బిగ్ బాస్ త‌మిళ్ 5: క‌మ‌ల్ ప్లేస్‌లో ర‌మ్య‌కృష్ణ వ‌చ్చేశారు!

  బిగ్ బాస్ త‌మిళ్ 5 హోస్ట్ అయిన క‌మ‌ల్ హాస‌న్‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయి, హాస్పిట‌ల్‌లో చేర‌డంతో వీకెండ్ ఎపిసోడ్‌కు ఆయ‌న స్థానంలో ప్ర‌ముఖ సీనియ‌ర్ యాక్ట్రెస్ ర‌మ్య‌కృష్ణ వ‌చ్చారు. క‌మ‌ల్ హౌస్‌మేట్స్‌తో వీడియో కాల్ ద్వారా ఇంట‌రాక్ట్ అవుతున్న వీడియో క్లిప్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన మేక‌ర్స్‌, ఆయ‌న కోలుకొని తిరిగి వ‌చ్చేంత‌వ‌ర‌కు ర‌మ్య‌కృష్ణ హోస్ట్‌గా కొన‌సాగుతారంటూ ఆమెను ప‌రిచ‌యం చేశారు. ఈ న్యూస్‌ను అనౌన్స్ చేసేందుకు మేక‌ర్స్ ఒక ప్రోమో వీడియోను షేర్ చేశారు. గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన ర‌మ్య‌కృష్ణ గోల్డ్ క‌ల‌ర్ చీర‌లో బ్యూటిఫుల్‌గా క‌నిపిస్తున్నారు. బిగ్ బాస్ ఫ్యాన్స్ సైతం ర‌మ్య‌కృష్ణ ఈ షోను ఎలా హోస్ట్ చేస్తారో చూడాల‌ని ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఆమె బిగ్ బాస్ సెట్స్‌పైకి రావ‌డం ఇదే మొద‌టిసారి కాదు. ఇదివ‌ర‌కు బిగ్ బాస్ తెలుగు 4 వీకెండ్ ఎపిసోడ్‌కు నాగార్జున ప్లేస్‌లో ఆమె హోస్ట్‌గా చేసి, అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నారు. బిగ్ బాస్ త‌మిళ్ 5లో కొన్ని ఇంట్రెస్టింగ్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు క‌నిపిస్తున్నాయి. ఇంత‌కుముదు షో నుంచి ఎలిమినేట్ అయిన అభిషేక్ రాజా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మ‌రోసారి హౌస్‌లోకి వ‌చ్చాడు. అలాగే హీరో విజ‌య్ స‌న్నిహితుడు సంజీవ్ కూడా ఈ వారం షోలో ఎంట్రీ ఇచ్చాడు. Also read:  `బంగార్రాజు`పైనే `శివ‌గామి` ఆశ‌లు! కాగా, ఇటీవ‌ల యు.ఎస్‌.కు వెళ్లి తిరిగొచ్చిన క‌మ‌ల్ హాస‌న్‌కు క‌రోనా పాజిటివ్ అని తేలడంతో చెన్నైలో శ్రీ‌రామ‌చంద్ర హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న కోలుకొనేవ‌ర‌కు కుమార్తెలు శ్రుతి, అక్ష‌ర‌, శ్రుతి బాయ్‌ఫ్రెండ్ శంత‌ను హ‌జారికా చెన్నైలోనే ఉండ‌నున్నారు. త‌మ తండ్రి కోలుకుంటున్నార‌నీ, ఆయ‌న ఆరోగ్యం గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌నీ శ్రుతి చెప్పారు. Also read:  ష‌ణ్ణుతో హ‌గ్గుల‌పై సిరి ప్రియుడి షాకింగ్ రియాక్ష‌న్‌!

 `గుప్పెడంత మ‌న‌సు`: రాత్రి వ‌సు, రిషి ల మ‌ధ్య ఏం జ‌రిగింది?

రిషి, వసుల చిలిపి త‌గాదాలు, గిల్లిక‌జ్జాల‌ నేప‌థ్యంలో  సాగుతున్న సీరియ‌ల్ `గుప్పెడంత మ‌న‌సు`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతూ ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియ‌ల్ ఈ శ‌నివారంలో 303వ ఎపిసోడ్‌లోకి ఎంట‌ర్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలో స‌లు ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ రోజు హైలైట్స్ ఏంటో ఒక‌సారి లుక్కేద్దాం. వ‌సు, మ‌హీంద్ర రెస్టారెంట్‌లో క‌లుద్దామ‌ని అనుకున్న విష‌యం తెలుసుకున్న రిషి చాలా కాలంగా ద్వేషిస్తున్న జ‌గ‌తి కారులోనే రెస్టారెంట్‌కి బ‌య‌లుదేర‌తాడు. కార్ డ్రైవ్ చేస్తూ రిషి.. వ‌సు ఫ్యూచ‌ర్ ప్లాన్స్ ఏంట‌ని జ‌గ‌తిని అడుగుతాడు. అప్పుడు జ‌గ‌తి .. వ‌సు ఏదంటే అదే ..దానికి నేను హెల్ప్ చేస్తాను అంతే` అంటుంది. వెంట‌నే నాకు వ‌సు కావాలి మేడ‌మ్ `అంటాడు రిషి. ఆ మాట‌లు విన్న జ‌గ‌తి షాక్‌కు లోన‌వుతుంది. మాట మార్చిన రిషి మ‌న కాలేజీలో ఫ్యాక‌ల్టీ హెడ్‌గా వ‌సు కావాలంటాడు. అయితే నేను చెప్ప‌గ‌ల‌ను కానీ ఒప్పించ‌లేను క‌దా సార్ `అంటుంది జ‌గ‌తి. అడ‌గ‌డం అయితే మీరెందుకు త‌న‌ని ఒప్పించ‌మ‌ని మీకు బాధ్య‌త ఇస్తున్నాను` అంటాడు రిషి. ఇలా వీరి సంభాష‌ణ జ‌రుగుతుండ‌గానే కార్ ఆగుతుంది. క‌ట్ చేస్తే... రాత్రి కాలేజీలో రిషి బాస్కెట్ బాల్ ఆడుతుంటాడు. అదే స‌మ‌యానికి వ‌సు అక్క‌డికి వ‌స్తుంది. త‌న‌ని చూసి ఇదేంటి ఇలా వ‌చ్చావ్‌? ` అంటాడు రిషి. అనుకోకుండా వ‌చ్చాను సార్ అంటుంది వ‌సు.. వెంట‌నే `నీకు బాస్కెట్ బాల్ ఆడ‌టం వ‌చ్చా? అంటాడు రిషి. రాదు రాదు అంటూనే రిషితో క‌లిసి వ‌సు బాస్కెట్ బాల్ ఆడుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

బిగ్‌బాస్‌: ష‌న్నుకు కింగ్ నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్‌

