పిల్లలు టీవీ చూస్తే ఫర్వాలేదా!

  ఒక రెండు దశాబ్దాల క్రితం మన ఇళ్లలో టీవీ పాత్ర చాలా తక్కువగా ఉండేది. అప్పట్లో టీవీ అంటే దూరదర్శనే. కానీ ఇప్పుడో! వందలకొద్దీ ఛానెల్స్‌ వచ్చేసాయి. రోజంతా చూసినా తనివితీరనన్ని కార్యక్రమాలు వాటిలో ప్రసారంఅవుతున్నాయి. అందుకనే ఇప్పుడు టీవీ మన జీవితాలని శాసించేంత స్థాయికి చేరుకుంది. పెద్దవారంటే తమ విచక్షణని అనుసరించి టీవీ చూస్తారు. కానీ అభం శుభం తెలియని పిల్లల సంగతో! అందుకే వారి విషయంలో టీవీ ప్రభావాన్ని తగ్గించేందుకు మనం గట్టి ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది.   కారణం ఏదో ఒక ఛానల్లో ఏదో ఒక కార్యక్రమం వస్తూ ఉండటమో, పిల్లలని ఆడించేంత ఓపిక పెద్దవారికి లేకపోవడమో, తల్లిందండ్రులిద్దరూ ఉద్యోగ బాధ్యతలలో మునిగిపోవడమో... ఇలా కారణం ఏదైతేనేం పిల్లలు టీవీలకు అతుక్కుపోతున్నారు. నిజానికి రెండేళ్లలోపు పిల్లలు అసలు టీవీ జోలికే పోకూడదనీ, రెండేళ్లు దాటిన పిల్లలు రెండుగంటలకు మించి టీవీ చూడకూడదనీ నిపుణులు సూచిస్తున్నారు. అది వారిలో అనారోగ్య సమస్యలని సృష్టించడమే కాకుండా శారీరిక, మానసిక ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఇవీ సమస్యలు!     - నిరంతరం టీవీ ముందు కూర్చునే పిల్లలు తమకు తెలియకుండానే ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఇలా కదలకుండా మెదలకుండా పై నుంచి ఏదో చిరుతిండిని ఆరగిస్తూ ఉండటం వల్ల వారు ఊబకాయం బారిన పడతారు.   - టీవీలో పాత్రలని అనుసరించడం వల్ల వారిలో హింసాత్మక ధోరణులు పెరిగే ప్రమాదం ఉంది. ఆఖరికి టామ్ అండ్‌ జెర్రీలోని పిల్లీ, ఎలుకా కొట్టుకునే సన్నివేశాలు కూడా వారి మీద ప్రతికూల ప్రభావం చూపుతాయి.   - తాము టీవీలో చూస్తున్నదానిలో ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ వారికి ఉండదు. సిగిరెట్లు తాగడం, బాణాలు వేసుకోవడం, గోడ మీద నుంచి దూకడం, అత్యాచారం చేయడం వంటి పనులలో ఉండే నైతికతనీ, ప్రమాదాన్నీ బేరీజు వేసుకోకుండానే వాటిని అనుసరించే ప్రమాదం ఉంది.   - టీవీ ప్రకటనలు పిల్లల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. పనికిమాలిన చిరుతిళ్లను ఆకర్షణీయంగా, ఉపయోగం లేని వస్తువులను అవసరంగా చిత్రీకరించి పిల్లలను ఆకర్షిస్తాయి. పిల్లలు అలాంటి వస్తువులను కొనాలని మారం చేయడం, వాటికి అలవాటుపడిపోవడం మనం తరచూ చూసేదే!     ఇవీ పరిష్కరాలు! - పిల్లలలో ఆసక్తినీ, విజ్ఞానాన్నీ పెంచేలా ఏదన్నా వ్యాపకాన్ని అలవాటు చేసే ప్రయత్నం చేయడం.   - పిల్లలు మనల్ని అనుసరిస్తారు కాబట్టి వారి ముందు అనవసరంగా టీవీ చూస్తూనో, అభ్యంతరకరమైన కార్యక్రమాలు చూస్తూనో కాలం గడపకూడదు. అలా పిల్లలకి ఒక మంచి ఉదాహరణగా మనమే నిలవాల్సి ఉంటుంది.   - పిల్లలు తరచూ ఎలాంటి కార్యక్రమాలు చూస్తున్నారు. అవి వారి వయసుకి, ఆలోచనకీ తగినవా కాదా అని గమనించుకోవడం.   - పిల్లలు టీవీకి తగినంత దూరంగా కూర్చుంటున్నారా, మధ్యమధ్యలో తగినంత విరామం ఇస్తున్నారా అన్న విషయాలను గుర్తించాలి.   - రోజు మొత్తంలో ఇంతసేపు మాత్రమే టీవీ చూడాలి అన్న నిబంధనను వారికి స్పష్టం చేయడంతో వారు ఆ కాస్త సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాలి.   - హోంవర్కు చేసిన తరువాతనే, అన్నం తిన్న తరువాతనే... వంటి మాటలతో టీవీ వారి దినచర్యని అడ్డుకోకుండా చూడాలి.   - పిల్లవాడికి టీవీ ఒక వ్యసనంగా మారిపోతే ఆ పరిస్థితిని తేలికగా తీసుకోకూడదు. అతిగా టీవీ చూడటం వల్ల వచ్చే అనర్థాలను వివరించి....  నయానో భయానో అతని అలవాటు అదుపులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి.   టీవీ ఒక తప్పించుకోలేని సౌకర్యం. అలవాటు కనుక అదుపులో ఉంటే పిల్లల వినోదానికీ, విజ్ఞానానికీ, లోకజ్ఞానానికీ... టీవీని మించిన చవకబారు సాధనం కనిపించదు. లేకపోతే మాత్రం వారి జీవితాంతం వేధించే దుష్ఫ్రభావాలు తప్పవు. ఫలితం ఎలా ఉండాలన్నది మన చేతుల్లోనే ఉంది!   - నిర్జర.

మనిషిని జైల్లో ఉంచితే

మనిషి ఈ విశ్వంలోని రహస్యాలు ఎన్నింటినో ఛేదించి ఉండవచ్చు. కానీ అతని మనసులో ఉన్న మర్మం మాత్రం ఎప్పటికప్పుడు కొత్త విషయాలను వెల్లడిస్తూనే ఉంది. మనిషి మనసులోని ఈ లోతులను గమనించేందుకు ఎన్నో పరిశోధనలు సాగాయి. వాటిలో అత్యంత ఆసక్తికరమైనదీ, వివాదాస్పదమైనదీ ‘The Stanford Prison Experiment’. 1971లో అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ‘ఫిలిప్ జింబార్డో’ రూపొందించిన ఈ పరిశోధన ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. మనస్తత్వ శాస్త్రం గురించి రాసే ప్రతి పాఠ్యపుస్తకంలోనూ దీని ప్రస్తావన తప్పక కనిపిస్తుంది. తమ చుట్టూ ఉన్న పరిస్థితుల ఆధారంగా మనుషుల ప్రవర్తనలో మార్పులు వస్తాయా? అధికారం తలకెక్కితే మనిషి ఎలా ప్రవర్తిస్తాడు? అన్న ప్రశ్నలకు జవాబులను వెతికేందుకు ఈ పరిశోధనను నిర్వహించారు. ఇందుకోసం జింబార్డో ఒక 24 మంది అభ్యర్ధులను ఎన్నుకొన్నారు. వీరిలో 12 మంది జైలు అధికారులుగానూ, మరో 12 మంది ఖైదీలు గానూ కొన్నాళ్లపాటు ఉండాలని నిర్దేశించారు. వీరంతా తమ పాత్రలను నిర్వహించేందుకు నిజంగానే జైలుని తలపించేలా స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని ఒక భవనం కింద ఓ తాత్కాలిక జైలుని ఏర్పాటుచేశారు. ఏర్పాట్లన్నీ తాత్కాలికంగానే జరిగినా నిజంగానే అక్కడి వాతావరణం అంతా జైలుని తలపించేలా చర్యలు తీసుకున్నారు. జైలు అధికారులుగా ఉన్నవారికి యూనిఫాం, సన్గ్లాసెస్, లాఠీలను అందించారు. ఇక ఖైదీలుగా ఎన్నుకొన్నవారిని వారి ఇంటి దగ్గరే అరెస్టు చేసి, వారి మీద అభియోగాలు మోపినట్లు పత్రాలను చూపించారు. విశ్వవిద్యాలయంలో ఉన్న ‘జైలు’ గదుల్లో వారిని బంధించి ఒక సంఖ్యని కూడా కేటాయించారు. దీంతో పూర్తిగా జైలు వాతావరణం సిద్ధమైపోయింది. ఇక అక్కడ ఉండేవారు ఎలా ప్రవర్తిస్తారు అని గమనించడమే తరువాయి. జైలు అధికారులను పర్యవేక్షించే సూపరింటెండెంటుగా స్వయంగా జింబార్డోనే రంగంలోకి దిగారు. అప్పటి నుంచీ అసలు కథ మొదలైంది... జైల్లో ఉండే ఖైదీల మీద చేయి చేసుకోకూడదని మొదట్లోనే జైలు అధికారులందరికీ సూచనలను అందించారు. కానీ తాము అధికారులు, ఖైదీలుగా ఉన్నవారు బలహీనులు అనే అభిప్రాయాన్ని తెచ్చేందుకు ప్రయత్నించవచ్చునని చెప్పారు. ఇలా ఓ రెండువారాల పాటు ఈ పరిశోధనన నిర్వహించాలని అనుకున్నారు. కానీ పరిశోధన మొదలైన రెండోరోజునే పరిస్థితులు విషమించసాగాయి. ‘జైలు’లో ఉన్న ఖైదీలు ‘తిరుగుబాటు’ చేయడం మొదలుపెట్టారు. దానికి స్పందించిన జైలు ‘అధికారులు’ నిప్పుని ఆర్పే గ్యాస్ని వారి మీదకి వదిలి ఆ తిరుగుబాటుని అణిచివేశారు. రోజులు గడిచేకొద్దీ జైలులో ఉన్నవారంతా నటించడం మానేసి జీవించడం మొదలుపెట్టారు. రోజురోజుకీ గార్డులు అతి క్రూరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. మలమూత్రాలను సరిగా శుభ్రం చేయించకుండా అలాగే ఖైదీల గదిలో ఉంచేయడం, మంచాలను ఎత్తించేసి నేల మీదే పడుకునేలా చేయడం, ఒంటరిగా చీకటి గదులలో బంధించడం, నగ్నంగా ఉంచడం వంటి నానావిధాల హింసలను మొదలుపెట్టారు. ఈ అకృత్యాలను కొందరు ఖైదీలు నిశ్శబ్దంగా భరించగా, మరికొందరు తిరగబడేవారు. తిరగబడినవారికి మరిన్ని శిక్షలే దక్కేవి! విచిత్రం ఏమిటంటే పరిశోధనను రూపకల్పన చేసిన జింబార్డో కూడా నిజమైన జైలు అధికారిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఒక ఆరు రోజులు గడిచేసరికి ఇక ఈ పరిశోధనని సాగించడం ప్రమాదకరం అని తేలిపోయింది. పరిశోధనని గమనించేందుకు బయట నుంచి వచ్చిన ఒక విద్యార్థిని పరిస్థితులు విషమిస్తున్నాయంటూ జింబార్డోకి తలంటడంతో అర్ధంతరంగా దీనిని విరమించారు. తామంతా ఒక పరిశోధనలో భాగంగా ఉన్నామనీ, తమ చర్యలను వీడియో తీస్తున్నారనీ తెలిసినా కూడా జైలులో ఉన్నవారి ప్రవర్తన అదుపుతప్పడం పలు పాఠాలను నేర్పింది. మనిషి తన చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా తన ప్రవర్తనను మలుచుకుంటాడనీ, అధికారం అతడిని రాతిగుండెగా మార్చివేస్తుందనీ ఈ పరిశోధనతో తేలిపోయింది. స్టాన్ఫోర్డ్ పరిశోధన ఆధారంగా పలు నివేదికలు రూపొందాయి, పలు డాక్యుమెంటరీలు రూపొందాయి. గత ఏడాది ఒక హాలీవుడ్ చిత్రం కూడా విడుదలైంది. ఈ పరిశోధన ఆధారంగా అమెరికాలో ఖైదీలను విచారించే తీరులోనూ, వారిని జైల్లో ఉంచే పద్ధతులలోనూ పలు మార్పులను తీసుకువచ్చారు. కానీ అధికారులు కఠినాతికఠినంగా ప్రవర్తించే ప్రతిసారీ ఈ పరిశోధన గుర్తుకురాక మానదు.   - నిర్జర.

