`ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`: త‌ప్పులో కాలేసిన య‌శోధ‌ర్‌

`స్టార్ మా`లో రీసెంట్‌గా మొద‌లైన ప్రేమ‌క‌థ `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`. ప్రారంభం నుంచి మేకింగ్ ప‌రంగా, కంటెంట్ ప‌రంగా ఈ సీరియ‌ల్ ఆక‌ట్టుకుంటోంది. తెలుగు సీరియ‌ల్స్ అంటే క‌న్న‌డ స్టార్స్ అనేట్టుగా మారిన ఈ నేప‌థ్యంలో ఈ సీరియ‌ల్‌లోనూ క‌న్న‌డ టీవీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారే ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. బెంగ‌ళూరుకు చెందిన నిరంజ‌న్ కోల్‌క‌తాకు చెందిన డెబ్‌జాని మోడ‌క్ కీల‌క పాత్ర‌ల్లో య‌శోధ‌ర్‌, వేద‌లుగా న‌టించారు. మ‌రో కీల‌క పాత్ర‌లో బెంగ‌ళూరు ప‌ద్మ న‌టించింది. శిన‌వారం ఖుషీని వేద కిడ్నాప్ చేసిందంటూ య‌శోధ‌ర్ త‌ల్లి అనుమానించ‌డంతో ఆమెపై కేసు పెడ‌తాడు య‌శోధ‌ర్‌. దీంతో వేద తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్‌కి తీసుకెళ‌తారు. అక్క‌డికి వెళ్లిన వేద ముందు ఖుషీని ఒంట‌రిని చేసిన య‌శోధ‌ర్‌ని నిల‌దీస్తుంది. గంట ఆల‌స్య‌మైతే ఖుషీ ప్రాణాల‌కే ప్ర‌మాదం జ‌రిగేద‌ని చ‌,ఎబుతుంది. కావాలంటే డాక్ట‌ర్‌ని అడిగి తెలుసుకోండి అంటుంది. అయితే నువ్వు చెప్పిందే నిజ‌మ‌ని గ్యారంటీ ఏంట‌ని ఇన్స్‌పెక్ట‌ర్ ప్ర‌శ్నిస్తాడు. సాక్ష‌మేంట‌ని నిల‌దీస్తాడు. ఇలా వేద‌ని య‌శోధ‌ర్‌, ఇన్స్‌పెక్ట‌ర్ ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న స‌మ‌యంలో నేను సాక్షం అంటూ య‌శోధ‌ర్ మాజీ భార్య అక్క‌డికి వ‌చ్చి షాకిస్తుంది. డాక్ట‌ర్ వేద ఖుషీని కిడ్నాప్ చేసింద‌న‌డానికి మీద‌గ్గ‌ర ఏదైనా ఆధారం వుందా? అంటుంది. దానికి వెంట‌నే `చెయ్య‌లేదు అన‌డానికి మీద‌గ్గ‌ర ఏం సాక్ష్యం వుంద‌ని ఇన్స్ పెక్ట‌ర్ ప్ర‌శ్నిస్తాడు. వెంట‌నే యశోధ‌ర్ మాజీ భార్య వేద ఖుషీని కిడ్నాప్ చెయ్య‌లేదు అన‌డానికి సాక్ష్యం నేనే అంటుంది. వెంట‌నే వాట్ మీరెవ‌రు అస‌లు అని ఇన్స్‌పెక్ట‌ర్ ప్ర‌శ్నించ‌డంతో `ఖుషీ క‌న్న‌త‌ల్లిని` అని అంటుంది. దీంతో య‌శోధ‌ర్‌, ఇన్స్‌పెక్ట‌ర్ ఇద్ద‌రూ షాక్‌కి గుర‌వుతారు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. వేద విష‌యంలో త‌ప్పు చేశాన‌ని య‌శోధ‌ర్ తెలుసుకున్నాడా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు 9:30 గంట‌ల‌కు ప్ర‌సారం అయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.

ప్రేమ లోకంలో బిగ్‌ బాస్ ముదురుజంట‌!

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్. తాజాగా సీజ‌న్ 5 మొద‌లై మ‌రో నాలుగు వారాల్లో ముగియ‌బోతున్న విష‌యం తెలిసిందే. గ‌త సీజ‌న్‌ల‌తో పోలిస్తే ఈ సీజ‌న్ చాలా దారుణంగా వుందనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. పైగా కంటెస్టెంట్‌ల ప‌రంగానూ చాలా విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతోంది. కంటెస్టెంట్ ల తీరు వెగ‌టు పుట్టించేలా వుంద‌ని ఓ రేంజ్‌లో నెటిజ‌న్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ సీజ‌న్‌లో హౌస్‌లోకి ఎంట్రి ఇచ్చిన జంట‌లపై కూడా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అందులో ప్ర‌ధానంగా వినిపిస్తున్న ముదురు జంట లోబో - ఉమాదేవి. వీరిద్ద‌రి మ‌ధ్య సాగిన ల‌వ్ ట్రాక్‌.. వీరిద్ద‌రి కెమిస్ట్రీ ప‌లువురిని ముక్కున వేలేసుకునేలా చేసింది. ల‌వ్ అంటే ఇదా అని ఆశ్చ‌ర్యానికి లోన‌య్యేలా చేసింది. హౌస్‌లో కోట్లాది మంది చూస్తుండ‌గానే రెచ్చిపోయిన ఈ జంట బ‌య‌టికి వ‌చ్చాక కూడా అదే పంథాని కొన‌సాగిస్తూ ఫొటోల‌కి పోజులిస్తున్నారు. ఒక‌రిపై ఒక‌రు ప్రేమ‌ని ఒల‌క‌బోస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్‌లు పెడుతూ ర‌చ్చ చేస్తున్నారు. ఇటీవ‌ల ఓంకార్ కామెడీ స్టార్స్ షోలో ఉమాదేవి తో రిలేష‌న్ షిప్‌పై ఓపెన్‌గానే చెప్పేసి షాకిచ్చాడు లోబో. అదే స్థాయిలో ఉమాదేవి కూడా ఓపెన్ అయిపోయి సోష‌ల్ మీడియాలో లోబోతో స‌న్నిహితంగా వున్న ఓ ఫొటోని షేర్ చేసి ఆస‌క్తిక‌రంగా స్పందించింది. ప్రేమ‌కి వ‌య‌సుతో సంబంధం లేదు. ఎప్పుడైనా పుట్టొచ్చు అంటూ హాట్ కామెంట్‌లు చేసింది. పెళ్లీడుకొచ్చిన ఇద్ద‌రు కూతుళ్లు వున్నా ప్రేమిస్తే త‌ప్పేంటీ? అంటూ బోల్డ్ స్టేట్‌మెంట్‌లు ఇస్తోంది. ఉమ‌, లోబో ల‌కు సంబంధించిన ఓ ఫొటో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.

