Sylvester Stallone – అతని జీవితమే ఓ సినిమా!

  అనగనగా ఓ హీరో! అతను నానాకష్టాలూ పడతాడు. ఆ కష్టాలు చూసినవారెవ్వరికైనా ‘ఇంతకంటే దారుణమైన జీవితం ఉంటుందా!’ అన్న అనుమానం వచ్చేస్తుంది. కానీ మన హీరోకి మాత్రం అలాంటి అనుమానం ఏమీ ఉండదు. ప్రతి కష్టాన్నీ అతను నిబ్బరంగా ఎదుర్కొంటాడు, చివరికి తను కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడు. అలాంటి హీరోలు వెండితెర మీదే కాదు... మన మధ్యన కూడా కొందరున్నారు. కావాలంటే చూడండి!   సిల్వస్టర్ స్టలోన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. 70 ఏళ్ల వయసులో కూడా హాలీవుడ్లో హంగామా సృష్టిస్తున్న టాప్ హీరో. కానీ ఈ స్థాయికి చేరుకునేందుకు అతను సాగించిన ప్రయాణం అసమాన్యం. స్టలోన్ తండ్రి అమెరికాలో స్థిరపడిన ఇటాలియన్, తల్లి రష్యన్. స్టలోన్ పుట్టుకతోనే దురదృష్టం తోడుగా లోకంలోకి అడుగుపెట్టాడు. అతన్ని తల్లి గర్భం నుంచి బయటకు తీసేందుకు పటకారు (forceps) ఉపయోగించాల్సి వచ్చింది. దాని వల్ల అతని మొహంలోని ఒక నరం దెబ్బతిని పక్షవాతం వచ్చేసింది. అతని పెదాలు, నాలుక, దవడలోని కొంత భాగం సరిగా పనిచేయకుండా పోయింది. స్టాలిన్ కష్టాలకు ఇది ఒక ఆరంభం మాత్రమే!   స్టలోన్కు తొమ్మిదేళ్ల వయసు ఉండగా... అతని తల్లిదండ్రులు విడిపోయారు. అతని ఆలనాపాలనా తల్లే చూసుకోసాగింది. కానీ స్టలోన్ చదువులో చురుగ్గా లేకపోవడంతో, తల్లి అతన్ని ఒక సెలూన్లో ఉద్యోగానికి పెట్టింది. కానీ ఆ ఉద్యగం అతన్ని మరింత పేదరికంలోకి నెట్టేసింది. స్టలోన్కు 24 ఏళ్లు వచ్చేసరికి ఏ ఉద్యోగమూ లేకుండా పోయింది. అతను ఉంటున్న అపార్టుమెంట్ అద్దెని కూడా కట్టలేని పరిస్థితి. దాంతో ఓ రోజున కట్టుబట్టలతో సహా ఆ అపార్టుమెంటు నుంచి బయటపడక తప్పలేదు. తలదాచుకోవడానికి ఆరడుగుల అండ కూడా దొరక్కపోవడంతో... న్యూయార్కులోని బస్టాండులోనే మూడు వారాలు గడిపాడట స్టలోన్.   ఆ సమయంలో స్టలోన్కు ఒక వరంలాంటి శాపం దక్కింది. చూడ్డానికి ఎర్రగా బుర్రగా ఉన్న అతడికి ఒక పోర్న్ ఫిల్మ్ (అశ్లీల చిత్రం)లో చిన్న పాత్ర దక్కింది. ఆ పాత్రకుగాను అతనికి 200 డాలర్లు ఇస్తామని చెప్పారు. చేతిలో చిల్లిగవ్వ లేదు, తల దాచుకోవడానికి నెత్తి మీద నీడ లేదు. అలాంటి సమయంలో స్టలోన్కు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం తప్ప మరో మార్గం కనిపించలేదు. ఆ అవకాశంతో స్టలోన్ జీవితమైతే మారిపోలేదు కానీ చిన్నాచితకా వేషాలు దొరకడం మొదలైంది.   ఒకరోజు స్టలోన్ టీవీలో బాక్సింగ్ పోటీ చూస్తున్నాడు. అందులో మహమ్మద్ ఆలీ, చక్ వెప్నర్ అనే బాక్సర్లు హోరాహోరీగా పోటీపడుతున్నారు. ఆ పోటీ చూసిన స్టలోన్ మనసులో ఓ ఆలోచన మెదిలింది. బాక్సింగ్ పోటీ నేపథ్యంలో ఒక సినిమా కథని ఎందుకు రాయకూడదనిపించింది. వెంటనే తన రూమ్కి వెళ్లి మూడు రోజుల పాటు ఏకధాటిగా కూర్చుని ఒక కథని అల్లాడు. అదే Rocky! తను రాసిన స్క్రిప్ట్ను తీసుకుని స్టలోన్ ప్రొడ్యూసర్ల దగ్గరకి బయల్దేరాడు.   స్టలోన్ రాసిన కథ చాలామందికి నచ్చింది. కానీ ఆ కథలో ప్రధాన పాత్రని తనే పోషిస్తానని స్టలోన్ చెప్పడంతో ఎవ్వరూ సినిమా తీసేందుకు ధైర్యం చేయలేదు. చివరికి ఒక నిర్మాత ఆ కథని 3,50,000 డాలర్లకి కొనేందుకు ఒప్పుకొన్నాడు. అంత భారీ ఆఫర్ వచ్చినా కూడా స్టలోన్ తన పంతం వీడలేదు. అందులో రాకీ పాత్ర తను పోషించాల్సిందే అని పట్టుపట్టాడు. ఇక చేసేదేమీ లేక స్టలోన్కు కేవలం 35,000 డాలర్లు ముట్టచెప్పి అతనితో ఆ పాత్ర చేయించారు.   రాకీ విడుదల తర్వాత స్టలోన్ ఎవరో ప్రపంచానికి తెలిసిపోయింది. అందులో అతని అద్భుతమైన నటనకీ, రచనకీ ఆస్కార్ నామినేషన్ కూడా వచ్చింది. కేవలం పదకొండు లక్షల డాలర్లతో తీసిన ఆ చిత్రం 22 కోట్ల డాలర్లను వసూలు చేసింది. ఆ ఒక్క సినిమాకే ఆరు సీక్వెల్స్ తీశారంటే హాలీవుడ్లో దాని ప్రభావం ఏపాటిదో అర్థమవుతుంది. ఆ సీక్వెల్స్తో పాటుగా Rambo, Cliffhanger లాంటి 70కి పైగా చిత్రాలతో స్టలోన్ హాలీవుడ్ చరిత్రలోనే తనదైన అధ్యాయాన్ని సృష్టించుకున్నాడు.   స్టలోన్ కష్టకాలంలో ఉన్నప్పుడు తనకి ఇష్టమైన కుక్కపిల్లని 50 డాలర్లకు అమ్మేశాడట. కానీ రాకీ సినిమా కోసం తనకి 35,000 డాలర్లు ముట్టగానే వెంటనే ఆ కుక్కని తిరిగి కొనేందుకు బయల్దేరాడు. ఆ కుక్కని కొనుక్కొన్న వ్యక్తి తరచూ బార్కి వస్తాడని తెలియడంతో మూడురోజులపాటు అతని కోసం కాపుకాశాడు. చివరికి అతను కనిపించనైతే కనిపించాడు కానీ... ఆ కుక్కని తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. ‘ఆఖరికి 3,000 డాలర్లు చెల్లించి నానా తిట్లూ తిన్న తర్వాత నాకు ఆ కుక్కని తిరిగి ఇచ్చేందుకు అతను ఒప్పుకున్నాడు’ అని స్టలోన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. హుమ్! స్టలోన్ తను కోల్పోయినవి కూడా తిరిగి సాధించుకున్నాడన్నమాట. నిజమైన విజయం అంటే అంతే కదా!!! - నిర్జర.    

నాన్న తోడుంటే -ఏదైనా సాధించవచ్చు

  పిల్లల్ని పెంచడంలో తల్లి పాత్రని ఎవ్వరూ కాదనలేరు. కానీ బిడ్డల మీద తండ్రి ప్రభావం కూడా అసాధారణమే అంటున్నారు పరిశోధకులు. ఈ మధ్యకాలంలో వెలుగుచూసిన కొన్ని పరిశోధనల తండ్రి కేవలం తెరచాటు మనిషి మాత్రమే కాదనీ... పిల్లలు ఎదిగేందుకు అతని తోడ్పాటు చాలా అవసరమనీ తేల్చి చెబుతున్నాయి. వాటిలో కొన్ని...   తండ్రిలానే ఉంటాము   పిల్లవాడు పుట్టగానే అతనిది తల్లి పోలికా తండ్రి పోలికా అని బేరీజు వేస్తుంటారు. ఎదిగేకొద్దీ తండ్రి బుద్ధులు వచ్చాయా, తల్లి అందం వచ్చిందా అని తరచి చూసుకుంటారు. నిజానికి పిల్లవాడికి తల్లీ, తండ్రీ ఇద్దరి నుంచీ సమానమైన లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. పైగా మన కణాలకు జీవాన్నిచ్చే ‘మైటోకాండ్రియా’ కేవలం తల్లి నుంచే పిల్లలకు వస్తుంది. కానీ ఈ మధ్య జరిగిన ఓ పరిశోధనలో తండ్రి జన్యువులే పిల్లవాడి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయని తేలింది. తండ్రి నుంచి పిల్లవాడికి సంక్రమించిన genetic mutations మరింత బలంగా ఉంటాయట. కాబట్టి వంశపారంపర్యమైన వ్యాధులు వచ్చినా, మంచి రోగనిరోధకశక్తి ఉన్నా... తండ్రిదే కీలకపాత్ర కావచ్చు.   తండ్రి ప్రేమకి మంచి మార్కులు   టీనేజి పిల్లలకి చదువు మీద ధ్యాస అంతగా ఉండదు. అసలే పరిపరివిధాలా పోతున్న మనసుకి ఆర్థిక సమస్యలు కూడా తోడైతే ఇక చెప్పేదేమంది. చదువు కాస్తా చెట్టెక్కి తీరుతుంది. కానీ తండ్రి కనుక వీరికి అండగా నిలిస్తే... ఎలాంటి సమస్యనైనా దాటుకుని చదువులో ముందుండి తీరతారట. అయితే ఈ ప్రభావం ఆడపిల్లల మీద ఒకలా మగపిల్లల మీద ఒకలా ఉండటం గమనార్హం! తండ్రి నుంచి అందే ప్రేమతో ఆడపిల్లలు లెక్కలలో బాగా రాణిస్తే, ఆయన నుంచి వచ్చే ఆత్మవిశ్వాసంతో మగపిల్లలు ఇంగ్లిష్లో మంచి మార్కులు సాధించడాన్ని గమనించారు.   తండ్రి పక్కనుంటే డిప్రెషన్ దూరం   చక్కగా చూసుకునే నాన్న పక్కన ఉంటే, పిల్లవాడికి ఎలాంటి ఢోకా ఉండదంటున్నారు స్వీడన్కు చెందిన పరిశోధకులు. దాదాపు 20 ఏళ్లపాటు శోధించి తేల్చిన విషయం ఇది. ప్రేమతో మెలిగే తండ్రి ఉన్న మగపిల్లలు లేనిపోని గొడవల జోలికీ, చెడు వ్యసనాల జోలికీ పోకుండా ఉంటారట. ఇక ఆడపిల్లలేమో మానసిక సమస్యలకి దూరంగా నిబ్బంగా జీవించగలుగుతారట. వంద కాదు వెయ్యి కాదు... దాదాపు ఇరవైవేల మంది పిల్లలను పరిశీలించిన తర్వాత తేల్చిన విషయమిది!   తండ్రి ద్వేషం   పిల్లల్ని తండ్రి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చాలామంది అనుకుంటారు. పిల్లల్ని దగ్గరకు తీస్తే ఎక్కడ పాడైపోతారో అని చాలామంది తండ్రులు, పిల్లలని దూరం పెడుతుంటారు. కారణం ఏదైనా కానీయండి... తల్లికంటే కూడా తండ్రి నుంచి వచ్చే వ్యతిరేకతే పిల్లల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందట. ఆ ప్రభావం వారి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. దాదాపు పదివేల మంది మీద జరిగిన 36 పరిశోధనల సారాంశమిది! మరెందుకాలస్యం. భేషజాలను పక్కన పెడదాం! తండ్రి కూడా తల్లితో సమానంగా పిల్లలకి ప్రేమ పంచగలడని నిరూపిద్దాం. హ్యాపీ ఫాదర్స్ డే! - నిర్జర.    

