సంసారం... ప్రేమ సుధాపూరం... నవజీవన సారం

సమసోఖ్ఖ దుఖ్ఖ పరివడ్ఢిఆణం కాలేన రూఢ పెమ్మాణం  మిహుణాణం మర ఇ  జం తం జిగయి యీరం ము అం హోయి.  (గాధా-1-42) గాధాసప్తశతిలోని యీ గాధ, భార్యాభర్తల గాఢమైన ప్రేమకు అద్దం పడుతున్నది. 'సుఖదుఖాలను సమానంగా పంచుకుంటూ జీవించిన దంపతులలో, ముందెవరు మరణించినా, వారే జీవించి ఉన్నవారితో సమానం. మిలిగినవారు బ్రతికిఉన్నా, జీవన్మృతులే' అంటున్న పై గాధ, దాంపత్య జీవిత సార్థక్యతను స్పస్టంగా వివరిస్తున్నది. దాదాపు యేడు వందల సంవత్సరాల క్రితం రచనైనా, అప్పటి గృహస్థ జీవనంలోని విలువలను ఇప్పటి జంటలకు బోధిస్తున్నట్టూ, ఇలాగే మీరూ ఉండాలి సుమా' అని హెచ్చరిస్తున్నట్టూ ఉంది కదూ!              గాధాసప్తశతిలోని మరో పామరుడైన   రైతు,  తన భార్య గతించటాన్ని తట్టుకోలేక, ఆ శూన్యమైన ఇంటికి వెళ్ళేందుకూ ఇస్థపడక,పనేమీ లేకున్నా, పొలంలోనే కాలం గడుపుతున్నాడట! (గాధా-2-69) తనలో ఇంకా సజీవంగానే ఉన్న భార్య జ్ఞాపకాలను చెరిపివేయటం  సుతరామూ ఇష్టం లేదు పాపం ఆ అమాయకునికి!! ఈ నాటి దాంపత్య జీవితం,ఇటువంటి గాఢానుభూతులకు తావిచ్చేలా  లేదేమోననిపిస్తుంది. కారణం- ఆర్థిక పరమైన పరస్పరాధారాలుగానే  ఉంటున్న జీవితాలు మనవి. డబ్బుతో వచ్చే సౌఖ్యాలు తప్పనిసరి బంధాలను ప్రోత్సహిస్తున్నాయేమోననిపిస్తుంది కూడా!  యేది యేమైనా, ప్రేమ వివాహాలలోనూ, పెద్దలు కూర్చి చేసిన పెళ్ళిళ్ళలోనూ, 'ఇగో' అన్న గుణాన్ని అదుపులో ఉంచుకోకపోతే అన్నీ అనర్థాలే నన్నదీ నగ్న సత్యం. ఎంతగానో ప్రేమించుకుని, ఎన్నెన్నో త్యాగాలు చేసి మరీ పెళ్ళాడిన జంటలు కూడా యీ సమస్యతోనే విడిపోవటం నేను చూసిన సత్యం. ఇరువురి గుణాలూ, అలవాట్లూ అన్నీ అర్థమయ్యాకే పెళ్ళిళ్ళు చేసుకున్నా, కొద్ది రోజుల్లోనే  వీళ్ళెందుకు విడిపోతున్నారో అర్థం కాదు. అంటే, పెళ్ళికిముందు, వీరిద్దరిలోనూ ఉన్నది  కేవలం  ఆకర్షణేనా అని అనుమానమూ వస్తుంది కదా!  అంతేకాక, చాలావరకూ ప్రేమ జంటలకు   తల్లిదంద్రుల సమ్మతి దొరకకపోవటం వల్ల, ఇరువురి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు, సర్ది చెప్పే పెద్దవారూ  ఉండరు. ఇకపోతే, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో, భార్యాభర్తల మధ్య  అనుబంధం యేర్పడేందుకూ  కొంత కాలం పడుతుంది. ఐనా, ఇదివరకటి బాల్య వివాహాలు వితంతు సమస్యకు కారణమైనా, భార్యాభర్తల మధ్య,కుటుంబ సభ్యుల మధ్య కూడా, సుదీర్ఘ అనుబంధానికి అనుకూలంగా ఉండేవి. కాలం మారి, వివాహాలకూ అర్హమైన వయస్సును నిర్ణయించటం వల్ల, ముక్కుపచ్చలారక ముందే తల్లి కావటం, ప్రసవ సమస్యలకు గురి కావటం, లేత వయసులోనే తనువు వీడటం   లేదా కాళ్ళ పారాణికీ, పసుపు కుంకుమలకూ దూరం కావటమన్న సమస్యలు శాశ్వతంగానే పరిష్కరింప బడినాయి  కూడా!  ఇది మంచి పరిణామమే. ఈనాడు, ఆడ, మగ పిల్లలిద్దరూ సమానంగా చదువుకుని, ఉద్యోగాలు చేసుకుంటున్న వయసులో తమ కాళ్ళపై తాము నిలబడిన తరువాతే వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నారు.అంతేకానీ, వివాహబంధం కలకలం ఒక తీయని అనుబంధంగా వర్ధిల్లేందుకు అవసరమైన ఆలోచనాధోరణిని అలవరచుకోవటంలో కాస్త అలసత్వం వహిస్తున్నారేమోననిపిస్తుంది.  జీవితంలో భార్యాభర్తల మధ్య చిలిపి తగాదాలూ, అనునయించుకోవటాలూ, రాజీపడి, తిరిగి జీవనరాగాలు ఆలపించటమూ ఉన్నట్టే,అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు, పట్టు విడుపులూ, ఒకరి అభిప్రాయాలను మరొకరు కుటుంబ నేపధ్యంలో గౌరవించుకోవటమూ కూడ అలవరచుకుంటే, యీ 'ఎడమొగం-పెడమొగం’ కాపురాలకొక పరిష్కారం  దొరుకుతుంది. ఎవరికి వారే యమున తీరే అనుకుంటూ, తాను పట్టిన కుందేటికి   మూడే కాళ్ళూ అని పట్టుదలలతో ప్రవర్తించేవారికి విడాకులూ వరాలుగా అనిపించినా, జీవిత చరమాంకంలోగానీ  మనం కోల్పోయినదేమిటో అర్థం కాదు.అలాంటి విడాకుల జీవితాలూ, విశృంఖల జీవితాలూ, స్వేచ్చాశృంగారంతోనే తాత్కాలిక ఆనందం పొందుతూ, 'వివాహానికి అర్థం ఇదేకదా' అని వాదించే  విపరీత  ధోరణులు పాశ్చాత్య జీవిత ప్రభావాలే! ఇలాంటి ఆలోచనలనుండి, బయటపడాలనీ, మన భారతీయ కౌటుంబిక జీవనాన్నే ప్రమాణంగా స్వీకరించాలనీ, పశ్చిమ దేశాలు సైతం తహతహలాడుతున్న నేపధ్యంలో యీ 'యిగో 'అన్న అంశాన్ని గురించి దంపతులు పునరాలోచించవలసి ఉంది.  పెళ్ళి అన్నది, ధర్మార్థకామమోక్షాలకు ఆలవాలంగా, గృహస్తాస్రమం,  సమాజానికి ఒక నిజమైన అండగా అభివర్ణించిన మన శాస్త్రాలలోని అంతరార్థం అర్థం చేసుకుంటే,  ఒంటరి జీవితం ఒక దిద్దుకోలేని తప్పుకు అద్దం లా నిలిచి పోతుంది. అంతే!!   అలాకాక, ఒకరికోసం మరొకరు అప్పుడప్పుడూ తగ్గుతూ, ఒకరి మనోభావాలను మరొకరు గౌరవించుకుంటూ మనగలిగితే, వైవాహిక జీవితంలోని అసలు ఆనందం అనుభవీభూతమవుతుంది. తల్లిదండ్రులిరువురి  ప్రేమనూ సమానంగా పొంది, పెరిగిన పిల్లల్లను సమజానికి అందించటం ద్వారా,బాధ్యతాయుతమైన పౌరులను సమాజానికి మన కానుకగా అందించిన  తృప్తి దక్కుతుంది దంపతులకు.సమాజంలో నేడు జరుగుతున్న అనేక నేరాలకు, వారి వారి కుటుంబ నేపధ్యమే కారణమంటున్నాయి మనస్తత్వ శాస్త్రాలు. ఈ నేపధ్యంలో ఆలోచించినా, భార్యాభర్తల మధ్య అవగాహన,సర్దుకుపోయే మనస్తత్వం అవసరమేననిపిస్తుంది కూడా. అలా సుఖంగా సంసారాలు చేసుకుని, తమ వారసత్వం యెదుగుదలను కళ్ళారా ఆనందంగా చూసుకునే ఆనందంలోని ప్రతి క్షణమూ కవితాత్మకం కాదామరి? -పుట్టపర్తి నాగపద్మిని