`దేవ‌త‌`: ఆదిత్య‌కు షాకిచ్చిన‌ రాధ‌

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ దేవ‌త‌. శోభ‌న్ బాబు, శ్రీ‌దేవి, జ‌య‌ప్ర‌ద ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన `దేవ‌త‌` కాన్సెప్ట్‌నే తీసుక‌ని దానికి నాట‌కీయ ప‌రిణామాల్ని ప‌జోడించి కొత్త పంథాలో కాస్త భిన్నంగా కుటుంబ భావోద్వేగాల్ని జోడించి ఈ సీరియ‌ల్‌ని రూపొందించారు. `చంటిగాడు` ఫేమ్ సుహాసిని,  అర్జున్ అంబ‌టి, వైష్ణ‌వీ రామిరెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్రేమించిన వాడిని అక్క కోసం త్యాగం చేసే ఓ చెల్లెలు క‌థ‌.. చెల్లెలు త్యాగాన్ని తెలుసుకుని త‌న జీవితాన్నే త్యాగం చేసిన ఓ అక్క క‌థ‌గా ఈ సీరియ‌ల్‌ని రూపొందించారు. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న దేవ‌త ఈ రోజు 398వ ఎపిసోడ్‌లోకి ప్ర‌వేశించింది. ఈ మంగ‌ళ‌వారం ఎపిసోడ్ ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగబోతోంది. త‌న‌ని వెతుక్కుంటూ వ‌చ్చిన ఆదిత్య‌తో త‌న‌కు పెళ్లైంద‌ని చెబుతుంది రాధ‌. ఈ విష‌యం ఆదిత్యని షాక్‌కు గురిచేస్తుంది. ఇదిలా వుంటే రాధ‌, మాధ‌వ్‌లు క‌లిసి ముడుపు క‌డితే వాల్లు భార్య‌భ‌ర్త‌లేన‌ని లేదంటే కాద‌ని ఆదిత్య‌తో ర‌మ్య అంటుంది. రాధ త‌న కూతురు దేవి కోసం మొక్కు తీర్చ‌డానికి ముడుపు క‌ట్టేందుకు మాధ‌వ్‌, రాధ గుడికి వ‌స్తారు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో మాత్ర‌మే మాధ‌వ్‌తో క‌లిసి ముడుపుక‌ట్టేందుకు రాధ ముందుకు వ‌స్తుంది. ఇద్ద‌రు క‌ల‌సి ముడుపు క‌ట్టేందుకు ముందుకొస్తారు. ఇదే స‌మ‌యంలో మాధ‌వ్‌కు కళ్లు తిర‌గ‌డంతో ముడుపు వ‌దిలేస్తే రాధే క‌ట్టేస్తుంది. కానీ దూరం నుంచి చూస్తున్న ఆదిత్య‌, ర‌మ్య‌ల‌తో పాటు జాన‌కి, రామ్మూర్తిల‌కు మాత్రం రాధ‌, మాధ‌వ్‌లు క‌లిసి ముడుపు క‌డుతున్నాట్టుగా క‌నిపిస్తుంది. అది చూసిన ఆదిత్య ఎలా రియాక్ట్ అయ్యాడు? .. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

యాంక‌ర్ ర‌విని అడ్డంగా బుక్ చేసిన కాజ‌ల్

బిగ్‌బాస్ సీజ‌న్ 5లో యాంక‌ర్ ర‌వి మైండ్ గేమ్ ఆడుతూ ఇంటి స‌భ్యుల్ని ఒక్కొక్క‌రి బ‌య‌టికి పంపిస్తూనే వున్నాడు. తాజాగా ఇదే ఫార్ములాని స‌న్నీపై ఉప‌యోగించాల‌ని శ్రీరామ చంద్ర‌తో క‌లిసి ర‌వి ప్ర‌య‌త్నాలు బ‌మొద‌లుపెట్టాడు. అయితే ఆ ప్ర‌య‌త్నాలేవీ స‌న్నీ విష‌యంలో ఫ‌లించ‌డం లేదు. కార‌ణం అత‌నికి అండ‌గా మాన‌స్‌, కాజ‌ల్ వుండ‌టం.. స‌న్నీ త‌న గేమ్‌ని సిన్సియ‌ర్‌గా ఆడుతుండ‌టం. మ‌రో నాలుగు వారాల్లో సీజ‌న్ 5 ఎండ్ కానున్ర‌న నేప‌థ్యంలో హౌస్‌లో రాజ‌కీయాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇంటి నుంచి ఎవ‌రిని బ‌య‌టికి పంపిస్తే టైటిల్ రేసులో మిగ‌తా వారికి అడ్డు లేకుండా పోతుంద‌ని ఎవ‌రికి వారు ఎత్తుల‌కు పైఎత్తులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే యాంక‌ర్ ర‌వి మ‌రోసారి అడ్డంగా దొరికిపోయాడు. గ‌త కొన్ని వారాలుగా కంటెస్టెంట్‌ల‌ని త‌న‌దైన ఎత్తుల‌తో చిత్తు చేస్తూ బ‌య‌టికి పంపిస్తున్న ర‌వి ఈసారి కాజ‌ల్‌కు అడ్డంగా దొరికిపోయాడు. హౌస్‌లో న‌ట‌రాజ్ మాస్ట‌ర్ చెప్పిన‌ట్టు గుంట‌న‌క్క‌లా మారిన ర‌వి ఒక‌రి గురించి మ‌రొక‌రికి చెప్పడం.. ఇక్క‌డి మాట‌లు అక్క‌డ అక్క‌డి మాట‌లు ఇక్క‌డ చెబుతూ ఇంటి స‌భ్యుల‌తో ఆడుకుంటూ కొంత మంది ఎలిమినేట్ కావ‌డానికి కార‌ణంగా మారుతున్నాడు. ఇప్ప‌టికే గుంట‌న‌క్క అన్న పేరున్న ర‌వికి స‌న్నీ తాజాగా నార‌దుడు అనే పేరు పెట్టేశాడు. అంతేనా సోమ‌వారం జ‌రిగిన నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో ర‌విపై ఫైర్ అయిన స‌న్నీ హౌస్‌లో వున్న వ్య‌క్తుల్లో పేక్ ఎవ‌రైనా వున్నారంటే అది నువ్వే అంటూ ముఖం మీదే చెప్పేశాడు. ఇదే సంద‌ర్భంగా కాజ‌ల్ కూడా ర‌విని, శ్రీ‌రామ‌చంద్ర‌ల‌ని ఓ రేంజ్‌లో ఆడేసుకుంది. సిరి, ష‌న్ను ఒక‌రికి ఒక‌రం ఆడాల‌ని ముందే అనుకుని ఇక్క‌డికి వ‌చ్చార‌ని, ఇక్క‌డికి వ‌చ్చాక జ‌న్యూన్‌గా క‌నెక్ట్ అయ్యార‌ని ర‌వి చెప్పాడ‌ని శ్రీ‌రామ‌చంద్ర‌ని అడ‌గ‌డం మ‌ధ్య‌లోకి న‌న్ను లాగ‌కంటూ శ్రీ‌రామ‌చంద్ర ఎస్కేప్ కావండంతో సిరి, ష‌న్ను విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టేసి ర‌వి అడ్డంగా బుక్క‌య్యాడ‌ని, అత‌ను బుక్క‌య్యేలా కాజ‌ల్ చేసింద‌ని నెటిజ‌న్స్ సెటైర్లు వేస్తున్నారు.

