వీళ్లు ఖర్చుపెట్టకుండా ఉండలేరు!

  ‘అప్పుచేసి పప్పు కూడు’ అని మన పెద్దలు ఓ సామెతని చెబుతూ ఉంటారు. కొంతమందిని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఒంటి మీద వేసుకోవడానికి సరైన బట్టలు లేకపోయినా, పిల్లలకి తిండి పెట్టే స్తోమత రాకపోయినా... విలాసవంతమైన వస్తువులు కొనడంలో వీళ్లు ముందే ఉంటారు. ఇలాంటి మనస్తత్వం వెనుక ఏదన్నా కిటుకు ఉందేమో గమనించే ప్రయత్నం చేశారు. ఈ పరిశోధన కోసం లండన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఓ బ్యాంకుని ఎన్నుకొన్నారు. ఆ బ్యాంకులోని 718 వినియోగదారుల చెంతకి వెళ్లారు. మీ ఖాతాలను ఓ ఏడాదిపాటు గమనించే అవకాశం ఇవ్వండి అని వారిని ఒప్పించారు. ఆ తర్వాత వారి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకునేందుకు కొన్ని ప్రశ్నల జాబితాను వారి ముందు ఉంచారు. ఏడాదిపాటు వీరంతా డబ్బుని ఖర్చుచేసిన విధానాన్ని బట్టి ఐదు క్యాటగిరీలుగా విభజించారు. బాగా తక్కువ ఖర్చు చేసే వారు తొలి క్యాటగిరీలోకి రాగా... విపరీతంగా ఖర్చుపెట్టేవారిని ఐదో క్యాటగిరీలోకి చేర్చారు. తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా కొందరు బాగా ఖర్చు చేయడాన్ని గమనించారు. వ్యక్తిత్వాలలోని తేడా వల్లే ఇలా జరుగుతున్నట్లు తేలింది. బహిర్ముఖంగా (extroverts) ఉండేవారు, నలుగురిలోనూ తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ఇలా ఖర్చు పెట్టేస్తూ ఉంటారట. అంతర్ముఖంగా (introverts)గా ఉండేవారు తమ social status (అంతస్తు) ఎలా ఉన్నా పెద్దగా పట్టించుకోరు. కానీ బహిర్ముఖులు అలా కాదు. వాళ్లు నలుగురిలో కలివిడిగా తిరగడానికి ఇష్టపడతారు. ఇతరుల ముందు తమ పేదరికం ఎక్కడ బయటపడుతుందో అని అప్పు చేసి మరీ విలాస వస్తువులని కొనుగోలు చేస్తారట. కొందరి ఆదాయం నేల చూపులు చూసినా, విలాస వస్తువులకి ప్రాధాన్యత ఇవ్వడానికి ఇదే కారణం అని తేల్చి చెబుతున్నారు. కావాలంటే మీ చుట్టూ ఓసారి తరచి చూసుకోండి! - నిర్జర. 

ఐస్‌క్రీంని బట్టి మనస్తత్వం

  మీకు ఏ ఐస్‌క్రీం అంటే ఇష్టం? అని అడిగితే ఠక్కున వెనీలా అనో స్ట్రాబెర్రీ అనో జవాబు చెప్పేస్తాం. కానీ సరదాగా ఇష్టపడిన ఆ రుచి వెనక మన మనస్తత్వం దాగి ఉందంటే నమ్మగలరా! కొన్ని రుచులను మనం ప్రత్యేకంగా ఇష్టపడటానికి కారణం మన మెదడులో ఉండే limbic lobe అనే భాగమే కారణం. ఇదే భాగం మన మనస్తత్వాన్ని కూడా నిర్దేశిస్తుందని చెబుతారు. కాబట్టి మనం ఎలాంటి పదార్థాలను ఇష్టపడతామో అన్న విషయం ద్వారా మన వనస్తత్వం ఎలాంటిదో కూడా పసిగట్టేయవచ్చునట! కావాలంటే మీరే పోల్చి చూసుకోండి… వెనీలా వెనీలా అతి సాధారణమైన ఫ్లేవర్‌. మీరు కూడా అంతే నిరాడంబరంగా ఉంటారు. జీవితంలో ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తారు. ప్రేమకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కష్టకాలంలో నమ్మదగిన మనిషిగా గుర్తింపు పొందుతారు. ఎంత నిదానంగా కనిపించినా... అవసరం అయినప్పుడు మీ మనసులో మాటని నిర్మోహమాటంగా చెప్పేయగలరు. ఆపదని ఎదుర్కొనేందుకు ఎంతటి సాహసానికైనా సిద్ధపడగలరు. చాక్లెట్‌ మనుషులని గెల్చుకోవడంలో మిమ్మల్ని మించినవారు ఉండదరు. పార్టీలన్నా, ప్రయాణాలన్నా మీకు మహా సరదా! ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ ప్రేమించేందుకు మీరు సిద్ధంగా ఉంటారు. అదే సమయంలో మిమ్మల్ని మీరూ ప్రేమించుకుంటారు. జీవితాన్ని అనుభవిస్తూనే, కెరీర్‌లో దూసుకుపోతారు. మీ జీవితంలో అటు విలాసాలకీ, ఇటు వినోదాలకీ కొదవే ఉండదు. స్ట్రాబెర్రీ మీలో సహనం చాలా ఎక్కువ. ఒక బంధాన్ని నిలుపుకొనేందుకు, జీవితంలో నిరంతరం ముందుకు వెళ్లేందుకైనా ఆ సహనమే మీకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. అంతర్ముఖులుగా (introvert) మీరు నిత్యం ఏదో ఒక ఆలోచనలో మునిగిపోయి ఉంటారు. ఒకోసారి ఆ ఆలోచనలే మీలో లేనిపోని భయాలను రేకెత్తిస్తాయి. ఆత్మన్యూనతో కుంగిపోయేలా చేస్తాయి. పిస్తా మీది నలుగురూ నడిచే బాట కాదు. నలుగురూ మాట్లాడే మాట కాదు. మీకంటూ ఒక భిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఎవరి వైపూ మొగ్గు చూపని, ఎవరి ప్రభావానికీ లొంగని ప్రత్యేకత మీది. అదే భిన్నత్వం వల్ల స్నేహితులు మీరంటే ఇష్టపడతారు. ఆ భిన్నత్వం ఒకోసారి మిమ్మల్ని కొరకరాని కొయ్యగా మారుస్తుంది. ఇతరుల కంటే వైవిధ్యంగా ఉండాలనే తపన ఒకోసారి అసహనానికి దారితీస్తుంది. బటర్‌ స్కాచ్‌ మీరు ఏదన్నా పని చేస్తే, వేలెత్తి చూపించేందుకు ఏమీ ఉండదు. మీ జీవితం కూడా అలాగే ఉండాలనుకుంటారు. సంప్రదాయాలను అనుసరిస్తూ గౌరవాన్ని పొందుతారు. మీ గమ్యాన్ని చేరుకునేందుకు ఒక ప్రణాళికను ఏర్పరుచుకుని, దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని నష్టాలు ఎదురైనా... మీరు ఏర్పరుచుకున్న విలువలని అంగుళం కూడా సడలించరు. ఇవే కాదండోయ్‌! బనానా, మింట్, ఆల్మండ్, కాఫీ- ఇలా రకరకాల ఐస్‌ క్రీం ఫ్లేవర్లు ఉన్నాయి కానీ... మనకి ఎక్కువగా దొరికే రుచుల గురించే పైన చెప్పుకొన్నాం. వాటిలో ఎంతవరకు నిజం ఉందో మీరే చెప్పాలి.  - నిర్జర.

