టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా... భారత్ బ్యాటింగ్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాస్ ఆలస్యంగా ప్రారంభమవుతోంది. భారత్, సౌతాప్రికా జట్లు రెండూ ఇప్పటివరకు ఒక్కసారి కూడా వరల్డ్ గెలవలేదు. దీంతో చారిత్రక విజయం కోసం ఇరు జట్లూ తలపడుతున్నాయి. అయితే, భారత్‌కు కాస్త అనుకూలత ఉంది.
గతంలో రెండుసార్లు (2005, 2017) ఫైనల్ ఆడిన అనుభవంతో పాటు, సొంతగడ్డపై భారీ సంఖ్యలో అభిమానుల మద్దతు లభించనుంది. ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటికే ఈ వేదికపై మూడు మ్యాచ్‌లు ఆడింది. మరోవైపు, దక్షిణాఫ్రికా ఈ టోర్నీలో ఇక్కడ ఆడటం ఇదే తొలిసారి.
భారత్: షెఫాలీ, మంధాన, రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్, దీప్తిశర్మ, రిచా ఘోష్, అమన్‌జ్యోత్, రాధా యాదవ్, క్రాంతి, శ్రీచరణి, రేణుక సింగ్. సౌతాఫ్రికా: వోల్వార్ట్, బ్రిట్స్, అనెకె, సున్ లూస్, కాప్, సినాలో, డెర్క్‌సెన్, ట్రయాన్, క్లర్క్, ఖాక, ఎంలబా