సెల్ఫీలోనూ రకాలు ఉన్నాయట!

  ఒకప్పుడు సెల్ఫీ దిగేవారిని చూసి జనం నవ్వుకొనేవారు. అలా నవ్వుకొంటున్న జనాలందరికీ కూడా ఇప్పుడు సెల్ఫీ దిగడం అలవాటు అయిపోయింది. మన దేశంలో ఆధారు కార్డు లేనివారు, సెల్ఫీ దిగనివారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. సోషల్‌ మీడియాలోకి లక్షలాదిగా వచ్చి పడే ఈ సెల్ఫీను చూస్తే వాటి మధ్య కొన్ని పోలికలు కనిపిస్తాయి. అందుకే చాలా పత్రికలు ఇప్పుడు సెల్ఫీలలో రకాలు అంటూ ప్రకటిస్తున్నాయి. వాటిలో కొన్ని ఇవిగో...   కారులో సెల్ఫీ కారులో సీటుబెల్టు పెట్టుకొని దిగే సెల్ఫీలు మనకి కోకొల్లలుగా కనిపిస్తాయి. తాము బుద్ధిమంతులుగా కనిపిస్తున్నామని మురిసిపోయేందుకో, తనకి కూడా కారు ఉందని చెప్పకుండానే చెప్పేందుకో ఇలాంటి సెల్ఫీలు ఉపయోగపడతాయి.   సెల్ఫీ విత్‌ సెలబ్రెటీ ఎవరన్నా సెలబ్రెటీ కనిపిస్తే వారితో ఫొటో దిగి జీవితాంతం జనాలందరికీ చూపించుకోవాలనుకునే తపన మనది. అయితే ఇప్పుడు ఫొటో ఎవరు తీస్తారా అని వాళ్లనీ వీళ్లనీ బతిమాడవలసిన అవసరం లేదు. సెలబ్రెటీని మన దగ్గరకి ఒక్క గుంజు గుంజి వారితో సెల్ఫీ తీసుకుంటే సరిపోతుంది.   పెంపుడు జంతువులతో సెల్ఫీ మన ఇంట్లో తిరిగే కుక్కల్నీ పిల్లుల్నీ ఎలాగూ ప్రత్యేకించి ఫొటోలు తీయం. పైగా వాటి మీద మనకి ఉన్న అభిమానాన్ని సోషల్ మీడియాలో పంచుకునేదెలా! అందుకే పెంపుడు జంతువులతో దిగే సెల్ఫీలకి కూడా మంచి గిరాకీ ఉంది.   తిండి సెల్ఫీ తింటూ సెల్ఫీ దిగాలంటే మనవారికి అదో సరదా! రెస్టారెంటులో కుటుంబసభ్యులతో కూర్చునో, కేకు ముక్కలు నోట్లో కుక్కుకుంటూనో సెల్ఫీల దిగుతుంటాము. మీరు కూడా ఈ సమయంలో మాతో ఉంటే బాగుండు అన్న అభిలాషతోనో, మేం హాయిగా ఆహారాన్ని ఆస్వాదిస్తున్నాం అని ఉడికించేందుకో ఇలాంటి సెల్ఫీలు పడుతుంటాయి.   బాత్రూం సెల్ఫీలు విదేశీ సెల్ఫీలలో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. స్నానం చేస్తూనో, పళ్లు తోముకుంటూనో బాత్రంలో దిగే ఇలాంటి సెల్ఫీలకి కొదవ లేదు. మనవారు ఇంతదూరం వెళ్లరు కానీ అద్దం ముందు నిల్చొని దిగే సెల్ఫీలు మాత్రం మన సోషల్‌ మీడియాలో ఎక్కువగా కనిపిస్తాయి.   కండల సెల్పీలు కుర్రకారు వ్యాయామం చేసేది సగం ఆరోగ్యం కోసం, మిగతా సగం బలప్రదర్శన కోసం. అందుకని వ్యాయామం చేస్తూనో, జిమ్‌లో చెమటలు కక్కుతూనో దిగే సెల్ఫీలకి కొదవ ఉండదు. జాగింగ్ చేస్తూ, సిక్స్‌ ప్యాక్‌ని ప్రదర్శిస్తూనో దిగే సెల్ఫీలు కూడా దర్శనమిస్తూనే ఉంటాయి.   సెల్ఫీ ప్రేమ ప్రేమలో పడినవారు సెల్ఫీలు తీసుకోక తప్పదేమో! ప్రపంచమంతా కుళ్లుకునేలా తమ అన్యోన్యమైన ప్రేమని సెల్ఫీ రూపంలో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తుంటారు ప్రేమికులు. సెలబ్రెటీల దగ్గర్నుంచీ, మధ్యతరగతి భార్యాభర్తల వరకూ జంటలుగా దిగే ఈ సెల్ఫీలు ఇప్పుడు సర్వసాధారణం.   విజయగర్వంతో డిగ్రీ పట్టా పుచ్చుకోగానే ఓ సెల్ఫీ, ఎవరెస్టు ఎక్కగానే ఓ సెల్ఫీ, ఓటు వేయగానే ఓ సెల్ఫీ, ఆఖరికి సినిమా టికెట్టు సాధించగానే ఓ సెల్ఫీ... ఇలా ఏదో సాధించామని గర్వపడే ప్రతిసారీ, సదరు విజయాన్ని నలుగురితో పంచుకునేందుకు తీసే సెల్ఫీలకి కొదవలేదు. చెప్పుకొంటూ పోవాలే కానీ సెల్ఫీలు ఇలా వేయి విధాలు. అప్పుడే పుట్టిన బిడ్డతో సెల్ఫీ దిగడం దగ్గర్నుంచీ శవం పక్కనే నిలబడి దిగే చావు సెల్ఫీ వరకూ... సెల్ఫీ విశ్వరూపాన్ని చూడాలంటే వేయికళ్లూ చాలవేమో!     - నిర్జర.

బలవంతపు నవ్వుతో ఉపయోగం లేదు

  ‘మీరు సంతోషంగా లేకపోతే ఓ ఉపాయం ఉంది. మొహం మీద బలవంతంగా చిరునవ్వుని పులుముకోండి. దాంతో సంతోషం దానికదే తన్నుకుంటే వచ్చేస్తుంది. మీ దృక్పధమే మారిపోతుంది,’ అంటూ ఇన్నాళ్లుగా సైకాలజిస్టులు, వ్యక్తిత్వ వికాస నిపుణులూ ఊదరగొట్టేవారు. కానీ ఈ సూత్రంలో నిజం లేదని తాజా పరిశోధన రుజువు చేస్తోంది.   30 ఏళ్ల నమ్మకం ఒక మనిషి బలవంతంగా నవ్వుతూ ఉంటే, అతని మనసు కూడా తెలియకుండానే మారిపోతుందా! అన్న సందేహం జర్మనీ చెందిన ‘స్ట్రాక్‌’ అనే పరిశోధకుడికి వచ్చింది. దాంతో ఆయన 1988లో ఒక పరిశోధన చేశారు. కొంతమందిని లేని నవ్వుని తెచ్చిపెట్టుకొని ఎదురుగా ఉన్న కార్టూన్లను చూడమని చెప్పారు. ఇలా బలవంతపు నవ్వుతో కార్టూన్లని చూసిన తరువాత, అవి ఏ మేరకు నవ్వు తెప్పించేవిలా ఉన్నాయో మార్కులు వేయమన్నారు. మొహంలో ఎలాంటి నవ్వూ లేనివారితో పోలిస్తే బలవంతపు నవ్వుతో కార్టూన్లను చూసిన వ్యక్తులు కార్టూన్లు మహాద్భుతంగా ఉన్నాయని తెగ మార్కులు ఇచ్చేశారు. ఈ పరిశోధన అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. సంతోషంగా ఉండటానికి ఒక సులువైన దారి దొరికిందంటూ జనం తెగ మురిసిపోయారు. కానీ ఇదే పరిశోధనను మళ్లీ ఇప్పుడు చేయడంతో కథ మొదటికి వచ్చింది.   ప్రపంచవ్యాప్త పరిశోధన ఈసారి నెదర్లాండ్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు 1988 నాటి పరిశోధనని మరోసారి చేసి చూద్దామని ప్రయత్నించారు. అందుకోసం ‘స్ట్రాక్‌’ అనుమతిని తీసుకుని, ఆయన సలహాల మేరకు మరోసారి పరిశోధనని నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఓ 17 పరిశోధనాశాలలలో 1,894 మంది అభ్యర్థుల మీద ఇదే పరిశోధనను నిర్వహించారు. కానీ ఈసారి ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చాయి. ఇతరులతో పోలిస్తే,  బలవంతంగా చిరునవ్వు పులుముకున్నవారు కార్టూన్లకి ఇచ్చిన మార్కులలో పెద్దగా మార్పులు రాలేదు. దీంతో 1988 నాటి ప్రయోగపు ఫలితాలు ఏదో అనుకోకుండా ఏర్పడినవి తేలిపోయింది.     నవ్వు సహజంగా రావాల్సిందే! కుక్క తోకని నిరంతరం ఊపుతూనే ఉంటుంది. అంతమాత్రాన తోకే కుక్కని ఊపుతుందని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో... బలవంతపు చిరునవ్వుతో మనసు మారిపోతుందనుకోవడం అంతే మూర్ఖత్వం అంటున్నారు పరిశీలకులు. కానీ తన 1988నాటి పరిశోధన తప్పంటే ‘స్ట్రాక్‌’ ఒప్పుకోవడం లేదు. తాజా పరిశోధనలో చాలా లొసుగులు ఉన్నాయనీ, అందుకే ఒకప్పుడు నిరూపించిన ఫలితాలు ఇప్పుడు మారిపోయాయనీ వాదిస్తున్నారు.   ఈ దెబ్బతో బలవంతపు చిరునవ్వు గురించిన నమ్మకాలు చెదిరిపోయాయి. అయితే ఈ సందర్భంగా మన పెద్దవారు చెబుతూ వచ్చిన మాటలని మాత్రం గుర్తుకి తెచ్చుకోక తప్పదు. ఏ భావమైనా మనసులోంచి స్వచ్ఛంగా రావాలే కానీ తెచ్చిపెట్టుకుని ఉపయోగం లేదన్నది విజ్ఞుల మాట. మనసులో ఉన్న భావాలని అణచిపెట్టుకోవడం వల్ల అవి నశించిపోతాయనుకోవడం ఎంత తెలివితక్కువతనమో, పైకి కృత్రిమంగా వ్యక్తపరిచే భావాలు మనసుని ప్రభావితం చేస్తాయనుకోవడమూ అంతే మూర్ఖత్వం!   - నిర్జర.