The Boiling Frog Theory

  From centuries together, many theories have been put forward to evaluate human psychology. And the Theory of Boiling Frog is one such experiment. Some people call it as mere metaphor and some believe in it... but everyone feels that there is an important message to be learnt from the story.   The Theory If you keep a frog in the boiling water, it would immediately jump out of the water. But if you keep in cold water and start boiling, the frog would not notice the danger. By the time it realises the danger, it gets succumbed by the heat. Several experiments have been done to decide the truth in this theory. In one such experiment, when the temperature was raised slowly at the rate of 0.002°C per second... the frog was found dead after 2½ hours.   The Reason Humans try to maintain constant temperature irrespective of their surroundings. But frogs have the ability of changing their body temperatures according to the atmosphere around them. So, by the time frog realises that it is too hot to adapt to the boiling water, enough damage would be done to its reflexes which disable it to get out.   The Truth Scientists in the past claimed to have proved the theory to be perfect. But modern naturalists have several objections to such claims. From temperatures to the behaviour of the frog... experts now have many doubts over the validity of the theory. Some conversationalists also allege that this theory would mislead people about nature.   The Lessons The frog might jump out of the gradually boiling water or it might won’t. But this theory has some important lessons for us.   - The circumstances around us may not seem to be threatening, but we have to be watchful about the slightest of the changes.   - Any decision that is not taken in time might sometimes close the door forever.   - Most of our weaknesses are like the gradually boiling water. We may not feel the loss initially, and by the time we realise our mistake... we find ourselves neck deep in the trouble.   - We live in a complex society. And we have to decide when to adjust, when to adopt and when to quit? Such decisions guide the course of our lives.   - Some people around us are like boiling water. They keep exploiting us unless our strength gets drained off without our awareness. We have to be vigilant about such people.     - Nirjara.

Why should we save WATER

  Water is the only substance on earth found in all three states i.e., solid, liquid and gas. And it is often described as the nector of life. But people often ignore the importance of water unless they feel the heat of its scarcity. Here are some of the facts about the role of water in our daily lives and the ways to save it   - 60% of our body constitutes water. Water helps to regulate out body temperature; lubricate the joints; moisture the tissues; carry nutrients through blood and digest the food. In short... we can’t imagine humans without water.   - Though we gain some water through meals and fruits, at least 2 litres of additional water is said to be needed to stay healthy. This means that we should be drinking atleast 8 glasses of water... especially in the summer.   - Water constitutes over 70 percent of the earth; much of it can't serve the purpose of humans. 90% of water is either in the form of salt water which we can't drink or in the form of glaciers which we can't utilise.   - With the rapid increase in the population and industries, the resources of drinking water are getting scant. We are failing in tapping the rain water, reusing the drain and avoiding the wastage. In short, we haven’t yet mastered of water management. By now it might be clear that if we waste the limited water resources, our own future would be in chaos. The following precautions would certainly save gallons of water every year...   - Take bath with a mug instead of a shower. This alone could save at least 10 litres of water per day! And if you are addicted to shower baths, use such showers which consume less water.   - Don't leave the water running from the faucet while you are brushing or washing your hands.   - If you find a leak, how tiny it might be... get it fixed. A drip of leak every second is in fact a few litres per day!   - If you love to water your garden, do it with a device that consumes least amount of water. Further, devices such as sprinklers could save a lot of water without harming the purpose.   - Never spill the water left in your glass or buckets. Let it be used for some other purpose.   - People often use water to clean the sheds and the corridors. This could involve a lot of water which can be substituted by just a... broom!   - We might get a lot of waste water from the water purifiers. Such water can be used for watering the plants or flushing the toilets.   These are just a few ways to save water. But the list can be extended forever. In every manner you utilise the water, there is a way to save a part of it.   - Nirjara.

ఏ బహుమతి ఇవ్వాలి?

  తమ ఆప్యాయతనీ, అభినందలనీ తెలియచేసేందుకు చాలామంది బహుమతులనే మార్గంగా ఎంచుకొంటారు. కానీ ఎలాంటి బహుమతిని అందచేయాలన్నది ఎప్పుడూ ఒక సమస్యగానే తోస్తుంటుంది. ఫలితం! డబ్బులు ఖర్చుపెట్టి, సమయాన్ని వెచ్చింది ఏదో ఒక బహుమతిని కొనేస్తుంటారు. దాంతో ఇటు బహుమతిని ఇచ్చేవారికీ, పుచ్చుకునేవారికీ కూడా అసంతృప్తే మిగులుతుంది. అందుకే పెద్దలు చెప్పే కొన్ని సూత్రాలను పాటిస్తే బహుమతి ఇవ్వడం కూడా మంచి అనుభవంగా మిగిలిపోతుంది...   అభిరుచిని అనుసరించి కొందరికి పుస్తకాలంటే ఇష్టం, కొందరికి పెర్‌ఫ్యూమ్‌ బాటిల్స్ అంటే ప్రాణం. బొమ్మలను సేకరించేవారు కొందరైతే పాటలంటే చెవి కోసుకునేవారు మరికొందరు. ఇలాంటివారికి వారి అభిరుచిని తగిన బహుమతిని ఇస్తే చాలా సంతోషిస్తారు. ఒకవేళ అలా కుదరకపోయినా, అభిరుచికి పూర్తి విరుద్ధమైన బహుమతులను ఇవ్వడం కంటే ఒక గులాబీ పువ్వుని చేతిలో పెట్టడం మేలు.   సందర్భాన్ని బట్టి మనం ఏ సందర్భానికి బహుమతిని అందించాలనుకుంటున్నాం అనేది మన నిర్ణయాన్ని ప్రభావితం చేయవలసిన అంశం. కొత్త సంవత్సరం వేడుకల దగ్గర్నుంచీ పెళ్లిరోజుల వరకూ సందర్భాన్ని బట్టి బహుమతిని ఇస్తే బాగుంటుంది. అలా కాకుండా న్యూ ఇయర్‌ రోజున పాల పీకనీ, పెళ్లిరోజున యాపిల్‌ పళ్లనీ ఇస్తే అవతలివారిని వేళాకోళం చేసినట్లే అవుతుంది. ఒకోసారి పుష్టగుచ్ఛం ఇస్తే సరిపోవచ్చు, ఒకోసారి బంగారు గొలుసు ఇస్తే బాగుండు అనిపించవచ్చు. ఎప్పుడు ఎలాంటి బహుమతి ఇవ్వాలి అన్నది ఆయా సందర్భాల మీద ఆధారపడి ఉంటుంది.   బడ్జట్‌ని దృష్టిలో ఉంచుకొని అవతలివారి దగ్గర ప్రశంసలు పొందడం కోసం భారీబడ్జట్‌ బహుమతులు అందించి చాలామంది చేతులు కాల్చుకుంటూ ఉంటారు. ఖరీదైన బహుమతికంటే మంచి బహుమతి ఇవ్వడం మేలన్న విషయం వారికి బోధపడదు. పైగా ఉన్నతాధికారులు, ధనవంతుల మెప్పు కోసం ఇచ్చే భారీబహుమతులు వారి కంటికి ఎలాగూ ఆనవు. కాబట్టి బహుమతిని కొనేటప్పుడు మన స్తోమతను దృష్టిలో ఉంచుకోవాలి. అది మన సృజనను ప్రతిబించేలా, అవతలి వారికి ఉపయోగపడేలా ఉండాలి. అంతేకానీ ఆర్భాటానికి చిహ్నంగా మిగిలిపోకూడదు.   మొక్కుబడులు వద్దు ఏదో ఒక బహుమతి ఇవ్వాలి కదా అని చాలామంది ఇంట్లో చేతికందిన వస్తువుని చుట్టచుట్టి ఇచ్చేస్తూ ఉంటారు. మరికొందరు తమ దగ్గర పోగైన బహుమతులనే చేతులు మారుస్తూ ఉంటారు. బహుమతి అనేది తప్పనిసరి తతంగంగానో, వస్తువులను వదిలించుకునే తంతుగానో సాగితే ఎవరికీ ఉపయోగం ఉండదు. దానివల్ల అవతలివారి మనసులో మన పట్ల వ్యతిరేక అభిప్రాయం ఏర్పడే ప్రమాదమూ లేకపోదు.   ఏదీ తోచకపోతే! కొన్ని సందర్భాలలో ఏ బహుమతి తీసుకోవాలో ఎంతకీ స్ఫురించకపోవచ్చు. అవతలివారితో అంతగా పరిచయం లేకపోవడమో, వారి అభిరుచులు తెలియకపోవడమో దీనికి కారణం కావచ్చు. అలాంటప్పుడు వారి వయసుకి తగిన వస్తువుని బహుకరించేయవచ్చు. అదీ కాదంటే అందరికీ ఉపయోగపడేలాంటి వస్తువునీ కొనిపెట్టవచ్చు. ఇక ఏదీ తోచని పక్షంలో మన బడ్జెట్‌కు తగిన డబ్బుని ఓ కవర్లో పెట్టి ఇవ్వడమే ఉత్తమమైన మార్గంగా మిగిలిపోతుంది.   - నిర్జర. 

