Beat the heat and the Bills

        With summer already blaring in March it’s time to get the Air conditioners serviced and have them run non-stop. But this could also lead to high electricity bills which you may want to reduce. Fortunately, with the clever use of blinds, curtains and other window treatments can help keep your house cool and keep your bills in check. The Department of Energy, USA reports that smart management of window coverings can reduce heat gain by up to 77 percent. And as a bonus these same practices can reduce heat loss in the winter. Here are some energy-saving suggestions from them which could also be helpful to us.   Awnings. Window awnings can reduce solar heat gain by up to 65 percent on south-facing windows and 77 percent on west-facing windows, according to the DOE. For best results choose awnings in light colors that reflect more sunlight. In the winter, you can roll up retractable awnings to let the sun warm up your house. Curtains and drapes. On summer days, keep your curtains closed, especially on windows that get direct sunlight. The ability of curtains and drapes to reduce heat gain depends on fabric type (closed or open weave) and color. Studies show that medium-colored draperies with white-plastic backings can reduce heat gain by 33 percent, according to the DOE. Hang the curtains as close to the window as possible. For maximum effect, install a cornice at the top of the draperies, seal the draperies at the sides and overlap them in the middle using Velcro or tape. Shades. When properly installed, window shades are one of the simplest and most effective ways to save energy but they need to be drawn all day to work. Mount them as close to the glass as possible within the window frame, creating a sealed space. Reversible shades that are white on one side and dark on the other can be switched with the seasons with the white side reflecting the sun in the summer and the dark side absorbing it in the winter. Quilted roller shades and Roman shades with several layers of fiber batting act as both insulation and an air barrier and are more effective than other soft window treatments. Blinds. Because of the horizontal slats, it's difficult to control heat loss through interior window blinds, although they do offer some flexibility. Unlike shades, you can adjust the slats to control light and ventilation. When completely closed, highly reflective blinds can reduce heat gain by around 45 percent, says the DOE. They can also be adjusted to block and reflect direct sunlight onto a light-colored ceiling, which diffuses the light without much heat or glare. Reflective films. Window films are best for homes in regions with long cooling seasons. Silver, mirror-like films typically are more effective than colored, more transparent films and east- and west-facing windows benefit most because of their greater potential for heat gain. Keep in mind that reflective films are tricky to clean and impair outside visibility. Since we still need to AC it is best to buy more energy efficient air conditioners and which come with energy saver modes and use them. Source: Consumer Reports News:

ఆ సమయంలో బయటకు వస్తే అంతే సంగతులు!

  సాయంత్రం ఐదు గంటలకి రోడ్డు మీదకి వచ్చామంటే చాలు... అంగుళం కూడా రోడ్డు కనిపించకుండా, వాహనాలతో కిటకిటలాడిపోతుంటుంది. ఇలాంటి సమయంలో కాలుష్యం కాస్త ఎక్కువగానే ఉంటుందని తెలుసు. కానీ వాస్తవం అంతకంటే భయంకరంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. సాధారణంగా కాలుష్యాన్ని గుర్తించే పరికరాలు రోడ్డు పక్కన ఏర్పాటు చేస్తారు. కానీ కారులోనో, బస్సులోనో పరిస్థితి దీనికంటే మరింత భిన్నంగా ఉండవచ్చు. ఉక్కిపోయి ఉండే ఆ వాతావరణంలో కాలుష్యం మరింత తీవ్రంగా ఉండవచ్చు. అమెరికాలోని డ్యూక్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులకు ఇదే అనుమానం వచ్చింది. దాంతో వారు మనిషి ఊపిరితిత్తులను పోలిన పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరాన్ని ఓ 30 కారులలో బిగించి చూశారు.   పరికరాలను బిగించన కార్లు మంచి రద్దీగా ఉన్న సమయాలలో ఊరిలో తిరిగాయి. ఊహించినట్లుగానే బయట ఉన్న కాలుష్యంకంటే కారులో ఉన్న కాలుష్యం దాదాపు రెండు రెట్లు ఎక్కువగా కనిపించింది. కారు వేగం, కిటికీలు తీసి ఉంచడం... లాంటి పరిస్థితులేవీ పెద్దగా ప్రభావం చూపలేదు. మొత్తంగా, కారులో ఉండేవారు బయటకంటే అధికకాలుష్యాన్ని అనుభవిస్తున్నట్లు తేలింది.   కారులో కాలుష్యం అధికంగా ఉండటమే కాదు... అందులోని రసాయనాలు కూడా మరింత విషపూరితంగా ఉంటున్నట్లు తేలింది. ఈ రసాయనాల కారణంగా శరీరంలో oxidative stress అనే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఊపిరితిత్తుల సమస్యలు, గుండెజబ్బులు, కేన్సర్, నాడీసంబంధ వ్యాధులు లాంటి రకరకాల సమస్యలకి ఈ oxidative stress దారితీస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.... ఈ కాలుష్యం మన కణాలను, వాటిలోని DNAను సమూలంగా ప్రభావితం చేస్తాయి.   అదండీ విషయం! ప్రపంచంలోని నగరాలు చాలావరకు ఎలాంటి ప్రణాళికా లేకుండా కనిపిస్తాయి. ప్రత్యామ్నాయ రహదారులు లేకపోవడం, ఆఫీసులన్నీ ఒకేచోట ఉండటం, రద్దీకి తగినట్లుగా రోడ్లని వెడల్పు చేయకపోవడం, పబ్లిక్ ట్రాన్స్పోర్టుకి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటి సవాలక్ష సమస్యలు ఈ నగరాలలో కనిపిస్తాయి. ఫలితంగా జనం కాలుష్యంతో విలవిల్లాడిపోతున్నారు.   ఈ పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు కొన్ని మార్గాలు లేకపోలేదు. రద్దీ తక్కువగా ఉండే సమయంలో బయటకు వెళ్లే ప్రయత్నం చేయడం, వీలైతే మన ఆఫీసు పనివేళలను రద్దీ తక్కువగా ఉండే సమయంలో ఎంచుకోవడం, రద్దీ తక్కువగా ఉండే మార్గాలలో ప్రయాణం చేయడం, రద్దీగా ఉండే రోడ్లకి కాస్త దూరంగా నివసించే ప్రయత్నం చేయడం.... లాంటి జాగ్రత్తలతో ఈ కాలుష్యాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయవచ్చు. - నిర్జర.    