CLASSROOM CLASSICS

For me classroom has always been a place where all of my friends spend the day with each other and have fun rather than a place of learning. We have spent most of our quality time of our lives in classrooms. I am sure of it..What makes the experience of classroom concept all the more intriguing is the type of students it has. Now I am back with one of my lists on the types of classic people we have come across during our classroom times. So why the delay!   1. The Studs These are the students who are the gems in the teacher’s eyes. They put up such a brilliant show in front of the teacher that she is left with nothing else to say to him except “Student ho toh aisa”.  Its strange because, most of them(the ones that I have come across) are not that sincere when the teacher is out of the scene. But when she is around, they act like they are extremely innocent and know nothing but to listen to what she says!!  They will run to her even before she gives out the H E of H E L P P.They are always the ones that carry books to and from the staff-rooms.( Wonder what pleasure they get doing that.) 2. The Toppers Well, the title itself gives away the content here.. Obviously these are the ones who do miraculous wonders when academics is talked about. But here I am talking about only those who we know have worked hard to reach their current standards.. Yes, I know the type you are thinking about right now. That’s the next one. 3. The Silent-Killers Yes, this type creeps me out. What we see out of them in class are complete back-benchers. They hardly bring books to class. (wonder what even is in their bags??). They never happen to take notice of what happens in the class. They have complete knowledge about all the possible TV shows that have been aired and are currently being played. Yet, after all this,God knows how,they manage to get their names among rank-holders.  I mean, How the hell did this happen?. The night before the exam, he was active on facebook until midnight. Now he is on the stage getting his report card from the principal for outstanding performance in the pre-finals!!!! 4.  The Bhukkads  I envy this type a lot!! These students are extreme foodies!! They just love to eat right about everything. And they eat like they are responsible for the famines in most parts of the country. But the strange thing here is they stay just the way they are. They don’t gain even a  wee bit of weight . How is it possible?  I am just sitting here, eating salads and going to the gym, aerobics and all sorts of stupid stuff and still managing to puff up.. And they are like eating up half of the lunch boxes including their own and still staying slim as a stick. I consider that a God’s gift.   5.  The Queen-bee There is always only one person in the class.(mostly a girl) of this type. She is extremely pretty and so cute and all her actions are just so elegant and girly that almost all the boys have a crush on her. She is always the centre of attraction. She is always a head-turner in the class. Even the girls just adore her. 6. The Roadside Romeos Ok.These are just silly. They are very flirty. Atleast it looks like they are!! I don’t know what they have in mind. But they act like they are the most beautiful creatures on Earth and everyone just loves them.  What do I think about them? Well, I think they are just desperate for attention and desperate to have a girlfriend(or a boyfriend),just so they can go about telling their peer group about it. 7. The Link-Masters I hate them. These are the ones that spread rumors.Nasty ones. When a boy just turns his head in the direction of a girl, The link-masters go about couple-naming him with her for the rest of his school/college life. 8. The Rebels These just amaze me. How can one just show such courage?They go about arguing with the teacher for as long as the teacher can argue back. That too in such a tone, that the teacher is taken aback at first. As for me, I am just thankful to such type of classmates because,they waste half the class time just arguing and I just get to enjoy the scene.The next half the teacher lectures on manners and how students should be and how she was as a student which obviously no one(especially me) even cares to listen to. 9. The Talented Thunderstorms These are the kids who are the most popular in the entire school because they participate and win in all the competitions ever held.. They are the ones who are always approached to by all the teachers to represent the school in interschool competitions and still pass the exams with decent scores. Half their time goes in saying “thank you”’ to the congratulations showered upon them by everybody.. Last but definitely not the least 10. The Inseparables In every class, there is always that pair of students who are the closest friends. They sit together,have lunch together, gossip only among themselves, always manage to be the lab-partners and share their own secrets. Its like there is this invisible tape binding them. Then the teachers get envious!! I don’t understand why they do this!!They either make them sit in separate benches or completely change their section during shuffling the next year. I mean what is wrong with having a mirrored being who reflects all your interests. Anyway these besties manage to meet up during breaks however!! But seriously, why do you want to separate ppl who have been together right from their kindergarden!! Well Teachers!! Now if I have to discuss about them, it will take me a whole new blog!!because there are just too many varieties you know! Whatever said and done, classroom years are the best. Those glorious years are just unforgettable. Ok!! Now I am talking like a 65 year old grand-ma. I still have lots of classroom years left!! Hope I’ll experience even more fun!! Wish you all could relate atleast a bit. Did you experience any other type? Comment below! Until then this is Sanjana signing off   By Sanjana Kunde   

చిన్న 'సారీ' చెప్పేయండి

మీరు మీ భార్య లేదా భర్తతో...హ్యాపీగా మంచి రిలేషన్ లో వుండాలను కు౦టున్నారా? అయితే ఓకే ఒక్క సూత్రం వుంది. దానిని పాటించ౦డి చాలు అంటున్నారు పరిశోధకులు..! ''సారీ'' ( Sorry ) ని కాస్త విరివిగా వాడితే చాలు బంధం బలపడుతుంది అంటున్నారు వీరు. సుదీర్ఘ౦గా కొన్ని వందల జంటలపై సాగించిన అధ్యయనంలో భార్య భర్తలకి ఒకరిపై ఒకరికి ఉండే ఆరోపణల్లో మొదటిస్థానంలో ఈ 'సారీ' చెప్పకపోవడమే నిలిచి౦దిట. మనసు గాయం చిన్నదైనా, పెద్దదైనా ఎదుటవ్యక్తి దానికి 'సారీ' చెప్పకపోతే దానిని తమపై ప్రేమ లేనట్లుగానే భావిస్తారట. భార్య అయినా భర్త అయినా.. నిర్లక్ష్యం, ప్రేమ లేకపోవడం, బాధ్యతారాహిత్యం, ఇలా అ ఫీలింగ్ కి రకరకాల మాస్కులు తొడిగేసి బాధ పడిపోతారట. ఇక ఆ భావనలు మనసుని పట్టి కుదిపెస్తుంటే అనుబంధం బీటలు వారక ఏమవుతుంది చెప్పండి? చిన్న సారీ పెద్ద ఉపద్రవాలని ఆపెయ్యగలదు అంటున్నారు పరిశోధకులు. చిన్న చిన్న మనస్పర్ధలు ఒకొటోకటిగా చేరి మనసును విరిచేస్తాయి కాబట్టి ఎదుటి వ్యక్తి మనసు నొప్పి౦చగానే సిన్సియర్ గా సారీ చెప్పండి..బంధాన్ని కాపాడుకోండి అని సలహా ఇస్తున్నారు. మరి కాస్త ఇగో పక్కన పెట్టి సారీ చెప్పేయడం ప్రారంభించ౦డి.     

సంస్కారమే ముఖ్యమని తేల్చిన పరిశోధన

కాలం మారిపోయింది. జీవితం ఉరుకులపరుగుల వేగంతో నడిచిపోతోంది. ఇలాంటి పోటీ ప్రపంచంలో తన పిల్లవాడు ఎక్కడ వెనబడిపోతాడో అని తల్లిదండ్రులు కంగారుపడటం సహజమే! కానీ పిల్లవాడిని ఎలాగైనే పరుగులెత్తించాలనే తపనతో అతడి మీద తమ ఆశలని అద్ది... తమవైన లక్ష్యాలను నిర్దేశిస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది! మొదటికే మోసం వస్తుందని తేలుస్తోంది ఓ పరిశోధన.   చదువా- సంస్కారమా! అరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు ఆరోతరగతి చదువుకుంటున్న ఓ 506 మంది పిల్లల ముందు ఓ ప్రశ్నని ఉంచారు. మీ తల్లిదండ్రులు మీ నుంచి ఏం ఆశిస్తుంటారు? అన్నదే ఆ ప్రశ్న. ఇందుకోసం వారు ఒక ఆరు అంశాలతో కూడిన ఓ జాబితాను రూపొందించారు. ఈ జాబితాలో మంచి మార్కులు సాధించడం, ఆటపాటల్లో ముందుండటంలాంటి వ్యక్తిగత విజయాలకి సంబంధించిన ఓ మూడు అంశాలు ఉంటే... ఇతరులకి సాయపడటం, మర్యాదగా ప్రవర్తించడం వంటి వ్యక్తిత్వపరమైన అంశాలు ఓ మూడు ఉన్నాయి. అంటే తల్లిదండ్రులు తమ పిల్లవాడు వ్యక్తిగత విజయాలను సాధించాలని అనుకుంటున్నారా? లేకపోతే వారు మంచి వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవాలని అనుకుంటున్నారా? అని తేల్చేందుకు ఈ జాబితాను రూపొందించారన్నమాట.   సంస్కారవంతులదే విజయం తమ తల్లిదండ్రుల అభీష్టానికి అనుగుణంగా వ్యక్తిగత విజయాలు సాధించాలనుకునేవారు అనేకరకాల మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేలింది. ఆందోళన, ఉద్వేగం, క్రుంగుబాటు వంటి సమస్యలతో వీరు సతమతమవడాన్ని గమనించారు. పైగా వీరి ప్రవర్తన గురించి కూడా ఉపాధ్యాయులకు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని తేలింది. అన్నింటికంటే చిత్రమైన విషయం ఏమిటంటే చదువులో కూడా వీరు వెనకబడుతున్నారని బయటపడింది. ఇందుకు పూర్తి విరుద్ధంగా సంస్కారానికి అధిక ప్రాధాన్యతని ఇచ్చిన కుటుంబాలలోని పిల్లలు... ఇటు చదువులోనూ, అటు ప్రవర్తనలోనూ అందరికంటే ఓ అడుగు ముందున్నారట!   విలువలే ముఖ్యం ర్యాంకులు, బహుమతులు వంటి బాహ్యమైన విషయాలతో తనని తాను కొలిచి చూసుకునే పిల్లవాడికి తన మీద తనకు నమ్మకం కలగదు. వ్యక్తిగత విజయాలు సాధిస్తేనే తనకు విలువ అన్న అభిప్రాయం అతని మనసు మీద తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా అటు చదువులోనూ రాణించలేకపోతాడు, ఇటు తనదైన వ్యక్తిత్వాన్నీ రూపొందించుకోలేకపోతాడు. అన్నింటికీ మించి జీవితాన్ని ఆస్వాదించలేకపోతాడు.   అలాగని పిల్లల్ని వాళ్ల మానానా వాళ్లని వదిలేయమనో, నిరంతరం నీతిబోధలు చేస్తూ ఉండమనో పరిశోధకులు ఉద్దేశం కాదట! అటు చక్కగా చదువుకోమని ప్రోత్సహిస్తూనే, ఇటు వారిలో మంచి విలువలని కూడా పెంపొందించే ప్రయత్నం చేయాలంటున్నారు. ఇటు వ్యక్తిగత విజయాలకీ, అటు వ్యక్తిత్వానికీ సరసమానంగా ప్రాధాన్యతని ఇవ్వమని సూచిస్తున్నారు.   - నిర్జర.

చిన్న మార్పులతో మీ ఇల్లు విశాలం

  తమ ఇంటిని అందంగా చేసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మరి అలాంటి వారు తమ ఇంటిని ఏ విధంగా అందంగా, విశాలంగా చేసుకోవాలంటే కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. మరి ఆ మార్పులు ఏమిటో చూద్దామా..! మీ గదిలో ఎక్కువ స్థలాన్ని కేటాయిస్తున్న అనవసరపు వస్తువులను తీసెయ్యండి. ఎప్పటి కప్పుడు గదిని శుభ్రంగా ఉంచాలి. అనవసరపు చెత్తా చెదారం ఇంట్లోంచి బయటికి పంపించాలి. ఇలా చేస్తే మీ గది విశాలంగా కనిపిస్తుంది. అలాగే ఏవైనా మంచి మంచి కర్టెన్స్ లాంటివి ఏర్పాటు చేసుకుంటే గదిని మరింత అందంగా కనబడేలా చేసుకోవచ్చు. ఖరీదైన ఫర్నిచర్ లాంటివి వాడకుండా తక్కువ బడ్జెట్ లో ఉండి, ఆకర్షనీయంగా కనపడే ఫర్నిచర్ ను వాడటం వల్ల మీ ఇంటికి ఓ కొత్తదనం వస్తుంది. అదే విధంగా ఎక్కువ స్థలాన్ని కేటాయించే ఫర్నిచర్ లాంటివి కాకుండా తక్కువ స్థలాన్ని కేటాయిస్తూ, మీకు ఉపయోగపడే ఫర్నిచర్ ను వాడటం మంచిది. మీ గదికి ముదురు రంగులు వేయడం వల్ల గది కాస్త చిన్నగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి... ఏదైనా లైట్ కలర్ లో ఉండే రంగులను ఎంపిక చేసుకోవడం మంచిది. అదే విధంగా వెంటిలేషన్ సదుపాయం చక్కగా ఉండేలా చూసుకోవాలి. తేలికపాటి రంగులు గదిని విశాలంగా కనిపించేలా చేస్తాయి. కంటికి ఒక గది పెద్దగా లేదా చిన్నగా కనిపించడానికి చేసే ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గది యొక్క అందం రెట్టింపు అవుతుంది. ఆ గదిలో అమర్చే వస్తువుల వల్ల కూడా గది యొక్క రూపం మారుతుంది.