మోనిత‌కు దిమ్మ‌దిరిగే షాకిచ్చిన వంట‌ల‌క్క‌

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్‌ల‌లో ముందు వ‌రుస‌లో నిలిచింది `కార్తీక దీపం`. ముఖ్యంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని టీవీల‌కు అతుక్కుపోయేలా చేసి రేటింగ్ ప‌రంగా రికార్డుని సృష్టించింది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల‌కు సైతం దీని సెగ త‌గల‌డం.. టైమింగ్ ని మార్చండి మ‌హా ప్ర‌భో అంటూ క్రికెట్ ప్రేమికులు అభ్య‌ర్ధ‌న‌లు చేయ‌డంతో ఈ సీరియ‌ల్ మ‌రింత‌గా పాపులారిటీని సొంతం చేసుకుంది. దేశ వ్యాప్తంగా నంబ‌ర్ వ‌న్ సీరియ‌ల్‌గా రేటింగ్‌ని సొంతం చేసుకుని టాప్ వ‌న్‌లో కొన‌సాగుతున్న `కార్తీక దీపం` చిత్ర విచిత్ర‌మైన ట్విస్ట్‌ల‌తో.. మ‌లుపుల‌తో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ మంగ‌ళ‌వారం 1204వ ఎపిసోడ్‌లోకి ఎంట‌ర్ అవుతోంది. గ‌త కొన్ని రోజులుగా సాగ‌దీత ధోర‌ణిలో సాగుతూ ప్రేక్ష‌కుల‌కు విసుగుపుట్టిస్తున్న `కార్తీక దీపం` ఈ రోజు ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపుల‌తో ప్రేక్ష‌కుల్ని థ్రిల్‌కి గురిచేయ‌బోతోంది. మోనిత ఇంట బార‌సాల‌కు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వ‌స్తాన‌ని, ఈ సారి క్లైమాక్స్‌ని డిఫ‌రెంట్‌గా ప్లాన్ చేశాన‌ని చెప్పి వెళ్లిపోయిన దీప మ‌రోసారి మోనిత ఇంట వంట‌ల‌క్క అవ‌తారం ఎత్తుతుంది. అంత‌కు ముందు మోనిత‌, డాక్ట‌ర్ భార‌తి, ప్రియ‌మ‌ణి మాట్లాడుకుంటుండ‌గా చేతిలో బ్యాగుతో ఎంట్రి ఇచ్చి షాకిస్తుంది దీప‌. దీప రాక‌ని ఊహించ‌ని భార‌తి, మోనిత‌, ప్రియ‌మ‌ణి షాక్‌కు గుర‌వుతారు. త‌రువాత త‌న బ్యాగ్‌ని ప్రియ‌మ‌ణికిచ్చి లోప‌ల పెట్ట‌మ‌ని ప‌నుల్లోప‌డిపోతుంది దీప‌. మోనిత ఇంటికి వ‌చ్చిన డాక్ట‌ర్ బాబు అక్క‌డ వంట‌ల‌క్క గెట‌ప్‌లో దీప‌ని చూసి ఆగ్ర‌హాంతో ఊగిపోతాడు. న‌వ్వు వంట‌లు చేయ‌డం ఏంట‌ని మండిప‌డ‌తాడు. అయితే బార‌సాల కానివ్వండ‌ని చెబుతుంది. ఆ త‌రువాత మోనిత తాను కార్తీక్ వ‌ల్ల గ‌ర్భం దాల్చాన‌ని చెప్ప‌డం.. అది స‌హ‌జ గ‌ర్భం కాద‌ని దీప ఆధారాన్ని చూపించడంతో అంతా షాక్‌కి లోన‌వుతారు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?  దీప ఇచ్చిన షాక్‌కు మోనిత ఎలా రియాక్ట్ అయింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

నాగ్ సాక్షిగా ష‌న్నుకు షాకిచ్చిన సిరి

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ విమ‌ర్శ‌ల మ‌ధ్య 78వ ఎపిసోడ్‌ని పూర్తి చేసుకుని సోమ‌వారం 79వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్ట‌బోతోంది. గ‌త 11 వారాలుగా అనేక విమ‌ర్శ‌ల మ‌ధ్య స‌ప్ప‌గా సాగుతున్నఈ సీజ‌న్ 5 మ‌రో నాలుగు వారాల్లో ముగియ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో ఆదివారం ఆనీ మాస్ట‌ర్ ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేసింది. దీంతో హౌస్‌లో మొత్తం 8 మంది మిగిలారు. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన 19 మందిలో ఇప్ప‌టి వ‌ర‌కు 10 మంది ఎలిమినేట్ కాగా జెస్సీ అనారోగ్య కార‌ణాల వ‌ల్ల ఇంటి నుంచి బ‌య‌టికి వ‌చ్చేశాడు. ఇక ఈ సండే ఫండేగా క‌నిపించినా ఇంటి స‌భ్యుల్లో కొంత మందికి షాకింగ్ డేగా మారింది. ప్ర‌ధానంగా ష‌న్ను, సిరిల‌కు సండే బిగ్ షాక్‌గా మారింది. లిప్‌లాక్ కార‌ణంగా వార్త‌ల్లో నిలిచిన ఈ జంట ఆదివారం కూడా హాట్ టాపిక్‌గా నిలిచారు. `అనుభ‌వించు రాజా` చిత్ర ప్ర‌మోష‌న్స్ కోసం బిగ్‌బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో రాజ్ త‌రుణ్ సిరిని ఉద్దేశించిన చేసిన కామెంట్ హైలైట్‌గా నిల‌వ‌డ‌మే కాకుండా ఓ ర‌కంగా సరి, ష‌న్నుల‌కు చుర‌క‌లంటించిన‌ట్టుగా వుండ‌టం గ‌మ‌నార్హం. సిరి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం... అయితే నీకు మాత్రం కాదు అని రాజ్ త‌రున్ సెటైర్ వేయ‌డం.. మీ ఇద్ద‌రి గురించి బ‌య‌ట మ‌రో ఇద్ద‌రు ఎదురు చూస్తున్నార‌ని మ‌రో సారి పంచ్ వేయ‌డంతో సిరికి ఆ పంచ్ గ‌ట్టిగా త‌గిలింది. దాంతో నాగ్ అడిగిన ఓ ప్ర‌శ్న‌కు సిరి `అవే త‌గ్గించుకుంటే మంచిది` అంటూ ష‌న్నుకి షాకిచ్చింది. దీంతో సిరి, ష‌న్నుల‌కు నాగ్ మ‌రోసారి గ‌ట్టిగానే ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చినంత ప‌ని చేశాడ‌ని నెటిజ‌న్‌లు సెటైర్లు వేస్తున్నారు. అలాగే నాగ్ చెప్పిన‌ట్టే సిరి, ష‌న్ను ఆ ఎక్స్‌ట్రాలే త‌గ్గించుకుంటే మంచిద‌ని కామెంట్‌లు చేస్తున్నారు.

డాక్ట‌ర్ బాబుతో త‌న‌ ప్రేమక‌థ‌ని బ‌య‌ట‌పెట్టిన మంజుల‌!

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్‌ `కార్తీక దీపం`. అశేష మ‌హిళాలోకాన్ని ఆక‌ట్టుకుంటూ నంబ‌ర్ వ‌న్ సీరియ‌ల్‌గా రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతోంది. ఈ సీరియ‌ల్ తో డాక్ట‌ర్ బాబుగా పాపుల‌ర్ అయ్యారు ప‌రిటాల నిరుప‌మ్‌. ర‌చ‌యిత ప‌రిటాల ఓంకార్ త‌న‌యుడిగా టీవీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన నిరుప‌మ్‌ ల‌వ్ మ్యారేజ్‌. టీవీ న‌టి మంజుల‌ని నిరుప‌మ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా త‌మ ప్రేమ క‌థ‌ని, ఆ క‌థ వెన‌కున్న ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని మంజుల త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో వివ‌రించే ప్ర‌య‌త్నం చేసింది. నిరుప‌మ్‌, మంజుల‌ల ప్రేమ ప్ర‌యాణం `చంద్ర‌ముఖి` సీరియ‌ల్‌తో మొద‌లైంది. త‌న‌కు నిరుప‌మ్ ప్ర‌పోజ్ చేసిన రోజంటూ ఓ వీడియోని ` మా ల‌వ్‌స్టోరీ` పేరుతో విడుద‌ల చేసింది మంజుల. ఈ వీడియోలో మంజుల‌, నిరుప‌మ్ త‌మ ప్రేమ ఎప్పుడు ఎలా ఎక్క‌డ మొద‌లైందో చెప్పుకొచ్చారు. ఏడాది ప‌రిచ‌యం త‌రువాతే ఇద్ద‌రం ఫోన్ నంబ‌ర్‌లు తీసుకున్నామ‌ని ఇద్ద‌రు చెప్పొకొచ్చారు. ఈ సంద‌ర్భంగా నిరుప‌మ్ త‌న‌దైన స్టైల్లో మంజుల‌తో కామెడీ చేయ‌డం న‌వ్వులు పూయిస్తోంది. మంజుల‌తో క‌లిసి `చంద్ర‌ముఖి` సీరియ‌ల్ లో న‌టించాడు నిరుప‌మ్‌. అయితే అదే వీరికి తొలి సీరియ‌ల్ కావ‌డం, మంజుల‌కు తెలుగు రాక‌పోవ‌డంతో దాన్ని అడ్వాంటేజీగా తీసుకున్న నిరుప‌మ్ డైలాగ్‌లు వివ‌రించ‌డం.. సీన్‌ల విష‌యంలో ఎలా న‌టించాలో వంటివి చెప్పేవాడ‌ట‌. అలా ఇద్ద‌రి మ‌ధ్య ఏడాది పాటు కొన‌సాగిన ప‌రిచ‌యం ఆ త‌రువాత ప్రేమ‌గా మారింద‌ని, అదే పెళ్లికి దారితీసింద‌ని మంజుల చెప్పింది. ఇక ఇద్ద‌రి వ్య‌వ‌హారం ఇంట్లో తెలియ‌డంతో నిరుప‌మ్ ఇంట్లో వాళ్లు జాత‌కాలు క‌లిస్తేనే పెళ్లి అని చెప్పేశార‌ట‌. జాత‌కాలు క‌లిశాయి కాబ‌ట్టే ల‌క్కీగా మా పెళ్లి జ‌రిగింద‌ని నిరుప‌మ్ వివ‌రించాడు. ప్ర‌స్తుతం నిరుప‌మ్‌, మంజుల‌కు సంబంధించిన‌ప వీడియో నెట్టింట సంద‌డి చేస్తోంది.