For a Faster Computer

How often we click the refresh command to let our computers work faster. But do you know that, refreshing the computer has nothing to do with refreshing its memory? The refresh command would only rearrange the desktop to include the latest changes. It’s funny to watch even the learned computer techies constantly pressing the F5 button to refresh the system. Here are a few practical solutions that might fasten your system…. And using the `Refresh` command is not included among them!   RAM: RAM as you are aware is the temporary memory of a system. In cases like browsing the net, the capacity of RAM certainly affects the speed of our work. Most of the motherboards contain the slot for an additional RAM. Including an additional RAM might certainly boost the working of a system. And it won’t cost much! A RAM of 512 MB might have been a better option a decade ago… but with the changing needs and the updated versions of the browsers, a RAM above 2 GB is desirable.   Antivirus: The Antivirus though is an effective way to combat the malware that attacks our computers… might slow our computers. Apart from taking a lot of memory to store the definitions of viruses, they need regular updates to be effective. Programs related to antivirus might often start up along with the computer and keep running. So if you find your antivirus as a culprit in slowing down your system, try to change its settings. Even if that doesn’t work, better install a different antivirus.   Defragmentation:     The data stored on our hard disk might be scattered throughout the disk. Disk defragmentation would reassemble it in order. Such a procedure would speed up the performance to a certain extent, particularly in cases where there are numerous folders in our computer. But running Disk defragmentation quite often might shorten the life of our hard disk. In some cases it might even damage some files permanently.  So opt for the defragmentation once a while when you are sure that there aren’t any important files on your hard disk.   Disc cleanup:     Disc clean up is a better option than Defragmentation. It would delete the unnecessary files such as internet cache, temporary files etc. You can find the option among the system tools folder in the windows o/s. However a few softwares like CC cleaner are available on net for free download, which are much effective. But beware of choosing the options while running a cleaner. It’s always a safe choice not to go for a change in the registry of the computer.   Unused files and programs: We often dump our hard disk with numerous files and never care to review them. Too much of data on desktop and internal disks can certainly be time consuming for the processor. Likewise programs that are useless should better be uninstalled. We even ignore that too much data dumped in the `Recycle bin` would also affect our storage. So, better empty our recycle bin often. Deleting the temporary files would also save some space for us. Press the windows button and ‘R’ button to start the command prompt. Type `%temp%` in the command space and click OK to see a bunch of temporary files resting in idle. You can safely and certainly delete them.   These are few measures that might certainly boost up the speed of our computer. However when you are about to perform a task that needs much speed, it’s better to restart your computer. That would certainly refresh your RAM (not the F5 button!).  If your system seems to be dumped with too much of data and updates, formatting it after having a backup of the data would rejuvenate your processor and hard disk.   --Nirjara

గాంధీ మెచ్చిన సుబ్బులక్ష్మి స్వరం

  ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి జీవితాన్ని పరిచయం చేయాలనే ప్రయత్నం, సాగరాన్ని గుప్పిట్లో బంధించడంలాంటిది. కర్ణాటక సంగీతానికి పర్యాయపదంగా, భక్తి సంగీతానికి నిర్వచనంగా నిలిచిన ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి శతజయంతి సందర్భంగా ఆమె ప్రతిభను చాటే ఒక ఉదంతాన్ని తెలుసుకోవడం మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది.   ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి తన పదకొండవ ఏట నుంచే సంగీత ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆమె చేసే ఒకో సంగీత కచేరీతో ఆమె గాత్ర మాధుర్యం లోకమంతా విస్తరించడం మొదలైంది. ఇక 1947లో హిందీలో వచ్చిన మీరాబాయి చిత్రంలో ఆమె పాడిన భజనలతో ఎమ్మెస్‌ దేశవ్యాప్తంగా సంగీతసంచలనంగా మారిపోయారు. ఆ చిత్రంలో ఎమ్మెస్‌ పాడిన పాటలకు ముగ్ధులైపోయిన జవహర్‌లాల్‌ నెహ్రూ ‘నేను కేవలం ఒక ప్రధానమంత్రిని మాత్రమే! సంగీతానికి రాణి అయిన ఆమె ముందు నేనెంత?’ అనేశారు.   ఇంచుమించు అదే సమయంలో సుబ్బులక్ష్మి భర్త సదాశివంగారికి గాంధీగారి నుంచి ఒక ఫోన్‌ వచ్చింది. బహుశా గాంధీగారు మీరాబాయి చిత్రంలోని పాటలను విన్నారో ఏమో... తనకు ఇష్టమైన ఒక మీరాబాయి భజనను ఎమ్మెస్‌ గాత్రంలో వినాలని ఉందని ఆయన కోరారు. అయితే ఎమ్మెస్‌ ఆ కోరికను సున్నితంగా తిరస్కరించారు. గాంధీగారు కోరుకుంటున్న ఆ భజన తనకు అంతగా పరిచయం లేదనీ, దానికి తాను న్యాయం చేయలేననీ ఎమ్మెస్ భయం. అయితే ఆ సాయంత్రం నేరుగా గాంధీగారి నుంచే మరో ఫోను వచ్చింది. ఎమ్మెస్ ఆ భజనను పాడాల్సిన అవసరం లేదనీ, కనీసం ఆమె దానిని చదివినా తనకు తృప్తిగా ఉంటుందనీ ఆయన అన్నారు. గాంధీగారు అంతగా కోరుకోవడంతో, రాత్రికిరాత్రే ఎమ్మెస్‌ ఆ భజనను రికార్డు చేసి దిల్లీకి పంపారు.   ఈ ఘటన జరిగిన కొద్ది నెలల తరువాత ఎమ్మెస్ ఒక రోజు రేడియోలో వార్తలను వింటున్నారు. ఆ రోజు 1948 జనవరి 30. గాంధీని అత్యంత దారుణంగా కాల్చి చంపిన రోజు. రేడియోలో ఆ వార్తని వింటూనే ఎమ్మెస్ మ్రాన్పడిపోయారు. ఆ వార్తని వినిపించిన వెంటనే రేడియోలో తాను గాంధిగారి కోసమని పాడిన మీరా భజన ప్రసారం అయ్యింది. ఆ భజన వినడంతోనే ఎమ్మెస్ స్పృహ కోల్పోయారు. ఆ తరువాత కాలంలో ఎమ్మెస్‌ తరచూ ఈ సంఘటనలన్నింటినీ కన్నీటితో గుర్తుచేసుకునేవారట.   గాంధీ అంతటివారు అంతగా కోరి పాడించుకున్న ఆ భజన ‘హరి తుమ్‌ హరో’ (hari tum haro). యూట్యూబ్‌లో ఆ భజనని ఎవరైనా వినవచ్చు. దేశాన్ని నడిపించే నేతలైనా, ప్రపంచాన్ని నడిపించే నాయకులైనా... కళలకు కరిగిపోక తప్పదని ఈ ఉదంతం నిరూపిస్తుంది. ఎవరితోనైనా చివరివరకూ తోడుగా నిలిచేది ఆ కళే అని చాటి చెబుతోంది.   - నిర్జర.