ఎదిగిన మనిషి

  అతను కోట్ల రూపాయల విలువ చేసే సంస్థకు అధిపతి. కానీ ఆ సంస్థను ఆయన తరువాత చేపట్టేందుకు పిల్లలు లేరు. అయినా ఆయన పెద్దగా బాధపడేవాడు కాదు. తన ఉద్యోగులలో సమర్థమైనవాడికే ఆ సంస్థ పగ్గాలు అందించాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. ఆ రోజు రానేవచ్చింది. తనకు వారసుడిగా ఆ కంపెనీని ఎవరి చేతిలో ఉంచాలా అని నిశ్చయించేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి ఒక పదిమంది ఉద్యోగులు హాజరయ్యారు.   ‘‘సుదీర్ఘకాలంగా నా సంస్థలోని ఉద్యోగులందరినీ గమనించిన మీదట, వందలాది మంది ఉద్యోగులలలో మీరు అత్యంత సమర్థులు అని తేలింది. ఇక మీలో ఎవరో ఒకరికి నా కంపెనీ బాధ్యతలని అప్పచెప్పబోతున్నాను,’’ అన్నాడు యజమాని. యజమాని మాటలకి ఉద్యోగుల మనసులు సంతోషంతో గంతులు వేశాయి. కానీ ‘‘మీ అందరిలోకి ప్రతిభావంతుడు ఎవరా అని తేల్చేందుకు నేను ఒక పరీక్షను పెట్టాలనుకుంటున్నాను,’’ అని యజమాని చెప్పేసరికి అప్పటిదాకా సంతోషంతో ఎగిరిన వారి మనసులు కాస్తా బిక్కచచ్చిపోయాయి. ఈలోగా యజమాని తన ముందున్న ఒక పెట్టేలోంచి పది గింజలను బయటకు తీశాడు.   ‘‘సంస్థ అనేది ఒక మొక్కలాంటిది. ఆ మొక్కను పెంచి పెద్దచేయాలంటే ఎంతో శ్రమ, మరెంతో పట్టుదల అవసరం. మీలో అలాంటి లక్షణాలు ఎంతవరకు ఉన్నాయో తేల్చేందుకే ఈ పరీక్ష. నేను మీ అందరికీ తలా ఒక చిక్కుడు గింజను ఇస్తున్నాను. వాటిని మీరు ఒక రెండు నెలలపాటు పెంచి చూపించాలి,’’ అంటూ తలా ఓ గింజా చేతిలో ఉంచాడు.   ఆ గింజలను అందుకున్నవారంతా సంతోషంగా వాటిని ఇంటికి తీసుకువెళ్లారు. వాటికి రోజూ నీళ్లు పోయసాగారు. అసలు చిక్కుడు మొక్క అన్న పేరే విననివారు, దానిని ఎలా పెంచాలో తెలుసుకొనేందుకు ఇంటర్నెట్‌లో తెగ వెతకసాగారు. రోజూ తాము పెంచుతున్న చిక్కుడు మొక్క ఎంత అద్భుతంగా ఉందో ఎదుటివారితో గంటల తరబడి మాట్లాడటం మొదలుపెట్టారు.   ఇలా ఒక  రెండు నెలలు గడిచాయి. యజమాని ఇచ్చిన గడువు పూర్తయ్యింది. తలా ఒక కుండీని తీసుకుని యాజమాని ముందు చేరారు. ఒకొక్కరే తమ చేతిలోని కుండీని యజమానికి చూపుతూ సంబరపడిపోసాగారు. యజమాని చిరునవ్వుతో వాటిని చూస్తుండిపోయాడు. ఇంతలో ఒక ఉద్యోగి వెనకాలే ఉండిపోవడాన్ని యజమాని గుర్తించాడు. ‘‘అదేంటి నీ చేతిలో ఉన్న కుండీని చూపించకుండా అలా ఉండిపోయావేంటి?’’ అని అడిగాడు యజమాని. దానికి సదరు ఉద్యోగి వణికిపోతూ ముందుకువచ్చాడు. అతని చేతిలోని కుండీని చూసి ఉద్యోగులంతా ఒక్కసారి గొల్లున నవ్వారు. కారణం! అందులో అసలు మొక్కే లేదు.   ‘‘సర్! క్షమించండి. మీరు ఇచ్చిన గింజని నేను చాలా శ్రద్ధగానే నాటాను. దానికి తగినంత మట్టి ఉండేలా చూసుకున్నాను. రోజూ నీళ్లు కూడా పోశాను. కానీ ఎందుకనో ఇన్నాళ్లు గడిచినా అది మొలక వేయనే లేదు. మీరు పెట్టిన పరీక్షలో నేను పరాజయం పొందాను,’’ అన్నాడు ఆ ఉద్యోగి సిగ్గుపడుతూ.   ఉద్యోగి చెప్పిన మాటలు విన్న యజమాని ఒక్క పెట్టున నవ్వాడు. ‘‘అదేం కాదు! పరీక్షలో నువ్వొక్కడివే నెగ్గావు. నిజానికి నేను మీ అందరికీ కాల్చి, ఉప్పునీటిలో ఉడకబెట్టిన గింజలను ఇచ్చాను. అవి మొక్కలుగా మారే సమస్యే లేదు. కానీ మీరంతా ఎలాగొలా పరీక్షని నెగ్గితీరాలన్న పంతంతో ఏపుగా పెరిగిన మరో మొక్కని తీసుకువచ్చి నాకు చూపించారు. మనిషి ఎదగాలంటే శ్రమ, పట్టుదల ఎంత అవసరమో నిజాయితీ కూడా అంతే అవసరం. అవి అతనిలో మాత్రమే ఉన్నాయి,’’ అని తేల్చాడు.   ఈ కథని మనం చాలాసార్లు చదివే ఉంటాము. కాకపోతే పాత్రలు మారి ఉండవచ్చు. పరీక్ష వేరుగా ఉండి ఉండవచ్చు. కానీ ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఒప్పుకోగలిగేవాడు విజయం సాధిస్తాడన్న నీతి మాత్రం మారదు. విజయం సాధించినా సాధించకపోయినా నిజాయితీ ఉన్నవాడు ఇతరులకంటే ఒక మెట్టు పైనే నిలబడగలడన్న సూత్రమూ మారదు.   - నిర్జర.

ఇంటర్వ్యూలో విజయం కోసం

  ఎంత ప్రతిభ ఉన్నా ఒకోసారి చిన్నపాటి లోపాలతో ముందుకు వెళ్లలేకపోతుంటాం. మెదడులో బోల్డంత జ్ఞానం, నరనరాన తెలివితేటలున్నా చిన్నపాటి ఉద్యోగమో, ఆ ఉద్యోగంలో పదోన్నతో సంపాదించలేకపోతుంటాం. అర్హత ఉంది కదా! కావల్సిన ఉద్యోగం కాళ్ల దగ్గరకి వస్తుందనే రోజులు పోయాయి. ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు కొన్ని చిట్కాలను దృష్టిలో ఉంచుకోక తప్పని కాలం ఇది. వాటిలో కొన్ని ఇవిగో...     సంస్థ గురించి అవగాహన ఇంటర్వ్యూకి వెళ్లే సంస్థ చరిత్ర ఏమిటి? దాని అవసరాలు ఏమిటి? సంస్థ పయనం ఎలా ఉంది? లాంటి విషయాల మీద కొంత అధ్యయనం అవసరం. అందుకోసం సంస్థకి సంబంధించిన వెబ్‌సైట్‌ని ఓసారి పరిశీలిస్తే సరిపోతుంది. సంస్థ గురించి ఒక అవగాహన ఉన్న వ్యక్తులను తీసుకునేందుకు అధికారులు ఇష్టపడతారు. ఇంటర్వ్యూలో సంస్థకు సంబంధించిన ప్రశ్న ఎదురైనప్పుడు బిక్కమొగం వేయాల్సిన పరిస్థితి రాదు.     ఆత్మవిశ్వాసం ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టగానే కాళ్లు వణకడం ఖాయం. కానీ మొహంలో చిరునవ్వుని మాత్రం మర్చిపోకూడదు. జీవితంలో ఒక అవకాశం పోతే మరో అవకాశం రావచ్చు... కానీ భయపడితే చేతికందే అవకాశాలు చేజారిపోవడం తప్ప ఫలితం ఉండదు. అందుకే ధైర్యాన్ని కూడగట్టుకొని, ఆత్మవిశ్వాసంతో మెలగాలి. ఆత్మవిశ్వాసం ఉన్న మనిషిని ఏ సంస్థా కూడా వదులుకొనేందుకు ఇష్టపడదు.     బాడీ లాంగ్వేజ్ ఇంటర్వ్యూల మీద మన శరీరభాష చాలా ప్రభావం చూపుతుంది. ఎదురుగా వ్యక్తుల కళ్లలోకి చూడకుండా తప్పుకోవడం, చేతులు కట్టుకుని కూర్చోవడం, సీట్లో కూర్చుని ఊగడం, గోళ్లు కొరుక్కోవడం, వంగిపోయి నడవడం... లాంటి సూచనలు అధికారులలో ఏమంత సానుకూల అభిప్రాయాన్ని కలిగించవు.   మనల్నే ఎందుకు తీసుకోవాలి సంస్థకి ఇంటర్వ్యూకి వెళ్లున్నాం సరే! వాళ్లు మనల్నే ఎందుకు ఆ ఉద్యోగానికి ఎన్నుకోవాలి! అన్న విషయం మీద కొంత ఆలోచించడం మంచిది. సంస్థకు మీరెలా ఉపయోగపడగలరు. మీ వల్ల సంస్థకు కలిగే అదనపు లాభం ఏముంటుంది. ఇతరులకంటే మీరు భిన్నంగా ఎలా సంస్థ ఎదుగుదలకి తోడ్పడగలరు... లాంటి విషయాల మీద ఒక అవగాహనకు రావడం వల్ల ఇంటర్వ్యూని ఎదుర్కొనే తీరే మారిపోతుంది. అలాంటి విశ్వాసంతో తెలియకుండానే అధికారులను ఇంప్రెస్‌ చేయగలుగుతాము.   వస్త్రధారణ విడిగా ఎలా ఉన్నా ఇంటర్వ్యూ రోజునన్నా కాస్త శుభ్రమైన దుస్తులు వేసుకుని వెళ్లి తీరాల్సిందే! రాముడు మంచి బాలుడులాగా చక్కగా తల దువ్వుకొని, గడ్డం చేసుకుని తీరాల్సిందే. వీలైనంత వరకూ టీషర్టులు వేసుకుని వెళ్లకపోవడం మంచిది. సంస్థని బట్టి టక్‌ చేసుకోవడం, షూస్‌ వేసుకోవడం, టై పెట్టుకోవడం కూడా ఆ రోజుకి తప్పనిసరి కావచ్చు. అలాగని దస్తులు మరీ ఆర్భాటంగా ఉన్నా అవతలివారికీ, మనకీ కూడా అవి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.   ముఖ్యమైన ప్రశ్నలు ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అనేదాని మీద కొంత కసరత్తు అవసరం. మీ గురించి చెప్పండి? లాంటి సాధారణ ప్రశ్నల దగ్గర్నుంచీ... ఇన్నాళ్లూ ఖాళీగా ఎందుకున్నారు? లాంటి ఇబ్బందికరమైన ప్రశ్నల వరకూ ఎలాంటి ప్రశ్నకైనా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. అలాగని జవాబులని బట్టీపట్టమని కాదుగానీ, ఏ ప్రశ్ననైనా నిబ్బరంగా, నిజాయితీగా ఎదుర్కునేందుకు సమాయత్తం కావాలి.   ప్రవేశం, నిష్క్రమణ ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించగానే అధికారులను చిరునవ్వుతో పలకరిడంతో మన మీద తొలి అభిప్రాయం ఏర్పడిపోతుంది. ఇక చాలామంది ఇంటర్వ్యూ ముగిసింది కదా అన్న సంబరంలో హడావుడిగా వెళ్లిపోతూ ఉంటారు. అధికారులకు థాంక్స్‌ చెప్పడం, వారి దగ్గర నుంచి సెలవు తీసుకోవడం కూడా మర్చిపోతుంటారు. ఇంటర్వ్యూ గది బయటకి అడుగు పెడితే కానీ తతంగం ముగిసినట్లు కాదన్న విషయం గుర్తుంచుకోవాలి.     - నిర్జర.

