Another Nirbhaya case in Hyderabad... A young woman was forced to drink alcohol and gang-raped

హైదరాబాద్ లో మరో నిర్భయ కేసు... యువతికి బలవంతంగా మద్యం తాగించి గ్యాంగ్ రేప్  

మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం ప్రవేశపెట్టింది. నిర్భయ అంటే నేటి సమాజంలో ప్రతి ఒక్కరి మదిలో మెదులుతూ మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తున్న చట్టం. గతంలో ఎన్నడూ లేనంతగా మహిళలకు భద్రత కల్పిస్తున్న ఏకైక చట్టం. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్భయ కేసు నమోదైంది.  భర్త వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బలవంతంగా మద్యం తాగించి దారుణానికి తెగబడ్డారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని అల్వాల్ లో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. యాప్రాల్‌కు చెందిన 29 ఏళ్ల మహిళ భర్త వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి అల్వాల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఇందుకోసం ఆమె ఉబెర్ ఆటోను బుక్ చేసుకుంది. అయితే, బాధితురాలిపై కన్నేసిన ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్ దగ్గరే కాపుకాశాడు. స్టేషన్ నుంచి ఆమె బయటకురాగానే యాప్రాల్ లో దింపేస్తానని ఆటో ఎక్కించుకున్నాడు. ఆపై సానుభూతి మాటలు చెబుతూ ఓ వైన్ షాప్ దగ్గర ఇద్దరు వ్యక్తులను ఎక్కించుకున్నాడు. వారిద్దరూ మద్యం తాగుతూ బలవంతంగా బాధితురాలికీ తాగించారు. ఆపై ఆటోను వెంకట్రావ్ లేన్ లోని నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఓ కారులోకి ఎక్కించారు. తర్వాత ఆటో డ్రైవర్ వెళ్లిపోగా.. మిగతా ఇద్దరు ఆమెపై కారులోనే అత్యాచారం చేశారు. శనివారం తెల్లవారుజామున వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు గణేశ్‌ ఆలయం వద్దకు చేరుకుంది. స్థానికుల సాయంతో పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసింది. బొల్లారం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితురాలిని పీఎస్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకుని.. కేసును అల్వాల్‌ స్టేషన్ కు బదిలీ చేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన అల్వాల్‌ పోలీసులు.. ఆటో నెంబర్ సాయంతో డ్రైవర్ ను అరెస్టు చేశారు. అయితే, మహిళపై అత్యాచారం చేసిన నిందితులు మాత్రం ఇంకా దొరకలేదని పోలీసులు తెలిపారు.

ysjagan leave tadepalli palace

జగన్ తాడేపల్లి నుంచి బిచాణా ఎత్తేసినట్లేనా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బిచాణా ఎత్తేశారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రిగా తన ఐదేళ్ల అరాచకపాలనతో ప్రజాగ్రహానికిగురై, ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయంపాలై అధికారానికి దూరమైన జగన్ రెడ్డి.. ఇప్పట్లో ప్రజల ముందుకు వచ్చే అవకాశాలు లేవా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.   మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ కళ్లు మూసుకుంటే ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయనీ, మళ్లీ అధికారంలోకి వస్తాననీ చెప్పిన జగన్.. ఈ ఐదేళ్లూ కళ్లు మూసుకోవడానికే రెడీ అయిపోయారని జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అర్ధమౌతోంది. ఆ పరిణామాలు ఏమిటంటే.. మరో వారం రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాలకు జగన్ మోహన్ రెడ్డి హాజరౌతారా? లేదా అన్న విషయంపై వైసీపీ నుంచి కానీ, స్వయంగా జగన్ నుంచి కానీ స్పష్టత లేదు. అసలు ఆ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యులు ఎవరైనా హాజరయ్యే అవకాశాలున్నాయా అన్న విషయంలోనూ క్లారిటీ లేదు. అసలు వైసీపీ శాసనసభాపక్ష నేతగా జగన్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇంత వరకూ ఎన్నుకోలేదు. ఇక మళ్లీ జనంలోకి వెడతాను, తాడేపల్లి ప్యాలెస్ లో ప్రజాదర్బార్ ఏర్పాటు చేస్తానంటూ ముహూర్తాలు కూడా ప్రకటించేశారు. దీంతో ఆయన ప్రజా జీవితంలో కొనసాగుతారు. అధికారం కోల్పోయిన తరువాత కళ్లకు కమ్మిన అధికార పొరలు తొలిగి.. మళ్లీ జనంతో మమేకమై పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు ఆశించాయి. అయితే హఠాత్తుగా ఆయన తాడేపల్లి ప్యాలస్ నుంచి ప్రత్యేక విమానంలో బేంగళూరుకు వెళ్లిపోయారు. ప్రజాదర్బార్ రద్దు అయిపోయింది. ఇక ఆయన ప్రజాక్షేత్రంలోకి ఎప్పటి నుంచీ వస్తారన్నదానిపై కూడా క్లారిటీ లేదు. అసలు బెంగళూరు ప్యాలస్ వదిలి బయటకు వస్తారా? మళ్లీ తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్న విషయంపై వైసీపీ వర్గాలలోనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Notices to hero Raj Tarun

హీరో రాజ్ తరుణ్ కు నోటీసులు

గత పది రోజులుగా హీరో రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో మరో ట్విస్ట్ జరిగింది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో సినీ నటుడు రాజ్ తరుణ్‌కు హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా రాజ్ తరుణ్‌కు ఈరోజు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 18వ తేదీలోపు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. కొత్త న్యాయచట్టం బీఎన్ఎస్ఎస్ 45 కింద రాజ్ తరుణ్‌కు నోటీసులు ఇచ్చారు.రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అతనిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది. ఏ 1గా రాజ్ తరుణ్, ఏ2 గా మాల్వి మల్హోత్రా, ఏ3గా మయాంక్ మల్హోత్రని పేర్కొన్నారు. మాల్వీ సోదరుడు తనను చంపేస్తానని బెదిరించాడని లావణ్య పేర్కొంది. వారిపై ఐపీసీ 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది.