ప్రియ ఇంట బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ల సంద‌డి

`ప్రియ‌స‌ఖి` సీరియ‌ల్‌తో వెలుగులోకి వ‌చ్చిన న‌టి ప్రియ‌. ఆ త‌రువాత టీవీ సీరియ‌ళ్ల‌లో పాపులారిటీని సొంతం చేసుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ ఫ్రెండ్‌గా, హీరో చెల్లెలిగా న‌టించి మంచి పేరు తెచ్చుకున్న ప్రియ ప్ర‌స్తుతం త‌ల్లి పాత్ర‌ల్లో , క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టిస్తూ బిజీగా వుంది. ఇటీవ‌ల బిగ్‌బాస్ సీజ‌న్ 5లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియ కొన్ని రోజుల పాటు హౌస్‌లో కొన‌సాగి స‌న్నీ కార‌ణంగా వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. మ‌గాడివేనా.. , ద‌మ్ముందా?.. చెంప ప‌గిలిపోద్ది అంటూ స‌న్నీపై చిందులేని కొంత ఓవ‌రాక్ష‌న్ చేసిన ప్రియ ఆ ఓవ‌ర్ యాక్ష‌న్ కార‌ణంగానే ఇంటిదారి ప‌ట్టేసింది. నెటిజ‌న్‌ల ఆగ్ర‌హానికి గురైన ప్రియ ఓటింగ్ దారుణంగా ప‌డిపోవ‌డంతో ఏడ‌వ వారంలోనే ఎలిమినేట్ కావాల్సి వ‌చ్చింది. ఇక ఇదిలా వుంటే ప్రియ ఇంట పెళ్లి బాజా మోగింది. త‌న‌కు వ‌రుస‌కు కూతుర‌య్యే లోహిత పెళ్లి కుదిరింది. ఈ వేడుక‌కు బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చేసిన కంటెస్టెంట్‌లు స‌ర‌యు, ఉమా దేవి, జెస్సీ హాజ‌ర‌య్యారు. ఈ పెళ్లి వేడుక‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన వీరి ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. `మా ఇంట్లో పెళ్లి వేడుక‌లు షురూ` అంటూ ఇంటి ముందు ముగ్గులు వేసిన ఫొటోని ప్రియ అభిమానుల‌తో పంచుకుంది. హ‌ల్దీ, మెహందీ వేడుక‌ల‌కు సంబంధించిన ఫొటోల‌ని కూడా ఈ సంద‌ర్భంగా ప్రియ పంచుకుంది. ఇదే సంద‌ర్భంగా స‌ర‌యు, జెస్సీల‌కు సంబంధించిన ఫొటోల‌ని కూడా ప్రియ ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసింది.

రాహుల్ సిప్లిగంజ్ స‌పోర్ట్ ఎవ‌రికి?

బిగ్‌బాస్ సీజ‌న్ 3 విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ సీజ‌న్ 5పై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌త సీజ‌న్ 4పై రాహుల్ చేసిన వ్యాఖ్య‌లు ఫైన‌ల్‌లో నిజం కావ‌డంతో సీజ‌న్ 5పై రాహుల్ ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌బోతున్నాడు? .. త‌న స‌పోర్ట్ ఎవ‌రికి అని స్ప‌ష్టం చేయ‌బోతున్నాడ‌న్న‌ది గ‌త కొన్ని రోజులుగా ఆస‌క్తిగా మారింది. అయితే తాజాగా అంతా ఊహించిన‌ట్టే రాహుల్ సిప్లిగంజ్ సీజ‌న్ 5పై త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. సీజ‌న్ 5పై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ సీజ‌న్‌లో ఎవ‌రి స‌త్తాని వారు చూపిస్తున్నార‌ని, హౌస్‌లో కంటెస్టెంట్‌లు త‌గ్గుతున్నా కొద్దీ ఎవ‌రు బెస్ట్ అని చెప్ప‌డం క‌ష్ట‌మ‌న్నాడు. షోను రెగ్యుల‌ర్‌గా ఫాలో అవుతున్నాన‌ని, ఎంజాయ్ చేస్తున్నాన‌ని చెప్పిన రాహుల్ బాగా లేక‌పోయినా షో చూస్తాన‌ని క్లారిటీ ఇచ్చాడు. త‌ను పాల్గొన్న సీజ‌న్ 3కి మంచి టీఆర్పీ రేటింగ్ వ‌చ్చింద‌ని.. అయితే తాజా సీజ‌న్‌ల‌కు అంత‌కు మించి వ‌స్తోంద‌ని పేర్కొన్నాడు. ఇన్ని చెప్పిన రాహుల్ గ‌త సీజ‌న్ త‌ర‌హాలో త‌ను ఎవ‌రికి స‌పోర్ట్ చేస్తున్న‌ది మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు. గ‌త సీజ‌న్‌లో తాను అభిజీత్‌కు, సోహైల్‌కు స‌పోర్ట్ చేస్తున్నాన‌ని చెప్పిన రాహుల్ సీజ‌న్ 5 విష‌యంలో ఎవ‌రిని స‌పోర్ట్ చేస్తార‌న్న విష‌యాన్ని మాత్రం చెప్ప‌కుండా దాట‌వేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఎందుకు రాహుల్ ఈ సీజ‌న్ విష‌యంలో క్లారిటీగా చెప్ప‌డం లేద‌ని ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. దానికి కార‌ణం ఈ సీజ‌న్ అంతగా ఆక‌ట్టుకోలేక‌పోవ‌డ‌మేన‌ని ప‌లువురు నెటిజ‌న్స్ కామెంట్‌లు చేస్తున్నారు.

