పి.ఎం, సి.ఎంల‌కే పౌర‌స‌త్వ ఆధారాలు లేవ‌ట‌!

అవును. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం వివాదస్పదంగా మారిన నేపధ్యంలో  దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. దేశంలో తొలిసారి కులం ఆధారంగా పౌరసత్వం ఇవ్వబోతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతే కాదు ప్ర‌ధాని మోదీకి, హ‌ర్యానా ముఖ్య‌మంత్రికి పౌర‌స‌త్వ ఆధారాలున్నాయా అంటూ ఆర్ టి ఐ దాఖ‌లైంది. అయితే, ప్ర‌ధాని మోడీ కి పౌరసత్వం ఉందా అని RTI ద్వారా సమాచార ఆడిగితే PMO నుండి వచ్చిన సమాధానం ఆస‌క్తిక‌రంగా వుంది. ఏది క్లియర్ గా చెప్పలేకపోయారు, మోదీకి సంబంధించిన ఆధారాలు రిజిస్ట్రేషన్ అయ్యి లేవు కానీ, ఇండియా లో నే జన్మించారు కాబట్టి పౌరుడే అని స‌మాధానంలో ఆర్ టి ఐ అధికారులు వెల్ల‌డించారు. బీజేపీకి చెందిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్‌, అతని కేబినెట్ మంత్రుల పౌరసత్వాన్ని నిరూపించే ఆధారాలపై మ‌రో ఆర్ టి ఐ దాఖ‌లైంది. అస్సాంలో మాదిరిగానే హర్యానాలో తమ ప్రభుత్వం ఎన్.ఆర్.సి ని అమలు చేస్తుందని ఇటీవల నేవీ చీఫ్‌ అడ్మిరల్ సునీల్ లాంబ, రిటైర్డ్ హైకోర్ట్ జడ్జీ హెచ్.ఎస్. భల్లాలతో చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ ప్రకటన చేయడంపై విశేషం. ఈ నేప‌థ్యంలో  పానిపట్ కు చెందిన ఓ ఆర్టీఐ కార్యకర్త పి.పి కపూర్ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్, అతని ప్రభుత్వంలోని మంత్రులు, గవర్నర్ సత్యదేవ్ నారాయణ్‌ ఆర్య ల పౌరసత్వానికి సంబంధించిన ఆధారాలను ఇవ్వాల్సిందిగా సమాచార హక్కు చట్టం కింద జనవరి 20 న దరఖాస్తు చేశారు. అయితే ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్‌, అతని కేబినెట్ మంత్రుల పౌరసత్వాన్ని నిరూపించే  ఎలాంటి రికార్డ్స్ లేవని ప్రజా సమాచార అధికారి పూనమ్ రతి స‌మాధానం పంపించారు. అది సంగ‌తి. ఇన్ని రోజులుగా జనం చెప్పేది అదే.  మేమంతా ఇక్కడే పుట్టిపెరిగామని.

బాబును చావ‌గొట్టకుండా విడిచిపెట్ట‌డం అదృష్ట‌మేన‌ట‌!

త‌ప్పించుకొని వ‌చ్చినందుకు చంద్ర‌బాబు సంతోష‌ప‌డాలని జేసీ అంటున్నారు. విశాఖ జిల్లా పర్యటనకు వెళ్లిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేవ‌లం అడ్డుకున్నారు. చెప్పులు విసిరారు. అంత వ‌ర‌కే ఆగిపోయారు. ఇంకా ముందుకు వెళ్ళి చంద్ర‌బాబునాయుడిని కొట్టకపోవటం అదృష్టమే. చంద్ర‌బాబును పోలీసులే కింద పడేసి.. చావగొట్టకపోవటం సంతోషకరమని జేసీ దివాక‌ర్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు దుమారాన్ని రేపుతున్నాయి. నోటి దూల తీర్చుకోవ‌డం జేసీ దివాక‌ర్ రెడ్డికి అల‌వాటే. తాజాగా చంద్ర‌బాబునుదే్ద‌శించి జేసీ కామెంట్స్ సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. అస‌లు జీసీ చంద్ర‌బాబును పొగుడుతున్నారా?  లేక వ్యంగం ఎక్కువైందా అని టిడిపిలో చ‌ర్చ మొద‌లైంది. చంద్రబాబు విషయంలో మితిమీరిన ఉత్సాహంతో దివాక‌ర్‌రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నార‌ని టిడిపి నేత‌లు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. అంతే కాదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన భేషుగ్గా వుంద‌ని,  అతనెప్పటికి తమ వాడేనని జేసీ వ్యాఖ్యానించ‌డం టిడిపి శ్రేణుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

వెల్లుల్లికి కరోనాను ఎదుర్కొనే శక్తి వుందా?

