బిగ్‌బాస్ షోపై మాధ‌వీల‌త షాకింగ్ కామెంట్స్‌

తెలుగు బిగ్‌బాస్ షోపై గ‌త కొంత కాలంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల మొద‌లైన సీజ‌న్ 5పై కూడా విమ‌ర్శ‌లు తారా స్థాయికి చేరుకున్నాయి. స‌ల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్‌బాస్‌పై మాత్రపై అడ‌ల్ట్ కామెంట్స్ వినిపించేవి కానీ ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్‌పై కూడా అదే త‌ర‌హా ఆరోప‌ణ‌లు.. వినిపించ‌డం ప‌లువురిని షాక్‌కు గురిచేస్తోంది. తెలుగులో మొద‌లైన తొలి సీజ‌న్ నుంచి కంటెస్టెంట్‌ల ఎంపిక విష‌యంలో కాస్టింగ్ కౌచ్ విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన విష‌యం తెలిసిందే. అయితే తాజా సీజ‌న్‌లో మాత్రం అడ‌ల్ట్ కంటెంట్ వుంద‌ని.. దానికి సంబంధించిన వీడియోలు త‌న ద‌గ్గ‌ర వున్నాయంటూ న‌టి, బీజేపీ మ‌హిళా విభాగం నాయకురాలు మాధ‌వీల‌త తాజాగా ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. షో రేటింగ్ త‌గ్గ‌డంతో నిర్వాహ‌కులు అడ‌ల్ట్ సీన్‌ల‌కి తెగించార‌ని అందుకు సంబంధించిన వీడియోలు త‌న ద‌గ్గ‌ర వున్నాయంటూ మాధ‌వీల‌త సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. మాధ‌వీల‌త బిగ్‌బాస్ లోని అడ‌ల్డ్ సీన్‌ల‌కు `ర‌గులుతోంది మొగ‌లి పొద‌` అని పేరు పెట్టింది. ఈ వీడియోలు చాలా దారుణంగా వున్నాయ‌ని, అయితే వీటిని బ‌య‌ట‌పెట్ట‌డం స‌భ్య‌త కాద‌న్న చిన్న కార‌ణంతో వాటిని బ‌య‌ట‌పెట్ట‌డం లేద‌ని చివ‌ర్లో ట్విస్ట్ ఇచ్చింది. మాధ‌వీల‌త చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

అన‌సూయ‌కు ధీటుగా శ్రీ‌ముఖి కాస్కో అంటోంది!

ఓ షోకి పోటీగా మ‌రో షోని అదే టైమ్‌కి లైన్‌లోకి తీసుకురావ‌డం అనే పోటీ ఈ మ‌ధ్య మొద‌లైంది. బిగ్‌బాస్ షోకు ధీటుగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ `ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు` టాక్ షోని మొద‌లు పెట్ట‌డం.. దాని కార‌ణంగా బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్‌లో తేడా రావ‌డం తెలిసిందే. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో జెమినీ టెలివిజ‌న్ షోకి పోటీగా మ‌రో షో తెర‌పైకి వ‌చ్చేసింది. జెమిని టీవీలో `మాస్ట‌ర్ ఛెఫ్‌` పేరుతో ఛెఫ్‌ల ఛాలెంజింగ్ షో ప్ర‌సారం అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ షోకు ధీటుగా మాస్ట‌ర్ మైండ్ అల్లు అర‌వింద్ త‌న ఆహా ఓటీటీ కోసం `ఛెఫ్ మంత్ర` పేరుతో స‌రికొత్త షోకి శ్రీ‌కారం చుట్టారు. `మాస్ట‌ర్ ఛెఫ్‌` కు ముందు త‌మ‌న్నా హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా టీఆర్పీ రేటింగ్ కార‌ణంగా త‌మ‌న్నాని త‌ప్పించి నిర్వాహ‌కులు ఆ స్థానంలో హోస్ట్‌గా అన‌సూయ‌ని రంగంలోకి దింపేశారు. ఇక ఇదే స్పీడుతో ఆహా `ఛెఫ్ మంత్ర‌` షో కోసం బుల్లితెర రాముల‌మ్మ శ్రీ‌ముఖిని హోస్ట్‌గా ఫైన‌ల్ చేశారు. దీంతో అన‌సూయ‌, శ్రీ‌ముఖిల మ‌ధ్య నువ్వా నేనా కాస్కో అనే స్థాయిలో పోటీ మొద‌లైంది. శ్రీ‌ముఖి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న `ఛెఫ్ మంత్ర` స‌క్సెస్ అయితే అన‌సూయ ఇమేజ్ డ్యామేజ్ అయిన‌ట్టే అంటున్నాయి సినీ వ‌ర్గాలు. ఇప్ప‌టికే రెజీనా, శ్రియ‌ల‌తో ఓ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌ని షూట్ చేసి వ‌దిలారు కూడా. తాజాగా శ్రీముఖి ఈ ప్రోగ్రామ్ కోసం ట్రెండీగా సిద్ధ‌మై ఫొటోల‌కి ఫోజులిచ్చిది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి.

`కామెడీ స్టార్స్` : యాంక‌ర్ ర‌వి ప‌రువు తీసిన విశ్వ‌

బిగ్‌బాస్ తాజా సీజ‌న్‌లో త‌ను టైటిల్ రేస్‌లో వుండ‌టానికి యాంక‌ర్ ర‌వి కొంత మందిని త‌న ఎత్తుల‌తో చిత్తు చేస్తూ హౌస్ పుంచి బ‌య‌టికి పంపించేస్తున్న విష‌యం తెలిసిందే. ల‌హ‌రి.. ప్రియ.. శ్వేతావ‌ర్మ‌.. ఆయంక‌ర్ ర‌వి కార‌ణంగానే హౌస్ నుంచి బ‌యటికి వ‌చ్చేశారు. ర‌వి కార‌ణంగా కొన్ని టాస్క్‌ల‌లో అడ్డంగా దొరికిపోయిన ల‌హ‌రి, శ్వేతావ‌ర్మ‌, ప్రియ అదే కార‌ణంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. దీంతో యాంక‌ర్ ర‌వి వ్య‌వ‌హార శైలిపై నెటిజ‌న్స్ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తాజాగా బ‌య‌టికి వ‌చ్చిన విశ్వ కూడా యాంక‌ర్ ర‌విపై ఫైర్ అయ్యాడు. ఏకంగా ర‌వి ప‌రువుతీసేశాడు. బిగ్‌బాస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన వాళ్ల‌లో చాలా మంది ఓంకార్ నిర్వ‌హిస్తున్న కామెడీ షో `కామెడీ స్టార్స్‌` షోలోకి ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. ఈ షోలోకి గ‌త ఆదివారం లోబో ఎంట్రీ ఇచ్చి ర‌చ్చ ర‌చ్చ చేశాడు. యాంక‌ర్ శివ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు చిర్రెత్తుకోచ్చి షో నుంచి వెళ్లిపోవ‌డం తెలిసిందే. ఇదిలా వుంటే ఈ వారం కామెడీ స్టార్స్ షోలోకి బిగ్‌బాస్ కంటెస్టెంట్ విశ్వ పోలీస్ గెట‌ప్‌తో ఎంట్రీ ఇస్తున్నాడు. విశ్వ‌తో పాటు లోబో కూడా ఈ ఆదివారం కామెడీ స్టార్స్‌లో సంద‌డి చేయ‌బోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోని `స్టార్ మా` తాజాగా రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో టార్చ‌ర్ చేస్తున్న విశ్వ‌ని ఉద్దేశించి `అమ్మ‌తోడు` అని లోబో అన‌డం.. దానికి కౌంట‌ర్‌గా ఆ డైలాగ్ బిగ్‌బాస్ హౌస్‌లో యాంక‌ర్ ర‌విగానిది నీది కాదు అని విశ్వ అనడం.. దానికి శ్రీ‌ముఖి అదిరిపోయే ఎక్స్‌ప్రెష‌న్ ఇవ్వ‌డం న‌వ్వులు పూయిస్తోంది.

