చంద్రబాబుపై అసంతృప్తి.. మా సంగతేంటి బాబుగారు..

  రాజకీయాల్లో జంపింగ్ లు కామన్. ఒకప్పుడైతే పార్టీకి కట్టుబడి ఉండి.. పార్టీ మీద ప్రేమతో అధికారంలో ఉన్నా.. లేకపోయినా అదే పార్టీలో ఉండేవారు. కానీ రోజులతో పాటు అలాంటి ప్రేమలు, పద్దతులు కూడా మారిపోయాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవ్వడం.. అప్పటి వరకూ వినడానికి కాస్త ఇబ్బందిగా ఉండే పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసినా.. ఎలాంటి మొహమాటం లేకుండా వేరే పార్టీలోకి వెళ్లడం.. వారితో కలిసిపోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే...   అధికార పార్టీ అయిన టీడీపీలోకి ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు జంప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలందరూ టీడీపీపై అసంతృప్తితో రగిలి పోతున్నారట.  తమను పార్టీలో చేర్చుకునే ముందు… చంద్రబాబు ఎన్నో హామీలిచ్చారని, కాని వచ్చాక కూరలో కరివేపాకులా తీసేస్తున్నారని మండిపడుతున్నారట. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణానంతరం ఆయన అన్న కొడుకు భూమా బ్రహ్మానందరెడ్డి ఉప ఎన్నికల్లో గెలుపొందారు. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రిపదవులిచ్చారు చంద్రబాబు. అందులో ప్రధానంగా రెడ్డి వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ముగ్గురికి స్థానం కల్పించారు. మరో నలుగురికి మంత్రి పదవులిచ్చారు.. అయితే  మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాత్రం మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. కనీసం నామినేటెడ్ పోస్టుల్లో కూడా తమకు ప్రాధాన్యం కల్పించలేదని మండిపడుతున్నారట. దీంతో సైకిల్ పై వెళితే.. తమకు భవిష్యత్ ఉండదని గ్రహించి.. ఫ్యాన్ కిందకు వచ్చేయాలని ఆరాటపడుతున్నారట. ఈ నేపథ్యంలో టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల్లో.. పదిమంది ఎమ్మెల్యేలు జగన్ తో చర్చలు జరిపారట.   మరి జగన్ వైఖరి అందరికీ తెలిసిందే. పార్టీలో ఉన్నవాళ్లే జగన్ కు భయపడుతుంటారు. తాను చెప్పిందే వినాలనుకుంటాడు జగన్. అలాంటిది..ఇప్పుడు టీడీపీలోకి జంప్ అయి ఇప్పుడు వస్తా అంటే అంత ఈజీగా ఓకే అంటాడా..? తాము ఏదో అనుకుని పార్టీ మారామని, కానీ, ఇక్కడ తాము అనుకున్నంత లేదని వారు ఆవేదన వ్యక్తం చేసినా... వారి మాటలు విన్న జగన్ మోహన్ రెడ్డి మాత్రం.. వారికి ఎలాంటి హామీ ఇవ్వలేదట. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చి గెలుపించుకోగలనన్న దీమాతో ఉన్నారట జగన్. పాపం మరి రెంటికి చెడ్డ రేవడిలా.. పాపం అటు టీడీపీలో ఉన్నా ఉపయోగం లేదు.. ఇటు జగన్ కనికరించక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారట. ఆయన ఎప్పుడు ఊ అంటే.. అప్పుడు గోడదూకేందకు సిద్ధంగా ఉన్నారట. మరి చూద్దాం ఏం జరుగుతుందో...

వాళ్ళందరి గుట్టు విప్పుతా...పది రోజులు ఆగండి..

మొత్తానికి ఏపీ రాజకీయాలు మాత్రం రోజుకో ట్విస్ట్ తో.. రోజుకో కొత్త అంశంతో వేడి వేడిగా తయారవుతున్నాయి. ఎవరికి వాళ్లు వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం తెగ కష్టాలు పడుతున్నారు. ఇక ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు నడుపుతున్నారు. తమ వల్లే ప్రత్యేక హోదా ఇచ్చారని చెప్పుకోవడానికి తాపత్రయపడుతున్నారు. అయితే కేంద్రం మాత్రం ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పేసిందనుకోండి. అయినా భగీరధ ప్రయత్నం చేస్తున్నారు ఏపీ నేతలు. ఇక ఇప్పటికే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందబ్బా అని అయోమయంలో ఉన్న సామాన్య ప్రజలకు...అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఇంకా అయోమయంలో పడేస్తుంటారు  హీరో శివాజీ.   ఈ మధ్య ఆపరేషన్ గరుడ అంటూ.. దాని గురించి ఏకంగా ఓ బ్లాక్ బోర్డ్ పెట్టి.. ఆ ఆపరేషన్ గురించి చెప్పి హడావుడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత రెండు మూడు రోజులు దానిపై చర్చలు జరిగినా..తరువాత దాని గురించి మరిచిపోయారు. ఇక ఇప్పుడు మరోసారి ఆయన ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రత్యేక హోదా’ సాధించే ఉద్దేశం రాజకీయ నేతలకు గానీ, రాజకీయ పార్టీలకు గానీ లేదని, వాళ్ళందరూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడంలో నిమగ్నమై ఉన్నారని, ఎవరికీ ప్రత్యేక హోదా సాధించే చిత్తశుద్ధి లేదని అంటున్నారు. అంతేకాదు... కొందరు నేతలైతే రాష్ట్రంలో అల్లకల్లోలాలు సృష్టించేందుకు డబ్బులు కూడా తీసుకున్నారని, వాళ్ళందరి గుట్టు విప్పుతానని మండిపడ్డారు. మరో పది రోజుల్లో అందరినీ నడిరోడ్డుపై నిలబెట్టి జనాలు రాళ్ళు వేసి కొట్టేలా చేస్తానని చెప్పిన శివాజీ, తనకు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ‘స్పెషల్ స్టేటస్, రైల్వే జోన్, పోలవరం’ వంటి కీలకమైన అంశాల కోసం రాజకీయ నాయకులే పోరాటానికి దిగని సందర్భంలో... సినీ హీరోలను ఎలా విమర్శిస్తామని శివాజీ లాజికల్ గా ప్రసంగించారు. మరి  శివాజీ ఏం గుట్టు విప్పుతారో... ఎవరిపై ఏం బాంబు పేల్చుతారో తెలియాలంటే అప్పటివరకూ వెయిట్ చేయాల్సిందే.

ఈ ఒక్కరోజు దీక్షలతో ఏం సాధిస్తారు సార్...!

  ఈ మధ్య  రాజకీయ నాయకులకు ఒక్కరోజు నిరాహారదీక్షలు చేయడం.. ఒక్కరోజు పాదయాత్రలు చేయడం ఫ్యాషన్ అయిపోయింది.  ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరోజు పాదయాత్ర చేశారు. అంతేనా ప్రధానమంత్రి మోడీ కూడా ఒక్కరోజు నిరాహార దీక్ష చేశారు. మోడీ ఒక్కరోజు నిరాహార దీక్ష ఎందుకు చేశారో తెలుసుకదా. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎంపీలందరూ పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. ఇక చేయాల్సింది అంతా చేసి కేంద్రం డ్రామాలు ఆడి దానిపై చర్చ జరగకుండా చేసింది. పైగా విపక్షాలు చర్చలు జరగకుండా అడ్డుకున్నాయని... దానిని నిరసిస్తూ ప్రధాని మోడీ దీక్ష చేశారు. ఇక తమిళనాడులో కూడా కావేరి బోర్డు యాజమాన్యం ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే అధ్వర్యంలో నేతలు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అయితే పేరుకే ఆమరణ నిరాహార దీక్ష అని తేలిపోయింది. దీక్ష పేరుతో నేతలు ఎంచక్కా పక్కకు వెళ్లి ఫుల్ గా కుమ్మేయడం కెమెరాల కంటికి చిక్కి పరువు పోవడం అన్నీ జరిగిపోయాయి. ఇక ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తాను కూడా నిరాహారదీక్షను చేయబోతున్నానంటూ ప్రకటన చేశారు. తన పుట్టినరోజైన ఏప్రిల్ 20వ తేదీన దీక్షను చేపడుతున్నానని ఆయన తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేయనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్లమెంటును జరగనివ్వలేదని చెప్పి ప్రధాని మోదీ నిరాహారదీక్ష చేశారని... పార్లమెంటు జరగకపోవడానికి కారణం మీరే కదా? అని ఆయనను తాను అడుగుతున్నానని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాను మాత్రం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ దీక్ష చేయబోతున్నానని... తద్వారా కేంద్రం పట్ల నిరసన వ్యక్తం చేస్తానని తెలిపారు. అంతేకాదు... ఢిల్లీని శాసించబోయేది టీడీపీనే అని... ఢిల్లీలో చక్రం తిప్పుతామని చెప్పారు. 2019లో మనం మద్దతు ఇచ్చే పార్టీనే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లను గెలిపిస్తే... ప్రత్యేక హోదాను తెస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంటే ఏమిటో యావత్ దేశానికి చూపుదామని అన్నారు. మరి ఈ ఒక్కరోజు దీక్షలు ఏంటో అని సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒక్కరోజు దీక్ష చేస్తే ఆ ఎఫెక్ట్ ఎంత వరకూ ఉంటుందో వాళ్లకే తెలియాలి అని అంటున్నారు. అసలు ఏం తినకుండా ఒక్కరోజు ఉండటం పెద్ద మ్యాటరేం కాదు.. అలాంటిది ఒక్కరోజు దీక్ష చేసి ఏం సాధిస్తారో ఏమో అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి చంద్రబాబు ఒక్కరోజు దీక్షతో సాధిస్తారేమో..!

