మహేష్ అంటే ఇష్టమే కానీ..!
posted on Sep 24, 2012 @ 5:29PM
మహేష్ బాబు ఇష్టపడి చేస్తానంటే వద్దంటానికి ఏ అమ్మాయికి మాత్రం ఏం కారణముంటుంది చెప్పండి.. కానీ.. తమన్నా మాత్రం నాకిప్పుడస్సలు టైం లేదు అనేసిందని టాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయ్. “అవును మరి ఆల్రెడీ లైన్లో ఉన్న హీరోలు, ప్రొడ్యూసర్లతో బిజీగా ఉన్నప్పుడు సూపర్ స్టార్ ఎంతగా ఇష్టపడ్డా చేయలేని పరిస్థితి నాది అంటూ తమ్మూ గట్టిగా చెప్పడంలోకూడా ఓ పాయింటుంది మరి” అంటూ లేత తమలపాకులాంటి ఈ హీరోయిన్ని ఇష్టపడేవాళ్లు వెనకేసుకొస్తున్నారు. “వర్క్ లోడ్ మరీ ఎక్కువైతే లేలేత చివురులాంటి చిన్నది వాడిపోదూ” అంటూ ఫ్యాన్స్ కళ్లెర్రజేస్తున్నారు. సో.. తమన్నా కావాలంటే ఎంత పెద్ద స్టారైనా సరే.. కొంతకాలం పాటు వెయిట్ చేయక తప్పదు గాక తప్పదు.. ఎందుకంటే క్యూలైన్ అంత పెద్దగా ఉంది.. మరి..