మహిళల వరల్డ్ కప్ విజేత టీమ్ ఇండియా.. హర్మన్ ప్రీత్ సేన విజయనాదం
posted on Nov 2, 2025 @ 12:59AM
ఉత్కంఠ పోరులో టీమిండియాదే విజయం మహిళల వరల్డ్ కప్ ఫైనల్ లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత మహిళల క్రికెట్ జట్టు విశ్వ విజేతగా నిలిచింది. పైనల్ మ్యాచ్ లో భారత అమ్మాయిలు అదరగొట్టేశారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో ప్రత్యర్థి జట్టుపై సంపూర్ణ ఆధిపత్యం కనబరిచారు. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి దక్షిణాఫ్రికా ముందు 299 విజయలక్ష్యాన్ని ఉంచింది. అయితే దక్షిణాఫ్రికా ఛేదనలో చతికిలబడింది.
45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 52 పరుగుల తేడాతో విజయం సాధించి ప్రపంచ కప్ ను ముద్దాడింది. ఈ విజయంతొ భారత మహిళల క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభమైందనే చెప్పాలి. 1993లో భారత జట్టు వరల్డ్ కప్ విజేతగా నిలిచిన తరువాత ఇండియాలో క్రికెట్ రూపురేకలు ఎలా మారిపోయాయో, క్రికెట్ కు ఆదరణ ఎంతగా పెరిగిందో తెలిసిందే. ఇప్పుడు మహిళల క్రికెట్ లొ టీమ్ ఇండియా విజయం దేశంలో మహిళల క్రికెట్ కు మరింత ఆదరణ పెంచుతుందనడంలో సందేహం లేదు.
సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయంతో ఆత్మవిశ్వాసంతో ఫైనల్ లోకి ప్రవేశించిన హర్మన్ ప్రీత్ సేన.. దక్షిణాఫ్రికాపైనా అద్భుత ఆటతీరు ప్రదర్శించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియాకు అద్భుత ఆరంభాన్నిచ్చింది ఓపెనింగ్ జంట స్మృతి మంధాన, ఫెపాలి వర్మ. షెపాలి వర్మ 78 బంతుల్లో ఏడు ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసింది. ఇక స్మృతి మంధానా 45 పరుగులు చేసింది. వీరిరువురూ తొలి వికెట్ కు 104 పరుగుల భాగస్వామ్యం సాధించారు. ఆ తరువాత ఆల్ రౌండర్ దీప్తి శర్మ వంద శాతం స్ట్రైక్ రేట్ తో 58 బంతుల్లో 58 పరుగులు చేసింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమ్ ఇండియా 398 పరుగులు చేసింది. 399 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 45.3 ఒవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికా స్కిప్పర్ లారా వోల్వార్ట్ ఒంటరి పోరాటంతో 101 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో దీప్పి శర్మ 5 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా పతనాన్ని శాశించింది. దీంతో భారత మహిళల జట్టు తొలి సారి వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ రాణించిన షెపాలీవర్మ ప్లేయర్ ఆఫ్ ది ప్లేయర్ గా నిలవగా టోర్నీ మొత్తం స్థిరంగా రాణించిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దక్కింది.