ycp rajya sabha members to join bjp

రాజ్యసభలో వైసీపీ పక్షం మాయం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మార్పులు పెను వేగంతో జరుగుతున్నాయి. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రభావం, కేంద్రంలోని ఎన్డీయే కూటమిపై కూడా పడుతోంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తన రాజకీయ నిర్ణయాలకు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో చర్చించి, ఆయన ఆమోదంతోనే ముందుకు సాగాల్సిన పరిస్థితి ఉంది. ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న జగన్  ఫలితాల తరువాత తన పార్టీ రాజ్యసభ సభ్యులతో భేటీ అయ్యారు. కేంద్రంలో బీజేపీకి మన అవసరం ఉంది. గట్టిగా నిలబడండి. బీజేపీయే కాళ్ల బేరానికి వస్తుంది అన్నట్లుగా ఉద్బోధ చేశారు. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఉందని ఆయన భ్రమ పడ్డారు. అయితే వాస్తవానికి వచ్చే సరికి ఆయన కళ్లు బైర్లు కమ్మాయి. ఫలితాలు ఎలా అయితే తన చేతుల్లో లేవని అంగీకరించేశారో.. అలాగే ఇప్పుడు రాజ్యసభలో వైసీపీ బలం కూడా తనది కాదని ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఏపీ మండలిలో కూడా ముందు ముందు అదే జరిగే అవకాశం ఉంది. అది వేరే సంగతి.  ఇప్పుడు రాజ్యసభలో వైసీపీ సభ్యలు వద్దకు వస్తే గంపగుత్తగా వారంతా బీజేపీ గూటికి వెళ్లి  వైసీపీ రాజ్యసభ పక్షాన్ని కమలం పార్టీలో విలీనం చేసేందుకు రెడీ అయిపోయారు. ఈ విషయంలో ఎలాంటి దాపరికం లేదు.  ఎందుకంటే జగన్ కు తమ సభ్యులు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా గొంతెత్తమని ఆదేశించే ధైర్యం లేదు. అక్రమాస్తుల కేసుల కత్తి మెడమీద వేళాడుతుండటంతో ఆయన కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా గట్టిగా నోరెత్తలేని పరిస్థితి. సో.. వైసీపీ సభ్యులు రాజ్యసభలో ప్రభుత్వ వ్యతిరేక ప్రసంగాలు చేసే అవకాశం లేదు. కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం కూడా భాగస్వామి కావడంతో తెలుగుదేశంపైనా విమర్శలు చేసే సాహసం చేయలేని పరిస్థితి వైసీపీది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సభ్యులు బీజేపీవైపు చూస్తున్నారు.  అయితే ఎన్డీయేలో భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం అంగీకారం లేకుండా వైసీపీ రాజ్యసభ సభ్యులకు బీజేపీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించే అవకాశం లేదు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ అవసరాలను చంద్రబాబు పరిగణనలోనికి తీసుకోకుండా ఉండరు. అందుకే బీజేపీ అగ్రనేతలు చంద్రబాబుతో భేటీకి తహతహలాడుతున్నారు. వారి ఆహ్వానం మేరకే చంద్రబాబు హస్తినకు వెడుతున్నారు. కేంద్రం వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి రోజుల ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబు హస్తిన పర్యటన అంటే అందరూ రాష్ట్రానికి అవసరమైన నిధుల కేటాయింపుపై చర్చించడానికి అని భావిస్తారు. అది సహజం. అయితే ఇప్పటికే బీజేపీ నుంచి ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపుల విషయంలో ఎటువంటి అన్యాయం జరగదన్న స్పష్టమైన హామీ వచ్చేసిందని అంటున్నారు.  దీంతో ఇప్పుడు చంద్రబాబు హస్తిన పర్యటన అజెండా రాజకీయ అంశమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎన్డీయే కూటమికి రాజ్యసభలో అవసరమైన బలం లేదు. ఒడిశాలో ఓటమి తరువాత బీజేడీ బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశాలు ఇసుమంతైనా లేవు. దీంతో బీజేపీ చూపు వైసీపీ రాజ్యసభ సభ్యులపై పడింది. వైసీపీ రాజ్యసభ సభ్యులు కూడా కాషాయ కండువా కప్పుకోవడానికి తహతహలాడుతున్నారు. ఆ సంకేతాలు స్పష్టంగానే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేసుకునే విషయంపై చంద్రబాబుతో చర్చలకు బీజేపీ అగ్రనేతలు ముందుకు వచ్చారు. బహుశా ఆ విషయంపై చర్చించేందుకే చంద్రబాబు హస్తిన పర్యటన అని అంటున్నారు.  ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోచవ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి,  ఎన్డీఏకు మెజారిటీ కావాలంటే వైసీపీ, బీఆర్ఎస్ సభ్యులను చేర్చుకోవాల్సిన పరిస్థితి. ఆ విషయం తెలిసిన చంద్రబాబు ఇందుకు అభ్యంతరం చెప్పే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నేడో రేపో వైసీపీ రాజ్యసభ సభ్యులు కమలం తీర్థం పుచ్చుకుని వైసీపీకి గుడ్ బై చెప్పే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. ఈ తంతు చంద్రబాబు సమక్షంలో జరిగినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాష్ట్రం పుంజుకోవడానికి అవసరమైన ఆర్థిక సహకాయం కేంద్రం నుంచి వస్తే చాలు అన్నఉద్దేశంతో ఉన్న చంద్రబాబు వైసీపీ  రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరికకు అభ్యంతరం పెట్టే అవకాశాలు తక్కువేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

supreme reject nia petition

కోడికత్తి శ్రీను బెయిలు రద్దు పిటిషన్ వెనుక ఎన్ఐఏ ఉద్దేశం ఏంటి?

2019 ఎన్నికల ముందు ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసు మాత్రం జీడిపాకంలా సాగుతూనే ఉంది. విస్తృత కుట్ర కోణం ఉందంటూ ఈ కేసులో ఐదేళ్లు జైల్లో మగ్గిన నిందితుడు శీనుకు బెయిలు రాకుండా అడ్డుకునేందుకు జగన్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బాధితుడిగా  ఐదేళ్లలో ఒక్క సారి కూడా కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వడానికి ఇష్టపడని జగన్ ఈ కేసులో నిందితుడు జనుపల్లి శ్రీని బయటకు రాకుండా ఉండాలని గట్టిగా భావించారు.   జగన్ డిమాండ్ మేరకే కోడికత్తి కేసును ఎన్ఐఏకు అప్పగించారు. ఈ కేసు దర్యాప్తు చేసిన ఎన్ఐఏ కోడికత్తి దాడి వెనుక  ఎటువంటి రాజకీయ కుట్ర లేదని విస్పష్టంగా తేల్చేసినా, జగన్మోహన్‌ రెడ్డి మాత్రం విస్తృత కుట్ర కోణం అంటూ కేసును పొడిగించి, ఈ కేసులో నిందితుడు జైల్లోనే మగ్గిపోవాలన్నట్లుగా వ్యవహరించారు. ఈ కేసులో దాడి బాధితుడిగా జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వకుండా ఈ కేసులో నిందితుడు ఐదేళ్లు జైల్లో మగ్గిపోవడానికి కారణమయ్యారు.  అంటే  జగన్‌ ఏనాడూ విచారణకు హాజరు కాకుండా, నిందితుడు శ్రీనును జైల్లోని బయటకు రాకుండా చేశారు. చివరికి ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టు బెయిల్‌ ఇవ్వడంతో శ్రీను బయటకు రాగలిగాడు. అయితే నిందితుడి బెయిలు రద్దు చేయాలంటూ ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ సుప్రీంను ఆశ్రయించింది. సుప్రీం కోర్టు ఎన్ఐఏ పిటిషన్ ను  కొట్టివేసింది. బెయిలు రద్దు చేయలేమని విస్పష్టంగా పేర్కొంది.   అయితే ఈ కేసులో రాజకీయ కుట్ర కోణం లేదని విస్పష్టంగా చెప్పిన ఎన్ఐఏ. ఈ కేసుకు సంబంధించి నిందితుడు శ్రీనుని ఇంకా విచారించాల్సిన అవసరం లేదని తేల్చేసిన ఎన్ఐఏ ఇప్పుడు అతని బెయిలు రద్దు చేయాలని ఎందుకు సుప్రీంను ఆశ్రయించింది. ఎన్ఐఏ సుప్రీం కోర్టులో శ్రీను బెయిలు రద్దు పిటిషన్ వెనుక ఉన్న ఉద్దేశమేమిటి? అన్న చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతోంది.   ఈ కేసు విచారణ పూర్తవ్వాలంటే జగన్మోహన్‌ రెడ్డి   కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇస్తే చాలని ఎన్ఐఏ పలు మార్లు కోర్టుకు విన్నవించింది. అయితే ఇంత కాలం జగన్ రెడ్డి కోర్టుకు హాజరు కాలేదు. ముఖ్యమంత్రిగా తనకు క్షణం తీరిక ఉండదనీ, అందువల్ల కోర్టుకు హాజరు కాలేనని చెబుతూ వచ్చారు. ఇక ఇప్పుడు ఇంతకాలం జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నందున తీరిక లేక విచారణకు హాజరు కాలేకపోతున్నారని చెప్పుకునేవారు.  అయితే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు. కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే.  అందుకే ఇప్పుడు ఆయన కోర్టు హాజరు నుంచి మినహాయింపు కోరలేరు. ఈ కారణంగానే జగన్ ను కోర్టుకు రప్పించే ఉద్దేశంతోనే ఎన్ఐఏ కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను బెయిలు రద్దు కోసం సుప్రీంను ఆశ్రయించిందని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయితే రాజకీయవర్గాలలో మాత్రం ఎన్ఐఏ బెయిలు రద్దు పిటిషన్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ ను ఎన్ఐఏ కోర్టుకు రప్పించాలంటే శ్రీను బెయిలు రద్దు అవసరం లేదని అంటున్నారు. అధికారంలోకి రావడం కోసం, అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీని ఇబ్బందులలోకి నెట్టడం కోసం జగన్ కోడికత్తి కేసును ఉపయోగించుకున్నారు. అందుకే కేసు తేలకుండా కొనసాగుతూనే ఉండేలా జగన్ వ్యవహరించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత ఈ కేసు లాజికల్ ఎండ్ కువచ్చేస్తే.. తన ఆబోరు దక్కదన్న ఆందోళనలో జగన్ ఉన్నారు. అందుకే ఈ కేసు విచారణ సాగుతూనే ఉండాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పడు ఎన్ఐఏ సుప్రీంలో కోడికత్తి శ్రీను బెయిలు రద్దు పిటిషన్ దాఖలు చేయడం అనుమానాలకు తావిస్తోంది.  సరే ఎన్ఐఏ పిటిషన్ ను సుప్రీం తోసిపుచ్చింది. ఇక కోడి కత్తి కేసు విచారణ జరిగితే జగన్ కోర్టుకు హాజరై తీరాల్సిందే. అందుకు ఎటువంటి మినహాయింపులూ లభించవు అనడంతో సందేహం లేదు. కేసు విచారణకు కోడికత్తి శ్రీను బెయిలు రద్దు అవసరం లేదు. విచారణకు హాజరు కావాలన్న నోటీసు ఇస్తే చాలు. ఇప్పుడిక ఎన్ఐఏ ఎంత తొందరగా ఈ కేసు విచారణ ముగిస్తుందన్నది చూడాలి. 