రక్తాన్ని బట్టి మనస్తత్వం చెప్పేస్తారు

  తెలుగు హీరోలు తరచూ తమ రక్తానికి ఉన్న మహిమ గురించి పుంఖానుపుంఖాలుగా డైలాగులు చెబుతూ ఉంటారు. అసలు రక్తాన్ని బట్టి పౌరుషం ఉంటుందా? ఒక మనిషి రక్తాన్ని బట్టి అతని గుణగణాలను అంచనా వేయవచ్చా అని ప్రేక్షకులు తల బాదుకోవచ్చుగాక! కానీ జపాన్‌, కొరియా, తైవాన్ వంటి కొన్న దేశాలలలో ఇలాంటి నమ్మకాలు చాలా విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి.   90 ఏళ్ల నమ్మకం మనిషి రక్తాన్ని A,B,O అనే మూడు రకాలుగా విభజించి వందేళ్లకు పైనే గడుస్తోంది. ఈ విభాగాలను చూసిన ‘టకేజీ ఫురుకవ’ అనే జపాను ప్రొఫెసరుగారికి ఓ వింత ఆలోచన వచ్చింది. వేర్వేరు మనుషులు వేర్వేరు బ్లడ్‌ గ్రూపులు ఉన్నట్లే, వేర్వేరు బ్లడ్‌ గ్రూపులు ఉన్నవారి గుణాలను కూడా అంచనా వేయవచ్చు కదా అన్నదే ఆ ఆలోచన. అనుకున్నదే తడవుగా టేకీజీగారు 1927లో ఓ పరిశోధనను వెలువరించారు.   పిచ్చిపిచ్చిగా నమ్మేశారు టకేజీగారి సిద్ధాంతాలని జపాను జనం మారు ప్రశ్నించకుండా నమ్మేశారు. అప్పటి జపాన్‌ ప్రభుత్వం ఈ బ్లడ్‌గ్రూపులను అనుసరించి సైనికులను నియమించడం వరకూ ఈ నమ్మకం ఎదిగిపోయింది. తరువాత కాలంలో ఈ నమ్మకం కొంత పలచబడింది. కానీ 1970వ దశకంలో ‘మసాహికో నోమి’ అనే ఓ జర్నలిస్టు ఈ సిద్ధాంతాన్ని బలపరుస్తూ ఏకంగా ఏడు పుస్తకాలు రాయడంతో మళ్లీ రక్త చరిత్ర మొదలైంది.   ఇవీ గుణాలు జపానువారి బ్లడ్‌గ్రూప్‌ సైకాలజీ ప్రకారం వివిధ బ్లడ్‌గ్రూపుల స్వభావం ఇలా చెప్పుకోవచ్చు... A – ఇది ఒక రైతుకి సరిపడే స్వభావాన్ని పోలి ఉంటుంది. ఈ బ్లడ్‌గ్రూపు ఉన్నవారు శాంతము, సహనము, బాధ్యత, నిజాయితీ, పట్టుదల కలిగి ఉంటారు. B – ఇది ఒక వేటగాడిని గుర్తుకుతెస్తుంది. ఈ తరహా బ్లడ్‌గ్రూప్‌ ఉన్నవారు బలంగా, సృజనాత్మకంగా, నిర్దాక్షిణ్యంగా, సమాజపు కట్టుబాట్లను ధిక్కరించేలా, ఆశావహంగా ఉంటారు. AB- ఇది ఒక మానవతావాదిని ప్రతిబింబిస్తుంది. AB బ్లడ్‌గ్రూపు ఉన్నవారు సమన్వయంగా, తార్కికంగా, నలుగురిలో కలిసిపోయేలా ప్రవర్తిస్తారు. కానీ వీరు ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉండే అవకాశం లేకపోలేదు. O -  ఈ బ్లడ్‌గ్రూప్ లక్షణాలు ఒక యోధుని గుర్తుకుతెస్తాయి. ఆత్వవిశ్వాసం, స్వతంత్ర భావాలు కలిగి ఉండటం, ఉద్రేకం, ఏదన్నా సాధించాలనే తపన, స్వార్ధం, అనుమానం వీరి లక్షణాలు.   ఆధారాలు లేకపోయినా బ్లడ్‌గ్రూప్‌ ఆధారంగా ఒక వ్యక్తి మనస్తత్వాన్ని నిర్వచించేందుకు వందలాది పరిశోధనలు జరిగాయి. కానీ ఇప్పటివరకూ ఎవ్వరూ ఖచ్చితమైన ఆధారాలను చూపలేకపోయారు. కానీ మన దేశంలో రాశిఫలాలను ఎలా నమ్ముతారో జపాన్‌లో బ్లడ్‌గ్రూప్‌ ఆధారిత నమ్మకాలకు అంత ఆదరణ ఉంది. జపాన్‌లో ఎదుటివారి మనస్తత్వాన్ని అంచనా వేసేందుకు ‘మీ బ్లడ్‌గ్రూప్‌ ఏమిటి?’ అని అడగటం సర్వసాధారణం. పెళ్లిళ్లు చేసుకునేటప్పుడు, ఉద్యోగులను నియమించేటప్పుడు కూడా వారు బ్లడ్‌గ్రూప్ మీదే ఆధారపడతారు. బ్లడ్‌గ్రూప్‌ ఆధారంగా కొందరిని లోకువగా చూడటం, ఏడిపించడం వంటి సంఘటనలు కూడా వెలుగులోకి వస్తుంటాయి.    ఇదీ జపానువారి రక్తచరిత్ర! నిజంగా ఒకో బ్లడ్‌గ్రూపునకూ ఒకో స్వభావం ఉంటుందో లేదో తెలియదు కానీ... మీది ఫలానా బ్లడ్‌గ్రూప్‌ కాబట్టి ఫలానా లక్షణాలు ఉంటాయని ఎవరన్నా చెబితే, అది మన మనస్తత్వం మీద ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. అంటే.. బ్లడ్‌గ్రూప్‌ సైకాలజీ నిజమైనా కాకపోయినా, దాన్ని నమ్మినవారు మాత్రం అలాగే ప్రవర్తిస్తారన్నమాట. ఇదో సైకాలజీ మరి!   - నిర్జర.

Cock And Eagle Stories

  It was a Sunday morning and I'm waiting anxiously in my room for my friend.  I have so many things to share with him; complaints, gossips, secrets, arguments… wow! Lots of things happen within a week and I'm excited to narrate all those to my friend.  I need sympathy for my complaints and support for my arguments. As my friend arrived at my room, I didn’t even bother to offer him some water.  I've started complaining as soon as he sat down wearily after a long journey, “you know how mean my sister is, last week…”    “Let me tell you a story my friend” my listener interrupted me, I'm surprised at his intrusion as he doesn’t speak much in between, sometimes I even doubt whether he was listening to me! But my friend continued with his dialogue despite my reaction “Thousands of years ago, there was an eagle which has a problem in its attitude, it was happy to fill its stomach with the worms that crawled around its nest, it never ventured to fly high in search of better food unlike the other eagles.    “As the days passed by it grew weaker with insufficient food but still didn’t endeavour to fly out of its nest, rather it began to descend on the ground in search of worms.  One day it realised its mistake and tried to fly for a better life, but couldn’t! Its wings have lost their ability to let it fly high, it flapped its wings hard and cried aloud for help till its face turned red – but couldn’t reverse its fate “It could never rest in peace with the burden of guilt and woke up early in the morning trying to fly again by flapping its wings and crying aloud in desperation – it’s no more an eagle.  People has given a new name for the creature, they called it a COCK as it woke them up early in the morning like a CLOCK.  The shrill it makes is a wake up call for those who lie peacefully in the darkness of ignorance.”   My friend stood up as he completed the story and said his last words before he left me “It’s unto you to decide whether you want to be a cock or an eagle, to feed on those trifle things all through your life and become a cock or to use all the powers the nature has bestowed upon you to aim higher and achieve the highest.”   - K.L.Surya.

Tips for Time Management

  Everyone in this world is provided with 24 hours of time within a day. But the difference lies in its usage. Some use it and become success and some just lose it and remain a failure. And that is the reason why Time Management has become crucial in the field of personality development. These are some of the most popular tips suggested by many of the experts in Time Management.   Let there be a plan Most of us jot down a daily schedule, but won’t care to allot time for each one of the task. Assigning the time limit to our tasks would create a sense of discipline and urgency to complete the work. It would also give us an opportunity to review the time spent and make necessary changes.   Learn to say no Much of our time can often be wasted in obligations. Keep in your mind of the precious time needed to meet such commitments... and learn to say no for futile obligations. But be sure that your denial is not going to affect your relation.   While waiting We spend much of our time in waiting. We wait to reach our destination, we wait to meet some official and we even wait for a bus. Try to utilise those precious moments. Grab the text book to complete a chapter or pickup your laptop to review a project.   Electronic Gadgets These are the days of digital revolution and we can find every person with a smart phone in his hand. But have we ever considered the time wasted with those gadgets? A study conducted by the British psychologists has revealed that the youngsters were spending an average of five hours a day with their smart phones. Having some control on such habits can save some valuable hours in our lives.   Remainders There are lot of devices that keep a track on our time management. Applications and appliances such as digital organisers, online calendars... can all be used to remind us of our tasks. Time tested utilities like dairies and post it notes would also be helpful.   Review It would always be good to review our schedules and time allotments once in a while. It would give us an insight of our achievements as well as lapses. It would help us to pinpoint those moments that are getting wasted.   And finally... time management doesn’t mean that we should work like a machine. Enough sleep, rest, exercise and entertainment should always be a part of our daily lives.   - Nirjara.

ఎప్పుడెలా ఉండాలి!