వెన్నంటి వచ్చే ధైర్యం

  అతని లోకం ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. ఏదో మాయదారి ఇన్ఫెక్షన్ సోకి అతని రెండు కళ్లూ కనిపించకుండా పోయాయి. వైద్యులంతా చేతులెత్తేశారు. పరిచయస్తులంతా సానుభూతి చూపేందుకు సిద్ధపడిపోయారు. కానీ ఎవరి ఓదార్పూ కూడా అతనికి స్వాంతన కలిగించలేదు. అకస్మాత్తుగా గుడ్డివాడిగా మారిపోవడం అంటే జీవితం చేజారిపోవడమే అనిపించింది. కానీ ఎన్నాళ్లని అలా ఇంట్లో కూర్చుంటాడు! అతనికి తగినట్లుగా ఏదో ఒక పని చూసిపెడతామని ఆఫీసువాళ్లు కబురుపెట్టారు. దాంతో భార్యని తీసుకుని రోజూ ఆఫీసుకి వెళ్లడం మొదలుపెట్టాడు. మళ్లీ సాయంత్రం వేళకి భార్య ఆఫీసు దగ్గరకి వచ్చి అతన్ని ఇంటికి తీసుకువెళ్లేది.   రోజూ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి బస్సులో ఆఫీసుకి వెళ్లడం, భార్య అతన్ని ఆఫీసులో దింపేసి ఇంటికి వచ్చి తన పనుల్లో మునిగిపోవడం, తిరిగి ఆఫీసు ముగిసే సమయానికి అక్కడికి వెళ్లి భర్తని తీసుకురావడం... ఇదే వారి దినచర్యగా మారిపోయింది. ఇలా ఒక నెలరోజులు గడిచాయి. ఒక రోజు ఉదయం భార్య, భర్త దగ్గరకి వెళ్లి నిదానంగా ‘‘ఎన్నాళ్లని ఇలా రోజూ మీతో పాటు రాగలను. పైగా ఏదో ఒక రోజు మీరు ఒంటరిగా వెళ్లక తప్పదు. అందుకని ఇప్పటినుంచే ఒంటరిగా వెళ్లడాన్ని అలవాటు చేసుకోరాదా! ఇంటి ముందర బస్సు ఎక్కితే ఆఫీసు ముందర దిగుతారు కదా!’’ అన్నది.   భార్య మాటల్లో నిజం లేకపోలేదని అతనికి తెలుసు. రోజూ ఇంటిపని వదులుకొని అంతంత దూరం తనతో పాటు రావడం వల్ల ఆమెకు సమయం వృధా కావడమే కాదు, విపరీతమైన అలసట కూడా కలుగుతోంది. కానీ తన మానాన తనని వదిలేయాలన్న ఆమె నిర్ణయం అతనికి బాధని కలిగిస్తోంది. ‘నిస్సహాయంగా ఉన్న తనని అలా ఎలా ఒంటరిగా వదిలిపెట్టగలదు!’ అన్న ఆలోచన అతని మనసుని తొలిచేస్తోంది. కానీ తప్పదు! ఆ రోజు నుంచి తనే ఒంటరిగా ఆఫీసుకి వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. మొదట్లో తన భార్య తనని అలా వదిలిపెట్టేసినందుకు మనసు కుతకుతా ఉడికిపోయేది. కానీ రోజులు గడిచేకొద్దీ ఆమె తనతో రాకపోవడం వల్ల ఎలాంటి లోటూ కనిపించకపోయేది.ఇలా ఒక ఏడాది గడిచింది. ఒక రోజు అతను బస్సులో ఎక్కి ఎప్పటిలాగే ఒక ఖాళీ సీటులో చేరగిలపడ్డాడు. ఇంతలో అతని పక్కనే కూర్చున్న వ్యక్తి- ‘ఇవాళ ఆవిడ వచ్చినట్లు లేదేంటండీ?’ అంటూ అడిగాడు.‘ఎవరావిడ?’ అని యాంత్రికంగా ఎదురు ప్రశ్న వేశాడతను.   ‘‘అదే! రోజూ మీ వెనకే బస్సు ఎక్కి ఆ మూల ఉన్న సీట్లో కూర్చునేది. మళ్లీ మీ వెనకే ఆఫీసు దగ్గర దిగిపోయేది. ఓ రెండు రోజుల నుంచీ ఆవిడ కనిపించడం లేదు. ఆవిడ ఇల్లు కూడా మీ ఇంటి దగ్గరేనేమో అనుకుని అడిగాను,’’ అన్నాడు తోటి ప్రయాణికుడు.   ఒక్క క్షణం పాటు తోటి ప్రయాణికుడు ఏం చెబుతున్నాడో అర్థం కాలేదు. ఆ తరువాత అతని మాట వెనుక మర్మం తెలిసొచ్చింది. ఏడాది క్రితం తన భార్య ఒంటరిగా ఆఫీసుకి వెళ్లడం అలవాటు చేసుకోమని చెప్పింది. కానీ తను క్షేమంగా వెళ్తున్నాడా లేదా గమనించేందుకు రోజూ తనని వెన్నంటే వచ్చేదన్నమాట! రోజూ ఎలాంటి ఇబ్బంది లేకుండా తను గమ్యం చేరుకుంటున్నాడన్న భరోసా కలిగిన తరువాతే తను ఇంటికి పరిమితమైంది. తను ఒంటరిగా అడుగు వేయలేనప్పుడు నడవక తప్పని పరిస్థితి కల్పించింది. ఒంటరిగా నడవడం అలవాటయ్యేదాకా తన క్షేమాన్ని గమనించుకుంది. అంత గొప్ప తోడు దొరకడం ఎంత అదృష్టమో కదా అనిపించింది అతనికి. ఏమిచ్చి తన బదులు తీర్చుకోగలనా అన్న ఆలోచనలో పడిపోయాడు! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.

కొత్త భాషని నేర్చుకోవడం తేలికే!

  భాషంటే భావాలను పంచుకునే సాధనం మాత్రమే కాదు, అది ఒక భిన్నమైన సంస్కృతికి చిహ్నం. అందుకనే ప్రపంచాన్ని తెలుసుకోవాలనుకునేవారు వీలైనన్ని ఎక్కువ భాషలు నేర్చుకునేందుకు ఇష్టపడుతూ ఉంటారు. పైగా ఒకటికి మించి భాషలను నేర్చుకోవడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందనీ, మెదడు పనితీరు మెరుగవుతుందనీ, విశాలమైన దృక్పథం అలవడుతుందనీ పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. మరి మనకి ఏమాత్రం అలవాటు లేని ఒక కొత్త భాషను నేర్చుకొనేందుకు ఉపాయాలు ఉన్నాయా అంటే లేకేం!   తరచూ వినిపించే పదాలు వర్షం, ఊరు, భోజనం, ఇల్లు... ఇలా ప్రతి భాషలోనూ తరచూ వినిపించే పదాలు ఒక వందన్నా ఉంటాయి. ఆ వంద పదాలు నేర్చుకుంటే చాలు, కనీసం మన మనసులో ఉన్న మాటని చెప్పేయవచ్చు అనేలా ఉంటాయి. అలాంటి ముఖ్యమైన పదాలు కొన్నింటిని బట్టీపట్టేయండి. ఒకటికి పదిసార్లు వాటిని రాసి చూసుకుని, అవి మనకు పూర్తిగా వచ్చేవరకూ ఊరుకోవద్దు.   చిన్న చిన్న వాక్యాలు ముఖ్యమైన పదాలు వచ్చిన తరువాత వాటితో చిన్నచిన్న వాక్యాలను నిర్మించే ప్రయత్నం చేయాలి. నీ పేరేంటి? భోజనం చేశారా? వర్షం పడుతోంది! మీ ఇల్లు ఎక్కడ? వంటి వాక్యాలతో సంభాషించే ప్రయత్నం చేయండి. నువ్వు, నేను, నాది, నీది, అప్పుడు, ఇప్పుడు, ఎక్కడ, ఇక్కడ, ఒకటి, చాలా వంటి పదాలను జోడిస్తే వాక్య నిర్మాణం సులభమవుతుంది.   వ్యాకరణం జోలికి వద్దు ప్రతి భాషకీ తనదైన వాక్య నిర్మాణం ఉంటుంది. వాటికి సంబంధించిన వ్యాకరణ సూత్రాలన్నీ బట్టీపట్టాలంటే అయ్యే పని కాదు. భాష నేర్చుకునే సమయంలో చాలామంది చేసే పొరపాటు ముందుగానే వ్యాకరణ సూత్రాలని నేర్చుకునే ప్రయత్నం చేయడం. దాని వల్ల భాష మరింత గందరగోళంలో పడిపోయే ప్రమాదం ఉంది. తెలుగులో కర్త, కర్మ, క్రియ మనకి ఏం తెలుసని ఇంత తప్పులు లేకుండా మాట్లాడుతున్నాం! కాబట్టి భాషని ముందు సహజంగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఆ తరువాత దాని లోతులను తెలుసుకోవాలి.   వింటూ ఉండటమే భాషని వినడం ద్వారా నేర్చుకోవడం అనే సూత్రం ఇప్పటి తరానికి కొత్త కావచ్చు. కానీ ఒకప్పుడు దూరదర్శన్‌లో వచ్చే హిందీ కార్యక్రమాలను చూస్తూ హిందీ మీదే పట్టుసాధించేవారు. ఎందుకంటే అప్పట్లో చూసేందుకు మరో ఛానల్‌ ఉండేది కాదయ్యే! ఒక భాష నేర్చుకోవాలనే అనురక్తి ఉన్నప్పుడు ఒక పక్క ఆ భాషని నేర్చుకుంటేనే మరోపక్క అందులోని సంభాషణలను ఏదో ఒక రూపంలో వినడం వల్ల చాలా ప్రభావం కనిపిస్తుంది. అవి సినిమాలు కావచ్చు, వార్తలు కావచ్చు, ఆఖరికి నేతల ఉపన్యాసాలు కావచ్చు!   ఓనమాలు భాషలో అక్షరాలు నేర్చుకుని కూడబలుక్కుంటూ అయినా ఓ పది వాక్యాలను చదవగలిగితే కొత్త భాష గాడిలో పడినట్లే. ఒక భాషని చదవడం రాకపోతే, అందులో ఎంత ప్రావీణ్యం ఉన్నా వృధానే! చదువుతూ ఉంటే కొత్త కొత్త పదాలు కనిపిస్తుంటాయి. పక్కన ఓ చిన్న నిఘంటువు ఉంటే ఇక కొన్నాళ్లకి రోజువారీ కనిపించే పదాలన్నింటికీ అర్థం తెలుస్తూ ఉంటుంది.   మాట్లాడటం ముఖ్యం ఒక భాష మీద పూర్తిస్థాయి పట్టుసాధించాలంటే చాలా కాలమే పట్టవచ్చు. మనమేమీ అందులో పుట్టి పెరగలేదు కదా! కాబట్టి సరిగా రాదన్న భయంతోనో, ఎగతాళి చేస్తారన్న సిగ్గుతోనో భాషని మనలోనే దాచుకుంటే ఉపయోగం లేదు. భాషని ఎంతగా సంభాషణా రూపంలోకి తీసుకువస్తే దాని మీద అంత పట్టు పెరుగుతుంది. అందుకోసం ఆ భాష తెలిసిన పరిచయస్తులు ఎవరన్నా ఉంటే వారితో సంభాషించండి. ఎవరూ దొరక్కపోతే ఏదో ఒక అంశం మీద ఒక చిన్న వ్యాసం రాసేందుకు ప్రయత్నించండి. అప్పుడే భాష మీద మనకు ఎంతవరకూ పట్టు ఉందో తేలిపోతుంది.     - నిర్జర.

What makes you attractive?