కరోనా మందు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చా! తాజాగా ఉడికించిన వెల్లుల్లితో కరోనాను కంట్రోల్ చేయ‌వ‌చ్చ‌ట‌.  ఓ చైనా వైద్యుడు ఈ చిట్కాను అనేక మంది కరోనా రోగులపై ప్రయోగించి విజయం సాధించినట్టు తెలుస్తోంది . ఈ మందు ఎలా చేసుకోవాలంటే .. ఎనిమిది తరిగిన వెల్లుల్లి , లవంగాలను తీసుకోవాలి. వాటిని ఏడు కప్పుల నీటిలో వేసి మరిగించాలి . బాగా మరిగిన తర్వాత .. ఆ వెల్లుల్లి రెబ్బలను, లవంగాలను తినేయాలి .. వెల్లుల్లి , లవంగాలను మరగపెట్టగా వచ్చిన నీటిని తాగేయాలి. ఇలా ఒక రాత్రి చేస్తే .. తెల్లవారే సరికల్లా కరోనా చాలా మందికి నయమైందని చెబుతున్నారు.

చంద్ర‌బాబు కుటుంబం హత్యకు వైసీపీ కుట్ర!!

చంద్రబాబు సహా ఆయన కుటుంబ సభ్యులను అంతమొందించేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఇటీవలే విశాఖలో చంద్రబాబు, మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో లోకేష్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని అన్నారు. చంద్రబాబు, లేకేష్‌ను లేకుండా చేస్తే రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండదని సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుపై లోకేశ్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తే పోలీసులకు బాధ్యతారాహిత్యంగా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాల‌ని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు, లోకేశ్‌కు భద్రత తగ్గింపుపై కేంద్రానికి లేఖ రాస్తామని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. 

బిగ్‌బాస్‌-3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌పై దాడి

ప‌బ్‌లో గ్యాంగ్ వార్‌   ఎమ్మెల్యే సోద‌రుడి గ్యాంగ్‌తో త‌ల‌ప‌డ్డ రాహుల్ గ్యాంగ్‌ బిగ్‌బాస్‌-3 విజేత, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌పై హైదరాబాద్‌లోని ఓ పబ్బులో దాడి జరిగింది. తలపై బీరుసీసాలతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. రాహుల్‌ సిప్లిగంజ్‌ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్  ఎంజాయ్ చేస్తూ  ఇబ్బందుల్లో ప‌డ్డాడు.   అదే ప‌బ్‌లో కొంతమంది యువకులు రాహుల్‌ వెంట వచ్చిన యువతి ని చూసి కామెంట్లు చేస్తూ అస‌భ్య‌క‌రంగా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోయాడు. రాహుల్‌ వారిని నిలదీయడంతో మాటామాటా పెరిగింది. అంతే ఇరు ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. సినిమా షూటింగ్‌ను త‌ల‌పించేలా అర‌గంట సేపు గ్యాంగ్ వార్ న‌డిచింది. ఈ గొడ‌వ‌లో కొంత మంది యువ‌కులు రాహుల్‌ను బీరు సీసాలతో కొట్టారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన వారిలో వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు ఉన్నట్లు సమాచారం. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రాహుల్ చికిత్స పొందుతున్నాడు. 