  అతనో రాజకుమారుడు. ఓ మహాసామ్రాజ్యానికి వారసుడు. అలాంటి రాజకుమారుడి పుట్టినరోజు వచ్చింది. వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్యంలోని పెద్దలంతా రాజకుమారుని స్థాయికి తగినట్లుగా తలా ఓ విలువైన కానుకా అందించారు. చివరగా రాజకుమారుడికి విద్యాబుద్ధులు నేర్పుతున్న గురువుగారి వంతు వచ్చింది. ఆయన నిదానంగా ఒక చిన్న పెట్టెను తన సంచిలోంచి బయటకు తీసి రాజకుమారుడి చేతిలో పెట్టాడు. ఆ పెట్టెలో ఏముంటుందా అని ఆశ్చర్యంగా ఎదురుచూసిన రాజకుమారుడికి మూడు మట్టి బొమ్మలు కనిపించాయి. గురువుగారు తమ కుటుంబాన్ని అవహేళన చేసేందుకే ఆ మట్టి బొమ్మలు ఇచ్చారనుకుని రాజుగారి మొహం ఎర్రబడిపోయింది. ‘ఈ బహుమతి ఇవ్వడం వెనుక మీ ఉద్దేశం తెలుసుకోవచ్చా!’ అని అడిగారు రాజుగారు.   ‘రాజా! ఈ మూడు బొమ్మలూ సామాన్యమైవి కావు. ఇవి మూడు స్వభావాలను ప్రతిబింబిస్తాయి. కావాలంటే చూడండి...’ అంటూ ఒక దారాన్ని తీసుకుని మొదటి బొమ్మ చెవిలోంచి పోనిచ్చాడు. అది నేరుగా రెండో చెవిలోంచి బయటకు వచ్చింది. ‘కొంతమంది అవతలివారు ఏం చెబుతున్నారో వినకుండా ఈ చెవి నుంచి విని, ఆ చెవిలో వదిలేస్తారు. అలాంటి స్వభావానికి ప్రతీక ఈ బొమ్మ!’ అన్నారు గురువుగారు.   ఇక రెండో బొమ్మ చెవిలోంచి కూడా ఒక దారాన్ని పోనిచ్చారు గురువుగారు. అది నోట్లోంచి బయటకు వచ్చింది. ‘కొంతమంది తాము విన్న విషయాన్ని మనసులో దాచుకోలేరు. దాన్ని పదిమందికీ చేరవేస్తే కానీ వారికి తృప్తిగా ఉండదు,’ అంటూ నవ్వారు గురువుగారు.   గురువుగారి చేష్టలను చూసిన రాజకుమారుడిలో ఆసక్తి పెరిగిపోయింది. ఆఖరుగా ఉన్న చివరి బొమ్మ ఎలాంటి స్వభావాన్ని సూచిస్తుందా అని అంతా ఉత్కంఠంగా ఎదురుచూడటం మొదలుపెట్టారు. కానీ ఆశ్చర్యం! మూడో బొమ్మ చెవిలోంచి వెళ్లిన దారం బయటకు రానేలేదు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు తెలిసిన విషయాన్ని బయటకు చెప్పని స్వభావానికి ప్రతీక ఈ బొమ్మ!’ అంటూ విడమరిచారు గురువుగారు.   ‘బాగుంది! ఇంతకీ ఈ బొమ్మలలో వేటి స్వభావాన్ని అనుసరించడం మంచింది!’ అని వినయంగా అడిగాడు రాజకుమారుడు. ‘మూడింటినీ అనుసరించాల్సిందే!’ అన్నారు గురువుగారు చిరునవ్వుతో. ‘పనికిరాని విషయాలను వినీవిననట్లు ఉండాలి. ఈ చెవి నుంచి విని ఆ చెవితో వదిలేయాలి. మంచి విషయాలు, నలుగురికీ మేలు చేసే విషయాలను పదిమందితోనూ పంచుకోవాలి. ఇక పాలనకు సంబంధించిన విషయాలు, ఇతరుల వ్యక్తిగత రహస్యాలు ఎప్పటికీ మన మనసులోనే ఉంచుకోవాలి. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అన్న విచక్షణను అలవర్చుకోవడమే పాలకుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం,’ అంటూ వివరించారు గురువుగారు. గురువుగారు ఇచ్చిన ఆ బహుమతి ముందు మిగతా విలువైన బహుమతులన్నీ వెలవెలబోయాయి. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   ...Nirjara

For a perfect Resume

  Everybody loves to have a good job and Resume often acts like a passport for securing such position. People often treat the creation of Resume as a mere formality, but experts claim that Resume writing is a skill. Because, people who hire us come to know about us only through our Resume! Here are a few tried and tested tips in preparing a nice and perfect resume....   Highlight The busy HR managers won’t have much time to go through every Resume thoroughly. So try to highlight the important facts that you wish to attract them. Use wide margins and readable font size. Apply bold letters, Italics or underlines to create emphasis over certain factors.   Change your Resume People often continue to use the same Resume for different jobs on different occasions. It would always be better to change our Resume as per the job we are applying for. Further various job positions and various fields require varied capabilities. A little bit of Googling would give us some idea about the company we are applying for... and it’s better to alter our resume as per the working and requirement of that firm.   Achievement and Talents Mere description of qualifications and past experience might not help these days. People love to know your achievements and capabilities. So it’s better to list out or summarize your past achievements and success. It would also be interesting for an employer to know the extra talents you possess such as typing, expertise in hardware, proficiency in a foreign language etc. that can be of practical use at some point of your service.   Proofread We always tend to make some mistakes in typing and sentence formation. We as the first person who has compiled the resume might not be aware of such errors, but they would glare at those who read them. So it would always be better to read the resume once and again. It would be more helpful if you take the help of an elder in finding any faults in your Resume. Make sure that your Resume is free from childish errors.   Be Honest The best policy of being honest works for our Resumes as well. HR’s are often capable of finding the faults and fallacies hidden within the Resume. Further we have to face tough time at the interview to justify the claims laid in our Resume. So, let our Resume represent our true character and right statistics.   Finally, let’s beware that it’s not the length of the Resume that attracts the employer, but the information delivered through it... and that should be the key in forming a Resume.   - Nirjara.

ఎలా చూస్తే అలాగే!

  అనగనగా ఓ కొండదిగువు గ్రామం. ఆ గ్రామంలోని జనమంతా కలిసిమెలసి ఉండేవారు. ఆ గ్రామం చివర కట్టెలమ్మెకునే ఒక పేదరాలు ఉంది. చాలా ఏళ్ల క్రితమే ఆమె భర్త చనిపోయాడు. ఆయన జ్ఞాపకంగా మిగిలిన ఒక్కగానొక్క కొడుకుని కడుపున పెట్టుకొని పెంచుకుంటోంది! కానీ అదేం చిత్రమో ఆ కుర్రవాడికి ఎవరన్నా సరిపడేది కాదు. తల్లి ఉదయమంతా కట్టెలు కొట్టుకుని మధ్యాహ్నానికి అలసిపోయి వచ్చేసరికి, అతని దగ్గర బోల్డన్ని ఫిర్యాదులు సిద్ధంగా ఉండేవి. ‘ఆ ఇంట్లోవారు మంచివారు కాదు, ఈ పక్కింటి పిల్లవాడు పెంకివాడు, ఆ వీధి చివరామె చాలా మొండిది...’ ఇలా రకరకాల ఆరోపణలు చేస్తూ ఉండేవాడు.   పిల్లవాడిని తనతో పాటుగా ఊరిలోకి తీసుకువెళ్తే, అక్కడ అతని ఫిర్యాదులు తగ్గుతాయేమో అనుకుంది తల్లి. అందుకని కట్టెలు అమ్ముకునేందుకు వెళ్తూ పిల్లవాడిని కూడా తోడు తీసుకువెళ్లడం మొదలుపెట్టింది. కానీ పిల్లవాడి తీరు మారనే లేదు. అటు పక్క దుకాణం వాళ్లు, ఇటు పక్కనుంచి దుకాణం వాళ్లు... ఆఖరికి దారిన పోయేవాళ్లు కూడా అతనికి చెడ్డవారుగానే కనిపించసాగారు.   పిల్లవాడి ఫిర్యాదులతో తెగ విసిగిపోయింది తల్లి. ‘వీడికి అసలు మనుషుల పొడే గిడుతున్నట్లు లేదు’ అనుకుంది. అనుకుని వాడిని తనతో పాటు కట్టెలు కొట్టేందుకు అడవికి తీసుకువెళ్లడం మొదలుపెట్టింది. కానీ అదేం చిత్రమో! ఆ పిల్లవాడు చెట్టూపుట్టల్ని కూడా వదిలేవాడు కాదు. ‘ఆ చెట్టు ఎందుకూ పనికిరానిది, ఈ చెట్టుకి ముళ్లున్నాయి...’ అంటూ తిట్టేవాడు. చివరికి తల్లి వాడి ప్రవర్తనతో విసిగిపోయింది. వాడిలో ఎలాగైనా మార్పు తీసుకురావాలంటూ ఓ ఉపాయాన్ని ఆలోచించింది.   మర్నాడు వాడిని పక్కనే ఉన్న కొండమీదకు తీసుకుపోయింది. ఎప్పుడూ లేనిది తల్లి, తనను అంతెత్తు ఉన్న కొండ మీదకి తీసుకువెళ్లడం చూసి పిల్లవాడికి ఆశ్చర్యం వేసింది. అక్కడ ఒక చోట పిల్లవాడిని ఆపి తల్లి- ‘‘నువ్వు గమనించావో లేదో కానీ ఈ కొండకి ఓ ప్రత్యేకత ఉంది. నువ్వు ఒక మాట అంటే దాన్ని అది తిరిగి అంటుంది. ఆ కొండని తిట్టి చూడు, అది కూడా నిన్ను తిరిగి తిడుతుంది,’’ అని చెప్పింది.   పిల్లవాడికి తిట్టడం అంటే మహా సరదా కదా! అందుకని తల్లి అడిగిందే తడువు, తన నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టడం మొదలుపెట్టాడు. నిజంగానే అవన్నీ ఆ కొండకోనల్లో ప్రతిధ్వనించి, పిల్లవాడికి తిరిగి వినిపించాయి. మొదట్లో పిల్లవాడికి ఏదో సరదాగా ఉందికానీ, తన తిట్లు తనకే వినిపించడం మొదలుపెట్టేసరికి... కాసేపటికి అతని మొహం సిగ్గుతో కందగడ్డలా తయారైంది.   ‘‘ఇప్పుడు ఆ కొండకి కాస్త మంచి మాటలు చెప్పిచూడు. అవే మాటలు నీకు వినిపిస్తాయి!’’ అంది తల్లి. పిల్లవాడు నిదానంగా మాటలను కూడబలుక్కుంటూ ‘‘నువ్వు చాలా మంచివాడివి!’’ అని అరిచాడు. తిరిగి అతనికి అవే మాటలు వినిపించాయి. మరోసారి ‘‘నేను నీ స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాను!’’ అని అరిచాడు. అవే మాటలు అతనికి యథాతథంగా వినిపించాయి.   తల్లి, పిల్లవాడి తల మీద చేయి వేసి- ‘‘ప్రపంచం కూడా ఇంతేరా! అందులో మంచీచెడూ రెండూ ఉంటాయి. నువ్వు దేన్ని చూడాలనుకుంటే దాన్ని చూడగలుగుతావు. మనుషులలో ఉన్న చెడు ఎలాగూ బయటపడక తప్పదు. ఇక వెతికి మరీ నువ్వు వారిలో లోపాలను కనిపెట్టడం ఎందుకు. అందుకు బదులుగా వారిలో మంచి లక్షణాలను గమనించవచ్చు కదా! ముందుగానే వారితో శతృత్వాన్ని పెంచుకునే బదులు, మిత్రుడిగా వారి మనసుని గెలుచుకునే ప్రయత్నం చేయవచ్చు కదా!’’ అని చెప్పింది తల్లి. తల్లి మాటలతో పిల్లవాడికి ఏదో కొత్త విషయం బోధపడినట్లు అయ్యింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   ..Nirjara

