బొగ్గు కుంభకోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి దోషి.. ఢిల్లీ కోర్టు తీర్పు

బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రితో పాటు మరో ముగ్గుఋ ఉన్నతాధికారులను ఢిల్లీ కోర్టు దోషులుగా నిర్ణయిస్తూ తీర్పు ఇచ్చింది. 1999లో వాజ్ పేయి ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో నాటి బొగ్గుగ‌నుల మంత్రి దిలీప్ రే అక్రమాలకు పాల్పడినట్టు న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఝార్ఖండ్ బొగ్గు గనుల కేటాయింపుల్లోఈ అవకతవకలకు జరిగినట్లు తేల్చింది. కేంద్ర‌మంత్రితో పాటు అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద గౌతమ్‌, క్యాస్ట్రన్ టెక్నాలజీ, ఆ సంస్థ డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాల్‌ను దోషులుగా తేల్చారు. జార్ఖండ్‌లోని గిరిధిలో ఉన్న బ్ర‌హ్మ‌దిహ బొగ్గు గ‌నుల‌ను కాస్ట్రాన్ టెక్నాల‌జీస్ లిమిటెడ్‌కు కేటాయించగా, ఇందులో అవినీతి జరిగినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ గనుల కేటాయింపులో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు సీబీఐ నిర్ధారించింది. ఈ కేసులో దోషులకు శిక్ష‌ల‌ విష‌యాన్ని మాత్రం ఈనెల‌ 14న కోర్టు తన తుది తీర్పులో ప్ర‌క‌టించ‌నుంది.

అవి ఇస్తే ఎన్డీయేలో చేరే విషయం ఆలోచిస్తాం.. క్లారిటీ ఇస్తున్న వైసీపీ కీలక నేతలు.. 

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో భేటీతో పాటు ఎన్డీయేలో చేరాలంటూ బీజేపీ ఆహ్వానించిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా దీని పై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందిస్తూ ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, అలాగే రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేరుస్తామంటేనే తాము ఎన్డీయేలో చేరే అంశాన్ని పరిశీలిస్తామని అయన అన్నారు. అయితే ఇప్పటివరకు ఎన్డీయే లో చేరాలని తమకు ఎటువంటి ఆహ్వానమూ లేదని, అలాగే వైసీపీ సైతం ఆ ప్రతిపాదన చేయలేదని అయన స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో ఈ ఉదయం 10.30 గంటలకు సీఎం జగన్, ప్రధాని మోడీ మధ్య భేటీ జరుగనుంది. ఆ తరువాత మధ్యాహ్నం 12 గంటల నుంచి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వీడియో కాన్ఫెరెన్స్ విధానంలో తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ తో కలిసి జగన్ పాల్గొననున్నారు.   ఇది ఇలా ఉండగా ఇదే విషయం పై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఒక ప్రాంతీయ పార్టీగా తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని. అందుకే రాష్ట్రానికి మేలు చేకూర్చే ప్రత్యేక హోదా.. తదితర అంశాల పై మాత్రమే తాము దృష్టి పెడతామని, అయితే బీజేపీ నుండి మాత్రం ఎన్డీయేలో చేరాలని తమకు ఎటువంటి ఆహ్వానం అందలేదని తెలిపారు.

పాత తరాల కన్నీటి బిందువుల్ని వజ్రాలుగా మూటగట్టి

చాలాకాలం క్రితం... 'ఏడు తరాలు' పుస్తకం చదివి అర్ధరాత్రి వేళ... బిగ్గరగా ఏడ్చా..! అది నేను ఆ పుస్తకానికిచ్చిన గౌరవం! ప్రపంచం అంతా 'బ్లాక్ బైబిల్' గా పరిగణించిన పుస్తకం రూట్స్. ఆ పుస్తకాన్ని ఆ పాత్రలని ఆ రచయిత 'అలెక్స్ హెలి'ని ఎప్పుడు తలుచుకున్నా కన్ను చెమరుతుంది ! అలాంటి మరో సజీవ చిత్రణ 'వీరయ్య'. కడుపు చేత్తో పట్టుకుని ఓడెక్కిన రైతు కూలీలు దేశాంతరాలు తమ రక్తమాంసాలని... ఆ చెరుకుతోటలకి ఎరువుగాను తమ కన్నీటిని నీరుగాను....తమ చెమటను చెరుకుగడకి తీపిగాను ఎక్కించిన తీరు..! కదిలిపోతాం ...మనకి తెలియకుండానే... గుండె చిలకబడి అది కళ్ళ గుండా... చెమ్మగిల్లి... నిశ్శబ్దంగా చెక్కిళ్ళ మీదనించి ధారలుగా జారుతుంది ! మన ముత్తాత ఫోటో సంపాదించడమే అసాధ్యం అయ్యే ఈ రోజుల్లో... రచయత కృష్ణ తన మూలాన్ని వెతుక్కుంటూ చరిత్రపుటల్లోకి... తవ్వుకుంటూ వెళ్ళిపోయి... అక్కడినించి... ఘనీభవించిన... తమ పాత తరాల కన్నీటి బిందువుల్ని వజ్రాలుగా మూటగట్టి... 'వీరయ్య'గా మన ముందు పరిచాడు. అందుకే కొన్ని సంఘటనలు కఠినంగా మెరుస్తూ వుంటాయి ! ఈ పుస్తకం... ఏకబిగిన చదవకండి ! గుండె తట్టుకోలేదు..! కన్నీరు ఇంకి పోతుంది..! ఊపిరి కూడా ఆగిపోవచ్చు..!! అంచెలంచలుగా చదివి...అనుభూతి చెందండి..!  ఈ పుస్తకం వల్ల...మనకి రెండు విషయాలు తెలుస్తాయి..!  ఒకటి... మనిషి మీద సాటి మనిషి క్రౌర్యం..! రెండు, ఒక మనిషి... కష్టాలకు ఎదురొడ్డి ! మానవ జాతికంతటికీ కాంతివంతమైన ఒక దీపస్తంభమై నిలబడ్డం !! -ఆత్మీయంగా,  తనికెళ్ళ భరణి వీరయ్య పుస్తకాన్ని కొని చదివి ఆనందించండి India – 275 INR - https://amazon.in/dp/8194427339 USA – 7.50 $ - https://www.amazon.com/dp/8194427339 

ధర్మాన ప్రసాదరావు పరువు తీస్తున్న కృష్ణదాసు

ధర్మాన అనుచరులలో అసంతృప్తి   నోరు పారేసుకుంటున్న మంత్రులతో తలనొప్పి   జగన్ సర్కారుకు దూరమవుతున్న తటస్థులు- విద్యావంతులు   ‘ఆణిముత్యాల’ వంటి మంత్రులుగా ఏరికోరి ఎంపిక చేసుకున్న ఏపీ సీఎం జగన్ నిర్ణయం.. ఇప్పుడు ప్రతికూల ఫలితాలిస్తోంది. కొడాలి నాని, ధర్మాన కృష్ణదాసు వంటి మంత్రుల నోటిదురుసు వ్యాఖ్యలతో, పార్టీ పరువు పోతోందన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ప్రధానంగా.. గత ఎన్నికల్లో జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దామనుకుని ఓటేసిన.. ఏపార్టీకీ చెందని తటస్థులు, విద్యావంతులలో వారిపై ఏహ్య భావం ఏర్పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మంత్రులంతా జగన్ పరువు తీస్తున్నందు వల్లే, ప్రజల్లో తమ ప్రభుత్వం పలచన అవుతోందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.     తిరుమల డిక్లరేషన్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు.. చివరకు జాతీయ స్థాయిలో దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలు చివరకు.. ప్రధాని మోదీని సైతం అవమానించే స్థాయికి చేరడంతో, బీజేపీ నేతలు కూడా ఆందోళన నిర్వహించారు. తమ అధినేతకు రక్షణ కవచంలా నిలబడటంలో తప్పు లేదు. అయితే ఎదుటివారిని విమర్శించే సందర్భంలో, సంయమనం పాటించాల్సి ఉంది. తర్వాత  అమరావతి రైతులపై.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు చేసిన బూతు వ్యాఖ్యలు, మర్యాదస్తుల మనసులను గాయపరిచాయి. సభ్య సమాజంలో బతుకుతూ, ఉన్నత పదవిలో ఉన్న ఒక మంత్రి, రైతులనుద్దేశించి ఆవిధంగా బూతు మాటలు మాట్లాడటాన్ని, చివరకు వైసీపీ శ్రేణులే అంగీకరించకలేపోతున్నారు. రైతులను ఉద్దేశించి కృష్ణదాసు చేసిన వ్యాఖ్య, యావత్ రైతాంగాన్ని మానసికంగా గాయపరిచినట్టయింది. అది పార్టీపై కూడా ప్రభావం చూపేదేనంటున్నారు.   పైగా తాను చేసిన వ్యాఖ్యలను... యధాతథంగా రాసుకోవాలని మీడియాకు చెప్పడంపై, పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. సహజంగా అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఏ నాయకుడయినా, నాలిక్కరచుకుని నష్టనివారణకు దిగుతారు. తమ పీఏ లేదా పీఆర్‌ఓలతో మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి, దయచేసి అలాంటివి రాయవద్దని బ్రతిమిలాడతారు. ఆ వ్యాఖ్యలు ఒకవేళ దుమారం రేపితే, తాము తెలియక నోరుజారినందున, తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే  క్షమించాలని స్వయంగా వారే ప్రకటనలిస్తుంటారు. ఇది రాజకీయాల్లో చాలాకాలం నుంచీ వస్తున్న సంప్రదాయమే. తాజాగా విశాఖలో.. తన గోడ కూల్చిన వ్యవహారంలో నోరు జారినందుకు, మాజీ ఎంపీ సబ్బం హరి మీడియా ముఖంగా క్షమాపణ కోరారు. ఇలాంటి దిద్దుబాటుతో, నేతల హుందాతనం బయటపడుతుంటుంది.   కానీ ధర్మాన కృష్ణదాసు వ్యవహారం, దీనికి పూర్తి రివర్సులో ఉండటంపై సొంత పార్టీలోనే ఆగ్రహం, అభ్యంతరాలు వ్యక్తమవుతోంది. ఇక శ్రీకాకుళం జిల్లాలో అయితే వైసీపీ శ్రేణులు, ధర్మాన కుటుంబాన్ని అభిమానించే ఇతర పార్టీ కార్యకర్తలు కూడా.. కృష్ణదాసు వాడిన, బూతు పదంపై తలపట్టుకుంటున్నారు. కృష్ణదాసు తన సోదరుడైన, ధర్మాన ప్రసాదరావు పరువు తీస్తున్నారన్న వ్యాఖ్యలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. ఎంతోమంది ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన, సీనియర్ నాయకుడయిన ధర్మాన ప్రసాదరావుకు మర్యాదస్తుడన్న పేరుంది. ఆయన అసెంబ్లీలో-బయట అనేక సార్లు విపక్షాలపై విమర్శలు, ఆరోపణాస్త్రాలు సంధించేవారు. ఆ సందర్భంలో ఆయనెక్కడా నోరు జారిన సందర్భాలు లేవు. అవి కూడా హుందాతనంగానే ఉంటాయి.   నిజానికి ప్రసాదరావు వాడే భాష చాలా సంస్కారవంతంగా, అచ్చ తెలుగులో ఉంటుంది. ఆయన తన ప్రసంగంలో, ఆంగ్ల భాష కూడా వినియోగించిన సందర్భాలు బహు అరుదు. కాంగ్రెస్ హయాంలో, ముఖ్యంగా వైఎస్ జమానాలో మంత్రులుగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి, కాసు కృష్ణారెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి, డొక్కా మాణిక్యప్రసాదరావు వంటి నేతల భాష చాలా హుందాగా ఉండేది. వీరిలో ధర్మాన ప్రసాదరావు ప్రసంగం మళ్లీ వినాలన్నంత ఆసక్తిగా ఉంటుంది.   ఆ అంశంలో, రాజకీయ ప్రత్యర్ధులు సైతం గౌరవించేలా ఉండే ధర్మాన ప్రసాదరావుకు, ఆయన సోదరుడైన కృష్ణదాసుకు ఏ స్థాయిలోనూ పోలికలు లేవన్న వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దశాబ్దాల నుంచి ధర్మాన ప్రసాదరావు కాపాడుకుంటూ వస్తున్న పరువు, గౌరవాన్ని.. ఆయన సోదరుడు తన అసభ్యమైన భాషతో పోగొడుతున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. కొందరు మంత్రులు, ఎమ్పెల్యేలు వాడుతున్న బూతు భాష .. జగన్‌ను సీఎంగా చూడాలని ఓటు వేసిన తటస్థులు- విద్యావంతులను, పార్టీకి దూరం చేస్తోందన్న ఆందోళన వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.  -మార్తి సుబ్రహ్మణ్యం