బిగ్‌బాస్ : స‌న్నీని ఎర్రి** చేస్తున్నారా?

బిగ్‌బాస్ విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగుతున్నా బిగ్‌బాస్ నిర్వాహ‌కుల తీరులో మాత్రం మార్పు రావ‌డం లేదు అంటున్నారు నెటిజ‌న్స్‌. బుధ‌వారం సంచాల‌క్‌గా వ్య‌వ‌హ‌రించిన యాంక‌ర్ ర‌వి ఇచ్చిన తీర్పుపై మండిప‌డిన స‌న్నీ త‌న స్నేహితులు మాన‌స్‌, కాజ‌ల్‌ల‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. దీంతో హౌస్ ఒక్క‌సారిగా హీటెక్కింది. ప్ర‌తీ విష‌యంలోనూ ఒక్క‌టిగా వుండే ముగ్గురు స్నేహితుల మ‌ధ్య బిగ్‌బాస్ కెప్టెన్సీ పోటీలో భాగంగా ఇచ్చిన టీష‌ర్ట్‌ల టాస్క్‌తో చిచ్చు పెట్ట‌డంతో నెటిజ‌న్స్ ఓ రేంజ్‌లో మండిప‌డుతున్నారు. ఇదిలా వుంటే గురువారం ఎనిసోడ్ మ‌రింత ర‌స‌వ‌త్త‌ర మ‌లుపుల‌కు వేదిక‌గా కాబోతున్న‌ట్టుగా తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన బిగ్‌బాస్ ప్రోమో హౌస్‌లో కెప్టెన్ ర‌వి ... స‌న్నీ .. మాన‌స్‌ల‌ని విడిదీయ‌డానికి కొత్త ఎత్తులు వేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. దీనిక బిగ్‌బాస్ కూడా చేయి క‌ల‌ప‌డం స‌న్నీ అభిమానుల‌కు ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంది. నెక్ట్స్ కూడా క్యాప్టెన్సీ పోటీ దారుగా ర‌వి నిల‌వాలంటే పోటీలో మాన‌స్‌, స‌న్నీ మాత్ర‌మే వుండాల‌ని శ్రీ‌రామ‌చంద్ర .. ర‌వితో సీక్రెట్‌గా చెప్ప‌డం.. వ‌న్ ఈజ్ డిస్ట్ర‌క్ష‌నా?  టూ ఈజ్ డిస్ట్ర‌క్ష‌నా? అని ర‌వి అడిగితే.. వ‌న్ ఈజ్ డిస్ట్ర‌క్ష‌న్ అని శ్రీ‌రామ‌చంద్ర చెప్ప‌డం హౌస్‌లో ర‌వి కొత్త గేమ్‌ని తెర‌లేపాడ‌నే సంకేతాల్ని అందిస్తోంది. ఈక్ర‌మంలోనే బిగ్‌బాస్ ర‌విని క‌న్ఫేష‌న్ రూమ్‌లోకి పిలిచి ప‌వ‌ర్ టూల్‌ని మీరు సొంతం చేసుకుంటారా?  లేక ఇత‌ర ఇంటి స‌భ్యుల్లోని ఒక‌రికి ఇస్తారా?  అని బిగ్‌బాస్ అడ‌గ‌డం.. ఈ టూల్‌ని స‌న్నీకి ఇవ్వాల‌నుకుంటున్నాన‌ని ర‌వి చెప్ప‌డం.. అలా చెప్పిన‌ట్టే స‌న్నీకి ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తే నేను తీసుకోన‌ని స‌న్నీ స‌మాధానం చెప్ప‌డం.. అలా అని నువ్వు చెప్ప‌డానికి వీల్లేద‌ని.. ఇది బిగ్‌బాస్ ఆదేశ‌మ‌ని ర‌వి చెప్ప‌డంతో అయిష్టంగానే స‌న్నీ టూల్‌ని తీసుకోవ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ప్రోమో చివ‌ర్లో  `న‌న్ను రెచ్చ‌గొట్టి పంపిస్తారు.. లాస్ట్‌కి ఎర్రిపుష్పం చేస్తారూ.. అంటూ  స‌న్నీ వేసిన పంచ్ ఓ రేంజ్‌లో పేలింది.

కార్తీక్‌కు కునుకు లేకుండా చేస్తున్న మోనిత

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తున్న ధారావాహిక `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా వ‌రుస ట్విస్ట్‌ల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ ఇటీవ‌ల గాడిత‌ప్పిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేసింది. వ‌రుస ట్విస్ట్‌ల‌తో ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్న ఈ సీరియ‌ల్ తాజాగా స‌రికొత్త మ‌లుపుల‌తో  సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ మ‌రింత ర‌స‌వ‌త్త‌ర మ‌లుపుల‌తో ట్విస్ట్‌ల‌తో సాగ‌బోతోంది. ఈ ఎపిసోడ్‌లో మోనిత దీపావ‌ళి జ‌రుపుకోబోతోంది. అందంగా రెడ్ క‌ల‌ర్ సారీలో ముస్త‌బైన మోనిత దీపాల‌ని అందంగా అలంక‌రించి దీపాల‌నే చూస్తూ ఈ స‌మ‌యంలో కార్తీక్‌తో వుంటే బాగుండు అనుకుంటూ వుంటుంది. కార్తీక్‌తో క‌లిసి దీపావ‌ళిని ఎప్పుడు జ‌రుపుకుంటానా? అని క‌ల‌లు కంటూ వుంటుంది మోనిత‌.  ఇలా ఆలోచిస్తుండ‌గానే ప్రియ‌మ‌ణి వ‌చ్చేస్తుంది. వెంట‌నే ఆనంద‌రావుని జాగ్ర‌త్త‌గా చూసుకో ఈ రోజు దీప‌నో నేనో తేలిపోవాల‌ని చెప్పి  కార్తీక్ ద‌గ్గ‌రికి వెళుతున్నానంటుంది. ఈ మాట‌లు విన్న ప్రియ‌మ‌ణి ఆగ్ర‌హంతో క‌సురుకుంటుంది. ప‌ట్టించుకోకుండానే కార్తీక్‌ని క‌ల‌వ‌డానికి బ‌య‌లుదేరుతుంది మోనిత‌. త‌ను వ‌స్తున్న విష‌యాన్ని కార్తీక్‌కి ఫోన్ చేసి చెబుతుంది. మోనిత ఇంటికి వ‌చ్చి మ‌ళ్లీ ఎలాంటి గొడ‌వ‌కు తెర‌లేపుతుందోన‌ని కార్తీక్ హ‌డావిడిగా మోనిత ఇంటికి బ‌య‌లుదేర‌తాడు.. మ‌ద్య‌లో ఏం జ‌రిగింది? .. మోనిత .. కార్తీక్‌కి ఎలాంటి షాకిచ్చింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఇంటికి కొత్త క‌ళ‌! పండంటి పాప పుట్టింది!!