What kids can teach us!

  We as adults may be sure that we know a lot about life. But are always vexed to find ourselves in chaos, anger and frustration! We might go through some self development book or visit a psychiatrist for the resolution. As we wander here and there for some peace and stability of mind, we often overlook the solution that’s right in front of our eyes. Watching kids can teach us a lot of valuable lessons that are needed for life. Here are some of them...   Ever Active Right from the moment of their wakeup, kids seem to be bundled with lots of energy. The energy levels in them seem to be amazing. And that was not just that! They are eager to live their life fully and don’t wish to waste a second of time. They sleep like a log and pace like a dog. It’s rare to see them with small steps and sagged shoulders...which are the brand marks of our elders.   Nature Loving Kids have a special bonding with nature and it’s hard to understand the reason behind it. You often find them wandering among the trees or playing with sand. It’s hard to keep them away from the water. Probably they are so pure at heart that they could find the elements of nature as a part of their own existence. They teach us that nature is the best medicine to cure the pain in our heart.   Creative Kids are creative. They wish to find a solution to every problem they face in their own way. Sometimes the `out of the box thinking’ of the kids would even amaze the adults. Kids are curious to know everything in this world and creative to find every solution for this world. Being creative and curious can always lead us to a better life. A life filled with contention!   Fearless How often we see a child boldly singing on a stage. How often we see a child posing a difficult question without of the fear of being rebuked. That child has not yet moulded himself according to the social inhibitions. He hasn’t yet reserved his feelings and talents for the fear of being mocked. What he knows is to just express himself!   Have fun It’s hard to imagine a child without a smile on his face. They giggle, they smile and they explode with laughter! They don’t step back from having some fun in their lives. A research points that while an adult laughs for less than 20 times a day, a kid laughs for more than 300 times! And what could be the better medicine other than laughter, to soothe any disease within our mind and body   These are just a few lessons to point out. Children won’t worry about tomorrow; they are ready to forgive and forget; they don’t wish to leave a crisis unsolved... and they do a lot of things that could certainly show us a better way to live our life. We have to just watch them out!   - Nirjara.

లుకింగ్‌ గ్లాస్ థియరీ

  మనిషి మనస్తత్వం మనిషికే అంతుచిక్కదు. అందుకోసం వందలాది అధ్యయనాలు, వేలాది పరిశోధనలతో ఏకంగా మనస్తత్వ శాస్త్రాన్నే రూపొందించుకున్నాడు. వాటిలోని ప్రతి పుటా ఆసక్తికరమైనదే! ప్రతి అధ్యయనమూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పేదే! అలాంటి ఒక సిద్ధాంతమే ‘లుకింగ్‌ గ్లాస్ సెల్ఫ్‌’   వందేళ్లనాటిది Looking glass self సిద్ధాంతం ఈనాటిది కాదు. ఛార్లస్‌ కూలే అనే అమెరికన్ సామాజిక శాస్త్రవేత్త 1902లోనే ప్రతిపాదించిన సిద్ధాంతం ఇది. ఆయన తన Human Nature and the Social Order అనే పుస్తకంలో భాగంగా దీన్ని ప్రతిపాదించాడు. అంతకుముందు విలియమ్ జేమ్స్ అనే శాస్త్రవేత్త రూపొందించిన సిద్ధాంతానికి కాస్త పొడిగింపుగా ఈ లుకింగ్‌ గ్లాస్ సిద్ధాంతం సాగుతుంది.   ఇదీ విషయం సమాజంలో ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారని మనం భావిస్తామో, దానికి అనుగుణంగానే మన ప్రవర్తనను, వ్యక్తిత్వాన్ని మలుచుకుంటామన్నది ఈ సిద్ధాంతంలోని ముఖ్య విషయం. తన సిద్ధాంతాన్ని ఛార్లెస్‌ కూలే మూడు భాగాలుగా అందించాడు... 1- మనం అవతలివారికి ఎలా కనిపించాలని అనుకుంటున్నామో, ఓ అంచనా వేసుకుంటాం. 2- మన అవతలివారికి అలా కనిపించిన తరువాత, వారు ఎలా ప్రతిస్పందిస్తున్నారు అన్న విషయాన్ని గ్రహించేందుకు ప్రయత్నిస్తాం. 3- అవతలివారికి మన మీద ఏర్పడిన అభిప్రాయాల ఆధారంగా మన వ్యక్తిత్వాన్ని మలుచుకుంటాం.   పొరపాట్లు జరగవచ్చు మన మీద ఇతరుల అభిప్రాయాలకు అనుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం అనేది మానవ సహజం. మనం సంఘజీవులం కాబట్టి, ఎదుటివారి ప్రతిస్పందనల ఆధారంగానే మనల్ని మనం అంచనా వేసుకుంటాం. ఇందుకోసం మన బాల్యంలో కుటుంబసభ్యుల ప్రతిస్పందన మొదలుకొని, సమాజంలోకి వచ్చిన తరువాత చుట్టుపక్కలవారిని గమనించడం వరకూ ఈ పద్ధతి సాగుతూనే ఉంటుంది. అయితే ఒకోసారి ఈ అంచనాలో మనం ఘోరం విఫలం అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఉదాహరణకు మనం తరగతి గదిలో ఒక లెక్కను తప్పు చెప్పాం అనుకోండి... మిగతా విద్యార్థులు ఆ విషయాన్ని పట్టించుకోకపోయినా, మనం వారి దృష్టిలో ఒక మొద్దుగా ముద్రపడిపోయామన్న భయం కలగవచ్చు. అలాగే ఇతరులు ఏదో ముఖస్తుతి కోసం మనల్ని పొగిడితే, ఆ పొగడ్తే నిజమనీ భ్రమించవచ్చు.   ఆత్మవిశ్వాసం! మన గురించి ఇతరుల ప్రతిస్పందనలని గమనించడం సహజమే అయినా, అది ఒకోసారి మనమీద మనకు ఉన్న నమ్మకాన్నే దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. నిరంతరం అవతలివారు ఏమనుకుంటున్నారో అన్న ఆలోచనతో బతికితే ఆత్మన్యూనతలో క్రుంగిపోయే ప్రమాదం ఉందని తేల్చి చెబుతున్నారు. ఈ సమాజంలో భాగంగా ఇతరుల మనోభావాలను గమనించుకుంటూ, వారి ఇబ్బంది కలుగకుండా ప్రవర్తించడం అవసరమే! కానీ మనలోని విచక్షణ ఏది మంచి, ఏది చెడు అని బేరీజు వేసుకునే స్థాయికి వచ్చిన తరువాత... ఇతరుల ప్రతిస్పందనల గురించి అతిగా ఊహించుకోవడం, అనవసరమైన ప్రతిస్పందనలకి మన వ్యక్తిత్వాన్ని బలిచేసుకోవడం మంచిది కాదన్న సూచనను ఈ లుకింగ్ గ్లాస్‌ సెల్ఫ థియరీ అందిస్తోంది.   - నిర్జర.