పవన్ కు పోటీగా చిరంజీవి..!

  కర్ణాటక ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ... బీజేపీకి ఈ ఎన్నికలు ఇంకా కీలకంగా మారాయి. కారణం.. దీనికి బీజేపీ పై దేశవ్యాప్తంగా ఉన్న వ్యతిరేకతే. ఇప్పటికే వచ్చిన ఉపఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుండటంతో.. ఈ ఎన్నికల్లో గెలిచి మళ్లీ తమ సత్తా చూపించాలని చూస్తున్నారు. ఇక కాంగ్రెస్ కూడా తమ వ్యూహాలు తాము రచించుకుంటున్నారు.   ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ ఎన్నికల్లో తెలుగు వాళ్ల ప్రచారానికి బాగా డిమాండ్ ఏర్పడుతోంది. ప్రధానంగా తెలుగువారు ఉండే ప్రాంతాల్లో, బెంగళూరు సిటీలో తెలుగు స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం కోసం కన్నడ నేతలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ తో ప్రచారం చేయించుకోవడానికి జేడీఎస్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రకటించుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ చిరంజీవితో ప్రచారం చేయించాలన్న ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ ప్రచారానికి వస్తారని కర్ణాటక కాంగ్రెస్ నేతలు అంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ లోనే ఉన్నారని... కర్ణాటకలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడానికి ఆయన వస్తారని అక్కడి కాంగ్రెస్ నేతలు అంటున్నారు.   అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. చిరంజీవి పదవికాలం ఇటీవలే ముగిసింది. చిరును మళ్లీ రాజ్యసభకు పంపడానికి తగిన బలం కాంగ్రెస్ కు లేకపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులోనూ చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మరీ ఏపీలో ఉన్నంత వీక్ గా లేదు. చిరంజీవి వచ్చి ప్రచారం చేస్తే సినీ గ్లామర్ కలిసి వస్తుందని అక్కడి నేతలు భావిస్తున్నారు. అధిష్టానం చేత చెప్పించి, చిరంజీవిని ప్రచారానికి రప్పించేయత్నాల్లో ఉన్నారట అక్కడి కాంగ్రెస్ నేతలు. మరి చిరంజీవి వెళతారో లేదో చూడాలి. ఒకవేళ చిరంజీవి కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే పవన్ ను చిరంజీవి కి మధ్య పోటీ ఏర్పడుతుందేమో.

మోడీ చరిత్రలోనే బ్లాక్ డే..

  ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇప్పటివరకూ మోడీ ఎన్నో పర్యటనలు చేసి ఉంటారు. ఎన్నో విదేశాలు తిరిగేసి ఉంటారు. కానీ ఈరోజు ఆయనకు జరిగిన అవమానం ఎక్కడ జరిగి ఉండకపోవచ్చు. మోడీకి అవమానం జరిగింది ఎక్కడో కాదు...ప్రాంతీయతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే తమిళనాడు రాష్ట్రంలో. అసలు సంగతేంటంటే... డిఫెన్స్ ఎక్స్‌పో కార్యక్రమంలో పాల్గొనేందుకు మోడీ చెన్నై వెళ్లారు. అయితే అక్కడ మోదీకి నిరసనలతో స్వాగతం లభించింది. కావేరీ నదీ జలాల నిర్వహణ బోర్డును ఏర్పాటు చేయాలని గత కొద్దికాలంగా తమిళనాడు రాష్ట్రంలో నిరసనలు జరుగుతున్న సమయంలో ఆయన చెన్నైకు రాగా... ఆయన రాకను నిరసిస్తూ, వేలాది మంది నిరసనలకు దిగారు. విమానాశ్రయం సమీపంలోనే ఆయన్ని అడ్డుకునేందుకు  పెద్దఎత్తున నిరసనకారులు ప్రయత్నించారు.   దీంతో ఇప్పటివరకూ ఎన్నడూ లేని విధంగా తమిళనాడులో మోడీకి చేదు అనుభవం ఎదురైందని అంటున్నారు. అంతేనా సోషల్ మీడియాలో అయితే మోడీపై సెటైర్లు మామూలుగా వేయలేదు తమిళ ప్రజలు. మీరు ప్రధానిగా పనికిరారని, ఇంతకు ముందు మీరు చేసిన టీ అమ్ముకునే పనే చేసుకోవాలని ఘాటుగా సోషల్ మీడియాలో సలహా ఇస్తున్నారు. మీ మొసలి కన్నీళ్లకు కరిగిపోవడానికి ఇది ఉత్తర భారతదేశం కాదని తమిళనాడు అని తమిళ ప్రజలు తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో హెచ్చరించారు. ఇంకా ఆశ్చర్యకమైన విషయం ఏంటంటే... మోడీ గో బ్యాక్ అనే నినాదాలు సోషల్ మీడియా ట్రెండింగ్ లో భారత్ నెంబర్ 1గా, ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ 4 స్థానంలో ట్రెండింగ్ లో నిలిచింది. నిజంగా ప్రధానిగా మోడీకి ఏప్రిల్ 12వ తేదీ గురువారం బ్లాక్ డే అని, ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని తమిళ ప్రజలు అంటున్నారు.   ఇంకా కొంతమంది అయితే ఏకంగా...ప్రధాని పదవికి మోడీ  అనర్హుడు వెనక్కి వెళ్లిపోండి...మీరు మళ్లీ టీ అమ్మడం మొదలుపెట్టండి. మీరు టీ అమ్మడానికి కచ్చితంగా సరిపోతారు, ముందు ఆ పని చెయ్యండి అంటూ ట్వీట్లు పెడుతున్నారు. ముల్లును ముల్లుతోనే తియ్యాలి.. మీ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి మీరు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటారు. మీ మీద వ్యతిరేకతను తెలియజేయడానికి మేము కూడా అదే సోషల్ మీడియానే ఉపయోగించాము.. అంటూ కౌంటర్ల మీద కౌంటర్లు విసురుతున్నారు. ఇంకా దారుణం ఏంటంటే...  మోడీ తమిళనాడుకు రావడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. ఓ ఆందోళన కారుడు ఏకంగా ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు. ఒంటిమీద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తానికి మోడీకి ఇన్ని రోజులకు దక్షిణాది రాష్ట్రాల సెగ తగిలినట్టుంది. దక్షిణాది రాష్ట్రాలే కదా అని చిన్న చూపు చూస్తున్న ఆయనకు... వారు తిరగబడితే ఎలా ఉంటుందో తెలిసొచ్చింది.

వాళ్లు ఓడిపోవాలి...చంద్రబాబుకు మద్దతిస్తా...!

  ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కాస్త రాజకీయ అనుభవం ఉన్న ఎవరికైనా ఆయన గురించి తెలిసే ఉంటుంది.  రాజకీయ విశ్లేషణల లో ఆయనది అందెవేసిన చెయ్యి. ఏదైనా విషయం మీద పూర్తిగా అవగాహన వచ్చాకే మాట్లాడడం ఆయన ప్రత్యేకత. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన.. అప్పుడప్పుడు రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ప్రశ్నిస్తూ.. మీడియా ముందుకు వస్తూ పలు వివరణలు ఇస్తూ ఉన్నారు.  ఏపీకి ప్రత్యేక హోదా కోసం సాగుతున్న పోరాటంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరు అదే సమయంలో ఇతర పక్షాల పోరాటం, అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదన్న విషయాలపై ఉండవవల్లి కీలక వ్యాఖ్యలు చేసి ఏపీ రాజకీయాల్లో పెను సంచలనమే రేపారు. ఇక ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో మాత్రం రెగ్యులర్ గా మీడియాతో టచ్ లో అప్పుడప్పుడు అధికార పార్టీపై పంచులు వేస్తూనే.. కావాల్సిన సలహాలు ఇస్తున్నారు.   ఓ రకంగా ఏపీ ప్రత్యేక హోదా పోరాటం ఇంత సీరియస్ అయిందంటే ఓ రకంగా దానికి ఉండవల్లే కారణమని చెప్పొచ్చు. ఎందుకంటే.. కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టమని అసలు ముందు చెప్పిందే ఉండవల్లి. ఉండవల్లి మాట వినే పవన్ ఆ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి.. అవిశ్వాస తీర్మానం పెట్టాలని సవాల్ విసిరారు. ఇక సవాల్ ను స్వీకరించిన జగన్... కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు.. ఆతరువాత టీడీపీ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడంతో అసలు యుద్దం మొదలైంది. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చాంశనీయమ్యాయి. దీంతో మోడీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని ... అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాలని తమ వాదన వినిపించినా.. చర్చ మాత్రం జరగకుండానే పార్లమెంట్ సమావేశాలు ముగించేశారు.   ఇక ఈ పోరాటం పై కూడా స్పందించిన ఉండవల్లి ముందుగా హోదా కోసం తెలుగుదేశం ఎంపీల పోరాటాన్ని గురించి ప్రస్తావించిన ఆయన దానిని కేవలం నాటకంగా అభివర్ణించారు. ప్రజలను మభ్యపెట్టేందుకే తన పార్టీ ఎంపీలతో చంద్రబాబు నాటకాలు ఆడిస్తున్నారని ఉండవల్లి నిప్పులు చెరిగారు. అంతేకాదు ఈ సందర్బంగా ఏపీ ప్రజలకు కూడా కొన్ని సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ బాగు పడాలంటే ఒక్క ఎన్నిక చాలని రానున్న ఎన్నికల్లో డబ్బు ఇచ్చిన వాడికి ఓటెయ్యెద్దని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు. డబ్బు ఖర్చు పెట్టినవాడు ఈ ఎన్నికల్లో ఓడిపోయి తీరాలని అప్పుడే రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఎన్నికలు అయ్యాక హోదా ఎలా తెస్తారో టిడిపి, వైసీపీలు చెప్పాలని, ఎందుకంటే టిడిపి వైసీపీలు కేంద్రంలో ప్రధాని స్థాయిలో ఉండేవారు కాదు. ఎలా తెస్తారు..? రేపటి ఎన్నికల్లో ఎన్డీయే రావొచ్చు లేదా యుపిఎ రావొచ్చు...20 కోట్లు ఖర్చు పెట్టె వాడు ముందు అవి రికవర్ చేసుకుంటాడా, మనకి సేవ చేస్తాడ అని ఉండవల్లి ప్రశ్నించారు. అదే విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమానికి సంబంధించి తనను పిలిస్తే టీడీపీ నిరసన కార్యక్రమాలకు మద్దతు తెలుపుతానని కూడా ఉండవల్లి అన్నారు. మరి ఉండవల్లి అంతటి వాడే ఇంత ఆఫర్ ఇచ్చి ముందుకు వచ్చారు... మరి టీడీపీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుందా.. లేక.. లైట్ తీసుకుంటుందా చూద్దాం.. చంద్రబాబు ఏం చేస్తారో...

చంద్రబాబుపై మోడీ కక్ష సాధింపు.. 19 లక్షల ఆంధ్రులకి దెబ్బ..

  మరోసారి ఏపీ ప్రజలను ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ను ప్రధాని మోడీ దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నట్టున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏపీ ప్రత్యేక హోదా పోరాటం నేపథ్యంలో బీజేపీతో ఇప్పటికే చంద్రబాబు తెగదెంపులు చేసుకొని ఇప్పటికే శత్రువు అయ్యారు. ఇక మోడీకి వ్యతిరేకంగా ఏకంగా అవిశ్వాస తీర్మానం పెట్టేసి శాశ్వత శత్రువు అయ్యారు. ఇంత పోరాటం జరుగుతున్నా ఏపీ ప్రత్యేక హోదా విషయంలో మాత్రం మోడీ మౌన మునిలా కూర్చొని చూసేరా తప్పా.. కనీసం ఏపీకి న్యాయం చేయాలన్న ఆలోచన కూడా ఆయనకు లేనట్టే కనిపించింది.   ఇక ఇప్పుడు పార్లమెంట్లో ఇంత ఆందోళనలు చేయడానికి కారణమైన చంద్రబాబుపై మోడీ పగపట్టిట్టున్నారు. అందుకే మరోసారి ఆయన చంద్రబాబుపై కత్తి కట్టునట్టు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అది అగ్రిగోల్డ్ స్కాం విషయంలో. అగ్రిగోల్డ్ స్కాం.. కాంగ్రెస్ హయాంలో జరిగిన మరో భారీ స్కాం ఇది. దేశ వ్యాప్తంగా 32 లక్షల మంది అగ్రి గోల్డ్ బాధితులుంటే వీరిలో 19 లక్షల మంది ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు. ఇక కాంగ్రెస్ హయాంలో జరిగిన ఈ స్కాంను... చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆంధ్రులకు  ఎలా అయినా న్యాయం చెయ్యాలని, అగ్రి గోల్డ్ ఆస్తులను అమ్మి, నష్టపోయిన వారికి డబ్బులు చెల్లించాలని నిర్ణయించారు.  ప్రభుత్వం తరుపున చేస్తే లేని పోనీ తలనొప్పులు అని, కోర్ట్ ద్వారా ఈ ప్రక్రియ చెయ్యటానికి రెడీ అయ్యారు.  దీనిలో భాగంగానే..  అగ్రి గోల్డ్ ను టేకోవర్ చేసేందుకు జీఎస్సెల్ గ్రూపు ముందుకొచ్చింది.   కోర్టుకు కూడా  జీఎస్సెల్ గ్రూపు ఇదే విషయం చెప్పింది. ప్రభుత్వం కూడా అగ్రిగోల్డ్‌ సంస్థలో డబ్బులు దాచుకున్న వారి జాబితా మొత్తం సిద్ధం చెయ్యమని సీఐడీ అధికారులని ఆదేశించింది... జీఎస్సెల్ గ్రూపు టేక్ ఓవర్ చేసిన అనంతరం సమకూరే నిధులు నుంచి బాధితులకు చెల్లించాల్సిన మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చెయ్యటానికి ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇక అంతా బాగానే సాగిపోతుంది అనుకుంటున్న టైంలో, అగ్రిగోల్డ్‌ సంస్థను టేకోవర్‌ చేయడానికి ముందుకొచ్చిన ఎస్సెల్‌-జీ గ్రూపు చేతులేత్తేసింది... ఇదే విషయం నిన్న కోర్ట్ కి చెప్పింది.. అంతేకాదు, సమాజ్ వాది పార్టీ నేత అమర్ సింగ్‌ను కూడా తెరపైకి తీసుకు వచ్చింది, జీ గ్రూప్.. సంయుక్త ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వానికి ఆసక్తి ఉందని అమర్ సింగ్ చెప్పారని జీఎస్ఎల్ గ్రూప్ తెలిపింది.. ఇక  దీనిపై స్పందించిన కోర్టు... మీరు అగ్రిగోల్డ్‌ను స్వాధీనం చేసుకుంటారా లేదా రెండు వారాల్లో చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది.   అయితే, ఈ తతంగం మొత్తం వెనుక మోడీ, బీజేపీ పెద్దల ఒత్తిడి ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి... ఇంత పెద్ద గ్రూప్, ఏమి గ్రౌండ్ వర్క్ చేసుకోకుండానే, ఇక్కడ వరకు వచ్చిందా ? ఇప్పుడు వచ్చి, మా వాల్ల కాదు అంటున్నారు అంటే, ఒత్తిడి ఉండే ఉంటుంది అని భావిస్తున్నారు... ఇది కనుక ఒక కొలిక్కి వస్తే, 19 లక్షల మందికి చంద్రబాబు దేవుడు అవుతాడు... అలా చేస్తే, రాజకీయంగా చంద్రబాబుకి లాభం... అందుకే, ఇది ముందుకు వెళ్ళకుండా ఆపారు అంటున్నారు... జీ ఛానెళ్ల నెట్ వర్క్ అధినేత సుభాష్ చంద్ర, 2016లో బీజేపీ సపోర్ట్ తో రాజ్యసభకు ఎన్నికయ్యారు.. మోడీ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నారు. మొత్తానికి మోడీ ఏపీపై తనకు ఉన్న చిన్నచూపును మరోసారి చూపించారని... ఆంధ్రుల మీద కక్ష ఇలా తీర్చుకుంటున్నారని మండిపడుతున్నారు.

చంద్రబాబు వెనుక ఇంత రాజకీయ కుట్ర చేశారా గవర్నర్ జీ...!

  ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగానే నాలుగేళ్లు కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ విడిపోయిన సంగతి తెలిసిందే. కానీ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రాజకీయ కుట్ర వెలుగుచూసింది. అది రాజభవన్ సాక్షిగా జరిగిన రాజకీయ కుట్ర అని ఏపీ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ ఈ కుట్రకి కథ, స్క్రీప్లే, దర్శకత్వం ఎవరనుకుంటున్నారా...? ఆయనెవరో కాదు... ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్. వినడానికి ఆశ్చర్యంగా ఉంది.. కదా... అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.   నరసింహన్ ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ ఆయన మాత్రం ఏపీ కంటే తెలంగాణకే ఎక్కువ సపోర్ట్ చేస్తారని.. తెలంగాణకే ఎక్కువ వంతపాడుతారన్నది ఏపీ నేతల అబిప్రాయం. అంతేకాదు ఇటీవల ఆయన్ని మార్చాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు మరో ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. అదేంటంటే...ఏపీకి, కేంద్రానికి మధ్య విభేధాలు పెరగడానికి గవర్నరే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-టీడీపీ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడానికి కారణం నరసింహనే అన్న వార్త వినిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా కేంద్రానికి ఫిర్యాదులు చేయడమే పనిగా పెట్టుకున్నారట నరసింహన్. అంతేకాదు ఇటీవల పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు కూడా.. గవర్నర్ ఇందులో ఏదో మతలబు ఉందని కేంద్రానికి ఫిర్యాదు చేశారట. ఇక ఇదంతా గమనించిన ఓ కేంద్ర మంత్రి చంద్రబాబు అంటే గవర్నర్ నరిసంహన్ కు పడదా? అని పలువురు నేతల వద్ద అన్నారట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే...గవర్నర్ చెప్పిన మాటలు, ఇస్తున్న నివేదికలను నమ్మే ఇన్ని రోజులు ప్రధాని మోడీ చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదట. అందుకే బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంటున్నా..బీజేపీ ఒక్కమాట కూడా మాటలడలేదట.   అంతేకాదు వైసీపీ అధినేత జగన్ కు, జనసేన అధినేత మద్య సఖ్యత ఏర్పడానికి కూడా గవర్నరే కారణమట. ఏపీలో ప్రస్తుతం జగన్ కు అనుకూల పరిస్థితులు ఉన్నాయని.... ఈ టైంలో పవన్ కనుక చంద్రబాబుకి ఎదురుతిరిగితే చంద్రబాబు మరింత బలహీనపడతారని చెప్పారట. దీనికి కేంద్రం సిగ్నల్ ఇవ్వడంతో రంగంలోకి దిగిన గవర్నర్... పవన్ ను పిలిపించుకొని మాట్లాడారట. ఐ.వై.ఆర్ కృష్ణారావు వంటివారితో సంప్రదింపులు జరిపారట. దీనిలో భాగంగానే వైసీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయని..  అందుకే మోడీ ఎప్పుడు అడిగితే అప్పుడు విజయసాయిరెడ్డికి అపాయింట్ మెంట్లు ఇస్తున్నారని... పవన్ ను బీజేపీ నడిపిస్తుందని.. ఇలా పలు వార్తలు వింటూనే ఉన్నాం. ఇక ఇప్పుడు గవర్నర్ చేసిన పనికి టీడీపీ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. టీడీపీని బలహీన పరిచేందుకే కేంద్రానికి గవర్నర్ తప్పుడు నివేదికలు అందజేశారని... తన పదవిని కాపాడుకునేందుకు గవర్నర్ బీజేపీ తొత్తుగా మారారని విమర్శిస్తున్నారు. మొత్తానికి సైలెంట్ గా ఉండే గవర్నర్ ఇంత డ్రామా నడిపారంటే గ్రేట్ అంటున్నారు కొంతమంది. పూజలు పునస్కారాలు అంటూ ఎప్పుడూ గుళ్ల చుట్టూ తిరిగే తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ లో ఇంత టాలెంట్ ఉందా అని అందరూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు.

పేద తల్లి కుమారుడిని... మళ్లీ సెంటిమెంట్ డ్రామా మొదలుపెట్టారుగా...!

  దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేకత పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఏపీ ప్రత్యేక హోదా పోరాటం అంశం విషయంలో ఈ వ్యతిరేకత ఇంకా పెరిగిపోయిందని చెప్పొచ్చు. పార్లమెంట్లో తమ మెజార్టీ ఎక్కువగా ఉన్నా.. కేవలం ఓ చిన్న అవిశ్వాసం తీర్మానం చర్చకు రానివ్వకుండా.. అన్నాడీఎంకేను అడ్డుపెట్టుకొని డ్రామాలాడిన సంగతి దేశ వ్యాప్తంగా అందరూ గమనించారు. దీంతో మోడీ ప్రభుత్వంపై ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా, మోడీ వివిధ రాష్ట్రాలకి చేస్తున్న అన్యాయం పై, పలు పార్టీలకు చెందిన 100 మంది ఎంపీలు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు కూడా రాజకీయ వర్గాల నుండి వినిపిస్తున్న టాక్. ఇక పరిస్థితి గమనించిన బీజేపీ అప్పుడే దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. సానుభూతిని కూడగట్టుకునే చర్యలు మొదలుపెట్టింది.   దీనికి సంబంధించి.. బీజేపీ అనుకూల ఛానల్ గా పేరు ఉన్న రిపబ్లిక్ టీవీ దేశ రాజకీయలను ప్రభావితం చేసే ఒక సంచలన కధనం ప్రసారం చేసింది. మోడీకి వ్యతిరేకంగా... పలు పార్టీలకు చెందిన 100 మంది ఎంపీలు రాజీనామా చేస్తున్నారని... కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌, టీడీపీ నేత చంద్రబాబు, ఎన్సీపీ సారథి శరద్‌పవార్‌ కలిసి, మోడీని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఒక కధనం ప్రసారం చేసింది. వంద మంది ఎంపీలతో రాజీనామాలు చేయించి ముందస్తు ఎన్నికలు పెట్టే పరిస్థితి తేవడం ద్వారా.. ఏపీకి ప్రత్యేక హోదా వంటి అంశాల్లో మోదీ సర్కారుపై ఇప్పటికే కొన్ని వర్గాల్లో ఉన్న అసంతృప్తులను సొమ్ము చేసుకోవడమే విపక్షాల టార్గెట్‌ అని రిపబ్లిక్‌ చానల్‌ విశ్లేషించింది. దీంతో ఈ కధనం కేవలం మోడీకి దేశ వ్యాప్తంగా సానుభూతి కోసం ప్రసారం చేసింది అన్న వాదనలు అప్పుడే మొదలయ్యాయి... మోడీ ఒక్కరే దేశం కోసం పని చేస్తుంటే, మోడీని పడగొట్టటానికి విపక్షాలు అన్నీ కలిసి వస్తున్నాయి అనే ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.   ఇదిలా ఉండగా ప్రధాని మోడీ కూడా సానుభూతి కూడగట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టే కనిపిస్తోంది.  బీజేపీ 38వ ఆవిర్భావ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ...  ఓబీసీ వర్గానికి చెందిన, పేద తల్లి కుమారుడినైన తాను ప్రధాని కావడాన్ని చూసి తట్టుకోలేక పోతున్నారని... వెనుకబడిన కులాల్లో పుట్టిన వారు కూడా ఉన్నత స్థానాలకు చేరుకోగలరన్న విషయాన్ని అంగీకరించలేక పోతున్నారని మళ్ళీ సెంటిమెంట్ డ్రామా మొదలు పెట్టారు. దీంతో గతంలో తాను ఛాయ్ వాలా అని.. ఈ స్థాయికి ఎదిగానని చెప్పి సెంటిమెంట్ ను పండించి ఏకంగా ప్రధాని పదవిని అధిరోహించిన మోడీ గారు... ఇప్పుడు అదే సెంటిమెంట్ ను మరోసారి తెరపైకి తెస్తున్నారని.. మళ్లీ  ఎమోషన్ డ్రామా మొదలు పెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మీరిచ్చిన హామీలను నెరవేర్చండి బాబు అంటే.. అందరూ కలిసిపోయారు.. నేను ప్రధాని కావడం ఓర్చుకోవడం లేదని.. చిన్నపిల్లలు పితురీలు చెప్పినట్టు మాట్లాడుతున్నారని.. పేద తల్లి కొడుకు కాబట్టే సామాన్యుల బాధలు ఇంకా బాగా అర్ధమవుతాయని... సెంటిమెంట్ డ్రామాలు ఆపి మా హామీలు నెరవేర్చండి బాబూ అని మోడీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఆంద్రోడి దెబ్బకి పారిపోయిన మోడీ జీ...!