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఎండింగ్‌కి రోజులు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా కొద్దీ వివాదాలు మ‌రీ ఎక్కువ‌వుతున్నాయి. ఈ షోపై గ‌త షోల‌కు మించి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న విష‌యం తెలిసిందే. కంటెస్టెంట్‌ల ప‌రంగానూ, కింగ్ నాగ్ విష‌యంలోనూ దారుణంగా విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. తాజాగా అవి ప‌తాక స్థాయికి చేరిన‌ట్టుగా తెలుస్తోంది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ష‌న్ను, సిరి జంట చేసే ప‌నులే అని తెలుస్తోంది. 12వ వారంలోకి ఎంట‌రైన బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ షోకి వ‌చ్చిన 19 మందిలో 11 మంది ఎలిమినేట్ అయి ఇంటిదారి ప‌ట్టారు. జెస్సీ అనారోగ్య కార‌ణాల వ‌ల్ల ఇంటి నుంచి బ‌య‌టికి వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఇంటిలో యాంక‌ర్ ర‌వి, స‌న్నీ, ష‌న్ను, సిరి, కాజ‌ల్‌, మాన‌స్‌, ప్రియాంక‌, శ్రీ‌రామ‌చంద్ర‌తో క‌లిపి 8 మంది స‌భ్యులున్నారు. ఈ ఎనిమ‌బిది మంది ఇంటి స‌భ్యుల్లో ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌న్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా వుంటే శ‌నివారం కింగ్ నాగార్జున .. కంటెస్టెంట్ ష‌న్నుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన‌ట్టుగా తెలుస్తోంది. కెప్టెన్సీ టాస్క్‌లో బాగా ఆడావ‌ని అభినందిస్తూనే ఇంటి స‌భ్యుల స‌హ‌కారం వ‌ల్లే నువ్వు కెప్టెన్ కాగ‌లిగావ‌ని నాగ్ .. ష‌న్నుకు చుర‌క‌లంటించార‌ట‌. అంతే కాకుండా కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా జ‌రిగిన వాద‌నలో కాజ‌ల్ జెండ‌ర్ గురించి ప్ర‌స్తావించిన‌ప్పుడు ఎందుకు అలా రియాక్ట్ అయ్యావ‌ని, త‌ను ఒక‌సారి అంటే అదే ప‌దాన్ని ప‌దే ప‌దే ఎందుకు అనాల్సి వ‌చ్చింద‌ని నాగ్ మండిప‌డ్డార‌ట‌. ఇక సిరి మ‌ద‌ర్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి అంతా బాగానే వుంది కానీ హ‌గ్గులు మాత్రం త‌న‌కు న‌చ్చ‌లేద‌న్న‌ప్పుడు నువ్వెందుకు ఫీల‌య్యావ్‌.. అలా ఎందుకు రియాక్ట్ కావాల్సి వ‌చ్చింద‌ని పాగ్ ఓరేంజ్‌లో ష‌న్నుకీ క్లాస్ పీకార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అస‌లు శ‌నివారం ఎపిసోడ్‌లో నాగ్ ఎవ‌రికి షాక్ ఇవ్వ‌బోతున్నాడు? .. ష‌న్నుని ఏరేంజ్‌లో ఆడుకున్నాడు? అన్న‌ది తెలియాటంటే టుడే ఎపిసోడ్ ని మిస్ అవ్వ‌కూడ‌దంతే..  

`కార్తీక‌దీపం` : మోనిత‌పైకి చీపుర్లెత్తిన బ‌స్తీ జ‌నం!

మ‌హిళా ప్రేక్ష‌కుల నీరాజ‌నాలందుకుంటున్న బుల్లితెర సీరియ‌ల్ కార్తీక దీపం. ఈ మ‌ధ్య కాలంలో ఇంత‌లా పాపుల‌ర్ అయిన సీరియ‌ల్ మ‌రొక‌టిలేదు. సామాన్య గృహిణుల నుంచి సెల‌బ్రిటీల మ‌ద‌ర్‌ల వ‌ర‌కు ఈ సీరియ‌ల్ ఫ్యాన్స్‌గా మారిపోయారు. వంట‌ల‌క్క వారికి హాట్ ఫేవ‌రేట్‌గా మారిపోయింది. శ‌న‌వారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగ‌బోతోంది. మ‌రీ ముఖ్యంగా కీల‌క పాత్ర‌ధారి మోనిత‌కు ఈ ఎపిసోడ్ భారీ షాక్ ఇవ్వ‌బోతోంది. అదేంటో ఓసారి లుక్కేద్దాం. 1208వ ఎపిసోడ్‌లోకి ఈ సీరియ‌ల్ ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో ప‌లు ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకోబోతున్నాయి.  ఆనంద‌రావు, సౌంద‌ర్య ఆనందంగా క‌నిపిస్తుంటారు. మ‌న‌సు చాలా ప్ర‌శాంతంగా వుంద‌ని, ఈ రోజు ఎంతో ఉత్సాహంగా వుంద‌ని చాలా రోజుల త‌రువాత ఇలా ఆనందంగా వుండ‌టం బాగుంద‌ని చెబుతుంటాడు ఆనంద‌రావు ఇదే స‌మంలో అక్క‌డికి హిమ‌, శౌర్య వ‌స్తారు. వీరితో వాకింగ్‌కి వెళుతున్నామ‌ని, ఈ విష‌యం దీప‌కు చెప్ప‌మని పిల్ల‌ల్ని పంపిస్తారు సౌంద‌ర్య‌, ఆనంద‌రావు. క‌ట్ చేస్తే కార్తీక్ త‌ల స్నానం చేసి రావ‌డంతో అత‌ని త‌ల‌ని గ‌ట్టిగా తుడుస్తూ వుంటుంది దీప‌. కార్తీక్ చాలు అన్నా విన‌కుండా అత‌న్ని ఓ ఆటాడుకుంటుంది. ఇదంతా గ‌మ‌నించిన పిల్ల‌లు మురిపిపోతారు. ఆ త‌రువాత ఈ ఇద్ద‌రూ ఆనంద‌రావు, సౌంద‌ర్య‌తో క‌లిసి వాకింగ్‌కి వెళ్లిపోతారు. క‌ట్ చేస్తే ప్రియ‌మ‌ణితో క‌లిసి మోనిత కారులో కార్తీక్ ఇంటి బ‌య‌ట ఎదురుచూస్తూ వుంటుంది. స‌మ‌యం చిక్కింది క‌దా అని ప్రియ‌మ‌ణి .. మోనిత‌ని త‌న మాట‌ల‌తో విసిగిస్తూ వుంటుంది. ఇంత‌లో దీప తండ్రి ముర‌ళీ కృష్ణ ఇంటికి వ‌స్తూ వ‌స్తూ కారులో మోనిత వుండ‌టాన్ని గ‌మ‌నిస్తాడు. అదే విష‌యాన్ని దీప‌కు చెబుతాడు. వెంట‌నే దీప కార్తీక్‌కి చెబుతుంది. విష‌యం తెలుసుకున్న కార్తీక్ కోపంతో ర‌గిలిపోతాడు. క‌ట్ చేస్తే బ‌స్తీలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తాడు కార్తీక్‌. ఇదే అద‌నుగా ప్రియ‌మ‌ణితో బాబుతో క‌లిసి అక్క‌డికి వ‌స్తుంది మోనిత‌. మోనిత‌ని గ‌మ‌నించిన దీప బ‌స్తీ వాసుల‌కి త‌న గురించి చెప్ప‌డంతో అంతా క‌లిసి మోనిత‌పై చీపురు తిర‌గేస్తారు. ఆ త‌రువాత ఏమైంది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

ష‌ణ్ణుతో హ‌గ్గుల‌పై సిరి ప్రియుడి షాకింగ్ రియాక్ష‌న్‌!