vijayasai announce own channel again

విజయసాయిరెడ్డి నోట మళ్లీ సొంత చానల్ మాట!

వైసీపీ కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నోట మరో సారి సొంత చానల్ మాట వచ్చింది. గతంలో కూడా ఒక సారి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి సొంతంగా చానల్, పత్రిక ప్రారంభించబోతున్నట్లు ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. అప్పట్లో  అంటే ఆయన సొంత చానల్, పత్రిక ప్రకటన చేసిన సమయంలో ఆయనకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయింది. పార్టీలో ఆయన నంబర్ 2 స్థానాన్ని అప్పటి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించేసుకున్నారు. దీంతో ఆయనకు పార్టీలో ఇసుమంతైనా గుర్తింపు లేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో  ఆయన సొంత చానల్, సొంత పత్రికా అంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటన చేశారు.  ఇప్పుడు మళ్లీ ఆయన తీవ్రమైన ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఒక మహాళా అధికారితో అక్రమ సంబంధం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా ఆ మహిళా అధికారి భర్తే ఈ ఆరోపణ చేశారు. ఫిర్యాదు సైతం చేశారు. వైసీపీ తరఫున ఈ వార్తలను ఖండించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా విజయసాయిపై ఆరోపణలను ఖండించలేదు. దీంతో ఆయన ఇక పార్టీ అండ కోసం అర్రులు చాస్తూ కూర్చుంటే లాభం లేదన్న నిర్ణయానికి వచ్చేశారు. అదే సమయంలో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా.. తాను ఏ పార్టీలో ఉన్నా తన చానల్ మాత్రం నిఖార్సైన వార్తలే ప్రసారం చేస్తుందని చెప్పండం ద్వారా పార్టీ మారే అవకాశాలున్నాయన్న విషయాన్ని సూచన ప్రాయంగా వెల్లడించి, ఒక విధంగా వైసీపీ అధినేత జగన్ ను బ్లాక్ మెయిల్ చేశారని కూడా చెప్పవచ్చు.  వాస్తవానికి విజయసాయి రెడ్డి పార్టీలో తనకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్న సమయంలో మాత్రమే జగన్ పై ఒకింత ధిక్కార స్వరాన్ని వినిపిస్తారు. గతంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.   విజయసారిరెడ్డికి పార్టీలో ఉక్కపోత మొదలైనా.. సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలు ఎదురైనా ఆయన సొంత మీడియా అంటూ ముందుకు వస్తున్నారు.  గతంలో వైసీపెలో నెంబర్ 2 గా ఓ వెలుగు వెలిగిన విజయ సాయి రెడ్డికి ఆ పార్టీలో ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలైన తరువాత పార్టీలో ఆయనను పట్టించుకునే నాథుడే కరవయ్యారు. ఇప్పుడు అక్రమ సంబంధం ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరౌతున్న విజయసాయి.. సెల్ఫ్ డిఫెన్స్ కోసం సొంత టీవీ చానల్ అంటూ హడావుడి చేస్తున్నారు.   అయితే గతంలో విజయసాయి సొంత చానల్ అని ప్రకటించిన సమయంలో ఆయనకు ఢిల్లీ పెద్దలతో పాటుగా  పొరుగు రాష్ట్రానికి  చెందిన ముఖ్యనేత అండదండలున్నాయన్న వార్తలు వచ్చాయి.  అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. ఢిల్లీలో  చక్రం తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేతుల్లో ఉంది. ఆయనకు నచ్చని పని చేయడానికి ఢీల్లీ పెద్దలు సాహసించే అవకాశం లేదు. ఇక పొరుగు రాష్ట్రం నుంచి కూడా విజయసాయికి సహకారం అందే అవకాశం లేదు. ఏపీలో వైసీపీ పరిస్థితిలాగే, పొరుగు రాష్ట్రంలో గతంలో విజయసాయికి అండదండగా నిలవడానికి ముందుకు వచ్చిన నేత ఉన్న పార్టీ పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో విజయసాయికి ఎటు నుంచీ సహకారం అందే అవకాశాలు లేవు.  ఇప్పుడేమిటి చాలా కాలంగా వైసీపీలో విజయసాయి రెడ్డి ఉక్కపోతకు గురవుతున్నారు.   జగన్ రెడ్డి ఒకటొకటిగా విజయ సాయి పదవులు కత్తిరిస్తూ వస్తున్నారు. మరో వంక, విశాఖ భూదందాల బాగోతంలో విజయసాయి పీకలోతు కూరుకుపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జగన్ రెడ్డి కాదుకదా, వైసేపీ నాయకులు ఎవరూ  ఆయనకు అండగా విజయసాయిపై ఆరోపణలు ఖండించడానికి ముందుకు రావడం లేదు. ఎవరూ ముందుకు రాని కారణంగానే జూపూడిని పక్కన పెట్టుకుని విజయసాయి సోమవారం (జులై 15) మీడియా సమావేశంలో మాట్లాడారు.  ఈ పరిస్థితుల్లో విజయసాయి సొంత చానెల్ ప్రకటనను ఎవరూ పెద్ద సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. 

reason balineni enter ongole

బాలినేని ఒంగోలు ఎంట్రీ.. కారణమేంటంటే?

