కామ‌పిశాచి టీచ‌ర్ అరాచ‌కాలు!

పాఠాలంటూ పిలిచి పైశాచికం సందేహాలడిగితే ఇంటికి రమ్మంటాడు అమ్మాయిల‌ పట్ల పైశాచికంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడికి గ్రామస్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దూరు గ్రామానికి చెందిన సామ శరత్‌కుమార్ మూడేళ్లుగా వనపర్తి జిల్లాలోని ఓ గ్రామంలో ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. బాలికలు సందేహాలడిగితే ఇంటికి రమ్మనేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారిపై అసభ్యంగా ప్రవర్తించేవాడు. విషయం ఎవరికీ చెప్పవద్దని భయపెట్టేవాడు. ఒక బాలిక స్నానం చేస్తుండగా రక్తస్రావం కావడం చూసి తల్లి భయపడి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు చెప్పడంతో హతాశురాలైన తల్లి ఏం జరిగిందని పాపను అడిగితే విషయం చెప్పింది. వెంటనే పాఠశాలకు వెళ్లి యజమాన్యాన్ని నిలదీసి ఉపాధ్యాయుడి కోసం గాలింపు చేపట్టారు. కొల్లాపూర్‌ వెళ్లాడని తెలుసుకుని, అక్కడికి వెళ్లి పట్టుకుని తీసుకువచ్చారు. గ్రామస్థులతా కలిసి ప్రశ్నించగా మద్యం మత్తులో తప్పుచేశానని అంగీకరించాడు. దీంతో అతడికి దేహశుద్ధి చేసి పోలీసుల‌కు అప్ప‌గించారు. సీఐ సూర్యానాయక్‌ గోపాల్‌పేట పోలీస్ స్టేష‌న్‌లో అతణ్ని విచారించారు. మరి కొందరు బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తించానని అతడు అంగీకరించాడు.

ఆ కొండపైనే ఏపీ సచివాలయం!

రాజధాని తరలింపు ప్రక్రియను స్పీడప్ చేసే విష‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీరియ‌స్‌గా అడుగులు వేస్తున్నారు. సి.ఎం. ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగానే  విశాఖ‌ప‌ట్నం మధురవాడలోని మిలీనియం టవర్స్‌కు అత్యంత సమీపంలో ఉన్న కాపులుప్పాడ కొండపై సచివాలయం నిర్మాణం చేయ‌డానికి  స‌ర్కార్ స‌న్న‌ద్ధ‌మైంది.  కాపులుప్పాడ కొండ వున్న మొత్తం ప్రాంతాన్ని సచివాలయం తో పాటు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి వినియోగించాలని భావిస్తున్నారు.   కాపులుప్పాడలో విశాలమైన కొండలు ఉన్నాయి. గతంలోనే రెవెన్యూ యంత్రాంగం 1300 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి ఉన్నట్లు గుర్తించింది. తాజాగా 250 ఎకరాల్లో ప్రభుత్వ భవనాలు ఏర్పాటు చేసేందుకు, ముఖ్యంగా సెక్రటేరియట్‌ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లును అధికారులు ఇక్కడి నుంచే చేస్తున్నారు.  సహజసిద్ధమైన ప్రకృతి సంపదకు కేంద్ర బిందువైన కాపులుప్పాడ ప్రాంతం భీమిలి ఏరియాలోనే ఉంది. ప్రస్తుతం 1350 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. 250 ఎకరాల విస్తీర్ణ స్థలంలో లేవుట్ వేయగా..175 ఎకరాల స్థలం అందుబాటులోకి వచ్చింది. ఇతర కొండలను చదును చేసి మరో 600 ఎకరాల భూమిని వినియోగంలోకి తీసుకరావాలని అధికారులు భావిస్తున్నారు. అదానీ డేటా సెంటర్‌ కోసం కొండ దిగువ ప్రాంతంలో 175 ఎకరాలను ఎంపిక చేసి ఇక్కడ 'క్లౌడ్‌ కంప్యూటింగ్‌ డేటా సెంటర్‌'ను పెట్టాలని గ‌తంలో నిర్ణ‌యించారు. అయితే రూ.70 వేల కోట్ల పెట్టుబడితో అదానీ వస్తాడని ప్రణాళికలు వేయడం అత్యాశే అవుతుందని భావించి వైసిపి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను కొట్టిపడేసింది.  ఎపిఐఐసి ఇదివరకే అదానీ గ్రూప్‌ సంస్థకు ఇచ్చేందుకుగానూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 175 ఎకరాలను ఆమోదించగా, వైసిపి ప్రభుత్వం అధికారానికి వచ్చాక రద్దు చేసింది.   ఇప్పటికే కొండలపై నీటి ట్యాంకులను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎపిఐఐసి ఇక్కడ రూ.100 కోట్లు ఖర్చు చేసి కొండలను చదును చేసింది. 