పరాజయం నుంచే అద్భుతాలు మొదలవుతాయి

మన దృష్టి సాధారణంగా మనలో ఉన్న బలాల మీద కాకుండా బలహీనతల మీదే ఉంటుంది. ఆ బలహీనతల వల్ల ఏర్పడిన పరాజయాల మీదే ఉంటుంది. కానీ ఫెయిల్యూర్ ఎదుర్కొన్న ప్రతిసారీ... దాని నుంచి ఏదన్నా నేర్చుకోవాలనే ప్రయత్నం చేస్తే... అదే మన విజయానికి దారితీస్తుంది. అందులో మన బలం కూడా ఎక్కడో దాగి ఉందని తెలుస్తుంది. నమ్మడం లేదు కదూ! కావాలంటే ముక్తామణి కథ వినండి...   ఈ కథ 1989లో మొదలవుతుంది. అప్పట్లో మణిపూర్‌లో ముక్తామణి అనే ఆవిడ ఉండేది. ముక్తామణి కుటుంబం తీవ్రమైన పేదరికంలో ఉండేది. ఆ కుటుంబానికి పూట గడవడమే కష్టంగా ఉండేది. పేదవాడి కష్టాలకి కొదవ ఉండదు కదా! అలా ఓ రోజు ఆమె రెండో కూతురు చిరిగిపోయిన షూస్‌తో ఇంటికి వచ్చింది. ఆ షూస్ అప్పటికే చిన్న చిన్న రిపేర్లతో బాగుపడే పరిస్థితిని దాటిపోయాయి. కూతురు షూస్ చూసిన ముక్తామణికి ఏం చేయాలో పాలుపోలేదు. ఒకపక్క తినడానికే డబ్బు లేదు. ఇక కొత్త షూస్ ఎక్కడి నుంచి తీసుకువస్తుంది. ఇక చేసేదేమీ లేక... చివరికి ఆ షూస్ చుట్టూ వులెన్ దారంతో అల్లింది. కానీ ఆ తల్లీకూతుళ్ల మనసులో ఒకటే అనుమానం. మర్నాడు టీచర్ ఏం తిడతారో అని! యూనిఫాంతో సరిపోని షూస్‌ని చూసి టీచర్ తప్పకుండా తిట్టిపోస్తుందని వాళ్ల భయం. ఆ భయంతోనే ముక్తామణి కూతురు మర్నాడు స్కూళ్లో అడుగుపెట్టింది. కానీ విచిత్రం! టీచర్ ఆ అమ్మాయిని తిట్టలేదు సరికదా... వాటిని ఎవరు అల్లారో కనుక్కొంది. అంతేకాదు- ‘మా పాపకి కూడా ఇలాంటి షూస్ అల్లిస్తుందేమో మీ అమ్మని కనుక్కో!’అంది. తిట్టు వినపడతాయనుకునే చోట ప్రశంసలు కనిపించడంతో ముక్తామణి సంతోషానికి హద్దు లేకపోయింది. దాంతోపాటే ఆమెలో ఆ ఆలోచన కూడా మొదలైంది- ‘తను వులెన్ దారంతో షూస్ అల్లగలదు కదా! దాన్నే ఓ వృత్తిగా చేసుకుంటే ఎలా ఉంటుంది?’. ఆ ఆలోచన ప్రస్తుతం ‘ముక్తా షూ ఇండస్ట్రీ’కి దారి తీసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు... ఈ ముప్ఫై ఏళ్లలో ముక్తామణి వెయ్యిమందికి పైగా ఉపాధి కల్పించింది. ఆవిడ కంపెనీలో తయారయ్యే షూస్‌ ఇప్పుడు ఆస్ట్రేలియా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ లాంటి దేశాలకు ఎగుమతి కూడా అవుతున్నాయి. ముక్తా సాధించిన విజయాలకి లెక్కలేనన్ని అవార్డులు కూడా దక్కాయి. ఈమధ్యే ‘ద టెలిగ్రాఫ్‌’ పత్రిక ఆవిడను ‘True Legends Awards 2018’తో సత్కరించింది. ఇంత ఎదిగినా కూడా ముక్తామణిలో కొంచెం కూడా గర్వం కనిపించదు- ‘నాతో పాటు అలుపెరగకుండా పనిచేసేవాళ్ల సాయం ఉండబట్టే, ఈ స్థాయికి చేరుకున్నానని చెబుతారు.’ - Nirjara

ప్రేమా? ద్వేషమా? మీరే నిర్ణయించుకోండి!

    ఒక బడిలో పిల్లలు నిరంతరం గొడవలుపడుతూ, కొట్టుకుంటూ ఉండేవారు. పిల్లలంతా చదువులో బాగున్నారు, ఆటపాటల్లో బాగున్నారు. కానీ వారిలో సంస్కారం మాత్రం లేదని ఉపాధ్యాయులంతా తెగ బాధపడేవారు. ఇంత చిన్న వయసులోనే ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకుంటున్నారంటూ దిగాలు పడిపోయేవారు. పిల్లల తీరు మార్చేందుకు ఎవరెన్ని మంచి మాటలు చెప్పినా ప్రభావం లేకుండా పోయింది. చివరికి ఓ ఉపాధ్యాయుడికి ఓ ఆలోచన తట్టింది. మర్నాడు తన తరగతిలో అడుగుపెడుతూనే ఆ ఉపాధ్యాయుడు ‘నేను మీతో ఓ సరదా ప్రయోగం చేయించాలనుకుంటున్నాను. ఈ ప్రయోగాన్ని చివరివరకూ చేసినవారికి పరీక్షలలో ఐదేసి మార్కులు కలుపుతాను,’ అన్నాడు. ప్రయోగం, మార్కులు అనగానే పిల్లలంతా ఉత్సాహంగా తల ఊపారు. ‘మీకు ఈ ప్రపంచంలో కొందరు ఇష్టం ఉండకపోవచ్చు కదా! అలా మీకు ఎంతమందిమీద ద్వేషం ఉంటే అన్ని టమాటాలని రేపు తీసుకురండి,’ అని చెప్పాడు. టీచరుగారు చెప్పింది సరదాగానే ఉంది. దాంతో ఒకో విద్యార్థీ తనకి ఎందరి మీద ద్వేషం ఉందో అన్నేసి టమాటాలు తీసుకువచ్చాడు. కొందరు మూడు టమాటాలతో సరిపెట్టుకున్నారు, కొందరు పది తెచ్చారు, ఇంకొందరు ఏకంగా ఇరవై టమాటాలు మోసుకువచ్చారు. ‘వెరీ గుడ్‌! మీరు తెచ్చిన టమాటాలన్నీ మీ డెస్క్‌లో పెట్టుకోండి. ఒక వారం గడిచాక వాటిని తీసేయవచ్చు. ఇదే మీరు చేయబోయే ప్రయోగం,’ అన్నారు టీచరుగారు. టీచరుగారి మాటలకు పిల్లలు పగలబడి నవ్వారు. ఇది కూడా ఓ ప్రయోగమేనా! అంటూ గుసగుసలాడుతూ  ఎగతాళి చేశారు. కానీ ఎంతైనా టీచరు కదా! అందుకని మారుమాట్లాడకుండా ఆయన చెప్పినట్లు చేశారు. ఓ రెండు రోజులు అంతా బాగానే ఉంది. కానీ తర్వాత మొదలైంది అసలు కథ! డెస్క్‌లో టామాటాలు గభాలున చేయి తగిలితే పగిలిపోయేవి. మరికొన్ని కుళ్లపోయేవి. దాంతో పుస్తకాలు పెట్టుకోవడానికి కాదు కదా! కనీసం తలుపు తెరిచి చూడ్డానికి కూడా విద్యార్థులకి భయం వేసిపోయింది. ఎక్కువ టమాటాలు ఉన్నవారి బాధ మరింత ఎక్కువగా ఉంది. వాళ్లు బడికి రావడానికే భయపడిపోయారు. డెస్క్‌ మీద చేయి వేయడానికి కూడా ధైర్యం చాల్లేదు. ఇలా వారం రోజులూ క్షణమొక యుగంగా గడిచాయి. చివరి రోజుకి పిల్లలంతా బిక్కచచ్చిపోయి ఉన్నారు. ‘నేను చెప్పినట్లుగానే ప్రయోగం కోసం మీరంతా వారం పాటు టమాటాలను మీ దగ్గర ఉంచుకున్నారు. ఈ పరీక్షలో మీరంతా నెగ్గారు కాబట్టి మీ అందరికీ ఐదేసి మార్కులు ఇస్తున్నాను. కానీ మార్కులకి మించిన పాఠం ఒకటి మీరు తెలుసుకోవాల్సి ఉంది,’ అన్నారు టీచరుగారు చిరునవ్వుతో! టీచరు మాటలకి విద్యార్థులందరూ నోరువెళ్లబెట్టుకొని చూశారు. వాళ్లని చూస్తూ టీచరుగారు ఇలా చెప్పారు... ‘మీరు ఏర్పరుచుకున్న ద్వేషాలు మీ డెస్క్‌లో ఉన్న టమాటాలులాంటివి. ఎంతమంది మీద ద్వేషం ఏర్పరుచుకుంటే మీ మనసులో అంత దుర్గంధం చేరుతుంది. చూసేవాళ్లకి కూడా మీ మనసు అంత స్వచ్ఛంగా లేదన్న విషయం అర్థమైపోతుంది. క్రమంగా అంతా మీ నుంచి దూరమైపోతారు. కొన్నాళ్లకి మీరే మీకు అర్థం కాకుండా పోతారు. మనసులో ఏదో తెలియని బరువు, చిరాకు మాత్రమే మిగులుతాయి. ప్రేమ, కరుణలాంటి గుణాలు దూరమైపోతాయి. ద్వేషంతో మీ వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకోవాలా? ప్రేమతో ఈ ప్రపంచాన్ని జయించాలా?’ మీరే నిర్ణయించుకోండి అంటూ ముగించారు టీచరుగారు. ఆయన మాటలు విన్న విద్యార్థులంతా ఆలోచనలో మునిగిపోయారు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  

