్నీ మాట్లాడుకుంటూ వుండ‌గా బిగ్ బాస్ హౌస్‌లో 65వ రోజు ప్రారంభ‌మైంది. జెస్సీ ఒంట్లో బాగాలేన‌ట్లు క‌నిపించాడు. ష‌ణ్ణు త‌న‌పై బాల్స్ విసిరేసిన‌ప్పుడు త‌న‌కు దెబ్బ‌లు త‌గిలాయ‌ని అత‌ను కాజ‌ల్‌తో చెప్పాడు. ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ ఐట‌మ్స్ కోసం హౌస్‌మేట్స్ షాపింగ్ చేశారు. ఆ టైమ్‌లో యానీ మాస్ట‌ర్‌, కాజ‌ల్ వాదించుకున్నారు. నామినేష‌న్ ప్రాసెస్‌ను బిగ్ బాస్ స్టార్ట్ చేశాడు. ఇంటి స‌భ్యులు న‌లుగురు వ్య‌క్తుల్ని నామినేట్ చేసి, వారిని జైలులో ఉండేట్లు చేయాలి. కెప్టెన్ హోదాలో కాజ‌ల్‌, స‌న్నీ, మాన‌స్, ష‌ణ్ణుల‌ను యానీ నామినేట్ చేసింది. ప్రియాంక తాళాల‌ను ద‌క్కించుకుని మాన‌స్‌ను విడుద‌ల చేసింది. ర‌వి, జెస్సీల‌ను నామినేట్ చేస్తున్న‌ట్లు మాన‌స్ చెప్పాడు. మాన‌స్‌తో ర‌వి గొడ‌వ‌ప‌డ్డాడు. నామినేష‌న్స్ కోసం జెస్సీని జైలుకు పంపింది ప్రియాంక‌. జెస్సీని సిరి కాపాడ‌గా, మాన‌స్‌, ప్రియాంక‌ల‌ను నామినేట్ చేశాడు జెస్సీ. మాన‌స్‌ను సిరి జైలుకు పంపింది. కీస్ ద‌క్కించుకొని ష‌ణ్ణును బ‌య‌ట‌కు తెచ్చాడు జెస్సీ. ప్రియాంక‌, సిరిల‌ను నామినేట్ చేశాడు ష‌ణ్ణు. నామినేష‌న్స్ కోసం ప్రియాంక‌ను పంపాడు జెస్సీ. కాజ‌ల్‌ను శ్రీ‌రామ‌చంద్ర కాపాడాడు. ర‌వి, సిరిల‌ను నామినేట్ చేసింది కాజ‌ల్‌. సిరిని నామినేష‌న్స్ కోసం పంపాడు శ్రీ‌రామ‌చంద్ర‌. సిరి లేదా ష‌ణ్ణును కాపాడ‌మ‌ని కాజ‌ల్‌ను అడిగాడు శ్రీ‌రామ‌చంద్ర‌. ష‌ణ్ణును కాజ‌ల్ కాపాడింది. ర‌వి, శ్రీ‌రామ్‌ల‌ను ష‌ణ్ణు ఎంచుకున్నాడు. ర‌విని కాజ‌ల్ జైలుకు పంపింది. అలా ఈవారం ర‌వి, సిరి, స‌న్నీ, మాన‌స్ నామినేష‌న్లు పొందారు. కెప్టెన్ యానీకి స్పెష‌ల్ ప‌వ‌ర్ ఇచ్చి, ఒక‌రిని నామినేట్ చేయాల‌ని బిగ్ బాస్ అడిగాడు. ఆమె కాజ‌ల్‌ను నామినేట్ చేసింది.

బిగ్ బాస్ 5.. తొమ్మిది వారాలకు 'విశ్వ'కి అంత ముట్టిందా!!

బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ తొమ్మిది వారాలు పూర్తి చేసుకుంది. తొమ్మిదో వారంలో అనూహ్యంగా విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న విశ్వ ఫైనల్ కి చేరతాడని భావించారంతా. కానీ ఊహించని విధంగా ఆయన ఎలిమినేట్ కావడంతో ఆడియన్స్ తో పాటు హౌస్ మేట్స్ కూడా షాక్ అయ్యారు. నిజంగా ఓట్లు తక్కువ పోలై విశ్వ ఎలిమినేట్ అయ్యాడా? లేక మరేదైనా కారణముందా అనే చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తొమ్మిది వారాలకు గాను విశ్వకు భారీగానే రెమ్యునరేషన్ ముట్టినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు విశ్వ పలు సందర్భాల్లో చెప్పుకున్నాడు. అయితే బిగ్ బాస్ షో పుణ్యమా అని ఆయన ఆ ఇబ్బందుల నుండి బయటపడినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ లో విశ్వకి రెమ్యునరేషన్ బాగానే ముట్టిందట. వారానికి రెండున్నర లక్షల చొప్పున తొమ్మిది వారాలకు గాను 22లక్షలు ఆయనకు ముట్టినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో బుల్లితెరపైనా, వెండితెరపైనా నటుడిగా అలరించిన విశ్వ.. బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తో నటుడిగా ఇంకా బిగ్ ఆఫర్స్ దక్కించుకుని సత్తా చాటుతాడేమో చూడాలి.