బహుమతి

కవిత అనే పాపకి ముత్యాల హారం వేసుకోవాలని తెగ కోరికగా ఉండేది. కానీ వాళ్లదేమో చాలా సాధారణ కుటుంబమయ్యే! తల్లీదండ్రీ ఇద్దరూ కూడా రోజూ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఒక రోజు కవిత తన తల్లితో కలసి సరుకులు కొనడానికని బజారుకి వెళ్లింది. అక్కడ ఓ దుకాణంలోని అద్దాలలోంచి ఒక ముత్యాల హారం మెరుస్తూ కవితకి కనిపించింది. దాని కింద 300/- అన్న వెల కూడా రాసి ఉంది. ‘అమ్మా! నువ్వెలాగూ మంచి ముత్యాల హారాన్ని కొనలేవు. కనీసం ఈ నకిలీ హారాన్నైనా కొనిపెట్టు ప్లీజ్‌!’ అంటూ అడిగింది కవిత.   కవిత వాళ్లమ్మ కాసేపు ఆలోచించింది. తన కూతురికి ముత్యాల హారం వేసుకోవాలని ఎంత ముచ్చటో ఆమెకు తెలుసు. అందుకని చివరికి- ‘సరే! ఈ నెలంతా కనుక నువ్వు బుద్ధిగా ఉంటే, నాకు ఇంటిపనుల్లో సాయపడితే... వచ్చే నెలలో ఉన్న నీ పుట్టినరోజుకి ఆ హారాన్ని కొనిపెడతాను,’ అంటూ మాట ఇచ్చింది అమ్మ. కవిత మామూలుగానే బుద్ధిగా ఉండే పిల్ల. ఇక తల్లి మాట విన్నాక మరింత ఒద్దికగా తన పనులను చేసుకోవడం మొదలుపెట్టింది. ఇంటి పనుల్లో తల్లికి వీలైనంత సాయమూ చేసింది. అలా నెల గడిచేసరికి కవిత పుట్టినరోజు రానేవచ్చింది. తల్లి ఆమెకు మాట ఇచ్చినట్లుగానే, ఆ ముత్యాల హారాన్ని కొనిచ్చింది. ఆ రోజు నుంచి కవిత ఆ ముత్యాలహారాన్ని వదిలిపెట్టలేదు. నిరంతరం ఆ హారం ఆమె మెడలో ఉండాల్సిందే! పడుకునేటప్పుడు కూడా ఆ హారం ఆమె మెడలో లేకపోతే నిద్రపట్టేది కాదు.   రోజులు గడిచేకొద్దీ, ఆ హారం వెలిసిపోవడం మొదలుపెట్టింది. కానీ కవితకు మాత్రం దాని మీద మోజు ఏమాత్రం తగ్గలేదు. కవిత వాళ్ల నాన్న ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఆయన ఒక రోజు కవిత దగ్గరకు వెళ్లి- ‘చిట్టి తల్లీ! నీ మెడలోని ఆ హారం బాగా వెలిసిపోయింది కదా! దాన్ని అవతల పడేయరాదూ. నిదానంగా ఇంకొకటి కొనుక్కోవచ్చు,’ అని అడిగాడు. ‘లేదు నాన్నా! నాకు ఈ హారాన్ని వదిలిపెట్టడం ఇష్టం లేదు. నా దగ్గర ఉన్న ఏ వస్తువునైనా వదులుకోవడానికి సిద్ధపడతాను కానీ ఈ హారాన్ని మాత్రం వదులుకోలేను. ఇది విరిగి ముక్కలయ్యే దాకా నా దగ్గర ఉండాల్సిందే!’ అని తెగేసి చెప్పింది పిల్ల.   ‘చిట్టి తల్లీ అలా వెలిసిపోయిన హారం నీ మెడలో ఉంటే చూడటానికి బాగోలేదు. పైగా నీ ఒంటికి కూడా అంత మంచిది కాదు. కావాలంటే ఆ హారాన్ని నా దగ్గర భద్రంగా ఉంచుకుంటాను. దాన్ని నాకు ఇచ్చేయవూ...’ అని అడిగాడు తండ్రి. తండ్రి ఆ హారాన్ని తనకు ఇవ్వమని అడగగానే కవిత ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే తన మెడలోని హారాన్ని తీసుకుని ఆయన చేతిలో పెట్టేసింది. కవిత ఆ పాత హారాన్ని ఇలా పెట్టిందో లేదో, ఆమె తండ్రి తన జేబులోంచి నిదానంగా ఒక కొత్త ముత్యాల హారాన్ని బయటకు తీశాడు. ‘ఇది నకిలీది కాదు. నిజమైన ముత్యాలతో చేసిన హారం! ఇది ఎప్పటికీ మాసిపోదు,’ అంటూ తన కూతురు మెడలో వేశాడు.    జీవితంలో కోరికలు సహజమే! కానీ ఆ కోరికలకు పట్టువిడుపులు ఉండాలి. అప్పుడే ఒకదాన్ని మించి ఒకటిగా ఉన్నతమైనవి పొందగలుగుతాము. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   ...Nirjara

క్షమాపణ చెప్పడం ఒక కళ

  ఇద్దరు మనుషుల మధ్య ఏర్పడే బంధం ఎల్లకాలం ఒకేలా ఉంటుందని అనుకోలేము. ఒక చిన్న మాటతోనో, అనుకోని చేతతోనో ఇద్దరి మధ్యా మనస్పర్థలు ఏర్పడవచ్చు. పట్టుదలకు పోయి ఆ స్పర్థను అలాగే వదిలేస్తే, విలువైన అనుబంధం కాస్తా చేజారిపోతుంది. తప్పు మనవైపు ఉంది అని మన విచక్షణ చెబుతున్నప్పుడు, మనం చెప్పే ఒక చిన్న క్షమాపణతో బంధాలు తిరిగి బలపడతాయి. అందుకే క్షమాపణ చెప్పడం కూడా ఒక కళ అంటున్నారు నిపుణులు. ఆ కళలోని కొన్ని మెలకువలు ఇవిగో...   వీలైనంత త్వరగా! తప్పు మనదే అని తేలిపోయినప్పుడు వీలైనంత త్వరగా క్షమాపణ చెప్పేయడం మంచిదంటున్నారు. ఎందుకంటే కాలం గడిచేకొద్దీ, ఇద్దరి మధ్యా దూరం మరింతగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. పట్టుదలలు మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. క్షమాపణకి ఎక్స్‌పైరీ డేట్ ఉండకపోవచ్చు. కానీ అప్పటికప్పుడు చెప్పే క్షమాపణలు మరిన్ని అపార్థాలకు దారితీయకుండా కాపాడతాయి.   మనస్ఫూర్తిగా చెప్పండి అవతలివాళ్లు ఏడ్చిపోతున్నారనో, తప్పు బయటపడిపోయిందనో.... మొక్కుబడిగా క్షమాపణ చెబుతారు కొందరు. ఇలాంటి క్షమాపణలు అవతలివారు తప్పక పసిగట్టేస్తారు. దానివల్ల తాత్కాలికంగా సమస్య దూరమైనట్లు కనిపించినా, మీ గురించి ఏర్పడిన అపనమ్మకం మాత్రం వారి మనసులో అలాగే ఉండిపోతుంది. అందుకే... మీ గుండె లోతుల్లోంచి క్షమాపణలను అందించండి.   మొహమాటంగా ఉంటే నేరుగా క్షమాపణ చెప్పేందుకు కొందరికి మొహమాటంగా ఉండవచ్చు. ఇలాంటప్పుడు ఉత్తరాలు రాయడమో, మెయిల్‌ చేయడమో చేస్తే సరి. అది కూడా కాదంటే, సెల్‌ఫోన్లు ఎలాగూ అందుబాటులో ఉన్నాయి కదా! మీ మనసులోని మాటను ఉన్నది ఉన్నట్లుగా అవతలివారికి మెసేజ్ చేయండి. అవతలి వారు జవాబు ఇవ్వరేమో అన్న సందేహం ఉంటే నేరుగా ఫోన్‌ చేసి మాట్లాడండి.   తప్పుని సరిదిద్దుకోండి అవతలి వ్యక్తికి మాట ఇచ్చి నిలబెట్టుకోలేదా? వారి వస్తువుని ఏదన్నా పాడుచేశారా? వాళ్లు కోరుకున్న అవకాశాన్ని దూరం చేశారా? ఇలాంటి సందర్భాలలో మీ తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉంటే కనుక తప్పక దాన్ని సరిదిద్దుకోండి. ఒకవేళ మాట జారడం వంటి సరిదిద్దుకోలేని తప్పు చేస్తే, మీరు చేసిన పని ఎంత పొరపాటో.... దాని వల్ల మీరు ఎంతగా బాధపడుతున్నారో తెలియచేయండి.   తీరులో తీవ్రత చేసిన పొరపాటుని బట్టి క్షమాపణ చెప్పే తీరులో కూడా మార్పు ఉంటే బాగుంటుంది. ఏదో చిన్నపాటి పొరపాటైతే ‘నన్ను క్షమించు!’ అనేస్తే సరిపోతుంది. కానీ అదే చేయరాని పొరపాటైతే, అనకూడని మాట ఏదో అనేసి ఉంటే.... మరింత ఉద్వేగభరితమైన క్షమాపణలు అవసరం. ‘చాలా పొరపాటు జరిగిపోయింది. ఇంకెప్పుడూ అలా అనను...’ లాంటి దీనాలాపనలు తప్పవు. మరి బంధాలను కాపాడుకోవాలంటే, ఆ మాత్రం త్యాగం చేయకపోతే ఎలా! ‘నేను ఎందుకు చెప్పాలి అన్న అహంకారానికి పోతే, మిగిలేది ఒంటరితనమే!’   - నిర్జర.

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నది అందుకే...