  బిగ్‌ బాస్ హౌస్‌లో ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌తో క‌లిసి ర‌చ్చ చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్న త‌న ప్రియురాలు సిరి హ‌న్మంత్‌పై ఆమె ప్రియుడు శ్రీ‌హాన్ షాకింగ్ కామెంట్‌లు చేశాడు. సిరి, ష‌ణ్ణు హ‌గ్గుల‌పై నెటిజ‌న్స్ తీవ్రంగా ట్రోల్ చేస్తున్న వేళ శ్రీ‌హాన్ షాకింగ్ రియాక్ష‌న్ ఇచ్చాడు. వివ‌రాల్లోకి వెళితే... బిగ్‌బాస్ ఐదో సీజ‌న్ 12వ వారంలోకి ఎంటర‌వుతోంది. ఈ నేప‌థ్యంలో హౌస్‌లో ప‌లు నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా సిరి, ష‌ణ్ణుల మ‌ధ్య హ‌గ్గులకు ఆన‌క‌ట్ట అనేది లేకుండా సీరియ‌ల్ త‌ర‌హాలో న‌డుస్తోంది. ఇదే చాలా మందికి చిరాకు తెప్పిస్తోంది. స్వ‌యంగా వీరి హ‌గ్గుల పురాణంపై సిరి త‌ల్లి ఘాటుగానే స్పందించింది. ఇటీవ‌లే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సిరి త‌ల్లి సిరిని ష‌ణ్ణు ఓ అన్న‌లా, ఓ ఫాద‌ర్‌లా స‌పోర్ట్ చేయ‌డం బాగానే వుంది కానీ అస్త‌మానం హ‌గ్గులు చేసుకోవ‌డం మాత్రం త‌న‌కు న‌చ్చ‌డంలేద‌ని ముఖం ముందే చెప్పేసి షాకిచ్చింది. అయితే దీనిపై మొత్తానికి సిరి ప్రియుడు శ్రీ‌హాన్ స్పందించాడు. సిరి - ష‌ణ్ణు హ‌గ్గుల‌పై ఓ ర‌కంగా షాకింగ్ కామెంట్‌లు చేశాడు. సిరి చెంప ఛెల్లు మ‌నేదంట‌.. ఎందుకో.. సిరి, ష‌ణ్ణు మ‌ధ్య వున్న రిలేష‌న్ గురించి త‌న‌కు తెలుస‌ని, వాళ్లున్న ప‌రిస్థితుల్ని బ‌ట్టి వారు అలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా సిరి త‌ల్లి త‌న కూతురు బ‌య‌ట బ్యాడ్ కాకూడ‌ద‌నే కార‌ణంగానే అలా మాట్లాడింది కానీ ఆమెకు కూడా సిరి గురించి బాగా తెలుస‌న్నాడు. సిరి, ష‌ణ్ణు మ‌ధ్య వున్న‌ రిలేష‌న్‌ని తాను గౌన‌విస్తాన‌ని, వారిద్ద‌రు మంచి ఫ్రెండ్స్ మాత్ర‌మేన‌ని క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. ష‌ణ్ముఖ్‌కు షాకిచ్చిన సిరి మ‌ద‌ర్‌

సిరి చెంప ఛెల్లు మ‌నేదంట‌.. ఎందుకో..

బిగ్‌బాస్ రియాలిటీ షోని అంతా అనుమానిస్తున్న‌ట్టుగానే ఓ జంట వ‌ల్గ‌ర్ స్టాయికి తీసుకెళుతోంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. హౌస్‌లో ఎమోష‌న‌ల్ బాండింగ్ పేరుతో హ‌గ్గులు, కిస్సులు.. ఎక్కువైపోయాయ‌ని... సంద‌ర్భం అనేది లేకుండానే హ‌గ్గులు .. కిస్సుల‌తో ఓ జంట నాన ర‌చ్చ చేస్తోంద‌ని నెటిజ‌న్స్ మండిప‌డుతున్నారు. ఆ జంట మ‌రెవ‌రో కాదు. సిరి, ష‌ణ్ముఖ్‌. హౌస్‌లో వీరిద్ద‌రి రొమాన్స్‌కి ఎక్క‌డా అడ్డుక‌ట్ట‌ప‌డ‌టం లేదు. ఇటీవ‌ల సిరి త‌ల్లి హౌస్‌లోకి ఎంట‌రై ష‌ణ్ముఖ్‌ ఓ అన్న‌లా, తండ్రిలా స‌పోర్ట్ చేస్తున్నాడ‌ని, అయితే ప్ర‌తీసారి హ‌ద్దులు మీరి హ‌గ్గులు ఇవ్వ‌డం త‌న‌కేమీ న‌చ్చ‌డం లేద‌ని బాంబ్ పేల్చిన విష‌యం తెలిసిందే. ష‌ణ్ముఖ్‌కు దూరంగా వుండ‌మ‌ని, అత‌నికి ద‌గ్గ‌ర కావ‌డం త‌న‌కు న‌చ్చ‌డం లేద‌ని సిరి త‌ల్లి ఎంత చెప్పినా సిరి మాత్రం త‌న మాట‌ని లెక్క‌చేయ‌డం లేదు. అలా అంటే ష‌న్ను ఫీల‌వుతాడ‌ని చెప్పి త‌ల్లికే క్లాస్ పీకిన సిరి ఆ త‌రువాత యాజ్ యూజ్‌వ‌ల్‌గా ష‌న్నుని హ‌గ్ చేసుకోవ‌డంతో నెటిజన్స్ త‌ల్లి చెప్పినా మార‌లేద‌ని సిరిపై సెటైర్లు వేస్తున్నారు. దీనిపై జెస్సీ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. వెర్టిగో వ్యాధితో బాధ‌ప‌డుతున్న జెన్సీ ఇంటి నుంచి బ‌య‌టికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టాడు. హౌస్‌లో త‌ను అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న స‌మ‌యంలో సిరి త‌న‌కు అండ‌గా నిలిచింద‌ని, ఆ స‌మ‌యంలో కుటుంబం వుంటే బాగుండేద‌ని ఫీల‌య్యాన‌ని, అందుకే బ‌య‌టికి వ‌చ్చాన‌ని జెస్సీ చెప్పాడు. అంతే కాకుండా హౌస్‌లో ఒంట‌రి త‌నం ఫీల‌వుతున్న‌ప్పుడు మ‌న‌కు బాగా ద‌గ్గ‌ర‌గా వుండే వాళ్ల‌తో ఎక్కువ‌గా క‌నెక్ట్ అవుతామ‌ని, అలాగే సిరి, ష‌న్ను క‌నెక్ట్ అవుతున్నార‌ని, ఓ సంద‌ర్భంలో సిరి బాత్రూమ్ గోడ‌కి త‌ల కొట్టుకోవ‌డం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని, ఆ స‌మ‌యంలో నేను హౌస్‌లో వుంటే ఖ‌చ్చితంగా సిరి చెంప ఛెల్లుమ‌నేద‌ని చెప్పుకొచ్చాడు జెస్సీ.   

`కార్తీక‌దీపం` : లాయ‌ర్ సురేష్‌తో క‌లిసి మోనిత కొత్త కుట్ర‌

గ‌త కొంత కాలంగా బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. వంట‌ల‌క్క పాత్ర ధారి ప్రేమి వైధ్య‌నాథ్‌ని స్టార్‌ని చేసింది. ఇక డాక్ట‌ర్ బాబు పాత్ర‌లో న‌టించిన నిరుప‌మ్ ఓంకార్‌ని కూడా పాపుల‌ర్ స్టార్‌గా మార్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు 1206 ఎపిసోడ్‌లు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న ఈ సీరియ‌ల్ ఈ శుక్ర‌వారం 1207వ ఎపిసోడ్‌లోకి ఎంట‌ర‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. బార‌సాల సాక్షిగా  మోనిత  క‌డుపు వెన‌కున్న కుట్ర‌ని బ‌య‌ట‌పెట్టి క‌ళ్లు బైర్లుక‌మ్మేలా చేసింది దీప‌. ఇదే సంద‌ర్భంగా దీప‌పై త‌న‌కున్న ప్రేమ‌ని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టాడు కార్తీక్‌. క‌ట్ చేస్తే ఈ రోజు ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించేదిగా వుంది. ఆ హైలైట్స్ ఏంటో చూద్దాం. దీప , శ్రావ్య ఒక‌టీమ్‌, ఆదిత్య‌, కార్తీక్ ఒక‌టీమ్‌గా ఏర్ప‌డి పొడుపుక‌థ‌ల పోటీ పెట్టుకుని హ్యాపీగా న‌వ్వుకుంటుంటారు. పిల్ల‌లు, ఆనంద‌రావు, సౌంద‌ర్య‌లు వాళ్ల‌ని చూసి మురిపిపోతుంటారు. ఇలా కార్తీక్‌, దీప‌ల కుటుంబం ఆనందంపార‌వ‌శ్యంలో మునిగితేలుతుంటే మోనిత ఎలా వాళ్ల ఆనందాన్ని దూరంచేయాలా అని మ‌రో కుట్ర‌కు తెర‌లేపుతుంది. ఇందు కోసం ఓ మాస్ట‌ర్ ప్లాన్‌ని రెడీ చేసుకున్న మోనిత వెంట‌నే లాయ‌ర్ సేరుష్‌ని రంగంలోకి దించేస్తుంది. `మీరు ఏ దారిలో వెళ‌తారో నాకు తెలియ‌దు. సురేష్‌గారు డ‌బ్బులు ఎంత ఖ‌ర్చ‌యినా ఫ‌ర‌వాలేదు మ‌నం మాత్రం గెల‌వాలి.. మీరు నా రివేంజ్ తీర్చాలి` అంటుంది మోనిత‌. ఇంత‌కీ మోనిత చేసిన ప్లాన్ ఏంటీ? .. దీపని మళ్లీ ఏం చేయ‌బోతోంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎనిసోడ్ చూడాల్సిందే.