స్నేహమేరా జీవితం... ఆ స్నేహంతోనే ఆరోగ్యం!

  కుటుంబాన్ని దేవుడు ఇస్తాడు, కానీ స్నేహితులని ఎంచుకునే అవకాశం మనకే ఉంటుంది. అందుకనే స్నేహం చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి అంటారు పెద్దలు. అలా మంచి స్నేహితులను ఎంచుకోవడానికి మరో బలమైన కారణం కూడా చూపిస్తున్నారు పరిశోధకులు. మంచి స్నేహితులు పక్కన ఉంటే... ఆరోగ్యం కూడా భేషుగ్గా ఉంటుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.   మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన విలియం చోపిక్ అనే పరిశోధకుడు, ఆరోగ్యం మీద స్నేహం ప్రభావాన్ని తెలుసుకోవాలని అనుకున్నారు. అందుకోసం వందమంది కాదు వేయిమంది కాదు వంద దేశాల నుంచి 2,70,000 మంది నుంచి సమాచారాన్ని సేకరించారు. వీళ్లంతా కూడా కుటుంబం వల్లా, స్నేహితుల వల్లా తాము సంతోషంగానూ ఆరోగ్యంగానూ ఉంటున్నామని చెప్పుకొచ్చారు. వృద్ధాప్యంలో అయితే కుటుంబాన్ని మించి కూడా స్నేహితుల అండ తమను ఆరోగ్యంగా ఉంచుతోందని తేల్చారు.   అభ్యర్థులు స్వయంగా చెప్పిన ఈ విషయాలు వాస్తవంగా ఎంతవరకూ నిజమో తెలుసుకోవాలని అనుకున్నారు. అందుకోసం మరో ఏడువేల మందికి చెందిన మెడికల్ రికార్డులను పరిశీలించారు. నిజంగానే స్నేహితులు ఉన్నవారు ఇతరులకంటే ఆరోగ్యంగా ఉన్నట్లు ఈ పరిశీలనలో తేలింది. అందుకని వృద్ధాప్యంలో హాయిగా ఉండేందుకు డబ్బులు, ఆస్తులు ఎలా సమకూర్చుకుంటామో...   అంతకంటే ముఖ్యంగా, మంచి స్నేహితులను కూడా తయారుచేసుకోవాలని చెబుతున్నారు.ఇంతకీ వయసు పెరిగేకొద్దీ స్నేహం ఎందుకంత ప్రభావం చూపుతుంది? అన్న ప్రశ్నకు పరిశోధకుల దగ్గర చాలా జవాబులే ఉన్నాయి. - కాలం గడుస్తున్న కొద్దీ పనికిరాని స్నేహాలను పక్కనపెట్టి, నిజమైన స్నేహితులతోనే కాలం గడిపేందుకు ప్రయత్నిస్తాం. సహజంగానే వీరు మన కష్టసుఖాలను పంచుకునేవారై ఉంటారు.   - వృద్ధాప్యంలో భార్యో భర్తో మరణించిన తర్వాత ఎక్కడలేని ఒంటరితనమూ అవహిస్తుంది. సహజంగానే స్నేహితులు ఆ ఒంటరితనం నుంచీ, దగ్గర మనిషిని కోల్పోయిన బాధ నుంచీ బయటపడేస్తారు.   - కుటుంబసభ్యులతో అన్ని విషయాలనూ పంచుకోలేకపోవచ్చు. అవతలివారు అపార్థం చేసుకుంటారనో, కంగారు పడతారనో, బంధంలో చులకన అయిపోతామనో... వారి దగ్గర కొన్ని విషయాలు దాచిపెడతాము. కానీ స్నేహంలో అలాంటి భేషజాలు ఏవీ ఉండవు కదా! - ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో పాలుపోదు. జీవితమంతా శూన్యంలా తోస్తుంది. అలాంటి సమయంలో స్నేహితుల అండ ఓ కొత్త జీవితాన్ని అందిస్తుంది.   - కుటుంబంలో ఏదన్నా సమస్య ఉంటే అది మనసుని వేధించక తప్పదు. దాని నుంచి పారిపోయే అవకాశమూ లేకపోవచ్చు. కుటుంబంలో అనుభవించే యాతనకి స్నేహితుల దగ్గర ఓదార్పు లభించి తీరుతుంది.   అలాగని స్నేహం కేవలం వృద్ధాప్యంలోనే కాదు.... జీవితంలోని ఏ మలుపులో అయినా అండగా నిలిచి తీరుతుంది. కాబట్టి వయసుతో నిమిత్తం లేకుండా మంచి మనుషులను స్నేహితులుగా మార్చుకునేందుకు, ఆ స్నేహితులను కలకాలం నిలుపుకొనేందుకు ఇప్పటినుంచే ప్రయత్నించమని సూచిస్తున్నారు పరిశోధకులు.     - నిర్జర.  

ఏడ్చే మగవాడిని నమ్మితీరాల్సిందే!

    ఏడ్చే మగవాడనికి నమ్మకూడదు అంటారు? కానీ రోజులు మారాయి. దాంతోపాటుగా నమ్మకాలు కూడా మారాల్సిందే! ఆడవారైనా, మగవారైనా ఏడిస్తే వ్యక్తిత్వం బలపడుతుంది! అంటున్నారు. ఎందుకో మీరే చూడండి.   ఒత్తిడి నుంచి ఉపశమనం:-   మనసుకి తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు, దానిని గుండెలోతుల్లో అదిమిపెట్టి ఉపయోగం లేదు. అలా అణిచిపెట్టుకున్న దుఃఖం మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అదే కష్టాన్ని కన్నీళ్ల ద్వారా బయటకు పంపేస్తే మనసు తేలికపడుతుంది. కష్టం దగ్గరే ఆగిపోకుండా జీవితంలో ముందుకు సాగే ధైర్యం వస్తుంది. అంతేకాదు! మనసు తేలికపడిన తర్వాత అసలు సమస్య ఎక్కడ వచ్చింది? దానిని అధిగమించడం ఎలా అనే స్పష్టత ఏర్పడుతుంది.   తెగింపుకి సూచన:-   మనసులో ఎంత బాధ ఉన్నా పైకి గంభీరంగా నటిస్తాము. మగవాళ్లు ఏడిస్తే బాగోదు కదా! అన్న ఆలోచనతో కన్నీటి ఉగ్గబట్టుకుని కుమిలిపోతుంటాము. కానీ అవతలివారు ఏమనుకుంటారో! అన్న ఆలోచనని అధిగమించిన రోజునే తెగించి కన్నీళ్లు పెట్టుకోగలం. అందుకే స్వచ్ఛమైన మనసుకీ, భేషజాలెరుగని వ్యక్తిత్వానికీ సూచనగా ఏడుపు నిలుస్తుంది!   ఎదుటి వ్యక్తికి సాంత్వన:-   ఎదుటివాడి కష్టాన్ని చూసి కంటనీరు పెట్టుకున్నారనుకోండి! అవతలివారికి మీరు తన పట్ల సానుకూలంగా ఉన్నారన్న అభిప్రాయం కలుగుతుంది. తన కష్టసుఖాలను మీతో పంచుకోగల నమ్మకం వస్తుంది. ఒకవేళ మీరే ఎదన్నా తప్పు చేశారనుకోండి.... ‘తప్పయిపోయిం’దంటూ కంటనీరు పెట్టుకుంటే, అవతలివారి మనసులో మీ పట్ల ఉన్న దురభిప్రాయం కాస్తా తొలిగిపోతుంది. కాబట్టి ఏ రకంగా చూసినా కన్నీరు బంధాలను నిలబెట్టినట్లే లెక్క!   స్పందనకు ప్రతిరూపం:-   కష్టానికి త్వరగా స్పందించే మనసు ఉన్నవారే... బొటబొటా కన్నీటిని విడుస్తుంటారు. ఇలాంటి సున్నితమైన మనసు ఉన్నవారు సహజంగా ఏ కవిగానో, చిత్రకారునిగానో మారి అద్భుతాలు సృష్టిస్తుంటారు. ఇతరుల కష్టాలని తీర్చేందుకు సమాజసేవకులుగానూ మారుతుంటారు. ప్రపంచపు బాధని తీర్చే శాస్త్రవేత్తలుగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు!   ఆరోగ్యానికీ ఢోకా ఉండదు:-   కష్టాన్ని కన్నీటి ద్వారా బయటకు పంపేస్తే గుండెకు ఎలాగూ మంచిదే! అంతేకాకుండా మన శరీరంలో ఉత్పత్తి అయ్యే కార్టిసాల్‌ వంటి విషరసాయనాలన్నీ కన్నీటి ద్వారా బయటకు వెళ్లిపోతాయట! పైగా కన్నీటిలో ఉండే ‘లైసోజైం’ అనే అరుదైన రసాయనం శరీరంలోని హానికారక బ్యాక్టీరియాని నిర్వీర్యం చేయగలదు.   ఏడుపు వల్ల అటు వ్యక్తిత్వానికీ ఇటు ఆరోగ్యానికీ ఇన్ని లాభాలు ఉన్నాయన్నమాట! ఇప్పుడు చెప్పండి ఏడ్చే మగవాడిని నమ్మకుంగా ఎలా ఉండగలం!                        - నిర్జర.