ఇదేం ట్విస్ట్ బాబోయ్‌.. వంట‌ల‌క్క కొత్త ట్విస్ట్‌

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న ఫ్యామిలీ డ్రామా `కార్తీక దీపం`. చిత్ర విచిత్ర‌మైన మ‌లుపులు.. షాకిచ్చే ట్విస్ట్‌ల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ 1203వ ఎపిసోడ్‌లోకి ఎంట‌రైంది. సోమ‌వారం ఎపిసోడ్‌లో వంట‌ల‌క్క అలియాస్ దీప ఊహించ‌ని షాక్ ఇవ్వ‌బోతోంది. శనివారం ఎపిసోడ్‌లో డాక్ట‌ర్ బాబు ఇంటికి వచ్చిన మోనిత రేపు మా బాబు బార‌సాల మీరు త‌ప్ప‌కుండా రావాలి అని పిల‌వ‌డం.. కార్తీక్‌, సౌంద‌ర్య నో అని చెప్ప‌డం.. వెంట‌నే దీప `మోనిత నీ ఏర్పాట్లు చేసుకో.. వీళ్లంద‌రినీ తీసుకుని వ‌చ్చే బాధ్య‌త నాది అని చెప్పి షాకిచ్చ‌యింది. ఆ త‌రువాత మోనిత‌ని ద‌గ్గ‌ర‌కు తీసుకుని చెప్పాను క‌దా మోనిత నీకు ఊహించ‌ని క్లైమాక్స్ ఇవ్వ‌బోతున్నాను` అని షాకిస్తుంది. దీప మాట‌లు విన్న మోనిత‌కు మైండ్ బ్లాంక్ అవుతుంది. దీప ఇచ్చిన స‌మాధానంతో అయోమ‌యంలో ప‌డిపోయిన మోనిత అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. దీప మాట‌ల‌కు ఓ ప‌క్క కంగారు.. మ‌రో ప‌క్క అయోమ‌యానికి గురైన సౌంద‌ర్య‌, ఆనంద‌రావు దీప ఇలా ప్ర‌వ‌ర్తిస్తుందేంట‌ని మ‌ద‌న ప‌డుతుంటారు. ఆనందారావు అయితే దీప‌ని చూసి బాధ‌ప‌డుతుంటాడు. ఇదిలా వుంటే దీప త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి వార‌ణాసి కారులో రెస్టారెంట్‌కి వెళుతుంది. అక్క‌డ పిల్లలు ఏది ఆర్డ‌ర్ చేస్తే అది ఇప్పిస్తాన‌ని చెబుతుంది. అంతే కాకుండా ఈసారి త‌న నిర్ణ‌యం మార్చుకోన‌ని పిల్ల‌ల‌కు హింట్ ఇస్తుంది. ఆ త‌రువాత పిల్ల‌ల‌ని ఇంటికి పంపించేసి తాను ఎక్క‌డికో వెళ్లిపోతుంది. విష‌యం తెలిసి సౌంద‌ర్య‌, ఆనంద‌రావు షాక్‌కు గుర‌వుతారు. ఇంత‌కీ దీప ఎక్క‌డికి వెళ్లింది? .. ఏం చేయ‌బోతోంది? .. మోనిత‌కు దిమ్మ‌దిరిగే షాక్ ఇవ్వ‌బోతోందా?  లేక త‌న‌ని ప్రేమిస్తున్న ప్రేక్ష‌కుల‌కే షాక్ ఇవ్వ‌నుందా అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ ఖ‌చ్చితంగా చూడాల్సిందే.

ఇమ్మాన్యుయేల్‌కి షాకిచ్చిన వ‌ర్ష

బుల్లితెర కామెడీ షో `జ‌బ‌ర్ద‌స్త్‌`. ఈ షో తెలుగు ప్రేక్ష‌కుల్ని గ‌త కొన్నేళ్లుగా విశేషంగా అల‌రిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో ద్వారా చాలా జంట‌లు పాపులారిటీని సొంతం చేసుకున్నాయి. అందులో ఇమ్మాన్యుయేల్ , వ‌ర్ష జంట‌. న‌ల్ల‌ని అబ్బాయి వెంట‌ప‌డే అమ్మాయిగా వ‌ర్ష పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ ఇద్ద‌రికి బుల్లితెర‌పై హిట్ పెయిర్‌గా మంచి క్రేజ్ ద‌క్కింది. దీంతో వీరిద్ద‌రిపై ప్ర‌త్యేకంగా ఈవెంట్ ల‌ని కూడా నిర్వ‌హించారు. అయితే ఈ జంట‌పై కొంత మంది కామెంట్‌లు చేయ‌డంతో మ‌న‌స్తాపానికి గురైన వ‌ర్ష ఆ త‌రువాత నుంచి ఇమ్మాన్యుయేల్‌తో స్కిట్‌లు చేయ‌డం త‌గ్గించేసింది. ఒక ద‌శ‌లో జ‌బ‌ర్ద‌స్త్‌ని వ‌దిలేస్తున్నానంటు కూడా వ‌ర్ష ప్ర‌క‌టించి షాకిచ్చింది. అయితే తాజాగా ఈ జోడీ ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈ సంద‌ర్భంగా వ‌ర్ష‌పై ఇమ్యాన్యుయేల్ పంచ్‌లు వేయ‌డం.. దానికి వ‌ర్ష కూడా కౌంట‌ర్ ఇవ్వ‌డం న‌వ్వులు పూయిస్తోంది. ఇమ్మానుయేట్ త‌నతో స్కిట్ చేస్తున్న యువ‌తిని త‌న పెదాలు త‌డ‌పొచ్చుక‌దా అంటాడు. దానికి ఆ అమ్మాయి నీళ్లు ఇమ్మాన్యుయేల్ ముఖాన నీళ్లు కొడుతుంది. దానికి పెదాలు త‌డ‌ప‌డం అంటే ఇది కాదు వ‌ర్ష‌ని చూసి నేర్చుకోవాలి. వ‌ర్ష అయితే సునామీలా కుమ్మేసి పెదాల‌ని త‌డిపేస్తుంది. ఈ మాట‌లు విన్న వ‌ర్ష ఆశ్చ‌ర్యానికి లోనైంది. ఆ వెంట‌నే ఇదే స్కిట్‌లో నూక‌రాజు త‌న చివ‌రి ఇకోరిక వ‌ర్ష‌ని హ‌గ్ చేసుకోవ‌డం అని చెబుతాడు. ఇదే మంచి ఛాన్స్ అని భావించిన వ‌ర్ష ప‌కోడీ గాడికే హ‌గ్ ఇచ్చాను నికివ్వ‌నా అంటూ నూక‌రాజుకి వ‌ర్ష హ‌గ్ ఇచ్చేయ‌డం ఇమ్మాన్యుయేల్ ని షాక్‌కు గురిచేసింది. 

లిప్‌లాక్ రివ‌ర్స్‌.. ష‌ణ్ముఖ్‌, సిరిలకు నాగ్ క్లాస్!