డ్యాన్స్ మాస్ట‌ర్ న‌ట‌రాజ్ ఇంటికి కొత్త క‌ళ‌. త‌ను కోరుకున్న కోరిక తాజాగా నెర‌వేర‌డంతో న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. న‌ట‌రాజ్ మాస్ట‌ర్ దంప‌తుల‌కు పండంటి  పాప జ‌న్మించింది. ఈ ఆనందాన్ని నెటిజ‌న్‌ల‌తో పంచుకుంటూ ఎమోష‌న‌ల్ అయ్యాడు న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌. త‌న భార్య నీతూ డెలివ‌రీ కాగానే అంతులేని ఆనందానికి లోనైన న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఇన్ స్టా లైవ్‌లో అభిమానుల‌తో ముచ్చ‌టిస్తూ భావోద్వేగానికి లోన‌య్యారు. త‌ను పాప పుట్టాల‌ని కోరుకున్నాన‌ని, త‌న భార్య మాత్రం బాబు కావాల‌ని కోరుకుంద‌ని అయితే త‌ను కోరుకున్న‌ట్టే పాప పుట్టింద‌ని ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌. బిగ్‌బాస్ సీజ‌న్ 5కి ఎంపికైన న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఆ త‌రువాత మ‌ధ్య‌లోనే హౌస్ నుంచి ఇంటిదారి ప‌ట్టిన విష‌యం తెలిసిందే. హౌస్‌లోకి న‌ట‌రాజ్ ప్ర‌వేశిస్తున్న స‌మ‌యంలో అత‌ని భార్య నీతూ గ‌ర్భ‌వ‌తి. ఏ క్ష‌ణాన ఎలా వుంటుందో .. ఆ స‌మ‌యంలో త‌న ప‌క్క‌న వుండ‌లేక‌పోతానేమోన‌ని న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఎమోష‌న‌ల్ అయిన విష‌యం తెలిసిందే. అత‌ను హౌస్‌లో వున్న స‌మ‌యంలోనే నీతూకు బుల్లితెర తార‌లు సీమంతం చేయ‌డం.. ఆ వీడియోలు వైర‌ల్ కావ‌డం తెలిసిందే. న‌ట‌రాజ్ త‌న భార్య పండంటి పాప‌కు జ‌న్మ‌నివ్వ‌డంతో వెంట‌నే ఇన్‌స్టా లైవ్‌లో త‌న ఆనందాన్ని అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ని, త‌న వైఫ్‌ని, త‌న బేబీని బ్లెస్ చేసిన ప్ర‌తీ ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. మీ ప్రేమ‌ని మా ముగ్గురిపై ఇలానే కొన‌సాగించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాన‌ని న‌ట‌రాజ్ మాస్ట‌ర్ అన్నారు. ఈ సంద‌ర్భంగా న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ప‌క్క‌నే వున్న లోబో కూడా త‌ను మామ‌ని అయ్యాన‌ని ఆనందాన్ని వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

బిగ్‌బాస్ సుజాత నా వ‌ల్ల కాదు నాన్నోయ్ అంటోంది!

న్యూస్ ఛాన‌ల్‌లో జోర్దార్ వార్త‌లు ప్రోగ్రామ్‌తో లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన సుజాత ఆ త‌రువాత జోర్దార్ సుజాత‌గా మారిపోయింది. ఆమె క్రేజ్‌ని, మాట తీరు న‌చ్చిన బిగ్‌బాస్ నిర్వాహ‌కులు సీజ‌న్ 4 కోసం ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. హౌస్‌లోకి ట్రంకు పెట్టెతో ఎంట్రీ ఇచ్చిన జోర్దార్ సుజాత చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన కింగ్ నాగార్జున‌ని బిట్టూ బిట్టూ అంటూ అల్ల‌రి చేసి చివ‌రికి ఆ పిలుపు కార‌ణంగానే ప్రేక్ష‌కుల ద్వారా ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇక అభిజీత్ విష‌యంలోనూ బ్యాడ్ అయిపోయిన జోర్దార్ సుజాత ఇక బిగ్‌బాస్ నుంచి తాను ఎందుకు ఎలిమినేట్ కావాల్సి వ‌చ్చిందో .. తాను నాగార్జున‌ని ఎందుకు బిట్టు అని పిలిచిందో దాని వెన‌కున్న సీక్రెట్‌ని బ‌య‌ట పెట్టేసింది. ప్రస్తుతం  `స్టార్ మా`లో ప్ర‌సారం అవుతున్న `కామెడీ స్టార్స్‌`లో అవినాష్‌తో క‌లిసి ఆక‌ట్టుకుంటోంది. ఇదిలా వుంటే తాజాగా జోర్దార్ సుజాత ఇన్ స్టా స్టేట‌స్ ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. త‌న మ్యారేజ్ గురించి అభిమానులు ప్ర‌శ్నిస్తుండ‌టంతో ఇక స‌మాధానం చెప్ప‌డం నా వ‌ల్ల కాద‌ని, త్వ‌ర‌గా పెళ్లి చేసేయండి నాన్నా ` అంటూ సుజాత పెట్టిన ఇన్ స్టా స్టేట‌స్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. త‌న తండ్రితో క‌లిసి దిగిన ఫొటోని అభిమానుల‌తో పంచుకున్న సుజాత త‌న పెళ్లెప్పుడ‌ని అభిమానులు అడుగుతుండ‌టాన్ని తాను త‌ట్టుకోలేక పోతున్నాన‌ని, త‌న‌కు వెంట‌నే పెళ్లి చేసేయాల‌ని స్టేట‌స్ ని పెట్ట‌డం గ‌మ‌నార్హం.

బిగ్‌బాస్ ఓ సైకో గేమ్

బిగ్‌బాస్ సీజ‌న్ 5పై వ‌రుస విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న విష‌యం తెలిసిందే. హోస్ట్ నాగార్జున‌తో పాటు నిర్వాహ‌కులు షోని ర‌న్ చేస్తున్న తీరు ప్రేక్ష‌కుల‌కి అస‌హ‌నాన్ని తెప్పిస్తోంది. శనివారం జ‌రిగిన ర‌చ్చ‌తో పాటు ఆ రోజు నాగ్ .. స‌న్నీపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన తీరు ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల‌ని సైతం ఆగ్ర‌హానికి గురిచేసింది. ఇదిలా వుంటే బిగ్‌బాస్‌పై న‌టి, బిజేపీ మ‌హిళా విభాగం నాయ‌కురాలు మాధ‌వీ ల‌త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ని సంత‌రించుకుంది. తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా బిగ్‌బాస్‌పై నిప్పులు చెరిగింది మాధ‌వీల‌త. బిగ్‌బాస్ ఓ సైకో గేమ్ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. బిగ్‌బాస్ హౌస్‌లో అనాగ‌రిక చ‌ర్య‌లు జ‌రుగుతున్నాయ‌ని, గ‌తంలో ప‌ల్లెటూళ్ల‌లో అనాగ‌రిక శిక్ష‌లు వుండేవి. త‌ప్పు చేసిన వాడికి స‌గం మీసం క‌ట్ చేసి లేదా గుండు కొట్టించి గాడిద మీద ఊరేగించేవారు. కొంత మంది ఈ ప‌నుల‌కి అవ‌మాన భారంతో చ‌నిపోయేవారు. ఇదే త‌ర‌హా సంస్కృతి బిగ్‌బాస్ హౌస్‌లో క‌నిపిస్తోంద‌ని నిప్పులు చెరిగింది మాధ‌వీల‌త‌. సైకో మ‌న‌స్తత్వం వున్న వారికి టాస్క్‌ల‌ని రాసే అవ‌కాశం ఇవ్వ‌డం అనేది చాలా దుర్మార్గం. ఈ విష సంస్కృతిని అన్ని భాష‌ల్లోనూ కొన‌సాగించ‌డం .. బిగ్‌బాస్ వ్య‌క్తుల‌ని ఫేమ‌స్ చేసి వారికి జ్ణానాన్ని అందించే దేవాలం అని డ‌బ్బా కొట్ట‌డం .. త‌ప్పులు జ‌రుగుతున్నా ఆ త‌ప్పులు చేస్తున్న వారినే హోస్ట్ వెన‌కేసుకు వ‌స్తూ స‌మాజానికి విష సంస్కృతిని పెంపొందిస్తున్నార‌ని మాధ‌వీల‌త బిగ్‌బాస్ పై ఓ రేంజ్‌లో ఫైర్ అయింది.