సలామ్ హలీమ్! (సండే స్పెషల్)

ప్రేమకి కులం, మతం ఉండవంటారు. ప్రేమకే కాదు... ఫుడ్ కీ కూడా ఉండదు అని ఓ వంటకం నిరూపించింది. ఒక మతానికి చెందిన పవిత్ర ఆహారమైనా... ప్రతి మతం వారికీ ప్రీతిపాత్రమయ్యింది. ప్రపంచమంతటా తన పేరు మారుమోగేలా చేసుకుని ఏ ఆహారమూ సంపాదించనంత కీర్తిని మూటగట్టుకోవడం దానికే చెల్లింది. ఇంతకీ ఏమిటది? ఇంకా చెప్పాలా... అర్థమైపోలేదూ... హలీమ్. అవును. ఇది వంటకాలకే రారాజు. రుచుల్లో మహారాజు.    రంజాన్ మాసం వస్తోందంటే ముసల్మానులంతా ఉపవాసాలకు సిద్ధమవుతూ ఉంటారు. అయితే మిగతావారంతా హలీమ్ తినడానికి సిద్ధపడుతూ ఉంటారు. దుకాణాలు తెరిచీ తెరవగానే వాటి ముందు క్యూ కడుతుంటారు. లొట్టలేసుకుంటూ హలీమ్ ని లాగించేస్తుంటారు. ఏమిటంత ప్రీతి? ఓ వంటాన్ని తినడం కోసం ఎందుకింత ఆరాటం? హలీమ్ మాత్రమే ఎందుకింత ప్రత్యేకం? అసలు ఏమిటి హలీమ్ ప్రస్థానం? తెలుసుకుందాం రండి.   అలా వచ్చింది... మహబూబ్ అలీఖాన్... ఆరవ నిజాం నవాబు. ఒకసారి ఈయన తన రాజ్యంలోని రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని తలపెట్టాడు. దానికోసం ఓ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమావేశానికి పర్షియా నుంచి కొందరు ప్రముఖులు వచ్చారు. అది రంజాన్ మాసం కావడంతో వాళ్లంతా ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఆ దీక్షను విరమించడానికి తాము ఎప్పుడూ తినే వంటకం ఉంటే బాగుంటుందని అభిప్రాయ పడ్డారు.  అది మనకు పరిచయం లేదు. దాంతో నవాబు వంటవాళ్లను పిలిచి, ఆ వంటకం ఎలా చేయాలో పర్షియన్ అతిథులతో వాళ్లకి చెప్పించాడు. వెంటనే ఆ వంటకం సిద్ధమైంది. దాని సువాసన అందరి ముక్కు పుటాలనూ అదరగొట్టింది. అదే హలీమ్. మొట్టమొదటి సారిగా ఆరోజు మన దేశంలో అడుగు పెట్టిన హలీమ్... ఆపైన మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లలేదు.       తయారీయే ప్రత్యేకం... హలీమ్ గొప్పదనమంతా దాన్ని వండటంలోనే ఉంటుంది. గోధుమరవ్వను నాలుగ్గంటలు నీటిలో నానబెడతారు. తర్వాత నీటిని ఒంపేసి మాంసం, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మసాలాలతో కలిపి పన్నెండు గంటల పాటు ఉడకబెడతారు. తర్వాత దాన్ని మెత్తని పేస్ట్ లా అయ్యేవరకూ కర్రలతో కలియబెడతారు. ఇలా చేయడాన్ని గోటా కొట్టడం అంటారు. గోటా కొట్టిన తరువాతే హలీమ్ ఘుమఘుమలు మొదలవుతాయి. ఆపైన ఉల్లిపాయ ముక్కలు, బాదం పప్పు, జీడిపప్పు తదితర డ్రై ఫ్రూట్స్ ని నేతిలో వేయించి హలీంలో కలుపుతారు. తినేముందు కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం చల్లి ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లారకుండా బట్టీల్లో వేడి మీదే ఉంచుతారు. అందుకే ఎప్పుడు హలీమ్ తిన్నా వేడిగానే ఉంటుంది. ఇంత ప్రత్యేకంగా తయారు చేయబట్టే హలీమ్ అన్నింట్లోకీ ప్రత్యేకంగా నిలిచింది.    పోషకాలకు లోటు లేదు... అసలు రంజాన్ మాసంలో హలీమ్ ఎందుకు తింటారు? ఎందుకంటే రోజంతా చేసే ఉపవాసం వల్ల నీరసం రాకుండా చేస్తుంది హలీమ్. దానిలో నిండుగా ఉండే పోషకాలు అదనపు శక్తినిచ్చి నెల రోజుల పాటు ఉపవాస దీక్ష చేయగలిగేలా చేస్తుంది. పప్పుధాన్యాలు, నెయ్యి, తాజా మాంసం, డ్రై ఫ్రూట్స్ వంటివి ఎంతో బలవర్ధకం. అందుకే హలీమ్ రంజాన్ మాసపు ప్రత్యేక ఆహారమయ్యింది. మటన్, చికెన్ లతో పాటు వెజిటేరియన్స్ కోసం వెజ్ హలీమ్ కూడా దొరుకుతుంది. మటన్ తో చేసేదాన్ని హలీమ్ అనీ, చికెన్ తో చేసేదాన్ని హరీస్ అనీ అంటారు. పేరు ఏదైనా... పదార్థాలు ఏవైనా... వెజ్ అయినా నాన్ వెజ్ అయినా... దాని రుచి దేనికీ కాదు.    కాసులు కురిపిస్తోంది... రుచుల్ని అందించడమే కాదు... కాసుల్ని కూడా కురిపిస్తోంది హలీమ్. అది కూడా కోట్లలో. యేటా ఒక్క హైదరాబాద్ లోనే వంద కోట్లకు పైగా బిజినెస్ జరుగుతోందంటే దీని డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భాగ్యనగరంలో ఆరు వేలకు పైగా హలీమ్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఆన్ లైన్ బుకింగ్ కూడా మొదలవ్వడంతో బిజినెస్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఎంతోమందికి జీవనాధారం కూడా కల్పిస్తోంది.     వాస్తవానికి వేరే దేశం నుంచి హలీమ్ హైదరాబాద్ కి వచ్చింది. కానీ ఇప్పుడు హలీమ్ కి హైదరాబాదే కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. మన దేశంలోని చెన్నై, కోల్ కతా, బెంగళూర్ వంటి సిటీలతో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, చైనా, అమెరికా, మలేషియా, సింగపూర్, సౌదీ తదితర దేశాలకు కూడా హైదరాబాద్ నుంచే హలీమ్ సరఫరా అవుతోంది. అయితే ఇటీవలి కాలంలో విజయవాడ, రాజమండ్రి, గుంటూరు లాంటి ప్రాంతాల్లో కూడా హలీమ్ లభిస్తోన్నా హైదరాబాద్ హలీమ్ రుచి దేనికీ లేదంటున్నారు అభిమానులు. అంతగా హైదరాబాద్ హలీమ్ రుచి అందరినీ కట్టి పడేసింది. పావుకిలో రూ. 100 నుంచి రూ. 150 వరకూ ఉంటుంది. అరకిలో 250 నుంచి 300 రూపాయల వరకూ, కిలో 450 నుంచి 500 వరలకూ ఉంటోంది.     రేటు ఎంతయినా సరే... తిని తీరాల్సిందేనంటారు హలీమ్ ప్రియులు. అవును మరి... హలీమ్ కి వెలకట్టగలమా! తిన్న తర్వాత కొన్ని గంటల వరకూ నోటిని వదిలిపెట్టని ఆ రుచి కోసం ఎంతయినా ఖర్చుపెట్టొచ్చు. వంద భోజనాల వల్ల కలిగే శక్తిని ఒక్క కప్పుతో కలిగించే దాని ఘనతకి ఎన్ని వందలైనా వెచ్చించొచ్చు. తిరుగు లేని హలీమ్ కి ఎన్ని సలామ్ లైనా కొట్టొచ్చు. సలామ్ హలీమ్!   -Sameera N

ఆదివారం లేట్గా నిద్రలేస్తే గుండెజబ్బు ఖాయం!

  రోజంతా ఉరుకుల పరుగుల జీవితం. క్షణం కూడా ఊపిరి సలపనీయని బాధ్యతలు. ఎక్కడికన్నా పారిపోవాలి అనిపించేంత ఒత్తిడి. అందుకనే శనివారం సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తుంటారు చాలామంది. ఇక శనివారం వచ్చిందంటే తమలోని గూడు కట్టుకుపోయిన ఒత్తిడిని దూరం చేసుకునేందుకు బార్కి బయల్దేరతారు. అర్ధరాత్రి దాకా గడిపి తీరికగా ఇంటికి చేరుకుంటారు. ఆపై కళ్లు మూతలు పడేదాకా టీవీ చూస్తూ కూర్చుంటారు.   మర్నాడు ఆదివారమే కదా! ఓ గంట ఆలస్యంగా నిద్ర లేవచ్చులే అన్న భరోసా వీరిది. నిజంగానే మర్నాడు బారెడు పొద్దెక్కాకే నిద్రలేస్తారు. కానీ అదేం విచిత్రమో ఒత్తిడి ఏమాత్రం తగ్గినట్లు అనిపించకపోగా... విసుగ్గా, బద్ధకంగా తోస్తుంది. ఇలా అదనంగా నిద్రపోయినా కూడా నిస్సత్తువగా తోచడానికి ‘సోషల్ జెట్లాగ్’ అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. నిద్రని ఆపుకొని ఆపుకొని ఒకేసారి పడుకోవడమే ఈ సోషల్ జెట్లాగ్కి కారణం.   సోషల్ జెట్లాగ్ వల్ల మనం నిద్రపోయే సమయాలు ఒకసారి ఎక్కువగానూ, మరోసారి తక్కువగానూ ఉంటాయి. జీవగడియారంలో వచ్చే ఈ మార్పులు జన్యువుల మీద ప్రభావం చూపుతాయి. మన గుండెని కూడా ప్రభావితం చేస్తాయి. ఈ విషయాన్ని ధృవీకరించేందుకు అమెరికాలోని అరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక సర్వేని చేపట్టారు. సర్వేలో భాగంగా 22 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న 984 మందిని పరిశీలించారు. వారు ఆదివారం నాడు ఎంత ఎక్కువసేపు నిద్రపోతున్నారో చెప్పమని అడిగారు. ఆ తర్వాత వారి ఆరోగ్యానికీ, మానసిక ప్రశాంతతకీ సంబంధించిన వివరాలు సేకరించారు. ఆదివారంపూట ఒక్క గంట ఎక్కువగా పడుకున్నా కూడా మనకి గుండెజబ్బు వచ్చే అవకాశం 11 శాతం ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది! పైగా అంతసేపూ నిద్రపోయినా కూడా వారికి చిరాగ్గానూ, నిద్ర తీరనట్లుగానూ తోచిందట.   మనసు, ఆరోగ్యమూ సవ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర ఉండాలన్నది అందరికీ తెలిసిన విషయమే! కానీ ఆ నిద్ర కూడా ఎప్పుడూ ఒకే తీరున ఉండాలని ఈ పరిశోధన రుజువు చేస్తోంది. మర్నాడు ఆదివారం కదా అని శనివారం టీవీ చేస్తూనో, కబుర్లు చెబుతూనో, మందు కొడుతూనో కాలక్షేపం చేయనే వద్దని హెచ్చరిస్తోంది. వారం పొడుగూతా ప్రతి రాత్రీ ఏడు గంటలకు తగ్గకుండా నిద్రపోతూ... ఒకే దినచర్యని పాటించాలన్నది పరిశోధకుల హెచ్చరిక! - నిర్జర.  

