ఆరు జాగ్రత్తలు పాటిస్తే కరోనా రాదు

  వేడి వాతావరణంలోనూ కరోనా వైరస్ 48 గంట‌లు బ్ర‌తుకుతుంది పాయింట్ 1 కరోనా గాలి ద్వారా వచ్చే వైరస్ కాదు. అంటే... గుంపుగా జనం ఉన్నా... అక్కడి గాలిలో కరోనా వైరస్ ఉండదు. కానీ... ఆ జనంలో ఎవరికైనా కరోనా వైరస్ ఉంటే... వాళ్లు దగ్గినా, తుమ్మినా... అప్పుడు వచ్చే నీటి బిందువుల్లో (తుంపర్లలో) కరోనా వైరస్ ఉంటుంది. అది గాలిలో ఎగురుతూ వచ్చి మనపై పడితే... వైరస్ మనపై చేరే ప్రమాదం ఉంటుంది. అంటే వైరస్ మనకు చేరకుండా ఉండాలంటే... మనపై ఏ తుంపర్లూ పడకూడదన్నమాట. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోండి. పాయింట్ 2 ఈ వైరస్ ఉన్న వ్యక్తులు ప్రయాణాల్లో బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో, ఆటోల్లో ఎక్కడైనా సరే, ఏదైనా వస్తువును (రాడ్లు, సీట్లు, డోర్లు వంటివి) ముట్టుకుంటే... వాటిపై వైరస్ ఉండే ఛాన్సుంటుంది. అదే వస్తువును మనమూ ముట్టుకుంటే... ఆ వైరస్ మనపై చేరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి... వీలైనంతవరకూ అలాంటివేవీ ముట్టుకోకుండా జాగ్రత్త పడాలి. చేతులకు గ్లోవ్స్ వాడితే మంచిదే. లేదంటే ప్రయాణం తర్వాత చేతుల్ని సబ్బుతో బాగా కడిగేసుకోవాలి. అలాగే... ప్రయాణ సమయాల్లో హ్యాండ్ శానిటైజర్ వాడాలి. రెండు, మూడు చుక్కలు చేతిలో వేసుకొని... రెండు చేతులకూ రాసుకోవాలి. అలా ప్రయాణం చేసిన ప్రతిసారీ రాసుకుంటే... వైరస్ మన చేతులకు చేరదు. పాయింట్ 3 ముఖానికి మాస్క్ పెట్టుకుంటే చుట్టూ ఉన్నవాళ్లు మనల్నే చూస్తూ... అమ్మో ఇతనికి వ్యాధి ఉందేమో అనుకునే ఛాన్స్ ఉంటుంది. అయినప్పటికీ మాస్క్ వాడటం మేలు కాబట్టి... అది వాడొచ్చు. లేదంటే కనీసం కర్చీఫ్ అయినా ముఖానికి (ముక్కూ, నోరూ మూసుకునేలా) కట్టుకుంటే మంచిదే. పాయింట్ 4 వైరస్ ఉన్నవారికి కనీసం 2 మీటర్ల దూరంలో ఉండాలి. కానీ ఎవరికి వైరస్ సోకిందో మనకు తెలియదు కదా. కాబట్టి... మనలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే  పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, గింజల వంటివి ఎక్కువగా తినాలి. ముఖ్యంగా పుల్లటి పండ్లను బాగా తినాలి. వాటిలోని C విటమిన్... ఇలాంటి వైరస్‌లను బాడీలోకి రానివ్వకుండా చేస్తుంది. పాయింట్ 5 జలుబు, దగ్గు, నీరసం, ఆయాసం వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ వైరస్ వెంటనే సోకుతోంది. కాబట్టి... ఇలాంటి అనారోగ్యాలు ఉన్నవారు మరింత ఎక్కువ జాగ్రత్త పడాలి. బయటి ప్రయాణాలు మానుకుంటే బెటర్. పాయింట్ 6 ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వైరస్ సోకితే... భయపడాల్సిన పనిలేదు. మనో ధైర్యంతో నాకేంకాదు... కచ్చితంగా రికవరీ అవుతా అని మనసులో మాటిమాటికీ అనుకుంటూ ధైర్యంగా ఉండాలి. ఈ ధైర్యం పెరిగేకొద్దీ... బాడీలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అది వైరస్‌తో పోరాడుతుంది.

సెక్స్‌కు పెళ్లికి ముడి!

సెక్స్ ఈక్వల్స్ టు మ్యారేజ్ అంటున్నారు ర‌ష్య అధ్యక్షుడు పుతిన్ సెక్స్ అంటే అది పూర్తిగా పెళ్లితో నిమిత్తం అయింద‌ని, ఒకరితో సెక్స్ లో పాల్గొంటే వారిని పెళ్లి చేసుకున్నట్టే అని  అధ్యక్షుడు పుతిన్  రాజ్యాంగంలోనే స‌వ‌ర‌ణ చేయ‌డానికి సిద్ధ‌మైయ్యార‌ట‌. సెక్స్ అనేది మనిషి కనీస అవసరం. సెక్స్ కోసమని పెళ్లి చేసుకోవడం లేదా సెక్స్ చేసిన వారితో పెళ్లి అయిపోయిందంటే ఎలా అని ర‌ష్యాలో ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మ‌రో ప‌క్క స్వలింగ సంపర్క వివాహాలను కూడా రష్యాలో నిషేధిస్తూ పుతిన్ నిర్ణయం తీసుకున్నారు. వివాహం అంటే అది స్త్రీ- పురుషుడికి జరిగిదే అని.. మగాడు-మగాడు స్త్రీ- స్త్రీ పెళ్లి చేసుకుంటే అలాంటి పెళ్లిని ఆమోదించేది లేదని పుతిన్ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. సేమ్ సెక్స్ మ్యారేజెస్ కు ఆమోదమే లేకుండా కొత్త చట్టాలను చేస్తున్నారు ఇప్పుడు ర‌ష్యాలో.