మనిషి మనిషిలా బతికేదెన్నాళ్లు

  అనగనగా భగవంతుడు సృష్టిని చేస్తున్నాడు. ముందరగా ఆయన ఓ కుక్కను సృష్టించాడు. ‘చూడూ నీకు ముప్ఫై ఏళ్ల ఆయుర్దాయాన్ని ఇస్తున్నాను. నువ్వు చేయాల్సిందల్లా, నీది అనుకున్న ఇంటిని కాపలా కాస్తూ ఉండటం. నీ జోలికి ఎవరన్నా వస్తే వారి వెంట పడి అరిచి అరిచి మీదపడి కరవడం. సరేనా!’ అన్నాడు.   దానికి కుక్క ‘అరవడం, కరవడం గురించి వింటుంటే సరదాగానే ఉంది కానీ మరీ ముప్ఫై ఏళ్లపాటు అలా గడపడమే కష్టమనిపిస్తోంది. కాబట్టి ఓ పదేళ్లపాటు అలా జీవిస్తే చాలనిపిస్తోంది. మిగతా ఇరవై ఏళ్లూ మీరే ఉంచేసుకోండి’ అనేసింది. ‘సరే, నీ ఇష్టం!’ అంటూ కుక్కను భూమ్మీదకు వదిలాడు భగవంతుడు.   అలా కుక్కను సృష్టించిన తరువాత కోతిని సృష్టించాడు. ‘చూడూ నీకు నలభై ఏళ్ల ఆయుష్షుని ఇస్తున్నాను. నువ్వు చేయాల్సిందల్లా, నా కోతి చేష్టలతో జనాల దృష్టిని ఆకర్షించడమే. సరేనా!’ అన్నాడు. దానికి కోతి ‘జనాల దృష్టిని ఆకర్షించడం బాగానే ఉంటుంది. కానీ మరీ నలభై ఏళ్ల పాటు అలా గడపడం అంటే చిరాగ్గా ఉంటుంది. విసుగేసిపోతుంది. కాబట్టి ఓ ఇరవై ఏళ్లు పాటు జీవిస్తే చాలు. మిగతా ఇరవై ఏళ్లూ మీరే ఉంచేసుకోండి’ అనేసింది. ‘సరే, నీ మాటను ఎందుకు కాదనాలి!’ అంటూ కోతిని భూమ్మీదకు వదిలాడు దేవుడు.     ఈసారి ఆవు వంతు వచ్చింది. ‘నిన్ను సృష్టిస్తుంటే నాకే జాలిగా ఉంది. నీకు అరవై ఏళ్ల జీవితకాలం ఇస్తున్నాను. నువ్వు దూడలను కని పోషించాలి. అవసరమైతే రైతుకి తోడుగా పొలాల్లో పనిచేయాలి. వట్టిపోతే చావుకోసం ఎదురుచూస్తూ కూర్చోవాలి.’ అన్నాడు భగవంతుడు.   దానికి ఆవు ‘సరే! మీరు నా నుదుటిన ఎలా రాస్తే అలా జరుగుతుంది. కాకపోతే ఒక్క మేలు చేయండి దేవా! ఇన్నేసి కష్టాలను అన్నేసి ఏళ్లపాటు భరించడం నా వల్ల కాదు. అందుకని ఒక మూడో వంతు జీవితాన్ని మాత్రమే నాకు ఇచ్చి, మిగతా నలభే ఏళ్లూ మీరే తీసేసుకోండి’ అని వేడుకొంది.దానికి భగవంతుడు సరేనంటూ, ఆవుని భూగ్రహం మీదకు వదిలాడు.   ఇక మనిషి వంతు వచ్చింది. ‘బాబూ, నీకు 20 ఏళ్ల ఆయుష్షుని ఇస్తున్నాను! తిను, కష్టపడు, నిద్రపో, ఆడు, పాడు.... పండగచేస్కో. ఈ ప్రపంచంలోని జీవులన్నింటికీ నువ్వే యజమానవి’ అని ఆశీర్వదించాడు.     కానీ మనిషి ఎంతైనా స్వార్థపరుడు కదా! భగవంతుని చేతిలో ఆయుష్షు పోసుకుంటూనే తన స్వార్థాన్ని చూపించేశాడు ‘జీవితాన్ని అనుభవించడానికి మరీ ఇరవై ఏళ్లేనా! కనీసం నిండు నూరేళ్లయినా లేకపోతే అదేం జీవితం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు మాత్రం వందేళ్ల జీవితం కావల్సిందే!’ అని పట్టుపట్టాడు.   మనిషి మాటలకు ఏం చేయాలో దేవునికి పాలుపోలేదు. ‘సరే ఒక పని చేస్తాను. నా దగ్గర కుక్కవి ఓ ఇరవై ఏళ్లూ, కోతివి ఓ ఇరవై ఏళ్లూ, ఆవువి ఓ ఇరవై ఏళ్లూ మిగులుగా ఉన్నాయి. వాటన్నింటినీ నీ ఆయుష్షుకి కలిపితే వందేళ్లు పూర్తవుతుంది. కానీ తరువాత జరిగే పరిణామాలకి మాత్రం నాది బాధ్యత కాదు. సరేనా!’ అని అడిగాడు.   ‘ఓ దానిదేం భాగ్యం. నాకు వందేళ్ల ఆయువు ఉంటే చాలు’ అంటూ భూమ్మీదకి దూకేశాడు మనిషి. అలా మనిషి జీవితం వందేళ్లనుకుంటే అందులో ఇరవై శాతం మాత్రమే తనలా ఉంటాడట. మిగతా ఇరవై శాతం కాలాన్నీ తనది అనుకున్న ఆస్తిని కాపాడుకునేందుకు, తోటి వారి మీద ద్వేషంతో అరుస్తూ కరుస్తూ ఉండేందుకు ఉపయోగిస్తుంటాడు. మరో ఇరవై శాతం జీవితంలో చుట్టుపక్కల ఉన్న జనాలని ఎలాగైనా తనవైపు ఆకర్షించుకునే ప్రయత్నంలో గడిపేస్తూ ఉంటాడు. ఇక మిగిలిన జీవితమేమో బండచాకిరీ చేస్తూ, ఇతరుల కోసమే జీవిస్తూ ఉంటాడు.   ..Nirjara

సాయానికి ప్రతిఫలం!

  అతను ఆ రోజు తన పాత బండి మీద 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీసుకి బయల్దేరాడు. అవడానికి 40 కిలోమీటర్లు అన్నమాటే కానీ ఆ దారంతా చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. ఆ దారిలో దొంగతనాలూ ఎక్కువే! దానికి తోడు ఆ రోజు విపరీతమైన మంచు కురుస్తోంది. అలాంటి సమయంలో అతనికి రోడ్డు పక్కగా నిలిపిన ఓ కారు కనిపించింది. ఆ కారు కదలడం లేదు. ఏమై ఉంటుందా అని అతను కారుకి దగ్గరగా వెళ్లి చూశాడు. లోపల ఒక పెద్దాయన బిక్కచచ్చిపోయి ఉన్నాడు. కారు తలుపు తీసి బయటకు వచ్చేందుకు కూడా ఆయనకు ధైర్యం చాలడం లేదు. కారు టైరు పంక్చర్‌ అయి ఉంది.   ‘నాపేరు రవీంద్ర! మీరు నన్ను చూసి కంగారుపడనవసరం లేదు. మీ దగ్గర ఇంకో టైరు ఉంటే చెప్పండి. నేను సరిచేసి పెడతాను,’ అంటూ భరోసా ఇచ్చాడు బండి మీద అక్కడికి చేరుకున్న వ్యక్తి. అతను అంతగా భరోసా ఇచ్చినా కూడా కారులోని మనిషికి ధైర్యం చాలడం లేదు. అందుకనే కారు తలుపు తీయకుండానే ‘స్పేరు టైరు, రిపేరు చేసే సామాన్లు డిక్కీలోనే ఉన్నాయి,’ అంటూ తడబడుతూ సమాధానం చెప్పాడు.   రవీంద్రకి పెద్దాయన భయం అర్థమైంది. తనలో తను నవ్వుకుంటూ డిక్కీ తెరచి కావల్సినంత సరంజామా అంతా బయటకు తీశాడు. వాటితో కారు టైరు సరిచేయడం మొదలుపెట్టాడు. ఓ గంట గడిచేసరికి పని పూర్తయ్యింది. పాడయిన టైరు స్థానంలోకి మరో టైరు చేరింది. కానీ పాపం రవీంద్ర బట్టలన్నీ గ్రీజుతో మాసిపోయాయి. అతని వాలకం చూసిన కారులో పెద్దాయనకి చెప్పలేనంత పశ్చాత్తాపంగా తోచింది. వెంటనే కారులోంచి దిగి- ‘నువ్వు లేకపోతే ఈ దారిలో నా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది. నువ్వు చేసిన సాయానికి బదులుగా ఎంత డబ్బు కావాలో చెప్పు,’ అంటూ తన పర్సుని బయటకు తీశాడు.   ‘మీరు ఆపదలో ఉన్నారని సాయపడ్డానే కానీ, డబ్బులు ఆశించి కాదు. మీరు అంతగా నా రుణం తీర్చుకోవాలంటే దానికో మార్గం లేకపోలేదు. మీకెప్పుడైనా కష్టాలలో ఉన్న మనిషి తారసపడితే, నేను మీకు చేసిన సాయాన్ని తల్చుకోండి. నా సాయానికి బదులుగా అతనికి మీరు చేతనైనా సాయం చేయండి,’ అనేసి తన దారిన తను వెళ్లిపోయాడు రవీంద్ర. పెద్దాయన తన మార్గంలో సాగిపోయాడు.   ఆ రోజు పెద్దాయన, తన ఇంటికి దగ్గరగా ఉన్న ఓ హోటల్‌కి చేరుకున్నాడు. గత కొన్ని వారాలుగా ఆయనకు ఆ హోటల్‌కు వస్తూనే ఉన్నాడు. అక్కడ పనిచేసే ఒక సర్వర్‌ని చూసి ఆయనకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఆ సర్వర్‌ నిండు గర్భవతి! పాపం విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఆమె పనిచేయాల్సి వస్తోందే అని జాలి కలిగేది పెద్దాయనకి. ఆమె అంతగా పనిచేస్తున్నా కూడా ఆమె మొహంలో వీసమెత్తయినా చిరాకు లేకపోవడం చూసి ముచ్చటగా తోచేది. పనితాలూకు అలసట ఆమె మొహంలో ప్రతిఫలిస్తున్నా, తను హోటల్‌కు వెళ్లిన ప్రతిసారీ చిరునవ్వుతో పలకరిస్తూ, మర్యాదగా సేవచేయడం చూసి... ఆమెకు ఏదన్నా సాయం చేస్తే బాగుండు అనిపించేది. కానీ అలాగే అశ్రద్ధ చేసేవాడు. కానీ ఇవాళ జరిగిన సంఘటనతో ఎందుకో ఆయన మనసు మరింత మెత్తబడింది. ‘ఆపదలో ఉన్నవారికి సాయం చేసి తన రుణం తీర్చుకోమన్న’ రవీంద్ర మాటలు పదేపదే గుర్తుకువచ్చాయి. అంతే! తన జేబులో ఉన్న ఓ పదివేల రూపాయలు తీసి ఆమెకు బిల్లుతో పాటు అందించాడు. ఆమె ఆ డబ్బులు చూసి అతన్ని ‘ఎందుకని’ అడిగేలోపే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తనకు అందిన సాయాన్ని చూసి ఆమె నోట మాట రాలేదు. ఆ సంఘటనను తన భర్తతో పంచుకునేందుకు ఆ రోజు హడావుడిగా ఇంటికి చేరుకుంది. అక్కడ ఆమె భర్త చొక్కా మీద గ్రీజు మరకలతో కనిపించాడు. తమ ఇద్దరికీ ఆ రోజు తారసిల్లిన మనిషి ఒక్కరేనన్న విషయం తెలుస్తుందో లేదో మరి! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