బాలయ్య షోకి నాని.. అన్‌స్టాపబుల్ ఎంటర్‌టైన్‌మెంట్

ప్రముఖ ఓటీటీ వేదిక 'ఆహా'లో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' పేరుతో నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ ఎపిసోడ్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ లో మంచు ఫ్యామిలీతో కలిసి బాలయ్య అలరించారు. ఓల్డ్ ఫార్మాట్ ను బ్రేక్ చేస్తూ బాలయ్య హోస్ట్ చేస్తున్న విధానానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సెకండ్ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సెకండ్ ఎపిసోడ్ కు నేచురల్ స్టార్ నాని గెస్ట్ గా రాబోతున్నట్లు తాజాగా ఆహా అధికారికంగా ప్రకటించింది. బిగ్ బాస్ షోతో పాటు పలు స్పెషల్ సినిమా ఈవెంట్స్ లో హోస్ట్ గా చేసిన అనుభవం నానికి ఉంది. ఇక బాలయ్య హోస్ట్ గా లేట్ గా ఎంట్రీ ఇచ్చినా ఓ రేంజ్ లో అలరిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు వీరిద్దరూ కలిస్తే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దానికి తోడు నానికి బాలయ్య అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ' సినిమాలో చేతి మీద 'జై బాలయ్య' టాటూతో బాలయ్య వీరాభిమానిగా కనిపించారు నాని. షోలో ఈ విషయం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. 'మ‌న‌లో ఒక‌డు, సెల్ఫ్ మేడ్‌ కి స‌ర్ నేమ్.. మ‌న రెండో గెస్ట్ నాని' అని తెలుపుతూ ఆహా సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసింది. ఫోటోలలో బాలయ్య , నానిలు చిరున‌వ్వులు చిందిస్తూ కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈరోజు(సోమవారం) సాయంత్రం 5.04 గంట‌ల‌కు రెండో ఎపిసోడ్ ప్రోమో విడుద‌ల అవుతుంద‌ని ఆహా ప్రకటించింది.

హై రేంజ్ లో హైపర్ ఆది సంపాదన.. రీసెంట్ గా కొన్న ఆస్తులు తెలిస్తే షాక్!

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షోలో తన పంచ్ లు, కామెడీ టైమింగ్ తో తక్కువ టైంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది.. పలు టీవీ షోలు, సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తక్కువ టైంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న ఆది.. సంపాదన విషయంలోనూ తక్కువ టైంలోనే బాగా వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. టీవీ షోలు, ఈవెంట్ లకు ఆది రెమ్యునరేషన్ భారీ గానే ఉంటుందని టాక్. జబర్దస్త్ లో ఒక్కో స్కిట్ కి లక్షల్లో రెమ్యునరేషన్ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈవెంట్స్ లో కూడా.. ఈవెంట్ రేంజ్ ని బట్టి ఆది రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తాడట. ఇలా టీవీ షోలు, ఈవెంట్ లు, సినిమాలు కలిపి ఆది సంపాదన ఏడాదికి కోటి రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లుగా.. ఆది ఫేమ్ ఉండగానే బాగా సంపాదిస్తున్నాడట. అంతేకాదు ఆ సంపాదనని వృధా ఖర్చు చేయకుండా ముందు చూపుతో ప్రాపర్టీస్ కొంటున్నాడట. ఇప్పటికే సొంత ఊళ్ళో 16 ఎకరాల పొలం కొన్న ఆది.. తాజాగా హైదరాబాద్ లో ఒక ప్లాట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

దీపావ‌ళి ట‌పాసులా పేలిన మోహ‌న్‌బాబుతో బాల‌య్య ఇంట‌ర్వ్యూ!

  ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురుచూసిన‌ 'అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే' షో ఎట్ట‌కేల‌కు దీపావ‌ళి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న ఆహాలో స్ట్రీమింగ్ మొద‌లైంది. ఇప్ప‌టికే ఈ షో ప్రోమోస్ వీక్ష‌కుల్లో క్యూరియాసిటీని బాగా పెంచాయి. ఫ‌స్ట్ ఎపిసోడ్‌లో డైలాగ్ కింగ్ మోహ‌న్‌బాబును ఆయ‌న ఇంట‌ర్వ్యూ చేసిన తీరు శాంపిల్‌గా మ‌న‌కు చూపించారు. త‌న‌దైన స్టైల్‌లో బాల‌య్య వేసిన ప్ర‌శ్న‌లు, పంచ్‌లు ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడు ఫుల్ ఎపిసోడ్ చూద్దామా అని వారు అత్యంత ఆస‌క్తిగా ఎదురుచూశారు. ఇప్ప‌టిదాకా మ‌నం చూడ‌ని బాల‌య్య‌లోని మ‌రో కోణాన్ని అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే చూపించింద‌నే అభిప్రాయం అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతోంది. ఆరు ప‌దుల వ‌య‌సును అందుకున్న బాల‌య్య ముఖంలో ఆ వ‌య‌సు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నా, ఆయ‌న మూమెంట్స్‌లో మాత్రం అదేమీ క‌నిపించ‌లేదు. ఎంతో ఎన‌ర్జిటిక్‌గా ఆయ‌న క‌నిపించారు. మోహ‌న్‌బాబుతో ఆయ‌న సంభాష‌ణ జ‌రిపిన విధానం అల‌రించింది. మ‌ధ్య మ‌ధ్య‌లో త‌న చేష్ట‌లు, మాట‌ల‌తో ఆయ‌న వినోదాన్ని పంచారు. దీపావ‌ళి క్రాక‌ర్స్‌లా ఈ ఎపిసోడ్ అల‌రించింది. ఈ సంద‌ర్భంలోనే త‌న తాగుడు అల‌వాటు గురించి మోహ‌న్‌బాబు మ‌న‌సువిప్పి మాట్లాడారు. కెరీర్ తొలినాళ్ల‌లో త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు ఉండేవి కావ‌నీ, కోడంబాకం బ్రిడ్జి కింద సారాయి షాపుకు ఓ స్నేహితుడిలో వెళ్లి సారాయి తాగేవాడిన‌ని మోహ‌న్‌బాబు వెల్ల‌డించారు. త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు లేని రోజుల్లో సారాయి తాగాన‌నీ, ఇప్పుడు దేవుడు డ‌బ్బిచ్చాడు కాబ‌ట్టి విస్కీ తాగుతున్నాన‌నీ ఆయ‌న చెప్పారు. అలాగే మంచు ల‌క్ష్మితో బాల‌య్య చేసిన డాన్సులు, విష్ణుతో ఆయ‌న మాట్లాడిన విధానం కూడా ఆక‌ట్టుకుంద‌ని అభిమానులు అంటున్నారు. రానున్న ఎపిసోడ్ల‌లో టాలీవుడ్‌లోని ప‌లువురు టాప్ స్టార్స్‌ను బాల‌య్య ఇంట‌ర్వ్యూ చేయ‌డం మ‌నం చూడ‌నున్నాం. వారిలో ప్ర‌భాస్ కూడా ఒక‌రు.