What makes you attractive?   We might be an introvert at soul. But we have to play the Good Samaritan role while living in the society. We may have to please our customers or may have to appease our bosses. If we wish to alight some steps of success... we have to win a few hearts. Here are a few steps that make us acceptable for everyone at every testing time. Humour Humour isn’t a trait limited to a few people. Human brains are embedded with sense of humour and even Hitler isn’t an exception for that. A little bit of confidence and ability to express our thoughts is all that’s needed to be humorous. But there are three rules for that- watch the situation, mind your language and dont’ hurt others. Remember! It’s hard to ignore a humorous person. Confidence People with bundles of confidence can cast an easy spell over others. The way we look and the way we talk would always be influenced by our confidence.  Even if you are timid at your heart, try to look confident before others. It’s proved that when you act as if you are confident, your confidence gets improved in reality. The looks Everyone can’t be a Tom Cruise to be stunningly beautiful. But we all have a body to live in and let’s make it look impressive. Sticking to the basics of grooming is all thats needed to be attractive. Unsuitable clothing, body odour, gloomy face, bad breath... can all devastate our social lives. Simple tips like maintaining good posture and a smile on our face can save us a few impressions. Boring No one loves to waste their time with a chatterbox. But it’s hard to get along with a boring person too! So, let’s not turn the environment around us into a meditaion session. Let’s say something, let’s ask something, let’s hum something. Most of us are afraid to run a conversation with the fear of looking ignorant. But the art of conversation can never be perfected unless we speak out! And it’s not that bad to look ignorant sometimes. Character We may think that it’s hard to find out the character of a stranger. But human minds are so complicated that they could easily form an impression of one’s character. The way we speak, the way we express, the way we dress and the way we move... would all give some cues about our character. Our pride and humility can easily be judged within a few minutes of conversation. So lets be honest with us and with those around us. And that could certainly win us a few hearts.     - Nirjara  

అబద్ధం ఓ అందమైన అలవాటు

కొంతమంది పదేపదే అబద్ధాలు ఎందుకు చెబుతుంటారు? ఏదో అలవోకగా అడేసిన చిన్నపాటి అబద్ధం గొలుసుకట్టు అబద్ధాలకి ఎందుకు దారి తీస్తుంది? ఇలా అబద్ధాల చెప్పే అలవాటుని శాస్త్రీయంగా రుజువుచేయవచ్చా?... ఇలాంటి సందేహాలే వచ్చాయి లండన్‌కు చెందిన ‘టాలీ షారోట్‌’ అనే మనస్తత్వ శాస్త్రవేత్తకి. తన సందేహాలు రుజువు చేసుకునేందుకు ఆయన ఓ చిత్రమైన పరిశోధనని చేపట్టారు.    చిల్లర డబ్బుల పరిశోధన. టీలీ షారోట్ తన పరిశోధన కోసం 18 ఏళ్ల వయసు నుంచి 65 ఏళ్ల వయసు వరకు ఒక 80 మంది అభ్యర్థులను ఎన్నుకొన్నారు. వీళ్లకి చిల్లర డబ్బులు ఉన్న ఒక సీసాను చూపించి అందులో ఉన్న డబ్బుల గురించి ఇతరులకి చెప్పమన్నారు. అవతలివారికి డబ్బు గురించి లెక్కలు చెప్పేటప్పుడు అబద్ధం చెప్పే స్వేచ్ఛని కూడా ఇచ్చారు. అయితే ఇందులో మూడురకాల పరిస్థితులను కల్పించారు. కొన్ని సందర్భాలలో అబద్ధం వల్ల చెప్పినవాడికీ, విన్నవాడికీ కూడా మేలు జరుగుతుంది. మరికొన్ని సందర్భాలలో అబద్ధం చెప్పడం వల్ల ఇద్దరిలో ఎవరో ఒకరికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొన్ని సందర్భాలలో అబద్ధం చెప్పడం వల్ల ఒకరికి లాభం జరగడమే కాదు, అవతలివారికి నష్టం కూడా కలుగుతుంది.   మెదళ్లని పరిశీలించారు అభ్యర్థులు ఇలా పోటీలు పడి అబద్ధాలు చెప్పే సమయంలో వారి మెదడుని అత్యాధునిక fMRI స్కానింగ్‌ ద్వారా పరీక్షించారు. మెదడులోని ‘అమిగ్డలా’ అనే కేంద్రం భావోద్వేగాలను నియంత్రిస్తుంది. అబద్ధం చెప్పిన ప్రతిసారీ ఈ అమిగ్డలాలో ఎలాంటి స్పందనలు నమోదయ్యాయో పరిశోధకులు గమనించారు. చిత్రం ఏమిటంటే తొలిసారి అబద్ధం చెప్పినప్పుడు ఈ అమిగ్డలా చాలా తీవ్రంగా స్పందించింది. అబద్ధం చెప్పేందుకు అతను ఊగిసలాడుతున్నట్లు దీనివల్ల తేలిపోయింది. కానీ అబద్ధాలు సాగుతున్నకొద్దీ దీని ప్రతిస్పందన తగ్గిపోయిందట. దీనివలన అభ్యర్థులు మరింత పెద్ద అబద్ధాన్ని కూడా అలవోకగా చెప్పడాన్ని గమనించారు. పైగా తనకి లాభం కలిగేలా అబద్ధం చెప్పినప్పుడు అమగ్డోలా స్పందన నామమాత్రమగానే మిగిలిపోతోందని తేలింది. అంటే తన వ్యక్తిగత స్వార్థం కోసం అభ్యర్ధులు చాలా తేలికగా అబద్ధాలు చెప్పగలిగారన్నమాట.   ప్రయోజనాలు మనిషి అబద్ధం చెప్పినప్పుడు అతని మెదడు ఎలా స్పందిస్తుందనే విషయం మీద ఇదే తొలి పరిశోధన అని చెబుతున్నారు. ఒక వ్యక్తి చెప్పే మాటలు నిజమా కాదా అని నిర్ణయించేందుకు మున్ముందు లై డిటెక్టరు పరీక్షల బదులు ఇలాంటి పరీక్ష మరింత ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు ‘చిన్నచిన్న అబద్ధాలతో మొదలయ్యే ఒక ప్రయాణం ఒకోసారి తీవ్రమైన నేరాలకు ఎలా దారితీస్తుందో అర్థం చేసుకునేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుంది’ అంటున్నారు టాలీ షారోట్.   - నిర్జర.

సమస్యలు లేని దీపావళి కోసం!

   లక్ష్మీదేవిని పూజించుకునేందుకో, రాముడు అయోధ్యలో అడుగుపెట్టిన వేళని గుర్తు చేసుకునేందుకో, సత్యభామ చేతిలో నరకాసురుడు చనిపోయాడని సంబరాన్ని చేసుకునేందుకో- కారణం ఏదైతేనేం... దీపావళిని ధూంధాంగా చేసుకుంటున్నాం. కాకపోతే రోజురోజుకీ దీపావళి తీరే మారిపోతోంది. విపరీతమైన వెలుగూ, వేడీ, శబ్దాలను వెలువరించే టపాసులతో ఈ రాత్రి మోతెక్కిపోతోంది. ఇది పర్యావరణానికి కూడా కాస్త హాని కలిగిస్తోందంటున్నారు నిపుణులు...   గ్లోబర్‌ వార్మింగ్ వాతావరణంలోకి కార్బన్‌ డై ఆక్సైడ్ వంటి వాయువులు మోతాదుకి మించి చేరడం వల్ల భూతాపం పెరుగుతుందన్న విషయం తెలిసిందే! అయితే ఈ వాయువులు కేవలం పరిశ్రమల నుంచీ, వాహనాల నుంచీ మాత్రమే కాదు.... టపాసుల నుంచీ, కార్చిచ్చుల నుంచి కూడా వెలువడతాయన్న విషయం చాలామందికి తెలియదు. అలా కేవలం ఒక్క దీపావళి రోజునే టన్నుల కొద్దీ కార్బన్ డై ఆక్సైడ్‌ విడుదల అవుతుందట! ఇక టపాసుల నుంచి వెలువడే సల్ఫర్‌, నైట్రేట్‌ వంటి వాయువులు ఆక్సిజన్‌తో కలిసి నీటి మేఘాలను సైతం విషతుల్యం చేస్తున్నాయని తేలింది.   చెత్తాచెదారం దీపావళి ముగిసిన తరువాత వేలకొద్దీ టన్నుల చెత్త మిగిలిపోతుంటుంది. ఒక్క దిల్లీలోనే నాలుగువేల మెట్రిక్ టన్నుల టపాసుల చెత్త పేరుకుపోతుందని చెబుతున్నారు. రోజువారీ చెత్తలాగానే దీనిని కూడా డంపింగ్‌ యార్డులనో, సముద్రంలోనో కలిపేస్తూ ఉంటారు. కానీ ఈ కాగితాలకు అంటుకున్న రసాయనాలు నేలలోకి చేరినప్పుడు ఇటు భూసారాన్నీ, ఆటు భూగర్భజలాలనూ ప్రభావితం చేయక తప్పదు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పేరిస్‌ ఒకప్పుడు దీపావళి కోసమని కొనుక్కొనే ప్రమిదలు, బొమ్మలని మట్టితో తయారుచేసేవారు. కానీ ఇప్పుడు మట్టి బదులుగా చవకగా తేలికగా తయారైపోయే ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ వస్తువులే కనిపిస్తున్నాయి. ఇవి నీటిలో కానీ, నేలలో కానీ ఓ పట్టాన కరగవు సరికదా... వీటికి అద్దే రంగులలో లెడ్‌, క్రోమియం వంటి విషకారకాలు భూమిని విషతుల్యం చేసిపారేస్తున్నాయి.   బాలకార్మికులు ప్రపంచవ్యాప్తంగా పిల్లలకి సంతోషం కలిగించే విషయాలు రెండు. ఒకటి చాక్లెట్లు, రెండు టపాసులు. విషాదం ఏమిటంటే ఈ రెండు పరిశ్రమల్లోనూ వెట్టిచాకిరీ చేసేది కూడా పిల్లలే. ఆఫ్రికాలో పిల్లలు కోకో పరిశ్రమలో నలిగిపోతుంటే, శివకాశి వంటి ప్రాంతాల్లో టపాసుల పరిశ్రమలో పిల్లలే పావులుగా ఉన్నారు. ప్రభుత్వ చర్యలకు భయపడి పెద్ద పెద్ద సంస్థలు పిల్లలతో పనిచేయించేందుకు వెనుకంజ వేస్తున్నా... శివకాశిలోని కుటీరపరిశ్రమల్లో వేలమంది పిల్లల జీవితాలు కడతేరిపోతున్నాయని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. నిరంతరం ఈ హానికారక రసాయనాల మధ్య పనిచేయడం వల్ల వారు ఆస్తమా, క్షయ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు లోనవుతున్నారట.   కాలుష్యాలు దీపావళి నాడు కాల్చే టపాసుల నుంచి స్ట్రోటియం, మెగ్నీషియం, బేరియం వంటి హానికారక పదార్థాలు రోజుల తరబడి గాలిలో తిష్టవేసుకుని ఉండిపోతున్నాయి. ఇవి మన శరీరంలోకి చేరి రకరకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. దీపావళి రోజున టపాసుల వెలుతురుతో కాంతి కాలుష్యం ఏర్పడి పక్షులు, రాత్రివేళ సంచరించే జీవులు మృత్యుబారిన పడుతున్నాయి. ఇక టపాసుల నుంచి డెసిబల్స్ కొద్దీ వెలువడే శబ్ద కాలుష్యంతో ప్రతి జీవికీ నష్టమే!   అలాగని మన సంప్రదాయంలో ముఖ్యమైన దీపావళిని జరుపుకోవద్దని చెప్పే సాహసం ఎవ్వరూ చేయలేరు. మారిపోయిన పరిస్థితులను బట్టి దీపావళి టపాసుల గురించి కంగారుపడుతున్నామే కానీ, ఈ పండుగ వెనుక ఉన్న వైజ్ఞానిక కారణాలను ఎవ్వరూ కాదనలేరు. కాబట్టి ఆచితూచి మనకీ, ఇతరులకీ ఇబ్బంది కలగని విధంగా ఈ పండుగ జరుపుకోవడం అందరికీ శ్రేయస్కరం.   - నిర్జర.

బంగారం కొనేటప్పుడు మోసపోవద్దు!