  బిగ్‌ బాస్ ఇంట్లో సిరి హ‌న్మంత్‌, ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌ చేసిన ర‌చ్చ బిగ్‌బాస్ షోని విమ‌ర్శ‌ల‌కు గురిచేస్తోంది. న‌టి మాధ‌వీల‌త వీరిద్ద‌రికి సంబంధించిన వీడియోల‌పై ఓ రేంజ్‌లో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం.. అవి నిజ‌మేన‌ని తేల‌డం తెలిసిందే. గ‌త రెండు రోజుల క్రితం బిగ్‌బాస్ హౌస్‌లో సిరి, ష‌ణ్ణు లిప్‌లాక్ చేసుకోవ‌డం ప‌లువురిని షాక్‌కు గురిచేసింది. ఏంటీ ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రుగుతోంది? అని అంతా విస్మ‌యాన్ని వ్య‌క్తం చేశారు. అయితే కింగ్ నాగార్జున మాత్రం ఇద్ద‌రినీ కన్ఫేష‌న్ రూమ్‌కి పిలిచి క‌డిగిపారేశారు. ష‌ణ్ణుతో పోలిస్తే సిరినే ఎక్కువ‌గా మంద‌లించే ప్ర‌య‌త్నం చేశారు. ఓ ర‌కంగా చెప్పాలంటే సిరి ప‌రువుతీసేశారు. నిన్ను చూసి ఇలా వుండాల‌ని అనుకోవాలే కానీ ... ఇలా వుండ‌కూడ‌ద‌ని అనుకోకూడ‌ద‌ని... గ‌ట్టి క్లాసే పీకాడు. గ‌త కొన్ని రోజులుగా సిరి, ష‌ణ్ణు వ్య‌వ‌హార శైలి నెటిజ‌న్‌ల‌కి, ఆడియ‌న్స్‌కి చిరాకు తెప్పిస్తోంది. ఎందుకు గొడ‌వ ప‌డ‌తారో తెలియ‌దు.. ఆ త‌రువాత ఎందుకు కాంప్ర‌మైజ్ అవుతారో తెలియ‌దు.. దాన్ని అవ‌కాశంగా తీసుకుని టైట్‌గా ఎందుకు హ‌గ్ చేసుకుంటారో తెలియ‌దు. ఇవే అర్థంకాని ప్ర‌శ్న‌లంటే తాజాగా సిరి, ష‌ణ్ణు లిప్‌లాక్.. అది కెమెరా కంటికి చిక్క‌డంతో నానా ర‌చ్చ‌కు దారి తీసింది. దీనిపై సిరి, ష‌ణ్ణుల‌ని శ‌నివారం నిల‌దీశారు నాగార్జున‌. ఎందుకంత‌గా ట్రిప్ అవుతున్నార‌ని చుర‌క‌లు అంటించారు. సిరిని అయితే ఓ రేంజ్‌లో ఏకి పారేశారు. నీలా వుండ‌కూడ‌ద‌ని చుర‌క‌లంటించాడు నాగ్‌. ఆయ‌న‌ చుర‌క‌లు అంటించ‌డంతో సిరి, ష‌ణ్ణులో రియ‌లైజేష‌న్ వ‌చ్చేసింది. కానీ జ‌ర‌గాల్సిన  న‌ష్టం జ‌రిగిపోయిందని నెటిజ‌న్స్ ష‌ణ్ణు, సిరిల‌పై సెటైర్లు వేస్తున్నారు. 

తారక్, మహేష్ ఫ్యాన్స్ కి అసలుసిసలు పండగ!

'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోలో అప్పుడప్పుడు సెలబ్రిటీలు వచ్చి సందడి చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి-కొరటాల శివ, సమంత, దేవిశ్రీప్రసాద్-తమన్ ఈ షోకి గెస్ట్ లుగా వచ్చి ఎంటర్టైన్ చేశారు. ఇక ఈ షోకి మహేష్ బాబు గెస్ట్ గా రాబోతున్నట్లు షో నిర్వాహకులు తాజాగా అధికారికంగా ప్రకటించారు. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకి గెస్ట్ గా మహేష్ రాబోతున్నట్లు ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. ఈ ఎపిసోడ్ షూట్ కూడా ఎప్పుడో పూర్తయింది. షూట్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. మొదట ఈ ఎపిసోడ్ దసరా కానుకగా టెలికాస్ట్ కానుందని న్యూస్ వినిపించింది. కానీ ఆ ప్లేస్ లో సమంత ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. ఇక దీపావళికి టెలికాస్ట్ కానుందని ప్రచారం జరగగా.. ఆ ప్లేస్ లో దేవిశ్రీప్రసాద్-తమన్ ల ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. దీంతో మహేష్ ఎపిసోడ్ ఎప్పుడొస్తుందా అని డ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ ని ఖుషీ చేసే న్యూస్ తాజాగా వచ్చింది. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలో మహేష్ పాల్గొన్న ఎపిసోడ్ త్వరలోనే టెలికాస్ట్ కానుందని తెలియజేస్తూ తాజాగా షో నిర్వాహకులు పోస్టర్ ను విడుదల చేశారు. తారక్, మహేష్ లకు మంచి బాండింగ్ ఉంది. మహేష్ ని తారక్ అన్నయ్య అని పిలుస్తాడు. గతంలో వీళ్ళిద్దరూ 'భరత్ అనే నేను' ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఒకే స్టేజ్ పై కనిపించి కనువిందు చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి బుల్లితెరపై సందడి చేస్తే షోకి రికార్డ్ రేటింగ్స్ రావడం ఖాయమనే చెప్పాలి.

బిగ్‌బాస్ : మాన‌స్‌.. కాజ‌ల్ మైండ్‌గేమ్‌.. చిట‌ప‌ట‌లాడిన ఆనీ

బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఎండింగ్‌కి రోజులు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా కొద్దీ గేమ్ ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరుగుతోంది. ఇంటి స‌భ్యుల మ‌ధ్మ‌య వున్న అస‌లైన బంధాలు.. ప్రేమ‌లు.. త్యాగాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. అంతే కాకుండా కంటెస్టెంట్‌ల మ‌ధ్య దూరం.. రోజు రోజుకీ పెరిగిపోతూ గొడ‌వ‌లు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. దీనికి బిగ్‌బాస్ పెడుతున్న టాస్క్‌లు కూడా ఇంటి స‌భ్యుల మ‌ధ్య దూరాన్ని పెంచుతున్నాయి. నిన్న‌టి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ ఇంటి స‌భ్యుల మ‌ధ్య పెద్ద చిచ్చే పెట్టాడు. 75వ ఎపిసోడ్ లోకి ఎంట‌రైన హౌస్ మేట్స్ త‌మ‌ని తాము కాపాడుకోవ‌డానికి .. పోటీలో గెల‌వ‌డానికి ఆస‌క్తిక‌ర ప్లాన్‌ల‌ని సిద్ధం చేసుకున్నారు. యాంక‌ర్ ర‌వి .. శ్రీ‌రామ‌చంద్ర అండ్ కోని క‌లుపుకుంటూ కొత్త ఎత్తులు వేయ‌డం గ‌మ‌నార్హం. ఇది గ‌మ‌నించిన స‌న్నీ, కాజ‌ల్‌, మాన‌స్స, ప్రియాంక‌లు కూడా త‌మ ప్లాన్‌ని సిద్ధం చేసుకుని రంగంలోకి దిగారు. ఈ నేప‌థ్యంలోనే మాన‌స్ ఇంటి కెప్టెన్ కావ‌డంతో స‌న్నీ, కాజ‌ల్ హ్యాపీగా ఫీల‌య్యారు. `నిప్పులే శ్వాస‌గా గుండెలో ఆశ‌గా` అనే టాస్క్‌ని ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో భాగంగా మొద‌టి సైర‌న్ మోగిన వెంట‌నే ముందు ఎవ‌రైతే ఫైర్ ఇంజిన్‌లోకి ఇద్ద‌రు వ్య‌క్తులు ఎక్కాల్సి వుంటుంది. ఆ ఇద్ద‌రు ఒక ఇంటి స‌భ్యుడిని కాపాడాల్సి వుంటుంది. ఈ టాస్క్‌లో గెలిచిన వారికి ఫ్రీ ఎవిక్ష‌న్ పాస్ సొంతం అవుతుంది. దీంతో కంటెస్టెంట్‌లు అంతా త‌మ పూర్తి ఎఫ‌ర్ట్‌ని పెట్ట‌డానికి రెడీ అయిపోయారు. ఇక్క‌డే మాన‌స్, కాజ‌ల్ మైండ్ గేమ్ ఆడారు. ఈ టాస్క్‌లో సిరి, ఆనీ ఫొటోల్లో ఒక్క‌రి ఫొటో కాల‌కుండా చూడాలి. అయితే ఈ ఇద్ద‌రి ఫొటోల‌ని తెలివిగా కాలిస్తే స‌న్నీ సేవ్ అవుతాడు ఈ విష‌యాన్ని ముందు ప‌సిగ‌ట్టిన మాన‌స్‌, కాజ‌ల్ ఒకు సిరి అంటే మ‌రొక‌రు ఆనీ అంటూ చివ‌రి వ‌ర‌కు గేమ్ ఆడీ ఇద్ద‌రి ఫోటోలు కాలిపోయేలా చేశారు. చివ‌రికి స‌న్నీని అనుకున్న‌ట్టే సేవ్ చేసుకున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆనీ మాస్ట‌ర్ కాజ‌ల్ ఆడిన గేమ్‌ని త‌ప్పుబ‌డుతూ మండి ప‌డింది. తొండిగేమ్ అంటూ ఓ రేంజ్‌లో ర‌చ్చ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది. 