తమన్, డీఎస్పీ లతో తారక్ గేమ్.. ఈసారి డబుల్ ఫన్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో అప్పుడప్పుడు సినీ సెలబ్రిటీలతో డబుల్ వినోదాన్ని పంచుతున్న తారక్.. ఈ దీపావళికి రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్స్ దేవిశ్రీప్రసాద్, తమన్ లతో చేసిన స్పెషల్ ఎపిసోడ్ తో స్పెషల్ డేకి సందడి చేయనున్నారు. దేవిశ్రీప్రసాద్, తమన్ లు పాల్గొన్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' స్పెషల్ ఎపిసోడ్ దీపావళి కానుకగా నవంబర్ 4న రాత్రి 8:30 కి ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటుంది. తమన్, డీఎస్పీ లతో తారక్ కి మంచి బాండింగ్ ఉంది. దీంతో ఎపిసోడ్ అంతా ఫుల్ ఫన్ తో సరదాగా సాగినట్లు తెలుస్తోంది. తారక్ తన కామెడీ టైమింగ్ తో మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరినీ ఒక ఆట ఆడుకున్నారని అంటున్నారు. ఇక ఎపిసోడ్ లో తారక్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని ప్రోమో, పోస్టర్స్ చూస్తే అర్థమవుతుంది. వైట్, బ్లూ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేసిన డ్రెస్ తో తారక్ చాలా ఎట్రాక్టివ్ గా ఉన్నారు. మరి దేవిశ్రీప్రసాద్, తమన్ లతో కలిసి తారక్ దీపావళికి ఏ స్థాయిలో అలరిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే ఈ షోలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా త్వరలో సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ స్పెషల్ ఎపిసోడ్ షూట్ కూడా పూర్తయింది. నవంబర్ 18న మహేష్ పాల్గొన్న ఎపిసోడ్ టెలికాస్ట్ కానుందని, ఆ ఎపిసోడ్ తోనే ఈ సీజన్ ముగియనుందని సమాచారం.

'ఎక్స్ట్రా జబర్దస్త్' టీమ్ లీడ‌ర్‌ను కొట్ట‌బోయిన మ‌నో!

'ఎక్స్ట్రా జబర్దస్త్' లాస్ట్ ఫ్రైడే ఎపిసోడ్ చూశారా? 'రాకింగ్' రాకేష్ స్కిట్ చేస్తున్నాడు! మధ్యలో జడ్జ్ సీటులో కూర్చున్న మనో పంచ్ డైలాగులు వేశారు. 'ఓ ముద్దు ఇవ్వొచ్చు కదా' అని రోషిణి అడిగితే... రాకేష్ డైలాగ్ చెప్పడానికి ముందు మనో చెప్పారు. 'ఏనాడైనా ఇచ్చానా' అని. నెక్స్ట్ ఆఫీసు నుండి వచ్చిన భర్తను రోహిణి గదిలోకి రమ్మని పిలుస్తుంది. 'మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఏనాడైనా...' అని రాకేష్ అనడమే ఆలస్యం 'లోపాలకి వెళ్లామా?' అని మనో డైలాగ్ అందుకున్నారు.  రాకేష్ స్కిట్ టైమ్‌లో మనో అంత సందడి చేశారు. కట్ చేస్తే... నెక్స్ట్ వీక్ ప్రోమోలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ టైమింగ్, రైమింగ్ ఏమయ్యాయో.... రాకేష్, మనో మధ్య ఏం జరిగిందో? పూర్తిగా చూపించలేదు. కానీ, రాకేష్ స్కిట్ చూసి మనో హార్ట్ అయినట్టు చూపించారు. 'ఎంత గౌరవం అయ్యా రాకేష్ నువ్వెంటే? ఏంటిది? పద్ధతేనా? మీరు చేస్తున్నది ఏంటి?' అని మనో ఆవేదన చెందినట్టు చూపించారు. ఆ తర్వాత జడ్జ్ సీటులోంచి దిగి కిందకు వెళ్లిపోయారు. రాకేష్ స్టేజి మీద నుండి కిందకు దిగగా... పైకి వెళ్లమని మనో చెప్పారు. ఆ సమయంలో కొట్టడానికి అన్నట్టు చెయ్యి ఎత్తారు. టీఆర్పీ కోసమా? లేదంటే నిజంగా గొడవ జరిగిందా? అనేది ఈ శుక్రవారం తెలుస్తుంది.

ఇంద్ర‌జలో అద్భుత‌మైన‌ సింగ‌ర్! క‌మెడియ‌న్స్ స్టాండింగ్ ఒవేష‌న్‌!!