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓట‌మి త‌రువాత ఆ పార్టీ నేత‌ల మ‌ధ్య వ‌ర్గ‌విబేధాలు బ‌య‌ట‌కొస్తున్నాయి. పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యాల కార‌ణంగానే తాము ఓడిపోయామ‌ని కొంద‌రు వైసీపీ నేత‌లు బ‌హిరంగంగా చెబుతుండ‌గా.. మ‌రికొంద‌రు క్యాడ‌ర్ వ‌ద్ద త‌మ‌ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఘోర ఓట‌మితో మ‌రికొంద‌రు నేత‌లు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. వీరిలో చాలా మంది వైసీపీని వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతుంది. అందులో మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి ఒక‌రు. బాలినేని వైసీపీని వీడ‌బోతున్నార‌ని విస్తృత ప్ర‌చారం జ‌రిగింది. జ‌న‌సేన, టీడీపీ, బీజేపీలో ఏదో ఒక పార్టీలో  చేరేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రిగింది. ఇందుకు కార‌ణం.. ఎన్నిక‌ల ఫ‌లితాల రోజునుంచి ఆయ‌న జిల్లాకు, పార్టీ క్యాడ‌ర్‌కు దూరంగా ఉన్నారు. తాజాగా.. ఒంగోలుకు వ‌చ్చిన బాలినేని తాను పార్టీ మారుతున్న‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌ను ఖండించారు. నేను ఏ పార్టీలో చేర‌డం లేదు.. వైసీపీలోనే ఉంటాన‌ని క్లారిటీ ఇచ్చారు. వైసీపీని వీడ‌న‌ని బాలినేని కరాఖండీగా చెప్పిన‌ప్ప‌టికీ వైసీపీ నేతలు మాత్రం విశ్వసించడం లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ అభ్య‌ర్థిగా  పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి పరాజయం పాలయ్యరు.  తెలుగుదేశం అభ్యర్థి దామచర్ల జనార్ధన్‌రావు. 34వేల ఓట్ల పైచిలుకు ఆధిక్యతతో విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల అనంతరం బాలినేని రాజకీయంగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు.  వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షల్లోనూ బాలినేని క‌నిపించ‌లేదు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ బాలినేని ఇలానే వ్య‌వ‌హ‌రించారు. ఆ స‌మ‌యంలో ఓట‌మి త‌రువాత దాదాపు మూడునాలుగేళ్ల పాటు క్యాడ‌ర్ కు అందుబాటులో లేరు. ఎప్పుడో బుద్ధిపుట్టినప్పుడు ఒక‌సారి పార్టీ క‌ర్య‌క్ర‌మాల్లో కనిపించేవారు. అప్ప‌టితో పోల్చుకుంటే ఇప్పుడు బాలినేని ఘోర ఓట‌మిని చ‌విచూశాడు. దీంతో ఆయ‌న రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్ప‌బోతున్నారన్న ప్ర‌చారంసైతం జ‌రిగింది. తాజాగా ఒంగోలు వ‌చ్చిన బాలినేని ఈ విష‌యంపై స్పందించారు. కౌంటింగ్ రోజున ఎన్నికల మూడ్ చూసి బాధవేసి ఒంగోలును విడిచి వెళ్లిపోయానన్నారు. ఒకానొక ద‌శ‌లో రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని ఆలోచించిన మాట వాస్త‌వ‌మే. కానీ, అధికారంలోకి వ‌చ్చిన కొద్దిరోజుల‌కే వైసీపీ కార్యకర్తలపై తెలుగుదేశం నాయకులు దాడులు మొద‌లుపెట్టారు. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా ఉండేందుకు మ‌ళ్లీ ఒంగోలులో అడుగు పెట్టాన‌ని బాలినేని చెప్పారు. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత నుంచి నియోజ‌క‌వ‌ర్గం వైపు చూడ‌ని బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి ఉన్న‌ట్లుండి ఒంగోలులో అడుగు పెట్ట‌డం వెనుక  ఓ కార‌ణం ఉంద‌ని ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. వైసీపీ ఘోర ఓట‌మి త‌రువాత బాలినేని ఆ పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కూట‌మి పార్టీల్లో ఏదోఒక పార్టీలో చేరాల‌ని ఆయా పార్టీల ముఖ్య‌నేత‌ల‌తో మంత‌నాలు సైతం జ‌రిపిన‌ట్లు తెలిసింది. అయితే, మూడు పార్టీల‌ అధిష్టానాల నుంచి బాలినేనికి గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించ‌క‌పోవ‌టంతో ఆయన అనివార్యంగా  వైసీపీలోనే ఉండాల్సిన ప‌రిస్థితి  ఏర్పడింది. దీంతో ఆయన మ‌ళ్లీ ఒంగోలుకు వ‌చ్చిన‌ట్లు వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. అంతే కాక‌ ప్ర‌కాశం జిల్లా వైసీపీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్య‌ర్థిగా పోటీచేసి ఓడిపోయిన చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డికి అప్ప‌గించేందుకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మొగ్గుచూపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఎన్నిక‌ల ముందు ఒంగోలు ఎంపీ టికెట్ చెవిరెడ్డికి ఇచ్చే విష‌యంపై జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని బాలినేని తీవ్రంగా వ్యతిరేకించారు.   మాగుంట‌ శ్రీ‌నివాసులరెడ్డికే మ‌రోసారి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాగుంట‌కు టికెట్ ఇచ్చేందుకు నిరాక‌రించి.. చెవిరెడ్డిని రంగంలోకి దింపారు. దీంతో మాగుంట తెలుగుదేశంలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి చెవిరెడ్డిపై విజ‌యం సాధించారు. ప్ర‌కాశం జిల్లా వైసీపీలో ప్ర‌స్తుతం పార్టీ అధ్య‌క్షుడు ఎవ‌ర‌నే విష‌యంపై చ‌ర్చ జ‌రుగుతుంది. ఒంగోలు ఎంపీ అభ్య‌ర్థిగా పోటీచేసి ఓడిపోయిన చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డికి జిల్లా పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు జ‌గ‌న్ మొగ్గుచూపుతున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జంకె వెకంట‌రెడ్డి ప‌నితీరు అంతంత‌ మాత్రంగా ఉండ‌టం.. ఎన్నిక‌ల్లో పార్టీ ఘోర వైఫ‌ల్యం నేప‌థ్యంలో పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు వేరేవారికి అప్ప‌గించేందుకు పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. చెవిరెడ్డికే జిల్లా పార్టీ ప‌గ్గాలు అప్ప‌గిస్తార‌ని వైసీపీ నేత‌లు సైతం భావిస్తున్నారు. మొద‌టి నుంచి జిల్లాలో చెవిరెడ్డి ఎంట్రీని బాలినేని వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే. చెవిరెడ్డికి జిల్లా అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే బాలినేని, ఆయ‌న అనుచ‌రులు వైసీపీని వీడ‌టం ఖాయ‌మ‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌కాశం జిల్లా వైసీపీ అధ్య‌క్షుడిగా చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డిని నియ‌మించి బాలినేనికి జ‌గ‌న్ షాకివ్వ‌బోతున్నారా.. లేకుంటే.. బాలినేని సూచించిన వారికి జిల్లా ప‌గ్గాలు అప్ప‌గిస్తారా అనే అంశం వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ‌ను రేపుతోంది.

chandrababu white paper on natural resources

సహజ వనరుల దోపిడీపై చంద్రబాబు శ్వేతపత్రం!