పాత తరాల కన్నీటి బిందువుల్ని వజ్రాలుగా మూటగట్టి

చాలాకాలం క్రితం... 'ఏడు తరాలు' పుస్తకం చదివి అర్ధరాత్రి వేళ... బిగ్గరగా ఏడ్చా..! అది నేను ఆ పుస్తకానికిచ్చిన గౌరవం! ప్రపంచం అంతా 'బ్లాక్ బైబిల్' గా పరిగణించిన పుస్తకం రూట్స్. ఆ పుస్తకాన్ని ఆ పాత్రలని ఆ రచయిత 'అలెక్స్ హెలి'ని ఎప్పుడు తలుచుకున్నా కన్ను చెమరుతుంది ! అలాంటి మరో సజీవ చిత్రణ 'వీరయ్య'. కడుపు చేత్తో పట్టుకుని ఓడెక్కిన రైతు కూలీలు దేశాంతరాలు తమ రక్తమాంసాలని... ఆ చెరుకుతోటలకి ఎరువుగాను తమ కన్నీటిని నీరుగాను....తమ చెమటను చెరుకుగడకి తీపిగాను ఎక్కించిన తీరు..! కదిలిపోతాం ...మనకి తెలియకుండానే... గుండె చిలకబడి అది కళ్ళ గుండా... చెమ్మగిల్లి... నిశ్శబ్దంగా చెక్కిళ్ళ మీదనించి ధారలుగా జారుతుంది ! మన ముత్తాత ఫోటో సంపాదించడమే అసాధ్యం అయ్యే ఈ రోజుల్లో... రచయత కృష్ణ తన మూలాన్ని వెతుక్కుంటూ చరిత్రపుటల్లోకి... తవ్వుకుంటూ వెళ్ళిపోయి... అక్కడినించి... ఘనీభవించిన... తమ పాత తరాల కన్నీటి బిందువుల్ని వజ్రాలుగా మూటగట్టి... 'వీరయ్య'గా మన ముందు పరిచాడు. అందుకే కొన్ని సంఘటనలు కఠినంగా మెరుస్తూ వుంటాయి ! ఈ పుస్తకం... ఏకబిగిన చదవకండి ! గుండె తట్టుకోలేదు..! కన్నీరు ఇంకి పోతుంది..! ఊపిరి కూడా ఆగిపోవచ్చు..!! అంచెలంచలుగా చదివి...అనుభూతి చెందండి..!  ఈ పుస్తకం వల్ల...మనకి రెండు విషయాలు తెలుస్తాయి..!  ఒకటి... మనిషి మీద సాటి మనిషి క్రౌర్యం..! రెండు, ఒక మనిషి... కష్టాలకు ఎదురొడ్డి ! మానవ జాతికంతటికీ కాంతివంతమైన ఒక దీపస్తంభమై నిలబడ్డం !! -ఆత్మీయంగా,  తనికెళ్ళ భరణి వీరయ్య పుస్తకాన్ని కొని చదివి ఆనందించండి India – 275 INR - https://amazon.in/dp/8194427339 USA – 7.50 $ - https://www.amazon.com/dp/8194427339   

ఢిల్లీ బయలుదేరిన సీఎం జగన్.. కేంద్ర కేబినెట్ లోకి వైసీపీ...!

ఏపీ సీఎం జగన్ కొద్ది సేపటి క్రితం ఢిల్లీ బయలుదేరారు. అయన ఢిల్లీలో ప్రధాని మోడీ ని కలవనున్న నేపథ్యంలో, మరోపక్క కేంద్ర కేబినెట్ లో చేరాలని జగన్ కు ఆహ్వానం అందిందని ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పర్యనటకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. వైసీపీకి 2 కేబినెట్, ఒక సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) పదవులను కేంద్రం ఆఫర్ చేసినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏ నుండి మిత్ర పక్షాలు విడిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి కూడా మిత్రపక్షాల అవసరం చాలా ఉంది. కొద్దీ రోజుల క్రితం ఎన్డీయే నుండి అకాలీదళ్ బయటకు వెళ్లిపోవడంతో రాజ్యసభలో ఎన్డీయే బలం తగ్గింది. దీంతో లోక్ సభలో బీజేపీకి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా... రాజ్యసభలో మాత్రం బిల్లులను పాస్ చేయించుకోవడానికి ఇతర పార్టీల అవసరం చాలా ఉంది.   ఈ నేపథ్యంలో వైసీపీకి ఒకటి రెండు బెర్తులిచ్చి కూటమిలోకి ఆహ్వానించాలని బీజేపీ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వైసిపి కొన్ని బిల్లులకు తన పూర్తీ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ప్రధాని మోడీతోనూ, అలాగే బీజేపీ పెద్దలతోను జగన్ ఈరోజు, రేపు చర్చలు జరుపుతారని తెలుస్తోంది. అయితే కేంద్ర కేబినెట్ లో చేరితే వైసీపీకి బలమైన సపోర్ట్ గా ఉన్న క్రిస్టియన్లు, మైనారిటీలు పార్టీకి దూరమవుతారని అయన సందేహిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ప్రతిపక్షాలు మళ్ళీ ప్రత్యేక హోదా స్లోగన్ ఎత్తుకునే అవకాశం ఉంది. ఈ రెండు అంశాలు రాజకీయంగా సీఎం జగన్ కు ఇబ్బందికరమైనవే. ఇప్పటికే వైసీపీ పార్లమెంట్ లో బీజేపీకి అన్ని విధాలా సహకరిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ కేంద్ర కేబినెట్ లో చేరడానికి అంగీకరిస్తారా.. లేక బయటి నుండి మద్దతు ఇస్తాం అని అంటారా.. ఏ విషయం రేపటిలోగా తేలనుంది.

ఈ తరం గాంధీ 'విష్ణువర్ధన్ రెడ్డి'కి 13 జిల్లాల్లో అభిమానులు!!

పేదల పెన్నిది.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి.. 13 జిల్లాల్లోనూ అభిమాన సంఘాలు ఉన్న మన ప్రియతమ నేత.. ఆంధ్రా ముద్దుబిడ్డ విష్ణువర్ధన్ రెడ్డికి కాస్త ఆలస్యంగా జన్మదిన శుభాకాంక్షలు...   ఏపీలోని పదమూడు జిల్లాల్లో బీజేపీ పార్టీ ఉందో లేదో తెలియదు గానీ.. ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి మాత్రం పదమూడు జిల్లాల్లోనూ ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. ఈ మాట మేం అనట్లేదు. స్వయంగా ఆయనే చెప్పారు. ఆయన జన్మదినం సందర్భంగా 13 జిల్లాల్లోని ఆయన అభిమానులు రక్తదాన శిబిరాల ఏర్పాటు, సేవా కార్యక్రమాలు చేసి.. ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఊరుకోండి.. సీఎం స్థాయి నేతలకే 13 జిల్లాల్లో క్రేజ్ లేదు, ఈయనకి ఎలా ఉంటదని తక్కువ అంచనా వేయకండి. అసలు అధికార పార్టీ వాళ్ళు తమ నేతని ఈ తరం గాంధీ అని చెప్పుకుంటున్నారు గానీ.. నిజానికి ఈ తరం గాంధీ విష్ణువర్ధన్ రెడ్డి. అందుకేనేమో ఆయన గాంధీ జయంతి నాడు జన్మించారు. మరి గాంధీ జయంతి నాడు పుట్టిన ఈ తరం గాంధీ జన్మదినం అంటే ఆ మాత్రం హడావుడి లేకుండా ఎలా ఉంటుంది. అందుకే 13 జిల్లాలోనూ ఆయన అభిమానులు సేవాకార్యక్రమాలు చేశారు. వాటిని వీడియో రూపంలో విష్ణువర్ధన్ రెడ్డి మనతో పంచుకున్నారు.    ఏంటి విష్ణువర్ధన్ రెడ్డికి ఇంత క్రేజ్ ఉందా!!.. అలా అయితే ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో 13 జిల్లాల్లో క్రేజ్ ఉన్న విష్ణువర్ధన్ రెడ్డిని సీఎం అభ్యర్దిగా ప్రకటిస్తే బాగుంటుంది. ఆయన క్రేజ్ తో ఖచ్చితంగా నోటా కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని బీజీపీ పెద్దలకి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా?. ఆగండి ఆగండి అక్కడే మనమంతా పప్పులో కాలేశాం. నాణేనికి మరోవైపు కథ వేరే ఉంది. అసలు మేటర్ ఏంటంటే గాంధీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాలను అదేరోజు పుట్టినరోజు జరుపుకున్న విష్ణువర్ధన్ రెడ్డి తన ఖాతాలో వేసుకున్నారు.   గాంధీ జయంతి సందర్భంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గుడ్‌ కేర్‌ హెల్పింగ్‌ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే, అనంతపూర్ రాయల్ యూత్ ఫెడరేషన్ మరియు నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మరియు రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛందంగా కొందరు యువకులు రక్తదానం చేశారు.    అయితే రాజమహేంద్రవరం, అనంతపూర్ లో జరిగిన కార్యక్రమాలకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో విష్ణువర్ధన్ రెడ్డి వాడేసుకున్నారు. ఇవే కాదు రాష్ట్రవ్యాప్తంగా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలన్ని తన పుట్టినరోజు సందర్భంగా నిర్వహించినవే అంటూ విష్ణువర్ధన్ రెడ్డి నిస్సిగ్గుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. దీంతో ఇదేం పబ్లిసిటి పిచ్చి అంటూ విష్ణువర్ధన్ రెడ్డి తీరుపై సెటైర్లు వినిపిస్తున్నాయి.   విష్ణువర్ధన్ రెడ్డికి మొదటి నుంచి ప్రచార పిచ్చి ఎక్కువనే భావన రాజకీయ వర్గాల్లో ఉంది. మీడియాలో ఫోకస్ అయ్యేందుకే ఆయన కావాలనే కాంట్రవర్సీ కామెంట్లు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, పొలిటికల్ టీడర్లకు పబ్లిసిటి పిచ్చి ఉండవచ్చు కాని.. ఇంత పీక్ స్టేజీలో ఉండకూడదని అంటున్నారు. పబ్లిసిటి కోసం ఏకంగా గాంధీ జయంతి కార్యక్రమాలను తన ఖాతాలో వేసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   విష్ణువర్ధన్ రెడ్డి తీరుపై ఏపీ బీజేపీలోనూ పెద్ద చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఛీప్ ట్రిక్స్ తో పార్టీ పరువు పోతుందని కొందరు కమలం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. గాంధీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాలను.. తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు జరిపారని చెప్పుకోవడం ఏంటని విష్ణువర్ధన్ రెడ్డిపై కమలం ముఖ్య నేతలు ఫైరయ్యారని సమాచారం. 