  అందరూ ఊహించిందే జరిగింది. ఏపీ ప్రత్యేక హాదా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండానే సభ నిరవధిక వాయిదా పడింది. గత మూడు వారాలుగా పార్లమెంట్ లో జరుగుతున్న డ్రామా అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్రం వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు టీడీపీ ఎంపీలు, వైసీపీ ఎంపీలు కూడా పార్లమెంట్లో పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఆఖరికి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇక అవిశ్వాస తీర్మానం పెట్టారు కదా.. ఏదో అద్భుతం జరిగిపోతుంది... కేంద్రం దిగివస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ... దాదాపు నెలరోజులైనా అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రానివ్వలేదు మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న విపక్షాలన్నీ ఏక తాటిపైకి వచ్చినా... ఆందోళన చేసినా ఉపయోగం లేకుండా పోయింది. దీనికి కూడా స్పీకర్ ఏవో కుంటి సాకులు చెప్పారనుకోండి.. వెల్ లోకి వచ్చి ఆందోళన చెబడితే చర్చకు కష్టం అని.. కౌంటింగ్ చేయలేమని నమ్మలేని సాకులు చెప్పారన్న విషయం స్పష్టంగా అర్దమవుతోంది. ఇక ఈరోజుతో పార్లమెంట్ సమావేశాలు కూడా అయిపోయాయి. అవిశ్వాస తీర్మానంపై చర్చే జరగలేదు.   దీంతో ఇప్పుడు మోడీపై ఒకటే సెటైర్లు వేసుకుంటున్నారు నెటిజన్లు. తెలుగోడి దెబ్బకి మోడీ భయపడ్డారని అంటున్నారు. అసలు మొదట్లో వైసిపీ అవిశ్వాసం నోటీసుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తాను అని చెప్పింది... అప్పటికి, ఇంకా దేశంలోని ఏ పార్టీ కూడా వైసిపీ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వలేదు... కాని, ఒక పక్క అవిస్వాసం అంటూ, మరో పక్క అదే నోటీసు పట్టుకుని విజయసాయి రెడ్డి ప్రధాని ఆఫీస్ కి వెళ్ళటంతో, వెంటనే చంద్రబాబు అలెర్ట్ అయ్యారు... వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు అని తెలుసుకుని, వెంటనే టీడీపీ వారే అవిశ్వాసం పెట్టారు... అంతే, చంద్రబాబు అవిశ్వాసం పెట్టిన గంటలో, దేశంలోని అత్యధిక విపక్ష పార్టీలు, చంద్రబాబుకి మద్దతు ప్రకటించాయి. అప్పుడే మోడీ పతనానికి మొదటి అడుగు పడిందని అన్నారు. ఇక పార్లమెంట్లో అన్నాడీఎంకే తో డ్రామాలాడించి అవిశ్వాస తీర్మానం చర్చకు రానివ్వకుండా చేశారు. ఇంకా అశ్చర్యకరం ఏంటంటే... ఇంత గోల జరుగుతున్నప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని చర్చించడం కుదరలేదు కానీ.. వాళ్లకు కావాల్సిన బిల్లులు ఆమోదించుకోవడం మాత్రం కుదిరింది. దీంతో మాకు సంపూర్ణ బలం ఉంది అంటూ పైకి మేకపోతు గాంభీర్యం చూపిస్తున్న మోడీ ఆంధ్రోడి దెబ్బకి పారిపోయారని సోషల్ మీడియాలో కామెంట్లు చేసుకుంటున్నారు. దేశంలోనే అత్యంత శక్తి వంతుడిగా పేరు పొందిన నేత.. కేవలం ఓ చిన్న అవిశ్వాస తీర్మానానికి భయపడ్డారని అనుకుంటున్నారు.

పెద్ద బాస్ బాధ్యతను చిన్న బాస్ తీసుకున్నాడా..?

  వైసీపీ అధినేత జగన్ బాధ్యతను జనసేన అధినేత పవన్  కళ్యాణ్ తీసుకున్నారా..? జగన్ తరపున పవన్ వకాల్తా పుచ్చుకున్నారా..? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న కామెంట్లు ఇవే. జగన్ బాధ్యత ఏంటీ.. పవన్ తీసుకోవడం ఏంటీ.. అసలు ఇంతకీ అంత పెద్ద బాధ్యత ఏంటబ్బా అని అనుకుంటున్నారా..? అదేనండీ జగన్ చేస్తున్న పాదయాత్ర. ప్రతి శుక్రవారం జగన్ కు హాలీడే అని తెలుసుకదా. అక్రమాస్తుల కేసులో భాగంగా ప్రతిశుక్రవారం  జగన్ కోర్టుకు వెళ్లాలి కదా. అందుకే ప్రతి శుక్రవారం పాదయాత్రకు సెలవు.   దీంతో రేపు జగన్ కోర్టుకెళ్తుంటే... పవన్ పాదయాత్ర చేస్తున్నారని అనుకుంటున్నారు ఏపీ జనాలు. ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా.. పవన్ 6న ఏపీలో పాదయాత్ర చేస్తామని పవన్ ప్రకటించారు. జాతీయ రహదారుల్లో, పలు ముఖ్య కూడళ్లలో నిర్వహిస్తామని.. పూర్తి శాంతియుత పద్ధతిలో ఢిల్లీని తాకే విధంగా నిరసన ఉంటుందని, ఈ పాదయాత్రలో జనసేన, సీపీఎం, సీపీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. దీంతో ఈ విషయంపై అప్పుడే కామెంట్లు మొదలయ్యాయి. ఎందుకంటే ఇప్పుటికే జగన్, పవన్ ఇద్దరూ కలిసిపోయారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పెద్ద బాస్ కోర్టుకు వెళితే.. ఇటీవలే పార్టనర్ అయిన చిన్న బాస్ పాదయాత్ర చేస్తున్నారని.. అదీ పార్టనర్స్ అంటే.. అలాగే ఉండాలి. అలాగే కలసి రావాలి అని సెటైర్లు వేసుకుంటున్నారు.   అంతేకాదు.. జగన్ పాదయాత్రలో ఆయన ఏ ఊరుకి వెళ్లినా.. ఎక్కడికి వెళ్లినా చంద్రబాబుపై దుమ్మెత్తిపోయడం... ఆయనపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని.. విభజన హామీలు నెరవేర్చాల్సిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని మాత్రం పల్లెత్తుమాట అనరు. ఈయనకు పార్టనర్ గా ఇప్పుడు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తయారయ్యారు. ఈయన కూడా మోదీనీ కానీ బీజేపీని కాని పల్లెత్తు మాట అనలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ రోజూ పాదయాత్రలో జగన్ రాళ్లు వేస్తూంటారు. ఈ శుక్రవారం కోర్టుకు వెళ్లాలి కాబట్టి.. ఈ వారం ఆ బాధ్యతను పవన్ కల్యాణ్ కు అప్పగించారు అని... విజయవాడలో ఒక రోజు పాదయాత్ర చేసి… జగన్ మిగిల్చిన రాళ్లను…చంద్రబాబుపై వేయనున్నారు అని అనుకుంటున్నారు. అందరూ అనుకోవడం ఏమో కానీ... చూడబోతే అది నిజంలాగే కనిపిస్తోంది. లేకపోతే ఒక్కరోజు పాదయాత్ర ఏంటీ మరీ విడ్డూరం కాకపోతే. ఇంతమంది ఇన్ని రోజులుగా పోరాటం చేస్తుంటే... పవన్ ఒక్కరోజు పాదయాత్ర చేసి మోడీగారి మెడలు వంచుతారట.. వినేవాడు వుంటే..చెప్పేవాడు ఏదైనా చెబుతాడంట అలా ఉంది...