గుప్పెడంత మ‌న‌సు` : జ‌గ‌తిని రిషీ ఏమ‌డిగాడు?

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `గుప్పెడంత మ‌న‌సు`. రిషీ. వసుల ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో ఆద్యంతం ఆక‌ట్టుకునే క‌థా క‌థ‌నాల‌తో సాగుతోంది. గ‌త కొర‌న్ని వారాలుగా ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియ‌ల్ ఈ శుక్ర‌వారం 302వ ఎపిసోడ్‌లోకి అడుగుపెడుతోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో చూద్దాం. రిషీ, ఫ‌ణీంద్ర‌, మ‌హేంద్ర‌ల‌తో క‌లిసి ఇంట్లో కూర్చుని ` ఈరోజే లాస్ట్ ఎగ్జామ్‌...సెల‌వుల్లో మెషీన్ ఎగ్జామ్ మ‌రింత డ‌బుల్ చేయాలి` అంటాడు. ఇదే స‌మ‌యంలో మ‌హేంద్ర‌కు వ‌సు ఫోన్ చేస్తుంది. ప‌క్క‌కు వెళ్లిన మ‌హేంద్ర `నేనే నీకు ఫోన్ చేయాల‌నుకుంటున్నాన‌మ్మా .. నీతో చాలా మాట్లాడాలి` అంటాడు అయితే రెస్టారెంట్‌లో సాయంత్రం క‌లుద్దామా` అంటుంది వ‌సు. రిషి వ‌స్తున్నది గ‌మ‌నించి మ‌హేంద్ర ఫోన్ క‌ట్ చేస్తాడు. అది గ‌మ‌నించిన రిషీ.. ఏంమీ త‌న‌తో మీకు ప‌ర్స‌న‌ల్స్‌.. అని ప్ర‌శ్నిస్తే.. అబ్బెబ్బే ఏమీ లేదు ఊరికే చేసింది అని క‌వ‌ర్ చేస్తాడు. మీరు రెస్టారెంట్లో క‌ల‌వాల‌నుకుంటున్నార‌ని అది త‌న‌కు తెలుస‌ని త‌న‌కు తెలుస‌ని రిషి మ‌న‌సులో అనుకుంటాడు. మ‌రి అనుకున్న‌ట్టుగానే మ‌హేంద్ర‌, వ‌సు రెస్టారెంట్‌లో కలుసుకున్నారా? .. క‌లిస్తే ఏం మాట్లాడుకున్నారు? .. ఆ త‌రువాత ఏంజ‌రిగింది? .. రిషి వ‌చ్చాడా? .. జ‌గ‌తికి .. రిషి.. వ‌సు గురించి ఏం చెప్పాడు? .. అందుకు జ‌గ‌తి ఎలా రియాక్ట్ అయింది? .. వంటి ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకోవాలంటే ఈ రోజు ఎపిసోడ్ త‌ప్ప‌కుండా చూడాల్సిందే.   

`ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`: య‌శోధ‌ర్ మాజీ భార్య ట్రాప్‌లో వేద‌

స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న స‌రికొత్త ప్రేమ‌క‌థ `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`. ప్ర‌ధాన జంట‌గా న‌టించిన య‌శోధ‌ర్‌, వేద ఇద్ద‌రూ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త వారే కావ‌డం.. డైరెక్ట‌ర్ ఎంచుకున్న నేప‌థ్యం.. క‌థాగ‌మ‌నం కొత్త‌గా వుండ‌టంతో ఈ సీరియ‌ల్‌ని బుల్లితెర‌ ప్రేక్ష‌కులు అమితంగా ఇష్ట‌ప‌డుతున్నారు. వేద‌గా డెబ్‌జానీమోడ‌క్‌, య‌శోధ‌ర్‌గా నిరంజ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ రోజు ఎపిసోడ్ మ‌రింత హైలైట్‌గా నిల‌వ‌బోతోంది. ఖుషీని కిడ్నాప్ చేసింద‌ని వేద కుటుంబాన్ని పోలీస్టేష‌న్‌కి లాగిన య‌శోధ‌ర్ త‌న మాజీ భార్య ఎంట్రీతో త‌ను త‌ప్పు చేశాన‌ని తెలుసుకుంటాడు. ఎలాగైనా వేద‌కు సారీ చెప్పాల‌నుకుంటాడు. ఇదే విష‌యాన్ని య‌ధ‌ర్ సోద‌రుడు వ‌సంత్ కూడా చెబుతాడు. నీ తొంద‌ర‌పాటు త‌నం వ‌ల్ల వేద జీవితం నాశ‌నం అయ్యేలా వుంద‌ని, అమెకు సారీ చెప్పమంటాడు. ఇందుకు య‌శోధ‌ర్ అంగీక‌రించి వేద‌కు సారీ చెప్ప‌డానికి రెడీ అవుతాడు. టెర్రాస్‌పై వేద వుంద‌ని తెలుసుకుని అక్క‌డికి వెళ్లిన య‌శోధ‌ర్ .. డాక్ట‌ర్ వేద‌కు సారీ చెప్పాడా? ఆ త‌రువాత ఏం జ‌రిగింది అన్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా వుంటే పాప‌ని అడ్డంపెట్టుకుని వేద‌ని ట్రాప్‌లో ప‌డేస్తుంది య‌శోధ‌ర్ మాజీ భార్య. వేద‌ని కావాల‌ని య‌శోధ‌ర్‌పై రెచ్చ‌గొట్టి అత‌నంటే త‌న‌కు ఇయిష్టం పెరిగేలా ప్లాన్ చేస్తారు. ఇంత‌కీ య‌శోధ‌ర్ మాజీ భార్య ప్లాన్ ఏంటీ? .. త‌న భ‌ర్త‌, బిజినెస్‌మెన్‌, య‌శోధ‌ర్ ప్ర‌త్య‌ర్థితో క‌లిసి ఏం ప్లాన్ చేసింది? .. వేద నిజంగానే వారి ట్రాప్‌లో ప‌డిపోయిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