సాహస బాలలు వీరే

ఎదుటి వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు సాధ్యమైనంతలో వారికి సాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం.. తాను మనిషినే అన్న విచక్షణ.. మానవత్వం గురించి తెలిసే వయసులో ఇలాంటి ఆలోచన రావడం సహజం.. కానీ ఆటపాటలతో, అల్లరితో మానవత్వం వంటి పెద్ద పెద్ద పదాలు తెలియని బుజ్జాయిలు సాయం చేస్తే.. సాయం చేస్తూ ప్రాణాలు కోల్పోతే.. నిజంగా గొప్ప విషయం కదా..!! అందుకే ఆపదలో చిక్కుకున్న ఇతరులను రక్షించేందుకు, తమ ప్రాణాలను సైతం తెగించి నిస్వార్థంతో, ధైర్యసాహసాలు ప్రదర్శించిన బాలబాలికలను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం జాతీయ సాహస బాలల పురస్కారాలను ప్రవేశపెట్టింది. ఈ అవార్డులను పొందిన బాలలకు ఒక మెడల్‌నూ, సర్టిఫికేట్‌నూ, క్యాష్‌ అవార్డ్‌తో కలిపి ప్రదానం చేస్తారు.   'భారత్‌' అవార్డ్‌ గెలుపొందినవారికి గోల్డ్‌ మెడల్‌నూ, మిగిలిన ఇతర అవార్డులను పొందినవారికి సిల్వర్‌ మెడల్స్‌నూ అందిస్తారు. ఇవే కాక ఈ అవార్డులను పొందినవారికి నగదుపురస్కారంతో పాటూ, వారి చదువు కోసం ప్రోత్సాహకాలను, ఉపకార వేతనాలనూ ప్రభుత్వం అందిస్తుంది. వీరి నుంచి స్పూర్తి పొంది మిగిలిన చిన్నారులు కూడా సాయానికి.. సాహసానికి ముందుకొచ్చేలా చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన? ఎప్పటిలాగే ఈ సారి కూడా 18 మంది బాలబాలికలు సాహస బాలల అవార్డుకు ఎంపికయ్యారు. వీరిలో ఒక్కొక్కొరిది ఒక్కో నేపథ్యం. వీరిందరిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన నజియా సాహసం ప్రత్యేకమైనది. అసలు ఆమె ఏం చేసింది..? ఎందుకు ఆమె సాహస బాలల అవార్డుకు ఎంపిక చేశారు.. చూస్తే.. ఈ పద్దెనిమిదేళ్ల అమ్మాయి తొలి నుంచి ఆగ్రా వీధుల్లో సాహసబాలికగా పేరు తెచ్చుకుంది. రెండేళ్ల క్రితం ఈమె చేసిన సాహసం దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.   ఎప్పటిలాగే కాలేజ్‌కు వెళుతున్న నజియాకు ఎక్కడ్నుంచో హెల్ప్.. హెల్ప్ అంటూ ఓ ఆడపిల్ల అరుపులు వినిపించాయి. ఆ కేకలు నజియా ఒక్కదానికే కాదు చుట్టూ ఉన్న ఎంతోమంది చెవులను తాకాయి. కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఆపదలో ఉన్న అమ్మాయి హిందూ మతానికి చెందిన అమ్మాయి. అప్పటికే ఆ కాలనీలో హిందువులకు, ముస్లింలకు పడేది కాదు. రోజు ఏదో ఒక చోట తగవులు జరుగుతూనే ఉండేవి. అందుకే హిందూ మతానికి చెందిన ఆ అమ్మాయి ఆపదలో ఉన్నా చూసీ చూడనట్లు వదిలేశారు. కానీ నజియా అలా ఆలోచించలేదు.. ఇద్దరు కిడ్నాపర్లు ఆ బాలికను మోటార్ సైకిల్‌పైకి లాగుతున్నారు. ఆ క్షణంలో ఏమీ ఆలోచించకుండా వెంటనే ఆ బాలిక చేయి పట్టుకుని లాగుతూ.. కొద్దిసేపు వారితో పెనుగులాడింది. ఈ లోపు వీరి కేకలకు జనం గుమిగూడుతుండటంతో కిడ్నాపర్లు తోకముడిచారు. ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి తమ కూతురిని కాపాడిన నజియాకు ఆ బాలిక కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న నాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ నజియాను అభినందించి సాహస బాలికగా అవార్డు అందజేశారు.   ఇది జరిగిన కొద్దిరోజుల తర్వాత అఖిలేష్‌కు నజియా నుంచి ఓ ట్వీట్ వచ్చింది. ఆగ్రాలోని మంటోలా ఏరియాలో ఓ గ్యాంబ్లింగ్ బ్యాచ్ మట్కా సెంటర్‌ను నిర్వహిస్తున్నారని.. ఇది చూసిన తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని.. అలా చేసినప్పటి నుంచి పోలీసులు, గ్యాంబర్లు కలిసి తనను వేధిస్తున్నారని.. తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తున్నారని అఖిలేష్‌కు ట్వీట్ చేసింది. వెంటనే స్పందించిన అఖిలేష్ వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అలా ఈ ముఠా ఆటకట్టించే క్రమంలో సంఘవిద్రోహ శక్తులకు ఎదురొడ్డి నిలిచి ఎందరిలోనో స్పూర్తి నింపింది. అందుకే ఆమను సాహసబాలిక అవార్డుతో పాటు ప్రతిష్టాత్మక "భారత్" అవార్డుకు ఎంపిక చేసింది కేంద్రప్రభుత్వం. సో.. ఫ్రెండ్స్‌ చిన్నపిల్లలమని.. ఏం చేయలేనివారమని అనుకోకుండా ఈ నజియా లాగే ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ.. అన్యాయాన్ని ఎదుర్కొందామా మరి. నేత్రావతి ఎం. చవాన్ కర్నాటకలోని బాగల్‌కోట్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల నేత్రావతి ఎం చవాన్‌ నీటిలో మునిగిపోతున్న ఇద్దరు బాలలను కాపాడేందుకు తన ప్రాణాలను త్యాగం చేశారు. తొలుత చెరువులో మునిగిపోతున్న 16 ఏళ్ల బాలుడిని నేత్రావతి కాపాడింది. అయితే పదేళ్ల వయసున్న మరో బాలుడిని రక్షించే క్రమంలో అతనితో పాటు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరణానంతరం ఆమెను గీతా చోప్రా అవార్డుకు ఎంపిక చేశారు. ఏడవ తరగతి తర్వాత చదువుకు స్వస్తి పలికిన నేత్రావతి ఇంటి వద్ద తన సోదరుల ఆలనా పాలనా చూస్తున్నారు.   కరణ్ బీర్ సింగ్: పంజాబ్‌లోని అమృత్‌సర్ నగరానికి సమీపంలోని గాగువాల్‌ గ్రామానికి చెందిన 12 ఏళ్ల కరణ్‌బీర్ సింగ్‌ది మరో సాహసగాధ. ఒకరోజు అతను ప్రయాణిస్తున్న స్కూలు బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. బస్సు వేగంగా నీటిలో మునిగిపోతుంది... ఆలస్యం చేస్తే చాలా మంది ప్రాణాలు కోల్పోతారని గ్రహించిన కరణ్.. వెంటనే తన సోదరితో సహా తోటి వారిని బయటకు లాగి వారి ప్రాణాలను కాపాడాడు. ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది విద్యార్ధులు చనిపోయారు   ఎఫ్ లాల్‌చంద్మా: తన స్నేహితుల్ని కాపాడే ప్రయత్నంలో లాల్‌చంద్మా ప్రాణాలు కోల్పోయారు. తన ముగ్గురు స్నేహితులతో కలిసి పరీక్షలు రాసి వస్తూ పక్కనే ఉన్న ట్లావుంగ్ నదికి వెళ్లాడు లాల్‌. అయితే అనుకోకుండా వారు నదిలో పడిపోవడంతో లాల్‌చంద్ నీటిలో దూకి ప్రవాహాంలో కొట్టుకుపోయాడు. గాలింపు చర్యల తర్వాత వీరి మృతదేహాలు కనుగొనబడ్డాయి. చిన్నప్పటి నుంచి కార్డియాలజిస్ట్‌ కావాలన్నది లాల్‌చంద్ కల.   బెస్త్వాజాన్ పీలాంగ్: పశ్చిమ ఖాసీ కనుమలకు దగ్గరలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన పీలాంగ్ తన తమ్ముడిని అగ్నిప్రమాదం బారి నుంచి రక్షించాడు. ఒకరోజు వంటగదిలో అన్నదమ్ములిద్దరూ ఉండగా ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. చూస్తుండగానే అగ్నికీలలు ఇంటి పైకప్పును తాకాయి. పైకప్పు ఊడిపోయి తమ్ముడి మీద పడిపోతుండగా దానికి అడ్డుపడి సోదరుడిని బయటకు విసిరేశాడు పీలాంగ్.   మమతా దాలై: గతేడాది ఏప్రిల్‌లో ఒడిషాలోని కేంద్రపారా జిల్లాలో 6 సంవత్సరాల మమతా దాలై తన స్నేహితురాలు అశాంతితో కలిసి చెరువులో స్నానానికి వెళ్లింది. ఇద్దరు స్నానం చేస్తుండగా ఒక మొసలి అశాంతిపై దాడి చేసింది. ఈ సమయంలో తన ప్రాణాలను తాను రక్షించుకోవడానికి బదులుగా మొసలి పట్టు నుంచి స్నేహితురాలిని కాపాడేందుకు పోరాడి ఆమె ప్రాణాలను రక్షించింది.   సెబాస్టియన్ విన్సెంట్: కేరళలోని అల్లెప్పీకి చెందిన సెబాస్టియన్ విన్సెంట్ తన స్నేహితుడు అభిజిత్‌తో కలిసి సైకిల్‌ మీద రైల్వే ట్రాక్‌పై వెళుతుండగా.. అభిజిత్‌ కిందపడిపోయి.. లేచి నడవలేకపోయాడు.. దూరం నుంచి రైలు వస్తోన్న శబ్ధం.. కానీ అభిజిత్ ‌లేవలేకపోతున్నాడు. రైలు అతి దగ్గరకు వచ్చేస్తోంది.. ప్రమాదాన్ని పసిగట్టిన విన్సెంట్ వెంటనే మిత్రుడిని పక్కకు లాగి అతన్ని కాపాడాడు.   లక్ష్మీ యాదవ్: చత్తీస్‌గడ్‌ రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన లక్ష్మీ యాదవ్ ‌తన స్నేహితులతో మాట్లాడుతూ ఉండగా ముగ్గురు ఆగంతకులు బైక్‌పై వచ్చి ఆమెను అపహరించుకుపోయారు. జన సంచారం లేని ప్రాంతంలో లక్ష్మీపై అత్యాచారయత్నానికి పాల్పడుతుండగా.. ఆమె వారి ప్రయత్నాన్ని అడ్డుకుంది. వారిపై పిడిగుద్దులు కురిపించి.. బైక్‌ కీని దూరంగా విసిరేసి.. దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తన మానాన్ని కాపాడుకోవడంలో ఆమె చూపిన అసమాన ధైర్య సాహసాలకు పోలీసులు లక్ష్మీ యాదవ్‌ని అభినందించారు.   సమృద్ధి సుశీల్ శర్మ: గుజరాత్‌కు చెందిన 16 ఏళ్ల సమృద్ధి శర్మ ఒంటరిగా ఉన్న సమయంలో ఒక ఆగంతకుడు ఇంట్లోకి ప్రవేశించి అపహరించే ప్రయత్నం చేశాడు. మెడపై కత్తి ఉన్నప్పటికీ ఆమె అతని నుంచి తప్పించుకునేందుకు పోరాడింది. ఊహించని ఈ సంఘటనతో ఆ ఉన్మాది కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అయినప్పటికీ ఆమె తన ప్రాణాల కోసం పోరాడింది. ఈ ప్రయత్నంలో సమృద్ధి ఎడమ చేతి ఉంగరం వేలు పూర్తిగా దెబ్బతినగా ఇప్పటి వరకు రెండు సర్జరీలు చేయించుకుంది.   జోనున్‌త్లుంగా: మిజోరమ్‌‌కు చెందిన జోనున్‌త్లుంగా ఎలుగుబంటి దాడి నుంచి తన తండ్రిని రక్షించాడు. ఒక రోజు కూరగాయల కోసం జోనున్ తన తండ్రితో కలిసి దగ్గరలోని అడవికి వెళ్లారు. ఆ సమయంలో ఎలుగుబంటి జోనున్‌ తండ్రిపై దాడి చేసి ముఖాన్ని తీవ్రంగా గాయపరిచింది. ఈ సమయంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జోనున్ తన దగ్గర ఉన్న చిన్న చిన్న.. ఆయుధాలతోనే ఎలుగుబంటితో పోరాడి తన తండ్రిని కాపాడాడు.   పంకజ్ సెమ్వాల్: ఉత్తరాఖండ్‌లోని తెహ్రీకి చెందిన పదహారేళ్ల పంకజ్ సెమ్వాల్ చిరుతపులి బారి నుంచి తన తల్లితో పాటు అక్క, చెల్లి, తమ్ముడిని రక్షించాడు. చింగై వాంగ్సా: నాగాలాండ్‌ మోకోక్చుంగ్ గ్రామానికి చెందిన వాంగ్సా అగ్నికీలల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని కాపాడాడు.   నదాఫ్ ఎజాజ్ అబ్దుల్ రవూఫ్: మహారాష్ట్రకు చెందిన రవూఫ్ నీటిలో మునిగిపోతున్న మహిళ ప్రాణాలను రక్షించే ప్రయత్నంలో తన ప్రాణాలను కోల్పోయారు.   పంకజ్ కుమార్ మహంతా: ఒడిషాకు చెందిన 15 ఏళ్ల పంకజ్ కుమార్ మహంతా బైతారని నదిలో మునిగిపోతున్న ముగ్గురు మహిళలను రక్షించేందుకు నీటిలోకి దూకి.. వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చాడు.   రాజేశ్వరి చాను: మిజోరానికి చెందిన రాజేశ్వరి చాను ఇంఫాల్ నదిలో శిధిలమైన వంతెన నుంచి పడిపోయిన తల్లీబిడ్డను రక్షించే ప్రయత్నంలో చనిపోయింది. వంతెన నుంచి జారిపడ్డ తల్లీబిడ్డను కాపాడిన రాజేశ్వరి పైకి వస్తుండగా.. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో ప్రవాహాంలో కొట్టుకుపోయింది. ఆమె మరణంపై ఆగ్రహించిన గ్రామస్తులు ఆ వంతెనను తగులబెట్టారు. నేటీకి కూడా అక్కడి ప్రభుత్వం తగులబడిన వంతెన స్థానంలో మరో బ్రిడ్జిని నిర్మించలేదు. వీరితో పాటుగా నాగాలాండ్‌కు చెందిన మన్షా, శాగ్పోన్ కొన్యాక్, యోక్నీ తదితరులు తమ ధైర్య సాహసాలతో సాహసబాలల అవార్డుకు ఎంపికయ్యారు.  

