పవన్ కళ్యాణ్ పై జన సైనికుల అగ్రహం.. ఎందుకో తెలుసా ?
రాజకీయాల్లో ఉండాలంటే రాజకీయం తెలియాలి ... అంటే, అయినా ఇదేం స్టేట్మెంట్, రాజకీయాలు తెలియని వారు రాజకీయాల్లో ఎందుకుంటారు, ఎలా ఉంటారు .. హౌ .. అని మనం అనుకోవచ్చును కానీ, రాజకీయాలు అంటే కేవలం జెండాలు, ఎజెండాలు మాత్రమే కాదు. ఇంకా చాలా కళలు తెలిస్తేనే కానీ, రాజకీయాల్లో రాణించ లేరని ఆధునిక రాజకీయ పండితులు ఘోషిస్తున్నారు. ప్రైవేటుగా పాఠాలు కూడా చెపుతున్నారు. అప్పుడెప్పుడో సత్యకాలంలో గిరీశం మాస్టారు, ‘ఒపీనియన్స్ మార్చుకోలేని వాడు, పోలిటిషియన్ కాలేరు’ అని ఓ సింపుల్ చిట్కా చెప్పి వదిలేశారు. కానీ , ఇప్పుడు అదొక్కటే సరిపోదని ఆధునిక గిరీశం సార్లు చెపుతున్నారు. ఇప్పడు మనం ఆనాటి సత్యకాలంలో లేమని గుర్తు చేస్తున్నారు. సో ..ఈ రోజు రాజకీయాలలో రాణించాలంటే ... వాళ్ళు సినిమా స్టార్లు అయినా సరే, జస్ట్ గ్లామర్ ఉంటే సరిపోదు, గ్రామరు కూడా తెలిసుండాలి. దానితో పాటుగా,నోరుండాలి, ఆ నోట్లో ఫినాయిల్ సీసాలు కాదు పీపాలు పోసి కడిగినా పోనంత బూతుండాలి..అందులో మీ ప్రత్యర్ధి, వైసేపీ బూతు భాషకు బ్రాండ్ అంబాసిడర్ అయినప్పడు మీకు బూతు బాష బాగా వచ్చుండాలి.. అంటూ ఆయనకు అయన అభిమానులు, అనుచరులు పాఠాలు చేపితున్నారు. ..ట.
ఇంతకీ విషయంవిషయం ఏమంటే, ఏపీలో ఎన్ని రాజకీయ పార్టీలున్నా, బూతు పాండిత్యంలో మాత్రం వైసీపీదే ఫస్ట్ ప్లేస్. ఆడ మగ తేడా లేకుండా, బ్రహ్మాండగా బూతులు మాట్లాడగల నాయకులు. ఎమ్మెల్యేలు, మంత్రుల కొరత లేని పార్టీ, రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మీద ఏదైనా ఉందంటే, అది వైసీపే ఒక్కటే, ఈవిషయంలో ఎవరికీ అనుమానం అవసరం లేదు. ఈ మధ్య, తెలుగు దేశం పార్టీ నాయకులు కూడా వైసీపీతో పోటీ పడే ప్రయత్నం చేస్తున్నారు కానీ, అయినా, వైసీపీ స్థాయికి ఇంకా చేరలేదు.
అదలా ఉంటే, బూతులు నేర్చుకోవయ్యా.. బాబు .. అంటూ పవన్ కళ్యాన్ అభిమానులు ఆయన వెంట పడుతున్నారు. సినిమాల్లో పవర్ స్టార్ అనిపించుకున్న పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చాలా చాలా వెనకబడి పోయారని, పొలిటికల్ గురువులు కూడా, పవన్ అప్డేట్ కావాలనే అంటున్నారు.
ఒకప్పదు ఏమో కానీ, ఈ రోజు రాజకీయ నాయకులు చాలావరకు సంస్కారహీనంగా మాట్లాడడమే రాజకీయ సంస్కారం అనుకుంటున్నారు. దిగజారి దూషణలకు దిగాజరుతున్నారు. ముఖ్యంగా వైసేపీ నాయకులు అయితే, ప్రత్యర్ధి పార్టీల నాయకులనే, కాదు, నాయకుల కుటుంబ సభ్యులను కూడా అసభ్యంగా దూషించి, ఆనందం పొందుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు అంతటి నాయకుడే, అసెంబ్లీలో కళ్ళ నీళ్ళు పెట్టుకునే స్థితి వచ్చిందంటే, వైసీపీ ఏ స్థాయికి దిగజారిందో వేరే చెప్పనక్కర లేదు.
అలాగే, పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కూడాడా వైసేపీ నాయకులు దిగజారుడు భాషలో దుర్భాషలాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయినా పవన్ కళ్యాణ్ మాత్రం, వైసీపీ నాయకులకు దీటుగా, వారికి అరమయ్యే భాషలో సమాధానం ఇవ్వడం లేదనేది, జనసేన నాయకులు, కార్యకర్తలు ఆయన పై చేస్తున్న అభియోగం. నువు తమలపాకుతో ఒకటంటే..నే తలుపు చెక్కతో రెండంటా’ అనేలా రాజకీయ భాష ఉండాలని లేదంటే, కష్టమని పవన్ పై కాస్తంత కోపగించుకుంటున్నారు.
జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణపై బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు దారుణమైన భాషతో విరుచుకుపడ్డారు. అవి ప్రసారం చేసిన టీవీ చానళ్లపై కేసులు పెట్టారు. ఇంత జరిగిన తర్వాత కూడా పవన్ కల్యాణ్ బాలినేని గారూ మీ అనుచరులకు పద్దతులు నేర్పండి అంటూ ప్రకటన జారీ చేశారు. ఇదే జనసైనికులకు ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు.అందుకే పవన్ కళ్యాణ్ అర్జెంటుగా బాతులు బాగా బట్టి పట్టాలని అంటున్నారు.