వ‌సు, మ‌హేంద్ర‌ల‌కు షాకిచ్చిన రిషి, జ‌గ‌తి

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తున్న సీరియ‌ల్ `గుప్పెడంత మ‌న‌సు`. గ త‌కొన్ని వారాలుగా సాగుతున్న ఈ సీరియ‌ల్ నేడు 301వ ఎపిసోడ్‌లోకి ఎంట‌ర‌వుతోంది. ఈ గురువారం మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌బోతోంది. ఎగ్జామ్ రాసిన త‌రువాత వ‌సు కోసం ఎదురు చూస్తున్న రిషి త‌న‌ని తీసుకెళ్ల‌డానికి కార్‌లో ఎదురుచూస్తూ తాను ఎంత‌కీ రాక‌పోవ‌డంతో రెండు సార్లు హార‌న్ మోగిస్తాడు. అది గ‌మ‌నించిన వ‌సు త‌న ఫ్రెండ్‌ని పంపించేసి రిషి కారెక్కుతుంది. సీట్‌బెల్ట్ పెట్టుకోమ‌ని చెప్పిన రిషి `ఎగ్జామ్ బాగా రాసిన‌ట్టున్నావ్ ముఖం వెలిగిపోతోంది.. అప్పుడే రిలాక్స్ అయిపోకు మెషిన్ ఎడ్యుకేష‌న్ గురించి మ‌రిన్ని ప్లాన్స్ వేయాలి అంటూ రిషి కార్‌ని ముందుకు క‌దిలిస్తాడు ఇంత‌లో వ‌సు హ‌ఠాత్తుగా కార్ ఆపండి సార్ అని అరుస్తుంది. వాస‌న అద్భుతంగా వుంది మిర్చి బ‌జ్జీ తిందాం సార్‌` అంటుంది. మిర్చి బ‌జ్జీ గురించి లెక్చ‌ర్ ఇవ్వ‌నంటే వ‌స్తానంటాడు రిషి. స‌రే అంటుంది వ‌సు. ఇద్ద‌రూ వెళ్లి మిర్చీ బ‌జ్జీలు తినేస్తారు. క‌ట్ చేస్తే ఎప్పుడూ నిప్పు ఉప్పులా వుండే జ‌గ‌తి - రిషి కార్ వ‌ల‌న క‌ల‌వాల్సి వ‌స్తుంది. త‌న కార్‌ని పెద‌నాన్న తీసుకెళ్ల‌డంతో కార్ కోసం ఎదురుచూస్తుంటాడు రిషి. అయితే త‌న కార్‌లో డ్రాప్ చేస్తానంటుంది జ‌గ‌తి. అందుకు రిషి అంగీక‌రించి జ‌గ‌తి కార్ ఎక్కేస్తాడు. రిషి గురించి మ‌హేంద్ర‌, వ‌సు మాట్లాడుకుంటుండ‌గా జ‌గ‌తి కార్‌లోంచి రిషి దిగ‌డం చూసి మ‌హేంద్ర‌, వ‌సు షాక్ అవుతారు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

ష‌ణ్ముఖ్‌కు షాకిచ్చిన సిరి మ‌ద‌ర్‌

బుల్లితెర‌ రియాలిటీ షో బిగ్‌బాస్ విమ‌ర్శ‌ల మ‌ధ్య చివరి అంకానికి చేరుకుంటోంది. కంటెస్టెంట్స్ ప‌రంగానూ, హోస్ వ్య‌వ‌హార శైలి ప‌రంగానూ వివాదాల్లో చిక్కుకుండా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న ఈ షో తాజాగా కంటెస్టెంట్‌ల పేరెంట్స్ కార‌ణంగానూ వివాద‌స్ప‌ద‌మ‌వుతోంది. హౌస్‌లో ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయిన కంటెస్టెంట్‌ల‌ని ప‌క్క‌న పెడితే ఈ వారం ఎలిమినేష‌న్‌లో మొత్తం ఎనిమిది మంది స‌భ్యులున్నారు. ష‌న్ను కెప్టెంన్ అయ్యాడు. ఈ నేప‌థ్యంలో హౌస్ మేట్స్‌కి వారి పేరెంట్స్‌, బంధువుల‌ని క‌లిపించే కార్య‌క్ర‌మాన్ని బిగ్‌బాస్ బుధ‌వారం మొద‌లుపెట్టారు. ఇందులో భాగంగా బుధ‌వారం కాజ‌ల్ భ‌ర్త‌, కూతురు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి కాజ‌ల్‌ని స‌ర్‌ప్రైజ్ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. తాజాగా గురువారం మ‌రో ఇద్ద‌రు  కంటెస్టెంట్‌లకు సంబంధించిన పేరెంట్స్ రాబోతున్నారు. ముందుగా మాన‌స్ మ‌ద‌ర్ హౌస్‌లోకి రాబోతోంది. ఆ త‌రువాత సిరి మ‌ద‌ర్ ఎంట్రి ఇస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రోమోని బిగ్‌బాస్ తాజాగా విడుద‌ల చేశారు. ఈ వీడియోలో మాన‌స్ తల్లి కంటెస్టెంట్‌ల‌తో క‌లిసి అల్ల‌రి చేయ‌గా.. సిరి త‌ల్లి రావ‌డం రావ‌డ‌మే ష‌న్నుపై త‌న ఆగ్ర‌హాన్ని చూపించింది. సిరి బాగా ఆడుతోంద‌ని చెప్పిన ఆమె త‌న‌కు ష‌న్ను స‌పోర్ట్ చేస్తున్నాడ‌ని, అయితే త‌న‌ని ప్ర‌తీసారి సిరి హ‌గ్ చేసుకోవ‌డం త‌న‌కు న‌చ్చ‌డం లేద‌ని ష‌న్ను ముఖం మీదే చెప్పేసి షాకిచ్చింది. త‌న‌కు సిరి బాగా ద‌గ్గ‌రైపోతోంద‌ని, అది త‌న‌కు ఏమాత్రం న‌చ్చ‌డం లేద‌ని చెప్పేయ‌డంతో ష‌న్ను ముఖం ఒక్క‌సారిగా వాలిపోయింది. తాజా ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది.

స్టేజ్‌పై అంద‌రూ చూస్తుండ‌గా సుధీర్ గ‌ల్ల‌ప‌ట్టి క‌న్ను కొట్టేసింది!

బుల్లితెర కామెడీ షో ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌. ఈ షో ద్వారా పాపుల‌ర్ అయిన జోడీ సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్‌. వీరిద్ద‌రిపై వ‌చ్చిన‌న్ని పుకార్లు మ‌రే జంట‌పై ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. అంత‌గా వార్త‌ల్లో నిలిచారు. ఒక ద‌శ‌లో వీరి క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకున్న షో నిర్వాహ‌కులు రోజా సాక్షిగా సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్‌ల‌కు ఉత్తుత్తి పెళ్లి తంతుని కూడా నిర్వహించి ఔరా అనిపించారు. ఆ త‌రువాత నుంచి వీరిద్ద‌రు త్వ‌ర‌లో పెళ్లిపీట‌లెక్క‌బోతున్నారంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. వీరిద్ద‌రూ డ్యాన్స్ షో ఢీ -13లోనూ త‌మ‌దైన రీతిలో ఎంట‌ర్‌టైన్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు.  తాజా ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోని నిర్వాహ‌కులు రిలీజ్ చేశారు. గ‌ణేష్ మాస్ట‌ర్‌, ప్రియ‌మ‌ణి, పూర్ణ న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోకి మంచు ల‌క్ష్మి, సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ షోలో టీమ్ లీడ‌ర్‌లుగా సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్ వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా విడుద‌ల చేసిన ప్రోమోలో సుడిగాలి సుధార్‌పై మంచు ల‌క్ష్మి కామెంట్‌లు చేయ‌డం.. దానికి హైప‌ర్ ఆది ఆజ్యం పోయ‌డం న‌వ్వులు పూయిస్తోంది. ఇక ఇదే వేదిక‌పై `గుంటూర్ టాకీస్ 2` ర‌ష్మీ గౌత‌మ్‌, సుడిగాలి సుధీర్‌తో చేస్తే ఎలావుంటుంద‌ని చిన్న స్కిట్ చేశారు. ఈ స్కిట్‌లో భాగంగా సుడిగాలి సుధీర్ గ‌ల్ల‌ప‌ట్టి ద‌గ్గ‌ర‌కు లాక్కుని కొంటెగా ర‌ష్మీ క‌న్ను కొట్ట‌డంతో పూర్ణ‌, ప్రియ‌మ‌ణి, గ‌ణేష్ మాస్ట‌ర్‌, మంచు ల‌క్ష్మీ త‌దిత‌ర‌లు నోరెళ్ల‌బెట్టేయ‌డంతో ఒక్క‌సారిగా న‌వ్వులు విరిసాయి. ప్ర‌స్తుతం ఈ ప్రోమో నెట్టింట టాప్ లో ట్రెండ్ అవుతోంది.