స్టూడెంట్‌తో టీచర్ కామక‌లాపాలు!

త‌న స్టూండెంట్‌పైనే క‌న్నేసాడు ఆ టీచ‌ర్‌. మాయ మాట‌ల‌తో లొబ‌ర్చుకున్నాడు. రూంకు పిలిపించుకొని ఎంజాయి చేశాడు. ఈ దారుణం  కర్ణాటకలోని మైసూర్ జిల్లా నంజన్‌గుడ్ తాలుకా రాంపురా గ్రామంలో జ‌రిగింది. రిటైర్‌మెంట్ వ‌య‌స్సుకు వ‌చ్చినా ఈ టీచ‌ర్ బుద్ది అయితే మార‌లేదు. ఇత‌ని పేరు సిద్ధరాజు(58).  రాంపురాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా ప‌నిచేస్తున్నాడు. ఈ ఊరిలోనే  దాదాపు 25 ఏళ్ల నుంచి టీచర్ వృత్తిలో కొనసాగుతున్నాడు. తాను చదువు చెప్పిన స్కూల్‌లో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. త‌న మాయ‌మాట‌ల‌తో  విద్యార్థినులలో ఒకర్ని లోబర్చుకున్నాడు. ఆమె స్కూల్ విడిచిపెట్టి వెళ్లిపోయినా ఆమెను వెంటాడాడు. తాజాగా, వారిద్దరు ఒక గదిలో కామక్రీడలో పాల్గొన్నారు. జ‌రుగుతున్న దృశ్యాన్ని చూసి   అదే స్కూల్‌కు చెందిన వ్య‌క్తి టీచ‌ర్ కామకార్య‌క‌లాపాల‌ను ఫొటో తీసి ఇంటర్నెట్‌లో పెట్టాడు. అర్ధనగ్నంగా బెడ్‌పై పడుకొని ఆమెతో ఉన్న ఆ ఫొటో స్థానికంగా వైరల్ అయ్యాయి. దీంతో టీచ‌ర్ ఊరు విడిచిపెట్టి పారిపోయాడు. ఆగ్రహంతో ఊగిపోతున్న గ్రామ‌స్థులు కామ‌పిశాచి టీచ‌ర్ సిద్ధరాజును స‌స్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

మైనార్టీల‌కు అండ‌గా వుంటా.. సిఎం జ‌గ‌న్ భ‌రోసా

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో చ‌ర్చించి తీర్మానం క్యాంప్ కార్యాల‌యంలో జ‌రిగిన మైనార్టీ నేత‌లు, ముస్లిం మ‌త పెద్ద‌ల‌తో సి.ఎం. భేటీ. జాతీయ జనాభా పట్టికలో(ఎన్పీఆర్‌) ప్రతిపాదించబడ్డ కొన్ని ప్రశ్నలు రాష్ట్రంలోని మైనారిటీల్లో అభద్రతా భావాన్ని కలుగజేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఎన్పీఆర్‌పై మైనారిటీల్లో నెలకొన్న ఆందోళనకు సంబంధించి సీఎం వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో స్పందించారు. ఎన్పీఆర్‌ అంశంపై తమ పార్టీలో విస్తృతమైన చర్చ జరిపామని పేర్కొన్నారు. ఎన్పీఆర్‌కు సంబంధించి 2010లోని నిబంధనలనే ఇప్పుడు కూడా పాటించాలని కేంద్రాన్ని కోరాతామని అన్నారు. ఇందుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని వెల్లడించారు. NPR, NRC కు సంబంధించిన అంశాలపై ప్రజా ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌ" ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డితో తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో చర్చించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ SB. అంజాద్ భాష మీడియాతో మాట్లాడారు.