అమెరికాలో తెలుగు స్టూడెంట్స్ కి కొత్త కష్టం

హెచ్ 1 బి వీసా కోసం ఎదురుచూస్తున్న 24 వేల మంది తెలుగు విద్యార్థులు ఏప్రిల్ తో ముగియనున్న నివాస గ‌డువు వీసా రాక‌పోతే తిరుగుపయనం తప్పదు. అమెరికాలో భారతీయులకు కష్టమొచ్చింది. వచ్చే ఏప్రిల్ తో 68 వేల మంది ఎన్నారై స్టూడెంట్ల భ‌విష్య‌త్ రోడ్డున ప‌డ‌నుంది. ఓపీటి ముగియ‌నుండ‌టంతో  భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఉన్నత విద్యకోసం ఇండియా నుంచి అమెరికా వెళ్లి అక్కడ హెచ్ 1 బి వీసా కోసం ఎదురుచూస్తున్న వారు 68 వేల మంది ఉన్నారు. వీరిలో తెలుగు వారు అత్యధికంగా 24 వేల మంది ఉన్నారు.   వీరి అమెరికా నివాస గడువు ఈ ఏప్రిల్ తో ముగియనుంది. వీరిలో ఎవరికైతే హెచ్ 1 బి వీసా దొరుకుతుందో వారు మాత్రమే అక్కడ ఉండగలుగుతారు. మిగతా వారు అక్కడి నుంచి ఉద్యోగాలు వదిలి అర్ధంతరంగా తిరుగుపయనం కాక తప్పదు. వీరంతా ప్రస్తుతం ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం) కింద అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. హెచ్ 1బి వీసా రానివారికి తిరుగుపయనం తప్పదు. ఒకవేళ అక్కడే ఉండాలి అనుకుంటే... వారికు మరో అవకాశం ఉంది. అక్కడ ఏదైనా మరోకోర్సులో జాయిన్ అయితే... మరో మూడేళ్లు నివాసం ఉండొచ్చు. కోర్సులో చేరాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఉన్నవారికి అది సాధ్యమవుతుంది. కానీ ఆర్థిక స్తోమత అంతంతమాత్రంగా ఉన్నవారికి ఆ అవకాశం ఉండదు. అమెరికాలో ఉద్యోగం చేయాలంటే... హెచ్ 1 బి వీసా ఉండాలి.  ఇది విదేశీయులకు అమెరికాలో ఉండటానికి జారీ చేసే అనుమతి పత్రం వంటిది. ఇది మొదటి సారి మూడేళ్లకు ఇస్తారు. తర్వాత దానిని మరోసారి పొడిగించుకునే అవకాశం ఉంటుంది. అత్యధికంగా ఆరేళ్లు మాత్రమే ఈ వీసా మీద అమెరికాలో ఉండగలరు. ఏదైనా స్కిల్ ఆధారంగా మాత్రమే దీనిని మంజూరు చేస్తారు. ఈ హెచ్-1బీ వీసా మూడు రకాలుగా ఉంటుంది. ప్రతి సంవత్సరం నిర్దేశించిన సంఖ్యలో మాత్రమే వీసాలను జారీ చేస్తారు. హెచ్ 1 బి వీసా పొందిన వారి రక్తసంబంధీకులు డిపెండెంట్ వీసా ( హెచ్ 4) తీసుకుని వారితో కలిసి ఉండొచ్చు.

ఆరోగ్యకర అలవాట్లతో కొరోనాను నిరోధించవ‌చ్చు

ఆందోళన వద్దు. భయభ్రాంతులకు గురికావద్దు. మన రోగనిరోధకశక్తే మనకు రక్ష అంటోంది జ‌న విజ్ఞాన వేదిక‌. చైనాలో 80వేల మందికి కొరోనా వైరస్ సోకగా 50వేల మందికి ఇప్పటికే నయమైంది. కేవలం 3వేల మంది మాత్రమే చనిపోయారు. 4% మంది కూడా చనిపోలేదు. సాధారణ ఫ్లూ వైరస్ తో కూడా ఇంతకంటే ఎక్కువ మంది చనిపోతారు. కావున ఇది అంత ప్రమాదకరమైనదేమీ కాదు. వృద్దులు, గర్భిణి స్త్రీలు, డయాబెటిక్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ వంటి, ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు ఉన్నవాళ్ళు బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు హై రిస్క్ గ్రూపు. కొరోనా వైరస్ కణాలు చాలా పెద్దవి. సుమారు 100 - 250nm సైజులో ఉంటాయి. అందరూ మాస్క్ వాడాల్సిన అవసరం లేదు. కరోనా ఉన్నవాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు N95 మాస్కులు ఖచ్చితంగా వాడాలి. దగ్గు, జలుబు ఉన్నవాళ్ళు సాధారణ మాస్కులు వాడాలి. ఆవీ లేకపోతే జేబురుమాళ్ళు వాడాలి. ఎవరైనా తుమ్మినా, దగ్గినా జేబురుమాలు నోటికి అడ్డంగా పెట్టుకోవాలి. జేబురుమాలు లేకపోతే మోచేతిని బెండ్ చేసి నోటికి అడ్డంగా పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన నోటి తుంపర్లు ఇతరుల మీద పడకుండా జాగ్రత్త పడాలి. ఈ వైరస్ గాలిలో ఉండిపోదు. వెంటనే నేలని చేరుతుంది. అందుకే, గాలి ద్వారా వ్యాపించదు. మనిషి నుండి మనిషికి వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా నోరు, ముక్కు, కండ్ల ద్వారా మనకు చేరుతుంది. కొరోనా వైరస్ ఏదైనా లోహపు ఉపరితలం మీద 12 గంటలు ఉండగలదు. అందుకే, సబ్బుతో చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటే, సరిపోతుంది. కొరోనా వైరస్ బట్టల మీద 9 గంటలు మాత్రమే ఉంటుంది. అందుకే బట్టలు ఉతికినా, లేదా ఎండలో ఒక రెండు గంటలు ఆరేసినా, కొరోనా వైరస్‍ని అరికట్టినట్టే. ఈ వైరస్ చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకే, స్పిరిట్ ఆధారిత స్టెరిలైజర్‍ని ఎప్పుడూ మీ వెంట ఉంచుకోవడం చాలా మంచిది.   ఈ వైరస్ గనుక, 26-27 ° C ఉష్ణోగ్రత ఉంటే, చనిపోతుంది. అందుకే వేడిమి గల ప్రదేశాల్లో బ్రతకలేదు. కాబట్టి, వేడి నీళ్ళు తాగడం, ఎండలో నిలబడడం లాంటివి చేయండి. ఇప్పటి మన ఎండలకు రూమ్ టెంపరేచర్ లో కూడా ఈ వైరస్ బ్రతకలేదు. AC గదుల్లో, వాహనాళ్లో ఉండేవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కొన్నాళ్ళు ఐస్‍క్రీమ్స్, కూల్ డ్రింక్స్ లాంటి చల్లని పదార్థాలకి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. కొన్ని రోజులపాటు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే, వైరస్‍ని నివారించవచ్చు.

ఢిల్లీ హింసపై నోరు మెదపరేం?

బిజెపి మిత్ర‌పక్షాలపై ఎంపీ అసదుద్దీన్‌ విమర్శలు తెలంగాణా అసెంబ్లీ సమావేశాల్లో  సీఏఏకు వ్యతిరేక తీర్మానం మాదిరిగా ఎన్‌పీఆర్‌పై స్టే విధించాలని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విజ్ఞప్తి చేశారు. కేరళ మాదిరిగా ఎన్‌పీఆర్‌పై నిర్ణయం తీసుకుంటేనే భవిష్యత్‌లో దాని ప్రక్రియ ఆగుతుందని తేల్చిచెప్పారు. ఢిల్లీ ‘మారణహోమం’పై ప్రధాని మోదీతోపాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఎందుకు నోరు మెదపడం లేదని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ప్రశ్నించారు. హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారంతా భారతీయులేనని, ఇప్పటికైనా బాధిత కుటుంబాలను పరామర్శించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ నాయకులు చేసిన ప్రకటన వల్లే ఇదంతా జరిగిందని ఆరోపించారు.  ఢిల్లీ హింసాకాండపై ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మౌనం వహిస్తున్నాయని.. నితీశ్‌కుమార్, రామ్‌విలాస్‌ పాశ్వాన్, అకాలీదళ్‌ హింసపై ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని ప్రశ్నించారు.  ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితికి కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

ర‌సం కరోనా వైరస్ కి విరుగుడుగా ప‌నిచేస్తుందా?