ఇంటింటి గృహ‌ల‌క్ష్మి : భాగ్య చెంప ఛెల్లుమ‌నిపించిన లాస్య‌

`స్టార్ మా`లో ప్ర‌సారం అవుతున్న హెవీ డోస్ ఫ్యామిలీ డ్రామా `ఇంటింటి గృహ‌ల‌క్ష్మి`. క‌స్తూరి, నంద‌గోపాల్‌, లాస్య, ల‌హ‌రి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ డ్రామాగా సాగుతున్న ఈ ధారావాహిక ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. గ‌త కొన్ని వారాలుగా ర‌స‌వ‌త్త‌ర ములుపుల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ బుధ‌వారం షాకింగ్ స‌ర్‌ప్రైజ్ ల‌తో ఆక‌ట్టుకోబోతోంది. గ‌త కొంత కాలంగా త‌న‌కు అండ‌గా నిలుస్తూ తుల‌సిని ఇబ్బందుల‌కు గురిచేసే క్ర‌మంలో స‌హ‌క‌రిస్తున్న భాగ్య‌ని చెంప‌ని లాస్య ఛెల్లు మ‌నిపించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఆఫీస్ ప‌నిమీదు క్యాంప్‌కి వెళ్లిన తుల‌సి, నందులు ద‌గ్గ‌ర‌వ‌డం లాస్య‌కు ఇబ్బంది క‌రంగా మారుతుంది. క‌ట్ చేస్తే తుల‌సి క‌ళ్లు త‌రిగి ప‌డిపోతుంది. వెంట‌నే నందు డాక్ట‌ర్‌కి ఫోన్ చేసి ర‌ప్పిస్తాడు. ప‌రీక్షించిన డాక్ట‌ర్ ఈమె మీకు ఏమ‌వుతుంద‌ని అడుగుతుంది. నందు ఆలోచించి భార్య అంటాడు. ఇంత దానికి ఆలోచించి చెప్పాలా? అని క‌సురుకున్న డాక్ట‌ర్ తుల‌సికి ఇలా జ‌ర‌గ‌డం ఇదే మొద‌టి సారా అని అడుగుతుంది. దానికి నందు లేదు ఇలా చాలా సార్లు జ‌రిగింద‌ని చెబుతాడు. అయితే తుల‌సికి మ‌రిన్ని ప‌రీక్ష‌లు చేయాలి హాస్పిట‌ల్‌కి తీసుకురండి అంటుంది. ఇదిలా వుంటే నందు, తుల‌సిల మ‌ధ్య దూరం త‌గ్గుతోంద‌ని లాస్య తెగ బాధ‌ప‌డిపోతూ వుంటుంది. ఇదే విష‌యాన్ని భాగ్య‌కు చెబుతుంది. దీనికి భాగ్య లాస్య‌కు దిమ్మ‌దిరిగే ఆన్స‌ర్ ఇస్తుంది. `నువ్వు పెద్ద‌గా భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు లాస్య‌.. బావ‌గారు ఓకే అంటే నువ్వు బావ‌గారు ఒక‌ట‌వుతారు. పొర‌పాటున తుల‌సి, బావ‌గారు ఒక‌టైతే నువ్వు వేరేదారి చూసుకోవాల్సి వ‌స్తుంది` అని అంటుంది భాగ్య‌. వేరే దారి అంటే అంటుంది లాస్య‌. వేరు దారి అంటే నువ్వు మ‌రొక‌రిని పెళ్లిచేసుకుని వెళ్లిపోతావ‌న్న‌మాట అంటుంది భాగ్య ఆ మాట అన‌గానే భాగ్య చెంప ఛెల్లుమ‌నిపిస్తుంది లాస్య‌. .. లాస్య నుంచి ఊహించ‌ని స్పంద‌న ల‌భించ‌డంతో భాగ్య బిత్త‌ర‌పోతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?  భాగ్య ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

బాలయ్య 'అన్ స్టాపబుల్'కు చిన్న బ్రేక్!

ఓటీటీ వేదిక ఆహాలో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' పేరుతో నటసింహం నందమూరి బాలకృష్ణ టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య మొదటిసారి హోస్ట్ చేస్తున్న ఈ షోకి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ కి మోహన్ బాబు, సెకండ్ ఎపిసోడ్ కి నాని గెస్ట్ లుగా వచ్చారు. ఈ రెండు ఎపిసోడ్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి. దీంతో మూడో ఎపిసోడ్ ఎప్పుడొస్తుందా? అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 'అన్ స్టాపబుల్' ఫ్యాన్స్ కి ఓ బ్యాడ్ న్యూస్. ఈ షోకి చిన్న బ్రేక్ వచ్చిందని, మూడో ఎపిసోడ్ రావడానికి టైం పడుతుందని న్యూస్ వినిపిస్తోంది. అందుకే ఇంతవరకు మూడో ఎపిసోడ్ ప్రోమో విడుదల కాలేదని తెలుస్తోంది. 'అన్ స్టాపబుల్' షో మూడో ఎపిసోడ్ గెస్ట్ గా హాస్యబ్రహ్మ బ్రహ్మానందం వస్తారని మొదట ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు వినిపిస్తోంది. 'అన్ స్టాపబుల్' మూడో ఎపిసోడ్ ని విజయ్ తో ప్లాన్ చేశారట షో నిర్వాహకులు. అయితే బాలయ్య చేతికి చిన్న సర్జరీ జరగడంతో షూటింగ్ వాయిదా పడిందట. మళ్ళీ షూట్ ప్లాన్ చేద్దామనుకున్న టైంలో 'లైగర్' మూవీ షూటింగ్ కోసం విజయ్ అమెరికా వెళ్ళడంతో.. 'అన్ స్టాపబుల్'కి చిన్న బ్రేక్ వచ్చిందట. విజయ్ అమెరికా నుంచి రాగానే 'అన్ స్టాపబుల్' షోలో పాల్గొంటాడని, కాస్త ఆలస్యమైనా గత రెండు ఎపిసోడ్స్ ని మించేలా ఈ ఎపిసోడ్ లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అంటున్నారు. బాలయ్య షోకి విజయ్ రానున్నాడన్న న్యూస్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వీరిద్దరూ కలిస్తే ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉండదని ఎగ్జైట్ అవుతున్నారు. ఈ న్యూస్ నిజమైతే ఆ ఎపిసోడ్ నిజంగానే 'అన్ స్టాపబుల్' ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు.

