బిగ్‌బాస్‌-3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌పై దాడి

ప‌బ్‌లో గ్యాంగ్ వార్‌  
ఎమ్మెల్యే సోద‌రుడి గ్యాంగ్‌తో త‌ల‌ప‌డ్డ రాహుల్ గ్యాంగ్‌

బిగ్‌బాస్‌-3 విజేత, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌పై హైదరాబాద్‌లోని ఓ పబ్బులో దాడి జరిగింది. తలపై బీరుసీసాలతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది.

రాహుల్‌ సిప్లిగంజ్‌ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్  ఎంజాయ్ చేస్తూ  ఇబ్బందుల్లో ప‌డ్డాడు.  

అదే ప‌బ్‌లో కొంతమంది యువకులు రాహుల్‌ వెంట వచ్చిన యువతి ని చూసి కామెంట్లు చేస్తూ అస‌భ్య‌క‌రంగా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోయాడు. రాహుల్‌ వారిని నిలదీయడంతో మాటామాటా పెరిగింది. అంతే ఇరు ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. సినిమా షూటింగ్‌ను త‌ల‌పించేలా అర‌గంట సేపు గ్యాంగ్ వార్ న‌డిచింది.

ఈ గొడ‌వ‌లో కొంత మంది యువ‌కులు రాహుల్‌ను బీరు సీసాలతో కొట్టారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన వారిలో వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు ఉన్నట్లు సమాచారం. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రాహుల్ చికిత్స పొందుతున్నాడు. 

Teluguone gnews banner