చైనాలో జోరుగా పులుల పెంపకం, అమ్మకం

వన్యప్రాణుల వాణిజ్యానికి పాల్పడుతున్న చైనా   పులి ఎముకలతో వైన్ తయారుచేస్తన్న డ్రాగన్ కంట్రీ   కదిలే జంతువులు ఏవైనా సరే వారికి ఆహారంగా మారాల్సిందే.. పాములు, కప్పలే కాదు వన్యప్రాణులను కూడా తింటారు చైనీయులు. టైగర్ ఫామ్స్ ఏర్పాటుచేసి పులులను వాణిజ్యపరంగా పెంచుతున్నారు. అంతరించిపోతున్న పులులను రక్షించాలని అంతర్జాతీయంగా ఎన్నో సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను లెక్కచేయకుండా చైనా మాత్రం యధేచ్ఛగా పులులను పెంచుతుంది. చైనాలో అక్రమంగా పులుల పెంపకం కొనసాగుతుందని అనేక అంతర్జాతీయ వార్తా సంస్థల పరిశోధనలో వెల్లడైంది. పౌరుషానికి ప్రతికగా భావించే పులి శరీరభాగాలను ధరించడాన్ని గొప్పగా భావిస్తారు అక్కడి ప్రజలు. అంతేకాదు పులి ఎముకల నుంచి తయారుచేసిన వైన్ తాగడం వల్ల బలవంతులుగా అవుతారని విశ్వసిస్తారు. ఖరీదైనప్పటికీ టైగర్ వైన్ సేవించడానికి ఆసక్తి చూపిస్తారు. అందుకే చైనాలో పులి ఎముకల నుంచి తయారుచేసిన వైన్ కు భలే గిరాకీ ఉంది. చట్టాలను అతిక్రమించి మరీ తయారుచేస్తున్నారు. పులి గోరు నుంచి చర్మం, ఎముకలు, మాంసం అన్నీ వాణిజ్యంగా ఉపయోగిస్తారు. టైగర్ ఫామ్స్ లో పర్యాటకులకు పులుల మధ్యన తిరిగేందుకు, పులి కూనలను ఎత్తుకునేందుకు కూడా అనుమతిస్తారు.   డబ్ల్యుడబ్ల్యుఎఫ్, ఎన్విరాన్‌మెంటల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వంటి జంతు ప్రచారకులు టైగర్ ఫామ్స్ పై నిఘా ఏర్పాటుచేసి అనేక వాస్తవాలను వెల్లడించారు. వన్యప్రాణులను వాణిజ్యపరంగా పెంచడం నేరం. టైగర్ బోన్ వైన్ అమ్మకాన్ని చైనాలో 1993 లో నిషేధించారు. కాని ఇప్పటికీ చైనాలో ఈ వైన్ దొరుకుతుంది. అయితే చాలా తెలివిగా టైగర్ అన్న పేరు లేకుండానే దీనిని రహస్యంగా అమ్ముతున్నారు. ఇది టైగర్ బోన్ వైన్ అని రుజువు చేసేలా పులి గోరు, పంజాలను కూడా చూపిస్తారు. ఈ అమ్మకాలు చాలా రహస్యంగా స్థానికులకు మాత్రమే తెలిసేలా జరుగుతాయి. టైగర్ కు సంబంధించిన అన్నింటిని వాణిజ్యపరంగా మార్కెట్ లో ఉంచుతున్నారు.   ప్రపంచంలోనే పులి బలమైన జంతువు అని చైనా ప్రజలు నమ్ముతారు. కాబట్టి పులి శరీరభాగాలను ధరించడం, ఎముకల నుంచి ఉత్పత్తి చేసిన వైన్ తాగడం వల్ల తాము బలంగా తయారవుతామని వారి విశ్వాసం. ప్రాచీన ఔషధాల తయారీలోనూ పులి వైన్ ఆర్థరైటిస్ వంటి అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని నమ్ముతారు. తమ సంపదనకు చిహ్నంగా పులి శరీర భాగాలను బహుమతులుగా ఇచ్చిపుచ్చుకుంటారు.   భూమిపై అంతరించి పోతున్న అనేక జీవజాతుల్లో పెద్దపులి ఒకటి. ఇప్పటికే ఆసియా ఖండంలోని లావోస్, కంబోడియా, వియత్నాం వంటి దేశాల్లో దాదాపు కనుమరుగైపోయింది. ఇక మన దేశంలో పులుల సంఖ్య పెరుగుతున్నా వాటిని వేటాడి స్మగ్లింగ్ చేసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక ఆసియా ఖండంలో ఉన్న దాదాపు 8000వేల పులుల్లో సగానికన్నా ఎక్కువే చైనాలోనే ఉన్నాయి టైగర్ ఫామ్స్ లో బందీలుగా..   టైగర్ ఫామ్ అనేది మన దేశంలో పశువులను, మేకలను, గొర్రెలను, కోళ్లను పెంచినట్టే అక్కడ పులులను పెంచుతారు. పులులు చూసేందుకు, వాటితో సెల్ఫీలు తీసుకునేందుకు పర్యాటకులను అనుమతిస్తారు. వేగంగా పులులు పెరిగేలా, దృఢంగా అయ్యేలా ఆహారం ఇస్తారు. పులికూనలను తల్లి నుంచి వేరుచేసి పెంచుతారు. ఔషధాల తయారీలో వాడకం కోసం వాటిని చంపుతారు. చైనాలో పులుల అక్రమ పెంపకం, వాటి శరీరభాగాల అక్రమ రవాణాపై అనుమానంతో అధికారులు దాడి చేసిన ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన థాయిలాండ్ లోని టైగర్ టెంపుల్ వంటి జంతుప్రదర్శనశాల్లో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చారు.   చైనాలో టైగర్ ఎముకల నుంచి తయారుచేసిన వైన్ ఇష్టంగా తాగుతారు. ఇది బలాన్ని ఇస్తుందని వారు నమ్ముతారు. ఈ వైన్ ను అంతర్జాతీయ సంస్థలు నిషేధించడంతో చాలా తెలివిగా చైనా సెల్లర్స్  టైగర్ అనే పదాన్ని లేబుల్ నుండి తీసివేశారు. పులి ఎముకల పొడితో తయారుచేసిన మాత్రలు రుమాటిజానికి నివారణగా వాడతారు. అంతేకాదు పులి పురుషాంగం కామోద్దీపన కలిగిస్తుందని అక్కడి ప్రజల నమ్మకం. పులి భాగాలను స్థితి చిహ్నంగా కూడా ఉపయోగిస్తారు. పులి చర్మం ముక్కలు కలిగిన తాయెత్తులతో పులి రగ్గులు,  కంఠహారాలుగా మారి యజమాని సంపదకు,  ప్రతిష్టకు చిహ్నలుగా భావిస్తారు. పులి గోర్లు, దంతాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అంతేకాదు కొన్ని చోట్ల నాన్ వెజిటేరియన్ మెనులో పులి మాంసం కూడా ఉంటుంది.   చైనాలో దాదాపు 200 టైగర్ ఫామ్స్ లో దాదాపు 6,000 పులులు బందీగా ఉన్నాయి. ఆగ్నేయాసియాలోని ఉన్న పులుల సంఖ్య దాదాపు 8,000 కాగా అందులో అత్యధిక శాతం చైనాలోనే టైగర్ ఫామ్స్ లోనే ఉన్నాయి.   2007 లో CITES( Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora ) సమావేశంలో పులులను వ్యాపార అవసరాల కోసం వాణిజ్యపరంగా పెంచవద్దని తీర్మానం చేశారు. 171దేశాలు దీనిపై సంతకాలు చేశాయి. చైనా కూడా సంతకం చేసింది. అయితే 1981లోనే చైనా పులులను వాణిజ్యవస్తువులుగా వినియోగించని సంతకం చేసింది. అయినా నిబంధనలను ఖాతరు చేయలేదు. ఆ తర్వాత మరోసారి దేశీయం కూడా పులుల శరీరభాగాలను వ్యాపార వస్తువులుగా పరిగణించను అంటూ సంతకం చేసింది. అయినప్పటికీ చైనా మాటపై ఉండలేదు. వాణిజ్య అవసరాల కోసం టైగర్ ఫామ్స్ ఏర్పాటుచేశారు. ఆ తర్వాత 2007లో  CITES తీర్మానానికి అంగీకరించింది. అయితే ఏ నిబంధనలను కూడా చైనా పాటించలేదు. దాంతో తిరిగి 2016లోనూ చైనాలో పులుల పెంపకం అంతర్జాతీయంగా చర్చకు వచ్చింది. పులల సంరక్షణ కోసమే టైగర్ ఫామ్స్ ఉన్నయి తప్ప వాటిని హింసించడం లేదని చైనా మరోమారు దబాయించింది. అంతర్జాతీయ సంస్థల కన్నుగప్పి యదేఛ్చగా పులుల శరీరభాగాలను మార్కెటింగ్ చేస్తూ అంతర్జాతీయ విపణిలో డిమాండ్ పెంచింది. దాంతో చాలా దేశాల్లో పులుల వేట పెరిగింది.   చైనాలో దాదాపు 20 ఫామ్స్ లో ఆరువేలకు పైగా పులులు పెంచుతున్నారు. ముఖ్యంగా ముదాంజియాంగ్ , ఈశాన్య చైనాలో, హెలాంగ్ జియాంగ్ ప్రావిన్స్ లో టైగర్ ఫామ్స్ ఎక్కువగా ఉన్నాయి. పులులను వాణిజ్యపరంగా పెంచడం 1986లోనే చైనా మొదలుపెట్టింది. చాలా అంతర్జాతీయ సంస్థలు ఇందుకు అభ్యంతరం చెప్పగా దొంగచాటుగా పులుల పెంపకం కొనసాగించింది. 2010లో హర్బిన్ సైబీరియన్ పార్క్ లో 200 పులులు ఫ్రీజర్ లో బయటపడిన సంఘటనతో చైనా పులి జాతిపై విసిరిన పంజా ప్రపంచదేశాలకు తెలిసింది. 2008లో చైనాలోని ప్రధాన ఆరు నగరాల్లో జరిపిన సర్వేలో పులులను రక్షించాలన్న ఆలోచన కన్నా వాటి శరీరభాగాలను ధరించాలన్న ఆసక్తే చైనీయుల్లో ఎక్కువగా కనిపించింది.  దాంతో పులి గోరు నుంచి చర్మం వరకు ప్రతిదీ మార్కెట్ చేసేందుకు చైనా సిద్ధపడింది. ఆర్థికలాభాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చే వన్యప్రాణులను వాణిజ్యఅవసరాల కోసం పెంచుతుంది.  చట్టాలను అతిక్రమిస్తూ జోరుగా పులుల పెంపకం చేస్తోంది. ప్రపంచదేశాల కన్నుగప్పి తాను ఆర్థికంగా ఎదగాలనుకునే దుర్భుద్ధితో అంతరించిపోతున్న జీవులను సైతం ఆహారంగా తీసుకుంటుంది. ఈ డ్రాగన్ కంట్రి పులినే కాదు అవకాశం వస్తే ప్రపంచాన్నే కబళిస్తుంది అన్నది అందరం అంగీకరించే సత్యం.