ప్రేమ సంపాదించాలంటే!

చాలారోజుల క్రితం ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్లిద్దరూ మొదట్లో బాగానే ఉండేవారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ అన్నయ్య తీరు మారిపోయింది. మనిషి చాలా కఠినంగా తయారయ్యాడు. లోకం తీరు చూసీ చూసీ అతని మనసే చెదిరిపోయిందో, పరాజయాలు అతని ఆత్మవిశ్వాసాన్నే దెబ్బతీసాయో... కారణం ఏదైతేనేం, అన్నయ్య చాలా ముభావంగా మారిపోయాడు. అన్నయ్య తీరు చూసి తమ్ముడికి చాలా కష్టంగా తోచింది. ఇదివరకులా అతను తన అన్నయ్యతో మనసు విప్పి మట్లాడలేకపోతున్నాడు, చనువుగా ఉండలేకపోతున్నాడు. అలాగని తనని చిన్నప్పటి నుంచి తండ్రిలా కాచుకుని ఉన్న అన్నయ్యకి దూరంగానూ ఉండలేకపోతున్నాడు. దీనికి పరిష్కారం ఏమిటా అని తమ్ముడు తెగ ఆలోచించాడు. చివరికి తన ఊరి చివర ఉన్న ఒక స్వామీజీ దగ్గరకు వెళ్లాడు. స్వామీజీతో తన గోడంతా చెప్పుకొన్నాడు తమ్ముడు. ‘స్వామీ! తమరు మందే ఇస్తారో, మంత్రమే వేస్తారో, తాయత్తే కడతారో... ఏదో ఒకటి చేసి మా అన్నదమ్ములు ఇరువురి మధ్యా బంధం బలపడేలా చేయండి స్వామీ!’ అని వేడుకున్నాడు. తమ్ముడి మాటలను సావధానంగా విన్నారు స్వామీజీ. ఆ తర్వాత కాసేపు ఏదో ఆలోచించారు. చివరికి- ‘మీ అన్నయ్య మనసు గెల్చుకునేందుకు ఒక ప్రత్యేకమైన తాయత్తుని రూపొందించాలి. ఆ తాయెత్తుని చేసేందుకు కావల్సిన వస్తువుని తేవడం నీ వల్ల కాదు,’ అన్నారు.  ‘అంతమాట అనకండి. మా అన్నయ్య అభిమానాన్ని తిరిగి పొందడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధమే!’ అన్నాడు తమ్ముడు. ‘సరే! అయితే నాకు ఆ తాయెత్తులోకి, బతికి ఉన్న పులి మీసాన్ని తీసుకురావాలి. తేగలవా!’ అని అడిగాడు స్వామీజీ. ‘ప్రయత్నించి చూస్తాను!’ అంటూ ఇంటికి బయల్దేరాడు తమ్ముడు. కానీ పులి మీసం అంటే మామూలు విషయమా! ఆలోచించగా ఆలోచించగా అతనికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే కోడి కూర వండుకుని సమీపంలోని అడవికి వెళ్లాడు. అక్కడ ఒక గుహలో ఎప్పటినుంచో పులి నివసిస్తోందని అతను వింటూ వస్తున్నాడు. నిదానంగా ఆ గుహ సమీపానికి వెళ్లి, తాను తెచ్చిన ఆహారాన్ని అక్కడ ఉంచాడు. తమ్ముడు పొదల్లో దాక్కొని చూస్తుండగా, గుహలోని పులి బయటకు వచ్చి సుష్టుగా ఆ ఆహారాన్ని తినేసి లోపలకి వెళ్లిపోయింది. దాంతో తమ్ముడు మర్నాడు కూడా కోడికూర వండుకుని అక్కడకు చేరుకున్నాడు. ఇలా ఒకో రోజూ గడిచేకొద్దీ పులి అతని ఆహారానికి అలవాటు పడింది. కొన్నాళ్లకి అతని అడుగుల చప్పుడుకే బయటకి వచ్చి కూర్చోవడం మొదలుపెట్టింది. మరికొన్నాళ్లకి కాస్త ముందుగానే బయటకి వచ్చి అతని కోసం ఎదురుచూడసాగింది. ఇలా ఓ మూడు నెలలు గడిచేసరికి అతనికి పులి దగ్గరకి వెళ్లి దాని ముందర ఆహారాన్ని ఉంచేంత ధైర్యం కలిగింది. నిదానంగా అతను చేయి వేసి నిమిరినా కూడా సహించేంత చనువు ఏర్పడింది. ఇలా మరో మూడు నెలలు గడిచిపోయాయి. ఇక తన పథకాన్ని అమలు చేయాలసిన రోజు వచ్చేసిందనుకున్నాడు తమ్ముడు. ఆ రోజు ఎప్పటిలాగే పులిని నిమురుతూ చటుక్కున దాని మీసాన్ని ఒకటి కత్తిరించేశాడు. పులి మీసాన్ని సాధించిన గర్వంతో తమ్ముడు పరుగుపరుగున స్వామీజీ దగ్గరకు చేరుకున్నాడు. ‘స్వామీజీ మీరు కోరిన వస్తువుని సాధించాను. మరీ నేను అడిగిన తాయత్తుని వెంటనే ఇస్తారా!’ అని అడిగాడు. స్వామీజీ, తమ్ముడు తీసుకువచ్చిన పులి మీసాన్ని ఎగాదిగా చూశాడు. వెంటనే చటుక్కున దాన్ని అగ్నిగుండంలో పడేసి- ‘ఇక దీని ఉపయోగం లేదులే!’ అనేశాడు. స్వామీజీ చేష్టలకు తమ్ముడు మ్రాన్పడిపోయాడు. ‘అదేంటి స్వామీ! మీరు అడిగారని నేను ఎంతో శ్రమకి ఓర్చి ఈ పని చేశాను. చివరికి నా ప్రయత్నాన్ని బూడిదచేసిపారేశారే!’ అని బాధగా అడిగాడు. ‘నేను అడిగానని ఒక క్రూర జంతువునే నువ్వు మచ్చిక చేసుకున్నావు. దాని ఇష్టాఇష్టాలను గమనిస్తూ, ఒకో అడుగే ముందుకు వేస్తూ.... దాని మనసు గెలుచుకున్నావు. అలాంటిది ఒక మనిషి మనసుని గెల్చుకోలేవా. నీ అహాన్ని కాస్త పక్కన పెట్టి నేర్పుగా నీ అన్నయ్య మనసుని గెల్చుకోలేవా! మనసుని గెల్చుకునేందుకు కావల్సిన ఓర్పు, పట్టుదల నీకు ఉన్నాయి. నీ అన్నయ్యని గెల్చుకునే మందు నీలోనే ఉంది. ప్రయత్నించి చూడు!’ అని చిరునవ్వుతో బదులిచ్చారు స్వామీజీ! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.