మిరియాల చారు తాగండి. కరోనాను తరిమికొట్టండి. అవును. కరోనా కు విరుగుడు మన కరేపాకు వేసిన మిరియాల చారేన‌ట‌. ఇది ఇప్పుడు చైనాలో ప్ర‌చారంలో వుంది.  ఇది ఇప్పుడు కరోనా వైరస్ కి విరుగుడుగా ప‌నిచేస్తుంద‌ట‌. అద్భుత వనమూలికలూ, మషాలా దినుసులు, అల్లం, మిరియాల తో తయారు చేసిన భారతీయ వంటకం ర‌సం. దీనితో కరోనా వైరస్ ను రాకుండా చేసుకోవచ్చని ఇప్పుడు చైనా లో పెద్ద ఎత్తున ప్రచారం జ‌రుగుతోంది. హోటళ్లలో కూడా ప్రత్యేకంగా ఫ్లెక్సీ స్టాండులు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారట‌. ' రసం పవర్ ' అని దాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు చైనా వాళ్ళు. 5 వేల ఏళ్ల నాటి భారతీయ వంటకం ర‌సం. దీనిపై పేటెంట్ ఎలా తీసుకుందామ‌ని ఆలోచించ‌కుండా ముందు ర‌సం సేవించండి.   మన పూర్వీకులు చెప్పిన విషయాలు, ఆచారాలు, జీవన విధానాల వెనుక ఏదొక విజ్ఞానం(సైన్స్) ఇమిడి ఉంటుంది. కాబ‌ట్టి మిరియాల చారు తాగుదాం కరోనాను తరిమికొడదాం.

రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదు!

అమరావతిని రాజధానిగా కొనసాగించాలా? వ‌ద్దా అనేది రాష్ట్ర పరిధిలోని అంశం. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవ‌ద‌ని మ‌రోసారి బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు వివ‌ర‌ణ ఇచ్చారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి సైతం వేసవి రాజధానిని ప్రకటించడం దీనికి నిదర్శనమన్నారు. రాజధాని ఏర్పాటు విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని కేంద్రం పార్లమెంటులో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానమిచ్చిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. రాష్ట్ర పార్టీ శాఖ కోరిన అన్ని అంశాలనూ కేంద్ర ప్రభుత్వం అమలు చేయ‌ద‌ని ఆయ‌న చెప్పారు. రాజధాని విషయంలో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టంగా చెప్పిందని  పేర్కొందని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చి కేంద్రం తప్పుడు నిర్ణయాలు తీసుకోదన్నారు. ఎవరైనా  అమరావతి విషయంలో తప్పుడు హామీలు ఇచ్చినా, వ్యాఖ్యలు చేసినా.. అవన్నీ వారి వ్యక్తిగత అభిప్రాయాలుగానే పరిగణించాలని జీవీఎల్ స్పష్టంచేశారు.

ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఫీజు ఫిక్స్‌!

కనిష్ఠం రూ.35 వేలు 288లో 150 కాలేజీలకు ఖరారు మిగతావాటిపైనా నేడు నిర్ణయం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంజనీరింగ్ కాలేజ్‌ల ట్యూషన్‌ ఫీజు ఖరారు చేశారు. 2019-20 విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల బ్లాక్‌ పీరియడ్‌కు మొత్తం 288 ఇంజనీరింగ్‌ కాలేజీలకు ట్యూషన్‌ ఫీజు ఖరారు కావాల్సి ఉంది. గురువారం ప్రత్యేకంగా సమావేశమైన ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌... ఇందులో దాదాపు 150 కాలేజీల ఫీజులను తేల్చింది. కనీస ఫీజు రూ.35 వేలుగా నిర్ణయించారు. అయితే కొన్ని కాలేజీల విషయంలో పున:సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని కమిషన్‌ సభ్యులు అభిప్రాయపడినట్టు తెలిసింది. ఆడిటర్‌ రిపోర్టును బట్టి చూస్తే పలు కాలేజీలకు ఫీజును గతంలో కంటే తగ్గించాల్సి ఉందన్న భావన ఈ సమావేశంలో వ్యక్తమయినట్టు చెబుతున్నారు. ఉన్నత విద్య నియంతణ్ర, పర్యవేక్షణ కమిషన్‌ బృందాలు గత నవంబర్‌ 27 నుంచి ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. జనవరి నెలాఖరుకల్లా ఈ ప్రక్రియను పూర్తిచేశాయి. ఫిబ్రవరి 4 నుంచి కాలేజీలతో వ్యక్తిగత విచారణ మొదలుపెట్టి మార్చి 3తో ముగించాయి. కాలేజీలు సమర్పించిన ఫీజుల ప్రతిపాదనలు, తనిఖీల నివేదికలు, వ్యక్తిగత విచారణ అనంతరం..గురువారం కమి షన్‌ సమావేశమైంది. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను దృష్టిలో ఉంచుకుని కాలేజీల పనితీరును బట్టి వాస్తవంగా ఎంతవస్తే అంతే సిఫారసు చేద్దామని పలువురు సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో  మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఫీజుల ఖరారులో విద్యాబోధన , సదుపాయాలు, ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్లు, ఆదాయ, వ్యయాలు, ఏఐసీటీఈ నిబంధనల అమలు తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకున్నారు. కన్వీనర్‌ కోటా ఫీజుకు దాదాపు డబుల్‌ ఫీజును కేటగిరీ-బి అడ్మిషన్లలో వసూలు చేసుకునేలా సిఫారసు చేయాలని కమిషన్‌ నిర్ణయించింది. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆర్థికభారం తగ్గించుకునే ఆలోచనతోనే ఫీజులు తగ్గిస్తున్నారని కాలేజీల మేనేజ్‌మెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

కడప లో మ‌రో స్టీల్ ప్లాంట్!