లాలిపాటలే తొలి జీవితపాఠాలు

  బిడ్డ పుట్టగానే బాధ్యత తీరిపోయిందని ఏ తల్లీ అనుకోదు. ఆ పిల్లవాడిని గొప్ప మనిషిగా తీర్చిదిద్ది, ఈ లోకానికి అందించేవరకూ ఆమె విశ్రమించదు. ఆ ప్రయాణంలో ప్రతి అడుగూ ఓ అద్భుతమే! అందుకే తల్లీబిడ్డల మధ్య బంధం పరిశోధకులకి ఓ హాట్టాపిక్! అలా ఈమధ్య జరిగిన ఓ పరిశోధనలో, తల్లి లాలిపాట కూడా పిల్లవాడి ఎదుగుదల మీద గొప్ప ప్రభావం చూపుతుందని తేలింది.   ప్రాంతానికీ, భాషకీ అతీతంగా ప్రపంచంలోని ప్రతి తల్లీ పిల్లవాడిని తన పాటతో లాలిస్తుంది. అసలు సంగీతం లాలిపాటతోనే మొదలైందని అంటారు. ప్రపంచంలో బెస్ట్ సింగర్ తల్లే అని ఒప్పుకుంటారు. అందుకే మియామీ యూనివర్సిటీ పరిశోధకులు పిల్లవాడి మీద తల్లి లాలిపాట ప్రభావం గురించి పరిశోధించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం వారు 70 మంది పసిపిల్లలని గమనించారు. తల్లి లాలిపాట పాడుతున్నప్పుడు వారి మానసిక స్థితినీ, వేరే సంగీతం వింటున్నప్పుడు వారి ఉద్వేగాలనీ పరిశీలించారు.   లయబద్ధంగా, ప్రేమగా సాగే లాలిపాటని వినగానే పిల్లవాడిలో అలజడి సద్దుమణిగిపోతున్నట్లు తేలింది. లాలిపాట పాడుతున్నప్పుడు పిల్లవాడు తల్లి వంకే చూస్తుంటాడు. పిల్లవాడి స్పందనలకు అనుగుణంగా తల్లి కూడా, పాటలోని లయని మారుస్తూ ఉంటుంది. దీంతో ఇద్దరి మధ్యా గొప్ప అనుబంధం ఏర్పడుతున్నట్లు గమనించారు. లాలిపాటతో పిల్లలు శబ్దాలను కూడా సులువుగా గ్రహించగలుగుతున్నారట. అలా లాలిపాట పిల్లవాడికి భాషని కూడా పరిచయం చేస్తోందన్నమాట.   లాలిపాట పాడుతూ పిల్లవాడితో గడపడం వల్ల తల్లి మనసు కూడా ప్రశాంతత పొందుతున్నట్లు తేలింది. చాలామంది తల్లులు డెలివరీ తర్వాత, శరీరంలోని హార్మోనుల మార్పులతో డిప్రెషన్కు లోనవుతారు. దీన్నే postpartum depression అంటాము. తల్లిలో ఏర్పడే ఈ నిరాశ నుంచి దృష్టి మళ్లించేందుకు లాలిపాట మందులా పనిచేస్తుందట. అంటే అమ్మ తనని తాను సంభాలించుకుంటూ, పిల్లవాడికి ప్రపంచాన్ని పరిచయం చేస్తుందన్నమాట. - నిర్జర.  

అమ్మ వయసు రెండు లక్షల సంవత్సరాలు

  ఎన్నో జన్మలెత్తితే కానీ మనిషిగా పుట్టడం సాధ్యం కాదు అంటాయి శాస్త్రాలు. అందులో వాస్తవాన్ని నిరూపించడం కష్టమే! కానీ ఎన్నో లక్షల సంవత్సరాల పరిణామక్రమం తర్వాత ఇప్పటి మనిషికి ఆ ఆకారం, జ్ఞానం వచ్చాయంటోంది విజ్ఞానశాస్త్రం. ఇప్పుడు ఆ చిక్కుముడి కూడా వీడిపోయింది. సరిగ్గా రెండు లక్షల సంవత్సరాల క్రితం తొలి మనిషి ఈ భూమ్మీద పుట్టాడని తేల్చారు.   అమెరికా, పోలండ్‌ దేశాలకు చెందిన పరిశోధకులు... మానవజాతికి తొలి మాతృమూర్తి ఎవరై ఉంటారా అన్న పరిశోధన మొదలుపెట్టారు. అందుకోసం ఇప్పటి మనిషిలోని జన్యువులని పరిశీలించసాగారు. తరం మారేకొద్దీ తల్లిదండ్రుల జన్యువులు కలిసి బిడ్డకు చేరుతూ ఉంటాయి. ఈ కలయికల వల్ల ఏ ఇద్దరి వ్యక్తులలోని జన్యువులూ ఒకేలా ఉండవు. ఇలా మారుతూ వస్తున్న జన్యువుల మూలాన్ని కనుక ఛేదించగలిగితే తొలి మానవుడు బయటపడినట్లే!   కానీ ఇదేమంత తేలికైన విషయం కాదు. ఒక మనిషిలో దాదాపు 20,000 రకాల జన్యువులు ఉంటాయి. వీటన్నింటిలో వస్తున్న మార్పుని పరిశీలించాలంటే మహా మహా కంప్యూటర్ల వల్ల కూడా కాదు. పైగా మిగతా జీవులతో పోలిస్తే మానవజాతి విశృంఖలంగా పెరిగిపోయింది. భూమ్మీద అతని సంచారమూ, వేర్వేరు తెగల మధ్య సంతానమూ పరిమితులు లేకుండా సాగాయి. శాస్త్రవేత్తలు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే కానీ లెక్క తేలదు. అందుకని శాస్త్రవేత్తలు ఒక ఉపాయాన్ని ఆలోచించారు.   మనలో కేవలం తల్లి నుంచి మాత్రమే వచ్చే జన్యువు ఒకటి ఉంది. అదే mitochondrial Eve (mtEve). ఈ ఒక్క జన్యువునీ విశ్లేషిస్తే సరిపోతుందనుకున్నారు. రకరకాల mathematical models ద్వారా దీని వయసుని కనుగొనే ప్రయత్నం చేశారు. mitochondrial Eve (mtEve)లో మార్పు ఎన్నేళ్లకు ఓసారి వస్తోంది? అలా ఎన్ని మార్పులు వచ్చాయో అంచనా వేసి చిక్కుముడిని విప్పారు. తొలి బిడ్డకు జన్మనిచ్చిన రెండు లక్షల సంవత్సరాలు గడిచినట్లు తేల్చారు. అంటే రెండు లక్షల సంవత్సరాలుగా ఆడది, అమ్మ బాధ్యతను మోస్తూ ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తోందన్నమాట! - నిర్జర.

లోపం నీలోనే ఉంటే....

  అతను ఓ కోపధారి మనిషి. ఎదుటి మనిషి మాటలో కానీ, కదలికలో కానీ ఏమాత్రం తేడా తోచినా తెగ విరుచుకుపడిపోయేవాడు. అలా రోజూ ఏదో ఒక గొడవ పెట్టుకొని కానీ ఇంటికి చేరుకునేవాడు కాదు.  వయసు గడిచేకొద్దీ ఆ కోపధారి మనిషిలో పశ్చాత్తాపం మొదలైంది. ‘రోజూ అసహ్యంగా ఏమిటీ గొడవలు’ అనుకున్నాడు. అంతే! కొన్నాళ్లపాటు ఎటూ వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవాలని అనుకున్నాడు. తన కోపం తగ్గేదాకా ఇంట్లో ఉండి ఆ తరువాత సమాజంలోనికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అంతవరకూ బాగానే ఉంది. కానీ...   ఓ నాలుగు రోజులు గడిచిన తరువాత అతనిలో సహనం నశించింది. ఇంట్లో భార్యాబిడ్డలతో ఏదో ఒక విషయం మీద వాదన మొదలుపెట్టసాగాడు. ‘మీరు బయటకి వెళ్తేనే మా బతుకులు ప్రశాంతంగా ఉండేవి,’ అని వారి చేత ఛీ కొట్టించుకున్నాడు. దాంతో ఆ కోపధారి మనిషికి తన కోపం మీదే మా చెడ్డ కోపం వచ్చింది. అంతే! వెంటనే ఇల్లూ వాకిలీ విడిచిపెట్టేసి ఓ ఆశ్రమంలో చేరిపోయాడు.   కోపధారి మనిషికి ఆశ్రమంలో అంతా బాగున్నట్లుగా తోచింది. వేళకి భోజనం, వేళకి నిద్ర.... ప్రతి ఒక్కరికీ స్థిరమైన బాధ్యతలు. ఆ బాధ్యతలను పర్యవేక్షించేందుకు పెద్దస్వాములు. అంతా ఓ పద్ధతి ప్రకారం సాగిపోతున్నట్లుగా అనిపించింది. తను కూడా ఆశ్రమ అధికారులు అప్పగించిన బాధ్యతలను బుద్ధిగా నెరవేచ్చసాగాడు. నియమం తప్పకుండా ధ్యానం చేసేవాడు. మనసులో ఒకటే ప్రశాంతత! కొన్నాళ్లకి అతనికి వంటింటి బాధ్యతల అప్పగించారు ఆశ్రమంవారు. ఇక అక్కడి నుంచీ కథ అడ్డం తిరిగింది. తోట వంటవారితో ఉప్పులు, పప్పులు దగ్గర గొడవలు మొదలయ్యాయి. ఎసరు ఎక్కువైందనీ, తాలింపు మాడిపోయిందనీ కొట్లాటకు దిగసాగాడు. ఇప్పుడు అతనిలోని కోపధారి మళ్లీ బయటకి వచ్చేసాడు.   ‘ఉహూ! ఇదంతా లాభం లేదు. అసలు మనుషులే లేని చోటకి వెళ్లిపోతాను. నరమానవుడు కనిపించని చోట తపస్సు చేసుకుని నా మనసుని మార్చుకుంటాను,’ అనుకున్నాడు కోపధారి. అందుకోసం ఎవరూ లేని ఓ దుర్గమ అరణ్యంలోకి చొచ్చుకుపోయాడు. అక్కడ అతనికి ఎటుచూసినా ప్రశాంతతే కనిపించింది. పక్షుల కిలకలారావాలు, కుందేళ్ల పరుగుల మధ్య అదో భూతల స్వర్గాన్ని తలపించింది.   ఆ అడవిలో నిజంగానే అతని మనసు ప్రశాంతతలో మునిగిపోయింది. ఓపిక ఉన్నంతసేపూ ఓ చెట్టు కింద కూర్చుని గంటల తరబడి ధ్యానం చేసుకునేవాడు. ఆకలి వేస్తే ఏవో పండ్లు తినేవాడు. భయం వేస్తే చెట్టు మీదకి ఎక్కి దాక్కొనేవాడు. దాహం వేస్తే దగ్గరలో ఉన్న సెలయేరు దగ్గరకి ఒక చిన్న కుండ తీసుకువెళ్లి నీళ్లు తెచ్చుకునేవాడు. అలా ఓ రోజూ కుండ తీసుకుని సెలయేటి దగ్గరకి వెళ్లాడు కోపధారి. కుండలో నీరు నింపి దాన్ని పక్కన పెట్టి, తాను స్నానానికి ఉపక్రమించాడు. ఆ కుండ తటాలున పక్కకి ఒరిగిపోయింది. అందులో నీళ్లన్నీ ఒలికిపోయాయి. దాంతో మళ్లీ కుండని నింపి గట్టు మీద పెట్టాడు. అదేం దరిద్రమో... మళ్లీ కుండ కాస్తా పక్కకి ఒరిగిపోయింది.   ఆ రోజు విపరీతమైన గాలి వీస్తున్నట్లుంది. ఎందుకంటే ఇంకో నాలుగైదు సార్లు అలా కుండని నింపి పెట్టినా కానీ... అతను నీటిలోకి దిగేసరికి అది పక్కకి ఒరిగిపోయేది. దాంతో కోపధారి మనసు ఒక్కసారిగా కుతకుతలాడిపోయింది. ఆ కుండని తీసుకుని నేలకేసి కొట్టాడు. తన కసితీరా దానిని కాలితో తొక్కాడు. ఇన్ని రోజులుగా అతని మనసులో అణచుకున్న ఉద్వేగాలన్నింటినీ ఆ కుండపెంకుల మీద చూపాడు. అలా వాటిని ముక్కలు ముక్కలుగా చేసి, ఆ తరువాత పొడిపొడిగా నలిపేసిన తరువాత కానీ అతనిలోని కోపం చల్లారలేదు. ఆ కోపం తగ్గిన తరువాత అతనిలో ఎందుకో ఓ ఆలోచన మొదలైంది...’లోపం నా చుట్టూ లేదు, నాలోనే ఉంది. అందుకని నా చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి తప్పించుకుని ఉపయోగం లేదు. నా నుంచి నేను పారిపోలేను కదా! కాబట్టి నన్ను నేనే మార్చుకోవాలి,’ అనుకుంటూ ఇంటిబాట పట్టాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  