  ఇంద్ర‌జ చ‌క్క‌ని న‌టి. ఆ విష‌యం త‌ను న‌టించిన ప్ర‌తి సినిమా ద్వారా ఆమె నిరూపించారు. అంద‌చందాలు, అభిన‌య సామ‌ర్థ్యం క‌లిగిన త‌క్కువ మంది తార‌ల్లో ఆమె ఒక‌రు. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ అభిన‌యంతోటే ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు బుల్లితెర‌పైనా ఆమె త‌న ముద్ర‌ను వేస్తున్నారు. రోజా గైర్హాజ‌రీతో కొద్ది కాలం జ‌బ‌ర్ద‌స్త్ జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించిన ఆమెను, ఆ త‌ర్వాత వివిధ షోల‌లో సెల‌బ్రిటీ జ‌డ్జిగా కొన‌సాగిస్తూ వ‌స్తోంది మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. అలాంటి షోల‌లో 'శ్రీ‌దేవి డ్రామా కంపెనీ' ఒక‌టి. రానున్న ఎపిసోడ్‌లో ఇంద్ర‌జ‌లోని మ‌రో కోణాన్ని మ‌నం చూడ‌బోతున్నాం. ఆ షో లేటెస్ట్ ప్రోమోలో ఇంద్ర‌జ సింగ‌ర్ అవ‌తారం ఎత్తారు. 'జీన్స్' సినిమాలో ఎ.ఆర్‌. రెహ‌మాన్ మ్యూజిక్ స‌మ‌కూర్చ‌గా సూప‌ర్ పాపుల‌ర్ అయిన‌ "క‌న్నుల‌తో చూసేవీ గురువా క‌నుల‌కు సొంత‌మ‌వునా" పాట‌ను ఆమె రాగ‌యుక్తంగా, తాళ‌బ‌ద్ధంగా, గ‌తి త‌ప్ప‌కుండా పాడిన వైనం అంద‌రినీ మెస్మ‌రైజ్ చేసింది. ఈ ఎపిసోడ్‌కు స్పెష‌ల్ గెస్ట్‌గా వ‌చ్చిన సీనియ‌ర్ న‌టి సుధ క‌ళ్ల‌యితే చెమ్మ‌గిల్లాయి. ఇంద్ర‌జ పాడ‌టం పూర్త‌య్యాక‌ లేచి నిల్చొని, చ‌ప్ప‌ట్ల‌తో త‌న ఆనందాతిరేకాన్ని ఆమె వ్య‌క్తం చేశారు. వారే కాదు, ఆ షోలో పాల్గొన్న క‌మెడియ‌న్స్‌.. హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీ‌ను, ఆటో రాంప్ర‌సాద్‌, రోహిణి, ఇమ్మానియేల్‌తో పాటు సింగ‌ర్ ధ‌నుంజ‌య్ కూడా స్టాండింగ్ ఒవేష‌న్ ఇచ్చారు. నిజంగా ఇంద్ర‌జ‌లో చాలా చ‌క్క‌ని సింగ‌ర్ ఉంద‌నే విష‌యం ఇప్పుడంద‌రికీ తెలిసింది.  ఈ నెల 7 మాట‌ల మాంత్రికులు త్రివిక్ర‌మ్ పుట్టిన‌రోజు. వచ్చే ఎపిసోడ్ అదే రోజు ప్ర‌సారం కానున్న సంద‌ర్భంగా త్రివిక్ర‌మ్‌కు నీరాజ‌నాలు అర్పిస్తూ కొన్ని ప‌ర్ఫార్మెన్స్‌లు చేశారు. 

ఎవరు ఆపుతారో చూద్దామన్న‌ బాలయ్య... మంచు లక్ష్మీతో స్టెప్పులు!

  "నేను మీకు తెలుసు... నా స్థానం మీ మనసు" అన్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. తొలిసారి ఆయన ఓ టాక్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆహా ఓటీటీలో ప్రసారం కానున్న 'అన్ స్టాపబుల్'కు ఆయన హోస్ట్. దీపావళి సందర్భంగా నవంబర్ 4వ తేదీ నుంచి ఈ టాక్ షో ప్రారంభం కానుంది. ఆదివారం ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, పెద్ద కుమారుడు విష్ణు, కుమార్తె లక్ష్మి 'అన్ స్టాపబుల్' ఫస్ట్ ఎపిసోడ్ గెస్టులు. మోహన్ బాబు, బాలకృష్ణ మధ్య సంభాషణలు చాలా సరదాగా సాగాయి... ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రస్తావన వచ్చినప్పుడు ఇద్దరి ముఖాలు సీరియస్ అయ్యాయి. అయితే... అంతకుముందు హీరోగా మోహన్ బాబు ఎదుర్కొన్న ఇబ్బందులను నుంచి సాయంత్రం ఏడు తర్వాత (ఏక్ పెగ్ లా... సాంగ్ నేపథ్యంలో వినిపించింది) వచ్చే టాపిక్స్ వరకు చాలా డిస్కస్ చేశారు.  మోహ‌న్‌బాబు స‌మ‌క్షంలోనే లక్ష్మీ మంచుతో కలిసి 'దంచవే మేనత్త కూతురా...' పాట కు బాలకృష్ణ స్టెప్పులు వేశారు. 'అనిపించింది అందాం... అనుకున్నది చేద్దాం ‌‌... ఎవరు ఆపుతారో చూద్దాం' అంటూ తనదైన శైలిలో బాలకృష్ణ డైలాగులు చెబుతూ షోను రక్తి కట్టించారు.

ఇండియా-న్యూజిల్యాండ్ మ్యాచ్‌ vs బిగ్ బాస్ స్పెష‌ల్‌ ఎపిసోడ్‌!