IF

  IF you can keep your head when all about you Are losing theirs and blaming it on you, If you can trust yourself when all men doubt you, But make allowance for their doubting too; If you can wait and not be tired by waiting, Or being lied about, don't deal in lies, Or being hated, don't give way to hating, And yet don't look too good, nor talk too wise: If you can dream - and not make dreams your master; If you can think - and not make thoughts your aim; If you can meet with Triumph and Disaster And treat those two impostors just the same; If you can bear to hear the truth you've spoken Twisted by knaves to make a trap for fools, Or watch the things you gave your life to, broken, And stoop and build 'em up with worn-out tools: If you can make one heap of all your winnings And risk it on one turn of pitch-and-toss, And lose, and start again at your beginnings And never breathe a word about your loss; If you can force your heart and nerve and sinew To serve your turn long after they are gone, And so hold on when there is nothing in you Except the Will which says to them: 'Hold on!' If you can talk with crowds and keep your virtue, ' Or walk with Kings - nor lose the common touch, if neither foes nor loving friends can hurt you, If all men count with you, but none too much; If you can fill the unforgiving minute With sixty seconds' worth of distance run, Yours is the Earth and everything that's in it, And - which is more - you'll be a Man, my son! - Rudyard Kipling (If is thought to be one of the most inspiring poems of all time. IF is written by Rudyard Kipling famous for his `Jungle Book’ novel.)

అతనొక్కడే – కానీ ముంబైకి స్ఫూర్తిగా నిలిచాడు!

  ‘‘రెండేళ్ల క్రితం ముంబైలోని వెర్సోవా బీచ్, అతి చెత్త తీరాలలో ఒకటిగా అప్రతిష్ట మూటగట్టుకుంది. కానీ ఇప్పుడు అదే తీరం అతి సుందరంగా కనిపిస్తోంది. వెర్సోవా ప్రాంతవాసుల శ్రమ వల్లే ఇదంతా సాధ్యమయ్యింది. వారికి నాయకత్వం వహించిన ‘అఫ్రోజ్ షా’ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను,’’ అంటూ ఈ మధ్య తన మన్ కీ బాత్ కార్యక్రమలో ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. అప్పటి నుంచీ దేశం యావత్తూ... వెర్సోవా బీచ్లో జరిగిన అద్భుతం గురించీ, ఆ అద్భుతం నిజమయ్యేందుకు అఫ్రోజ్ షా అనే వ్యక్తి చేసిన కృషి గురించి తెలుసుకునే ప్రయత్నంలో మునిగిపోయారు.   అఫ్రోజ్ షా, బాంబే హైకోర్టులో లాయరుగా పనిచేస్తున్నారు. అందరు ముంబైవాసులలాగానే ఆయన కూడా సముద్రతీరంలో ఓ ఇల్లు ఏర్పరుచుకోవాలని కలగన్నారు. 2015లో ఆ కల నిజమైంది కూడా! కానీ ఉదయం లేచి చూస్తే ఏముంది? తీరమంతా చెత్తాచెదారంతో నిండిపోయి కనిపించింది. సముద్రంలో ఎక్కడెక్కడో కలిపే చెత్తతో పాటుగా, తీరం వెంబడి ఉండేవారంతా తమ చెత్తని అక్కడ నిర్మొహమాటంగా వదిలేయడం కనిపిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే వెర్సోవా తీరం ఓ అనధికారిక డంపింగ్ యార్డుగా మారిపోయింది.     మిగతావారిలాగా అఫ్రోజ్ తనకెందుకులే అని చూసీచూడనట్లు ముక్కుమూసుకుని ఉండిపోలేదు. తన పొరుగింటాయనతో మాట్లాడి తమ వంతుగా ఆ చెత్తని శుభ్రం చేసే ప్రయత్నం మొదలుపెట్టాడు. ప్లాస్టిక్ బాటిల్స్, గాజు ముక్కలు, పాత చెప్పులు, ఇనుప సామాను... ఇలా నానా చెత్తనంతా తీయవలసి వచ్చేది. మొదట్లో జనం ఆ ఇద్దరూ చేస్తున్న పనిని చూసి తమ దారిన తాము పోయేవారు. నిదానంగా ఒకో మనిషీ వచ్చి ఒకో చేయీ వేయడం మొదలుపెట్టారు. యాత్రికులు, దారినపోయేవారు, చేపలుపట్టేవారు, స్థానికులు మొదలుకొని అఫ్రోజ్ గురించి విన్న బాలీవుడ్ హీరోల వరకూ అంతా అఫ్రోజ్ బృందంలో కలిసి చెత్తని వెలికితీసే ప్రయత్నంలో భాగస్వాములు అయ్యారు.   వారం వారం అఫ్రోజ్ చేస్తున్న ఈ పని క్రమేపీ ఫలితాన్ని ఇవ్వడం మొదలుపెట్టింది. ఒకప్పుడు చెత్తాచెదారంతో నిండిపోయిన వెర్సోవా తీరం ఇప్పుడు తళతళ్లాడిపోతోంది. అఫ్రోజ్ చేస్తున్న పనిని ఐక్యరాజ్య సమితి సైతం గుర్తించింది. ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛతా కార్యక్రమంగా దీన్ని పేర్కొంది. అఫ్రోజ్కు ‘Champion of the Earth’ అనే బిరుదుని కట్టబెట్టింది. అంతేకాదు అఫ్రోజ్ స్ఫూర్తితో, దుర్గంధంతో నిండిపోయిన ఇండోనేషియా సముద్రతీరాన్ని కూడా శుభ్రపరిచే కార్యక్రమం మొదలుపెట్టింది.     వెర్సోవా తీరం ప్రస్తుతానికి ఓ కొలిక్కి వచ్చినమాట నిజమే! కానీ తమ బాధ్యత ఇక్కడితో ముగిసిపోలేదంటున్నారు అఫ్రోజ్. ఎక్కడెక్కడో సముద్రంలో కలిసే చెత్తంతా తీరానికి రాక తప్పదు కాబట్టి.... వారం వారం తాము ఆ చెత్తని శుభ్రం చేస్తూనే ఉంటామని హామీ ఇస్తున్నారు. మరోపక్క సముద్రతీరాలు కోతకు గురికావడం, సునామీబారిన పడటం వంటి ఉపద్రవాల నుంచి రక్షించే మడఅడవులని తిరిగి పెంచే కర్తవ్యాన్ని కూడా తలకెత్తుకున్నారు.   అందరిలా మనకెందుకులే అని అఫ్రోజ్ అనుకుంటే ఈ రోజున వెర్సోవా తీరంలో ఏ మార్పూ కనిపించేది కాదు. నేనొక్కడినే కదా అని వెనకడుగు వేస్తే ఆ మార్పు ప్రపంచాన్ని ఆకర్షించేదీ కాదు. అందుకే నిస్వార్థమైన నాయకత్వానికీ, సమాజం పట్ల బాధ్యతకీ అఫ్రోజ్ ఒక ఆదర్శంగా నిలుస్తాడని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు సైతం కితాబునిచ్చారు.     సముద్రతీరంలో చెత్తని పారేయడం మనకి చాలా సాధరణమైన దృశ్యంగా కనిపించవచ్చు. కానీ ఒకపట్టాన నేలలో కలవని గాజు, ప్లాస్టిక్ వంటి పదార్థాల వల్ల తనే ఎలాగూ పాడవుతుంది. పైగా సముద్రంలోకి చేరి అక్కడ నివసించే చేపలు వంటి జీవరాశుల ప్రాణాలు తోడేస్తాయి. సముద్ర పక్షలకి కూడా ప్రాణాంతకంగా మారిపోతాయి. ఈ కాస్త విషయమూ అర్థమైతే అఫ్రోజ్ వేసిన ముందడుగు ఎంత అవసరమో తేలిపోతుంది. (ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా) - నిర్జర.    

సంతోషంగా ఉండేందుకు ఓ బౌద్ధ భిక్షువు చిట్కాలు...!

  ఫ్రాన్స్‌కు చెందిన మాథ్యూ రికార్‌ (Matthieu Ricard) అందరిలాగే బుద్ధిగా చదువుకునేవాడు. ‘మాలిక్యులర్‌ జెనెటిక్స్‌’లో పీహెచ్‌డీ సైతం సాధించాడు. కానీ విజ్ఞానశాస్త్రం లోతులు చూస్తున్న కొద్దీ, తన మనసులో ఏముందో కూడా తెలుసుకోవాలనిపించింది మాథ్యూకి.   అందుకోసం ఫ్రెంచ్‌ తత్వవేత్తలు రాసిన పుస్తకాలన్నింటినీ చదవడం మొదలుపెట్టాడు. చివరికి భారతదేశమే తనలోని ఆధ్మాత్మిక జిజ్ఞాసకు దారిచూపగలదని నిశ్చయించుకున్నాడు. అలా ఇండియాకు చేరుకున్న మాథ్యూ బౌద్ధమతాన్ని పుచ్చుకొని నేపాల్‌లో స్థిరపడిపోయాడు.   మాథ్యూ గురించి విన్న కొందరు పరిశోధకులు మెదడు మీద ధ్యానం కలిగించే ప్రభావాన్ని అంచనా వేసేందుకు, అతన్ని ఎంచుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 12 సంవత్సరాల పాటు దఫదఫాలుగా ఆయనని పరిశీలించి చూశారు. మాథ్యూ మెదడుకి 256 సెన్సర్లు అమర్చి, ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన మెదడు ఎలా పనిచేస్తోందో గ్రహించే ప్రయత్నం చేశారు.   మాథ్యూ ధ్యానం చేస్తున్నప్పుడు, అతని మెదడులో ఏర్పడుతున్న తరంగాల స్థాయిని చూసి పరిశోధకులే ఆశ్చర్యపోయారు. ఆ స్థాయిలో ఇదివరకు ఎప్పుడూ తరంగాలు నమోదవలేదని తేల్చారు. ఎంతో ప్రశాంతంగా ఉంటే తప్ప మెదడులో అలాంటి చర్య సాధ్యం కాదని గ్రహించారు.   ఈ పరిశోధన బయటకు రావడంతో మీడియా అంతా ఆయనని "happiest person in the world" అంటూ ఆకాశానికి ఎత్తేసింది. కానీ తనకు అలాంటి బిరుదులేవీ వద్దని, తనని మించిన ఆధ్యాత్మికవేత్తలు ఎందరో ఉన్నారని మాథ్యూ చెబుతూ ఉంటారు.   ఇంతకీ మాథ్యూ మనసు ఇంత సంతోషంగా ఉండటానికి కారణం ఏమిటి అని అడిగితే... ఆయన చెప్పే సమాధానాలు వినండి. బహుశా అవి మనకు కూడా ఉపయోగపడతాయేమో!   - ఎప్పుడూ ‘నేను, నేను, నేను’ అంటూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటే ప్రపంచం మొత్తం నీకు శత్రువులాగానే కనిపిస్తుంది. దాంతో మనశ్శాంతి కరువవుతుంది. జాలి, కరుణ, పరోపకారం లాంటి భావనలు చోటు చేసుకున్నప్పుడు మనసు, శరీరం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. - ఎంతసేపూ సుఖాన్ని అందించే అనుభవాల కోసం వెంపర్లాడుతూ ఉంటే... సంతోషం ఎప్పటికీ దక్కదు. అలాంటి వెంపర్లాటతో అలసట తప్ప మేరమీ మిగలదు.   - సంతోషం ఒక మానసిక స్థితి. జీవితంలోని ఒడిదొడుకులను ఎదుర్కొనేందుకు కావల్సిన శక్తిని అది అందిస్తుంది. - సహనం చాలా ముఖ్యం. ఓర్పు ఫలం ఎప్పుడూ తియ్యగా ఉంటుంది. ఓర్పుతో ఉన్నప్పుడు, అద్భతమైన వ్యక్తిత్వం ఏర్పడేందుకు అవసరమయ్యే సుగుణాలన్నీ మనలో ఏర్పడతాయి.   - జీవితం నిరాశాజనకంగా ఉందని ఎప్పుడూ డీలా పడిపోవద్దు. అలాంటి సమయంలో కాస్త ఓర్పుగా ఉంటే అనుకోని మార్పులు సంభవిస్తాయి. - రోజుకి కనీసం 10-15 నిమిషాల పాటు మనసుని సంతోషకరమైన ఆలోచనలతో నిలిపి ఉంచే ప్రయత్నం చేస్తే జీవితమే మారిపోవడాన్ని గమనించవచ్చు.   - జీవితంలో ఎలాగైతే కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటూ మన మెదడుకి శిక్షణ ఇస్తూ ఉంటామో... అలాగే జాలి, పరోపకారం, కరుణ లాంటి మంచి లక్షణాలను కూడా మెదడుకి అలవాటు చేయడం సాధ్యమే!   - ఒకేసారి గంటల తరబడి ధ్యానంలో మునిగిపోవాల్సిన అవసరం లేదు. క్రమం తప్పకుండా కొద్ది నిమిషాల సేపైనా చేసే ధ్యానం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది. క్రమం తప్పకుండా నడిచేవాడు ఒలింపిక్స్‌కి వెళ్లి పతకం సాధించలేకపోవచ్చు.... కానీ అలసట లేకుండా సుదీర్ఘ ప్రయాణం చేసే నైపుణ్యాన్ని సాధిస్తాడు కదా! - నిర్జర.

