శ్వేతామీనన్ లేబర్ సీన్స్

మళయాళ నటి శ్వేతామీనన్ ప్రసవ వేదన పడుతోంది. చకచకా ఓ కెమెరా టీమ్ డెలివరీ రూమ్ లోకి ఎంటరయ్యింది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం టకటకా లైటింగ్ అరేంజ్ మెంట్స్ చేసేసుకున్నారు. శ్వేతామీనన్ పాపకి జన్మనిచ్చేటప్పుడు పడ్డ ప్రసవవేదనని షూట్ చేశారు. ఇదంతా సినిమాకోసం చేసిన నటనకాదు. నిజ జీవితంలో జరిగిన వాస్తవం. శ్వేత భర్త అనుమతితో, ఆస్పత్రివర్గాల అనుమతితోనే ఇదంతా జరిగింది. నిజజీవితంలో జరిగిన సన్నివేశాన్ని చిత్రీకరించిన సినిమా క్రూ శ్వేత తర్వాతి చిత్రంలో ఈ దృశ్యాల్ని ఉంచబోతున్నారట. బిడ్డ కడుపులోపడ్డ దగ్గర్నుంచి తల్లికి ఎదురయ్యే అనుభవాల సారాంశమే కొత్త సినిమా అని తనే చెబుతోంది. అందుకే నిజజీవితంలోని అనుభవాల్ని చిత్రీకరించి సినిమాకి అనుగుణంగా వాడుకునేందుకు శ్వేతామీనన్ తోపాటు ఆమె భర్తకూడా ఒప్పేసుకున్నాడట. నటనలో జీవిస్తున్న శ్వేతకి నిజంగా ఆస్కార్ కూడా సరిపోదేమో అని ఆమె అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

 

Teluguone gnews banner