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకంటారనే విషయం మెల్లమెల్లగా జనానికి అర్థమవుతోంది. ఆ విషయం..ఈ విషయం అని కాకుండా అన్ని విషయాల్లోనూ మన పూర్వీకులు ఒక క్రమపద్ధతిలో నడిచారు కాబట్టే..వారు నిండు నూరేళ్లు హాయిగా బ్రతికారు. ఆధునికత ప్రభావమో లేక పాశ్చాత్య పోకడలో మనం సంప్రదాయాన్ని అనాగరికతగా భావిస్తూ జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడిప్పుడే ఆధునిక జీవనశైలి మనల్ని ఎంత చిత్తు చేస్తుందో తెలుస్తోంది. డెబ్బయిల తర్వాత మన జీవన శైలిలో వచ్చిన వేగవంతమైన మార్పులతో వ్యాధుల్లోనూ అంతే మార్పులు వచ్చాయి.   మనం తిసుకునే ఆహారంలో పాశ్చాత్య పోకడలు పెరిగిపోయాయి. ఇందులో పోషకాల కంటే రుచి కోసం కొవ్వు, క్యాలరీలే ఎక్కువ. ఇక ఉరుకులు పరుగుల జీవితంలో అన్ని సమకూర్చుకోవడం కోసం భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్నారు. మనసు విప్పి మాట్లాడుకోవడానికి, కంటి నిండా నిద్రపోవడానికి, ఒక్క క్షణం ఆలోచించడానికి, ఆఖరికి మనం పరిగెత్తడానికి అవసరమైన తిండి ప్రశాంతంగా తినడానికి కూడా టైమ్ లేదు. అంతా ఇన్‌స్టెంట్‌గా, రెడీమేడ్‌గా అప్పటికప్పుడు జరిగిపోవాలి. దీంతో మంచి పోషకాహారాలను ఇంట్లోనే తయారు చేసుకునే సమయం లేక టైంకి ఏదో ఒకటి కడుపులో పడేలా చూసుకుంటున్నారు. అంతే తప్ప..ఆరోగ్యకరమైన ఆహారానికి నోచుకోవడం లేదు.   ఇలాంటి వారందరిని మేల్కోలిపే అధ్యయనం ఒకటి తాజాగా బయటపడింది. పోటీ ప్రపంచంలో మనిషి వేగంగా అభివృద్ధి చెందాలన్న ఆశతో ఎన్నో రకాల పనులను చేస్తున్నాడు. ఈ క్రమంలో శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ప్రధానంగా జ్ఞాపకశక్తిని కోల్పోతున్నాడు. మానవాళిని ఇప్పుడు వేధిస్తున్న సమస్యల్లో మెమోరీ లాస్ ఒకటి..దీనినే అల్జిమర్స్ అని కూడా పిలుస్తున్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ వ్యాధి కోరలు చాస్తోంది. అన్ని దేశాల్లో లాగే దీని ముప్పు భారతదేశానికి తప్పలేదు. మన దేశంలో ఒక మిలియన్ మంది ప్రజలు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా.   అయితే అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం భారతదేశపు సంప్రదాయ ఆహార అలవాట్లను పాటించే వారిలో అల్జీమర్స్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు గుర్తించారు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే..మాంస పదార్థాలు తక్కువగా ఉండే భారత్, జపాన్, నైజీరియా వంటి దేశాల సంప్రదాయ ఆహారపదార్థాల నుంచి ఈ తరహా ప్రయోజనాలు అధికంగా ఉంటున్నట్టు తేలింది. అల్జీమర్స్‌ వ్యాధి శారీరకంగా వచ్చేదే అయినా..ఆహారంతో సంబంధమున్నట్లు పరిశోధనలో తేలింది. ముఖ్యంగా మాంసం, తీపిపదార్థాలు, కొవ్వు ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తులు, వ్యాధుల ముప్పును పెంచడంలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు తేల్చారు. ఇలాంటి ఆహార వినియోగాన్ని తగ్గించడం ద్వారా అల్జీమర్స్‌ వ్యాధితో పాటు పలురకాల క్యాన్సర్లు, టైప్-2 మధుమేహం, పక్షవాతం, మూత్రపిండాల వ్యాధుల ముప్పు కూడా గణనీయంగా తగ్గినట్టు అధ్యయనంలో తేలింది. సో ఇప్పటికైనా బద్దకాన్ని వదిలి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న సూక్తిని అన్ని విషయాల్లో అన్వయించుకోండి.

మాతృభాషకు ఎందుకంత ప్రాముఖ్యత!

  ప్రపంచీకరణ పుణ్యమా అని ఇప్పుడు ఇంగ్లీషుదే ఆధిపత్యంగా మారింది. చదువుకోవాలంటే ఇంగ్లీషు, ఉద్యోగం చేయాలంటే ఇంగ్లీషు, ఆఖరికి బయటకు వెళ్లి వ్యవహారాలు నడపాలంటే ఇంగ్లీషు... ఇలా ఎక్కడ చూసినా ఇంగ్లీషుదే పెత్తనం అయిపోయింది. ఈ పరిస్థితికి ఎదురొడ్డి మనం మనుగడ సాగించడం కష్టమే! అలాగని మన మాతృభాష అయిన తెలుగుని పూర్తిగా మర్చిపోయే పరిస్థితి రావడమే దురదృష్టకరం. ఇంట్లో తండ్రీకొడుకులు ఎదురుపడినా కూడా ఆంగ్లంలోనే మాట్లాడుకోవడం, తెలుగులో మాట్లాడటాన్ని అనాగరికతగా భావించడం బాధాకరం. నాలుగు రాళ్లు వెనకేయని మాతృభాషని మర్చిపోతే ఏం అని ప్రశ్నించేవారికి సమాధానాలు ఇవిగో...   భావవ్యక్తీకరణ! ఇంగ్లీషులో ఎంత దుమ్మురేపేవాడైనా కాలికి ముల్లు గుచ్చుకుంటే ‘అమ్మా!’ అని అరవాల్సిందే! ఈ ఉదాహరణ కాస్త అతిగా తోచినా, మన మనసులోని భావాలను స్పష్టంగా బయటపెట్టేందుకు మాతృభాషే అత్యుత్తమమైన సాధనం అంటున్నారు నిపుణులు. అవసరం లేని చోట కూడా, కావాలని ఆంగ్లంలో మాట్లాడేవారిని గమనించండి. ఆ మాటలు వారి గుండె లోతుల్లోంచి రావడం లేదనీ, అసలు విషయాన్ని చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నారనీ ఇట్టే తెలిసిపోతుంది.   చదువు సులభంగా! పిల్లవాడికి తెలిసిన భాషలో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం సులువా? లేకపోతే ఇంకా పూర్తిగా అవగాహన లేని భాషలోనే విజ్ఞానం పొందడం సులువా? అన్న ప్రశ్నకు జవాబు ఏమంత కష్టం కాదు. ఆంగ్లంలో చదువుని నేర్చుకోవడం అంటే, ముందుగా ఒకో పదానికీ అర్థం వెతుక్కోవడంతోనే సరిపోతుంది. పైగా చదువుకున్న విషయాన్ని వ్యక్తీకరించడానికీ, దాని మీద ఏదన్నా సందేహాలు అడగడానికీ కూడా... మాతృభాషలోనే తగిన స్వేచ్ఛ ఉంటుంది కదా! అందుకనే, ఉన్నతవిద్య సంగతి ఎలా ఉన్నా ప్రాథమిక విద్య మాత్రం మాతృభాషలోనే సాగాలంటూ ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. అంతేకాదు! మాతృభాషలో ప్రాథమిక విద్యను నేర్చుకునేవారు, జ్ఞాన సముపార్జనలో ఇతరుకంటే ముందుంటున్నారనే పరిశోధనలూ వెలువడుతున్నాయి.   ఆంగ్లం మరింత సులభంగా! తమ మాతృభాష మీద పట్టు సాధించినవారే, రెండో భాషను చాలా సులభంగా నేర్చుకుంటారనే పరిశీలనలు వెలువడుతున్నాయి. ఎందుకంటే భాషకి సంబంధించి మనలో ఒక బలమైన పునాది ఏర్పడినప్పుడు, మరో భాషని నేర్చుకోవడం పెద్ద కష్టంగా తోచదు. అలా కాకుండా మాతృభాషే పూర్తిగా నేర్వని సమయంలో, మరో భాష వైపు అడుగులు వేస్తే... రెంటికీ చెడ్డ రేవడిగా మారడం ఖాయం. అందుకనే ఇప్పటి తరం పిల్లలు ఇటు తెలుగూ, అటు ఆంగ్లంలో కూడా నైపుణ్యం సాధించలేకపోతున్నారన్నది ఒక అభియోగం. తెలిసిన విషయం నుంచి తెలియని విషయం వైపుగా సాగడం, నైపుణ్యాన్ని సాధించేందుకు కావల్సిన అర్హత. అలా కాకుండా తెలియని భాష మీదే మొదట మన సామర్థ్యాన్ని వినియోగిస్తే, ఫలితం తారుమారు కాక తప్పదు కదా!   భాష మన శ్వాస! భాషంటే కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే భావవ్యక్తీకరణ మాత్రమే కాదు. అది మన జీవనాడి. వేల సంవత్సరాల చరిత్రకు, సంస్కృతికి సజీవ సాక్ష్యం. మన సాహిత్యం, మన సంప్రదాయాలు, మన జానపదం... అన్నీ భాషలోనే ఇమిడి ఉంటాయి. అలాంటి భాషను దూరం చేసుకోవడం అంటే, మన పునాదులని మనం కూల్చివేసుకోవడమే కదా! అలాంటప్పుడు మనిషికి తనది అని చెప్పుకొనేందుకు ప్రత్యేకంగా ఏవీ మిగలవు. తను ఫలానా జాతివాడు అని చెప్పుకొనేందుకు ఆధారమూ ఉండదు. మాతృభాషకు దూరమైనవాడు.. గాలికి కొట్టుకుపోయే ఎండుటాకుతో సమానం. అందుకనే! మాతృభాష వినిపించనివారిలో క్రుంగుబాటు ధోరణులు ఎక్కువగా ఉంటాయనీ, అవి ఒకానొక సందర్భంలో ఆత్మహత్యకు సైతం దారితీస్తున్నాయనీ... కెనడాలో తేల్చిచెప్పిన ఒక పరిశోధనా ఫలితాలు ప్రపంచాన్నే విస్తుబోయేలా చేశాయి.   మాతృభాషలోనే ప్రతిమాటా పలకాలి, ప్రపంచానికి ఎదురొడ్డాలి అని ఎవ్వరూ సూచించడం లేదు. అలాంటి సూచనలు బహుశా అంత ఆచరణసాధ్యం కూడా కాకపోవచ్చు. కానీ అమ్మభాషను ఆదరంగా చూసుకోవాలి, పిల్లల్లో మాతృభాష పట్ల తగినంత అభినివేశాన్ని కలిగించాలి, వారితో కనీసం ఇంట్లో అయినా స్పష్టమైన తెలుగులో మాట్లాడాలి... అని కోరుకోవడం తప్పేమీ కాదుగా! (నేడు తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా)   - నిర్జర.