Life is wonderful if you know how to live

      In Conversation with God   We found this interesting and life changing piece of information circulating on the net and we thought that we should share this with you. A must read for all those who have constant issues and how God responds to them.   Me- I can’t find free time. Life has become hectic.   God : Activity gets you busy. But productivity gets you free.   Me :why has life become complicated now?   God : Stop analyzing life. Just live it. It makes it complicated.   Me : Why are we then constantly unhappy?   God : Worrying has become your habit. That’s why you are not happy.   Me: why do good people always suffer?   God : Diamond cannot be polished without friction. Gold cannot be purified without fire. Good people go through trials, but don’t suffer. With that experience their life becomes better, not bitter.   Me : You mean to say such experience is useful?   God : Yes. In every term, Experience is a hard teacher. She gives the test first and the lessons afterwards.   Me : Because of so many problems, we don’t know where we are heading…   God : If you look outside you will not know where you are heading. Look inside. Eyes provide sight. Heart provides d way.   Me : Why  does failure hurt more than moving in the right direction?   God : Success is a measure as decided by others. Satisfaction is a measure as decided by you.   Me : In tough times, how do you stay motivated?   God : Always look at how far you have come rather than how far you have to go. Always count your blessing, not what you are missing.   Me : What surprises you about people?   God : When they suffer they ask, “why me?” When they prosper, they never ask “Why me?”   Me : How can I get the best out of life?   God : Face your past without regret. Handle your present with confidence. Prepare for the future without fear.   Me : One last question. Sometimes I feel my prayers are not answered.   God : There are no unanswered prayers.  Keep the faith and drop the fear.  Life is a mystery to solve, not a problem to resolve. Trust me.   Life is wonderful if you know how to live.

రాత్రివేళ త్వరగా తింటే ఎంత లాభమో!

  ప్రపంచం మారిపోయి ఉండవచ్చు. మనం జీవించే విధానమూ మారిపోయి ఉండవచ్చు. కానీ పెద్దలు చెప్పిన మంచి మాటలకి మాత్రం ఎప్పటికీ రోజులు చెల్లిపోవు. అందుకు ఉదాహరణగా రాత్రిపూట ఆహారం గురించి పెద్దలు చెప్పే మాటల గురించే చెప్పుకోవచ్చు. ‘రాత్రివేళ మనం తినే ఆహారం పడుకునే సమయానికల్లా అరిగిపోయేలా ఉండాల’న్నది పెద్దల మాట. అంటే కనీసం రాత్రి ఎనిమిదింటికల్లా తినేయాలన్నమాట. ఇదెంత ఆరోగ్యకరమో ఒక పరిశోధన రుజువుచేస్తోంది చూడండి!   పెన్సిల్వేనియాకు చెందిన పరిశోధకులు... ఆలస్యంగా ఆహారం తినడానికీ అనారోగ్యానికీ మధ్య ఏమన్నా సంబంధం ఉందేమో తెలుసుకోవాలనుకున్నారు. అందుకోసం కొంతమంది అభ్యర్థులను ఎంపికచేసి వారికి వేర్వేరు అలవాట్లను సూచించారు. మొదటి బృందంలో ఉన్నవాళ్లు ఉదయం ఎనిమిదిగంటల నుంచి రాత్రి ఏడుగంటల లోపు ఆహారం తీసుకోవాలని సూచించారు. రెండో బృందంలోని వారిని మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల వరకూ ఆహారం తీసుకోవచ్చని చెప్పారు. నిద్రపోయే సమయాలు మాత్రం, అభ్యర్థులందరికీ ఒకేలా ఉండేలా జాగ్రతత్తతీసుకున్నారు.   ఒక ఎనిమిదివారాలపాటు సాగిన ఈ పరిశోధనతో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఆహారం తినే సమయాన్ని బట్టి మన శరీరంలోని జీవక్రియలు వేర్వేరుగా ఉండటాన్ని గమనించారు. ఆలస్యంగా తిన్నప్పుడు ఆహారంలోని కొవ్వు, శరీరానికి ఎక్కువగా అందుతున్నట్లు తేలింది. శరీరం పీల్చుకునే ఆక్సిజన్కంటే వదులుతున్న కార్బన్డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్నట్లు బయటపడింది. శరీరంలోని ఈ ఆక్సిజన్, కార్బన్డైఆక్సైడ్ల మధ్య నిష్పత్తిని Respiratory quotient అంటారట. ఈ నిష్పత్తి ఎక్కువగా ఉంటే, శరీరం హానికారక పదార్థాలనే ఎక్కువగా స్వీకరిస్తోందని అర్థం.   ఆలస్యంగా తినడం వల్ల శరీరం ఆహారాన్ని భిన్నంగా స్వీకరిస్తోందని అర్థమైపోయింది. దీని వల్ల శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి, గుండె పనితీరు, కొవ్వు శాతం, గ్లూకోజు నిల్వలు... అన్నింటి మీదా ప్రతికూల ప్రభావం ఉన్నట్లు గమనించారు. అంతేకాదు! పగటివేళ ఆహారానికి అలవాటుపడితే, మనలో ఆకలిని కలిగించే ghrelin అనే హార్మోను కూడా పగటివేళే చురుగ్గా పనిచేస్తోందని తేలింది. అలాగే పొట్ట నిండుగా ఉండే భావనని కలిగించి, చిరుతిళ్లకు దూరంగా ఉంచే leptin అనే హార్మోను అదుపులో కనిపించింది.   ఒక్కమాటలో చెప్పాలంటే- రాత్రి ఆలస్యం కాకుండానే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, అధికబరువు వంటి సమస్యల నుంచి కూడా త్వరగా దూరం కావచ్చునని అంటున్నారు. ఈ చిన్నపాటి చిట్కాలను పాటిస్తే ఆరోగ్యంలో చాలా మార్పులు స్పష్టంగా వచ్చితీరతాయని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. - నిర్జర  

20 Daily Habits to make you Rich

      Whenever we see the rich and famous we always wondered what is that they do to become rich. In a radio interview, best-selling author Tom Corley talked about the differences between the habits of the rich vs. those of the not so rich. Here’s a list of things the rich do to which makes them what they are!   1. 80% of wealthy are focused on accomplishing some single goal. 2. 67% of wealthy write down their goals. 3. 81% of wealthy maintain a to-do list. 4. 86% of wealthy believe in life-long educational self-improvement 5. 86% of wealthy simply love to read 6. 88% of wealthy read 30 minutes or more each day for education or career reasons 7. 63% of wealthy listen to audio books during commute to work 8. 63% of wealthy parents make their children read 2 or more non-fiction books a month 9. Only 33% of wealthy watch more than 1 hour of TV every day 10. Only 6% of wealthy watch reality TV 11. 84% of wealthy believe good habits create opportunity luck 12. 76% of wealthy believe bad habits create detrimental luck 13. 70% of wealthy eat less than 300 junk food calories per day. 14. Only 23% of wealthy gamble. 15. 44% of wealthy wake up 3 hours before work starts 16. 74% of wealthy teach good daily success habits to their children 17. 70% of wealthy parents make their children volunteer 10 hours or more a month 18. 80% of wealthy make ‘Happy Birthday” calls 19. 79% of wealthy network 5 hours or more each month 20. 76% of wealthy exercise aerobically 4 days a week. Rich Habits – The Daily Success Habits of Wealthy Individuals by Tom Corley

Sleep for a Healthy Lifestyle

      Studies tell is that it is critical for adults to seek treatment for a sleep illness and aim for 7 to 9 hours of sleep each night in order to maintain a healthy lifestyle. Three new studies show just how critical it is for adults to seek treatment for a sleep illness and aim for seven to nine hours of sleep each night in order to maintain a healthy lifestyle.   One study of 2,240 adults is the first to examine the link between obstructive sleep apnea (OSA) and mortality in Asians. Results show that all-cause mortality risk was 2.5 times higher and cardiovascular mortality risk was more than 4 times higher among people with severe OSA. The results are consistent with previous studies in the U.S. and other countries. Another study of 2,673 patients in Australia found that untreated OSA is associated with an increased risk of motor vehicle crashes in very sleepy men as well as near-misses in men and women. Participants with untreated OSA reported crashes at a rate three times higher than the general community. That last study examined the relationship between sleep duration and self-rated health in Korean adults. Results show that short sleep duration of 5 hours or less per day and long sleep duration of 9 hours or more per day was associated with poor self-rated health. The results add weight to recent data emphasizing the importance of adequate sleep in physical and mental health. All three of the studies are in the Oct. 15 issue of the Journal of Clinical Sleep Medicine, which is published by the American Academy of Sleep Medicine. The AASM reports that at least 12 to 18 million adults in the U.S. have untreated obstructive sleep apnea, which involves the repetitive collapse of the upper airway during sleep. OSA is a serious sleep illness that is associated with an increased risk of high blood pressure, heart disease, diabetes, depression and stroke. The most effective treatment option for OSA is CPAP therapy, which helps keep the airway open by providing a stream of air through a mask that is worn during sleep.   So most of us adults need about seven to eight hours of nightly sleep to feel alert and well rested.