పిల్లలు వివక్షను పసిగట్టేస్తారు

  మనం పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నాం అనుకుంటాం. అసభ్యపదజాలం వాడకుండా, గొడవలు పడకుండా వీలైనంత సహనాన్ని పాటించే ప్రయత్నం చేస్తుంటాం. కానీ అక్కడే మనం పిల్లల్ని తక్కువగా అంచనా వేస్తున్నాం అంటున్నారు పరిశోధకులు. మన మాటలో తేడాని బట్టి, ప్రవర్తనలో మార్పులని బట్టి వారు మనలోని వివక్షని పసిగట్టేస్తారని హెచ్చరిస్తున్నారు.   ఒకే సన్నివేశం- రెండు వీడియోలు పిల్లలు మనల్ని ఎంతవరకు అంచనా వేయగలరో తెలుసుకునేందుకు వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఓ ప్రయోగాన్ని చేశారు. ఇందుకోసం వారు 4 లేదా 5 ఏళ్ల వయసు ఉన్న ఓ 67 మంది పిల్లలను ఎంచుకున్నారు. వారిలో ప్రతి ఒక్కరికీ రెండు వీడియోలు చూపించారు. మొదటి వీడియోలోనూ, రెండో వీడియోలోనూ ఒకటేతరహా దృశ్యం ఉంది. ఒకావిడి మరొకావిడకి ఏదో వస్తువు అందించడమే ఆ వీడియోలలోని సారం. కాకపోతే ఒక వీడియోలోని వ్యక్తి వస్తువుని నవ్వుతూ, ఆవిడ వైపుగా చేయిని చాస్తూ సంతోషంగా ఇస్తే... మరో వీడియోలోని వ్యక్తి చిరాకుగా, వస్తువుని ఇవ్వడం ఇష్టం లేనట్లుగా ప్రవర్తిస్తుంది.   తేలిపోయింది రెండు వీడియోలలోని సారం ఒకటే అయినా అందులోని వ్యక్తుల హావభావాలను బట్టి పిల్లలు ఓ అభిప్రాయానికి వచ్చేసినట్లు గ్రహించారు. తమకు సానుకూలంగా ప్రవర్తించిన మనిషి నచ్చిందనీ, వారితో బొమ్మలు పంచుకోవడం ఇష్టమనీ కుండబద్దలు కొట్టేశారు. ఏకంగా 67 శాతం మంది పిల్లలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అంటే పిల్లలు తమపట్ల సానుకూలంగా ప్రవర్తించేవారిని గుర్తించడమే కాకుండా, వారితో మున్ముందు ఎలా ఉండాలన్న అభిప్రాయాన్ని కూడా చేరుకుంటారన్నమాట.   మరికాస్త ముందుకి ప్రయోగం ఇక్కడితో ఆగిపోలేదు. ఈసారి ఇవే వీడియోలను మరో 81 మంది పిల్లలకు చూపించారు. వీరు కూడా 4 లేదా 5 ఏళ్ల వయసువారే! అయితే ఈసారి వీడియోలను చూపించిన తరువాత, ఆ వీడియోలలో ఉన్న వ్యక్తుల తాలూకు స్నేహితులు అంటూ కొందరిని పరిచయం చేశారు. వారిలో మీకు ఎవరు నచ్చారో చెప్పమన్నారు. ఆశ్చర్యంగా... వీడియోలో స్నేహపూర్వకంగా మెలిగినవారి స్నేహితులు తమకి ఎక్కువగా నచ్చారని పేర్కొన్నారు పిల్లలు. అంటే సానుకూలంగా ప్రవర్తించేవారే కాదు, వారికి సన్నిహితంగా ఎవరైతే ఉంటారో వారి పట్ల కూడా పిల్లలు మంచి అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నారన్నమాట.   సమాజంలో తమకు కనిపించే వివక్షను పిల్లలు ఎలా స్వీకరిస్తారో ఈ ప్రయోగంతో తేలిపోయిందంటున్నారు నిపుణులు. ఓ వర్గానికి చెందిన వ్యక్తులు తమతో ప్రతికూలంగా ప్రవర్తిస్తే, దానిని గ్రహించి మనసులో నిలుపుకుంటారని హెచ్చరిస్తున్నారు. అవడానికి ఇది అమెరికాలో జరిగిన పరిశోధనే అయినా... భిన్న కులాలు, వర్గాలుగా విడిపోయిన మన భారతీయ సమాజానికి కూడా ఈ ఫలితాలు అన్వయిస్తాయేమో!   - నిర్జర.

భయాలను ప్రభావితం చేసే స్నేహితులు

  అభంశుభం ఎరుగని పసిమనసు ఓ తెల్ల కాగితంలాగా ఉంటుంది. దాని మీద ఎవరు ఎలాంటి ముద్ర వేసినా అది జీవితకాలం ఉండిపోతుంది. అయితే ఇంతవరకూ జన్మతః వచ్చిన జన్యువులో లేకపోతే తల్లిదండ్రుల ప్రభావమో పిల్లల భయాందోళనలకు కారణాలు అనుకునేవారు. కానీ చిన్ననాటి స్నేహితులు కూడా మనలోని భయాల తీరుని ప్రభావితం చేస్తారంటూ ఓ పరిశోధన వెలువడింది.   బాల్యం భయాలమయం : బాల్యంలో ఉండేవారిని లెక్కలేనన్ని భయాలు చుట్టుముడుతూ ఉంటాయి. వారు కొత్త జంతువుని చూసినా భయపడతారు, కొత్త శబ్దాన్ని విన్నా భయపడతారు... ఏమీ కనిపించని చీకటన్నా భయపడుతుంటారు. క్రమేపీ ఒంట్లో బలం, మనసులో స్థైర్యం, పరిసరాల పట్ల అవగాహన ఏర్పడేకొద్దీ ఈ భయాలు చెదిరిపోతుంటాయి. మరికొందరిలో మాత్రం ఇవి జీవితాంతం ఉండిపోయి, వారి బతుకుని చిన్నాభిన్నం చేసి పారేస్తాయి.   స్నేహితులూ కారణమే : పిల్లలలో మెదిలే భయాలను వారి స్నేహితులు కూడా ప్రభావితం చేస్తారనే కొత్త అంశం ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ఇందులో నిజానిజాలు తెలుసుకునేందుకు ఇంగ్లండుకి చెందిన కొందరు నిపుణులు ఓ ప్రయోగాన్ని నిర్వహించారు. దీనికోసం వారు 242 మంది పిల్లలను ఎంచుకున్నారు. వీరంతా కూడా 7 నుంచి 10 ఏళ్ల లోపువారే. వీరందరికీ కూడా గతంలో ఎప్పుడూ చూడని ఓ రెండు జంతువుల చిత్రాలను చూపించారు. సగం మంది పిల్లలకి ఈ కొత్త జంతువుల గురించి మంచిగా చెబితే, మరికొందరికి వీటి గురించి భయం కలిగించే వివరాలను అందించారు.   భావాలు బదిలీ అయ్యాయి : ప్రయోగంలో రెండోదశలో భాగంగా పిల్లలందరినీ ఇద్దరిద్దరుగా జతచేశారు. కాసేపటి తరువాత వారిని మళ్లీ పరీక్షించారు. కొత్త జంతువు గురించి భయపడుతున్న పిల్లలు, తోటివారిలో కూడా తమ భయాన్ని చొప్పించినట్లు తేలింది. ఆ జంతువు పట్ల భయాన్నీ, ఆ భయాన్ని ఎదుర్కొనేందుకు ఎలా ప్రవర్తించాలి అన్న విషయాన్నీ కూడా వీరు ఇతరులకు బదలాయించేశారు.   ఇదీ ఉపయోగం : పైకి సాధారణంగా కనిపించే ఈ పరిశోధన మనలోని అనేక సమస్యలకు పరిష్కారాన్ని చూపవచ్చునంటున్నారు నిపుణులు. తీవ్రమైన భయాందోళనలతో బాధపడుతున్న పిల్లలు, ధైర్యంగా మెలిగే పిల్లలతో స్నేహం చేస్తే... వారిలోని భయాందోళనలు తగ్గే అవకాశం ఉందంటున్నారు. విపరీతమైన భయాలతో బాధపడుతున్న పిల్లలకు చికిత్సను అందిస్తున్నప్పుడు, వారిలో అలాంటి భయాలను ప్రోత్సహిస్తున్న మిత్రులు ఎవరన్నా ఉన్నారేమో గమనించుకోవాలి అని కూడా సూచిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే- పిల్లలలో అనవసరమైన భయాలను నివారించాలన్నా, పరిమితి దాటిన ఆందోళనకు చికిత్సను అందించాలన్నా... వారి స్నేహితులను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నమాట. బహుశా ఇది పెద్దలకు కూడా వర్తిస్తుందేమో!   - నిర్జర.