పతంజలి

  మన భారతదేశం లో యోగసూత్రాల ద్వారా యోగశాస్త్రాన్ని మానవాళికి అందించిన గొప్పయోగి పతంజలిగారు. ఈయన శ్రీ క్రిష్ణుడు జీవించిన కాలానికి కొద్దిగా అటుయిటుగా జీవించినవాడు అంటారు.. అంటే దాదాపు 5000 సంవత్సరాలకు పైమాటే. పతంజలి గారు రచించిన యోగసూత్రములు 195. అందులో అష్టాంగయోగము ప్రధానమైనది. యమము, నియమము, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి అని చెప్పారు. అలాగే ఈ ఆసనం వేసుకుంటే ఈ యోగం మనకి కలుగుతుందన్నది ఏ రోగం తగ్గుతుందన్నది కూడా పతంజలి గారు వివరించి మరీ చెప్పారు. అనేక యోగరహస్యాలను పతంజలి గారు యోగ సూత్రాలలో పొందుపరిచారు. ఆయన చెప్పిన ఆసనాలు అన్నీ ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి.. ప్రశాంతతని ఇస్తాయి... ఆయన సూచించిన ఆసనాలెన్నో వాటిలోకొన్నిటి పేర్లు తెలుసుకుందాం.... 1. నాడీశుద్ది ప్రాణాయామం 2. బద్దపద్మాసనం 3. పద్మాసనం 4. భుజంగాసనం 5. శలభాసనం 6. పశ్చిమోత్తాసనం 7. హలాసనం 8. విపరీతకరణిముద్రాసనం 9. సర్వాంగాసనం 10. వజ్రాసనం 11. సింహాసనం 12. గోముఖాసనం 13. లోలాసనం 14. హస్తపాదాసనం 15. త్రికోణాసనం 16. చక్రాసనం 17. యోగముద్ర 18. మత్య్యాసనం 19. ధనురాసనం 20. మయూరాసనం 21. అర్ధమత్స్యేంద్రాసనం 22. ఉద్యాణబంధము 23. నౌళిక్రియ 24. శీర్షాసనం 25. శవాసనం ఇలా ఏ ఆసనం వేసుకుంటే ఏ ప్రయోజనం ఉంటుంది అన్నది కూడా తెలియజేసిన మహాను భావుడు పతంజలి గారు.... ఆయన మన అందరి యోగం బాగుండాలనే యోగశాస్త్రమన్నదాన్ని స్రుష్టించారన్నది అక్షరసత్యం.

ఇలా చేస్తే కోపం మాయం

సంతోషం, బాధ ఎలాగో కోపం కూడా సహజమైన లక్షణమే! కోపంతోనే మన అసంతృప్తిని, అసహనాన్నీ వ్యక్తం చేయగలం. కానీ మనిషి కోపాన్ని కాకుండా కోపమే మనిషిని అదుపుచేస్తే బంధాలు ఛిద్రమైపోతాయి. అదే కోపాన్ని మనసులో దాచిపెట్టుకుంటే మన అంతరంగాన్ని దహించివేస్తుంది. అందుకనే కోపాన్ని జయించే మార్గాలు ఇవిగో...   విశ్లేషణ తప్పదు - మనలో హద్దుల మీరి కోపం ఏర్పడినప్పుడు, దానికి కారణం ఏమిటా అని విశ్లేషించుకోక తప్పదు. నిజంగా అవతలివారి తప్పుందా? ఉంటే ఆ తప్ప పట్ల మీ అసమ్మతిని తెలియచేస్తే ఉపయోగం ఉంటుందా! మీ కోపాన్ని వ్యక్తపరిచి తీరాలి అనుకున్నప్పుడు... కర్ర విరగకుండా, పాము చావకుండా మీ మాటలను ఎలా ప్రయోగించాలో నిర్ణయించుకోవాలి. ఒక్క క్షణం కోపాన్ని పక్కన పెట్టి విచక్షణకు పనిపెడితే ఇంత విశ్లేషణా కూడా నిమిషంలో తేలిపోతుంది.   కోపాన్ని గ్రహించండి – కోపమనేది ఒక భావన మాత్రమే కాదు... దాని వెనుక చాలా శారీరిక స్పందనలు కనిపిస్తాయి. కోపం వల్ల పెరిగిపోయే అడ్రినల్ ప్రభావంతో హృదయవేగం పెరగడం, కండరాలు బిగుసుకోవడం వంటి స్పందనలు కనిపిస్తాయి. ఈ మార్పులను కనుక గ్రహించగలిగితే మరింత విచక్షణతో మెలుగుతాం. లేకపోతే మనకి తెలియకుండా ఒక్కసారిగా విరుచుకుపడిపోయే పరిస్థితులు ఏర్పడతాయి.   శారీరిక శ్రమలో ఇమిడిపొండి – కోపం వచ్చిన తరువాత దానిని అదుపు చేసుకునేందుకు ఓ అత్యుత్తమ మార్గం ఉంది. శరీరం ఏదన్నా వ్యాయామంలో నిమగ్నమయ్యేలా చేస్తే మనసుని కాసేపు దారిమళ్లించినట్లు అవుతుంది. వ్యాయామం వల్ల ఎండోమార్ఫిన్స్ అనే పదార్థాలు విడుదల అవుతాయి. ఈ ఎండోమార్ఫిన్స్ వల్ల కోపం తగ్గి మనసుకి ప్రశాంతత చేకూరుతుంది.   వాతావరణాన్ని మార్చండి – కోపం కలిగిస్తున్న సందర్భం నుంచి తప్పుకోవడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఏదన్నా పుస్తకం చదవడమో, అలా వ్యాహ్యాళికి వెళ్లడమో, సంగీతం వినడమో... చేయడం వల్ల మనసుని కాస్త బుజ్జగించినట్లు అవుతుంది.   అంకెలు పనిచేస్తాయి – కోపం వచ్చినప్పుడు అంకెలు లెక్కపెట్టమని చెబుతూ ఉంటారు. ఇది ఉపయోగపడే చిట్కానే! ఒకటి నుంచి పది వరకు అంకెలను లెక్కపెట్టడం వల్ల మనసులోని కోపం ఉపశమిస్తుంది. ఈ అంకెలు లెక్కపెట్టడంతో పాటుగా, ఒకో అంకెతో పాటుగా శ్వాసని కూడా నిదానంగా పీల్చుకుంటే మనసులో కోపం స్థానంలో ప్రశాంతత ఆవహిస్తుంది.   ఊహకి పదును పెట్టండి – మనసంతా కోపంతో నిండిపోయినప్పుడు... నవ్వు తెప్పించుకునే సన్నివేశాన్ని గుర్తుచేసుకున్నా, ప్రశాంతమైన ప్రకృతిని తల్చుకున్నా మేలే జరుగుతుంది. ఆఖరికి మీకు కోపాన్ని కలిగిస్తున్న వ్యక్తిని చిత్రమైన వేషంలో ఊహించుకున్నా మనసులోని కోపం పటాపంచలైపోతుంది.   పంచుకోండి – మీ కోపాన్ని ఎవరన్నా సన్నిహితులతో పంచుకోవడం కూడా మంచిదే! దాని వల్ల వారు ఏదన్నా పరిష్కారాన్ని చూపించవచ్చు. మీకు కూడా మనసులోని భారం తగ్గవచ్చు. - నిర్జర.    

Plan an early Retirement

      Gone are those days when retirement was something which was given importance only after children, their education, house loans and health benefits and their marriages. The new-age thought trend is to plan your retirement as you reach your 30s. This is when you need to get serious about your financial plan and focus your retirement goals. Taking the time to think about your most important priorities means you're better able to target your spending and saving in accordance with what you want to achieve, now and in the future. John Lopez, who teaches personal finance at the University of Houston’s Bauer College of Business, says that your age gives you a significant advantage and setting goals while you’re younger gives you a lot of time and flexibility to reach those goals..   The following steps can help you start: Identify specific goals: “Be specific,” Lopez says. “Saying you want to retire at 60 is too broad. It’s more effective to specify the amount of money you need in the bank to reach that goal.” Your financial goals need specific components: what you want to achieve, and the amount of money you need to achieve them and for how long. Set your priorities: When you have defined your goals, including how much money you need to reach each one and the time in which you’d like to achieve them, you can determine which get top priority. “Your goals are competing for limited resources - your money - so you have to think about which to save for first,” Lopez says. At the top of your list should be goals for basic financial preparedness, including establishing an emergency fund, paying down high-interest debt and saving for retirement.  Self payments: “Pay yourself first” by automating your savings. You also can set up automatic transfers among your checking, savings and investment accounts so you can work toward your goals hassle-free. Annual reviews: Evaluate your goals each year to adjust for any changes such as a new job or the birth of a child. Talk to a financial advisor or your consultant who can help you evaluate your personal finance goals and your progress.  