మనిషి విలువ ఎంత

ఓ కుర్రవాడికి హఠాత్తుగా సందేహం వచ్చింది. ఆ సందేహం అతన్ని నిలవలనీయలేదు, కూర్చోనీయలేదు. ‘మనిషి విలువ ఏమిటి?’ అన్నదే అతని సందేహం. తన ప్రశ్నకి జవాబు తాతయ్య దగ్గరే ఉంటుందనిపించింది ఆ కుర్రవాడికి. వెంటనే తాతయ్య దగ్గరకి పరుగుపరుగున వెళ్లాడు. ‘తాతయ్యా! తాతయ్యా! మనిషి విలువ, మనిషి విలువ అంటూ ఉంటారు కదా! అసలు మనిషి విలువ ఏమిటి?’ అని అడిగాడు.   కుర్రవాడి ప్రశ్నకి తాతగారు ఏమీ మాట్లాడలేదు కానీ చిరునవ్వుతో తన గదిలో ఉన్న బీరువాలోంచి ఒక రాయిని తీసి కుర్రవాడి చేతిలో పెట్టారు. ‘ఈ వీధిలో ఉన్న దుకాణాల దగ్గరకి వెళ్లి, ఈ రాయి విలువ ఏమిటో ఒకొక్కరినీ అడిగి చూడు. కానీ పొరపాటున అమ్మవద్దు,’ అన్నారు.   ఎర్రగా తళతళా మెరిసిపోతున్న ఆ రాయిని తీసుకుని కుర్రవాడు వీధిలోకి బయల్దేరాడు. ముందుగా అతనికి ఓ పండ్ల దుకాణం కనిపించింది. దుకాణంలోకి వెళ్లి ఆ దుకాణదారుడికి తన దగ్గర ఉన్న రాయిని చూపించి ‘దీన్ని తీసుకుని మీరేం ఇవ్వగలరు,’ అని అడిగాడు. పండ్ల దుకాణదారుడు ఆ రాయిని ఎగాదిగా చూసి ‘ఓ ఐదు డజన్ల యాపిల్స్ ఇస్తాను,’ అని గొప్పగా చెప్పాడు.   ఆ తరువాత కుర్రవాడు ఓ కూరగాయల దుకాణంలోకి ప్రవేశించాడు. తన దగ్గర ఉన్న రాయిని చూపించి ‘ఈ రాయికి బదులుగా మీరేం ఇవ్వగలరు?’ అని అడిగాడు. దానికి ఆ దుకాణదారుడు ‘నేను ఓ బస్తా బంగాళదుంపలు ఇచ్చేందుకు సిద్ధం,’ అని చెప్పాడు.   తన రాయికి పండ్లు, కూరగాయల దుకాణాల దగ్గర అంతగా విలువ లభించడం లేదనుకున్నాడు కుర్రవాడు. దాంతో దగ్గరలో ఉన్న ఓ నగల దుకాణంలోకి వెళ్లాడు. దుకాణంలో కుర్రవాడు చూపించిన రాయిని చూడగానే నగల వర్తకుడు డంగైపోయాడు. ‘ఈ రాయికి బదులుగా వంద గ్రాముల బంగారం ఇచ్చేందుకు సిద్ధం,’ అనేశాడు. నగలవర్తకుడి మాటలకి కుర్రవాడు తెగ ఆశ్చర్యపోయాడు. తన తాతగారు ఇచ్చిన ఆ రాయి ఏమంత తీసిపారేయదగింది కాదనిపించింది అతనికి. దాంతో వాళ్లనీ వీళ్లనీ అడిగే బదులు ఓ రత్నాల వర్తకుడి దగ్గరకు వెళ్లాలనుకున్నాడు. దగ్గరలో అలాంటి వర్తకుడు ఎక్కడ ఉన్నాడో వాకబు చేసుకుంటూ ఓ రత్నాల వ్యాపారి దుకాణంలోకి అడుగుపెట్టాడు.   రత్నాల వ్యాపారి ముందు ఆ రాయిని ఉంచగానే ఆ వర్తకుడు తన కళ్లని తానే నమ్మలేకపోయాడు. ఓ ముఖమల్ వస్త్రం తీసుకుని బల్ల మీద పరిచి, కుర్రవాడి చేతిలోని రాయిని అపురూపంగా దాని మీద ఉంచాడు. ‘ఇది మామూలు రాయి కాదు. ఇది ఓ గొప్ప పగడం. నా ఆస్తంతా అమ్మినా కూడా దీనిని నేను కొనలేను,’ అంటూ తలవంచి ఆ రాయి ముందు మోకరిల్లాడు.   రత్నాల వ్యాపారి దుకాణంలో జరిగిన సంఘటనకి కుర్రవాడు తెగ ఆశ్చర్యపోయాడు. తన చేతిలో ఉన్న రాయిని పదిలంగా గట్టిగా పట్టుకుని అదెక్కడ చేజారిపోతుందో అన్న భయంతో తాతయ్య దగ్గరకు పరుగుతీశాడు. తాతయ్య కుర్రవాడు చెప్పిందంతా చిరునవ్వుతో విన్నాడు.   ‘ఇవాళ ఉదయం నువ్వు నన్ను మనిషి విలువ ఏమిటి అని అడిగావు కదా! నీకు ఎదురుపడిన అనుభవాలే నీ ప్రశ్నకు సమాధానంగా నిలుస్తాయి. నువ్వు ఆ అమూల్యమైన పగడంలాంటి వాడివి. కానీ నీకు జీవితంలో ఎదురుపడేవారందరూ నీకు తగిన విలువని అందిస్తారనుకోవడం అసాధ్యం. వాళ్ల వ్యక్తిత్వాన్ని బట్టి, విచక్షణని బట్టి నిన్ను అంచనా వేస్తుంటారు. జీవితంలో వాళ్లు విలువైనవి అనుకునేవాటికీ నీకూ పొంతన లేకపోవచ్చు. నిన్ను సరిగా అంచనా వేసే సామర్థ్యం వాళ్లకి ఉండకపోవచ్చు. ఎక్కడో ఒక చోట ఆ రత్నాల వ్యాపారివంటివాడు నీకు ఎదురుపడతాడు. నీ విలువని అంచనా వేయలేనని ఒప్పుకుంటాడు. కాబట్టి నీ విలువ ఇంత అని చెప్పడం అసాధ్యం. అలాగని ముందుగానే నిన్ను నువ్వు అంచనా వేసుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే నువ్వు విలువకి అందని వాడివి. అలాగే ఉండేందుకు ప్రయత్నించు. నీ మీద నువ్వు గౌరవం ఉంచుకో! పండ్ల వ్యాపారీ, కూరగాయల వ్యాపారుల్లాగా నిన్ను తేలికగా అంచనా వేసిన చోట చవకగా అమ్ముడుపోవద్దు,’ అని చెప్పుకొచ్చాడు. ఇంతకీ మనిషి విలువ అమూల్యం అన్నమాట!!! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  