`కార్తీక దీపం`: వంటలక్క దెబ్బ అదుర్స్

బుల్లితెర సీరియ‌ల్స్‌ల‌లో ఏ నోట విన్నా ఒక్క‌టే మాట `కార్తీక దీపం`. టాలీవుడ్ స్టార్స్‌.. వారిలోని కొంత మంది ఫ్యామిలీల కూడా ఈ సీరియ‌ల్ ప్ర‌భావితం చేస్తోందంటే ఏ స్థాయిలో ఈ సీరియ‌ల్ క్రేజ్‌ని సొంతం చేసుకుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక స‌రికొత్త మ‌లుపుల‌తో సాగుతున్న కార్తీక దీపం గురువారం మ‌రో ఆస‌క్తిక‌ర అంకానికి ఎర‌లేపింది. 1205 ఎపిసోడ్‌ని బుధ‌వారం పూర్తి చేసుకున్న ఈ సీరియ‌ల్ గురువారం 1206వ ఎపిసోడ్లోకి ఎంట‌రైంది. ఈ రోజు విశేషాలేంటో చూసేద్దాం. మోనిత ఇంట బార‌సాల‌కు వంట‌ల‌క్క‌తో పాటు సౌంద‌ర్య కుటుంబం మొత్తం హాజ‌ర‌వుతుంది. ఇక్క‌డే నాట‌కీయ ప‌రిణామాలు మొద‌ల‌య్యాయి. ఇక్క‌డ వంట‌ల‌క్క‌గా దీప ప్ర‌త్య‌క్ష్యం కావ‌డం.. అది చూసి డాక్ట‌ర్ బాబు ఆగ్ర‌హంతో ఊగిపోయి దీప నా భార్య అని, నా స‌ర్వ‌స్వం.., నా ప్ర‌పంచం.. అని డాక్ట‌ర్ బాబు అందిరి ముందు చెప్ప‌డం.. దానికి మోనిత షాక్ అవ్వ‌డం తెలిసిందే. క‌ట్ చేస్తే దీప.. మోనిత‌కు అదిరిప‌డే దెబ్బ కొట్టింది. వంట‌ల‌క్క కొట్టిన దెబ్బ అదుర్స్ క‌దూ అంటున్నారు ఆమె అభిమానులు. బార‌సాల సాక్షిగా మోనిత‌ని దీప అడ్డంగా బుక్ చేసింది. మోత‌ది స‌హ‌జ గ‌ర్భం కాద‌ని, ఆర్టిఫీషియ‌ల్ గ‌ర్భ‌మ‌ని తేల్చేస్తుంది దీప‌. ల్యాబ్ టెక్నీషియ‌న్ కు డ‌బ్బు ఆశ చూపించి షాంపిల్స్‌ని తీసుకుంద‌ని, త‌ద్వారా గ‌ర్భం దాల్చింద‌ని నిరూపిస్తుంది దీప‌. మోనిత కాద‌ని బుకాయించ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటే ల్యాబ్ వ్య‌క్తి వీడియోని సాక్షంగా చూపించి షాకిస్తుంది. దీంతో అంతా మోనిత‌ని చీకొడ‌తారు. అయితే అప్పుడే సినిమా అయిపోయింద‌నుకోకు ఇంకా వుంది అని మోనిత.. దీప‌తో అంటుండ‌గానే సౌంద‌ర్య .. మోనిత చెంప ఛెల్లుమ‌నిపిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. మోనిత చేయ‌బోతున్న మ‌రో కుట్ర ఏంటీ అన్న‌ది తెలియాంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

బిగ్‌బాస్ : నెటిజ‌న్స్ త‌లంటినా మార్పు లేదే?

పాపుల‌ర్ రియాలిటీ షో బిగ్‌బాస్. ఈ షో సీజ‌న్ 5 త్వ‌ర‌లో ముగియ‌నున్న విష‌యం తెలిసిందే. షో ఎండింగ్‌కి టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా కొద్దీ కంటెస్టెంట్‌ల నిజ‌స్వ‌రూపాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. అంతే కాకుండా కొంత మంది కంటెస్టెంట్‌లు బిగ్‌బాస్ హౌస్ అని.. కోట్ల మంది చూస్తున్నార‌నే విష‌యాన్ని మ‌రిని మ‌రీ హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. దీనిపై నెటిజ‌న్స్ చుర‌క‌లు అంటించినా.. ఓ రేంజ్‌లో ఘాటు విమ‌ర్శ‌లు చేస్తూ త‌లంటినా న‌వ్వు పోదురు గాక నాకేటి సిగ్గు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. మ‌రీ ముఖ్యంగా బిగ్‌బాస్ హౌస్‌లో వున్న ఇద్ద‌రిపై మీమ్స్ ఓరేంజ్‌లో పేలుతున్నాయి. అరేయ్ ఏంట్రా ఇదీ మీ రొమాన్స్ యుద్ధానికి కాస్త గ్యాప్ ఇవ్వండ్రా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇదంతా చెబుతోంది ఎవ‌రి గురించో ఇప్ప‌టికే అర్థ‌మై వుంటుంది య‌స్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌, సిరి హ‌న్మంతు. హౌస్‌లో ఈ ఇద్ద‌రు అవ‌స‌రం వున్నా లేకున్నా.. సంద‌ర్భ‌మా  కాదా అని ఆలోచించ‌కుండా హ‌గ్గుల‌తో పిచ్చెక్కిస్తున్నారు. అంతే కాకుండా కిస్సుల‌తో కిర్రాక్ తెప్పిస్తున్నారు. నాట‌కీయ ప‌రిణ‌మాల నేప‌థ్యంలో ప్రియాంక ఇంటి కెప్టెన్ కావాల్సింది చివ‌రికి ష‌న్ను కెప్టెన్ అయ్యాడు. దీనికి ముందు జ‌రిగిన టాస్క్‌లో సిరిని ప్రియాంక ఎలిమినేట్ చేసి ర‌విని సేవ్ చేయ‌డం జ‌రిగింది. అది న‌చ్చ‌ని సిరి ప్రియాంక‌పై త‌న యాటిట్యూడ్‌ని చూపించింది. అంతేనా ఆ త‌రువాత నియంత సింహాస‌నాన్ని ద‌క్కించుకున్న ష‌న్నుని అడ్డంపెట్టుకుని ప్రియాంక ని కెప్టెన్ కాకుండా చేసి తను భావోద్వేగానికి లోన‌య్యేలా చేసింది. ప్రియాంక‌ని ప‌క్క‌న పెట్టి ర‌విని ష‌న్ను సేవ్ చేయ‌డంతో వెంట‌నే రియాక్ట్ అయిన సిరి ష‌న్నుపై ప‌డి ముద్దుల వ‌ర్షం కురిపించింది. దీనిపై ప్ర‌స్తుతం ఓ రేంజ్‌లో ట్రోల్స్ మొద‌ల‌య్యాయి. ఎన్ని సార్లు త‌లంటినా ఒరేయ్‌ ఈ డ‌ర్టీపిక్చ‌ర్ గోల ఎంట్రా.. ఇన్ని పార్లు విమ‌ర్శించినా.. నాగ్ సార్ ఇండైరెక్ట్‌గా హౌస్ నుంచి బ‌య‌టికి వెళ్లిపొమ్మ‌న్నా వీల్ల‌లో మార్పులేదేంట్రా అంటూ నెటిజ‌న్స్ కామెంట్‌లు చేస్తున్నారు.