  దనత్రయోదశి వచ్చిందంటే అందరికీ బంగారం మీదే దృష్టి పడుతోంది. శుభసూచకం అనో, సందర్భం వచ్చింది కదా అనో ఎంతోకొంత బంగారాన్ని కొనడం ఆనవాయితీగా మారింది. ఇక ధనత్రయోదశి తరువాత వచ్చే దీపావళి, కార్తీకమాసం, నూతన సంవత్సరం, సంక్రాంతి... ఇలా ఏదో ఒక సందర్భంలో బంగారాన్ని కొనుగోలు చేయడమూ ఎక్కువగానే ఉంది. ఇలాంటప్పుడు కేవలం సెంటిమెంటు మాత్రమే ఉంటే సరిపోదు... బంగారం కొనుగోలు విషయంలో ఎలాంటి మోసానికీ లోను కాకుండా ఉండటమే ముఖ్యం!   క్యారెట్ల విషయంలో మోసం బంగారాన్ని క్యారెట్ల విషయంలో కొలుస్తారన్న విషయం వేరే చెప్పనవసరం లేదు. 24 క్యారెట్‌ బంగారం అంటే 99 పాళ్లు స్వచ్ఛమైన బంగారం అని లెక్క. కానీ ఇంత స్వచ్ఛమైన బంగారంతో చేస్తే ఆభరణాలు త్వరగా విరిగిపోతాయి. అందుకే ఆభరణాలకు దృఢత్వాన్ని ఇచ్చేందుకు, వాటిలో రాగి వంటి లోహాలను కలుపుతారు. ఇలా ఇతర లోహాల కలయికను బట్టి 22, 21, 18 క్యారెట్ల బంగారం అంటూ పేర్కొంటారు.   22 క్యారెట్ల బంగారంలో 91.6 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మనం తరచూ వినే 916 బంగారం ఇదే! ఇక 18 క్యారెట్ల బంగారంలో కేవలం 75 శాతం మాత్రమే నిజమైన బంగారం ఉంటుంది. చాలా సందర్భాలలో బంగారు దుకాణాలు మనకి 18 క్యారెట్ల బంగారాన్ని అందించి 22 క్యారెట్ల బంగారపు విలువని వసూలు చేస్తాయి. అందుకని ఆ రోజు బంగారం రేటు ఎంత ఉంది అని తెలుసుకుంటే సరిపోదు! ఏ క్యారెట్‌ బంగారానిది ఏ రేటు అని కూడా గమనించాలి. దానికి అనుగుణంగానే ఖరీదు కట్టారో లేదో చూసుకోవాలి.   తరుగుదల, మజూరి ఆభరణం కోసం వాడిన బంగారానికి మాత్రమే కాదు... దానిని రూపొందించేందుకు అయ్యే మజూరి, రూపొందే క్రమంలో పోయిన తరుగుని కూడా బిల్లులో కలుపుతుంటారు. ఈ తరుగు, మజూరీ అనేవి ఆభరణాన్ని బట్టి, దాని రూపుని బట్టి మారిపోతుంటాయి. కాబట్టి ఒక పక్క మనసుకి నచ్చిన ఆభరణాన్ని ఎంచుకొంటూనే, మరోపక్క దానికి అయ్యే తరగు, మజూరీలు వీలైనంత తక్కువగా ఉండేలా సమతూకాన్ని పాటించాలి.   తూకం బంగారం విలువ ఎక్కువ కాబట్టి, ఒకటి రెండు గ్రాములలో తేడా వచ్చినా బిల్లులో భారీ మార్పు తప్పదు. కాబట్టి మిల్లీగ్రాములతో సహా లెక్కకట్టగలిగే తూనికలను వాడాలన్నది ప్రభుత్వ ఆదేశం. అలాంటి తూకాలు ఉన్న దుకాణాలలోనే బంగారం కొనుగోలు చేయడం ఉత్తమం. పైగా ఆభరణపు బరువులోంచి, దానికి అతికించిన రాళ్ల బరువుని తీయించడం చాలామంది మర్చిపోతుంటారు. వీటివల్ల అపారమైన నష్టం తప్పదు. బంగారాన్ని ఎక్కువ మొత్తంలో కొన్నప్పుడు, మొత్తం మీద ఒక పదిగ్రాముల తేడా వచ్చినా ముప్ఫై వేల నష్టం తేలుతుంది. ఇలాంటప్పుడు, మరోచోట ఈ తూకాన్ని సరిచూసుకోవడంలో తప్పులేదు.   హాల్‌మార్కు తప్పనిసరి హాల్‌మార్కు ఉన్న నగలకి ప్రభుత్వమే భరోసా! ఎందుకంటే ప్రభుత్వం తరఫు నుంచి సదరు నగని ఎవరు తయారుచేశారు, ఎప్పుడు తయారుచేశారు, అందులో ఉన్న బంగారం శాతం ఎంత, ఏ హాల్‌మార్కు కేంద్రంలో అది నమోదైంది తదితర వివరాలు స్పష్టంగా ఉంటాయి. ఇలాంటి నగల విషయంలో మోసం జరిగే అవకాశం తక్కువ.   రసీదు తప్పనిసరి బంగారానికి ఎంత లెక్కకట్టారు, మేకింగ్‌ ఛార్జెస్‌కు ఎంత జోడించారు, ఎంత తరుగు పోయింది... వంటి వివరాలన్నింటితనూ రశీదు తీసుకోవడం తప్పనిసరి. మున్ముందు ఆభరణం విషయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తినా ఈ రశీదే మనకు ఉపయోగపడుతుంది.   అప్పు చేసి ఆభరణం వద్దు ఏదో పిల్లల పెళ్లి వంటి అత్యవసరమైన సందర్భాలకు తప్ప అప్పు చేసి మరీ బంగారాన్ని తీసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. బంగారం రేట్లు ఎప్పటికప్పుడు పెరిగే మాట నిజమే అయినా... మనం చెల్లించే వడ్డీకీ, సదరు పెరుగుదలకీ పొంతన ఉండదు. పైగా బంగారాన్ని లాకర్లలో పెట్టుకొనేందుకు కూడా ఒకోసారి భారీగా అద్దెలు చెల్లించుకోవాలసి ఉంటుంది. అందుకని చేతిలో మిగులు సొమ్ములు ఉంటే తప్ప బంగారాన్ని కొనుగోలు చేసే సాహసం చేయవద్దంటున్నారు.   - నిర్జర.

మీ చూపుడు వేలు చిన్నదిగా ఉందా!

మన చేతిలో వేళ్ల పొడవుని బట్టి, ఇతర వేళ్లతో వాటికి ఉండే పోలికను బట్టి పెద్దలు రకరకాల జోస్యాలు చేస్తుంటారు. వీటిలో కొన్ని వారి వారి అనుభవంతో చెప్పినవి కావచ్చు. మరికొన్ని ఊసుకోని ఊహలు కావచ్చు. కానీ వేళ్లని చూసి మనస్తత్వాన్ని అంచనా వేయవచ్చని ఇప్పుడో పరిశోధన రుజువుచేస్తోంది. అంతేకాదు! ఒక మనిషి ఏ రంగంలో రాణించగలడో కూడా చెప్పవచ్చునంటోంది.   ఉంగరం వేలు- చూపుడు వేలు ఒక్కసారి మీ చేతి వంక చూసుకోండి. కొందరికి వారి ఉంగరం వేలు, చూపుడు వేలుకంటే పెద్దదిగా ఉంటుంది. మరికొందరికి చూపుడు వేలే ఉంగరపు వేలుకంటే పెద్దదిగా ఉంటుంది. సరే! మరికొందరికి రెండు వేళ్లూ సమానంగా ఉంటాయనుకోండి. తల్లి కడుపులో ఉన్నప్పుడు, మనకి లభించిన టెస్టోస్టెరోన్‌ అనే హార్మోనులో మార్పుల వల్లే ఇలా రెండు వేళ్లలో తేడాలు ఉంటాయని తేలింది. టెస్టోస్టెరోన్‌ ఎక్కువైతే టెస్టోస్టెరోన్‌ అనే హార్మోను పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది వారిలోని పునరుత్పత్తిని నిర్దేశిస్తుంది. స్త్రీలలో కూడా ఈ హార్మోను ఉత్పత్తి ఉంటుంది కానీ, పురుషులతో పోలిస్తే ఇది చాలా తక్కువ. తల్లి కడుపులో ఉండగానే శిశువుకి ఈ హార్మోను ఎక్కువపాళ్లలో అందితే వారి చూపుడు వేలు, ఉంగరపు వేలుకంటే చిన్నగా ఉంటుందట. అదే తగినంతగా అందకపోతే ఉంగరపు వేలే చిన్నదిగా ఉంటుందట. ఇది జ్యోతిషులు చెప్పిన మాట కాదు... శాస్త్రవేత్తలు తేల్చి చెప్పిన వాస్తవం. ప్రభావం ఉంటుంది ఇలా చిన్నప్పుడే టెస్టోస్టెరోన్ హార్మోను ఎక్కువగా పొందినవారు ఇతరులతో పోలిస్తే చాలా దృఢంగా ఉంటారని తేలింది. వీరు క్రీడలలో సమర్థంగా రాణించగలరట. ఇక దారులను గుర్తుంచుకోవడం, క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలను వెతకడం వంటి ప్రతిభ కూడా వీరిలో అధికంగా ఉంటుంది. అంతేకాదు! వీరిలో జీవితాంతమూ టెస్టోస్టెరోన్‌ ఇలా అధికమొత్తంలో విడుదల అవుతూ ఉంటుందట. అలాగని చిన్నప్పుడు టెస్టోస్టెరోన్‌ తక్కువగా పొందినవారిని (ఉంగరపు వేలు చిన్నగా ఉన్నవారు) తక్కువగా చేయడానికి వీల్లేదు. వీరు జ్ఞాన సంబంధమైన విషయాలలో ముందుంటారట. మనుషులను గుర్తుంచుకోవడం, చదివిన విషయాలను పొల్లుపోకుండా అప్పచెప్పగలగడం వంటి ప్రతిభ వీరిలో అపారంగా ఉంటుంది. జబ్బులు కూడా చూపుడు వేలు, ఉంగరపు వేళ్లని బట్టి వారి ప్రతిభను మాత్రమే కాదు... వివిధ మానసిక సమస్యలు వచ్చే అవకాశాన్ని కూడా పసిగట్టవచ్చునంటున్నారు. చూపుడు వేలు చిన్నగా ఉన్నవారు ADHD, ఆటిజం వంటి తీవ్రమైన సమస్యలకు లోనయ్యే ప్రమాదం ఉంటుందట. ఇక ఉంగరపు వేలు చిన్నగా ఉన్నవారు చీటికీమాటికీ ఉద్వేగానికి లోనవ్వడం, క్రుంగుబాటు వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు.   నార్వేజియన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 42మంది మీద పరిశోధన చేసి తేల్చిన ఫలితాలివి. మన శరీర ఆకారానికీ హార్మోనులకీ మధ్య అవినాభావ సంబంధం ఉందని ఈ పరిశోధనతో తేలిపోతోంది. అయితే ఇది కేవలం ఎదుటి వ్యక్తి గురించి ఒక అంచనాను మాత్రమే అందించగలదు. ఎందుకంటే ఒక మనిషి ప్రతిభ ఏమిటన్నది అంతిమంగా అతని వ్యక్తిత్వం మీదే ఆధారపడి ఉంటుంది కదా!   - నిర్జర.