బాబుపై కోపంతో...జగన్ కు చేరువవుతున్న టాలీవుడ్

  తెలుగు చిత్ర పరిశ్రమకు, రాజకీయాలకు చాలా అవినాభావ సంబంధాలు ఉంటాయి.  స్వర్గీయ ముఖ్యమంత్రి, నటుడు ఎన్టీరామారావు రాకీయ రంగప్రవేశంతో అది మరింత బలపడింది. అప్పటి నుండి చాలా మంది సినీ ప్రముఖలు అడపా దడపా రాజకీయ రంగ  ప్రవేశం చేస్తూనే ఉన్నారు. అంతేకాదు రాజకీయ నేతలు కూడా సినీ గ్లామర్ ను కూడా బాగానే వాడుకుంటున్నారు. ప్రజల్లో వారిపై ఉండే అభిమానానికి నాలుగు ఓట్లు ఎక్కువగా వస్తాయని వారి అంచనా. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. దానికి తోడు ఈ మధ్య ప్రత్యేక హోదా పోరాటం విషయంలో టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తెలుగు చిత్రపరిశ్రమను, హీరోలను, నటులను నిందిస్తూ.. సిగ్గులేదా.. చేవచచ్చిందా అంటూ తీవ్ర విమర్శలు చేయడంతో పెద్ద దుమారం రేగింది. దీనికి ఆజ్యం పోసినట్టుగా ఇటీవల ఓ న్యూస్ యాంకర్ కూడా ప్రత్యేక హోదా కోసం సినీ తారలు ఏం చేయరా అని ఏకంగా బూతులే తిట్టేశాడు. దీంతో చిత్ర పరిశ్రమ మొత్తం ఏకతాటిపైకి వచ్చింది. సదరు ఎమ్మెల్సీ పైన, యాంకర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.  ’ఇన్నాళ్లు మాపై ఎన్ని ఆరోపణలు, దాడులు చేస్తున్నా సహించాం, మీ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని బలిచేయాలని చూస్తే.. ఇక సహించేది లేదు. దాసరి నారాయణరావు గారే బతికుంటే పరిస్థితి మరోలా ఉండేది‘ అంటూ కొందరు నటులు హెచ్చరికలు కూడా చేశారు.   ఇదిలా ఉండగా ఇప్పుడు ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్టు... వాళ్లు నోరుజారడం... పాపం చంద్రబాబుకు పనిష్మెంట్ లా ఉంది. ఎందుకంటే...  తమను చులకనగా చూస్తున్న చంద్రబాబునాయుడి నాయకత్వంలోని టీడీపీకి ఇకపై ఎవ్వరూ సపోర్టు చేయకూడదని సినీ పెద్దలు, నటులు నిర్ణయం తీసుకున్నారట. ఇంకా అశ్చర్యకరమైన విషయం ఏంటంటే... టీడీపీకి దూరమవుతున్న చిత్ర పరిశ్రమ జగన్ కు చేరువవుతున్నట్టు తెలుస్తోంది.   సినీ పరిశ్రమలో ఉన్న దాదాపు చాలా మంది ఇప్పటికే టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. చిరంజీవి ఎలాగూ కాంగ్రెస్ లో ఉన్నారు. పవన్ ఏకంగా పార్టీనే పెట్టాడు. ఇక నందమూరి వారసత్వంలో ఫేస్ వ్యాల్యూ ఉన్న బాలకృష్ణ సీఎం చంద్రబాబు నాయడుకి వియ్యంకుడన్న సంగతి తెలిసిందే. కానీ హరికృష్ణ కుటుంబం మాత్రం పరోక్షంగా చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తూ వస్తోంది. హరికృష్ణ కు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వకపోవడం, 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని వదిలేశారన్న భావనతో వారు టీడీపీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక అక్కినేని నాగార్జున మొదట్నుంచి జగనతో సన్నిహితంగా ఉంటున్నారు. మూవీ మొఘల్, దివంగత నిర్మాత రామానాయుడు టీడీపీ తరుపున ఎంపీగా చేశారు. ఆయన అనంతరం వారి వారసులు నటడు వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారు. కాని చంద్రబాబుతో వచ్చిన విభేదాల వల్ల వీరు కూడా టీడీపీ కి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుటుంబం మొత్తం జగన్ వెంటే ఉంది. కుమారుడు విష్ణు పెళ్లితో వైఎస్ కుటుంబానికి బంధువయ్యారు మోహన్ బాబు. అప్పటి నుంచి జగన్ కు తన పూర్తి మద్ధతు ప్రకటిస్తూ వస్తున్నారు. ఇక మొన్నటి వరకు టీడీపీతో కొంత అనుబంధం కొనసాగిస్తున్న నటులు కూడా ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలతో పూర్తి తెగదెంపులు చేసుకున్నారట. వెరసి నందమూరి వంశంలోని బాలకృష్ణ, నారా హీరోలు, ఎంపీ మురళీ మోహన్ వర్గం, మినహా దాదాపు తెలుగు చిత్ర పరిశ్రమలోని చాలా మంది టీడీపీ, ముఖ్యంగా చంద్రబాబు అంటేనే మండిపడుతున్నారట. దీంతో చంద్రబాబు పై ఉన్న కోపంతో వీళ్లంతా జగన్ కు మద్దతిస్తారని.. అంతేకాదు.. అవసరమైతే ప్రచారంలోకూడా పాల్గొనే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరవకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది...

మోడీ సర్కార్ కాదు... లీకుల సర్కార్

  ఇప్పటికే నోట్ల రద్దు, జీఎస్టీ, దళితులపై దాడులు ఇలా చాలా కారణాలవల్ల దేశవ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకంగా పెరిగిపోయింది. మరోపక్క.. బ్యాంకుల కుంభకోణాలు.. వేలకు వేలు కోట్లు కుంభకోణం జరగడం.. దేశాన్ని విడిచిపెట్టి పోవడం.. వాళ్లు దేశాన్ని విడిచి పారిపోయేంత వరకూ చూసి ఆ తరువాత నోరెళ్లబెడతారు. ఇక కుంభకోణాలు వెలుగుచూశాక 'కఠిన చర్యలు తీసుకుంటాం' అని ప్రభుత్వాలు చెప్పే మాటలను నమ్మడం కూడా ఎప్పుడో మానేశారనుకోండి. వాళ్లెంత సీరియస్ గా చెప్పినా..అంతా ఉత్తిదే అని ఫిక్స్ అయిపోయారు.   ఇప్పుడు వాటికితోడు పేపర్ల లీకులు ఒకటి. నిన్న ఎస్ఎస్‌సి.. నేడు సీబీఎస్ఈ. దీంత ఇప్పుడు విద్యార్ధుల తల్లిదండ్రులు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలన్ని స్కాముల్లా మారిపోతున్నాయని జేపీ ప్రభుత్వంపై విమర్సలు గుప్పిస్తున్నారు. మరి ఏ చిన్నఛాన్స్ దొరుకుతుందా విమర్శిద్దామా అని చూసే ప్రతిపక్షాలకు మంచి పాయింట్ దొరికింది. దీంతో దొరికిందే ఛాన్స్ గా బీజేపీ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. దేశవ్యాప్తంగా 28లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సీబీఎస్ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించకపోవడం మోడీ ప్రభుత్వ వైఫల్యం చెందిందని...అసలు మోడీ సర్కార్ అని పేరు తీసేసి పేపర్ లీక్ సర్కార్ అని మార్చుకోండి అని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విటర్ వేధికగా చేసుకుని మోదీపై ఘాటైన విమర్శలు చేశారు. ‘మోదీ సర్కార్‌లో లీకులే లీకులు. డేటా లీక్. ఆధార్ లీక్. ఎస్‌ఎస్‌సీ ఎగ్జామ్ లీక్. ఎలక్షన్ డేట్ లీక్.. ఇప్పుడు సీబీఎసీఈ పేపర్ల లీక్, యాతావాతా చౌకీదార్ వీక్’ అంటూ కాంగ్రెస్ చీఫ్ సెటైర్లు వేశారు. మున్ముందు ఇంకెన్ని లీక్‌లు చూస్తామో అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాదు.. పరీక్షల సమయంలో ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలనే దానిపై ప్రధాని మోడీ 'వారియర్స్' అనే పుస్తకాన్ని రాశారు... ఇప్పుడు పేపర్ లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తు నాశనమవడంతో.. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఈ ఒత్తిడిని ఎలా అధిగమించాలో చెబుతూ.. మోడీ 'వారియర్స్-2' పుస్తకాన్ని రాస్తే బాగుంటుందని సెటైర్లు వేశారు. మొత్తానికి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు... ఇప్పటికే ప్రజల్లో ఎంతో వ్యతిరేకత మూటగట్టుకున్న బీజేపీ.. ఇప్పుడు ఈ స్కాముల వల్ల.. లీకులు వల్ల పార్టీ పరిస్థితి చాలా దారణంగా తయారైనట్టు ఉంది. మరి ఇప్పటికైనా బీజేపీ కఠిన చర్యలు తీసుకుంటుందో..లేదో..? చూడాలి.

మే 15.. బీజేపీ చాప్టర్ క్లోజ్...