జీసస్ శిలువ తొలగింపుపై దుమారం.. దేవనహళ్లిలో ఉద్రిక్త‌త‌

బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించారంటూ ఏసుక్రీస్తు విగ్రహం, కొన్ని శిలువలను స్థానిక మున్సిపల్ అధికారులు తొలగించారు. స్థానిక క్రైస్తవులు అడ్డుపడ్డారు. అధికారులు విగ్రహం, శిలువలను ధ్వంసం చేశారు. జీసస్ విగ్రహాన్ని, శిలువలను నేలమట్టం చేశారు. శిథిలాలను ట్రక్కులో తరించారు.  దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు ఎలాంటి నోటీసులను కూడా ఇవ్వకుండా విగ్రహాన్ని ఎలా తొలగిస్తారంటూ  క్రైస్తవ మత పెద్దలు నిల‌దీసినా అధికారులు ప‌ట్టించుకోలేద‌ట‌. ప్రభుత్వం స్మశాన వాటిక కోసం క్రైస్తవ సంఘాలకు కేటాయించిన 4.20 ఎకరాల స్థలంలోనే తాము విగ్రహాన్ని నిర్మించామని క్రైస్తవ మత పెద్దలు చెబుతున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి కొంత మంది క్రిస్టియ‌న్లు అక్కడ జీసస్ విగ్రహాన్ని, శిలువను నిర్మించారంటూ స్థానిక భారతీయ జనతా పార్టీ, సంఘ్ పరివార్ కార్యకర్తలు ఫిర్యాదు చేయ‌డంతో తాము పోలీసుల సహాయంతో చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని అధికారులు చెబుతున్నారు. 

బీసీలను నమ్మించి మోసం చేస్తారా?

బీసీ కోటాపై సుప్రీంకు వెళ్ళండి! ప్రభుత్వం తరఫున ఎస్‌ఎల్‌పీ వేయండి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయండి సి.ఎం. జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు లేఖ‌ బీసీల రిజర్వేషన్‌ పరిరక్షణ కోసం తక్షణం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేయాలని సీఎం జగన్మోహన్‌రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వచ్చిన హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయకుండా.. వారికి 24 శాతం రిజర్వేషన్‌తోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలనుకోవడం పై ఆయ‌న తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.   బీసీల రిజర్వేషన్ పై అఖిల పక్ష సమావేశం పిలవకుండా, బీసీ సంఘాలను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని చంద్ర‌బాబు త‌ప్పుప‌డుతూ  ముఖ్యమంత్రికి  చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్‌, బీసీ సబ్‌ప్లాన్‌ అంటూ ప్రచారం చేసి.. అధికారంలోకి రాగానే రిజర్వేషన్లు తగ్గించి వెన్నుముక విరిచేయడం, బీసీలను నమ్మించి మోసం చేయడమేన‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

లింగమనేని కార్యాలయంలో ఐటీ సోదాలు

తెలుగుదేశం పార్టీకి ఆర్ధిక మూల స్థంబాలైన‌ సంస్థ‌ల‌పైనే ఐటి గురి చేసి దాడులు నిర్వ‌హిస్తోంది. టీడీపీ విజయం కోసం ఎన్నికల్లో ఆర్ధిక సాయం చేసిన వారి జాబితా తీసుకొని ఐటి దాడులు కొన‌సాగుతున్నాయి. మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు సన్నిహితులపై మరోసారి ఆదాయ‌పు ప‌న్ను శాఖ దాడులు నిర్వ‌హించింది. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి యజమాని లింగమనేని రమేష్ తో పాటు రాష్ట్రంలోని నారాయణ, చైతన్య విద్యాసంస్ధల క్యాంపస్ లలోనూ ఐటీ సోదాలు చేసి  పలు కీలక డాక్యుమెంట్లను, రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజధాని భూముల వ్యవహారంలో లింగమనేని వెంచర్స్‌ యజమాని రమేష్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో చంద్రబాబు మాజీ కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ తో పాటు మరికొందరు టీడీపీ ముఖ్యనేతల కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో 2 వేల కోట్ల రూపాయల మేర అక్రమ లావాదేవీలకు సంబందించిన ఆధారాలు సంపాదించిన ఐటీ శాఖ ఇప్పుడు మరికొందరి కార్యాలయాల్లో దాడులు నిర్వహిస్తోంది. ఇందులో చంద్రబాబు ఉండవల్లి నివాసం యజమాని లింగమనేని రమేష్ కు చెందిన లింగమనేని ప్రాపర్టీస్ తో పాటు చైతన్య విద్యాసంస్ధలు కూడా ఉన్నాయి. విజయవాడ గాయత్రీ నగర్ లోని లింగమనేని ప్రాపర్టీస్ కార్యాలయంతో పాటు రాష్ట్రంలో చైతన్య, నారాయణ విద్యాసంస్ధలకు చెందిన పలు క్యాంపస్ లలో ఐటీ దాడులు చేస్తోంది. ఇందులో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ తోపాటు చైతన్య విద్యాసంస్ధల అధినేత బీఎస్ రావు, నారాయణ సంస్ధల అధినేత నారాయణ ముగ్గురూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులే. వీరంతా గతంలో టీడీపీ విజయం కోసం పలు ఎన్నికల్లో ఆర్ధిక సాయం చేసిన వారే. అలాగే గత ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కు మద్దతుగా వీరు నిధులు సరఫరా చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత ఆదేశాలతో వీరు కాంగ్రెస్ కు నిధులు పంపారా అన్న కోణంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు అర్ధమవుతోంది.

