బ్రాడ్ పిట్ తో ఐష్ కి ఒకేనా ?

 

బాలీవుడ్ అందాల సుందరి ఐశ్వర్య రాయ్ బ్రాడ్ పిట్ ఒక హాలీవుడ్ సినిమాలో నటించాబోతోందని బాలీవుడ్ వర్గాల్లో తాజా చర్చ నడుస్తోంది. జీవితంలో ఒక్కసారైనా ఐష్ తో చేయాలని బ్రాడ్ పిట్ తెగ కళలు కంటున్నట్లు హాలీవుడ్ వర్గాల బోగట్టా. గతంలో ట్రాయ్ అనే చిత్రంలో బ్రాడ్ పిట్ సరసన నటించే అవకాశం వచ్చినప్పుడు ఐష్ నో చెప్పేసింది. ఓ పిల్లకు తల్లైన తరువాతైనా తనతో పనిచేసే అవకాశం దక్కుతుందేమోనని బ్రాడ్ పిట్ ఆశతోనే ఉన్నాడని హాలీవుడ్ లో గట్టిప్రచారం జరుగుతోంది. ఐష్ ను ఎలాగైనా ఒప్పించేందుకు బ్రాడ్ పిట్ ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడట. ప్రపంచంలోనే ఐశ్వర్య వంటి అందగత్తె లేదని, వర్సటైల్ నటిగా కూడా ఐష్ కి చాలామంచి పేరు సంపాదించుకుందని 'ది పింక్ పాంథర్', 'ప్రోవోకడ్' లాంటి చిత్రాల్లో ఐష్ నటన చూసిన దగ్గర్నుంచీ తను ఆమెకు పిచ్చ ఫ్యాన్ గా మారిపోయానని లైఫ్ లో ఒక్కసారైనా తనతో చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నానని బ్రాడ్ పిట్ కన్పించినవారికల్లా చెప్పుకుని సంతోషపడుతున్నాడట. ఇంతకీ ఐష్ బ్రాడ్ పిట్ కోరికను ఈసారైనా తీరుస్తుందో లేదో ....

telugu one news

Teluguone gnews banner