కడప జిల్లాలో 10 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో భారీ స్టీల్‌ ప్లాంట్‌ పెట్టడానికి ప్రముఖ స్విస్‌ కంపెనీ ఐఎంఆర్‌ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై తమ ఆసక్తిని వ్యక్తం చేశారు.   ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, ఉక్రెయిన్, భారత్‌ సహా పలు దేశాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం లాంటి గనుల తవ్వకాలను చేపట్టడంతోపాటు విద్యుత్, ఉక్కు కర్మాగారాలను నడుతున్నామంటూ ఐఎంఆర్‌ కంపెనీ ప్రతినిధులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. కృష్ణపట్నం పోర్టు, అక్కడ నుంచి రైల్వే మార్గం, జాతీయ రహదారులతో రవాణా సదుపాయం ఉందని వారికి వివరించారు. రానున్న రోజుల్లో వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రాంతం స్టీల్‌ సిటీగా రూపాంతరం చెందడానికి పూర్తి అవకాశాలు న్నాయని కంపెనీ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్‌ఎండీసీతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. నీరు, కరెంటు, మౌలిక సదుపాయాలు.. ఇలా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పారు. సమావేశంలో చీఫ్‌ సెక్రటరీ నీలం సహానీ, ఇండిస్టీస్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ్‌, ఐఎంఆర్‌ ఎజి చైైర్మన్‌ హాన్స్‌ రడాల్ఫ్‌ వైల్డ్‌, కంపెనీ డైరెక్టర్‌ అని ర్యుధ్‌ మిశ్రా, సెడిబెంగ్‌ ఐరన్‌ ఒర్‌ కంపెనీ సిఇఒ అనీష్‌ మిశ్రా, గ్రూప్‌ సిఎఫ్‌ఒ కార్ల్‌డిల్నెర్‌, టెక్నికల్‌ డైరెక్టర్‌ సురేష్‌ తవానీ, ప్రా జెక్ట్స్‌ ప్రెసిడెంట్‌ అరిందమ్‌ దే, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ సంజరు సిన్హా, ఎపి ఇంటిగ్రేటెడ్‌ స్టీల్స్‌ ఎమ్‌డి పి.మధుసూదన్‌ పాల్గొన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 69.54 శాతం పూర్తి

ఎంపీ కేశినేని నాని ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం దిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 69.54 శాతం పూర్తయినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ లోక్‌సభకు వెల్లడించింది. తెదేపా ఎంపీ కేశినేని నాని లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2016 సెప్టెంబర్‌ 30 నాటి కేంద్ర ఆర్థికశాఖ లేఖ ప్రకారం 100 శాతం పోలవరం ప్రాజెక్టు ఖర్చును కేంద్రమే భరిస్తుందని అందులో స్పష్టం చేశారు. 2014 ఏప్రిల్‌ 1 నుంచి ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసాను కేంద్రమే తిరిగి చెల్లిస్తుందని సమాధానంలో పేర్కొన్నారు. కేంద్రం ప్రకటన చేసిన తర్వాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం ఆమోదం ప్రకారం ఏపీ ప్రభుత్వానికి ఇప్పటి వరకూ రూ.8,614.16కోట్లు చెల్లించామని.. గతనెలలో విడుదల చేసిన రూ.1,850 కోట్లు కూడా దీనిలో ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు. ఏపీ ఇచ్చే వివరాలపైనే మిగిలిన నిధులు... పోలవరంపై 2014 మార్చి 31 వరకు చేసిన ఖర్చు ఆడిట్‌ నివేదికలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే రెండు లేఖలు రాశామని.. 2013-14 ధరల ప్రకారం సవరించిన అంచనాలు కూడా సమర్పించాలని ఆయా లేఖల్లో ప్రస్తావించామని కేంద్ర మంత్రి వెల్లడించారు. 2018 జులై 26న, 2019 మే 6న రాసిన రెండు లేఖలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. ఆడిట్‌కు సంబంధించిన అన్ని వివరాలు అందించే వరకు తదుపరి నిధులు విడుదల చేయడం కుదరదంటూ గతేడాది నవంబర్‌ 26న కేంద్ర ఆర్థికశాఖ రాష్ట్రానికి మరో లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం తాత్కాలికంగా రూ.5,175.25 కోట్లకు గాను.. రూ.3,777.44 కోట్లకు ఆడిట్‌ పూర్తయిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వివరాలపైనే మిగిలిన మొత్తాన్ని విడుదల చేయడం ఆధారపడి ఉంటుందన్నారు. 2021 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గజేంద్రసింగ్‌ షెకావత్‌ వివరించారు.