HOW TO GET RID OF GUILT

As humans, we are bound to make mistakes. And those mistakes would certainly cling to our consciousness. Guilt is a baggage which keeps reminding us of our mistake. To some extent, guilt can bear positive consequences. But most of the times, it can be a constant pain which doesn’t let us live in peace. These are some of the ways to get rid of unnecessary guilt... Forgive yourself Guilt is an act where we punish ourselves constantly. So let’s accept that we are bound to make mistake and let’s accept that there is no good in carrying the mistake forward forever. Let’s forgive ourselves and free ourselves from guilt. Make amendments We may not live our life again to unwind the mistake. But we might try to compensate our mistake. A sorry might save a shattered relation, an explanation might heal someone’s ego.... so let’s recognise the reason for guilt and take a chance for makeup. Turn it into a possibility We have made some horrible mistake and that mistake might have changed the course of our life. Why not take it as an opportunity to build a new way to lead our life. Why not take it as a chance to review our personality. Create a List It might look funny.... but try to list out various situations of guilt that keeps lingering in your mind. Such a focus would enable you to evaluate and dissolve trifle reasons forever. Accept It is never possible to attain perfection. In the course of living our lives... we tend to make mistakes and keep learning from them. Our live mostly runs in a trial and error basis. Moreover, guilt belongs to a past situation where we might not have enough maturity to deal with the situation. Get stronger The more we get matured, the more we attain inner strength... we start taking control over our lives. And that’s certainly a situation where memories of unnecessary guilt get dissolved. Share with someone else We often feel ashamed of our guilt and try to bury deep in our heart. But sharing our moments of guilt with someone close to use could ease the burden of guilt on our mind. We might even get solace or suggestion from those with whom we have shared our guilt.   - Nirjara.

ఈ ప్రశ్నకి బదులేది!

  అది ఒక మహా సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి మంత్రిగా ఉన్న వ్యక్తి వయసు పైబడుతోంది. దాంతో తన తర్వాత వారసుడిగా ఉండేందుకు ఎవరు తగినవారా అని నిర్ణయించాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో ఉండగా ఓ రోజు ఎక్కడి నుంచో ఒక యువకుడు రాజాస్థానానికి వచ్చాడు. పేరు గాంచిన విశ్వవిద్యాలయాలలోనూ, ప్రసిద్ధి చెందిన గురువుల దగ్గరా  ఆ యువకుడు సకల శాస్త్రాలూ నేర్చుకున్నాడు. మహామేధావిగా పేరుగాంచాడు. అలాంటి యువకుడి ప్రతిభను విన్న రాజుగారు అతనే రాజ్యానికి కాబోయే మంత్రి అని నిర్ణయించేశారు.   రాజుగారి నిర్ణయం విన్న మంత్రి మాత్రం కాస్త డీలా పడ్డాడు. ‘రాజా! మంత్రి పదవి కేవలం పుస్తకజ్ఞానంతోనూ, పైపై మెరుగులుతోనూ, జ్ఞాపకశక్తితోనూ సాగించేది కాదు. ఇంతటి రాజ్యాన్ని నిత్యం ఏదో ఒక క్లిష్ట సమస్య వేధిస్తూనే ఉంటుంది. కాబట్టి నిజజీవితంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించే తర్కమే మంత్రికి ఉండాల్సిన తొలి లక్షణం. ఆ తర్కం ఇతనిలో ఉందో లేదో నేను పరీక్షించదల్చుకున్నాను. అప్పటివరకూ మీ నిర్ణయాన్ని వాయిదా వేయండి,’ అంటూ ప్రాధేయపడ్డాడు.   యువకుడు ఎలాంటి తర్కానికైనా సమాధానం చెప్పగలడని రాజుగారి నమ్మకం. అందుకే వెనువెంటనే ఆ యువకుడిని ఆస్థానానికి పిలిపించారు. ‘నేను నీకో ప్రశ్న వేస్తాను. ప్రశ్న చాలా చిన్నదే కానీ జవాబు మాత్రం ఆలోచించి చెప్పాలి సుమా! అంతేకాదు! ఒకటే ప్రశ్నని మూడుసార్లు వేస్తాను. మూడుసార్లూ నువ్వు జవాబు చెప్పలేని పక్షంలో బుద్ధిని మరింతగా పదునుపెట్టేందుకు మరి కొద్ది సంవత్సరాలు గడపాల్సి ఉంటుంది,’ అని చెప్పారు మంత్రిగారు.   ‘ఓస్ అదెంతటి పరీక్ష. మహామహా తర్కాలనే తట్టుకుని నిలబడ్డాను. మీ ప్రశ్న నాకు కేవలమాత్రం,’ అని దర్పంగా వదరాడు యువకుడు.   ‘మంచిది. అయితే నా ప్రశ్నని విను. ఇద్దరు వ్యక్తులు ఒక ఇంటి పొగగొట్టంలోంచి కిందకి దిగారు. వారిలో ఒకరి ముఖానికి మసి అంటింది. వేరొకరి ముఖం శుభ్రంగానే ఉంది. ఇద్దరిలో ఎవరు మొహం కడుక్కుంటారు?’ అని అడిగాడు.   ‘ఛీ ఇదీ ఓ ప్రశ్నేనా! మసి అంటుకున్న వ్యక్తి ముఖం కడుక్కుంటాడు,’ అని బదులిచ్చాడు యువకుడు.   ‘తప్పు! శుభ్రంగా ఉన్న మనిషిని చూసి మసి అంటుకున్న వ్యక్తి తాను కూడా శుభ్రంగా ఉన్నానని అనుకుంటాడు. కానీ మసి అంటుకున్న మనిషిని చూసి, శుభ్రంగా ఉన్న మనిషి తనకి కూడా మసి అంటుకుందేమో అనుకుని మొహం కడుక్కుంటాడు. ఇప్పుడు మళ్లీ చెప్పు! ఇద్దరిలో ఎవరు మొహం కడుక్కుంటాడు,’ అని అడిగాడు మంత్రి.   ‘మీరే చెప్పారుగా. శుభ్రంగా ఉన్న మనిషి మొహం కడుక్కుంటారని,’ అని చిరాకుపడ్డాడు యువకుడు.   ‘కాకపోవచ్చు. ఇద్దరూ మొహం కడుక్కోవచ్చు. ఇందాక చెప్పాను కదా! శుభ్రంగా ఉన్న మనిషి మురికిగా ఉన్న వ్యక్తిని చూసి తనకి కూడా మసి అంటుకుందని భావిస్తాడనీ.. ఆ భ్రమలో తన మొహం కూడా కడుక్కుంటాడనీ. అవతలి వ్యక్తి చేష్టని చూసి మసి అంటుకున్న వ్యక్తి తనలో ఏదో లోపం ఉందని గుర్తించే అవకాశం ఉంది. దాంతో అతను కూడా మొహం కడుక్కుంటాడు. ఇప్పుడు మరోసారి ఇదే ప్రశ్నకి జవాబు చెప్పు,’ అని అడిగాడు మంత్రి.   రెండోసారి కూడా తన జవాబు తేలిపోయేసరికి యువకుడి అహం దెబ్బతిన్నది. రోషం పొడుచుకువచ్చింది. ‘మీరే చెప్పారు కదా! ఇద్దరూ మొహం కడుక్కుంటారని. ఇంతకు మించి మరో జవాబు నాకు కనిపించడం లేదు,’ అని చిరాకుపడ్డాడు.   ‘తప్పు! దీనికి మరో జవాబు కూడా ఉంది. ఇద్దరూ మొహం కడుక్కోకుండా ఉండిపోవచ్చు. మసి అంటుకున్న వ్యక్తి శుభ్రంగా ఉన్న వ్యక్తిని చూసి, తను కూడా శుభ్రంగా ఉన్నానని అనుకుని ఊరుకుంటాడు. మసి అంటుకున్న వ్యక్తి ప్రతిస్పందనని బట్టి తన మొహం శుభ్రంగా ఉందేమో అని గ్రహించి అవతలి వ్యక్తి కూడా ఊరుకుండిపోతాడు. ఇప్పుడు ఇదే ప్రశ్నని మరోసారి అడుగుతున్నాను. కనీసం ఈసారన్నా కొత్తగా జవాబు చెప్పేందుకు ప్రయత్నించు,’ అన్నాడు మంత్రి.   ‘ఏడ్చినట్లు ఉంది. మూడు జవాబులకి మించి ఇంకే ఆస్కారం ఉంటుంది. ఈసారి కూడా మీరు మరో జవాబు చెబితే నేను మళ్లీ ఈ ఆస్థానంలోకి రాను. నాకు తెలిసిన విద్య అంతా పుస్తకజ్ఞానమే అని ఒప్పుకొని నిజమైన జ్ఞానం కోసం, ఆ జ్ఞానాన్ని అందించే అనుభవాల కోసం దేశాటనకు వెళ్లిపోతాను,’ అన్నడు కుర్రవాడు.   ‘బాబూ! నీ దగ్గరకు ఎవరన్నా ఏదన్నా సమస్యతో వచ్చారే అనుకో! అసలు ముందు ఆ సమస్య సంభవించే అవకాశం ఉందో లేదో కూడా తెలుసుకోవాలి కదా! అసలు ఒక చిన్న పొగగొట్టంలోంచి ఇద్దరు వ్యక్తులు కిందకి రావడం ఎలా సాధ్యం. అందులో ఒకరికి మసి అంటుకుని మరొకరికి అంటుకోకపోవడం ఎలా కుదురుతుంది. ఇంతా జరిగిందే అనుకో! పొగగొట్టంలోంచి కలిసి దిగిన ఇద్దరు వ్యక్తులు అద్దం చూసుకోకుండా ఉంటారా? ఒకవేళ అక్కడ అద్దం లేకపోయినా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉంటారా? కాబట్టి నా ప్రశ్నలోనే లోపం ఉందని నువ్వెందుకు చెప్పలేకపోయావు. విషయం లేకుండా వాదన ఎలా సాధ్యమవుతుంది?’ అంటూ కుర్రవాడని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు మంత్రి.   ఆ ప్రశ్నలకి బదులివ్వలేక కుర్రవాడు రాజుగారి ముందు నుంచి నిష్క్రమించాడు. మంత్రిపదవి కోసం మళ్లీ వెతుకులాట మొదలైంది.   (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర

Dokkodo – A way of life

Over decades and centuries, many great people have interpreted life in many great ways. Such ways have withstood the testing times like gleaming beacons and infused hope in hearts with despair. Miyamoto Musashi was one such personality who tried to summarize his enlightment in just 21 sentences. Miyamoto Musashi was a great Samurai warrior who lived in Japan during 17th century. Musahi was a celebrated warrior, teacher and writer. He is believed to have won 60 duels- a record which stands unbroken. Musahi has written a book named ‘The book of five rings’ which deals with strategies to be followed to achieve victory. Though Musashi was a successful warrior, his body couldn’t withstand the deadly test of cancer. As Musashi got aware that his death was certain... he gave away his possessions and went into solitude. There, a week before his death, he wrote ‘Dokkodo’ (The Way of Walking Alone). Dokkodo consists of 21 instructions based upon his interpreatin of life. These instructions has been a source of inspiration of millions of people for hundreds of years. Here are those instructions... - Accept everything just the way it is. - Do not seek pleasure for its own sake. - Do Not, Under Any Circumstances, Depend On A Partial Feeling. - Think lightly of yourself and deeply of the world. - Be detached from desire your whole life. - Do not regret what you have done. - Never be jealous. - Never let yourself be saddened by a separation. - Resentment & complaint are appropriate neither for oneself nor others. - Do not let yourself be guided by the feeling of lust or love. - In All Things Have No Preferences. - Be indifferent to where you live. - Do not pursue the taste of good food. - Do not hold on to possessions you no longer need. - Do not act following customary beliefs. - Do not collect weapons or practice weapons beyond what is useful. - Do not fear death. - Do not seek to possess either goods or fiefs for your old age. - Respect Buddha and the gods without counting on their help. - You may abandon your own body but you must preserve your honor. - Never stray from the Way. - Nirjara.  

Sean Stephenson – ఇతను మూడడుగుల బుల్లెట్

  మే 5, 1979. ఆ పిల్లవాడు పుడుతూనే అతని ఎముకలన్నీ విరిగిపోయాయి. అతనికి Osteogenesis imperfect అనే అరుదైన వ్యాధి ఉందనీ... అతను బహుశా మరో 24 గంటలు మించి బతకడనీ తేల్చేశారు వైద్యులు. పదిహేను వేల మందిలో ఒక్కరికే వచ్చే ఆ మాయదారి జబ్బుతో ఒకవేళ పిల్లవాడు బతికినా, అతని జీవితం వృధా అని హెచ్చరించారు. ఆ పిల్లవాడి పేరే sean Stephenson.   Osteogenesis వ్యాధి వచ్చినవారి ఎముకలు మహా బలహీనంగా మారిపోతాయి. అవి ఎక్కడికక్కడ వంగిపోయి, విరిగిపోతాయి. దానికి తోడు ఆ వ్యాధి ఉన్నవారు పెద్దగా ఎత్తు ఎదగరు. వారి కీళ్లన్నీ సడలిపోయి ఉంటాయి. ఊపిరితిత్తులు, వినికిడి సమస్యలు కూడా ఏర్పడతాయి. పళ్లు త్వరగా ఊడిపోతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ వ్యాధి ఉన్నవారు బతికినా కూడా చక్రాల కుర్చీకి అంకితమైపోయి జీవచ్ఛవంలా ఉండాల్సిందే. కానీ sean Stephenson జీవచ్ఛవంలా బతుకుతూనే ఇతరుల జీవితాల్లో వెలుగు నింపుతున్నాడు.   ‘మన జీవితం వృధా అని చెప్పే హెచ్చరికని ఎప్పుడూ నమ్మకూడదు. నేను అలా నమ్మలేదు కాబట్టే... ఆనాడు నేను చనిపోతానని చెప్పిన డాక్టర్లంతా చనిపోయారేమో కానీ, నేను మాత్రం ఇంకా బతికే ఉన్నాను,’ అంటాడు సీన్. తనలోని ఆత్మవిశ్వాసమే అండగా బతకడమే కాదు... నలుగురికీ దారి చూపించే వ్యక్తిత్వ వికాస రంగాన్ని ఎంచుకున్నాడు. అందుకోసం అవసరమైన కోర్సులన్నీ చేశాడు. హిప్నోధెరపీలో డాక్టరేటుని కూడా అందుకున్నాడు.   సీన్కి వచ్చిన వ్యాధి వల్ల అతని జీవితం నిజంగా నరకప్రాయంగానే ఉండేది. ఎముకలు విరిగిపోకుండా అతనిలోకి ఇనుపరాడ్లను చొప్పించారు. పళ్లన్నీ విరిగిపోయాయి. తనంతట తానుగా స్నానం కూడా చేయలేడు. కానీ శరీరానికి వచ్చిన వైకల్యంకంటే పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోవడమే నిజమైన వైకల్యం అంటాడు సీన్. అలా సీన్ ఉపన్యాసాల ద్వారా, అతని పుస్తకాల ద్వారా లక్షలాదిమంది జీవితం మీద కొత్త ఆశలను ఏర్పరుచుకున్నారు. అతని ప్రతిభని గుర్తించి బయోగ్రఫీ ఛానల్ Three Foot Giant  ఒక డాక్యుమెంటరీనే రూపొందించింది.   సీన్ పరిస్థితి చూసి చాలామంది తెగ జాలిపడిపోతూ ఉంటారు. కానీ అవతలివారిని చూసి కానీ, తనని తాను చూసుకుని కానీ జాలిపడటం అంత పనికిమాలిన విషయం మరొకటి లేదన్నది సీన్ నమ్మకం. ‘నేను పనికిమాలినవాడిని, ఏమీ చేయలేను, ఏదీ సాధించలేను,’ అని తనని తాను వేధించుకోవడం నేరమన్నది అతని వాదన.   సీన్ అందమైన వ్యక్తిత్వాన్ని చూసి Mindie Kniss అనే అందగత్తు తన మనసు పారేసుకుంది. 2012లో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. సీన్తో తన జీవితం చాలా అద్భుతంగా గడిచిపోతోందని మిండెల్ తరచూ చెబుతుంటుంది. సీన్ వ్యక్తిత్వం నానాటికీ బలపడుతూ ఉండవచ్చు. కానీ అతనిలో దాగిన వ్యాధి మాత్రం ఎప్పటికప్పుడు తన పంజా విసురుతూనే ఉంది. ఆ వ్యాధి కారణంగానే గత ఏడాది సీన్ తన మాట కూడా పోగొట్టుకున్నాడు. అయినా తన రాతల ద్వారా ఇతరులలో జీవితం పట్ల కసిని రగిలిస్తూనే ఉన్నాడు. తన మాట పోయిన తర్వాత 2 Minutes with Sean పేరుతో తన ఫేస్బుక్లో అతను చేసిన పోస్టే ఇందుకు ఉదాహరణ. ‘మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి’ అన్న సందేశంతో ఇచ్చిన ఈ పోస్టుని దాదాపు ఏడుకోట్ల మంది చూశారు.   ఇంతకీ సీన్కి తన మీద ఇంత నమ్మకం ఎలా సాధ్యం? అన్న అనుమానం రాకమానదు. ఆ ప్రశ్నకి కూడా సీన్ దగ్గర సమాధానం ఉంది. ‘ఈ లోకంలో అన్నిటికంటే పెద్ద జైలు మన మెదడే! ఆ మెదడుకి కనుక స్వేచ్ఛని అందించగలిగితే... లెక్కలేనన్ని దారులు కనిపిస్తాయి’ అంటారు. నిజమే కదా! - నిర్జర.    

HOW TO AVOID A PINK SLIP

  Time can be uncertain... and so can be our Job. Sometimes, we may have to pass through a recession and sometimes we may have to face a harsh employer. Every such momentum can pose a threat to our Job. No matter how efficient we might be, some tips are ought to be kept in mind if we wish to secure our job forever. Let them know your work You might work hard and you might achieve innumerable tasks. But it’s important that your employer is aware of our achievement and dedication. Talk to him or send him a mail. But make sure that he knows about your work and methodology. Be Dependable Every employee might seem to be a part of the firm. But when it comes to reducing the staff... most of them might not pass the test. So, place yourselves in such a way that the firm has to think umpteenth time before laying you off. Ask for a Feedback Work to your maximum capability. But never be satisfied with the quality of your work. Ask your officials and mentors about your work and heed their advice. Always be ready to a change that could fortify your capability. Co- workers Maintaining healthy relation with co-workers is a key trait for a good employee. Managers often consider the good will of an employee before deciding his fate. Be passionate Passionate people are rare species. So employers would never dare to get rid of such people. As we have to spend most of our time and energy on the job, it could be a better option to add some love and passion to it. That would ultimately make our job endearing to us and make us adorable to our boss! Know the need Be sure of the goals and objectives of the firm. And try to align your work with such goals. Working 24/7 without any aim could be futile forever. Handle the pressure Being cool at tough times is indeed a challenge. Achieving such trait could bring a difference in your job. And moreover no employer would dare to get rid of a person with endurance. Discipline Firms might not pressure much on punctuality during profits. But when things seem to soar up, punctuality could be a yardstick to measure your character. So, it’s always better to stick to the good old basic rules of punctuality. Above all! When you have been a good employee at all standards, and if the firm is thinking of ousting you... it’s better to search for a new job before the firm offers its pink slip. - Nirjara.