మాయ చెట్టు

  ఆ వడ్రంగికి ఆ రోజు పెద్ద బేరం తగిలింది. తన పాత ఇంటికి అవసరమయ్యే చిన్నచితకా మరమ్మత్తులను చేసిపెట్టమంటూ ఒక పెద్దాయన వడ్రింగిని పిలిపించాడు. చాలా రోజుల తరువాత మంచి పని దొరికింది కదా అనుకుని ఉత్సాహంగా బయల్దేరాడు వడ్రంగి. కానీ పని మొదలు పెట్టిన దగ్గర్నుంచీ ఏదీ అతనికి అనుకూలంగా సాగలేదు. రంపం మధ్యలోకి విరిగిపోయింది. డ్రిల్లింగ్‌ చేయబోతే ఫ్యూజులు కాస్తా ఎగిరిపోయాయి. నేల మీద పడి ఉన్న పాతమేకు ఒకటి కాల్లోకి దిగబడిపోయింది. ఇలా ఏదో ఒక అవాంతరం అడుగడుగునా ఎదురుపడుతూనే ఉంది.   ఒకదాని తరువాత ఒకటిగా వచ్చిన సమస్యలని చూసి వడ్రంగికి చిరాకెత్తిపోయింది. చీకటిపడే వేళకి జరగాల్సిన పనిలో మూడో వంతు కూడా పూర్తికానేలేదు. తీరా ఇంటికి వెళ్దామని బయల్దేరబోతుంటే అతని బండి కూడా మొరాయించింది. ‘‘ఈ బండిని ఇక్కడే వదిలెయ్యి! ఇవాల్టికి నేను నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతానులే!’’ అన్నాడు ఆ ఇంటి యజమాని. అలా ఆ పెద్దాయనతో కలసి తన ఇంటికి వెళ్లాడు వడ్రంగి. తన ఇల్లు చేరుకోగానే ‘‘ఎలాగూ ఇక్కడిదాకా వచ్చారు. కాస్త లోపలకి వచ్చి టీ తాగి వెళ్దురు,’’ అని అభ్యర్థించాడు వడ్రంగి. వడ్రంగి మాటను కాదనలేకపోయాడు పెద్దాయన. ఇద్దరూ కలిసి ఆ ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టారు.   వడ్రంగి ఆ ఇంటి ఆవరణలోకి అడుగుపెడుతూనే నేరుగా ఒక చిన్న మొక్క దగ్గరకి వెళ్లాడు. దాని లేత కొమ్మలను ఒకసారి తన వేళ్లతో తాకి ఇంట్లోకి అడుగుపెట్టాడు. అంతే! అప్పటివరకూ చిరాకుగా ఉన్న అతనిలో చిత్రమైన మార్పు కనిపించింది పెద్దాయనకు. మొహంలో చిరాకు స్థానాన్ని చిరునవ్వు ఆక్రమించింది. అతణ్ని చూడగానే పరుగులెత్తుకుంటూ వచ్చిన ఇద్దరు పిల్లలనూ ఒక్కసారిగా గుండెలకు హత్తుకున్నాడు. భార్యను పిలిచి యజమాని గురించి గౌరవంగా నాలుగు మాటలు చెప్పాడు. ఆమె యజమాని కోసం ఫలహారం చేయడంలో సాయపడ్డాడు.   ఏదో మాయ జరిగినట్లుగా వడ్రంగిలో ఒక్కసారిగా వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యం వేసింది పెద్దాయనకు. అందుకే తిరిగివెళ్తూ- ‘‘నువ్వు ఈ చెట్టు దగ్గరకి వచ్చి దాన్ని ముట్టుకున్నప్పటి నుంచీ నీలో నాకు భలే మార్పు కనిపించింది. దీని వెనుక కారణం ఏమన్నా ఉందా!’’ అని అడిగాడు ఆసక్తిగా.   పెద్దాయన ప్రశ్నకి వడ్రంగి చిరునవ్వుతో ‘‘మరేం లేదండీ! పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్తూ తమ ఆయుధాలను ఎలాగైతే జమ్మి చెట్టు మీద ఉంచి వెళ్లారో... అలా నాకు ఉద్యోగంలో ఎదురయ్యే చిరాకులన్నింటినీ సాయంవేళకి ఈ చెట్టు మీద తగిలించేస్తాను. ఆ తరువాత ఒక ఉద్యోగిలా కాకుండా... ఒక భర్తలాగా, ఒక తండ్రిలాగా ఈ ఇంట్లోకి ప్రవేశిస్తాను. మర్నాడు ఉదయం తిరిగి పనిలోకి వెళ్లేముందు తిరిగి ఆ చిరాకులని చెట్టు మీద నుంచి తిరిగి తీసుకుంటాను. కానీ అదేం చిత్రమో కానీ, ఆ చిరాకులు ముందు రోజు సాయంత్రం ఉన్నంత భారంగా మర్నాటికి అనిపించవు,’’ అంటూ బదులిచ్చాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)     - నిర్జర.

వివక్షను నిరూపించిన ప్రయోగం

అది 1968 సంవత్సరం, ఏప్రిల్‌ 4. అమెరికాలో నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడుతున్న ‘మర్టిన్‌ లూథర్‌ కింగ్’ అనే నాయకుని, శ్వేతజాతీయులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ఈ సంఘటనతో అమెరికా అంతా అట్టుడికిపోయింది. అమెరికాలో ఉన్న నల్ల జాతీయుల మీద అకృత్యాలు పెరిగిపోతున్నాయంటూ మేధావులు గగ్గోల పెట్టేశారు. ఆ దేశంలోని వివిధ జాతుల మధ్య సఖ్యత కుదిరేది ఎలాగా అంటూ నేతలు మధనపడిపోయారు. ఇదే సమయంలో ‘జేన్‌ ఎలియట్‌’ అనే ఉపాధ్యాయురాలు మరో విధంగా ఆలోచించడం మొదలుపెట్టింది.   వివక్ష మూలాలు జేన్‌ ఎలియట్‌ అమెరికాలోని లోవా నగరంలోని ఓ పాఠశాలలో మూడో తరగతి పిల్లలకు పాఠాలు చెబుతూ ఉండేది. లూథర్‌ కింగ్‌ హత్య జరిగిన తరువాత ఆమె తన విద్యార్థులని వివక్ష గురించి రకరకాల ప్రశ్నలు అడిగింది. అందులో శ్వేతజాతీయులైన పిల్లలు తాము నల్లజాతీయుల పిల్లలు పనికిరానివారిగా భావిస్తూ ఉంటామనీ, వారిని నిగ్గర్లని పిలుస్తూ అవమానిస్తూ ఉంటామనీ చెప్పారు. నల్లజాతి పిల్లలేమో తాము వివక్షకు గురవుతున్న విషయం తమ మనసుకి తెలుస్తూనే ఉందని తేల్చి చెప్పారు.     ఒక వింత ప్రయోగం పిల్లలలో వివక్ష ఎలా మొదలవుతుంది? దాని కారణంగా వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? వివక్షకి సంబంధించిన దృక్పథం వారి చదువు మీద ఎలా పడుతుంది?... వంటి ప్రశ్నలకు పిల్లలే జవాబులు కనుక్కునేలా చేయాలని ఎలియట్‌ భావించారు. ఇందుకోసం ఆమె రెండు రోజుల పాటు తన తరగతిలో ‘A Class Divided’ అనే ఓ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మొదటి రోజున నీలం కళ్లు ఉన్నవారు నల్లటి కళ్లున్నవారికంటే చాలా అధికులని పిల్లలని నమ్మించారు ఎలియట్‌. నల్లటి కళ్లున్నవారు తెలివితక్కువవారనీ, సంస్కారం లేనివారనీ, మాట వినరనీ చెప్పుకొచ్చారు. వారితో ఆడకూడదంటూ నీలం కళ్లున్నవారికి సూచించారు. పైగా తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు నీలం కళ్లున్నవారు ప్రత్యకమైన కాలర్‌ ధరించవచ్చని చెప్పారు.   ఫలితం అనూహ్యం శ్వేత జాతీయులు, నల్ల జాతీయులు అన్న తేడా లేకుండా నీలం కళ్లు ఉన్నవారు ఎలియట్ మాటలకి చెలరేగిపోయారు. ఒక్క పూటలోనే వారి ప్రవర్తన మారిపోయింది. నల్లని కళ్లున్నవారిని నీచంగా చూడటం, వారిని ఏడిపించడం, ఇంకా మాట్లాడితే కొట్టడం చేయసాగారు. అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల పిల్లలు కాస్తా రాక్షసంగా మారిపోయారు. వారిలో అన్ని రంగాలలో ఆధిక్యత కనిపించింది. చదువులో కూడా నల్లరంగు పిల్లలకంటే మెరుగైన ఫలితాలు సాధించారు.     ప్రయోగంలో మార్పు! మర్నాడు ఎలియట్‌ పిల్లల ముందు మరో ప్రతిపాదన చేశారు. తాను నిన్న నీలం రంగు పిల్లలు అధికులని చెప్పాననీ, నిజానికి నల్లకళ్లున్న పిల్లలే గొప్పవారనీ... వారే అధికులనీ తేల్చి చెప్పారు. నల్ల కళ్లున్న పిల్లల నీలం రంగు కళ్లున్న పిల్లలని దూరంగా పెట్టాలని సూచించారు. అనూహ్యంగా అంతకు ముందు రోజు నీలం రంగు కళ్లున్న పిల్లలు ఎలా ప్రవర్తించారో, మర్నాడు నల్లకళ్ల పిల్లలూ అలాగే ప్రవర్తించారు. ఆవేళ చదువులో వారిదే పైచేయిగా సాగింది.   విశ్లేషణ ఫలానా జాతివాళ్లు, రంగువాళ్లు, కులంవాళ్లు గొప్పవారు అనే భావన మనిషి మనస్తత్వం మీద ఎలా ప్రభావం చూపుతుందో తెలియచేసే గొప్ప ప్రయోగం ఇది. తరువాత కాలంలో ఎలియట్‌ ఇదే ప్రయోగాన్ని పెద్దవారి మీద ప్రయోగించి ఇదే తరహా ఫలితాలను పొందారు. నిజానికి ఎవరూ ఉన్నతులు కారనీ, తాము ఉన్నతులం అనుకునే దృక్పథమే వారి ప్రవర్తనను ప్రభావితం చేస్తుందని ఎలియట్‌ తేల్చి చెప్పారు. అంతేకాదు! ఇలాంటి వివక్షతో కూడిన వాతావరణం పిల్లల నేర్పు మీద తప్పకుండా ప్రభావం చూపుతుందని తేల్చారు.   ఇప్పటికీ చాలామంది నల్లజాతీయుల పిల్లలు తెలివితక్కువవారని భావిస్తుంటారు. దానికి సంబంధించిన గణాంకాలను కూడా చూపిస్తుంటారు. నిజానికి సదరు పిల్లలు వెనుకబడి ఉండటానికి వారి చుట్టూ కల్పించిన అవిశ్వాసపు వాతావరణమే అంటున్నారు శాస్త్రవేత్తలు. అలాంటి వివక్షపు అడ్డుగోడలను కూల్చివేసిన రోజున, తరతరాలుగా పేరుకున్నా తప్పుడు అభిప్రాయాలను మార్చుకున్న రోజున... అందరూ సమానంగా జీవించగలరని ఈ ప్రయోగం తేల్చిచెబుతోంది.     - నిర్జర.

10 Tips to avoid computer virus

  We may not have enough expertise to differentiate between Viruses, Worms, Trojan horses and Spyware. But we all knew they are the kinds of Malware that could harm our computers! We can of course carry on our regular work on the computers despite being the drives being infested. But it isn’t certainly a pleasant experience to watch the screen filled with those nasty files and messages created by the virus. These are a few time tested tips that could prevent our computers being flooded with virus. 1- Never click on any e-mail attachments or links without being sure of its content. Never click on a pop up window even if it assures the best gifts in the world. 2- Don’t think much about the cost to be spent on an anti-virus. An effective and up-to-date antivirus could certainly save you from a huge trouble that can’t be estimated in the terms of money. Antivirus is just like a health insurance. You never know when it could save you! 3. Disabling the `Auto run’ feature can protect our system from the virus files that automatically gets executed whenever an infested CD or Pen drive is inserted. 4. Don’t click on the buttons that ask you to download certain software in order to watch a movie or enter a website. They can certainly be a menace in future.   5. Never leave your Wi-Fi open to public. Lock with a password and keep it private. Don’t use a free Wi-Fi on a devise where you have stored your personal information. 6. Now a day, external storage devices are not as costly as they used to be. So it’s always a great option to backup your data periodically. This would let you to format your computer when it is infested with virus. Further it would prevent your data being corrupted by the virus. 7. Pen drives are the easiest ways for the virus to enter the system. So don’t push every USB of your friend into your system. And don’t use your USB on a system which has no active antivirus. 8. When you are working on a system that is connected to a network... it is always recommended to turn on the FIREWALL option on windows.     9. Update your browser regularly so that you can take advantage of their advanced options such as pop-up blocking. 10. Some applications request to have access to your mail as well as `manage your contacts’. Be sure whether to share your privacy with such website or not! - Nirjara