నైట్ షిఫ్టులతో కేన్సర్?

  రాత్రిళ్లు నిద్రపోకుండా ఉద్యోగాలు చేసే పురుషులకు రకరకాల కేన్సర్లొచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని తాజా అధ్యయనాల్లో తేలింది. రాత్రిళ్లు ఉద్యోగాలకు వెళ్లే పురుషులపై వైద్య పరిశోధనలు జరిపినప్పుడు వాళ్లకి ప్రొస్టేట్. పెద్దపేగు, ఊపిరి తిత్తులు, మూత్రకోశ, పురీషనాళ, క్లో కేన్సర్, నాన్ హడ్గ్కిన్స్ కణతి లాంటి కేన్సర్లొచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని తేలింది. రాత్రివేళల్లో కరెంట్ లైట్ల కింద పనిచేయడంవల్ల నిద్రకి ఉపకరించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి బాగా తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ హార్మోన్ రోగ నిరోధక వ్యవస్థని పటిష్టం చేయడానికి కూడా పనికొస్తుందని ధృవీకరించారు కూడా.. నిద్రలేమివల్ల కేన్సర్లు మాత్రమే కాక రకరకాలైన మానసిక జబ్బులొచ్చే అవకాశంకూడా ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

నేషనల్ సైన్స్ డే

ఫిబ్రవరి 28వ తేదీ మన జాతీయ విజ్ఞాన దినోత్సవం.. నేషనల్ సైన్స్ డే... నా మాత్రుభూమిలో నిజమైన సైన్స్ నిర్మాణం చేయగలననుకున్నాను అంటూ చివరి వరకూ భారత దేశంలో సైన్స్ అభివ్రుద్దికి పాటుపడ్డ మహనీయుడు చంద్రశేఖర్ వెంకట్రామన్ సి.వి.రామన్ గారి పరిశోధనా ఫలితాల్ని ధ్రువీకరించిన  రోజు ఫిబ్రవరి 28 కనక ఈరోజుని జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా సి.వి.రామన్ గారికి వందనాలు అర్పిస్తూ..ఒక్కసారి ఆయన గురించి మన దేశ శాస్త్రవేత్తల గురించి ఒక్కసారి మననం చేసుకుందాం.   1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్టు అంటే పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞులసదస్సులో చూపించారు. అందుకే బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్‌హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ రామన్ ఎఫెక్టు అసామాన్యమైనదని, అందులో 200 రూపాయలు కూడా ధరచేయని పరికరాలతో ఆ దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ రామన్‌ను అభినందించారు. ఈయన పరిశోధన యొక్క విలువను గుర్తించి 1930లో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు. ఆ మహనీయుని సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 1954లో 'భారతరత్న' అవార్డు బహుకరించిన సమయంలో సందేశాత్మక ఉపన్యాసం ఇస్తూ 'విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి' అన్న మాటలు నేటికి ఆలోచింపచేసేవి. ఆయన నాజీవితంలో ఒక విఫల ప్రయోగం. ఎందుకంటే నేను నా మాతృభూమిలో నిజమైన సైన్స్ నిర్మాణం చేయగలననుకున్నాను. అంటూ చివరి వరకు భారతదేశంలో సైన్స్ అభివృద్ధికై పాటుపడ్డ ఆ మహనీయుడు 1970 నవంబర్ 20 న భౌతికంగా కన్నుమూసినా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించుకొని ఆయనను చిరంజీవిగా మనమధ్యే నిలిపేలా కొన్ని సంస్థలు ఆయన పేరు మీద టాలెంట్ టెస్ట్‌లు, సైన్స్‌కు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నాయి. విద్యార్థినీ, విద్యార్థుల్లో ఆయన స్ఫూర్తిని నింపుతూ సైన్స్ అంటే మక్కువ కలిగేలా చేస్తున్నాయి. 1928లో ఫిబ్రవరి 28న ఈయన రామన్ ఎఫెక్టును కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ఫిబ్రవరి 28వ తారీఖును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా (నేషనల్ సైన్స్ డే) జరుపుకొంటారు. సి.వి.రామన్ గారి గురించి తలుచుకున్నాం కద... జాతీయ విజ్ఞాన దినోత్సవ సందర్భంగా మన భారతదేశంలో మిగిలిన ప్రముఖ శాస్త్రవేత్తల పేర్లు కూడా ఒక్కసారి తలుచుకుందాం....   శ్రీనివాస రామానుజన్ గారు.. శ్రీనివాస రామానుజన్ అనే భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు స్వతంత్రంగా గాస్, కుమ్మేర్ మరియు హైపర్ రేఖాగణిత సిరీస్ లను కనుకోనేను. అంతేకాక అయన సంఖ్య సిద్ధాంతం మీద ప్రసిద్ధ రచనలు చేసారు. భిన్నాలు మరియు అపరిమిత సిరీస్ లను కొనసాగించారు. 20 వ శతాబ్దపు అత్యుత్తమ గణిత శాస్త్రవేత్తగా గుర్తించబడ్డారు. శ్రీనివాస రామానుజన్ అనే భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు స్వతంత్రంగా గాస్, కుమ్మేర్ మరియు హైపర్ రేఖాగణిత సిరీస్ లను కనుకోనేను. అంతేకాక అయన సంఖ్య సిద్ధాంతం మీద ప్రసిద్ధ రచనలు చేసారు. భిన్నాలు మరియు అపరిమిత సిరీస్ లను కొనసాగించారు. మరో ప్రసిద్ధ విద్యావేత్త,రసాయన శాస్త్రవేత్త,ఉపాధ్యాయుడు అయిన ప్రఫుల్ల చంద్ర రాయ్ మొదటి భారతీయ ఔషధ సంస్థ,బెంగాల్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ ఏర్పాటు చేసారు. భారతీయ రసాయన శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్తగా అయన చాలా ప్రసిద్ధి చెందారు. అంతేకాక కెమిస్ట్రీ రాయల్ సొసైటీ వారిచే జీవిత పురస్కారాన్ని పొందారు. మొట్ట మొదటగా యూరోప్ బయట నుండి ఒక రసాయన ల్యాండ్ మార్క్ ప్లాక్ గా గుర్తింపు పొందారు.    మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు.. కర్నాటక చెందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య,మైసూర్ లో కావేరి నదిపై కృష్ణ రాజ సాగర్ ఆనకట్టను నిర్మించిన ఒక ఇంజనీరు. ఆయన గౌరవార్ధం, భారతదేశం ప్రతి సంవత్సరం అయన పుట్టినరోజు సెప్టెంబర్ 15 న ఇంజినీర్స్ డే గా జరుపుకుంటున్నారు. ఆయన ప్రజా మరియు ఆధునిక నిర్మాణ భారతదేశం గురించి చేసిన వివిధ రచనలకు 1955 వ సంవత్సరంలో భారతరత్న అవార్డు లభించింది. మరో భౌతిక శాస్త్రవేత్త  హోమీ జహంగీర్ భాభా.. హోమీ భాభా ఒక సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త మరియు ఒక ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్త. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ మరియు భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ స్థాపించడంలో ప్రముఖమైన పాత్రను పోషించారు. అయన భారతీయ అణు శక్తి చీఫ్ ఆర్కిటెక్ట్ గా ఉన్నారు. అయన భారతదేశంలో అత్యంత ప్రఖ్యాత శాస్త్రవేత్తలలో ఒకరుగా ఉన్నారు.   మరో మహానుభావుడు జగదీష్ చంద్ర బోస్ గారు.. బెంగాలీ భౌతిక శాస్త్రవేత్త,జీవశాస్త్రజ్ఞుడు,వృక్షశాస్త్రజ్ఞుడు మరియు పురాతత్వవేత్త అయిన JC బోస్ రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ రంగంలో వివిధ అధ్యయనాలను కనుగొన్నారు. అయన జంతువులు మరియు మొక్కలు వివిధ పరిస్థితుల్లో ఎలా ఉంటాయో తెలుసుకోవటానికి 'క్రెస్కోగ్రాఫ్' అనే పరికరాన్ని కనుగొన్నారు.    మనమంతా సలాం చేయాల్సిన మరో మహానుభావులు సలీం ఆలీ గారు... సలీం ఆలీ పక్షుల అధ్యయనం మరియు వాటిని వర్గీకరించడంలో అపారమైన ఆసక్తి కలిగిన ఒక భారతీయ పక్షి శాస్త్రవేత్త .ఆయన భారతదేశం అంతటా క్రమబద్ధమైన పక్షి సర్వేలు నిర్వహించిన మొదటి భారతీయుడు. అలాగే అయన అన్ని సమయాల్లోనూ విస్తృతంగా గొప్ప శాస్త్రవేత్తగా ఆమోదించబడ్డారు. అంతేకాక సలీం ఆలీని "భారతదేశం యొక్క బర్డ్ మెన్ " గా పిలిచేవారు.   కంప్యూటర్ సైన్స్ లో వండర్స్ స్రుష్టిస్తాను బిరెడీ...అన్న మహానుభావులు రాజ్ రెడ్డి గారు... రాజ్ రెడ్డి కృత్రిమ ఇంటలిజెన్స్ [AI] సిస్టమ్స్ రంగంలో పెద్ద స్థాయిలో మార్గదర్శకులుగా ఉన్నారు. అయన కృత్రిమ ఇంటలిజెన్స్ [AI] సిస్టమ్స్ కనుకోనుట వలన,1994 వ సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్ రంగంలో అత్యున్నత పురస్కారం అయిన అలన్ ట్యూరింగ్ అవార్డు ను గెలుచుకున్నారు.   మన భారతదేశానికి ఆయన పేరే తెచ్చింది విజానబలం.. ఆయన వేరెవరో కాదు... A.P.J. అబ్దుల్ కలాం.... అందరం పెడదాం...ఆయనకి సలాం... APJ అబ్దుల్ కలాంను భారతదేశం యొక్క మిస్సైల్ మాన్ అని అంటారు. అయన విస్తృతంగా భారతదేశం యొక్క బాలిస్టిక్ క్షిపణి మరియు అణు యుద్ధ క్షిపణి కార్యక్రమం అభివృద్ధిలో కీలక పాత్రను పోషించారు. భారతదేశంలో ఉత్తమ రాష్ట్రపతులలో ఒకరిగా చేశారు.   మరో మహానుభావులు సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్.. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ భారత ఖగోళభౌతిక శాస్త్రవేత్తగా పేరు గాంచారు. అయన నక్షత్రాలు మరియు బ్లాక్ హోల్స్ యొక్క పరిణామ దశలను కనుగొనుట వలన 1983 వ సంవత్సరంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. అయన కనుగొన్న సిద్దాంతం 'చంద్రశేఖర లిమిట్' గా పేరు పొందింది. ఇలా ఎందరో మన భారతీయ శాస్త్రవేత్తలు అందరికీ... తలవంచి మరీ దాసోహం చేద్దాం.... ఎందుకంటే ఇవాళ సమాజంలో మనకి అవసరమైన శాస్త్రసాంకేతిక పరికరాలు, వైద్యసదుపాయాలు అన్నీ మనకి ఉన్నాయంటే ఇదంతా వారి చలువ... అందుకే మనమంతా వారందరికీ ఒకసారి... వందనాలు చేసుకుందాం...  