రమేష్ ఆసుపత్రి సరే.. పద్మావతి ఆసుపత్రి సంగతేమిటి?

యాజమాన్య నిర్లక్ష్యంతో మహిళా ఉద్యోగి మృతి   మరి కాంట్రాక్టరుపై చర్య తీసుకుంటారా?   ఆ ఆసుపత్రికి సీఎం చైర్మన్, మంత్రి, టీటీడీ చైర్మన్లే సభ్యులు   మరి వారిపైనా రమేష్ మాదిరిగానే కేసులు పెడతారా?   న్యాయం అందరికీ ఒకటే. చట్టం అందరికీ సమానమే. వాటిని పక్షపాతం లేకుండా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే. మరి అలాంటి చట్టాలు-న్యాయాన్ని, అధికారులు పక్షపాతం లేకుండా అమలుచేస్తున్నారా? అన్నదే ఇప్పుడు ప్రశ్న. కొద్ది నెలల క్రితం విజయవాడలో రమేష్ ఆసుపత్రి, కోవిద్ సెంటర్ కోసం ఒక హోటల్‌ను లీజుకు తీసుకుంది. ఆ హోటల్‌లో అగ్ని ప్రమాదం సంభవించి, రోగులు మృతి చెందారు. దానిపై ఆగమేఘాలపై స్పందించిన సర్కారు, దానిపై విచారణ  కమిటీ వేసింది. రమేష్ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందని నివేదిక ఇచ్చింది. దానితో  రమేష్‌ను అరెస్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దానిపై హైకోర్టుకు వెళిన రమేష్ , స్టే తెచ్చుకున్నారు. ఇది పాత కథే.   తాజాగా తిరుపతిలోని స్విమ్స్‌కు చెందిన పద్మావతి కోవిడ్ సెంటర్‌లో ఓ ప్రమాదం సంభవించింది. ఆ ఘటనలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిని మృతి చెందగా, ఇద్దరు కరోనా పేషెంట్లు గాయపడ్డారు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఎవరిపై చర్యలు తీసుకుంటుంది? జరిగిన ఘటన ప్రభుత్వానికి చెందిన ఆసుపత్రిదే కాబట్టి.. అధికారులపై తీసుకుంటారా? లేక రమేష్ ఆసుపత్రి తరహాలోనే, దానికి చైర్మన్లు, డైరక్టర్లుగా ఉన్న పాలకులపై తీసుకుంటారా అన్నది ప్రశ్న.   తిరుపతి పద్మావతి కోవిడ్ సెంటర్‌లో, రెండో బ్లాక్‌లో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పైన పనులు జరుగుతున్నప్పుడు, కింద ఉండే వారి కోసం రక్షణ చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఆ మేరకు ఇనుప కంచెలాంటిది ఏర్పాటుచేయవలసి ఉంది. కానీ, అక్కడ అలాంటి జాగ్రత్తలు తీసుకున్న దాఖలాలే లేవు. ఒకవేళ అలాంటి చర్యలు తీసుకుంటే, ఓ గర్భిణి మృతి చెందేది కాదు. మరో ఇద్దరు గాయపడేవారు కాదు. స్విమ్స్ ఆసుపత్రి టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తోంది. దానికి స్వయంగా ముఖ్యమంత్రి చైర్మన్ కాగా, టీ టీడీ ైచె ర్మన్, ఆరోగ్యశాఖ మంత్రి, టీ టీడీ ఈవోలు డైరక్టర్లుగా వ్యవహరిస్తుంటారు. చనిపోయిన మహిళ మృతి అత్యంత విషాదకరం. రాధిక అనే కాంట్రాక్టు ఉద్యోగి 5 మాసాల గర్భిణి. ఇప్పటికే ఇద్దరు చిన్నారులు మృతి చెందటంతో, ఆమె మూడోసారి గర్భం దాల్చింది. భవన నిర్మాణంలో చూపిన నిర్లక్ష్యం వల్ల,  చివరకు ఇప్పుడు ఆమె మృతి చెందటం బాధాకరం.   టీడీపీ ప్రభుత్వ హయాంలోనే  సదరు బిల్డరుకు, భవన నిర్మాణ కాంట్రాక్టు లభించింది. కానీ ఒక సబ్ కాంట్రాక్టరుతో పనులు చేయిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా జరిగిన ఘటనకు కాంట్రాక్టరూ బాధ్యుడే. కానీ, ఆసుపత్రికి చైర్మన్ ముఖ్యమంత్రిగా ఉండటం, అందులో మంత్రి, టీటీడీ చైర్మన్ పాటు ఉన్నతాధికారులు కూడా,  సభ్యులు కూడా కొనసాగుతున్నారు. కాబట్టి.. బెజవాడలో రమేష్ ఆసుపత్రి,  లీజుకు తీసుకున్న హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో తీసుకున్న చర్యలే,  తిరుపతి ఘటనలోనూ తీసుకోవలసి ఉంటుంది. ప్రైవేటు ఆసుపత్రుల విషయంలోనే అంత కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం.. మరి తన అధీనంలో ఉన్న ఆసుపత్రిలోనే ఘటన జరిగితే అంతకంటే వేగంగా-కఠినంగా వ్యవహరించాలి కదా? మరి న్యాయం-చట్టం  అందరికీ సమానమే కదా?  -మార్తి సుబ్రహ్మణ్యం

సీఎం జగన్ పై అసంతృప్తి.. ఎమ్మెల్యే వంశీ పాలిటిక్స్ కు గుడ్ బై..!

గన్నవరం నియోజకవర్గంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే వంశీ రాజకీయాలపై వైరాగ్యం చూపుతున్నారు. టీడీపీ తరఫున గెలిచి వైసీపీకి అనుకూలంగా మారిన వంశీకి నియోజకవర్గంలో ఏర్పడిన పరిస్థితులు తీవ్ర నిరాశకు గురి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు అయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో అందరినీ కలుపుకుని వెళ్లేందుకు తాను ప్రయత్నిస్తున్నానని అన్నారు. అయితే కొందరు తనపై గొడవలు సృష్టించి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం పై వైసీపీ అధిష్ఠానం కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే వంశీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు తనపై లేనిపోని నిందలు మోపుతున్నారని వంశీ ఆరోపించారు. దీంతో రాజకీయాల నుంచి తప్పుకునే యోచనలో ఎమ్మెల్యే ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.   నియోజకవర్గంలోని వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకటరావు ఓ వైపు, దుట్టా రామచందర్ రావు మరో వైపు టీడీపీ నుండి వచ్చి చేరిన ఎమ్మెల్యే వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా వారు బహిరంగంగానే వంశీకి సవాళ్లు విసురుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే వంశీతో కలిసి పనిచేయబోనని తాను ఇప్పటికే సీఎం జగన్ కు చెప్పినట్లు యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. వంశీ తనను, తన అనుచరులను ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టారని ఆయన చెప్పారు. వైసీపీ కార్యకర్తలను వంశీ బెదిరిస్తున్నారని వెంకటరావు ఆరోపించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని తన ముఖ్య అనుచరులతో ఎమ్మెల్యే వంశీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.

దుబ్బాకలో టీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ అభ్య‌ర్థిగా చెరుకు శ్రీ‌నివాస్ రెడ్డి..!

దుబ్బాక ఉపఎన్నికలకు సిద్దమవుతున్న టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ త‌గ‌లింది. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీ‌నివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. దీంతో దుబ్బాక ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీ త‌రుపున శ్రీ‌నివాస్ రెడ్డి పోటీ చేయ‌టం దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం తండ్రి ముత్యంరెడ్డితో పాటు శ్రీ‌నివాస్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. అయితే నియోజకవర్గంలో త‌న తండ్రి చేసిన మంచి ప‌నుల గురించి గుర్తు చేస్తూ.. నిత్యం కార్య‌క‌ర్త‌ల‌కు, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్న త‌న‌కు టికెట్ కేటాయిస్తే గెలిచి వ‌స్తాన‌ని టీఆర్ఎస్ అధిష్టానాన్ని శ్రీ‌నివాస్ రెడ్డి కోరగా.. టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ నిరాకరించినట్లు తెలుస్తోంది.   దీంతో శ్రీ‌నివాస్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో రహస్య మంతనాలు జరిపినట్లుగా సమాచారం. దుబ్బాక అభ్యర్థిగా తన పేరును ప్రకటిస్తే పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు చెరుకు శ్రీనివాస్ రెడ్డి దామోదరతో చెప్పినట్లు తెలుస్తోంది. నిన్న అర్ధ‌రాత్రి వ‌ర‌కు మాజీ ఎమ్మెల్యే న‌ర్సారెడ్డి కాంగ్రెస్ తరుఫున దుబ్బాక నుండి పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికీ, స్థానికేత‌రుడు అయినందున ఆయ‌నపై కాంగ్రెస్ పునరాలోచ‌న‌లో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీ‌నివాస్ రెడ్డి చేరిక‌, టికెట్ పై ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా కాంగ్రెస్ నేత‌ల‌తో పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. ఈ విషయం పై త్వరలోనే కాంగ్రెస్ పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