మహత్యం ఎంతకి దొరుకుతుంది

  ఎవరో ఏడుస్తున్న శబ్దం విన్న హరితకి హఠాత్తుగా మెలకువ వచ్చింది. గోడ మీద ఉన్న గడియారం వంక చూస్తే సమయం రాత్రి మూడయ్యింది. ఇంతలో పక్క గదిలోంచి మరోసారి ఎవరో వెక్కివెక్కి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఆ వెక్కిళ్ల మధ్య ‘అంటే పిల్లవాడు మనకి దక్కడంటారా!’ అన్న తల్లి మాటలు వినిపించాయి.   ‘మెదడుకి ఆపరేషన్‌ అంటే మాటలా!’ ఇప్పటికిప్పుడు లక్షలకి లక్షలు కావాలి. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది. అమ్ముకోవడానికి ఇల్లు లేదు. అప్పు చేయడానికి పరపతి లేదు. నెలనెలా వచ్చే జీతం బొటాబొటీగా మన ఇల్లు గడిచేందుకే సరిపోతోంది. ఏదో ఒక మహత్యం మన జీవితాల్లో ప్రవేశిస్తే తప్ప వాడు బతికేలా లేడు..’ గద్గదమైన స్వరంతో అనునయిస్తున్నాడు తన తండ్రి.   తమ్ముడికి వచ్చిన అనారోగ్యం గురించే తన తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నారన్న విషయం హరితకి అర్థమైంది. కానీ ఆ ఎనిమిదేళ్ల పాపకి మహత్యం అన్న మాటకి మాత్రం అర్థం బోధపడలేదు. కాకపోతే మహత్యం ఉంటే తన తమ్ముడి అనారోగ్యం నమయవుతుందని మాత్రం తెలుసుకొంది. దాంతో తెల్లవారిన వెంటనే సందు చివర ఉన్న మందుల షాపుకి వెళ్లి మహత్యం కొని తీసుకురావాలని మాత్రం నిర్ణయించుకుంది.   ఆ రాత్రి హరితకి నిద్రపట్టలేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా! ఎప్పుడు తన తమ్ముడి కోసం మహత్యాన్ని కొనుక్కువద్దామా అని ఎదురుచూడటమే సరిపోయింది. ఇంతలో భళ్లున తెల్లవారింది. ఎన్నో రోజుల నుంచి తను పైసాపైసా పోగేసుకుంటూ వచ్చిన డబ్బుల్ని చూసుకుంది. మొత్తం 69 రూపాయల లెక్క తేలింది. ఆ డబ్బులన్నీ ఒక చిన్న మూట కట్టుకుని మందుల షాపు దగ్గరకు చేరుకుంది.   మందుల షాపు ఖాళీగానే ఉంది. కానీ ఆ షాపు యజమాని మాత్రం ఎవరో పెద్దాయనతో ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించాడు. అతనిలో మాట్లాడే హడావుడిలో షాపులోకి వచ్చిన హరితని గమనించనేలేదు. ‘అంకుల్‌!’ పిలిచింది హరిత. మందులషాపు యజమాని ఆ మాటలకి ఉలకలేదు, పలకలేదు. హరితకి ఒక్కసారిగా తన తమ్ముడు గుర్తుకువచ్చి ఏడుపు ముంచుకువచ్చింది. ‘‘అంకుల్‌! నా తమ్ముడికి ఒంట్లో బాగోలేదు. వాడి కోసం అర్జంటుగా ఒక మహత్యం కావాలి!’’ అంటూ గట్టిగా అరిచింది.   హరిత మాటలు విన్న ఆ ఇద్దరూ ఒక్కసారి ఆమె వంక చూశారు. హరిత కళ్లలో నీరు. షాపతనితో మాట్లాడుతున్నతను ఒక్కసారి హరితను దగ్గరకు తీసుకుని ‘‘మీ తమ్ముడికి ఏం జరిగిందమ్మా!’’ అంటూ అనునయంగా అడిగాడు. ‘‘వాడికి మెదడులో ఏదో తేడా చేసిందట. అది నయం కావాలంటే ఏదో మహత్యం కావాలంట,’’ అంటూ ఏడుస్తూ చెప్పింది హరిత. ఆ పెద్దాయన ఏదో కాసేపు ఆలోచించాడు. ఆ తరువాత ‘‘పద! ఓసారి మీ ఇంటికి వెళ్లి మీ అమ్మానాన్నలతో మాట్లాడదాం,’’ అంటూ హరితను బయల్దేరదీశాడు.   ఇంతకీ ఆ పెద్దాయన ఓ పేరు మోసిన వైద్యుడు. తన బంధువుని ఓసారి పలకరించి పోయేందుకని మందుల షాపుకి వచ్చాడు. అక్కడ అనుకోకుండా ఆయనకు హరిత తారసపడింది. హరిత ఇంటికి చేరుకున్న ఆ వైద్యుడికి వారి పరిస్థితి బోధపడింది. వెంటనే పైసా తీసుకోకుండా తన ఆసుపత్రిలో అతని ఆపరేషన్‌కు ఏర్పాటు చేశాడు. ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయ్యింది. ‘‘నిజంగా ఇలాంటి ఆపరేషన్‌ చేయించాలంటే మన స్తోమత సరిపోయేది కాదు కదా,’’ అన్నాడు ఆసుపత్రి బయట నిల్చొన్న తన భార్యని చూస్తూ.  ‘‘నిజమే! కానీ స్తోమత లేకపోతేనేం. తన తమ్ముడిని ఎలాగైనా బతికించుకోవాలనుకునే హరిత వాడికి తోడుగా ఉంది కదా! అలాంటి మంచి మనసు ఉన్న పిల్ల చాలు. మన కుటుంబం ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలదు,’’ అని బదులిచ్చింది హరిత తల్లి. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   ..Nirjara

`I and Me’ theory

  Humans might have reached advanced stages in the field of science, but the world hidden in their mind is still a Pandora’s Box. The questions like- How does a man think about himself? How does he form his character? What really influences his personality? Has always been a source of numerous theories. One such theory is put forward by an American Philosopher named George Herbert Mead.   The Founder Mead is thought to be one of the founders of Social Psychology. Social Psychology deals with the influence of society over the thoughts and behaviour of an individual. Mead have contributed various aspects in such Social Psychology and thus regarded as one of the significant psychologist in the lineage of Freud. The `I and Me’ theory proposed by Mead is thought to be the most path breaking theory in his life.   The Influence There is no doubt that a man is a social animal. Though he seems to have a unique character of his own, such character is obviously influenced by the society. Right from our birth, we are sub consciously influenced by a lot of factors like the culture we are born and by the behaviour of our parents. As we grow up, we get influenced by our surroundings, our friends and our teachers. Thus in every stage of our life, we are being influenced by some factor or the other.   The Theory Mead proposes that we have two identities within us. One is the `Me’ and the other one is the `I’. `Me’ is the set of influence that society has made on us. It is the set of attitudes and beliefs formed through the society. `I’ is the individual impulse. `I’ is the seeker and the knower. When `I’ receives some response from the society and accepts it, it would then become a part of `Me’. On the other hand `Me’ tries to mould `I’ according to the society. So both `I’ and `Me’ together would form a person.   Practical purpose The `I and Me’ theory helps to pinpoint the affect of society over individual. On the other hand it helps to access the psychology of a person. People can be either be dominated by their `I’ part of the individuality or the `Me’ part. A person who relies mostly on reasoning and tries to act independently is the one who has a stronger `I’. He is the one who differs from the norms of the society and may try to shape his own character. On the other hand, a person who goes along with the society without any questioning is the one who has a dominant `Me’. He follows the rest of the mankind and thinks in the same manner as his neighbour thinks. So what do you think about yourself! Do you have a dominant `Me’ or a dominant `I’?   - Nirjara.  

చనిపోయేలోగా ఏం చేయాలనుకుంటున్నారు!

  చావు ఎవరికైనా భయాన్ని కలిగించేందే! మనం ఈ లోకం నుంచి శాశ్వతంగా, హఠాత్తుగా సెలవు తీసుకునే సందర్భాన్ని ఊహించడానికే బాధగా ఉంటుంది. అందుకే జనం తాము చనిపోతామనే భావనని వీలైనంతగా మనసు లోలోతుల్లో మరుగున పెట్టేస్తూ ఉంటారు. కానీ చావు ఉంటేనే కదా జీవితానికి విలువ ఉండేది. మృత్యవు ఒకటి ఉందన్న భావన ఉన్నప్పుడే కదా, చేతిలో ఉన్న జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న తపన కలిగేది. అందుకనే అమెరికాకు చెందిన ‘క్యాండీ చాంగ్‌’ అనే యువతి ఒక ప్రాజెక్టుని ప్రారంభించింది. అదే- Before I Die.     తోటివారిని కోల్పోవడంతో క్యాండీ చాంగ్‌ అమెరికాలో స్థిరపడిని ఒక తైవాన్‌ చిత్రకారిణి. వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ ఆమె జీవితం సాఫీగానే సాగిపోతూ ఉండేది. కానీ కొన్నాళ్ల క్రితం ఆమె మనసుకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి ఒకరు హఠాత్తుగా కాలేయం దెబ్బతినడంతో చనిపోయారు. చావు సహజమే అయినప్పటికీ, ఎన్ని రోజులు గడిచినా దానికి సంబంధించిన ఆలోచనల నుంచి బయటపడలేకపోయింది క్యాండీ. ‘మనుషులు బతుకుతున్నారు, చనిపోతున్నారు... మరి చనిపోయేలోపల తాము ఏం చేయాలో వారికి ఏమన్నా లక్ష్యం ఉందా?’ అన్న ఆలోచన వచ్చింది క్యాండీకి. ఆలోచన వచ్చిందే తడువుగా దాన్ని ఇతరులతో పంచుకోవాలని అనుకుంది.     పాడుబడ్డ గోడ మీద క్యాండీ అమెరికాలోని ‘న్యూ ఆర్లియన్స్’ నగరంలో నివసిస్తోంది. తనకు వచ్చిన ఆలోచనకి ఒక రూపం ఇచ్చేందుకు ఆమె తన ఇంటి పక్కనే ఉన్న ఒక పాడుపడిన ఇంటిని ఎంచుకొంది. ఆ గోడ మీద "Before I die I want to ________" అంటూ రాసి ఉంచింది. దాని మీద దారిన పోయేవారు తమతమ అభిప్రాయాలను వెల్లడించవచ్చన్నమాట. క్యాండీ చేసిన ఈ ప్రయోగం ఊహించని ఫలితాలను ఇచ్చింది. అటుగా వెళ్లేవారంతా ఆగి ఆ ప్రశ్నని చూసి కాసేపు తమలో తాము మధనపడి, మనసు లోతుల్లోంచి రాసిన వాక్యాలన్నీ చూసి క్యాండీ ఆశ్చర్యపోయింది.   మనిషిలో కోరిక ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన రావడంతో క్యాండీ ఇతర చోట్ల కూడా ఇలాంటి ప్రయోగమే చేసింది. క్యాండీ ప్రయోగాన్ని చూసి... ప్రపంచంలో ఎందరో ఆమెను అనుకరించడం మొదలుపెట్టారు. అలా ఇప్పటివరకూ 70కి పైగా దేశాలలో, 35కి పైగా భాషలలో వేయికి పైగా గోడల మీద ‘నేను చనిపోయేలోగా ఏం చేయాలనుకుంటున్నానంటే ______’ అంటూ ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అందులో ప్రతి ఒక్క కోరికా భిన్నమైనదే. ‘నా తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలని అనుకుంటున్నాను’ అని ఒకరంటే ‘నా కూతురు చదువు పూర్తిచేయడాన్ని చూడాలి’ అని ఇంకొకరు కోరుకున్నారు. ‘సమసమాజాన్ని చూడాలని’ ఒకరు ఆశిస్తే ‘కాలినడకన ప్రపంచాన్ని చుట్టాలని’ మరొకరు భావించారు. ఒకటా రెండా వేలకొద్దీ రాసిన రాతల మీద ప్రతి భావమూ భిన్నమైనదే!   ఉపయోగం ఎందుకు జీవిస్తున్నామో కూడా తెలియనంత అయోమయంలో పరుగులెత్తుతున్న మనిషి ఒక్కసారి ఆగి, తన గురించి తాను ఆలోచించుకునే అవకాశమే ఈ Before I Die ప్రశ్న. పైగా ఒకోసారి చావు గురించిన ఆలోచన జీవితపు విలువను గుర్తుచేస్తుంది. తన లక్ష్యాలు ఏమిటి, ప్రాధాన్యతలు ఏమిటి అని నిర్ణయించుకోవాల్సిన హెచ్చరికను అందిస్తుంది. అలాంటి అవకాశం ఈ ప్రశ్న కల్పిస్తుంది. ఇంతకీ ఈ ప్రశ్నకు మీరిచ్చే జవాబు ఏమిటి???   - నిర్జర.