కఠినమైన పెంపకంతో... చదువు పాడైపోతుంది

పిల్లల పెంపకానికి సంబంధించి ఎన్ని పరిశోధనలు జరిగినా, ఏదో ఒక కొత్త విషయం బయటపడుతూనే ఉంటుంది. పిల్లలకి సంస్కారం నేర్పడమే ముఖ్యమైన ధ్యేయంగా ఉండాలనీ, దండనతో పిల్లలు మొద్దిబారిపోతారనీ... ఇలా రకరకాల విషయాలని నిపుణుల ద్వారా వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా కఠినమైన శిక్షణలో పెరిగే పిల్లలు, చదువులో వెనకబడిపోతారని తేల్చారు.   పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు, పిల్లల చదువు మీద వారి పెంపకపు ప్రభావాన్ని గమనించే ప్రయోగం చేశారు. ఇందుకోసం వారు 1,482 మంది పిల్లలను ఎన్నుకొన్నారు. వీరంతా కూడా ఏడో తరగతి చదివేవారే. వీరందరినీ ఓ తొమ్మిదేళ్లపాటు నిశితంగా గమనించారు. వీరంతా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినవారు. ఆర్థికంగానూ, సామాజికంగానూ భిన్నమైన నేపథ్యాలు కలిగినవారు.   ప్రయోగం కోసం ఎన్నుకొన్న విద్యార్థుల నుంచి తరచూ అనేక వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు పరిశోధకులు. వారితో తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉంది? తరచూ తిట్లు, తన్నులతో తల్లిదండ్రుల కఠినత్వం శృతి మించుతోందా? తోటి విద్యార్థులతో వీరి ప్రవర్తన ఎలా ఉంది? వారిలో లైంగిక ఆసక్తులూ, నేరపూరిత స్వభావాలూ ఏమేరకు ఉన్నాయి? వంటి అనేక విషయాలను సేకరించారు.   కఠినమైన పెంపకపు పద్ధతుల మధ్య పెరిగినవారు తొమ్మిదో తరగతికి వచ్చేసరికి తమ స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కనిపించింది. ఆడపిల్లలలో లైంగిక చర్యల పట్ల ఆసక్తి పెరగడాన్నీ, మగపిల్లలలో నేరప్రవృత్తి హద్దు మీరడాన్నీ గమనించారు. సహజంగానే ఇది వారి చదువు మీద ప్రభావం చూపింది. ఏకంగా కాలేజీ నుంచి నిష్క్రమించే స్థాయిలో వీరు చదువులో వెనకబడిపోయారు.   చిన్నతనంలో తల్లిదండ్రుల నుంచీ తగినంత ప్రేమని పొందనివారు, క్రమేపీ ఆ లోటుని స్నేహితుల దగ్గర భర్తీ చేసుకునే ప్రయత్నం చేస్తారట. అలా స్నేహితులకి అధిక ప్రాధాన్యతని ఇచ్చే క్రమంలో తనదైన వ్యక్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పుకొస్తున్నారు పరిశోధకులు. నేరప్రవృత్తి, లైంగిక విశృంఖలత వంటి తాత్కాలిక లక్ష్యాలకి ప్రాధాన్యతని ఇస్తూ దీర్ఘకాలిక లక్ష్యాలైన చదువు, వ్యక్తిత్వం వంటి ప్రాధాన్యతలను వారు విస్మరించే ప్రమాదం ఉందంటున్నారు. ఇలాంటి పిల్లల్ని ముందుగానే గమనించడం వల్ల వారిని తిరిగి సరైన దారికి తీసుకువచ్చేలా తగిన కౌన్సిలింగ్ను అందించవచ్చని సూచిస్తున్నారు. అయినా చేతులు కాలేదాకా చూసుకుని కౌన్సిలింగ్ ఇచ్చేకంటే, తల్లిదండ్రులే కాస్త జాగ్రత్తగా తమ పిల్లలను పెంచుకుంటే సరిపోతుంది కదా! - నిర్జర.  