అవినాష్ ముక్కు ప‌గ‌ల‌గొట్టిన యాద‌మ్మ రాజు

స్టార్ మాలో హాస్య ప్రియుల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తున్న షో కామెడీ స్టార్స్‌. మ‌ల్లెమాల ఎంట‌ర్ టైన్‌మెంట్స్ అందిస్తున్న `జ‌బ‌ర్ద‌స్త్‌` షోకు పోటీగా `స్టార్ మా`లో ఓంకార్ స్టార్ట్ చేసిన ఈ షో గ‌త కొన్ని నెల‌లుగా బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటూ మంచి రేటింగ్‌తో కొన‌సాగుతోంది. ప్ర‌తీ ఆదివారం మ‌ధ్యాహ్నం 1: 30  గంట‌ల‌కు ప్ర‌సారం అయ్యే ఈ షో కు సంబంధంచిన తాజా ప్రోమోని విడుద‌ల చేశారు. ఈ ఆదివారం ప్ర‌సార‌మ‌య్యే షోలో హ‌రి, యాద‌మ్మ రాజు, ముక్కు అవినాష్‌, యాద‌మ్మ రాజులు క‌లిసి చేసే కామెడీ హైలైట్‌గా నిల‌వ‌బోతోంది. హ‌రితో క‌లిసి యాద‌మ్మ రాజు లేడీ గెట‌ప్‌లో న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే `నా బిల్డ‌ప్ అంతా చూసి వ‌చ్చింది అషురెడ్డి అనుకున్నార్రా ` అన్నాడు హ‌రి. దానికి యాదమ్మ రాజు `నా గ్లామ‌ర్ ఎక్క‌డ అషు గ్లామ‌ర్ ఎక్క‌డ‌` అన్నాడు. నిజ‌మే నీకు, అషుకు ఆటోకీ ఆడీ కార్‌కి వున్న తేడా వుంద‌ని హ‌రి అన‌డం.. ఓ అషుని ఆటోతో పోల్చావా అని యాద‌మ్మ రాజు అన‌డం న‌వ్వులు పూయిస్తోంది. ఇక ముక్కు అవినాష్‌తో క‌లిసి యాద‌మ్మ రాజు చేసిన స్కిట్ కూడా ఓ రేంజ్‌లో పేలనున్న‌ట్టుగా తెలుస్తోంది. ముక్కు అవినాష్ ముక్కు గుర్తుతో పోటీకి దిగ‌డం.. అత‌ని అనుచ‌రుడిగా యాద‌మ్మ రాజు గుద్దాలే గుద్దాలే ముక్కునే గుద్దాలే అంటూ ప్ర‌చారం చేస్తూ ముక్కు అవినాష్ ముక్కు ప‌గ‌ల‌గొట్ట‌డం హిలేరియ‌స్‌గా వుంది. క‌డుపుబ్బా నవ్వించే ఈ కామెడీ స్కిట్ లు వ‌చ్చే ఆదివారం బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఓ రేంజ్‌లో ఎంట‌ర్‌టైన్ చేయ‌నున్నాయి.

ఆలోచ‌న‌లో ప‌డ్డ రిషి, వ‌సు.. ఏం జ‌రుగుతోంది?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న ఫ్యామిలీ డ్రామా `గుప్పెడంత మ‌న‌సు`. వ‌సుధార‌, రిషి జంట నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ రోజు రోజుకీ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ రోజు ఎపిసోడ్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా సాగేలా క‌నిపిస్తోంది. గ‌త కొన్ని ఎపిసోడ్‌లుగా త‌న ప్రేమ‌ని వ‌సుధార‌తో చెప్ప‌డానికి ఇబ్బందులు ప‌డిన రిషి మొత్తానికి త‌న మ‌న‌సులో మాట‌ని బ‌య‌ట‌పెట్టేసిన విష‌యం తెలిసిందే. తాజాగా శుక్ర‌వారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిగా సాగ‌బోతోంది. రిషి త‌న గ‌దిలో ఒంట‌రిగా కూర్చొని వ‌సుధార అన్న మాట‌ల‌ని గుర్తుచేసుకుంటూ వుంటాడు. ఇదే స‌మ‌యంలో రిషి రూములోకి వ‌చ్చిన తండ్రి మ‌హేంద్ర రిషి మ‌న‌సులో ఏముంది? .. వ‌సుధార గురించి త‌ను ఏమ‌నుకుంటున్నాడ‌ని ఆరాతీసే ప్ర‌య‌త్నం చేస్తాడు. కానీ రిషి మాత్రం ఎక్క‌డా బ‌య‌ట‌ప‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌తాడు. ఇదే క‌ర్మంలో వ‌సుధార ఆరోగ్యం గురించి తెలుసుకోమ‌ని జ‌గ‌తికి ఫోన్ చేయ‌మంటాడు రిషి దాంతో మ‌హేంద్ర .. జ‌గ‌తికి ఫోన్ చేసి వ‌సుధార ఆరోగ్యం గురించి తెలుసుకుంటాడు. క‌ట్ చేస్తే క్యాలేజ్ క్యాబిన్‌లో జ‌గ‌తి, మ‌హేంద్ర కూర్చుని రిషి, వ‌సుధార‌ల గురించి మాట్లాడుకుంటుంటారు. ఇంత‌లో అక్క‌డికి రిషి వ‌స్తాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?  రిషి .. జ‌గ‌తి, మ‌హేంద్ర‌ల‌ని ఏమ‌డిగాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది అన్న‌ది ఈ రోజు ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

అషురెడ్డి దుబాయ్ బ్యాగ్ క‌హానీ విన్నారా?

బిగ్‌బాస్ తో లైమ్ లైట్‌లోకి వ‌చ్చేసిన యూట్యూబ‌ర్ అషురెడ్డి ప్ర‌స్తుతం స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న `కామెడీ స్టార్స్‌`లో హ‌రి టీమ్‌తో క‌లిసి స్కిట్‌లు చేస్తూ ఆక‌ట్టుకుంటున్న విష‌యం తెలిసిందే. గ‌త రెండు వారాలుగా ఈ షోలో క‌నిపించ‌కుండాపోయిన అషురెడ్డి తాజాగా దుబాయ్ విహారానికి వెళ్లింది. అక్క‌డ ఎంజాయ్ చేస్తూ స్విమ్మింగ్ పూల్‌లో జ‌ల‌కాలాడుతూ నెటిజ‌న్‌ల‌కు క‌నువిందు చేసింది. చేయాల్సినంత ఎంజాయ్ చేసిన అషు రెడ్డి ప్ర‌త్యేకంగా దుబాయ్‌లో త‌న‌కు కావాల్సి వ‌న్నీ కొనుక్కోవ‌డానికి షాపింగ్ చేసింది. ఈ షాపింగ్‌లో భాగంగా రెండు హ్యాండ్ బ్యాగ్‌లు తీసుకుంది. అయితే అవి మామూలు హ్యాండ్ బ్యాగ్‌లు కాదు.  ఒక్కో హ్యాండ్ బ్యాగ్ ఖ‌రీదు అక్ష‌రాలా ఎండున్న‌ర ల‌క్ష‌లు. ఈ విష‌యం తెలిసి అషురెడ్డి త‌ల్లి షాక్ గుర‌వ‌డ‌మే కాకుండా డ‌బ్బుల‌న్నీ దుబారా చేస్తోంద‌ని, అషుకు డ‌బ్బు విలువ తెలియ‌డం లేద‌ని ఆగ్రంతో ఊగిపోయి దుడ్డు తిరిగేసేంత ప‌ని చేసింది. సోష‌ల్ మీడియాలో గ‌త కొంత కాలంగా ర‌చ్చ చేస్తున్న అషురెడ్డి ఈ మ‌ధ్య కాస్త త‌న ఫోక‌స్‌ని యూట్యూబ్‌కు మార్చింది. త‌న సొంత ఛాన‌ల్‌ని మ‌రింత‌గా పాపుల‌ర్ చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ప‌డిన అషు అందుకోసం ఇంటికి సంబంధించిన వీడియోల‌ని కూడా పోస్ట్ చేయ‌డం మొద‌లుపెట్టింది.  ఈ క్ర‌మంలో త‌న త‌ల్లికి , త‌న‌కు మ‌ధ్య జ‌రిగిన ఆస‌క్తిక‌ర విష‌యాల‌కు సంబంధించిన వీడియోని కూడా పోస్ట్ చేసింది. ఇందులో అషు త‌ల్లి పాత బ్యాగ్‌ల‌ని కాల్చి వేయ‌డం.. మ‌రోసారి స‌ర‌దాల పేరుతో డ‌బ్బు త‌గ‌లేస్తే ఊరుకోన‌ని వార్నింగ్ ఇవ్వ‌డం ఆస‌క్తిగా మారింది.