  ప్రతి వీకెండ్ 'బిగ్ బాస్'లో కింగ్ నాగార్జున సందడి చేస్తారు. దాంతో ఆడియన్ అందరూ వీకెండ్ ఎపిసోడ్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ‌ ఆదివారం మాత్రం నాగార్జునకు తోడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అతని తమ్ముడు ఆనంద్ దేవరకొండ... స్టార్ యాంకర్ సుమ... సెక్సీ హీరోయిన్ శ్రియ శరణ్...  డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అవికా గోర్... హీరో హీరోయిన్లు సంతోష్ శోభన్, మెహరీన్ కౌర్ సందడి చేశారు. వీళ్ళకి తోడు గత  సీజన్ బిగ్ బాస్ సభ్యులు సొహైల్‌, అరియానా, అవినాష్, బాబా భాస్కర్ మాస్టర్ తదితరులు షోకి వచ్చారు. దీపావళి ఈ వారమే. అయితే... ఆ‌ రోజు‌ ఎపిసోడ్‌కి నాగార్జున రారు.‌ అందుకని ఈ ఆదివారమే దీపావళి స్పెషల్ ఎపిసోడ్ డిజైన్ చేశారు. దీని వెనుక మరో కారణం కూడా ఉంది... ఆదివారం న్యూజిలాండ్, భారత్ మధ్య టి20 వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది.‌ టీమిండియా ఎట్టి పరిస్థితులలోనూ ‌విజయం సాధించాల్సిన మ్యాచ్‌ ఇది. అందుకని, తెలుగు ప్రేక్షకులు కూడా ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు.  మ్యాచ్ నుండి ప్రేక్షకుల దృష్టి షో వైపు తిప్పుకోవాలని అంటే సాధారణంగా ఉంటే సరిపోదు. సంథింగ్ స్పెషల్ అన్నట్టు ఉండాలి. టీఆర్పీలు పడిపోకుండా చూసుకోవాలి. అందుకని దీపావళిని బిగ్ బాస్ ఫుల్‌గా వాడేశాడు. దీపావళికి విడుదల అవుతున్న సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ఆయా యూనిట్ సభ్యులకు బిగ్ బాస్ వేదిక కల్పించింది. దాంతో హీరో హీరోయిన్ల వచ్చారు. క్రికెట్ vs బిగ్ బాస్... ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

టీడీపీ ప‌గ్గాలు చంద్ర‌బాబుకు ఎందుకిచ్చావ్‌? బాల‌య్య‌కు మోహ‌న్‌బాబు సూటి ప్ర‌శ్న‌!

  విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావుకు తగ్గ తనయుడిగా ఇటు సినిమాల్లోనూ, అటు రాజకీయాల్లోనూ సింహం నందమూరి బాలకృష్ణ పేరు తెచ్చుకున్నారు. హీరోగా ఆయనది ఎప్పుడూ టాప్ ప్లేస్. రాజకీయాల్లోనూ ఎమ్మెల్యేగా రాణిస్తున్నారు. తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీ పగ్గాలను అందుకోవాలనే ఆశ తనకు ఉన్నట్లు ఎప్పుడు బాలకృష్ణ చెప్పలేదు. బావ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నడుస్తున్న పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే... 'తెలుగుదేశం పార్టీ పగ్గాలు చంద్రబాబుకి ఎందుకిచ్చావ్?' అని బాలకృష్ణను మోహన్ బాబు ప్రశ్నించారు. బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్ స్టాపబుల్' ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఆదివారం విడుదల అయింది. ఈ షోకి మోహన్ బాబు తొలి అతిధిగా వచ్చారు. ఆయనతో బాలకృష్ణ ఇంటర్వ్యూ సరదాగా మొదలైంది. మధ్యలో తెలుగుదేశం పార్టీ విషయం వచ్చినప్పుడు ఇద్దరిమధ్య మాటా మాటా పెరిగింది. "చంద్రబాబుకు పార్టీ పగ్గాలు ఎందుకు ఇచ్చావు?" అని మోహన్ బాబు ప్రశ్నించిన తర్వాత... "ఆయన్ను అన్నగారు (ఎన్టీఆర్) స్థాపించిన పార్టీలో నుంచి వెళ్ళిపోయి వేరే పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చింద"ని బాలకృష్ణ అడిగారు.  ప్రోమో మొత్తం మీద సగటు సినిమా అభిమానులతో పాటు సామాన్యులను సైతం ఆకట్టుకున్న అంశం ఏదైనా ఉందంటే అది ఇదే. దీపావళి కానుకగా విడుదల కానున్న ఫుల్ ఎపిసోడ్ లో టాపిక్ మీద ఇంకేం మాట్లాడారో చూడాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఇంద్ర‌జ టీలో ఈగ ఉంటే, నా రేంజ్‌కి నా టీలో ఏనుగు ఉండాలిగా.. నాలిక క‌రుచుకున్న రోజా!