ఏపీలో ఓవైసీ ప‌ప్పులుడ‌క‌వు! ఆంధ్ర‌లోనూ అదే ఎత్తుగ‌డ‌నా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిజంగానే ముస్లింలు వైసిపికి దూరం అవుతున్నారా?  విజ‌య‌వాడ‌, గుంటూరు బ‌హిరంగ‌స‌భ‌ల్లో ఎంపి అస‌దుద్దీన్ ఓవైసీ ప్ర‌సంగాల ఉద్దేశం ఏమిటి?  ముస్లిం ఓటు  బ్యాంక్ జ‌గ‌న్ నుంచి దూర‌మైతే బిజెపి లాభ‌ప‌డుతుందా? అందుకేనా ఓవైసీ ఏపి ముస్లింల ప‌ట్ల స‌వ‌తిత‌ల్లి ప్రేమ ఒల‌క బోస్తున్నారా? ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వ‌చ్చి ఓవైసీ చేసిన ప్ర‌సంగాల వెనుక బిజెపి వ్యూహం వుందా?  లేక స్వంతంగా ఎపిలో ఎద‌గాల‌ని ఎంఐఎం తాప‌త్ర‌య ప‌డుతుందా? దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అయిన ముస్లింల‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేసిన ఘ‌న‌త ఓవైసీ ఖాతాకే వెళుతుంది. ఎంఐఎం ఎన్నిక‌ల్లో పోటీ చేసిన చోట్ల‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ బాగా లాభ‌ప‌డిన విష‌యం అయా నియోజ‌క‌వ‌ర్గాల ఎన్నిక‌ల ఫ‌లితాలు చూస్తే స్ప‌ష్టం గా అర్థం అవుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఓవైసీ బ్రదర్స్ ఎనలేని అభిమానం చూపించేవారు. ముస్లింల కోసం ఆనాడు వైఎస్ తీసుకొచ్చిన 4 శాతం రిజర్వేషన్లో లేక ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలో... లేక మరేదైనా కారణముందో తెలియదు గానీ వైఎస్ అన్నా, ఆయన కుటుంబమన్నా ఓవైసీ బ్రదర్స్ ఎప్పుడూ పాజిటివ్ కామెంట్సే చేసేవారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా వైఎస్ ను ఎన్నోసార్లు పొగిడారు. ముస్లింల కోసం వైఎస్ ఎంతో చేశారంటూ అసెంబ్లీ వేదికగా అక్బరుద్దీన్ స్టేట్ మెంట్స్ కూడా ఇచ్చారు. ఇక, వైఎస్ రాజకీయ వారసుడిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డిపైనా ఓవైసీ బ్రదర్స్ ప్రేమానురాగాలు, అభిమానం చూపించేవారు. ఎప్పుడూ కూడా జగన్ కు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పైగా గతంలో పొగడ్తల వర్షం కూడా కురిపించారు. అంతేకాదు, మొన్నటి ఎన్నికల్లో వైసీపీ గెలవాలని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. కానీ, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అసదుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరుగుతున్నారు. ఎందుకు? ప్రధాని మోడీ అంటే, జగన్మోహన్ రెడ్డికి భయమని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. మోడీ అండ్ అమిత్ షా అంటే భయం కనుకే, ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. అదే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండి ఉంటే, సీఏఏ, ఎన్పీఆర్ వంటి చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించేవారంటూ గుంటూరు సభలో ఓవైసీ వ్యాఖ్యానించారు. అయితే, ఇటీవ‌ల జ‌రిగిన విజ‌య‌వాడ‌,  గుంటూరు సభల వెనుక అసదుద్దీన్ కు రాజకీయ వ్యూహం ఉందంటున్నారు. ఇప్పటివరకు తెలంగాణతోపాటు దేశంలో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోటీచేస్తూ ఎంఐఎంను విస్తరిస్తున్న అసదుద్దీన్.  ఏపీలో కూడా సత్తా చాటాలని నిర్ణయం తీసుకున్నారట. అందులో భాగంగానే ముస్లింలు అధికంగా ఉండే గుంటూరు, కర్నూలు, కడపపై దృష్టిపెట్టారని చెబుతున్నారు. గుంటూరు, కర్నూలు, కడపలో ఇప్పటికే ఎంఐఎం కార్యాలయాలు ప్రారంభించడంతో, జెండాలు, కార్యకర్తల హడావుడి సైతం కనిపిస్తోంది. అయితే, ఏపీలో ముస్లింలంతా వైసీపీకి ఓటు బ్యాంకుగా మారారని గుర్తించిన ఓవైసీ, ఆంధ్రప్రదేశ్ లో ఎదగాలంటే, వైసీపీ నుంచి ముస్లింలను వేరు చేయాలనే వ్యూహంతో ముందుకెళ్తున్నారని అంటున్నారు. అందుకే సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్సీలను ఆయుధంగా ప్రయోగిస్తున్నారని చెబుతున్నారు. అందుకే, జగన్‌ పట్ల ముస్లింలలో వ్యతిరేక ముద్ర వేసి, ఏపీలో ఎంఐఎం బలోపేతానికి బాటలేసుకోవాలన్నది ఓవైసీ వ్యూహంగా తెలుస్తోంది.  అందుకే ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయకపోతే, ముస్లింలంతా జగన్‌కు వ్యతిరేకం కావాలని పిలుపునిచ్చారు అసద్. స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం పోటీచేస్తే గుంటూరు, కర్నూలు, కడపలో ఫలితాలు తారుమారౌతాయి. ఎంఐఎం గెల‌వ‌క‌పోయినా ప్ర‌త్య‌ర్థి పార్టీల గెలుపుకు అవ‌కాశం వుంటుంది. అయితే టిడిపి లాభ‌ప‌డుతుందా?  లేక బిజెపి లాభ‌ప‌డుతుందా అనేది ఓవైసీ కే తెలుసు. రాజ‌కీయాల్లో  మిత్రులు, శ‌త్రువులంటూ ఎవ‌రూ ఉండ‌రు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ముఖ్యం. సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్సీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముస్లింలు వాటిని వ్యతిరేకించని పార్టీలపై కూడా అంతే ఆగ్రహంతో ఉన్నారు. వాస్త‌వ ప‌రిస్థితుల్ని అర్థం చేసుకున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాబినెట్ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యంతీసుకున్నారు. 2010లో జనాభా లెక్కల ప్రక్రియలో ఏ ప్రశ్నావళి అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ ప్రక్రియకే పరిమితమవుతాం. ఎన్‌పీఆర్‌ ప్రశ్నల నమూనాలో కూడా మార్పు చేయాలని మంత్రి మండలి తీర్మానం చేసింది. ఎన్‌పీఆర్‌ ప్రక్రియను కూడా నిలిపివేయాలని తీర్మానం చేసి రాష్ట్ర ముస్లింల మ‌న‌స్సుల్ని గెల్చుకోవ‌డ‌మే కాదు ఓవైసీ వ్యూహాన్నిచెక్‌పెట్ట‌డంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విజ‌యం సాధించారు.

కేసీఆర్ ప్రభుత్వాన్ని కార్నర్ చేసిన 'బిగ్ బాస్ 3' విజేత?