బిగ్‌బాస్ : ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ ఎవ‌రికి ద‌క్కేను

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5 విమ‌ర్శ‌లు చుట్టుముడుతున్నా త‌న పంథాని మార్చ‌కుండా ముందుకు సాగుతోంది. మ‌రో నాలుగు వారాల్లో షో ముగియ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో హౌస్‌లో ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు చోటు చేసుకోబోతున్నాయి. ఇంటి స‌భ్యుల మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర‌మైన పోటీ జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా బిగ్‌బాస్ ఒక కంటెస్టెంట్ ని ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ పేరుతో నేరుగా ఫైన‌ల్‌కి పంపించ‌బోతున్నారు. ఈ షో 19 మంది కంటెస్టెంట్‌ల‌తో మొద‌లైంది. అందులో ఇప్ప‌టి వ‌ర‌కు 9 మంది కంటెస్టెంట్‌లు ఎలిమినేట్ అయి ఇంటి నుంచి వెళ్లిపోయారు. తాజాగా 10వ కంటెస్టెంట్ హెల్త్‌ కార‌ణాల‌తో జెస్సీ బ‌య‌ట‌కి వ‌చ్చేయ‌డంతో హౌస్‌లో ఇప్పుడు 9 మంది కంటెస్టెంట్‌లు మిగిలిపోయారు. ఇందులో 5 గురు ఫైన‌ల్‌కి వెళ్ల‌బోతున్నారు. మిగిలిన నలుగురు ఇంటి నుంచి ఎఇల‌మినేట్ కానున్నారు. ఎవిక్ష‌న్ పాస్ కోసం బిగ్‌బాస్ `నిప్పులే శ్వాస‌గా గుండెలో ఆశ‌గా` అనే టాస్క్‌ని ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భాగంగా మొద‌టి ఫైర్ అలారం మోగిన‌ప్పుడు ఏ ఇద్ద‌రు స‌భ్యులైతే ముందుగా ఫైర్ ఇంజిన్ లోకి వెళ‌తారో వారే బ‌ర్నింగ్ హౌస్‌లో వున్న ఇద్ద‌రిని సేవ్ చేస్తారో .. ఎవ‌రిని మంట‌ల్లో కాలిపోనిస్తారో నిర్ణ‌యించాల్సి వుంటుంది. ఈ నేప‌థ్యంలో స‌న్నీ, పింకీ .. షన్ను, సిరిల‌ని రిక్వెస్ట్ చేయ‌డం.. నేను మారాల‌నుకుంటున్నాన‌ని స‌న్నీ అన‌డం.. నేను స్ట్రాంగ్ అని పింకీ చెప్ప‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఆక‌ట్టుకుంటోంది.

వంట‌లక్క ప్రేక్ష‌కుల‌కు షాకివ్వ‌బోతోందా?

బుల్లితెర‌పై టాప్ వ‌న్ రేటింగ్‌తో ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న ధారావాహిక `కార్తీక దీపం`. రేటింగ్ విష‌యంలో కాస్త వెన‌క‌బ‌డిన ఈ సీరియ‌ల్ మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేసింది. గ‌త కొన్ని వారాలుగా సాగ‌దీత ధోర‌ణితో సాగుతున్న `కార్తీక దీపం` తాజా ట్విస్ట్‌లు.. మ‌లుపుల‌తో మ‌ళ్లీ గాడిలో ప‌డింది. శుక్ర‌వారం ఎపిసోడ్ స‌రికొత్త ట్విస్ట్‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు షాకివ్వ‌బోతోంది. ఈ రోజు ఎపిసోడ్‌లో వంట‌ల‌క్క త‌న‌ని గ‌త కొంత కాలంగా ఇష్ట‌ప‌డుతున్న ప్రేక్ష‌కుల‌కు షాకివ్వ‌బోతున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇంట్లో జ‌రుగుతున్న ప‌రిణామాలు ఊహించ‌ని సంఘ‌ట‌న‌ల‌కు షాకైన పిల్ల‌లు సౌంద‌ర్య కూర్చుని ఒక‌ప్పుడు ఎన్నో ప్ర‌దేశాల‌కు వెళ్లామ‌ని కానీ ఇప్పుడు వెళ్ల‌లేక‌పోతున్నామ‌ని బాధ‌ప‌డుతుంటారు. ఇవాళ అమ్మ పుట్టిన రోజు ఈ సంద‌ర్భంగా గోల్కొండ‌కి వెళ్దామ‌ని అంటారు పిల్ల‌లు. ఇదే స‌మ‌యంలో దీప అక్క‌డికి వ‌చ్చేస్తుంది. దీప‌ని గ‌మ‌నించిన సౌంద‌ర్య ఈ రోజు నీ పుట్టిన రోజా పిల్ల‌లు గోల్కొండ వెల్దాం అంటున్నారు. ఈ మాట‌లు పూర్త‌య్యేలోపే `గోల్కొండ‌కు కాదు.. ఆ ప‌క్క‌నే వున్న స‌మాధుల్ని చూడ్డానికి వెళ్దాం` అంటుంది. దీంతో సౌంద‌ర్య‌, పిల్ల‌లు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌వుతారు. క‌ట్ చేస్తే సౌంద‌ర్య .. దీప మాట‌లు త‌లుచుకుంటూ బోరున ఏడుస్తుంటుంది. ఆనంద‌రావు వ‌చ్చి ఏం జ‌రిగింద‌ని ప్ర‌శ్నిస్తాడు. దీప‌ని చూస్తే భ‌య‌మేస్తోంద‌ని, త‌న ప్ర‌వ‌ర్త‌న విచిత్రంగా వుంద‌ని.. అవ‌స‌రానికి మించి సంతోషంగా క‌నిపిస్తోంద‌ని.. చ‌నిపోయేముందు ఎలా మాట్లాడ‌తారో దీప అలా మాట్లాడుతోంద‌ని. దాని తీరు చూస్తుంటే ఆత్మహ‌త్య చేసుకుంటుందేమో అని భ‌య‌మేస్తోంద‌ని సౌంద‌ర్య బోరుమంటుంది. ఇంత‌కీ దీప మ‌న‌సులో ఏముంది? .. ద‌ర్శ‌కుడు వంట‌ల‌క్క‌తో ప్రేక్ష‌కుల‌కు నిజంగానే షాకివ్వ‌బోతున్నాడా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.