  'జ‌బ‌ర్ద‌స్త్' జ‌డ్జిగా రోజా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. గ‌తంతో పోలిస్తే ఇటీవల ఆమె కాస్త లావ‌య్యారు. ఆ విష‌యాన్ని ఆమె ఒప్పేసుకున్నారు. అదీ.. త‌న‌ను ఏనుగుతో పోల్చుకుంటూ! అదెప్పుడు జ‌రిగిందంటారా?  వ‌చ్చే దీపావ‌ళి సంద‌ర్భంగా 4వ తేదీ ఈటీవీలో 'త‌గ్గేదేలే' అనే స్పెష‌ల్ ప్రోగ్రాం ప్ర‌సారం కాబోతోంది. అందులో అన్న‌మాట‌! ఈ షోలో రోజా, ఇంద్ర‌జ‌, ప్రియ‌మ‌ణి, పూర్ణ‌, మ‌న్నారా చోప్రా త‌మ గ్లామ‌ర్‌తో అల‌రించారు, ఆక‌ట్టుకున్నారు.  ఇంద్ర‌జ "క‌న్నుల‌తో చూసేదీ గురువా క‌నుల‌కు సొంత‌ము" పాట‌కు చేసిన ప‌ర్ఫార్మెన్స్ అదుర్స్ అనిపించేలా ఉంది. ప్రియ‌మణి "మ‌గాళ్లు ఒట్టి మాయ‌గాళ్లే" పాట‌ను పాడి అల‌రించింది. చ‌లాకీ చంటి "ఓహో లైలా ఓ చారుశీల" పాట‌ను హుషారుగా ఆల‌పించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. సినిమా డైరెక్ట‌ర్‌గా హైప‌ర్ ఆది ఐదుగురు హీరోయిన్ల‌తో షూటింగ్‌ను ప్లాన్ చేశాడు. వారిలో న‌లుగురు.. రోజా, ఇంద్ర‌జ, ప్రియ‌మ‌ణి, మ‌న్నారా వ‌చ్చి కుర్చీల్లో కూర్చున్నారు. ప్రియ‌మ‌ణి వ‌చ్చి న‌మ‌స్కారం చేయ‌గానే, "డైరెక్ట‌ర్ గారికి ఒక హ‌గ్ ఇచ్చి, ఆ రెస్పెక్ట్ తెలీదా మీకు?" అని అడిగాడు ఆది. ప్రియ‌మ‌ణికి ఏమ‌నాలో తెలీక న‌వ్వుతూ అత‌డి వంక అలాగే చూసింది.  "మీరు కాఫీలో, టీలో ఏదో ఒక‌టి ఆర్డ‌ర్ చేసుకోండి" అన‌డిగాడు ఆది. రోజా గ్రీన్ టీ, ఇండ్ర‌జ ఎల్లో టీ, ప్రియ‌మ‌ణి బ్లాక్ టీ, మ‌న్నారా బ్లూ టీ ఆర్డ‌ర్ చేశారు. "ఇవ‌న్నీ మా ద‌గ్గ‌ర లేవు. గ్రీన్ టీ ఒక్క‌టే ఉంది" అని అది స‌ర్వ్ చేయించాడు ఆది. "ఏంటిది? నా టీలో ఈగ ఉంది!" అని ఆశ్చ‌ర్య‌పోయింది ఇంద్ర‌జ‌. "ఈమె టీలోనే ఈగ ఉంటే నా రేంజ్‌కి నా టీలో ఏనుగుండాలిగా" అని చెప్పి, వెంట‌నే తానేమ‌న్న‌దో గ్ర‌హించి నాలుక క‌రుచుకొని, చేత్తో క‌ళ్లు మూసుకుంది రోజా. అంద‌రూ ప‌డీ ప‌డీ న‌వ్వారు. అలా మొత్తానికి రోజా త‌న ఆకారం ఎలా ఉందో త‌నే చెప్పేసుకుంద‌ని అంద‌రూ అంటున్నారు.

సిగ్గుతో చీరకొంగు వెనుక ముఖం దాచుకున్న అనసూయ!

  రష్మీ గౌతమ్‌కి తెలుగు రాదు కనుక డైలాగులు మరచిపోతుంది. మధ్యలో ఏవో పదాలు చేరుస్తుంది. 'అలా కాదు అమ్మా!' అంటూ పక్కన ఉన్నవాళ్లు కరెక్ట్ చేస్తుంటారు. అవలీలగా తెలుగు మాట్లాడే అనసూయ కూడా డైలాగులు మరచిపోతుందా? దీపావళి సందర్భంగా నవంబర్ 4న టెలికాస్ట్ కానున్న జ‌బ‌ర్ద‌స్త్ ఎపిసోడ్ ప్రోమో చూస్తే... అదే డౌట్ వస్తుంది. అక్కినేని నాగార్జున క్లాసిక్ మూవీ 'గీతాంజలి' థీమ్ తీసుకుని 'హైపర్' ఆది స్కిట్ చేశాడు. అందులో అతడు నాగార్జున, అనసూయ హీరోయిన్ గిరిజ‌.  'నీకు కాన్సర్ అని నాకు ఎందుకు చెప్పలేదు?' అని ఆదిని అనసూయ అడుగుతుంది. 'నీది స్కార్పియో అనే సంగతి నాకెందుకు చెప్పలేదు?' అని ఆది ఎదురు ప్రశ్నించాడు. ఇక్కడ స్కార్పియో అంటే కారు కాదు. వృశ్చిక రాశి అన్నమాట. 'నువ్వు రాశిగారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా?' అని చాలా సీరియ‌స్‌గా పాత్ర‌లో లీన‌మై అనసూయ డైలాగ్ చెప్పింది. ఛాన్స్ దొరికితే ఆది వదులుతాడా? 'అవి రాశి గారి ఫలాలు కాదు.. రాశి ఫలాలు' అని కరెక్ట్ చేశాడు. అందరూ నవ్వేశారు. సిగ్గుతో చీరకొంగు వెనుక అనసూయ తన ముఖం దాచుకుంది.  అనసూయ సంగతి పక్కన పెడితే... ఆది, వెంకీ మంకీస్ స్కిట్లలో అడల్ట్ జోక్స్ చాలా పేలాయి. 'చలాకి' చంటి స్కిట్ లో సుధాకర్ లేడీ గెటప్ వేసి చిత్ర విచిత్ర వేషాలు వేశాడు.  

మళ్లీ 'బిగ్ బాస్'లో మాటల మంటలు! వ‌ర‌స్ట్ ప‌ర్ఫార్మ‌ర్‌గా స‌న్నీ!!

  తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 5లో గట్టిగా అరుచుకోవడం... చిన్న చిన్న విషయాలకు గొడవలు పెట్టుకోవడం వంటి విషయాలు చాలా కామన్ అయ్యింది. మొన్నామధ్య ఒకసారి ఆట పేరుతో మధ్యలో కొట్టుకున్నారు కూడా! అయితే, ఇప్పుడు కొట్లాటలు కొంచెం తగ్గాయి. కానీ, మాటల మంటలు మాత్రం ఎప్పటికప్పుడు రగులుతూ ఉన్నాయి. ఫ్రెండ్స్ కోసం ఈసారి మాటల మంటలు రగిలాయి.  కెప్టెన్ టాస్క్ గురించి సన్నీ, జెస్సీ మధ్య మొదట గొడవ జరిగింది. జెస్సీ సరిగా పని చేయలేదని సన్నీ ఫైర్ అయ్యాడు. తర్వాత ఇంటిలో సభ్యులు చెప్పినదాని ప్రకారం వరస్ట్ పెర్ఫార్మర్ రేసులో కాజల్, సన్నీకి ఓట్లు సమానంగా పడ్డాయి. అప్పుడు సన్నీ పేరు చెప్పాడు షణ్ముఖ్. సన్నీతో టాస్క్ లో బస్తాను తన్నడం నచ్చలేదని చెప్పాడు. తనతో పాటు చాలామంది హౌస్ మేట్స్ కి నచ్చలేదని అన్నాడు. మిగతావాళ్లు ఎవరో చెప్పమని సన్నీ అడిగాడు. అప్పుడు సిరి హన్మంతు తన చేయి పైకి ఎత్తింది.  అక్కడ ఫ్రెండ్స్ టాపిక్ వచ్చింది. 'ఆవిడ మీ ఫ్రెండే కదా' అని సన్నీ కామెంట్ చేశాడు. దాంతో సిరి కోప్పడింది. 'ఏంటి... ఇరవై నాలుగు గంటలు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అంటారు. మీరు ముగ్గురు ఫ్రెండ్స్ (సన్నీ, కాజల్, మానస్) లేరా? మేము ఎప్పుడైనా అన్నామా?' అని మండిపడింది. దాంతో మానస్ లైనులోకి వచ్చాడు. 'యు ఆర్ క్లియర్లీ డిఫెండింగ్ యువర్ ఫ్రెండ్' అని షణ్ముఖ్ మీద కామెంట్ చేశాడు. అందుకే, తనకు వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చానని షణ్ముఖ్ అరిచాడు. ఇలా ఒకరిపై మరొకరు అరుచుకున్నారు. చివరకు, సన్నీని వరస్ట్ పెర్ఫార్మర్ అని డిసైడ్ చేసి జైలుకు పంపారు. 

తారక్, మహేష్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోలో అప్పుడప్పుడు సెలబ్రిటీస్ కూడా సందడి చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ, సమంత సందడి చేశారు. అలాగే ఈ షోలో మహేష్ బాబు కూడా సందడి చేయనున్నారు. ఇప్పటికే షూట్ కూడా పూర్తయింది. అయితే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ మరోసారి వాయిదా పడనుందని తెలుస్తోంది. ఎన్టీఆర్, మహేష్ ల మధ్య మంచి బాండింగ్ ఉంది. మహేష్ ను ఎన్టీఆర్ అన్నయ్య అని పిలుస్తుంటారు. దీంతో మహేష్ 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' షోలో పాల్గొనబోతున్నారన్న న్యూస్ రాగానే ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట ఆ ఎపిసోడ్ దసరాకు టెలికాస్ట్ కానుందని వార్తలొచ్చాయి. అయితే దసరాకు సమంత ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. దీంతో దీపావళికి మహేష్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందని భావించారంతా. కానీ దీపావళికి కూడా మహేష్ ఎపిసోడ్ టెలికాస్ట్ కావట్లేదని తెలుస్తోంది. దీపావళికి మ్యూజిక్ డైరెక్టర్స్ దేవిశ్రీప్రసాద్, తమన్ పాల్గొన్న ఎపిసోడ్ ప్రసారం కానుందని సమాచారం. దీంతో ఎన్టీఆర్, మహేష్ ల ఫ్యాన్స్ డిస్సప్పాయింట్ అవుతున్నారు. 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' షో ఈ సీజన్ ను నవంబర్ 18న ప్ర‌సారం కానున్న‌ ఎపిసోడ్ తో ముగించబోతున్నారు. ఆ ఎపిసోడ్‌ లో మహేష్ కనిపించబోతున్నార‌ని ప్రచారం జరుగుతోంది. సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ని స్టార్ హీరో రామ్ చరణ్ తో స్టార్ట్ చేశారు కాబట్టి.. లాస్ట్ ఎపిసోడ్ ను మరో స్టార్ హీరో మహేష్ తో ఎండ్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో షో నిర్వాహకులు ఇలా ప్లాన్ చేశారని అంటున్నారు.

ఫ్లోలో నిజం చెప్పేసిన రష్మి!