పెట్రోల్ పోస్తుండగా మంటలు.. బాలిక మృతి.. మ‌రో బాలుడికి గాయాలు

బైక్‌లో పెట్రోల్ పోస్తుండగా ప్రమాదవశాత్తూ మంటలు వ్యాపించి బాలిక మృతి చెందింది. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం చక్రాయపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బైక్‌లో పెట్రోల్ పోస్తుండగా ఒక్కసారిగా మంటలు చెల‌రేగాయి. అవి విస్త‌రించి బాలికకు అంటుకోవడంతో ఆమె శరీరం కాలిపోయింది. కాలిన గాయాలతో బాలిక మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో బాలులుడు కూడా తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అస‌లు పెట్రోల్ పోసేట‌ప్పుడు మంట‌లు ఎందుకు వ‌చ్చాయి. దీనిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. స్థానిక పోలీసులు కేసు న‌మోదు చేసుకొని విచార‌ణ చేప‌ట్టారు.

పీజీ వైద్య సీట్ల భర్తీకి షెడ్యూల్‌

ఆలిండియా కోటా లో 50 శాతం సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల పరిధిలోనే భ‌ర్తీ చేస్తారు. ఈ సీట్లకు ఈ నెల 12 నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి దేశవ్యాప్తంగా పీజీ వైద్య డిగ్రీ, పీజీ డిప్లొమా సీట్ల భర్తీకి కేంద్రం బుధవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలల పరిధిలో మొత్తం సీట్లలో 50 శాతం సీట్లు జాతీయ కోటాలో ఉంటాయి. ఈ సీట్లకు ఈ నెల 12 నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని షెడ్యూల్‌లో పేర్కొంది. మొత్తం మూడు రౌండ్లలో సీట్ల భర్తీ జరగనుంది. మూడు రౌండ్లలో చివరిదైన మాప్‌ అప్‌ రౌండ్‌ తర్వాత మే 27లోగా సీట్లలో చేరకపోతే వాటిని ఖాళీ సీట్లుగా గుర్తించి మే 31లోగా భర్తీ చేస్తారు.

విజయవాడలోనూ కరోనా వైరస్?

బెజవాడకు చెందిన ఓ యువకుడికి కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆ యువకుడుని నగరంలోని కొత్త ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జీజీహెచ్‌ ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు ఇటీవల జర్మనీ నుంచి విజయవాడకు వచ్చినట్లు తెలుస్తోంది. తీవ్రమైన జ్వరం, జలుబు ఉండడంతో యువకుడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కరోనా నిర్ధారణ కోసం శాంపిల్స్‌ని తిరుపతికి పంపించే ఆలోచన చేస్తున్నారు. మ‌న దేశంలో ఇప్పటివరకు 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ అధికారిక ప్రకటన చేశారు. 12మంది భారతీయులు 16మంది విదేశీయులకు కరోనా సోకిందన్నారు.  ప్రపంచవ్యాప్తంగా  80 దేశాల్లో  3500 పైచిలుకు మంది మృతి చెందారు.

స్థానిక ఫ‌లితాలు తారుమారైతే వేటు త‌ప్ప‌దు

గెలిపించాల్సిన బాధ్యత మంత్రులదే! మంత్రివర్గ సమావేశంలో హెచ్చ‌రించిన సి.ఎం. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ సీరియస్ గా చర్చించింది. అన్ని స్థానాలను గెలిపించాల్సిన బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలదే అన్నారు సీఎం జగన్. ఫ‌లితాలు తారుమారైతే మంత్రిప‌ద‌వులు ఊడ‌టం ఖాయ‌మ‌ని. స‌హ‌క‌రించ‌ని ఎమ్మెల్యేల‌కు మ‌రో సారి సీటు ద‌క్క‌ద‌ని హెచ్చ‌రించారు. నియోజకర్గాల్లో మంచి ఫలితాలు రాకపోతే మంత్రి పదవులకు వెంట‌నే రాజీనామా చేయాల్సివుంటుందని మంత్రులకు టార్గెట్‌ల‌ను ఇచ్చారు. అన్ని స్థానాలను వైసీపీ దక్కించుకునేలా కృషి చేయాలని మంత్రులను ఆదేశించారు.