ప్రయత్నమే పెద్ద విజయం

  ‘మార్పు’ అనగానే భయపడతాం. అది ఎప్పుడైనా, ఎలా అయినా, ఎవరినైనా కాస్త ఇబ్బంది పెట్టే పదం. కొత్తగా స్కూల్లో వేసిన కుర్రాడు భోరుభోరున ఏడుస్తూ స్కూలుకి వెళ్ళనని మారాం చేస్తుంటాడు. ఇంటిని, అమ్మని వదిలి కొత్త చోటుకి వెళ్ళటం అంటే వాడికి భయం. ఆ ‘మార్పు’ని ఎలా ఎదుర్కోవాలో ఆ చిన్న బుర్రకి తెలీక పేచీ పెడతాడు. కొన్ని రోజులకి ఆ మార్పుకి అలవాటు పడి, హాయిగా స్కూలుకి ఏ పేచీ లేకుండా వెళ్ళిపోతాడు. కాస్త సమయం పడుతుంది అంతే. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ, పెద్దయినా ‘మార్పు’కి భయపడుతూనే వుంటాం. రొటీన్ జీవితానికి పురోగతి నిల్:- నిజానికి అలవాటైన పరిస్థితులకు అంటిపెట్టుకున్నంతసేపూ ఎవరి జీవితంలోనూ పురోగతి వుండదు. వాటికి దూరమైనప్పుడు సహజంగానే అనిశ్చితి, అసౌకర్యం ఎదురవుతాయి. అలా ఎదురైన అసౌకర్యం సౌకర్యవంతంగా మారటానికి ‘కొద్దిగా’  సమయం పడుతుంది. అప్పుడే ఎదుగుదల సాధ్యపడుతుంది. ఉదాహరణకి కొత్తగా ఏదైనా చేయాలనే తపన ఎందరిలోనో వుంటుంది. కానీ, ధైర్యంగా ముందుకు అడుగు వేసి ఓ ప్రయత్నం చేసే సాహసం కొందరే చేయగలరు. వారు విజేతలుగా జేజేలు అందుకుంటారు కూడా. అందుకే అంటారు ‘ప్రయత్నమే పెద్ద విజయం’ అని. మనమూ పిల్లలమే:- మనమందరం కొద్దో గొప్పో స్కూలుకు వెళ్ళనని మారాం చేసే పిల్లాడితో సమానమే. కొత్త పరిసరాలు, పరిస్థితులు, వ్యక్తులు ఎదురవుతుంటే భయంతో బిగుసుకుపోతాం. ఒకోసారి అలా కొత్తవాటిని ఎదుర్కొనే ధైర్యం లేక ఏ మార్పుకి ఇష్టపడం కూడా. మన పరిస్థితి పట్ల అసంతృప్తి, మన జీవితం పట్ల నిరాశ వున్నా కూడా, కచ్చితమైన ప్రయత్నం చేస్తే జీవితం మెరుగుపడుతుందని తెలిసి కూడా ఆ దిశగా ప్రయత్నం చేయం. అందుకు రకరకాల కారణాలు చెపుతుంటాం. కానీ, ఒక్కసారి ఆ భయంలోంచి బయటకి రావాలని గట్టిగా అనుకుంటే అది ఏమాత్రం కష్టం కాదు అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. గిరి గీసుకోకండి:- ఎవరికివారు తమ శక్తియుక్తులని సరిగ్గా అంచనా వేసుకోగలగాలి. చాలాసార్లు తమ గురించి, తమ శక్తియుక్తుల గురించి సరైన అంచనా వేసుకోలేక చాలామంది గిరిగీసుకుని  ఉండిపోతుంటారు. ఇతరులతో పోల్చుకుని బాదపడుతుంటారు.  అదే ఎలాంటి భేషజాలు లేకుండా తమ గురించి, తమ బలం, బలహీనతల గురించి అంచనా వేసుకోగలిగితే కొత్త ప్రయత్నం చేయడానికి అంతగా భయపడరు. ‘మార్పు’ వారిని వణికించదు. అందరూ శక్తిమంతులే:- ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్పే మాట ఒక్కటే. ‘‘ఈ ప్రపంచంలో తక్కువ శక్తి కలవారు ఎవరూ లేరు. తక్కువ శక్తి కలవాళ్ళమని నమ్మేవాళ్ళే ఉన్నారు. అంతే... దాని వల్లనే జీవితంలో ఎక్కడివారు అక్కడే మిగిలిపోతారు’’ ఈమాట ఎంతో నిజం. అలాగే కోరిన రీతిలో జీవితాన్ని తీర్చిదిద్దుకోగల శక్తి అందరికీ ఉంటుందన్నదే వాస్తవం. శక్తి సామర్థ్యాలను ఆశించిన రీతిలో ఎవరైనా పెంపొందించుకోగలరు. ఏదైనా ఇట్టే సాధించగలమననుకునే చిన్నపాటి ధీమాయే ‘మార్పు’ని ధైర్యంగా ఎదుర్కోగల ఆయుధం. ఆ ఆయుధం ఆధారంగా ముందుకు వెళితే అంతా విజయమే. -రమ ఇరగవరపు

ఫోన్ పక్కనుంటే చాలు.. మైండ్ పనిచేయదు!

  స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చి పాతికేళ్లు కూడా నిండి ఉండదు. కానీ వచ్చీరాగానే అవి మన జీవితాలని ఆక్రమించేసుకున్నాయి. దానికి తోడు ఇంటర్నెట్ కూడా చవకగా మారిపోవడంతో... చేతిలో ఓ స్మార్ట్ఫోన్ ఉంటే చాలు, ప్రపంచం మనల్ని వెలివేసినా ఫర్వాలేదు అనే ధైర్యం మనది. కానీ అదే స్మార్ట్ ఫోన్ కొంపలు ముంచుతోంది. కంటిజబ్బులు, నిద్రలేమిలాంటి సమస్యలని తెచ్చిపెడుతోంది. అసలు స్మార్ట్ఫోన్ పక్కన ఉంటే మన మెదడు కూడా సరిగా పనిచేయదంటూ ఓ పరిశోధన వెలుగులోకి వచ్చింది. అదేమిటో మీరే చూడండి...   టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు, మన మెదడు మీద స్మార్ట్ఫోన్ పనితీరుని విశ్లేషించాలనుకున్నారు. అందుకోసం వారు ఓ 800 మంది ఫోన్ వాడకందారులను పిలిపించారు. వీరిని ఓ కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి కొన్ని చిన్న చిన్న సమస్యలకు జవాబులను అందించమని చెప్పారు. అప్పటికప్పుడు కాస్త మెదడుని పెడితే... ఎవరైనా సులువుగా జవాబు చెప్పగలిగే ప్రశ్నలే అవన్నీ!   అభ్యర్థుల స్మార్ట్ఫోన్ పక్కగదిలో ఉండటమో, టేబుల్ మీదే ఉండటమో, జేబులోనే ఉండటమో బట్టి వారు జవాబులని ఇచ్చే సామర్థ్యంలో తేడా ఉందేమో గమనించారు. ఈ పరిశీలనలో ఖచ్చితమైన తేడాలు కనిపించాయి. పక్కగదిలో ఫోన్ పెట్టేసినవారు ఇతరులకంటే చక్కగా జవాబులు రాశారట. ఫోన్ అభ్యర్థికి ఎంత దగ్గరగా ఉంటే, సమస్య మీద అతని ఏకాగ్రత అంతగా బలహీనపడినట్లు గ్రహించారు. ఫోన్ సైలెంటులో ఉందా, తిరగేసి ఉందా లాంటి పరిస్థితులతో సంబంధం లేకుండా ఈ ఫలితాలు కనిపించాయి.   ఈ ప్రయోగానికి పొడిగింపుగా మరో సందర్భాన్ని సృష్టించారు పరిశోధకులు. ఈసారి అభ్యర్థులను- ‘ఫోన్తో మీ అనుబంధం ఎలా ఉంటుంది?’ అని ప్రశ్నించారు. కొందరు అభ్యర్థులు ‘అబ్బే మేము ఫోన్ లేకుండా నిమిషం కూడా బతకలేము,’ అని చెప్పారు. మరికొందరు ‘ఫోన్ కేవలం అవసరం కోసమే! అదే మా సర్వస్వం కాదు. దానికి పెద్దగా సమయాన్ని కేటాయించం,’ అని తేల్చారు. వీళ్లందరి మీదా పైన పేర్కొన్ని ప్రయోగాన్నే అమలుచేశారు. ఎవరైతే ఫోన్ లేకుండా గడపలేమని అన్నారో... వారు కంప్యూటర్లో కనిపించిని చిన్నిపాటి సమస్యలకి కూడా జవాబుని అందించలేకపోయారట.   ఏతావాతా తేలిందేమిటంటే, ఫోన్ దగ్గరలో ఉంటే చాలు- ఏదన్నా కాల్ వస్తుందేమో, వాట్సప్ మెసేజి వచ్చిందేమో, చార్జింగ్ ఉదో లేదో, భార్యకి కాల్ చేయాలి కదా, ఆన్లైన్లో డబ్బులు పంపించాలిగా లాంటి సవాలక్ష సందేశాలు మనసుని గిలిపెడుతూ ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా పనిచేసుకోవాలి అని మనసుని బలవంతపెట్టిన కొద్దీ మన ఏకాగ్రత మరింతగా చెదిరిపోతుంది. ఫలితం! మన అవసరం కోసం కనిపెట్టిన స్మార్ట్ఫోన్, జీవితాలను కమ్ముకుని ఉంటోంది. - నిర్జర.          

రాముడు గెలిచింది అందుకనే!