మొబైల్‌తో అద్భుతమైన ఫొటోలు తీయవచ్చు

  ఒకప్పుడు ఫొటో తీయాలంటే పెద్ద ప్రహసనం! కెమెరా మెడలో తగిలించుకోవాలి, దాన్లో రీలు ఎంతవరకూ వచ్చిందో చూసుకోవాలి, బ్యాటరీలు పనిచేస్తున్నాయో లేదో గమనించుకోవాలి... ఇంత చేసినా ఫొటో తీసేటప్పుడు కెమెరా కాస్త కదిలిందంటే రీలు వృధా అయిపోయినట్లే! డిజిటల్‌ కెమెరాలు వచ్చాక ఈ బాధలన్నీ తీరిపోయాయి. ఇక ప్రతి చేతిలోనూ ఓ సెల్‌ఫోనూ, ఆ సెల్‌ఫోనుకి ఓ కెమెరా ఉన్న ఈ కాలంలో ఫొటో అంటే కన్నుమూసి తెరిచినంత తేలికైపోయింది. మరి అలాంటి ఫొటోలు అద్భుతంగా రావాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే....   రెజల్యూషన్‌ ఫోన్‌ చేతిలోకి వచ్చిన తరువాత అందులో కెమెరాకి సంబంధించిన డిఫాల్ట్‌ సెట్టింగ్స్‌ జోలికి పోము. నిజానికి ఫోన్‌ రెజల్యూషన్‌, ఇమేజ్‌ క్వాలిటీ వంటి ఆప్షన్స్‌లో మార్పులు చేయడం ద్వారా నాణ్యమైన ఫొటోలు తీయవచ్చు. ఒక ఫోటోని ఎంత స్పష్టంగా తీయవచ్చో ఈ ఆప్షన్స్‌ ద్వారా నిర్ణయించవచ్చు. ఫోన్లో 2048*1536 వరకూ రిజల్యూషన్‌ అందుబాటులో ఉంటే కేవలం 320*240 రిజల్యూషన్‌తో తీయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.   ప్రత్యేకమైన ఆప్షన్లు/ యాప్స్‌ ఒక 50 మంది వరుసగా నిలబడి ఉంటే... వారందరినీ ఒకే ఫొటోలో ఎలా బంధించగలం? ఫొటో తీశాక కళ్లలో ఎరుపుదనం కనిపిస్తే ఏం చేయాలి?... ఇలాంటి సమస్యలెన్నో మనకి ఎదురుపడుతుంటాయి. ఇలాంటి సవాలక్ష సమస్యలకి ఫోన్లో ప్రత్యేకమైన ఆప్షన్లు ఉంటాయి. ఉదాహరణకు పనోరమా అనే ఆప్షన్ను ఎంచుకోవడం ద్వారా పక్కపక్కనే ఉన్న దృశ్యాలను ఫోటో తీసి ఒక్కే ఫోటో కిందకి మార్చవచ్చు. ‘రెడ్‌ ఐ రిమూవల్‌’ అనే ఆప్షన్ వాడి కళ్లలో ఎరుపుదనం తొలగించవచ్చు. మన ఫోన్లో ఇలాంటి సౌకర్యాలు ఏమేం ఉన్నాయో ఒకసారి వరుసపెట్టి చూసుకోవడం మంచిది. ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి ఉన్నవారికి వేలాది యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.   వెనక్కి తగ్గేది లేదు ఇప్పుడు మన ఫోన్లలో కావల్సినంత మెమరీ ఉంటోంది. అవసరం అనుకుంటే ఎప్పటికప్పుడు దాన్ని ఖాళీ చేయవచ్చు కూడా! కాబట్టి మంచి ఫొటో రావాలి అనుకున్నప్పుడు ఏమాత్రం సందేహించకుండా వరసపెట్టి ఫోటోలు తీసేయడమే! ముఖ్యంగా పిల్లల్ని సహజంగా ఫొటో తీయాలన్నా, కదిలే వస్తువులని బంధించాలన్నా వెంటవెంటనే ఫోటోలు తీస్తుండాలి. ఇందుకోసం షట్టర్ స్పీడ్‌ ఎక్కువగా కెమెరాలను ఎంచుకుంటే దృశ్యాన్ని త్వరగా బంధించే అవకాశం ఉంటుంది.   జూమ్‌ వద్దు కాస్త దూరంగా ఉండే దృశ్యాన్ని బంధించేందుకు జూమ్‌ ఆప్షన్‌ వాడుతుంటాం. నిజానికి మొబైల్‌ ఫోన్లలో ఎక్కువగా ‘డిజిటల్‌ జూమ్‌’ మాత్రమే ఉంటుంది. అంటే మీరు జూమ్‌ చేయాలనుకున్న దృశ్యం కాస్త దగ్గరగా కనిపిస్తుందే కానీ, కెమెరాలోని లెన్స్‌లో ఏమాత్రం తేడా రాదు. దీని వలన ఫొటోలోని రిజల్యూషన్ తగ్గిపోయి జూమ్‌ చేసిన వస్తువు మసకగా కనిపిస్తుంది. దీనికంటే మంచి రెజల్యూషన్‌తో ఫొటో తీసి కావల్సినంత మేర ఎన్‌లార్జ్ చేసుకోవడమే ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది.   చీకటి వెలుగులు ఫొటోగ్రఫీ అంటేనే చీకటివెలుగులతో గీసే చిత్రం. పైగా మొబైల్‌ ఫోన్లలో ఉండే ఫ్లాష్‌ ప్రభావం పెద్దగా ఉండదు. కాబట్టి మంచి ఫొటో రావాలంటే ఎంత వెలుతురు ఉండాలో గ్రహించడం అవసరం. తరచూ ఫొటోలు తీస్తూ ఉంటే ఈ నేర్పు వచ్చేస్తుంది. సూర్యరశ్మి మరీ ఎక్కువగానూ, మరీ తక్కువగానూ లేని సమయంలో తీసే ఫొటోలు సహజంగా కనిపిస్తాయి. ఫ్లాష్‌ లేదా ఇతరత్రా కృత్రిమమైన వెలుగుతో తీసిన ఫొటోల కంటే సహజమైన వెలుతురులో దిగిన ఫొటోలు అద్భుతంగా వస్తాయి.   ఎడిటింగ్ చేతిలో ఫోన్‌ ఉంది కదా అని చకచకా ఫొటోలు తీసేయడమో, ఫొటోలు తీశాం కదా అని సోషల్ మీడియాలో పంచేసుకోవడమో చేస్తుంటాం. కానీ ఫొటోని ఎడిటింగ్ చేయడం కూడా గొప్ప కళే అని మర్చిపోతుంటాం. ఫొటోలోని సహజత్వం ఏమాత్రం చెడకుండా అందులోని చిన్నచిన్న లోపాలను సవరించగలిగితే జీవితాంతం మిగిలిపోయే జ్ఞాపకంగా ఓ ఫొటో మారిపోతుంది. అందుకోసం ‘ఫొటోషాప్’ వంటి అప్లికేషన్లు ఎలాగూ మనకి అందుబాటులో ఉన్నాయి.   ఇవే కాదు! ఫొటోని ల్యాండ్‌స్కేప్‌లో తీయాలా పోర్ట్రెయిట్‌లో తీయాలా; కెమెరా లెన్స్‌ శుభ్రంగా ఉందా లేదా; బ్రైట్‌నెస ఎంత ఉండాలి.. ఇలా ఫొటోలకి సంబంధించి ఒకో ఎంపికతోనూ ప్రయోగాలు చేస్తూ పోతే ఒక సాధారణ మొబైల్‌ ఫోన్‌తో కూడా అద్భుతమైన ఫొటోలు తీయవచ్చు.   - నిర్జర.

పేర్లని ఎందుకు మర్చిపోతాం!