గుప్పెడంత మ‌నసు :  జోరు వాన‌లో రిషి.. వ‌సుధార‌

`స్టార్ మా`లో ప్ర‌సారం అవుతున్న ధారావాహిక `గుప్పెడంత మ‌న‌సు`. క‌న్న‌డ న‌టీన‌టులు ముఖేష్ గౌడ‌, అక్ష గౌడ‌, సాయికిర‌ణ్, జ్యోతి రాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గ‌త కొంత కాలంగా ప్ర‌సారం అవుతున్న `గుప్పెడంత మ‌న‌సు` మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ మంగ‌ళ వారం 293వ ఎపిసోడ్‌లోకి ఎంట‌ర‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ప‌లు ర‌స‌వ‌త్త‌ర సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోనున్నాయి. వ‌సుధార‌, రిషిలుగా న‌టిస్తున్న ముఖేష్ గౌడ‌, అక్ష గౌడ‌ల మ‌ధ్య ఈ రోజు ఎపిసోడ్‌లో ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు చోటు చేసుకోబోతున్నాయి. రిషిపై కోపంతో అత‌ని కార్‌ని ఛేజ్ చేసి అడ్డుకున్న వ‌సుధార ఏం చేసింది? .. రిషిని ఏ స్థాయిలో నిల‌దీసింది అన్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. త‌న‌ని అడ్డ‌గించిన వ‌సుధార `మీరు అడ్డ‌దిడ్డంగా నిర్ణ‌యాలు తీసుకుంటే అడిగే అడ్డ‌గించే హ‌క్కు నాకుంది` అంటూ నిల‌దీస్తుంది. యీరు స‌మాధానం చెప్పేవ‌ర‌కు ఇక్క‌డే వుంట‌న‌ని భీష్మిస్తుంది. నీకు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం నాకు లేద‌ని రిషి అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. అయితే వ‌సుధార మాత్రం అక్క‌డే వుంటుంది. వ‌ర్షం వ‌చ్చేలా వుండ‌టంతో వ‌సుధార కోసం జ‌గ‌తి కంగారు ప‌డుతూ వుంటుంది. కంగారుగా మ‌హేంద్ర .. రిషికి కాల్ చేస్తే క‌ట్ చేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తాడు రిషి. అయితే ధ‌ర‌ణికి ఫోన్ చేసి వ‌సుధార ఎక్క‌డ అని రిషిపై అరుస్తాడు మ‌హేంద్ర‌. దీంతో వ‌సు మాట‌లు గుర్తొచ్చి రిషి త‌న ఫోన్‌ని ధ‌ర‌ణికి ఇచ్చేసి అక్క‌డి నుంచి వ‌సుధార‌ని వెతుక్కుంటూ వెళ్లిపోతాడు. వ‌ర్షంలో త‌డుస్తూ నిలుచున్న వ‌సుధార ఏం చేసింది. రిషి ఎలా వ‌సుధార‌ని ఒప్పించాడు? .. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి సంభాష‌ణ చోటు చేసుకుంది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

పెళ్లైన మ‌రుస‌టి రోజే లేచిపోయిన అవినాష్ భార్య ?

జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ ముక్కు అవినాష్‌కు భారీ షాక్ త‌గిలింది. పెళ్లైన మొద‌టిరోజే భార్య తను న‌చ్చ‌లేద‌ని ప్రేమించిన వాడితో జంప్ అయింది. ఆగండాగండి.. ఇది రియ‌ల్ లైఫ్‌లో కాదండోయ్ స్కిట్‌లో.. వివ‌రాల్లోకి వెళితే.. బిగ్‌బాస్ సీజ‌న్ 4లో ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఆక‌ట్టుకున్న అవినాష్ ఆ త‌రువాత నుంచి వ‌రుస ఆఫ‌ర్ల‌తో నిత్యం బిజీగా మారిపోయాడు. అంతే కాకుండా `స్టార్ మా`లో ఓంకార్ నిర్వ‌హిస్తున్న ప‌లు షోల‌లో ఎంట్రీ ఇచ్చి త‌న‌దైన మార్కు కామెడీతో ఆక‌ట్టుకున్నాడు. అంతే కాకుండా `కామెడీ స్టార్స్‌`లోనూ త‌న‌దైన కామెడీ స్కిట్‌ల‌తో ఎంట‌ర్‌టైన్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ కామెడీ స్టార్స్ షోకు ప్ర‌ముఖ క‌మెడియ‌న్ అలీ, న‌టి శ్రీ‌దేవి న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. హోస్ట్‌గా బుల్లితెర రాముల‌మ్మ శ్రీ‌ముఖి వ్య‌వ‌హ‌రిస్తోంది. ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 నిమిషాల‌కు ప్ర‌సారం కానున్న ఈ షోకి సంబంధించిన తాజా ప్రోమోని విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఇది నెట్టింట సంద‌డి చేస్తోంది. ఇందులో ముక్కు అవినాష్ కొత్త‌గా పెళ్లైన యువ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు. `పుష్ప‌క విమానం` సినిమా కాన్సెప్ట్ నేప‌థ్యంలో ముక్కు అవినాష్ చేస్తున్న ఈ స్కిట్ కు సంబంధించిన తాజా ప్రోమో ఆక‌ట్టుకుంటోంది.`ఏమండీ మీరు నాకు న‌చ్చ‌లేదు. అందుకే పెళ్లైన మ‌రుస‌టి రోజే ఇంకొక‌డితో ఎగిరిపోతున్నాను. మీతో నాకు వ‌ర్క‌వుట్ కాదు. న‌న్ను క్ష‌మించండి.. ఈ విష‌యం ఎవ‌రికైనా చెబితే స‌మాజం మీ ముఖంపై ఉమ్మేస్తుంది` అంటూ అవినాష్ లేచిపోయిన త‌న భార్య లెట‌ర్ రాయ‌డం.. ఆ విష‌యం బ‌య‌ట‌ప‌డ‌కుండా త‌న భార్య ఇంట్లోనే వున్న‌ట్టుగా అవినాష్ క‌వ‌ర్ చేయ‌డం... ఎవ‌రు ఉమ్మేసినా ప‌ర‌వాలేదు తుడుచుకుంటాన‌ని అవినాష్ అంటుంటే శ్రీ‌ముఖి ఉమ్మేయ‌డం న‌వ్వులు పూయిస్తోంది. లేచిపోయిన అవినాష్ పెళ్లాంగోల క‌థేంటో తెలుసుకోవాలంటే వ‌చ్చే సండే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

బిగ్‌బాస్ : ఎన్ని జ‌న్మ‌లెత్తినా ర‌వి గుంట‌న‌క్కేనా?