చిరంజీవితో రఘువీరా భేటీ

వీరి క‌ల‌యిక పార్టీకి  జీవం పోస్తుందా?   ఆంధ్రాలో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీకి మంచి రోజులు వ‌స్తాయా?   పార్టీలో గుస‌గుస‌లు ఇప్పుడు ఇదే పిక్చర్ ఆఫ్ ఆంధ్రా ర‌ఘువీరారెడ్డి చిరంజీవిని క‌ల‌వ‌డానికి కుటంబసమేతంగా హైదరాబాద్ వెళ్లారు. ఎందుకంటారా ఆయ‌న అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురంలో 52 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ విగ్ర‌హాన్ని ఆవిష్కరించేందుకు చిరంజీవిని ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మం మే 29న జ‌ర‌గ‌నుంది. ఒక‌ప్పుడు రఘువీరారెడ్డి.. రాష్ట్ర మంత్రిగా పని చేశారు. ఏపీకి పీసీసీ చీఫ్ గా పని చేశారు. జాతీయ స్థాయిలోనూ పరిచయాలు, మంచి పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొసగలేక.. ఇప్పుడు పొలం పనికి మాత్రమే పరిమితమయ్యారు. పల్లెటూరి జీవనాన్ని.. హాయిగా అనుభవిస్తున్నారు. ఆడంబరాలకు దూరంగా ఉంటున్నారు. చిరంజీవి కూడా అంతేగా.  కేంద్ర మంత్రిగా పని చేసి.. ఇప్పుడు రాజకీయాలు వదిలి.. తన పని తాను చేసుకుంటున్నారు. హాయిగా సినిమాలు చేసుకుంటూ జీవితాన్ని మునుపటిలా ఎంజాయ్ చేస్తున్నారు. కలర్ ఫుల్ గా లైఫ్ కానిచ్చేస్తున్నారు. ఇలాంటి ఇద్దరు నేతలు.. హైద‌రాబాద్‌లో క‌ల‌వ‌డం విశేషమేగా మరి. అవును. అలాంటి సందర్భమే అందరినీ ఆకర్షిస్తోంది. చిరంజీవి ఆ కార్యక్రమానికి వెళ్తారా, లేదా అన్న అంశం కంటే  చిరు, రఘువీరా కలయిక మాత్రం.. రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరూ రాజకీయాలు మాట్లాడుకునే అవకాశమైతే లేకుండా ఉండవని.. ఇద్దరి మధ్యా ఈ దిశగా ఏ విషయం చర్చకు వచ్చి ఉంటుందా అని.. అంతా అనుకుంటున్నారు. కలర్ ఫుల్ గా ఉన్న వీరి పిక్చర్ ను కాంగ్రెస్ అభిమానులైతే ఎంజాయ్ చేస్తున్నారు. తిరిగి కాంగ్రెస్ పార్టీకి వీరి క‌ల‌యిక జీవం పోస్తుందా? కాంగ్రెస్‌ పార్టీకి ఆంధ్రాలో మళ్లీ మంచి రోజులు వ‌స్తాయా?  పార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ముస్లిం 4% రిజ‌ర్వేష‌న్ కేసు మార్చి 16కు వాయిదా!

2004 లో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ముఖ్యమంత్రి అయిన త‌రువాత‌ రాష్ట్రములోని అణ‌గారిన ముస్లిం వర్గాలకు బిసి(ఇ) క్యాట‌గిరి పేరుతో రిజ‌ర్వేష‌న్లు ఇచ్చారు.   ముస్లిం సమాజంలోని వెనుకబడిన వర్గాలకు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ద్రోహద పడేలా రిజర్వేషన్ కల్పించడము అత్యవసరమని భావించి 4% రిజర్వేషన్ కల్పించారు. ఆ రిజర్వేషన్ ఫలితంగా ముస్లిం  సమాజము విద్య ,మరియు ఉపాధి రంగాలలో గణనీయమైన ప్రాధాన్యత పొందింది. అయితే మత ప్రాతిపదిక పై రిజర్వేషన్లను ఇవ్వడాన్ని సవాలు చేస్తూ, ఉమ్మడి రాష్ట్రము హైకోర్టులో రిట్ పిటిషన్ను దాఖలు చేయగా అప్పటి రాష్ట్ర హైకోర్టు సదరు కేసును కొట్టివేయడము  జరిగింది.  ఆ దరిమిలా సదరు కేసును కొంతమంది తిరిగి సుప్రీం కోర్టులో కేసును దాఖలు చేశారు 2010లో డాక్టర్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి గారి చొరవతో ఆ కేసును వాయిదా వేయించడం జరిగింది (స్టే తీసుకుని రావడం )అప్పటి నుండి ఆ stay నేటి వరకు కొనసాగుతుండగా, విద్య మరియు  ప్రభుత్వ ఉద్యోగాలలో ముస్లిం సమాజం 4% రిజర్వేషన్ ఫలాలను పొందుతున్నారు. ఈ కేసు సుప్రీంకోర్టులో మార్చి 3వ తేదీన బెంచ్‌పైకి వ‌చ్చింది. ఈ కేసును మార్చి 16, 2020 వాయిదా వేస్తున్న‌ట్లు ఉన్న‌త న్యాయ‌స్థానం ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి   ఉప ముఖ్యమంత్రి  అంజద్ బాషా గారు హుటాహుటిన ఢిల్లీకి పంపారు. ఆయ‌న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఆర్ వెంకటరమని ,మరియు జయదీప్ గుప్తాలతో ప్రత్యక్ష సమాలోచనలు జరిపి ఈ కేసుకు సంబంధించి చ‌ర్చించారు. ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన రిజర్వేషన్ కేసును తప్పనిసరి గా గెలవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని డిప్యూటీ సి.ఎం. ఆశాభావం వ్య‌క్తం చేశారు.