  ఒక మనిషి మంచివాడు అని చెప్పడానికి అతణ్ని రాముడితో పోలుస్తారు. ఒక మనిషి అహంకారి అని సూచించడానికి అతణ్ని రావణాసురునితో పోలుస్తారు. రాముని దేవునిగా మనం పూజించవచ్చేమో! కానీ అతణ్ని ఆభిమానించేది మాత్రం ఆయన వ్యక్తిత్వాన్ని చూసే! రావణాసురుడు అసురుడు అన్న విషయాన్ని మనం గమనించకపోవచ్చు. కానీ ఆయనకు భయపడేది, అతనిలోని అహంకారాన్ని చూసే. రాముడు విజేతగా నిలిచినా, రావణుడు పరాజయం పాలైనా వారివారి గుణాలను బట్టే కానీ అంశను అనుసరించి కాదు.     ఆచార్యులను అనుసరిస్తూ... రాముడికి చిన్ననాటి నుంచే పరీక్షలు మొదలయ్యాయి. వశిష్టులవారి వద్ద ఇలా రామలక్ష్మణులు తమ విద్యను పూర్తిచేసుకున్నారో లేదో, అలా విశ్వామిత్రుడు వచ్చి వారిని తన వెంట అడవులకు పంపమని అడిగాడు. తాను చేస్తున్న యాగాలకు రక్షణగా రాముని తోడు కావాలంటూ పట్టుపట్టాడు విశ్వామిత్రుడు. గురువుల మాట మీద గౌరవంతో ముక్కుపచ్చలారని రాముడు అలా మొదటిసారి అడవుల బాట పట్టాడు. అడవిలో రామునికి తనకు తెలిసిన అస్త్ర రహస్యాలన్నింటినీ అందించాడు విశ్వామిత్రుడు. గురువుని అనుసరించినందుకు రామునికి దక్కిన ప్రతిఫలం అది! అలా విశ్వామిత్రుని యాగశాలలకు కిమ్మనకుండా కాపలాగా వచ్చినందుకు, రామునిలో అటు జ్ఞానమూ, ఇటు అనుభవమూ రెండూ కూడా బలపడ్డాయి.     పెద్దలను గౌరవిస్తూ... విశ్వామిత్రుని యాగం ముగిసిన తరువాత అయోధ్యకు తిరిగివచ్చే దారిలో రామునికి సీతాస్వయంవరం తటస్థించింది. అక్కడ మహామహులను కాదని శివధనస్సుని ఎక్కుపెట్టి సీతమ్మ చేయి పట్టాడు రాముడు. తన గురువైన శివుని ధనుస్సుని విరిచిన రాముని మీద కోపంతో ఊగిపోతూ అక్కడికి చేరుకుంటాడు పరశురాముడు. పరశురాముడు పరుషంగా ఎన్నిమాటలన్నా పరమశాంతంగా వాటిని భరిస్తాడు రాముడు. పరశురాముని కోపంలో కారణం ఉంది కాబట్టే, మారు మాటలాడకుండా నిల్చుంటాడు రాముడు. చివరికి చేతనైతే తనవద్దనున్న విష్ణుచాపాన్ని కూడా ఎక్కుపెట్టి చూపమని అడుగుతాడు పరశురాముడు. ఆ ధనుస్సుని కూడా రాముడు ఎక్కుపెట్టిన తరువాతే, అతను విష్ణుమూర్తి అవతారమన్న విషయం అర్థమవుతుంది పరశురామునికి. ఇలా పెద్దవారి పట్ల అణకువ, సందర్భోచితమైన ప్రవర్తన రాముని అవతారంలో అడుగడుగునా కనిపిస్తాయి.     తల్లిదండ్రుల మాట జవదాటక... సీతా స్వయంవరం ముగిసి, సతీసమేతంగా అయోధ్యకు చేరుకున్న రాముడు కొన్నాళ్లైనా సుఖంగా ఉన్నాడో లేడో... రాముని అడవులకు పంపమంటూ అతని సవతి తల్లి కైకేయి దశరథుని శాసించింది. మరికొద్ది రోజులలో తనకు పట్టాభిషేకం జరగబోతుండగా, ఏకంగా అడవులకు వెళ్లాల్సి రావడం ఏమిటని రాముడు సంకోచించలేదు. తండ్రిని ఎదిరించలేదు, సవతి తల్లి కదా అని దూషించలేదు. మారుమాట్లాడకుండా నార వస్త్రాలతో అడవులకేగాడు. ఎందుకంటే రాముడు ధర్మాన్ని నమ్మాడు. సమాజం ఒక రీతిలో సాగేందుకు ఏర్పరుచుకున్న నియమమే ధర్మం. అది కాలాన్ని బట్టి ఎంతోకొంత మారుతూ ఉండవచ్చు. తన కాలంలో ఉన్న ధర్మాన్ని రాముడు మనసావాచా అనుసరించాడు. ధర్మాన్ని తాను పరిరక్షిస్తే, ధర్మం తనను కాపాడుతుందని విశ్వసించాడు. ఆ నమ్మకమే ఆయన విజయానికి కారణమైంది. ప్రకృతిలో ప్రతి జీవి ఆయన నమ్మకానికి తోడునిచ్చేందుకు సిద్ధపడింది. అల్లరికి మారుపేరైన కోతుల దగ్గర్నుంచీ, అల్పజీవులైన ఉడతల దాకా రామునికి సాయపడ్డాయి. లంకను దాటేందుకు సముద్రంలో రాళ్లు తేలాయి, రాముని మీద సంధించిన మోయాపాయాలన్నీ చిన్నబోయాయి. దీనికంతటికీ ధర్మం పట్ల రాముడు చూపిన నమ్మకమే అని వేరే చెప్పాలా. అందుకే ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అన్నారు. అంటే రూపం దాల్చిన ధర్మమే రాముడు అని అర్థం. అదే అతని విజయ రహస్యం.     మరి రావణుడో! రామునికంటే రావణుడు  పెద్దవాడు, అనుభవజ్ఞుడు. మానవుల చేతిలో తప్ప మృత్యువు రాదన్న వరం ఉన్నవాడు. కుబేరుడు నిర్మించిన లంకా నగరంలో సకలవైభోగాలూ అనుభవిస్తున్నవాడు. అందుకే గొప్ప ఇంటిని చూస్తే దాన్ని ‘లంకంత కొంప’తో పోలుస్తాము. మండోదరిలాంటి మహాపతివ్రత రావణుని భార్య; విశ్వజిత్తు వంటి చేతికందిన ఏడుగురు సమర్థులు అతని కొడుకులు; విభీషణుడు, కుంభకర్ణుడులాంటి పరాక్రమవంతులు అతని సోదరులు; శివుని ఆశీస్సులు; వేదాలను అభ్యసించి సాధించిన అపార జ్ఞానం... ఇవేవీ రావణుని రక్షించలేకపోయాయి. పరస్త్రీ వ్యామోహం, ఆ వ్యామోహాన్ని సమర్థించుకునే అహంకారం అతని వినాశనానికి దారితీశాయి. అడవుల బాట పట్టిన రాముడు, కోతిమూక సాయంతో రావణుని ఓడించాడు. రాముడు తన జీవితకాలంలో స్నేహితులను పోగేసుకుంటే వెళ్తే, రావణుడు తన సోదరుడైన విభీషణుని సైతం శత్రువుగా మార్చుకున్నాడు. రాముని దర్శించిన అహల్యవంటివారంతా శాపవిమోచనం పొందితే, రావణుడు మాత్రం ఒక్కొక్కొరి నుంచి శాపాలను పోగుచేసుకుంటూ సాగాడు. ఆ శాపాలు, శతృత్వాలే చివరికి రావణుడి కొంప ముంచాయి. ధర్మం దాటి పరస్త్రీని చేపట్టిన రావణుని అంతమొందించేందుకు సాయపడ్డాయి.   - నిర్జర.

పిల్లలు తప్పులు ఒప్పుకోవాలంటే

తల్లిదండ్రులు తిడతారేమో అన్న అనుమానంతో ప్రోగ్రెస్‌ రిపోర్టు కార్డులలో దొంగ సంతకాలు చేసే పిల్లల సంగతి వినే ఉంటాము. ఏదన్నా వస్తువుని పాడుచేస్తే, తండ్రి చేతిలో దెబ్బలు తప్పవన్న భయంతో తనకేమీ తెలియనట్లు నటించే పిల్లల గురించీ మనకి తెలుసు. అంతదాకా ఎందుకు! మన బాల్యంలో కూడా తల్లిదండ్రుల దండననీ, చీవాట్లనీ తప్పించుకునేందుకు ఇలాంటి పనులేవో చేసే ఉంటాము.   పిల్లవాడు ఎప్పుడో ఒకసారి అబద్ధం చెప్పడం సహజమే కావచ్చు. కానీ ప్రతిసారీ ఇదే తీరు కనుక కొనసాగితే, అది పిల్లవాడి జీవితం మీదే ప్రభావం చూపక మానదు. అబద్ధం అనేది ఒక అలవాటుగానో, ఒక విషవలయంగానో మారిపోయి అతని భవిష్యత్తులనే నాశనం చేసే ప్రమాదం లేకపోలేదు. తప్పు చేసినప్పుడు నిజాయితీగా దానిని ఒప్పుకోవడమా, లేకపోతే తల్లిదండ్రుల దగ్గర వెల్లడించడమా అనే సంశయం ఏర్పడినప్పుడు పిల్లలో ఎలాంటి భావాలు కలుగుతాయి? అన్న సందేహం వచ్చింది ఓ ప్రొఫెసరుగారికి. దాంతో ఆయన చేసిన పరిశోధన ఇలాంటి పరిస్థితులలో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలో ఒక సూచనను అందిస్తోంది.   పిల్లల అంతరాత్మ సంఘర్షణని తెలుసుకునే ఈ ప్రయోగం కోసం పరిశోధకులు 4 నుంచి 9 ఏళ్ల వయసు లోపల ఉన్న కొందరు పిల్లలను ఎంచుకున్నారు. వీరికి కొన్ని సందర్భాలను ఊహించుకోమని ప్రోత్సహించారు. అలాంటి సందర్భాలలో మీరు ఏదన్నా పొరపాటు చేస్తే, చేసిన తప్పు గురించి తల్లిదండ్రులకు చెబుతారా లేదా? ఒకవేళ చేసిన పొరపాటుని ఒప్పుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అదే పొరపాటుని ఒప్పుకోకుండా ఏదో అబద్ధంతో కప్పిపుచ్చుకుంటే మీ మనసుకి ఎలా తోస్తుంది? అంటూ రకరకాల ప్రశ్నలతో వారి భావాలను గ్రహించే ప్రయత్నం చేశారు.   పరిశోధనలో తేలిందేమిటంటే 4,5 ఏళ్ల పిల్లలు తమ తప్పుని కప్పిపుచ్చున్నప్పుడు పెద్దగా పశ్చాత్తాపపడలేదట. పైగా చేసిన తప్పుని ఒప్పుకునేందుకే వారు చాలా ఇబ్బంది పడ్డారట. దీనికి విరుద్ధంగా 7,8 ఏళ్ల పిల్లలు తాము చేసిన తప్పుని ఒప్పుకోవడంలోనే మనశ్శాంతిని పొందారు. ఆ తప్పుని కప్పిపుచ్చుకునేందుకు వారు చాలా ఇబ్బందిపడ్డారు. అలాగని 4,5 ఏళ్ల పిల్లలలో ఫలానా పని తప్పు అనే విచక్షణ లేకపోలేదు. కానీ బహుశా వారు పెద్దలు దండిస్తారనే భయంతో తప్పుని కప్పిపుచ్చుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చి ఉంటారు.   ఏతావాతా ఈ పరిశోధన తరువాత నిపుణులు చెబుతోందేమిటంటే- ‘పిల్లవాడు తప్పుచేయగానే ముందు విరుచుకుపడిపోవద్దు. అసలు అతను ఏం చెబుతున్నాడో వినండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తన వాదన వినేందుకు సిద్ధంగా ఉండండి. తద్వారా చేసిన తప్పుని ఒప్పుకోవడం అనే లక్షణం మీకు సంతోషాన్ని కలిగిస్తుందనే అభిప్రాయం అతనిలో కలిగేలా చేయండి. జరిగిన సంఘటననీ, దానికి అతను చెప్పిన మాటనీ విన్న తర్వాత ప్రశాంతంగా ఓ నిర్ణయానికి రండి. పిల్లవాడిలో ఇలాంటి భరోసా కలగడం వల్ల, అతను మున్ముందు ఎలాంటి పొరపాటు చేసినా మీకు సరిదిద్దే అవకాశం వస్తుంది. మద్యం మత్తులో మునిగిపోయినా, పొరపాటున డ్రగ్స్‌ అలవాటైనా కూడా అతను మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంటుంది.’ – నిజమే కదా! - నిర్జర.