వాడికి కొవ్వెక్కింది.. కొవ్వు తీసే టైం వచ్చింది.. టీడీపీ నేతలపై రెచ్చిపోయిన మరో మంత్రి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నాయకులు నరసన్నపేట పోలీస్ స్టేషన్‌లో కృష్ణదాస్‌పై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి అప్పలరాజు మీడియా సమావేశం నిర్వహిస్తూ టీడీపీ నేతల పై రెచ్చిపోయారు. టీడీపీ నేత కూన రవికుమార్ కు కొవ్వెక్కిందని ఆయన అన్నారు. వాడెవడో బుద్దా వెంకన్న ఏదో వాగుతున్నాడని అన్నారు. వీరంతా బరి తెగించి మాట్లాడుతున్నారని.. కొవ్వు తీసే సమయం ఆసన్నమైందని మంత్రి వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో అమరావతి రైతులపై అయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విమానంలో ఢిల్లీ వెళ్లినవారు అమరావతి రైతులు కాదని.. వారు ముమ్మాటికీ పెయిడ్ అర్టిస్టులేనని ఆయన అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు చేయిస్తున్నారని ఆయన అన్నారు.   విశాఖ రాజధాని కోసం తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతూ టీడీపీ నేతలు తనపై పోటీ చేసి గెలువగలరా అని ఆయన ప్రశ్నించారు. "పలాస నియోజక వర్గం నుంచి నేను రాజీనామా చేస్తా.. టీడీపీ తరఫున అచ్చెన్నాయుడో, ఎంపీ రామ్మోహన్ నాయుడో లేక నారా లోకేష్ ఎవరైనా నాపై పోటీ చేసి గెలవాలని’’ మంత్రి సవాల్ విసిరారు. మంచికి బ్రాండ్ అంబాసిడర్ అయిన ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలను వక్రీకరించి మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. కృష్ణదాస్ తన నియోజకవర్గంలో తన మనుషులతో మాట్లాడిన విషయాలను ఎల్లో మీడియా వక్రీకరించి బూతులు మాట్లాడినట్లు చిత్రీకరించిందని ఆయన విమర్శించారు.   ఎవరైతే బాగా బూతులు మాట్లాడగలరో, వీధి రౌడీల్లాగ వ్యవహరించగలరో వారినే చంద్రబాబు గుర్తించి మరీ పార్టీలో అధ్యక్ష పదవులు కట్టబెడుతున్నారంటే ఆ పార్టీ తీరు అందరికీ అర్థమవుతోందని మంత్రి అప్పలరాజు అన్నారు. కరోనా కాలంలో ఎక్కడా కనిపించని ఎంపీ రామ్మోహన్ నాయుడు పోలీస్ స్టేషన్ వద్దకు దౌర్జన్యం చేయడానికి రావడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పోలీసు స్టేషన్ వద్ద క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం రౌడీయిజానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

‘గ్రేటర్’లో పార్టీని బాబు గాలికొదిలేశారా?

ఇప్పటివరకూ ఎమ్మెల్సీ ఎన్నికపై సమీక్షించని బాబు   రమణపై తమ్ముళ్ల తిరుగుబాటు   బాబు ఇంటివద్దనే తమ్ముళ్ల ధర్నా            రాజకీయాల్లో హత్యలుండవు. అన్నీ ఆత్మహత్యలేనన్నది, తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మౌనం స్పష్టం చేస్తోంది. ఒకవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఇంకోవైపు దెబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక,  మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముంచుకొస్తున్నా... ఇప్పటిదాకా చంద్రబాబు సమీక్షించని వైనంపై, తెలంగాణ తమ్ముళ్లలో ఆగ్రహం క ట్టలు తెంచుకుంటోంది. కరోనా సీజన్ మొదలయినప్పటి నుంచీ, హైదరాబాద్‌లోనే ఉంటున్న బాబు.. ఇప్పటివరకూ ఈ మూడు ఎన్నికలపై కనీస సమీక్ష నిర్వహించకపోవడంపై, పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అటు తెలంగాణ పార్టీ అధ్యక్షుడు రమణ నిర్లిప్తత కూడా తోడవడంతో, ఎటు పోవాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో తెలంగాణ తమ్ముళ్లు కనిపిస్తున్నారు. ప్రధానంగా..కేసుల కారణంతో, కేసీఆర్‌తో బాబు యుద్ధం చేసే పరిస్థితి లేదన్న మానసిక భావన టీడీపీ నేతల్లో కనిపిస్తోంది.   తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా మంచుకువస్తున్నాయి. తొలుత గ్య్రాడ్యుయేట్ ఎన్నికలు, ఆ తర్వాత గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలు రానున్నాయి. అయితే, వీటిపై  దృష్టి సారించి స్థానిక నేతలతో సమీక్షించాల్సిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ చేతులెత్తేశారు. పోనీ.. కరోనా సీజన్ నుంచీ హైదరాబాద్‌లోనే ఉన్న, అధినేత చంద్రబాబు నాయడు ఏమైనా వీటిపై పార్టీ నేతలతో సమీక్షించారా, అంటే అదీ లేదు.   ఇప్పటికే అన్ని పార్టీలూ ఎన్నికల రంగంలోకి దిగాయి. చిన్నా చితకా పార్టీలు కూడా వ్యూహ రచనలో మునిగిపోయాయి. కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి సారించాయి. అధికార టీఆర్‌ఎస్, హైదరాబాద్‌లో డివిజన్ల వారీగా నేతలతో సమీక్షలు నిర్వహిస్తోంది. కానీ టీడీపీ మాత్రం ఇప్పటిదాకా గ్రేటర్ సహా, ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించలేదు. దానితో తమ పార్టీ అసలు బరిలో ఉందా? లేదా? అన్న సందిగ్ధం తమ్ముళ్లను వేధిస్తోంది.   నిజానికి గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో 25 డివిజన్లలో సెటిలర్ల ప్రభావం తీవ్రంగా ఉంది. మరో 19 డివిజన్లలో విజయంలో వారిదే కీలక పాత్ర. గత ఎన్నికల్లో టీడీపీకి ఒక్క స్థానమే వచ్చినా కాంగ్రెస్-బీజేపీని వెనక్కి నెట్టేసి అనేక డివిజన్లలో టీడీపీనే రెండో స్థానం సాధించిన విషయాన్ని తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు.  ఆ ప్రకారంగా గత గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ 4,39,047 ఓట్లతో 13.11 శాతం ఓట్లు సాధించింది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీనే రెండో స్థానంలో ఉంది. అయినా ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునే నాయకత్వం లేకుండా పోయిందన్నది తమ్ముళ్ల ఆవేదన.   స్వయంగా చంద్రబాబు నాయుడే, నగరంలో  కాడి కిందపడేశారన్న భావన వారిలో ఉంది. ఒకవేళ టీడీపీకి ఓటేసి గెలిపిస్తే, గెలిచిన కార్పొరేటర్లు తిరిగి టీఆర్‌ఎస్‌లో చేరరన్న గ్యారంటీ లేదన్న భావన జనంలో ఉందంటున్నారు. అందుకే సెటిలర్లు ఉన్న డివిజన్లలో టీఆర్‌ఎస్‌ను గెలిపించారని విశ్లేషిస్తున్నారు.  అలాంటి అభిప్రాయం తొలగించేందుకు,  ఏ స్థాయిలోనూ ప్రయత్నం జరగడం లేదని చెబుతున్నారు.   నగరంలో పార్టీకి కొన్ని ప్రాంతాల్లో అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ, చంద్రబాబు గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల, పార్టీ మూల్యం చెల్లించుకోవలసి వస్తోందంటున్నారు. నిజానికి టీడీపీ నుంచి టీఆర్‌ఎస్-బీజేపీలో చేరిన నేతలకు, అక్కడ సరైన గౌరవం-గుర్తింపు లేదన్న భావన చాలాకాలం నుంచీ ఉంది. కేసీఆర్‌కు భయపడి.. బాబు ఆంధ్రాకు వెళ్లినందున, ఇక పార్టీలో ఉన్నా ఫలితం లేదన్న ముందుచూపుతోనే, వారంతా ఇతర పార్టీల్లో చేరుతున్నారు. అటు సెటిలర్లు కూడా అనివార్య పరిస్థితిలో టీఆర్‌ఎస్‌కు జై కొడుతున్నారని విశ్లేషిస్తున్నారు. ఆ భావనను తొలగించేందుకు, పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు చేసిన ప్రయత్నాలేవీ లేవంటున్నారు. అందుకు తగినట్లుగానే రమణ పనితీరు ఉండటం, ఆయనను మార్చాలని యావత్ పార్టీ యంత్రాంగం సంతకాలు చేసినా, బాబు స్పందించకపోవడం చూస్తే.. హైదరాబాద్ సహా, తెలంగాణలో చంద్రబాబు పార్టీని గాలికొదిలేశారన్న అభిప్రాయం కార్యకర్తల్లో స్థిరపడిపోయింది.   చివరకు దుబ్బాక ఉప ఎన్నికపైనా, బాబు ఇప్పటివరకూ దృష్టి సారించని వైనాన్ని పార్టీ నే తలు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్-బీజేపీలు దాదాపు అభ్యర్ధుల పేర్లు ప్రకటించేశాయి. కానీ త మ పార్టీ మాత్రం ఇప్పటి దాకా దానిపై దృష్టి సారించలేదంటున్నారు. తాజాగా.. అధ్యక్షుడు రమణ బీజేపీతో కుమ్మక్కయారంటూ, బాబు నివాసం వద్ద తమ్ముళ్లు ధర్నా చేయడం కలకలం సృష్టించింది. ఖమ్మంలో ఎమ్మెల్సీ పోటీ విషయంలో రమణ, బీజేపీతో కుమ్మక్కయ్యారని తమ్ముళ్లు ఆరోపించారు. తాము సూచించిన నేతకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఓ కార్పొరేటర్ అభ్యర్ధి.. బాబు నివాసం వద్ద, పార్టీ వైఖరిని తప్పుపడుతూ చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.   దుబ్బాకలో పార్టీ అధ్యక్షుడు రమణను పోటీ చేయించి, ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నన్నూరు నర్శిరెడ్డిని బరిలోకి దించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. నర్శిరెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బరిలోకి దించితే, ఉస్మానియా యూనివర్శిటీ నేపథ్యంతోపాటు, రెడ్డి సామాజికవర్గం కూడా కలసి వస్తుందని విశ్లేషిస్తున్నారు. అయితే, ఇప్పటి పరిస్థితిలో పార్టీ నాయకత్వం నయాపైసా ఇచ్చే పరిస్ధితి లేదంటున్నారు.  హైదరాబాద్-రంగారెడ్డి-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎన్నికలో, ఇతర పార్టీల నుంచి రెడ్లు ఎవరూ పోటీ చేయనందున, ఆ సమీకరణ టీడీపీకి పనికివస్తుందంటున్నారు. నర్శిరెడ్డిది ఉస్మానియా యూనివర్శిటీ నేపథ్యమే అయినందున, అది ఎన్నికల్లో అక్కరకొస్తుందని విశ్లేషిస్తున్నారు. కానీ స్థానికంగా ఎలాంటి పట్టు లేని రమణ, ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తుండంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.   టీఆర్‌ఎస్‌పై చంద్రబాబు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుని, నగరంపై దృష్టి సారిస్తే ఇప్పటికీ సానుకూల వాతావరణం ఉంటుందని చెబుతున్నారు. ఇటీవల తీన్మార్ మల్లన్న, బ్యాలెట్‌పై నిర్వహించిన సర్వేలో తెరాసకు 50 శాతంపైగా రాగా, టీడీపీకి 25 శాతం వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి.. తమ అధినేత చంద్రబాబు నాయుడే, తెలంగాణలో పార్టీ కాడి కింద పడేశారన్న వాస్తవం అర్ధమవుతోందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. 