గత అయిదేళ్ళలో వైసీపీ నేతలు సహజ వనరులను భారీ స్థాయిలో దోపిడీ చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. జగన్ ప్రభుత్వం అడవులను కూడా ధ్వంసం చేసిందని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో సహజవనరుల దోపిడీపై ఏపీ సచివాలయంలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. వైసీపీహయాంలో భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని విమర్శించారు. "కొత్త దారులు వెతుక్కుని, కొత్త విధానాలు ఏర్పాటు చేసుకొని మరీ దోపిడీ చేశారు. విశాఖపట్నం, ఒంగోలు, చిత్తూరులో భూకబ్జాలకు పాల్పడ్డారు. ఇళ్ల నిర్మాణం పేరుతో దందా చేశారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు. వైకాపా నేతలు, కార్యకర్తలకు అసైన్డ్ భూములు అప్పగించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూ దోపిడీకి కుట్రపన్నారు." అని చంద్రబాబు వెల్లడించారు.  * విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూములు కొట్టేసేందుకు విఫలయత్నం చేశారు.  * వృద్ధాశ్రమానికి ఇచ్చిన హయగ్రీవ ల్యాండ్స్ కూడా కొట్టేశారు.  * దసపల్లా భూములను కాజేసి ఇళ్లు కట్టారు.  * మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారు.  * ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్లతో 101 కోట్ల రూపాయల ఆస్తి కాజేసేందుకు యత్నించారు. ఒంగోలు భూ కబ్జాలపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాం.  * తిరుపతి, రేణిగుంటలోని మఠం భూములను కొట్టేశారు.  * తిరుపతి జిల్లాలో భూ ఆక్రమణలు, అక్రమాలకు లెక్కే లేదు. 22-ఏ పెట్టి భూ ఆక్రమణలు చేశారు.  * చిత్తూరులో 782 ఎకరాలు కాజేసేందుకు ప్రయత్నించారు. * పుంగనూరులో 982 ఎకరాలను పట్టా చేయించుకున్నారు. పేదవారి అసైన్డ్ భూములను లాక్కున్నారు. హౌసింగ్ కాలనీ ఎక్కడ రావాలో వైసీపీ నేతలే నిర్ణయించేవారు. ముందే స్థలం కొనేవారు.. అనేక రెట్ల పరిహారం కొట్టేసేవారు.  * గ్రామాల్లో ఉండే ఖాళీ భూములను ఆక్రమించారు. నివాసయోగ్యం కాని భూములను ఇళ్లకు కేటాయించారు.  * అక్రమంగా భవనాలు కట్టేశారు. ప్రశ్నించే వారిపై దాడులు చేశారు.  * 13,800 ఎకరాలను జగన్ ప్రభుత్వం ఆ పార్టీ నేతలకు ధారాదత్తం చేసింది. వైసీపీ నేతలు తక్కువ ధరకు 40 వేల ఎకరాలు కొన్నారు. అధికారులను బెదిరించి భూములకు పట్టాలు తెచ్చుకునేవారు. అని చంద్రబాబు ఆరోపించారు. * భూహక్కు పత్రం పేరుతో ప్రచారానికి 13 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.  * భూముల రీసర్వే పేరుతో సరిహద్దు రాళ్ళ మీద జగన్ చిత్రం ముద్రించుకున్నారు.  * ఎంతో అహంభావంతో ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చారు. ఆ చట్టం దురుద్దేశాలను ప్రజలు గ్రహించారు. ఒకసారి భూములను చెక్ చేసుకోవాలని ప్రజలను కోరుతున్నా.. భవిష్యత్‌లో భూ కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తాం. భూములు, ఆస్తులు కబ్జాకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి. గుజరాత్లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని ఇక్కడా తీసుకొస్తాం. తాము భూమి యజమానులమని కబ్జాదారులే నిరూపించుకోవాలి... అని చంద్రబాబు అన్నారు. * మైనింగ్, క్వారీ లీజుల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. బెదిరింపులు, భారీ జరిమానాలతో అనేక గనులు కొల్లగొట్టారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ నిబంధనలకు తూట్లు పొడిచారు.  * నిబంధనలు ఉల్లంఘించి గనులు తవ్వేశారు. అధికారులను డిప్యుటేషన్ మీద తెచ్చుకొని అక్రమాలకు పాల్పడ్డారు. ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీలను తెచ్చారు. అక్రమంగా భారీ యంత్రాలు వాడారు. తవ్వకాల కోసం నదులు, కాలువలపై రోడ్లు వేశారు. ఇసుక దందాను ప్రశ్నించే వారిపై అట్రాసిటీ కేసులు పెట్టారు. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో భారీ ఇసుక దందాలు జరిగాయి. వైసీపీ నేతలకు కప్పం కట్టలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇసుక దందాలో 9,750 కోట్ల రూపాయలు కొట్టేశారు. * ఏ ప్రభుత్వంలోనైనా అటవీ, గనులశాఖను సాధారణంగా ఒక వ్యక్తికి ఇవ్వరు. కానీ, వైసీపీ హయాంలో మాత్రం ఆ రెండుశాఖలను ఒకే వ్యక్తికి అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లాలో లేటరైట్ గనులను బలవంతంగా లాక్కున్నారు. ప్రకాశం జిల్లాలో 250 క్వారీలపై దాడులు చేశారు. కుప్పం నియోజకవర్గంలోనే అక్రమంగా గనులు తవ్వేశారు. దౌర్జన్యం, బెదిరింపులు, జరిమానాల పేరుతో గనులను దోపిడీ చేశారు. ఆఖరికి ద్రావిడ యూనివర్సిటీలో అక్రమంగా మైనింగ్ చేశారు. చిత్తూరు జిల్లాలో టార్గెటెడ్ ఇన్‌స్పెక్షన్ల పేరుతో వేధించారు. గనుల కేటాయింపులో పారదర్శకత తీసుకువస్తాం.... అని చంద్రబాబు అన్నారు. * పర్యావరణాన్ని దెబ్బతీస్తే భావితరాలు దెబ్బతింటాయి.  ప్రకృతి సంపద ప్రజలకు చెందాలి. గనులు బాధితులు ముందుకు రావాలి. ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి.  * అమరావతి రోడ్డుపై ఉన్న మట్టిని తవ్వుకొని పోయారు.  * ఎర్రచందనం దొంగ రవాణా కోసం అక్రమాలకు పాల్పడ్డారు. ఎర్రచందనాన్ని అక్రమంగా చైనాకు పంపారు. ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ సిబ్బందిని తగ్గించారు. స్మగ్లర్లను ప్రోత్సహించారు.  * రుషికొండలో 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టారు. రుషికొండ కట్టడాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే. భీమిలి ఎర్రమట్టి దిబ్బల్ని పూర్తిగా మింగేశారు.  * ప్రభుత్వ, ప్రైవేట్ భూముల పరిరక్షణకు ప్రజలంతా కలిసి రావాలి. భూగర్భ ఖనిజ సంపద సమాజహితానికి వినియోగించాలి. అడవులను మింగేసిన అనకొండలను శిక్షిస్తాం... అని చంద్రబాబు నాయుడు వివరించారు.

On KCR petition  Adjournment to tomorrow in the Supreme Court

రేపటికి వాయిదాపడ్డ కెసీఆర్ పిటిషన్

 పదేళ్ల బి  ఆర్ఎస్ హాయంలో విద్యుత్ కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగాయి.  వార్తలు ఈ  నేపథ్యంలో జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో  కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.  రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  ఇప్పటికే డిమాండ్  చేశారు.  కెసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను రేపు విచారిస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో మొదట కేసీఆర్ తరఫు న్యాయవాది మోహిత్ రావు పాస్ ఓవర్ కోరారు. కోర్టు పని వేళలు ముగిసిన సమయానికి కేసు విచారణకు రావడంతో రేపు ఉదయానికి వాయిదా వేసింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలపై కమిషన్ వేసింది. విచారణ రావాలంటూ కమిషన్... కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన న్యాయపోరాటం ప్రారంభించారు.  హైకోర్టులో కెసీఆర్ కు చుక్కెదురు కావడంతో కెసీఆర్ సుప్రీంను ఆశ్రయించారు. తనకు నోటీసులు ఇవ్వడం, విచారణకు పిలవడంపై ఆయన సు ప్రీంకోర్టు గడప దొక్కారు.చత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలపై విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు.

ram setu is still exist

సముద్రంలో రామసేతు వుంది.. ఇస్రో!

ఇండియా శ్రీలంక మధ్య రామసేతు వంతెన కల్పితం కాదని, అక్కడ వంతెన నిర్మించిన మాట వాస్తవమేనని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం ఇన్‌శాట్-2 డేటాను వినియోగించి ఈ విషయాన్ని కనుగొన్నారు. తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ని విడుదల చేశారు. ఇండియా, శ్రీలంక దేశాల మధ్య వుండే ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్లు వుందని, దీని ఎత్తు సముద్రంలో 8 మీటర్లు వుందని తెలిపారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ఆగ్నేయ దిక్కులో వున్న ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని మన్నారు ద్వీపం, తలై మన్నారు వరకు విస్తరించి వుందని తెలిపారు. ఈ వంతెనను సున్నపురాతితో నిర్మించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ వంతెన 99.98 శాతం నీటిలోనే మునిగి వుందని వెల్లడించారు.