షహీద్ మేళా బేవర్ ఉత్తర ప్రదేశ్ అధ్యక్షుడిగా డా.గజల్ శ్రీనివాస్

ప్రతిష్టాత్మక సంస్థ "షహీద్ మేళా బేవర్ -ఉత్తర ప్రదేశ్"  అధ్యక్షుడిగా ప్రఖ్యాత గ్గాయకులు డా.గజల్ శ్రీనివాస్ ను మేళా కమిటి ఏకగ్రీవం గా ఎన్నుకున్నట్టు సంస్థ సంచాలకులు శ్రీ రాజ్ త్రిపాఠి తెలిపారు. షహీద్ మేళా  ప్రతి ఏటా జనవరి 23 నుండి ఫిబ్రవరి 10 వ తేదీ వరకు జరుగుతుందని, స్వాతంత్ర సంగ్రామంలో అసువులు బాసిన త్యాగధనులకు లక్షలాది మంది ఈ ఉత్సవం లో నీరాజనం పలుకుతారని తెలిపారు. దేశవ్యాప్తం గా ఎంతో మంది ఈ ఉత్సవం లో సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్ర ప్రదర్శన, కవి సమ్మేళనం లో పాల్గొని దేశభక్తి ని చాటి చెబుతారని తెలిపారు. 1942 లో కృష్ణ కుమార్, 14 ఏళ్ళ  విద్యార్థీ,  శ్రీ సీత రామ్ , శ్రీ జమునా ప్రసాద్ త్రిపాఠి లు బ్రిటిష్ వారి తుపాకీ  గుళ్లకు ఎదురువెళ్లి స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు. ఆ పిదప లక్షలాది మంది స్పూర్తి పొంది బేవర్ లో ఉద్యమాన్ని ఉదృతం చేసారు . ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసారు. వారి గురుతుగా 1972 నుండి షహీద్ మేళా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్టు , దేశం లో మరెక్కడా లేనట్టుగా 26 మంది స్వాతంత్ర  సమర యోధులకు "షహీద్ మందిరాన్ని " నిర్మించినట్టు శ్రీ రాజ్ త్రిపాఠి తెలిపారు. డా. గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో  భవిష్యత్తులో అన్ని రాష్ట్రల్లో  షహీద్ మేళ నిర్వహించి ఈ తరం ప్రజలకు స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను గుర్తు చేస్తామని అన్నారు.

సీఎం కేసీఆర్ అమెరికాకి వెళ్లారంటూ కాసులు వెనకేసుకున్న అధికారులు!!

తెలంగాణ సీఎం కేసీఆర్ కి తెలియకుండా.. కొందరు అధికారులు కాసులకి కక్కుర్తి పడి.. సీక్రెట్ జీవోలు ఇస్తున్నారా అంటే అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. పీఎం, సీఎం లు విదేశీ పర్యటనలకు వెళ్లడం సహజం. అయితే ఇతర రాష్ట్రాల సీఎంలతో పోల్చుకుంటే.. కేసీఆర్ విదేశీ పర్యటనలకు వెళ్లడం తక్కువనే చెప్పాలి. అసలు చేసేదే తక్కువ పర్యటనలు అంటే.. ఆ తక్కువలో కూడా అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వడం చర్చనీయాంశమైంది. కేసీఆర్‌ 2014 జూన్‌ 2 నుంచి 2020 ఫిబ్రవరి 15 వరకు ఏయే విదేశీ పర్యటనలు చేశారు? ఒక్కో పర్యటనకు ఎంత ఖర్చయింది? వంటి అంశాలపై వివరాలు తెలపాల్సిందిగా జలగం సుధీర్‌ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనికి రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఫిబ్రవరి 27న సమాధానం ఇచ్చింది. ఈ ఆరేళ్లలో కేసీఆర్‌ మూడు విదేశీ పర్యటనలు చేసినట్లు తెలిపింది. 2014 ఆగస్టులో సింగపూర్‌-మలేషియాలకు, 2015 సెప్టెంబర్‌లో చైనాకు కేసీఆర్‌ వెళ్లినట్లు తెలిపింది. అలాగే, 2016 ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 1 వరకు కేసీఆర్‌ అమెరికా పర్యటనలో ఉన్నట్లు పేర్కొంది. కానీ ఇక్కడే పప్పులో కాలేసింది. 2016 ఆగస్టు 30వ తేదీ నాడు కేసీఆర్‌.. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో నాటి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమయ్యారు. రెండ్రోజుల తర్వాత అనగా సెప్టెంబరు 1వ తేదీన అప్పటి అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం హైదరాబాద్‌లోని క్యాంప్‌ ఆఫీసుకు వచ్చి కేసీఆర్‌ను కలుసుకున్నారు. అంటే ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 1 వరకూ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లోనే ఉన్నారు. కానీ జీఏడీ మాత్రం.. ఆ మూడు రోజులూ కేసీఆర్‌ దేశంలోనే లేరని, అమెరికా పర్యటనలో ఉన్నారని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అమెరికాలో 2016 ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 1 వరకూ జరిగే ఓ వ్యవసాయ సదస్సుకు రావాల్సిందిగా ఆ ఏడాది జులైలో కేసీఆర్ కు ఆహ్వానం అందింది. కానీ కేసీఆర్‌ ఎందుకో ఆ పర్యటనకు వెళ్లలేదు. అయితే, జీఏడీ మాత్రం.. కేసీఆర్‌ అమెరికా పర్యటనకు సంబంధించి 2016 ఆగస్టు 26న జీవో ఆర్టీ నంబర్‌ 1895 జారీ అయినట్లు ప్రకటించింది. అసలు కేసీఆర్ అమెరికానే వెళ్లునప్పుడు.. ఈ జీవో ఎలా జారీ అయింది? ఈ జీవో విషయం సీఎంకు తెలియదా? ఆయనకు తెలియకుండా సీఎం పర్యటన పేరుతో కాసులు వెనకేసుంటున్నారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే సీఎం విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చులను మాత్రం జీఏడీ వెల్లడించలేదు. మొదటి రెండు పర్యటనల ఖర్చు వివరాలు పరిశ్రమల శాఖ వద్ద, అమెరికా పర్యటన ఖర్చు వివరాలు వ్యవసాయ శాఖ వద్ద ఉన్నాయని పేర్కొంది. సరే మొదటి రెండు పర్యటనలు అంటే నిజంగా సీఎం వెళ్లారు కాబట్టి దానికి తగ్గట్టు ఖర్చు చేసి ఉంటారులే అనుకోవచ్చు. కానీ, అసలు వెళ్లని అమెరికా పర్యటన ఖర్చు వివరాలు వ్యవసాయ శాఖ వద్ద ఉండటం ఏంటి? దీనిపై కేసీఆర్ సర్కార్ కాస్త సీరియస్ గానే దృష్టి పెట్టాల్సిన అవసరముంది. సమాచార హక్కు చట్టం పుణ్యమా అని ఈ భాగోతం బయటపడింది. ఇంకా బయటకు రాని భాగోతాలు ఎన్ని ఉన్నాయో ఏంటో!!