ఉగాది రోజే 26 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ

ఇక ఏపీలో వైఎస్సార్‌ జగనన్న కాలనీలు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీల‌క నిర్ణ‌యాలు ఉగాది రోజు రాష్ట్ర వ్యాప్తంగా 26లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర స‌మాచారశాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. ‘‘స్థలం పొందిన లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడానికి అనుమతి పత్రంతో పాటు, ఐదేళ్ల వరకు స్థలం బ్యాంకులో తనఖా పెట్టుకోవడానికి.. ఐదేళ్ల తర్వాత విక్రయానికి హక్కు కల్పిస్తూ పట్టా ఇవ్వబోతున్నారు. ఇందుకోసం అందరు తహశీల్దార్లకు జాయింట్‌ సబ్‌ రిజిస్టార్లుగా హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేసేందుకు 43,141 ఎకరాల భూమిని సిద్దం చేశారు. ఇందులో 26,976 ఎకరాల ప్రభుత్వ భూమి, 16,164 ప్రైవేటు భూమి ఉంది. యుద్ధ ప్రాతిపదికన ప్లాట్లు అభివృద్ధి చేసి లబ్ధిదారులకు ఇవ్వబోతున్నారు. ఈ కాలనీలన్నింటికీ వైఎస్సార్‌ జగనన్న కాలనీలుగా నామకరణం చేస్తారు. ఎన్‌పీఆర్‌కు సంబంధించి మైనారిటీలకు అభయమిచ్చేలా తీర్మానం చేశారు. 2010లో చేసిన ప్రక్రియకే పరిమితమై గత ప్రశ్నలే ఉంచాలని తీర్మానంలో పేర్కొన్నారు. అప్పటి వరకు ఎన్‌పీఆర్‌ ప్రక్రియను ఏపీలో నిలిపివేయాలని తీర్మానించిన‌ట్లు  మంత్రి పేర్ని వివర‌ణ ఇచ్చారు. రుణం తీసుకునేందుకు సీడ్‌ కార్పొరేషన్‌కు అనుమతి పోర్టుల నిర్మాణానికి ఏర్పాట్లతో పాటు అడ్డంకులు తొలగించేలా కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్న‌ట్లు మంత్రి పేర్ని నాని చెప్పారు. కృష్ణపట్నం పోర్టు పరిధి కుదింపునకు రాటిఫికేషన్‌ చేయడంతో పాటు అక్కడ 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నామన్నారు. రూ.500కోట్ల రుణం తెచ్చుకునేందుకు సీడ్‌ కార్పొరేషన్‌కు కేబినెట్‌ అనుమతి ఇచ్చింది. ఒంగోలులో తెదేపాకు కేటాయించిన రెండు ఎకరాల భూమిని రద్దు చేస్తూ తీర్మానం చేశారు.  ఆ భూమిని తిరిగి జలవనరుల శాఖకు అప్పగించేలా నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు.   భోగాపురం విమానాశ్రయం పనుల్లో జీఎంఆర్‌కు అనుమతిస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంది.

మాస్క్‌ల ధరలకు రెక్కలు వచ్చాయి!