  ఇంట్లో మనతో కలిసి ఉండేవారి పేరుని మర్చిపోలేకపోవచ్చు. మనతో పాటు ఆఫీసులో పనిచేసేవారి పేరూ మర్చిపోకపోవచ్చు. అదే పేరు పదేపదే తల్చుకోవడం వల్ల ఇలా మనకి దగ్గరగా ఉండేవారి పేరు నాలుక మీదే ఆడుతూ ఉంటుంది. కానీ అకస్మాత్తుగా రోడ్డు మీద పాత పరిచయస్తుడు కనిపిస్తే! ఫలానా కథలో ప్రధాన పాత్ర ఎవరు అన్న ప్రశ్న వినిపిస్తే! చాలా సందర్భాలలో మనం పేర్లని మర్చిపోవడానికి బోలెడు కారణాలున్నాయట... పొంతన ఉండదు చాలా సందర్భాలలో పేరుకీ మనిషికీ అసలు పొంతనే ఉండదు. పండు అన్న మనిషి కాయలాగా ఉండవచ్చు. రామారావు అన్న పేరు కల్గినవాడు పరమ దుర్మార్గుడై ఉండవచ్చు. ఫలితంగా మనకి అతని పట్ల ఉండే అభిప్రాయానికీ, అతని పేరుకీ పొంతన లేకపోవడం వల్ల చటుక్కున పేరు గుర్తుకువచ్చే అవకాశం ఉండదు.   అయోమయం రాముడు, సుగ్రీవుని ఎలా చంపాడు అంటే ‘చెట్టు చాటు నుంచి’ అంటూ చటుక్కున జవాబు చెబుతాము. కానీ రాముడు చంపింది సుగ్రీవుని కాదనీ, అతని సోదరుడు వాలిని అని చెప్పడానికి కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే వాలి, సుగ్రీవులు ఇద్దరూ వానరులే. ఇద్దరూ రామునితో సంబంధం ఉన్నవారే! కాబట్టి ఇద్దరి పేర్లూ మెదడులో కలిసిపోయే ప్రమాదం ఎక్కువ.   ఒకటే పాత్ర – రెండు పేర్లు ఆఫీసులో వెంకట్రాయుడు, వెంకట్రావు అన్న పేర్లు ఉన్న ఇద్దరు ఉద్యోగులు ఉంటే ఇద్దరిలో ఎవరి పేరు ఏమిటో పోల్చుకోవడం కష్టమే! ఆ ఇద్దరూ చేసే పని ఒకటే అయినప్పుడు వారి పేర్లు మరింత అయోమయానికి గురిచేస్తాయి. సినిమానటులు, రాజకీయవేత్తల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం తరచూ ఇలాంటి అయోమయానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదు.   ఆసక్తి లేకపోవడం ఒకో మనిషికీ ఒకో రంగం మీద ఆసక్తి ఉంటుంది. అందులో ప్రతి మనిషి గురించీ టకటకా పొల్లు పోకుండా చెప్పేస్తారు. కొందరికి అసలు దేనిమీదా ఆసక్తి ఉండదు. అసలు చుట్టుపక్కల మనుషులనే పట్టించుకోరు. ఇలాంటివారు తాము వార్తల్లో వినే పేర్లనీ, రోజూ కలిసే వ్యక్తుల పేర్లనీ ఆ నిముషంలోనే మర్చిపోయే అవకాశం ఉంది.   ఒకే రూపు స్నేహా ఉల్లాల్‌, ఐశ్వర్యా రాయ్‌ ఒకేలా ఉంటారు. ఇద్దరూ మనకి తెర మీద పరిచయమే కాబట్టి ఏ ఫొటో ఎవరిదో పోల్చుకోగలం. కానీ మన పాత స్నేహితులలో ఇద్దరు ఒకే రూపుతో ఉంటే! దశాబ్దాల తరువాత వారి ఫొటోలు మన కంటపడిదే? ఎవరెవరో పోల్చుకోవడం కష్టం కదా! మనుషుల రూపురేఖలకీ, వారి పేర్లకీ మధ్య మెదడు లంకె వేసుకుంటుంది. కానీ ఆ రూపురేఖలు ఒకేలా ఉంటే మనసు కూడా అయోమయానికి గురవుతుంది. పేరుని గుర్తుచేసుకోవడం అనేది ఓ సంక్లిష్టమైన ప్రక్రియ.  లిప్తమాత్ర కాలంలో మెదడు లోలోపలి పొరల్లో నిక్షిప్తమై ఉన్న వింత శబ్దాలని గుర్తుచేసుకోవడం నిజంగా కష్టమే కదా! అవి అర్థవంతంగా లేకపోతేనో, మరో పాత్రతో కలిసిపోయి అయోమయం కలిగిస్తుంటేనో... పాపం మెదడు ఎంత కష్టపడుతుందో కదా. కాబట్టి అకస్మాత్తుగా ఏదన్నా పేరు గుర్తుకురాకపోతే కంగారుపడకుండా, అది సహజమే అని సరిపెట్టుకోవాలి. కానీ గుర్తుండాల్సిన సందర్భంలోనూ కూడా పేర్లని మర్చిపోతుంటే మాత్రం... అందుకోసం కొన్ని చిట్కాలను ప్రయోగించమంటున్నారు. ఆ చిట్కాలు మరోసారి చెప్పుకొందాం.   - నిర్జర.

హోటల్కి వెళ్తే సర్వీస్ చార్జ్ కట్టాలా?

  పుట్టినరోజనో, ప్రమోషన్ వచ్చిందనో... కారణం ఏదైతేనేం! కుటుంబంతో కాస్త సరదాగా గడపాలి అనుకుంటే అలా రెస్టారెంటుకి వెళ్తాం. కానీ బిల్లు కట్టాల్సి వచ్చేసరికి ఆ సరదా కాస్తా తీరిపోతుంది. వందల్లో కనిపించే బిల్లు, ఆ బిల్లు మీద రకరకాల పేర్లతో ఉండే చార్జీలు- వెరసి బిల్లు మీద దాదాపు 30 శాతం ఎక్కువగా చెల్లించేసి బిక్కమొగంతో బయటకి వస్తాం. ఇంతకీ అందులో కొంతమొత్తం మనం అసలు కట్టాల్సిన అవసరమే లేదు తెలుసా!   దాదాపు అన్ని రెస్టారెంట్లూ సర్వీస్ చార్జ్ పేరుతో 10 శాతం వరకు అదనంగా వసూలు చేస్తుంటాయి. నిజానికి సర్వీస్ చార్జి వసూలు చేయమని ఏ చట్టంలోనూ లేదు. అలా వసూలు చేసే డబ్బు ఏ ప్రభుత్వానికీ వెళ్లదు. సర్వీస్ చార్జ్ అంటే హోటలు సేవలు నచ్చి మనం ఇచ్చే డబ్బు. అంటే సర్వర్కి టిప్పు ఎలాగో, హోటల్కి సర్వీస్ చార్జ్ అలా అన్నమాట! కాబట్టి ఇంత సర్వీస్ చార్జ్ చెల్లించి తీరాలని ఏ చట్టమూ పేర్కొనలేదు. పైగా అలా సర్వీస్ చార్జ్ని బలవంతంగా వసూలు చేయాలనుకోవడం చట్టవిరుద్ధం కూడా! సర్వీస్ చార్జ్ అని పేర్కొన్న కాలం (column) పక్కన వినియోగదారుడే తనకు తోచిన రుసుము చేర్చాలని ప్రభుత్వం పేర్కొంటోంది.   ఇక GST వచ్చిన తర్వాత రెస్టారెంట్లలో బాదుడు పెరిగిపోయిందన్న విషయం తెలిసొందే! చిన్నపాటి ఏసీ రెస్టారెంటులో తిన్నా కనీసం 18 శాతం GST కట్టాల్సి వస్తోంది. దీనికి సర్వీస్ చార్జి మరో పది శాతం తోడైతే చెప్పేదేముంది! పైగా చాలా హోటళ్లు GST లెక్కపెట్టేటప్పుడు సర్వీస్ చార్జిని కూడా కలుపుతున్నాయి. అసలు బిల్లు 100 రూపాయలు, సర్వీస్ చార్జి 10 రూపాయలు అయితే... మొత్తం 110 రూపాయల మీద GST లెక్క కడుతున్నాయన్నమాట!   ఈ విషయాలు చాలామందికి తెలియకో... తెలిసినా లేనిపోని గొడవ ఎందుకనో నిశ్శబ్దంగా బిల్లు చెల్లించేస్తుంటారు. హోటళ్లు కూడా అంతే నిశబ్దంగా ఆ డబ్బుని తమ ఖాతాలో జమచేసుకుంటాయి. కడుపు మీద కొట్టడం అంటే ఇదే కదా! - నిర్జర.  