క్లాస్‌రూంలో నేర్చుకోని పాఠం

  అది అమెరికాలో జాన్ హాప్‌కిన్స్‌ అనే యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్‌కి ఓ ఆలోచన వచ్చింది. ‘తన కళ్ల ముందు ఉన్న స్టూడెంట్స్ అంతా మంచి మంచి కుటుంబాల నుంచి వచ్చినవాళ్లే కదా! వాళ్లు ఎప్పటికైనా మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు కదా! మరి బస్తీలో పెరిగే పిల్లల సంగతి ఏంటి?’ అన్న ఆలోచన ప్రొఫెసర్ మనసుని కదిలించేసింది. వెంటనే ఆయన కొంతమంది స్టూడెంట్స్‌ని పిలిచాడు. ‘ఈ ఊరి చివర ఓ స్లమ్‌ ఏరియా ఉంది కదా! మీరంతా అక్కడికి వెళ్లండి. అక్కడ పిల్లల మనస్తత్వాన్నీ, వాళ్ల నేపథ్యాన్నీ గమనించండి. వాళ్లు పెద్దయ్యాక ఏమవుతారో ఊహించండి?’ అంటూ ఓ ప్రాజెక్ట్‌ వర్క్‌ అప్పగించాడు. ప్రొఫెసర్ చెప్పినట్లుగానే విద్యార్థులు ఊరి చివర ఉన్న స్లమ్‌ ఏరియాకు వెళ్లారు. అక్కడ పిల్లలని ఓ రోజంతా పరిశీలించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు దాదాపు రెండువందల మంది పిల్లలను గమనించారు. చివరికి వాళ్లలో కనీసం 90 శాతం మంది పిల్లలైనా, పెద్దయ్యాక ఎందుకూ పనికిరాకుండాపోతారని అంచనా వేశారు. వాళ్లలో చాలామంది ఏదో ఒక నేరం చేసి జైలుకి వెళ్లితీరతారని ఊహించారు. తమ ప్రాజెక్టుని ప్రొఫెసరుకి అందించారు.   ఇదంతా జరిగి సుమారు 25 సంవత్సరాలు గడిచింది. ఈసారి ప్రొఫెసరుగారికి మరో ఆలోచన వచ్చింది. తాను ఒకప్పుడు చేయించిన ప్రాజెక్టు ఎంతవరకు నిజమైందో తెలుసుకోవాలని అనుకున్నాడు. వెంటనే తన దగ్గర ఇప్పుడు చదువుతున్న కొంతమందికి పాత పేపర్లు అప్పగించి, అప్పటి పిల్లలు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో పరిశీలించి రమ్మని చెప్పాడు.   ప్రొషెసరుగారు అప్పగించిన కాగితాలు తీసుకుని విద్యార్థులు బయల్దేరారు. ఆనాటి రెండు వందల మంది పిల్లల్లో ఓ 180 మంది ఆచూకీ కనిపెట్టగలిగారు. వాళ్లంతా రకరకాల వృత్తులలో ఉన్నారని తేలింది. ఆశ్చర్యంగా వాళ్లలో కేవలం నలుగురంటే నలుగురు మాత్రమే ఏదో ఒక నేరం చేసి జైలుకి వెళ్లినట్లు బయటపడింది. ఒకప్పుడు అల్లరిచిల్లరగా తిరిగిన పిల్లలలో అంత మార్పు ఎలా వచ్చిందో విద్యార్థులకి అర్థం కాలేదు. చివరికి అక్కడ పనిచేసిన ఓ టీచర్ కారణంగా వాళ్లంతా బుద్ధిమంతుల్లా మారిపోయారని బయటపడింది.   అంతమందిలో మార్పు తీసుకువచ్చిన టీచర్‌ గురించి విద్యార్థులలో ఆసక్తి పెరిగిపోయింది. ఆవిడ ఎక్కడ ఉంటారో కనుక్కుని విద్యార్థులంతా బయల్దేరారు. ఆ టీచర్‌ని కలవగానే, తాము స్లమ్‌ ఏరియాలో చూసిన అద్భుతాన్ని ఆవిడతో చెప్పుకొచ్చారు. ‘మీరు ఇంతమందిలో మార్పు ఎలా తీసుకువచ్చారు,’ అంటూ ఆ టీచర్ని అడిగారు.   విద్యార్థుల ప్రశ్నకి టీచర్‌ ఏమాత్రం తడుముకోలేదు. ‘నేను వాళ్లని ప్రేమించాను. వాళ్లు తప్పకుండా మారతారని నమ్మకం ఉంచాను. ఒక టీచర్‌గా నా బాధ్యతని నిర్వహించాను. వాళ్లు భవిష్యత్తులో నేరగాళ్లు అవుతారనే అనుమానమే నాకు ఉండేది కాదు,’ అంటూ చిరునవ్వుతో చెప్పుకొచ్చింది. ఆ టీచర్‌ సమాధానం విద్యార్థులందరికీ ఓ కొత్త పాఠాన్ని నేర్పింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

సాటి మనిషిని గుర్తించండి

  సమాజంలో తనకంటూ ఓ గొప్ప స్థానం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. స్థానం సంగతి అలా ఉంచితే... కనీసం తను ఒకడు ఉన్నాడని అవతలివారు గుర్తించాలని అనుకుంటారు. ఈ గుర్తింపు కూడా పొందలేకపోతే మనిషి ఏమైపోతాడు? అలాంటివారితో ఎలా ప్రవర్తించాలి? అన్న అనుమానాలు వచ్చాయి పరిశోధకులకి. ఫలితంగా ఓ ప్రయోగం చేసి చూశారు. ఆ ప్రయోగం ఏమిటో! అది నేర్పే పాఠాలేమిటో చూడండి!   ఈ పరిశోధన కోసం సైకాలజిస్టులు, అభ్యర్థులతో ఒక ఆటని ఆడించారు. ఇందులో ఒకరికి ఒకరు బంతిని అందిస్తూ ఉండాలి. ఈ ఆటలో కొందరికి బంతి అస్సలు అందలేదు. ఇలాంటి సందర్భాలలో కావాలని తమని విస్మరిస్తున్నారన్న భావన మనకి కలగడం సహజం. ఇది ఆత్మన్యూనత, అభద్రతాభావం లాంటి తీవ్రమైన మనస్తత్వానికి దారితీస్తుందని తేల్చారు.   తన ఉనికిని గుర్తించకపోవడం వల్ల మనిషి అహం దెబ్బతింటుదనీ... అది తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుందనీ తేలిపోయింది. కానీ ఇలాంటి సందర్భాలను నివారించడం ఎలా అన్న దిశగా కూడా ప్రయత్నం చేశారు. తనని తిట్టినా, తిరస్కరించినా కూడా మనిషికి ఎలాగొలా తనని గుర్తించారులే అన్న తృప్తి కలుగుతుందట. ఏదో సినిమాలో చెప్పినట్లు- ‘కుదిరితే క్షమించు, లేదా శిక్షించు, కానీ మేం ఉన్నామని గుర్తించు’ అంటూ మనిషి తపించిపోతాడట.   మన చుట్టూ ఉండే ప్రతిఒక్కరి అహంకారాన్నీ మనం తృప్తి పరచలేకపోవచ్చు. కానీ వాళ్లూ మన రోజువారీ జీవితంలో భాగమేనని గుర్తించడం చాలా అవసరం అంటున్నారు. ఉద్యోగ సంస్థలు కూడా ఈ విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు. ఉద్యోగులని పరామర్శ ద్వారానో, విమర్శ ద్వారానో... అసలంటూ వారు తమ సంస్థలో ఉన్నారన్న విషయాన్ని గుర్తించాలంటున్నారు. అలాగే ఒకే ఉద్యోగానికి పదులకొద్దీ దరఖాస్తులు వచ్చినప్పుడు కూడా ఈ సూత్రాన్ని పాటించాలని చెబుతున్నారు. తిరస్కరించిన అభ్యర్థుల విషయంలో మిన్నకుండి పోకుండా మెయిల్‌ లేదా ఉత్తరం ద్వారా ‘మిమ్మల్ని తిరస్కరిస్తున్నాం’ అని తెలియచేయమంటున్నారు.   - నిర్జర.

ఏది ముందు కావాలి?