న‌గ‌రంలో మాస్క్‌ల కృత్రిమ కొరత‌ హైద‌రాబాద్‌లోని 80 శాతం మెడిక‌ల్ షాప్‌ల‌లో మాస్క్‌లు లేవు. ఎక్కువ ధ‌ర‌కు అమ్ముతూ ప్రజల్ని దోచుకుంటున్న మందుల‌షాపులు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల వద్ద మాస్కులకు విప‌రీత‌ డిమాండ్‌ హైద‌రాబాద్ మెడిక‌ల్ షాప్‌ల‌లో మాస్క్‌ల కొర‌త‌పై తెలుగు వ‌న్ టీం గౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ నగర ప్రజలకు కరోనా వైరస్ భయంపట్టుకుంది. మాస్క్‌లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.  అందుకేనేమో మాస్క్‌ల ధరలకు రెక్కలొచ్చాయి.  వైరస్ సోకకుండా వుండడానికి మాస్క్‌ల ధరించాలన్న ఉద్దేశంతో చాలా మంది మాస్క్‌లకు ఎగబడుతున్నారు. ఎర్ర‌గ‌డ్డ చెస్ట్ ఆసుప‌త్రి, గాంధీ, ఉస్మానియా ఆసుప‌త్రి చుట్టుప‌క్క‌ల ఉన్న మెడిక‌ల్ షాప్‌ల‌లో మాస్క్ కొన‌డానికి వెళ్ళిన తెలుగువ‌న్ టీంకు చేదు అనుభ‌వం ఎదురైంది. మొత్తం 38 షాపుల్లో కేవ‌లం 7 షాపుల్లోనే మాస్క్‌లు దొరికాయి. మిగ‌తా 31 మెడిక‌ల్ షాప్‌ల‌లో స్టాక్ లేద‌ని స‌మాధానం. మాస్క్‌లు, శానిటైజ‌ర్‌లు త‌క్కువ మోతాదులో సేల్ అయ్యే ఐట‌మ్స్ కాబ‌ట్టి జ‌న‌ర‌ల్‌గా మెడిక‌ల్ షాపుల్లో స్టాక్ త‌క్కువ‌గా వుంటుందని మెడిక‌ల్ షాప్ నిర్వాహ‌కులు చెబుతున్నారు. షాప్‌కు వ‌చ్చే 10 మంది క‌స్ట‌మ‌ర్ల‌లో 9 మంది మాస్క్‌ల‌నే అడుగుతున్నార‌ట‌! 50 రూపాయ‌లైనా ఇస్తాం. మాస్క్ ఇవ్వ‌మ‌ని డిమాండ్ చేస్తున్నా ఇవ్వ‌లేక‌పోతున్నామంటున్నారు మెడిక‌ల్ షాప్ నిర్వాహ‌కులు. ఎర్ర‌గ‌డ్డ చెస్ట్ ఆసుప‌త్రికి కిలోమీట‌ర్‌ ప‌రిధిలో వున్న 8 పెద్ద మెడిక‌ల్ షాపుల్లో ఆరు మెడిక‌ల్ షాపుల్లో స్టాక్ లేద‌న్నారు. మెడ్‌ప్ల‌స్ అమీర్‌పేట లాల్‌బంగ్లా బ్రాంచ్ బ‌య‌ట నో స్టాక్ బోర్డే పెట్టేశారు. రెండు షాప్‌ల‌లో సాదార‌ణ మాస్క్‌ను 20 రూపాయ‌ల‌కు సేల్ చేశారు. గాంధీ ఆసుప‌త్రి చుట్టుప‌క్క‌ల 15 మెడిక‌ల్ షాప్‌ల‌లో కేవ‌లం నాలుగు చోట్ల మాత్ర‌మే మాస్క్‌లు దొరికాయి. ఉస్మానియా ఆసుప‌త్రి స‌మీపంలోని 15 మెడిక‌ల్ షాప్‌ల‌లో మాస్క్ కొన‌డానికి వెళ్ళిన మా టీంకు విచిత్ర‌మైన అనుభ‌వం క‌లిగింది. మ‌ధ్య‌నిషేధం వున్న‌ప్పుడు ర‌హ‌స్యంగా బ్లాక్‌లో మందు అమ్మిన‌ట్లు ఇప్పుడు మెడిక‌ల్ షాప్ బ‌య‌ట బ్లాక్‌లో మాస్క్‌లు  అమ్ముతున్నారు. ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కొంత మంది మందుల షాపుల నిర్వాహ‌కులు వాటి ధరలను అమాంతం పెంచేసి విక్రయిస్తున్నారు.  నిన్నటిదాకా రిటైల్‌గా ఐదు రూపాయలు, హోల్‌సేల్‌లో రూపాయి 60 పైస‌లు విలువ చేసే రెండు లేయర్ల మాస్క్ ధర ఇప్పుడు 20 నుంచి 25  రూపాయ‌లకు  డిమాండ్‌ను బట్టి విక్రయిస్తున్నారు. 40 రూపాయ‌లు  విలువ చేసే ఎన్ 95 మాస్క్‌ను 300 రూపాయ‌ల‌కు విక్రయిస్తున్నారని ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. త‌క్కువ ధ‌ర‌కు ల‌భించే జనరిక్ మందుల షాపుల్లోనూ మాస్క్‌ ధర అమాంతం పెరిగిపోయింది. ఒక్కో మాస్కును 15 నుంచి 20 రూపాయ‌ల‌కు విక్రయిస్తున్నారు. గతంలో వంద మాస్కుల ప్యాకెట్ 160 రూపాయ‌లుంటే ఇప్పడది ఏకంగా 1600 రూపాయ‌ల‌కు పెరిగింది. ప్రస్తుత డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని హోల్‌సేల్‌ అమ్మకందార్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. స్టాక్ ని దాచి పెట్టి తర్వాత ఎక్కువ రెట్లు పెట్టి అమ్ముకోవ‌చ్చ‌నే ఆలోచ‌న‌ల‌తో   కొంత మంది మెడిక‌ల్ షాపుల నిర్వాహ‌కులున్నారు. సానిటైజర్ లు అయితే అసలు లేవని చెప్పేస్తున్నారు. అయితే నిజంగా స్టాక్ లేదా?  లేక కృత్తిమ కొరత సృష్టించి దోచుకుంటున్నారా?   రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లోనే ప‌రిస్థితి ఇంత దారుణంగా వుంటే ప్ర‌భుత్వం ఏం చేస్తోంది?  కృత్రిమ కొరత సృష్టించి మెడిక‌ల్ షాప్‌ల నిర్వాహ‌కులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని జ‌నం బెంబేలెత్తుతున్నారు. ఇప్ప‌ట్టికైనా ముఖ్య‌మంత్రి కెసిఆర్ స్పందించి ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన మాస్క్‌ల‌ను అందుబాటులో పెట్టాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు. 