గాంధీ ఆస్పత్రిలో కలకలం.. హైద‌రాబాద్‌లో క‌రోనా ఆస్పత్రి?

కరోనా వైరస్ వస్తే పేషెంట్‌ని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచాల్సి వుంటుంది. రోగి వ‌ద్ద‌కు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే అలాంటి పరిస్థితులు  తెలంగాణలోని ఏ ఆసుప‌త్రిలోనూ లేవు. ప్ర‌స్తుతం మాత్రం గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డుల్ని ఏర్పాటు చేశారు. ఆ వార్డుల్లోకి కంప్లీట్ సూట్లు వేసుకున్న డాక్టర్లు మాత్రమే వెళ్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏం చేయాల‌ని అధికారులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న  ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్పత్రిని పూర్తిగా కరోనా కేసుల కోసం కేటాయిస్తే ఎలా ఉంటుందనేది ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఒకవేళ చెస్ట్ ఆస్పత్రి కుదరకపోతే... మిలిటరీ ఆస్పత్రిని పూర్తిగా తీసుకోవాలని ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా ఆలోచిస్తోంది. ఇదిలా ఉంటే, కరోనా పేషంట్ జనరల్ పబ్లిక్ వెళ్లే కామన్ బాత్‌రూంకి వెళ్లడం గాంధీ ఆసుపత్రిలో కలకలం రేపింది. తెలంగాణలో ఒక యువకుడికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతనికి గాంధీ ఆస్పత్రిలోని.. ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. అయితే ఐసోలేషన్ వార్డులో ప్రత్యేక బాత్ రూం లేకపోవడంతో..  అతను జనరల్ పబ్లిక్ వెళ్లే కామన్ బాత్‌రూంకి వెళ్లాడని తెలుస్తోంది. దీంతో.. ఆస్పత్రి సిబ్బంది, ఇతర రోగులు, వారి కుటుంబ సభ్యులు.. ఎక్కడ తమకి కరోనా సోకుతుందోనని.. ఆందోళన చెందుతున్నారు. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. తగు జాగ్రత్తలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం.

ఇంటర్నేషనల్ కోర్టుకు అమరావతి ఇష్యూ... త్వరలో యూఎన్ వోకి ఫిర్యాదు...

నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం అలుపెరగని పోరాటం జరుగుతోంది. రాజధాని గ్రామాల్లో రెండున్నర నెలలుగా రైతులు, మహిళలు, ప్రజలు ఆందోళనలు చేస్తుంటే, మరోవైపు ఎన్నారైలు కూడా వైసీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ వివిధ రూపాల్లో తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. ఇక, అమరావతిని తరలించొద్దంటూ ఏపీ హైకోర్టులో ఇఫ్పటికే పలు కేసులు నమోదు కాగా, ఇక, ఇప్పుడు అమరావవతి ఇష్యూ అంతర్జాతీయ న్యాయస్థానానికి చేరింది. అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వ తీరును ఎండగడుతోన్న ఎన్నారైలు... ఏకంగా ది హేగ్ లోని ఇంటర్నేషనల్ కోర్టును ఆశ్రయించారు.  అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ... అమెరికా ఎన్నారైల తరపున శ్రీనివాస్ కావేటి... ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించేవిధంగా ఆదేశాలిచ్చి, అమరావతి రైతులకు న్యాయం చేయాలని తన పిటిషన్ లో కోరాడు. అయితే, అసలు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తుందో లేదోనన్న అనుమానాలు కలిగినా, అమరావతిపై ఎన్నారై వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. త్వరలోనే సీరియల్ నెంబర్ కేటాయించనున్న ఇంటర్నేషనల్ కోర్టు.... విచారణ చేపట్టనుంది. అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎన్నారైలు... మొదట్నుంచీ రాజధాని రైతులకు అండగా నిలుస్తున్నారు. వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తూనే, ఇఫ్పుడు ఏకంగా ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అంతేకాదు, అమరావతిలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ, త్వరలోనే UNO మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఎన్నారైలు తెలిపారు.