Rains in Telangana for five days... Heavy rain forecast today

తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు... ఈ రోజు భారీ వర్ష సూచన 

షియర్ జోన్ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, ఈశాన్య తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురియవచ్చునని తెలిపింది. ఆగ్నేయ, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్ జోన్ ఏర్పడిందని... ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. భూగర్భ శాస్త్రంలో, షీయర్ జోన్ అనేది భూమి సన్నని జోన్, ఇది జోన్‌కు ఇరువైపులా ఉన్న రాతి గోడలు ఒకదానికొకటి జారడం వల్ల  షియర్ జోన్ ఏర్పడుతుంది.    నేడు కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, జనగాం, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

Heroine Rakul Preet Sing brother caught in drug bust in Hyderabad

హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం... పట్టుబడ్డ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్  సోదరుడు 

హైదరాబాద్ లో డ్రగ్స్  కలకలం  మరో మారు రేపాయి.    రాజేంద్రనగర్ సమీపంలో పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను పట్టుకున్నారు. నార్కోటిక్స్ విభాగం, ఎస్ఓటీ విభాగం, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 200 గ్రాముల కొకైన్ పట్టుబడింది. దీని విలువ రూ. 2 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఆపరేషన్ లో డ్రగ్స్ తరలిస్తున్న నలుగురు పట్టుబడ్డారు. వీరిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ కూడా ఉన్నట్టు సమాచారం. మిగిలిన వారంతా నైజీరియన్లు. గోవా కేంద్రంగా డ్రగ్స్ దందా నడుస్తున్నట్టు నిందితుల నుంచి పోలీసులు తెలుసుకున్నారు. గతంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా డ్రగ్స్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

samvidhaan hatya diwas is it correct

‘రాజ్యాంగ హత్య దినం’ సబబేనా?

కారణాలు ఏమైనప్పటికీ, 1975, జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. దాని ప్రభావం, పర్యవసానాల సంగతి అందరికీ తెలిసిందే. ఇందిరా గాంధీ చరిత్రలో ‘ఎమర్జెన్సీ’ ఒక మచ్చలాగా మిగిలిపోయింది. ఇందిరాగాంధీ కూడా ఆ తర్వాత తాను ఎమర్జెన్సీని ప్రకటించడం తప్పేనన్న విషయాన్ని అంగీకరించారు. ఎమర్జెన్సీని విధించిన తప్పుకు ప్రజలు ఆమెను శిక్షించారు. ఆ తర్వాత ఆమెను క్షమించి మళ్ళీ అధికారం ఇచ్చారు. ఇందిరాగాంధీ అధికారంలో వుండగానే, ప్రధానమంత్రిగా అందరి నుంచి జేజేలు అందుకుంటున్న సమయంలోనే హత్యకు గురయ్యారు. అదంతా ఎప్పుడో ముగిసిపోయిన అధ్యాయం.. మానిపోయిన గాయం. ఇప్పుడు ఆ గాయాన్ని అధికారికంగా రేపి రాజకీయ లబ్ధిని పొందాలని భారతీయ జనతాపార్టీ భావిస్తోంది. ఎమర్జెన్సీని ప్రకటించినందుకు ఇందిరాగాంధీని ఇప్పటికీ నోరున్న ప్రతి ఒక్కరూ విమర్శిస్తూ వుంటారు. బీజేపీ వర్గాలయితే ఎమర్జెన్సీని, ఇందిరాగాంధీని, జవహర్లాల్ నెహ్రూని విమర్శిస్తూనే వుంటారు. ఇందిర,  నెహ్రూ దేశానికి చేసిన సేవలు బీజేపీ వాళ్ళకి ఎప్పుడూ కనిపించవు. నెహ్రూ కుటుంబాన్ని విమర్శించడానికి బీజేపీకి చెందిన గల్లీ కార్యకర్త అయినా నేను సిద్ధం అంటూ రెడీ అయిపోతాడు. ఇలా ఒక పార్టీ వేదికగా ఎవరయినా, ఎవర్నయినా విమర్శించవచ్చు. కానీ, ప్రభుత్వం పరంగా మాత్రం అలా చేయడానికి చాలా పరిమితులు వుంటాయి. ఆ పరిమితులన్నీ బీజేపీ ప్రభుత్వం దాటింది. ఎమర్జెన్సీ ప్రకటించిన జూన్ 25వ తేదీని ‘సంవిధాన్ హత్యా దివస్’ (రాజ్యాంగ హత్య దినం) పేరిట అధికారికంగా ప్రకటించింది. ఈ చర్య ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించడం కంటే దారుణమైన చర్య అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏనాడో ఒక మాజీ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు అధికారికంగా విమర్శించే విధంగా చేయడం సబబు కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బీజీపీకి అధికారం వుంది కాబట్టి, తనను ఆపే అవకాశం ఎవరికీ లేదు కాబట్టి ‘రాజ్యాంగ హత్య దినం’ అంటూ ప్రకటించారు. కొంతకాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమో, మరో ప్రభుత్వమో వస్తుంది. అప్పుడు మోడీ నోట్ల రద్దు చేసిన రోజును ‘అత్యంత తలతిక్కల దినం’ అనో, మోడీ ప్రమాణ స్వీకారం చేసిన రోజును ‘అత్యంత విషాదాత్మక దినం’ అని ప్రకటిస్తే ఎలా వుంటుంది? ఇందిరాగాంధీని కానీ, మోడీని కానీ వ్యక్తిగతంగా ఎంతయినా విమర్శించవచ్చు. ఇలా  ‘హద్దులు’ మీరి ఆ విమర్శలకు ‘అధికారం’ కల్పించడం ఎంతవరకు సబబు అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులను జనం దృష్టిలో పలుచన చేసే విధంగా నిర్మించే సినిమాలకు మద్దతు ఇస్తోంది. ఇప్పుడు సమయం సందర్భం లేకుండా ‘ఎమర్జెన్సీ’ అంశాన్ని పైకి తీసుకొచ్చి, దానికి అధికారికంగా ఒక పేరును ఇవ్వడం అనేది త్వరలో రాబోతున్న ‘ఎమర్జెన్సీ’ అనే సినిమాకి హైప్ తేవడమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ అనే సినిమా సెప్టెంబర్ 6, 2024న విడుదలవుతోంది. ఇందిరా గాంధీ మీద తమ ద్వేషాన్ని అధికారికంగా వెళ్ళగక్కడంతోపాటు కంగన రనౌత్ నిర్మాత కూడా అయిన ‘ఎమర్జెన్సీ’ సినిమా మీద నేటితరం ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే ప్లానులో భాగంగా బీజేపీ ప్రభుత్వం తీసుకోకూడని నిర్ణయం తీసుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Danger bells rang for Hussain Sagar

హుస్సేన్ సాగర్ కు  డేంజర్ బెల్స్  

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా నిన్న పలుచోట్లు భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం చాలా కాలం తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, శానిటేషన్ సిబ్బందిని హుటాహుటిన రంగంలోకి దించారు. హుస్సేన్ సాగర్ గరిష్ఠ నీటిమట్టం 514.75 మీటర్లు కాగా... ప్రస్తుత నీటిమట్టం 513.41 మీటర్లుగా ఉంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. వరదనీటి కారణంగా పలు ప్రధాన రహదారులపై అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. దీని కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ నీటి మట్టాలు దాదాపు పూర్తి స్థాయికి చేరుకున్నాయి. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, శానిటేషన్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి నిల్వలను తొలగించేందుకు కృషి చేస్తున్నారు.  హైదరాబాద్ నగరంలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు సగటున 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రహదారులపై భారీగా వరద నీరు చేరింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. కొన్ని చోట్ల కార్లు, ఆటోలతో పాటు ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి.

రేవంత్ ఆపరేషన్ ఆకర్ష్.. అసలు కారణం ఇదే!