మీ మాట నెగ్గించుకునే- FITD టెక్నిక్

మనిషి సంఘజీవి. ఉదయం లేచిన దగ్గర్నుంచీ అతనికి పదిమందితోనూ అవసరం తప్పదు. అదే ఏ మార్కెటింగ్‌ రంగంలో అన్నా ఉంటే ఇక అవతలివారు కొనుగోలు చేసే నిర్ణయాల మీదే మన అభివృద్ధి ఆధారపడి ఉంటుందయ్యే! అందుకోసం రకరకాల చిట్కాలు ఉండనే ఉన్నాయి. వీటిలో కొన్ని వాక్చాతుర్యంతో సాధించేవి అయితే, మరికొన్ని మనస్తత్వ శాస్త్రం ఆధారంగా రూపొందించినవి. అలాంటి ఒక చిట్కానే Foot-in-the-door technique (FITD)! ముందుగా కాలుపెట్టండి ‘నాన్నా ఇవాళ మహేష్‌తో కలిసి సినిమాకి వెళ్లనా!’ అని అడిగతే నాన్నగారు దానికి ఒప్పుకుంటారో లేదో కష్టం. కానీ ముందుగా ‘నాన్నా, ఇవాళ సాయంత్రం మహేష్‌ వాళ్లింటికి వెళ్లనా!’ అని అడిగారనుకోండి... అదేమంత పెద్ద విషయం కాదు కాబట్టి నాన్నగారు దానికి ఒప్పుకోవచ్చు. కానీ ఆ తరువాత ‘మహేష్‌ వాళ్లింటికి వెళ్లాక, అక్కడి నుంచి వీలైతే సినిమాకు వెళ్లొచ్చా!’ అని అడిగారనుకోండి... నాన్నగారు ఒప్పుకునే అవకాశాలే ఎక్కువ! ఇది కొంటె కుర్రాళ్ల మంత్రం కాదు శాస్త్రవేత్తల మాటే. ముందుగా ఎదుటివారు కాదనలేని ఒక చిన్న అభ్యర్థన ద్వారా ఈ టెక్నిక్‌ను మొదలుపెట్టాలి. ఆ తరువాత దానికి కొనసాగింపుగా అసలైన అభ్యర్థనని వారి ముందు ఉంచండి. దాని వల్ల ‘ఇంతకు ముందు అభ్యర్థనని నేను ఒప్పుకున్నాను కదా! ఇప్పుడు దీనిని కూడా ఒప్పుకుంటే పోయేదేముంది’ అన్న అభిప్రాయం అవతలివారిలో ఏర్పడుతుంది. ఉపయోగాలు ఒక చిన్న అంగీకారంతో మరో పెద్ద అంగీకారానికి దారి తీయించడమే ఈ టెక్నిక్‌లోని రహస్యం. మొదటి అంగీకారంతో అవతలి వ్యక్తి ఒక తెలియని ఒప్పందంలోకి వచ్చేస్తాడనీ, తరువాత ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండాలన్న మర్యాదని పాటిస్తాడని నిపుణులు అంటున్నారు. అయితే ఒకే వ్యక్తి నుంచి ఈ అభ్యర్థనలు ఉండాలనీ, రెండు అభ్యర్థలనకూ మధ్య పొంతన ఉండాలనీన సూచిస్తున్నారు. మార్కెంటింగ్‌లో ఉన్న వ్యక్తులకి ఈ టెక్నిక్‌ బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ముందుగా మీ మాటలు వినేందుకో, మీ ఉత్పత్తి పనితీరుని గమనించేందుకో, కొన్నాళ్లపాటు వాడిచేసేందుకో... అవతలి వ్యక్తులను ఒప్పించగలిగితే, మీ పని మరింత సులువవుతుందని చెబుతున్నారు. స్వచ్చంద సంస్థలలో పనిచేసేవారు కూడా ఈ పద్ధతిని శుభ్రంగా పాటించవచ్చని చెబుతున్నారు. ‘మా సంస్థకి ఒక్క వందరూపాయల విరాళం ఇవ్వండి మాస్టారూ!’ అని అడిగి ఒప్పించిన తరువాత ‘నెలనెలా వంద రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి మాస్టారూ!’ అని చెబితే అవతలివారు తిరస్కరించడం కష్టమే కదా! రివర్స్‌ టెక్నిక్‌ FITD టెక్నిక్ సరిగా పనిచేయకపోతే కంగారుపడవద్దంటున్నారు. ఈసారి Door-in-the-face (DITF) టెక్నిక్‌ని వాడి చూడమంటున్నారు. ఇందులో భాగంగా మొదటిసారే పెద్ద అభ్యర్థన చేసి చూడాలి. దానికి అవతలివారు ఒప్పుకోనప్పుడు, చిన్న అభ్యర్థనను చేసి చూడాలి. ఎలాగూ మొదటి అభ్యర్థనను తిరస్కరించాం కదా అన్న జాలితో, అవతలివారు రెండోదానికి అంగీకారం తెలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ‘ఈ పుస్తకం ధర వెయ్యి రూపాయలండీ కొనుక్కోరాదూ!’ అని అడిగితే... అవతలి వ్యక్తి దాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించవచ్చు. కానీ మరో చిన్న పుస్తకాన్ని చూపించి ‘ఈ పుస్తకం అయితే పాతిక రూపాయలే! ఇదన్నా తీసుకోండి’ అని అడిగితే... అవతలి వ్యక్తి మారుమాట్లాడకుండా దాన్ని కొనుగోలు చేయవచ్చు. ఏదో ఒకటి రెండు ఉదాహరణలతో సరిపెట్టుకున్నాం కానీ, ఈ రెండు టెక్నిక్‌లనూ రోజువారీ జీవితంలో అనేక సందర్భాలలో వాడి చూడవచ్చు. కాకపోతే మన కుటుంబజీవితంలో మాత్రం ఎప్పుడో ఒకసారి తప్ప, నిరంతరం ఇలాంటి చిట్కాలను వాడుతుంటే... మన బంధాలు కాస్తా కృతకంగా మారిపోయే ప్రమాదం లేకపోలేదు.   - నిర్జర.  

ఆలోచించండి బాబూ..ఆలోచించండి..!

మనిషికి దేవుడు ఇచ్చిన గొప్పవరం మెదడు..ఇది మన శరీరంలోని అత్యంత నిగూడమైన అవయవం..ఇప్పటికీ మన మెదడు గురించి మనకు తెలిసింది సముద్రంలో ఇసుక రేణువంత. మన మెదడును మన భావాలను సజీవంగా ఉంచటం మరియు అవయవాలను కదిలేలా చేస్తుంది. మన మెదడు కొన్ని కోట్ల సూపర్‌ కంప్యూటర్లతో సమానం..కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు లేనికాలంలో ఎంతటి సంక్లిష్టమైన సమస్యనైనా మన మస్తిష్కం పూర్తి చేసేది. ఎంత పెద్ద లెక్కయినా టక్కున నోటితోనే చెప్పేసేవారు. కానీ ఇప్పుడు దుకాణానికి వెళ్లి రెండు వస్తువులు కొంటే మొత్తం ఎంతయిందో క్యాలిక్యులేటర్ ఉంటే కానీ చెప్పలేం.  అంతేందుకు మొబైల్ ఫోన్లు ఇంతగా లేనపుడు ప్రతి ఒక్కరి కి వందల కొద్దీ ఫోన్ నెంబర్లు అలా తలచుకుంటే ఇలా కళ్ల ముందు మెదిలేవి. కానీ ఇప్పుడు మొబైల్ కాంటాక్ట్ లిస్ట్‌లో పేరు పెట్టి వెతికితే కానీ నంబర్ తెలియదు..అసలు ఇంతకీ మన మెదడుకి ఎమైంది. మారుతున్న జీవనశైలి మెదడును మొద్దు బారుస్తోంది..ఉద్యోగాలు, పనులన్నీ కంప్యూటర్లలోనూ, ఆన్‌లైన్లోనే అయిపోతున్నాయి. నెట్ బ్యాంకింగ్ వివిధ రకాల యాప్‌లతో బ్యాంకులకు వెళ్లే పని, దుకాణాలకు వెళ్లే పని, చివరికి హోటళ్లకు వెళ్లే పనీ తప్పిపోతోంది.. అపరిమితమైన సమాచారాన్ని తనలో నిక్షిప్తం చేసుకోగలిగే సత్తా ఉన్న మస్తిష్కాలను అంతులేని సంగతులు చెప్పే ఇంటర్నెట్ బలహీనం చేస్తోంది. బోలెడన్ని యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు, సీక్రెట్ కోడ్‌లు పెట్టినా అవి కూడా గుర్తు రాక నానాతంటాలు పడుతున్నారు. కొందరైతే ఇవి సమయానికి గుర్తురాక మతిమరుపు వచ్చేసిందేమోనని భయపడుతున్నారు.   కారణాలు: నేటి ఆధునిక జీవిన విధానంలో ఇంటర్నెట్ రాక..మనిషి గమనాన్ని పూర్తిగా మార్చేసింది. తినాలన్నా...పడుకోవాలన్నా..మేల్కొనాలనే అంతా టెక్నాలజీయే..ఇప్పటి తరం ఏ సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్‌లో వెతుకుతున్నారే కానీ గుర్తుంచుకోవడం లేదు..అరచేతిలో సమస్తం దొరుకుతున్నపుడు కావాల్సినపుడు తెలుసుకోవచ్చులే అని దేనిని మెదడులోకి ఎక్కించడం లేదు. చాలా మంది రోజుకు గంట నుంచి మూడు గంటల దాకా ఫోన్‌లో నెట్ వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఖాళీ దొరికితే చాలు ఇంటర్నెట్‌లో మునిగిపోతుండటంతో..అవసరమైనది, లేనిదీ కనిపిస్తుండటంతో మెదడు షార్ట్ టెర్మ్ మెమొరీకి సవాలుగా మారుతోంది..ఒకదానికొకటి సంబంధం లేని అనేక అంశాలను తక్కువ కాలవ్యవధిలో వీక్షిస్తుండటంతో మెదడుపై భారం పడుతోంది. ఇవన్నీ కలగలిసి ధీర్ఘకాలంలో మెదడుపై దుష్ప్భ్రభావాన్ని చూపుతున్నాయి.   సమస్యలు: పనిచేస్తుంటేనే మన కండరాలు బలపడతాయి. ఎప్పటికప్పుడు కొత్త శక్తిని సంతరించుకుంటాయి. మెదడు కూడా అంతే. ప్రతీ పనికీ ఏదో ఒక సాధనం మీద ఆధారపడుతూ మెదడును వాడటం తగ్గించేస్తున్నాం. దీని వల్ల మెదడు త్వరగా వృద్ధాప్యం బారిన పడుతోంది. ఫలితంగా డిమెన్షియా, అల్జీమర్స్ వంటి తీవ్ర మతిమరుపు వ్యాధుల ముప్పూ పెరుగుతోంది. 2015 నాటి ప్రపంచ అల్జీమర్స్ నివేదిక ప్రకారం..మనదేశంలో 41 లక్షల మంది అల్జీమర్స్‌తోనే బాధపడుతున్నారు. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా డిమెన్షియాతో బాధపడేవారిలో సగం మంది ఆసియాలోనే ఉండొచ్చనీ నివేదిక హెచ్చరించింది.    నివారణ: మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవటం మన చేతుల్లోనే ఉంది. మెదడుకు పదును పెట్టే పజిల్స్, సుడోకులు వంటి ఆటలు ఆడుతుండాలి. నిరంతరం కొత్తకొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండటం ద్వారా మనం మెదడు పదును తగ్గకుండా చూసుకోవచ్చు. కొత్త భాష, సంగీతం, వంటలు ఇలా ఏవైనా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం మంచిది. కంటి నిద్రపోవటం వల్ల జ్ఞాపకాలు స్థిరపడతాయి. ఏకాగ్రత కుదురుతుంది, మెదడు చురుకుగా పని చేస్తుంది.    ఆహారం: మెదడు సమర్థంగా పని చెయ్యటానికి కొన్ని పోషకాలు చాలా అవసరం. శరీరంలోని మిగతా అవయవాల మాదిరిగానే శక్తి లేకపోతే మెదడు కూడా పనిచేయలేదు. అందువల్ల దంపుడు బియ్యం, రాగులు, సజ్జలు, జొన్నలు, చేపలు, టమోటాలు, ఆకుకూరలు, చికెన్, గుడ్లు, అరటి, బ్రకోలీ వంటివి తీసుకోవటం మంచిది.