కరోనాకు చికిత్స మధ్యలోనే బయటకు వచ్చిన ట్రంప్... వెల్లువెత్తుతున్న విమర్శలు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనా సోకిన వ్యక్తి చికిత్స పూర్తైన తరువాత కూడా కొద్ది రోజులు ఐసోలేషన్ లో ఉండాలని నిపుణులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కరోనా వైరస్ సోకి, ప్రస్తుతం వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చికిత్స మధ్యలోనే.. కొవిడ్-19 ప్రొటోకాల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ బయటకు వచ్చి తీవ్ర విమర్శల పాలయ్యారు. బులెట్ ప్రూఫ్ కారులో మాస్క్ ధరించి రోడ్డుపై తిరిగేస్తూ.. తన మద్దతుదారులకు అభివాదం చేస్తూ కనిపించారు.   కాసేపు అలా బయట తిరిగిన ఆయన తిరిగి మళ్ళీ ఆసుపత్రిలోకి వెళ్లిపోయారు. అయితే కరోనా నెగటివ్ రాకుండానే ఆయన ఇలాంటి చర్యలకు పాల్పడడాన్ని వైద్య నిపుణులు తప్పు పడుతున్నారు. శరీరంలో ఉన్న కరోనా వైరస్ అనుక్షణం బయటకు వ్యాపిస్తూనే ఉంటుందని, ఈ కారణంతోనే రోగులను ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారని.. అయితే చికిత్స సమయంలో సాక్షాత్తు అధ్యక్షుడు ఇలా చేయడం సరికాదని అంటున్నారు.   ఇది ఇలా ఉండగా బయటకు రావడానికి ముందు, ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో మరో వీడియోను పోస్ట్ చేస్తూ.... "కొవిడ్ గురించి నేను చాలా తెలుసుకున్నాను. నిజంగా స్కూలుకు వెళ్లినట్టుగా ఉంది" అని వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్ సోషల్ మీడియా స్టంట్ ను ప్రారంభించారని ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ట్రంప్ కాన్వాయ్ లో ఉన్న ప్రతి ఒక్కరినీ 14 రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్ కు పంపనున్నామని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ చీఫ్ జేమ్స్ ఫిలిప్స్ తెలిపారు.   ట్రంప్ తాజా నిర్వాకం కారణంగా కాన్వాయ్, సీక్రెట్ సర్వీస్ ఏజంట్లు, సెక్యూరిటీలోని ఎవరైనా అనారోగ్యానికి గురై చనిపోతే దానికి ఎవరు బాధ్యులని.. అంతేకాకుండా తన రాజకీయ అవసరాలకు ఉద్యోగులను బలిపెట్టడం ఏంటని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

'కస్తూర్బా' వద్దన్న 'నయా గాంధీ' జగన్!

కాలేజీకి తండ్రి పేరు పెట్టుకున్న భీమవరం వైసీపీ ఎమ్మెల్యే   దాతల భూమిపై రాజకీయ దాష్టీకం   గాంధీ జయంతి రోజునే కస్తూర్బా గాంధీ పేరు తొలగింపు   ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు ఉత్తి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాత్రమే కాదు. 'మహాత్మాగాంధీ జగన్మోహన్‌రెడ్డి' కూడా! అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించిన  మహాత్ముడు, మళ్లీ పులివెందులలో జగనన్న రూపంలో జన్మించారు. మంచిదే. ప్రపంచానికి  సహనం, శాంతి సిద్ధాంతాలను చాటి చెప్పిన అంతటి మహాత్ముడు, మన జగనన్న రూపంలో ఈ యుగంలో పుట్టడం, తెలుగువారి పూర్వజన్మ సుకృతమే. ఒక చెంప మీద కొడితే, మరో చెంప చూపమన్న ‘ప్రపంచ శాంతికపోతం’ తెలుగు గడ్డపై మళ్లీ జన్మించడం, ప్రపంచంలోని తెలుగువారందరికీ గర్వకారణమే. జగనన్నకు, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి గారిచ్చిన మహాత్ముడి బిరుదులో ‘అతి’శయోక్తి ఉందా.. లేదా అన్నది పక్కకు పెడితే..  ‘అసలు మహాత్ముడి’తో కలసి జీవనం సాగించిన కస్తూర్బా గాంధీ పేరు తొలగించి, అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే.. తన తండ్రి పేరు పెట్టుకోవడమే జాతిపితను,  క్షోభకు గురిచేసే వ్యవహారం. ఈ విషయాన్ని ‘తెలుగు జాతిపిత’ అయిన ‘మహాత్మా జగన్మోహన్‌రెడ్డి’ ఎందుకో విస్మరించారు.   పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో.. కస్తూర్బా గాంధీ ప్రభుత్వ జూనియర్ కాలేజీని,  చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు అనే వదాన్యుడు ఏర్పాటుచేశారు. గోదావరి జిల్లాలకు ‘మూర్తిరాజు’గా పరిచితులయిన ఆ దానశీలి, తన 3 వేల ఎకరాల భూములను విద్యా సంస్థలకు దానం ఇచ్చారు. ఇప్పుడు గుడిలో ఒక ఫ్యాను ఇచ్చి, మూడు రెక్కలపై తమ కుటుంబ సభ్యుల పేర్లు రాసుకుంటున్నారు. కానీ, 3 వేల ఎకరాల భూములిచ్చిన మూర్తిరాజు గారు, ఏ ఒక్క సంస్థకూ తన పేరు పెట్టుకోకపోవడమే గొప్పతనం.   ఈ కాలేజీని దిరుసుమర్రి గ్రామానికి చెందిన  ఓ రైతు, స్థలం విరాళంగా ఇచ్చారు. అయితే ఆయన వారసులు, తమ స్థలం తమకు ఇచ్చేయాలని కోర్టుకెళ్లి, విజయం సాధించారు. అప్పుడు ప్రస్తుత వైసీపీ ఎమ్మల్యే గ్రంధి శ్రీనివాస్ స్పందించి, బైపాస్ రోడ్డు వద్ద ఉన్న తన 30 సెంట్ల భూమిని, కాలేజీ భవన నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. అందుకు ప్రతిఫలంగా, ఆయన తండ్రి గ్రంధి వెంకటేశ్వరరావు పేరు కాలేజీ భవనానికి పెట్టారు. అప్పటివరకూ అది కస్తూర్బాగాంధీ కాలేజీగానే కొనసాగుతోంది. తాజాగా అధికార వైసీపీ ఎమ్మెల్యే అయిన గ్రంధి శ్రీనివాస్, ఏకంగా కాలేజీకి తన తండ్రి గ్రంధి వెంకటేశ్వరరావు పేరుతో, ఉత్తర్వునే తెచ్చుకున్నారు. అది కూడా గాంధీ జయంతి రోజున!   మహాత్ముడు మళ్లీ పుట్టాడని వైసీపీ అధికార పత్రిక ఓ వైపు, తన వ్యాసాల్లో ‘నయా గాంధీ జగనన్న’ను ఆకాశానికెత్తేస్తోంది. కానీ, అదే ‘నయా గాంధీ’ పాలనలో.. ‘ఒరిజినల్ గాంధీ’ సతీమణి పేరుతో ఉన్న కాలేజీ పేరును మార్చడం, మరి మన ‘నయాగాంధీ జగనన్న’కు తలవంపులే కదా? అసలు గాంధీని అవమానించినట్లే కదా? దీనిపై యుశ్రారైకా పార్టీ రెబెల్ ఎంపీ, రఘురామకృష్ణంరాజు కూడా స్పందించారు. ఆ కాలేజీకి తిరిగి కస్తూర్బాగాంధీ పేరు పెట్టాలని, కలియుగ మహాత్మా గాంధీ అయిన జగన్‌ను కోరారు. మహాత్ముడి పాలనలో ఇలాంటివి జరగడం మంచిది కాదన్నారు. మూర్తిరాజు గారు వేల ఎకరాలు విద్యా సంస్థలకు దానం చేసినా, ఎక్కడా తన పేరు పెట్టుకోలేదని గుర్తు చేశారు.  -మార్తి సుబ్రహ్మణ్యం

ప్రశ్నించడమే పాపమా! అరాచకాలకు అంతే లేదా? ఆటవిక రాజ్యం!

అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం చెడ మడ చేలరేగినా చెప్పెదెవడ్రా నా ఇష్టం..   ఇది కౌరవుడి సినిమాలోని సాంగ్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ఈ పాట అప్పట్లో హిట్టైంది. ఈ పాటలోని అంతా నా ఇష్టంలా ఇప్పుడు ఏపీలో కొందరు వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికార మదంతో అంతా తమ ఇష్టం అన్నట్లుగా అరాచకాలకు పాల్పడుతున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా, కోర్టుల నుంచి చివాట్లు తగిలినా వైసీపీ నేతలు బరి తెగింపు ఆపడం లేదు. ప్రభుత్వ  వైఫల్యాలను ప్రశ్నించడమే ఏపీలో పాపంగా మారిపోయింది. విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు. దాడులకు పాల్పడుతూ భయాందోళనలు స్పష్టిస్తున్నారు. ఎవరూ మాట్లాడినా ఇదే పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, అరాచరాలకు అంతే లేకుండా పోతోంది.    తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. దుండగులతో కొట్టిస్టున్నారు. కొత్త కొత్త రూల్స్ తెస్తూ .. అక్రమ కట్టాలంటూ ఇండ్లను కూల్చేస్తున్నారు. కార్లను ధ్వంసం చేస్తున్నారు. ఇలా ఏదో ఒక రకంగా టీడీపీ ముఖ్య నేతలను వరుసగా టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. చివరకు జడ్జీల కుటుంబ సభ్యులను వదలడం లేదు. బరి తెగించిన దుండగులు.. హై సెక్యూరిటీ ఉండే న్యాయమూర్తుల ఇండ్ల దగ్గర కూడా దాడులకు పాల్పడుతున్నారు. కులాల పేరుతో కుంపట్లు పెడుతున్నారు. మత విద్వేశాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రజల్లో భయాందోళన పుట్టిస్తూ.. ఎవరూ తమకు ప్రశ్నించవద్దనే దోరణితో ఏపీని రావణకాష్టంలా మారుస్తున్నారు.       విజయవాడలో హైకోర్టు జడ్జీ ఇంటి పక్కనే ఉండే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ కారు అద్దాలను దుండగులు పగుల గొట్టారు. ఇంటి బయట పెట్టిన కారు ముందు, వెనుక అద్దాలను రాళ్లతో కొట్టి ధ్వంసం చేశారు.  హైకోర్టు జడ్జీ ఇల్లు ఉండటంతో అక్కడ పోలీస్ పికెట్ కూడా ఉంది. అయినా దౌర్జన్యకాండకు దిగారు దుండగులు. జడ్జీ ఇంటి పక్కనే ఉన్న పట్టాబి కారును ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది.  ఎక్కడో ఉన్న సర్వే రాళ్లు తీసుకువచ్చి  కారు పగలగొట్టారు దుండగులు. ఈ ఘటనతో ఏపీలో ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయో ఊహించవచ్చు. జడ్జీ ఇంటి దగ్గరే భద్రత లేకపోతే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయోనన్న ఆందోళన జనాల్లో వ్యక్తమవుతోంది.    పట్టాభిరామ్ కారు ధ్వంసం వెనుక అధికార పార్టీ మంత్రి, ఎమ్మెల్యే హస్తం వుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పట్టాభిపై దాడి చేయాలని చూశారని... అది కుదరక కారు అద్దాల ధ్వంసంతో సరిపెట్టుకున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజా వేదికతో మొదలైన ద్వంసాలు..  సబ్బం హరి ఇల్లు, పట్టాభి  కారు అద్దాలు ధ్వంసం వరకు వచ్చాయన్నారు టీడీపీ నేతలు. దాడులు, దౌర్జన్యాలు తెలుగు వారి సంస్కారం కాదన్న టీడీపీ నేతలు.. వైసీపీ తీరుతో ఏపీ ప్రజలు తల దించుకునే పరిస్థితులు వచ్చాయన్నారు. వైసీపీ అవినీతిని బయట పెడుతున్నందుకే తన కారుని ధ్వసం చేశారని పట్టాభి ఆరోపించారు.  కారు ధ్వసం చేస్తే  భయపడేంత పిరికిపందను కాదన్నారు పట్టాభి.    విశాఖ సీతమ్మధారలోని టీడీపీనేత, మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి ప్రహరీ, మరుగుదొడ్డిని జీవీఎంసీ అధికారులు కూల్చి వేయడం దుమారం రేపుతోంది. జేసీబీలు, వందలాదిమంది పోలీసులతో  తెల్లవారుజాము 3.30 గంటలకు అధికారులు తరలిరావడం చూస్తే అక్కడ యుద్ధరంగమే కనిపించింది.  తనకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతారని జేసీబీకి అడ్డంగా సబ్బంహరి నిలబడినా అధికారులు వినలేదు. తన అభ్యంతరాలను, నిరసనలను సబ్బం వ్యక్తం చేస్తుండగానే.. అక్రమమంటూ కొన్ని నిర్మాణాలను కూల్చేశారు. హరి ఇంటి భాగంలోనే ఫెన్సింగ్‌ నాటి, జీవీఎంసీ బోర్డు ఏర్పాటుచేశారు. తెల్లవారుజామున దొంగల్లా సబ్బం హరి ఇంటిని వందలాది మంది జీవీఎంసీ అధికారులు, సిబ్బంది, పోలీసులు చుట్టుముట్టడం విశాఖ వాసులను విస్మయపరిచింది.   జగన్‌ ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తున్న వారిలో సబ్బంహరి ఒకరు. అందుకే కక్ష సాధింపులో భాగంగానే ఆయన ఇంటిని కూల్చివేశారనే ఆరోపణలు వస్తున్నాయి.  రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపునకు వైసీపీ నేతలు జీవీఎంసీని పావుగా వాడుకుంటుందని తెలుస్తోంది. విశాఖలో  కుప్పలుతెప్పలుగా వున్న అక్రమనిర్మాణాలను వదిలేసి.. కేవలం టీడీపీ  నేతలకు చెందిన ఆస్తులనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. నగరంలో అక్రమ నిర్మాణాలపై కొన్నేళ్ల క్రితం హైకోర్టు కూడా స్పందించింది. అన్నింటిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినా సబ్బం హరినే టార్గెట్ చేశారు. రెండు దశాబ్దాల కిందట నిర్మించుకున్న ఇంట్లో కొంత పార్కు స్థలం వుందనే విషయం జీవీఎంసీ అధికారులకు ఇప్పుడు గుర్తుకురావడం, ఆగమేఘాల మీద అందులోనూ అర్ధరాత్రి దాటిన తర్వాత  కూల్చివేతకు దిగడంతీవ్ర చర్చనీయాం శమైంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం  జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహారశైలిని ఎప్పటికప్పుడు ఎండగడుతున్న సబ్బం హరి గొంతు నొక్కేయాలన్న కుట్రతోనే ఇదంతా చేశారని చెబుతున్నారు.    జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కొద్దిరోజుల కిందట అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణను టార్గెట్ చేశారు. పెందుర్తిలో ఇరవై ఏళ్ల కిందట ఆయన నిర్మించుకున్న ఇంటి ప్రహరీ ప్రభుత్వ స్థలంలో వుందంటూ తొలగించాలని చూశారు. గోవిందు ఇంచి ప్రహరీ తొలగించేందుకు రాత్రిపూట అక్కడ జేసీబీలను కూడా సిద్ధం చేశారు. పీలా కుటుంబ సభ్యుల నుంచి నిరసన వ్యక్తంకావడంతో జీవీఎంసీ అధికారులు వెనక్కి తగ్గారు. అలాగే పీలా గోవిందు సీతంపేట మెయిన్‌రోడ్డులో నిర్మిస్తున్న భవనం అక్రమం అంటూ ఏడాది కిందట అర్ధరాత్రివేళ యంత్రాలతో కూల్చివేశారు. కేవలం టీడీపీ నేతలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని జీవీఎంసీ చర్యలకు దిగడం ఆశ్చర్యకరంగా వుందనే అభిప్రాయం నగరవాసుల్లో వ్యక్తమవుతోంది.                  కొన్ని రోజుల క్రితం చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన దళిత జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రపై కొందరు దుండగులు దాడిచేశారు. ఈ ఘటనలో రామచంద్ర తీవ్రంగా గాయపడ్డారు.  బి.కొత్తకోట బస్టాండులో  రామచంద్ర పండ్లు కొనుగోలు చేస్తుండగా కర్ణాటక రిజిస్ర్టేషన్‌ కలిగిన కారులో వచ్చిన వారు ఆయనపై  దాడిచేశారు. రక్తం కారేలా తనపై ముష్ఠిఘాతాలు కురిపించారని రామచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులకు, తమ కుటుంబానికి మధ్య జరుగుతున్న భూవివాదాలే ఈ దాడికి కారణమని జడ్జి రామకృష్ణ ఆరోపించారు. స్థానిక వైసీపీ నాయకులు తన తమ్ముడిపై హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు. అయితే మదనపల్లె డీఎస్పీ  మాత్రం..  దాడి పథకం ప్రకారం జరగలేదని, రోడ్డుపై అనుకోకుండా జరిగిన ఘర్షణేనని, ఈ దాడికి, రాజకీయాలకు సంబంధం లేదని తేల్చేశారు. రామచంద్రపై జరిగిన దాడి ఘటన, పోలీసుల తీరుపైనా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. జడ్జీ సోదరుడికే న్యాయం జరగపోతే... సామాన్యుల పరిస్థితి ఏంటన్న భయాందోళనలు జనాల నుంచి వస్తున్నాయి.    ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామో.. ఆటవిక రాజ్యాంలో ఉన్నామో తెలియడం లేదని సామాన్య ప్రజలు ప్రశ్నించుకునే పరిస్థితి నెలకొంది. వైసీపీ నేతల అరాచకాలతో ఆంధ్రప్రదేశ్ పరువు పోతుందన చర్చ జరుగుతోంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని.. అలా ప్రశ్నించిన వారిపై దాడి చేయడం దుర్మార్గమనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వస్తోంది. ఈ అరాచకాలకు చెక్ పెట్టాలని, లేదంటే బీహార్ లా  ఏపీ మారిపోయే పరిస్థితి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

కేసీఆర్ నై.. కేటీఆర్ సై! అందుకే పెద్దాయన వద్దంటున్నారా? 

పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో పోటీపై అధికార టీఆర్ఎస్ లో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు కనిపిస్తోంది. గత శాసన మండలి ఎన్నికల ఫలితాలు, ఉద్యోగుల వైఖరి, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ బరిలో ఉండకపోవడమే బెటరని కొందరు నేతలు చెబుతుండగా.. అధికార పార్టీగా ఏ ఎన్నికల్లోనైనా పోటీ చేయాల్సిందేనని మరికొందరు నేతలు చెబుతున్నారట. మండలి ఎన్నికల్లో పోటీపై సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆలోచనలు వేరువేరుగా ఉన్నాయని చెబుతున్నారు.          త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై  టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సర్వే చేయింటారట. ఎన్నికలు జరగనున్న ఆరు జిల్లాల్లో జరిగిన సర్వేలో ప్రభుత్వానికి షాకింగ్ ఫలితాలు వచ్చాయంటున్నారు. పట్టభద్రులు, ఉద్యోగులు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం తేలిందట.  సర్కార్ ఇంటిలిజెన్స్ రిపోర్టు కూడా అలానే ఉందట. అధికార టీఆర్ఎస్ పై నిరుద్యోగులు. ఉద్యోగుల స్టాండ్ ఎలా ఉంటుందో కేసీఆర్ కూడా ఊహించగలరు. క్షేత్రస్థాయిలోని అన్ని పరిస్థితులు పరిశీలించి,  పార్టీకి సానుకూలంగా లేవని నిర్ధారించుకోవడం వల్లే మండలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను పెట్టడంపై ఆయన విముఖంగా ఉన్నారని కొందరు గులాబీ నేతలు చెబుతున్నారు.    దేశంలో జమిలి ఎన్నికలు రావచ్చనే అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. అధికార పార్టీగా ఉండి కూడా మండలి ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వస్తే ఇబ్బందులు వస్తాయని కేసీఆర్ భావిస్తున్నారట. రెండేండ్లలోనే జమిలి ఎన్నికలు వస్తే.. మండలి ఎన్నికల ప్రభావం వాటిపై పడుతుందని పార్టీ నేతలతో కేసీఆర్ చెప్పినట్లు చెబుతున్నారు. గతంలో జరిగిన మండలి ఎన్నికల్లోనూ పార్టీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయని ఆయన గుర్తు చేస్తున్నారట. అందుకే పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను పెట్టకుండా.. తటస్థులు, మేథావులకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే హైద్రాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కు సపోర్ట్ చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించినట్లు ప్రచారం జరిగిందని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ అభిప్రాయంతో మంత్రి కేటీఆర్ విభేదించారని, అధికార పార్టీగా తామే గెలుస్తామని ఆయన ధీమాగా ఉన్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కేటీఆర్ ఒత్తిడి వల్లే మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయాలని నిర్ణయించిందని చెబుతున్నారు.    దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, మండలి ఎన్నికలు,  గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలను విపక్షాలన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా తీసుకుంటున్నాయి. అందుకే విజయం కోసం అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ సమయంలో పట్టభద్రుల ఎన్నికల్లో అధికార పార్టీగా వ్యతిరేక ఫలితాలు వస్తే  తమకు ఇబ్బందేనని టీఆర్ఎస్ నేతలు ఓపెన్ గానే చెబుతున్నారు. పోటీపై పెద్దాయన క్లారిటీగానే ఉన్నా.. కేటీఆర్ అందుకు అంగీకరించడం లేదని చెబుతున్నారు. పట్టభద్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని, తాము ప్రచారం కూడా చేయలేకపోతున్నామని కొందరు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. పోటి పెట్టకుండా కేసీఆర్ ఆలోచన ప్రకారం తటస్థులు, మేథావులకు మద్దతు ఇవ్వడమే కరెక్ట్ అని కొందరు టీఆర్ఎస్ నేతలు అంతర్గత సమావేశాల్లో మాట్లాడుకుంటున్నట్లు తెలంగాణ భవన్ లో చర్చ జరుగుతోంది.

అధికారుల సంఘానికి ఆత్మగౌరవం లేదా?