తెలంగాణలో రాజకీయ పరిణామాలు గత పదేళ్లూ ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అన్నట్లుగా ఉన్నాయి. తెలంగాణ ఆవిర్బావం తరువాత పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్.. రాష్ట్రంలో విపక్షాల పొడే గిట్టనట్లుగా వ్యవహరించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను బలహీనం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు గేట్లు బార్లా తెరిచారు. వచ్చిన వారికి వచ్చినట్లు బీఆర్ఎస్ కండువా కప్పేశారు. ఇలా చేయడం వల్ల ఆయన పొందిన రాజకీయ లబ్ధి కంటే నష్టమే ఎక్కువ అని ఇప్పుడు బయటపడుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీయడం ద్వారా బీఆర్ఎస్ ఇబ్బందుల్లో చిక్కుకుంది. ప్రతి నియోజకవర్గంలో ఆ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారు, తొలి నుంచీ ఆ పార్టీలోనే ఉన్న వారి మధ్య సత్సంబంధాలు లేకుండా పోయాయి. ఒకరికొకరు ప్రత్యర్థులుగానే భావించుకుంటూ గ్రూపులు కట్టారు. ఆ గ్రూపులే 2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది.   సరే ఆ ఎన్నికలలో  కాంగ్రెస్ విజయం సాధించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఎలాగైతే ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగంతో బలహీనం చేశారో.. సరిగ్గా అలాగే రేవంత్ ఇప్పుడు బీఆర్ఎస్ శాసన సభా పక్షాన్ని ఖాళీ చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరిక వల్ల ఆ పార్టీలో వెల్లువెత్తిన అసమ్మతి కాంగ్రెస్ లో వ్యక్తం కావడం లేదు. ఒక్క జీవన్ రెడ్డి వినా మరెవరూ ఈ చేరికలను వ్యతిరేకించిన దాఖలాలు లేవు.  అసలు కాంగ్రెస్ అంటేనే గ్రూపులూ, అసమ్మతులూ.. అటువంటి కాంగ్రెస్ లో బయటి నుంచి చేరికల పట్ల అసమ్మతి, అసంతృప్తి వ్యక్తం కావడం లేదు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టమే కారణం. ఎందుకంటే ఆ చట్టం ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాలలో 2026 నాటికి అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీ స్థానాల సంఖ్య 153కు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాల సంఖ్య 225కు పెరుగుతుంది. దాంతో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఆశావహులకు వచ్చే ఇబ్బంది పెద్దగా లేదు. అలాగే తెలంగాణ అసెంబ్లీలో పెరిగే స్థానాలలో అత్యధికంగా జీహెచ్ఎంపీ, హెచ్ఎండీఏ పరిధిలోనే పెరుగుతాయి. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం 24 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఆ సంఖ్య 2026లో 54కు పెరుగుతుంది. అందుకే రేవంత్ రెడ్డి ఎక్కువగా గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఇదే కారణంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పార్టీ నుంచి ఎమ్మెల్యేల వలసలపై ఆందోళన చెందుతున్నారు. ఈ వలసల కారణంగా భవిష్యత్ లో బీఆర్ఎస్ పుంజుకునే అవకాశాలు సన్నగిల్లు తున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ తన బలాన్ని మరింత పెంచుకుని బలపడుతుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. మొత్తానికి విభజన చట్టం కారణంగా రేవంత్ రాజకీయాంగా లబ్ధి పొందుతున్నారని చెప్పవచ్చు. 

జగన్ స్థాయికి దిగజారిన ట్రంప్!

అమెరికా మాజీ అధ్యక్షుడు, త్వరలో జరగబోయే ఎన్నికలలో అధ్యక్ష పదవికి రేసులో వున్న డొనాల్డ్ ట్రంప్ మన జగన్ స్థాయికి దిగజారిపోయినట్టు అనిపిస్తోంది. ఆదివారం నాడు ట్రంప్ మీద హత్యాయత్నం జరిగింది (?). ట్రంప్ చెవి చివరి నుంచి బుల్లెట్ దూసుకుపోవడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ట్రంప్ మీద హత్యయత్నం చేసిన క్రూక్స్ అనే యువకుడిని భద్రతాదళాలు కాల్చి చంపాయి. తన చెవికి బుల్లెట్ తగిలినప్పటికీ ట్రంప్ భయపడకుండా పిడికిలి బిగించి పోరాట యోధుడిలా పోజు ఇచ్చారు. దాంతో ఇప్పటి వరకు అటూ ఇటుగా వున్న ట్రంప్ విజయావకాశాలు పెరిగిపోయాయి.... ఇదీ నిన్నటి వరకు మీడియాలో వినిపించిన పాయింట్లు. ఆదివారం వరకు ట్రంప్ మీద హత్యాయత్నం జరిగిందని అమెరికా జనం నమ్మారుగానీ, ఒకరోజు గడిచేసరికి ఇందతా ట్రంప్ ఆడించిన నాటకం అనే అభిప్రాయాలు అమెరికాలో వినిపిస్తున్నాయి. ఎవరో యువకుడు కాల్పులు జరపడం ఏంటో, అది కరెక్టుగా వెళ్ళి ట్రంప్ చెవి అంచుకు తగలడం ఏంటో... ట్రంప్ బుల్లెట్ తగిలినా పోరాట యోధుడిలా పిడికిలి బిగించడం ఏంటో... అంతా సినిమాటిక్‌గా వుందని అమెరికా జనం అంటున్నారు. ఇదేదో తేడా వ్యవహారంలాగానే వుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చివరికి ట్రంప్ కూడా మన జగనని ఫాలో అయ్యే పరిస్థితికి దిగజారిపోయాడని తెలుగు రాష్ట్రాల ప్రజలు అనుకుటున్నారు. 2019 ఎన్నికలలో కోడికత్తి డ్రామా ఆడిన జగన్ అధికారంలోకి వచ్చారు. 2024 ఎన్నికలలో గులకరాయి డ్రామా ఆడారుగానీ, అది బెడిసికొట్టింది. మరి ఇప్పుడు జగన్ని ఫాలో అయిన ట్రంప్ 2019 లాగా లాభం పొందుతారో, 2024 లాగా చతికలపడతారో చూడాలి.

ఒంగోలు కార్పొరేషన్ తెలుగుదేశం వశం!?