ప్రేమికుని మనసు గ్రహించకపోతే కష్టం

  ప్రేమ గుడ్డిదంటారు! అది నిజమేనని తేల్చేందుకు చాలా పరిశోధనలే జరిగాయి. ప్రేమలో ఉన్నవారికి మిగతా ప్రపంచం సరిగా కనిపించదనీ, తమకి ఏం జరుగుతోందో పట్టదనీ ఈపాటికే తేలింది. ప్రేమలో ఉన్నప్పుడు మన శరీరంలో పనిచేసే హార్మోన్లే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ప్రేమలో ఉన్నవారు అవతలివ్యక్తి భావాలని కూడా గమనించకపోతే ఎలా!   వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది సైకాలజిస్టులు, ప్రేమికులు ఒకరి భావోద్వేగాలను మరొకరు సరిగా పసిగడుతున్నారా లేదా అనే విషయం మీద ఓ పరిశోధన నిర్వహించారు. ఇందుకోసం వారు ఏళ్ల తరబడి ప్రేమలో మునిగితేలుతున్న ఓ 120 మంది జంటలకు కొన్ని ప్రశ్నలను అడిగారు. వారి జవాబులని విశ్లేషించిన మీదట కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి.   - కొంతమంది వ్యక్తులకి కోపం వచ్చినప్పుడు... ఆ కోపాన్ని లోలోపచే అణచుకునే ప్రయత్నం చేస్తారు. కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఈ వ్యక్తులలోని ముభావాన్ని బట్టి, సందర్భాన్ని బట్టీ వారికి కోపం వచ్చిందని తెలుసుకోవచ్చు. కానీ చాలామంది ప్రేమికులు ఈ విషయంలో అంతగా శ్రద్ధ చూపరని తేలింది.   - తమ కోపాన్ని దిగమింగుకునేవారి సంగతి ఇలా ఉంటే... మరికొందరేమో ఏం జరిగినా కూడా ‘అంతా మన మంచికే’ అనే సానుకూల స్వభావంతో ఉంటారు. దురదృష్టవశాత్తూ ఇలాంటివారి కోపాన్ని కూడా వారి ప్రేమికులు తక్కువగా అంచనా వేస్తారట. అన్నింటిలోనూ సానుకూలత చూపిస్తారు కాబట్టి, ఏం జరిగినా కూడా సానుకూలంగానే స్వీకరిస్తారులే అన్న తేలికభావంతో వీరిని తక్కువగా అంచనా వేస్తారట.   - ఒక వ్యక్తి తరచూ తన భావోద్వేగాన్ని ప్రకటించేవాడై ఉంటే... తనలో తాను ఏమీ దాచుకోకుండా తన ఉద్వేగాన్ని వెళ్లగక్కుతాడులే అన్న నమ్మకంతో ఉంటారట అవతలివారు.   - ఆడవారు తమ ప్రేమికునిలో ఎప్పుడూ సానుకూల దృక్పథాన్నే గమనిస్తారట. దాని వల్ల ఒకింత మేలు జరుగుతున్నప్పటికీ... వారి మనసుకి కష్టం కలిగినప్పుడు దాన్ని గ్రహించలేకపోయే ప్రమాదం ఉంది.   - స్త్రీలో పోలిస్తే మగవారు తమ భావోద్వేగాలను ఎక్కువగా కప్పిపుచ్చుతారని ఈ పరిశోధకులే ఇంతకుముందు నిరూపించారు. దీని వల్ల వారిని అంచనా వేసే అవకాశం తక్కువగా ఉంటుంది.   మనసులో ఉన్న అసంతృప్తిని బయటకి వెళ్లగక్కి విషయాన్ని తేల్చుకోకపోవడం వల్ల మున్ముందు చాలా సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. అలాగే అవతలి వ్యక్తిలోని భావోద్వేగాలను సరిగా పట్టించుకోకపోయినా కూడా బంధం బలహీనపడిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. - నిర్జర.  

Love heals heart issues

Many say this entire month is dedicated to Love because it includes Valentine's Day. So let us talk about Love and Heart this week. What runs our hearts is love, flow of love is flow of life. Is nt't it? We see so many of our friends and loved ones ending up having heart issues or at least circulatory system or cholesterol issues in recent years. What gives rise to heart issues? Would you believe me if I say its lack of love? Our entire lives revolve around seeking love, appreciation or approval from others. All that we do is for love, seriously. When we don't feel loved, we go to either of two extremes, emotionally. We either become a nice person and give ourselves to others or we become an angry rebel and say I don't care for you. In both situations, we do not know how to really receive the love that we are looking for. These days, we are listening to many new age gurus asking us to love ourselves first and make ourselves a priority and only then consider others. It is radically different from what is taught to us from our childhood. Our parents or grand parents asked us to love someone else first, give importance to someone else. My parents and grand parents were always in sacrifice mode where they gave up many things for someone or other. They are right, giving up for others is satisfying but only when we can do it from a place of fullness. But how often we can give from a place of love? Often it is in hope of getting love or approval from others through giving to others or giving in to others. I call this 'good boy/girl' syndrome. When we do these sacrifices, our need for love is not met anyway and it leaves pain in our hearts. Are you aware, continuously ignoring self ultimately leads to inability to give or receive love? Why so much of fuss if we can't receive or give love? Because blocks to flow of love literally leads to blocks in flow of blood, our life force, or heart issues! Do you remember the instructions when you are about to take off in a flight? The flight assistants ask you to first look after your own oxygen masks in case of emergency, even before you attend to your own child. Because if you are not safe, you cannot save your child anyway. Same way it is better to share love from a heart that is not seeking love from outside but full from within. Remember, your love is valuable because of you, remove 'you' from the equation and there is not much value to the love. Is n't it? What about those who are aggressive and angry on a constant basis? They attend anger management or stress management workshops with no result. How can it get resolved unless their need for love is not addressed? Many of us express or feel this pain of not being loved or valued in form of anger. But because anger is bad, we resist feeling it or we blow our fuse. Whenever a person is expressing or suppressing anger, literally it is like a small block of cholesterol being formed obstructing the flow of blood. The real lack of love is suppressed underneath it all and the anger continues to manifest till they end up for some heart procedure. Anger itself is not bad, what damages health, is not attending to our true feelings. In the recent past, I have been experiencing many young clients of about 30 to 40 years of age coming to me with a complaint of high cholesterol levels and some of them experiencing blocks requiring immediate procedures. Although there are many physical risk factors for heart attack like sedentary lifestyle, unhealthy eating habits, alcohol or other addictions, we need to consider emotional causes also. Most of the time we group all emotional issues under 'stress' and say it leads to health complications. In fact, all that was ever needed here is loving attention, nurturing and care towards self. We give much importance to doctors' advice to get our cholesterol levels checked up at regular intervals and keep a tab on heart health. At the same time, it is also very important to ensure that we keep a tab on our own emotional health. We can keep our hearts healthy with a good dose of self love. It just takes a little bit of self care and attention towards our true feelings. When we are in the habit of only giving to others without considering our needs, we develop blocks in receiving love from others. No matter how much others try to love us, we are unable to receive it. I have noticed often in my clients that when we deprive ourselves from receiving love, we develop issues in the veins. Same way, when we stop ourselves giving love to others, then we develop issues in arteries. In both the cases, it can lead to cardiac problems, heart attack being one of the primary life threatening disorders. It's not just at heart, unresolved anger shows up in other places too, like liver, kidneys and knee cartilage. I have observed health of liver and heart are often directly connected. Liver has to work well for the heart to work well. Lack of self love has to show up at the heart, because we are depriving ourselves of love and Love relates to heart. Loving ourselves moves us out of fear and insecurity and leads us back to happiness. We are born as embodiment of Love, but we have learnt all our lives not to love ourselves. At least before our body starts reacting with health issues, let us start unlearning all that we have learnt about self love and start seeing ourselves as pure love and nothing else. The body will shift its gears at once and cooperates with us with all its Love towards us. We then become more loving towards others as we do all our actions out of love for self and love for others. Our giving will then truly come from unconditional love, not for gaining love from others. Can any addiction be bigger and larger than Self-love? Taste it once and you will know it makes a world of difference to your life! Let us commit to love ourselves to the fullest starting this Valentine's Day! Medical Disclaimer: This article is speaking only at a high level emotional issues. There are many variants within cardiovascular diseases. This deals only with some of the emotional causes and doesn't dwell deep into physical aspects or reasons for cardiac problems. Please consult your cardiac specialist or GP for your issues. This is no replacement to medical assistance. The above discussed are just the experiences and opinions of the author. -Ramakrishna Maguluri Engaging with life ELAI engagingwithlife@yahoo.com