'బిగ్ బాస్ 3' విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. బుధవారం రాత్రి గచ్చిబౌలిలోని ఓ పబ్ లో జరిగిన గొడవపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. పబ్ మూసివేసే సమయంలో వాష్ రూమ్ నుండి బయటకు వస్తుండగా... తనకు డాష్ ఇచ్చారని, తనతో ఉన్న స్నేహితురాళ్లతో అసభ్యంగా ప్రవర్తించారని, ఇదేమిటని ప్రశ్నించగా పదిమంది కలిసి బీరు బాటిల్ తో తనపై దాడి చేశారని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీడియాతో రాహుల్ సిప్లిగంజ్ అన్నారు. ఈ వివాదంలో అత్యంత చాకచక్యంగా ‌ కెసిఆర్ ప్రభుత్వాన్ని అతడు కార్నర్ చేసినట్టే కనబడుతోంది. రాహుల్ సిప్లిగంజ్ మీద దాడి చేసిన రితేష్ రెడ్డి సోదరుడు ప్రస్తుతం ఎమ్మెల్యే. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. రాజకీయ పొగరుతోనే తనపై దాడి చేశారని రాహుల్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు... దర్యాప్తును పక్కదోవ పట్టించడానికి రాజకీయపరమైన ఒత్తిళ్ళు రావచ్చు అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. న్యాయం జరుగుతుందో? లేదో? చూస్తానని రాహుల్ సిప్లిగంజ్ అన్నారు. 'కేసులో పొలిటికల్ ఇన్ఫ్లూయెన్స్ ఉంటుందని మీరు భావిస్తున్నారా?' అని రాహుల్ సిప్లిగంజ్ ను ప్రశ్నించగా... 'ఉండదని అనుమానమా?' అని అన్నారు. కేసు ఉన్నత స్థాయి వరకు వెళ్లిందనీ, ఎవరు ఎవరి మీద దాడి చేస్తారో వీడియోలో అందరూ చూశారనీ, న్యాయం జరగాలని మాత్రమే తాను కోరుకుంటున్నానని రాహుల్ సిప్లిగంజ్ మాటల్లో వినపడింది. ఈ వివాదంపై న్యాయం జరిగేలా చూడాలని రాహుల్ అభిమానులు ట్విట్టర్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి సొంత పార్టీ మనుషులను బయటపడేస్తారా? లేదా నిష్పక్షపాతంగా విచారణ జరిపించి దోషులకు శిక్ష పడేలా చేస్తారో? చూడాలి. మీడియా ముందు రాహుల్ సిప్లిగంజ్ మాటలతో ఒకటి మాత్రం స్పష్టమైంది. అతడి మాటల్లోనూ దురుసుతనం బయటపడింది. 'హౌలా గాడు' అనే మాటను రాహుల్ సిప్లిగంజ్ ఎక్కువగా వాడాడు. అతడి భాషపై మీడియా ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేయగా... ఇప్పటికీ వాళ్లకు గౌరవం ఇస్తే నన్ను హౌలా గాడు అని ప్రేక్షకులు అనుకుంటారని వ్యాఖ్యానించడం కొసమెరుపు.

భోగాపురానికి జగన్ ఎందుకు జైకొట్టారు? ఇక్కడ ప్రజాధనం ఆదా చేయరా?

టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను తిరగదోడుతూ విస్తృత అధికారాలు కల్పిస్తూ సిట్ ను నియమించిన జగన్ ప్రభుత్వం.... కొన్నింటికి మాత్రం జైకొడుతోంది. మొదట భారీ దోపిడీ జరిగిందంటారు. కేవలం దోపిడీ కోసమే ఆ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడితే చాలు చంద్రబాబు నిర్ణయాలపై దుమ్మెత్తిపోస్తారు. తీవ్ర విమర్శలు చేస్తారు. సరే, విచారణ సిద్ధమా? అంటే చాన్నాళ్లవరకు నోరు మెదపరు. పోలవరం ప్రాజెక్టు దగ్గర్నుంచి... అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ వరకు ఇదే తంతు. ప్రతిపక్షంలో ఉండగా తీవ్ర ఆరోపణలు చేసిన ప్రాజెక్టుల విషయంలోనూ జగన్ ప్రభుత్వం మాట మార్చింది. పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ విమర్శలనే చూద్దాం, ఆనాడు పోలవరం అంచనాలను చంద్రబాబు పెంచినప్పుడు భారీ దోపిడీ కోసమేనంటూ జగన్మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతలంతా విమర్శించారు. చివరికి కేంద్రానికి సైతం ఫిర్యాదులు చేశారు. చివరికి ఏం జరిగింది? జగన్ అధికారంలోకి వచ్చాక, అవే అంచనాలను ఆమోదించాలంటూ కేంద్రాన్ని కోరారు. ఇక, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు విషయంలోనూ అదే జరిగింది. జీఎంఆర్ కు లబ్ది చేకూర్చేవిధంగా నిర్ణయం తీసుకున్నారంటూ విమర్శించారు. టెండర్ నిబంధనల్లో పలు ఉల్లంఘనలు జరిగాయని పెద్దఎత్తున ఆరోపణలు చేశారు. సీన్ కట్ చేస్తే, నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో జీఎంఆర్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దాంతో, జగన్ సర్కారు తీరుపై విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ప్రజాధనం ఆదా చేస్తున్నామని చెబుతున్న జగన్ ప్రభుత్వం.... ప్రతిపక్షంలో ఉండగా, పెద్దఎత్తున విమర్శలు చేసిన జీఎంఆర్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కాంట్రాక్టు విషయంలో మాత్రం ఎందుకు రివర్స్ టెండరింగ్ కు వెళ్లలేదని ప్రశ్నిస్తున్నారు. పైగా చంద్రబాబు నిర్ణయానికి జగన్ ఎందుకు జైకొట్టారని నిలదీస్తున్నారు. అయితే, జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు.... జగన్ తో పలుమార్లు సంప్రదింపులు జరిపారని, అందుకే భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం విషయంలో సానుకూల నిర్ణయం తీసుకున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే, చంద్రబాబు నిర్ణయాలన్నింటినీ తిరగదోడుతూ, సిట్ దర్యాప్తునకు ఆదేశించిన జగన్మోహన్ రెడ్డి... కొన్నింటికి మాత్రం ఎందుకు జైకొడుతున్నారనేది అనుమానాలు రేపుతోంది.

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి వస్తుండగా రేవంత్‌ని ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ ఫామ్‌హౌస్‌ను డ్రోన్‌తో చిత్రీకరించారన్న అభియోగంపై.. ఇప్పటికే నలుగురు రేవంత్‌ అనుచరులను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. తాజాగా రేవంత్ ని అరెస్ట్ చేశారు. ఆయన్ని నార్సింగ్​ పోలీస్​ స్టేషన్​ కు తరలించారు. కాగా, ఈ వ్యవహారంలో రేవంత్ సహా మొత్తం 8 మందిపై నార్సింగ్‌ పీఎస్‌లో కేసులు నమోదయ్యాయి. ఐపీసీ 184, 187, 11 రెడ్ విత్ 5ఏ, ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదయ్యాయి.