బిగ్‌బాస్ సీజ‌న్ 5 గ‌త సీజ‌న్‌ల‌కు మించి విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. కంటెస్టెంట్‌ల వ్య‌వ‌హార శైలి..హోస్ట్‌గా నాగ్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ప‌ట్ల నెటిజ‌న్స్ తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. శ‌నివారం ఎపిసోడ్ విష‌యంలో అయితే కింగ్ నాగ్ మ‌రీ దారుణంగా వ్య‌వ‌హ‌రించ‌యార‌ని.. సిరిని మంద‌లించ‌కుండా ప్రొటెస్ట్ చేసుకున్న స‌న్నీనే నిందించ‌డం మ‌రీ దారుణంగా వుందని.. గిల్టీ బోర్డ్‌ని స‌న్నీకి త‌గిలించ‌డం మ‌రీ బిగ్‌బాస్ ఏ స్థాయికి వెళ్లింద‌నే విష‌యాన్ని స్ప‌ష్టంచేస్తోంద‌ని మండిడుతున్నారు. ఇదిలా వుంటే ఈ సోమ‌వారం అంటే 11వ వారం నామినేష‌న్‌ల ప్ర‌క్రియ మొద‌లైంది. ప్ర‌తీ సోమ‌వారం నామినేష‌న్‌ల ప్ర‌క్రియ కార‌ణంగా షో ర‌స‌వ‌త్త‌ర మ‌లుపుల‌కు ట్విస్ట్‌ల‌కు తెర‌లేప‌డం తెలిసిందే. ఈ వారం కూడా అదే త‌ర‌హా ర‌చ్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా స‌న్నీ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. త‌న‌కి గిల్టీ బోర్డ్ త‌గిలించ‌డం ప‌ట్ల కాజ‌ల్, మాన‌స్ ద‌గ్గ‌ర బాధ‌ని వ్య‌క్తం చేసిన స‌న్నీ .. న‌ట‌రాజ్ మాస్ట‌ర్ త‌ర‌హాలో ఇంటి స‌భ్యుల‌కు త‌న‌దైన స్టైల్లో పేర్లు పెట్టాడు. ఆనీ మాస్ట‌ర్ ఖ‌చ్చితంగా పాము అని చెప్పిన స‌న్నీ .. న‌ట‌రాజ్ మాస్ట‌ర్ అన్న‌ట్టు ర‌వి నిజంగా గుంట‌న‌క్కే అని తేల్చేశాడు. ఇక సిరి క‌ట్ల పాము అని ష‌ణ్ముఖ్ న‌ల్ల న‌క్క అని చెప్పిన స‌న్నీ...ఇక త‌న‌కు తాను పేరు పెట్టుకోవాలంటే చింపాజీన‌ని చెప్పుకొచ్చాడు. ఇదిలా వుంటే నెటిజ‌న్స్ మాత్రం స‌న్నీని బిగ్‌బాస్ టార్గెట్ చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంద‌ని విచారం వ్య‌క్తం చేశారు. అంతే కాకుండా అర్థ్ర రాత్రి బాత్‌రూమ్‌లో దూరి గ‌బ్బు ప‌నులు చేసిన వారికి గిల్టీ బోర్డ్ ధ‌రించ‌లేద‌ని... కోట్ల మంది చూస్తుండ‌గా ఫ్రెండ్షిప్ పేరుతో ఒకే దుప్ప‌ట్లో దూరి ముద్దులు.. హ‌గ్గుల‌తో రెచ్చిపోయినవారికి ఎలాంటి బోర్డ్‌లు త‌గిలించ‌లేద‌ని.. కాజ‌ల్‌ని హేళ‌న చేసిన వాళ్ల‌కి.. త‌ల్లిపై ఒట్టుపెట్టి ప‌చ్చి అబ‌ద్ధాలు ఆడిన ర‌వికి ఎలాంటి బోర్డ్‌లు వేయ‌లేద‌ని.. మ‌రి స‌న్నీకే ఎందుకు గిల్టీ బోర్డ్ వేశారో జ‌నం చూస్తున్నార‌ని నెటిజ‌న్స్ బిగ్‌బాస్ తీరుపై మండిప‌డుతున్నారు. 

కార్తీక దీపం: ఆదిత్య‌కు ఊహించ‌ని షాకిచ్చిన మోనిత‌

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని టీవీల‌కు అతుక్కుపోయేలా ఆక‌ర్షిస్తున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. దేశ వ్యాప్తంగా టీఆర్పీ రేటింగ్ విష‌యంలో మొద‌టి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించిన ఈ సీరియ‌ల్ రోజు రోజుకీ ర‌స‌వ‌త్త‌ర మలుపులు తిరుగుతూ కొంత మందిని ఆక‌ట్టుకుంటూ మ‌రి కొంత మందికి అస‌హ‌నాన్ని క‌లిగిస్తోంది. ఈ మంగ‌ళ‌వారం 1198 వ ఎపిసోడ్‌లోకి ఎంట‌ర‌వుతోంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ప‌లు నాట‌కీయ ప‌రిణామాలు.. ఆస‌క్తిక‌ర ట్విస్ట్‌లు చోటు చేసుకోబోతున్నాయి. దీప త‌న‌కు తెలియ‌కుండా త‌న చుట్టూ ఏదో జ‌రుగుతోంద‌ని ప‌సిగ‌ట్టి సౌందర్య‌, ఆనంద‌రావు, డాక్ట‌ర్‌ల‌బాబుల‌పై ఇండైరెక్ట్‌గా సెటైర్‌లు వేయ‌డం ప్రారంభిస్తుంది. ర‌క ర‌కాల వంట‌కాల‌న్నీ చేసి కోరి కోరి మ‌రీ వ‌డ్డిస్తూ సెటైర్లు వేస్తుంటుంది. ఇద‌తి గ‌మ‌నించిన ఆదిత్య `ఏంటీ వ‌దినా ఈ రోజు చాలా ఆనందంగా క‌నిపిస్తున్నావ్‌? అంటాడు. దీంతో ఏమీ లేదు ఆదిత్య ఏడుస్తూ క‌నిపిస్తుంటే ప్రతీ ఒక్క‌రూ న‌న్ను ఏడిపించాల‌ని చూస్తున్నారు.. అందుకే ఇలా న‌వ్వుతున్నానే అంటుంది.. దీంతో ఒక్క‌సారిగా సౌంద‌ర్య‌, ఆనంద‌రావులు షాక్‌కు గుర‌వుతారు. క‌ట్ చేస్తే ఆదిత్య‌ని బుట్ట‌లో వేయ‌డానికి మోనిత మ‌హ‌త్త‌ర‌మైన ప్లాన్ వేస్తుంది. డాక్ట‌ర్ బాబు వ‌స్తున్నాడ‌ని చెప్పి ఆదిత్య‌ని త‌న ఇంటికి ర‌ప్పిస్తుంది. తీరా ఇంటికి వ‌చ్చిన ఆదిత్య‌కు అస‌లు విష‌యం చెప్పి మీ వాళ్లు నీద‌గ్గ‌ర చాలా దాచార‌ని, నాకు బాబు పుట్టాడ‌ని, డెలివ‌రీ స‌మ‌యంలో మీ అన్న‌య్య భ‌ర్త‌గా సంత‌కం చేశాడ‌ని.. డెలివ‌రీ త‌రువాత మీ అమ్మే స్వ‌యంగా త‌న‌ని ఇంటికి తీసుకెళ్లింద‌ని న‌మ్మ‌డం లేదా అంటూ డాక్ట‌ర్ బాబుతో క‌లిసి పూజ‌లో కూర్చున్న ఫొటోల‌ని చూపిస్తుంది. ఆ ఫొటోలు చూసి ఆదిత్య షాక్‌కు గుర‌వుతాడు. షాక్‌లోనే దీప అన్న మాట‌లు గుర్తు చేసుకుంటూ అన్న డాక్ట‌ర్ బాబుని నిల‌దీస్తానంటూ అక్క‌డి నుంచి బ‌య‌టికి వ‌స్తాడు. ఆదిత్య త‌న అన్న డాక్ట‌ర్ బాబుని నిల‌దీశాడా?  ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి?  మంగ‌ళ‌వారం క‌థ ఏ ట‌ర్న్ తీసుకోబోతోంది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