ఏపీలో కలకలం.. కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన మరో ఆరుగురు!

కరోనా వైరస్ లక్షణాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా బయటపడుతున్నాయి. విశాఖ, విజయవాడ, ఏలూరులో పలువురు కరోనా అనుమానిత వ్యక్తులు ఆస్పత్రుల్లో చేరారు. వైద్యులు, వారి రక్త నమూనాలను టెస్టుల కోసం ల్యాబ్ లకు పంపించారు. ప్రస్తుతం వారందరినీ ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి వైద్యం అందిస్తున్నారు.  పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు కరోనా వైరస్ లక్షణాలతో చేరారు. బాధితుల్లో ఒకరు గత నెల 18న మస్కట్ నుంచి వచ్చినట్టుగా గుర్తించారు. విశాఖలో సింగపూర్ నుంచి వచ్చిన ఓ కుటుంబం కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ కుటుంబానికి చెందిన ముగ్గురిని.. విశాఖ చెస్ట్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయవాడలో ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో ఒక వ్యక్తి చేరాడు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో స్థిరపడిన ఆ వ్యక్తి ఇటీవలే జర్మనీకి వెళ్లి వచ్చాడని గుర్తించారు. ఇప్పటికే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసు నమోదవ్వడంతో.. ఏపీ అధికారులు అప్రమత్తమయ్యారు.

గోదావరి జిల్లాలో కరోనా కలకలం!

ముందు జాగ్రత్తగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్పిటల్ లో ఐసోలేషన్ సెంటర్లు వెంటి లెటర్లు తో ప్రత్యేక వార్డ్ లు తాజా ప‌రిస్థితుల‌పై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స‌మీక్ష‌ ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపింది. ఇటీవల దక్షిణ కొరియా వెళ్లి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి కరోనా సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కరోనా వైరస్ సోకినట్లుగా అనుమానిస్తున్న ఈ వ్యక్తి ఇటీవల ఓ పెళ్ళికి కూడా హాజరైనట్లు తెలుస్తోంది. కొత్తపేట మండలం వాడపాలేనిలోకి చెందిన సదరు వ్యక్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఎపి లో క‌రోనా వైర‌స్ ఆన‌వాళ్ల‌పై అప్రమత్తమైన AP వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, బాధిత వ్య‌క్తి ఆరోగ్య‌ప‌రిస్థితి, చేప‌డుతున్న చికిత్స‌పై వైద్య అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. కొత్త పేట మండలం వాడపల్లి గ్రామానికి చెందిన బండారు వెంకటేస్వర్లు ఆరోగ్య ప‌రిస్థితిపై నిల‌క‌డ‌గా వుంద‌ని, వైద్య పరీక్షలకు కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐస్లేషాన్ వార్డ్ లో వెంకటేస్వర్లు కు వైద్య పరీక్షలు నిర్వ‌హించిన‌ట్లు అధికారులు మంత్రికి తెలిపారు. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తాజా ప‌రిస్థితిపై స‌మీక్షించారు. కోన సీమ ప్రాంతంలో ప్రజలు ఆందోళన చెందవ‌ల్సిన అవ‌స‌రం లేద‌ని ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టిందని మంత్రి భ‌రోసా ఇచ్చారు. ముందు జాగ్రత్తగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్పిటల్ లో ఐసోలేషన్ సెంటర్లు సిద్ధం చేస్తున్నారు. వెంటి లెటర్లు తో ప్రత్యేక వార్డ్ ల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న రెడీ చేశారు. సెక్రటేరియట్ లో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. 0866-2410978నెంబర్ కు ఫోన్ చేయవచ్చు.