సోనియా ఫ్యామిలీకి కరోనా పరీక్షలు... ఆర్ఎల్పీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

కరోనా వైరస్ దేశంలో అలజడి సృష్టిస్తోంది. కరోనా భయంతో ప్రజలంతా వణికిపోతున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 29 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ లోక్ సభలో ప్రకటన చేశారు. అయితే, కరోనా విస్తరించకుండా సకల జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం రేపుతోంది. తెలంగాణలో ఇప్పటికే పదుల సంఖ్యల కరోనా అనుమానిత కేసులు నమోదు కాగా, ఏపీలోనూ అనుమానితుల జాబితా పెరిగిపోతోంది.  కరోనాపై దేశంలో కలకలం రేగుతుంటే, లోక్ సభలో ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ తన వ్యాఖ్యలతో కల్లోలం సృష్టించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, అలాగే కుటుంబ సభ్యులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కోరారు. భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ గా తేలినవారిలో ఎక్కువగా సోనియా పుట్టినిల్లు ఇటలీ నుంచి వచ్చినవాళ్లేనని బీజేపీ మిత్రపక్షమైన ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ అన్నారు. అందువల్ల, సోనియా కుటుంబ సభ్యులందరికీ కరోనా టెస్టులు చేయాల్సిన అవసరముందన్నారు. ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ వ్యాఖ్యలతో లోక్ సభలో కలకలం రేగింది. హనుమాన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం చెప్పింది. వెల్ లోకి దూసుకొచ్చి ఆందోళనకు దిగారు. ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ ను వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. హనుమాన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకు టీడీపీ.. జీవో 176 అమలుకు డిమాండ్...

ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గింపును సవాలు చేస్తూ టీడీపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేశారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, అలాగే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కలిసి అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఏపీ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కుదింపు నిర్ణయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. జగన్ అధికారంలోకి రావడానికి బీసీలు సహకరిస్తే, చివరికి వాళ్ల కన్నుల్లో పొడుస్తూ, రిజర్వేషన్లు కుదించారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లు తగ్గడం కారణంగా, రాష్ట్రవ్యాప్తంగా 15వేల పదవులను బీసీలు కోల్పోనున్నారని అన్నారు.  అయినా, సొంత కేసుల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ సీనియర్ న్యాయవాదులను పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి.... బీసీల కేసుల విషయంలో మాత్రం ఎందుకు సమర్ధుడైన లాయర్ ను నియమించలేదని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఇప్పటికైనా, జీవో 176ను యథాతథంగా అమలు చేయాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. నిజంగానే జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, 34శాతమున్న బీసీ రిజర్వేషన్లు... 24శాతానికి ఎలా పడిపోతుందని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ప్రశ్నించారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప, వాళ్లకు న్యాయం చేయడం లేదని జగన్ పై మండిపడ్డారు. బీసీలకు రాజ్యాధికారం దక్కకూడదన్న దురుద్దేశంతోనే జగన్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆరోపించారు. అయినా, కోర్టుల ద్వారా బీసీ రిజర్వేషన్లకు అమలుకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం ముందే ఎందుకు గుర్తించలేదని కొనకళ్ల ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై జగన్ ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవడం వల్లే, తాము సుప్రీంను ఆశ్రయించామన్న టీడీపీ నేతలు... బలహీనవర్గాలకు న్యాయం చేయకపోతే, బీసీల ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు.

నాల్గ‌వ డెత్ వారెంట్! ఈసారైనా అమ‌లౌతుందా?

మార్చి 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులకు ఉరి శిక్ష విధించాలని పటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్లను జారీ చేసింది.  ఇప్పటికే మూడుసార్లు నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదా పడుతూ వచ్చింది. నాలుగోసారి డెత్ వారెంట్లను పటియాలా హౌస్ కోర్టు గురువారంనాడు జారీ చేసింది. ఎప్ప‌ట్టిలాగే గురువారంనాడు కూడా నిర్భ‌య తల్లి ఆశాదేవీ పటియాలా హౌస్ కోర్టు హాల్‌లో ఉత్కంఠ‌త‌తో తీర్పు  విన‌డం కోసం ఆతృత్ర‌తో ఎదురుచూస్తున్నారు.   న్యాయ‌మూర్తి  త‌న తీర్పు వెల్ల‌డించారు.  మార్చి 20న ఉదయం 05.30 గంటలకు దోషులను ఉరితీయాలని ఆదేశాలు జారీ చేశారు. నలుగురు దోషులు ముకేష్ కుమార్ సింగ్, పవన్ కుమార్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ సింగ్ నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయనున్నారు. తీర్పు అనంతరం ఆమె తరఫున వాదించిన న్యాయవాదిని కౌగిలించుకుని కన్నీటిపర్యంతమయ్యారు. డెత్‌వారెంట్లు జారీ అనంతరం ఆశాదేవి మీడియా మాట్లాడారు. 'నా కూతురిపై అత్యాచారం జరిపిన నలుగురు దోషులను ఉరితీసే సమయం ద‌గ్గ‌ర ప‌డింది.  నలుగురు కామాంధులను ఉరితీసిన రోజే నా కూతురికి న్యాయం జరిగినట్టు. ఇప్పటికే మూడుసార్లు ఉరి వాయిదా పడటం విచారం. ఇక వారికున్న న్యాయపరమైన అంశాలన్నీ ఇక మూసుకుపోయాయి. దోషులు చట్టం నుంచి ఇక తప్పించుకోలేరు. ప్ర‌భుత్వం అవకాశం ఇస్తే వారి చావును చూడాలని ఉంది' అని అన్నారు. 2012 డిసెంబర్ 16న ఆరుగురు దోషులు... కదులుతున్న బస్సులో నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె బాయ్ ఫ్రెండ్‌ని దారుణంగా చిత‌క‌బాదారు. ఆ తర్వాత నిర్భయను నడిరోడ్డుపై బస్సులోంచీ విసిరేశారు. ఆమెకు ప్రత్యేక చికిత్స కోసం సింగపూర్ తరలించినా... ఆమె బతకలేదు. ఈ కేసులోని ఆరుగురు దోషుల్లో ఒకడు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో దోషి మైనర్ కావడంతో  మూడేళ్ల శిక్ష తర్వాత 2015లో విడుదలయ్యాడు. మిగతా నలుగురు ముకేష్ కుమార్ సింగ్, పవన్ కుమార్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ సింగ్ కి ఉరిశిక్ష పడింది. ఐతే చట్టంలో లొసుగులును ఉపయోగించుకొని ఉరిశిక్షను మూడుసార్లు వాయిదాపడేలా చేశారు. దోషులకు ఉన్న న్యాయపరమైన అంశాలన్నీ మూసుకుపోవడంతో ఈసారి శిక్ష అమలు జరిగి తీరుతుందని న్యాయవాదులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

సినీ రంగానికే చిరంజీవి జీవితం అంకితం.. రాజ్యసభ సభ్యత్వంపై నాగబాబు క్లారిటీ...

మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం దక్కనుందనే ప్రచారంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనుందనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మెగా అభిమానుల్లో గందరగోళం సృష్టించేందుకే కొంతమంది ఇలా చేస్తున్నారని నాగబాబు మండిపడ్డారు. ప్రస్తుతం చిరంజీవికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదన్నారు. పవన్ కల్యాణ్ జనసేనతో కూడా చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే, పవన్ ఆలోచనలను అన్నయ్యగా చిరంజీవి సమర్ధిస్తారని చెప్పుకొచ్చారు. చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం అంటూ తప్పుడు వార్తలతో గందరగోళం సృష్టిస్తున్నారని నాగబాబు ఫైరయ్యారు. చిరంజీవి ఏ పార్టీలోకి వెళ్లినా గొప్పగా స్వాగతం లభిస్తుందని, అలాంటప్పుడు రాజ్యసభ సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం ఆయనకు ఏమొచ్చిందన్నారు. అయితే, చిరంజీవి తన జీవితాన్ని తిరిగి సినీ రంగానికే అంకితం చేయాలని నిర్ణయించుకున్నారని, అందుకే రాజకీయాలను వదిలేసి, సినిమాలపై దృష్టిపెట్టారని నాగబాబు తెలిపారు. అందుకే, వరుస సినిమాల్లో నటిసక్తున్నారని చెప్పుకొచ్చారు. మెగా హీరోల్లో అందరి కంటే చిరంజీవే సినిమాల్లో బిజీగా ఉన్నారని గుర్తుచేశారు. అన్నదమ్ములిద్దరూ ఒకే రంగంలో ఎందుకనే ఉద్దేశంతోనే చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యారని నాగబాబు తెలిపారు. అంతేకాదు, తమ్ముడు పవన్ కోసం తన రాజకీయ జీవితాన్ని చిరంజీవి త్యాగం చేశారంటూ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో తనకంటే పవన్ అద్భుతంగా ప్రజలకు సేవ చేయగలడని, ఆయనకు ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్ ఉండాలంటే తాను అందులో ఉండకూడదని చిరంజీవి నిర్ణయం తీసుకున్నారని నాగబాబు వివరించారు. చిరంజీవికి అన్ని పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఉంటాయని, అంతమాత్రాన ఆయా పార్టీల నిర్ణయాలకు ఆయన మద్దతు ఉన్నట్లు కాదన్నారు. ఇకకైనా, చిరంజీవిపై తప్పుడు ప్రచారం మానుకోవాలని నాగబాబు సూచించారు.

కరీంనగర్ కారు మిస్టరీలో కొత్త కోణం... సత్యనారాయణరెడ్డి డైరీలో కీలక ఆధారాలు...

కరీంనగర్‌ కాకతీయ కెనాల్‌లో దొరికిన కారుపై మిస్టరీ కొనసాగుతోంది. అది ప్రమాదమా? లేక యాక్సిడెంట్‌లా అల్లిన కథా? అనేది ఇంకా తేలలేదు. అయితే, పోలీసులకు మాత్రం ఒక క్లూ దొరికింది. అది ప్రమాదం కాదని మొదట్నుంచీ అనుమానిస్తోన్న పోలీసులకు ఆధారం లభించింది. అనుమానాస్పద స్థితిలో మరణించిన ముగ్గురూ.... పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సోదరి కుటుంబం కావడంతో అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు.... మృతుడు సత్యనారాయణరెడ్డి ఫెర్టిలైజర్‌ షాపులో దొరికిన డైరీలో సంగతులు అనుమానాలకు బలం చేకూర్చాయి. సత్యనారాయణరెడ్డి తన డైరీలో 2020 జనవరి 27కి ముందు... తన ఆస్తి అంతా టీటీడీకి అప్పగించాలంటూ రాసుకున్నారు. దాంతో, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాకే, తన ఆస్తి గురించి డైరీలో రాశారని పోలీసులు భావిస్తున్నారు. డైరీలో దొరికిన ఈ ఆధారాన్ని బట్టి, సత్యనారాయణరెడ్డి కుటుంబానిది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.  డైరీలో దొరికిన ఆధారాల ప్రకారం ఆత్మహత్యగా అనుమానిస్తున్నా, కొన్ని సందేహాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. జనవరి 27నే సత్యనారాయణరెడ్డి ఫోన్ స్విచ్ఛాప్ అయితే, అప్పట్నుంచి కారు దొరికే వరకు ఆ కుటుంబం ఏమైందో... ఎక్కడికి వెళ్లిందో... కనీసం ఆరా తీసిన వాళ్లే లేకపోవడంతో... ఆ ముగ్గురి మృతిపై అనుమానాలు కొనసాగుతున్నాయి. ఇక, డ్రైవింగ్ సీట్లో ఉండాల్సిన సత్యనారాయణరెడ్డి మృతదేహం... కారు వెనుక సీట్లో ఉండటంపైనా సందేహాలు కలిగించాయి. పైగా అర్ధరాత్రిపూట కాలువలో ఒక బైక్ పడిపోతేనే స్థానికులకు శబ్ధం వినిపించినప్పుడు... మరి, అంతపెద్ద కారు... ప్రమాదానికి గురై... కాలువలో పడిపోతే.... ఎవ్వరికీ చప్పుడు వినిపించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. అసలు ఏ రోజు, ఏ సమయంలో కారు... కెనాల్‌లో పడిందనేది సైతం మిస్టరీగా మారింది.  మరోవైపు, కాలువలో కారు బయటపడే నాటికి 15రోజుల కిందట సత్యనారాయణరెడ్డి, రాధ, వినయశ్రీ సెల్‌ఫోన్ టవర్ లోకేషన్స్ చెప్పాలంటూ కరీంనగర్ త్రీటౌన్ పోలీసులను, అలాగే పెద్దపల్లి పోలీసులను సంప్రదించిన వ్యక్తులు ఆ తర్వాత పత్తా లేకుండా పోవడం కూడా కలకలం రేపింది. ఈ ఎంక్వైరీ చేసిందెవరనేది సస్పెన్స్‌గా మారింది. ఈ అనుమానాలన్నింటికీ సమాధానాలు దొరికితేనే, ఈ ముగ్గురి మృతిపై అనుమానాలు తొలగిపోతాయి.