ఐఏఎస్‌లకూ తప్పని వేధింపులు   నాడు రమామణి నేడు రమణమూర్తి   బాసులు అగ్రకులాలయితేనే స్పందిస్తారా?   వారే బాధితులయితే పట్టించుకోరా?   అధికారుల సంఘాలు ఉన్నాయా? దుప్పటి ముసుగేసుకుని పడుకున్నాయా? లేక పాలకులిచ్చే పోస్టింగులకు ఆశపడి భయపడుతున్నాయా? నోరుతెరిస్తే ఎక్కడ శంకరగిరిమాన్యాలు పట్టిస్తుందేమోనని నిలువునా వణికిపోతున్నాయా? అదీ కాకపోతే మనకెందుకులేనని, నోరులేని జీవులవుతున్నాయా? అందుకేనా... తమ సహచరులపై బాసులు దాష్టీకం చేస్తున్నా నోరుమెదపడం లేదు? అందుకేనా.. ఎంతమంది సహచరులు చనిపోతున్నా ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించలేకపోతున్నాయా? అవును... అప్పుడు ఐఏఎస్ అధికారిణి రమామణి. ఇప్పుడు ఐఎఫ్‌ఎస్ అధికారి రమణమూర్తి. ఇక రేపెవరు? తమ సహచరులు ఒక్కొక్కరే బాసుల దాష్టీకానికి బలవుతున్నా, ఈ సంఘాల నేతలు ఏ కలుగులో దాక్కొన్నారు? పెదవి విప్పి ప్రశ్నించేందుకు ఎందుకు వణికిపోతున్నారు? సర్కారు స్పందనలో ఎందుకీ పక్షపాతం? అగ్రకులాల అధికారులు బాధితులయితే, పాలకులు స్పందించరా? అగ్రకులాలు బాసులుగా ఉన్నప్పుడు జరిగే ఘటనలకే స్పందిస్తారా? ఎందుకీ రెండకళ్ల సిద్ధాంతం?.. ఎందుకీ పక్షపాతం?.. ఇదీ ఇప్పుడు ఏపీలో ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల అంతర్మథనం.   న్యాయం అందరికీ ఒక్కటే. దానికి కులం లేదు. మతం లేదు. చట్టంలో ఉన్న దీనిని నిజమని నమ్మితే చివరకు మిగిలేది అవమానం, వేధింపులే! కులం ఉంటేనే న్యాయం. బాసు స్థానంలో ఉండే కులాన్ని బట్టి న్యాయం చేస్తున్న తీరు. అగ్రకులానికి చెందిన వారు బాసులయితే జరిగే న్యాయం వేరు. బాధితుడే అగ్రకులానికి చెందిన వారయితే జరిగే న్యాయం వేరు! ఏపీలో గత 15 నెలల నుంచి నిర్నిరోధంగా అమలవుతోన్న సర్కారీ న్యాయసూత్రం ఇదే!  ఏపీలో ఇప్పుడు ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్‌లకే రక్షణ లేదు. ఐదేళ్లు పాలించే రాజకీయ పార్టీల దయాధర్మంపై ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్‌లు ఆధారపడాల్సిన దుస్థితి.   ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి పోస్టింగంటే అధికారులు ఎగిరి గంతేసేవారు. ఓ అయిదు- పదేళ్లయినా డిప్యుటేషన్లపై వచ్చేందుకు ఆసక్తి చూపేవారు. అంత క్రేజు-మోజు ఉన్న ఈ పరిస్థితి, ఇప్పుడు రివర్సయిపోయింది. ఇక్కడెందుకు ఉద్యోగం చేస్నున్నామా అని, బిక్కుబిక్కుమని పనిచేయాల్సిన దుస్థితి. బాసుల దాష్టీకం, అవమాన పర్వానికి తాళలేక.. తమ ఈతిబాధలు చెప్పుకున్నా, వినే దిక్కులేక.. మనోవ్యథతో ఒత్తిళ్ల పాలయి, చివరకు చనిపోతున్న ద యనీయ పరిస్థితి. కొద్ది నెలల క్రితం ఐఏఎస్ అధికారిణి రమామణి. ఇప్పుడు ఐఎఫ్‌ఎస్ అధికారి రమణమూర్తి. పేర్లు ఏమయితేనేం? హోదా ఏదయితేనేం? వారంతా బాధాసర్పదస్టులు. అగ్ర కులం కావడమే ఏకైక శాపం! అందుకే తమ మరణశాసనాన్ని తామే లిఖించుకుంటున్నారు.   డాక్టర్ వాడ్రేవు భాస్కర రమణమూర్తి. ఐఎఫ్‌ఎస్ అధికారి. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ స్థాయి అధికారి. అంటే పోలీసు భాషలో డీజీపీతో సమానం.  నిజాయితీకి మారు పేరు. వీటికి మించి సున్నిత మనస్కుడు. ఇప్పుడు అదే ఆయన ప్రాణం తీసింది. సీనియారిటీకి తగిన పోస్టింగు దొరక్క, చాలా కాలం లూప్‌లైన్‌లో మగ్గిన అధికారి. తాను పీసీసీఎఫ్ క్యాడర్ అధికారి అయినప్పటికీ, తనకు రెండు స్థాయిలు తగ్గి ఉన్న హోదా ఇచ్చినా, ఇదేం అన్యాయమని ప్రశ్నించకుండా  తన పని తాను చేసుకున్న మౌని. అయినా ఓ ఉన్నత స్థాయి అధికారి, వరస వెంట వరస కొనసాగిస్తున్న అవమానాన్ని తనలోనే దిగమింగుకున్నారు.   పీసీసీఎఫ్ క్యాడర్ అధికారినయిన తనను కీలకమైన సమావేశాలకు పిలవకపోగా,  చాంతాండంత మెమోలతో వేధిస్తున్న వైనానికి కుమిలిపోయిన రమణమూర్తి సెలవు పెట్టారు. సెలవు ముగిసి, తిరిగి విధుల్లోకి చేరాల్సి ఉన్నప్పటికీ..ఆయనను సదరు ఉన్నతాధికారి వేధింపు ఆలోచనలే వెంటాడాయి. ఫలితం ఆత్మహత్య. అలా..  నిజాయితీపరుడైన ఓ అధికారి జీవితం అర్ధంతరంగా రాలిపోయింది. కాదు. రాల్చేశారు.   ఓ ఉన్నతాధికారికి-ఆయనకు సరిపడటం లేదని ప్రభుత్వానికి తెలుసు. అయినా, ఎవరూ పట్టించుకోలేదు. ఓ ఉన్నతాధికారి.. చ నిపోయిన రమణమూర్తినే కాదు. మరో ఇద్దరు అదే స్థాయి అధికారులనూ వేధిస్తూనే ఉన్నా, సదరు శాఖ మంత్రికీ పట్టదు. ఆయనసలు ఆ శాఖనే పట్టించుకోరు. ప్రతి ఏడాది ఇచ్చే సీఆర్‌పై సంతకం చేసేది సదరు ఉన్నతాధికారే. అంటే కింద స్థాయి అధికారి పిలక, ఆయన చేతిలోనే ఉన్నట్లు లెక్క. పైగా.. పీసీసీఎఫ్ స్థాయి అధికారులెవరూ, నేరుగా తమ సమస్యలు సర్కారుకు నివేదించే  అధికారం లేదు. ఏమైనా ఉంటే బాసుకు ఇచ్చుకోవాల్సిందే. అంటే సదరు బాసుపై ఆయనకే ఫిర్యాదు చేయాలన్న మాట. ఇదీ అటవీ శాఖలో ఓ వైచిత్రి.   నిజానికి రమణమూర్తి సహా, ఆ శాఖలో పనిచేసే ఇద్దరు అధికారులకు ఇప్పుడు చేయడానికి పెద్ద పనేమీ లేదు. వీరంతా డీజీపీ స్థాయి అధికారులే. ఇప్పుడున్న ఓ అధికారికి 8 నెలల తర్వాత గానీ పోస్టింగు రాలేదు. కానీ ఇప్పుడు పనిచేస్తున్న ఓ అధికారి, తన హోదా కంటే నాలుగు స్థాయుల కింద హోదాలో పనిచేస్తున్నారు. అంటే ఒక డీఎఫ్‌ఒ స్థాయిలో అన్నమాట. నిజానికి, పీసీసీఎఫ్ స్థాయి అధికారికి.. పై స్థాయి అధికారులతో హోదా విషయంలో విబేధాలు రాకుండా, ఒకరికి సెక్రటేరియేట్‌లో కార్యదర్శి, మరొకరికి కార్పొరేషన్ ఎండీ పదవులిస్తుంటారు. అవన్నీ స్వతంత్రంగా పనిచేసే హోదా ఉన్న విభాగాలు కావడంతో, ఇప్పటిదాకా ఏ స్థాయిలోనూ మనస్పర్ధలు వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఓ ఉన్నతాధికారి.. కింది స్థాయి అధికారులను వేధిస్తున్న తీరు వల్ల, పీసీసీఎఫ్ స్థాయి అధికారి ఆత్మహత్య చేసుకోవలసిన దయనీయం నెలకొంది. వీటిని పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇవేమీ పట్టవు.   అయితే ఇక్కడ ఓ ఉన్నతాధికారి వేధింపులతో.. ఆత్మహత్య చేసుకున్నది ఒక అగ్ర కులానికి చెందిన అధికారి. కాబట్టే ఎక్కడా స్పందన లేదు. ఎక్కడా ఆందోళనలు లేవు. పాలకులు కూడా పెదవి విప్పరు. గతంలో రమామణి విషయంలోనూ అదే జరిగింది. అదే ఆత్మహత్య చేసుకున్న అధికారి స్థానంలో, ఇతర కులాలకు చెందిన అధికారి ఉంటే,  సర్కారు ఇంత నింపాదిగా ఉండేదా? ఆయా కులాలకు చెందిన ఉద్యోగ-కుల సంఘాలు మౌనంగా ఉండేవా అన్నది ప్రశ్న. అంటే...  కులాన్ని బట్టి, సర్కారు న్యాయం అమలుచేస్తుందనుకోవాలా?    -మార్తి సుబ్రహ్మణ్యం

హత్రాస్ భాదితురాలి ఇంటికి రాహుల్.. సంచలన విషయాలు బయటపెట్టిన సోదరుడు

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ మృతురాలి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ కలిశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు యూపీ పోలీసులు రాహుల్, ప్రియాంకతో పాటు మరో ముగ్గురికి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. హత్రాస్ లో 144 సెక్షన్ అమలులో ఉందని, అందుకే ఐదుగురిని మాత్రమే అనుమతించామని పోలీసులు తెలిపారు. దీంతో రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌదరి మాత్రమే హత్రాస్ కు పయనమయ్యారు. కాసేపటి క్రితం హత్రాస్ చేరుకున్న కాంగ్రెస్ నేతలు, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.   మరోవైపు, హత్రాస్ లోకి మీడియాను అనుమతించిన నేపథ్యంలో.. మృతురాలి కుటుంబ సభ్యులు సంచలన విషయాలు చెప్పారు. మృతురాలి సోదరుడు మీడియాతో మాట్లాడుతూ.. ఆరోజు దహనం చేసిన శరీరం ఎవరిదో తాము తెలుసుకోవాలనుకుంటున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అది తన సోదరి మృతదేహమే అయితే.. అలా రహస్యంగా దహనం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తమ సోదరిని చివరిసారి చూడాలని పోలీసులు, అధికారులకు తాము మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పోస్ట్ మార్టం రిపోర్ట్ అయినా ఇవ్వాలని అడిగితే.. అది ఇంగ్లీషులో ఉంటుందని, మీకు అర్థం కాదని చెప్పారని మండిపడ్డారు. తమను ఇంటి నుంచి కదిలేందుకు కూడా అనుమతించడం లేదని, తాము ఎంతో భయానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.