కరోనా వ్యాక్సిన్ త‌యారైందా?

కరోనాను నియంత్రించే వ్యాక్సిన్‌ మరో 90 రోజుల్లో అందుబాటులోకి వ‌స్తుంద‌ని ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా తొలి వ్యాక్సిన్‌ను రూపొందించామని అమెరికాకు చెందిన బయోటిక్ సంస్థ మోడెర్నా కూడా ప్రకటించింది. ఈ వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగాలకు సిద్ధం చేశామని తెలిపింది. ఈ ట్రయల్స్ ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందట‌. తొలి దశ ప్రయోగం విజయవంతమైతే.. అది అందుబాటులోకి రావడానికి ఏడాది సమయం పడుతుంది. 2002లో సార్స్ విజృంభించినప్పుడు దాని వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్‌కు సిద్ధమయ్యే సరికి 20 నెలలు పట్టగా తాజాగా కరోనా వైరస్‌ జన్యు సమాచారం తెలుసుకున్న ఆరు వారాల్లోనే వ్యాక్సిన్‌ను రూపొందించి, మనషులపై ప్రయోగాలకు రెడీ చేయడం విశేషం. మందు కనిపెట్టినా, దాన్ని పంపిణీ చెయ్యడానికి కనీసం 3 నెలలు పడుతుంది. ఆ మందు కోసం ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

వైసీపీ నేతల నుంచి మీరే కాపాడాలి... గవర్నర్‌కు అమరావతి మహిళల మొర...

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులు, మహిళలు, 29 గ్రామాల ప్రజలు ఎక్కడికక్కడ తమ నిరసనలకు తెలియజేస్తున్నారు. అయితే, అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ మరోసారి ఏపీ గవర్నర్‌ను కలిసింది. రాజధానిలో జరుగుతున్న పరిణామాలు, అక్రమ కేసులపై గవర్నర్‌కి ఫిర్యాదు చేసింది. అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ మహిళలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ మహిళలపై అక్రమ కేసులు నమోదు పెడుతున్నారని అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ ఆవేదన వ్యక్తంచేసింది. శాంతియుతంగా తాము ధర్నాలు చేస్తుంటే... వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారన్నారని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఎంపీ నందిగం సురేష్ తమపై తప్పుడు కేసులు పెట్టించి భయపెడుతున్నారని మహిళలు ఆరోపించారు. ఇక, మహిళలపై పోలీసులు విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్న ఫొటోలను గవర్నర్ కు అందజేశారు. తాము శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే, తమపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమపై ఇప్పటివరకు 2వేల 800 అక్రమ కేసులు పెట్టారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ... తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

స‌మాధానం చెప్పండి. అప్పుడు మ‌తాన్ని అంట‌గ‌ట్టం!

ట్విట్టర్ లో నిల‌దీసిన మాజీ ఐఎఎస్ అధికారి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికు మతాన్ని అంటగడితే చూస్తూ ఊరుకోబోమని మంత్రి వెల్లంపల్లి చేసిన ప్రకటనపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు ఘాటుగా స్పందించారు. జ‌గ‌న్‌కు మ‌త పిచ్చి లేక‌పోతే ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల‌ని ట్విట్టర్ వేదికగా  ఐవైఆర్ సంధించిన పోస్టులు వైర‌ల్ అయ్యాయి. 1. హిందూ మత సంస్థల నుంచి హిందూయేతరలను తొలగిస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయకపోవడానికి కారణాలేమిటో? 2. చట్టబద్ధంగా ఏర్పాటు చేయాల్సిన ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి దాని క్రిందికి ధార్మిక సిబ్బందిని నియ‌మించ‌క‌ పోవడం ఏమిటి? 3. హిందూ ధర్మ ప్రచార ట్రస్ట్ కు చట్టబద్ధత కల్పించి, దానిని సమరసత వేదికతో అనుసంధానం చేయకపోవడం. 4. రాజ్యాంగ విరుద్ధమని తెలిసి కూడా ఇమామ్‌ల‌కు, పాస్టర్లకు వేతనాలు చెల్లించ‌డంలో మ‌త‌ల‌బు ఏమిటి? 5. ప్రభుత్వ ధనం నుంచి జెరూసలేం, హ‌జ్‌ యాత్రకు సహాయం, చర్చిలు కట్టడానికి సహాయం ఎందుకు చేస్తున్నారు? 6. దేవతా విగ్రహాలపై దుండగులు దాడి చేస్తే త‌మ‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం. దేవాదాయ శాఖ మాత్యులుగా ఆ ప్రదేశాలను కూడా సందర్శించకుండా ఉండటం. సరైన సమాధానం చెప్పగలిగితే ముఖ్యమంత్రి గారికి మతాన్ని అంట కట్టాల్సిన అవసరం ఉండదని ఐవైఆర్ పేర్కొన్నారు.

