కేట్స్ లా చూపించలేం!
posted on Sep 24, 2012 @ 5:38PM
కేట్స్ టాప్ లెస్ ఫోటోలు ఒక్క రోజులో ప్రపంచాన్ని ఊర్రూతలూగించాయ్. బ్రిటన్ రాజుగారి పెళ్లాం కొంగుచాటు అందాల్ని చూడాలని ఆరాటపడని మగాడు ఈ భూమ్మీదే లేడన్నంతగా జనం విరగబడి చూశారు. అమ్మో.. కేట్ అందాలకు ఇంత ఫాలోయింగా అనుకుంటూ తోటి మోడలింగ్ ముద్దుగుమ్మలు బుగ్గలుకూడా నొక్కుకున్నారుకూడా. అయితే మరి.. మీరు కూడా రవికెలు తీసిపారేసి విపరీతమైన ఫాలోయింగ్ పెంచేసుకోవచ్చుగా అని అడిగితే మాత్రం గుటకలు మింగుతున్నారు.
వాళ్ల అందాలు కేట్స్ అందాలంత బాగుండవన్న విషయం తెలుసుగాబట్టి చూపించుకోవడం బాగుండన్న విషయాన్ని బాహాటంగానే ఒప్పుకుంటున్నారు. మాయజేసో, మతలబు చేసో మేం ఉన్న అందాలకు కాస్త అదనపు హంగుల్ని జోడించుకుని ఎప్పట్నుంచో తిప్పలు పడుతుంటే.. ఇప్పుడిలా కేట్ తన అందాల్ని ప్రపంచానికి కనువిందుచేసేస్తే మా గతి ఏం కానూ అంటూ మూతి ముఫ్పైఆరు వంకర్లు తిప్పుకుంటున్నారు. హేట్సాఫ్ టు కేట్ అని మనస్ఫూర్తిగా అభినందించేవాళ్లుకూడా ఎక్కువగానే ఉన్నారు లేండి.