'అది ఒక చిన్న కొండ. ఆ కొండ మీద ఓ పూరిగుడిసె! ఓ ముసలిభార్యాభర్తా, వారికొడుకూ కోడలూ ఆ ఇంట్లో ఉండేవారు. అంతాబాగానే ఉంది. పొద్దున లేచి గుడిసెలోంచి బయటకు రాగానే విశాలమైన ప్రపంచం కనిపిస్తుంది, ఎదురుగుండా సూర్యుడు ఉదయిస్తూ పలకరిస్తాడు. కొండ కింద ఉన్న ఊరిలో ఇంటిపెద్దాయనా, ఆయన కొడుకూ పనికి వెళ్తారు. రోజంతా ఒళ్లు వంచి పనిచేసి, మర్నాటికి సరిపడా సంపాదించుకొని ఇంటికి చేరతారు. ఓ రోజు తండ్రీకొడుకులు ఎప్పటిలాగే పనికి బయల్దేరారు. ఆ సాయంత్రం వారి ఇంటి ముందుకి ఓ నలుగురు వింత మనుషులు వచ్చారు. చారెడు మీసాలు, బారెడు గడ్డంతో వారంతా చాలా చిత్రంగా ఉన్నారు. కానీ వారి మొహాలు మాత్రం తేజస్సుతో వెలిగిపోతున్నాయి. ‘ఎవరయ్యా మీరు! పాపం దారి తప్పి వచ్చినట్లున్నారు. రండి కాసిని మంచినీళ్లు తాగండి. మాతో కలిసి భోంచేయండి. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి,’ అంటూ ఇంటావిడ సాదరంగా ఆహ్వానించింది. ఇంటావిడ మాటలకు ఆ నలుగురూ చిరునవ్వు నవ్వి ‘మరేం ఫర్వాలేదు. మేము ఈ అరుగు మీదే కూర్చుంటాము. మీ ఇంట్లోవారంతా వచ్చిన తర్వాతే మేము ఇంట్లోకి వస్తాము,’ అని చెప్పారు. మరికాసేపటికి తండ్రీకొడుకులు ఇద్దరూ అక్కడికి చేరుకోనే చేరుకున్నారు. ఇంటి బయట ఉన్నవారి గురించి ఆ ఇంటావిడ వారితో చెప్పింది. వెంటనే ఆ ఇంటి పెద్దాయన బయటకు వెళ్లి- ‘ఇంట్లో వారమంతా వచ్చేశాము. దయచేసి లోపలకి రండి,’ అంటూ ఆహ్వానించాడు. ‘మేము నలుగురమూ ఒకేసారి లోపలకి రావడం కుదరదు. మాలో ఒకరు కీర్తికి ప్రతినిధి, మరొకరు విజయానికి సూచన, ఇంకొకరు డబ్బుకి చిహ్నం, నేను ప్రేమకు ప్రతిరూపాన్ని. మాలో ఎవరు మీ ఇంట్లోకి మొదటగా రావాలో నిర్ణయించుకోండి,’ అని వారిలో ఒకరు చెప్పారు. వారి మాటలు విన్న పెద్దాయన ఇంట్లోకి వెళ్లి విషయం చెప్పాడు- ‘ఇందులో పెద్దగా ఆలోచించాల్సింది ఏముంది? ముందు డబ్బుని లోపలకి రమ్మనండి. ఈ పేదరికంతో చచ్చిపోతున్నాను,’ అన్నాడు కొడుకు. ‘అబ్బే డబ్బుదేముంది! ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కీర్తి శాశ్వతం కదా. ముందు ఆ కీర్తిని లోపలకు రమ్మని పిలవండి,’ అని చెప్పింది కోడలు. ‘ఇన్నాళ్లూ నేను జీవితంలోని ప్రతి సందర్భంలోనూ ఓడిపోతూనే ఉన్నాను. ఇప్పటికైనా నేను విజయాలను అందుకోవాలని అనుకుంటున్నాను. నేను విజయాన్నే లోపలకు పిలుస్తాను,’ అన్నాడు తండ్రి. ‘భలేవారే! మన అరాయించుకోలేనంత డబ్బు, డప్పు కొట్టుకొనేంత కీర్తి, తలపొగరెక్కేంత విజయం లేకపోయినా ఇన్నాళ్లూ సుఖంగా ఉన్నామా లేదా! అందుకు కారణం మన మధ్య ఉన్న ప్రేమే! ఆ ప్రేమ మన జీవితాలలో లేకపోతే... తతిమావి ఏవుండి మాత్రం ఏం లాభం? నా మాట విని వెళ్లి ఆ ప్రేమను లోపలకు పిలవండి,’ అని గట్టిగా చెప్పింది భార్య. ఆవిడ మాట అందరికీ సబబుగానే తోచింది. వెంటనే వెళ్లి ‘మీలో ప్రేమకు ప్రతినిధి ఎవరో ముందుగా రండి!’ అని పెద్దాయన పిలవగానే అందులో ఒకరు లేచి లోపలకి అడుగుపెట్టారు. విచిత్రం! ప్రేమ లోపలకు అడుగుపెట్టగానే మిగతావారు కూడా ఆయన వెంటనే లోపలకు వచ్చేశారు. ‘మీరు ప్రేమని కాకుండా మిగతా ఏ ఒక్కరిని ఎంచుకున్నా, మిగతా ముగ్గురూ తిరిగి వెళ్లిపోయేవారు. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట విజయం ఉంటుంది. విజయం ఉన్నచోట డబ్బు, కీర్తి ఉంటాయి. మిగతా లక్షణాలు అలా కాదు! ఒకటి ఉంటే మరొకటి ఉండకపోవచ్చు!’ అన్నాడు విజయానికి ప్రతినిధిగా ఉన్నవాడు. అప్పటి నుంచీ వారి జీవితాల్లోనూ, మనసుల్లోనూ ఏ లోటూ లేకుండా పోయింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.

ఆన్ లైన్ షాపింగ్ భయం ఉన్న వారికి 4 సలహాలు

  ఆన్ లైన్ షాపింగ్ కొందరికి నచ్చితే, చాలా మందికి నచ్చదు. ఇక బట్టల విషయంలో అయితే చెప్పక్కర్లేదు. వాళ్ళ భయానికి గల అసలు కారణం ఏంటంటే ఆన్ లైన్ షాపింగ్ లో పొరపాటున నచ్చని వస్తువు కొన్నా, లేదంటే వస్తువు అనుకున్నట్లుగా లేకపోయినా వాపసు చేయడం ఎలాగా అని? అలాంటి వారి కోసమే ఈ 4 సలహాలు:   1 . మెజర్మెంట్స్ బాక్స్ సరిగ్గా చెక్ చేస్కోండి: ఒక వస్తువుని కొనేప్పుడు మనం చేసే ప్రథమ తప్పిదం ఏంటంటే మెజర్మెంట్స్ బాక్స్ సరిగ్గా చెక్ చేసుకోకపోవడం. ఒక చొక్కానో, లేక ప్యాంటు కొనేప్పుడు మెజర్మెంట్స్ బాక్స్ లో అన్ని వివరాలు సరిగ్గా గమనిస్తే అది మన సైజు కి సరిపోతుందా లేదా అనే విషయంలో సరయిన అవగాహన వస్తుంది.   2 . డిస్క్రిప్షన్ శ్రద్ధగా చదవండి: ప్రతి పోర్టల్ కి ఒక డిజైనర్ ఉంటారు. వాళ్ళు తాము చేసే దుస్తులు వీలయినంత వరకు అందంగా కనిపించేలా చూసుకుంటారు. కావున, మనం కాస్త జాగ్రత్త వహించడం మంచిది. మీరు ఇష్టపడిన దుస్తులు ఒక సాధారణ వ్యక్తిపై చాలా భిన్నంగా కనిపించొచ్చు. ఒక్కోసారి వాటికి బెల్ట్ కానీ వేరే ఇతర వస్తువు తగిలించి కనిపించొచ్చు. అయితే అది మనం తీసుకునే వస్తువుతో జత చేయబడి ఉండొచ్చు, ఉండక పోవచ్చు. కాబట్టి డిస్క్రిప్షన్ శ్రద్ధగా చదవండి, మీకు అన్ని విషయాల్లో సరయిన అవగాహన వస్తుంది.   3 . సామాజిక మాధ్యమాల్లో ఒక లుక్కేయడం ఉత్తమం: ఏదయినా వస్తువు కొనాలనుకున్నప్పుడు, మీరు ఇంతకు ముందు దానిని చూడని సందర్భంలో, ఆ వెబ్ సైట్ యొక్క ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ లేదా వేరే సామాజిక మాధ్యమాల్లో ఒక లుక్కేయడం ఉత్తమం. ఎందుకంటే, మీకు ఆ వస్తువును రకరకాల కోణాల్లో చూసే అవకాశం ఉంది. చెప్పలేం, మీకు తెలిసిన వారెవరయినా అది ఇంతకు ముందు ధరించి ఉండవచ్చు కూడా. ఇలా చేయడం వల్ల మీకు ఆ దుస్తులపైన సరైన అవగాహన వచ్చి, మీరు కొనొచ్చో లేదో నిర్ణయం తీసుకోవచ్చు.   4 . ఫాబ్రిక్ విషయంలో జాగ్రత్త వహించండి: ఎల్లప్పుడూ, మీరు కొనే ఫాబ్రిక్ నాణ్యత, సౌకర్యం విషయంలో మీకు ఇంతకు మునుపు ఉన్న బట్టలతో పోల్చి చూడండి. చాలా సందర్భాల్లో మీరు కొనే దుస్తులు మెటీరియల్ వల్ల కానీ లేదా మీకు ఎంత సౌకర్యవంతంగా ఉంది అనే దాని బట్టి ఇష్టం ఏర్పడే అవకాశం ఉంది. మీరు ఓ ఫాబ్రిక్ నిపుణులవ్వాల్సిన అవసరం ఏం లేదు. మీ దగ్గర ఇంతకు ముందు ఉన్న దుస్తుల ఫాబ్రిక్ లో ఏది సౌకర్యవంతంగా ఉందో అదే ఫాబ్రిక్ దుస్తులు తీసుకుంటే మంచిది.  ఈ 4 చిట్కాలను అనుసరించండి ఆన్లైన్ షాపింగ్ నిపుణులు అవ్వండి. ఇప్పుడు మీరు ఆన్లైన్లో కొనుగోలు చేసిన వస్తువులు మీకు ఇష్టం లేనందున నిరాశ చెందే పని ఉండదు.