  ఇప్పటికే బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది. నాలుగేళ్ల ముందు మోడీకి ఉన్న క్రేజ్ వేరు.. ఇప్పుడున్న క్రేజ్ వేరు అని చెప్పొచ్చు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే అయన పతనానికి దారితీస్తున్నాయి. జీఎస్టీ, నోట్ల రద్దు అంటూ ఎప్పుడైతే సామాన్య ప్రజల్ని ఇబ్బందులకు గురిచేశారో అప్పుడినుండే మోడీ క్రేజ్ తగ్గుతూ వచ్చింది. దానికి తోడు దళితులపై దాడులు, గో రక్షకుల పేరుతో దాడులు, వారి నియంత పాలన చూసి బీజేపీ అంటేనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. దీనికి మోడీ కంచుకోట అయిన గుజరాత్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఆ రాష్ట ఫలితాలు చాలు... మోడీపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పడానికి. అంతేకాదు నార్త్ లో అన్నిచోట్ల అధికారం చేపట్టి ఎగిరిపడుతున్న బీజేపీకి.. ఇప్పుడు ఎక్కడ ఏ ఉపఎన్నిక జరిగినా షాకుల మీద షాకులు తగులుతూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.   ఈ నేపథ్యంలో ఇప్పుడు కర్ణాటక ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారాయి. మే పదిహేనో తేదీ బీజేపీ పార్టీ చరిత్రను మలుపుతిప్పే రోజు అని చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే.. మే 12 న కర్ణాటక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఫలితాలు మే 15 న రానున్నాయి. అందుకే మే పదిహేనుతో బీజేపీ చాప్టర్ క్లోజ్ అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీనికి కారణం.... దేశవ్యాప్తంగా బీజేపీపై ప్రజల్లో అసహనం పెరిగిపోవడం.. సర్వేల్లో ఫలితాలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా రావడంతో బీజేపీ బురదలో కూరుకుపోవడం ఖాయమని తేలిపోయింది. దానికితోడు ఇటీవల ఓ సభలో తమ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప.. అవినీతిలో నెంబర్ వన్ అని ప్రకటించి  అమిత్ షా నోరుజారి బుక్కయ్యాడు.   మరోవైపు సిద్దరామయ్య బీజేపీని తలదన్నే వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు. బీజేపికి తగ్గ రాజకీయాలు చేస్తూ… వారి ఓటు బ్యాంక్ కే గండిపెట్టారు. పైగా.. కర్ణాటక సొమ్మును … కేంద్రం ఉత్తారాదికి ఇస్తుందనే ప్రచారాన్ని కూడా సిద్ధరామయ్య జోరుగా చేస్తున్నారు. ఈ తరుణంలో మోదీ వచ్చి.. ప్రచారం చేసినా ప్రయోజనం ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే.. ఏపీ ప్రత్యేక హోదా అంశం మరోఎత్తు. కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రజల్లో బీజేపీ వ్యతిరేక సెంటిమెంట్ పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ చేస్తున్న అన్యాయం చూసి అక్కడి తెలుగువారు మండిపడుతున్నారు. దీంతో ఉత్తరాది నేతల ఆధిపత్యాన్ని సహించని కన్నడ సంఘాలు.. తెలుగు రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రచారం చేస్తున్నారు. మరో వైపు.. ఏపీ నుంచి కూడా.. కొంత మంది … సోషల్ మీడియాలో… బీజేపీకి వ్యతిరేకంగా కన్నడలో ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ చూస్తే.. కర్ణాటకలో బీజేపీ గెలవడం కష్టం అని చెప్పవచ్చు. కర్ణాటకలో ఓడిపోతే... ఈ సంవత్సరం ఆఖరిలో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గెలుపు అసాధ్యమే. అందుకే మే 15తో బీజేపీ భవిష్యత్తు ఏంటో తెలిసిపోతుందన్న  వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో...

అర్ధరాత్రి రమ్మన్నారు....మీ పాపం అందరికీ పంచుతారా...!

  ఇప్పటికే టీడీపీపై విమర్శలు గుప్పిస్తూ రచ్చ లేపుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా మరో బాంబు పేల్చారు. ఏపీ ప్రత్యేక హోదాపై, విభజన హామీలపై చంద్రబాబు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సమావేశానికి పవన్ ను కూడా ఆహ్వానించారు చంద్రబాబు. కానీ తాను మాత్రం ఈ సమావేశానికి రానని చెప్పేశారు పవన్. అంతేకాదు దీనిపై ఓ లేఖ విడుదల చేస్తూ మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. తమ పార్టీ హాజరు కాకపోవడానికి గల కారణాలను ఆయన వివరించారు.   "ఏదైనా పనికి సంకల్పం బలంగా ఉంటేనే ఫలితం గొప్పగా  ఉంటుందంటారు మన  పెద్దలు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన అఖిలపక్షం సమావేశానికి అటువంటి సంకల్పమే లోపించింది. సోమవారం సంధ్య ముగిసేవేళ, నిశిరాత్రి వేళ.. మంగళవారం సమావేశానికి రా..రమ్మని అనుచరులతో ఆయన కబురు పంపారు. తొలుత ఈ సమావేశం అఖిల సంఘాలకు మాత్రమే అని ప్రచారం చేసి, చివరికి పనిలో పనిగా రాజకీయ పార్టీలను కూడా కలిపేశారు. ఈ సమావేశం నిర్వహణను కేవలం 'తెలుగుదేశం రాజకీయ ఎత్తుగడ'గానే జనసేన భావిస్తోందని అన్నారు.   అఖిల పక్ష సమావేశం ఇప్పుడు కాదు, మూడేళ్ల క్రితం పెట్టాల్సిందని... తిలా పాపం తలా పిడికెడు అనే పద్ధతిలో మీ పాపంలో అందరికీ భాగం పంచుతారా.. తన పాపాలను అందరికీ పంచేందుకే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిందని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలను వంచించే ఏ చర్యనైనా జనసేన వ్యతిరేకిస్తుందని..హోదాతో రగిలిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను మభ్యపెట్టేందుకే చంద్రబాబు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారని.. అందుకే తాము అఖిల పక్ష సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. మొత్తానికి మరోసారి పవన్ చంద్రబాబుకు రివర్స్ అయ్యారు. మరి ఇప్పటికే పవన్ పై మండిపడుతున్నటీడీపీ నేతలు ఇప్పుడు పవన్ లేఖపై ఎలా స్పందిస్తారో చూడాలి..

పోలవరంలో తప్పులు లేవు... ప్రతిపక్షాలు నోరుమూసుకోవాల్సిందే...

  పోలవరం తెలుగు ప్రజల జీవనధార అని.. పోలవరం నిర్మించడం నా జీవిత లక్ష్యం... అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందు దొరికినప్పుడల్లా చెబుతూనే ఉంటారు. మరోపక్క ప్రతిపక్షపార్టీ నేతలేమో పోలవరం ప్రాజెక్ట్ పెద్ద ఫ్రాడ్ అని.. ఈ ప్రాజెక్ట్ లో ఎన్నో అవినీతులు జరిగాయని వారికి టైం చిక్కినప్పుడల్లా ఊదరగొట్టేస్తుంటారు. దీనికి తోడు ఈమధ్య నాలుగేళ్లు వారితో కలిసున్న పవన్ కూడా పోలవరం పై అభ్యంతరాలు వ్యక్తం చేయడం.. మీరు ఏ తప్పూ చేయనప్పుడు శ్వేత పత్రం విడుదుల చేయండి అని అనడంతో ఉన్న సందేహాలు కాస్త ఎక్కువయ్యాయనే చెప్పొచ్చు. ఇవన్నీ ఒకటైతే కేంద్రం నుండి నిధుల విషయంలో తలకాయనొప్పులు. ఇలా అన్ని దిక్కుల నుండి విమర్శలు, ఇబ్బందులు వస్తున్నా... చంద్రబాబు మాత్రం ఏదోలా పోలవరాన్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.   అయితే ఇప్పుడు తాజాగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబుకు కాస్త ఊరట కలిగించే ఘటన చోటుచేసుకుంది. పోలవరం ప్రాజెక్టు పనుల తీరుపై కేంద్ర ప్రభుత్వం 2017లో మసూద్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఆకమిటీ నివేదిక పూర్తయింది. పోలవరం ఆర్అండ్ఆర్ పై సంతృప్తి వ్యక్తం చేసింది. ఇక ఈ నివేదికలో... నవయుగ కంపెనీ రంగంలోకి వచ్చాక పోలవరం పనులు వేగవంతమయ్యాయని... రోజుకు 4,800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరుగుతున్నాయని మసూద్ కమిటీ తన నివేదికలో తెలిపింది. అంతేకాదు తమ నివేదికలో అనుకున్న లక్ష్యాన్ని అనుగుణంగా పోలవరం పనులు జరుగుతున్నాయని.. కాంక్రీట్ పనుల్లో కూడా చాలా నాణ్యత కనిపిస్తోందని తెలిపింది. నవయుగ కంపెనీ అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా చేరుతుందని అన్నారు. ఏది ఏమైనా పోలవరంపై వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ నివేదిక రావడం నిజంగా చంద్రబాబుకు ఊరట నిచ్చే అంశమే. మొత్తానికి ఈ నివేదిక వల్ల  ఇప్పటివరకూ అవాకులు చవాకులు పేల్చిన నేతలందరూ ఇకపై నోరు మూసుకోవాల్సిందే.

బీజేపీ కుట్ర బయటపెట్టిన శివాజీ... ఇదే ఆపరేషన్ ద్రవిడ..