మిస్టరీ : కదిలే రాళ్లు

  కాలిఫోర్నియాలో ఉన్న ఓ ఎడారి పేరు మృత్యు లోయ. ఆ ప్రాంతాన్ని దాటే ప్రయత్నంలో కొందరు చనిపోవడంతో దానికా పేరు వచ్చింది. అక్కడ శాశ్వతంగా నివసించే ప్రజలు తక్కువే అయినా... అక్కడ ఉండే కొండలు, లోయలను చూసేందుకు ఏటా లక్షలాది మంది మృత్యులోయను చేరుకుంటారు. అలా మృత్యులోయకి చేరుకునేవారికి ఓ విచిత్రం కనిపిస్తూ ఉంటుంది. అవే sailing stones.   అంతా మాయ   మృత్యులోయలోని ప్లేయా అనే ప్రాంతంలోకి చేరుకోగానే ఒక ఎండిపోయిన సరస్సు కనిపిస్తుంది. దీని మీద వందలాది రాళ్లూ కనిపిస్తాయి. అసలు వింత అది కాదు. ఈ రాళ్లన్నీ కూడా ఎవరో పనిగట్టుకుని లాగినట్లుగా స్థానం మారుతూ ఉంటాయి. శీతకాలం వస్తే చాలు కొన్ని వందల అడుగుల దూరానికి నిదానంగా జరుగుతుంటాయి. అలా రాళ్లు జరిగాయి అన్నదానికి సాక్ష్యంగా నేల మీద గీతలు ఉంటాయి.   వందేళ్ల రహస్యం   మృత్యులోయలోని రాళ్లు కదులుతున్నట్లు దాదాపు వందేళ్ల క్రితమే గమనించారు. కానీ దానికి కారణం ఏమిటన్నది ఎవరికీ తట్టనేలేదు. దాంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. గ్రహాంతర వాసులే వీటిని కదిపి వెళ్తున్నారనీ, ఏదో అయస్కాంత శక్తి ఉండటం వల్లే ఇలా జరుగుతోందనీ, ఆకతాయిల పని అనీ... ప్రచారాలు జరిగాయి. దాంతో కదిలే రాళ్ల వెనక ఉన్న రహస్యాన్ని ఛేదించేందుకు శాస్త్రవేత్తలంతా రంగంలోకి దిగారు.   తేలనే లేదు   300 కిలోలకు పైగా బరువున్న రాళ్లు ఒక్క ఏడాదిలోనే 800 అడుగులకు పైగా జరగడం, పరిశోధకులని సైతం ఆశ్చర్యపరచింది. ఎంత గాలి వీచినా కూడా ఇది అసాధ్యమే కదా! పైగా ఒకో రాయి ఒకోతీరున కదలడం మరో విశేషం. మృత్యులోయలో తరచూ కనిపించే గాలి దుమారాల వల్లే ఈ రాళ్లు కదులుతున్నాయని కొందరు శాస్త్రవేత్తలు భావించారు. అప్పుడప్పుడూ ఈ సరస్సులోకి నీరు రావడం వల్ల రాళ్లు కదులుతున్నాయని మరికొందరు నిర్ధరించారు. కానీ ఈ ఊహలేవీ పరీక్షకి నిలబడలేదు. దాంతో కదిలే రాళ్ల మీద ఓ కన్ను వేసి ఉంచేందుకు సరస్సులో చిన్నపాటి వాతావరణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ రాళ్ల కదలికలని నిశితంగా గమనించేందుకు, వాటికి బెజ్జాలు చేసి అందులో జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) యంత్రాలను అమర్చారు.   ఇంట్లోనే తేలిపోయింది   విజ్ఞాన ప్రపంచాన్ని ఇంతగా వేధించిన ఈ ప్రశ్నకి ఓ శాస్త్రవేత్త తన ఇంట్లోనే జవాబు కనుక్కోవడం ఆశ్చర్యం. రాల్ప్ లోరెంజ్ అనే శాస్త్రవేత్త ఈ ఘనత సాధించారు. ఒక గిన్నెలో నీరు పోసిన లోరెంజ్ అందులో ఓ రాయిని ముంచి ఫ్రిజ్లో ఉంచారు. ఆ నీరు గడ్డకట్టిన తరువాత, రాయి ఉన్న మంచు గడ్డని ఇసుక మీద బోర్లించారు. మంచుగడ్డ కదిలినప్పుడు దాంతో పాటుగా రాయి కూడా కదలడాన్ని లోరెంజ్ గమనించారు.   రాళ్ల చుట్టూ మంచు పేరుకోవడం ద్వారా, అవి నీటి మీద కాస్త ముందుకు సాగుతున్నాయని తేలిపోయింది. అలా కదిలేటప్పుడు ఒకోసారి అవి పక్కకి ఒరగడం వల్ల గతి మారే అవకాశం ఉందని అర్థమైంది. ఏడాదిలో చాలావరకు ఎండిపోయి ఉండే ఈ సరస్సులో వర్షం పడటం, శీతకాలంలో నీటి ఉపరితలం గడ్డకట్టడం, అలా గడ్డకట్టిన మంచు పలకల మధ్య ఉన్న రాళ్లు ముందుకు కదలడం..... అంతా కూడా చాలా నిశ్శబ్దంగా జరిగిపోతుంది కాబట్టి, ఇంతకాలం ఎవరూ వాటిని ప్రత్యక్షంగా గమనించలేకపోయారు. దాంతో అదేదో గొప్ప రహస్యంగా భావించేవారు. కానీ ఇప్పుడు అసలు విషయం తేలిపోయింది కదా! అయినా ఇప్పటికీ చాలామంది ఈ కదిలే రాళ్ల వెనుక ఏదో మాయ ఉందనే నమ్ముతున్నారట. మరి మీరో!!! - నిర్జర.      

కళ్ల ముందు హత్య జరిగితే పట్టించుకోం. ఎందుకంటే!

1964 మార్చి 13: న్యూయార్కులో Catherine Genovese అనే 28 ఏళ్ల అమ్మాయి రోడ్డు దాటుకుని తన ఇంట్లోకి వెళ్లబోతోంది. ఇంతలో ఓ సీరియల్‌ కిల్లర్ ఆమె మీద దాడి చేశాడు. దారినపోయేవారు చూస్తుండగా Catherineని దారుణంగా హతమార్చాడు. తనని రక్షించమంటూ కేథరీన్‌ ఎంత అరిచినా, ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అక్కడ దాడి జరుగుతోందన్న విషయం పోలీసులకు చెప్పేందుకు కూడా ఎవరూ ప్రయత్నించలేదు. దీంతో Bystander Effect అనే తత్వం గురించి చర్చ మొదలైంది. ఏమిటీ ఎఫెక్ట్‌? అమెరికా పోలీసు శాఖ ప్రకారం 70 శాతం దాడులు నలుగురూ చూస్తుండగానే జరుగుతాయి. 52 శాతం దొంగతనాలు జరిగేటప్పుడు కూడా చుట్టుపక్కలవారు చూసీ చూడనట్లుగా సాగిపోతుంటారు. ఇలా తమ పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోకపోవడాన్ని Bystander Effect అంటారు. గొడవలోకి దిగితే తనకి ఏదన్నా జరుగుతుందనే సహజమైన భయం ఎలాగూ ఉంటుంది అంతకు మించిన కారణాలు కూడా ఉన్నాయంటున్నారు సైకాలజిస్టులు.   - నలుగురూ ఉండటం వల్ల... నేరాన్ని అడ్డుకునే బాధ్యత ఎవరో ఒకరు తీసుకుంటారులే అన్న నిర్లిప్తత ఏర్పడుతుంది. దీనిని Diffusion of responsibility అంటారు. - సంఘటనాస్థలంలో ఉన్నవారంతా ఏం చేయకపోవడంతో... అలా ఏం చేయకుండా ఉండటమే మంచిదేమో అన్న అపోహ ఏర్పడుతుంది. - హత్య, దాడిలాంటి సంఘటనలకి మనం సిద్ధంగా ఉండం. దాంతో అలాంటివి చూసినప్పుడు మెదడు అయోమయానికి లోనవుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతోందో, దానికి ఎలా ప్రతిస్పందించాలో తెలియని సందిగ్థంలో గుడ్లప్పగించి చూస్తుండిపోతాము. ఏం చేయాలి? Bystander Effect వినడానికి బాగానే ఉంది. కానీ మనం కూడా దానికి లొంగిపోతే ఎలా! అందుకని కళ్ల ముందు ఏదన్నా ఘోరం జరుగుతున్నప్పుడు ఈ Bystander Effectని అధిగమించేందుకు కొన్ని ఉపాయాలు కూడా సూచిస్తున్నారు. - అయోమయంగా చూస్తూ ఉండిపోకుండా... అక్కడేం జరుగుతుందో అంచనా వేసే ప్రయత్నం చేయాలి. - మీ వంతుగా అందులో పాలుపంచుకునే అవకాశం ఏమేరకు ఉందో ఆలోచించాలి. - దాడి చేస్తున్న వ్యక్తిని మాటల్లోకి దింపితే హింసకి పాల్పడే అవకాశం కూడా తగ్గుతుంది. - ఈ సందర్భంలో చుట్టూ మూగేవారిని కలిసికట్టుగా ఉసిగొల్పే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. - ఇదివరకు నేరం గురించి సమాచారం ఇచ్చేవారినీ, గాయపడిన వ్యక్తులని హాస్పిటల్‌కు తీసుకువెళ్లేవారినీ విచారణ పేరుతో తెగ వేధించేవారు. ఈ విచారణ భయంతోనే చాలామంది వెనకడుగు వేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు చట్టాలు మారాయి. సాయపడేవారికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి తర్వాత ఏం జరుగుతుందో అన్న భయం వదిలి ప్రమాదంలో ఉన్నవాడికి సాయపడే ప్రయత్నం చేయాలి. అన్నింటికీ మించి, అసలు ఈ Bystander Effect గురించి అవగాహన ఉంటే చాలు... మనం దానికి లొంగకుండా ఉంటామంటున్నారు సైకాలజిస్టులు.   - నిర్జర.