`దేవ‌త‌` :  రాధ‌కు ఊహించ‌ని షాకిచ్చిన స‌త్య‌

స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న పాపుల‌ర్ సీరియ‌ల్ `దేవ‌త‌`. అర్జున్  అంబ‌టి, సుహాసిని, వైష్ణ‌వి రామిరెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. పిల్ల‌ల కార‌ణంగా ఆదిత్య అవ‌మానానికి గురికావ‌డంతో స‌త్య త‌ట్టుకోలేక‌పోతుంది. ఆదిత్య స‌ర్దిచెప్పినా స‌రే ఇంటికి వ‌చ్చాక కూడా అదే మాధ‌వ .. ఆదిత్య‌ని అవ‌మానించిన తీరుని జీర్ణించుకోలేక స‌త్య కోపంతో ఊగిపోతుంటుంది. క‌ట్ చేస్తే రాధ `ఆఫీస‌ర్ సార్ కంటే నాయ‌నే మంచి వాడ‌ని పిల్ల‌ల‌కు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. కానీ పిల్ల‌లు మాత్రం ఆఫీస‌ర్ సారే మంచి వార‌ని, ఆయ‌న‌ని నాయ‌న ఏమీ అనొద్ద‌ని చెప్ప‌మంటారు. ఆ మాట‌లు విని రాధ బాధ‌ప‌డుతుంది. మాధ‌వ .. ఆదిత్య‌ని అవ‌మానించిన విషం దేవుడ‌మ్మ‌కు తెలుస్తుంది. విష‌యం తెలిసిన వెంట‌నే త‌న బిడ్డ‌ని మాధ‌వ అంత మాటంటాడా క‌డిగేస్తా .. దులిపేస్తా అని ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తుంది దేవుడ‌మ్మ‌. అయితే త‌న‌ని అడ‌గాల్సింది మీరు కాదు.. నేను అని స‌త్య  కోపంగా రాధ ఇంటికి వెళ్లి త‌లుపు త‌డుతుంది. త‌లుపు తీసిన రాధ‌కు ఎదురుగా స‌త్య క‌నిపించ‌డంతో ఊహించ‌ని షాక్‌కు గుర‌వుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. స‌త్య .. త‌న అక్క రాధ‌ని చూసిందా?.. స‌త్య‌కు క‌నిపించ‌కుండా రాధ ఎలా త‌ప్పించుకుంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు `దేవ‌త‌` ఎపిసోడ్ చూడాల్సిందే.

`ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు` : ఫ‌లించిన సామాన్యుడి క‌ల‌

`ఇక్క‌డ క‌థ‌లు మీవి.. క‌ల‌లు మీవి.. ఆట నాది కోటి మీది` అంటూ బుల్లితెర‌పై స‌రికొత్త రియాలిటీ షోతో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సంద‌డి చేస్తున్న విష‌యం తెలిసిందే. బిగ్‌బాస్ రియాలిటీ షోతో బుల్లితెర హోస్ట్‌గా ఓ రేంజ్‌లో ఆక‌ట్టుకున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆ త‌రువాత ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్ జెమినీ టీవీ కోసం `ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు` గేమ్ షోకు షోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. సామాన్యుల‌ని కోటీశ్వ‌రులుగా మార్చేస్తాం అంటూ ప్ర‌చారం చేస్తున్న ఎన్టీఆర్ నిజంగానే ఓ సామాన్యుడిని కోటీశ్వ‌రుడిని చేసేశాడు. తాజా సీజ‌న్ మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి ఈ షోలో పాల్గొన్న ఏ కంటెస్టెంట్ కోటిని గెల‌వ‌లేక‌పోయాడు. కానీ తాజాగా ఆ అద్భుతం ఆవిష్కృత‌మైంది. ఓ సామాన్యుడు ఓ విచిత్ర‌మైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న త‌న త‌న‌యుడి కోసం పోటీలో పాల్గొని ఏకంగా కోటి గెలుచుకుని సంచ‌ల‌నం సృష్టించాడు. చ‌క చ‌కా గేమ్ ఆడుతూ యంగ్ టైగ‌ర్ అడిగిన ప్ర‌శ్న‌ల‌న్నింటికీ ట‌కా ట‌కా స‌మాధానాలు చెప్పిన కంటెస్టెంట్ కోటి రూపాయ‌ల ప్ర‌శ్న‌కు కూడా అంతే స్పీడుతో స‌మాధానం చెప్పేసి కోటి గెలుచుకోవ‌డంతో హోస్ట్ ఎన్టీఆర్ షాక్‌కి గుర‌య్యార‌ట‌. కోటి రూపాయ‌ల ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పేసి కోటి గెలుచుకున్న కంటెస్టెంట్‌కి సంబంధించిన ప్రోమోని తాజాగా జెమిని టెలివిజ‌న్ వ‌ర్గాలు విడుద‌ల చేశాయి. అయితే ఈ ప్రోమోలో కోటి గెలుచుకున్న‌ది ఎవ‌రో మాత్రం చూపించ‌కుండా సీక్రెట్‌గా వుంచారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.

జెస్సీకి అరియానా వార్నింగ్

వ‌ర్టీగో వ్యాధి కార‌ణంగా గ‌త కొన్నిరోజులుగా బాధ‌ప‌డుతున్న జెస్సీ ఈ ఆదివారం అనారోగ్య కార‌ణాల వ‌ల్ల ఇంటి నుంచి బ‌య‌టికి వ‌చ్చేసిన విష‌యం తెలిసిందే. ఇంట్లో వున్న‌న్ని రోజులు నోట్లో నాలుక లేని వాడిగా క‌నిపించిన జెస్సీ ఆ త‌రువాత నుంచి త‌న నిజ‌స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెట్ట‌డం మొద‌లుపెట్టాడు. త‌న‌కు న‌చ్చ‌ని ఇంటి స‌భ్యుల‌పై యార‌గెంట్‌గా ప్ర‌వ‌ర్తిస్తూ త‌న నైజాన్ని బ‌య‌ట‌పెట్టి అంద‌రికి షాకిచ్చాడు. స‌న్నీపై ఓ రేంజ్‌లో యుద్ధానికి దిగి ష‌న్నూ చేత చివాట్లు తిన్న జెస్సీ తాజాగా త‌న బుద్దిని మ‌రో సారి బ‌య‌ట‌పెట్టి షాకిచ్చాడు. బిగ్‌బాస్ హౌస్ నుంచి అనారోగ్య కార‌ణాల వ‌ల్ల ఆదివారం బ‌య‌టికి వ‌చ్చేసిన జెస్సీ `బిగ్‌బాస్ బ‌జ్‌` కోసం అరియానాకు ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌డాప‌నికి వ‌చ్చి నానా ర‌చ్చ చేశాడు. అరియానా అడ‌క్కుండానే సిరి త‌న ఫ‌స్ట్ క్ర‌ష్ అని చెప్పిన జెస్సీ చూడ‌గానే య‌మ వుంది అనిపించింద‌ని సిరి గురించి త‌న ఒపీనియ‌న్ చెప్పేశాడు. సిరి క్ర‌ష్ క‌ర‌క్టు మ‌రి శ్వేత ఏంటి ? .. నాకు ఎవ్వ‌రూ క‌నెక్ట్ కావ‌ట్లేదు.. అంద‌మైన అమ్మాయి రావాల‌ని అన్నావ‌ని అరియానా.. జెస్సీపై  ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది.  `మొన్న‌టి వ‌ర‌కు సీక్రెట్ రూమ్‌లో వున్నా నా రూమ్‌లోకి కొత్త వాళ్ల‌ని పంపిస్తారేమో అనుకున్నా అంటూ న‌వ్వేశాడు జెస్సీ.. దీంతో చిర్రెత్తుకొచ్చిన అరియానా `రూమ్‌లో ఒక్క‌డినే వున్నా అన‌డం చాలా చండాలంగా వుంది తెలుసా? అంటూ వార్నింగ్ ఇచ్చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట చ‌క్కర్లు కొడుతోంది.