నేను సినిమాలు చేయ‌డం మా ఆయ‌న‌కు ఇష్టంలేదు!

  కొణిదెల వారి గారాల‌ప‌ట్టి నిహారిక పెళ్లికి ముందు నాలుగు సినిమాలు చేసింది. 'ఒక మ‌న‌సు'తో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన ఆమె, త‌ర్వాత 'హ్యాపీ వెడ్డింగ్‌', 'ఒరు న‌ల్ల నాల్ పాతు సొల్రేన్‌', 'సూర్య‌కాంతం' సినిమాల్లో నటించింది. గ‌త ఏడాది చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డతో వివాహం త‌ర్వాత సినిమా న‌ట‌న‌కు దూర‌మైంది. భ‌ర్త‌కు ఇష్టం లేక‌పోవ‌డం వ‌ల్లే త‌ను సినిమాలు చేయ‌ట్లేద‌ని ఆమె చెప్పింది. అవును. 'ఆలీతో స‌ర‌దాగా' షోలో అలీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది నిహారిక‌. "నేను సినిమాలు చేయ‌డం మా ఆయ‌న‌కు ఇష్టం లేదు. నేను కూడా ఓకే అనుకున్నాను." అని ఆమె చెప్పింది. అలా అని న‌ట‌న‌కు ఆమె దూరం కాలేదు. ప్ర‌స్తుతం ఆమె ఓ వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది. "ఒక సూప‌ర్ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే దాని డీటైల్స్ ఇవ్వ‌లేను. సూప‌ర్బ్ థీమ్‌. నిఖిల్ విజ‌యేంద్ర సింహ అలియాస్ యుట్యూబ‌ర్‌ నిఖిలూ అందులో లీడ్ యాక్ట‌ర్‌." అని నిహారిక తెలిపింది. చిన్న‌వ‌య‌సులోనే ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వ‌చ్చిందని అలీ అడిగిన ప్ర‌శ్న‌కు, "కొంత‌మంది యాక్ట్రెసెస్‌ను చూసుకుంటే పెళ్లి అయిన త‌ర్వాత వాళ్ల కెరీర్ అంత మార‌లేదు. నిజం చెప్పుకోవాలంటే, స‌మంత‌కు పెళ్లికి ముందు ఎంత క్రేజ్ ఉండిందో, పెళ్లి అయిన త‌ర్వాత కూడా అంతే క్రేజ్ ఉండింది. స్టిల్ షి ఈజ్ ఎ సూప‌ర్‌స్టార్‌. హిందీలోనూ కొంత‌మందిని చూశాను. పెళ్లి త‌ర్వాత కూడా అంత చేంజ్ ఏమీ ఉండ‌దు. పెళ్లి త‌ర్వాత యాక్టింగ్ ఎందుకు ఆపేశారో.. బ‌హుశా వాళ్ల‌కు వారి కార‌ణాలు ఉండొచ్చు." అని ఆమె చెప్పింది.

బిగ్ సర్ప్రైజ్.. తారక్ షోలో మహేష్ తో పాటు పవన్ కూడా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ షోలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సందడి చేయగా.. త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి చేయనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రోమోకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఎపిసోడ్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ ఎపిసోడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ ప్రైజ్ ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలో మహేష్ పాల్గొన్న ఎపిసోడ్ షూట్ ఎప్పుడో పూర్తయింది. ఆ షూట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీకై వైరలయ్యాయి. దీంతో ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని తారక్, మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రోమో విడుదల కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. జస్ట్ ప్రోమోతోనే ఈ ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేయబోతుందో చెప్పేశారు. అయితే ఈ ఎపిసోడ్ లో పవన్ ఫ్యాన్స్ కి కూడా ఓ సర్ ప్రైజ్ ఉందని ప్రచారం జరుగుతోంది. మహేష్ ఒక ప్రశ్నకు సమాధానం తెలియక.. వీడియో కాల్ లైఫ్ లైన్ ఉపయోగించుకొని పవన్ కి కాల్ చేస్తాడట. అలా పవన్ సాయంతో మహేష్ ఆ ప్రశ్నకు సమాధానం చెబుతాడట. అంతేకాదు ఆ సమయంలో ముగ్గురు స్టార్ల మధ్య జరిగే సంభాషణ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుందని సమాచారం. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియదు కానీ.. ఆ ఎపిసోడ్ లో నిజంగానే పవన్ కూడా కనిపిస్తే ఎపిసోడ్ కి రికార్డ్ రేటింగ్ వస్తుంది అనడంలో సందేహం లేదు. ముగ్గురు స్టార్స్ ఒకే స్క్రీన్ పై సందడి చేస్తే ఫ్యాన్స్ కి అంతకంటే కావాల్సింది ఏముంటుంది. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 2న టెలికాస్ట్ అయ్యే అవకాశముందని అంటున్నారు.

మోనిత‌కు దిమ్మ‌తిరిగే షాకిచ్చిన కార్తీక్‌

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా టాప్ రేటింగ్‌తో దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ సీరియ‌ల్ ఈ బుధ‌వారం 1205వ ఎపిసోడ్‌లోకి ఎంట‌ర‌వుతోంది. అంతే కాకుండా గ‌త కొన్ని రోజులుగా చిత్ర విచిత్ర‌మైన ట్విస్ట్‌ల‌తో మ‌లుపులు తిరుగుతున్న `కార్తీక దీపం` ఈ బుధ‌వారం ఎపిసోడ్ హైలైట్‌గా నిల‌వ‌బోతోంది. మోనిత కొడుకు బార‌సాల కోసం దీప ... మోనిత ఇంట మ‌ళ్లీ వంట‌ల‌క్క అవ‌తారం ఎత్త‌డం తెలిసిందే. ఇదిలా వుంటే మోనిత ఇంటి ముందు కారు ఆపిన కార్తీక్ `తిరిగి వెళ్లిపోదాం మ‌మ్మీ` అంటాడు. నేను వ‌చ్చింది నా కోడ‌లు దీప కోసం నువ్వు కూడా రావాల్సిందే అంటూ సౌంద‌ర్య భ‌ర్త ఆనంద‌రావుతో క‌లిసి కారు దిగుతుంది. వెంట‌నే కార్తీక్ కూడా దిగేస్తాడు. అక్క‌డే అచేత‌నంగా నిల‌బ‌డివున్న వార‌ణాసిని చూసి కార్తీక్ షాక్ అవుతాడు. ఏంటి వార‌నాసి ఇక్క‌డున్నావ్ .. దీప వ‌చ్చిందా? అంటాడు. `వ‌చ్చింది డాక్ట‌ర్ బాబు.. అక్క మాట‌లు వింటున్నా.. త‌న చేష్ట‌లు చూస్తుంటే భ‌యంవేస్తోంది` అని చెబుతాడు వార‌ణాసి. క‌ట్ చేస్తే .. బార‌సాల జ‌రిపించ‌డానికి వ‌చ్చిన పంతులుతో ..`పంతులుగారు ఈవిడే నా భార్య అని కార్తీక్ అన‌డంతో మోనిత‌తో పాటు అంతా షాక్‌కు గుర‌వుతారు. `ఇదేం విడ్డూరం అండీ.. ఈవిడ మీ భార్యా` అవంటాడు పంతులు.. `అవును పంతులుగారు ఈవిడే నా భార్య‌... నా అర్థాంగి` అంటూ దీప భుజంపై చెయ్యివేసి ధైర్యంగా చెబుతాడు కార్తీక్‌. అంతే కాకుండా `ఆమె నా జీవితం.. ఆమె నా ప్ర‌పంచం` అంటాడు. ఆ మాట‌ల‌కు దీప పొంగిపోతూ  మోనిత వంక పెద్ద పెద్ద క‌ళ్ల‌తో ఉరిమి చూస్తుంది. ఈవిడ మీ భార్య అయితే మ‌రి ఆవిడ ఎవ‌రు? అని మోనిత‌ని చూపిస్తాడు పంతులు. `మంచి ప్ర‌శ్న వేశారు పంతులుగారు` అంటుంది దీప.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. దీప మాట‌ల‌కు మోనిత రియాక్ష‌న్ ఏంటి? దీప , డాక్ట‌ర్ బాబు.. మోనిత‌కు ఎలాంటి షాకిచ్చారు. అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ ఖ‌చ్చితంగా చూడాల్సిందే.