మీరూ స్పైడర్‌మేన్ కావచ్చు

స్పైడర్‌మేన్ పాత్రంటే ఎవరికైనా ఇష్టమే! ఆ స్పైడర్‌మేన్ ఇలా చేయిచాచగానే అతని చేతి నుంచి దారాలు రావడం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ దారాలను పట్టుకుని అతను ఎక్కడికైనా వెళ్లిపోవడం చూసి అసూయా కలుగుతుంది. మనం కూడా చేతికి ఓ యంత్రాన్ని తగిలించుకుని అలా దారాలు వదిలే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. సాలెపురుగు దారానికి ఉన్న ప్రత్యేకత గురించి కొత్తగా చెప్పుకోనవసరం లేదు. అంతే మందమున్న ఇనప తీగతో పోలిస్తే, సాలెదారం చాలా బలంగా ఉంటుంది. ఎటుపడితే అటు వంగుతుంది, సాగుతుంది కూడా! ఇన్ని బలాలు ఉన్నా పట్టులాగా మెత్తగా ఉండటం మరో విచిత్రం. సాలెపురుగు దారానికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి... దీనిని మనిషికి అనువుగా మార్చే ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. దాదాపు 50 ఏళ్ల క్రితమే సాలెపురుగు దారం మీద పరిశోధనలు మొదలయ్యాయి. ఆ పరిశోధనలు ఇప్పుడు కీలక దశ చేరుకున్నాయి.   పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు golden orb-weaver spider అనే సాలెపురుగులో ఉండే జన్యువులన్నింటినీ కనుక్కోగలిగారు. ఈ సాలెపురుగుని Genome mapping చేయడం ద్వారా వీరు దాని 14000 జన్యువులనీ గుర్తించారు. వీటిలో 400 జన్యువుల గురించి ఇప్పటివరకూ ప్రపంచానికి తెలియనే తెలియదు. అంతేకాదు! సాలెపురుగు దారాన్ని అల్లేందుకు అవసరమయ్యే 28 రకాల ప్రొటీన్లని కూడా వీరు కనుగొన్నారు. వీటిని spidroins అంటారు.   ఈ పరిశోధనలో-  సాలెపురుగు ఒకో సందర్భంలో ఒకో తరహా దారాన్ని వాడుతోందని కూడా తెలిసింది. ఉదాహరణకు సాలెగూడుని అల్లేందుకు ఒక తరహా దారాన్ని వాడితే, సాలెగూడులో చిక్కుకున్న ఆహారాన్ని చుట్టేందుకు మరో తరహా దారాన్ని వాడుతోందట! ఇలా ఒకటే సాలెపురుగు ఏడు సందర్భాల కోసం ఏడు రకాల దారాన్ని వాడుతున్నట్లు గ్రహించారు. సాలెపురుగు దారం రహస్యమంతా ఇప్పుడు శాస్త్రవేత్తల గుప్పిట్లోకి వచ్చేసింది. కాబ్టటి ఇక కృత్రిమంగా సాలెపురుగు దారాన్ని తయారుచేయడమే తరువాయి! పరిశ్రమల్లోనూ, దుస్తుల్లోనూ, భవన నిర్మాణాలలోనూ... ఇలా రోజువారీ జీవితంలో వేల సందర్భాలలో ఈ దారాన్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు! సాలెపురుగు దారానికి సూక్ష్మక్రిములను ఎదుర్కొనే సత్తా ఉంటుంది. కాబ్టటి గాయాలకు కుట్లు వేసేటప్పుడు, ఎముకలు విరిగినప్పుడు నిరభ్యంతరంగా ఈ దారాన్ని చికిత్సలో వాడవచ్చు.   సాలెపురుగు దారాన్ని కనుక కృత్రిమంగా ఉత్పత్తి చేయడం మొదలుపెడితే... ఓ చిన్న యంత్రాన్ని చేతికి బిగించుకుని మనం కూడా స్పైడర్‌మేన్‌గా మారిపోవచ్చునంటున్నారు.   - నిర్జర.

మిస్టరీ - ఈ ఊళ్లో అందరూ కవలలే!

మనకి పరిచయం ఉన్నవారిలో ఎంతమంది కవల పిల్లలు ఉండి ఉంటారు? మహా అయితే ఓ నలుగురో, ఐదుగురో ఉంటారు. కానీ ఆ ఊరిలోకి అడుగుపెడితే వీధికో కవల జంట కనిపిస్తుంది. శాస్త్రవేత్తలకి కూడా సవాలు విసురుతున్న ఆ ఊరి పేరు ‘కొడింహి’. కేరళలోని మలప్పురం జిల్లాలోని ఈ మారుమూల ప్రాంతం, తన ప్రత్యేకత కారణంగా ప్రపంచంలోని పరిశోధకులందరినీ ఆకర్షిస్తోంది.   మిగతా ప్రపంచంతో పోలిస్తే మన దేశంలో కవల పిల్లలు పుట్టడం తక్కువే! ప్రతి వెయ్యి మంది పిల్లలలో మహా అయితే ఓ ఇరవై మంది, కవల పిల్లలు ఉంటారు. కానీ కొడింహి పట్నంలో మాత్రం దాదాపు పది శాతం పిల్లలు కవలలే కనిపిస్తున్నారు. ఆ ఊళ్లో మొత్తం జనాభా ఇరవైవేల మంది ఉంటే అందులో 500 మంది కవల పిల్లలే! ఇలా కొడింహిలో పుట్టిన కవలలందరూ కలిసి ఏకంగా ఓ ‘కవలల సంఘాన్నే’ ఏర్పాటుచేసుకున్నారు.   ‘కొడింహి’లో దాదాపు ఓ 70 ఏళ్ల నుంచి ఇలా కవలపిల్లలు పుట్టడం మొదలైందట. అది రోజురోజుకీ పెరిగిపోతోందనీ... కొన్నాళ్లు పోతే ప్రతి కాన్పులోనూ కవల పిల్లలే పుట్టే పరిస్థితి వచ్చేస్తుందని అంటున్నారు. ఇంతాచేసి మహామహా శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ కవలపిల్లల తాకిడి వెనక ఉన్న రహస్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కొడింహిలో ఉండే నీరు తాగడం వల్ల ఇలా కవల పిల్లలు పుడుతున్నారేమో అని కొందరు, ఇక్కడి ఆహారంలో ఉండే కొన్ని ప్రొటీన్ల వల్లే ఇలా కవలలు పుడుతున్నారని మరికొందరు ఊహిస్తున్నారు. కానీ ఏ కారణాన్నీ ఇప్పటివరకూ శాస్త్రీయంగా రుజువుచేయలేకపోయారు. కొడింహిలో ఉండే ఈ విచిత్రమైన లక్షణాన్ని తప్పించుకునేందుకు కొందరు చాలా దూర సంబంధాలను చేసుకున్నారు. కానీ కొడింహిలో పుట్టి పెరిగినవారు, ఎంత దూరం వెళ్లినా.... అక్కడ కూడా వారికి కవలపిల్లలు పుట్టడం విచిత్రం.   ఈమధ్యనే జర్మనీ, ఇంగ్లండ్‌కు చెందిన పరిశోధకులు కూడా ఈ ఊరికి వచ్చారు. ఇక్కడి కవల పిల్లల DNAను సేకరించారు. ఆ DNAని విశ్లేషించాకైనా కవలపిల్లల రహస్యం తెలుస్తుందని ఆశిస్తున్నారు. అప్పటిదాకా కొడింహి ఓ మిస్టరీనే!   - నిర్జర.

టెన్షన్ పడుతున్నారా? మంచిదే!

  ఇప్పటి యువతది అంతా ప్రాక్టికల్‌ మార్గం. టెన్షన్‌ పడటం వల్ల పని జరుగుతుందా? టెన్షన్‌ పడితే మూడ్‌ పాడవటం వల్ల ఉపయోగం ఉందా? అందుకే టెన్షన్ పడకుండా కూల్‌గా ఉండాలన్నది చాలామంది దృక్పథం. వ్యక్తిత్వ వికాస నిపుణులు, పుస్తకాలు ఇదే మాటని పదే పదే చెబుతూ ఉంటాయి. టెన్షన్‌ పడేవాడు జీవితంలో పైకి ఎదగలేడు అని నూరిపోస్తుంటాయి. కానీ టెన్షన్‌ వల్ల ఉపయోగం ఉందంటున్నారు నిపుణులు.   ఆరోగ్యం బాగుంటుంది   ఈ విషయం చెప్పుకొనేందుకు ఆడవారినే ఉదాహరణగా తీసుకుందాం. ఒక వయసు దాటిన ఆడవారు బ్రెస్ట్ కేన్సర్‌కి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతూ ఉంటారు.  ఏ విషయానికీ పెద్దగా టెన్షన్ పడనివారు, ఈ సలహాని కూడా పట్టించుకోరు. దాంతో ఒకోసారి పరిస్థితులు చేజారిపోయే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం గురించి కంగారు పడేవారు మాత్రం ఠంచనుగా సమయానికి తగిన పరీక్షలు చేయించుకుంటారు. ఇలా ఆరోగ్యసూత్రాలు ఠంచనుగా పాటించేలా ప్రోత్సహించే టెన్షన్ మంచిదేగా!   సిద్ధంగా ఉంటారు   టెన్షన పడేవారు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆలోచనలో ఉంటారు. తాము భయపడినట్లు జరిగితే ఏం చేయాలి అన్న ఉపాయం కూడా వారిదగ్గర సిద్ధంగా ఉంటుంది. కాబట్టి నిజంగానే ఏదన్నా అనుకోని ఆపద జరిగినప్పుడు ఠక్కున రంగంలోకి దూకేస్తారు. తమ ఉపాయాన్ని అమలుచేస్తారు. టెన్షన్ లేకుండా నిర్లప్తంగా ఉండేవారిలో ఇంతటి సంసిద్ధత ఉండకపోవచ్చునంటున్నారు.   సంతోషం రెట్టింపు   టెన్షన్‌తో ఉండేవారిలో సానుకూల దృక్పథం తక్కువగా ఉంటుంది. తాము తలపెట్టిన కార్యం పూర్తవుతుందో లేదో, పరిస్థితులు తమకి అనుకూలంగా ఉంటాయో లేదో అన్న అనుమానంలో ఉంటారు. అలాంటి సమయంలో విజయం వరించిందనుకోండి... ఇక వారి సంతోషానికి అవధులు ఉండవు. జీవితంలో టెన్షన్ పడనివారేమో- ‘ఆ జరగక చస్తుందా! జరిగితే మాత్రం అంత సంతోషించాల్సిన పని ఏముంది,’ అన్న స్తబ్దతలో ఉండిపోతారు.   నిబంధనలు పాటిస్తారు   టెన్షన్ పడేవారు ఎందుకొచ్చిన తంటా అనుకుంటూ అన్ని నిబంధనలూ ఖచ్చితంగా పాటిస్తారు. ఇవి వారికీ, సమాజానికీ కూడా మేలు చేయవచ్చు. ఉదాహరణకు సీట్‌ బెల్టు పెట్టుకోవడం, ఇన్‌ష్యూరెన్స్ పాలసీలు తీసుకోవడం, పన్నులు కట్టడం... లాంటి పనులన్నమాట!   అన్నింటా ముందుంటారు   టెన్షన్ పడేవారిలో తాము ఎక్కడ వెనకబడిపోతామో అన్న భయం ఉంటుంది, తమకి తెలియని విషయం ఏదన్నా ఉందేమో అన్న అనుమానం ఉంటుంది. అందుకే చదువులోనూ, ఉద్యోగంలోనూ... తలపెట్టే ప్రతి పనిలోనూ పరిపూర్ణతని సాధించే ప్రయత్నం చేస్తారు. అలా అన్నింటా ముందుంటారు.   ఇదంతా చదివాక లేనిపోని టెన్షన్‌ని అలవాటు చేసుకోమని ఎవ్వరూ చెప్పడం లేదు. కాకపోతే కాస్త టెన్షన్ ఉండటం సహజమే అనీ... అది అదుపులో ఉన్నంతవరకూ మంచిదేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. - నిర్జర.