రింగులు రింగులు రింగులు...స్టార్ట్ ....

  1. ఐస్ప్రూట్ అంటే ఇప్పటి ఐస్క్రీమ్ కి తాత...ఆ డబ్బా లోనుంచి తియ్యగానే మనసు చల్లగా ,నోరు తియ్యగా చేసేది, పైగా తిన్నాక నాలిక రంగు చూపించి మురిసిపోవడం ... గుర్తుందా ?? ..పుల్ల ఐసు ..తింటూ అది కారి వళ్ళంతా పడుతుంటే , తుడుచు కుంటూ ..ఏమయినా ఆ రుచే వేరబ్బా ఇక జీడ్లు ,పిప్పర మెంట్లు, పప్పుండలు , ఆ రుచి మీ నోట్లో ఇప్పటికీ ఉందా లేదా ??     2. ఎంతటోళన్నా ..మట్టి లో ఆడాల్సిందే ...అందులో దొర్లుతూ, వళ్ళంతా మట్టి పట్టించు కుంటే గాని , నిద్ర పట్టేది కాదు. అమ్మ తో తిట్లు బోనస్ అనుకోండి...ఒళ్ళు అలిసెలా మట్టి లో ఆడిన ఆ రోజులు, ఆ ఆనందం ఒక్కసారి గుర్తు చేసుకోండి...మళ్ళి పరుగున వెళ్లి , ఇప్పటి టెన్సన్స్ అన్ని వదిలేసి , పిల్లల్లా ఆ మట్టిలో ఆటలాడుకుంటే ఎలా వుంటుంది ? ..ఉహలెందుకు బాస్ ...మీ పిల్లలతో కలిసి  ఆ ముచ్చట తీర్చుకోండి ...     3. సెలవోస్తే వెళ్ళేది లండన్కొ సింగాపుర్ కొ కాదు ...అమ్మమ్మ ఇంటికి...రాజాది, రాజ ..మార్తాండ భోజ ..అన్న లెవెల్ లో మనం ఫోజులు కొడుతు అమ్మమ్మ , తాతయ్యలతో చేయించుకున్న సేవలు , ఇప్పుడు కోట్లు పోసి అయినా కొనగలమా ? అమ్మమ్మ చేతి గోరుముద్దలు, తాతయ్య వెన్నెల్లో చెప్పిన కథలు అన్ని , అన్ని ..అచ్చం గా మనకే సొంతం...       4 .మన రంగుల ప్రపంచం మన చేతిలోనే......ఎక్కడంటే అక్కడ, బొమ్మలు గీసేయచ్చు ..నాన్న ఎంచక్కా మనకోసమే గోడలకి తెల్లటి సున్నం వేసి ..కాన్వాస్ ని సిద్దం గా పెట్టేవాడు..ఇక రోజుకో చోట , మన ఇష్టం వచ్చినట్టు బొమ్మలు గీసేయ్యటమే.. ఎం ఎఫ్ హుస్సైన్ మన ముందు ఏ పాటి ? ..ఏది ఇప్పటి పిల్లలకి అలాంటి ఛాన్స్ ఏది ? వాళ్ళు గట్టిగా గోడలకి ..చేతులు ఆనించినా మరకలు అవుతాయని భయం ...ఏమిటో ?     5. ఇక ఇన్డోర్ గేమ్స్ గురించి వేరే చెప్పాలా...? అష్టా చెమ్మా నుంచి వామన గుళ్ళు దాకా...ఎన్ని ఆటలో ..? రాళ్ళూ రప్పలు కూడా ఆటలో భాగమే...కంకర రాళ్ళతో కూడా ఆటలు , చింత గింజలు, గోళీలు, గవ్వలు ..ఇలా ఎన్నో మన సంపదలుగా నిలిచాయి...వీటిలో ఏవి మనదగ్గర వున్నా చాలు చెప్పలేని  ఆనందం .ఇప్పడో  ? ఎన్ని కోట్లు వున్నా..ఇంకా కావాలనే ఆత్రం మధ్య ఆ ఆనందం రుచి కూడా మర్చి పోయాం ..   -Pushpa Bhaskar

Teach your Children to save for their Retirement

  Nothing surprising about this statement about teaching a child about retirement savings as explaining about budgeting and personal finance is quite a challenge. With the Gen  z children it’s never too late to start teaching them about money habits. How should you start of teaching them about money, savings, budgeting and its benefits? Start with Pocket money : First start giving them pocket money when they ready to handle money. Make them help around the house and give them a monthly allowance only for the work done. There are plenty of creative ways to make earning fun, so it’s up to you to figure out what you can make them do for work for money. Teach them to save : The next big step after giving them pocket money is to show them how to save it. You would have started by buying them a piggy bank when they were small kids. Now the next part is to start showing them how to save money for the big picture. And by this we don’t mean toys and books it could also mean saving up for camera, or a cycle and as they grow bigger you could look at how the youngster would repay an education loan taken by you in the coming future. Explain the rates of everyday living : Take some time out and explain the costs of your daily expenditure, like food, electricity, and your entertainment bills. You salary amount should be shared with your child when he is old enough to understand and tell them to value the money earned vis a vis money wasted.    Teach them how to do banking : When your child is about 8 to 10 years old, take them to a bank and show them the banking process. While most banking tasks can be done online or at an ATM, it is still important to explain how to fill out a deposit and withdrawal form. This is a good time to explain how a check works and the proper way to fill one out.  You can explain how interest works, how it is calculated and when it is deposited to the account. Many adults find banking to be complicated; explaining how the process works can make them more comfortable with banking procedures when the time comes. Open a Child account : With the new private banks coming out with interesting options which includes a child account , you can open one in his/her name and encourage the child to save money in the bank. That way they get a hang of how to operate, save, withdraw and use money. You will also have the option of keeping track of their expenditure since the child is a minor and as parent you will be the guardian and get the SMS banking alerts when there is a transaction. Keep money safe and keep track of it : Send them to get small items from the grocery stores and when they get back, ask them how much was spent and what was the change they got back. There are chances of them misplacing money or forgetting the change. This way you can remind them to keep and count money carefully and if they lose money it would be forfeited from their pocket money as a fine for losing it. The importance of retirement savings : Now we come to the part mentioned in the title… Talk to them about the importance of starting a savings account for retirement benefits also. You could start teaching this when they are in high school and maybe starting their first job.  Provident funds, ESI’s tax planning, loan repayment etc. can be explained and hopefully these suggestions can help you introduce your child to finance, help them understand the importance of money and the responsibility they have to protect it. Hopefully by the time they are all grown up they will acquire the skills need to be financially independent and who knows they could end up teaching you a thing or two about the latest financial plans in the market!