టీఆర్ఎస్‌లోకి శ్రీధర్ బాబు..! సోషల్ మీడియాలో ప్రచారం

దుద్దిళ్ల శ్రీధర్ బాబు... తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని నియోజకర్గం ఎమ్మెల్యే. టీకాంగ్రెస్‌లో సీనియర్ నాయకుల్లో శ్రీధర్ బాబు ఒకరు. అంతేకాదు మొన్నటి అంసెబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. అయితే, శ్రీధర్ బాబుపై ఇటీవల వరుసగా ఏదోక ప్రచారం జరుగుతూనే ఉంది. శ్రీధర్ బాబు తెలంగాణ కాంగ్రెస్‌ పగ్గాలు ఇవ్వబోతున్నట్లు ఎప్పట్నుంచో వినిపిస్తోంది. అయితే, పీసీసీ రేసులో తానున్నంటూ, కావాలనే తనపై ప్రచారం చేస్తున్నారని, నెగెటివ్‌గా కథలు అల్లుతున్నారన్నది శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తంచేస్తున్నారట. మరోవైపు అధికార టీఆర్ఎస్‌ పార్టీలోకి కూడా వెళ్తున్నారంటూ మరో ప్రచారం మొదలయ్యింది. ఏకంగా డేట్‌ కూడా ఫిక్స్‌ చేశారంటూ, ఒక డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి ఇదిప్పుటి ప్రచారం కాదు. అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు టీఆర్ఎస్‌ కండువా కప్పుకున్న సమయంలోనే, శ్రీధర్ బాబు పేరు కూడా వినిపించింది. కానీ అప్పుడు ఆయన ఈ ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఎట్టి పరిస్దితుల్లోనూ కాంగ్రెస్‌ను వీడేది లేదంటూ ప్రకటించారు. అయితే ఇప్పుడు మరోసారి శ్రీధర్ బాబుపై ఈ ప్రచారం స్టార్ట్ అయ్యింది. మార్చ్ 7న శ్రీధర్ బాబు సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అంతేకాదు శ్రీధర్ బాబు విషయంలో మంత్రి ఈటల రాజేందర్ మధ్యవర్తిగా మాట్లాడారంటూ కూడా ఊహాగానాలు వినపడ్తున్నాయి. అయితే శ్రీధర్ బాబు కాంగ్రెస్‌ను వీడుతున్నారనే ప్రచారంలో నిజం లేకపోగా, ఆ ప్రచారం వెనుక రాజకీయం ఉందంటున్నారు ఆయన అనుచరులు. పీసీసీ రేసులో శ్రీధర్ బాబు పేరు వినిపిస్తున్న క్రమంలో, కావాలనే కొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇందులో ఆయనకు పీసీసీ పదవి రాకుండా చేయాలనే రాజకీయ కుట్ర ఉందంటున్నారు. ఈ ప్రచారం చేస్తున్నవారిలో, టీఆర్ఎస్ లీడర్లతోపాటు సొంత పార్టీ నేతలు కూడా ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఆరోపణలు, వదంతులు ఎన్ని వస్తున్నా, శ్రీధర్ బాబు మాత్రం మౌనంగానే ఉంటున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానంటూ కార్యకర్తలకు చెబుతున్న శ్రీధర్‌ బాబు... ఈ ప్రచారాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. పరిస్థితులన్నీ కుదుటపడ్డాక, సరైన సమయంలో స్పందిస్తానని, తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నవారిని వదిలిపెట్టేది లేదని శ్రీధర్ బాబు తన అనుచరులతో చెబుతున్నారట. మరి, శ్రీధర్ బాబు ఎప్పుడు నోరు విప్పుతారో అప్పటివరకు ఆగాల్సిందే.

పితానిని కావాలనే టార్గెట్ చేశారా? టీడీపీ నేతల మౌనం ఎందుకు?

  పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీ ఏదైనా ఆచంట నియోజకవర్గం మాత్రం పితానికి కంచుకోట. గత ఎన్నికలకు ముందువరకూ ఆయన మాటకు ఎదురు నిలిచిన పార్టీ, నాయకుడు లేడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మొదలు, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఇలా ముఖ్యమంత్రులు, పార్టీలు అధికారం మారారే తప్ప పితాని సత్యనారాయణకు మంత్రి పదవి మాత్రం మారలేదు. అయితే, వరుసగా మూడుసార్లు మంత్రిని చేసిన అదృష్టం కాస్తా ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నట్టుంది. ఓ వెలుగు వెలిగిన పితానిపై తాజాగా ఈఎస్‌ఐ స్కామ్ ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. వాస్తవానికి పితాని... టీడీపీలో చేరకముందు వైఎస్ రాజశేఖరరెడ్డికి, ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. జగన్... వైసీపీని ఏర్పాటుచేశాక వైఎస్‌కు దగ్గరగా ఉన్నవారంతా ఆ పార్టీలో చేరతారని భావించారు. కానీ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు పితాని, వట్టి అటు వైపు చూడలేదు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీకి అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చినా, ఆయన మొగ్గలేదనేది టాక్. ఎన్నికలు ముగిశాయి. అధికారం తారుమారైయ్యింది. నేతలు ఎవరి రాజకీయం వారు చేస్తూనే ఉన్నారు. పార్టీల మధ్య విభేదాలు తారాస్దాయికి చేరడంతో, ఆయా పార్టీల నేతలు ఢీ అంటే ఢీ అనే స్దాయికి చేరుకున్నారు. విచారణలో నిజానిజాలు ఎలానూ తేలుతాయి. స్కామ్ లో పితాని భాగస్వామ్యం ఎంతవరకూ అనేది త్వరలో వెలుగుచూస్తుంది. అయితే ఈలోపు తమ పార్టీ నేతకు అండగా నిలవాల్సిన జిల్లా టిడిపి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మనకెందులే అని లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అదే పితాని వర్గం ఆవేదన కూడా. మద్దతివ్వాల్సిన సొంత పార్టీ నేతలు మౌనం దాల్చడంతో పితాని ఒంటరి పోరాటం చేస్తున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. ఏదైమైనా పితాని తనపై వచ్చిన అవినీతి ఆరోపణలో ఒంటరి పోరాటం చేస్తున్నారని, ఆయన అనుచరులంటున్నారు. అండగా నిలుస్తుందని ఆశించిన పార్టీ, అంతకంతకూ దూరం పెడుతోందని, పితాని వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇత‌ర‌ వైరస్‌లతో పోల్చితే కరోనా వైరస్‌ మరణాల రేటు తక్కువే!

క‌రోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణా మంత్రులు భ‌రోసా ఇస్తున్నారు.  క‌రోనా వస్తే చనిపోతారన్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని, గత వైరస్‌లతో పోల్చితే కరోనా వైరస్‌లో మరణాల రేటు తక్కువని వారు చెబుతున్నారు. కరోనా వైరస్‌ నియంత్రణ, తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్ర‌భుత్వం  అత్య‌వ‌స‌ర‌ సమన్వయ సమావేశం నిర్వహించింది. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో వైద్య, ఆరోగ్య, పురపాలక, పంచాయితీరాజ్‌శాఖల అధికారులు, మంత్రులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. ఆయా శాఖ కార్యదర్శులు, శాఖాధిపతులతో మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సమావేశమై వివిధ అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. జీహెచ్‌ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతి, వివిధ ఆరోగ్య సంస్థల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలు, అనుమానితులకు పరీక్షలు, ముందు జాగ్రత్త చర్యలు, ప్రజల్లో అవగాహన కల్పించడం సహా పలు అంశాలపై సమావేశంలో చర్చించారు.

వియ్యంకులే లేచిపోయారు!

అదే పెళ్లి కుమార్తె తల్లిని పెళ్లికొడుకు తండ్రి లేపుకెళ్ళాడు. గుజరాత్ లో చోటు చేసుకున్నఈ ఉదంతం సోషల్ మీడియా వైరల్గా మారింది. వరుడి తండ్రిపై  వధువు తల్లి మ‌న‌సు ప‌డింది. అంతే ఇద్ద‌రి మ‌న‌స్సులు క‌లిశాయి. మాటాలు పెరిగాయి. ఇరువురు ఒక‌రి విడిచి మ‌రొక‌రు ఉండ‌లేని ప‌రిస్థితికి వెళ్ళిపోయారు. పిల్లల పెళ్లికి కాస్త ముందుగా తామే లేచి పోయి వేరే కాపురం పెట్టి క‌లిసి వుంటున్నారు. గుజ‌రాత్ రాష్ట్రం సూరత్ కు చెందిన 46 ఏళ్ల హిమ్మత్ పాండవ్,  నవ్ సారీకి చెందిన శోభనా లేచిపోయిడంతో వారిద్దరి పిల్లల పెళ్లి నిలిచి పోయింది. దీంతో కుటుంబంలోని పెద్ద‌లు జోక్యం చేసుకొని లేచిపోయిన‌ కాబోయే వియ్యంకుల‌పై మిస్సింగ్ కేసు పెట్టి  ఒత్తిడి చేయ‌డంతో ఆ జంట  తిరిగి వచ్చింది. అయితే పెళ్లి కుమార్తె తల్లి భ‌ర్త ఈ సంఘ‌ట‌న‌తో షాక్‌కు గురై ఆమెతో తెగ‌తెంపులు చేసుకోవ‌డంతో  ఆమె తన తల్లిదండ్రుల వ‌ద్ద‌కు చేరింది. అయితే కొత్త ప్రేమికుడ్ని మ‌రిచిపోలేక మ‌రోసారి పారిపోయి హిమ్మ‌త్ పాండ‌వ్‌తో క‌లిసి వుంటోంద‌ట‌!