 `గుప్పెడంత మ‌న‌సు` : బ‌య‌ట‌ప‌డిన దేవ‌యాని కుట్ర‌

మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న ధారావాహిక `గుప్పెడంత మ‌న‌సు`. వ‌సుధార , రిషిల చిలిపి ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో సాగుతున్న ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా బుల్లితెర ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తోంది. తాజాగా మంగ‌ళ‌వారం 299వ ఎపిసోడ్‌లోకి అడుగుపెడుతోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వ‌సు కోసం జ‌గ‌తి ఇంటికి వ‌చ్చిన రిషి అక్క‌డే వ‌సు వంట చేయ‌డంతో భోజ‌నం కూడా లాగించేస్తాడు. ఆ త‌రువాత వ‌సుకి థ్యాంక్స్ చెప్పేస్తాడు. ఇది చ‌లా గొప్ప విష‌యం సార్‌. జ‌గ‌తి మేడ‌మ్ ఇంటికి రావ‌డం.. ఇక్క‌డే భోజ‌నం చేయ‌డం నిజంగా గొప్ప విష‌యం సార్ అంటుంది. ఆ మాట‌లు విన్న వెంట‌నే రిషికి ఇగో త‌న్నుకొస్తుంది. వెంట‌నే `నిజ‌మే క‌దా.. నేనేంటి ఇక్క‌డ తిన్నాను` అన‌కుంటూ వ‌సు పిలుస్తున్నా ఆగ‌కుండా అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు రిషి. క‌ట్ చేస్తే జ‌గ‌తి, మ‌హేంద్ర ఇంటికి వ‌చ్చేస్తారు. మ‌హేంద్ర‌కు కాల్ రాగానే బ‌య‌టికి వెళ్లిపోతారు. అక్క‌డ డైనింగ్ టేబుల్‌పై రెండు ప్లేట్లు వుండ‌టాన్ని గ‌మ‌నించిన జ‌గ‌తి `ఏంటి వ‌సు రెండు సార్లు తినేసి ప్లేట్‌లు క‌డ‌గ‌డం మానేసావా? అంటుంది. రిషి వ‌చ్చిన విష‌యం చెప్పేస్తుంది వ‌సు. విష‌యం తెలియ‌గానే జ‌గ‌తి న‌వ్వే ఓ గెస్ట్‌వి అంటూ షాకిస్తుంది. ఇదిలా వుంటే రిషి, వ‌సుధార‌ల మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌ని దేవ‌యాని ఆరాతీయ‌డం మొద‌లుపెడుతుంది. ఆ విష‌యం మ‌హేంద్ర‌కు తెలుస్తుంది. దేవ‌యాని కుట్ర గురించి తెలుసుకున్న మ‌హేంద్ర `వ‌దిగారు ఏం చేస్తున్నా ఓపిక ప‌డుతున్నాను.. ఆమె భ‌య‌ప‌డే రోజు ఖ‌చ్చితంగా వ‌స్తుంద‌ని మ‌హేంద్ర అంటాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది? .. కాలేజీకి వెళుతూ వ‌సుధార‌తో రిషి చేసిన చిలిపి ప‌ని ఏంటీ అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

`ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`: త‌ప్పులో కాలేసిన య‌శోధ‌ర్‌

`స్టార్ మా`లో రీసెంట్‌గా మొద‌లైన ప్రేమ‌క‌థ `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`. ప్రారంభం నుంచి మేకింగ్ ప‌రంగా, కంటెంట్ ప‌రంగా ఈ సీరియ‌ల్ ఆక‌ట్టుకుంటోంది. తెలుగు సీరియ‌ల్స్ అంటే క‌న్న‌డ స్టార్స్ అనేట్టుగా మారిన ఈ నేప‌థ్యంలో ఈ సీరియ‌ల్‌లోనూ క‌న్న‌డ టీవీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారే ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. బెంగ‌ళూరుకు చెందిన నిరంజ‌న్ కోల్‌క‌తాకు చెందిన డెబ్‌జాని మోడ‌క్ కీల‌క పాత్ర‌ల్లో య‌శోధ‌ర్‌, వేద‌లుగా న‌టించారు. మ‌రో కీల‌క పాత్ర‌లో బెంగ‌ళూరు ప‌ద్మ న‌టించింది. శిన‌వారం ఖుషీని వేద కిడ్నాప్ చేసిందంటూ య‌శోధ‌ర్ త‌ల్లి అనుమానించ‌డంతో ఆమెపై కేసు పెడ‌తాడు య‌శోధ‌ర్‌. దీంతో వేద తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్‌కి తీసుకెళ‌తారు. అక్క‌డికి వెళ్లిన వేద ముందు ఖుషీని ఒంట‌రిని చేసిన య‌శోధ‌ర్‌ని నిల‌దీస్తుంది. గంట ఆల‌స్య‌మైతే ఖుషీ ప్రాణాల‌కే ప్ర‌మాదం జ‌రిగేద‌ని చ‌,ఎబుతుంది. కావాలంటే డాక్ట‌ర్‌ని అడిగి తెలుసుకోండి అంటుంది. అయితే నువ్వు చెప్పిందే నిజ‌మ‌ని గ్యారంటీ ఏంట‌ని ఇన్స్‌పెక్ట‌ర్ ప్ర‌శ్నిస్తాడు. సాక్ష‌మేంట‌ని నిల‌దీస్తాడు. ఇలా వేద‌ని య‌శోధ‌ర్‌, ఇన్స్‌పెక్ట‌ర్ ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న స‌మ‌యంలో నేను సాక్షం అంటూ య‌శోధ‌ర్ మాజీ భార్య అక్క‌డికి వ‌చ్చి షాకిస్తుంది. డాక్ట‌ర్ వేద ఖుషీని కిడ్నాప్ చేసింద‌న‌డానికి మీద‌గ్గ‌ర ఏదైనా ఆధారం వుందా? అంటుంది. దానికి వెంట‌నే `చెయ్య‌లేదు అన‌డానికి మీద‌గ్గ‌ర ఏం సాక్ష్యం వుంద‌ని ఇన్స్ పెక్ట‌ర్ ప్ర‌శ్నిస్తాడు. వెంట‌నే యశోధ‌ర్ మాజీ భార్య వేద ఖుషీని కిడ్నాప్ చెయ్య‌లేదు అన‌డానికి సాక్ష్యం నేనే అంటుంది. వెంట‌నే వాట్ మీరెవ‌రు అస‌లు అని ఇన్స్‌పెక్ట‌ర్ ప్ర‌శ్నించ‌డంతో `ఖుషీ క‌న్న‌త‌ల్లిని` అని అంటుంది. దీంతో య‌శోధ‌ర్‌, ఇన్స్‌పెక్ట‌ర్ ఇద్ద‌రూ షాక్‌కి గుర‌వుతారు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. వేద విష‌యంలో త‌ప్పు చేశాన‌ని య‌శోధ‌ర్ తెలుసుకున్నాడా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు 9:30 గంట‌ల‌కు ప్ర‌సారం అయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.