ఫేస్‌బుక్‌తో ఆయుష్షు పదిలం

‘లేచిన దగ్గర్నుంచీ ఆ ఫేస్‌బుక్‌ ముందరే తగలడతారేంటి?’ అని భార్యలు తిట్టవచ్చుగాక! ‘పిదపకాలం పిదప పోస్టులు’ అంటూ పెద్దలు విసుక్కోవచ్చుగాక! కానీ ఫేస్‌బుక్‌ అంటే పడిచచ్చేవారికి సంతోషం కలిగించేలా ఓ పరిశోధన జరిగింది. ఫేస్‌బుక్‌తో జీవితకాలం పెరుగుతుందని సదరు పరిశోధన రుజువుచేస్తోంది.   12 శాతం ఎక్కువ సామాజిక సంబంధాలు దృఢంగా ఉన్నవారు సుదీర్ఘకాలం బతుకుతారన్న విషయం ఇప్పటికే రుజువైంది. అయితే ఇది ఆన్‌లైన్‌లో సామాజిక వెబ్‌సైట్లకు ఎంతవరకు వర్తిస్తుందో తెలుసుకోవాలనుకున్నారు కొందరు పరిశోధకులు. ఇందుకోసం వారు కాలిఫోర్నియాకు చెందిన ఫేస్‌బుక్‌ యూజర్ల జాబితాను సేకరించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఈ జాబితాలో ఉన్నవారి ఆరోగ్యం ఎలా ఉందో బేరీజు వేశారు. ఫలితం! ఫేస్‌బుక్‌ వాడేవారు ఇతరులతో పోలిస్తే 12 శాతం సుదీర్ఘకాలం జీవిస్తున్నట్లు తేలింది.   అకౌంట్‌ ఉంటే సరిపోదు కేవలం ఫేస్‌బుక్‌ అకౌంటు ఉంటే సరిపోదు, అందులో చురుగ్గా పాల్గొంటున్నా సరిపోదు! పరిశోధకుల లెక్కల ప్రకారం వీలైనంతమంది ఎక్కువ ఫేస్‌బుక్ నేస్తాలు ఉన్నవారికే ఆయుష్షుపరంగా మేలు జరుగుతోంది. పైగా ఏదో నామమాత్రంగా పోస్టులు పెట్టడం, లైకులు కొట్టడం వల్ల ఉపయోగం లేదట. ఎక్కువమంది మిత్రులు ఉన్నవారు, ఆ మిత్రులతో తమ ఫొటోలను పంచుకుంటున్నవారే ఫేస్‌బుక్‌ వల్ల లాభపడుతున్నట్లు తేలింది.   కారణం! ఈ పరిశోధన ఏదో వందలు, వేలమంది మీద జరిగింది కాదు. ఆషామాషీగా సాగిందీ కాదు. దాదాపు కోటిమందికి పైగా ఫేస్‌బుక్ యూజర్లను గమనించిన తరువాత తేల్చిన విషయం. సామాజికంగా దృఢమైన సంబంధాలు ఉన్నవారు ఇతరులకంటే ఎక్కువకాలం జీవిస్తారనే విషయం దాదాపు 35 ఏళ్ల క్రితమే రుజువయ్యింది. అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా ఫేస్‌బుక్‌ కూడా మన సామాజిక బంధాలను కొలిచే ఒక సాధనంగా మారిపోయింది. ఇందులో ఏదో కొందరు నామమాత్రంగా పాల్గొంటే... నిజంగా నలుగురిలో కలిసే మనస్తత్వం ఉన్నవారు వీలైనంత ఎక్కువమంది స్నేహితులను ఆకర్షించడం, తమ ఫొటోలను వారితో పంచుకోవడం చేస్తుంటారు. సహజంగానే ఇలాంటివారిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు, చొరవా, ఉత్సాహం ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి దృక్పథం వారి ఆరోగ్యం మీద కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అదే వారి సుదీర్ఘమైన ఆయుష్షుకి కారణం అంటున్నారు పరిశోధకులు. ఈ పరిశోధనకి మనం కూడా ఒక లైక్‌ కొడదాం మరి!   - నిర్జర.

అందుకనే మనిషి గొప్పవాడు

  అది ఓ దట్టమైన అడవి. ఆ అడవిలో ఉన్న జీవాలన్నీ ఓ మిట్టమధ్యాహ్నం కాలక్షేపంగా కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టాయి. అకస్మాత్తుగా ‘అసలు జీవితం అంటే ఏమిటి?’ అన్న చర్చ మొదలైంది.   ‘జీవితం అంటే తనివితీరా పాడటం. అలా ఆటలా పాటలా సాగేదే అసలైన జీవితం,’ అని మైమరపుతో చెప్పింది ఓ కోయిల. చెప్పడమే కాదు, వెంటనే ఓ కూనిరాగం తీయడం మొదలుపెట్టింది.   ‘పాటా పాడా! జీవితం అంటే భయం భయంగా బతకడం. ఎవరి కంటా పడకుండా భయపడతూ నక్కి నక్కి తిరగడం,’ అని చెప్పిందో పందికొక్కు.   ‘అబ్బే అంత భయపడటం ఎందుకు? జీవితం అంటే అందం, జీవితం అంటే సంతోషం,’ అంటూ రెక్కలు చాస్తూ గిరగిరా తిరుగుతూ చెప్పింది ఓ అందమైన సీతాకోకచిలుక.   ‘నిరంతరం అలా తిరుగుతూ ఉంటే ఇక పనిచేసేదెప్పుడు. అసలు జీవితం అంటేనే పని. పని చేయకపోతే జీవితానికి అర్థమే లేదు,’ అని నిట్టూర్చింది ఓ తేనెటీగ.   ‘నువ్వు చెప్పింది ముమ్మాటికీ నిజం. సంతోషం సంగతి పక్కన పెట్టండి. నిరంతరం పనిచేయకపోతే జీవించి ఉపయోగం లేదు,’ అని తేనెటీగ మాటలను బలపరిచింది చీమ.   ఇంతలో ‘మీతో నేను ఏకీభవించను,’ అంటూ గంభీరంగా ఓ స్వరం వినిపించింది. ఆ స్వరం ఎక్కడిదా అని పైకి చూసిన జీవులన్నింటికీ ఓ గద్ద కనిపించింది. ‘జీవితం అంటే స్వేచ్ఛ. అల్లంత ఎత్తున ఆకాశంలో తిరుగుతూ కిందకి చూస్తుంటే ఆ మజానే వేరబ్బా!’ అంటూ నిశ్చలంగా ఆకాశంలో తేలుతూ చెప్పింది.   నిదానంగా ఈ చర్చలోకి మొక్కలు కూడా తలో మాటా కలిపాయి. ఎత్తైన దేవదారు వృక్షం గద్దతో ఏకీభవించింది. అడవిపూలేమో చీమని బలపరిచాయి. గులాబీ మాత్రం అందమే ముఖ్యమన్న సీతాకోకచిలుక మాటలను బలపరిచింది. ఈ హడావుడంతా చూసి పైనున్న మబ్బులు కూడా గొంతు కలిపాయి. ‘జీవితం అంటే కన్నీళ్లు, కష్టాలు, ఊహించని విపత్తులు,’ అంటూ సాగిపోయాయి.   మబ్బులు మాట్లాడటం చూసి నదులు కూడా అరిచాయి ....’అదేమీ కాదు! జీవితం అంటే ఓ అంతులేని ప్రవాహం,’ అంటూ ముందుకు ఉరికాయి.   అలా జీవితం అంటే ఏమిటంటూ నిదానంగా మొదలైన చర్చ ఓ భీకరమైన వాదన కిందకి దారితీసింది. అన్ని జీవాలూ కలగాపులగంగా అరుచుకోవడం మొదలుపెట్టాయి. ఇంతలో ఆకాశవాణి వినిపించింది... ‘మీరు చెప్పిన జవాబులన్నీ అసంపూర్ణంగా ఉన్నాయి. నిజానికి జీవితం అంటే ఏ ఒక్క లక్షణమో కాదు. అందం, ఆటాపాటా, సంతోషం, స్వేచ్ఛ ఒకవైపునా..... కష్టం, బాధా, కన్నీరు, భయం, పని మరోవైపు సమంగా ఉండేదే జీవితమంటే. అలాంటి జీవితాన్ని అనుభవించే అదృష్టం ఒక్క మనిషికి మాత్రమే ఉంది,’ అంటూ చెప్పుకొచ్చింది. ఆ మాటలతో జీవాలన్నీ ఏకీభవించక తప్పలేదు. మరి మీరో! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  

బహుమతులు - వాటి ఫలితాలు

శుభకార్యాలకు బహుమతులు ఇవ్వడం లేదా పుచ్చుకోవడం సహజం. అయితే, కొందరికి ఎలాంటి బహుమతులు ఇవ్వాలో, ఎలాంటివి  తీసుకోకూడదో తెలీదు. ఏదో ఒకటి కొంటారు, వెళ్లి తమ స్నేహితులకో, బంధువులకో ఇస్తారు. అలా ఏదంటే అది కొనుక్కొని వెళ్లి ఇవ్వకూడదని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎవరైనా  టవల్స్, కర్చీఫ్ లు బహుమతులుగా ఇస్తే తీసుకోకూడదట. వివాదాలు వస్తాయట. బహుమతిగా ఇస్తే వద్దని చెప్పాలట లేదా వారి చేతిలో ఒక నాణెం పెట్టాలట. చైనా జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం  నీళ్లతో వున్న వస్తువులు (అక్వేరియం) బహుమతిగా ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే మీదగ్గర ఉన్న అదృష్టం వారివద్దకు వెళుతుందట. మీరు తరచూ ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటారట. అలాగే పదునైన వస్తువులు ఇవ్వడం లేదా స్వీకరించడం కూడా దురదృష్టమే. పైగా అనారోగ్య సమస్యలు వస్తాయట. తిరస్కరించడం ఉత్తమమని కొందరి జ్యోతిష్యుల భావన.