ఎనిమిది సంవత్సరాలుగా నీ కోరిక ఎందుకు తీరట్లేదక్కా?!
కొన్నేళ్లుగా రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ జోడీకి తిరుగనేదే లేదు. బుల్లితెరకు సంబంధించి ఆ ఇద్దరిపై వచ్చినన్ని గాసిప్స్ మరే జోడీపై రాలేదు. ఆ ఇద్దరి మధ్య రొమాంటిక్ యాంగిల్ నడుస్తోందనేది అత్యధికుల అభిప్రాయం. తమ మధ్య అలాంటిదేమీ లేదని వారితో పాటు, వారి ఫ్రెండ్స్ గెటప్ శ్రీను, ఆటో రామ్‌ప్రసాద్ లాంటి వాళ్లు ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా, జనం మాత్రం ఆ మాటల్ని నమ్మడం లేదనేది వాస్తవం. రష్మీ-సుధీర్ జోడీకి వున్న క్రేజ్‌ను అనేక ప్రోగ్రామ్స్‌లో 'జబర్దస్త్' షో ప్రొడ్యూసర్స్ మల్లెమాట ఎంటర్‌టైన్‌మెంట్ క్యాష్ చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా ఆ ఇద్దరికీ ఓ షోలో పెళ్లి కూడా చేశారు.
కాగా రేపు (నవంబర్ 12) ప్రసారం కానున్న 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' ఎపిసోడ్‌ను కార్తీక పౌర్ణమి స్పెషల్‌గా రూపొందించారు. అందులో భాగంగా ఓ నలుగురు అమ్మాయిలతో కలిసి వచ్చిన రష్మి దీపాలు వెలిగించింది. "ఈరోజు దీపాలు వెలిగిచ్చుకొని ఏది కోరుకున్నా అది పూర్తవుతది" అని చెప్పింది. పక్కనున్న అమ్మాయి, "మరి ఎనిమిది సంవత్సరాలుగా నీ కోరిక ఎందుకు తీరట్లేదక్కా?" అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది. దాంతో షాకైనట్లు ఫీలింగ్ ఇచ్చి, నవ్వు దాచుకోవడానికి ట్రై చేసింది రష్మి. ఎనిమిదేళ్లుగా సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ జోడీగా కలిసి కనిపిస్తున్నా, నిజ జీవితంలో వారు జోడీ కాలేకపోయారని మనకు తెలుసు. అయితే సుధీర్‌ను పెళ్లి చేసుకోవాలనే కోరిక రష్మికి వున్నా, ఆ కోరిక తీరట్లేదనే అర్థం వచ్చేలా ఆ అమ్మాయి అడిగిందన్న మాట.
ఆ తర్వాత, "ఈరోజు గుడి దగ్గర చాలా మంది ఎదవలు తిరుగుతుంటారు. ఎవరికి పడితే వారికి పడిపోకండి. అర్థమైందా?" అని చెప్పింది రష్మి. అదే అమ్మాయి, "ఫుల్ ఎక్స్‌పీరియెన్స్ మా అక్కకి" అంది. ఈసారి నోట మాటరాలేదు రష్మికి. జడ్జిలు మనో, రోజా నవ్వుల్లో మునిగిపోయారు.