  హీరో శివాజీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎప్పటినుండో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటినుండో ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని శివాజీ డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన ఈరోజు ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం చేస్తున్న కుట్ర గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ పట్ల ఒక జాతీయ పార్టీ ఆపరేషన్ చేపట్టిందని...ఆపరేషన్ పేరు ద్రవిడ అందులో భాగమే ఏపీ గరుడ... తమిళనాడు, కేరళకు సంబంధించి ఆపరేషన్ రావణ...కర్నాటకలో ఆపరేషన్ కుమార అని అన్నారు. 2017 సెప్టెంబర్లోనే ఓ అజ్ఞాతవ్యక్తి ద్వారా ఈ విషయం నాకు తెలిసింది.. ఈ ఆపరేషన్ కు 4,800 కోట్లు కేటాయించారు..అందులో కొన్ని డిస్పాచ్ అయ్యాయి... 2019 ఎన్నికలే జాతీయ పార్టీ నిర్వహించే ఈ ఆపరేషన్ అని అన్నారు. రాష్ట్రం మీద వాళ్ల అధిపత్యం ఎలా సాధించాలనుకుంటున్నారో..ప్రతి విషయానికి నాదగ్గర ఆధారం ఉంది.. అంతేకాదు.. ఈ ఆపరేషన్ సంధాన కర్తగా ఓ రాజ్యాంగ శక్తి ఉన్నాడు అని కూడా చెప్పారు.   ఇదిలా ఉండగా..  ఇంకో విషయం కూడా శివాజీ బయటపెట్టారు. ఓ పక్కా ప్లాన్ ప్రకారం..రేపు అవిశ్వాసం తీర్మానం చర్చకు వస్తుంది..కేంద్ర ప్రభుత్వం తరపున ఆరుగురు వ్యక్తులు మాట్లాడుతారు.. అందులో ముగ్గురు ఇంగ్లీషులో, మరో ముగ్గురు హిందీలో మాట్లాడతారని చెప్పారు. ఈ ఆరు మంది కూడా అనర్గళంగా ధడ్ ధడ్ లాడిస్తారని... ఏపీకి అంతా చేసేశామని చెప్తారని.. వీరంతా మాట్లాడిన తర్వాత అవిశ్వాసాన్ని వ్యతిరేకించే వారు చేయెత్తాలని స్పీకర్ అడుగుతారని, అనుకూలంగా ఉండేవారు చేయెత్తాలని అడుగుతారని చెప్పారు. చివరకు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఉండేవారే ఎక్కువగా కనిపిస్తున్నారంటూ... అవిశ్వాసం వీగిపోయిందని ప్రకటిస్తారని తెలిపారు. రేపు సభలో జరగబోయేది ఇదే అని తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు శివాజీ వ్యాఖ్యలపై చర్చలు మొదలయ్యాయి. మరి ఇంత గట్టిగా చెబుతున్నాడంటే సమాచారం పక్కాగానే ఉండోచ్చని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి శివాజీ చెప్పినట్టే జరుగుతుందా.. లేక బీజేపీ ఏదైనా మార్పులు చేస్తుందా.. చూడాలి..

పవన్ ఇలా చేస్తాడని ఎన్నడూ అనుకోలేదు...

  గత నాలుగేళ్ల నుండి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య చాలా సన్నిహత సంబంధం ఏర్పడింది. ఈ నాలుగేళ్లలో పవన్ వైసీపీ పై విమర్శలు గుప్పించడమే కానీ.. ప్రభుత్వాన్ని పెద్దగా టార్గెట్ చేసిన దాఖలాలు లేవు. ఎప్పుడైనా ఏదైనా సమస్యపై పవన్ ప్రభుత్వాన్ని నిలదీసిన.. ఈ పని చేయాలని డిమాండ్ చేసినా.. వెంటనే చంద్రబాబు ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునేవారు. అలా ఇద్దరి మధ్య చాలా కోఆర్డినేషన్ ఉండేది. అంతలా పవన్ ను చంద్రబాబు నమ్మారు. అయితే ఉన్నట్టుండి పవన్ యూటర్న్ తీసుకొని టీడీపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు.   జనసేన పార్టీ ఆవిర్భావం రోజు నుండి ఈరోజు వరకూ పవన్ టీడీపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇక పవన్ చేసిన విమర్శలపై స్పందించిన టీడీపీ నేతలు పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు అయితే పవన్ పై నిప్పులు చెరిగారు. తాజాగా నేషనల్ మీడియాతో మాట్లాడిన పవన్... మరోసారి టీడీపీపై, చంద్రబాబుపై విమర్సలు గుప్పించారు. దీంతో ఈ ఉదయం ఎంపీలతో సుదీర్ఘ టెలీ కాన్ఫరెన్స్  నిర్వహించిన ఆయన.. పవన్ వ్యాఖ్యలపై స్పందించి తీవ్రంగా ఖండించినట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీని, తన కుటుంబంపై నిరాధార ఆరోపణలతో ఇంత డ్యామేజ్ చేస్తారని ఎన్నడూ అనుకోలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారట. వివిధ కాంట్రాక్టుల్లో కమీషన్లు తీసుకుంటున్నామని పవన్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన కుమారుడు లోకేష్ పై పవన్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని మరోసారి తేల్చి చెప్పారు.   తన స్వార్థ ప్రయోజనాల కోసం మరొకరి ప్రయోజనాల కోసం పవన్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, పవన్ వంటి వ్యక్తి ఓ విమర్శ చేసేముందు నిజానిజాలను తెలుసుకోవాలని.. తెలుగు ప్రజలు ఎంతో అభిమానించే నటుల్లో ఒకరైన పవన్ ఇటువంటి విమర్శలు చేస్తే, నమ్మేవారు కొందరైనా ఉంటారని, అది ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేస్తుందని అన్నారు. మొత్తానికి పవన్ ను ఇంతలా నమ్మిన చంద్రబాబుకు.. పవన్ ఇలా చేస్తాడని కనీసం కలలో కూడా అనుకోని ఉండరు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న పవన్ ఇప్పుడే ఏకంగా చంద్రబాబుపై, ఆయన తనయుడిపైనే డైరెక్ట్ గా విమర్శలు గుప్పించడంతో చంద్రబాబు బాగానే ఫీలవుతున్నట్టున్నారు.

అందుకే లోకేశ్ ను విమర్శించా....

  ఎవ్వరూ ఉహించని విధంగా గుంటూరు జనసేన ఆవిర్భావ సభలో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ టీడీపీ పై విమర్శలు గుప్పించి ఏపీ రాజకీయ పరిణామాలనే మార్చేశారు. అసలు పవన్ కళ్యాణ్ టీడీపీ పై యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏంటి.. ఇన్ని రోజులు టీడీపీని విమర్సించని పవన్ కళ్యాణ్ టీడీపీపై ఈ రేంజ్ లో విమర్శలు గుప్పించడానికి కారణం ఏంటీ అని.. ఆలోచనపడ్డారు. ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేశ్ పై అవినీతి ఆరోపణలు గుప్పించారు.. ఇసుక నుంచి  మట్టి వరకు  నేల తల్లిని అమ్ముకుంటున్నారు..  ఇదంతా లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నా మీద్రుష్టికి రాలేదా? ఒకవేల వస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు. లేకపోతే మీకు తెలిసే అన్నీ చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అలాగే తమిళనాడుకు చెందిన టీటీడీ మాజీ బోర్డ్ మెంబర్ శేఖర్ రెడ్డికి లోకేష్ కు సబంధాలున్నాయని దీనికి మీరు ఏం సమాధానం చెబుతారంటూ నిలదీశారు పవన్.   దీంతో అసలు పవన్ స్ట్రాటజీ ఏంటని అనుకుంటున్నారు. ఇక పవన్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ ఎదురుదాడికి దిగింది. పవన్ వెనుక బీజేపీ ఉందని కొంతమంది వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ పై తాను అవినీతి ఆరోపణలు చేయడానికి కారణం ఏంటో పవన్ చెప్పాడు. ఓ న్యూస్ ఆఫీస్ కు వెళ్లిన పవన్ ను ఒక ముఖ్యమంత్రి కొడుకుపై మీ లాంటి సెలబ్రిటీ అటువంటి ఆరోపణలు చేశారు.. మీ దగ్గరేమన్నా.. ఆధారాలున్నాయా అని అడుగగా.. దీనికి పవన్ సమాధానం చెప్తూ.. లోకేష్ పై ఉన్న ఆరోపణలు అందరి దృష్టిలో ఉన్నవేనని.. వాటినే నేను మళ్లీ గుర్తు చేశానని అన్నారు. అందరి దృష్టిలో ఉండి నీ దృష్టికి రాలేదా అని అందరూ అడుగుతారనే తాను ఖచ్చితంగా మాట్లాడాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చారు. మరి శేఖర్ రెడ్డితో తనకు పరిచయాలు ఉన్నాయని అంటున్నారు అది ఎంత వరకూ నిజమో చెప్పాలి అని అన్నారు...దానికి లోకేశ్..  శేఖర్ రెడ్డికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు కదా అని అడుగగా.. అంటే.. ఇలాంటివి కూడా ఉన్నాయి ఒకసారి చూసుకోండి అంటూ చెప్పాను అంతే అంటూ చాలా తేలిగ్గా తేల్చారు.