మధ్యప్రదేశ్ లో కర్నాటక తరహా గేమ్... హుటాహుటిన ఢిల్లీకి శివరాజ్ సింగ్...

మధ్యప్రదేశ్ లో కర్నాటక తరహా నెంబర్ గేమ్ మొదలైంది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలతో మధ్యప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నెంబర్ గేమ్ తర్వాత కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడే, బీజేపీ నెక్ట్స్ టార్గెట్ మధ్యప్రదేశే నంటూ వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేయడంతో ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది. ఆర్నెళ్లు తిరగకుండానే, మళ్లీ ఇప్పుడు మధ్యప్రదేశ్ లో నెంబర్ గేమ్ మొదలైంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 సీట్లు ఉండగా, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలు.... బీజేపీ 107 సీట్లు గెలుచుకున్నాయి. అలాగే, నలుగురు ఇండిపెండెంట్స్ గెలవగా, బీఎస్పీ 2, ఎస్పీ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. రెండు స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు 116 సీట్లు కావాల్సి ఉండటంతో, ఎస్పీ, బీఎస్పీ, నలుగురు ఇండిపెండెంట్స్ తో కలిసి మొత్తం 121మంది బలంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, బీజేపీ కంటే కేవలం ఏడు సీట్లు మాత్రమే ఎక్కువ గెలుచుకున్న కాంగ్రెస్.... ఎస్పీ, బీఎస్పీ, ఇండిపెండెంట్స్ మద్దతుతో సర్కారును నడుపుతోంది. ఇదే, బీజేపీకి ఆయుధంగా మారింది. మ్యాజిక్ ఫిగర్ కు కేవలం 9 సీట్ల దగ్గర ఆగిపోయిన కాషాయ పార్టీ, ఇఫ్పుడు నెంబర్ గేమ్ మొదలుపెట్టింది. కర్నాటక తరహాలోనే అసమ్మతి రాజేసి గద్దెనెక్కేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే 8మంది ప్రభుత్వ ఎమ్మెల్యేలకు వల విసిరిందని అంటున్నారు. 8మందిలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాగా, మిగతా నలుగురు బీఎస్పీ, ఎస్పీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలని చెబుతున్నారు. అయితే, బీజేపీ బంధించిన 8మంది ఎమ్మెల్యేల్లో, నలుగురు తప్పించుకుని వచ్చారని, ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ ఆధీనంలోనే ఉన్నారని దిగ్విజయ్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలతో కమలనాథులు కొట్టిపారేస్తున్నారు. కేవలం సంచలనం కోసమే కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని బీజేపీ మండిపడుతోంది. ఏదో ఒక సంచలనం లేదా కలకలం సృష్టించి, తిరిగి రాజ్యసభకు ఎన్నిక కావాలన్న ఉద్దేశంతోనే దిగ్విజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ అగ్రనేత, మాజీ సీఎం శివరాజ్ సింగ్ ఆరోపించారు. అయితే, శివరాజ్ సింగ్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లడంతో మధ్యప్రదేశ్ లో నెంబర్ గేమ్ పై అనుమానాలు పెరుగుతున్నాయి. మరి, స్వల్ప మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కమల్ నాథ్... తన సర్కారును కాపాడుకుంటారో లేక... కర్నాటక తరహాలో అధికార పీఠాన్ని కోల్పోతారో వేచిచూడాలి.