ఫ్యాన్సీ ఫోన్ నంబర్ కావాలా? వెరీ సింపుల్!
posted on Aug 3, 2024 @ 12:27PM
మీకు ఫ్యాన్సీ మొబైల్ నంబర్ కావాలని వుందా? అయితే వెరీ సింపుల్. బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్యాన్సీ నంబర్లను చాలా సులభమైన పద్ధతిలో అందిస్తోంది. బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ సంస్థ కాబట్టి సర్వీసు అంత బాగోదని అపోహపడకండి. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ కూడా ప్రైవేట్ సెల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లతో పోటీ పడుతోంది. సరే, ఇంతకీ బీఎస్ఎన్ఎల్ మొబైల్ ఫ్యాన్సీ నంబర్ ఎలా తీసుకోవాలంటే.....
1. సెర్చ్ ఇంజన్లోకి వెళ్ళి 'BSNL choose your mobile number' అని సెర్చ్ చేయాలి.
2. ఇక్కడ కనిపించే వెబ్‌పేసెజ్‌లో 'cymn' మీద క్లిక్ చేసి మీ జోన్‌ని, రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి.
3. ఇప్పుడు కనిపించిన రకరకాల ఆప్షన్ల ద్వారా మీకు నచ్చిన నంబర్ని ఎంపిక చేసుకోవాలి. 'Reserve Number' ట్యాబ్ మీద క్లిక్ చేసి, మీ ప్రస్తుత ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే మీరు ఎంపిక చేసుకున్న నంబర్ మీకు రిజర్వ్ అవుతుంది. ఈ తతంగం అంతా పూర్తయిన వెంటనే దగ్గర్లోని బీఎస్ఎన్ఎల్ కేంద్రానికి వెళ్తే, అక్కడ నిర్ణీత రుసుము తీసుకుని సిమ్ కార్డు ఇస్తారు.. అంతే.. సింపుల్!