  యాంకర్ రష్మీ గౌతమ్ అంటే హాట్ లేడీ. 'గుంటూరు టాకీస్' వంటి సినిమాలలో రష్మి చాలా హాట్ హాట్ గా కనిపించింది. ఇటు టీవీ కార్యక్రమాలలోనూ హాట్ ఇమేజ్ ఆమెకు ఉంది. అటువంటి రష్మి ఫేస్ కామెడీగా ఉంటుందనే 'హైపర్' ఆది కామెంట్ చేశాడు. వీళ్ళిద్దరూ 'ఢీ' షోలో టీం లీడర్లుగా చేస్తున్న సంగతి తెలిసిందే. షోలో 'సుడిగాలి' సుధీర్, రష్మీ గౌతమ్ మధ్య ట్రాక్ రన్ చేస్తూ ఉంటారు కదా! వచ్చే వారం ఎపిసోడ్ లో కూడా అటువంటిది ఒకటి ప్లాన్ చేశారు.  మాటలో మధ్యలో 'నా ముఖం చూస్తే కామెడీగా ఉందా?' అని సుధీర్‌తో రష్మీ గౌతమ్ అంటే... మధ్యలో 'హైపర్' ఆది కలుగజేసుకున్నాడు. 'ఫ్లోలో నిజం చెప్పేసింది' అని కామెంట్ చేశాడు.  ఏమాటకు ఆమాట చెప్పుకోవాలి... నెక్స్ట్ ఎపిసోడ్ లో 'అర్జున్ రెడ్డి' సినిమాలో 'మధురమే ఈ క్షణమే...' పాటకు రష్మీ గౌతమ్, దీపికా పిల్లి పెర్ఫార్మన్స్ చేశారు. ప్రోమోలో వాళ్ళిద్దరి డాన్స్ చూస్తుంటే... సెగలు పుట్టించినట్టు తెలుస్తోంది. అయితే... సుధీర్, రష్మి మధ్య మాటలు లేవంటూ ఇద్దరి మధ్య ప్యాచప్ చేస్తున్నట్టు ఒక స్కిట్ చేశారు. 'మీ టీమ్ వాళ్ళు ఎలా ఆన్నారు సుధీర్ గారు?' అని రష్మి అడిగితే... 'అందరూ బావున్నారు' అని సుధీర్ సమాధానం ఇచ్చాడు. 'ఇది బ్లాక్‌బస్టర్ ప్లాప్' అని ప్రియమణి సెటైర్ వేశారు.  లాస్ట్ వీక్ సుహాస్, సోహైల్ వంటి చోటా హీరోలను తీసుకొచ్చి ఆడియన్స్ ను అట్రాక్ట్‌ చేసే ప్రయత్నం చేశారు. అది అంతగా వర్కవుట్ కాకపోవడంతో షోలో జడ్జ్ లు, టీమ్ లీడర్లతో డిఫరెంట్ స్కిట్స్, డాన్స్ పెర్ఫార్మన్స్ ప్లాన్ చేశారు. 

ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చిన శ్రీముఖి!

  "నేను చెప్తున్నాను. మీరెవరో గెటప్పులు లేకుండా నాకు తెలుసు. ఇండస్ట్రీలో లేకుండా చేస్తా" అని శ్రీముఖి వార్నింగ్ ఇచ్చింది. ఎవరికో తెలుసా? 'మాయా ద్వీపం'లో రాక్షసుల గెటప్పులు వేసుకున్న ఆర్టిస్టులను! ఎందుకంటే... సోహైల్, మెహబాబా, విష్ణుప్రియతో కలిసి శ్రీముఖి 'మాయా ద్వీపం' కార్యక్రమానికి వచ్చింది. అక్కడ ఓ టాస్క్ లో భాగంగా నెత్తి మీద కుండ పెట్టుకుని... చిన్న వంతెన దాటాలి. కుండను కింద పడేయాలని రాక్షసులు ఏదో ఒకటి విసురుతూ ఉంటారు. అప్పుడు శ్రీముఖికి కోపం వచ్చి వార్నింగ్ ఇచ్చింది.  సోహైల్, శ్రీముఖి కలిసి 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో 'ఉండిపో...' పాటకు డాన్స్ చేశారు. అయితే, అంతకు ముందు 'సోహైల్ అన్నయ్యా' అని శ్రీముఖి అనడంతో అతడు ఒక్కసారి షాక్ అయ్యాడు. 'చిన్నపిల్లల షోకు పెద్దవాళ్ళను ఎందుకు పిలవాలని అనిపించింది?' అని ఓంకార్ ను శ్రీముఖి అడగ్గా... 'మనలో ఉన్న పిల్లల్ని చూశారు' అని విష్ణుప్రియ అనడం... 'ఇవే తగ్గించుకుంటే మంచిది' అని సెటైర్స్... ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా ఉందనే హోప్ ఇచ్చాయి. 

"ఎవడికి కావాలి నీ సారీ".. ష‌ణ్ణుపై సిరి ఫైర్‌!

  యూట్యూబర్లు సిరి హనుమంతు, షణ్ముఖ్ జస్వంత్ క్లోజ్ ఫ్రెండ్స్. 'బిగ్ బాస్' ఇంటిలోకి రాకముందు నుంచే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. ఇంటిలోకి వచ్చిన తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతోంది. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన సభ్యుల్లో కొంతమంది 'వాళ్ళిద్దరూ కలిసి ఆట ఆడతారు' అని ఆరోపించారు. అటువంటి ఫ్రెండ్స్ మధ్య బుధవారం చిన్న గొడవ చోటు చేసుకుంది. షణ్ముఖ మీద సిరి గట్టిగా అరిచింది. ఎందుకు? ఏమిటి? అంటే... బుధవారం నాటి ఎపిసోడ్ లో షణ్ముఖ్ జస్వంత్ దగ్గరకు వెళ్ళిన సిరి హనుమంతు ''మనిద్దరం ఒక సాంగ్ (డాన్స్) చేద్దాం" అని అడిగింది. అప్పుడు షణ్ముఖ్ "హమీదాకు కూడా ఏదైనా సాంగ్ చేయాలని అనుకున్నప్పుడు మాత్రమే నేను గుర్తుకు వచ్చేవాడిని" అని అన్నాడు.‌ దాంతో సిరి హర్ట్ అయింది. అక్కడి నుండి వెళ్ళిపోయింది.  సిరి హర్ట్ అయిన విషయం గమనించిన షణ్ముఖ్ ఆమెకు సారీ చెప్పాడు. అయితే ఆమె పట్టించుకోలేదు.‌ మళ్లీ సారీ చెప్పాడు.‌ అప్పుడు "ఎవడికి కావాలి నీ సారీ? అనాల్సిన మాటలన్నీ అనేసి" అంటూ గట్టిగా అరిచింది సిరి. దాంతో డైనింగ్ టేబుల్ మీద ఉన్న సింగర్ శ్రీరామ్ చంద్ర ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. షణ్ముఖ్, సిరి మధ్య ఇటువంటి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ కామన్ అని సోషల్ మీడియాలో జనాలు అంటున్నారు. ఏమవుతుందో చూడాలి.