వైసీపీ కష్టాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తరువాత ఇక ఆ పార్టీకి స్థానిక సంస్థలపై కూడా పట్టు లేకుండా పోతోంది. పలు కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో  వైసీపీ బలహీనం అవుతోంది. పంచాయతీలలో కూడా ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతోంది. తాజాగా   ఒంగోలు కార్పొరేషన్ ను వైసీపీ కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. పలువురు కార్పొరేటర్లు వైసీపీని వీడి తెలుగుదేశం గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవలి సాధారణ  ఎన్నికలకు ముందే ఐదుగురు వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం గూటికి చేరారు. ఇప్పుడు తాజాగా మరో కార్పొరేటర్ శనివారం (జులై13) తెలుగుదేశం గూటికి చేరారు. దీంతో  ఒంగోలు కార్పొరేషన్ లో తెలుగుదేశం బలం 13కు పెరిగింది. అయితే మరింత మంది కార్పొరేటర్లు కూడా వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని స్థానికంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒంగోలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు  ఒంగోలు కార్పొరేషన్ పై దృష్టి పెట్టి వైసీపీ కార్పొరేటర్లను తెలుగుదేశంలోకి ఆహ్వానిస్తున్నారు.  ఒంగొలు కార్పొరేషన్ కు వైసీసీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్నికలు జరగడంతో ఆ పార్టీ సామదానభేద దండోపాయాలతో కొర్పొరేషన్ ను కైవసం చేసుకుంది. ఒంగోలు కార్పొరేషన్ లో 50 డివిజన్లు ఉండగా వాటిలో 43 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అప్పటి ఎన్నికలలో తెలుగుదేశం 6 డివిజన్లలోనూ, జనసేన ఒక డివిజన్ లోనూ విజయం సాధించింది.   కార్పొరేషన్ లో మెజారిటీ సాధించాలంటే తెలుగుదేశం పార్టీకి 26 మంది కార్పొరేటర్లు అవసరం.  ప్రస్తుతం ఉన్న 13 మంది కార్పొరేటర్లు, ఒంగోలు ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల, సంతనూతల పాటు ఎమ్మెల్యే విజయ్ కుమార్ ను కార్పొరేషన్ లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా సభ్యత్వం తీసుకోవడానికి రెడీ గా ఉన్నారు. ఈ ముగ్గురూ కూడా తోడైతే ఒంగోలు కార్పొరేషన్ లో తెలుగుదేశం బలం 13కు చేరుతుంది.  మరో పది మంది వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం గూటికి చేరితే ఒంగోలు కార్పొరేషన్ తెలుగుదేశం హస్తగతం అవుతుంది.  తాజా పరిణామాలను గమనిస్తుంటే పలువురు వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం గూటికి చేరడానికి రెడీగా ఉన్నట్లు అవగతమౌతోంది. అలా చేరడానికి సిద్ధంగా ఉన్న కార్పొరేటర్ల సంఖ్య పది నుంచి 15 వరకూ ఉన్నట్లు వైసీపీ వర్గాలలోనే గట్టిగా వినిపిస్తున్నది.  తెలుగుదేశంలో చేరేందుకు అవకాశం లేని ఒకరిద్దరు జనసేన ద్వారా కూటమికి, తద్వారా తెలుగుదేశంకు దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఇప్పటికే ఒంగోలు మేయర్ గంగాడ సునీత తెలుగేదేశం గూటికి చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా చేరే అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ.. తెలుగుదేశం నేతలు మాత్రం ఆమెను పక్కకు పెట్టి నేరుగా కార్పొరేటర్లతోనే సంప్రదింపులు చేస్తున్నారు.  ఈ పరిస్థితిని గమనించిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి  వైసీపీ కార్పొరేటర్ల వలసన నిరోధానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు.  ఇటీవలి ఎన్నికలలో ఒంగోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఎన్నికలలో ఓటమి తరువాత బాలినేని హైదరాబాద్ కే పరిమితమయ్యారు. కార్పొరేషన్ చేజారకూడదన్న ఉద్దేశంతో ఆయన సోమవారం ఒంగోలు చేరుకున్నారు. అయితే కార్పొరేటర్ల వలసలను నిరోధించడానికి ఆయన ప్రయత్నాలు ఫలించే అవకాశాలు దాదాపు మృగ్యం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే కార్పొరేటర్ల వలసలను ఆపడానికి ఆయన పెద్దగా ఏమీ ప్రయత్నాలు చేయరని కూడా అంటున్నారు.  జగన్ రెండేళ్ల కిందట  మంత్రివర్గ విస్తరణలో తన మంత్రిపదవి ఊడబీకడం దగ్గర నుంచీ ఆ తరువాత జగన్  వ్యవహరించిన తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలినేని.. పార్టీ విషయాలు పెద్దగా పట్టించుకోవడం మానేశారు. ఎన్నికలలో పార్టీ ఓటమి, తన ఓటమి తరువాత ఆయన వైసీపీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒంగోలు కార్పొరేషన్ వైసీపీ చేజారకుండా ఆయన గట్టిగా ప్రయత్నించే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఏదో నామ్ కే వాస్తే కార్పొరేటర్లతో చర్చిస్తారే తప్ప వారిని పార్టీ మారకుండా నిరోధించేందుకు సీరియస్ గా ప్రయత్నించే అవకాశాలు లేవని అంటున్నారు. ఆ విషయం తెలుసు కనుకనే తెలుగుదేశంలో చేరాలని భావిస్తున్న కొందరు కార్పొరేటర్లు బాలినేని చెప్పేది విని ఆ  తరువాతే నిర్ణయం తీసుకునే ఉద్దేశంతో  ఉన్నారని అంటున్నారు. 

చంద్రబాబు చెప్పిన ‘స్పీడ్ బ్రేకర్లు’ ఎవరు?

‘‘మంచి చేయాలని అనుకునేవారికి ఇక స్పీడ్ బ్రేకర్లు వుండవు’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతి పరిసరాల్లోని కొలనుకొండలో వున్న హరేకృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చంద్రబాబు పైన పేర్కొన్న వ్యాఖ్య చేశారు. అక్కడ జరిగింది ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి, అక్కడ వున్న చాలామంది ఈ వ్యాఖ్యను ఒక ఆధ్యాత్మిక కోణంలో చూసి వుండొచ్చు. మంచి చేయాలని అనుకున్నవాళ్ళని దేవుడు చల్లగా చూస్తాడు కాబట్టి, వాళ్ళు అభివృద్ధి పథంలో స్పీడు బ్రేకర్లు లేకుండా దూసుకుని వెళ్తారు అనేది చంద్రబాబు ఉద్దేశం అనుకుని, మనసులో దేవుడికి భక్తిగా నమస్కారం పెట్టుకుంటారు. అలాంటి వారిని ఆ భక్తి పారవశ్యంలోనే వుంచేసి, మనం కొంచెం పక్కకి తప్పుకుని రాజకీయ మార్గంలోకి వద్దాం.  రాజకీయ మార్గంలోకి వస్తే, చంద్రబాబు ఎవరిని ఉద్దేశించి ‘స్పీడ్ బ్రేకర్లు’ అని వుండొచ్చని ఆలోచిస్తే, చాలామంది బుర్రలో టక్కున కనిపించే ఒక దివ్య అమంగళ విగ్రహం జగన్‌ది. ఐదేళ్ళపాటు రాష్ట్రాన్ని తన నీచ నికృష్ట పాలనతో సర్వనాశనం చేసిన జగన్ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం అయిపోయాడు. పైగా కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఢిల్లీకి పారిపోవాలని అనుకుంటున్నాడు. అందువల్ల చంద్రబాబు చేయాలనుకున్న మంచి పనులకు స్పీడ్ బ్రేకర్లా అడ్డు పడకుండా వుంటాడన్న ఆలోచన కొంత రాజకీయ స్పృహ వున్నవాళ్ళకి అనిపిస్తుంది. నిజానికి జగన్‌కి ఇప్పుడు చంద్రబాబుకు స్పీడ్ బ్రేకర్లా అడ్డుపడే సీన్ లేదు. ‘జగన్’ అనేది ఒక ముగిసిపోయిన చీకటి అధ్యాయం. సరే, జగన్ ఒక స్పీడ్ బ్రేకర్ అనుకుందాం. మరి చంద్రబాబు ‘స్పీడ్ బ్రేకర్లు’ అన్నారు. అంటే, జగన్ కాకుండా మరో స్పీడ్ బ్రేకర్ వున్నట్టే కదా.. ఇంతకీ ఎవరా స్పీడ్ బ్రేకర్. ఆ స్పీడ్ బ్రేకర్ మరెవరో కాదు.. ప్రధాని నరేంద్ర మోడీ. 2014లో టీడీపీ, బీజేపీ మధ్య స్నేహం వున్నా నిధుల విషయంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసింది సున్నా. అమరావతి విషయంలో, పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబును పెట్టిన ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావు. అప్పట్లో మోడీకి పూర్తి మెజారిటీ వుండేది కాబట్టి ఆయన ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెద్ద స్పీడ్ బ్రేకర్‌గా మోడీ మారారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేంద్రంలో చక్రం తిప్పే స్థాయిలో చంద్రబాబు వున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన నిధులను, ఏపీ న్యాయమైన డిమాండ్లను ప్రధాని ఒప్పుకోక తప్పని పరిస్థితులు వున్నాయి. ఈ రకంగా చూస్తే ఈసారి ఏపీ అభివృద్ధికి ‘మోడీ స్పీడ్ బ్రేకర్’ కూడా లేనట్టే.