బ‌న్నీ ఫ్యాన్స్ చెప్పుల‌తో కొడ‌తార‌ట‌!

ఒక స్టార్ హీరోని అనుక‌రించ‌డం.. అలా అనుక‌రించ‌డంలో ఎలాంటి త‌ప్పులు దొర్లినా అవ‌త‌లి వ్య‌క్తి పై ఫ్యాన్స్ దాడికి దిగ‌డం.. అత‌న్ని సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేయ‌డం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే స‌ద‌రు వ్య‌క్తిపై ఓ రేంజ్‌లో స్టార్ హీరో అభిమానులు భౌతిక దాడుల‌కు దిగ‌డం కూడా మ‌న‌కు తెలిసిందే. అలాంటి ప‌రిస్థితే `కామెడీ స్టార్స్‌` టీమ్ లీడ‌ర్ హ‌రికి ఎదురు కానుందా? అంటే యాంక‌ర్ శ్రీ‌ముఖి అవున‌ని హెచ్చ‌రిస్తోంది. స్టార్ హీరో ఫ్యాన్స్ చెప్పుల‌తో కొడ‌తారంటూ శ్రీ‌ముఖి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. వివ‌రాల్లోకి వెళితే.. బుల్లితెరపై ఆస‌క్తిక‌ర‌మైన గేమ్ షోల‌ని క్రియేట్ చేస్తూ వాటిని జ‌న‌రంజ‌కంగా మ‌లుస్తూ ఆక‌ట్టుకుంటున్న ఓంకార్ `స్టార్ మా` కోసం `కామెడీ స్టార్స్‌` ప్రోగ్రామ్‌ని ప్రొడ్యూస్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ షోలో ముక్కు అవినాష్ టీమ్‌, హ‌రి టీమ్‌, ధ‌న్‌రాజ్, వేణు టీమ్ పోటీ ప‌డుతూ త‌మ‌దైన కామెడీ స్కిట్‌ల‌తో ఆక‌ట్టుకుంటున్నారు. ఇదే క్ర‌మంలో ఆదివారం ప్ర‌త్యేకంగా వీకెండ్ కావ‌డంతో స‌రికొత్త స్కిట్‌ల‌తో బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించారు. హ‌రి కూడా కొత్త స్కిట్‌తో న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇందులో భాగంగా బ‌న్నీ న‌టించిన `పుష్ప‌` చిత్రంలోని `చూపే బంగార‌మాయెనే శ్రీ‌వల్లీ మాటే మాణిక్య మాయెనే.. అంటూ సాగే పాట‌కు బ‌న్నీని అనుక‌రించే ప్ర‌య‌త్నం చేశాడు హ‌రి. ఈ పాట‌ని ప్ర‌ద‌ర్శించే క్ర‌మంలో హ‌రి చెప్పులు జారిపోవ‌డంతో ఈ స్టెప్పులు చూస్తే బ‌న్నీ ఫ్యాన్స్ అదే చెప్పుల‌తో కొడ‌తారేమో చూసుకో అంటూ శ్రీ‌ముఖి వార్నింగ్ ఇవ్వ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

బిగ్‌బాస్ : ఈ రోజు ర‌చ్చ అంత‌కు మించి

మొత్తానికి విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5 ప‌ద‌వ వారంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. కంటెస్టెంట్‌ల విష‌యంలో ఇప్ప‌టికే ప‌లువురు విమ‌ర్శ‌లు చేస్తూనే వున్నారు. సీజ‌న్ 4తో పోలిస్తే తాజా సీజ‌న్ అన్ని విష‌యాల్లోనూ తేలిపోయింద‌ని, కంటెస్టెంట్‌ల పెర్ఫార్మెన్స్ ఏమంత‌గా లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న నెటిజ‌న్స్ తాజాగా శ‌నివారం ఎపిసోడ్ విష‌యంలో హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న నాగ్ తీరుపై కూడా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప‌ద‌వ వారం వ‌ర్టిగో వ్యాధి కార‌ణంగా బాధ‌ప‌డుతున్న జెస్సీ ఆరోగ్య‌కార‌ణాల వ‌ల్ల హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేశాడు. దీంతో అత‌ని స్థానంలో బ‌య‌టికి వెళ్లాల్సిన కాజ‌ల్ మొత్తానికి సేఫ్ అయిపోయింది. ఇదిలా వుంటే సోమ‌వారం నామినేష‌న్‌ల ప్ర‌క్రియ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో హౌస్ మ‌రోసారి ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌ల‌తో హీటెక్క‌బోతోంది. అంద‌రికి మ‌న‌సులో వున్న నిజాల‌ని బ‌య‌ట‌పెట్టే ధైర్యం వుండ‌దు. నిజాల‌ని నిర్భ‌యంగా నిల‌దీసే అవ‌కాశ‌మే ఈ రోజు జ‌రిగే నామినేష‌న్ ప్ర‌క్రియ అంటూ బిగ్‌బాస్ హౌస్ మెంబ‌ర్స్ మ‌ధ్య కొచ్చ చిచ్చుకు తెర‌లేపాడు. దీంతో సోమ‌వారం రోజు ర‌చ్చ అంత‌కు మించి వుండేలా క‌నిపిస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. `నీ త‌ప్పు నీకు చెబితే నీకు నేను ఫేక్ ఎలా అనిపించానో నాకు అర్థం కాలేదు మామా అంటూ స‌న్నీని ఉద్దేశించిన ర‌వి అన‌డం.. అంద‌రి ముందు నాది బ్యాడ్ బిహేవియ‌ర్ అన‌డం .. ఆ వ‌ర్డ్‌ని నేనే తీసుకోలేక‌పోయాను మామ‌` అని స‌న్నీ స‌మాధానం చెప్ప‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య ర‌చ్చ‌కు దారి తీసింది. ఇదిలా వుంటే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ష‌న్నూ .. కాజ‌ల్‌ని నామినేట్ చేయ‌డం.. ఇంటి నుంచి నువ్వు బ‌య‌టికి వెళ్లిపోతే గొడ‌వ‌లు త‌గ్గుతాయ‌ని నా ఫీలింగ్ అని చెప్ప‌డం.. ఇదే క్ర‌మంలో స‌న్నీ కార‌ణంగా మాన‌స్‌, ష‌న్నూల మ‌ధ్య గొడ‌వ జ‌ర‌గ‌డంతో ఈ సోమ‌వారం ఎపిసోడ్ ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌నున్న‌ట్టుగా తెలుస్తోంది.